నేను ధైర్యమున్న యోధురాలిని. పార్లమెంటులో కూర్చుని మీ కోసం పోరాడతా.. అంటూ మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే ఎమోనల్ స్పీచ్‌తో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పరాలిలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బంధువు ధనంజయ్ ముండే చేతిలో ఇక్కడి నుంచే ఆమె ఓడిపోయారు. తాజాగా పరాలికి విచ్చేసిన పంకజా ముండేకు ఘన స్వాగతం లభించింది. ఆమె సాంప్రదాయ బంజారా దుస్తులు ధరించిన ఆమె లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని పరాలివాసులను కోరారు.
"నేను ధైర్యమున్న యోధురాలిని. నేను పార్లమెంటులో కూర్చుని మీ కోసం పోరాడుతాను. నా బంజారా సోదరులు, సోదరీమణుల కోసం సూర్య చంద్రులు, నక్షత్రాలతో సైతం పోరాడతాను" అంటూ అక్కడ గుమికూడిన ప్రజల నినాదాలు, చప్పట్ల మధ్య భావోద్వేగంతో ఆమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. గోపీనాథ్ ముండేను అన్ని వర్గాలు ప్రేమిస్తున్నాయని, ఆయనను స్మరించుకోని సమాజం లేదని అన్నారు. బంజారా సమాజానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి సుధాకరరావు నాయక్‌తో తన తండ్రికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment