nadigar sangam
-
ఫిర్యాదు చేయకపోతే ప్రయోజనం ఉండదు!
మలయాళ సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న ఘటనలను మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) సమావేశంలో నటి రోహిణి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం మంచిది. తమను వేధించినవారిపై ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు’’ అని పేర్కొన్నారు. -
సైకిల్‌పై వచ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ చెన్నైలో సందడి చేశారు. చాలా సింపుల్‌గా సైకిల్ తొక్కుతూ కనిపించారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ 68వ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి వచ్చారు. సైకిల్‌పై తమ అభిమాన హీరో రావడంతో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అక్కడే గేట్ దగ్గర ఉన్న అభిమానులతో విశాల్ కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల మాలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొద్దిరోజుల క్రితమే నడిగర్ సంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో పది రోజుల్లో నడిగర్ సంఘం ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వస్తుందని విశాల్ వెల్లడించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఇండస్ట్రీ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తామని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. VIDEO | Actor Vishal arrives on a bicycle to attend 68th South Indian Artist Association meeting being organised in Chennai.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/EYP25aY3rb— Press Trust of India (@PTI_News) September 8, 2024 -
నడిగర్ సంఘం హెచ్చరిక.. అలాంటి వారిపై ఐదేళ్ల నిషేధం!
హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్‌లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు. -
Nadigar Vs Tamil Producers: కోలీవుడ్‌లో ముదురుతున్న వివాదం!
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) మధ్య వివాదం ముదురుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తమిళ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్ల సంఘం, థియేటర్ల సంఘం నిర్వాహకులు సమావేశమై నటీనటుల పారితోషికాలు, పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం, నటీనటులు ముందుగా ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేశాకే కొత్త చిత్రాలను అంగీకరించాలని, నటుడు ధనుష్ చాలా చిత్రాలకు అడ్వాన్స్‌లు తీసుకున్నారని, ఆయనతో కొత్తగా చిత్రాలు చేసే నిర్మాతలు ముందుగా నిర్మాతల మండలితో చర్చించాలని, ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకూ నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తీర్మానాలు చేశారు. నిర్మాతల మండలి చేసిన ఈ తీర్మానాలు తమకు సమ్మతం కాదని, వెనక్కి తీసుకోవాలని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ పై స్పందిస్తూ తమిళ నిర్మాతల మండలి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నటుడు ధనుష్‌పై ఎలాంటి ఫిర్యాదు లేదని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం పేర్కొనడం అవాస్తవమని నిర్మాతల మండలి పేర్కొంది. ఏడాదిన్నర క్రితమే నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో నిర్మాతలకు నష్టం కలిగించిన ఐదుగురు నటుల గురించి తీర్మానం చేసి, దాన్ని నడిగర్ సంఘానికి పంపామని తెలిపింది. అయితే దానిపై ఆ సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ కారణంగానే నిర్మాతల మండలి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో పాటు తమకు నడిగర్ సంఘం సహకరిస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. దీనిపై నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
కోటి రూపాయలు సాయం చేసిన కమల్.. హీరో కార్తీ చేతికి చెక్
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం కోలీవుడ్ స్టార్ హీరోలు తీవ్రంగానే కష్టపడుతున్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. సుమారుగా రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మితం అవుతున్న భవనం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కానీ ప్రస్తుతం నిధుల కొరత కారణంగా ఈ పనులు పూర్తి కాలేదు. దీంతో సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హాసన్ కోటి రూపాయాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన చెక్కును హీరో కార్తీ చేతికి ఆయన అందించారు. ఆ సమయంలో కార్తీతో పాటుగా ప్రధాన కార్యదర్శి విశాల్, వైస్ ప్రెసిడెంట్ పూచీ మురుగన్‌తో కమల్ సమావేశం అయ్యారు. నడిగర్ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్ విన్నపం చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు. త్వరలోనే ఈ సంఘం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. -
నడిగర్ సంఘం భవన నిర్మాణానికి సూర్య, కార్తీ విరాళం
Suriya Karthi Donation To Nadigar Sangam Building Construction: దక్షిణ భారత సినీ నటీనటుల (నడిగర్ సంఘం) సంఘం 6వ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 14) ఉదయం చెన్నైలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచి మురుగన్, కరుణాస్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో సంఘానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. అనంతరం సంఘం ట్రస్టు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో జాతీయ ఉత్తమ అవార్డులను గెలుచుకున్న నటీనటులు, సాంకేతిక వర్గాన్ని నడిగర్ సంఘం నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా 'విరుమాన్' చిత్ర నిర్మాత సూర్య, కథానాయకుడు కార్తీ, సహ నిర్మాత రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ సంఘం నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళాన్ని అందజేశారు. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి అందుకోసం మా అమ్మ జాబ్ వదిలేసింది: శృతిక సముద్రాల -
మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శిపై కేసులు
మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి అక్రమాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సంఘం 66వ సర్వసభ్య సమావేశం ఆదివారం చెన్నైలో నిర్వహించారు. ఈ సంఘం ఎన్నికలు 2019లో జరిగినా.. అక్రమాలు జరిగాయంటూ ఐసరి గణేష్‌కు చెందిన స్వామి శంకరదాస్ జట్టు చెన్నై హైకోర్టు గుమ్మం తొక్కింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పలు దఫాలు విచారణ జరిపినా న్యాయస్థానం ఇటీవల సంఘం ఎన్నికలు సక్రమమే అంటూ ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన పోటీ చేసిన పాండవర్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆదివారం స్థానిక శాంథోమ్ రోడ్‌లోని శాంథోమ్ హైయ్యర్ సెకండరీ పాఠశాలలో నడిగర్ సంఘం కార్యవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షులు కరుణాస్, పూచి మురుగన్‌లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెడుతూ సభ్యుల అనుమతి కోరారు. ముఖ్యంగా నడిగర్ సంఘం నూతన భవనాన్ని పూర్తి చేయడం, అందుకు కావాల్సిన నిధుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందడం వంటి అంశాలపై చర్చించారు. చదవండి: ఏంటో.. అందరికి నా బర్త్‌డే సెంటిమెంట్ అయిపోయింది క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది.. -
కమలహాసన్‌తో నడిగర్ సంఘ నాయకుల భేటీ
సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ను దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నాయకులు సోమవారం స్థానిక ఆళ్వార్‌పేటలో ని ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. గత మూడేళ్ల క్రితం వివాదాల మధ్య జరిగిన ఈ సంఘం ఎన్నికల ఫలితాలను చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపొందిన పాండవర్ జట్టు.. తమ సంఘం ట్రస్టీ సభ్యుడిగా కమలహాసన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్ మర్యాదపూర్వకంగా కమలహాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు కమలహాసన్‌ను సంఘం ట్రస్టీ సభ్యునిగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు కమలహాసన్ కూడా అంగీకరించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటన లో నటీనటుల సంఘం నాయకులు తెలిపారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నడిగర్ సంఘం ఎన్నికలపై స్పందించిన హీరో విశాల్
Vishal Celebrates Nadigar Sangam Election Victory Viral Photos: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల్లో పాండవర్ జట్టు విజయంపై ఆ సంఘ ప్రధాన కార్యదర్శి విశాల్ స్పందించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఇది చాలా కాలం క్రితం జరిగిన ఒక యుద్ధం లాంటిదని, కాస్త ఆలస్యమైనా నిజమే గెలిచిందని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన విశ్రాంత న్యాయమూర్తి పద్మనాభన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నడిగర్ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు చెబుతూ.. పాండవర్ జట్టుకు శుభాకాంక్షలని, ఈ విజయం తమ బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ముందే చెప్పినట్లుగా చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని, సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని విశాల్ చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు, పోలీస్ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా లత్తీ చిత్రం షూటింగ్ స్పాట్లో విశాల్ యూనిట్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. -
ఎట్టకేలకు 'నడిగర్' ఫలితాలు విడుదల, గెలిచిందెవరంటే?
చెన్నై (తమిళనాడు): దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ రెండోసారి విజయఢంకా మోగించగా ప్రధాన కార్యదర్శిగా విశాల్ రెండోసారి గెలుపొందాడు. నడిగర్ సంఘం ట్రెజరర్‌గా కార్తీ విజయం సాధించాడు. కాగా 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి. ఇందులో నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా ఒక ప్యానల్ నుంచి కె. భాగ్యరాజ్ అధ్యక్షుడిగా, గణేశన్ సెక్రటరీగా మరో ప్యానల్ నుంచి పోటీ చేశారు. ఓటింగ్‌లో హీరో విశాల్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందడంతో మద్రాస్ కోర్టు కౌంటింగ్‌ను ఆపేసింది. తాజాగా రిటైర్డ్ జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరపగా మరోసారి నాజర్ ప్యానెల్ గెలుపొందింది. చదవండి: Sarkaru Vaari Paata: పెన్నీ ఫుల్ సాంగ్ వచ్చేసింది -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్
సాక్షి, చెన్నై: తమిళ సినిమాల్లో కమెడియన్‌గా నటించి ప్రేక్షకుల్ని అలరించిన తవసికి పెద్ద కష్టం వచ్చిపడింది. గత కొంత కాలంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న తవసి ఆర్థికంగానూ చితికిపోయారు. అటు ఆరోగ్యం, ఇటు ఆర్థికంగానూ కుదేలైన తవసి చాలా సన్నబడిపోయారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తండ్రి చికిత్సకు ఆర్థికంగా తమను ఆదుకోవాలంటూ ఆయన కుమారుడు అరుముగన్ కోలీవుడ్ పెద్దలను అభ్యర్థించారు. ఈ క్రమంలో నడిగర్ సంఘం స్పందించింది. తవసికి సాయం చేసేందుకు ముందుకు రావాలని సోషల్ మీడియాలో వేదికగా అర్థించింది. తన కామెడీతో నవ్వులు పూయించిన తవసి దీనస్థితి చూసి అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. తోచినంత సాయం చేస్తామని ముందుకొస్తున్నారు. (చదవండి: వైద్య చరిత్రలోనే గొప్ప మైలురాయికి నాంది) Condition of VVS fame Actor #Thavasi now, he is strongly affected by cancer and seeking for a help. #SIAA #nadigarsangam pic.twitter.com/q6wiONwnZN — NadigarSangam PrNews (@NadigarsangamP) November 16, 2020 -
పెద్ద మనసు చాటుకున్న విశాల్
తమిళ సినిమా : కరోనా దెబ్బకు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) సభ్యులు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నారు. సంఘానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ప్రతినిధి ఆదుకోవాలని సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. కొందరు నడిగర్ సంఘం సభ్యులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. సభ్యులను ఆదుకునేందుకు విశాల్ ఆదివారం ముందుకు వచ్చారు. 150 మంది సభ్యులకు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. సహాయ కార్యక్రమంలో నటుడు శ్రీమాన్, దళపతి దినేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర ఊర్లలో ఉన్న సభ్యులకు ఈ సాయం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 300 మంది హిజ్రాలకు నిత్యావసర వస్తువులను అందించారు. అదేవిధంగా కరోనా నివారణకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 1,000 మాస్క్‌లు, 1,000 శానిటైజర్లు అందించారు. -
విశాల్‌పై చర్యలు తీసుకుంటాం
చెన్నై : నటుడు విశాల్‌పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు నటుడు.నిర్మాత కే.రాజన్ తెలిపారు. ఆర్చెర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నవ నటుడు ఉదయ్ కథానాయకుడిగా పరిచయమవుతూ నిర్మిస్తున్న చిత్రం ఉదయ్. నటి లీమా కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ్‌సెల్వన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారరం ఉదయం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత కే.రాజన్, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వతంగం ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై కే.రాజన్ మాట్లాడుతూ నిర్మాతల మండలిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నటుడు విశాల్ ఈ సంఘాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. సుమారు రూ.13 కోట్లు అవకతవకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతకుముందు ఇబ్రహిం రావుత్తర్ నిర్మాత కలైపులి ఎస్.ధాను వంటి వాళ్లు నిర్మాతల సంఘానికి నిధులను చేర్చి పెట్టగా దాన్ని విశాల్ విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఆయన సంఘానికి చెందిన ఆదాయవ్యయ ఖర్చులను చెప్పి తీరాలని, లేని పక్షంలో విశాల్‌పై తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని కే.రాజన్ పేర్కొన్నారు. కాగా ఉదయ్ చిత్ర పాటలు, ప్రచార చిత్రం బాగున్నాయని, ఈ చిత్రానికి విడుదల సమయంలో తగిన థియేటర్లు లభించేలా సహకరిస్తామని ఆయన అన్నారు. చిత్ర హీరో ఉదయ్ మాట్లాడుతూ తనకు హీరోగా ఇదే తొలి చిత్రం అని, ఇంతకు ముందు ఒక షార్ట్ ఫిలింలో నటించిన అనుభవంతో ఈ చిత్రంలో నటించానని తెలిపారు. ఉదయ్ చిత్రం లవ్, యాక్షన్, సెంటిమెంట్ తదితర అంశాలు కలిసిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, అన్ని వర్గాలకు నచ్చే చిత్రంగా ఉంటుందని చెప్పారు. -
‘నడిగర్ సంఘంలో అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి’
పెరంబూరు : నడిగర్ సంఘంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు సవ్యంగానే జరుగుతున్నాయని ఆ సంఘ సభ్యులు సంఘ రిజిస్ట్రార్ శాఖకు, రాష్ట్రర సచివాలయానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు.. దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఎన్నికల జరిగినా ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండడం వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగలేదు. ఓట్ల లెక్కింపు ఎప్పుడు నిర్వహించాలన్నది ఈ నెల 15వ తేదీన వెల్లడించనున్నట్లు చెన్నై హైకోర్టు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సంఘాల శాఖ నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌లకు నోటీసులు జారీ చేసింది. అందులో సంఘనిర్వాక విధులను సరిగా నిర్వహించలేదని తెలిసిందని, దీంతో తామే ప్రత్యేక అధికారితో ఎందుకు సంఘ బాధ్యతలు నిర్వహించారాదు? అని ప్రశ్నించారు. ఈ నోటీసులు నడిగర్‌సంఘం సభ్యులను ధిగ్భ్రాంతికి గురి చేసింది. వారు సంఘాల శాఖ అధికారికి, రాష్ట్ర సచివాలయానికి ఒక లేఖ రాశారు. అందులో తమకు నోటీసులు, పత్రికల్లో వెలువడ్డ వార్త దిగ్భ్రాంతిని, మనస్థాపాన్ని కలిగించాయన్నారు. సంఘంలో చాలా కాలంగా పొందని పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ మూడేళ్లలో తాము పొందుతున్నామన్నారు. ముఖ్యంగా విశ్రాంత నటీ, నటులకు వృద్ధాప్య భృతి వంటి సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల ఫలితాలు వెలువడక పోయినా అందిస్తోందని చెప్పారు. అలాంటిది కొందరు కావాలనే ఉసుగొల్పి, ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలతో ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు. సంఘ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎన్నికలను రద్దు చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికలు జరిగి మూడు నెలలు అయినా ఎలాంటి అవరోధాలు లేకుండా సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారన్నారు. అలాంటిది సంఘానికి చేటు వాటిల్లేలా ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించరాదన్న నోటీసులు సంఘంలోని 80 శాతం సభ్యులను బాధించాయన్నారు. 200 మంది వరకూ లేఖలో సంతకాలు చేసి పంపారు. -
ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి
విమర్శకుల దృష్టి ఇప్పుడు నయనతారపై పడింది. దక్షిణాదిలో అగ్రనటిగా రాణిస్తున్న నటి నయనతార. జయాపజయాలకు అతీతంగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. తమిళంలోనే ఇటు సూపర్‌స్టార్‌తో, అటు దళపతి విజయ్‌తో ఏకకాలంలో నటిస్తున్న నటి ఈమె. ఆ మధ్య తన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాధారవి మాట్లాడుతూ నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ, మరో చిత్రంలో సీతగానూ నటిస్తున్నారని అన్నారు. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చుననీ, ఇంతకు ముందు సీతగా నటించాలంటే కేఆర్.విజయనే ఎంపిక చేసేవారని అన్నారు. ఇప్పుడైతే నమస్కరించేవారూ నటించవచ్చు, అందుకు భిన్నమైన వారూ నటించవచ్చునని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద చర్చకే దారితీశాయి. చాలా మంది ప్రముఖులు రాధారవి వ్యాఖ్యలను ఖండించారు. సాధారణంగా ఏ విషయం గురించి పెద్దగా పట్టించుకోని నయనతార ఈ వ్యవహారంపై తీవ్రంగా ధ్వజమెత్తింది. వెంటనే రాధారవికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేసింది. అందులో ఇకపై మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని భావిస్తున్నానని పేర్కొంది. అంతేకాదు నడిగర్ సంఘాన్ని గట్టిగానే ప్రశ్నించింది. సంఘం తమకు వృత్తిపరంగా సహకరించే విషయం గురించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఇంతకుముందే ఒక లేఖ ద్వారా తెలియజేశానని, సుప్రీంకోర్టు వెల్లడించినట్లు నడిగర్ సంఘం ద్వారా ఒక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తారా? విశాఖా కమిటీ సూచనల మేరకు ఆరోపణలు చేసిన వారిని విచారిస్తారా? అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన నడిగర్‌సంఘం వెంటనే రాధారవి వ్యాఖ్యలను ఖండిస్తూ లేఖ రాసింది. కాగా ఆదివారం జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో పలువురు ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపధ్యంలో నయనతార ఓటు వేయడానికి రాలేదు. దీంతో తనకు సమస్య వచ్చినప్పుడు నడిగర్సంఘంను ప్రశ్నించిన నయనతార, అదే బాధ్యతతో ఓటు వేయడానికి రావాలి కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. నయనతార ఇప్పుడే కాదు గత ఎన్నికల్లోనూ ఓటు వేయలేదు. దీంతో ఒకరిని ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు తన బాధ్యతను కూడా నిర్వహించాలిగా అంటూ ఈ సంచలన నటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నడిగర్ సంఘం ఎన్నికల్లో రాజకీయాల్లేవు
పెరంబూరు: నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీ య ప్రభావం లేదని ఐసరిగణేశ్ పేర్కొన్నారు. ఈ సంఘానికి 2019–2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామిశంకరదాస్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి కూడా పోటీ బలంగా ఉండడం, ఎన్నికలకు మరో 9 రోజులే గడువు ఉండడంతో ప్రచార మోత మొదలైంది. సభ్యులను ప్రభావితం చేసేలా వాగ్దానాస్త్రాలను ఇరు జట్లు తమ అంబులపొదలలో వేసుకుని సంధించడానికి సిద్ధం అయ్యారు. కాగా ఈ సారి ప్రచారంలో స్వామిశంకర్దాస్ జట్టు ముందుంది. నడిగర్ సంఘం ప్రస్తావనలో నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేరు గుర్తుకు రాక తప్పదు. సంఘం అప్పుల భారం మోస్తున్న తరుణంలో పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టిన విజయకాంత్ సంఘాన్ని రుణ విముక్తి చేసి లాభాల బాట పట్టించారు. దీంతో సంఘంలో ఆయనకు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఏ జట్టు అయినా ఆయనను కలిసి మద్దతు తీసుకుంటారు. అలా గురువారం ఉదయం స్వామిశంకరదాస్ జట్టు విజయకాంత్‌ను ఆయన ఇంట్లో కలిసి మద్దతు కోరారు. అనంతరం ఆ జట్టు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న దర్శక, నటుడు కే,.భాగ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన నాటక కళాకారులకు డబ్బు ఇస్తానన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించగా, అందుకు బదలిచ్చిన కే.భాగ్యరాజ్ తాను ఓటుకు నోటులిస్తానని చెప్పలేదని, సాధారణంగా సినీ కళాకారులు ఆర్థి కంగా చితికిపోయిన నాటక కళాకారులను కలసినప్పుడు వారికి డబ్బు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు నటుడు విశాల్, కార్తీ వంటి వారూ అతీ తులు కాదని పేర్కొన్నారు. విజయకాంత్‌ను కలవడం గురించి అడిగిన ప్రశ్నకు విజయకాంత్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తమ చేతులు పట్టుకుని ఆశీర్వదించారని చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అదే విధంగా నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్ నటుడు,నడిగర్‌సంఘం మాజీ కార్యదర్శి రాధారవి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా నటుడు,నిర్మాత, ప్రస్తుతం సంఘ కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న ఐసరిగణేశ్ స్పందిస్తూ తమ జట్టుకు పలువులు సహకరిస్తున్నారనీ, అయితే నటుడు రాధారవి తమకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పలేమనీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు.తమకు సంబంధించినంత వరకూ ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేదనీ ఐసరిగణేశ్ పేర్కొన్నారు. -
వేడి పుట్టిస్తున్న నడిఘర్ సంఘం ఎన్నికలు
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘంగా పిలువబడే నడిగర్ సంఘం ఎన్నికలు చర్చనీయాంశంగా మారింది. గతంలో శరత్ కుమార్ బృందాన్ని ఢీకొట్టి గెలిచిన పాండవర్ టీం మళ్లీ బరిలోకి దిగింది. ఈసారి కొత్తగా సీనియర్ దర్శక నటుడు భాగ్యరాజా, ఐసరీ గణేష్ టీమ్ పోటీ పటుతుండటంతో ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. 23న జరిగే ఈ ఎన్నికలకు న్యాయస్థానం ప్రత్యేక రిటర్నింగ్ అధికారిని నియమించగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో పాండవర్ టీమ్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అదే ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా.. భాగ్యరాజా టీమ్ వారికంటే తాము నడిగర్ సంఘాన్బి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామంటూ బరిలో దిగారు. భాగ్యరాజా టీమ్ సీనియారిటీ పేరుతో నడిగర్ సంఘాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టగా పాండవర్ టీమ్ మాత్రం గత మూడేళ్లుగా తమ అభివృద్దే మరోమారు విజయానికి దోహదపడుతుందనే ధీమాలో ఉంది. పాండవర్ టీమ్ నుండి అధ్యక్షుడిగా నాజర్, కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తితోపాటు ఉపాధ్యక్ష, సభ్యుల పదవి పాత వర్గమే బరిలో ఉంది. గత కమిటీలో శరత్ కుమార్ టీమ్ పై వ్యతిరేకతతో భాగ్యరాజా వంటి సీనియర్ నటులంతా పాండవర్ టీమ్ కి మద్దతుగా నిలిచారు. అయితే నడిగర్ సంఘానికి సొంత భవనంతోపాటు పేద కళాకారులకు ఆర్థిక సాయం వంటి భారీ పథకాలతో పాండవర్ టీమ్ ముందుకు సాగుతుండటం, పాత కమిటీ అవినీతిని బయట పెడుతుండటం సీనియర్లకు కొంత ఇబ్బందులను తెచ్చేలా చేసింది. దీంతో సీనియర్ల నుంచి భాగ్యరాజా అధ్యక్షుడిగా బరిలో దిగగా నిర్మాత నటుడు ఐసరీ గణేష్ రెండవ టీమ్ కు వెన్నదన్నుగా నిలుస్తున్నారు. గతంలో పాండవర్ టీమ్ లోనే ఉన్న ఐసరీ గణేష్ ఒక్కసారిగా టీమ్ మారటం ఇప్పుడు ఎన్నికలు రసవత్తరంగా మారేందుకు కారణమైంది. మొత్తానికి రెండు టీమ్‌లు గెలుపుకోసం ఎవరి దారిలో వారు సభ్యుల ఓట్ల కోసం వేట మొదలు పెట్టింది. -
నడిఘర్ సంఘం భవనానికి రూ.కోటి విరాళం
పెంరబూరు: దక్షిణ భారత నటీనటుల ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన సంఘ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత సంఘ నిర్వాహక వర్గం నాజర్, విశాల్, కార్తీల బృందం మళ్లీ పోటీకి సిద్ధం అయ్యారు. ఈ జట్టును ఢీకొనేందుకు ఐసరిగణేశ్, దర్శక, నటుడు కే.భాగ్యరాజ్‌ల జట్టు సిద్ధం అయ్యింది. ఈ జట్ల నామినేషన్ల పర్వం కూడా పూర్తి అయ్యింది.ఇదిలాఉండగా నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సంఘ కోశాధికారి బాధ్యతలను నిర్వహిస్తున్న నటుడు కార్తీ భవన నిర్మాణానికి కోటి రూపాయలను ఆర్థిక సాయం చేసినట్లు, అదే విధంగా సంఘ కార్యదర్శి విశాల్ రూ.25 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు ప్రచారం అవుతోంది. సంఘం ఎన్నికల సమయంలో కార్తీ, విశాల్ ఆర్థిక సాయం చేయడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే చర్యలేనన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. -
విశాల్‌కు హైకోర్టులో చుక్కెదురు
పెరంబూరు: సాధారణంగా ఒక వ్యక్తి విషయంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు అందులో ముందు గుడ్ న్యూస్ చెప్పమంటారా? బ్యాడ్ న్యూస్ చెప్పమంటారా? అని అడుగుతుంటారు. ఇప్పుడు కరెక్ట్‌గా నటుడు విశాల్ పరిస్థితి ఇలాంటిదే. ఆనందంతో పాటు అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. విశాల్ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన సంఘటన చోటు చేసుకున్నా, వృత్తిపరంగా విచారకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కీడెంచి మేలెంచమన్న సామెతను పక్కన పెట్టి ముందు విశాల్‌కు సంబంధించిన మంచి వార్త గురించి చెప్పుకుందాం. మోస్ట్ బ్యాచిలర్ అయిన నటుడు విశాల్ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన అనీషారెడ్డి అనే నటితో వివాహం నిశ్చయం అయిన విషయం విదితమే. ఆ మధ్య వివాహ నిశ్చితార్థం వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. అయితే వివాహ తేదీని మాత్రం వెల్లడించలేదు. తాజాగా తన పెళ్లి వేడుక అక్టోబర్ 9న జరగనుందని నటుడు విశాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అయితే వివాహ వేదిక ఎక్కడన్నది ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు. సమస్యలేంటంటే.. కాగా ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నటుడు విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించి జోడు పదవుల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా వీటిలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలిలో అవినీతి, అవకతవకలు జరిగాయంటూ వ్యతిరేక వర్గం ఆరోపణలను గుప్పిస్తున్నారు. మండలి కార్యవర్గం ఏ విషయంలోనూ విధి, విధానాలు పాఠించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాల్లో మండలిలో వ్యతిరేక వర్గం ఫిర్యాదు మేరకు ప్రభుత్వం మండలి నిర్వహణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. అందుకు ఎన్.శేఖర్ అనే రిజిస్ట్రార్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఇది విశాల్ వర్గాన్ని షాక్‌కు గురిచేసింది. దీంతో ప్రభుత్వ చర్యల్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ప్రభుత్వం విశాల్ వర్గానికి మరో షాక్ ఇచ్చింది. మండలికి ప్రత్యేక అధికారిగా నియమించిన ఎన్.శేఖర్‌కు సహాయ, సహకారాలను అందించే విధంగా తాత్కాలిక అడహాక్ కమిటీని నియమించింది. అందులో విశాల్ వ్యతిరేక వర్గానికి చెందిన దర్శకుడు భారతీరాజా, నటుడు కే.రాజన్, టీజే.త్యాగరాజన్ 9 మందిని సభ్యులుగా నియమించింది. దీన్ని వ్యతిరేకిస్తూ విశాల్ వర్గం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ సారి హైకోర్టులో కూడా విశాల్ వర్గానికి చుక్కెదురైంది. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్తానం అడహాక్ కమిటీని రద్దు చేయలేమని తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం నియమించింది ప్రత్యేక అధికారికి తాత్కాలిక సలహా అడహాక్ కమిటీని నియమించిందని, దాన్ని రద్దు చేయడం వీలుకాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈ అడహాక్ కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని పేర్కొన్నారు. ఈ తీర్పు కూడా విశాల్ వర్గానికి అవమానకరమైన విషయమే అవుతుంది. -
బుల్లితెర నడిగర్ సంఘానికి చతుర్ముఖ పోటీ
పెరంబూరు: ఎన్నడూ లేనంతగా చతుర్మఖ పోటీగా సాగిన తమిళనాడు బుల్లితెర నడిగర్ సంఘం ఎన్నికలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. ఈ సంఘానికి ఎన్నికల మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. కాగా ప్రస్తుత నిర్వాహకం పదవీకాలం పూర్తి కావడంతో శనివారం సంఘం ఎన్నికలు జరిగాయి. పోటీలో జట్లు విరుగంబాక్కమ్‌లోని ఏకేఆర్ మహాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రస్తుత కార్యవర్గ అధ్యక్షుడు శివన్ శ్రీనివాసన్ జట్టు మళ్లీ పోటీ చేస్తుండగా, నటి నిరోషా జట్టు, రవివర్మ జట్టు, బోస్‌వెంకట్ జట్టు అంటూ నాలుగు జట్లు పోటీ పడ్డాయి. నటి నిరోషా జట్టులో భరత్ కార్యదర్శి పదవికి, ఎస్.శ్రీధర్ కోశాధికారి పదవికి, వీటీ.దినకరన్, కన్యాభారతీ ఉపాధ్యక్ష పదవికి, విజయ్, ఆనంద్, రవీంద్రన్, మోనిక ఉపకార్యదర్శి పదవులకు పోటీ చేశారు. అదే విధంగా శివన్ శ్రీనివాసన్ జట్టులో కార్యదర్శి పదవికి భరత్కల్యాణ్, ఉపాధ్యక్షపదవికి రాజశేఖర్, మనోబాలా, కోశాధికారి పదవికి శ్రీవిద్య, ఉపకార్యదర్శి పదవులకు దళపతిదినేశ్, ఎంటీ.మోహన్ కర్పగవల్లి, సవాల్రావ్ పోటీలో ఉన్నారు. ఇక బోస్‌వెంకట్ జట్టులో కార్యదర్శి పదవికి పీకే.గణేశ్, ఉపాధ్యక్ష పదవికి సోనియా, ఎల్.రాజా, కోశాధికారి పదవికి రవీందర్, ఉప కార్యదర్శి పదవులకు కే.దేవానంద్, దాడి బాలాజి, శ్రద్ధిక, కే.కమలహాసన్ పోటీ చేశారు. సంఘంలో మొత్తం 1,551 సభ్యులు ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలీంగ్ సాయంత్రం 5 గంటల వరకూ జరిగింది. సినీ దర్శకుడు లియాఖత్అలీఖాన్ ఎన్నికల అధికారిగా నిర్వహించిన ఈ ఎన్నికలు గట్టి పోలీస్‌బందోబస్తు మధ్య జరిగాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల లెక్కింపు మొదలైంది. అయితే ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. -
హన్సికపై ఫిర్యాదు
సాక్షి, సినిమా : నటి హన్సికపై ఆమె కార్యనిర్వాహకుడు నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎంగేయుమ్ కాదల్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ముంబై భామ హన్సిక. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మాప్పిళై, విజయ్ సరసన వేలాయుధం ఒరుకల్ ఒరు కన్నాడి, తీయవేలై చేయనుమ్ కుమారు వంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ నటిగా ముద్ర వేసుకున్నారు. జయంరవి, ఆర్య, సిద్దార్థ్ వంటి యువ హీరోలతో నటించి మంచి పేరు తెచుకున్న హన్సిక శింబుతో ప్రేమ వ్యవహారంలో మినహా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోలేదనే చెప్పాలి. ఇటీవల హీరోయిన్ రేస్‌లో కాస్త వెనుకబడిన ఈ అమ్మడు నటించి తాజాగా విడుదలైన చిత్రం గులేభకావళి. ఆ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం విక్రమ్‌ప్రభుకు జంటగా తుపాకిమునై, అధర్వ సరసన ఒక చిత్రం మాత్రమే హన్సిక చేతిలో ఉన్నాయి. ఇకపోతే ఈమె వద్ద మునిస్వామి అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య హన్సిక కాల్షీట్స్ వ్యవహారాలను ఆమె తల్లి చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హన్సిక వద్ద ఇంతకుముందు మేనేజర్‌గా పని చేసిన మునిస్వామి సోమవారం ఆమెపై నడిగర్‌సంఘంలో పిర్యాదు చేశారు. అందులో.. తాను హన్సిక వద్ద మేనేజర్‌గా పని చేసినందుకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని, హన్సిక నుంచి తనకు రావలసిన పారితోషికాన్ని ఇప్పించాలని కోరారు. ఈ వ్యవహారంపై నటి హన్సిక ఎలా స్పందిస్తారో? నడిగర్‌సంఘం ఎలా డీల్ చేస్తుందో చూడాలి. -
పెళ్లి కోసం మండపాన్ని బుక్ చేసిన విశాల్
సాక్షి, చెన్నై : హీరో, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అయితే పెళ్లి వచ్చే ఏడాది జనవరిలో జరగనుందట. అయితే పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్ వెల్లడించలేదు. నిన్న (శుక్రవారం) అతడు చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకు మండపానికి అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నట్లు విశాల్ పేర్కొన్నాడు. సినిమాల్లోనే అనుకున్నా.. ఇక చెన్నైలో రౌడీముఠా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై విశాల్ స్పందిస్తూ...‘రౌడీ ముఠా పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడం, అందులో ఆటా, పాటా లాంటివి సినిమాల్లోనే చూపిస్తారనుకుంటామని, నిజ జీవితంలో జరగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, వారిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించాడు. మార్చి నుంచి సమ్మె చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న క్యూబ్, జీఎస్టీ లాంటి సమస్యలపై పోరాడే విధంగా దక్షిణ భారత సినీనటుల సంఘం మార్చి ఒకటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి చిత్రాల విడుదల ఉండదని వెల్లడించారు. ఈ విషయమై స్పందించిన విశాల్ మార్చి 1 నుంచి సమ్మె తథ్యం అని స్పష్టం చేశాడు. అయితే క్యూబ్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, చర్చలు సఫలం అవుతాయని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళభాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిధులను అందించే విషయమై నటీనటుల సంఘం సమాలోచనలు చేస్తోందని తెలిపాడు. -
నా తండ్రి భిక్షమడగడం కళ్లారా చూశా: టాప్ హీరో
పెరంబూర్: నా తండ్రి భిక్షమడగడం నేను కళ్లారా చూశాను అని హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. ఏప్రిల్ 2న జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్యానల్ సభ్యుల పరిచయ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నిర్మాతలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని తెలిపారు. నడిగర్ సంఘంలో జరిగే మంచి పనులు ఆ సంఘంలోని సభ్యులకే లబ్ధి చేకూరుస్తాయని, అదే నిర్మాతల మండలిలో అయితే పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు. కాగా నడిగర్ సంఘానికి తమ కార్యవర్గం చేసిన వాగ్ధానాలన్ని నెరవేర్చామన్నారు. అదే విధంగా నిర్మాతల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తామన్నారు. తన తండ్రి మహాప్రభు వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారని, ఐ లవ్ ఇండియా చిత్రం నిర్మించి.. దాన్ని అనుకున్న తేదీకి విడుదల చేయడానికి ఒక ల్యాబ్ ముందు భిక్షమడిగారన్నారు. తాను చేసిన ఒకే ఒక తప్పు ఈ చిత్రాన్ని నిర్మించడం అని ఆయన అన్న మాటలు తనను ఇంకా కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి ఏ నిర్మాతకు రాకూడదన్నారు. తాను నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేస్తానని తన తండ్రికి చెప్పినప్పుడు పోటీలో నెగ్గి ఏం చేస్తావని ఆయన ప్రశ్నించారని అన్నారు. ప్రతి నిర్మాతకు కనీసం అర గ్రౌండ్ లేదా పావు గ్రౌండ్ స్థలాన్ని అందించగలిగితేనే ఇంటికి రా లేకపోతే రావొద్దు అని తన తండ్రి అన్నారని విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్యానల్ వాగ్ధానాల పట్టికను వెల్లడించారు. -
అర్ధరాత్రి.. గుట్టుగా ఆందోళనస్థలికి సూపర్ స్టార్!
జల్లికట్టు ఆందోళనకు విజయ్ మద్దతు తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా వేలాదిమంది యువత జరిపన ఆందోళనకు మద్దతుగా తమిళ సినీ నటుల సంఘం నడిగర్ మౌన నిరసన ప్రదర్శన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిరసన ప్రదర్శనలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తోపాటు పలువురు తమిళ అగ్రనటులు పాల్గొన్నారు. అయితే, ఇందులో తమిళ అగ్రహీరో, ఇలయదళపతి విజయ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అదే రోజు రాత్రి విజయ్ మేరినా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్న లక్షలమంది యువతకు ఆయన మద్దతు పలికారు. వారితో కలిసి నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా నినాదాలు చేశారు. జల్లికట్టు ఆందోళనకు ముఖ్యకేంద్రంగా ఉన్న చెన్నైలోని మెరీనా బీచ్‌కు రహస్యంగా వచ్చిన విజయ్ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని నిరసనలో పాల్గొన్నారు. తాను పాల్గొనడం వల్ల అందరి దృష్టి తనపై పడి.. ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఆయన ఇలా గుట్టుగా పాల్గొన్నారని సన్నిహత వర్గాలు తెలిపాయి. నడిగర్ సంఘం జరిపిన మౌనప్రదర్శనను యువత తప్పుబట్టారు. తాము జోరుగా చేస్తున్న ఆందోళన నుంచి మీడియా దృష్టిని ఇది మరలుస్తుందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో నేరుగా యువత మనోగతానికి అనుగుణంగా వారితో కలిసి విజయ్ ఆందోళనలో పాల్గొన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అర్థరాత్రి మేరినా బీచ్‌లో కనిపించిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఆ ఇద్దరికీ శాశ్వత ఉద్వాసన
దక్షిణ భారత చలన చిత్ర రంగంలో ప్రముఖులుగా ఉన్న శరతకుమార్, రాధారవిలకు నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా ఉద్వాసన పలికారు. ఆ ఇద్దరిపై వేటు వేస్తూ ఆదివారం జరిగిన నడిగర్‌సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. ఇక, ముష్టియుద్ధాలు, దాడులు, ప్రతి దాడుల నడుమ సమావేశ ప్రాంగణం వెలుపల ఉత్కంఠ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. చెన్నై : గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ వర్గం గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఓటమి పాలైన శరత్‌కుమార్ వర్గం సంఘ నిర్వాకంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారం చేపట్టిన నూతన కార్యవర్గం ఆరోపణలు చేసింది. ముఖ్యంగా సంఘ ట్రస్ట్ నిధికి సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు పేర్కొంటూ దానికి ప్రధాన ట్రస్టీలుగా బాధ్యతలు నిర్వహించిన శరత్‌కుమార్, రాధారవిలను సంఘం నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రటించారు. ఈ విషయమై శరత్‌కుమార్ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఆదివారం స్థానిక టీనగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలను సంఘం సభ్యత్వం నుంచి శ్వాశతంగా ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేశారు. సంఘ అధ్యక్షుడు నాజర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంజీఆర్ శతాబ్ది వేడుకలను, దివంగత ప్రముఖ కథాకారుల పేరుతో అవార్డుల ప్రధాన కార్యక్రమాలను నిర్వహించారు. బి.సరోజాదేవికి మక్కల్ తిలకం అవార్డు కాగా ప్రఖ్యాత నటి సరోజాదేవిని మక్కల్ తిలకం అవార్డుతో సత్కరించారు, అదే విధంగా నడిగర్ తిలకం అవార్డును నటి కాంచనకు, భానుమతి అవార్డును నటి ఊర్వశీ శారదకు, అంజలిదేవి అవార్డును, నటి వాణిశ్రీకి, ఎంఆర్.రాధ, తంగవేల్ల పేరుతో అవార్డును నటుడు వెన్నిరాడై మూర్తికి, టీపీ.రాజ్యలక్ష్మి అవార్డును ఎంఎస్.రాజ్యంకు, మనోరమ అవార్డును ఎస్.పార్వతికి, సహస్రనామ అవార్డును ఎన్ఎస్కే.థామ్‌కు, ఎస్ఎస్.రాజేంద్రన్ అవార్డును వినూచక్రవర్తికి అందించి ఘనంగా సత్కరించారు. తమిళసినిమా శతాబ్ది అవార్డుల ప్రదానం అదే విధంగా తమిళసినిమా శతాబ్ది అవార్డులను నటి బీఎస్.సరోజా, చో.రామసామి, శ్రీకాంత్, చారుహాసన్, కే.పురట్చిరాణి, ఎంపీ.విల్వనాథన్, ఎంఆర్.కన్నన్, కేఎస్వీ.కనకాంబరం, టీఆర్.తిరునావక్కురసు. వి.రాజశేఖరన్, ఎంఎస్.జహంగీర్, ఏఆర్.శ్రీనివాసన్, టీఎస్.జోకర్‌మణి, ఆర్.శంకర్, జి.రామనాథన్, పదార్థం పొన్నుసామి, ఆర్.ఎన్.బాలదాసన్, సీఆర్.పార్తిబన్, ఆర్.గుణశేకరన్, ఎంఆర్.విశ్వనాథన్, జే.కమల, టీఎస్.రంగరాజ్, ఒరు ఇరవు. వసంతన్, టీఎస్కే.నటరాజ్, నాంజల్ నళిని, కేకే.జూడోరత్నం, పీ.సరస్వతి,కే. పన్నీర్‌సెల్వం మొదలగు వారికి అందించి సత్కరించారు. ఆందోళన, ముష్టి యుద్ధాలు: సంఘం నుంచి తొలగించబడిన సభ్యులు, వ్యతిరేక వర్గం తమను సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలంటూ సమావేవ వేదిక ముందు ఆందోళనకు దిగారు. కొందరు సంఘ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.ముష్టి యుద్ధాలకు దిగారు.పలువురికి గాయాలయ్యారుు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోవడంతో లాఠిచార్జి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. విశాల్ కార్యాలయం పై దాడి: అదే విధంగా సంఘ ఉపాధ్యక్షుడు, శాసనసభ్యుడు కరుణాస్ కారుపై ఆందోళన కారులు దాడి చేసి కారు అద్దాలను పగులగొట్టారు.ఇక్కడ ఇలా ఆందోళన జరుగుతుండగా సంఘం కార్యదర్శి విశాల్ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లతో దాడి చేసి కార్యాలయం నిర్వాహకులను గాయపరచారు. వేటును సమర్థించుకున్న నిర్వాహకులు కాగా ఇలా ఉద్రిక్త వాతావరణంలో సంఘం సర్వసభ్య సమావేశం పూర్తి చేసిన నిర్వాహకులు శఅనంతరం మీడియా సమావేశంలో శరత్‌కుమార్, రాధారవిల సభ్యత్వం నిరంతర రద్దును సమర్థించుకున్నారు.ఈ సందర్శంగా కోశాధికారి కార్తీ మాట్లాడుతూ గత నిర్వాకంలో సంఘ ట్రస్ట్‌కు తొమ్మింది మంది ట్రస్టీలు ఉండాల్సింది, శరత్‌కుమార్, రాధారవి మాత్రమే మొత్తం అధికారం ఉండేటట్లుగా వ్యవహరించి సంఘ నిధికి సంబంధించి పలు ఆక్రమాలకు పాల్పడట్టు లెక్కల్లో తేలిందన్నారు.అందుకే వారిపై వేటు వేసినట్లు వివరించారు.ఇకపై అవినీతిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశం జరగనివ్వకుండా కొందరు కావాలనే ఆందోళనకు దిగారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి విశాల్ తెలిపారు. నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా రద్దు చేయడంపై రాధారవి స్పందిస్తూ నడిగర్ సంఘంలో మేము అన్నీ కరెక్ట్‌గానే చేశామని, సంఘం నుంచి తొలగించడంపై కోర్టులో తేల్చుకుంటామని అన్నారు. -
శరత్‌కుమార్, రాధారవి సస్పెన్షన్
చెన్నై: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నుంచి ఆ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్‌లను సస్పెండ్ చేసినట్లు సంఘ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా చెప్పినట్లే సంఘ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందులో భాగంగా తాము నిర్వహించిన శోధనల్లో గత సంఘం నిర్వాహకం చేసిన పలు అవకతవకలు, అవినీతి వెలుగులోకి వచ్చాయని, వీటి గురించి పలు మార్లు కార్యవర్గ సమావేవంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు నడిగర్ సంఘం పేర్కొంది. అందులో భాగంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని, సంఘ విధి విధానాల పరంగా జరిగిన అవకతవకలపై విచారణలో నిజానిజాలు బయటపడతాయని తెలిపింది. అంత వరకూ మాజీ సంఘం నిర్వాహకులు శరత్‌కుమార్, రాధారవి, వాగా చంద్రశేఖర్‌ల సంఘ సభ్యత్వంను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని తెలపింది. -
ఆధారాలుంటే బయట పెట్టండి: విశాల్
చెన్నై: తనపై ఆరోపణలు చేసేవాళ్లు ఆధారాలను బయట పెట్టాలని దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ సవాల్ చేశారు. సోమవారం నటుడు విశాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన అభిమాన సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విశాల్ నిన్న స్థానిక ట్రిపుల్‌కేన్‌లోని అరిమా సంఘం, ఎంపీఎస్ పాలీ క్లినిక్ నిర్వాహకులతో కలిసి చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ఇది చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరం అని, కాబట్టి తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఉచిత వైద్యం పొందవచ్చనని తెలిపారు. కాగా నడిగర్‌సంఘంలో అవకతవకలు జరిగినట్లు సంఘ సభ్యులు కొందరు ఆరోపణలతో శనివారం స్థానిక టీ.నగర్,అబిబుల్లా రోడ్డులోని సంఘ ఆవరణలో ఆందోళనకు దిగారు. వారాహి అనే సంఘ సభ్యుడు సంఘ భవన నిర్మాణం కోసం నిధిని సమకూర్చే విధంగా నిర్వహించిన స్టార్స్ క్రికెట్‌కు సంబంధించి కోట్ల రూపాలు అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విశాల్ స్పందిస్తూ ఆరోపణలు చేసేవారు ఆధారాలను చూపాలన్నారు. గత సంఘం అవకతవకలకు సంబంధించిన అన్ని వివరాలను మరో 10 రోజులలో బయట పెట్టనున్నట్లు తెలిపారు. తమిళ నిర్మాతల మండలిపై విశాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ మండలి నిర్వాహకులు వివరణ అడిగిన విషయం విదితమే. ఈ విషయం గురించి ప్రశ్నంచగా నిర్మాతల మండలి నుంచి వివరణ కోరుతూ తనకు ఎలాంటి లేఖ రాలేదన్నారు. అందువల్ల తాను క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని విశాఖ స్పష్టం చేశారు. -
నడిగర్ సంఘం పదవికి రాజీనామా చేస్తా..
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్నట్లు నటుడు, శాసన సభ్యుడు కరుణాస్ వెల్లడించారు. హాస్యనటుడిగా, కథానాయకడిగా ప్రాచుర్యం పొందిన ఈయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపికైన విషయం తెలిసిందే. అదే విధంగా నడిగర్‌సంఘం ఎన్నికల్లోనూ ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడా పదవి నుంచి వైదొలగనున్నట్లు కరుణాస్ వెల్లడించారు. దీని గురించి ఆయన తె లుపుతూ యుక్త వయసు లోనే తాను నటుడవ్వాలని కలలు కనే వాడినన్నారు. అది నెరవేరిందని,అయితే రాజకీయవాదినవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఆశ పడడం మానవ సహజం అనీ,అయితే అత్యాశ కూడదని అన్నారు.45 చిత్రాలలో నటించానని ముఖ్యమంత్రి కావాలనుకోవడం దురాశే అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.రాజకీయాలు అంత సులభం కాదన్నారు. నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో పలు గ్రామాలు తిరిగి నటీనటుల ఆర్థిక పరిస్థితిని తెలుకున్నామన్నారు. అదే విధంగా శాసన సభ ఎన్నికల్లో వేలాది గ్రామాలు తిరిగి ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నానన్నారు. నడిగర్‌సంఘం సభ్యుల సమస్యలను చాలా వరకూ పరిష్కరించానని, సంఘం భవన నిర్మాణ నిధికి స్టార్స్ క్రికెట్‌ను నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఇక ఒక శాసనసభ సభ్యుడిగాప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నట్లు తెలిపారు. ఒక నటుడిగా నడిగర్‌సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి త్వరలో వైదొగలనున్నట్లు కరుణాస్ వెల్లడించారు. రాజకీయాలపైనే పూర్తి దృష్టి ఉంచుతానని చెప్పారు. -
'నటీనటుల సంఘం నుంచి తప్పుకుంటున్నా'
ఈ ఏడాది తమిళ నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. 2006 నుంచి 2015 వరకూ అధ్యక్ష పదవిలో ఉన్న నటుడు శరత్‌కుమార్‌ని ఓడించాలనే పట్టుదలతో సీనియర్ నటుడు నాజర్, యువ హీరోలు విశాల్, కార్తీ తదితరులు భారీ ఎత్తున ప్రచారం చేశారు. చివరికి అనుకున్నది సాధించారు. కాగా, శరత్‌కుమార్‌ని సపోర్ట్ చేసినవాళ్లల్లో హీరో శింబు ఒకరు. ఆయన ఓడిపోవడం ఈ హీరోని బాధపెట్టి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే, ఉపాధ్యక్షుడిగా శరత్‌కుమార్ ప్యానెల్ నుంచి పోటీపడిన శింబూకి కూడా నిరుత్సాహమే ఎదురైంది. కాగా, కొన్నేళ్లుగా నడిగర్ సంఘంలో సభ్యుడిగా ఉన్న శింబు ఇప్పుడు తప్పుకుంటున్నానని పేర్కొనడం విశేషం. ఏ ఆర్టిస్ట్‌కైనా సమస్య వచ్చినప్పుడు, దాని పరిష్కారానికి నడిగర్ సంఘం ముందుకు రావాలని శింబు అన్నారు. తనకు సమస్య వచ్చినప్పుడు నడిగర్ సంఘం ఏ సహాయమూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఇటీవల నిర్వహించిన స్టార్ క్రికెట్ మ్యాచ్ పట్ల కూడా తాను అసంతృప్తిగా ఉన్నానని శింబు పేర్కొన్నారు. -
మాలో విభేదాలా.. లేనే లేవు
నడిగర సంఘంలో విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వదంతులను సంఘం సెక్రటరీ జనరల్, హీరో విశాల్ ఖండించాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం విశాల్ ఓ ట్వీట్ చేశాడు. ''నడిగర సంఘంలో విభేదాలా? దమ్ముంటే తీసుకురండి. ఈ టీమ్ మొత్తం ఒకే కుటుంబంలా కలిసి ఉంటుంది, సంఘ సభ్యుల సంక్షేమం కోసమే పనిచేస్తుంది. సంఘానికి కొత్త భవనం కావాలన్న కోరిక తీరేవరకు మేమంతా ఇలాగే కలిసుంటాం'' అని తన ట్వీట్లో చెప్పాడు. అయితే, ఈ వదంతులు ఎందుకు, ఎప్పుడు వచ్చాయన్నది మాత్రం తెలియడం లేదు. ఇంతకుముందున్న శరత్‌కుమార్ టీమ్‌ను ఓడించి విశాల్ టీమ్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నడిగర సంఘానికి కొత్త భవనం కట్టించాలన్న నినాదంతోనే విశాల్ టీమ్ తన ప్రచారాన్ని సాగించింది. తెలుగు - తమిళ అన్న విభేదాలు తెచ్చే ప్రయత్నాలు జరిగినా, చివరకు విశాల్ టీమ్ విజయం సాధించింది. Split n our #nadigar sangam team? -
శరత్‌కుమార్‌పై ఫిర్యాదు
చెన్నై : శరత్‌కుమార్‌పై నడిగర్ సంఘం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శరత్‌కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో సంఘం ట్రస్ట్‌లో భారీ అవినీతి జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.గురువారం ఉదయం సంఘ నిర్వాహకులు పూచ్చి మురుగన్ నేతృత్వంలో న్యాయవాది కృష్ణతో కలిసి నగరంలోని పోలీస్‌కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆ ముగ్గురితో ఓ చిత్రం చేస్తా
చెన్నై : కార్తీ, జయంరవి, ఆర్యలతో కలిసి నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం ఓ చిత్రం చేయనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్ వెల్లడించారు. ఆయన హీరోగా నటిస్తూ, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం కథాకళి. క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర పరిచయ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఆ సందర్భంగా చిత్ర కథానాయకుడు నడిగర్ సంఘం భవన నిర్మాణ నిధి కోసం నటుడు కార్తీ, జయంరవి, ఆర్యలతో కలిసి చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఇంతకుముందే తీసుకున్న నిర్ణయమన్నారు. ఇందులో మరికొందరు ప్రముఖ నటులు నటించనున్నారనీ... దర్శకుడి ఎంపిక త్వరలో జరుగుతోందని చెప్పారు. ఇక కథాకళి చిత్రం విషయానికి వస్తే ఇందులో కాండం అనే పదం గురించి ఒకరు ట్విట్టర్లో విమర్శిస్తున్నారని, సెక్స్ విద్య అవసరం అంటున్న ఈ రోజుల్లో కాండం అన్న పదం తప్పు కాదని అన్నారు. కథాకళి చిత్రంలో ఆ పదాన్ని కావాలని వాడలేదని అన్నారు. అయినా చిత్రాలకు సెన్సార్ అనేది ఒకటి ఉందని విశాల్ అన్నారు. కాథాకళి చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశాల్ తెలిపారు. -
సీనియర్లను అగౌరవ పరిచారు
చెన్నై : సీనియర్ నటులను అగౌరవ పరచే విధంగా సత్యదూర ఆరోపణలు చేశారని, ఇది సంస్కారం అనిపించకోదని హీరో సూర్య... నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. ఇటీవల జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్ జట్టు, విశాల్ జట్లు పోటీ పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విశాల్ జట్టుకు నటుడు కమలహాసన్ మద్దతు తెలిపారు. అదే విధంగా నటుడు శరత్‌కుమార్, రాధారవిలపై నటుడు శివకుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో కమలహాసన్ విశ్వాస ఘాతకుడు అంటూ శరత్‌కుమార్ ధ్వజమెత్తారు. విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో ఏర్పడ్డ సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేశానని, అవన్నీ కమల్ మరచిపోయారని ఆరోపణలు గుప్పించారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న సూర్య ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గానికి ఓ లేఖ రాశారు. అందులో ఈ ఎన్నికలు పలు పాఠాలు నేర్పిందని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు బాధాకరమైన విషయాలు చోటు చేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయన్నారు. సామరస్య ప్రయత్నాలు ఫలించలేదు. పదవుల్లో ఉన్నప్పుడు చేసిన వాటిని బాధ్యతగా భావించకుండా సాయంగా చిత్రీకరించారని సూర్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టమైన వారికి మద్దతు ప్రకటించిన పలు సీనియర్ నటులను ఈ సందర్భంగా అగౌరవపరిచారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితి పునరావృతంకాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. నడిగర్ సంఘం సభ్యుల శ్రేయస్సుకు పాటు పడాలి అని లేఖలో సూర్య పేర్కొన్నారు. -
నడిగర్ గౌరవ సలహాదారులుగా కమల్, రజనీ ?
చెన్నై : ఈ నెల 18న జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్ జట్టుపై విశాల్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో అధ్యక్షుడిగా నాజర్, కార్యదర్శిగా విశాల్, ఉపాధ్యక్షులుగా కరుణాస్, పొన్‌వన్నన్‌లు, కోశాధికారిగా కార్తీ గెలిచారు. కార్యవర్గ సభ్యులుగా రాజేష్, ప్రసన్న, పశుపతి, జూనియర్ బాల య్య, నందా, రమణ, శ్రీమాన్, సంగీత, కుట్టి పద్మిని, కోవైసరళ, శరత్ గెలిచారు. శరత్‌కుమార్ జట్టులో కార్యవర్గ సభ్యులుగా పోటీ చేసిన వారిలో నళిని, రాంకీ, నిరోషా, టీపీ గజేంద్రన్ గెలుపొందారు. వీళ్లంతా నూతన కార్యవర్గంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. 25 వ తేదీన నూతన కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సంఘం భవన నిర్మాణం గురించి, ఇంతకు ముం దు ఒప్పందం రద్దు గురించి శరత్‌కుమార్ పత్రికా సమావేశంలో ప్రకటించిన వ్యవహారం గురించి చర్చించనున్నట్టు సమాచారం. అదే విధంగా సంఘానికి కమలహాసన్, రజనీకాంత్‌లను గౌరవ సలహాదారు పదవులను అందించే విషయం గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ సమావేశంలోనే సంఘం సర్వసభ్య సమావేశం తేదీని నిర్ణయించనున్నట్లు సమాచారం. -
విశాల్ టీమ్‌కు పూర్తి సహకారం ఉంటుంది: కమల్
చెన్నై: నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన హీరో విశాల్ టీమ్‌కు ఎలాంటి సహకారం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. నడిగర్ సంఘంలో తమకు ఎలాంటి గౌరవ పదవులు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే నడిగర్ సంఘం పేరును అలాగే కొనసాగించాలని కమల్ హాసన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాజధానులు ఉండటం అదృష్టమన్నారు. కాగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కమల్ కు ఆహ్వానం అందినా...అనివార్య కారణాల వల్ల ఆయన వెళ్లలేకపోయారు. -
నడిగర్ ఫలితాలలో విశాల్ వర్గానిదే హవా
చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల ఫలితాలలో విశాల్ వర్గం హవా కొనసాగింది. నాజర్ 113 ఓట్ల తేడాతో శరత్ కుమార్‌పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నాజర్‌కు 1344 ఓట్లు పోలవ్వగా, శరత్ కుమార్‌కు 1231 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీ ఘన విజయం సాధించారు. విశాల్‌కు 1445 ఓట్లు రాగా, రాధా రవికి 1138 ఓట్లు పోలయ్యాయి. మరోసారి పగ్గాలు చేపట్టాలని భావించిన శరత్‌కుమార్ టీమ్ ఈ ఎన్నికల ఫలితాలలో డీలా పడింది. గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్‌కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతున్న విషయం అందరికి విదితమే. ఈ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి పద్మనాభన్ వెల్లడించారు. -
నడిగర్ ఎన్నికలు.. సర్వత్రా ఉత్కంఠ
చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి. చెన్నైలోని అళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ ముగిసింది. ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్, జీవ, గౌతమి, సంగీత, కుష్బూ, సుహాసిని, విజయ్‌లతోపాటు చలన చిత్రారంగానికి చెందిన పలువురు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏ సమయంలోనైనా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్‌కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. ఈసారి కూడా ఆ బృందమే మళ్లీ పగ్గాలు చేపట్టాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం కూడా పోటీకి దిగడంతో ఎన్నికలు అనివార్యమైనాయి. అటు శరత్‌కుమార్ వర్గం... విశాల్ వర్గం ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగడంతో సామరస్యంగా జరగాల్సిన ఈ ఎన్నికలు హోరాహోరిగా మారాయి. ఈ రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొంది. దాంతో నడిగర్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఓ విధంగా చెప్పాలంటే సీనియర్, జూనియర్ నటుల మధ్య పోటీగా మారింది. హీరో విశాల్‌పై శరత్‌కుమార్ వర్గీయులు ఆదివారం ఉదయం దాడి చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయమైంది. నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై దాడికి పాల్పడుతున్నారని విశాల్ ఆరోపించారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శరత్‌కుమార్ వర్గానికి మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో రజనీ తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. విజేతలు హామీలు నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేయాలని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పూర్తవగానే ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న పద్మనాభన్ ప్రకటిస్తారు. (మరిన్ని చిత్రాలకు ఇక్కడ క్లిక్ చేయండి) -
నడిగర్ ఎన్నికలు.. సర్వత్రా ఉత్కంఠ
-
హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి: రజనీ
చెన్నై : చలన చిత్రపరిశ్రమంతా ఓ కుటుంబమని సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. ఆదివారం ఉదయం చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు చెన్నైలో అళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రజనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విజేతలు హామీలు నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేయాలని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే చలన చిత్రరంగానికి చెందిన ప్రముఖలంతా పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. శరత్‌కుమార్, విజయ్, రాధా, రజనీ తదితరులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్‌కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బృందమే పదవీ బాధ్యతలు కొనసాగాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం జట్టు కూడా ఈ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహాన్ని చూపింది. దీంతో ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యమైనాయి. అంతేకాకుండా అటు శరత్‌కుమార్ జట్టు... ఇటు విశాల్ జట్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని ... చివరికి ఈ రెండు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొంది. దాంతో ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఓ విధంగా చెప్పాంటే సీనియర్ నటులు... జూనియర్ నటుల మధ్య పోటీగా మారిందని చెప్పవచ్చు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు మాత్రం శరత్కుమార జట్టుకే ఉందని సమాచారం. కానీ ఈ ఎన్నికల్లో విజయావకాశాలు మాత్రం విశాల్ జట్టుకు వరించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న పద్మనాభన్ ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ పేట పరిసర ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ నడిగర్ సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా లేక సాధారణ పోటీ మధ్య ఎంపికయిన జట్టు పదవీ బాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే. -
కమల్‌హాసన్ గురించి తప్పుగా మాట్లాడారు
చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ గురించి నడిగర్ సంఘం కార్యదర్శి రాధారవి తప్పుగా మాట్లాడారని, ఆ ఆధారాలు తన వద్ద ఉన్నాయని నటుడు విశాల్ అన్నారు. నడిగర్ సంఘం వ్యవహారంలో శరత్‌కుమార్ వర్గం, విశాల్ వర్గం మధ్య పోటీ తీవ్రరూపం దాల్చిందని చెప్పక తప్పదు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తున్నారు. విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే ఓట్ల ప్రచారం ముమ్మరం చేశారు. నటుడు విశాల్ వర్గం సేలం తిరుచ్చి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి రంగస్థల నటులతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత సంఘ నిర్వాహకులపై అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ దండెత్తారు. తిరుచ్చి దేవర్ హల్లో నిర్వహించి న సమావేశంలో నటుడు విశాల్ మాట్లాడుతూ తాము పదవుల కోసం ఊరూరా తిరగడంలేదని అన్నారు. సినిమా తమ కుటుంబం అని అందులో రంగస్థల నటులు ఒక అంగం అని పేర్కొన్నారు. అలాంటి వారి క్షేమం కోసం గొంతెత్తడం తప్పా? అంటూ ప్రశ్నించారు. నటుడు కమల్‌హాసన్‌ను రాధారవి తప్పుగా మాట్లాడారు. ఆ ఆధారాలు చూపడానికి తాను రెడీ అన్నారు విశాల్. సహ నటీనటులను తక్కువ చేసి మాట్లాడటం నాగరికతా? అంటూ ప్రశ్నించారు. ఇకపై సంఘం వ్యవహారాల్లో విశాల్ మాత్రమే కాదు నటులందరూ ప్రశ్నిస్తారన్నారు. తాను తమ జట్లుకు ఓటు వేయమని అడగడం లేదని మనసాక్షికనుగుణంగా ఓటు వేయండి అంటున్నానని విశాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో నటుడు నాజర్, కరుణాస్, పోన్వన్నన్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుకెక్కిన హీరో విశాల్
చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) ఎన్నికలపై హీరో విశాల్ కోర్టుకెక్కారు. ఎన్నికల తేదీని మార్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు అతడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. శరత్ కుమార్, విశాల్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. శరత్ కుమార్ చర్యలను విశాల్ తరచుగా ప్రశ్నిస్తున్నారు. సంఘంపై తరచూ విమర్శలు చేస్తే విశాల్‌పై వేటు వేస్తామని శరత్‌కుమార్ హెచ్చరించారు. అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా? సంఘం నుంచి బహిష్కరించినా భయపడను అంటున్నారు నటుడు విశాల్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికల తేదీపై విశాల్ కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.