Simbu
-
కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే?
పల్లెటూరి నుంచి వచ్చి ఎన్నో పాట్లు పడి సినిమా తీసి నిలదొక్కుకున్నవారెందరో. తమిళ దర్శకుడు సుశీంద్రన్ (Suseenthiran) కూడా ఇదే జాబితాలో ఉన్నాడు. సినిమా తీయాలన్న లక్ష్యంతో 18 ఏళ్ల వయసులో చెన్నైకి చేరుకున్నాడు. కష్టాలకు ఓర్చుకున్నాడు. ఎదురుదెబ్బలకు వణికిపోకుండా నిలబడ్డాడు. పన్నెండేళ్ల ప్రయత్నాల తర్వాత తొలి సినిమా తీశాడు. వెన్నెల కబడ్డీ కుజు దర్శకుడిగా అతడి తొలి చిత్రం. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో మరుపటి ఏడాది కార్తీ- కాజల్‌తో కలిసి నాన్ మహాన్ అల్లా మూవీ తీశాడు. ఇది మరింత హిట్టు.సహజమైన కథలతో..అళగర్సామిన్ కుదిర, ఆదలాల్ కాదల్ సెవీర్, పాండ్య నాడు, జీవా, పాయుం పులి వంటి హిట్ చిత్రాలు తీశాడు. కొన్నిసార్లు అపజయాలతోనూ ప్రయాణం సాగించాడు. అయితే లేనిపోని హీరోయిజం, లాజిక్ లేని సీన్స్‌కు దూరంగా ఉంటూ తన కథలు సహజంగా ఉండేలా చూసుకున్నాడు. ఇతడు 2021లో శింబు (Silambarasan TR)తో ఈశ్వరన్ తీశాడు. నిజానికి ఈ కథ హీరో జై కోసం రాసుకున్నాడట!కథ బాలేదని ఛీ కొట్టిన హీరోకానీ శింబు తనతో ఓ సినిమా చేయమని కోరడంతో ఈ కథ అతడికి వినిపించాడు. అయితే కథ అస్సలు బాగోలేదంటూ శింబు ఉమ్మేశాడట! దీంతో కథను శింబుకు తగ్గట్లుగా మార్చేశానని దర్శకుడు సుశీంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్త వైరలవుతోంది. ఇకపోతే ఈశ్వరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. శింబు విషయానికి వస్తే పాదు తల (2023) సినిమాలో చివరిగా కనిపించాడు. ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: యాంకర్ రష్మీతో రాజమౌళి లవ్!.. ఇదెప్పుడు జరిగింది? -
ఇండస్ట్రీ ప్లే బాయ్‌తో చెయ్యి కలపనున్న 'సాయి పల్లవి'
సాయిపల్లవికి నటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకోవడం ఈమె నైజం కాదు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతారు. అదీ తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. ఇకపోతే గ్లామరస్‌గా ఉండకూడదు. అలాంటి పాత్రల్లో నటిస్తూనే వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా తాజాగా నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజాగా మరో కోలీవుడ్ చిత్రం కోసం సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. అదీ సంచలన నటుడు శింబుతో జత కట్టే విషయమై ప్రచారం జోరందుకుంది. శింబు ఇప్పుడు నటుడు కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్‌లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా వరుసగా మూడు చిత్రాల్లో నటించడానికి శింబు సిద్ధం అవుతున్నారు. అందులో ఒకటి పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రం. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల నటుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో శింబు చేతిలో ఉన్న పుస్తకంలో రక్తం మరకలు కలిగిన కత్తి ఉండడంతో ఇది యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..ఈ చిత్రంలో కథానాయకిగా నటి సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మరో ముఖ్య పాత్రలో నటుడు సంతానం నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. హాస్య నటుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత కథానాయకుడిగా రాణిస్తున్న సంతారం ఈ చిత్రం ద్వారా మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే శింబు నటించిన గత సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్ లేదా సాంగ్స్ ఉండటం సహజం. కోలీవుడ్ ప్లే బాయ్ అనే ట్యాగ్‌లైన్ కూడా ఆయనకు ఉంది. నయనతార,హన్సిక,ఆండ్రియా, హర్షిక,త్రిష,సనా ఖాన్ వంటి వారితో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయంటూ కోలీవుడ్‌లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, సింబు సినిమాలో సాయి పల్లవి నటించడానికి సమ్మతించారా..? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఆమె అంగీకరించినట్లయితే అందులో ఆమె పాత్ర స్ట్రాంగ్ అయ్యి ఉంటుందని భావించవచ్చు. కాగా ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఇది శింబు నటించనున్న 49వ చిత్రం అన్నది గమనార్హం. -
క్రేజీ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి!
హీరోయిన్ మీనాక్షీ చౌదరి కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ నటించిన ‘గుంటూరు కారం, సింగపూర్ సెలూన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. మీనాక్షి నటించిన ఇతర చిత్రాలు ‘లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, మట్కా’ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు ముస్తాబు అవుతున్నాయి. ఇక తాను హీరోయిన్గా కమిటైన సినిమాల చిత్రీకరణలు దాదాపు పూర్తి కావడంతో మీనాక్షీ చౌదరి కొత్త సినిమాలు సైన్ చేసేందుకు కథలు వింటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దర్శకుడు అశ్వత్ మారిముత్తు చెప్పిన కథ విన్నారట మీనాక్షి. కథ నచ్చడంతో శింబు హీరోగా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’లో కూడా మీనాక్షీ చౌదరి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపిస్తారు. -
యువన్ శంకర్‌రాజా బిగ్ ప్లాన్.. డైరెక్టర్‌గా ఎంట్రీకి లైన్ క్లియర్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న అతి కొద్దిమందిలో యువన్ శంకర్‌రాజా ఒకరు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడైన ఈయన ప్యార్ ప్రేమ కాదల్ అనే చిత్రం ద్వారా నిర్మాతగానూ మారారు. అందులో నటుడు హరీశ్ కల్యాణ్ కథానాయకుడిగా నటించారు. ఆ తరువాత విజయ్‌సేతుపతి హీరోగా మామనిదన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా ఈయన సంగీతాన్ని అందించిన గోట్ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. మరిన్ని చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న యువన్ శంకర్ రాజా త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో ఆయన పేర్కొంటూ త్వరలో మోగాఫోన్ పట్టనున్నట్లు చెప్పారు. తాను దర్శకత్వం వహించే చిత్రంలో నటుడు శింబును కథానాయకుడిగా నటింపజేస్తానని చెప్పారు. ఈయనకు నటుడు శింబుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో ఈయన దర్శకత్వంలో నటించడానికి శింబు ఒకే చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. నటుడు శింబు ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన థగ్‌లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. తదుపరి కమలహాసన్ తన రాజ్ కమల్ పిలింస్ పతాకంపై నిర్మించనున్న భారీ యాక్షన్ ఎంటర్టెయిన్మెంట్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తరువాత యువన్‌శంకర్‌రాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాలి. -
తమిళ 'బిగ్‌బాస్'హోస్ట్ రేసులో ముగ్గురు స్టార్ హీరోలు
తమిళ 'బిగ్‌బాస్' రియాల్టీ షో కోసం కొత్త హోస్ట్ వచ్చేస్తున్నాడు. ఏడు సీజన్ల వరకు లోకనాయుడు కమల్ హాసన్ హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. కమల్ ఇమేజ్‌తో ఈ షో పట్ల కోలీవుడ్‌లో మంచి బజ్ ఉంది. అక్కడ రేటింగ్స్ కూడా బాగానే బిగ్ బాస్ రాబట్టాడు. మరో కొద్దిరోజుల్లో సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్‌గా పనిచేయడంలేదని ప్రకటించారు. దీంతో కొత్తగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.2017లో తమిళ్లో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ ఉన్నారు. అయితే, వచ్చే సీజన్లో తాను హోస్ట్‌గా కొనసాగడంలేదని చెప్పారు. తను ఒప్పుకున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు. కమల్ స్థానాన్ని భర్తి చేసేందుకు కోలీవుడ్ హీరో శింబు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ నుంచి వైదొలిగినప్పుడు శింబు బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసేందుకు శింబు రానున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై శింబు మేనేజర్ ఇలా తెలిపాారు. 'బిగ్ బాస్ షోకు నటుడు శింబు హోస్ట్ చేయబోతున్నాడన్న సమాచారంలో నిజం లేదని.. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని' ఆయన చెప్పారు. శింబు తర్వాత విజయ్ సేతుపతి, సూర్య పేర్లు ఆ లిస్ట్‌లో కనిపిస్తున్నాయి. సరికొత్తగా రమ్యకృష్ణ పేరును కూడా బిగ్ బాస్ యూనిట్ పరిశీలిస్తుందట. మరొ కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. -
నిజాలు మాట్లాడితే కష్టాలే.. ఆ వివాదంపై స్పందించిన హీరో శింబు
తమిళంలో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న శింబు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు అంటే వివాదాలు, వివాదాలు అంటే శింబు అనే రీతిలో ఉంటుంది. ఈయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. తాజాగా నిర్మాత ఐసరి గణేశ్ కూడా శింబుపై ఫిర్యాదు చేశారు. తాను నిర్మించనున్న 'కరోనా కుమార్' చిత్రంలో నటించడానికి కమిట్ అయిన శింబుకు రూ.4 కోట్లు అడ్వాన్స్ ఇచ్చానని, కానీ ఇప్పుడాయన తన మూవీలో నటించడం లేదని, తన చిత్రాన్ని పూర్తి చేసే వరకు ప్రస్తుతం శింబు చేస్తున్న 'థగ్ లైఫ్' మూవీలో నటించకుండా నిషేధించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)దీంతో శింబుపై రెడ్ కార్డ్ విధించినట్లు ప్రచారం హోరెత్తింది. దీనిపై స్పందించిన శింబు.. తాను కమలహాసన్ 'థగ్ లైఫ్'లో నటిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ లోకంలో నిజాలు చెప్పేవారు చాలా కష్టపడుతున్నారని.. తాను చాలా నిజాలు మాట్లాడానని చెప్పారు. అయితే తనపై రెడ్ కార్డ్ విధించడం లాంటిదేదీ జరగలేదని పేర్కొన్నారు. చిన్న సమస్య ఉందని, దాన్ని మాట్లాడి పరిష్కరించినట్లు చెప్పారు. కాగా కమల్ హాసన్‌తో కలిసి నటిస్తూనే ఈయన నిర్మిస్తున్న మరో మూవీలోనూ హీరోగా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?) -
ఆ హీరో కోసం కియారా, జాన్వీ కపూర్!
బాలీవుడ్ హీరోయిన్లు ఈ మధ్య దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారు. ఇలియానా, తమన్నా, కాజల్, తాప్సీ, హన్సిక వంటి పలువురు బాలీవుడ్ భామలు దక్షిణాదిలో ఎదిగిన వారే. ఇప్పుడు కూడా కియారా, దిశాపటాని వంటి క్రేజీ హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటీమణులుగా రాణిస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ ఈ పట్టికలో చేరారు. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ రామ్‌చరణ్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇద్దరూ ఒకే సినిమాలో!ఇకపోతే కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌కు జంటగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి ఒక చిత్రంలో నటిస్తే.. అదీ తమిళ సినిమా అయితే, అందులో శింబు కథానాయకుడు అయితే, ఆ చిత్రం వేరే లెవల్‌గా ఉంటుంది కదూ! అలాంటి క్రేజీ చిత్రం త్వరలోనే తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. ద్విపాత్రాభినయంశింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా నటిస్తున్న థగ్‌లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీని తరువాత శింబు తన 48వ చిత్రంలో నటించనున్నారు. దీన్ని నటుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. దీనికి దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా అందులో ఇద్దరు శింబులు తలపడుతున్నట్లుగా ఉంది.కియారాతో పాటు..శింబు ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఒక కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే జాన్వీ కపూర్‌ను సైతం ఎంపిక చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే ఈ క్రేజీ చిత్రం ద్వారా కియారా, జాన్వీకపూర్ ఇద్దరూ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట!చదవండి: ట్రెండింగ్‌లో విజయ్ చెల్లెలు ఫోటో.. కారణం ఇదే -
తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి?
రీసెంట్ టైంలో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో కియారా అడ్వాణీ ఒకరు. హిందీ చిత్రాలతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది కానీ తెలుగులోనూ రెండు మూవీస్ చేసి ఇక్కడ క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తూ బిజీగా ఉంది. అలాంటిది ఇప్పుడు కియారాకు తమిళం నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)మిళ హీరోల్లో శింబు స్టైలే వేరు. దాదాపు కొన్నేళ్ల పాటు హిట్ లేక పూర్తిగా కనుమరుగైపోయిన ఇతడు.. కొన్నాళ్ల క్రితం 'మానాడు', 'వెందు తనిందడు' చిత్రాలతో హిట్స్ కొట్టాడు. గతేడాది వచ్చిన 'పత్తు తలా' మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇతడు కమల్ 'థగ్ లైఫ్'లో కీలక పాత్ర చేస్తున్నాడు. మరోవైపు కమల్ నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా చేస్తున్నాడు.దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కియారా అడ్వాణీ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తమిళ చిత్రసీమలోకి కియారా ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..
హీరో శింబు సినిమాలు జయాపజయాలకు అతీతంగా మినిమమ్ వసూళ్లు సాధిస్తాయి. అందుకే నిర్మాతలు ఈయనతో చిత్రాలు చేయడానికి క్యూ కడతారు. ఆ మధ్య మానాడు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న శింబు, ఆ తరువాత వెందు నిందదు కాడు చిత్రంతోనూ హిట్ కొట్టారు. ఆ తరువాత నటించిన పాత్తు తల చిత్రం నిరాశపరచింది. కాగా త్వరలో కమల్ హాసన్ బ్యానర్లో దేశింగు పెరియసామి దర్శకత్వంలో నిర్మించనున్న భారీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. థగ్‌లైఫ్ మూవీలోప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న థగ్‌లైఫ్ చిత్రంలో శింబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే పోస్టర్ కూడా రిలీజైంది. ప్రస్తుతం ఇతడు ఆ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో థగ్‌లైఫ్ చిత్రంలో శింబు నటించరాదని నిర్మాత ఐసరి గణేశ్ తమిళ నిర్మాతల మండలికి ఫిర్మాదు చేశారు. రూ.4 కోట్లు అడ్వాన్స్అందులో ఆయన తాను వెందు తనిందదు కాడు చిత్రం తరువాత శింబు హీరోగా కరోనా కుమార్ అనే చిత్రాన్ని గోకుల్ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నానని తెలిపారు. అందుకు గానూ ఆయనకు రూ.9 కోట్లు పారితోషికం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని, రూ.4 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఒప్పందం ప్రకారం శింబు తన చిత్రంలో నటించడం లేదని, ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. అప్పటివరకు ఎక్కడా నటించొద్దుసెప్టెంబరు 19వ తేదీలోగా రూ.1 కోటితో కూడిన అనుమతి పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని, లేని పక్షంలో ఇతర చిత్రాల్లో నటించడానికి నిషేధం విధించనున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు. కాబట్టి తన చిత్రాన్ని పూర్తి చేసే వరకూ శింబు థగ్‌లైఫ్ చిత్రంలో నటించరాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే థగ్‌లైఫ్ చిత్రంలో నటిస్తున్న శింబు ఆ చిత్రాన్ని పూర్తి చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. -
కమల్‌హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న భారీ చిత్రం 'థగ్ లైఫ్'. నాయగన్(1987) సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు, ఐశ్వర్యా లక్ష్మి, జోజూ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్‌లో కోలీవుడ్ హీరో శింబు జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, గన్‌తో ఎవరిపైనో గురి పెట్టి శింబు కాల్చుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. కమల్‌హాసన్, శింబులతో పాటు ప్రముఖ నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఢిల్లీ షూటింగ్ షెడ్యూల్ పూర్తవగానే ‘థగ్ లైఫ్’ టీమ్ లండన్ వెళుతుందని కోలీవుడ్ సమాచారం. రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారని.. ఈ ప్లేస్లోనే శింబును ఎంపిక చేశారని టాక్. అలాగే జయం రవి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోగా.. ఆ పాత్రను అశోక్ సెల్వన్ చేస్తారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
సూపర్ హిట్ డైరెక్టర్‌తో జతకట్టనున్న శింబు?
కోలీవుడ్‌లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న హీరో శింబు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్య మాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల శింబు నటించిన పత్తుతల చిత్రం పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే అవకాశాలకు మాత్రం తగ్గడం లేదు. తాజాగా నటుడు కమలహాస న్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో శింబు కథానాయకుడిగా నటించనున్నారు. దేశింగు పెరియ సామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నా యి. ఈ చిత్రం కోసం శింబు ప్రత్యేకంగా కసరత్తు చేయడంతో పాటు కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యల్లోనూ శిక్షణ పొందారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా శింబు తన 49, 50వ చిత్రాలకు కూడా కమిట్ అయిన ట్లు తాజా సమాచారం. ఆయన తన 49వ చి త్రాన్ని అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వంలో చే యనున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ డబుల్ ఓకే అనిపించడంతో వెంటనే అందులో నటించడాని కి సమ్మతించినట్లు తెలిసింది. ఇ కపోతే శింబు తాను 50వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్న ట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టా క్ వైరల్ అవుతోంది. సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర తాజాగా మరోసారి సూర్యతో పురనానూరు అనే చి త్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చి త్రం తర్వాత శింబుతో చేసే చిత్రం ఉండే అ వకాశం ఉంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మృణాల్ ఠాకూర్ ఏ హీరోకు ఎస్ అంటుందో?
నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విడాముయర్చి. లైకా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిల్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తర్వాత చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో అజిత్ సరసన నటి మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో వరుస హిట్లతో క్రేజీ కథానాయకిగా ఈమెకు ఇప్పుడు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల నటుడు శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనుందని ప్రచారం జోరుగా సాగింది. ఆమె కాల్షీట్స్ కోసం ఆ చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. అదేవిధంగా శింబు కథానాయకుడిగా కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలోనూ కథానాయకిగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. దీంతో ఈ అమ్మడు అజిత్‌కు జై కొడుతుందో, శింబుకు సై అంటుందోనన్న ఆసక్తి కోలీవుడ్‌లో నెలకొంది. అజిత్ చిత్రం యూనిట్ వేరే ఆప్షన్ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్ కాల్షీట్స్ కుదరకపోతే బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది .ఈ భామ ఇప్పటికే కంగువ చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
శింబు సినిమాలో కమల్ హాసన్?
తమిళ సినిమా: సంచలన నటుడు శింబు ప్రస్తుతం తన 48వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక కథా చిత్రాన్ని విశ్వనటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి దేశింగు పెరియసామి కళ, దర్శకత్వం బాధితులను నిర్వహిస్తున్నారు. పిరియాడికల్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం నటుడు శింబు కుంగ్ఫు హాస్టల్ ఆత్మ రక్షణ విద్యల్లో శిక్షణ పొందడంతో పాటు తన శారీరక భాషను పూర్తిగా మార్చుకున్నాడు. మరో విషయం ఏమిటంటే శింబు ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా, ప్రతినాయ కుడిగా నటించనుండడం మరో విశేషం. ఇందులో ఆయన సరసన నటి కీర్తి సురేష్, మృణాల్ ఠాగూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తాజాగా శింబు 48 చిత్ర అప్డేట్ ఏమిటంటే కమలహాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన కూడా ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగి పోతున్నాయి. చిత్ర షూటింగ్ మార్చి నెల రెండో వారంలో ప్రారంభం కాబోతున్నట్లు తాజా సమాచారం. ఇది శింబు అభిమానులకు పండగ చేసుకునే వార్తే అవుతుంది. కాగా ఇందులో నటించే వారి వివరాలు త్వరలో వెలుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కెరీర్ ఖతం అన్నారు.. కానీ ఎట్టకేలకు హీరోయిన్గా ఓ ఛాన్స్!
పూజా హెగ్డే.. అప్పట్లో వరస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అరవింద సమేత, అల వైకుంఠపురములో తదితర చిత్రాలతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం ఛాన్సుల్లేక పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది. ఈమె కెరీర్ ఇక అయిపోయినట్లే అని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) కానీ ఈమెకు ఇప్పుడు ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ప్రముఖ తమిళ హీరో శింబు ప్రస్తుతం దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. కమల్ హాసన్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శింబు పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఈ పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కోసమే శింబు.. లండన్‌కు వెళ్లి మరీ కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. అలానే ఈ మూవీలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే, కీర్తీ సురేశ్ నటిస్తారని టాక్ నడిచింది. కానీ కీర్తి సురేశ్ ఓ హీరోయిన్ కాగా మరో కథానాయికగా పూజా హెగ్డేకి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ) -
స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?
'హనుమాన్' సినిమా చూశారా? మీలో చాలామంది చూసే ఉంటారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరూ అద్భుతంగా చేశారు. అలానే హీరో అక్కగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉన్నంతలో అదరగొట్టేసింది. ఈ మధ్య తెలుగు చిత్రాల్లో మంచి మంచి రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ఈ నటి.. 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె వివాహంపై రూమర్స్ వచ్చాయి. ఏకంగా ఓ స్టార్ హీరోతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న 'ఎవడు' సినిమా హీరోయిన్) అసలేం జరిగింది? వరలక్ష్మి.. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు. తండ్రిలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తొలుత హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొన్నాళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. తమిళంతో పాటు తెలుగులోనూ ప్రత్యేక పాత్రలు చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె గతంలో విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి. అందులో నిజం పక్కనబెడితే ఇప్పటికీ వీళ్లిద్దరూ సింగిల్‌గానే ఉండిపోయారు. నిజమెంత? ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ధనుష్‌తో పెళ్లి ఉండొచ్చని అన్నారు. ఇప్పుడేమో తమిళ స్టార్ హీరో శింబుతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు. వరలక్ష్మిలానే శింబు కూడా సింగిల్‌గా ఉండటంతో ఈ వదంతులు వచ్చాయి. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని ఇరువురి సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
శింబుతో జతకట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!
తమిళ హీరో శింబు నటించిన చివరి చిత్రం పత్తుతల. ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో ఈయన తర్వాత చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శింబు కథానాయకుడిగా కమల్ హాసన్ ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి దేశింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారట. ఈయన చెప్పిన కథ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ స్టార్స్‌ను మెప్పించిందని, ఇందులో రజనీ నటించాల్సిందని ప్రచారం జరిగింది. హీరో, విలన్.. అన్నీ ఒక్కడే అలాంటి కథలో ఇప్పుడు శింబు నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం కోసం శింబు కరాటే వంటి విద్యల్లో శిక్షణ పొందడం విశేషం. ఇది పీరియాడికల్ కథా చిత్రంగా ఉంటుందని టాక్. ఈ మూవీలో శింబు హీరో, విలన్ పాత్రను తనే పోషించనున్నారని టాక్! ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ మోస్ట్ టాప్ హీరోయిన్గా రాణిస్తున్న దీపికాపదుకొనే, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ క్వీన్‌తో.. హీరోకు జంటగా కీర్తీసురేశ్, విలన్ సరసన దీపికా పదుకొనే నటించబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఇది నిజంగానే భారీ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రమవుతుంది. దీపికా పదుకొనే చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా పలకరించనున్నారన్నమాట. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది: మెగాస్టార్ ఎమోషనల్ -
బాహుబలి సినిమాకు ధీటుగా శింబు మూవీ!
జయాపజయాలను లెక్క చేయకుండా ముందుకుసాగే హీరోల జాబితాలో శింబు పేరు కచ్చితంగా ఉంటుంది. మానాడు చిత్రం తర్వాత ఈయనకు సరైన హిట్ లేదనే చెప్పాలి. వెందు తనిందదు కాడు చిత్రం ఓకే అనిపించుకున్నా ఆ తర్వాత నటించిన పాత్తుతల చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినా శింబు చిత్రం వస్తుందంటే ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా శింబు తాజాగా తన 48వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనుండటం విశేషం. రజనీ నుంచి శింబుకు దీనికి దేశింగు పెరియసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇది ఈయన సూపర్‌స్టార్ రజనీకాంత్ కోసం తయారు చేసుకున్న కథ అని సమాచారం. కానీ తర్వాత దీన్ని శింబు దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కోసం శింబు కొత్తగా మేకోవర్ అవుతున్నారు. గత కొన్ని నెలల క్రితమే విదేశాలకు వెళ్లి కరాటే, కుంగ్‌ఫూ వంటి ఆత్మ రక్షణ విద్యలో శిక్షణ పొంది వచ్చారు. ఈ చిత్రం కోసం తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. లుక్కు మార్చేశాడు బాగా స్లిమ్‌గా తయారవడంతోపాటు పొడవైన జుట్టు, గడ్డం మీసాలతో పూర్తిగా మారిపోయారు. తాజా సమాచారం ప్రకారం ఇది బాహుబలి చిత్రానికి దీటుగా భారీస్థాయి చారిత్రక కథాచిత్రంగా ఉంటుందట. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న భారీ చిత్రం గురించి అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: కొత్త కండీషన్లు పెడుతున్న రైతుబిడ్డ! గర్వం తలకెక్కిందా? -
శింబు సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్
సౌత్ ఇండియాలో సంచలన నటుడుగా ముద్ర వేసుకున్న శింబు.. కొత్త చిత్రాల విషయంలో వేగం పెంచాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన నటించిన వెందు తనిందదు కాడు (లైఫ్ ఆఫ్ ముత్తు) చిత్రం విడుదలై చాలా కాలం అయ్యింది. తదుపరి కరోనా కుమార్ అనే చిత్రంలో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ చిత్రం ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం శింబు రాజ్‌కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మించనున్న చిత్రం కోసం మేకోవర్ అవుతున్నారు. నటుడు రజనీకాంత్ నటించాల్సిన కథలో శింబు నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే శింబు ఇంతకు ముందు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన మానాడు చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా దానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి దర్శకుడు వెంకట్ ప్రభు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక భేటీలో ఆయనే తెలిపారు. ప్రస్తుతం ఆయన నటుడు విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న 68వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నటి మీనాక్షి చౌదరి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతో ఈ చిత్రం పూర్తి అయిన తరువాత మానాడా–2 ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!
స్టార్ హీరోకు- నిర్మాతకు మధ్య ఓ వివాదం. ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లింది. గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన దీనిపై తాజాగా న్యాయాస్థానం తీర్పు ఇచ్చింది. సదరు హీరో.. దాదాపు కోటి రూపాయల మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలా హీరో ఎవరు? జరిగింది ఇదే తమిళ నటుడు శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అప్పట్లో 'వల్లభ, 'మన్మథ' లాంటి డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత కేవలం తమిళం వరకే పరిమితయ్యాడు. ఇతడు కొన్నేళ్ల ముందు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా కోసం రూ.9.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.4.5 కోట్ల అందుకున్నాడు. కోటి రూపాయలు బ్యాంక్ ద్వారా చెల్లించగా, మిగిలిన మొత్తం డబ్బుగా ఇచ్చారు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?) ఎందుకు గొడవ? అయితే అడ్వాన్స్ తీసుకున్న శింబు.. సినిమా చేసే విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో వేల్స్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఇరువురి వాదనలు విన్న మద్రాసు హైకోర్టు.. బ్యాంక్ ద్వారా చెల్లించిన కోటి రూపాయల్ని నిర్మాణ సంస్థకు తిరిగిచ్చేయాలని ఆదేశించింది. మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలకు సరైన ఆధారాలు లేని కారణంగా అవి తిరిగివ్వాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ మిస్ ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ.. శింబు సన్నిహితులు లేదా పీఆర్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి ఏమైనా వెళ్తారా? రాజీ కుదుర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యే 'పాతు తలా' మూవీతో వచ్చిన శింబు హిట్ కొట్టాడు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) -
ఈ ఫొటోలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో కనిపెట్టారా?
చాలామంది హీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది. ఈ కుర్రాడికి మాత్రం స్టార్ హీరోయిన్లు పడిపోతారు. కలిసి సినిమాలు చేయడం లేటు.. ఆ బ్యూటీతో ఎఫైర్ పెట్టుకున్నాడనే రూమర్స్ వస్తాయి. అవి నిజమనేలా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయి. ఆ హీరో చిన్నప్పటి ఫొటో ఇప్పుడు ఒకటి వైరల్ అయింది. మరి అతడెవరో కనిపెట్టారా? పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి తండ్రి యాక్టర్ కమ్ డైరెక్టర్. దీంతో చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాపు 17 ఏళ్ల పాటు పలు సినిమాల్లో నటించాడు. అవును మీరు ఊహించింది కరెక్ట్. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఎవరో కాదు హీరో శింబు. తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకు మనోడు బాగానే తెలుసు. 'మన్మథ', 'వల్లభ' చిత్రాలతో అప్పట్లోనే తెలుగులో పాపులారిటీ సంపాదించాడు. కాకపోతే ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోలేకపోయాడు. (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) 2002లో హీరోగా సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన శింబు.. 2004లో 'మన్మథ', 2006లో 'వల్లభ' లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్తో హిట్స్ కొట్టాడు. 2010లో 'ఏ మాయ చేశావె' తమిళ రీమేక్‌తో ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే శింబు హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ తమిళంలో అంతంత మాత్రంగానే ఆడేవి. ఇక్కడ అసలు రిలీజయ్యేవి కావు. దీంతో తెలుగు ఆడియెన్స్‌కి శింబు మెల్లగా దూరమైపోయాడు. ఈ మధ్య కాలంలో మళ్లీ 'మానాడు', 'పాతు తలా' చిత్రాలతో విజయాలు అందుకుని.. సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. సినిమాల గురించి పక్కనబెడితే కెరీర్ ప్రారంభంలో నయనతారతో రిలేషన్ మెంటైన్ చేశాడు. శింబు-నయన్ ముద్దులు పెట్టుకున్న ఫొటోలు అప్పట్లో హాట్ టాపిక్. ఆ తర్వాత త్రిష, హన్సిక, నిధి అగర్వాల్.. ఇలా చాలామంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు తెగ రూమర్స్ వచ్చాయి. ఓ దశలో నిధి అగర్వాల్‌ని శింబు పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ అది ఇప్పటికే రూమర్ గానే మిగిలిపోయింది. అలాంటి శింబు చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్స్ ఈ విషయాల్ని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
మణిరత్నంతో మళ్లీ..
