విశాల్ టీమ్కు పూర్తి సహకారం ఉంటుంది: కమల్ | we support vishal team, says actor kamal hassan | Sakshi
Sakshi News home page

విశాల్ టీమ్కు పూర్తి సహకారం ఉంటుంది: కమల్

Published Fri, Oct 23 2015 2:10 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

విశాల్ టీమ్కు పూర్తి సహకారం ఉంటుంది: కమల్ - Sakshi

విశాల్ టీమ్కు పూర్తి సహకారం ఉంటుంది: కమల్

చెన్నై: నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన హీరో విశాల్ టీమ్కు ఎలాంటి సహకారం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు.

 

నడిగర్ సంఘంలో తమకు ఎలాంటి గౌరవ పదవులు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే నడిగర్ సంఘం పేరును అలాగే కొనసాగించాలని కమల్ హాసన్ సూచించారు.  ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా  ఆయన తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాజధానులు ఉండటం అదృష్టమన్నారు. కాగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కమల్ కు ఆహ్వానం అందినా...అనివార్య కారణాల వల్ల ఆయన వెళ్లలేకపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement