
'నేను కేవలం నా కొడుకు కోసమే విదేశాలకు వెళ్తున్నా. నా కొడుకు చాలా గొప్పవాడు. ఎంతో మంచివాడు. ఎందుకంటే గత కొద్దిరోజులుగా శింబు అమెరికాలోనే ఉండి నా వైద్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. నా కోసం తన తర్వాతి సినిమా షూటింగ్‌లు, ఆడియో ఫంక్షన్స్‌ను వాయిదా వేసుకున్నాడు.
T Rajendar Gets Emotional During Going To US For Medical Treatment: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు టి. రాజేందర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతూ చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వైద్యుల సూచన మేరకు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అయితే అమెరికాకు పయనమయ్యే సమయంలో మంగళవారం (జూన్ 14) రాత్రి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన ఆరోగ్యం, కొడుకు శింబు గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు.
'నేను కేవలం నా కొడుకు కోసమే విదేశాలకు వెళ్తున్నా. నా కొడుకు చాలా గొప్పవాడు. ఎంతో మంచివాడు. ఎందుకంటే గత కొద్దిరోజులుగా శింబు అమెరికాలోనే ఉండి నా వైద్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. నా కోసం తన తర్వాతి సినిమా షూటింగ్‌లు, ఆడియో ఫంక్షన్స్‌ను వాయిదా వేసుకున్నాడు. శింబు సినిమాల్లో గొప్ప నటుడు మాత్రమే కాదు తన తల్లిదండ్రుల పట్ల మంచి మనసున్న కొడుకు. ఇలాంటి కొడుకును కన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. అలాగే నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నన్ను పలకరించి, నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కమల్ హాసన్, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు.' అంటూ భావోద్వేగంగా తెలిపారు టి. రాజేందర్.
చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్
ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్