Life Threaten to Simbu: Usha Rajendar Complaint Against Producer - Sakshi
Sakshi News home page

Actor Simbu: నటుడు శింబుపై భారీ కుట్రలు

Published Fri, Oct 22 2021 2:43 PM | Last Updated on Fri, Oct 22 2021 5:29 PM

Life Threaten to Simbu: Usha Rajender Complaint Against Producer - Sakshi

తమిళసినిమా: నటుడు శింబుపై కుట్రలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులైన దర్శకుడు టి.రాజేందర్, ఉషా రాజేందర్‌ బుధవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు ఎగ్మూర్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ నిర్మించిన అన్భాదవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రంలో తన కొడుకు శింబు కథానాయకుడిగా నటించారన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న టి.రాజేందర్, ఉషా రాజేందర్‌ 

అయితే అతనికి నిర్మాత పూర్తిగా పారితోషికం చెల్లించలేదని, అలాంటిది శింబునే ఆయనకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారన్నారు. శింబుపై రెడ్‌కార్డు వేయాలనే కుట్ర జరుగుతోందని టి.రాజేందర్‌ ఆరోపించారు. ఉషా రాజేందర్‌ మాట్లాడుతూ ఈకుట్రను సీఎం స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఆయన ఇంటి ముందు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 

 చదవండి: (క్లాస్‌ అయినా మాస్‌ అయినా.. మోత మోగాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement