ప్రశ్నించడానికి విశాల్ ఎవరు?
తమిళసినిమా: నడిగర్‌సంఘంకు సంబంధిచిన విషయాలను ప్రశ్నించడానికి విశాల్ ఎవరు? అసలు తనకేమి హక్కు ఉంది అంటూ నటుడు శింబు ఘాటుగా ప్రశ్నించారు. నడిగర్‌సంఘం ఎన్నికలు ఈ నెల 18న జరగనున్న విషయం తెలిసిందే.ఎన్నికలకు మరో 10 రోజులే సమయం ఉండగా సంఘ పదవులకు బరిలో ఉన్న శరత్‌కుమార్ జట్టు విశాల్ జట్టు ఓటర్ల మద్దతు కూడ గట్టుకునే పనిలో తీవ్రంగా నిమగ్నమయ్యారు.పనిలో పనిగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.ఇరుజట్టు సభ్యులు నామినేషన్ల పర్వాన్ని పూర్తి చేశారు.మ్యానిఫేస్టులు ప్రకటించారు.
ఒక నామినేషన్లు వాపస్ గడువు బుధవారంతో ముగిసింది.ఇలాంటి పరిస్థితుల్లో శరత్‌కుమార్ జట్టు బుధవారం సాయంత్రం నగరంలోని ఒక నక్షత్ర హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో ఆ జట్టులో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు శింబు పోటీ జట్టు సభ్యుడయిన విశాల్ పై ఆరోపణల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కటుంబం లాంటి నడిగర్ సంఘాన్ని విశాల్ చీల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.తన సొంత సమస్యను సంఘానికి ఆపాదిస్తున్నారన్నారు.
ఒక కుటుంబం లాంటి సంఘాన్ని చీల్చుతానంటే చూస్తూ ఊరుకోను. నడిగర్ సంఘం భవన నిర్మాణ బాధ్యతల్ని ఎస్‌పిఐ సినిమాస్ సంస్థకు అప్పగించడం తప్పేమంది?అందులో ధియేటర్ కట్టడం విశాల్‌కు ఇష్టం లేదా?అసలు ఆయన ఏమి కోరుకుంటున్నారు? సీసీఎల్ కెప్టెన్ అయిన విశాల్ విజయకాంత్ కన్నా గొప్పా?నటుడు పూచి మురుగన్ సంఘ భవన నిర్మాణ వ్యవహారంలో కోర్టులో వేసిన పిటీషన్‌ను వాపస్ తీసుకోమని చెబితే ఎందుకు వాపస్ తీసుకోలేదు?భవనాన్ని పడగొట్టినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారు ఏమైపోయారు?సంఘం పక్కకే రానివారు అవినీతి,అక్రమాలు అని ఆరోపించడమా? సీనియర్ నటులు సంఘం కోసం ఎంతో కృషి చేస్తే విశాల్‌కు ఏమి అర్హత ఉందని సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు?అసలు ప్రశ్నించే అర్హత ఆయన కెక్కడిది? అంటూ ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించారు. నడిగర్‌సంఘం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని,అందుకోసం ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి తాము సిద్ధమేనని శింబు అన్నారు. రజనీ కాంత్, కమలహాసన్ ఎందుకు ముందుకురారు? అంటూ రాధిక ప్రశ్నించారు. దర్శకుడు,భాగ్యరాజ్,పూర్ణిమా భాగ్యరాజ్, ఊర్వశి పాల్గొన్నారు.