నడిగర్‌ సంఘం ఎన్నికలపై స్పందించిన హీరో విశాల్‌ | Vishal Celebrates Nadigar Sangam Election Victory Viral Photos | Sakshi
Sakshi News home page

Vishal: 'న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది,ఆలస్యమైనా సత్యమే గెలిచింది'..

Published Tue, Mar 22 2022 1:53 PM | Last Updated on Tue, Mar 22 2022 1:58 PM

Vishal Celebrates Nadigar Sangam Election Victory Viral Photos - Sakshi

Vishal Celebrates Nadigar Sangam Election Victory Viral Photos: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్‌) ఎన్నికల్లో పాండవర్‌ జట్టు విజయంపై ఆ సంఘ ప్రధాన కార్యదర్శి విశాల్‌ స్పందించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఇది చాలా కాలం క్రితం జరిగిన ఒక యుద్ధం లాంటిదని, కాస్త ఆలస్యమైనా నిజమే గెలిచిందని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన విశ్రాంత న్యాయమూర్తి పద్మనాభన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నడిగర్‌ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు చెబుతూ.. పాండవర్‌ జట్టుకు శుభాకాంక్షలని, ఈ విజయం తమ బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ముందే చెప్పినట్లుగా చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని, సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని విశాల్‌ చెప్పారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు, పోలీస్‌ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా లత్తీ చిత్రం షూటింగ్‌ స్పాట్‌లో విశాల్‌ యూనిట్‌ సభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement