Nadigar Sangam Electios
-
నడిగర్ సంఘం ఎన్నికలపై స్పందించిన హీరో విశాల్
Vishal Celebrates Nadigar Sangam Election Victory Viral Photos: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల్లో పాండవర్ జట్టు విజయంపై ఆ సంఘ ప్రధాన కార్యదర్శి విశాల్ స్పందించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఇది చాలా కాలం క్రితం జరిగిన ఒక యుద్ధం లాంటిదని, కాస్త ఆలస్యమైనా నిజమే గెలిచిందని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన విశ్రాంత న్యాయమూర్తి పద్మనాభన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నడిగర్ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు చెబుతూ.. పాండవర్ జట్టుకు శుభాకాంక్షలని, ఈ విజయం తమ బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ముందే చెప్పినట్లుగా చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని, సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని విశాల్ చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు, పోలీస్ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా లత్తీ చిత్రం షూటింగ్ స్పాట్లో విశాల్ యూనిట్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. -
ఎట్టకేలకు 'నడిగర్' ఫలితాలు విడుదల, గెలిచిందెవరంటే?
చెన్నై (తమిళనాడు): దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ రెండోసారి విజయఢంకా మోగించగా ప్రధాన కార్యదర్శిగా విశాల్ రెండోసారి గెలుపొందాడు. నడిగర్ సంఘం ట్రెజరర్‌గా కార్తీ విజయం సాధించాడు. కాగా 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి. ఇందులో నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా ఒక ప్యానల్ నుంచి కె. భాగ్యరాజ్ అధ్యక్షుడిగా, గణేశన్ సెక్రటరీగా మరో ప్యానల్ నుంచి పోటీ చేశారు. ఓటింగ్‌లో హీరో విశాల్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందడంతో మద్రాస్ కోర్టు కౌంటింగ్‌ను ఆపేసింది. తాజాగా రిటైర్డ్ జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరపగా మరోసారి నాజర్ ప్యానెల్ గెలుపొందింది. చదవండి: Sarkaru Vaari Paata: పెన్నీ ఫుల్ సాంగ్ వచ్చేసింది -
విషం ఇచ్చి చంపేయమంటున్నారు!
పెరంబూరు : విశ్రాంతి కళాకారులకు విషం ఇచ్చి చంపేయండి అని అంటున్నారని దర్శక, నటుడు కె.భాగ్యరాజ్ అన్నారు. గత ఏడాది జూన్ 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన నటుడు విశాల్ వర్గం , కె.భాగ్యరాజ్ అధ్యక్షతన నిర్మాత ఐసరిగణేశ్ వర్గం పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికలను రద్దు చేయాలంటూ కొందరు సభ్యులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు చెల్లవని, మరో మూడు నెలల్లో మళ్లీ నడిగర్ సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పుపై నటుడు విశాల్ వర్గం మద్రాసు హైకోర్టులోనే రిట్ పిటిషన్ వేశారు. అందులో ఎన్నికలు సక్రమంగానే జరిగాయని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సంఘానికి ఆర్థికస్తోమత లేదని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ నెల 10న తీర్పును ప్రకటిస్తూ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న గత ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించింది. కోర్టు స్టే విధించడాన్ని విశాల్ వర్గం స్వాగతించగా, భాగ్యరాజ్ వర్గం కోర్టు తీర్పునకు కట్టుబడతామని చెప్పారు.కాగా భాగ్యరాజ్ వర్గం బుధవారం స్థానిక టీ.నగర్,అబిబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం ఆవరణలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (స్వచ్ఛ రాజకీయాలు కావాలన్నప్పుడు వస్తా!) దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ మాట్లాడుతూ... సంఘం ఎన్నికల వ్యవహారంలో ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. కాగా సంఘం ద్వారా పెన్షన్లను పొందుతున్న విశ్రాంతి సభ్యులకు 6 నెలలుగా పెన్షన్లు అందకపోవడంతో వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కొందరు పేదరికం కారణంగా తమను విషం ఇచ్చి చంపేయండి అని అనడం బాధ అనిపించిందన్నారు. అనంతరం నిర్మాత ఐసరి గణేశ్ మాట్లాడుతూ మద్రాసు హైకోర్టు తీర్పును శిరసావహిస్తామన్నారు. సంఘానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయస్థానం తీర్పుపై నటుడు విశాల్ రిట్ పిటిషన్ వేయడం సరి కాదన్నారు. అయితే తాము మాత్రం మళ్లీ కోర్టులో అప్పీల్‌కు వెళ్లమని చెప్పారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా, ఇంతకు ముందు జరిగిన పోలింగ్ ఓట్లను లెక్కించినా తమకు సమ్మతమేనన్నారు. కాగా ఆరు నెలలుగా పింఛన్లు అందక విశ్రాంతి సంఘ సభ్యులు బాధపడుతున్నారన్నారు. అలాంటి వారికి తామే పింఛన్లు అందించాలని భావించామని అందులో భాగంగా ప్రస్తుతం సంఘం బాధ్యతల నిర్వహిస్తున్న ప్రభుత్వం నియమించిన అధికారిని కలిశారు. ఆయన్ని పెన్షన్లు పొందుతున్న విశ్రాంతి సభ్యుల పట్టికను ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పారు. (ఇక్కడైతే బతికిపోయేవాడు) అయితే ఆయన తాను నడిగర్ సంఘంకు మాత్రమే అధికారిగా నియమించబడ్డానని, పింఛన్లు పొందుతున్న వారి పట్టిక సంఘం ట్రస్ట్ బాధ్యతలు నిర్వహిస్తున్న వారి వద్ద ఉంటుందని చెప్పినట్లు తెలిపారు. కాబట్టి విశాల్ వర్గాన్ని పింఛన్లు పొందుతున్న విశ్రాంతి కళాకారుల పట్టికను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నారు, అదే విధంగా ఎవరైతే పింఛన్లకు అర్హులో వారంతా తమ గుర్తింపు కార్డులతో తమను కలిస్తే పింఛన్లు అందిస్తామని ఐసరి గణేశ్ పేర్కొన్నారు. -
‘నడిగర్ సంఘంలో అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి’
పెరంబూరు : నడిగర్ సంఘంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు సవ్యంగానే జరుగుతున్నాయని ఆ సంఘ సభ్యులు సంఘ రిజిస్ట్రార్ శాఖకు, రాష్ట్రర సచివాలయానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు.. దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఎన్నికల జరిగినా ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండడం వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగలేదు. ఓట్ల లెక్కింపు ఎప్పుడు నిర్వహించాలన్నది ఈ నెల 15వ తేదీన వెల్లడించనున్నట్లు చెన్నై హైకోర్టు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సంఘాల శాఖ నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌లకు నోటీసులు జారీ చేసింది. అందులో సంఘనిర్వాక విధులను సరిగా నిర్వహించలేదని తెలిసిందని, దీంతో తామే ప్రత్యేక అధికారితో ఎందుకు సంఘ బాధ్యతలు నిర్వహించారాదు? అని ప్రశ్నించారు. ఈ నోటీసులు నడిగర్‌సంఘం సభ్యులను ధిగ్భ్రాంతికి గురి చేసింది. వారు సంఘాల శాఖ అధికారికి, రాష్ట్ర సచివాలయానికి ఒక లేఖ రాశారు. అందులో తమకు నోటీసులు, పత్రికల్లో వెలువడ్డ వార్త దిగ్భ్రాంతిని, మనస్థాపాన్ని కలిగించాయన్నారు. సంఘంలో చాలా కాలంగా పొందని పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ మూడేళ్లలో తాము పొందుతున్నామన్నారు. ముఖ్యంగా విశ్రాంత నటీ, నటులకు వృద్ధాప్య భృతి వంటి సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల ఫలితాలు వెలువడక పోయినా అందిస్తోందని చెప్పారు. అలాంటిది కొందరు కావాలనే ఉసుగొల్పి, ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలతో ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు. సంఘ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎన్నికలను రద్దు చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికలు జరిగి మూడు నెలలు అయినా ఎలాంటి అవరోధాలు లేకుండా సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారన్నారు. అలాంటిది సంఘానికి చేటు వాటిల్లేలా ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించరాదన్న నోటీసులు సంఘంలోని 80 శాతం సభ్యులను బాధించాయన్నారు. 200 మంది వరకూ లేఖలో సంతకాలు చేసి పంపారు. -
దురదృష్టకరం..అలా జరగాల్సింది కాదు: రజినీ
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరుకు రేపటితో తెరపడనుంది. ఆదివారం నడిగర్ సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పాండవర్ జట్టు, స్వామి శంకరదాస్ జట్టులు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నడిగర్ సంఘం ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయినందుకు విచారాన్ని వ్యక్తం చేశారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న ఆయన తన ఆవేదనను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘‘ నేను ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్నాను. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా నా ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ సాయంత్రం చాలా ఆలస్యంగా 6.45 గంటలకు పోస్టల్ ఓటు అందుకున్నాను. ఈ ఆలస్యం కారణంగా నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాను. ఇది చాలా దురదృష్టకరం. ఇలా జరగాల్సింది కాద’’ని పేర్కొన్నారు. కాగా నడిగర్ సంఘం ఎన్నికలను నిలిపివేయాలని తమిళనాడులోని ఓ అధికారి మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పాండవర్ జట్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కోర్టు గత శుక్రవారం విచారణ జరిపింది. యథాప్రకారం ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగేలా తీర్పు వెలువరించింది. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరపరాదని షరతు విధించింది. -
అనూహ్యం: నడిగర్ సంఘం ఎన్నికలు రద్దు
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన దక్షిణ భారత నటీనటుల సంఘం (నడీగర్) ఎన్నికలు అనూహ్యంగా రద్దయ్యాయి. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన నడిగర్ ఎన్నికలను తమిళనాడు రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ బుధవారం నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నడిగర్ ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్న నాజర్-విశాల్, భాగ్యరాజ్-ఈశ్వరి గణేషన్ గ్రూపులు.. ఒక్కసారిగా ఎన్నికలు రద్దవ్వడంతో బిత్తరపోయాయి. నడిగర్ సంఘం నుంచి బహిష్కరించబడిన 61 మంది సభ్యుల ఫిర్యాదు మేరకు రిజిస్టార్ ఆఫ్ సొసైటిస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫిర్యాదుపై మరింత విచారణ జరిపి.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయిస్తామని ప్రకటించింది. నాజర్-విశాల్‌కు చెందిన పాండవర్ అని గ్రూప్ తమను నడిగర్ సంఘం ఓటర్ల జాబితా నుంచి ఆ కారణంగా తొలగించిందని, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తమపై బహిష్కరణ వేటు వేసిందని 61 మంది సభ్యులు ఫిర్యాదు చేశారు. -
ప్రశ్నించడానికి విశాల్ ఎవరు?
తమిళసినిమా: నడిగర్‌సంఘంకు సంబంధిచిన విషయాలను ప్రశ్నించడానికి విశాల్ ఎవరు? అసలు తనకేమి హక్కు ఉంది అంటూ నటుడు శింబు ఘాటుగా ప్రశ్నించారు. నడిగర్‌సంఘం ఎన్నికలు ఈ నెల 18న జరగనున్న విషయం తెలిసిందే.ఎన్నికలకు మరో 10 రోజులే సమయం ఉండగా సంఘ పదవులకు బరిలో ఉన్న శరత్‌కుమార్ జట్టు విశాల్ జట్టు ఓటర్ల మద్దతు కూడ గట్టుకునే పనిలో తీవ్రంగా నిమగ్నమయ్యారు.పనిలో పనిగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.ఇరుజట్టు సభ్యులు నామినేషన్ల పర్వాన్ని పూర్తి చేశారు.మ్యానిఫేస్టులు ప్రకటించారు. ఒక నామినేషన్లు వాపస్ గడువు బుధవారంతో ముగిసింది.ఇలాంటి పరిస్థితుల్లో శరత్‌కుమార్ జట్టు బుధవారం సాయంత్రం నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో ఆ జట్టులో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు శింబు పోటీ జట్టు సభ్యుడయిన విశాల్ పై ఆరోపణల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కటుంబం లాంటి నడిగర్ సంఘాన్ని విశాల్ చీల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.తన సొంత సమస్యను సంఘానికి ఆపాదిస్తున్నారన్నారు. ఒక కుటుంబం లాంటి సంఘాన్ని చీల్చుతానంటే చూస్తూ ఊరుకోను. నడిగర్ సంఘం భవన నిర్మాణ బాధ్యతల్ని ఎస్పిఐ సినిమాస్ సంస్థకు అప్పగించడం తప్పేమంది?అందులో ధియేటర్ కట్టడం విశాల్‌కు ఇష్టం లేదా?అసలు ఆయన ఏమి కోరుకుంటున్నారు? సీసీఎల్ కెప్టెన్ అయిన విశాల్ విజయకాంత్ కన్నా గొప్పా?నటుడు పూచి మురుగన్ సంఘ భవన నిర్మాణ వ్యవహారంలో కోర్టులో వేసిన పిటీషన్‌ను వాపస్ తీసుకోమని చెబితే ఎందుకు వాపస్ తీసుకోలేదు?భవనాన్ని పడగొట్టినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారు ఏమైపోయారు?సంఘం పక్కకే రానివారు అవినీతి,అక్రమాలు అని ఆరోపించడమా? సీనియర్ నటులు సంఘం కోసం ఎంతో కృషి చేస్తే విశాల్‌కు ఏమి అర్హత ఉందని సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు?అసలు ప్రశ్నించే అర్హత ఆయన కెక్కడిది? అంటూ ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించారు. నడిగర్‌సంఘం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని,అందుకోసం ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి తాము సిద్ధమేనని శింబు అన్నారు. రజనీ కాంత్, కమలహాసన్ ఎందుకు ముందుకురారు? అంటూ రాధిక ప్రశ్నించారు. దర్శకుడు,భాగ్యరాజ్,పూర్ణిమా భాగ్యరాజ్, ఊర్వశి పాల్గొన్నారు.