beed
-
బిల్లు కట్టమన్నందుకు.. వెయిటర్‌ను కారులో ఈడ్చుకెళ్లిన కస్టమర్లు
ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా తిన్న ఆహారానికి బిల్లు తప్పక చెల్లించాల్సిందే. ఇంకా అదనంగా చాలామంది ఫుడ్ సర్వ్ చేసినందుకు వెయిటర్లకు టిప్ కూడా ఇస్తుంటారు. కానీ ఓ చోట హోటల్లో ఫుల్‌గా తిని.. బిల్లు చెల్లించకుండా పరారరయ్యారు కొంతమంది. డబ్బులు కట్టమని అడిగేందుకు వెయిటర్ వారి వెంట కారు వద్దకు పరుగెత్తుకెళ్లగా.. అతన్ని కారులో కిలోమీటర్ వరకులాక్కెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బీడ్ జిల్లాలోని మెహకర్-పంధర్పూర్ పాల్ఖి రహదారిపై రోడ్డు పక్కన ఉన్న హోటల్లో శనివారం ముగ్గురు వ్యక్తులు భోజనం చేసేందుకు వచ్చాడు. హోటల్ బయట కారు పార్క్ చేసి భోజనం చేశారు. మొత్తం తిన్న తర్వాత ముగ్గురు వ్యక్తులు బిల్లు కట్టకుండానే కారు వద్దకు తిరిగి వచ్చారు. ఆన్లైన్ పేమెంట్ చేసేందుకు క్యూర్ కోడ్ స్కానర్‌ను తీసుకురావాలని వెయిటర్‌ను కోరారు.చదవండి: స్కూటర్ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడువెయిటర్ స్కానర్ తీసుకొచ్చే క్రమంలో ముగ్గురు తమలో తాము గొడవపడుతున్నట్లు నటింది. కారులోకి ఎక్కి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో వెయిటర్ కారు డోర్ తెరిచాడు. ఇంతలోనే దుండగులు కారును రివర్స్ తీసి వెయిటర్ డోర్‌కు వేలాడుతూనే అతడిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లాడు. ఇంతలో మరో హోటల్ సిబ్బంది కారును వెంబడించాడు. కానీ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అనంతరం కారును ఎవరూ లేని ప్రదేశంలో ఆపి.. వెయిటర్‌ను కొట్టి అతని జేబులోని రూ. 11,500ను లాక్కున్నారు. అతని కళ్లకు గంతలు కట్టి రాత్రి అంతా బందించి ఉంచారు మరుసటి రోజు ఉదయం అతన్ని విడిచిపెట్టారు. ఇక దీనిపై హోటల్ యాజమాన్యం దిండ్రూడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.#Maharashtra: बीड में एक #Waiter खाने के बाद #Scanner लेकर #Car के पास आया और #Bill देकर पैसे की मांग की, लेकिन बिल का भुगतान करने की बजाय कार सवार उसे पकडकर एक किलोमीटर तक घसीटता ले गए. वेटर को पूरी रात बंधक बनाकर रखा और पिटाई भी की.#Maharashtracrime #maharashtranews pic.twitter.com/CF6wqnOC5S— Delhi Uptodate News (@DelhiUptodate) September 11, 2024 -
నేను యోధురాలిని.. పంకజా ముండే ఎమోషనల్ స్పీచ్
నేను ధైర్యమున్న యోధురాలిని. పార్లమెంటులో కూర్చుని మీ కోసం పోరాడతా.. అంటూ మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే ఎమోనల్ స్పీచ్‌తో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పరాలిలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బంధువు ధనంజయ్ ముండే చేతిలో ఇక్కడి నుంచే ఆమె ఓడిపోయారు. తాజాగా పరాలికి విచ్చేసిన పంకజా ముండేకు ఘన స్వాగతం లభించింది. ఆమె సాంప్రదాయ బంజారా దుస్తులు ధరించిన ఆమె లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని పరాలివాసులను కోరారు. "నేను ధైర్యమున్న యోధురాలిని. నేను పార్లమెంటులో కూర్చుని మీ కోసం పోరాడుతాను. నా బంజారా సోదరులు, సోదరీమణుల కోసం సూర్య చంద్రులు, నక్షత్రాలతో సైతం పోరాడతాను" అంటూ అక్కడ గుమికూడిన ప్రజల నినాదాలు, చప్పట్ల మధ్య భావోద్వేగంతో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. గోపీనాథ్ ముండేను అన్ని వర్గాలు ప్రేమిస్తున్నాయని, ఆయనను స్మరించుకోని సమాజం లేదని అన్నారు. బంజారా సమాజానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి సుధాకరరావు నాయక్‌తో తన తండ్రికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు. -
వామ్మో ఇదేం ఆచారం రా బాబు! అక్కడ అల్లుడిని గాడిదపై కూర్చొబెట్టి..
భారత్‌లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే పలు రాష్ట్రల్లో ఈ పండగను విభిన్న రీతిలో వారి సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటుంటారు. కానీ కొన్ని చోట్ల సంప్రదాయాలు చాలా విడ్డూరంగా ఉంటాయి. వామ్మో ఇదేం ఆచారం అనిపించేలా ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు. అచ్చం అలాంటి విచిత్రమైన సంప్రదాయమే మహారాష్ట్రాలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలలో 82 ఏళ్లుగా ఒక విచిత్రమైన సంప్రదాయ కొనసాగుతోంది. హోలీ తర్వాత రోజు గ్రామంలో కొత్త అల్లుడిని బ్యాండ్ బాజాలతో గాడిదపై కూర్చొబెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఇదేంటి ఆచారమా!అవమానిస్తున్నారా అన్నట్లుంటుంది ఈ ఆచారం. బీడ్ గ్రామంలోని ప్రజలు మాత్రం గాడిదపై కూర్చొబెట్టడం అనేది సత్కారంగా కింద చూస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదేమిటంటే..గ్రామంలో నివశిస్తున్న ఠాకూర్ ఆనంద్ దేశ్‌ముఖ్ కుటుంబానికి చెందిన అల్లుడు హోలీకి రంగులు వేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే అతన్ని గాడిదపై కూర్చొబెట్టి, చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పుతూ ఉండగా..అతను హోలీ రంగులు వేస్తుండాలి. అందువల్ల అతను రంగులు వేసేందుకు ససేమిరా అన్నాడు. దీంతో అతడి మామగారు అతన్ని ఏదోలా ఒప్పించి గాడిదను చక్కగా అలంకరించి దానిపి కూర్చోబెట్టి ఊరంతా తిప్పి.. ఆ తర్వాత గుడికి తీసుకువచ్చి హరతి ఇచ్చి స్వాగతం పలికారు ఆ అల్లుడికి. ఆ తర్వాత మామగారు కొత్త బట్టలు, బంగారు ఉంగరం బహుకరిచడంతో ముభావంగా ఉన్న అల్లుడు ముఖం కాస్త సంతోషంతో చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ ఆచారాన్నే కొనసాగిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. (చదవండి: ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప బిగ్గరగా ఏడవడంతో..) -
అంబా ఆరోగ్యభవాని ఆలయంలో పూజారమ్మ.. అమ్మవారే స్వయంగా!
సరస్వతీ పరమేశ్వర్ బాగావలే... అతి సాధారణ మహిళ. సమాజం స్త్రీ కోసమే నిర్మించిన ఆంక్షల వలయాన్ని ఛేదించింది. ఇందుకోసం ఆమె పోరాటం చేయలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని స్వీకరించింది. చేపట్టిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది. అంబా ఆరోగ్యభవాని ఆలయంలో పూజాదికాలు నిర్వర్తిస్తోంది. అమ్మ పిలిపించుకుంది సరస్వతి పరమేశ్వర్ వయసు 36. ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి ఆలయం ప్రాంగణంలోనే జీవిస్తోంది. రోజూ ఉదయాన్నే ఆలయం ఆవరణ శుభ్రం చేయడం, స్నానాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆరోగ్యభవాని విగ్రహంతో సహా ఆలయం లోపల శుభ్రం చేయడం, విగ్రహాలను అలంకరించడం, ఆ తర్వాత వంట చేసుకుని వచ్చి ఆరగింపు సేవ చేయడంతో శుభోదయ సేవలు పూర్తవుతాయి. సాయంత్రం ఐదు గంటలకు మరోసారి పూజ చేసి, చపాతీలు చేసుకుని వచ్చి పటిక బెల్లంతో నివేదన చేస్తానని చెప్పింది. ‘‘నాలుగేళ్ల కిందట కొందరు ఊరి పెద్దలు వచ్చి ఆలయంలో పూజాదికాలు ఎవరు చేస్తారని అడిగారు. అప్పటివరకు పూజలు చేస్తున్న పూజారి బాగా వృద్ధులయ్యారు. వాళ్ల పిల్లలు వచ్చి తాము నివసించే పట్టణానికి తీసుకెళ్లిపోయారు. ఇక ఆయన కుటుంబం నుంచి పూజ చేయడానికి ఎవరూ లేరు. దాంతో మరొకరిని నియమించడానికి అందరినీ అడిగారు. అప్పుడు నేను ఆడవాళ్లు కూడా రావచ్చా అని అడిగాను. ఆ తర్వాత వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని ‘అమ్మవారే స్వయంగా నిన్ను పిలిపించుకుంటుందేమో...’ అని నన్ను పూజారిగా నియమించారు. భూగర్భంలో మరో ఆలయం మరాఠీ యూ ట్యూబర్లు వచ్చి ఈ ఆలయాన్ని వీడియోలు తీసుకుంటున్నారు. ఈ ఆలయంలో ఈ మాత కింద భూగర్భంలో మరో గుడి ఉంది. ఇక్కడ ఉన్న జాలీ తొలగించి మెట్ల నుంచి కిందకు వెళ్తే కనిపిస్తుంది. భూగర్భంలో ఉన్న ప్రతిమలు ఇక్కడ కనిపిస్తాయి చూడండి’’ అంటూ సీసీ టీవీ చూపించింది. ‘భక్తులు కిందకు వెళ్లి చూడవచ్చు’ అని మెష్ అమర్చిన ఉడెన్ ఫ్రేమ్‌ను తొలగించింది. కిందకు దిగితే అక్కడ మరో చిన్న ఆలయమే ఉంది. అందులో పూజాదికాలు కూడా సరస్వతి చేతుల మీదుగానే జరుగుతాయి. తనకు సాధ్యం కాని రోజుల్లో తన కూతురు పూజ చేస్తున్నట్లు చెప్పిందామె. ఇక్కడ ఏ ఉద్యమమూ జరగలేదు, కానీ ఒక అవసరం సమాజపు ఆధిపత్య గిరిగీతను తుడిచివేసింది. సరస్వతి పూజ చేస్తున్న ఆలయం మహారాష్ట్ర, బీడ్ జిల్లాలో ఉంది. మనకు సులభంగా తెలియాలంటే... ద్వాదశ జ్యోతిర్లింగం పర్లి వైద్యనాథ్ ఆలయం ఆధారంగా చెప్పుకోవాలి. వైద్యనాథ ఆలయం ఉన్న పర్లి పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చాందాపూర్ గ్రామంలో ఉంది సరస్వతి చేతుల మీదుగా పూజలందుకుంటున్న ఆరోగ్యభవాని ఆలయం. – వాకా మంజులారెడ్డి చదవండి: యాకమ్మ.. ఒక గొప్ప వెలుగు -
లాక్డౌన్ దిశగా మహారాష్ట్ర!
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. నాందేడ్, బీడ్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతోంది. పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్‌తోపాటు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అయినప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు. అందుకే మళ్లీ లాక్డౌన్ విధించడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. 43 వేలు దాటిన కేసులు రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 43,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 249 మంది మృతి చెందారు. గురువారం 32,641 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,66,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబై నగరంలో కరోనా బాధితుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. గురువారం 8,646 కేసులు రికార్డయ్యాయి. 18 మంది కరోనాతో కన్నుమూశారు. ముంబైలో ఆంక్షలను మరింత కఠినతరం చేయడం ఖాయమన్న సంకేతాలను మేయర్ కిషోరి ఫెడ్నేకర్ ఇచ్చారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాజేష్ టోపే మహారాష్ట్రలో లాక్‌డౌన్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే చెప్పారు. లాక్డౌన్ విధించాలని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. లాక్డౌన్ కాకుండా ఏమేం చేయొచ్చు అనేదానిపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశామన్నారు. -
చెరకు గడ చీలుస్తున్న గర్భసంచి
‘నీ గర్భసంచి ఇవ్వు... నీకు కూలిడబ్బులు ఇస్తా’ అని ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అనగలుగుతారేమో. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీలు పడే బాధలు ఎన్నో ఎందరికి తెలుసు? మహారాష్ట్రలోని బీడ్ చెరకు ఉత్పత్తిలో మేటి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అక్కడ కోతకాలం. కోతకు వచ్చిన కూలీలు నెలసరికి మూడురోజుల విశ్రాంతి తీసుకుంటే కూలి డబ్బులు పోతాయి. జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే అక్కడ కూలి చేయడానికి ముందే గర్భసంచి తొలగించుకుంటారు. ఈ కడుపుకోతపై దర్శకుడు అనంత్ మహదేవన్ ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం– బిట్టర్‌స్వీట్) అనే మరాఠి సినిమా గత సంవత్సరం తీశాడు. వివిధ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతున్న ఈ సినిమా ఇటీవల జనవరి 8–15 తేదీల మధ్య జరిగిన కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ ఇది. ‘చెరకు కట్ చేసే మిషను రెండున్నర కోట్లు ఉంటుంది. చక్కెర ఉత్పత్తిదారులు అంత పెట్టి మిషన్ ఎందుకు కొంటారు... అతి సలీసుగా కూలీలు దొరుకుతుంటే’ అంటారు దర్శకుడు అనంత్ మహదేవన్. ఆయన మరాఠిలో తీసిన ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం) సినిమా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ప్రశంస సినిమా గొప్పదనం గురించి కాదు. ఒక చేదు వాస్తవాన్ని కథగా ఎంపిక చేసుకోవడం గురించి. ఎందుకంటే ఈ సినిమా చెరకు కోత కోసం పని చేసే లక్షలాది మంది మహిళా కూలీల వెతను చూపింది కాబట్టి. బీడ్‌లో బతుకుపోరు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో షుగర్ ఫ్యాక్టరీలకు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలం చాలా కీలకం. చెరకుపంట కోత కాలం అది. లక్షల ఎకరాల్లో పంటను కోయడానికి కూలీలు కావాలి. మహారాష్ట్రలోని ఒక్క బీడ్ జిల్లాలో 5 లక్షల మంది చెరకు కోత కూలీలు ఉన్నారు. బీడ్ అంతగా పంటలు పండని ప్రాంతం కనుక ఇక్కడి నుంచి వలస ఎక్కువ. వీరు చెరకు కోత వచ్చే ఆరు నెలల కాలం కోసం కాచుకుని ఉంటారు. చెరకు కోతకు వెళ్లి్ల ఏం కోల్పోతున్నారనేది ‘బిట్టర్‌స్వీట్’ సినిమాలో చూపించాడు దర్శకుడు. వీరి కన్నీరు రక్తం కలగలవడం వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే రెండవ పెద్ద చక్కెర ఎగుమతిదారు అయ్యిందని అంటాడతను. దారుణమైన దోపిడి చెరకు పంట కోయించి ఫ్యాక్టరీలకు చేరవేసేందుకు చక్కెర ఫ్యాక్టరీలు ‘ముకదమ్’లను ఏర్పాటు చేసుకుంటారు. ముకదమ్‌లంటే దళారీలు. వీరు కూలీలను పట్టుకొని వచ్చి కోత కోయించాలి. అంతేకాదు ఇచ్చిన సమయంలో ఇచ్చినంత మేరా కోత జరిగిపోవాలి. ఇందుకోసం దళారీలు బీడ్ ప్రాంతం నుంచి వయసులో ఉన్న భార్యాభర్తలను కూలికి పిలుస్తారు. వీరిని ‘జోడీ’లంటారు. ఈ జోడీలకు ముందే 80 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఇచ్చేస్తారు. ఆ మేరకు వీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. రోజుకు పది నుంచి 12 గంటలు పని చేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక జోడి రోజులో రెండు మూడు టన్నుల చెరకు పంటను కోస్తారు. నెలసరి తప్పించుకోవడానికి జోడీలు ప్రతిరోజూ పని చేయాలి. చేయకపోతే కూలి దక్కదు. పైగా జరిగిన నష్టానికి జుర్మానా కట్టాలి. ఈ ఆరునెలల కాలంలో జోడీలోని భార్య నెలసరి సమయంలో మూడు రోజుల విశ్రాంతి తీసుకునే అవసరం పడొచ్చు. మూడురోజుల కూలీ పోవడం ఎదురు జుర్మానా కట్టాల్సి రావడం జోడీకి చాలా కష్టం అవుతుంది. అందుకని నెలసరి రాకుండా గర్భసంచిని తీసేయించడం బీడ్‌లో ఒక దయనీయమైన ఆనవాయితీ అయ్యింది. బీడ్ జిల్లాలో దాదాపు 100 ఆస్పత్రులు ఉంటే వాటిలో పది ఆస్పత్రులు ఇవే పని మీద ఉంటాయి. దళారీలకు ఈ ఆస్పత్రులతో అండర్స్టాండింగ్ ఉంటుంది. దళారీ గర్భసంచి తీసే ఆపరేషన్ కోసం విడిగా అప్పు ఇస్తాడు. అది ప్రతి సంవత్సరం కూలీలో కొంత కొంత కోత వేసుకుంటాడు. పైగా గర్భసంచి ఆపరేషన్‌కు మనిషిని పంపినందుకు కమిషన్ కూడా దొరుకుతుంది. ‘గర్భసంచులు లేని స్త్రీల ఊరు అని బీడ్ గురించి వార్త చదివాకే నాకు ఈ సినిమా తీయాలనిపించింది’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమా కథలో... ఈ సినిమా కథలో దర్శకుడు సత్యభామ అనే కోత కూలీ పాత్ర ద్వారా మనకు కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కోత పని సజావుగా సాగడానికి సత్యభామ గర్భసంచిని తీయించుకోవాలని ఆమెపై వొత్తిడి వస్తుంది. తీయించుకోవాలా వద్దా అనే సంఘర్షణలో మనకు సమస్య నేపథ్యం తెలుస్తుంది. చివరకు సత్యభామ గర్భసంచి తీయించుకోవడానికే అంగీకరిస్తుంది. ‘ఇది ఆమె శారీరక హక్కును బలవంతంగా తిరస్కరింప చేయడమే. పిల్లలు కనే హక్కును నివారించడమే. తన దేహం మీద తన హక్కును మహిళా కూలీలు కోల్పోవడమే కాదు భావితరాల పుట్టుకను కూడా నిరాకరిస్తున్నారు’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే నటించారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా మంచి స్పందనను పొందుతోంది. – సాక్షి ఫ్యామిలీ -
బస్సు - ట్రాక్టర్ ఢీ : 9 మంది మృతి
ముంబై : మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని... మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం బీడ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీడ్ కలెక్టర్ బదిలీపై నిరసనలు
బీడ్: ఇసుక మాఫియా, అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించిన జిల్లా కలెక్టర్ సునీల్ కేంద్రేకర్ను బదిలీ చేయడంపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానిక కార్యకర్తలు, రాజకీయ పార్టీలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఐఏఎస్ అధికారి సునీల్ బదిలీ అయ్యారన్న వార్త ఉదయం దావానంలా వ్యాపించడంతో అనేక మంది కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకున్నారు. ఈ వార్త నిజమేనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ బదిలీని నిరసిస్తూ శివసేన యువజన విభాగ కార్యకర్తలు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సునీల్‌ను పునర్నియమించాలనే డిమాండ్‌తో శివసేన, ఎమ్మెన్నెస్, బ్రాస్తచార్ విరోధి జనాందోళన్, ఇతర సంస్థలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే సునీల్‌ను బదిలీ చేశారని ఆర్టీఐ కార్యకర్త, అడ్వొకేట్ అజిత్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. బీడ్ జిల్లా కలెక్టర్‌గా 17 నెలల కాలంలో అనధికారిక నిర్మాణాలు, నీటి ట్యాంకర్ మాఫియా, ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేశారని తెలిపారు. అయితే తన బదిలీపై వ్యాఖ్యలు చేసేందుకు అందుబాటులో లేని సునీల్‌ను ఔరంగాబాద్‌లోని సిడ్కో ప్రధాన పరిపాలన సంబంధ అధికారిగా బదిలీ చేశారు. అయితే బీడ్ జిల్లా కలెక్టర్‌గా యావత్మల్ డిస్ట్రిక్ జిల్లా పరిషత్ సీఈవో నవల్ కిశోర్ రామ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.