భారత్‌లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే పలు రాష్ట్రల్లో ఈ పండగను విభిన్న రీతిలో వారి సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటుంటారు. కానీ కొన్ని చోట్ల సంప్రదాయాలు చాలా విడ్డూరంగా ఉంటాయి. వామ్మో ఇదేం ఆచారం అనిపించేలా ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు. అచ్చం అలాంటి విచిత్రమైన సంప్రదాయమే మహారాష్ట్రాలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది.
వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలలో 82 ఏళ్లుగా ఒక విచిత్రమైన సంప్రదాయ కొనసాగుతోంది. హోలీ తర్వాత రోజు గ్రామంలో కొత్త అల్లుడిని బ్యాండ్ బాజాలతో గాడిదపై కూర్చొబెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఇదేంటి ఆచారమా!అవమానిస్తున్నారా అన్నట్లుంటుంది ఈ ఆచారం. బీడ్ గ్రామంలోని ప్రజలు మాత్రం గాడిదపై కూర్చొబెట్టడం అనేది సత్కారంగా కింద చూస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదేమిటంటే..గ్రామంలో నివశిస్తున్న ఠాకూర్ ఆనంద్ దేశ్‌ముఖ్ కుటుంబానికి చెందిన అల్లుడు హోలీకి రంగులు వేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే అతన్ని గాడిదపై కూర్చొబెట్టి, చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పుతూ ఉండగా..అతను హోలీ రంగులు వేస్తుండాలి.
అందువల్ల అతను రంగులు వేసేందుకు ససేమిరా అన్నాడు. దీంతో అతడి మామగారు అతన్ని ఏదోలా ఒప్పించి గాడిదను చక్కగా అలంకరించి దానిపి కూర్చోబెట్టి ఊరంతా తిప్పి.. ఆ తర్వాత గుడికి తీసుకువచ్చి హరతి ఇచ్చి స్వాగతం పలికారు ఆ అల్లుడికి. ఆ తర్వాత మామగారు కొత్త బట్టలు, బంగారు ఉంగరం బహుకరిచడంతో ముభావంగా ఉన్న అల్లుడు ముఖం కాస్త సంతోషంతో చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ ఆచారాన్నే కొనసాగిస్తున్నారు అక్కడి గ్రామస్తులు.
(చదవండి: ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప బిగ్గరగా ఏడవడంతో..)
Comments
Please login to add a commentAdd a comment