ముప్పై అయిదేళ్ల తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఇందులో భాగంగానే కథలోని ఓ కీలక పాత్ర కోసం మణిరత్నం నుంచి శింబుకు కబురు వెళ్లిందనీ టాక్. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘చెక్క చివంద వానం’ (2018) (తెలుగులో ‘నవాబ్’) సినిమాలో శింబు ఓ లీడ్ రోల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. కమల్–మణిరత్నం కాంబో సినిమాలో శింబు నటిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇక కమల్, మణిరత్నం కాంబినేషన్లో 1987లో ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) వచ్చిన సంగతి తెలిసిందే. -
రెమ్యునరేషన్ తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలకు షాక్!
తమిళనాడులో హీరోలు, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు హీరోలపై మండిపడుతున్నారు. సరైన కథలతో కాకుండా పిచ్చి కథలతో ముందుకు వస్తే ఎలా డేట్లు సర్దుబాటు చేస్తామని అటు నటులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య జరుగుతున్న వివాదంపై తమిళనాడు చిత్రమండలి స్పందించింది. శింబు, ఎస్జే సూర్య, అధర్వ, విశాల్, యోగి బాబు.. ఐదుగురు నటులకు రెడ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ నిర్ణయంపై హీరోలు ఏమని స్పందిస్తారో చూడాలి! చదవండి: తనను ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పిన రాకేశ్ మాస్టర్ -
దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ, దిశా పటానికి కోలీవుడ్‌లో మరో చాన్స్ తలుపు తట్టిందా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బాలీవుడ్లో సత్తాచాటిన ఈమె ఇప్పటికే తమిళంలో నటుడు సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో సమకాలీన కథలో చారిత్రక అంశాలను జోడించి రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే నటి దిశా పటానికి మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. కమలహాసన్ తన రాజ్ కుమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించే చిత్రం చోటుచేసుకుంది. దీన్ని కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం ఫేమ్ దేసింగు పేరియసామి తెరకెక్కించనున్నారు. వచ్చేనెల ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇది చారిత్రక కథాంశంతో తెరకెక్కినున్నట్లు సమాచారం. కాగా ఇందులో నటుడు శింబు ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో శింబుతో జతకట్టే నటి ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది భారీ బడ్జెట్లో రూపొందనున్న పాన్ ఇండియా కథాచిత్రం కావడంతో బాలీవుడ్ నటి దీపిక పదుకొనేను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. అయితే ఆమె పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడంతో చిత్ర వర్గాలు వేరే నటిని ఎంపిక చేసే పనిలో పడ్డట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కీర్తి సురేష్ నటించబోతున్నట్లు ప్రచారం సాగింది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కమల్ మాస్టర్ ప్లాన్ శింబు కోసం దీసికకు 30 కోట్లు
-
Simbu: సైడ్ అయిన బాలీవుడ్ బ్యూటీ, శింబు మూవీలో కీర్తి సురేశ్!
అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడం సహజమే. హీరోయిన్ కీర్తి సురేశ్ విషయంలోనూ ఇదే జరుగుతోందనిపిస్తోంది. కోలీవుడ్‌లో కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె ఆ తరువాత టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మహానటి చిత్రంతో అందరి అభినందనలు అందుకున్న కీర్తిసురేశ్ ఆపై వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఒకటి, రెండు చిత్రాలే చేతిలో ఉండగా ఇప్పుడు మళ్లీ తమిళంలో బిజీ అవుతోంది. జయం రవి సరసన సైరన్, ఉదయనిధి స్టాలిన్‌తో మామన్నన్లతో పాటు రఘు తాతా, రివాల్వర్ రీటా చిత్రాల్లో నటిస్తున్న కీర్తిసురేశ్ తాజాగా మరో లక్కీచాన్స్ తలుపు తట్టినట్లు సమాచారం. కమల్‌హాసన్.. విక్రమ్ చిత్రం విజయం సాధించిన తరువాత ఆయన బిజీగా మారిపోయారు. ఒక పక్క కథానాయకుడిగా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆయన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నటుడు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. అదే విధంగా నటుడు ధనుష్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా సంచలన నటుడు శింబు హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించతలపెట్టారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం ఫేమ్ దేసింగు పేరియసామి కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఇందులో జంటగా బాలీవుడ్ సంచల నటి దీపిక పదుకొనేను నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు, అయితే ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం. దీంతో తాజాగా శింబుకు జంటగా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేయడానికి చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో బాలీవుడ్ నటి కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: Jr NTR: ఆ డైలాగ్స్ వింటే పూనకాలే! -
శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె ఒకరు. ఈమె ఇటీవల షారూఖ్‌ఖాన్‌తో జత కట్టిన పఠాన్ చిత్రంలో మోతాదుకు మించిన అందాలను ఆరబోసి కుర్రకారు మతులను పోగొట్టింది. ఈ సంచలన నటి ఇంతకుముందు కోలీవుడ్‌లో రజనీకాంత్‌కు జంటగా కోచ్చడయాన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు శింబుకు జంటగా నటింపజేసే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. శింబు నటించిన తాజా చిత్రం పత్తుతల ఇటీవల తెరపైకి వచ్చి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా ఆయన తన 48వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు కమలహసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ చిత్రం ఫేమ్ దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇందులో కథానాయకిగా దీపికా పదుకొణెను ఎంపిక చేయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. అందులో భాగంగా శింబు చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా కథ నచ్చిందని, తాను నటించడానికి సిద్ధం అని చెప్పిందట. అయితే తన పారితోషికం మాత్రం రూ.30 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతే కాకుండా తాను షూటింగ్‌కు వస్తే ఫైవ్‌స్టార్ హోటల్లో బసచేస్తానని, ఆ హోటల్లో తాను బస చేసే అంతస్తు మొత్తం తనకే కేటాయించాలని కండిషన్ పెట్టి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చినట్లు సమాచారం. దీపికా పదుకొణె డిమాండ్ చేసిన పారితోషికం నయనతార పారితోషికం కంటే 3 రెట్లు ఎక్కువ కావడంతో ఇప్పుడు మరో హీరోయిన్ను ఎంపిక చేయాలనే ఆలోచనలో శింబు చిత్ర వర్గాలు ఉన్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజమెంత తెలియాల్సి ఉందన్నది గమనార్హం. -
శింబుతో జోడీ కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె
హీరో శింబుతో జతకట్టడానికి బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె సై అంటుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే! శింబు ఇటీవల నటించిన మానాడు, వెందు తనిందది కాడు చిత్రాలు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. అయితే తాజాగా గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించిన పత్తుతల చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీన్ని విశ్వనాయకుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం ఫేమ్ దేసింగు పెరియసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ కథకు మొదట రజనీకాంత్‌ను హీరోగా అనుకున్నారు. అనివార్య కారణాలతో అది మిస్సైంది. దీంతో అదే కథతో శింబు హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇందులో శింబుకు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణెను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈమె ఇటీవల యాక్షన్ సన్నివేశాలతో పాటు, అందాలను విచ్చలవిడిగా తెరపై ఆరబోసిన పఠాన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాంటి బ్యూటీ ఇప్పుడు శింబుతో రొమాన్స్ చేయడానికి సై అంటుందా అన్నదే చర్చ. శింబు కంటే చాలా ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ దీపిక. అయితే ఇక్కడ నిర్మాత కమల్ హాసన్ కావడంతో ఆమె శింబుతో నటించే అవకాశాలే ఎక్కువగా ఉంటుందని సమాచారం. అలాగే ఇందులో కమల్ హాసన్ గౌరవ పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జూన్‌లో సెట్ పైకి వెళ్లనుంది. కాగా దీపిక పదుకొనే ఇంతకుముందు కోలీవుడ్‌లో రజనీకాంత్ సరసన కొచ్చాడయాన్ యానిమేషన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే! చదవండి: ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం, నటి అరెస్ట్ -
కామెడీ కథలో శింబు
మానాడు చిత్రంతో రీచార్జ్ అయిన నటుడు శింబు. ఆ తరువాత ఆయన నటించిన వెందు తనియందది కాడు చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. అయితే ఇటీవల విడుదలైన పత్తుతల చిత్రం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సంచలన నటుడు శింబు జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. శింబు తాజాగా కమలహాసన్ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ చిత్ర ఫేమ్ దేసింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. కాగా దీనికి ముందు శింబు మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి ఈ చిత్రం ఇంతకుముందే ప్రారంభం కావాల్సింది. అనివార్య కారణాల వల్ల శింబు ఈ చిత్రం నుంచి బయటికి వచ్చేశారు. దీనికి బదులుగా మరో చిత్రం చేస్తానని నిర్మాత ఐసరిగణేష్‌కు ఆయన మాట ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో దర్శకుడు గోకుల్, నటుడు విజయ్‌సేతుపతిని ఇందులో నటింపజేసే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా నటుడు ఆర్జే బాలాజీ, తాజాగా నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా శింబు మళ్లీ కరోనా కుమార్ చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది ఆయన నటించే 48వ చిత్రం అవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. నటుడు శింబు -
సినిమాలోనే కాదు జీవితంలోనూ నాకు తోడు లేదు: హీరో
శింబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పత్తు తల. ఆ మధ్య వరుస ప్లాప్‌లతో సతమతమైన ఈయన మానాడు చిత్రం విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. కాగా జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ సంస్థ,పెన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన చిత్రం పత్తు తల. దీనికి చిల్లన్ను ఒరు కాదల్ చిత్రం ఫేమ్ కృష్ణ దర్శకత్వం వహించారు. నటుడు గౌతమ్ కార్తీక్, నటి ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పత్తు తల చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఇందులో పాల్గొన్న ఏఆర్ రెహమాన్ చిత్రంలోని రెండు పాటలు వేదికపై పాడడం విశేషం. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలోని అక్కరైయిల్ అనే పాటను శింబు పాడాల్సి ఉందని, అయితే ఆయన థాయిలాండ్ వెళ్లడంతో తానే ఆ పాటను పాడానని చెప్పారు. మొదట్లో ఇళయరాజా, ఎమ్మెస్ విశ్వనాథన్, కె.మహదేవన్ తదితరుల వద్ద పనిచేశానని, అయితే టి. రాజేందర్ వర్కు చూసి అప్పటి వరకు ఇన్ట్రోవర్ట్గా ఉన్న తాను ఎక్స్ట్రోవర్ట్గా మారానన్నారు. అందుకే ఆయన తనకు ఇన్స్పరేషన్ అని చెప్పారు. నటుడు శింబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రారంభించే ముందు తాను చాలా కష్టాల్లో ఉన్నారన్నారు. అప్పుడు రాజా ఫోన్ చేసి ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు తాను ఇంట్లోనే ఉంటున్నాను. బయటకు రాను అని చెప్పానన్నారు. అయితే పది రోజుల తర్వాత మళ్లీ ఆయనే ఫోన్ చేసి పత్తు తల చిత్రం చేద్దామని చెప్పారన్నారు. ఇది కన్నడ చిత్రం అన్నారు. ఈ చిత్రం తనకు సక్సెస్ ఇవ్వకపోయినా గౌతమ్ కార్తీక్‌కు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానన్నారు. తనకు ఏఆర్ రెహమాన్ గాడ్ ఫాదర్ లాంటివారని పేర్కొన్నారు. ఆయనకు తనపై ఉన్న ప్రేమాభిమానాలను కాపాడుకుంటానన్నారు. తన ఆధ్యాత్మిక చింతనకు ఆయనే గురువని పేర్కొన్నారు. కాగా తనకు ఈ చిత్రంలోనూ తోడు లేదు, లైఫ్ లోనూ తోడు లేదని అన్నారు. ఇప్పుడు తాను ఇంతకుముందులా కాదని వేరే లెవెల్లో వచ్చానని అన్నారు. ఏఆర్ రెహమాన్ సినిమా లైట్మెస్ సహాయార్థం నిర్వహిస్తున్న సంగీత విభావరి యాప్‌ను శింబు చేతుల మీదుగా ఈ వేదికపై ఆవిష్కరించారు. -
రజనీ స్కిప్ట్‌తో శింబు మూవీ?
తమిళ సినిమా: నటుడు శింబు.. ప్రస్తుతం పత్తుతల చిత్రంలో నటిస్తున్నారు. ప్రియ భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి చిల్లన్ను ఒరు కాదల్ చిత్రం ఫేమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది కన్నడ చిత్రం మట్టికి రీమేక్ కావడం గమనార్హం. ఇందులో శింబు గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో శింబు తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కారణం ఇంతకు ముందు ఈయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన వెందు తనిందదు కాడు చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఆ చిత్ర నిర్మాత ఐసరి గణేష్ వెల్లడించారు. అయితే ఆ చిత్రానికి ఇంకా సమయం ఉందని సమాచారం. ఇకపోతే ఇంతకు ముందు కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన దేసింగు పెరియసామి తదుపరి రజినీకాంత్ కోసం కథను సిద్ధం చేసుకున్నారు. ఆయన్ని కలిసి కథను వినిపించారు. రజనీకాంత్ కూడా కథా నచ్చిందని ప్రచారం జరిగింది. అయితే ఆయన దేసింగు పెరియసామిని పక్కన పెట్టి బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్‌కు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రమే నిర్మాణంలో ఉన్న జైలర్. దీంతో ఎప్పటికైనా రజనీకాంత్‌తో చిత్రం చేస్తానని చెప్పిన దేసింగు పెరియసామి తాజాగా శింబు హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. శింబు హీరోగా చేసే చిత్రం రజినీకాంత్‌కు చెప్పిన కథా లేక వేరేనా అన్న చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
నయనతార, హన్సిక పెళ్లైపోయింది, నెక్స్ట్ శింబునే? ఇదిగో క్లారిటీ!
హీరో శింబు పెళ్లిపీటలెక్కబోతున్నాడంటూ ప్రచారం జోరందుకుంది. గతంలో నయనతార, హన్సికతో లవ్వాయణం చేసిన ఈ హీరో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవడంతో తాను కూడా వివాహం చేసుకుని సెటిలైపోవాలనుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురితో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు కథనాలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇదంతా వుట్టి పుకారేనని తెలుస్తోంది. శింబు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని హీరో మేనేజర్ స్పష్టం చేశాడు. 'శ్రీలంకకు చెందిన అమ్మాయితో శింబు ఏడడుగులు వేయబోతున్నాడంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. దయచేసి పెళ్లి వంటి వ్యక్తిగత విషయాల గురించి రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. నిజంగా వివాహానికి రెడీ అయినప్పుడు అందరికంటే మేమే మొదటగా ఆ న్యూస్ షేర్ చేస్తాం' అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో శింబు పెళ్లి వార్తలకు చెక్ పడినట్లైంది. చదవండి: అనసూయ ఆంటీ వివాదంపై స్పందించిన కస్తూరి భర్త కన్నుమూసిన వార్డులోనే కళాపతస్వి భార్య కూడా.. -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శింబు, వధువు ఎవరంటే!
హీరో శింబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయిన శింబుకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వల్లభ, మన్మధ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు శింబు. నటుడిగానే కాదు, సింగర్‌గా, సంగీత దర్శకుడిగా, రైటర్‌గా కూడా శింబుకి గుర్తింపు ఉంది. మల్టీ టాలెంటెడ్‌గా హీరోగా తమిళ నాట విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న శింబు హీరోయిన్స్‌తో లవ్ ఎఫైర్స్, డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అప్పట్లో నయనతార, హన్సికలతో ప్రేమయాణం నడిపిన సంగతి తెలిసిందే. చదవండి: మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్! ఇదిలా ఉంటే ఇప్పుడు శింబు ఓ ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ శింబు పెళ్లంటూ వార్తలు రాగా వాటిలో నిజం లేదని తేలింది. ఈసారి మాత్రం శింబు పెళ్లి వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు వధువుకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఈ తాజ బజ్ ప్రకారం.. కోటీశ్వరురాలైన శ్రీలంకన్ అమ్మాయితో శింబు త్వరలో ఏడడుగు వేయబోతున్నాడని సమాచారం. ఆమెతో శింబు కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడట. ఆ అమ్మాయి ఓ మెడికల్ స్టూడెంట్ అని, శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురని తెలుస్తోంది. ఆమె తండ్రికి శ్రీలంకలో పలు వ్యాపార సంస్థలు ఉన్నాయట. అయితే ఆ అమ్మాయి శింబుకు పెద్ద అభిమాని అని, ఇదే క్రమంలో ఓ సారి శింబును కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఎర్పడిందట, అది కాస్తా ప్రేమగా మారినట్లు ఫిలిం సర్కిల్లో గుసగుసల వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలుసుకున్నాయని, గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లపై చర్చించుకుంటున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. దాదాపు 200 థియేటర్లో రి-రిలీజ్‌కు రెడీ అయితే ఆయన తండ్రి డి. రాజేంద్రన్ శింబు పెళ్లిపై గతంలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శింబు పెళ్లి వార్తలు తెరపైకి రావడంతో ఆయన ఫ్యాన్స్ అంత ఖుషి అవుతున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ శింబు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే శింబు నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. -
హీరోతో లవ్ బ్రేకప్.. పెదవి విప్పిన హన్సిక!
హీరోయిన్ హన్సిక మొత్వానీ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్‌ను పెళ్లాడింది. డిసెంబర్ 4న గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి సందడి హాట్‌స్టార్‌లో లవ్ షాదీ డ్రామా పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. సోహైల్‌కు ఇది రెండో వివాహం కాగా హన్సికకు ఇది రెండో లవ్.. అర్థం కాలేదా? గతంలో ఈ బ్యూటీ శింబుతో డేటింగ్ చేసింది. కొంతకాలం బాగానే ఉన్న ఈ లవ్ బర్డ్స్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ విషయాలను తాజాగా హన్సిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత వేరేవారికి ఎస్ చెప్పడానికి నాకు ఏడెనిమిదేళ్లు పట్టింది. నేను ప్రేమను నమ్ముతాను, కానీ రొమాంటిక్ పర్సన్ అయితే కాదు. అంత ఈజీగా అన్ని ఎమోషన్స్‌ను వ్యక్తపరచలేను. నాతో కలకాలం ఉండాలనుకుంటున్న వ్యక్తికి ఓకే చెప్పడానికి నేను చాలా సమయమే తీసుకున్నాను. ఎందుకంటే గత రిలేషన్షిప్ విచిత్రంగా సాగింది. అయినా ఇప్పుడది ముగిసిన కథ' అని చెప్పుకొచ్చింది. కాగా సోహైల్ మొదటి పెళ్లి పెటాకులవడానికి కూడా హన్సికే కారణమంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని అతడు క్లారిటీ ఇచ్చాడు. చదవండి: పేరెంట్స్‌కు చెన్నైలో లగ్జరీ ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ధనుష్ -
నెట్టింట వైరల్‌గా మారిన శింబు లేటెస్ట్ సాంగ్..
సంచలనానికి మారుపేరు నటుడు శింబు. ఈయన ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా అభిమానులు మాత్రం తలకెక్కించుకుంటారు. ఇకపోతే శింబు ఇటీవల వరుస విజయాలతో మంచి జోరులో ఉన్నారు. మహానాడు, వెందు తనిందది కాడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా పత్తు తల చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నటి ప్రియా భవాని శంకర్ కథానాయకి. గౌతమ్ కార్తీక్ ముఖ్య పాత్ర పోషించారు. స్టూడియో గ్రీన్, పెన్ స్టూడియో సంస్థలు నిర్మిస్తున్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా తాజాగా శింబు 40వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానుల్లో పండగ వాతావరణమే నెలకొంది. శింబు ఫొటోలతో ఎస్టేక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పొత్తుల చిత్రంలోని నమ్మి సత్తం అనే లిరికల్ వీడియోను ఏఆర్ రెహా్మన్ ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది. -
Recap 2022: స్టార్స్‌కు మాట.. పాట సాయం చేసిన మరో స్టార్ హీరోలు
ఒక స్టార్ హీరో సినిమాకి మరో స్టార్ మాట సాయం చేస్తే.. పాట సాయం కూడా చేస్తే.. ఆ ఇద్దరు స్టార్ల అభిమానులకు పండగే పండగ. 2022 అలాంటి కొన్ని పండగలను ఇచ్చింది. అడగ్గానే కాదనకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి, మాట... పాట పాడిన కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరంజీవి. అది కూడా నాలుగు చిత్రాలకు. 2017లో వచ్చిన రానా ‘ఘాజీ’, మంచు మనోజ్ ‘గుంటూరోడు’ చిత్రాల తర్వాత ఈ ఏడాది లీజైన మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’, బాలీవుడ్ చిత్రం రణ్‌బీర్ కపూర్ ‘బ్రహాస్త్రం’కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫిబ్రవరి 18న విడుదలైంది. రణ్‌బీర్, ఆలియా జంటగా, నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో రూపొందిన ‘బ్రహ్మాస్త్రం’ ట్రయాలజీలోని ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ 1 శివ’ సెప్టెంబరు 9న రిలీజైంది. (చదవండి: ఆయన లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు: అల్లు అర్జున్) అదే నెల 30న విడుదలైన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 చిత్రానికీ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగ మార్తాండ’లోని షాయరీ చిరంజీవి వాయిస్‌తో ఆడియన్స్‌కు వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్ టైటిల్ రోల్ చేయగా, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలను చిరంజీవితో షాయరీగా చెప్పించారు కృష్ణవంశీ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మరోవైపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేశ్‌బాబు. పవన్ కల్యాణ్ ‘జల్సా’ (2008), ఎన్టీఆర్ ‘బాద్షా ’(2013), దివంగత నటుడు కృష్ణ టైటిల్ రోల్ చేసిన ‘శ్రీశ్రీ’ (2016), సందీప్ కిషన్ హీరోగా చేసిన ‘మనసుకు నచ్చింది’ (2018) చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ ఈ ఏడాది ‘ఆచార్య’కు ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజైన సంగతి తెలిసిందే. (చదవండి: ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు) మరోవైపు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తనకు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లాంటి హిట్ అందించిన ఆర్ఎస్జే స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ‘మిషన్ ఇంపాజిబుల్’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాప్సీ ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న రిలీజైంది. ఇంకోవైపు ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. మార్చి 11న ఈ చిత్రం విడుదలైంది. ఇక వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఇప్పటికే ‘అ!’, ‘హిట్’, ‘హిట్ 2’ సినిమాలను నిర్మించిన నాని ఈ ఏడాది వెబ్ ఆంథాలజీ ‘మీట్ క్యూట్’ నిర్మించారు. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలు. ఈ సినిమా ట్రైలర్‌కు నాని వాయిస్ ఓవర్ అందించారు. సోనీ లివ్‌లో నవంబరు 25 నుంచి ఈ ఆంథాలజీ స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో తాను నిర్మించిన ‘అ!’కు నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఇటీవల విడుదలైంది. ఈ గ్లింప్స్‌కు హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో మరోచోట కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 21న రానుంది. పాటల సందడి.. ఇప్పటికే ఎన్నో పాటలకు గాత్రం అందించిన శింబు ఈ ఏడాది బాగా సౌండ్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ది వారియర్’లోని ‘బుల్లెట్ సాంగ్’ పాడారు. తమిళంలోనూ ఈ పాటను పాడారు శింబు. రామ్, కృతీ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. అలాగే ఈ ఏడాది శ్రోతలను మెప్పించిన మరో పాట ‘టైమ్ ఇవ్వు పిల్ల..’ కూడా శింబు పాడిందే. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ‘18 పేజెస్’ చిత్రంలోని పాట ఇది. వీటితో పాటు నిర్మాతగా హీరో రవితేజ తెలుగులో సమర్పించిన తమిళ చిత్రం ‘ఎఫ్ఐఆర్’ థీమ్ సాంగ్ కూడా శింబు గొంతు నుంచి వినిపించిందే. ఫిబ్రవరి 11న ఈ చిత్రం రిలీజైంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారిసు ’(తెలుగులో ‘వారసుడు) సినిమా కోసం కూడా శింబు పాట పాడారు. ఈ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయ ఆదితి పాడిన తొలి పాట ‘రోమియోకి జూలియట్‌లా’. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’లోని పాట ఇది. ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజైంది. ఇలా మాట.. పాట సాయం చేసిన స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
పెళ్లి తర్వాత కీర్తి సురేష్ యాక్టింగ్‌కు గుడ్‌బై! ప్రొడక్షన్లోకి ఎంట్రీ?
తమిళసినిమా: కేజీఎఫ్, కేజీఎఫ్ – 2 సినిమాల తరువాత కన్నడ చిత్ర పరిశ్రమలో పేరు మోగుతున్న చిత్ర నిర్మాణ సంస్థ హోంబోలే ఫిల్మ్స్. దక్షిణాది భాషల్లో చిత్ర నిర్మాణం చేపడుతామని అధికారికంగా ప్రకటించిన ఆర్ సంస్థ అధినేత విజయ్ కిరగందర్ ఇప్పటికే టాలీవుడ్లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సలార్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ సంస్థ కోలీవుడ్‌లోనూ చిత్రాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సరరై పోట్రు చిత్రం ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు ప్రకటించింది. 'ఇందులో నటుడు శింబు కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం హోరెత్తింది. తాజాగా ఈ సంస్థలో నటి కీర్తి సురేష్ కథానాయికగా నటించబోతున్నట్లు మరో వార్త ప్రచారంలో ఉంది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం అని సమాచారం. దీనికి దర్శకుడు ఎవరు..? తదితర వివరాలు ఇంకా వెలువడ లేదు.కాగా ప్రస్తుతం నటి కీర్తి సురేష్ చేతిలో తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న బోలా శంకర్, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న సైరన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. నానితో జత కట్టిన దసరా చిత్రం, తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రాలు షటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటున్నాయి. మరోపక్క కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంకో పక్క ఆమె చిత్రం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీటన్నిటిపై స్పష్టత రావాలంటే కీర్తి సురేష్ స్పందించాల్సిందే. -
తమిళ స్టార్ శింబు నోట మరో తెలుగు పాట
తమిళ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . వల్లభ , మన్మథ లాంటి సినిమాలతో తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుని తనకంటూ కొంతమంది అభిమానులను సాధించుకున్నాడు. యూత్ ఫుల్ కాన్సప్ట్ సినిమాలు చేస్తూ యూత్ కి మరింత దగ్గరయ్యాడు శింబు. కేవలం నటుడిగానే కాకుండా శింబు లో మంచి సింగర్ కూడా ఉన్నాడు. శింబుకు పాటలు పాడటం కొత్తేం కాదు.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది హీరోల సినిమాలకు శింబు పాటలు పాడి మెప్పించాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో కోసం పాట పాడనున్నాడు శింబు. కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న ‘18పేజిస్’ ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే పాటను విడుదల చేసారు. ఆ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలా ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెరగడం వలన ఈ సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు చిత్రబృందం. అందులో భాగంగానే తమిళ్ స్టార్ హీరో శింబు తో ఈ చిత్రంలో పాట పాడించనున్నారట. ఇదివరకే ఎన్టీఆర్ బాద్ షా కి ‘డైమెండ్ గర్ల్’, మంచు మనోజ్ పోటుగాడికి కి ‘బుజ్జి పిల్ల’.. యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్ కి ‘బుల్లెట్ సాంగ్’ ను పడిన శింబు ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న 18పేజిస్ కోసం ‘టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు’ అనే పాటను పాడనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 23 విడుదల కానుంది. -
తమిళ ఇండస్ట్రీకి మంచిరోజులొచ్చాయి : హీరో శింబు
తమిళసినిమా: తమిళ సినిమాకు మంచిరోజులు నడుస్తున్నాయి అని అన్నది ఎవరో తెలుసా? ఇంకెవరు సంచలన నటుడు శింబు. ఈ మాట ఆయనకే వర్తిస్తుందని చెప్పవచ్చు. ఆ మధ్య వరుస ప్లాపులతో సతమతం అయిన శింబుకు మానాడు చిత్రం ఊపిరి పోసింది. ఆ తరువాత ఆయన నటించిన చిత్రం వెందు తనిందదు కాడు. బాలీవుడ్ భామ సిద్ధిసిద్నానీ నటించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ గత సెప్టెంబర్ 15న విడుదల చేసింది. గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందననే తెచ్చుకున్నా వసూళ్ల పరంగా చిత్ర యూనిట్‌ను ఖుషి చేసింది. ముఖ్యంగా శింబు ఖాతాలో మరో హిట్ చిత్రంగా నమోదు కావడంతోపాటు నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన వెందు తనిందదు కాడు చిత్రం రూ.60 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కాగా చిత్ర అర్ధ శతదినోత్సవం వేడుకను బుధవారం సాయంత్రం చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు శింబు మాట్లాడుతూ ఇప్పుడు తమిళ సినిమాకే గోల్డెన్ డేస్ నడుస్తున్నాయని అన్నారు. కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రం నుంచి మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్, కన్నడ చిత్రం కాంతార నుంచి ఇటీవల విడుదలైన లవ్ టుడే చిత్రం వరకు ఉన్న అన్ని చిత్రాలు మంచి ఆదరణ పొందాయన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించాలనే కోరిక తో వస్తున్న దర్శకుల కలలను సాకారం చేసేలా తమిళ సినిమా వారిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను తన ఇమేజ్‌కు భిన్నంగా ముత్తు పాత్రగా మారి నటించిన గ్యాంగ్ స్టార్ కథా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, ఘన విజయాన్ని అందించారన్నారు. నిర్మాత ఐసరి గణేష్ చిత్రాన్ని భారీగా నిర్మించారని, వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ తన సొంత సంస్థ లాంటిదన్నారు. గౌతమ్ మీనన్ చిత్రాన్ని కొత్తగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. తను కోరగానే చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరించిన ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు అన్నారు. ఇది విజయోత్సవ వేడుకగా కాకుండా ఇందులో పనిచేసిన నటీనటులు సాంకేతిక వర్గాన్ని గౌరవించాలని భావించినట్లు నిర్మాత ఐసరి గణేష్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఉదయనిధి స్టాలిన్, ఆర్కే సెల్వమణి, ఉదయకుమార్, అరుళ్ మణి, ధనుంజయ్, శరత్ కుమార్, రాధిక పలువురు సినీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరోయిన్ తో లవ్ నిజమేనా?
-
హైదరాబాద్‌లో హీరో శింబు కొత్త చిత్రం షూటింగ్
తమిళసినిమా: వెందు తనిందదు కాడు వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పత్తుతల. నటి ప్రియభవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఇందులో ప్రతి నాయకుడిగా దర్శకుడు గౌతమ్‌మేనన్ నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కన్నడంలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన మఫ్టీ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. అక్కడ ఈ చిత్రం విజయం సాధించింది. కాగా కన్నడంలో శివరాజ్ కుమార్ నటించిన పాత్రను తమిళంలో శింబు పోషిస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్‌ను పెట్టుకోవడం కోసం సీక్రెట్ పోలీస్ చేసే ప్రయత్నం ఈ చిత్ర ప్రధాన కథ. కాగా పత్తు తల చిత్ర షూటింగ్ ఇప్పటికే వైజాగ్, హైదరాబాద్, కన్యాకుమారి, బళ్లారి, శివగంగ జిల్లాలోని కారైక్కుడి, కోవిలూర్ వంటి ప్రాంతాల్లో నాలుగు షెడ్యూ ల్ పూర్తి చేసుకుంది. తాజాగా ఐదో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుకుంటుంది. ఈ చిత్రం కోసం అక్కడ భారీ సెట్టును వేసి నటుడు శింబుపై పాటను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు అధికంగానే నెలకొన్నాయి. కాగా చిత్రాన్ని డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారన్నది గమనార్హం. -
శింబుతో రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్!
తమిళసినిమా: మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌ను చుట్టేస్తున్న కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి ఈమె. ఇంకా చెప్పాలంటే మహానటి వంటి చిత్రాల్లో స్థాయికి మించిన పాత్రలను పోషించి మెప్పించింది. పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకున్న కీర్తీ సురేష్ ఇటీవల గ్లామర్‌పై మొగ్గు చూపే ప్రయత్నం చేస్తుంది. స్పెషల్ ఫొటో షూట్ చేయించుకుని మరీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం పూర్తి కావస్తోంది. భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లిగా నటిస్తున్న చిత్రం కూడా చివరిదశలో ఉంది. కాగా అక్కడ ప్రస్తుతానికి కీర్తీ సురేష్ చేతిలో మరో చిత్రం లేదు. ఇక మలయాళంలో కూడా ఏ చిత్రం చేయడం లేదు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మామన్నన్ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇలాంటి సమయంలో మరో లక్కీ ఛాన్స్ సురేష్‌కు వరించినట్లు సమాచారం. కన్నడంలో కేజీఎఫ్, ఎజీఎఫ్–2 కాంతార వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలి ప్రొడక్షన్స్ సంస్థ తమిళంలో శింబు కథానాయకుడుగా ఒక భారీ చిత్రాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సూరరై పోట్రు చిత్రం ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఇందులో శింబుకు జంటగా కీర్తిసురేష్ నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్ర వర్గాలు దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. -
Simbu-Sudha Kongara: కేజీఎఫ్ చిత్ర బ్యానర్లో శింబు
కేజీఎఫ్ చాప్టర్–1, చాప్టర్–2 చిత్రాలు కన్నడ సినీ చరిత్రను మార్చేశాయని చెప్పవచ్చు. అప్పటి వరకు లో బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన కన్నడ నిర్మాతలు కేజీఎఫ్ చిత్రం తరువాత పాన్ ఇండియాస్థాయిలో చిత్రాలను రూపొందించడం మొదలుపెట్టారు. ఆ రెండు చిత్రాల విజయాల ప్రభావం కన్నడ చిత్ర పరిశ్రమపై విశేష ప్రభావం చూపింది. ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ హూంబాలే ఫిలిమ్స్ అన్నది తెలిసిందే. కాగా ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా సలార్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా తమిళంలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి సూరరైపోట్రు చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకురాలి అవార్డు అందుకున్న సుధాకొంగర దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటనను నిర్మాణ సంస్థ ఇటీవలే మీడియాకు విడుదల చేసింది. సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనుండడం సంతోషంగా ఉందని అందులో ప్రకటించారు. కాగా తాజాగా ఈ చిత్రంలో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల విడుదలైన వెందు తనిందదు కాడు చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న శింబు ప్రస్తుతం పత్తు తల చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత ఆయన సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం. అదే విధంగా దర్శకురాలు సుధా కొంగర ప్రస్తుతం సూరరై పోట్రు చిత్ర హిందీ రీమేక్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత శింబు కథానాయకుడిగా నటించే భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
ధనుష్ సరసన చాన్స్ కొట్టేసిన శింబు మూవీ హీరోయిన్
దేనికైనా అదృష్టం ఉండాలంటారు. ప్రతిభ ఎంత ఉన్నా అది ఒక్కటే చాలదు. అదే విధంగా దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాల్లో నటించే హీరోయిన్లకు లక్ గ్యారెంటీ అనే టాక్ ఉంది. అలాంటి లక్కే ఇప్పుడు సిద్ధి ఇద్నానిని వరించనుందనే టాక్ కోలీవుడ్‌లో స్ప్రెడ్ అవుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వెందు తనిందదు కాడు’. ఇందులో గుజరాతీ నటి సిద్ధి ఇద్నాని కథానాయకిగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సంతోషంతో దర్శకుడు, కథానాయకులకు భారీ బహుమతులను కూడా అందించారు. ఈ విషయాన్ని అటుంచితే ఇందులో నాయకిగా నటించిన సిద్ధి ఇద్నానికి మరో లక్కీ ఛాన్స్ వరించినట్లు సమాచారం. నటుడు ధనుష్‌తో రొమాన్స్ చేసే అవకాశమే అది. ఈ సంచలన నటుడు తన అన్నయ్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన నానే వరువేన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 29వ తేదీ తెరపైకి రానుంది. కాగా ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న వాత్తి చిత్రంతో పాటు కెప్టెన్ మిల్లర్ చిత్రాల్లో ధనుష్ నటిస్తున్నారు. కాగా మరో చిత్రంలో నటించడానికీ ఈయన పచ్చజెండా ఊపారు. దీనికి ఇళన్ దర్శకత్వం వహించనున్నారు. 2015లో విడుదలైన గ్రహణం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత హరీష్ కల్యాణ్ హీరోగా ప్యార్ ప్రేమ కాదల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజా ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇందులో నటి సిద్ధి ఇద్నానిని నాయకిగా ఎంపిక చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. మొత్తం మీద ఈ అమ్మడు కోలీవుడ్‌లో అవకాశాలను రాబట్టుకుంటోందన్న మాట. -
హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
'మానాడు' విజయంతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన హీరో శింబు. తాజాగా ఆయన నటించిన ‘వెందు తానింధాతు కాడు’సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోకి ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’పేరుతో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. చిన్న ఊరు నుంచి వచ్చిన ముత్తు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత ఇషారి.కే గణేష్.. హీరో శింబు, గౌతమ్ మీనన్‌లకు కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చారు. హీరో శింబుకు టొయోటొ న్యూ వెల్‌వైర్ కారును గిఫ్టుగా ఇవ్వగా, డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు ఖరీదైన బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. #VTK Producer @IshariKGanesh gifted a brand new luxury car to Actor @SilambarasanTR_ and a Motor bike to Director @menongautham at #VTK success celebrations.. pic.twitter.com/M0YVVsplXF — Ramesh Bala (@rameshlaus) September 24, 2022 -
హీరోయిన్ని కాకుంటే ఆ పని చేసేదాన్ని : నిధి అగర్వాల్
కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. ఈమె తెరపై కనిపించిందంటే అందాల మోతే. ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా, నటి నిధి అగర్వాల్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. అలాగే తమిళంలో నటుడు శింబుతో రొమాన్స్ చేసిన ఈశ్వరన్ ఆమెను నిరాశ పరిచింది. అయితే నిజ జీవితంతో శింబుతో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం మాత్రం హోరెత్తింది. ఆ ప్రచారం ఎంతవరకు సాగిందంటే శింబు, నిధి అగర్వాల్ ప్రేమ, పెళ్లి పీటలెక్కబోతోంది అన్నంతగా. అయితే ఇప్పుడు ఆ విషయం చడీచప్పుడు లేదు. అంతేకాదు కోలీవుడ్‌లో నటి నిధి అగర్వాల్‌కు అవకాశాలు కూడా దక్కడం లేదు. అయినా అవకాశాల ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తునే ఉంది. ఈక్రమంలో ఇటీవల తన అభిమానులతో ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా నిధి అగర్వాల్ ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తాను వర్కౌట్స్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని చెప్పింది. అదేవిధంగా తాను ఇంటర్ స్టేట్ ఛాంపియన్ అని తెలిపింది. నటి కాకుంటే ఏం చేసేవారు అన్న ప్రశ్నకు నిధి అగర్వాల్ బదులిస్తూ నటిగా సక్సెస్ కాకుంటే తనను ఇంటిలో ఊరికే కూర్చోనిచ్చేవారు కాదని సంపాదించడానికి ఏదో ఒకపని చేయమని చెప్పే వారని పేర్కొంది. తాను నటిని కాకుంటే ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించేదాన్నని చెప్పింది. తనకు ఫ్యాషన్ డిజైనింగ్ పరిచయం లేదని అయితే, శిక్షణ పొంది ఆ రంగంలోకి వెళ్లేదాన్నని చెప్పింది. తన కుటుంబానిది వ్యాపార నేపథ్యమని, తాను కచ్చితంగా ఆ నేర్పరితనాన్ని ఉపయోగించేదాన్నని చెప్పింది. -
సినిమా కోసం 21 కేజీల బరువు తగ్గిన శింబు
తమిళ సినిమా: శింబు నటించిన తాజా చిత్రం వెందు తనిందదు కాడు. సిద్ధి ఇద్నాని నాయిక. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ద్వారా ఈ నెల 15 తేదీ విడుదలైన విషయం తెలిసిందే. టాక్‌తో సంబంధం లేకుండా చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోందని ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం చెన్నైలో విజయోత్సవ సమావేశం నిర్వహించింది. నిర్మాత ఐసరి గణేష్ మాట్లాడుతూ.. వెందు తనిందదు కాడు చిత్రం హిట్టు కాదు బంపర్ హిట్ అని పేర్కొన్నారు. చిత్రం రూ. 50 కోటక్లకు పైగా వసూలు సాధిస్తుందని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్వాహకులు చెప్పారన్నారు. చిత్ర కథను దర్శకుడు గౌతమ్ తనకు చెప్పినప్పుడు చాలా కొత్తగా ఉందని.. వెంటనే చేద్దామని చెప్పానన్నారు. ఇందులో కథానాయకుడి పాత్రను శింబు మినహా వేరెవరు చేయలేరన్నారు. ఈ చిత్రం కోసం శింబు 21 కిలోల బరువు తగ్గారంటే ఆయన ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవాలన్నారు. ఇందులోని పాత్రకు శింబుకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఖాయమన్నారు. మరో విషయం ఏంటంటే ఈ చిత్రానికి సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని.. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. విన్నైతాండి వరువాయా చిత్రానికంటే ఈ చిత్రానికి ఎక్కువ విమర్శలు వచ్చాయని తెలిపారు. అలాంటి వాటి నుంచి చాలా నేర్చుకున్నానని, విమర్శలు చిత్రంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని గమనించాలన్నారు. చిత్ర బాధ్యతలను నిర్మాత పూర్తిగా తన భుజాలపై వేశారని, సింగిల్ లైన్ కథ చెప్పగానే సూపర్ స్టార్ కథనా, ఏఆర్ రెహమాన్ సంగీతం చేద్దాం అని శింబు అన్నారని తెలిపారు. నటుడు శింబు మాట్లాడుతూ.. ఇది ఎక్స్పెరిమెంటల్ కథ కావడంతో వర్కౌట్ అవుతుందా అని నిర్మాత ఐసరి గణేష్‌తో అడిగానన్నారు. కథ ఆసక్తిగా ఉండడంతో ఓకే అన్నానన్నారు. చిత్రం బాగా వచ్చిందని, ఇప్పుడు చిత్రానికి మంచి స్పందన రావడంతో సంతోషంగా ఉందన్నారు. విన్నైతాండి వరువాయా తరువాత కొన్ని చిత్రాలు హిట్ అయినా, ఈ చిత్రానికి యాక్టింగ్ పరంగా వస్తున్న రెస్పాన్స్ బాగుందన్నారు. మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తోందన్నారు. దీనికి పార్ట్ 2 ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారని, జనరంజక అంశాలతో ఫ్యాన్స్ చప్పట్లు కొట్టేలా ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. -
‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుంది: గౌతమ్ మీనన్
‘‘ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచం, సినిమా పరిశ్రమ చిన్నవి అయిపోయాయి. ఇతర భాషల సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే సినిమాకు భాష లేదు. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ చిత్రంలో కొన్ని పాత్రలు హిందీ మాట్లాడతాయి. ఈ డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుంది’’ అని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అన్నారు. శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘వెందు తనిందదు కాడు’. సిద్ధీ ఇద్నాని కథానాయిక. ఇషారి.కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాను ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్‌తో శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ ఈ నెల 17న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ–‘‘పల్లెటూరులో జీవించే ముత్తు ముంబై వెళ్లి, అనుకోకుండా చీకటి ప్రపంచంలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఎలా బయట పడ్డాడు? అన్నదే కథ. రెహమాన్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కథ డిమాండ్ చేయడంతోనే ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నాం. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ను తెలుగులో ‘స్రవంతి’ రవికిశోర్‌గారు విడుదల చేయడం హ్యాపీ. నేను, రామ్ చేయాలనుకుంటున్న మూవీ వేసవి తర్వాత ఉండొచ్చు. కమల్‌హాసన్‌గారితో ‘రాఘవన్ 2’ చేయాలనే ప్లాన్ ఉంది. వెంకటేష్‌గారితో ‘ఘర్షణ 2’, నాగచైతన్యతే ‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుంది. విక్రమ్‌తో నేను తీసిన ‘ధృవనక్షత్రం’ ఈ డిసెంబరులో రిలీజ్ అవుతుంది’’ అన్నారు. -
Kamal haasan- Simbu: శింబు కోసం కమల్ హాసన్
మానాడు సక్సెస్ తర్వాత శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం వెందు తనిందదు కాడు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. విన్నై తాండి వరువాయా, అచ్చం యన్బదు మడమయడ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత శింబు, గౌతమ్ మీనన్‌ల కాంబోలో వస్తున్న చిత్రం ఇది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని కాలత్తుకు నీ వేనుం అనే పాట, ఏఆర్ రెహ్మాన్ పాడిన మరక్కుమా నెంజమ్ అనే పాట ఇప్పటికే విడుదలై సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఐసరి గణేష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్ రెండవ తేదీ చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరి నిర్వహించబోతున్నట్లు వర్గాలు తెలిపారు. కాగా, ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని నిర్మాత ఐసరి గణేష్ మంగళవారం కమలహాసన్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. చదవండి: (కోబ్రాపై భారీ అంచనాలు.. కాలేజీ యాజమాన్యానికి సెలవు కోసం విద్యార్థుల లేఖ) -
గ్లామరస్ ఫొటోలతో దడ పుట్టిస్తున్న నిధి అగర్వాల్
సినిమా రంగుల ప్రపంచం. ఇందులో అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఉంటుంది. బోల్డ్‌గా నటించే వారికి బోలెడు అవకాశాలు అందుతాయి. అందుకే తారలు ఫొటో సెషన్లు నిర్వహించి దర్శక, నిర్మాతలతో పాటు అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సైతం ఫొటో సెషన్స్ నిర్వహించి గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అవికాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో నాయకిగా పరిచయమైన నిధి అగర్వాల్ ఆ తరువాత టాలీవుడ్లో సవ్యసాచి చిత్రంలో అవకాశం దక్కించుకుంది. రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో మరింత వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రం బంపర్ హిట్ అయిన ఈమెకు అక్కడ అవకాశాలు అంతంత మాత్రమే. ఈశ్వరన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. శింబు ఈ చిత్ర హీరో. ఇంకేముంది నిధి అగర్వాల్‌కు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా అందులోని పాటలు ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. ముఖ్యంగా శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ కలాపాలు అంటూ పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారిందని వీరి పెళ్లికి పెద్దలు కూడా సమర్థించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేసింది. వీరు సహజీవనం చేస్తున్నారని టాక్ కూడా వినిపించింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై శింబు, నిధి అగర్వాల్ స్పందించకపోవడం విశేషం. ఈ అమ్మడు నటించే చిత్రాల విషయానికి వస్తే మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అదే విధంగా తెలుగులో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. చదవండి: మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్ ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియాభవానీ -
హీరో శింబుపై మహిళా డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థలే వీటిని స్ట్రీమింగ్ చేయడానికి అధిక ఆసక్తిని కనబరుస్తున్నాయి. పెట్టుబడికి ముప్పు లేకపోవడంతో దర్శక, నిర్మాతలు కూడా వెబ్‌సిరీస్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా తాజాగా రూపొందిన వెబ్ సిరీస్ ‘పేపర్ రాకెట్’. ఇది జీ చానల్ ఒరిజినల్ వెబ్‌సిరీస్. శ్రీనిధి సాగర్ నిర్మించిన దీనికి కృత్తిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. కాళిదాస్ జయరామ్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఇందులో గౌరీ జి.కిషన్, నాగివీడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి జీ చానల్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఉదయనిధి స్టాలిన్, శింబు, విజయ్ ఆంటోని, దర్శకుడు మిష్కిన్, మారి సెల్వరాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై దర్శకురాలు కృతిక మాట్లాడుతూ.. తనను ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు శింబుతో చిత్రం చేయాలన్నది తన కోరిక అని, అది ఈ ఆరంభంలో జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. శింబు తొలిసారి హీరోగా నటిస్తున్నప్పుడు తనకి ఇంకా పెళ్లి కాలేదని ఒక యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారని తెలిపారు. సాధారణంగా రకరకాల విమర్శలు చేస్తుంటారని అదే విధంగా తొలి చిత్రం సమయంలో శింబుపై కూడా ఇతను హీరోనా అని విమర్శలు వచ్చాయని అన్నారు. చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్ అయితే ఆయన నటిస్తున్న తొలి చిత్రం స్టిల్స్ బయటకు వచ్చినప్పుడు ఆ చిత్ర యూనిట్లో ఉన్నత స్థాయికి ఎదిగేది శింబునే అని తాను భావించానన్నారు. ఇక ఉదయనిధి గురించి చెప్పాలంటే తాను సినిమా ఇండస్ట్రీలోకి వెళుతానని చెప్పగానే ఆయన చాలా ఆలోచించారన్నారు. ఆ తరువాత తాను ఇంటిలో చేసే గోల పడటం కంటే సినిమా రంగంలోకి వెళ్లడమే మంచిదని, తనకు ప్రశాంతంగా ఉంటుందని భావించారేమో గాని సమ్మతించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా మహిళలకు సపోర్టు అందిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని కృతిక ఉదయనిధి అన్నారు. -
శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్
హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. ఇది ఆమెకు 50వ చిత్రం కావడం మరో విశేషం. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ తాను దర్శకత్వం వహించిన పుళన్ విచారణై చిత్రం ట్రైలర్‌ను గుర్తుకు తెచ్చిందన్నారు. శింబు ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించడం అభినందనీయమన్నారు. ఆయన మంచి నటుడని, సకాలంలో చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే తమకు ఎన్ని పనులు ఉన్నా రోజూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అంతకంటే ముఖ్యచిత్రాలకు సంబంధించిన వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. నిర్మాత మదియళగన్ సినిమా పరిశ్రమలో ప్రముఖులని, మహా చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సెల్వమణి తెలిపారు. చదవండి: కాజల్ రీఎంట్రీ.. ఇండియన్ 2తో వస్తుందా? -
చెన్నైలో శింబును కలిసిన రామ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ నటుడు రామ్ కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఈయన కథానాయకుడిగా నటించిన ‘ది వారియర్’ తెలుగు, తమిళం భాషల్లో రూపొంది ఈ నెల 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీనివాస స్టూడియోస్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ద్వారా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కృతిశెట్టి ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో బుల్లెట్ పాటను శింబు పాడటం విశేషం. కాగా చిత్రం విడుదల దగ్గర పడటంతో యూనిట్ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ పరిస్థితుల్లో ది వారియర్ చిత్రంలో శింబు పాడిన బుల్లెట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. రామ్ కోరిక మేరకు శింబు ఈ పాటను పాడారట. దీంతో శనివారం నటుడు రామ్ చెన్నైలో శింబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. రామ్ స్టైలిష్ లుక్ ఎంతగానో ఆకట్టుకుందని శింబు ప్రశంసించారు. బుల్లెట్ సాంగ్ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోందని, థ్యాంక్స్ శింబు అంటూ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున నెటిజన్లు! నా భర్త వేస్ట్.. అస్సలు కోపరేట్ చేయడు: స్టార్ హీరోయిన్ -
కొత్త హీరోయిన్ను పరిచయం చేస్తున్న హీరో శింబు
మానాడు హిట్ తరువాత శింబు నటిస్తున్న తాజా చిత్రం వెందు తనిందదు కాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వేల్స్ ఫిలిం పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గుజరాతీ భామ సిద్ధి ఇడ్నాని కథానాయికగా పరిచయం అవుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో శింబు విభిన్న పాత్రల్లో నటించినట్లు, ఆయన గెటప్ కూడా చాలా భిన్నంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. సెప్టెంబర్ 15న సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి, వెడ్డింగ్ ఫొటోలపై ఫ్యాన్స్ అసంతృప్తి! దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అదే నా బ్యూటీ సీక్రెట్ -
చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు.. ఎయిర్‌పోర్టులో ఎమోషనల్
T Rajendar Gets Emotional During Going To US For Medical Treatment: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు టి. రాజేందర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతూ చెన్నైలోని ఓ హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వైద్యుల సూచన మేరకు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అయితే అమెరికాకు పయనమయ్యే సమయంలో మంగళవారం (జూన్ 14) రాత్రి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన ఆరోగ్యం, కొడుకు శింబు గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. 'నేను కేవలం నా కొడుకు కోసమే విదేశాలకు వెళ్తున్నా. నా కొడుకు చాలా గొప్పవాడు. ఎంతో మంచివాడు. ఎందుకంటే గత కొద్దిరోజులుగా శింబు అమెరికాలోనే ఉండి నా వైద్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. నా కోసం తన తర్వాతి సినిమా షూటింగ్‌లు, ఆడియో ఫంక్షన్స్‌ను వాయిదా వేసుకున్నాడు. శింబు సినిమాల్లో గొప్ప నటుడు మాత్రమే కాదు తన తల్లిదండ్రుల పట్ల మంచి మనసున్న కొడుకు. ఇలాంటి కొడుకును కన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. అలాగే నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నన్ను పలకరించి, నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కమల్ హాసన్, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు.' అంటూ భావోద్వేగంగా తెలిపారు టి. రాజేందర్. చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్ -
స్టార్ హీరో తండ్రికి అస్వస్థత
కోలీవుడ్ స్టార్ శింబు తండ్రి, నటుడు టి.రాజేందర్ అస్వస్థతకు లోనయ్యారు. మే 7న ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్పటినుంచి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ విషయం బయటకు పొక్కడంతో హీరో శింబు సోషల్ మీడియాలో తన తండ్రి ఆరోగ్యం గురించి ఓ లేఖ విడుదల చేశాడు. 'మా తండ్రికి ఛాతీలో నొప్పి రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నాము. పొత్తికడుపులో రక్తస్రావం అవుతుండటంతో ఆయనకు ఇంకా మెరుగైన వైద్యం అవసరమని డాక్టర్లు చెప్పారు. వారి సూచన మేరకు విదేశానికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆయన బాగున్నారు. ట్రీట్మెంట్ పూర్తవగానే తిరిగొస్తాం. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు' అని శింబు రాసుకొచ్చాడు. కాగా రాజేందర్ అనారోగ్యానికి గురి కావడంతో మొదట చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాలు చికిత్స అందించిన తర్వాత పొరూర్లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడని పక్షంలో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లారు. pic.twitter.com/Wo2AZOxNR0 — Silambarasan TR (@SilambarasanTR_) May 24, 2022 https://t.co/8oKFJwpMET — VIJAY ANNA Fan 🕊 (@MathaiyanVijay) May 24, 2022 చదవండి 👇 విజయ్ మాల్యా కూతురి పెళ్లికి వెళ్లాను, అక్కడ నాతో ఏం చేయించారంటే? భర్తకు విడాకులు, ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. మాజీ ప్రేయసి వార్నింగ్ -
‘ది వారియర్’ నుంచి బుల్లెట్ సాంగ్ వచ్చేసింది
First Single Released From The Warrior Movie: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, ఆన్లైన్లో లీకైన సినిమా ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం వరస అప్డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్‌సింగిల్ పేరుతో తొలి సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. బుల్లెట్ అంటూ సాగే ఈ పాట యువతను సాంతం ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించి ఎనర్జీటిక్ మ్యూజిక్, శింబు, హరిప్రియ ఆలపించిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతోందీ. ఈ పాటకు శ్రిమణి లిరిక్స్‌ను అందించాడు. -
వారియర్ మూవీలో బుల్లెట్ సాంగ్ పాడిన శింబు
ది వారియర్‌కు పాట పాడారు తమిళ హీరో, సింగర్ శింబు. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ది వారియర్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో బుల్లెట్ అంటూ సాగే పాటను శింబు పాడారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. రామ్, దేవి శ్రీ ప్రసాద్‌లతో ఉన్న స్నేహం వల్లే శింబు మా చిత్రంలోని బుల్లెట్ పాట పాడారు. ఇది ఒక మాస్ నెంబర్. ఇటీవల ఇంట్రవెల్ సీన్‌తో పాటు హీరోహీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరించాం. మా మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది అన్నారు. ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీప్రసాద్, కెమెరా : సుజీత్ వాసుదేవ్. Thank you @SilambarasanTR_ #STRforRAPO #Thewarriorr pic.twitter.com/KUX2Fu62sa— Lingusamy (@dirlingusamy) April 17, 2022 చదవండి: షారుక్, అజయ్లతో అక్షయ్ యాడ్, ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ -
ఆటో డ్రైవర్‌గా మారిన స్టార్ హీరో.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ శింబు గతేడాది మానాడు హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. ప్రస్తుతం శింబు గౌతం వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో ‘వెందు తణిందదు కాడు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు మరో రెండు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శింబు ఆటోడ్రైవర్‌గా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో శింబు సినిమాలో ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారంటూ ఆయన ఫ్యాన్స్ వరుస ట్వీట్స్ చేసి ట్రెండింగ్ చేశారు. కానీ నిజానికి ఇది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం శింబు ఇలా ఆటో డ్రైవర్‌గా నటించారు అని ఆయన సన్నిహితులు వివరణ ఇవ్వడంతో రూమర్స్‌కి చెక్ పడినట్లయ్యింది. ஆட்டோ ஓட்டுநராக ஸ்டைலான லுக்கில் நடிகர் சிலம்பரசன் வீடியோ#Silambarasan |#silambarasantr |#str |#simbu |#tamildiary pic.twitter.com/MDC0JIOzj9 — Tamil Diary (@TamildiaryIn) April 11, 2022 -
చిక్కుల్లో హీరో శింబు కుటుంబం.. కారు డ్రైవర్ అరెస్ట్
Simbu Car Driver Arrest For Runs Over 70 Year Old Man In Chennai: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారు నడిపిన 70 ఏళ్ల వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వంని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 18న రాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్ కారులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. అటునుంచి వస్తున్న వాహనాల వెలుగులతో వృద్ధుడిని గమనించని డ్రైవర్ కారు నడపడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన టి. రాజేందర్ ప్రమాదం జరిగిన చోటు నుంచి 10 మీటర్ల దూరంలో కారు దిగి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అయితే అప్పటికే ఆ వృద్ధుడు మునుస్వామి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు శింబు డ్రైవర్ సెల్వంను మార్చి 19న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో శింబు కుటుంబాన్ని విమర్శిస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై శింబు కుటుంబం ఇంకా స్పందించలేదు. కాగా ఈ కారు శింబు పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం. சாலையை கடக்க முயன்ற முதியவர் மீது ஏறி இறங்கிய நடிகர் சிம்புவின் கார்.. பதைபதைக்க வைக்கும் சிசிடீவி காட்சி.. காரில் சிம்புவின் தந்தை டி.ராஜேந்தரும் இருந்ததாக தகவல்..#Simbu #ActorSimbu #SimbuCarAccident #Death #CCTVfootage #TRajendran pic.twitter.com/9Z9w3diXev — Asianetnews Tamil (@AsianetNewsTM) March 24, 2022 -
గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు.. ఆ హీరోతో నిధి వివాహం!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లవ్ ఎఫైర్ మరోసారి తెరమీదకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఈ నిధి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారని తెలుస్తుంది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్న నిధి షూటింగ్ పూర్తయిన వెంటనే పెళ్లిపీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తుందట.కాగా ఈశ్వరన్ సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నిధి ఆ సినిమా సమయంలోనే శింబుతో ప్రేమలో పడిపోయిందట. ఆ వ్యవహారం కాస్త పెళ్లి వరకు వెళ్లిందని, ఇప్పటికే నిధి టి నగర్‌లోని శింబు ఇంటికి మకాం మార్చినట్లు కోలీవుడ్ టాక్. మరి నిధి-శింబుల పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. గతంలోనూ పలువురు హీరోయిన్స్‌తో లవ్ ట్రాక్ నడిపిన శింబు ఈసారి అయినా పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. -
శింబు కేసులో నిర్మాతల సంఘానికి హైకోర్టు జరిమానా
High Court Fined Tamil Film Producers Council: నటుడు శింబు కేసులో తమిళ సినీ నిర్మాతల సంఘానికి చెన్నై హైకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే నిర్మాత మైఖేల్ రాయప్పన్ నటుడు శింబు కథానాయకుడిగా నిర్మించిన అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్ చిత్రం 2016లో విడుదలైంది. ఈ చిత్రంలో నటించడానికి తనకు రూ.8 కోట్లు పారితోకం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్‌గా రూ.కోటి 51 లక్షలు ఇచ్చిన నిర్మాత మిగిలిన రూ.6 కోట్ల 48 లక్షలు చెల్లించలేదని ఆ మొత్తాన్ని ఇప్పించవలసిందిగా శింబు నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? అదే సమయంలో నిర్మాత మైఖేల్ రాయప్పన్ శింబుతో నిర్మించిన చిత్రంతో తాను తీవ్రంగా నష్టపోయానని, కాబట్టి శింబు నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించవలసిందిగా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాత మైఖేల్ రాయప్పన్ తన గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై శింబు చెన్నై హైకోర్టులో రూ.కోటికి పరువు నష్టం దావా వేశారు. ఆ పిటిషన్లో నిర్మాతల సంఘాన్ని, నడిగర్ సంఘాన్ని, అప్పటి ఈ సంఘం కార్యదర్శి విశాల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. చదవండి: బిగ్‌బాస్: వారానికి ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? చాలాకాలంగా విచార ణలో ఉన్న ఈ కేసును బుధవారం న్యాయమూర్తి నీ.వేల్ మురుగన్ సమక్షంలో మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో 1080 రోజులు అయినా నిర్మా త సంఘం లిఖిత పూర్వకంగా వాదనలను కోర్టులో దాఖలు చేయని కారణంగా ఆ సంఘానికి రూ.లక్ష అపరాధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మొ త్తాన్ని ఈ నెల 31వ తేదీలోగా కోర్టు రిజిస్టర్ కార్యాలయంలో చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ ఒకటవ తేదీకి వాయిదా వేశారు. -
Bigg Boss: హాట్ టాపిక్‌గా హీరో శింబు రెమ్యునరేషన్, ఎంతంటే?
వెండితెర మీద మెరుపులు కురిపించే ఎంతోమంది హీరోలు పలు షోలకు వ్యాఖ్యాతగా మారడం చూశాం. బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ కోసమైతే ఏకంగా స్టార్ హీరోలే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్లకు ఎన్టీఆర్, నాని, నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా తమిళ షోకు కమల్ హాసన్, కన్నడ షోకు సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, హిందీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా పని చేశారు. అయితే కాల్షీట్లు కుదరకపోవడంతో కమల్ బిగ్‌బాస్ ఓటీటీ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానాన్ని హీరో శింబు భర్తీ చేశాడు. బిగ్‌బాస్ అల్టిమేట్ షోకు శింబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇతడిని షోకు రప్పించేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు బాగానే ముట్టజెప్పారట! ఒక్క ఎపిసోడ్‌కు సుమారు కోటి రూపాయల దాకా పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన బిగ్‌బాస్ ద్వారా శింబు రూ.5 కోట్లు వెనకేయనున్నట్లు కనిపిస్తోంది. #BBUltimate 🙏🏻 https://t.co/Lshz5ajZ6z — Silambarasan TR (@SilambarasanTR_) February 27, 2022 #BBUltimate-இல் இன்று.. ▶️ 6:30 pm onwards..#Day28 #Promo3 #NowStreaming only on #disneyplushotstar. @SilambarasanTR_ pic.twitter.com/fGOmZo8NKG — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) February 27, 2022 -
రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నశింబు
-
బిగ్‌బాస్ షో హోస్ట్‌గా స్టార్ హీరో, ప్రోమో రిలీజ్!
తమిళ బిగ్‌బాస్ షో హోస్ట్‌గా విశ్వ నటుడు కమల్ హాసన్ తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. మొదట్లో రమ్యకృష్ణను హోస్ట్‌గా నిలబెడతారనుకున్నారు. కానీ, బిగ్‌బాస్ అల్టిమేట్ షోలో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్ కారణంగా షో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో కోలీవుడ్ యంగ్ హీరోను సంప్రదించగా అతడు ఓకే చెప్పినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇది నిజమేనని వెల్లడించింది బిగ్‌బాస్ టీమ్. బిగ్‌బాస్ ఓటీటీకి హీరో శింబు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేసింది. మరి శింబు హోస్ట్‌గా బుల్లితెరపై అదరగొడతాడా? కంటెస్టెంట్ల లెక్కలు సరిచేస్తాడా? అభిమానులను ఎంటర్టైన్ చేస్తాడా? అనేది చూడాలి! #STRtheHostOfBBUltimate 💥 pic.twitter.com/GWozob5Kwu — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) February 24, 2022 -
స్టార్ హీరోతో నిధి అగర్వాల్ పెళ్లి? త్వరలోనే అనౌన్స్మెంట్!
Will Nidhi Agarwal And Simbu To Get Married Soon?: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో గత కొంతకాలంగా ప్రేమలో మునిగిపోయిన వీరిద్దరు త్వరలోనే ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ టాక్. శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత కొంతకాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కథనాలు వెలుడుతున్నాయి. ఈ వార్తలపై ఇంతవరకు స్పందించని ఈ జంట త్వరలోనే తమ పెళ్లి కబురు చెప్పేందుకు రెడీ అవుతున్నారట. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా మానాడు చిత్రంతో హిట్ అందుకున్న శింబు చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అటు నిధి సైతం 'హీరో', 'హరిహర వీరమల్లు' సహా ఒక తమిళ చిత్రం చేస్తోంది. -
తమిళ హీరో శింబుకు గౌరవ డాక్టరేట్, ఏ యూనివర్శిటీ ఇచ్చిందంటే
తమిళ స్టార్ హీరో శింబుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విషయాన్ని శింబు స్యయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ సందర్భంగా తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. కాగా తన జీవితంలో సినిమా ఉండటానికి వారే కారణమని, అందుకే ఈ గౌరవాన్ని వారిక అంకితమిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక తనని ఇంతవరకు తీసుకువచ్చిన తన అభిమానులకు ఈ సందర్భంగా శింబు ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉష కూడా హాజరయ్యారు. దర్శకుడు, నటుడు టి. రాజేందర్ కుమారుడిగా బాల నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శింబు హీరోగా ఆకట్టుకున్నాడు. అంతేగాక విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళనాట ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు శింబు. Thanking all the committee members of Vels University & @IshariKGanesh for bestowing the Honorary Doctorate upon me. I dedicate this huge honour to Tamil cinema, my Appa & Amma! Cinema happened to me because of them! Finally - my fans, #NeengailaamaNaanilla Nandri Iraiva! ❤️ pic.twitter.com/YIc6WyGCvR — Silambarasan TR (@SilambarasanTR_) January 11, 2022 -
స్టార్ హీరోతో లవ్‌లో పడ్డ నిధి, అతడి ఇంట్లోనే మకాం!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందన్న వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రెండుమూడుసార్లు ప్రేమలో విఫలమైన శింబుతో ఆమె లవ్‌లో పడిందని, త్వరలో వీళ్లిద్దరూ ఏడడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నారంటూ ఓ క్రేజీ గాసిప్ సినీప్రియులను ఆకర్షిస్తోంది. శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఇది గతేడాది జనవరిలో రిలీజైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట! కరోనా టైంలో లవ్‌లో పడ్డ నిధి కొంతకాలంగా చెన్నైలోని శింబు ఇంట్లోనే ఉంటోందని, త్వరలోనే ఈ ప్రేమజంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుందని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే! కాగా 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. గతేడాది 'ఈశ్వరన్'తో కోలీవుడ్‌లో లక్ పరీక్షించుకున్న ఆమె ప్రస్తుతం 'హీరో', 'హరిహర వీరమల్లు' సహా ఒక తమిళ చిత్రం చేస్తోంది. శింబు విషయానికి వస్తే 'మానాడు' సినిమాతో ఈ మధ్యే మంచి సక్సెస్ అందుకున్నాడీ హీరో. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ప్రస్తుతం శింబు చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. అప్సరసలా మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫొటోలు చూసేయండి -
ఆస్పత్రిలో చేరిన హీరో శింబు
Hero Simbu Hospitalised in Chennai: తమిళ హీరో శింబు ఆస్పత్రిలో చేరాడు. వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న శింబు శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. కాగా 'వెందు తనిందదు కాడు' అనే సినిమా షూటింగ్లో కొన్ని వారాలపాటు బిజీగా ఉన్న శింబు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అయితే ఇది కరోనా కాదని, సాధారణ ఇన్‌ఫెక్షనేనని వైద్యులు స్పష్టం చేశారు. శింబు అనారోగ్యంబారిన పడ్డారని తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా తమిళ స్టార్ అయిన శింబు తెలుగులో 'వల్లభ', 'మన్మధ' వంటి ప్రేమకథా చిత్రాలతో ఇక్కడిప్రేక్షకులకూ చేరువయ్యాడు. ఇటీవలే రిలీజైన ‘మానాడు’ తెలుగులో ‘ది లూప్‘ పేరుతో అనువదించారు. -
'మానాడు' మూవీ సక్సెస్ జోష్‌లో హీరో శింబు
Simbu thanks fans for overwhelming support for Maanaadu: మానాడు చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. వీ.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నెల 25వ తేదీ తెరపైకి వచ్చిన మానాడు చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్ర దర్శక నిర్మాతలను తన ఇంటికి పిలిపించుకొని అభినందించడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాత సురేష్ కామాక్షి ట్విట్టర్లో పేర్కొంటూ ‘సూపర్ స్టార్ ఆహ్వానం, అభినందనలు ఈ చిత్ర విజయాన్ని దృవపరిచాయి. మంచిని వెతికి అభినందించే ఈ మనసే ఇంకా మిమ్మల్ని ఉన్నత సింహాసనంపై కూర్చోబెట్టింది. గొప్ప ఫలితాన్ని పొందాం. యూనిట్ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. -
లాక్డౌన్లో 27 కేజీల బరువు తగ్గాను : శింబు
Hero Simbu Says He Lost 27 Kgs In Lockdown: ‘‘నేను నటించిన ‘మన్మథ, వల్లభ’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేయడానికి సిద్ధం’’ అని హీరో శింబు అన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, యస్.జె. సూర్య, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మానాడు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ది లూప్‘ పేరుతో అనువదించారు. అల్లు అరవింద్, బన్నీ వాసు తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళ్, తెలుగు భాషల్లో ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ‘ది లూప్’ రూపొందింది. ఇందులో నేను చేసిన అబ్దుల్ కాలిక్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాల వల్ల సామాన్య వ్యక్తి అయిన అబ్దుల్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? వాటిని ఎలా అధిగమించాడు? అన్నదే ఈ చిత్రకథ. ఒక్క రోజులో వేరే వేరే సమయాల్లో జరిగే కథ ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ చిత్రంలో నేను హంతకుడి పాత్ర పోషించాను. ఈ పాత్ర కోసం 27 కిలోల బరువు తగ్గాను. వెంకట్ ప్రభు మంచి దర్శకుడు. గతంలో ‘మన్మథ’ చిత్రాన్ని నేను తెలుగులో రీమేక్ చేద్దామంటే వద్దన్నారు.. అయినా పట్టుబట్టి నేను డబ్బింగ్ చేయించి, రిలీజ్ చేశాను. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ‘ది లూప్’ని కూడా నేనే తెలుగులో రిలీజ్ చేయిస్తున్నాను. నాపై నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేస్తున్న అల్లు అరవింద్, బన్నీ వాసుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. -
ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటా: శింబు
సాక్షి, చెన్నై(తమిళనాడు): నటుడు శింబు మానాడు చిత్ర ఆడియో వేదికలో కంటతడి పెట్టారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణి ప్రియదర్శన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించారు. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించగా.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. శింబు మాట్లాడుతూ ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటానని, అభిమానులు మాత్రం తన వెంటే ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
నటుడు శింబుపై భారీ కుట్రలు
తమిళసినిమా: నటుడు శింబుపై కుట్రలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులైన దర్శకుడు టి.రాజేందర్, ఉషా రాజేందర్ బుధవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎగ్మూర్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మించిన అన్భాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో తన కొడుకు శింబు కథానాయకుడిగా నటించారన్నారు. మీడియాతో మాట్లాడుతున్న టి.రాజేందర్, ఉషా రాజేందర్ అయితే అతనికి నిర్మాత పూర్తిగా పారితోషికం చెల్లించలేదని, అలాంటిది శింబునే ఆయనకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారన్నారు. శింబుపై రెడ్‌కార్డు వేయాలనే కుట్ర జరుగుతోందని టి.రాజేందర్ ఆరోపించారు. ఉషా రాజేందర్ మాట్లాడుతూ ఈకుట్రను సీఎం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఆయన ఇంటి ముందు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. చదవండి: (క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!) -
రూ.125 కోట్ల భారీ బడ్జెట్ మూవీకి హీరో నాని సాయం
తమిళ స్టైలీష్ స్టార్ శింబు, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘మానాడు’. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘సురేష్ కామాచి’ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్, మొదటి సింగిల్ విడుదలై మంచి ఆదరణ పొందాయి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయనున్నారు. అలాగే తమిళ ట్రైలర్ ఎ.ఆర్. మురుగదాస్, మలయాళంలో నివిన్ పాలి, కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేయనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. -
హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు
చెన్నై: నటుడు శింబుకు ఊరట కలిగింది. ఆయనపై తమిళ నిర్మాతల మండలి విధించిన రెడ్కార్డును రద్దు చేసింది. శింబు కథానాయకుడిగా అన్బాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించిన మైఖేల్ రాయప్పన్ శింబు సహకరించకపోవడం వల్లే తాను రూ.2 కోట్లు నష్టపోయానని తమిళ నిర్మాతల మండలిలో (టీఎఫ్‌పీసీ) ఫిర్యాదు చేశారు. శింబు నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతల మండలి తీర్మానం చేసినా ఫలితం లేకపోవడంతో రెడ్ కార్డును విధించారు. ఈ వ్యవహారంపై శింబు తల్లి ఉష ఇటీవల నిర్మాతల మండలికి లేఖ రాశారు. తదనంతరం శింబుకు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చల్లో ఈ వివాదానికి పరిష్కారం లభించింది. చదవండి : సినిమాలకు సమంత బ్రేక్.. అందుకేనా! మా సినిమా సక్సెస్‌పై పూర్తి నమ్మకం ఉంది: సుశాంత్ -
శింబు: వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్..ఫోటో వైరల్
కోలీవుడ్ హీరో శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'వెందు తానింధుడు కాదు'. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం కోసం దాదాపు 30 కిలోల బరువు తగ్గిన శింబు సరికొత్త లుక్‌లో అలరిస్తున్నారు. లేటెస్ట్గా తన ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన ఫోటోను శింబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో క్లీన్‌షేవ్‌తో స్టైలిష్ లుక్‌లో శింబు కనిపిస్తున్నారు. కాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు ఇది వరకే ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ తమిళ రీమేక్ వెర్షన్లలో నటించిన సంగతి తెలిసిందే. ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. -
కాలిన గాయాలతో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా?
Vendu Thanindathu Kadhu Movie: మాసిన చొక్కా, పైకి కట్టుకున్న లుంగీ, శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఆయుధంగా పొడవాటి కర్ర, ఏదో ఆపద సంభవించిందన్నదానికి ప్రతీకగా భూమి మీద మండుతున్న గడ్డి.. పై ఫొటో చూస్తుంటే హీరో ఏదో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లే కనిపిస్తున్నాడు. ఇంతకీ ఈ హీరోను గుర్తుపట్టారా? తమిళంలో ఈయన పెద్ద స్టార్. మన్మధ, వల్లభ, పోకిరోడు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. పోస్టర్లో ఉన్నదెవరో మీకీపాటికే అర్థమైపోయుంటుంది. అతడు స్టార్ హీరో శింబు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు ఓ సినిమా చేస్తున్నాడు. నేడు(ఆగస్టు 6) ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'నదిగలిలే నీరాడుం సూరియన్' అని గతంలో పెట్టిన టైటిల్‌ను మార్చివేసి 'వెందు తనిందదుక్కాడు' అని కొత్త టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్లో అడవిలో అంటుకున్న కార్చిచ్చులో శింబు గాయపడినట్లు తెలుస్తోంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె గణేశ్, అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. శింబు ప్రస్తుతం మానాడుతో పాటు పాతు కల(కన్నడ 'ముఫ్తీ' రీమేక్) సినిమాలు చేస్తున్నాడు. Here’s the title and first look of the new film with @TRSilambarasan @arrahman @IshariKGanesh@VelsFilmIntl @Ashkum19 Thank you to everybody who made this possible pic.twitter.com/6LY9icJuSd — Gauthamvasudevmenon (@menongautham) August 6, 2021 -
యూనిట్ సభ్యులకు శింబు సర్ప్రైజ్ గిఫ్ట్
తమిళసినిమా: మానాడు చిత్ర యూనిట్ సభ్యులను నటుడు శింబు ఖుషీ పరిచారు. శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మానాడు, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. సమకాలిన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శనివారంతో పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. శింబు సర్ప్రైజ్ గిఫ్ట్‌తో చిత్ర యూనిట్ సభ్యులను ఖుషీ పరిచారు. ఆయన దర్శకుడు వెంకట్‌ప్రభు నుంచి 300 మంది యూనిట్ సభ్యులకు ఖరీదైన వాచీలను కానుకగా అందించారు. -
అప్పటి నుంచి ఆల్కహాల్ మానేశా : హీరో శింబు
మధ్యపానం ఆరోగ్యానికి హానికారం అని తెలిసినా చాలామంది ఆ వ్యసనానికి అలవాటుపడతారు. దీనికి హీరో, హీరోయిన్లు కూడా అతీతం కాదు. డిప్రెషన్‌తో మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి కెరీర్‌ని నాశనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అలాగే... మత్తుతో తమ జీవితం చిత్తవుతుందని గ్రహించి త్వరగా ఆ వ్యసనం నుంచి బయటపడి కెరీర్‌ను గాడిన పెట్టుకున్న నటీనటులూ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి కోలీవుడ్ హీరో శింబు కూడా చేరిపోయారు. ప్రస్తుతం శింబు ‘మానాడు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీలోని ఓ పాటను ట్విట్టర్ వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా శింబు, డైరెక్టర్ వెంకట్ ప్రభు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శి సహా పలువురు నటీనటులు ఈ లైవ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నటుడు ఎస్జే సూర్య అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తాను ఆల్కహాల్ మానేసినట్లు శింబు వెల్లడించాడు. ఆల్కహాల్ మానేసి దాదాపు ఏడాది కావొస్తుందని,మందు మానేయడం వల్ల తాను చాలా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాడు. ఇప్పుడు తన ఫోకస్ అంతా హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పైనే ఉందని వివరించాడు. చదవండి : అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోలీవుడ్ స్టార్ శింబు తమిళనాడు రియల్ పాలిటిక్స్ ఆధారంగా ధనుష్ మూవీ! -
అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోలీవుడ్ స్టార్ శింబు
తమిళ సూపర్ స్టార్ శింబు ఇన్‌స్టాగ్రామ్‌లో 1మిలియన్ ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. గతేడాది అక్టోబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన శింబు ఏడాది కూడా పూర్తి కాకుండానే 1మిలియన్ మార్కును చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన ఫాలోవర్లకు, అభిమానులకు శింబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. గతేడాది చెన్నైలోని ఓ కాలేజీ ఈవెంట్లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ 1 మిలియన్ ఫాలోవర్స్‌కి థ్యాంక్స్ చెప్పాడు. ఇక లేట్‌గా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చినా..ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘మానాడు’ సినిమాలో శింబు నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి :Rangam: జీవా ప్లేస్‌లో శింబు, ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Silambarasan TR (@silambarasantrofficial) -
వివాదంలో హన్సిక మూవీ: కోర్టుకెక్కిన డైరెక్టర్
హీరోయిన్ హన్సిక నటించిన తాజా చిత్రం ‘మహా’ పై వివాదం నెలకొంది. యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహించారు. కాగా ‘‘నేను దర్శకత్వం వహించిన ‘మహా’ని నాకు చెప్పుకుండానే ఓటీటీలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.. దీనిపై నిషేధం విధించాలి’’ అని జమీల్ డిమాండ్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. హన్సిక టైటిల్ రోల్ చేసిన ‘మహా’ దాదాపు రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ‘‘ఈ చిత్రం పెండింగ్ పనులు నాకు తెలియకుండానే పూర్తి చేశారు.. నిర్మాత (మదియళగన్) నాకు 24 లక్షలు పారితోషికం చెల్లించాల్సి ఉండగా కేవలం 8.15 లక్షలు మాత్రమే చెల్లించారు. నాకు తెలియకుండానే పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేసినందున, నా కథ మార్చినందున రూ.10 లక్షల పరిహారంతో పాటు, నాకు రావాల్సిన రెమ్యూనరేషన్ బకాయి చెల్లించాలి’’ అని కేసు పెట్టారు జమీల్. అంతేకాదు.. సినిమా రిలీజ్ కానివ్వకుండా నిర్మాణ సంస్థపై నిషేధాన్ని విధించాలని కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ‘జమీల్ పిటిషన్‌పై మే 19లోగా స్పందించాలి’ అంటూ సదరు కోర్డు నిర్మాతను ఆదేశించింది. కాగా ఒక పైలెట్‌తో ప్రేమలో పడే పైలెట్ అటెండెంట్ (హన్సిక) కథ ఇది. ఈ జంటకు పుట్టిన కుమార్తె మరణం వెనక దుర్మార్గుల్ని హీరో ఎలా పట్టుకుని అంతం చేశాడు? అనేది ‘మహా’ చిత్రకథ. ఇందులో శింబు అతిథి పాత్రలో కనిపిస్తారు. చదవండి: రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే.. -
Rangam: జీవా ప్లేస్‌లో శింబు, ఫొటోలు వైరల్
సూర్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 'అయాన్'. తెలుగులో వీడొక్కడే పేరుతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దర్శకుడు కేవీ ఆనంద్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే ఆ వెంటనే 'కో' సినిమాను ప్రకటించాడు ఆనంద్. ఇది తెలుగులో 'రంగం' పేరుతో విడుదై సెన్సేషనల్ హిట్ సాధించింది. అయితే ఇక్కడో ఆసక్తికర విషయమేంటంటే ఇందులో మొదట హీరోగా అనుకుంది జీవాను కాదు శింబును! శింబుతో 'కో' సినిమా తీస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారంగా ప్రకటించింది. అంతే కాదు, ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ మొదలవుతుంది అనుకుంటున్న సమయంలో శింబు-కార్తీక నాయర్లపై ఫొటోషూట్ కూడా నిర్వహించారు. ఇక సినిమా పట్టాలెక్కే సమయానికి మాత్రం శింబు ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దీంతో దర్శకుడు శింబు ప్లేస్‌లో యంగ్ హీరో జీవాను తీసుకోవాల్సి వచ్చింది. అయితే అనుకున్నదానికంటే ఎక్కువగా అఖండ విజయం సాధించిన ఈ సినిమా రిలీజై దాదాపు పదేళ్లు దాటిపోయింది. ఈ సమయంలో తాజాగా శింబు-కార్తీక ఫొటోషూట్‌కు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. 'కో' సినిమా చేసేందుకు శింబు రెడీ అన్నాడు. కాకపోతే హీరోయిన్గా కార్తీకకు బదులు తమన్నా కావాలని అడిగాడట. కానీ ఆ సమయంలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ పెద్దమొత్తంలో పారితోషికం అందుకుంటున్న మిల్కీ బ్యూటీని ఈ ప్రాజెక్టుకు ఒప్పించడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు దర్శకనిర్మాతలు. తమన్నా కోరినంత రెమ్యుననరేషన్ ఇచ్చేంత భారీ బడ్జెట్ తమ వద్ద లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో దర్శకుడు, హీరో మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడటంతో శింబు ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. చేసేదేం లేక దర్శకుడు కూడా మరో మంచి నటుడు కోసం వెతుకుతుండగా జీవా కంటపడ్డాడు. అలా అతడికి కో మూవీలో చాన్స్ రాగా అది జీవా కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా రెండు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు, మూడు విజయ్, రెండు సీమా, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం విశేషం. చదవండి: Anushka Shetty: వైరలవుతున్న స్వీటీ ఫొటో సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం -
ఆరు నిమిషాల సీన్ సింగిల్ టేక్
ఆరు నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో నటించి ప్రశంసలు అందుకున్నారు నటుడు శింబు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మనాడు. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటి కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రధాన పాత్రలో ఎస్ జే. సూర్య నటిస్తున్న ఇందులో వైజీ.మహేంద్రన్, వాగై చంద్రశేఖర్, ఎస్ఏ చంద్రశేఖర్, ఆంజనా కీర్తి, ఉదయ, మనోజ్ కె భారతి, కరుణాకరణ్, మహత్, డేనియల్ పోప్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా శనివారం నటుడు శింబు, కళ్యాణి ప్రియదర్శన్, ఎస్ జె సూర్య, ప్రేమ్ జీ పాల్గొన్న సన్నివేశాలను దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రీకరించారు. అందులో భాగంగా ఆరు నిమిషాల సన్నివేశాన్ని నటుడు శింబు సింగిల్ టేక్ లో నటించి సింగల్ టేక్ నటుడు అన్న విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఆ సన్నివేశం పూర్తి కాగానే చిత్ర యూనిట్ అంతా చప్పట్లు కొట్టి ఆయన్ని ప్రశ్నించినట్లు నిర్మాత తెలిపారు. చదవండి: ఒకే బాటలో నయనతార.. త్రిష! -
బిగ్‌బాస్ 5: హోస్ట్ నుంచి తప్పుకున్న హీరో..
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్‌బాస్ వస్తుందంటే చాలు ఎంతో మంది టీవీల ముందు అతుక్కుపోతారు. తెలుగు, హిందీ తమిళ, కన్నడ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ కొట్లాది ప్రేక్షకులను అలరిస్తుంది. కాగా తమిళంలో బిగ్‌బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ నాలుగు సీజన్లకు విలక్షణ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తన హోస్టింగ్‌తో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తిచేశారు. బిగ్‌బాస్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో కమల్ హాసన్ హోస్టింగ్‌కు కూడా అంతే ఉంది. తాజాగా తమిళ బిగ్‌బాస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే నటుడు కమల్ హాసన్ ఇకపై బిగ్‌బాస్ హోస్ట్ చేయడని ఈ వార్తల సారంశం. మొదటి మూడు సీజన్ల మాదిరిగానే ఈ సంవత్సరం జూన్ లేదా జూలైలో ‘బిగ్ బాస్ 5’ ప్రారంభ కానున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ అయిదో సీజన్‌కు కమల్ రావడం లేదని సమాచారం. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యుమ్ పార్టీ స్థాపించి తమిళనాడు ఎన్నికల్లో బిజీగా మారారు. అంతేకాకుండా ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీకి జరిగే తన మొదటి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బిగ్‌బాస్ 5కి హోస్ట్‌గా వ్యవహరించడం అనుమానంగానే మారింది. దీంతో కమల్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే తెరపైకి మరో యువ నటుడి పేరు వినిపిస్తోంది. కమల్ స్థానంలో మాస్ హీరో శింబు వ్యాఖ్యాతగా వ్యవహరించున్నట్లు తెలుస్తోంది.ఇ ప్పటికే ‘బిగ్ బాస్ 5’ నిర్మాతలు శింబూతో చర్చలు ప్రారంభించారని, ఆయనకు కూడా చాలా ఆసక్తి ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కాగా తమిళంలో శింబుకు కూడా ప్రత్యేక పాపులారిటీ ఉంది. అంతేగాక ఉన్నది ఉన్నట్లు తన అభిప్రాయాన్ని చెప్పడంలో శింబు వెనకాడడు. ఒకవేళ ఇదే వార్త నిజమైతే బిగ్‌బాస్ ఈ సారి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. చదవండి: నా కొడుకుతో సహా బిగ్‌బాస్‌కు వెళ్తా!: నటి 'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ -
‘ఇస్మార్ట్’ బ్యూటీకి చేదు అనుభవం.. అందరి ముందే..
ఇస్మార్ట్ శంకర్ ఫేం, హాట్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురరైంది. హీరో శింబుతో కలిని నిధి అగర్వాల్ ఈశ్వరన్ అనే తమిళ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత బాలాజీ కబా నిర్మించిన ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. కె.భారతీరాజా వంటి సీనియర్ స్టార్ డైరెక్టరు కీలకమైన పాత్ర పోషించగా, నందితా శ్వేత, ఇతర తారాగణం నటించారు. కాగా, ఇటీవల జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో చిత్ర దర్శకుడు ఆమెను కాస్త ఇబ్బంది పెట్టాడు. దీంతో ఈ ఇష్యూ కోలివుడ్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే.. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఈశ్వరన్ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేజీపై మాట్లాడుతుండగా.. దర్శకుడు సుశీంద్రన్ పదే పదే మధ్యలో కలుగజేసుకుంటూ 'శింబు మామ ఐ లవ్యు' అని చెప్పు అంటూ అడ్డుపడుతూ బలవంత పెట్టారు. దీంతో నిధి కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి ప్రవర్తనను తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూపై దర్శకుడు సుశీంద్రన్ స్పందిస్తూ.. సినిమాలో శింబును ఉద్దేశించి నిధి 'మామా ఐ లవ్యూ' అని చెప్పే డైలాగ్ ఉంటుందని, దాన్ని హైలైట్ చేద్దామనే ఆడియో ఫంక్షన్లో అలా చెప్పనని వివరణ ఇచ్చారు. కాగా, ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది. -
దీపావళి కానుకగా వన్‌గ్రామ్ గోల్డ్, బట్టలు ఇచ్చిన హీరో
తమిళ హీరో శింబు ‘ఈశ్వరన్’ మూవీ టీంకు దీపావళికి కానుక వన్ గ్రామ్ గోల్డ్, ధుస్తులు ఇచ్చాడు. ప్రస్తుతం శింబు నటిస్తున్న ఈశ్వరన్ చిత్రం పూరైన సందర్భంగా షూటింగ్ చివరి రోజున పని చేసిన దాదాపు 400 మందికి వన్ గ్రామ్ గోల్డ్, కొత్త బట్టలను బహుమతిగా ఇచ్చాడు. అంతేగాక దాదాపు 200 మంది జునీయర్ ఆర్టిస్టులకు కూడా పండగ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేశాడు. దీంతో శింబు ఉదారతకు చిత్ర యూనిట్ సభ్యలతో పాటు జునీయర్ ఆర్టీస్టులంతా ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్క్షతలు తెలుపుతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో శింబు నాగుపామును పట్టుకుని ఉన్న ఫస్ట్ పోస్టుర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. (చదవండి: పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?) #ShootCompleted 😊#EeswaranTeaserForDiwali I heart fully thank each and everyone of my team #Eeswaran for this beautiful journey! & Special thanks to all my fans for all the love and support #SilambarasanTR #Atman #STR pic.twitter.com/7lAXOnjZyP — Silambarasan TR (@SilambarasanTR_) November 6, 2020 ఇక సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా శింబు ట్వీట్ చేస్తూ ఈ దీపావళి టీజర్ విడుద చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘ఈశ్వరన్ షూటింగ్ పూరైంది. ఈ దీపావళికి టీజర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వరన్ మూవీ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్క్షతలు తెలుపుతున్న’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
తారలు నెలల్లో స్లిమ్ అయిపోతారు
తగ్గడాలు పెరగడాలు సినిమాల్లో సాధారణం. బొద్దుగా కనిపించే తారలు నెలల్లో స్లిమ్ అయిపోతారు. కొన్ని సార్లు సినిమాలో పాత్రలు కోసం ఇలా చేస్తారు. కొన్నిసార్లు ఫిట్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యే తగ్గిపోతారు. లాక్డౌన్లో కొందరు స్టార్స్ ఫిట్‌గా మారిపోయారు. బరువును మొత్తం దించేసుకున్నారు. బరువు తగ్గడంతో కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందంటున్నారు. ఆ విశేషాలు... పెరిగి.. తగ్గారు కృతీ సనన్ నాజూకుగానే ఉంటారు. అయితే ‘మిమి’ అనే హిందీ సినిమా కోసం సుమారు 15 కిలోల బరువు పెరిగారీ బ్యూటీ. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో నటించారు కృతి. అందుకోసమే 15 కిలోలు పెరిగారామె. సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తగ్గే పని మీద దృష్టి పెట్టారు. లాక్డౌన్ ఆమెకు కలిసొచ్చింది. ‘‘ఈ లాక్డౌన్లో బరువునంతా తగ్గించుకోవడం సులువు అయింది. నా ట్రైౖనర్ సహాయం వల్లే ఈజీ అయింది’’ అన్నారు కృతీ సనన్. ఫిట్ శింబు ఆ మధ్య తమిళ హీరో శింబు బరువు బాగా పెరిగారు. లాక్డౌన్లో పూర్తి శ్రద్ధ బరువు తగ్గడం మీదే పెట్టారు శింబు. లాక్డౌన్ ముందు వరకూ ఆయన సుమారు 102 కిలోల బరువు ఉన్నారు. ఇప్పుడు 71 కిలోలకు వచ్చేశారు. తగ్గడానికి ఎన్ని నెలలు పట్టిందీ అంటే.. దాదాపు ఏడాది. తగ్గే ప్రయత్నాన్ని గత నవంబర్‌లో మొదలుపెట్టారు. లాక్డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయంలో కఠోర శ్రమతో వర్కౌట్స్ చేశారట. రోజుకి రెండు మూడు గంటలు వ్యాయామానికి కేటాయించారు శింబు. ప్రతిరోజూ వాకింగ్, జిమ్‌తో పాటు టెన్నిస్, బాస్కెట్‌బాల్ ఆడుతూ వెయిట్‌లాస్ అయ్యారు. ‘‘ఏ పని చేయడానికి అయినా మనం బలంగా సంకల్పించుకోవాలి. మన సంకల్పమే ముఖ్యం’’ అంటారు శింబు. ఇంకో విశేషం ఏంటంటే.. రెండువారాలుగా హీరోయిన్ శరణ్యా మోహన్ వద్ద భరతనాట్యంలో కోచింగ్ తీసుకుంటున్నారాయన. ఓ డ్యాన్స్ బేస్డ్ సినిమాలో నటించనున్నారట. అందుకే ఈ శిక్షణ అని సమాచారం. నిజమైన ఆత్మవిశ్వాసం ఇప్పుడొచ్చింది కామెడీ పాత్రల్లో అందర్నీ ఆకట్టుకున్నారు తమిళ పొన్ను (తమిళ అమ్మాయి) విద్యుల్లేఖా రామన్. స్వతహాగా ఆమె బొద్దుగానే ఉంటారు. చేసేవి కూడా కామెడీ ప్రధానంగా సాగే పాత్రలే కాబట్టి తెర మీద మెరుపు తీగలా కనపడాల్సిన పని లేదు. అయితే ఫిట్ గా ఉండటం ముఖ్యం అనుకున్నారు. అందుకే బరువు తగ్గడం మీద శ్రద్ధ పెట్టారు. ‘‘ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అనుకున్నాను. కానీ అలా అనుకున్నాను.. అంతే. బరువు తగ్గిన తర్వాతే నిజమైన ఆత్మవిశ్వాసం వచ్చింది. మనసు పెట్టి చేస్తే అసంభవం అంటూ ఏదీ లేదు. అలాగే బరువు తగ్గడం వెనక పెద్ద రహస్యాలేవీ ఉండవు. శ్రద్ధగా శ్రమించడమే’’ అంటారు విద్యుల్లేఖా రామన్. దాదాపు పది కిలోలు తగ్గారామె. శరీరాన్ని గౌరవించాలి ‘‘మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మన శరీరాన్ని గౌరవించాలి. అనారోగ్య సమస్యల వల్ల లావు అవ్వడాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ తిండి విషయంలో కంట్రోల్ లేకపోవడం సరైనది కాదు’’ అంటారు ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్. ‘ఉయ్యాల జంపాల’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అవికా తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో చాలా బరువు పెరిగారామె. లాక్డౌన్లో శరీరం మీద దృష్టి పెట్టి సుమారు 13 కిలోల వరకూ తగ్గారు. ‘‘ఇష్టమొచ్చింది తినేస్తూ వ్యాయామం చేయకుండా లావయ్యాను. ఓరోజు అద్దంలో నన్ను నేను చూసుకుని నివ్వెరపోయాను. చాలా నిరాశపడ్డాను. నా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ బరువు పెరగడంతో సరిగ్గా చేయలేకపోయాను. ఇక లాభం లేదనుకుని మళ్లీ వర్కౌట్స్ మొదలుపెట్టాను. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’’ అన్నారు అవికా. -
మహా పూర్తయింది
హీరోయిన్గా హన్సిక 50వ సినిమా మైలు రాయిని అందుకున్నారు. 50వ సినిమా కోసం ఓ క్రేజీ లేడీ ఓరియంటెడ్ కథను ఎంచుకున్నారామె. ‘మహా’ టైటిల్‌తో ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. అతిథి పాత్రలో శింబు మెరవనున్నారు. సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో శింబు కనిపిస్తారట. కోవిడ్ తర్వాత ఇటీవలే సినిమా చిత్రీకరణ ప్రారంభించి, పూర్తి చేశారు కూడా. ఈ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ – ‘‘నా 50వ సినిమా షూటింగ్ పూర్తిచేశాం. మహా పాత్రకు బైబై. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో భాగం అయిన అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?
దక్షిణాది భాషలన్నింటిలోనూ కథానాయకిగా నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచుకున్నారు త్రిష క్రిష్ణన్. ఆ తర్వాత కొన్ని చిత్రాలు వరుస ప్లాపులు అవ్వడంతో వెనకబడిన త్రిష మళ్లీ 96, పేట చిత్రాల విజయం ఆమెకు మళ్లీ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం త్రిష చేతి నిండా బోలేడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నటుడు శింబు, త్రిష కలిసి తమిళ చిత్రం ‘విన్నైతాండి వరువాయ’లో (తెలుగులో ఏమాయ చేశావే) నటించారు. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం గతంతో సామాజిక మాద్యమాల్లో జోరుగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులమని ఈ జంట స్పష్టం చేశారు. చదవండి: ఉన్నట్టుండి పోస్టులన్నీ డిలీట్, ఎందుకబ్బా? అయితే ఇటీవల శింబు ఈ ఏడాది డిసెంబర్లో శుభవార్త చెబుతానంటూ సోషల్ మీడియాలో ప్రకటించాడు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని, తొందరలోనే పెళ్లి కబురు చెప్పనున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ అది రియల్ లైఫ్ లేక రీల్ లైఫ్‌కు చెందిన విషయమా అని శింబు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ ఏడాది తమిళ నిర్మాత మండలి ఎన్నికల్లో శింబు తండ్రి టి. రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో ఓ జర్నలిస్టు ‘మీ కుమారుడు శింబు.. త్రిషతో ఏడడుగులు వేయబోతున్నారా’ అని ప్రశ్నించారు. అయితే దీనికి అవును, కాదని ఏ సమాధానం చెప్పకుండా రాజేందర్ ఈ ప్రశ్నను దాటేశారు. దీంతో త్వరలో శింబు- త్రిష పెళ్లి పీటలు ఎక్కనున్నారని మరోసారి సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ వదంతులు కాస్తా నిజమే అయితే శింబు, త్రిష అభిమానులు పండగ చేసుకోనున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: వెబ్ సిరీస్‌లో త్రిష.. -
వారి మరణాలు నన్నెంతో బాధించాయి..
కళాకారుడి విజయాన్ని మరణం ఆపలేదని నటుడు శింబు పేర్కొన్నారు. సినిమారంగంలో నెలకొంటున్న ఆత్మహత్యలు, కరోనా మరణాలపై శింబు స్పందిస్తూ మీడియాకు ఒక లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొంటూ చాలా బాధాకరమైన రోజులు నడుస్తున్నాయని అన్నారు. నటుడు సేతు, చిరంజీవి సార్జా నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ తదితరుల మరణాలు తనను చాలా బాధించాయని అన్నారు. వారు ముగ్గురూ తనకు మంచి మిత్రులని పేర్కొన్నారు. వారి మరణం తనకే కాకుండా సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. వారి ఆత్మ భగవంతుడి ఒడికి చేరాలని కోరుకుంటున్నానన్నారు. ఆ నటుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. మరో విషయం ఏమిటంటే నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ పే చురా చిత్రాన్ని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ చెప్పినట్లుగా థియేటర్లలో విడుదల చెయ్యాలని అన్నారు. ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించి మరణాలు విజయాన్ని ఆపలేవన్నది నిరూపించాలని అన్నారు. ఈ కరోనా కాలంలో ఎక్కడ చూసినా అంబులెన్సులు మోతలు, మరణాల ఏడుపులే వినిపిస్తున్నాయి అన్నారు. కరోనా బాధింపు మరణాల కుటుంబాలకు ఈ సందర్భంగా గా తన ఓదార్పును చెబుతున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ వ్యాధి వలన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు భీతి చెందడమే పెద్ద రోగం అన్నారు. చదవండి: శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజేందర్ ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. సునామి గజా తుపాన్ వంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఇంతకుముందు ఎదురొడ్డి విజయం సాధించామని అన్నారు కాకపోతే కరోనా కాలంలో బాధితులను ప్రత్యక్షంగా కలిసి, సాయం చేయలేని పరిస్థితి అని అన్నారు. ఇప్పుడు ధైర్యం చెప్పుకోవాలని అన్నారు. ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని హితవు పలికారు. అందరం ముఖానికి మాసు్కలు, చేతులకు బ్లౌజులు ధరించి ఈ కరోనా మహమ్మారి సమాజానికి సోకకుండా తరిమి కొడతామని నటుడు శింబు అన్నారు. చదవండి: హీరో విజయ్ రాజకీయ రంగప్రవేశం? -
శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజేందర్
హైదరాబాద్ : సంచలన నటుడు శింబు ఇంకా మోస్ట్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఈయనకు ప్లేబోయ్ ఇమేజ్ కూడా ఉంది. కెరీర్ ప్రారభంలో నయనతారతో కొన్నాళ్లు ప్రేమాయణం నెరిపాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకునేటప్పుడు మనస్పర్ధలతో విడిపోయారు. కొంతకాలానికి ఈ హీరో హన్సికను ప్రేమించాడు. కొన్నాళ్లకు ఆమెతో కూడా బ్రేకప్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరితోనూ ప్రేమలో పడలేదు. అయితే ఇటీవల శింబు వివాహంపై కోలివుడ్లో చర్చ జరుగుతోంది. లాక్డౌన్ అనంతరం శింబు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శింబు పెళ్లిపై ఆయన తల్లిదండ్రులు సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్, ఉషా రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. శింబు పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని నమ్మొద్దని అభిమానులను అభ్యర్థించారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. (చదవండి : జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది?) ‘శింబు పెళ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదు. శింబుకు సరిపోయే జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాం. అమ్మాయి కోసం వెతుకుతున్నాం. జాతకాలు కలిసే అమ్మాయి దొరికితే మేమే అందరికి తెలియజేస్తాం. అప్పటి వరకు వేచి చూడండి. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకండి’ అని శింబు తల్లిదండ్రులు ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా, శింబు పెళ్లిపై వస్తున్న రూమర్స్ కొత్తేమీ కాదు. 2019లో శింబు సోదరుడు కురళరసన్‌కు వివాహం జరిగినప్పుడు కూడా శింబు పెళ్లిపై వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. కాగా, తాజాగా శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. ‘కార్తీక్ డయల్ సేతాయన్’ పేరుతో విడుదలైన ఈ షార్ట్‌ఫిలిం నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. -
జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది?
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా కనిపించిన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ‘విన్నైతాండి వరువాయ’ పేరిట తమిళంలో విడుదలైన ఈ చిత్రంలో త్రిష, శింబులు కార్తీక్, జెస్సీలుగా నటించారు. తాజాగా శింబు- త్రిషలపై ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు గౌతమ్. ఈ షార్ట్ ఫిల్మ్‌లో శింబు, త్రిషకి కాల్ చేయడమే కథాంశం. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది సన్నివేశాలుగా చూపించారు. ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఎవరి ఇంట్లో వారుంటూ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఇక ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతాన్ని అందించడం మరో విశేషం. ‘కార్తీక్ డయల్ సేతాయన్’ పేరుతో విడుదలైన ఈ షార్ట్‌ఫిలిం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే తెలుగులో చైతూ, సామ్‌లతో ఈ విధంగానే ఓ షార్ట్ ఫిలిం చేస్తే బాగుంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. చదవండి: రానా నిశ్చితార్థం జరిగిపోయిందా? సినిమాలకు సడలింపులు ఇవ్వాలి -
‘కార్తీక్ మీ రచనలు చాలా అందంగా ఉంటాయి’
నాగ చైతన్య, సమంత కాంబినేషనన్లో 2010లో వచ్చిన ఏ మాయ చేశావే చిత్రం ఎంతటి మాయ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జెస్సీగా సమంత కుర్రకారు మదిని దోచింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కింది ఈ చిత్రం. తెలుగులో నాగ చైతన్య, సమంత మాయ చేస్తే.. తమిళంలో త్రిష-శింబు ప్రేక్షకుల మది దోచారు. ఈ చిత్రం పూర్తయ్యి ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యాయి. తాజాగా గౌతమ్ మీనన్ విన్నైతాండి వరువాయకి కొనసాగింపుగా కార్తీక్ డయల్ సేత్యా యెన్ షార్ట్ ఫిల్మ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్రిష, శింబులు ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించగా.. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.(శ్రీమతికో కేక్) లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు ఏవి జరగడం లేదు. దాంతో డైరక్టర్లు, రచయితలు కొత్త రచనలు చేస్తూ, షార్ట్ ఫిల్మ్‌లు తీస్తూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గౌతమ్ మీనన్ ఈ కార్తిక్ డయల్ సేత్యా యెన్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. అంతేకాక ఇటీవల షార్ట్ ఫిల్మ్ మేకర్స్ దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు.(చైతూకి 49, సమంతకు 51: సామ్ ట్వీట్!) ఈ టీజర్లో జెస్సీ(త్రిష), కార్తీక్(శింబు)ను ఉద్దేశించి ‘రాయండి.. మీ రచనలు చాలా అందంగా ఉంటాయి. అయితే బలవంతంగా ప్రయత్నించకండి. మీరొక ఆర్టిస్ట్.. ఏదైనా సహజంగానే జరగాలి. త్వరలోనే థియేటర్లు తెరుస్తారు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మిమ్మల్ని కలిసి తమ కోసం పని చేయమని కోరతాయి. వారికి కావాల్సింది మంచి రచనలు మాత్రమే. త్వరలోనే అంతా సర్టుకుంటుంది’ అంటూ సాగిన టీజర్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. విన్నైతాండి వరువాయి చిత్రంలో కార్తీక్ ఓ రచయిత అనే సంగతి తెలిసిందే. దాంతో లాక్డౌన్ గురించి చింతించకుండా కథలు రాయమని జెస్సీ, కార్తీక్‌ను ప్రేరేపిస్తుంది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ కోసం త్రిష, శింబుల పాత్రలను వారి ఇళ్లలోనే షూట్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ విడదల తేదీని ఇంకా ప్రకటించలేదు. -
విశాల్ స్థానంలో శింబు..!
విశాల్ నటించాల్సిన కొత్త చిత్రంలో సంచలన నటుడు శింబు నటించనున్నారనేది తాజా సమాచారం. విశాల్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండింటికీ ఆయనే నిర్మాత కావడం విశేషం. అందులో ఒకటి మిస్కిన్ దర్శకత్వంలో నటిస్తున్న తుప్పరివాలన్– 2. ఈ చిత్రం అధిక భాగం లండన్‌లో చిత్రీకరణ జరుపుకుంది. అయితే చిత్ర షూటింగ్ మధ్యలోనే విశాల్‌తో వివాదాలు తలెత్తడంతో దర్శకుడు మిస్కిన్ ఆ చిత్రం నుంచి వైదొలిగాడు. దీంతో ఆ చిత్రాన్ని తానే దర్శకత్వం చేస్తానని విశాల్ ప్రకటించాడు. వివాదానికి కారణం బడ్జెట్ పెరగడమే అని ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకున్నారు. కాగా, విశాల్ నటిస్తున్న మరో చిత్రం చక్ర. ఈ చిత్రం ద్వారా ఎమ్ఎస్ ఆనందన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రంలో విశాల్ కు జంటగా శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా నటిస్తున్నారు. ఈ క్రమంలో విశాల్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన కథ నచ్చడంతో నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర బడ్జెట్ పెరిగిపోవడంతో ఇప్పటికే రెండు చిత్రాలను నిర్మిస్తున్న విశాల్ ఈ చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆనంద్ శంకర్ దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని సెవంత్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. కాగా, ఈ చిత్రంలో హీరోగా నటుడు శింబును ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సమాచారం. శింబు ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సురేష్ కామాక్షి నిర్మిస్తున్న మానాడు చిత్రంలో నటిస్తున్నా డు. కాగా, మానాడు తర్వాత శింబు దర్శకుడు ఆనంద్ శంకర్ చిత్రంలో నటిస్తారని టాక్. -
అనుష్క.. శింబుతో సెట్ అవుతుందా?
కోలీవుడ్‌లో ఒక కొత్త క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. లిటిల్‌స్టార్ నుంచి క్రేజీ స్టార్ స్థాయికి ఎదిగిన ఈయన ఇటీవల నటనకు చిన్న గ్యాప్ తీసుకున్నారనే చెప్పాలి. ఈ గ్యాప్‌లో లండన్ వంటి విదేశాలు చుట్టొచ్చారు. అదేవిధంగా సమీప కాలంలో సరైన హిట్‌ను అందుకోలేదన్నది వాస్తవం. ఇక వివాదాలు ఈయనకు కొత్త కాదు. నయనతారతో ప్రేమ, నటి హన్సికతో పెళ్లి దాదాపు ఖయం అనుకున్న సమయంలో రివర్స్ అవడం శింబును సంచలన నటుడిగా మార్చాయని చెప్పవచ్చు. కాగా కోలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ అనిపించుకుంటున్న శింబు ప్రస్తుతం తన మాజీ ప్రియురాలు హన్సిక 50వ చిత్రంలో అతిథి పాత్రలో నటించి పూర్తి చేశారు. ప్రస్తుతం మానాడు చిత్రంలో నటిస్తున్నారు. (రాజ రాజ చోర’ అంటే దొంగలందరికీ రాజు లాంటివాడు అని అర్థం) ఇక అందాలతార అనుష్క గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అగ్రనటిగా రాణిస్తున్న ఈ స్వీటీ చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోందనిపిస్తోంది. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకే మొగ్గు చూపుతున్న అనుష్కను చివరిగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో అతిథి పాత్రలో చూశాం. కాగా ఈ బ్యూటీ నటించిన సైలెన్స్ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మాధవన్, నటి అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తరువాత చిత్రం ఏమిటన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఎందుకంటే అనుష్క ప్రేమలో పడిందని, త్వరలో పెళ్లి పీటలెక్కే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. కాగా ఈ అమ్మడు చాలా కాలం క్రితమే దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. అయితే ఆ తరువాత ఆ చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రస్తుతం నటుడిగా బిజీ అయ్యారు. అయితే దర్శకత్వానికి దూరం అవుతానని చెప్పలేదు. అంతేకాదు తదుపరి చిత్రానికి ప్రయత్నాలు మొదలెట్టారట. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో పే ర్కొంటూ విన్నైతాండి వరువాయా చిత్ర సీక్వెల్‌కు కథను రెడీ చేసినట్లు చెప్పారు. ఆయన దర్శకత్వంలో శింబు, త్రిష నటించిన విన్నైతాండి వరువాయా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. (శింబు సినిమాలో విలన్‌గా సుదీప్) అదే చిత్రం తెలుగులో నాగచెతన్య, సమంత నటించగా ఏం మాయ చేసావే పేరుతో విడుదలై అక్కడ అనూహ్య విజయాన్ని అందుకుని నటి సమంతకు కొత్త భవిష్యత్తును ఇచ్చింది. కాగా ఇప్పుడు విన్నైతాండి వరువాయా చిత్రానికి సీక్వెల్‌ను చేయడానికి గౌతమ్‌మీనన్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో నటుడు శింబును రిపీట్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే విధంగా ఆయనకు జంటగా నటి అనుష్క అయితే బాగంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇకపోతే శింబు, అనుష్క ఇంతకు ముందు ‘వానం’ చిత్రంలో నటించారన్నది గమనార్హం. -
శింబు సినిమాలో విలన్‌గా సుదీప్
ఇటివలే విడుదలైన సల్మాన్‌ఖాన్ దబాంగ్-3 సినిమాలో కన్నడ హీరో సుదీప్ విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సుదీప్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే సుదీప్ మరోసారి విలన్‌గా నటించనున్నాడు. కాకపోతే ఈసారి తమిళ్ సినిమాలో ఆ పాత్రను చేయనున్నాడు. వివరాల్లోకి వెళితే.. శింబు హీరోగా 'మానాడు' అనే సినిమా చేస్తున్నట్లు 2018లోనే వెంకట్ ప్రభు వెల్లడించారు. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న సురేశ్ కామట్జి, శింబుల మధ్య మనస్పర్థలు రావడంతో నిర్మాణ దశలోనే ఈ చిత్రం ఆగిపోయింది. శింబు తండ్రి, సినీ దర్శకుడు టి. రాజేందర్ జోక్యంతో ' మానాడు' సినిమాను చేస్తున్నట్లు వెంకట్ ప్రభు వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభిస్తున్నట్లు నిర్మాత సురేశ్ కామట్జి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్‌గా నటించాలని దబంగ్-3 షూటింగ్ సమయంలోనే సుదీప్‌ను అడిగామని ప్రొడ్యూసర్ సురేశ్ కామట్జి తెలిపారు. స్టోరీ విన్న సుదీప్ వెంటనే ఈ సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పొలిటికల్ బాక్డ్రాఫ్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మిగతా పాత్రలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. కాగా సుదీప్ గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' సినిమాలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. -
నటుడు శింబుపై నిర్మాత ఫిర్యాదు
చెన్నై,టీ.నగర్: నటుడు శింబుపై నిర్మాత ఒకరు నిర్మాతల కౌన్సిల్లో సోమవారం ఫిర్యాదు చేశారు. టీ.రాజేందర్ కుమారుడు శింబు. కథానాయకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా బహుముఖంగా రాణిస్తున్నారు. అలాగే, అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కెట్టవన్, మన్మథన్, ఏఏఏ అనే పలు చిత్రాల గురించి శింబుపై అనేక ఫిర్యాదులందాయి. ఇతనికి రెడ్‌కార్డ్ సయితం ఇచ్చేందుకు నిర్మాతల సంఘం నుంచి నిర్ణయం తీసుకున్నారు. సింబు నటిస్తున్న కన్నడ మఫ్టీ చిత్రం రీమేక్ ప్రస్తుతం విడిచిపెట్టబడింది. దీనిద్వారా గత రెండేళ్లలో శింబుకు మూడో చిత్రం నిలిచిపోయింది. ఖాన్, మానాడు చిత్రాల కోవలో ఈ చిత్రం కూడా డ్రాప్ అయింది. కన్నడ చిత్రమైన మఫ్టీ రీమేక్ చేస్తున్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. అందులో శింబు సక్రమంగా షూటింగ్‌కు రాలేదని, దీంతో చిత్ర నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు. మిగతా నటీనటుల షూటింగ్‌కు అంతరాయం కలిగిందని, వీరికి అనవసరంగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. మొదటి పదిరోజుల షూటింగే జరగలేదని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. -
రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో
ఒక చిత్రం మిస్ అయితే స్టార్ హీరోలు పెద్దగా పట్టించుకోరు. అదిపోతే మరొకటి వస్తుందనే ధీమా వారికి ఉంటుంది. ఇక సంచలన నటుడు శింబు అయితే అస్సలు కేర్ చేయరు. ఎందుకంటే శింబులో కేవలం నటుడే మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత, రచయిత కూడా. అలాంటి నటుడు తనే సొంతంగా చిత్రం చేసి తానేంటో నిరూపించుకోగలడు. ప్రస్తుతం శింబు అదే చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో సురేష్ కామాక్షి నిర్మించతలపెట్టిన ‘మానాడు’ అనే చిత్రంలో నటించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగింది. మధ్యలో ఆగిపోయిందనే ప్రచారం జరగడంతో నిర్మాత సురేష్ కామాక్షీ మానాడు చిత్రం ఆగిపోలేదు, షూటింగ్ జరుగుతోందని వివరణ ఇచ్చారు. అలాంటిది ఇటీవల సడన్‌గా అనివార్యకారణాల వల్ల శింబుతో మానాడు చిత్రం చేయడం లేదని ప్రకటించారు. అయితే వేరే నటుడితో మానాడు చిత్రం ఉంటుందని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే ఆ వెంటనే శింబు అభిమానులను ఖుషీ చేసే వార్త వెలువడింది. ఎప్పుడైతే మానాడు నుంచి శింబును తొలగించిన వార్త ప్రచారం అయిందో ఆ వెంటనే శింబు తండ్రి టి.రాజేందర్ స్పందించారు. మానాడు పోతేనేం శింబు ‘మహా మానాడు’తో వస్తున్నాడు అని వెల్లడించి షాక్ ఇచ్చారు. అవును శింబు హీరోగా మహా మానాడు చిత్రం తెరకెక్కనుందని, ఆ చిత్రాన్నిశింబునే స్వీయ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిపారు. ఇటీవల కుటుంబంతో సహా విదేశీ పర్యటన చేసినట్లు, ఆ సమయంలో మహా మానాడు చిత్ర కథ గురించి చర్చించినట్లు టి.రాజేందర్ చెప్పినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని రూ.125 కోట్ల భారీ బడ్జెట్లో తమిళంతో పాటు ఐదు భాషలో రూపొందించనున్నట్లు సమాచారం. -
‘మానాడు’కు సిద్ధమవుతున్న శింబు
నటుడు శింబు మానాడు చిత్రానికి రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్ తరువాత మణిరత్నం చిత్రం సెక్క సివంద వానం సక్సెస్‌తో ఖుషీగా ఉన్న శింబును ఆ తరువాత సుందర్.సీ దర్శకత్వంలో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం నిరాశ పరిచింది. కాగా అప్పటికే వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు చిత్రంలో నటించనున్నట్లు ప్రకటను వెలువడింది. అయితే ఈ చిత్రం ఆగిపోయిందనే ప్రచారం హోరెత్తింది. దీంతో చిత్ర నిర్మాత సురేశ్ కామాక్షి మానాడు ఆగిపోలేదని, రూపొందుతుందని స్పష్టం చేశారు. సినిమా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో అసలు మానాడు చిత్రం ఉంటుందా? అనే అనుమానాలు కోలీవుడ్‌లో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా సెట్‌కు వెళ్లనుందనే సమాచారం తెలిసింది. ప్రస్తుతం శింబు నటి హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న 50వ చిత్రం మహాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. వాలు చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ శింబు, హన్సిక ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఈ జంట ఇప్పుడు మహా చిత్రంలో కలిసి నటించడం విశేషం. ప్రస్తుతం మహా చిత్ర షూటింగ్ జరుగుతోంది. శింబు, హన్సికల ప్రేమ సన్నివేశాలను దర్శకుడు జమీల్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో శింబు పైలెట్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ నెలాఖరున మానాడు చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో శింబుకు జంటగా నటి కల్యాణి ప్రియదర్శన్ నటించనున్నారు. కాగా మరో ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు భారతీరాజా నటించనున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
షూటింగ్లో మాజీ ప్రేమజంట
నటి నయనతారను డీప్‌గా ప్రేమించిన నటుడు శింబు ఆ తరువాత అంతగా ప్రేమించిందెవరన్నా ఉన్నారంటే అది నటి హన్సికనే. అయితే విధో మరేదో అడ్డుపడిందో గానీ శింబుతో ఈ భామలిద్దరి ప్రేమా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా హన్సికతో శింబు పెళ్లి, చర్చలు వరకూ వచ్చి ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే వీరి పెళ్లికి శింబు తండ్రి, దర్శక, నటుడు టి.రాజేందర్ కూడా పచ్చజెండా ఊపారు. అయినా ఏ కనిపించని హస్తం అడ్డుపడిందో శింబు, హన్సికల పెళ్లి కథ పీటల వరకూ సాగలేదు. దీంతో తాజాగా నటుడు శింబును తనకు ప్రియుడిని చేయమని నటి హన్సిక దర్శకుడు జమీల్‌ను కోరిందట. ఆయన సరే అని శింబును ఆమెకు ప్రియుడిని చేసేశారు. అయితే ఇది రియల్ జీవితంలో కాదు సుమా.. రీల్లో లైఫ్‌లోనే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న నటి హన్సిక ప్రస్తుతం మహా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈ అమ్మడు నటిస్తున్న తొలి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం. అంతే కాదు హన్సిక అర్ధసెంచరీ చిత్రం కూడా కావడం విశేషం. జమీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్లలో వివాదాల్లో మునిగిపోయింది. తాజాగా ఈ చిత్రంలో సంచలన నటుడు శింబు చోటు చేసుకోవడంతో ఇంకా హైప్‌ను పెంచేసుకుంది. ఎందుకంటే రియల్ లైఫ్‌లో మాజీ ప్రేమజంట రీల్ లైఫ్‌లో ప్రేమికులుగా కనిపించబోతుండడమే. అవును మహా చిత్రంలో శింబు అతిథి పాత్రలో హన్సికకు ప్రియుడిగా మెరవనున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే మహా చిత్రంలో తనకు ప్రియుడి పాత్రలో శింబును నటించడానికి ఒప్పించమని నటి హన్సికనే దర్శకుడికి చెప్పారట. శింబు కూడా పెద్ద మనసుతో తన మాజీ ప్రియురాలితో మహా చిత్రంలో ప్రియుడిగా నటించడానికి సమ్మతించేశారు. ఈ చిత్రంలో శింబు 30 నుంచి 45 నిమిషాల పాటు కనిపిస్తాడని సమాచారం. ఇటీవలే మహా చిత్రం షూటింగ్లో శింబు పాల్గొన్నాడు. మరో విషయం ఏమిటంటే చెప్పిన సమయానికి షూటింగ్‌కు రాడనే అపవాదును మూట కట్టుకున్న నటుడు శింబు. అలాంటిది మహా చిత్రం విషయంలో మాత్రం చెప్పిన సమయానికి రెండు గంటల ముందే స్పాట్లో ఉంటున్నాడట. గతాన్ని మరచిపోయి శింబు, హన్సిక స్నేహంగా ఉంటున్నారట. షూటింగ్లో ఇద్దరూ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని టాక్. ఈ సంచలన జంట నటన చాలా ఇంప్రెస్ చేస్తోందని చిత్ర వర్గాలంటున్నారు. మొత్తం మీద మహా చిత్ర వ్యాపారానికి శింబు, హన్సిక జంట బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. -
ఆ జంట మళ్లీ కలుస్తారా?
చెన్నై: సినీరంగంలో ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా రాజకీయాల్లోనూ, సినీరంగంలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాట ఉండనే ఉంది. అలా ఒక సంచలన జంటను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. అసలు విషయం ఏమంటంటే మన్నన్ చిత్రాన్ని ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోవడం జరగదు. కారణం సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. అందులో అప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కథానాయకిగా రజనీకాంత్‌ను ఢీకొనే పాత్రలో నటించారు. ఇక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి పి.వాసు దర్శకుడు. ఇప్పుడీ చిత్రాన్ని రీమేక్ చేయాలని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్ణయించుకుంది. మన్నన్ రీమేక్‌లో రజనీకాంత్ పాత్రల్లో సంచలన నటుడు శింబును, విజయశాంతి పాత్రలో నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. మన్నన్ చిత్రంలో రజనీకాంత్, గౌండ్రమణిల కామెడీ ప్రేక్షకులను రంజింపజేసినా, నటి విజయశాంతి లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్, తనదైన నటనా ఆ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయన్నది వాస్తవం. అందుకే ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయనతారను ఆ పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక రజనీకాంత్ పాత్రలో శింబును ఎంపిక చేయాలనుకోవడానికి కారణం ఆయన నటనా వేగం, నయనతారతో గతంలో ప్రేమ లాంటి అంశాలు చిత్రానికి మంచి పబ్లిసిటీ బూస్ట్నిస్తాయన్న భావన కావచ్చు. ఈ సంచలన జంట మళ్లీ కలిసి నటించడానికి అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ఇక్కడ ఏదైనా జరగవచ్చుననే టాక్ వినిపిస్తోంది. శింబు, హన్సికల మధ్య ప్రేమ కూడా పెళ్లి వరకూ వచ్చి నిలిచిపోయింది. అలాంటిది వారిద్దరూ కలిసి మహా చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో నటించి మెరవబోతుండడంలా! నటన అన్నది వృత్తి కాబట్టి శింబు, నయనతార కూడా నటించే అవకాశం ఉంటుందంటున్నారు సినీ వర్గాలు. ఈ జంట గనుక మళ్లీ జత కడితే ఆ చిత్రంపై అంచనాలేవేరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే మన్నన్ చిత్ర పునర్నిర్మాణం గురించి చాలా కాలంగానే చర్చలు జరుగుతున్నా సెట్‌పైకి వెళ్లలేదు.కారణం మిస్టర్‌లోకల్ చిత్రమేనట. ఇది వినోదభరిత కథా చిత్రమే అయినా ఇంచుమించు మన్నన్ చిత్ర కాన్సెప్టేనని టాక్ రావడంతో ఆ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల వరకూ వేచి చూసే ధోరణిలో శివాజీ ప్రొడక్షన్స్ అధినేతలు ఉన్నారట. మొత్తంమీద మన్నన్ చిత్ర రీమేక్‌పై మరి కొద్దిరోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట. -
శింబు తమ్ముడి పెళ్లయింది..
పెరంబూరు: సంచలన నటుడు శింబు ఇంకా మోస్ట్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఆయన సోదరుడు మాత్రం పెళ్లి చేసేసుకున్నాడు. సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్ రెండవ కుమారుడు కురళరసన్‌కు శుక్రవారం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఓ ఇంటి వాడయ్యాడు. బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఇతడు ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించాడు. శింబు, నయనతార జంటగా నటించిన ఇదునమ్మ ఆళు చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం అయ్యాడు కూడా. కాగా కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమించడం, వివాహానికి తల్లిదండ్రులు పచ్చజెండా ఊపడంతో అతను ఇటీవల ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. శుక్రవారం కురళరసన్, తన ప్రేమించిన నబీలా అహ్మదును ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. స్థానిక అన్నాశాలైలోని మసీదులో జరిగిన ఈ వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు మత గురువులు మాత్రమే పాల్గొన్నారు. తమ్ముడు పెళ్లి కోసం లండన్‌లో ఉన్న శింబు చెన్నైకి వచ్చాడు. ఈ నవ వధూవరుల వివాహ రిసెప్షన్‌ను టీ.రాజేందర్ ఈ నెల 29న చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. -
క్రేజీ కాంబినేషన్ కుదిరింది
తమిళసినిమా: సంచలన నటుడు శింబు, యువ నటుడు గౌతమ్ కార్తీక్‌ల రేర్ కాంబినేషన్లో చిత్రం సెట్ అయ్యిందన్నది తాజా సమాచారం. నటుడు శింబు త్వరలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు చిత్రంలో నటించనున్నారు. దీన్ని వీ హౌస్ క్రియేషన్స్ పతాకంపై సురేశ్‌కామాక్ష్మి నిర్మిస్తున్నారు. దీని తరువాత మరో క్రేజీ చిత్రానికి శింబు పచ్చజెండా ఊపారు. దీన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మించబోతున్నారు. ఇందులో శిం బుతో కలిసి యువ నటుడు గౌతమ్‌కార్తీక్ మరో హీరోగా నటించనున్నారు. దీన్ని నార్దన్ అనే దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఆయన ఇంతకు ముందు కన్నడంలో మఫ్టీ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది శింబుకు 45వ చిత్రం అవుతుంది. అదే విధంగా స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తున్న 20వ చిత్రం ఇది. నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా ఈ వివరాలను ట్విట్టర్లో పేర్కొన్నారు. సంచలన నటుడు శింబు హీరోగా చిత్రం చేయనుండడం సంతోషంగా ఉందన్నారు. ఇది భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని అని చెప్పారు. ఈ చిత్రానికి మదన్ కార్గీ పాటలు, మాటలను అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గౌతమ్‌కార్తీక్ హీరోగా కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మించిన దేవరాట్టం చిత్రం మే ఒకటవ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. -
శింబుతో సెట్ అవుతుందా?
నటుడు శింబుతో నటి కల్యాణి ప్రియదర్శన్‌కు సెట్ అవుతుందా? ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తిగా మారిన విషయం ఇదే. శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలనాలకు కేరాఫ్ ఈ పేరు. జయాపజయాల విషయాన్ని పక్కన పెడితే ఈయన చిత్రాలంటేనే సంచలనం అవుతాయి. అలాంటి శింబు తాజాగా మానాడు అనే చిత్రంలో నటించబోతున్నారు. దీన్ని వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాక్షి నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రకటన చేసి చాలా కాలమైంది. అంతేకాదు ఆ తరువాత మానాడు ఆగిపోయిందనే ప్రచారం హల్చల్ చేసింది. అయితే అవన్నీ వదంతులని చిత్ర వర్గాలు ఖండించారనుకోండి. మానాడు చిత్రం నిర్మాణం అవుతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇందులో శింబుకు జంటగా నటి కల్యాణి ప్రియదర్శన్‌ని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని తాజా సమాచారం. 2013లోనే ప్రొడక్షన్స్ డిజైనర్ శాఖలో చేరిన ఈ బ్యూటీ ఆ తరువాత ఇరుముగన్ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ పని చేసింది. ఆ తరువాత తెలుగులో హలో చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ తరువాత మలయాళంలో, ఇటీవల తమిళంలోనూ పరిచయమైంది. అయితే మలయాళం, తెలుగులో నటించిన తొలి చిత్రాలు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్‌లో మాత్రం వాన్ అనే చిత్రం నిర్మాణంలో ఉంది. అదేవిధంగా శివకార్తికేయన్‌కు జంటగా హీరో చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు కోలీవుడ్‌లో శింబుకు జంటగా నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇతర నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇక్కడ ఒక్క చిత్రం కూడా విడుదల కాకుండానే మూడు చిత్రాలను దక్కించుకున్న ఈ మలయాళీ బ్యూటీ ఏ మాత్రం నిలదొక్కుకుంటుందో చూడాలి. త్వరలోనే మానాడు చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని నిర్మాత సురేశ్‌కామాక్షి తెలిపారు. -
మాజీ ప్రియుడితో హన్సిక
తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హన్సిక తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు తరుచూ వివాదాలతోనూ వార్తల్లో కనిపించే ఈ బ్యూటీ తాజా మరోసారి ఆసక్తికర వార్తలో హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ప్రస్తుతం హన్సిక తన 50వ చిత్రంగా నటిస్తున్న మహా సినిమా కూడా తరుచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు కోలీవుడ్ స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని హన్సిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘న్యూస్ అనుకున్న సమయం కన్నా ముందే లీకైంది. నేను, శింబు ‘మహా’లో కలిసి నటిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది హన్సిక. ఇప్పటికే పోస్టర్ల వివాదంతో మంచి పబ్లిసిటీ సాధించిన ఈ సినిమా ఇప్పుడు శింబు, హన్సికల క్రేజీ కాంబినేషన్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. Since the buzz is crazy and the news is leaked out way before time. Me and #STR are back in #MAHA 😊 pic.twitter.com/98WWdOg3Bu — Hansika (@ihansika) 6 March 2019 -
ఆయన నా లైఫ్‌లో ఉండాలి : ఓవియా
తమిళ బిగ్‌బాస్ షో తో ఫేమస్ అయిన ఓవియా.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 90ఎమ్ఎల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో ఓవియా బోల్డ్‌గా నటించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఓవియా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. హీరో శింబుతో కలిసి ఓవియా గతకొంతకాలంగా సన్నిహితంగా ఉంటోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందిస్తూ.. ‘స్నేహానికి .. ప్రేమకి మధ్య చాలా తేడా వుంది. శింబు మంచి స్నేహితుడు .. నా వ్యక్తిగత విషయాలను నేను తనతో షేర్ చేసుకుంటాను. ఆయన సలహాలు .. సూచనలు తీసుకుంటాను. ఏ సాయం కోసమైనా .. ఏ సమయంలోనైనా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేంత చనువు వుంది. ఎదుటివారి కష్ట సుఖాలను అర్థం చేసుకోగల మంచి మనసు శింబుకి వుంది. ఎదుటివారి సమస్యలకి తగిన పరిష్కారాలు సూచించగలగడంలో ఆయన ముందుటాడు. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండాలనే నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
జెస్సీతో మళ్లీ జత కుదిరేనా?
సాక్షి, తమిళ సినిమా: తమిళంలో జెస్సీ-కార్తీక్ కాంబినేషన్ మళ్లీ కుదరబోతుందా? అంటే కోలీవుడ్ నుంచి ఔననే సమాధానం వినిపిస్తోంది. గౌతం మీనన్ తెరకెక్కించిన ‘విన్నైతాండి వరువాయా’ (తెలుగులో ‘ఏ మాయ చేశావె) సినిమాలో జెస్సీగా త్రిష మెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగులో జెస్సీ పాత్రతో సమంత అరంగేట్రం చేస్తే.. తమిళంలో జెస్సీగా తన కెరీర్లో ఒక మైలురాయిని త్రిష సొంతం చేసుకుంది. తమిళంలో త్రిషకు జంటగా శింబు నటించాడు. వీరు జోడీగా నటించిన ‘విన్నైతాండి వరువాయా’ చిత్రం ఒక ఫీల్ లవ్ స్టోరీగా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు విన్నైతాండి వరువాయా జంటను మరోసారి తెరపై చూపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. మణిరత్నం తాజా ‘చిత్రం సెక్క సివంద వానం’ శింబుకు నూతనోత్సాహానివ్వగా, ఆ తర్వాత వచ్చిన ‘వందారాజా వాదాన్ వరువేన్’ (అత్తారింటికి దారిదే రీమేక్) నిరాశ పరిచిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే చిత్రంలో శింబు నటించబోతున్నారు. ఇందులో ఆయనకు జంటగా లక్కీ భామ రాశీఖన్నా నటించనున్నట్లు ప్రచారంలో ఉన్నా.. త్రిష అయితే బాగుంటుందని శింబు చెప్పడంతో దర్శకుడు వెంకట్‌ప్రభు ఆమెను నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నారని తెలిసింది. శింబు, త్రిష చిరకాల స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ జంట ఇప్పటికే అలై, విన్నైతాండి వరువాయా చిత్రాల్లో జోడీగా నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మానాడు సినిమాలో శింబు, త్రిష కలిసి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మతం మార్చుకున్న టాప్ హీరో సోదరుడు
సాక్షి, చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో శింబు సోదరుడు కురళరసన్ తాజాగా మతం మార్చుకున్నారు. ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. శింబుతోపాటు బాలనటుడిగా కురళరసన్ పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించి శింబు, నయనతార జంటగా నటించిన ‘ఇదునమ్మ ఆలు’ చిత్రంతో సంగీతదర్శకుడిగా మారారు. ఆయన తండ్రి సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు టీ. రాజేందర్.. ఆయన ఏ మతమైన సమ్మతమే అంటారు. ఇక, ఆయన పెద్ద కొడుకు శింబు శివభక్తుడు. కూతురు ఇలఖ్య ఆ మధ్య క్రైస్తవ మతంలోకి మారి పెళ్లి చేసుకున్నారు. తాజాగా కురళరసన్ ఇస్లాం మతం స్వీకరించారు. ఆయన శుక్రవారం చెన్నై, అన్నాశాలైలోని మక్కా మసీదులోని ముస్లిం మత గురువుల సమక్షంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కురళరసన్ తల్లిదండ్రులు టీ.రాజేందర్, ఉషా హాజయ్యారు. టీ.రాజేందర్ మాట్లాడుతూ కురళరసన్ చిన్నతనంలోనే ఇస్లాం మతం వైపు ఆకర్షితుడయ్యాడని, తనకు అన్ని మతాలు సమ్మతం కావడంతో తన ఇష్టాన్ని గౌరవించినట్లు తెలిపారు. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్‌రాజా ఇప్పటికే ఇస్లాం మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కురళరసన్ ఆ కోవలో చేరారు. అయితే కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమిస్తున్నారని, ఆమెను పెళ్లి చేసుకోవడానికే తను మతం మారారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. -
దొంగల పాలు
చైన్ స్నాచర్ల గురించి విన్నాం గానీ పాల క్యాన్ల స్నాచర్ల గురించి విన్నామా? తమిళనాడులో పాలక్యాన్ల దొంగలు ఇటీవల పెరిగిపోయారని అక్కడి పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు చెన్నై పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీని వెనుక మన తెలుగువారి పాత్ర కూడా ఉందని తెలిస్తే అంతగా కంగారు పడాల్సిన పని లేదు. తెలుగులో పెద్ద విజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తమిళంలో సింబు హీరోగా సి.సుందర్ (కుష్బూ భర్త) దర్శకత్వంలో ‘వందా రాజావతన్ వరువన్’గా రీమేక్ అయ్యింది. ఫిబ్రవరి 1న విడుదల. ఈ సందర్భంగా హీరో సింబు ఒక వీడియో విడుదల చేస్తూ ‘బాగా ఆర్భాటం చేయండి. పాలతో నా కటౌట్లు అభిషేకం చేయండి’ అని అభిమానులకు పిలుపు ఇచ్చాడు. దానిపై ట్రోలింగ్ జరిగింది. ‘సింబుకు అంత సీన్ లేదు. అంత పాలుబోసేంత ఫ్యాన్లు లేరు’ అని వేరే హీరోల అభిమానులు కామెంట్ చేశారు. దాంతో సింబు మరో వీడియో విడుదల చేసి ‘రెచ్చిపోండి... భారీ క్యాన్లతో నా కటౌట్లకు పాలాభిషేకం చేయండి’ అని పిలుపు ఇచ్చాడు. ఇది అభిమానులను తప్పుదారి పట్టించేలా ఉందని కొందరు మండిపడ్డారు. ఈలోపు ఈ తతంగం కోసమే అన్నట్టు తమిళనాడులో పాలతో వస్తున్న వాహనాలలోని క్యాన్లు మాయం కావడం మొదలెట్టాయి. వ్యవహారం ముదిరిపోయేసరికి సింబు నాలుకా పెదాలు రెండూ కరుచుకుని ‘నేను చెప్పింది పాలాభిషేకం చేయమని కాదు. అక్కర ఉన్న పిల్లలకు పాలు పంచమని’ అని కొత్త వీడియో రిలీజ్ చేసి తప్పు నుంచి తప్పించుకున్నాడు. అయితే ఈ సందర్భంగా ఈ శ్రుతి మించిన అభిమానం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో పాలాభిషేకానికి తెర తీసిన రజనీకాంత్ అభిమానులు ఈ ట్రెండ్‌ను పెంచి పోషించారని ఆలోచనాపరులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో వేలకొద్ది పసిపిల్లలు తగినన్ని పాలులేక బాధ పడుతుంటే కటౌట్ల మీద పాలుబోసి వృ«థా చేయడం అన్యాయమని అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల, పెరుగుతున్న వేడి వల్ల, నీటివసతి, గడ్డి వసతి కరువై సరైన ఆహారం లేక పశువులు ఇచ్చే పాల శాతం రాను రాను తగ్గుతూ పాల ధర పెరుగుతోందని ఒక పరిశీలన. మరోవైపు మనదేశంలో పిల్లల కోసం ఉపయోగించే పాల కన్నా క్రతువుల్లో వాడే పాలు అధికం. దానికితోడు వెర్రి అభిమానం వల్ల కూడా పాలు వృ«థా అవుతున్నాయి. సినిమా రిలీజ్ అవుతుందంటే ఇళ్ల ముందరి పాల ప్యాకెట్లు మాయమవుతున్నాయంటే మన కుర్రకారు ఏ స్థాయిలో ఉన్నట్టు? -
నాకున్న ఇద్దరు, ముగ్గురి ఫ్యాన్లకే చెబుతున్నా : స్టార్ హీరో
-
పెరియార్‌కుత్తుకు చిందేసిన శింబు
సంచలనం, కలకలం, వివాదం, అంతకు మించి ప్రతిభ ఇవన్నీ కలిస్తే శింబు. ఈ యువ నటుడు పాడినా, మాట్లాడినా, ఆడినా వార్తే. అలా శింబు ఎప్పుడూ ప్రత్యేకమే. శింబు షూటింగ్‌కు సరిగా రారు, నిర్మాతలను ఇబ్బంది పెడతారు, దర్శకులతో గొడవ పడతారు లాంటి ఆరోపణలూ ఉన్నాయి. ఆ మధ్య విజయాలకు దూరమై విమర్శలకు బాగా దగ్గరైన శింబుపై రెడ్ కార్డ్ పడనుందనే దుమారం వరకూ పరిస్థితులను తెచ్చుకున్న నటుడు శింబు. ఇక ఆ మధ్య బీప్ పాటతో పోలీసులకు ఫిర్యాదు, కేసులు, కోర్టులు వరకూ వెళ్లారు. అలాంటివి తగ్గి ఇటీవల నటించిన సెక్క సివంద వానం చిత్ర విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శింబు నటుడిగా బిజీ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం వందా రాజాదాన్ వరువేన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. చేతిలో చాలా అవకాశాలు ఉన్నాయి కూడా. ఇలాంటి సమయంలో పెరియార్ కుత్తు అనే ప్రైవేట్ ఆల్బ మ్తో మరోసారి సంచలనానికి రెడీ అయ్యారు. తమిళనాడులో పెరియార్‌కు చాలా ఉన్నత భావాలు కలిగిన రాజకీయ సామాజిక వాది అనే పేరు ఉంది. అలాంటి నాయకుడి పేరుకు కుత్తు (ఐటమ్ సాంగ్‌కు కుత్తు పదాన్ని వాడతారు) పదం చేర్చి శింబు పాడి, ఆడిన పాటతో కూడిన ఆడియోను శుక్రవారం యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. జాతి, మత వివక్షతను ఎండగట్టేలా సాగే ఆ పాటకు నటుడు శింబు నల్లషర్టు, ప్యాంటు ధరించి గ్రాఫిక్స్‌తో రూపొందించిన పెరియార్ శిల వద్ద ఐటమ్ సాంగ్ మాదిరి చిందులేస్తూ నటించడం విశేషం. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ దుమ్మురేపుతోంది. మరి ఈ వీడియోను ఎవరు ఏ విధంగా కెలికి వివాదంగా తెరపైకి తీసుకొచ్చారో చూడాలి. -
జీవాతో జత కుదిరింది!
జీవాతో నటి మంజిమామోహన్‌కు జత కుదిరింది. ‘అచ్చం ఎంబదు మడమయడా’ చిత్రంలో శింబుతో కలిసి కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ బ్యూటీ మంజిమామోహన్. ఈ తరువాత రెండు మూడు చిత్రాల్లో నటించినా ఈ అమ్మడి కెరీర్ ఇక్కడ వేగం పుంజుకోలేదనే చెప్పాలి. అయితే మాతృభాషతో పాటు తెలుగు వంటి ఇతర భాషల్లోనూ నటిస్తున్న మంజిమామోహన్ తాజాగా ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. యువ నటులు జీవా, అరుళ్‌నిధి కలిసి నటించనున్న చిత్రంలో ఈ బ్యూటీ నటించనుంది. దీనికి రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై నటుడు జిత్తన్ రమేశ్ నిర్మించనున్నారు. ఈ క్రేజీ చిత్రం గురించి ఆయన తెలుపుతూ మాప్పిళై సింగం చిత్ర ఫేమ్ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇది స్నేహం ఇతివృత్తంగా తెర పై ఆవిష్కరించనున్న కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు తమ సంస్థలో విజయ్ హీరోగా స్నేహం నేపథ్యంలో ఫ్రెండ్స్ చిత్రాన్ని నిర్మించామని, ఇది ఆ తరహాలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో జీవాకు జంటగా నటి మంజిమామోహన్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అరుళ్‌నిధి సరసన నటించే నటి ఎంపిక జరుగుతోందని అన్నారు. చిత్రాన్ని డిసెంబర్ 13న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందులో మీరు కూడా నటిస్తున్నారా అన్న ప్రశ్నకు తాను ప్రొడక్షన్‌నే చూసుకుంటున్నానని చెప్పారు. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, అభినందన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. కాగా ప్రస్తుతం జీవా గొరిల్లా, జిప్సీ చిత్రాలను పూర్తి చేసి కీ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా అరుళ్‌నిధి పుహళేంది ఉనుమ్ నాన్ చిత్రంతో పాటు భారత్ నీలకంఠన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తున్నారు. ఇక నటి మంజిమామోహన్ దేవరాట్టం చిత్రంలో నటిస్తోంది. -
మణి సినిమాలో మహేష్ లేనట్టే..!
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం గతంలో గట్టిగా వినిపించింది. కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తమిళ్ స్టార్ హీరో విజయ్, మహేష్ బాబుల కాంబినేషన్లో భారీ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేశారు మణిరత్నం. మహేష్ కూడా చాలా సందర్భాంలో మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తానంటూ ప్రకటించటంతో త్వరలోనే సినిమా పట్టాలెక్కుతుందని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ సెట్ కాకపోవటంతో మణి, మహేష్‌లు ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయారు. అయితే తాజాగా మణిరత్నం మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ కు ప్రయత్నాలు ప్రారంభించారట. కానీ ఈ సారి మహేష్ బాబును ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించే అవకాశం లేదని తెలుస్తోంది. తమిళ హీరోలతోనే సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట మణి. విజయ్‌తో పాటు శింబు, విక్రమ్లత ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనల్చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి సమచారం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
భారతీయుడితో శింబు, దుల్కర్..!
లోక నాయకుడు కమల్ హాసన్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. ఇండియన్ పేరుతో హిందీలోనూ సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత శంకర్, కమల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌ను రెడీ చేస్తున్నాడు శంకర్. ఇప్పటికే కమల్ తో పాటు హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో కమల్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో పాటు నయా సెన్సేషన్ దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నాడట. ప్రస్తుతానికి శింబు, దుల్కర్ పాత్రలపై అధికారిక ప్రకటన రాకపోయినా భారతీయుడు 2లో ఈ స్టార్స్ కనిపించటం దాదాపుగా కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలకు బాలీవుడు స్టార్ హీరో అజయ్ దేవగన్‌ను సంప్రదిస్తున్నారు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. -
హీరో శింబుకు హైకోర్టు వార్నింగ్
సాక్షి, చెన్నై: తీసుకున్న అడ్వాన్స్‌ను వడ్డీ సహా తిరిగి చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయనున్నట్లు నటుడు శింబును మద్రాసు హైకోర్టు మరోసారి హెచ్చరించింది. వివరాల్లోకెళితే.. సంచలన నటుడు శింబు చాలా కాలం తరువాత మణిరత్నం చిత్రం సెక్క సివంద వారం చిత్రంతో సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఈయన సుందర్.సీ దర్శకత్వంలో తెలుగు చిత్రం అత్తారింటికి దారేది రీమేక్‌లో నటిస్తున్నారు. ఈయన 2013లో అరసన్ అనే చిత్రంలో నటించడానికి ష్యాషన్ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాత నుంచి రూ.50 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. అయితే ఆ చిత్రానికి ఇంత వరకూ కాల్షీట్స్ కేటాయించకపోవడంతో ఆ నిర్మాతలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గత నెలలో విచారించిన న్యాయస్థానం నటుడు శింబు ఫ్యాషన్ మూవీ మేకర్స్ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, ఆ మొత్తాన్ని ఎప్పుడు చెల్లించేది తెలియజేయడానికి నాలుగువారాలు గడువు ఇస్తున్నట్లు పేర్కొంటూ, ఆ గడువు లోగా తెలియజేయకుంటే నటుడు శింబుకు చెందిన కారు, ఫోన్ వంటి వస్తువులను జప్తు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే న్యాయస్ధానం హెచ్చరికలకు శింబు తరఫు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. విచారణ అనంతరం న్యాయమూర్తి నటుడు శింబు అరసన్ చిత్ర నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను వడ్డీ సహా రూ. 85 లక్షలు తిరిగి చెల్లించాల్సిందేనని ఆ మొత్తాన్ని ఎప్పుడు చెల్లించేది ఈ నెల 31లోగా వెల్లడించాలని ఆదేశించారు. లేని పక్షంలో నటుడు శింబు ఆస్తులను జప్తు చేయనున్నట్లు హెచ్చరించారు. గత ఉత్తర్వుల్లో శింబుకు సంబంధించిన వస్తువులను జప్తు చేస్తామని హెచ్చరించిన న్యాయస్థానం, తాజాగా ఆయన ఆస్తులను జప్తు చేయనున్నట్లు హెచ్చరించడం గమనార్హం. -
వెర్రి అభిమానంతో.. అభిమాని అత్యుత్సాహం!
-
వెర్రి అభిమానం.. క్రేన్‌కు వేళాడుతూ..!
కొన్నిసార్లు అభిమానులు చేసే పనులు సినీ తారలను ఇబ్బందుల పాలు చేస్తాయి. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో అభిమానుల అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాట చెక్క చివంత వానం పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాలో శింబు కీలక పాత్రలో నటించాడు. చాలా రోజులుగా ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న శింబు ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఓ అభిమాని అత్యుత్సాహంతో చేసిన పని విమర్శలకు కారణమైంది. శరీరానికి సీకులు కుచ్చుకొని క్రేన్‌కు వేళాడుతూ దాదాపు 25 అడుగుల ఎత్తున్న శింబు కటౌట్‌కు పాలాభిషేకం చేశాడు అభిమాని. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. -
మణిరత్నం.. ‘నవాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : నవాబ్ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ తదితరులు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : మణిరత్నం నిర్మాత : మణిరత్నం, ఏ సుధాకరన్ లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నారు. ఓకె బంగారం సినిమాతో ఆకట్టుకున్నా తరువాత చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచారు. అయితే రిజల్ట్‌తో సంబంధం లేకుండా మణి సినిమాలపై క్రేజ్ మాత్రం అలాగే ఉంది. అందుకే నవాబ్ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను మణిరత్నం అందుకున్నారు..? రొమాంటిక్ జానరను పక్కన పెట్టి తన పాత స్టైల్ క్రైమ్ థ్రిల్లర్‌తో సక్సెస్ సాధించారా..? కథ ; భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) సమాంతర ప్రభుత్వంగా ఎదిగిన మాఫియా లీడర్. ఆయనకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు వరద (అరవింద్ స్వామి) గ్యాంగ్ స్టార్‌గా తండ్రి తరువాత ఆ స్థానం కోసం ఎదురుచూస్తుంటాడు. రెండో కొడుకు త్యాగు (అరుణ్ విజయ్) దుబాయ్‌లో.. మూడో కొడుకు రుద్ర(శింబు) సెర్బియాలో వ్యాపారాలు చేస్తుంటారు. ఒక రోజు భూపతి రెడ్డి మీద ఫేక్ పోలీసులు ఎటాక్ చేస్తారు. దీంతో అన్నదమ్ములంత తండ్రి దగ్గరకు వస్తారు. భూపతి రెడ్డి మీద ఎటాక్ చేసింది ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా భూపతి రెడ్డి ప్రత్యర్థి చిన్నప్ప అల్లుడిని చంపటంతో గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. కానీ భూపతి రెడ్డి తన మీద ఎటాక్ చేసింది చిన్నప్ప కాదని చెపుతాడు. దీంతో కొడుకులే ఆధిపత్యం కోసం భూపతి రెడ్డి మీద ఎటాక్ చేశారన్న అనుమానం కలుగుతుంది. అదే సమయంలో భూపతి రెడ్డి చనిపోతాడు. దీంతో అన్నదమ్ములకి ఒకరి మీద ఒకరి అనుమానం కలుగుతుంది. ఆదిపత్య పోరు మొదలవుతుంది. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు..? ఎవరు మిగిలారు..? అసలు భూపతి రెడ్డి మీద ఎటాక్ చేసింది ఎవరు.? రసూల్ (విజయ్ సేతుపతి)కి భూపతి రెడ్డి కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; మణిరత్నం సినిమా అంటే నటీనటులకు వంక పెట్టడానికి ఉండదు. తన పాత్రలకు పూర్తి న్యాయం చేయగలిగిన నటులను మాత్రమే తీసుకుంటాడు మణి. అదే ఫార్ములాను నవాబ్లోనూ ఫాలో అయ్యాడు. ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి ఒకరిద్దరు తప్ప అంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. భూపతి రెడ్డిగా ప్రకాష్ రాజ్ జీవించాడు. అరవింద్ స్వామి కెరీర్లో వరద మరో బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. క్రైమ్ థ్రిల్లర్‌గా సీరియస్ నోట్ లో సాగే సినిమాకు విజయ్ సేతుపతి కామెడీ టచ్ ఇచ్చాడు. శింబు, అరుణ్ విజయ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రల్లో జయసుధ, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితీ రావ్ హైదరీ, త్యాగరాజన్, మన్సూర్ అలీఖాన్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; చాలా రోజుల తరువాత ఓ భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందు వచ్చారు దర్శకుడు మణిరత్నం. సినిమాను ఇంట్రస్టింగ్ సీన్స్ తో స్టార్ట్ చేసిన దర్శకుడు అసలు కథను వెంటనే మొదలు పెట్టాడు. ఓపెనింగ్‌లోనే భూపతి రెడ్డి మీద ఎటాక్, తరువాత ఇతర పాత్రల పరిచయం, ఎటాకర్స్ కోసం వేట లాంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ రేసీగా సాగుతుంది. అయితే ఆ వేగం ద్వితీయార్థంలో మిస్ అయ్యింది.నటీనటుల సెలక్షన్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాత్రల ఎంపికలోనే కాదు వారి నుంటి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఇలా టాప్ టెక్నిషియన్స్ పనిచేసినా.. ప్రేక్షకులకు మణిరత్నం మార్క్ మిస్ అయిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. ముఖ్యంగా గ్యాంగ్ వార్స్ సన్నివేశాలు చాలా సాధాసీదాగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన నేపథ్య సంగీతం కథనంలో మలుపులు మైనస్ పాయింట్స్ ; మణిరత్నం మార్క్ కనిపించకపోవటం సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ -
నవాబ్ : అన్నదమ్ముల యుద్ధం!
లెజెండరీ దర్శకుడు మణిరత్నం స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా నవాబ్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ప్రకాష్ రాజ్ డాన్ తరహా పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తొలి ట్రైలర్లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసిన నవాబ్ టీం, రెండో ట్రైలర్లో కథ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. ట్రైలర్ చూస్తుంటే తండ్రి తరువాత ఆదిపత్యం కోసం అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధమే నవాబ్ కథ అని తెలుస్తోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో జోతిక, ఐశ్వర్యరాజేష్, డయానా ఎర్రప్పలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
‘నవాబ్’ రెండో ట్రైలర్‌ను రిలీజ్
-
మిల్కీ బ్యూటీకి మరో భారీ చాన్స్
సాక్షి, తమిళసినిమా : బాహుబలి చిత్రంలో అవంతికగా విజృంభించిన మిల్కీ బ్యూటీ తమన్నాకు.. ఆ తరువాత కోలీవుడ్‌లో సరైన అవకాశాలు రాలేదు. ఇక, శింబుతో రొమాన్స్ చేసిన ‘అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా శీనూరామస్వామి దర్శకత్వంలో కన్నె కలైమానే చిత్రంలో నటించినా.. అది ఇంకా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ అమ్మడు ఐటమ్ సాంగులకు సై అంటోందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో తమన్నా చెప్పే వెర్షన్ వేరేవిధంగా ఉంది. డాన్స్ అంటే తనకు ఇష్టమని, అందుకే ఐటమ్ సాంగ్స్ అవకాశాలను వదులుకోవడం లేదన్నది ఆమె అంటోంది. ఏదేమైనా కోలీవుడ్‌లో తమన్నా పనైపోయిందనే ప్రచారం సాగింది. అలాంటి తరుణంలో ఈ మిల్కీబ్యూటీని భారీ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుందర్.సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఈ భామకు నటించే అవకాశం దక్కింది. శింబు హీరోగా పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ని సుందర్ ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు. ఇందులో శింబుకు జంటగా మేఘా ఆకాశ్ నటించనుంది. ఈ చిత్రం తరువాత సుందర్ విశాల్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో విశాల్‌తో జోడీ కట్టే అవకాశం తమన్నాకు దక్కింది. ఈ విషయమై తమన్నా స్పందిస్తూ.. మొదటినుంచి సుందర్ సీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ కథాచిత్రమని, ఇందులో తన పాత్ర కూడా యాక్షన్ సీన్లలో నటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇంతకుముందు ఈ అమ్మడు ‘కత్తిసండై’ చిత్రంలో విశాల్‌తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తోంది. -
అత్తారింటికి దారేది: శింబుతో మేఘా రొమాన్స్!
సాక్షి, తమిళసినిమా : నటుడు ధనుష్‌తో జోడీ కట్టిన హీరోయిన్ తాజాగా శింబుతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందట. నటుడు శింబు చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అయ్యిపోతున్నారు. ఈయన మణిరత్నం దర్వకత్వంలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘సెక్క సివంద వానం’ (తెలుగులో నవాబ్) సినిమా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక, దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయా- 2 చిత్రాలలో నటించడానికి శింబు కమిట్ అయ్యారు. అదేవిధంగా ఇటీవల లైకా సంస్థ కూడా శింబుతో చిత్రం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్ద తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్ర రీమేక్ హక్కులను పొందిన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రీమేక్‌లో పవన్‌కల్యాణ్ పాత్రలో శింబు నటించనుండగా.. ఆయనకు జోడీగా మేఘాఆకాష్కు అవకాశం వరించిందట. ఈ అమ్మడు ఇప్పటికే కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా ‘ఎన్నై నోక్కి పాయుం తూటా’ చిత్రంతోపాటు ఒరు పక్క కథై, అధర్వకు జతగా బూమరాంగ్ చిత్రాలలో నటిస్తోంది. అయితే ఈ మూడింటిలో ఏ ఒక్క చిత్రం ఇంకా తెరపైకి రాలేదు. తెలుగులో ఇప్పటికే లై, ఛల్ మోహనరంగా వంటి చిత్రాల్లో నటించింది. ఇక, అత్తారింటికి దారేది చిత్రంలో సమంత పాత్రను మేఘా ఆకాశ్ పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మరో పాత్రను నటి ప్రణీత చేయగా.. తమిళంలో ఆ పాత్ర ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. -
హీరోకు హైకోర్టు హెచ్చరిక
ఒక చిత్ర నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్ చెల్లించే విషయంలో కోలీవుడ్ స్టార్ నటుడు శింబు కు హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. సదరు సంస్థ నుంచి తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా రూ.85 లక్షలు చెల్లించాలని, లేని పక్షంలో ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుందని శనివారం చెన్నై హైకోర్టు హెచ్చరించింది. వివరాల్లోకి వెళ్లితే.. సంచలన నటుడు శింబు ఫ్యాషన్ అనే నూతన నిర్మాణ సంస్థలో అరసన్ చిత్రంలో నటించడానికి 2013లో రూ.50 లక్షలు అడ్వాన్స్ పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆ సంస్థలో చిత్రం చేయకపోవడంతో ఫ్యాషన్ సంస్థ అధినేతలు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నటుడు శింబు అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.50 లక్షలకు వడ్డీతో కలిపి మొత్తం రూ.85లక్షలను నాలుగు వారాల్లోగా ఫ్యాషన్ చిత్ర నిర్మాణ సంస్థకు తిరిగి చెల్లించాలని, లేని పక్షంలో శింబు కారు, సెల్‌ఫోన్, ఇతర వస్తువులతో సహా ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుందని శనివారం విచారణానంతరం హెచ్చరించింది. కోర్టులో శింబు తరఫున ఫ్యాషన్ సంస్థ అనుకున్న సమయంలో చిత్రం చేయలేదని వివరణ ఇచ్చినా, నాలుగు సంవత్సరాలుగా చిత్రం చేయకపోవడానికి కోర్టు తప్పు పట్టింది. -
‘నవాబ్’ ట్రైలర్ విడుదల
-
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ : నవాబ్ ట్రైలర్
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా నవాబ్. అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ ఇలా భారీ తారాగణంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ను కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా తమిళ వర్షన్ ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు. సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ రూపొదించిన ఈ ట్రైలర్లో అందరూ ప్రతినాయకులలాగే కనిపిస్తున్నారు. మణి మార్క్ టేకింగ్ టాప్ స్టార్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు. -
‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో హీరో ఎవరంటే..?
తెలుగులో ఘనవిజయం సాధించిన అత్తారింటికి దారేది సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసింది. తాజాగా ఈ సినిమాను తమిళ రీమేక్ హక్కులను కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. అత్తారింటికి దారేది తమిళ రీమేక్‌లో శింబు హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సుందర్.సి డైరెక్ట్ చేయనున్నాడు. అంతేకాదు తెలుగులో నదియ కనిపించిన అత్త పాత్రను కోలీవుడ్‌లో సుందర్ సతీమణి, ప్రముఖ నటి కుష్బూ పోషించనున్నారు. ఇప్పటికే కన్నడలో రీమేక్ అయిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. -
‘వరద’గా అరవింద్ స్వామి..
మణిరత్నం సినిమా అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన తన సినిమాల్లో క్యారెక్టర్స్‌ను మలిచే విధానం ఆకట్టుకుంటుంది. మణిరత్నం సృష్టించే పాత్రలే సినిమాను నడిపిస్తాయి. ఆయన డైరెక్షన్లో వచ్చిన కడలి, చెలియా సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయాయి. మళ్లీ ఓ భారీ మల్టిస్టారర్ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ‘నవాబ్’గా తెలుగులో రాబోతోన్న ఈ మూవీలో అరవింద్ స్వామీ, శింబు, విజయ్ సేతుపతిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రోజూ ఒక పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా సోమవారం ‘వరద’పాత్రకు సంబంధించిన అరవింద్ స్వామీ లుక్‌ను రివీల్ చేశారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు శింబు పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జ్యోతిక, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. #Nawab - Launching Star 2's look today at 5:00 PM. Any guesses?#ManiRatnam @LycaProductions @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @salamsir21@arrahman @santoshsivan #SirivennelaSeetharamaSastry pic.twitter.com/pkOoGZLqAJ — Lyca Productions (@LycaProductions) August 14, 2018 -
భారీ మల్టీస్టారర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఇటీవల ఒక్క ‘ఓకె బంగారం’ సినిమా తప్ప మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. తాజాగా చెలియా సినిమాతో నిరాశపరిచిన ఆయన తన తదుపరి చిత్రం ‘చెక్క చివంత వానం’ షూటింగ్‌ను శరవేగంగా ముగించేస్తున్నారు. భారీ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మణి చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇటీవల మణి ఆరోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజులు నిర్మాణాంతర కార్యక్రమాలు బ్రేక్ ఇచ్చిన చిత్రయూనిట్, తిరిగి పనులు ప్రారంభించారు. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శింబు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్‌లు అన్నదమ్ములుగా కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత మందిస్తున్న ఈ సినిమాకు సంతోష్‌శివన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో నవాబ్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. -
ఆ లక్కీగర్ల్ ఎవరు?
తమిళసినిమా: సినిమాకు కథ, కథనాలను పక్కన పెడితే హీరోహీరోయిన్ల కాంబినేషన్ బట్టి కూడా వ్యాపారం ఉంటుంది. అలా కోలీవుడ్‌లో స్పెషల్ కాంబినేషన్లను కలిపే దర్శకుల్లో వెంకట్‌ప్రభు ఒకరు. ప్రస్తుతం పార్టీ చిత్ర విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈయన త్వరలో కొత్త చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సమ్మతించారు. అంతే కాదు ఈ చిత్రానికి మానాడు అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. దీన్ని సురేశ్‌కామాక్షి తన వీ.హౌస్ పతాకంపై నిర్మించనున్నారు. టైటిల్‌ను బట్టే అర్థం అవుతుంది ఇదో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న కథా చిత్రం అని. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్‌ప్రభు ధృవీకరించారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగునున్నాయి. ఇంత వరకూ బాగానే ఉంది. ఇందులో శింబుతో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. మానాడులో నటించే హీరోయిన్ కోసం ఇద్దరు యువ నటీమణులతో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అంతే కాదు వారి పేర్లు కూడా వెల్లడించారు. నటి కీర్తీసురేశ్, అతిలోక సుందరి వారసురాలు జాన్వీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే వీరిలో ఎవరు శింబుతో నటించేది త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. అయితే శింబుకు జంటగా నటి జాన్వీ నటిస్తుందన్నది సందేహమే. అయితే ఈ అమ్మడిని దక్షిణాదిలో పరిచయం చేయాలన్న ప్రయత్నాలు మాత్రం చాలా కాలంగానే జరుగుతున్నాయి. ఏదేమైనా మానాడు చిత్రంలో నాయకిగా కీర్తీసురేశ్‌నే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇ ఇద్దరు బ్యూటీలో ఎవరు శింబుతో జత కట్టినా అది క్రేజీ కాంబినేషనే అవుతుంది. త్వరలోనే ఎవరన్న సస్పెన్ప్ వీడనుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. -
మానాడు అంటున్న శింబు
తమిళసినిమా: సినిమాను, రాజకీయాలను వేరుచేయలేం. ముఖ్యంగా తమిళనాడులో ఈ రెండు రంగాలకు మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇక సినిమాల్లోనూ రాజకీయలు చోటు చేసుకోవడం పరిపాటే. నటుడు విజయ్ తన గత చిత్ర మెర్శల్లో సమకాలీన రాజకీయాలపై దండయాత్ర చేశారనే చెప్పవచ్చు. తాజాగా సర్కార్ చిత్రం రాజకీయాల ఇతివృత్తంతోనే తెరకెక్కుతోంది. ఇక సంచన నటుడుగా పేరొందిన శింబు తాజాగా రాజకీయాలతో కూడిన కథనే ఎంచుకున్నారు. చిన్న గ్యాప్ తీసుకున్న ఈయన మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంత వానం చిత్రంతో ఫుల్జోష్లోకి వచ్చారు. వరుసగా చిత్రాలను అంగీకరిస్తూ తన నట కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. షూటింగ్స్‌కు ఆలస్యంగా వస్తున్నాడనే ముద్రను తెరిపేసుకుంటూ క్రమశిక్షణను పాఠిస్తున్నారు. ఈయన తాజాగా జాలీగా సాగే చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్న వెంకట్‌ప్రభుతో జాయిన్ అవుతున్నారు. అయితే వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం మాత్రం కామెడీగా ఉండదట. రాజకీయాలు, యాక్షన్ అంటే వేరే లెవల్లో ఉంటుందని సమాచారం. దీనికి ముందు అదిరడి అనే పేరు ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిత్ర వర్గాలు మానాడు అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. నిర్మాత సురేశ్ కామాక్షి తన వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించనున్నారు.ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. సంధ్యాసమయంలో రాజకీయ నాయకుల షాటో కటౌట్ల మధ్య స్టాండ్ ఫర్ వాట్ ఈజ్ రైట్–ఈవెన్ ఇఫ్ దట్మీన్స్ స్టాండింగ్ ఎలోన్ అనే స్లోగన్‌ను ఆ పోస్టర్లో పొందుపరిశారు. ఇక మానాడు అనే టైటిల్ కింది ఏ వెంకట్‌ప్రభు పాలిటిక్స్ అన్న ట్యాగ్‌ను పొందుపరిచారు. ఇవన్నీ చూస్తే శింబు మానాడు సంచలన చిత్రంగా అవతరించే అవకాశం ఉందనిపిస్తోంది. ఈ త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని ఆ చిత్ర వర్గాలు తెలిపారు. -
అతిథిగా శింబు
తమిళసినిమా: సంచలనాలకు కేంద్రబిందువు శింబు అంటారు. సమయానికి షూటింగ్‌లకు రాకుండా దర్శక, నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తాడని, కథలో జోక్యం చేసుకుంటాడని చాలా ఆరోపణలే ఆయనపై ఉన్నాయి. ఇవన్నీ శింబుకు తెలుసు. అందుకే ఇకపై వేరే శింబును చూస్తారని, షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తున్నాడనే ఆరోపణలు రావని, ఇటీవల చెప్పడం ఒక షాక్ అయితే, మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడం, సెక్క సివంద వానం చిత్రాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయడం వంటివి శింబు నుంచి ఆశించనివే. తాజాగా నటి జ్యోతిక చిత్రంలో అతిథిగా మెరవడానికి అంగీకరించడం ఇంకా విశేషం. అవును నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కాట్రిన్ మొళి. ఇది హిందీలో మంచి విజయాన్ని సాధించిన తుమ్హారి సుళు చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. ఇందులో విద్యాబాలన్ పాత్రను జ్యోతిక పోషిస్తున్నారు. రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జ్యోతిక భర్తగా విథార్థ్ నటిస్తున్నారు. హిందీలో నేహా నటించిన పాత్రను తెలుగు నటి లక్ష్మీమంచు చేస్తున్నారు.ఎంఎస్.భాస్కర్, మనోబాలా, కుమారవేల్, మోహన్‌రామన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో ఒక కీలక పాత్రలో నటుడు శింబు నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ధనుంజయన్నే తన ట్విట్టర్లో పేర్కొన్నారు.శింబు కాట్ట్రిన్ మొళి చిత్రంలో చేరడంతో ఆ చిత్ర కలరే మారిపోయింది. శింబు, జ్యోతికలది హిట్ పెయిర్. గతంతో వీరిద్దరూ కలిసి మన్మథ చిత్రంలో నటించారన్నది గమనార్హం. చాలా కాలం తరువాత మళ్లీ కలిసి నటించడం విశేషమే. -
శింబుతో ఓకేనా?
తమిళసినిమా: సంచలన నటుడు శింబు, క్రేజీ నటి కీర్తీసురేశ్. ఈ కొత్త కాంబినేషన్లో చిత్రం వస్తే ఎలా ఉంటుంది. సింపుల్ సూపర్‌గా ఉంటుంది కదూ.. అయితే అలాంటి సంచలన కాంబినేషన్లో చిత్రం వచ్చే అవకాశం ఉందా అనేగా మీ ప్రశ్న. ఉండే అవకాశం లేకపోలేదు. శింబు, కీర్తీసురేశ్ జంటగా చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతాన్నాయన్నది తాజా సమాచారం. నటుడు శింబు చిన్న గ్యాప్ తరువాత చిత్రాల విషయంలో స్పీడ్ పెంచాడు. మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం చిత్రాన్ని పూర్తి చేసిని శింబు తాజాగా వరుసగా మూడు నాలుగు చిత్రాల్లో నటించడానికి సంతకాలు చేసినట్లు సమాచారం. వాటిలో ఒకటి దర్శకుడు వెంకట్‌ప్రభు చిత్రం. దీన్ని సురేశ్ కామాక్షి భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నటి కీర్తీసురేశ్‌ను నాయకిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. మహానటి చిత్రం తరువాత ఈ బ్యూటీ క్రేజే వేరు. తెలుగు, తమిళం భాషల్లో పలు అవకాశాలు కీర్తీసురేశ్ తలుపు తడుతున్నాయట. అయితే ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా అంగీకరించలేదని కీర్తీనే ఇటీవల స్వయంగా చెప్పింది. ప్రస్తుతం తన విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్‌తో సండైక్కోళి 2, విక్రమ్ సరసన సామి స్క్వేర్ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ తరువాతే కొత్త చిత్రాలను అంగీకరించనున్నట్లు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో శింబుతో జతకట్టే అవకా«శం వచ్చిందన్న ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. మరి శింబుతో తను ఓకే అంటుందా అన్నది వేచి చూడాలి. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్, పీసీ.శ్రీరామ్‌లను సంగీతం, ఛాయాగ్రహణం బాధ్యతలకు ఎంపిక చేసే పనిలో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలిసింది. ఇంతకీ ఈ చిత్ర టైటిల్ ఏమిటన్నది చెప్పలేదు కదూ! అదిరడి. టైటిల్ అదిరింది కదూ! ఈ చిత్రానికి సంబంధించిన అధికార పూర్వక పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
శింబు, అనుష్కలతో మల్టీస్టారర్ చిత్రం?
తమిళ సినిమా: దర్శకుడు గౌతమ్‌మీనన్ మల్టీస్టారర్ చిత్రం గురించి మరోసారి వార్తల్లో నానుతోంది. ఈ దర్శకుడు ప్రస్తుతం విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్ కథానాయకుడిగా ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు చాలా కాలం నిర్మాణంలో ఉన్నాయన్నది గమనార్హం. అదే విధంగా గోలీసోడా–2 చిత్రంలో గౌతమ్‌మీనన్ ఒక ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. గౌతమ్‌మీనన్ ఇది వరకే ఒక మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో తెరకెక్కించే ఈ చిత్రంలో నాలుగు భాషలకు చెందిన ప్రముఖ నటులు హీరోలుగా నటిస్తారని, హీరోయిన్గా అనుష్క నటిస్తారని వెల్లడించారు. నటి అనుష్క కూడా భాగమతి చిత్ర ప్రచారం కార్యక్రమంలో తాను దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఆ క్రేజీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి గౌతమ్‌మీనన్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మల్టీస్టారర్ చిత్రంలో తమిళ వెర్షన్లో హీరోగా నటుడు మాధవన్ నటించనున్నట్లు దర్శకుడు గౌతమ్‌మీనన్ ఇంతకు ముందు తెలిపారు. అయితే ఇప్పుడా పాత్రలో నటుడు శింబును నటింపజేయడానికి చర్చలు జరిపిన్నట్లు ప్రచారం. ఇక మలయాళ వెర్షన్లో టోవినో థామస్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ హీరోలుగా నటించనున్నారు. అదే విధంగా తెలుగులో ఒక ప్రముఖ నటుడి నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇకపోతే ఇందులో అనుష్క హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శింబు,గౌతమ్‌మీనన్‌ల కాంబినేషన్లో ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా, అచ్చం యంబదు మడమయడా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు వచ్చాయన్నది తెలిసిందే. ఈ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
నాకు రూ.1000 కోట్ల ఆస్తి ఉంది : హీరో
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఒకేసారి మూడు చిత్రాలను ప్రకటించాడు. విజయా ప్రొడక్షన్స్ బ్యానర్, గౌతమ్ మీనన్ సినిమాలతో పాటు తన డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సినిమాలు చేయటం కాదు ముందు షూటింగ్‌లకు సరైన సమయానికి రావటం నేర్చుకోమంటూ చాలా మంది కామెంట్ చేశారు. అయితే కామెంట్స్‌పై డైరెక్ట్‌గా స్పందించకపోయినా... విమర్శలకు బదులిస్తూ కోలీవుడ్ మీడియాకు శింబు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ‘నేను నా తొలి సినిమా చేసినప్పుడు కూడా మా నాన్నతో కలిసి 10 గంటలకు సెట్‌కు వెళ్లాను. అది నా నిర్లక్ష్యం కాదు. నేను ఎప్పుడూ ఇలాగే జీవిస్తున్నా. నేను చాలా కంఫర్టబుల్‌గా బతికాను. రోబోలా జీవించటం నా వల్ల కాదు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా వ్యక్తిగతంగా నేను జీవితంలో సెటిల్ అయ్యాను. నాకు రూ.1000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. నా జీవితాన్ని నేను ఆనందంగా జీవించగలను. నాకు సినిమా అంటే ఇష్టం అందుకే ఈ రంగంలో కొనసాగుతున్నాను. నాకు స్వార్థపరుడ్ని అనిపించుకోవాలనే ఉద్దేశం లేదు. అందుకే నా పనుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా ప్రవర్తన మార్చుకుంటా, ప్రస్తుతం అదే పనిలో ఉన్నా’ అంటూ క్లారిటీ ఇచ్చారు శింబు. -
‘నవాబ్’ షూటింగ్ పూర్తి చేసిన శింబు
ఇటీవల కాలం ఒక్క ‘ఓకె బంగారం’ సినిమా తప్ప మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. చెలియా సినిమాతో నిరాశపరిచిన ఆయన తన తదుపరి చిత్రం నవాబ్ షూటింగ్‌ను శరవేగంగా ముగించేస్తున్నారు. భారీ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మణి చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. శింబు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సెర్బియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తన పోర్షన్ షూటింగ్‌ను పూర్తి చేశారు శింబు. శింబు షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తారని, అనుకున్న సమయానికి సినిమా పూర్తికాదన్న అపవాదు ఉంది. అయితే అలాంటి రూమర్స్‌కు చెక్ పెడుతూ శింబు కూడా తన పోర్షన్ అనుకున్న సమయానికే పూర్తి చేశారు. ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నారు. సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా న్యూక్లియర్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు. -
అలా చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నా
చెన్నై : యాక్షన్ హీరో అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నానని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ అన్నారు. ఉరు చిత్ర నిర్మాత వీపీ.విజీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ఎళుమిన్. ఆత్మరక్షణ విద్యల్లో సత్తాచాటే ఆరుగురు చిన్నారుల ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం ఇది. హాస్యనటుడు వివేక్, నటి దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల సోమవారం వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో జరిగింది. నటులు విశాల్, కార్తీ, శింబు అతిథులుగా పాల్గొని ట్రైలర్‌ను ఆవిష్కరించారు. విశాల్ మాట్లాడుతూ తాను యాక్షన్ హీరో అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నానని, ఈ చిత్రంలో చిన్నారులు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారన్నారు. ఈ చిత్ర జెండా ఊపడానికి తాను రాకూడదనీ, జాకీఛానే రావాలని పేర్కొన్నారు. ఇందులో నటించిన చిన్నారులు తననే ఇన్స్పైర్ చేశారని అన్నారు. చిత్ర మ్యూజిక్ చాలా బాగా వచ్చిందనీ, ఇందులో నటుడు వివేక్ రాసిన పాట బాగుందని చెప్పారు. ఆయన నిజాలను ధైర్యంగా మాట్లాడతారని, ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని అన్నారు. ఇందులో నటించిన బాల తారలకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. నటుడు శింబు మాట్లాడుతూ.. వివేక్ ఒక చిత్రంలో నటిస్తున్నప్పుడు ఒకతన్ని ఒక డైలాగ్ చెప్పమని అడిగారన్నారు. దానికి అతను వెంటనే అంగీకరించాడన్నారు. అప్పుడు అతడు చెప్పకపోతే నేడు సంతానం అనే నటుడు ఉండేవాడు కాదని శింబు వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికనుగుణంగా వారిని ఎదగనివ్వాలని కోరారు. కార్యక్రమంలో నటి దేవయాని, నటుడు ఉదయ, ఎళుమిన్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు శింబు తండ్రి, నటుడు, దర్శకుడు టీ.రాజేందర్ మధ్య వర్గ పోరు జరుగుతోంది. ఇటీవల టీ.రాజేందర్ ఓ కార్యక్రమంలో విశాల్‌పై ఆవేశంగా విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతల మండలి అ«ధ్యక్షుడు విశాల్, వ్యతిరేక వర్గానికి చెందిన శింబు ఒకే వేదికపై పాల్గొనడంతో వివాదాస్పద వ్యాఖ్యలకు అవకాశం ఉంటుందని మీడియా ఆసక్తిని చూపింది. అయితే అలాంటి సంఘటనలేమీ జరగకపోవడం విశేషం. చిత్ర నిర్మాత ఈ సందర్భంగా తిరుపత్తూర్‌లోని వీరవిలైయాట్టు కలైకూట్టంకు రూ.25 వేలను విరాళంగా అందించారు. -
కల నిజమైంది
దర్శకుడు మణిరత్నం సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆయన డైరెక్షన్ స్టైల్ డిఫరెంట్. అందుకే మణిరత్నం సినిమాల్లో నటించేందుకు యాక్టర్స్ ఇష్టపడుతుంటారు. కొందరైతే అదృష్టంగా భావిస్తుంటారు. ఆ అదృష్టం దక్కినందుకు ఆనందపడుతున్నారు తమిళ నటి ఐశ్వర్యా రాజేశ్. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీ రావ్ హైదరీ, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చెక్క చివంద వానమ్’. తెలుగులో‘నవాబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో తమ వంతు షూటింగ్స్‌ను కంప్లీట్ చేశారు ఐశ్వర్య రాజేశ్ అండ్ అరుణ్ విజయ్. ‘‘నవాబ్’ సినిమాలో నా వంతు షూటింగ్ కంప్లీటైంది. మణిరత్నంగారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కల నిజమైనట్లు ఉంది’’ అన్నారు ఐశ్వర్య. అంతేకాదు తమిళ హీరో శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్ హౌస్‌లో రూపొందనున్న సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు ఐశ్వర్య. అరుణ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కతోన్నఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ టైటిల్ ఎనౌన్స్మెంట్ రేపు రానుంది. -
వారి కంటే శింబు బెటర్
పెరంబూరు: రజనీకాంత్, కమలహాసన్‌ల కంటే యువ నటుడు శింబు సమయోచితంగా వ్యవహరిస్తున్నారని కన్నడ సీనియర్ నటుడు అనంతనాగ్ వ్యాఖ్యానించారు. కావేరి బోర్డు వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం తీరు, నటులు రజనీకాంత్, కమలహాసన్ వ్యాఖ్యలపై ఈయన స్పందించారు. రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత రజనీ, కమల్ల నుంచి తాను ఎంతో ఆశించానని అయితే వారు పాత విధానంలోనే రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను తమిళులకు వ్యతిరేకిని కానని, తమిళులు మంచి వారు, సహృదయులు అని అన్నారు. కన్నడిగులతో సన్నిహితంగా మెలుగుతారన్నారు. కర్ణాటకలో మరో నెలలో కొత్త ప్రభుత్వం రానుందని, ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయని అన్నారు. అదే విధంగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు. తమిళనాడులో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అయినా వారు ఎందుకు ఉద్రేకానికి గురవుతున్నారని ప్రశ్నించారు. నటుడు శింబు ఎలాంటి పోరాటం లేకుండా కావేరి వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీటిని ఇవ్వాలని కోరుతూ విజ్ఞతతో వ్యాఖ్యలు చేశారని, ఆయనలాంటి పరిణితి రజనీ, కమల్లో లేకపోవడం చూసి దిగ్భ్రాంతి చెందానన్నారు. ఆఫ్రికాలోని నైల్నది సమస్య కూడా పరిష్కరమైందని, అలాంటిది కావేరి సమస్యకు పరిష్కారం లభించాలని తమిళ ప్రభుత్వం కోరుకోవడం లేదన్నారు. కన్నడిగులు మంచి వారని, కావేరి వ్యవహారంలో తమిళ రాజకీయ నాయకుల చేతకాని తనంగా భావిస్తున్నారని, వారికి తాము తగిన రీతిలో బదులిస్తామని నటుడు అనంతనాగ్ పేర్కొన్నారు. -
ధనుష్ కాదు శింబు
తమిళసినిమా: ఏ భాషలోనైనా చిత్రం మంచి టాక్ తెచ్చుకుంటే వెంటనే ఆ చిత్ర రీమేక్ హక్కులకు పోటీ సహజం. ఇటీవల తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై మంచి ప్రశంసలను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న చిత్రం నీది నాది ఒకే కథ. వర్థమాన నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఇందులో బిచ్చగాడు చిత్రం ఫేమ్ సాట్నా టిటస్ కథానాయకిగా నటించింది. టాలీవుడ్లో ఈమెకిది తొలి చిత్రం. ఊడుగుల వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. దీంతో కోలీవుడ్ దర్శక, హీరోల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఈ చిత్రం నటుడు ధనుష్‌కు తెగ నచ్చేసిందని, వెంటనే తమిళరీమేక్ హక్కులను ధనుష్ కొనేశారని ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ధనుష్ వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోక్కిపాయుమ్ తూట్టా, బాలాజీ మోహన్ దర్శకత్వంలో మారి 2 చిత్రాల్లో నటిస్తున్నారు. తదుపరి నీది నాది ఒకే కథ రీమేక్‌లో నటిస్తారని ప్రచారం. అయితే తాజా గా నీది నాది ఒకే కథ చిత్రంలో ధనుష్‌ను కాదని, సంచలన నటుడు శింబు నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం హల్చల్ చేస్తోంది. అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం ఫ్లాప్‌తో షాక్ తిన్న శింబు ఆ చిత్రం నిర్మాత నుంచి నష్ట పరిహారం లాంటి డిమాండ్లను ఎదుర్కొన్నారు. చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో సెక్క సి వక్క వానం చిత్రంలో నటిస్తున్నారు. -
మా నాన్న ఏకపత్నీ వ్రతుడు
సాక్షి సినిమా: మా నాన్న ఏకపత్నీవ్రతుడు అని అన్నది ఎవరో తెలుసా? సంచలన నటుడు శింబు. ఈయన తండ్రి సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాదు రాజకీయనాయకుడు కూడా. ప్రాసలో పంచ్ డైలాగ్స్ చెప్పడంతో దిట్ట. అయినా ఆయనపై సెటైర్లు వేస్తుంటారు. టీఆర్ డైలాగులను, ఆయన స్టైల్స్‌ను సినిమాల్లోనే కాకుండా బయట కూడా పేరడీ చేస్తుంటారు. అయితే ఇలా తన తండ్రిని పరిహాసం చేసేవారిపై ఆయన కొడుకు, సంచలన నటుడు శింబు దండెత్తారు. ఇటీవల ఒక టీవీ చానల్లో అతిథులుగా టీఆర్, ఆయన కొడుకు శింబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శింబు తన తండ్రి గురించి మాట్లాడుతూ తన తండ్రి చాలా ఉన్నతుడని పేర్కొన్నారు. ఆయనలో చాలా ప్రతిభ ఉందన్నారు. అలాంటి వ్యక్తిపై కొందరు సెటైర్స్ వేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి నోటితోనే సంగీత బాణీలు కడతారని, దాన్ని కొందరు పరిహాసం చేస్తుంటారని, అదే విధంగా తన తల జుత్తును ఎగరేసే స్టైల్‌ను ఎగతాళి చేస్తుంటారని అన్నారు. అలా చేయడం మీ వల్ల అవుతుందా అని ప్రశ్నించారు. తన తండ్రి ఇప్పటికీ సూపర్‌గా డాన్స్ చేస్తారని, అలా మీరు 20 ఏళ్ల వయసులో కూడా చేయలేరని అన్నారు. ఏ అమ్మాయిని చూసినా మీకు ఏదో భావం కలుగుతుందని, తన తండ్రి మాత్రం ఏకపత్నీవ్రతుడని పేర్కొన్నారు. ఆయనకు ఎలాంటి దురలవాట్లు లేవన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా చెప్పాలంటే సెటైర్లు వేసే వారంతా ప్రతిభలేనివారేనని అన్నారు. తన తండ్రి ప్రతిభ అంగీకరించి గౌరవించేవారినే తాను గౌరవిస్తానని శింబు ఆవేశంగా మాట్లాడారు. ఆయన మాటలకు అదే వేదికపై ఉన్న టీ.రాజేందర్ ఆనంద బాష్పాలు రాల్చారు. -
మారిపోయిన శింబు
తమిళసినిమా: కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన శింబులో ఇప్పుడు చాలా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తారన్న ఆరోపణలు ఎదుర్కొనే శింబు తాజాగా మణిరత్రం చిత్ర షూటింగ్‌కు చెప్పిన టైమ్ కంటే ముందుగానే వస్తూ చిత్ర యూనిట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారట. ఇక ఆ మధ్య నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్‌తో విబేధించిన శింబు ఇటీవల పైరసీలకు పాల్పడుతున్న వెబ్‌సైట్‌ను పోలీసులు మూసివేయడంతో ఆ ఘనత విశాల్‌దే అంటూ ప్రశంసించి అందరినీ విస్మయపరిచారు. తాజాగా యువ నటుడు మెట్రో శిరీష్, సంగీతదర్శకుడు యువన్శంకర్రాజాలపై అభినందనల వర్షం కురిపించారు. మెట్రో శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం రాజా రంగూస్కీ. ఇందులో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని నా యారన్ను తెరియుమా అనే పాటను ఈ నెల 15న విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఇంతగా అలరిస్తున్న ఈ పాటను ఆలపించింది నటుడు శింబునే. దీంతో పాట మంచి సక్సెస్ కావడంతో రాజా రంగూస్కీ చిత్ర హీరో మెట్రో శిరీష్, సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజాలను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. దీంతో వీరు యమ ఖుషీ అయ్యిపోయారట. పాట హిట్ అయినట్లే చిత్రం కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మెట్రో శిరీష్, యువన్‌శంకర్‌రాజాలను సంతోషపరచారు శింబు. రాజా రంగూస్కీ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబుతోంది. -
అది ప్రేమ కాదు
సాక్షి, సినిమా : నటి త్రిషపై తనకున్నది ప్రేమ కాదు అన్నారు సంచలన నటుడు శింబు. సంచలనాలకు మారు పేరు శింబు అన్నంతగా వాసికెక్కిన ఈ నటుడు అన్భానవతన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం తరువాత మరో చిత్రంలో నటించలేదు. చాలా గ్యాప్ తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటిస్తున్నారు. ఈ దర్శకుడు శింబును హీరోగా ఎంపిక చేసుకోవడం కూడా సంచలనమే. శింబు ఇంతకుముందు నటి త్రిషతో కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అందులో ఒకటి విన్నైతాండి వరువాయా చిత్రం. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అంతే కాదు శింబు, త్రిషల గురించి వదంతులు బాగానే హల్చల్ చేశాయి. తాజాగా విన్నైతాండి వరువాయా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు గౌతమ్‌మీనన్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నటుడు మాధవన్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై నటుడు శింబు ఇటీవల ఒక ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో త్రిష గురించి అడిగిన ప్రశ్నకు ఆమె తనకు చిన్నతనం నుంచి తెలుసని అన్నారు. త్రిష నటి అవుతుందని ఊహించలేదన్నారు. త్రిష గురించి చెప్పాలంటే తను ఎలాంటి గర్వం చూపించదు. ఏ విషయం గురించి అయినా తనతో పంచుకుంటుందని చెప్పారు. అయితే తమ మధ్య ఉన్నది ప్రేమ కాదు, స్నేహం కూడా కాదని అన్నారు. అభిమానం, ఆదరణ అని ఘనంగా చెప్పగలనని అన్నారు. -
భారీ మల్టీస్టారర్.. మొదలవుతోంది
సాక్షి, చెన్నై : పుకార్లకు పుల్ స్టాప్ పడిపోయింది. క్లాసిక్ చిత్రాల దర్శకుడు మణిరత్నం భారీ మల్టీస్టారర్‌ను అధికారికంగా ప్రకటించేశారు. చిత్ర తారాగణంతోపాటు వారి టైటిల్ లోగోను కూడా విడుదల చేసేశారు. తమిళ్లో ‘చెక్క చివంత వానమ్’ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్’ గా రానుంది. ఇక కాస్టింగ్ విషయానికొస్తే... శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి పేర్లను ఇది వరకే ప్రకటించగా... ఇప్పుడు అదనంగా అరుణ్ విజయ్(బ్రూస్ లీ ఫేమ్) జత కలిశాడు. ముందుగా మళయాళ నటుడు పహద్ ఫజిల్ పేరు అనుకున్నప్పటికీ.. డేట్లు అడ్జస్ట్ కాకపోవటంతో ఆ ప్లేస్‌లో అరుణ్ విజయ్ను తీసుకున్నారు. జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావ్ హైదరి, డయానా హీరోయిన్లుగా.. ప్రకాశ్ రాజ్, త్యాగరాజన్, మన్సూర్ అలీఖాన్, జయ సుధ తదితరులు కీలకపాత్రలు పోషించబోతున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ హౌజ్ వారు సంయుక్తంగా ఈ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. #NAWAB @LycaProductions @arrahman @santoshsivan @sreekar_prasad #SeetharamaSastry @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj @salamsir21 #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @dhilipaction @ekalakhani @onlynikil pic.twitter.com/uDk420IwgC — Lyca Productions (@LycaProductions) February 9, 2018 #CCV #ManiRatnam @LycaProductions @arrahman @santoshsivan @sreekar_prasad @vairamuthu @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj @salamsir21 #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @dhilipaction @ekalakhani @onlynikil pic.twitter.com/VaIk6EUxPc — Lyca Productions (@LycaProductions) February 9, 2018 -
మణిరత్నంకు షాక్ ఇచ్చిన హీరో
దక్షిణాది లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, జ్యోతిక లాంటి భారీ స్టార్ కాస్ట్ తో ఓ సినిమాను ప్లాన్ చేశారు మణి. అయితే చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా అంటే ఏ హీరో అయినా కాదనడూ.. కానీ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ మాత్రం మణి సినిమాలో నటించేందుకు ముందు అంగీకరించి తరువాత నో చెప్పేశాడట. సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఫహాద్ తప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. -
మణికి తోడుగా లైకా
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. భారీ తారాగణంతో మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్ లాంటి సౌత్ టాప్ స్టార్స్ నటిస్తున్నారు. ఇంతటి భారీ చిత్రాన్ని మణిరత్నంతో కలిసి నిర్మించేందుకు భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ముందుకు వచ్చింది. మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్ మణిరత్నం తదుపరి చిత్రాన్ని నిర్మించనుంది. వరుసగా భారీ చిత్రాలను రూపొందిస్తున్న లైకా సంస్థ మణిరత్నంతో కలవటంతో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మణి స్టైల్ లో రూపొందనున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి అందిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. -
హీరో శింబుపై బ్యాన్?
సాక్షి, తమిళ సినిమా: నటుడు శింబు అంటే సంచలనానికి మారుపేరు. ఆ మధ్య నయనతార, హన్సికతో ప్రేమాయణంతో వార్తల్లోకెక్కారు. ఆ తరువాత బీప్ సాంగ్ అంటూ వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర నిర్మాత నుంచి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. శింబు న టించిన ఈ చిత్రం ఘోర పరాజయం పొందడంతో నిర్మాత మైఖెల్ రాయప్పన్ తనకు రూ.20 కోట్లు నష్టం వచ్చిందని.. అందుకు శింబు కారణం అని పేర్కొన్నారు. ఏమైనా నేను చూసుకుంటాను, నాది బాధ్యత అని శింబు మాట ఇచ్చి మోసం చేశారని నిర్మాతల మండలిలో ఆయన ఫిర్యాదు చేశారు. శింబు సరిగా షూటింగ్‌కు రాలేదని, కథను కూడా మార్చేశారని ఆరోపణలు గుప్పించారు. బదులివ్వాల్సిన అవసరం లేదు నిర్మాత ఆరోపణలకు స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధుల ప్రశ్నకు తాను ఏమీ స్పందించాల్సిన అవసరం లేదని శింబు తెలిపాడు. తనకు నిర్మాత రూ.3.5 కోట్లు పారితోషికం ఇవ్వాలని, ముందు ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తనపై రెడ్ కార్డ్ వేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని శింబు అన్నారు. ఇలా ఉండగా శింబుపై రెడ్‌కార్డ్ వేసే అవకాశం ఉందనే ప్రచారం జరగడంతో మణిరత్నం చిత్రం నుంచి ఆయన్ని తొలగించి మరో నటుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
నాది బాధ్యత అన్నారు
తమిళసినిమా: ఏదైనా నేనే బాధ్యత వహిస్తానని నటు డు శింబు అన్నారని ఇప్పుడు నష్టాన్ని ఆయనే భరించాలని నిర్మాత మైఖెల్‌రాయప్పన్ డిమాండ్ చేస్తున్నారు. ఈయన శింబు హీరోగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించారు. శ్రియ, తమన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. గత జూన్‌లో విడుదలైన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాల్ని కలిగించింది. ఈ నష్టానికి కారణం నటుడు శింబునేనని, నిర్మాత మైఖెల్‌రాయప్పన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. నటుడు శింబు అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర పూర్తి స్క్రిప్ట్ చదివిన తరువాత చిత్రంలో నటించడానికి అంగీకరించారని తెలిపారు. చిత్ర షూటింగ్ సగం పూర్తయిన తరువాత చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించండి ఏం జరిగినా తాను బాధ్యత వహిస్తానని, రెండ వ భాగానికి పారితోషికం కూడా తీసుకోనని శింబు చెప్పారన్నారు. అంతకు ముందే దర్శకుడు చెప్పినట్లు ఆయన కథలో నటించలేదని ఆరోపించారు. తాను శిం బు అడిగిన పారితోషికం చెల్లించానని చెప్పారు. అయి తే చిత్రం విడుదలై తనకు రూ.20 కోట్లు నష్టం వచ్చిం దన్నారు. డిస్ట్రిబ్యూటర్లు నష్టపరిహారం చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. వారి నష్టానికి శింబు బాధ్యత వహించాలని తాను నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశానన్నారు. మండలి నిర్వాహకులు విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని చెప్పి నెల రోజులు అయ్యిందని ఇప్పటి వరకూ పరిష్కారం జరగలేదని, శింబునే నష్టాన్ని భరించాలని నిర్మాత మైఖెల్ రాయప్పన్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నటుడు శింబుకు రెడ్‌కార్డ్ విధించే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. -
మణిరత్నం సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి
దక్షిణాది నటీనటులకు మణిరత్నం సినిమాలో నటించటం ఓ కల. అందుకే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా అంటే చాలు ఎవరైన ఓకె చెప్పేస్తారు. సీనియర్ నటుల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ మణిరత్నం సినిమాలో చాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఓ అరుదైన అవకాశం టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ తలుపు తట్టింది. భర్త మరణం తరువాత నటనకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ నటి చాలా కాలం తరువాత ఓ తమిళ సినిమాకు అంగీకరించింది. మణిరత్నం సినిమా కావటం వల్లనే జయసుధ ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించిందట. చెలియా సినిమాతో నిరాశపరిచిన మణిరత్నం ప్రస్తుతం శింబు, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతిల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. జ్యోతిక మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ నటించనుంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సఖి సినిమాలో జయసుధ నటించింది. తిరిగి ఇన్నేళ్ల తరువాత మరోసారి మణి దర్శకత్వంలో నటించనుంది. ఇటీవల ఊపిరి సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించిన జయసుధ మరోసారి ఆసక్తికరమైన సినిమాలో కోలీవుడ్ ఆడియన్స్‌ను అలరించనుంది. -
డిజిటల్ ఫీవర్
నోట్ల పాట శింబు నోట! ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లు రద్దు చేసి ఏడాది అయింది. ఈ సందర్భంగా శింబూ సరదాగా ఓ పాట పాడాడు. అది ఇప్పుడు వైరల్ అయింది. అంతేకాదు, నోట్లరద్దు వల్ల సామాన్య ప్రజలపై పడ్డ ప్రభావాన్ని వీడియోలుగా తీసి డీ మానిటైజేషన్ యానివర్సరీ పేరుతో ఐదు ఫన్నీ వీడియోలు తీశారు. అందులో మోడీ సర్కస్ ఒకటి. వాటిలో కొందరు రెండువేల నోటుకు పుట్టినరోజు జరుపుతుంటే, ఇంకొందరు ఐదువందలు, వెయ్యినోట్లకు వర్ధంతి జరుపుతున్నారు. ఇప్పుడు ఈ విడియోలన్నీ హల్ చల్ చేస్తున్నాయి. చూసినవాళ్లు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే... వీటన్నిటిలో సినీనటుడు శింబూ పాటదే హైలైట్. స్టెప్పు అదిరింది ధోనీ! సెలబ్రిటీలయినంత మాత్రాన మేం మనుషులం కామా, మాకూ సరదాలుండవా అంటున్నాడు ఇండియన్ క్రికెటర్ ఎం.ఎస్. ధోని. క్రికెట్ ఆటలోనే కాదు, డాన్స్‌లో కూడా తానేమీ తీసిపోనంటున్నాడు. అందుకు ఉదాహరణగా, ఓ పాటకు స్టెప్పులు కూడా వేశాడు ఈ ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ సప్నా మోతీ భావ్నాని ఇటీవల పోస్ట్ చేసిన ఈ వీడియో దాన్ని బలపరుస్తోంది. 2011లో విడుదలైన హిందీ చిత్రం దేశీ బాయ్స్‌లోని ఝాక్ మార్ కే పాటకు ధోనీ సరదాగా స్టెప్పులు వేసిన ఈ వీడియోలో దోని భార్య సాక్షి కూడా ఉన్నారు. ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయని వాళ్లు, కామెంట్లు పెట్టని వాళ్లూ లేరు. వాళ్లలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఉన్నారు. ది ట్రంప్ డాగ్! మనిషిని పోలిన మనుషులుంటారని మనం విన్నాం. కొండొకచో కన్నాం కూడా. అయితే, కుక్క చెవిలో మనిషిని పోలిన కణితి ఉండడం ఎంత వింత! అందునా ఆ మనిషి ఒక ప్రముఖ వ్యక్తి కావడం ఇంకెంత విడ్డూరం! అందుకే ఇది వైరల్ అయి కూచుంది మరి.యూకేకు చెందిన జేడ్ రాబిన్సన్ తన పెంపుడు కుక్క చెఫ్, గత కొద్దికాలంగా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతుండడంతో, దాని చెవిలోపలి భాగాన్ని ఫొటో తీసి, పెట్ డాక్టర్‌కు పంపింది. అది చూసిన ఆ వైద్యురాలు, షాకయ్యింది. ఆమెను అంతగా షాక్‌కు గురి చేసిన విషయమేమిటంటే, ఆ పెంపుడు కుక్క చెవిలో ఒక గడ్డ ఉంది. ఆ గడ్డ మూలంగానే దానికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంతకీ సదరు డాక్టర్ షాక్ తిన్న విషయం అది కాదు... ఆ గడ్డ అచ్చం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖాన్ని పోలి ఉండటమే! చెఫ్, అదేనండీ, ఆ కుక్కగారు.. మేలుకుని ఉన్నప్పుడు దాని చెవిని కనీసం తాకనివ్వను కూడా తాకనిచ్చేది కాదు. దాంతో, జేడ్ అది గాఢంగా నిద్రపోయేటప్పుడు కనీసం 20 సార్లయినా వివిధ భంగిమలలో దాని చెవిని ఫొటోలు తీసి, తన ఫ్రెండ్‌కు పంపింది. ఆమె ఆ ఫొటోలను జూమ్ చేసింది. అందులో ఆమెకు ట్రంప్ ముఖం కనిపించింది. వెంటనే ఆమె ఆ విషయాన్నే జేడ్ చెవిన వేసింది. జేడ్ ఊరుకోలేదు. తన ముద్దుల చెఫ్ వైద్యానికయ్యే ఖర్చులకోసం సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ట్విటర్లో పోస్ట్ చే సింది. దానికోసం ఓ పేజ్ కూడా క్రియేట్ చేసింది. దీనిపై నలుగురూ నాలుగు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది. సుస్మితా లుక్సూపర్! నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ త్వరలో 42వ ఏట అడుగు పెట్టబోతోంది. గతంలో ఆమె నిర్ణయం తీసుకుంది. అదేమంటే, బాడీ షేపవుట్ కాకుండా ఫిట్‌గా ఉంచుకోవాలని...ముఖంపై ఏమాత్రం ముడతలు పడకుండా చూసుకోవాలని. వీటిని కాస్మటిక్ ట్రీట్మెంట్లు, శస్త్రచికిత్సలతో కాకుండా ఎక్సర్సైజ్లు, డైటింగ్ ద్వారా మాత్రమే సాధించాలని. ఈ 19న బర్త్‌డే చేసుకోబోతున్న సుస్మిత ప్రస్తుతం షార్జాలో ఉంది. తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. కుర్చీని తొడిగేసుకోవచ్చు విలన్ విలాసంగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఎదురుగా హీరో నిలబడి ఉంటాడు. హీరోని కూర్చోమని కుర్చీ చూపించే కనీస మర్యాద మన తెలుగు విలన్‌కు ఉండదు. కనుచూపు మేరలో ఉన్న కుర్చీని కండువాతో లాగి, దాని మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని దర్పాన్ని ఒలకబోస్తాడు మన హీరో. ఇకపై మన హీరోలు కుర్చీ కోసం లేనిపోని ఫీట్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కుర్చీని తొడిగేసుకోవచ్చు. అదేంటి ఫ్యాంటా? కోటా? తొడిగేసుకోవడానికి అని ఆశ్చర్యపోకండి. ఇంచక్కా ఫ్యాంటులాగానే ఒంటికి తొడిగేసుకునే కుర్చీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ కుర్చీలాంటి కుర్చీని ఫ్యాంటుకు తొడిగేసుకుని ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు. కూర్చోమని ఎవరూ కుర్చీ చూపించకపోయినా, దర్పానికి లోటు రాకుండా ఎక్కడంటే అక్కడ కాలు మీద కాలేసుకుని భేషుగ్గా కూర్చోవచ్చు. ‘నూనీ ఏజీ’ అనే స్విస్ కంపెనీ ఈ తొడుక్కునే కుర్చీని రూపొందించింది. దీని ధర దాదాపు వెయ్యి డాలర్లు. మన లెక్కల్లో చెప్పుకోవాలంటే సుమారు రూ.60 వేలు. -
మణి సినిమాలో మన హీరో లేడు..!
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన మణిరత్నం ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాతో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు ఒకేసారి హిందీలోనూ ఓ సినిమాకు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడన్న ప్రచారం జరిగింది. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో నాని మరో హీరోగా నటించనున్నాడన్న టాక్ వినిపించింది. ఈ వార్తలపై దర్శకుడు మణిరత్నం క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తెలుగు, హిందీ భాషల నుంచి ఎవరినీ ఎంపిక చేయలేదని తెలిపారు. హీరోయిన్లుగా సీనియర్ నటి జ్యోతికతో పాటు ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లు అదనపు ఆకర్షణలుగా నిలువనున్నాయి. మద్రాస్ టాకీస్ బ్యానర్ పై 17వ సినిమాగా మణిరత్నం స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
పాటపాడి అలరించనున్న హీరో తండ్రి..
చెన్నై: తెలుగు చిత్రపరిశ్రమలో 15 శాతం జీఎస్టీ పన్నునే అమలవుతోందని, అక్కడ రాష్ట్రప్రభుత్వాలు అదనంగా పన్నును విధించడం లేదని సీనియర్ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ పేర్కొన్నారు. ఆయన కుమారుడు శింబు హీరోగా నటించిన ఇదునమ్మ ఆళం చిత్రం సరసుడు పేరుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు తమిళనాడులో విడుదల కానుంది. తమిళంలో శింబు, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని శింబు ఆర్ట్స్ పతాకంపై టి. రాజేందర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈయన రెండో కుమారుడు కురలరసన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రంలో 50,60 సన్నివేశాలను రీషూట్ చేసి తెలుగులో నేరు చిత్రంగా విడుదల చేస్తున్నారు. అదే విధంగా తమిళంలో పొందుపరచని హలో పాటను తెలుగు చిత్రంలో చేర్చామని, ఈ పాట యువతను అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. దీనికి సరసుడు అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో టి. రాజేందర్ ఒక పాటను రాయడంతోపాటు ఒక పాటను పాడటం విశేషం. సరసుడు చిత్రాన్ని తానే శింబు ఆర్ట్స్ బ్యానర్లో సొంతంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమసాగరం చిత్రం నుంచి తనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. అదే విధంగా తన కొడుకు శింబు నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి మంచి విజయాన్ని సాధించయన్నారు. అలా, మన్మధ, వల్లభ చిత్రాల తరువాత ఈ సరసుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.