Emotional speech
-
Kamala Harris: పోరులో వెనకబడ్డా.. పోరాటం ఆపబోను
వాషింగ్టన్: విజయతీరాలకు కాస్తంత దూరంలో నిలిచిపోయినా పోరాటం మాత్రం ఆపేదిలేదని డెమొక్రటిక్ నాయకురాలు కమలా హారిస్ వ్యాఖ్యానించారు. హోరాహోరీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో పరాజయం పాలైన హారిస్ ఫలితాల తర్వాత తొలిసారిగా స్పందించారు. గురువారం వాషింగ్టన్‌లోని హొవార్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వేలాది మంది పార్టీ మద్దతుదారుల సమక్షంలో ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు. 60 ఏళ్ల హారిస్ గతంలో ఇదే వర్సిటీలో రాజనీతి, ఆర్థికశాస్త్రం చదువుకున్నారు.నా హృదయం నిండిపోయింది‘‘దేశంపై ప్రేమతో, దేశం కోసం పాటుపడుతూ మీరంతా నాపై ఉంచిన నమ్మకం, ప్రేమతో ఈ రోజు నా హృదయం నిండిపోయింది. ఈ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం దక్కలేదు. నిజానికి ఇలాంటి ఫలితం కోసం మనం పోరాడలేదు. మీరంతా ఓటేసింది కూడా ఇలాంటి ఫలితం కోసం కాదు. అయితే ఒక్కటి మాత్రం నిజం. అమెరికా అభ్యున్నతి కోసం మనందరం చేసిన ప్రతిజ్ఞా జ్వాల ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. ఓడిపోయాక పార్టీ అశేష అభిమానుల్లో పెల్లుబికి వస్తున్న భావోద్వేగాలను అర్థంచేసుకోగలను. అయినాసరే ఈ ఫలితాలను అంగీకరించక తప్పదు. ఫలితం ఎలా ఉన్నా ఆమోదించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. నేను ఈ ఫలితాలను, ఓటమిని అంగీకరిస్తున్నా. అయితే పోరాటాన్ని మాత్రం ఆపబోను’’ అని అన్నారు. ట్రంప్‌ను విష్ చేశాగత ఎన్నికల్లో ఓడినాసరే ఓటమిని అంగీకరించకుండా ట్రంప్ ప్రభుత్వం సాఫీగా అధికార మార్పిడి జరక్కుండా అడ్డుకున్న అంశాన్ని హారిస్ ప్రస్తావించారు. ‘‘ అధ్యక్ష్య ఎన్నికల్లో రెండోసారి గెలిచిన ట్రంప్‌కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పా. కాలపరిమితి ముగిశాక శాంతియుతంగా అధికార మార్పిడికి మా ప్రభుత్వం సాయపడుతుందని హామీ ఇచ్చా. మన దేశంలో ఒక అధ్యక్షుడికో, రాజకీయ పార్టీకో నిబద్దులై ఉండాల్సిన పనిలేదు. కానీ దేశ రాజ్యాంగానికి ఖచ్చితంగా మనం బద్ధులమై ఉండాలి. ఎన్నికలు ముగియడంతో మన పోరాటం ముగిసిపోలేదు. మన పోరాటం కొనసాగుతుంది. అగ్రరాజ్య ఆవిర్భావానికి పునాదులైన సూత్రాలకు కట్టుబడి ఉందాం. కొన్నిసార్లు పోరాటం అనేది సుదీర్ఘకాలం కొనసాగొచ్చు. అంతమాత్రాన మనం గెలవబోమని కాదు. గెలిచేదాకా పోరాటం ఆపకపోవడమే ఇక్కడ ముఖ్యం. స్వేచ్ఛా, అవకాశాలు, పారదర్శకత, ప్రజలకు మెరుగైన జీవితం అందించేదాకా మన పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం, శాంతి, సమానత్వం, న్యాయం కోసం నా పోరు ఆగదు. స్వేచ్ఛ కోసం జరిపే సమరం చాలా శ్రమతో కూడుకొని ఉంటుంది. ఇలాంటి కష్టాన్ని మనం ఇష్టపడతాం. మన దేశం కోసం ఆమాత్రం కష్టపడటం సబబే. ఫలితాల తర్వాత మనం ఓటమి చీకట్లోకి జారుకుంటున్నామని చాలా మంది భావించి ఉండొచ్చు. కానీ ఈ కష్టకాలం పెద్ద విషయమే కాదు’’ అని అన్నారు.సభలో గంభీర వాతావరణంపార్టీ ఓటమితో డెమొక్రాట్లలో ఒకింత నైరాశ్యం నిండింది. సభకు వేలాది మంది వచ్చినా సరే కొన్ని నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. మధ్యమధ్యలో హారిస్ తన ఉత్సాహభరితమైన ప్రసంగంతో వాళ్లలో హుషారు నింపే ప్రయత్నంచేశారు. పార్టీ సీనియర్ నేతలు కొందరు ప్రసంగించారు. దిగువసభ మాజీ మహిళా స్పీకర్ నాన్సీ పెలోసీ, డీసీ మేయర్ మురేల్ బౌసర్ తదితరులు మాట్లాడారు. పార్టీ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న కొందరు యువ ఓటర్లు, మద్దతుదారులు సభలోనే కన్నీటిపర్యంతమయ్యారు. -
తల్లి పడిన కష్టాలు చెప్పి ఏడిపించిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
Sonia Gandhi: రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నా
రాయ్‌బరేలి: ‘నా కుమారుడిని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నా. రాహుల్ మిమ్మల్ని నిరాశపర్చడు’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ శుక్రవారం రాయ్‌బరేలీలో ప్రచార సభలో పేర్కొన్నారు. ఎంపీగా 20 ఏళ్లు మీకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందకు ధన్యావాదాలని అన్నారు. ‘నాకున్న ప్రతిదీ మీరిచి్చందే. కాబట్టి సోదరసోదరీమణులారా నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా. మీరంతా నన్ను మీ దానిగా భావిస్తారు’ అని అన్నారు. ఓటర్లతో భావోద్వేగ పూరితమైన బంధాన్ని నెలకొల్పే ప్రయత్నంలో రాహుల్‌నీ మీ సొంతవాడిగా భావించాలని విజ్ఞప్తి చేశారు. వేదికపై రాహుల్, ప్రియాంక గాం«దీలు సోనియా పక్కన నిలబడ్డారు. ‘ఇందిరా గాం«దీ, రాయ్‌బరేలీ ప్రజలు నాకు నేర్పిన విలువలు, పాఠాలనే నేను రాహుల్, ప్రియాంకలకు నేర్పాను. అందరినీ గౌరవించండి. బలహీనుల పక్షాన నిలబడి వారిని కాపాడండి. అన్యాయాలను ఎదిరించండి. ప్రజల హ క్కుల కోసం పోరాడండి. భయపడొద్దు. పోరాటాలు, సంప్రదాయాల్లో మీ మూలాలు బలంగా ఉన్నాయి’ అని వారిద్దరికీ నేర్పానని సోనియా గాంధీ అన్నారు. సోనియా తొలిసారిగా 2004లో రాయ్‌బరేలి ఎంపీగా గెలిచారు. రాజ్యసభకు ఎన్నికై ఇటీవల రాజీనామా చేసేదాకా 20 ఏళ్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ బరిలో ఉన్నారు. 20 ఏళ్లు ఎంపీగా సేవ చేసుకునే అవకాశాన్ని తనకు రాయ్‌బరేలీ ప్రజలు కలి్పంచారని, ఇది తన జీవితంలో అమూల్యమైన ఘట్టమని సోనియా పేర్కొన్నారు. గత 100 ఏళ్లుగా తన కుటుంబం మూలాలు ఇక్కడి నేలతో ముడిపడి ఉన్నాయన్నారు. ఈ బంధం ఎంతో పవిత్రమైనదని, గంగా మాతతో అవధ్, రాయ్‌బరేలి రైతులకు ఉన్న బంధం లాంటిదే ఇదని పేర్కొన్నారు. రాయ్‌బరేలీకి ఇందిరా గాంధీ హృదయంలో ప్రత్యేక స్థానముందని, ఆమె పనిని తాను దగ్గరగా గమనించానని, రాయ్‌బరేలీ ప్రజల పట్ల ఇందిరకు ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. అనారోగ్య కారాణాలు వల్ల సోనియా గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ కుమారుడి కోసం శుక్రవారం ప్రచారం చేయడం గమనార్హం. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. సోనియాకు ముందు మాట్లాడిన రాహుల్ దేశంలోని యువత ఒక నిశి్చతాభిప్రాయానికి వచ్చారని, వారు మోదీని కోరుకోవడం లేదని తెలిపారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, అది ప్రజాప్రభుత్వమని చెప్పారు. భారత రాజ్యాంగ ప్రతిని చూపుతూ దీన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చింపి పాడేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. రాయ్‌బరేలీతో సమానంగా అమేథీని చూస్తా తాను గెలిస్తే అభివృద్ధి విషయంలో రాయ్‌బరేలి, అమేథీలను సమానంగా చూస్తానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమేథీలో మూడుసార్లు ఎంపీగా నెగ్గిన రాహుల్ 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి, తమ కుటుంబానికి నమ్మినబంటు కిశోరీలాల్ శర్మ తరఫున రాహుల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌తో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ‘రాయ్‌బరేలిలో అభివృద్ధి పనులకు రూ. 10 ఖర్చు చేస్తే అదే పది రూపాయలు అమేథిలోనూ ఖర్చు పెడతాం.. అది నా హామీ’ రాహుల్ పేర్కొన్నారు. అమేథీ ప్రజలకు 40 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించినందుకు కిశోరీలాల్ శర్మకు ధన్యవాదాలు చెప్పారు. అగి్నవీర్ నియామక విధానాన్ని రద్దు చేసి పరి్మనెంట్ నియామక పద్ధతిని తీసుకొస్తామని.. దీంట్లో పెన్షన్‌కు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. -
నేను యోధురాలిని.. పంకజా ముండే ఎమోషనల్ స్పీచ్
నేను ధైర్యమున్న యోధురాలిని. పార్లమెంటులో కూర్చుని మీ కోసం పోరాడతా.. అంటూ మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే ఎమోనల్ స్పీచ్‌తో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పరాలిలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బంధువు ధనంజయ్ ముండే చేతిలో ఇక్కడి నుంచే ఆమె ఓడిపోయారు. తాజాగా పరాలికి విచ్చేసిన పంకజా ముండేకు ఘన స్వాగతం లభించింది. ఆమె సాంప్రదాయ బంజారా దుస్తులు ధరించిన ఆమె లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని పరాలివాసులను కోరారు. "నేను ధైర్యమున్న యోధురాలిని. నేను పార్లమెంటులో కూర్చుని మీ కోసం పోరాడుతాను. నా బంజారా సోదరులు, సోదరీమణుల కోసం సూర్య చంద్రులు, నక్షత్రాలతో సైతం పోరాడతాను" అంటూ అక్కడ గుమికూడిన ప్రజల నినాదాలు, చప్పట్ల మధ్య భావోద్వేగంతో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. గోపీనాథ్ ముండేను అన్ని వర్గాలు ప్రేమిస్తున్నాయని, ఆయనను స్మరించుకోని సమాజం లేదని అన్నారు. బంజారా సమాజానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి సుధాకరరావు నాయక్‌తో తన తండ్రికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు. -
ఆ రోజు కన్నీళ్లు కార్చాను.. మంత్రి పొంగులేటి ఎమోషనల్
సాక్షి, ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారని, నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారంటూ వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఖమ్మం నగరంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఆత్మీయ సత్కారంలో మంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆ కుటుంబం చెప్పిందే వేదం.. గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది. మా ప్రభుత్వంలో ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి ఎమోషనల్.. నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చానని.. ఆ రోజు అభిమానులు బాధపడతారని వారి ఎదుట ఎమోషనల్ కాలేదని.. మంత్రి పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు. ఇదీ చదవండి: ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్.. ఎంపీ రేసులో మంత్రి సతీమణి? -
మన దాకా వస్తే కానీ ఎన్టీర్,సాయి ధరమ్ తేజ్,చెపింది అర్ధం కాదు
-
మెంటల్ గా, ఫిసికల్ గా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది...
-
లైంగిక ఆరోపణలు.. కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే రాజయ్య..
-
ఉక్రెయిన్‌కి ఇది పునర్జన్మ! ఇక రాజీపడేదే లే!: జెలెన్స్కీ
Volodymyr Zelensky emotional speech: రష్యాతో ఆధిపత్యం నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ఇది 'పునర్జన్మ' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఎప్పటికీ తన పోరాట స్ఫూర్తిని వదులుకోదు అని ఉక్రెయిన్ 31వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం చేసిన ప్రసంగంలో భావోద్వేగంగా మాట్లాడారు. ఈ మేరకు జెలెన్ స్కీ మాట్లాడుతూ... ఫిబ్రవరి 24 తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమైంది యుద్ధం. ఆ రోజు ప్రపంచంలో ఒక కొత్త దేశం కనిపించింది. ఏడ్చి కేకలు వేయని, భయపడని దేశం. తమ దేశాన్ని పరుల వశం కానివ్వం. ఆ దురాక్రమణను అంత తేలిగ్గా మరిచిపోం అని అన్నారు. గత ఆరు నెలల యుద్ధ కాలంలో తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యాతో ఇక రాజీపడేది లేదని, తాడో పేడో తేల్చుకోవడమేనని నొక్కి చెప్పారు. తలపై తుపాకి పెట్టినా తాము భయపడమని, తమను యుద్ధ ట్యాంకులు, విమానాలు, క్షిపణులు భయపట్టవని, కేవలం తమ స్వేచ్ఛను బంధించే సంకెళ్లను చూసే భయపడతామని అన్నారు. అంతేకాదు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పంతో పాటు తూర్పున పారిశ్రామిక డాన్బాస్ ప్రాంతంలోని కోల్పోయిన భూభాగాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవ వేళ రష్యా మరింతగా విధ్వసం సృష్టింస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాజధాని కీవ్ వీధులన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. చదవండి: యుద్ధంపై విమర్శ... రష్యాన్ రాజకీయవేత్తపై వేటు..) -
నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్
Amma Rajasekhar Fires On Nithin And Get Emotional: హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం నితిన్ నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన రారా రెడ్డి అనే పాట యూట్యూబ్‌లో వైరల్ అయింది. ఈ పాటలో నితిన్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడని ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో నితిన్‌కు డ్యాన్సే రాదని ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యారు. నితిన్ మాటిచ్చి హ్యాండిచ్చాడని, అది తనకు అవమానకరంగా ఉందని స్టేజ్‌పైనే ఎమోషనల్‌కు గురయ్యాడు. విషయంలోకి వెళితే.. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (జులై 10) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నితిన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సినట్లు తెలుస్తోంది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో నితిన్ హాజరు కానట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మ రాజశేఖర్.. పది రోజుల క్రితమే నితిన్‌ను ఈ ప్రోగ్రామ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించా. ఆయన వస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట నమ్మి.. అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్ కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్ చేయించా. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు. ఆయనకు డ్యాన్స్ నేర్పించి, ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్ అయినా పంపమని కోరాను. అది కూడా ఇవ్వలేదు. నితిన్‌కే కాదు హీరోలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్లినా.. అందుకు సహాయపడినవారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నితిన్.. నువ్ రాలేను అనుకుంటే రానని నేరుగా చెప్పేయాల్సింది. వస్తానని చెప్పి రాకుండా నన్ను ఎంతో అవమానించారు. నాకెంతో బాధగా ఉంది. అని అమ్మరాజేశేఖర్ ఎమోషనల్ అయ్యారు. కాగా నితిన్ నటించిన 'టక్కరి' మూవీకి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ -
ఆ సినిమాకు మొదట మిశ్రమ రివ్యూలు వచ్చాయి: హీరో
Kiran Abbavaram Speech In Sammathame Movie Success Meet: ''ప్రేక్షకుల వల్లే 'సమ్మతమే' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. నా 'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాకు కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్. 'సమ్మతమే' మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్యూలు వినిపించాయి. అదేరోజు సాయంత్రం ఓ థియేటర్‌కు వెళ్లి చూస్తే హౌస్‌ఫుల్ అయింది.' అని తెలిపాడు కిరణ్ అబ్బవరం. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం 'సమ్మతమే'. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 24న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ''డబ్బులుంటే ఎవరైనా సినిమా తీస్తారు. కానీ హిట్ కొట్టండ ముఖ్యం. మా సొంత డబ్బులతో 'సమ్మతమే' తీసి, సూపర్ హిట్ కొట్టడం హ్యాపీగా ఉంది' అని గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ''సమ్మతమే' సినిమాను బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని ప్రవీణ తెలిపారు. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి -
మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి
Akash Puri Emotional Speech In Chor Bazaar Success Meet: ''చోర్ బజార్' సినిమాతో మాస్ హీరోగా మెప్పించాననే పేరు నాకు దక్కింది. జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డిదే. నా గత చిత్రాల (మెహబూబా, రొమాంటిక్) కన్నా 'చోర్ బజార్' గ్రాండ్‌గా ఉందంటున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్ రాజు'' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 24) విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సమావేశంలో ''ఫస్ట్ టైమ్ 'చోర్ బజార్' వంటి ఒక కమర్షియల్ సినిమా చేశాను. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 'మా శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్' అని నిర్మాత వీఎస్ రాజు తెలిపారు. చదవండి:👇 చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
నేను జీరో.. ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్తా: ఆకాష్ పూరి
'ఆకాష్‌కి ఏంటి? పూరి జగన్నాథ్ కొడుకు అనుకుంటారు. కానీ, మా నాన్న స్టార్ డైరెక్టర్ కాకముందే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. మా నాన్న నా పక్కన లేకుంటే నేను జీరో.. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహానా సిప్పీ జంటగా నటించిన చిత్రం చోర్ బజార్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీ యూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 'చోర్ బజార్ బాగా తీస్తావనే నమ్మకం ఉంది. మా అబ్బాయి (ఆకాష్)తో మంచి సినిమా చెయ్ అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది' అని తెలిపారు. 'కలర్‌ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారు' అని నిర్మాత వీఎస్ రాజు పేర్కొన్నారు. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాష్ పూరీ -
చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు.. ఎయిర్‌పోర్టులో ఎమోషనల్
T Rajendar Gets Emotional During Going To US For Medical Treatment: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు టి. రాజేందర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతూ చెన్నైలోని ఓ హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వైద్యుల సూచన మేరకు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అయితే అమెరికాకు పయనమయ్యే సమయంలో మంగళవారం (జూన్ 14) రాత్రి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన ఆరోగ్యం, కొడుకు శింబు గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. 'నేను కేవలం నా కొడుకు కోసమే విదేశాలకు వెళ్తున్నా. నా కొడుకు చాలా గొప్పవాడు. ఎంతో మంచివాడు. ఎందుకంటే గత కొద్దిరోజులుగా శింబు అమెరికాలోనే ఉండి నా వైద్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. నా కోసం తన తర్వాతి సినిమా షూటింగ్‌లు, ఆడియో ఫంక్షన్స్‌ను వాయిదా వేసుకున్నాడు. శింబు సినిమాల్లో గొప్ప నటుడు మాత్రమే కాదు తన తల్లిదండ్రుల పట్ల మంచి మనసున్న కొడుకు. ఇలాంటి కొడుకును కన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. అలాగే నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నన్ను పలకరించి, నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కమల్ హాసన్, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు.' అంటూ భావోద్వేగంగా తెలిపారు టి. రాజేందర్. చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్ -
కాఫీ, టీ మోశాను.. కన్నీళ్లు పెట్టుకున్న నటి ప్రగతి
Actress Pragathi Emotional Speech In F3 Success Meet: దగ్గుబాటి విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మెహరీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్‌గా నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ 'ఎఫ్ 3' (F3). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కొల్లగొట్టిందని సమాచారం. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్లో చిత్రబృందం వారి అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే నటి ప్రగతి వ్యక్తిగత విషయాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో మంచి పాత్రలు చేశాను. కానీ నాకు తగ్గ పాత్రలు పడలేదన్న వెలితి ఎప్పుడూ ఉండేది. ఆ ఒత్తిడి తట్టుకోలేకే కొన్నిరోజులు బ్రేక్ కూడా తీసుకున్నాను. కాఫీ, టీ మోయడం దగ్గర నుంచి పెద్ద విలన్ పక్కన నిలోచవడం, అందమైన, యంగ్ అమ్మ పాత్ర వరకు చాలా సినిమాల్లో సెట్ ప్రాపర్టీలాగే పనిచేశాను. అవేవీ సంతృప్తి ఇవ్వలేదు. కానీ ఒక మంచి పాత్ర ఎఫ్ 2 రూపంలో ఒక బ్లెస్సింగ్ వచ్చింది. తర్వాత ఎఫ్ 3లో అవకాశంతోపాటు నా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నాకెంతో సంతృప్తినిచ్చింది.' అని ఎమోషనల్ అయ్యారు ప్రగతి. చదవండి: నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ -
దేశం వదిలి వెళ్లిపోదామనుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్ కౌర్
Poonam Kaur Gets Emotional In Nathi Charami Movie Press Meet: 'మాయాజాలం' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది పూనమ్ కౌర్. తర్వాత పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. సరైన అవకాశాలు లేక నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే చాలా గ్యాప్ తర్వాత పూనమ్ ఒక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమానే అరవింద్ కృష్ణ, సందేష్ బురి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నాతి చరామి'. నాగు గవర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియే 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మార్చి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం (మార్చి 8) హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో పూనమ్ కౌర్ భావోద్వేగానికి గురైంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో తాను కన్నీళ్లు ఆపుకోలేక పోయానని తెలిపింది. తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్లు పేర్కొంది. '2017, 18లో నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోదామనుకున్నా. కానీ నా జీవితాన్ని మార్చేసింది సినిమానే. తర్వాత ఇక సినిమాలు చేయను. పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోతానని మమ్మీకి చెప్పాను. దేశం వదిలి వెళ్లిపోతానని చెప్పా. కానీ చాలా క్లిష్టతరమైన పరిస్థితిలో రియలైజ్ అయ్యాను. దానివల్లే ఇక్కడ ఉన్నాను. ప్రతిరోజూ సీత, దుర్గా, ద్రౌపదిలానే తలచుకునేదాన్ని. అందువల్లే చాలా శక్తిని, ధైర్యాన్ని పొందాను. మధ్య తరగతి అమ్మాయిలకు చాలా కలలుంటాయి. అందులో ప్రత్యేకమైనది పెళ్లి. ఆ పెళ్లి కలను కొందరు చెదరగొట్టారు. అయితే ఇండియన్ కల్చర్‌లోనే మహిళలు ఎలా ధైర్యంగా ఉండాలనేది, పోరాడలనేది ఉంది. దాన్నుంచే నేను స్ఫూర్తి పొందాను. ఈ విషయంలో అమ్మ ఎంతో సపోర్ట్ చేసింది.' అని తెలిపింది పూనమ్. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ క్రమంలోనే ఉమెన్ సెంట్రిక్ మూవీ ఒకటి ఉందని నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిందని పూనమ్ కౌర్ పేర్కొంది. ఇది నిజజీవిత సంఘటనల ఆధారంగా, భార్య గురించి చెప్పే కథ అని తెలిసాక ఒప్పుకున్నట్లు వెల్లడించింది. 'నాతి చరామిలోని శ్రీలత పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. మూడేళ్ల క్రితం నా ఆలోచనలు 18 ఏళ్ల అమ్మాయిలా ఉన్నాయి. ఇప్పుడు 50 ఏళ్ల మహిళగా ఉన్నాయి.' అని పూనమ్ కౌర్ వివరించింది. -
కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంది
-
ఏ పదవీ శాశ్వతం కాదు
హవేరి: ఏ పదవీ శాశ్వతం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అన్నారు. హవేరి జిల్లాలోని సొంత నియోజకవర్గమైన షిగగావ్లో ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పదవులు, హోదాలతో సహా ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్నారు. జీవితమూ అంతేనన్నారు. ‘ఎంత కాలం ఉంటామో.. ఏ హోదాలో ఉంటామో ఎవరికీ తెలియదు. పదవులు, హోదాలు శాశ్వతం కాదు. ఈ వాస్తవం అనుక్షణం నా మదిలో మెదులుతూ ఉంటుంది. అవతలి వారికి నేను సీఎంను కావొచ్చు. కాని షిగగావ్కు వస్తే మీ బసవరాజ బొమ్మైని మాత్రమే. బసవరాజ అనే పేరు శాశ్వతం. పదవులు కాదు’ అని బొమ్మై వ్యాఖ్యానించారు. దాంతో బొమ్మై ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతారనే ఊహాగానాలు కొన్నివర్గాల నుంచి మొదలయ్యాయి. బొమ్మై మోకాలి సమస్యతో బాధపడుతున్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళతారని వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ నేపథ్యంలో సీఎంను మారుస్తారనే ఊహాగానాలు కొన్నివర్గాల్లో వినపడుతున్నాయి. -
'నా కల నెరవేరింది'.. వెంకటేశ్ అయ్యర్ ఎమోషనల్
Venkatesh Iyer Emotional After Debut For Team India In T20Is.. కేకేఆర్ స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 మ్యాచ్‌లో టీమిండియా తరపున టి20ల్లో 93వ ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు వెంకటేశ్ అయ్యర్ ఎమోషనల్ అయ్యాడు. ''దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతీ ఒక్కరికి ఒక కల. ఈరోజుతో నా కల నెరవేరింది. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తా. ఇక కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఆడేందుకు మంచి ఉత్సాహంతో ఉన్నా. ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగుతున్న నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇక బౌలింగ్‌లోనూ చేయి అందించడానికి ఎదురుచూస్తున్నా. స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య ఆడడం కొత్త అనుభూతినిస్తుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. https://t.co/Qud6f60uhQ — varun seggari (@SeggariVarun) November 17, 2021 The grin says it all! 😊 A moment to cherish for @ivenkyiyer2512 as he makes his #TeamIndia debut. 👏 👏#INDvNZ @Paytm pic.twitter.com/2cZJWZBrXf — BCCI (@BCCI) November 17, 2021 -
ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది కల.. ఈరోజుతో నెరవేరింది
కొలంబో: ''ఈ ప్రదర్శనే నేను కలగన్నది.. ఈరోజుతో నెరవేరింది.. అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాను.. దేశానికి విజయం అందించడం గర్విస్తున్నా'' అంటూ దీపక్ చహర్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్‌తో అభిమానులకు హీరోగా మారిపోయాడు. దీపక్ చహర్ ఈ ఇన్నింగ్స్‌ను టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆడాడే కాబట్టే అంత క్రేజ్ వచ్చింది. అయినా టీమిండియా ఆడుతోంది.. శ్రీలంకతోనే కదా అని చిన్నచూపు మాత్రం చూడొద్దు. వాస్తవానికి లంక జట్టు ప్రదర్శన బాగుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియాతో సమానంగా నిలిచింది. దానికి ఉదాహరణే రెండో వన్డే.. మొదట బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి 193 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత దీపక్ చహర్, భువనేశ్వర్‌తో కలిసి చిరస్మరణీయ భాగస్వామ్యం నమోదు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న చహర్ స్పందించాడు. 'దేశానికి విజయం అందించేందుకు మరో దారి లేదు. అన్ని బంతులు ఆడాలని రాహుల్ ద్రవిడ్ సర్ చెప్పారు. ఆయన కోచింగ్‌లో నేను భారత్-ఏ తరఫున కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడాను. ఆయనకు నాపై నమ్మకం ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు నేను సరిపోతానని అన్నారు. నమ్మకం ఉంచారు. ఇకపై జరిగే మ్యాచుల్లో నా వరకు బ్యాటింగ్ రాదనే అనుకుంటున్నా. లక్ష్యం 50 పరుగుల్లోపు వచ్చినప్పుడు గెలుస్తామనే ధీమా కలిగింది. అంతకుముందు మాత్రం ఒక్కో బంతిని ఆడుతూ పరుగులు చేశా. నా ఇన్నింగ్స్ సమయంలో కోచ్ ద్రవిడ్ డ్రింక్స్ బాయ్‌గా ఉన్న నా సోదరుడు రాహుల్ చహర్‌కు బ్యాటింగ్ పరంగా కొన్ని కీలక సూచనలు ఇచ్చి పంపించాడు. డ్రింక్స్ విరామం సమయంలో రాహుల్ నా దగ్గరకు వచ్చి ద్రవిడ్ సూచనలు అందించాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని నేనెప్పటి నుంచో కలగంటున్నా.ఈరోజుతో అది నెరవేరింది.' అని పేర్కొన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Will never forget this moment #teamindia #dream . Thank you so much for your wishes means a lot ☺️🙏 #keepsupporting pic.twitter.com/y0iGLAaaKY — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) July 21, 2021 -
‘పిల్లగాడు గెలుస్తడా అన్నరు. కానీ గెలిపించిండ్రు’
సాక్షి, హుజూరాబాద్: ‘‘ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ అంతిమ విజయం వాటిదే. కులం, డబ్బు, పార్టీ, జెండాలను కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు నేను ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ గాయపడినా నా మనసు మార్చుకోను. నాలాంటి వాడు మీముందుకు వచ్చి దేహీ అనే పరిస్థితి మంచిది కాదు..’’అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల భావోద్వేగంగా మాట్లాడారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘నేను చేసిన పనులు చెప్పుకునే అక్కర్లేదు. నేను కొత్తగా వచ్చిననాడు ఈ పిల్లగాడు గెలుస్తడా అన్నరు. కానీ మీరు ఆశీర్వదించి గెలిపించారు. 20 ఏళ్లుగా నా చరిత్ర మీ కాళ్ల దగ్గర పెట్టిన. మళ్లీ ఇప్పుడు వచ్చి పని చేస్తానో లేదో చెప్పుకునే దుస్థితి ఉంటుందా? నేను ఎలాంటి వాడినో, ఎవరి కోసం తపన పడతానో మీకు తెలుసు’’అని ఈటల అన్నారు. పథకాలు పేదరికానికి పరిష్కారం కాదన్నారు. ‘పరిగె ఏరుకుంటే రాదు.. పంట పండితే వస్తుంది’అనే సామెత ఉందని.. అలాగే కల్యాణలక్ష్మి, పెన్షన్లు, రేషన్ కార్డులు పేదరికానికి పరిష్కారం కాని వ్యాఖ్యానించారు. అందరూ తమ కాళ్లమీద తాము నిలబడే సత్తా తీసుకురావాలని.. పని చేయగలమనే కాన్ఫిడెన్స్ రావాలని చెప్పారు. ఊరంతా ఒక దారైతే.. ఊరంతా ఒకదారైతే ఊసరవెల్లిది ఇంకోదారి అన్నట్టు కొందరు ఉంటారని.. బంగారు గొలుసులు, ఉంగరాలు పెట్టుకుంటే గొప్పతనం కాదని, దానం చేసే గుణం ఉండాలని ఈటల పేర్కొన్నారు. మహాభారతంలో కౌరవులు, దుర్యోధనుడు వంటివారు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని.. సమాజంలో అందరూ ఒకే విధంగా ఉండరని చెప్పారు. నాయకులంటే భారీ ఆకారంతో, ఆభరణాలతో, కులంతో పని ఉండదని.. ప్రజల కన్నీళ్లు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి అని పేర్కొన్నారు. రైతు బాగుంటే ఊరంతా బాగుంటుందని, అలాంటి రైతుకు ఆసరాగా ఉండేందుకే రైతు వేదిక వచ్చిందని చెప్పారు. తాను ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు మచ్చ తీసుకురానని, రుణం తీర్చుకుంటానని ఈటల అన్నారు. చదవండి: కరోనా కేసులతో తెలంగాణ సర్కార్ అలర్ట్ -
ఆ ఇద్దరి నటన చూసి కన్నీళ్లొచ్చాయి: మోహన్‌బాబు
‘‘జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మోసపోతారు. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను మోసపోయాను?’ అని నా భార్య (నిర్మల) నాతో చెప్పింది (నవ్వుతూ...). ఆ మాట ఎందుకు అన్నదో నాకు అర్థం కాలేదు. ఆమె నన్ను మోసం చేసిందో... నేను ఆమెను మోసం చేశానో లక్ష్మి, విష్ణు, మనోజ్లకే తెలియాలి’’ అని నటుడు మంచు మోహన్‌బాబు సరదాగా అన్నారు. విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘సునీల్ శెట్టి అద్భుతమైన నటుడు. ‘మోసగాళ్ళు’లో కూడా బాగా నటించారు. కాజల్ మంచి నటి. పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఈ చిత్రంలో విష్ణుకి అక్కగా చేసినందుకు కాజల్‌ని అభినందిస్తున్నాను. హీరోయిన్గా ఉన్న నువ్వు అక్క పాత్ర చేయడం గ్రేట్. జానపద గాయని కోమలికి మన తర్వాతి సినిమాలో పాడే అవకాశం ఇద్దామని విష్ణు చెప్పాడు. కచ్చితంగా ఆ అవకాశం ఇస్తాను. రానాని చూస్తే ‘బాహుబలి’ గుర్తొస్తుంది. తను మంచి నటుడు. రానా నిర్మాతగా త్వరలోనే నాతో సినిమా చేస్తున్నాడు. ‘మోసగాళ్ళు’ అద్భుతమైన కథ. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమిది. ధైర్యం చేసి ఈ సినిమా తీశాడు విష్ణు. ఈ చిత్రంలో కాజల్– విష్ణు మధ్య సీన్స్ చూసి కన్నీళ్లొచ్చాయి. ఒళ్లు జలదరించింది. ఫ్యామిలీ, సెంటిమెంట్, అర్థం, పరమార్థం ఉన్న ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని మహిళలు, యూత్‌తో పాటు అందరూ చూడొచ్చు. మార్చి 19న నా పుట్టినరోజు. అందుకే ఆ రోజు విడుదల చేస్తున్నాడు విష్ణు’’ అన్నారు. సునీల్ శెట్టి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబుగారు ఒక నటుడిగా, ఫ్రెండ్‌గా నాకెంతో ఇష్టం. ఆయన ఫ్యామిలీతో నటించడమంటే నా కల నెరవేరినట్టుంది. ‘మోసగాళ్ళు’ కథ అందరి హృదయాలకు బాగా దగ్గరైంది.. అందుకే ఎంతో మనసు పెట్టి చేశాం. ప్రతి రోజూ మధ్నాహ్నం మోహన్‌బాబుగారి ఇంటి నుంచి వచ్చే భోజనం తిని నా బరువు కూడా పెరిగాను. ఆయన శ్రీమతిగారికి థ్యాంక్స్’’ అన్నారు. హీరో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే మా సినిమా చేసిన సునీల్ శెట్టికి, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా ఉంటూ నా అక్క పాత్ర చేసిన కాజల్‌కు, నవదీప్, ఎడిటర్ గౌతమ్రాజుగారితో పాటు సహకరించిన మొత్తం టీమ్‌కి థ్యాంక్స్. సునీల్ శెట్టిగారితో చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నాన్నగారి పుట్టినరోజున ‘మోసగాళ్ళు’ విడుదలవడం నా లక్’’ అన్నారు. ‘‘పెళ్లి తర్వాత విడుదలవుతున్న నా తొలి చిత్రం ‘మోసగాళ్ళు’’ అన్నారు కాజల్. అతిథిగా వచ్చిరానా మాట్లాడుతూ– ‘‘మోహ్రా’ సినిమాలో సునీల్ శెట్టి కండలు చూసి 8వ తరగతిలోనే నేనూ జిమ్‌కి వెళ్లడం మొదలెట్టా. ఈ నెల 19న ఒక ప్రత్యేకమైన వ్యక్తి (మోహన్‌బాబు) పుట్టినరోజు. ఆ రోజు థియేటర్‌కి వెళ్లి ‘మోసగాళ్ళు’ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. -
ఆజాద్ వీడ్కోలు.. మోదీ కన్నీరు
న్యూఢిల్లీ: భారతీయ ముస్లిం కావడాన్ని తాను గర్వంగా భావిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. వచ్చేవారం పదవీ విరమణ చేయనున్న ఆజాద్ మంగళవారం రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా ఎంతోమంది నాయకుల నుంచి ఎన్నో నేర్చుకున్నానని ఆజాద్ వ్యాఖ్యానించారు. ప్రజాసేవలో ఆజాద్ చేసిన కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆజాద్‌తో పాటు జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో ముగ్గురు సభ్యులు, నాజిర్ అహ్మద్, శంషేర్ సింగ్ మన్హాస్, మీర్ మొహ్మద్ ఫయాజ్‌ల రాజ్యసభ పదవీకాలం 15న ముగియనుంది. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సొంత పార్టీ ప్రయోజనాలతో పాటు రాజ్యసభ, భారతదేశ ప్రయోజనాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. కరోనా సమయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆజాద్ తనను కోరారని, దాంతో వెంటనే అఖిలపక్ష భేటీ పెట్టానని గుర్తు చేశారు. తాను గుజరాత్ సీఎంగా, కశ్మీర్ సీఎంగా ఆజద్ ఉన్నపుడు తాము మాట్లాడుకునేవారమన్నారు. కశ్మీర్లో గుజరాత్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సమయంలో తనకు మొదట ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది ఆజాదేనని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి గురైన ప్రధాని కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు. ‘అధికా రం వస్తుంది. పోతుంది. కొందరికే ఆ అధికారాన్ని సరిగ్గా వినియోగించడం తెలుస్తుంది. అది ఆజాద్‌కు తెలుసు’అని అన్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య మాట్లాడుతూ.. ప్రజాజీవితంలో ఆజాద్‌ది నిష్పక్షపాత గళమని, ప్రతిపక్షంలోనూ, అధికార పక్షంలోనూ విలువైన సేవలందించారన్నా. పాకిస్తాన్‌కు వెళ్లని అదృష్టవంతుడిని పాకిస్తాన్‌కు ఎన్నడూ వెళ్లని కొద్దిమంది అదృష్టవంతుల్లో తాను కూడా ఒకడినని ఆజాద్ వ్యాఖ్యానించారు. ‘పాకిస్తాన్లో పరిస్థితుల గురించి తెలుసుకుంటుంటే.. భారతీయ ముస్లింను అయినందుకు గర్వంగా ఉంటుంది. పొరుగుదేశాల్లోని దుష్ట శక్తులకు దూరంగా ఉన్నందుకు భారత్‌లోని ముస్లింలు గర్వపడాలి’అన్నారు. సీఎంగా తొలి బహిరంగ సభను సమస్యాత్మక సోపోర్ జిల్లాలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పటికీ అది చాలామందికి అసాధ్యమైన విషయమని వ్యాఖ్యానించారు. ఇందిర, సంజయ్‌ల వల్లనే.. జమ్మూకశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతుందని, కశ్మీరీ పండిట్లు తిరిగి స్వస్థలాలకు తిరిగి వస్తారని ఆశిస్తున్నానని తన ప్రసంగంలో ఆజాద్ పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. విద్యార్థిగా ఉండగానే రాజకీయాల్లో చేరానని, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్‌ల గురించి చదువుకుని దేశభక్తుడిగా మారానని ఆజాద్ వెల్లడించారు. ప్రజాప్రతినిధిగా 41 ఏళ్ల అనుభవం తనదన్నారు. కశ్మీర్లో తాను కాలేజ్ విద్యార్థిగా ఉన్న సమయంలో.. ఆగస్ట్ 14, ఆగస్ట్ 15.. ఈ రెండు తేదీల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగేవన్నారు. మెజారిటీ ప్రజలు ఆగస్ట్ 14వ తేదీన ఉత్సవాలు జరుపుకుంటే, తనతో పాటు మరికొందరు మాత్రం ఆగస్ట్ 15న జెండా పండుగ చేసేవారమన్నారు. రాజకీయంగా తాను ఈ స్థాయికి రావడానికి దివంగత నేతలు ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ కారణమని ఆజాద్ తెలిపారు. దాదాపు నలుగురైదుగురు ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశానని, పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా వ్యవహరించానని, ఈ అనుభవాలు తనకెన్నో విషయాలు నేర్పించాయని వివరించారు. ఇతర రాజకీయ పార్టీల్లోని గొప్ప నేతలైన జ్యోతిబసు, కరుణానిధి, జయలలిత, చంద్ర శేఖర్, ములాయం సింగ్ యాదవ్, ప్రకాశ్‌సింగ్ బాదల్, జీకే మూపనార్, ఫారూఖ్ అబ్దుల్లా, ముఫ్తీ మొహ్మద్ సయీద్ తదితరులతో కలిసి పనిచేశానన్నారు. అటల్ నుంచి నేర్చుకున్నా బీజేపీ దివంగత అగ్ర నేత అటల్ బిహారీ వాజ్‌పేయితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆజాద్ తెలిపారు. ‘అటల్‌జీని తరచూ కలుçస్తూ ఉండమని ఇందిరాజీ నాకు, ఆమె రాజకీయ కార్యదర్శి ఎంఎల్ ఫోతేదార్‌కు చెప్పేవారు’అని గుర్తు చేసుకున్నారు. 1991 నుంచి 1996 వరకు ఉన్న మైనారిటీ ప్రభుత్వంలో తాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉండగా, వాజ్‌పేయిజీ విపక్ష నేతగా ఉన్నారని, ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నానని వినమ్రంగా తెలిపారు. ‘ప్రభుత్వం, ప్రతిపక్షాలు.. రెండూ అంగీకరించేలా సమస్యకు పరిష్కారం ఎలా సాధ్యమో ఆ సమయంలో నేను నేర్చుకున్నాను’అన్నారు. ఐదు సార్లే ఏడ్చాను జీవితంలో 5సార్లే ఏడ్చానని ఆజాద్ చెప్పారు. సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల మరణాలప్పుడు, సునామీ వేళ, జమ్మూకశ్మీర్ సీఎంగా తాను ఉండగా కశ్మీర్లో ఉగ్రదాడిలో గుజరాత్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఏడ్చానన్నారు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా కళ్లలోకి నీళ్లు వచ్చాయి కానీ ఏడవలేదన్నారు. ఈ దేశంలో ఉగ్రవాదం అంతమవ్వాలని ఇప్పుడు దేవుడిని కోరుకుంటున్నానన్నారు. కాలేజ్ యూనియన్ ఎన్నికల్లో తనకు ఎంతోమంది కశ్మీరీ పండిట్లు మద్దతిచ్చారని గుర్తు చేశారు. -
కారు డిక్కీలోనే ఆఫీస్.. హిమా కోహ్లీ కంటతడి
సాక్షి, హైదరాబాద్ : న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రత్యేకంగా తనకు ఆఫీస్ ఉండేది కాదని, కారు డిక్కీనే కార్యాలయంగా వినియోగించుకున్నానని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ హిమాకోహ్లీ పేర్కొన్నారు. సీజేగా పదోన్నతిపై బదిలీ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ‘దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ను నుంచి భారత్‌కు వచ్చాం. ప్రాథమిక, ఉన్నత విద్య ఢిల్లీలోనే సాగింది. చదువుకునే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లోనే కళాశాలకు వెళ్లేవాళ్లం. విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్ రూ.12.50 మాత్రమే. నేను సివిల్ సర్వెంట్ కావాలని మా నాన్న కోరుకున్నారు. న్యాయవాది కావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. సివిల్స్‌కు ప్రిపేరయ్యేందుకు చదువుకోవడానికి లైబ్రరీ కార్డు వస్తుందనే ఉద్దేశంతో ఎల్ఎల్బీ అడ్మిషన్ తీసుకున్నా. (వ్యక్తి స్వేచ్ఛను కాపాడారు..) అయితే మా అమ్మ సహకారంతో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించా. న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత ప్రత్యేకంగా ఆఫీస్ లేకపోవడంతో కారు డిక్కీనే వినియోగంచుకున్నా. సివిల్ కేసుల్లో సూట్లో కోర్టు ఫీజు ఎంత కట్టాలో కూడా తెలియదు. ఇతర న్యాయవాదులు, సీనియర్ల ద్వారా తెలుసుకుంటూ ముందుకెళ్లా. ఓ కేసులో అడ్వకేట్ కమిషన్‌గా కోర్టు నియమించగా రిపోర్టు ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. సీనియర్ న్యాయవాది సూచనలు, సలహాలతో తయారు చేశాను. ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ఛాంబర్ కేటాయించే సమయంలోనే హైకోర్టు జడ్జిగా నియమితమయ్యా. న్యాయవాదిగా కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు’అని కోహ్లీ పేర్కొన్నారు. న్యాయమూర్తిగా తన అనుభవాలను పంచుకుంటూ కంటతడిపెట్టారు. -
ఆ మృగాలని చంపి నేను జైలుకెళ్తా: పూనంకౌర్
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకను దారుణంగా హత్యచేసిన మృగాలను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంటే.. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ ఘటనపై సినీ నటి పూనమ్‌కౌర్ స్పందిస్తూ.. ఇలాంటి జంతువులను చంపడానికైనా తాను సిద్ధమేనని అన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ మృగాలకు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకెళతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్లో ఒక వ్యక్తి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మతమనేది సమస్య కానేకాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ ఈ జనారణ్యంలోనే కొందరు మనుషులు అతిభయంకరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ మత, రాజకీయ రంగులు పులిమి తప్పదోవ పట్టించొద్దని కోరారు. ఈ మేరకు ఆమె ఫేస్బుక్లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. కాగా.. నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో జనం ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేసుకుంటూ స్టేషన్లోకి వచ్చేందుకు యత్నించారు. ప్రియాంకారెడ్డి హత్యను న్యాయవాదులు కూడా తీవ్రంగా ఖండించారు. నిందితులకు ఎటువంటి న్యాయసహాయం అందించకూడదని నిర్ణయించుకున్నారు.