donkey
-
గాడిద పందేలు
పండుగలు, జాతరలు భక్తితోనే కాదు సరదా సంబరాలతోనూ మైమరపిస్తాయి!కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటి వాటికి అవే వేదికలు! ఇప్పుడు గాడిదల పోటీలూ మొదలయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, కడపజిల్లాల్లో! ఆ వివరాలు..మోటారు వాహనాలు పెరగడంతో రవాణా మొదలు చాలా విషయాల్లో పశువుల మీద ఆధారపడే పరిస్థితి దాదాపుగా కనుమరుగైందనే చెప్పొచ్చు. ఆ క్రమంలో రజకులకు గార్దభాల అవసరమూ లేకుండా పోయింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం ఇంకా వాటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. ఆ జంతువులను సంరక్షిస్తున్నాయి. పండుగల వేళ వీటితో కలసి సంబరాలు చేసుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఆయా పర్వదినాల్లో వాళ్లు వాటిని చక్కగా అలంకరించి, పూజలు చేసి, ఊరేగించి వాటి ప్రత్యేకతను చాటుతున్నారు. వాటి మధ్య పందేలు నిర్వహిస్తున్నారు. ఫలానా ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కరపత్రాలను ముద్రిస్తారు. ఆ సమాచారాన్ని ముందుగా అందుకున్నవారు మిగిలిన పోటీదారులందరికీ వాట్సాప్ చేస్తారు. ఈ పోటీలను కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా కొన్ని మగ గార్దభాలను సిద్ధం చేస్తారు. ప్రతిరోజూ వీటిపై ఇసుక మూటలను వేసి నేల మీదే కాదు నీటిలోనూపరుగెత్తుతూ శిక్షణనిస్తారు. వీటికి మొక్కజొన్న పిండి, మినప పొట్టు, సజ్జలు తదితరాలను ఆహారంగా పెడతారు.పోటీ పదినిమిషాలే.. బరువును లాగే ఈ గాడిదల పోటీల వ్యవధి కేవలం పదినిమిషాలే! 80 పల్ల ఇసుక (రెండు క్వింటాళ్ల పది కిలోలు)తో పోటీలు నిర్వహిస్తారు. ఆ బరువుతో నిర్దేశించిన పది నిమిషాల్లో ఏ గాడిదైతే ఎక్కువ దూరం వెళ్తుందో దానినే విజేతగా నిర్ణయిస్తారు. విజేతకు నగదు, లేదా వెండిని బహుమతిగా అందిస్తారు. నగదు రూ. 5వేలు మొదలుకొని రూ. 20వేలకు పైనే ఉంటుంది. ఈ పోటీల కోసం అనంతపురం, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లి మరీ గాడిదలను కొంటున్నారు. బ్రీడ్ ఆధారంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లోని గాడిదలను కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటి ధర రూ. 50వేలు మొదలుకొని రూ.లక్షకు పైనే ఉంటుంది. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. అయితే పోటీల్లో పాల్గొనే గాడిదలకు వయసుతో సంబంధం ఉండదు. మోసే బరువే ప్రామాణికం. లీటరు పాలు రూ.7వేలకు పైనేగాడిద పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. లీటరు పాల ధర రూ.7వేలకు పైగా పలుకుతోంది. అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో డెయిరీలు సైతం ఏర్పాటయ్యాయి. రోజుకు ఓ గాడిద నుంచి 200 మి.లీ. పాలను సేకరిస్తారు. వీటిని పలు వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇతర జిల్లాల్లో గాడిద మాంసానికీ డిమాండ్ ఉంటోంది. అందుకే రాత్రివేళల్లో ఆయా ప్రాంతాల వాళ్లు వచ్చి వీటిని ఎత్తుకుపోతున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు.బురదనీటిలో సంబరంఉగాది రోజున కర్నూలు పట్టణంలోని కల్లూరులో కొలువైన చౌడేశ్వరీ మాత దేవాలయ ప్రాంగణాన్ని బురదతో చిక్కగా అలికేస్తారు. గార్దభాలను ముస్తాబు చేసి బండ్లు కడతారు. ఆ బురదలో వీటికి పోటీ నిర్వహిస్తారు. దీన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. గుర్తింపు ఉంటోందిపండుగలు, జాతరల సమయంలో మా జీవితాల్లో భాగమైన గార్దభాలతో సరదాగా బరువులను లాగించే పోటీలను నిర్వహిస్తున్నాం. పోటీల్లో బహుమతి సాధిస్తే గ్రామంలో మంచి గుర్తింపు ఉంటోంది. ఎక్కడ పోటీలు నిర్వహించినా వీటిని తీసుకెళ్తున్నాం.– చాకలి నాగ మద్దిలేటి, ముక్కమల్లఓ సరదా ఆరు సంవత్సరాలుగా గాడిదను పోటీలకు తీసుకెళ్తున్నా. అది ఇప్పటి వరకు 60 పందేల్లో పాల్గొంది. పోయిన ప్రతిచోటా మొదటి లేదా రెండోస్థానాన్ని గెలుచుకుంటోంది. అలా వచ్చిన డబ్బు రాకపోకలకే సరిపోతోంది. అయినా పోటీల్లో పాల్గొనడం ఓ సరదా. ఆ గెలుపుతో మాకు, మా ఊరికి పేరొస్తే చాలు! – చాకలి సుబ్బరాయుడు, వేల్పనూరు · పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు -
గరిటెడైనను చాలు.. గాడిద పాలు
సాక్షి, అమరావతి: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అనే వేమన పద్యం ఇప్పుడు ‘గరిటెడైనను చాలు.. గాడిద పాలు’ అని రూపుమార్చుకుంది. ప్రస్తుత తరుణంలో కొన్ని వస్తువులకు, ఆహార పదార్థాలకు ఆదరణ అనూహ్యంగా పెరిగింది. అందులో భాగంగానే గాడిద పాలకు డిమాండ్ ఏర్పడింది. అయితే, గాడిద పాలు దొరకడం కష్టం. ఎక్కడోగానీ.. ఎవరికో గానీ గాడిదలు అందుబాటులో ఉండవు. ఈ పరిస్థితుల్లో ఇటీవల వీధుల్లోకి అప్పుడప్పుడు గాడిదల్ని తీసుకొచ్చి మన కళ్లముందే గాడిద పాలు పితికి ఇస్తున్నారు.తెలంగాణ నుంచి వచ్చి..తెలంగాణ నుంచి గాడిదలను కొన్ని కుటుంబాల వారు ఏపీకి తీసుకువస్తున్నారు. జూలైలోనే ఇక్కడికి జనవరి వరకూ ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇక్కడే గాడిదలను పెంచుతున్నారు. శీతాకాలం వచ్చేసరికి గాడిదలు పిల్లల్ని కంటాయి. ఈ కాలంలోనే పాలనూ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. తెలంగాణ నుంచి వచ్చిన వారంతా పాడి గాడిదను ఊరంతా తిప్పుతూ ఇంటింటికీ పాలను విక్రయిస్తుంటారు. రోజుకి మూడు కప్పులు చొప్పున మూడు రోజుల పాటు గాడిద పాలు తాగితే ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయని వీరు ప్రచారం చేస్తున్నారు.15 మిల్లీలీటర్లు.. రూ.100కేవలం 15 మిల్లీలీటర్లు (అర టీ కప్పు) గాడిద పాల ధర రూ.100 పలుకుతోంది. ఇళ్ల వద్దకు వచ్చే పాల విక్రయదారులు ముందుగా రూ.300 వరకూ ధర చెబుతున్నారు. బేరమాడితే రూ.100 నుంచి రూ.200 వరకూ తగ్గించి ఇస్తున్నారు. ఈ లెక్కన లీటరు గాడిద పాల ధర కనీసం రూ.7 వేలు వరకూ ఉంటోంది. అయితే ఇందుకోసం ఒక గాడిదను, దూడను పోషించడానికి ఏటా రూ.80 వేలు ఖర్చవుతుందని పెంపెకందారులు చెబుతున్నారు.ఎందుకంత డిమాండ్ఒక గాడిద రోజుకు అర లీటర్ నుంచి 1.30 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. తల్లి పాలలో ఉన్నట్టుగానే గాడిద పాలలోనూ పుష్కలంగా విటమిన్లు (ఏ, బీ1, బీ5, బీ6, బీ12, ఫోలిక్ ఆమ్లం) ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి, శిశు పోషణ కోసం పూర్వం నుంచీ గాడిద పాలను వాడటమేనేది ఉంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు వంటి వాటికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని నమ్ముతుంటారు. దీంతో గాడిద పాల వ్యాపారం బాగా జరుగుతోంది.రోజుకి రూ.2 వేల సంపాదన మాది తెలంగాణలోని మంచిర్యాల. మా తాత ముత్తాతల నుంచీ గాడిదలను పెంచడం, పాలను విక్రయించడం మా వృత్తి. 10 కుటుంబాల వాళ్లం ఏటా పిల్లాపాపలతో కలిసి గాడిదలను తీసుకుని ఏపీకి వస్తాం. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం. ఇక్కడి ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాడిద పాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. బొంబాయ్ కాలనీలో ఉంటూ విజయవాడ వీధుల్లో పాలు విక్రయిస్తున్నాం. రోజుకి ఒక్కో గాడిద పాల ద్వారా రూ.2 వేల వరకూ ఆదాయం వస్తుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయానికంటే ముందే ఇళ్లకే వెళ్లి పాలు విక్రయిస్తుంటాం. అప్పుడే వ్యాపారం బాగుంటుంది. – జె.మహేష్, గాడిద పాల వ్యాపారి -
గార్ధభ సంరంభం
గాడిదల సంతలు దేశంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి గాని, రాజస్థాన్‌లో జైపూర్ సమీపంలోని లునియావాస్ గ్రామంలో జరిగేది మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద గాడిదల సంత. ఏటా దసరా నవరాత్రుల్లో ఇక్కడ గాడిదల సంత జరుగుతుంది. దాదాపు ఐదువందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పురాతనమైన గాడిదల సంతగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ సంత జైపూర్–ఆగ్రా రహదారిపై ఏకంగా 22 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. నవరాత్రుల రోజుల్లో ఈ మార్గంలో ప్రయాణించేవారికి ఎటుచూసినా గాడిదలే కనిపిస్తాయి. ఈ సంతకు వివిధ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తమ గాడిదలను తీసుకు వస్తారు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ సంతను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు రాజస్థాన్ పర్యాటక శాఖ ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించింది. దీనివల్ల ఈ సంతకు దేశ విదేశాల పర్యాటకులు కూడా వస్తుండటం విశేషం. మొఘల్ సామ్రాజ్య కాలంలో అప్పటి రాజస్థాన్ పాలకుడు దులేరాజ్ సింగ్ హయాం నుంచి ఇక్కడ గాడిదల సంత జరుగుతూ వస్తోందని చెబుతారు. ఈ సంత జరిగే సమయంలో ‘ఖాలాకానీ’ అని స్థానికులు పిలుచుకునే ‘కాళరాత్రి’ అమ్మవారి పూజ కూడా విశేషంగా జరుపుతారు. కాళరాత్రి అమ్మవారి వాహనం గార్ధభం కనుక ఇక్కడ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ సంతలో గాడిదల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాకుండా, గాడిదల అందాల పోటీలు, గాడిదల పరుగు పందేలు, గాడిదలు లాగే బళ్ల పందేలు కూడా జరుగుతాయి. ఈ సంతలో స్వదేశీ జాతులకు చెందిన కథియవాడీ, మార్వాడీ గాడిదలకు, అఫ్గాన్ గాడిదలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. విచిత్రంగా ఈ సంతలో గాడిదలకు బాలీవుడ్ హీరో హీరోయిన్ల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు పెట్టి మరీ అమ్ముతుంటారు. గత ఏడాది ప్రియంకా చోప్రా పేరు ఉన్న గాడిదకు ఏడువేల రూపాయల ధర పలికినట్లు ఒక వర్తకుడు చెప్పాడు. ఈ సంతలోని గాడిదల ధరలు మూడువేల రూపాయల నుంచి పదిహేనువేల రూపాయల వరకు ఉంటాయి. అఫ్గాన్ గాడిదలు ఎక్కువ ధర పలుకుతుంటాయి. గాడిదల అందాల పోటీలు, పరుగు పందేలు వంటి వేర్వేరు పోటీల్లో విజేతలుగా నిలిచిన గాడిదల యజమానులకు వేర్వేరు దశల్లో ఐదువందల నుంచి పదివేల రూపాయల వరకు నగదు బహుమతులు కూడా ఉంటాయి. -
బిగ్‌బాస్ షో నుంచి గాడిద ఎలిమినేట్!
బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఓ గాడిదను కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు. గత వారం బిగ్‌బాస్ 18వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో 19వ కంటెస్టెంట్‌గా గాడిదను ప్రవేశపెట్టారు. దీని పేరు గదరాజ్. దాన్ని బిగ్‌బాస్ హౌస్‌లోనే ఓ చోట కట్టేశారు. కంటెస్టెంట్లు సమయానికి దానికిన్ని నీళ్లు, గడ్డి పెట్టారు. అయితే రియాలిటీ షో కోసం మూగజంతువును వాడుకోవడం చూసి పెటా(పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది.మొదటివారం ఎవరు ఎలిమినేట్?తక్షణమే దాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈమేరకు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు లేఖ రాసింది. పెటా ఆదేశాలతో ఈ వారం గాడిదను ఎలిమినేట్ చేసి పంపించినట్లు సమాచారం. నిజానికి ఈ వారం చాహత్ పాండే, గుణరత్న సదవర్తె, కరణ్ వీర్ మెహ్రా, అవినాష్ మిశ్రా, ముస్కన్ బామ్నే నామినేషన్లో ఉన్నారు. కానీ వీళ్లలో ఒకరికి బదులుగా పెటా ఆదేశాల ప్రకారం గాడిదను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.18 మంది కంటెస్టెంట్లుఇకపోతే ఈ హిందీ బిగ్‌బాస్‌లో వివియన్ డిసేనా, ఐషా సింగ్, కరణ్ వీర్ మెహ్రా, చాహత్ పాండే, షెహజాదా దామి, నైరా బెనర్జీ, అవినాష్ మిశ్రా, ఎలైస్ కౌశిక్, రాజత్ దలాల్, శిల్ప శిరోద్కర్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గాడిద మృతితో గందరగోళం.. 65 మందిపై కేసు నమోదు
బక్సర్: బీహార్‌లోని బక్సర్ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక గాడిద మృతి అనంతరం గందరగోళం చెలరేగింది. ఇది పోలీసుల వరకూ చేరడంతో వారు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 65 మందిపై కేసు నమోదు చేశారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జిల్లాలోని కేసత్ బ్లాక్‌లో విద్యుదాఘాతం కారణంగా గాడిద మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలోనివారు ఆందోళనకు దిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించారు. ఈ దరిమిలా పోలీసులు 65 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు గురించి బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శుభమ్ ఆర్య మీడియాకు తెలియజేస్తూ సంఘటన జరిగిన వెంటనే చకోడా పవర్ గ్రిడ్ స్టేషన్‌కు చేరుకున్న పలువురు గ్రామస్తులు మృతిచెందిన గాడిదకు సంబంధించిన పరిహారం వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొందరు గ్రామస్తులు పవర్ గ్రిడ్ కార్యాలయంలోకి ప్రవేశించి, ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల పనులకు ఆటంకం కలిగించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ సీనియర్ అధికారి పోలీసులకు గ్రామస్తులపై ఫిర్యాదు చేశారు. మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన 65 మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ట్యాంకర్‌ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా.. -
గాడిద మోత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఇంట్రస్టింగ్ కథనం
మన దేశంలో మహారాష్ట్రలో గాడిదలను అధిక స్థాయిలో రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇటుక బట్టీలలో ఇసుక రవాణాలో వీటి వీపు మీద 200 కేజీల వరకూ వేయడానికి వెనుకాడరు. దీని వల్ల గాడిదలు హింసకు గురవుతున్నాయి. రోగాల బారిన పడుతున్నాయి. అందుకే నాందేడ్‌కు చెందిన సిర్జనా నిజ్జర్ గాడిదల సంరక్షణ గురించి పోరాడుతోంది. గాడిద మోత నుంచి గాడిదలను తప్పించాలంటోంది. ఆమె పోరాటం గురించి...‘జనం దేనికైనా విరాళాలు ఇస్తారు గాని గాడిదలంటే ఇవ్వరు. కాని గాడిదలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు’ అంటుంది సిర్జనా గుజ్జర్.ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సిర్జనా జనం కోసం న్యాయస్థానాల్లో వాదించడం కంటే హింసకు గురవుతున్న మూగజీవాల కోసం సమాజంలో వాదించడం మేలు అనుకుంది. అందుకే ఆమె ఎఫ్.ఐ.ఏ.పి.ఓ. (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్)లో కీలకబాధ్యతలు నిర్వహిస్తోంది. వీధి శునకాలతో మొదలైన ఆమె సేవ నేడు గాడిదలకు చేరింది.నాందేడ్‌లో చూసి...మహరాష్ట్రలోని నాందేడ్ సిర్జనా తాతగారి ఊరు. కాలేజీ రోజుల్లో వేసవి సెలవుల్లో అక్కడకు వెళితే గాడిదలు విపరీతంగా కనిపించేవి. వాటిని చూసి సరదా పడదామనుకుంటుడగానే ఒళ్లంతా గాయాలతో, బరువులు మోయలేక అవస్థపడుతూ, తిండి లేక ఎముకలు తేలి ఉన్న వాటి రూ΄ాలు సిర్జనాకు ఎంతో బాధ కలిగించేవి. విద్యార్థిగా ఉండగానే వాటి కోసం చేతనైనంతలో హెల్త్ క్యాంప్స్ నిర్వహించేది. లా పూర్తయ్యాక ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటి సంరక్షణ కోసం పని చేస్తోంది.మూడు జిల్లాల్లో...‘మహరాష్ట్రలోని మూడు జిల్లాలు నాందేడ్, బీడ్, లాతూర్‌లలో గాడిదల సంఖ్య ఎంత లేదన్నా 6000 ఉంటుంది. ఇవి మహరాష్ట్రలో వాన కొరత ్ర΄ాంతాలు. జనం పేదరికంలో మగ్గుతుంటారు. ఈ మూడు జిల్లాల్లోనూ ఇటుక బట్టీలు విస్తారం. వాటిలో కూలీ చేస్తే రోజుకు వంద రూ΄ాయలు వస్తాయి. ఇటుకలు మోయడానికి వీరంతా గాడిదలను ఉపయోగిస్తారు. ఇటుకలను చేరవేయడానికి వాటి వీపు మీద 60 కేజీల నుంచి 100 కేజీల వరకూ బరువు మోయిస్తారు. ఈ ప్రాంతంలో పారే ఉపనది చంద్రభాగ ఒడ్డు నుంచి ఇసుక మోయిస్తారు. శక్తికి మించి బరువు మోయడం వల్ల గాడిదలు గాయాల బారిన పడతాయి. ఒక్కోసారి వాటి కాళ్లు విరుగుతాయి. కంటి సమస్యలు వస్తాయి. వాటికి వైద్యం చేయించే శక్తి పేదలకు ఉండదు. వాటిని అలాగే వదిలేస్తారు’ అంటుంది సిర్జనా.వానలు వస్తే పస్తే‘నాందేడ్, బీడ్, లాతూర్ జిల్లాల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకూ నిర్విరామంగా ఇటుక బట్టీల పని జరుగుతుంది. అన్నాళ్లు గాడిదలకు పని ఉంటుంది. కొద్దోగొ΄్పో తిండి దొరుకుతుంది. కాని ఎప్పుడైతే తొలకరి మొదలవుతుందో ఇటుక బట్టీలు మూతపడతాయి. కూలీలు గాడిదలకు తిండి భారం అని రోడ్ల మీద వదిలేస్తారు. వాటికి తిండి దొరకదు. మంచినీరు దొరకదు. రోగాలతో బాధ పడతాయి. ముసలివైతే కబేళాకు అమ్మేస్తారు. వాటి కోసం ఈ మూడు జిల్లాలో సంరక్షణాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్.పి.సి.ఏ. (సొసైటీస్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్) బలోపేతం చేస్తున్నాం. గత పదేళ్లలో గాడిదల సంఖ్య కూడా బాగా తగ్గింది. వీటి సంఖ్య కాపాడుకుంటూ వీటితో మానవీయంగా వ్యవహరించే చైతన్యాన్ని కలిగించడమే నా లక్ష్యం’ అని తెలిపింది సిర్జనా. -
గాడిద బండి, వంకాయ్, వాష్ బేసిన్.. పాక్ ఎన్నికల్లో విచిత్ర గుర్తులు!
ఫిబ్రవరి 8న అంటే రేపు (గురువారం) పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే ముద్రించి సిద్ధంగా ఉంచారు. ఇక్కడ విశేషమేమిటంటే ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల గుర్తులు ఇంత విచిత్రంగా ఉన్నాయని తెలిస్తే ఎవరైనా పడీపడీ నవ్వుకుంటారు. అయితే ఇటువంటి ఎన్నికల గుర్తులపై పలువురు అభ్యర్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పాక్ ఎన్నికలను ప్రపంచమంతా ఆసక్తికరంగా చూస్తోంది. ఈ ఎన్నికల్లో మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ తిరిగి ప్రధాని రేసులో ముందున్నారు. షాబాజ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో కూడా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల కోసం కమిషన్ జారీ చేసిన విచిత్రమైన ఎన్నికల గుర్తులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్ ఛార్జర్, సిమ్ కార్డ్, గాడిద బండి, వంకాయ్, బూట్లు, బాటిల్, వాష్ బేసిన్, నెయిల్ కట్టర్, స్క్రూ, స్పూన్, తవా, షటిల్ కాక్ ఇవన్నీ ఎన్నికల సంఘం.. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారు అమీర్ మొఘల్ వంకాయ్ ఎన్నికల గుర్తును పొందారు. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా తమకు అవమానకరమైన, విచిత్రమైన ఎన్నికల గుర్తులను కేటాయించిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎన్నికల గుర్తును రద్దు చేసిన తర్వాత ఈ వివాదం మొదలైంది. పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీకి దిగారు. పాకిస్తాన్లో ఓటింగ్ కోసం 26 కోట్ల బ్యాలెట్ పేపర్లను ప్రింట్ చేశారు. పాక్‌లోని మొత్తం 22 కోట్ల జనాభాలో 12.69 కోట్ల మంది ఓటర్లు నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్.. ఈ ముగ్గురూ పాక్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. వీరికి చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్, పాకిస్తాన్ పార్టీ పీపుల్స్ పార్టీ అభ్యర్థుల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. -
ఈ వీడియో చూస్తే.. గాడిద అంటూ ఎవరినీ నిందించరు!
చాలామంది కోపంలో ఎదుటి వ్యక్తిని గాడిదతో పోలుస్తూ నిందిస్తుంటారు. అయితే తాజాగా వైరల్‌గా మారిన ఒక వీడియోలో గాడిద తన తెలివి తేటలను అద్భుతంగా ప్రదర్శించింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన వారంతా ఆ గాడిదను మెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ఇన్నాళ్లూ గాడిద పేరుతో అప్పుడప్పుడూ ఇతరులను నిందిస్తూ వచ్చామని, తెలియక పొరపాటు చేశామని లెంపలేసుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తమ కళ్లనే తాము నమ్మలేకపోతున్నామని అంటున్నారు. మరికొందరు ఈ గాడిద.. కథల్లో చెప్పినట్లు నక్క కన్నా తెలివైనదని అంటున్నారు. ఈ గాడిద కష్టించేందుకు బదులు తన తెలివిని ఉపయోగించి, తాను చేయాల్సిన పనిని మరింత సులభతరం చేసుకుంది. Work smarter.. 😅 pic.twitter.com/fFanLbhCO1 — Buitengebieden (@buitengebieden) December 10, 2023 ఈ వీడియోకు ఇప్పటివరకూ 80 లక్షలకు పైగా వీక్షణలు దక్కాయి. వేలమంది ఈ వీడియోను లైక్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏమున్నదనే విషయానికొస్తే.. కొన్ని గాడిదలు వాటికి ఎదురుగా అడ్డుగా ఉన్న కర్రను దాటి వెళుతున్నాయి. అయితే వాటిలో ఒక గాడిదకు అలా కర్రను దాటి అవతలి వైపునకు వెళ్లాలని అనిపించలేదు. కొసేపు ఆలోచించాక దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే అది అడ్డుగా ఉన్న కర్రను తన నోటితో సులువుగా తొలగించి, యమ దర్జాగా, హాయిగా మందుకు కదిలింది. ఈ వీడియోను చూసినవారంతా గాడిద తెలివితేటలకు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది కూడా చదవండి: రైలులో యువతిపై అకృత్యం.. బాత్రూమ్లో నిందితుని పట్టివేత! మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
గాడిద సవారీతో నామినేషన్‌కు..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. కొందరు అభ్యర్థులను వినూత్న మార్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు. బుర్హాన్పూర్ నియోజకవర్గానికి ప్రియాంక్ ఠాకూర్ అనే స్వతంత్ర అభ్యర్థి గాడిదపై వచ్చి నామినేషన్ సమరి్పంచారు. ‘అన్ని రాజకీయ పార్టీలు తమ ఆశ్రితులకే టికెట్లు ఇస్తున్నాయి. ప్రజలను గాడిదలుగా, అంటే మూర్ఖులుగా తయారు చేస్తున్నాయి. అందుకే గాడిదపై సవారీ చేస్తూ వచ్చి నామినేషన్ వేయాలనుకున్నాను’ అని ఆయన అన్నారు. ఇదే సీటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ సురేంద్ర సింగ్ ఎడ్ల బండిపై మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలిపేందుకే ఇలా చేసినట్లు చెప్పుకున్నారు. సన్వేర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రీనా బొరాసి ట్రాక్టర్‌పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రైతుల సమస్యలను తెలిపేందుకే ఇలా చేశానన్నారు. రాష్ట్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి విశ్వాస్ సారంగ్ స్కూటర్‌పై వచ్చి నరేలా నియోజకవర్గానికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీ. -
వృద్ధునిపై గాడిద దాడి.. ఎంతమంది అడ్డుకున్నా..
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఒక వీడియో కలకలం రేపుతోంది. ఒక గాడిద ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే వ్యవహరిస్తుంటాయి. అయితే కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియో గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేస్తోంది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా, అది ఆ వృద్ధునిపై దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో నమోదయ్యింది. ఎన్నో ప్రయత్నాల తరువాతనే.. ఈ ఘటన 2023 జూలై 7,ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ వీడియోలో.. ముందుగా ఒక వృద్ధుడు రోడ్డుపై వెళుతుండటం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డు పక్కగా ఒక గాడిద నిలుచుని ఉంటుంది. అది ఉన్నట్టుండి, ఆ వృద్ధుని దిశాగా పరిగెత్తకుంటూ వచ్చి, అతనిపై దాడికి తెగబడుతుంది. ఆ వృద్ధుడిని కింద పడవేసి తన కాళ్లతో తొక్కివేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనను గమనించిన చుట్టుపక్కల వారు ఆ వృద్ధుడిని గాడిద బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తారు. అయినా ఆ గాడిద తన పట్టువీడక ఆ వృద్ధునిపై దాడి చేస్తూనే ఉంటుంది. తరువాత ఒక వ్యక్తి ఆ గాడిదపైకి రాయి విసిరినా అది ఏమాత్రం అదరదు. మరికొందరు కర్రతో దానిని కొట్టడంతో ఆది తన దాడిని విరమించి పక్కకు వెళ్లిపోతుంది. తరువాత ఆ వృద్దుడు కాస్త తేరుకుని నిలబడతాడు. महाराष्ट्र के #कोल्हापुर में एक गधे ने सड़क पर चल रहे बुजुर्ग पर किया जानलेवा हमला..पूरी घटना CCTV में कैद..घटना गांधीनगर इलाके में 7 जुलाई सुबह 11 बजे की है..पिछले 3 दिनों में गधे द्वारा लोगों पर हमले की यह दूसरी घटना@indiatvnews@KOLHAPUR_POLICE@Dev_Fadnavis pic.twitter.com/WoWt4vCjap — Atul singh (@atuljmd123) July 8, 2023 మూడు రోజుల్లో రెండవ దాడి ఘటన గడచిన మూడు రోజుల్లో స్థానికంగా జంతువుల కారణంగా జరిగిన రెండవ దాడి ఇది. ఈ ఘటన కొల్హాపూర్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికిముందు ఇదే ప్రాంతంలో జరిగిన కుక్కల దాడిలో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఫిర్యాదు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు! -
క్లియోపాత్ర వాటితోనే స్నానం చేసింది!: మేనక గాంధీ వ్యాఖ్యలు వైరల్
బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ గాడిద పాల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ మేరకు ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో గాడిద పాల సబ్బులు మహిళలను ఎల్లప్పుడూ అందంగా ఉంచుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆమె ఆ వీడియోలో..గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళల సౌందర్యాన్ని పెంచుతాయని, ఈజిప్టు రాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసిందని అన్నారు. పైగా ఢిల్లీలో గాడిద పాలతో చేసిన సబ్బు ఒక్కొక్కటి రూ. 500 ధర పలుకుతుందని చెప్పారు. లడఖ్ కమ్యూనిటీ కూడా గాడిద పాలతోనే సబ్బులు తయారు చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లే గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. అదీగాక చాకలివాళ్లు కూడా గాడిదలను వినయోగించడం లేదని అన్నారు. లడఖ్‌లోని కమ్యూనిటీ సంఘం కూడా గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్ల గుర్తించిందని తెలిపారు. తన ప్రసంగంలో పెరుగుతున్న ఖర్చుల గురించి కూడా ప్రస్తావించారు..చెట్లు అంతరించిపోతున్నాయని, అందువల్లే కలప ఖరీదు పెరిగిపోయిందన్నారు. దీంతో దహన సంస్కారాల ఖర్చులు కూడా పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల పేద ప్రజలు మరణంలో సైతం తమ కుంటుంబికులను నిర్థాక్షిణ్యంగా వదిలేస్తున్నారని చెప్పారు. దహన సంస్కరాలకు కలపను/ఆవు పేడను వినియోగిస్తే అయ్యే ఖర్చుల వ్యత్యాసాన్ని సైతం విపులంగా వివరించారు మేనకా గాంధీ. అయితే తన ఉద్దేశ్యం ప్రజలు జంతవుల నుంచి డబ్బు సంపాదించమని కాదని, ఐనా ఈనాటికి మేకలు, ఆవులు పెంచుతున్న వారెవరూ ధనవంతులు కాలేదని చెప్పారు. అయినా మన వద్ద తగిన సంఖ్యలో వైద్యులు కూడా అందుబాటులో లేరని అన్నారు. సుమారు 25 లక్షల మంది ఉండే సుల్తాన్‌పూర్‌లో కనీసం ముగ్గురు డాక్టర్లు కూడా లేరని, కొన్నిసార్లు అంతమంది కూడా ఉండరని చెప్పుకొచ్చారు. గెదె, మేక జబ్బు పడితే లక్షలు ఖర్చు పెడతారు, పైగా ఆడవాళ్లను కూడా పశుపోషణలో చేయమని అడుగుతాం. అయితే వారు ఎంతవరకు చేయగలరు. అందుకే తాను మేక లేదా ఆవు పెంపకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. దీంతో మీరు సంపాదించాలంటే దశాబ్దం పడుతుంది. పైగా ఆ జంతవు ఒక్క రాత్రిలో చనిపోతుంది. దీంతో అప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుందంటూ మేనకా గాంధీ చాలా విచిత్రంగా ప్రసంగించారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"इनकी सुंदरता की राज आजा के सामने आई जो गधे के दूध से बनी और गोबर से बनी साबुन का प्रोडक्ट यूज करती हैं ◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/rXW1aY1t6o — AZAD ALAM (@Azad24906244) April 2, 2023 (చదవండి: కాంగ్రెస్ ఫైల్స్ అంటూ వీడియో రిలీజ్ చేసిన బీజేపీ) -
వామ్మో ఇదేం ఆచారం రా బాబు! అక్కడ అల్లుడిని గాడిదపై కూర్చొబెట్టి..
భారత్‌లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే పలు రాష్ట్రల్లో ఈ పండగను విభిన్న రీతిలో వారి సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటుంటారు. కానీ కొన్ని చోట్ల సంప్రదాయాలు చాలా విడ్డూరంగా ఉంటాయి. వామ్మో ఇదేం ఆచారం అనిపించేలా ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు. అచ్చం అలాంటి విచిత్రమైన సంప్రదాయమే మహారాష్ట్రాలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలలో 82 ఏళ్లుగా ఒక విచిత్రమైన సంప్రదాయ కొనసాగుతోంది. హోలీ తర్వాత రోజు గ్రామంలో కొత్త అల్లుడిని బ్యాండ్ బాజాలతో గాడిదపై కూర్చొబెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఇదేంటి ఆచారమా!అవమానిస్తున్నారా అన్నట్లుంటుంది ఈ ఆచారం. బీడ్ గ్రామంలోని ప్రజలు మాత్రం గాడిదపై కూర్చొబెట్టడం అనేది సత్కారంగా కింద చూస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదేమిటంటే..గ్రామంలో నివశిస్తున్న ఠాకూర్ ఆనంద్ దేశ్‌ముఖ్ కుటుంబానికి చెందిన అల్లుడు హోలీకి రంగులు వేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే అతన్ని గాడిదపై కూర్చొబెట్టి, చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పుతూ ఉండగా..అతను హోలీ రంగులు వేస్తుండాలి. అందువల్ల అతను రంగులు వేసేందుకు ససేమిరా అన్నాడు. దీంతో అతడి మామగారు అతన్ని ఏదోలా ఒప్పించి గాడిదను చక్కగా అలంకరించి దానిపి కూర్చోబెట్టి ఊరంతా తిప్పి.. ఆ తర్వాత గుడికి తీసుకువచ్చి హరతి ఇచ్చి స్వాగతం పలికారు ఆ అల్లుడికి. ఆ తర్వాత మామగారు కొత్త బట్టలు, బంగారు ఉంగరం బహుకరిచడంతో ముభావంగా ఉన్న అల్లుడు ముఖం కాస్త సంతోషంతో చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ ఆచారాన్నే కొనసాగిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. (చదవండి: ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప బిగ్గరగా ఏడవడంతో..) -
మారిన పరిస్థితి.. భూమి మీద గాడిదలు చూస్తామో లేదో!
అనంతపురం అగ్రికల్చర్: కష్టజీవి అయిన గాడిద (ఖరము) క్రమేణా కనుమరుగవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు మానవుని జీవన శైలిలో మార్పులు వచ్చాక గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మరికొన్ని సంవత్సరాలు కొనసాగితే భూమి మీద గాడిద జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి... వీటి సంతతిని పెంచాలని వార్షిక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ► గాడిద జీవితకాలం 50 సంవత్సరాలు. గ్రామీణ ప్రాంతాల్లో బరువు మోయడానికి వినియోగిస్తారు. చాకలివారు తమ వృత్తి పనిలో వీటినే ఎక్కువగా వాడేవారు. కొండలు, గుట్టలు లాంటి ప్రాంతాల్లో నివసించే వారు రవాణాకు, మరికొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనుల్లో కూడా వినియోగించేవారు. లగేజీ రవాణాకు ఆటోలు, తోపుడు బండ్లు, ద్విచక్రవాహనాలు అందుబాటులోకి రావడంతో గాడిదల వినియోగం తగ్గిపోయింది. 30 ఏళ్ల కిందట వరకు గాడిదల సంఖ్య గణనీయంగా ఉండేది. పల్లెల్లో చూస్తే ఎక్కడ చూసినా కనిపించేవి. గాడిద పాలను పిల్లలకు రోగనిరోధక శక్తిగానూ, కొన్ని ఆయుర్వేద మందుల్లోను వాడతారు. అక్కడక్కడా ఉన్న గాడిదల నుంచి కొందరు పాలను సేకరించి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వాటి పాలకు గిరాకీ ఉన్నందున గాడిద కూడా కొందరికి జీవనాధారంగా మారింది. వెయ్యిలోపే గాడిదలు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 2007 లెక్కల ప్రకారం 15 వేలకు పైగా గాడిదలు ఉండేవి. 2012లో ఆ సంఖ్య 6,800కు చేరగా, 2018లో 3,200కు పడిపోయింది. తాజాగా గాడిదల సంఖ్య వెయ్యికి లోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రొళ్ల, శెట్టూరు, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, యాడికి, పెద్దవడుగూరు, గుంతకల్లు, గుత్తి, ధర్మవరం, కూడేరు, కుందురి్ప, అమరాపురం, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో గాడిదలు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. గాడిదల పెంపకంపై 23న సదస్సు అంతరించిపోతున్న గాడిదల సంతతిని పెంచాలనే ఆలోచనతో ఈ నెల 23న అనంతపురంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘బ్రూక్ హాస్పిటల్’ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ సహకారంతో ‘డీక్లినింగ్ డాంకీ పాపులేషన్ అండ్ స్టెప్స్ ఫర్ మిటిగేషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, బ్రూక్ హాస్పిటల్ ప్రతినిధులతో పాటు పశు సంవర్ధక శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, నోడల్ ఆఫీసర్లు, అనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు, గుంటూరుకు చెందిన గాడిద పెంపకందారులు కొందరు హాజరు కానున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం తెలిపారు. -
పెళ్లిలో వధువుకు ‘గాడిద’ను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. ఎందుకో తెలుసా!
-
Video: పెళ్లిలో వధువుకు ‘గాడిద’ను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. ఎందుకో తెలుసా!
పెళ్లిళ్లకు హాజరయ్యేటప్పుడు నూతన వధూవరులకు కట్నకానుకలు అందించడం కామన్. కానీ ఇందుకు భిన్నంగా పెళ్లి మండపంలోనే ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యకు వినూత్న గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ వరుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.. అజ్లాన్ అనే వ్యక్తి వరిషా అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లిమండంలోనే వధువుకు ఓ బహుమతి ఇవ్వాలని అజ్లాన్ నిర్ణయించుకున్నాడు. దీంతో వరుడు వధువుకి ఓ గాడిద పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దానిని చూసిన వధువు షాక్ అవ్వలేదు. ఎందుకంటే అతనికి ముందే తెలుసు వధువు జంతు ప్రేమికురాలని. అందుకే చిన్న గాడిద పిల్లను ఆమెకు వివాహ కానుకగా ఇవ్వాలనున్నట్లు వరుడు అజ్లాన్ చెప్పాడు. కాబోయే భార్యకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చే సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను వరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో పెళ్లిలో బహుమతిగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నావు అని వధువు అడిగితే ఒకటేమో అదంటే నీకు ఇష్టం, రెండోది గాడిద అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు అని వరుడు బదులిచ్చాడు. అంతేగాక గాడిద పిల్లను దాని తల్లి నుంచి వేరు చేయలేదని.. తల్లి కూడా ఈ పిల్ల గాడిదతోనే ఉందని తెలిపాడు. తనకు జంతువులు అంటే చాలా ఇష్టమని, జనాలు ఏమైనా అనుకోనివ్వండి. వారిశాకు ఇదే నా బహుమతి అంటూ పేర్కొన్నాడు. అజ్లాన్ మాటలు విన్న వధువు వారిశా తాను దీన్ని కేవలం గాడిదలా చూడటం లేదని తెలిపింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఊహించని గిఫ్ట్‌ను చూసి కొందను నవ్వుతుంటే.. మరికొందరు మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని నూతన జంటకు శుభాకాంక్షలు తెలపుతున్నారు.. అలాగే గాడిద పిల్ల కూడా క్యూట్‌గా అందంగా ఉందంటూ, ఎవరు ఏమనుకుంటారనే దాని గురించి పట్టించుకోవద్దని కామెంట్ చేస్తున్నారు. -
Mur Ghurar Duronto Goti: అవును.. గుర్రం ఎగిరింది.. కలా? నిజమా!
‘అవును... గుర్రం ఎగరావచ్చు’ అంటారు. ఈ గుర్రం మాత్రం ఎగరడమే కాదు... యంగ్ డైరెక్టర్ మహర్షి కశ్యప్‌ను కూర్చోబెట్టుకొని బెంగళూరు నుంచి జైపుర్ వరకు తిప్పింది. రేపు ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా తీసుకువెళ్లవచ్చు... ఆస్కార్ 2023 బరిలో ‘షార్ట్ ఫిల్మ్ ఫిక్షన్’ విభాగంలో మన దేశం నుంచి అస్సామీ షార్ట్ ఫిల్మ్ మర్ గౌరర్ డురొంటో గోటి (ది హార్స్ ఫ్రమ్ హెవెన్) ఎంపికైంది. 27 సంవత్సరాల మహర్షి తుహిన్ కశ్యప్ దీని దర్శకుడు. కథ విషయానికి వస్తే... ఒక పెద్దాయన ఎప్పుడూ పగటి కల కంటూ ఉంటాడు. నగరంలో జరిగే గుర్రపు పందేలలో తన గుర్రం కూడా ఉండాలి. ఆ గుర్రం ఎలాంటిదంటే, మెరుపు వేగంతో పరుగులు తీస్తుంది. ఎప్పుడు గుర్రపు పందేలు జరిగినా తానే విజేత. ‘మీ గుర్రానికి ఎంత బాగా శిక్షణ ఇచ్చారు’ అంటూ అందరూ తనను వేనోళ్లా పొగుడుతుంటారు. ‘ఇంతకీ నా గుర్రం ఏదీ?’ అని వెదుకుతాడు ఆ పెద్దాయన. కానీ ఆ గుర్రం ఊహాల్లో తప్ప వాస్తవప్రపంచంలో కనిపించదు. అక్కడ కనిపించేది తన గాడిద మాత్రమే! ‘కలా? నిజమా! అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ గురించి వింటూ, చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్ బరిలో నిలవడం అనేది గర్వంగా ఉంది’ అంటున్నాడు మహర్షి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన మహర్షి స్టూడెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీశాడు. సర్రియలిజం, డార్క్ హ్యూమర్లతో కూడిన ఈ కథను చెప్పడానికి సంప్రదాయ కళ ‘ఒజపాలి’ని సమర్థవంతంగా వాడుకున్నాడు దర్శకుడు. ఆరువందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న అస్సామీ కళారూపం ‘ఒజపాలి’లో కళాకారులు ఆడుతూ, పాడుతూ, నవ్విస్తూ పురాణాలలో నుంచి కథలు చెబుతుంటారు. ‘ది హార్స్ ఫ్రమ్ హెవెన్’ను ఎక్కువ భాగం క్యాంపస్‌లో చిత్రీకరించారు. కొంత భాగం కోల్‌కతా శివారులలో చిత్రీకరించారు. ఈ చిత్రం కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్, జైపుర్ ఫిల్మ్‌ఫెస్టివల్, ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్, డీప్ ఫోకస్ స్టూడెంట్ ఫిల్మ్‌ఫెస్టివల్...మొదలైన ఎన్నో చిత్రోత్సవాలకు ఎంపికైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎస్ఎఫ్ఎఫ్)లో ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్ అందుకొని ఆస్కార్ బరిలోకి దిగబోతుంది. ఫీచర్ ఫిల్మ్స్‌లా కాకుండా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను ఆస్కార్‌కు పంపాలంటే అది ఆస్కార్ – క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ గెలుచుకోవాలి. మన దేశంలో అలాంటి ఏకైక ఫిల్మ్ ఫెస్టివల్ బీఐఎస్ఎఫ్ఎఫ్. ‘చిత్ర రూపకల్పన అనేది ఎంత క్లిషమైన విషయమో అందులో దిగాక కాని తెలియదు. ప్రతిరోజూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. స్వర్గం నుంచి దిగి వచ్చిన గుర్రం మమ్మల్ని ఎన్నో నగరాలు తిప్పింది. భవిష్యత్‌లో ఎన్ని చోట్లకు తీసుకువెళుతుందో తెలియదు’ అంటున్నాడు మహర్షి. కల్లోల ప్రాంతంలో పుట్టి పెరిగిన మహర్షికి ఎనిమిదవ తరగతిలో డైరెక్టర్ కావాలనే కోరిక పుట్టింది. చాలామందిలో ఆతరువాత కాలంలో ఆ కోరిక ఆవిరైపోతుంది. కానీ మహర్షి విషయంలో మాత్రం అది ఇంకా బలపడింది. (క్లిక్: హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత) సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టిన రోజు తన కలకు రెక్కలు దొరికినట్లుగా సంతోషపడ్డాడు. మహర్షిలో ఉన్న ప్రశంసనీయమైన ప్రత్యేకత ఏమిటంటే.. నేల విడిచి సాము చేయాలనుకోవడం లేదు. తన నేల మీద నడయాడిన కథలనే చిత్రాల్లోకి తీసుకురావాలకుంటున్నాడు. ఉత్తర, దక్షిణ భారతాలతో పోల్చితే వెండి తెర మీద కనిపించిన ఈశాన్య భారత ప్రాంత కథలు తక్కువ. ఇప్పుడు ఆ లోటు మహర్షి కశ్యప్ రూపంలో తీరబోతుంది. ఆస్కార్ ఎంట్రీ అనేది ఆరంభం మాత్రమే! (క్లిక్: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్) ప్రాంతీయ చిత్రాలు రకరకాల కష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అస్సాం అనేది కొత్త కథలకు కేంద్రం కాబోతుంది. – మహర్షి -
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని.. సొంతూరిలో గాడిదల ఫారం.. ఆదాయం ఎంతో తెలుసా?
రాజానగరం(తూర్పుగోదావరి): ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడవడైననేమి ఖరము పాలు.. అన్నాడు వేమన. ఆయన ఇప్పటి కాలంలో ఉంటే గాడిద పాలకు ఉన్న డిమాండ్ చూసి తన పద్యాన్ని సవరించుకునేవాడేమో.. నిజమే మరి..! ఆవు పాలు, గేదె పాలకు కూడా లేనంతగా గాడిద పాల ధర లీటరుకు రూ.7,500 వరకూ పలుకుతోంది. ఈ డిమాండ్‌ను తనకు ఉపాధిగా మలచుకున్నారాయన. విదేశాల్లో లక్షల రూపాయల జీతాన్ని.. సాప్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని సొంతూరిలో డాంకీ ఫారం పెట్టాడు రాజమహేంద్రవరానికి చెందిన నరాల వీర వెంకట కిరణ్‌కుమార్. ఇందుకు దారి తీసిన పరిస్థితులను ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? ‘‘మాది రాజమహేంద్రవరం. ఎమ్మెస్సీ చదువుకున్నాను. యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఓ కంపెనీ మారాను. బెంగళూరు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండేది. రోగ నిరోధక శక్తి కోసం అందరూ నానారకాలుగా తాపత్రయ పడేవారు. ఇందుకు గాడిద పాలు బాగా ఉపయోగపడతాయని చెప్పేవారు. కొందరు ఇంటింటికీ గాడిదలను తిప్పుతూ చిన్నపాటి గ్లాసులతో పాలు అమ్మేవారు. మా అబ్బాయి ఆస్త్మా ఉండేది. గాడిద పాల వల్ల ఇది తగ్గుతుందని తెలుసుకున్నాను. ప్రయోజనం కనిపించింది. గాడిద పాలకు ఉన్న డిమాండును సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. డాంకీ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నాను. వెంటనే కాతేరులోని మా ఫ్రెండ్ జీవీ రాజుతో నా ఆలోచన షేర్ చేసుకున్నాను. ఉద్యోగాన్ని వదులుకున్నాను. గాడిడల పెంపకంపై శిక్షణ తీసుకున్నాం. రాజానగరం మండలం మల్లంపూడిలో 30 ఎకరాలు లీజుకు తీసుకున్నాం. అక్షయ డాంకీ ఫారం గత నెలలో ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఇందులో నా స్నేహితుడి కుమార్తె నవ్య కూడా పార్టనర్‌గా చేరారు. ఆమె ఢిల్లీ ఐఐటీలో ఫస్టియర్ చదువుతున్నారు. చదువుకు ఆటంకం కలగకుండా చదువు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ఫారం ఇలా.. అక్షయ డాంకీ ఫారంలో ప్రస్తుతం 120 గాడిదలు ఉన్నాయి. టోక్యో దేశానికి చెందిన యుథోపియన్ బ్రీడ్ అచ్చు గుర్రంలా ఉంటుంది. దీని ఖరీదు రూ.5 లక్షలు. ఇది రోజుకు లీటరున్నర పాలు ఇస్తుంది. రాజస్తాన్‌కు చెందిన హాలారీ రకం రోజు 750 మిల్లీలీటర్ల పాలు ఇస్తుంది. దీని ఖరీదు రూ.80 వేలు పైనే. మా ఫారంలో రోజుకు 30 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి శనివారం 300 లీటర్లు హైదరాబాద్ పంపిస్తున్నాం. రోజు విడిచి రోజు కాకినాడ మీదుగా 20 లీటర్ల పాలను కాస్మెటిక్ కంపెనీలకు రవాణా చేస్తున్నాం. పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి గాడిద పిల్లలను కూడా విక్రయిస్తున్నాం. పాల పొడి, పనీరు కూడా అమ్ముతున్నాం. మద్య వ్యసనం నుంచి విముక్తి కల్పించే ఔషధంలో గాడిద మూత్రం ఉపయోగపడుతుంది. ఇందుకోసం సూరత్, మహారాష్ట్రలకు వారం వారం గాడిద మూత్రం పంపిస్తున్నాం. ఎన్నో రకాల విటమిన్లు గాడిద పాలలో విటమిన్ ఎ, బి, సి, డితో పాటు కాల్షియం ఉంటుంది. కొవ్వు శాతం తక్కువ. ఎక్కువ కేలరీలు లాక్టోస్ రూపంలో ఉండే కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తాయి. రోజుకు పది మిల్లీలీటర్ల గాడిద పాలు తాగితే ఎన్నో ఫలితాలుంటాయి. ఆవు, గేదెల పాల కంటే గాడిద పాలు కాస్త పలుచగా ఉంటాయి. రుచిలో కొబ్బరి పాలను తలపిస్తాయి. విదేశాల్లో గిరాకీ ఎక్కువగానే ఉంది. యూరప్ దేశాల్లో ఆహార పదార్థాలు, పానీయాల తయారీ, కాస్మెటిక్స్ తయారీలో వాడుతుంటారు. గాడిదలకు నిరంతరం డాక్టర్ అరుణ వైద్య సేవలు అందిస్తున్నారు. గాడిదలు ఉదయం, సాయంత్రం స్వేచ్ఛగా తిరిగేందుకు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాం. రోజుకు 25 కిలోల పచ్చగడ్డి అవసరమవుతోంది. సొంత ప్రాంతంపై మమకారంతో ఇక్కడ ఇలా డాంకీ ఫారం పెట్టాను’’ అని కిరణ్‌కుమార్ వివరించారు. -
Viral Video: చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం అంటే ఇదేనేమో!
న్యూఢిల్లీ: మనం చేసిన పనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. చేసిన కర్మకు వెంటనే ప్రతిఫలం వస్తుందంటుంటారు. అందుకు ఈ యువకుడు చేసిన పనే నిదర్శనంగా నిలుస్తోంది. గాడిదను కొడుతూ.. కాళ్లతో తంతూ తీవ్రంగా హింసించిన వీడియో చూస్తే మీరూ అవుననక ఉండలేరు. ఆ యువకుడి వీడియోను శక్తి కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై నెటిజన్లు సంతృప్తి చెందారు. కర్మకు తక్షణ ఫలితం ఉంటుందని యువకుడిపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఓ యువకుడు గాడిదను తాడుతో కట్టి పట్టుకుని తీవ్రంగా కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. ఆ తర్వాత దానిపైనే ఎక్కి అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించాడు. యువకుడి దాడితో సహనం కోల్పోయిన గాడిద ఎదురుదాడికి దిగింది. కింద పడేసి ఆ కిరాతకుడి కాలు పట్టుకుని చుట్టూ తిప్పుతూ కాళ్లతో తన్నుతూ దాడి చేసింది. ఈ వీడియోకు రెండు రోజుల్లోనే లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. గాడిద ప్రతీకారాన్ని సూచిస్తూ.. కర్మకు ప్రతిఫలం తప్పదంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. ‘రెండోభాగంలో వీడియో సూపర్.. సంతృప్తిగా ఉంది’ అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. మంచిపని అయింది.. నీకు అదే కావాలి అంటూ మరొకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Shakti Kapoor (@shaktikapoor) ఇదీ చదవండి: పావురం బ్యాక్ జంప్!.. చూస్తే అవాక్కవ్వాల్సిందే: వీడియో వైరల్ -
గాడిద ఎక్కడున్నా గాడిదే: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. కానీ, ఈసారి రాజకీయ విమర్శతో కాదు.. మరో కారణంతో! యూకేలో ఉన్నప్పడు తన జీవితం ఎలా ఉండేదో చెప్తూ.. ఆయన చెప్పిన ఓ సామెత ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘యూకేకి వెళ్లినప్పుడు నాకు సాదర ఆహ్వానమే దక్కింది. కానీ, దానిని ఎప్పుడూ నా ఇంటిగా అనుకోలేదు. ఎందుకంటే నేను పక్కా పాకిస్థానీని. ఒక గాడిదకు గీతలు(చారలు) పెట్టినంత మాత్రాన.. అది కంచర గాడిద అయిపోదు. గాడిద ఎక్కడున్నా గాడిదే’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ కామెంట్లు చేశారు. Without comment. pic.twitter.com/l0Jwpomqvp — Hasan Zaidi (@hyzaidi) May 6, 2022 ఇందుకు సంబంధించిన క్లిప్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ కామెంట్‌తో ఆడేసుకుంటున్నారు. పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ జునైద్ అక్రమ్ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో భాగంగా ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంతో ఏప్రిల్ 10వ తేదీన పాక్ ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయాడు. ముందస్తు ఎన్నికలకు కోసం ఖాన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ.. మే 2023 కంటే ముందు నిర్వహించడం కష్టమేనని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ చెప్తోంది. చదవండి: ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు -
అక్కడి అమ్మాయిని పెళ్లాడితే గాడిదమీద ఊరేగిస్తారు.. ఇదేం ఊరురా బాబోయ్!
ముంబై: భారతదేశంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలకు నిలవు. అందులో కొన్ని వింతగా కూడా ఉంటాయి. అయితే ఆచార వ్యావహారాలు ఎలా ఉన్నా పాటించడం మాత్రం పక్కాగా పాటిస్తుంటాం. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో హోలీ రోజున ఒక వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. వినడానికే కాదు ఆచరించడానికి కూడా కొంచెం వింతగా ఉంటుంది, కానీ తప్పదు మరి. ఆ గ్రామంలో కొత్త అల్లుడిని హోలీ రోజు గాడిద ఎక్కించి ఊరేగిస్తారట ! ఇదేం ఆచారం రా బాబు అనుకుంటున్నారా. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లి చూద్దాం.. (చదవండి: వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది! ) బరాబర్ గాడిద ఎక్కాలి.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోగల విదా గ్రామంలో 90 ఏళ్ల క్రితం ఈ ఆచారం మొదలైంది. దీన్ని అదే గ్రామానికి చెందిన ఆనంద్‌రావు దేశ్‌ముఖ్ ప్రారంభించారు. అప్పట్లో ఆనంద్‌రావు తన అల్లుడిని గాడిద ఎక్కించి ఊరేగించి ఆపై చివర్లో కొత్తబట్టలు పెట్టారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ ఊరిలో హోలీ రోజు ఈ తంతు జరుగుతోంది. ముందుగా గ్రామంలో కొత్త అల్లుళ్లు ఎవరెన్నారో తెలుసుకుంటారు. ఆపై వారి ఈ ఆచారం నుంచి తప్పించుకోకుండా నిఘా కూడా పెడ్తారు. కొత్త అల్లుళ్ల సర్వేకి కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుందట. అందుకోసం ఆ గ్రామంలోని కొందరు ఏకంగా ఇంటింటా సర్వే కూడా చేస్తారు. ఆచారం ప్రకారం ఈ గాడిద సవారీ గ్రామం మధ్య నుంచి మొదలై 11 గంటలకు ఆ ఊరిలోని హనుమాన్ దేవాలయం వద్ద ముగుస్తుంది. ఊరేగింపు ముగింపులో అల్లుడికి నచ్చిన బట్టలు కూడా పెడతారు. -
బల్మూరి వెంకట్ అరెస్టు
జమ్మికుంట/హుజూరాబాద్: మూగజీవాలను దొంగిలించి, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచారన్న ఆరోపణలపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కరీంనగర్ జిల్లా జమ్మి కుంట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కరీంనగర్ అదనపు డీసీపీ శ్రీనివాస్ జమ్మికుంట స్టేషన్ లో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. గురు వారం సీఎం కేసీఆర్ జన్మదినాన్ని అభాసుపాలు చేశారని జమ్మికుంట అర్బన్ టీఆర్ఎస్ పార్టీ అధ్య క్షుడు టంగుటూరి రాజ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట్, మరో 10 మంది కలసి ఒక గాడిదను దొంగతనంగా కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీకి తరలించి దానికి కేసీఆర్ చిత్రపటాన్ని తగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దాని కాలితో కేక్ కోయించి బలవంతం గా గాడిదకు తినిపించారని ఆరోపించారు. సీఎంను అవమానించడంతోపాటు కాంగ్రెస్–టీఆర్ఎస్ పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన బల్మూరి వెంకట్‌పై చర్యలు తీసుకోవాలని గురువారం రాత్రి జమ్మికుంట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అర్ధరాత్రి దాటాక వెంకట్‌ను హుజూరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకట్‌తోపాటు గుర్తుతెలియని పది మందిపై కేసు నమోదు చేశామని, వెంకట్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు. అరెస్టులతో మా పోరాటం ఆపలేరు..: కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని, ఇలాంటి చర్యలతో తమ పోరాటం ఆగ దని బల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. బెయిల్ మంజూరు చేసింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల బాధలు ప్రభుత్వానికి అర్థం కావడానికి నిరసన తెలిపితే, తాను గాడిదను చోరీ చేశానని తప్పుడు కేసు బనాయించారని తెలిపారు. నిరుద్యోగంపై పోరాడితే అరెస్టా?: రేవంత్ సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను ఎలాంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి అరెస్టు చేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ హక్కులను కాలరాస్తూ పోలీసులు కాంగ్రెస్ నాయకులపై దౌర్జన్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
గాడిదలను అపహరించి సొమ్ము చేసుకుంటున్నారు!
తాడేపల్లిరూరల్: తమ ఇంటి మహాలక్ష్మిగా పెంచుకుంటున్న గాడిదలను కొందరు అపహరించి అమ్ముకోవడంపై వాటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి అమ్ముకున్న వారు నష్టపరిహారం చెల్లించడంతో వారు మొత్తబడ్డారు. కర్నూల్ పట్టణ పరిధిలో దోబీ పనిచేసి జీవనం సాగించే కొంతమంది దుస్తులు మోసేందుకు గాడిదలను పెంచుతూ వాటిని ఎంతో ఆప్యాయంగా చూస్తుంటారు. అయితే బబ్లూ, శ్రీనివాసరావు, దుర్గారావులకు చెందిన గాడిదలను బాపట్లకు చెందిన రజనీకాంత్ అనే వ్యక్తి అపహరించి వాటిని తాడేపల్లిలో అమ్మాడు. దీంతో బబ్లూ, శ్రీనివాసరావులు తమ స్నేహితులతో కలసి రాష్ట్రంలో గాడిదలను ఎక్కడెక్కడ వధించి మాంసాన్ని విక్రయిస్తారో గూగుల్‌లో సెర్చ్ చేసి తాడేపల్లి చేరుకున్నారు. ఒక ఇంట్లో కట్టేసి ఉన్న తమ గాడిదను బబ్లూ, శ్రీనివాసరావులు గుర్తించి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించగా.. కర్నూలు నుంచి అపహరించిన మూడు గాడిదల్లో రెండింటిని మాంసం కోసం విక్రయించినట్టు తెలిపారు. మిగిలిన ఆ గాడిదను బబ్లూకు అప్పగించారు. అమ్మిన రెండు గాడిదలకు వెల కట్టి రూ.1.60 లక్షలను కర్నూలు యువకులకు అందించారు. -
కర్నూలులో వింత ఆచారం: భేష్.. గార్ధభాల రేస్
కోవెలకుంట్ల: మనలో చాలామందికి గుర్రాల పరుగు పందేలు తెలుసు. వృషభాల బండలాగుడు పోటీలు కూడా చూసే ఉంటారు. ఈ కోవలోనే గాడిదల (గార్ధభాలు)కూ పరుగు పందేలు ఇటీవల కాలంలో నిర్వహిస్తున్నారు. తరతరాల నుంచి ప్రజలు గాడిదలను బరువులు మోసేందుకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కొండప్రాంతాల నుంచి ధాన్యం, అటవీ సంపదను గార్ధభాలపై వేసుకుని ఒకచోట నుంచి మరో చోటకు తరలించేవారు. జంతు బలప్రదర్శన పోటీలపై ఆసక్తి ఉన్న కొందరు వ్యక్తులు ఇటీవల గార్ధభాలను పెంచి పోషిస్తున్నారు. జిల్లాలోని కోవెలకుంట్ల, చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, బనగానపల్లె, అవుకు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ, కల్లూరు, వెలుగోడు, తదితర మండలాల్లో గార్ధభాలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. బలవర్ధక ఆహారం పోటీలకు పెంచే గార్ధభాలకు బలవర్ధక ఆహారం అందజేస్తున్నారు. కేవలం దాణారూపంలో పెసలు, ఉలవలు, వడ్లగింజలు, కొర్రలు, కొర్ర పిండి, బెల్లం, తదితర పప్పుదినుసులతోపాటు వివిధ పండుగల సందర్భంగా కజ్జికాయలు కూడా ఆహారంగా అందజేస్తున్నారు. పశుగ్రాసంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో రోజుకు 750 గ్రాముల దాణాను ఆహారంగా ఇస్తున్నారు. పోటీలకు నిర్ణీత సమయం పరుగుపందెం పోటీల్లో ఇసుక సంచుల బరువుతో గార్ధభాలు నిర్ణీత పది నిమిషాలు సమయంలో నిర్దేశించిన దూరం పరుగెత్తాలి. సంజామల మండలం ఆల్వకొండ క్రాస్ సమీపంలో కాశినాయన ఆరాధనోత్సవాల సందర్భంగా ఇటీవల నిర్వహించిన పోటీల్లో ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన యోహాన్ గార్ధభం నిర్ణీత సమయంలో 11వేల అడుగుల దూరం పరుగెత్తి విజేతగా నిలిచి రూ.20 వేలు బహుమతి కైవసం చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన నాగవైష్ణవి గార్ధభం 10,700 అడుగులు, చాగలమర్రి మండలం పెద్ద వంగలికి చెందిన పాములేటి గార్ధభం 10,500 అడుగుల దూరం పరుగెత్తి తర్వాతి రెండు, మూడుస్థానాల్లో రూ.10వేలు, రూ.8 వేలు గెలుపొందాయి. పండుగలు, తిరుణాళ్లలో పోటీలు ఏటా ఉగాది, శ్రీరామ నవమి, సంక్రాంతి పండుగలతోపాటు కాశినాయన ఆరాధోత్సవాలు, పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, గ్యార్మీ, అమ్మవారి జాతరల సందర్భంగా కర్నూలు, నంద్యాల, చాగలమర్రి, ఆల్వకొండ, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా గార్ధభాల పరుగు పందెం పోటీలను నిర్వహిస్తున్నారు. నిర్వాహకుల నుంచి పోటీల సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గార్ధభాలను పెంచే వారు పందేలకు కొన్ని రోజుల ముందు మరోసారి శిక్షణ ఇచ్చి పోటీల్లో పాల్గొంటున్నారు. రూ.లక్ష వరకు ధర పరుగు పందెం పోటీలకు ఉపయోగించే గార్ధభాల ధర మార్కెట్లో సైజును బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. వివిధ సైజుల్లోని గార్ధభాలను కొనుగోలు చేసిన వారు వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీలకు సిద్ధం చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనే గార్ధభాలకు ఆయాసం రాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పరిగెత్తించడం, పోటీలకు తగ్గట్టు ఇసుకను సంచుల్లో నింపి పరుగుపందెం ప్రాక్టీస్ చేయిస్తారు. వాటిపై ఇసుక సంచులు తాళ్లతో కట్టి పోటీలకు దింపుతారు. పోటీలలో గార్ధభం దాదాపు 200 కిలోల బరువుతో పరిగెత్తాల్సి ఉంటుంది. రూ.42 వేలతో కొన్నా వైఎస్సార్ జిల్లా జంగాలపల్లెలో నెల రోజుల క్రితం రూ.42 వేలు వెచ్చించి గార్ధభాన్ని కొన్నాను. ఆ జిల్లాలో పది పర్యాయాలు పరుగు పందెం పోటీల్లో పాల్గొని అది బహుమతులు కైవసం చేసుకుంది. ఆ గార్ధభాన్ని కొనుగోలు చేశాక ఇటీవల ఒంగోలు, ఆల్వకొండ ప్రాంతాల్లో జరిగిన పోటీలకు తీసుకెళ్లాను. – సుధాకర్, కోవెలకుంట్ల చాకిరేవు వృత్తితోపాటు పోటీలకు చాకిరేవు వృత్తితోపాటు గార్ధభం పోటీలపై ఆసక్తి ఉండటంతో ఏడాది క్రితం కర్నాటక రాష్ట్రంలో రూ.50 వేలు వెచ్చించి గార్ధభాన్ని కొనుగోలు చేశాను. ప్రతి రోజు జొన్నలు, వడ్లు కలిపి ఆహారంగా పెడుతున్నాను. ఇప్పటి వరకు నంద్యాల, అయ్యలూరు, చిన్నవంగలి, ఆల్వకొండలో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. – సుబ్బరాయుడు, ముక్కమల్ల, సంజామల మండలం -
గాడిదపై సర్పంచ్ ఊరేగింపు: పండగ చేసుకున్న గ్రామస్తులు
భోపాల్: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా మధ్యప్రదేశ్‌లో మాత్రం ఆశించినంతగా కురవడం లేదు. దీంతో వర్షాల కోసం ప్రజలు తీరొక్క తీరున పూజలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మనం కప్పల పెళ్లి తదితర కార్యక్రమాలు చూశాం. కానీ ఆ రాష్ట్రంలో వింతగా గాడిదపై సర్పంచ్ కూర్చొని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఉత్సాహంతో ఈలలు.. కేకలు వేస్తూ డప్పు చప్పుళ్లకు డ్యాన్స్ చేస్తూ వర్షం కోసం ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ రాష్ట్రంలోని విదిశ జిల్లా రంగై గ్రామంలో అనాదిగా ఓ ఆచారం కొనసాగుతోంది. వర్షాల కోసం గాడిదపై సర్పంచ్ గ్రామమంతా ఊరేగాలనే సంప్రదాయం ఉంది. ప్రస్తుతం ఆ జిల్లాలో వర్షాలు సక్రమంగా కురవడం లేదు. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి సర్పంచ్ సుశీల్ వర్మకు గత సంప్రదాయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనుకున్నదే తడువుగా ఒక గాడిదను తీసుకుని వచ్చి దానికి పూజించారు. అనంతరం సర్పంచ్ సుశీల్ వర్మ గాడిదపై కూర్చోగా గ్రామస్తులంతా కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. పటేల్ బాబా ఆలయం నుంచి గణేశ్ మందిరం వరకు ఊరేగింపు చేపట్టారు. ఈలలు.. కేకలు వేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో గ్రామస్తులు పాల్గొన్నారు. ఊరేగింపు ముగిసిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు కురవాలని గ్రామస్తులంతా ప్రార్థించారు. ఈ కార్యక్రమం అనంతరం సర్పంచ్ సుశీల్ వర్మ స్పందించి ఆ ఆనవాయితీ గురించి వివరించారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో మాకు వింత ఆచారం ఉంది. గ్రామ అధిపతి (సర్పంచ్) గాడిదపై స్వారీ చేస్తే వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే గాడిదపై స్వారీ చేశా. ఒక ప్రజాప్రతినిధిగా గ్రామస్తుల సమస్య పరిష్కరించడం నా బాధ్యత. అందుకే గాడిదపై ఊరేగి వరుణదేవుడిని ప్రార్థించా’ అని తెలిపారు. -
చులకన వద్దు.. గరిటెడైనను చాలు గాడిద పాలు!
సాక్షి, అమరావతి: గాడిదను మనం చాలా చులకనగా చూస్తుంటాం.. ఒరేయ్ గాడిదా.. అంటూ దాని పేరును ఓ తిట్టులా వాడేస్తాం. మన దృష్టిలో అవమానానికి మారుపేరుగా మిగిలిన ఆ గాడిద పాలలోమనకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అనారోగ్యం బారిన పడినప్పుడు అవి మనకు అక్కరకొస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన తాజా పరిశోధనలు నిగ్గుతేల్చాయి. దేశంలో గాడిద పాల వినియోగం పూర్వకాలం నుంచే ఉన్నా.. పాల కోసమే గాడిదల్ని పెంచే దశకు మనం ఇంకా రాలేదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియా ఉపఖండ ప్రాంతాలను మినహాయిస్తే.. అమెరికా, లాటిన్ అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరింది. ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలెండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం వాణిజ్య స్థాయిలో కొనసాగుతోంది. యూరోప్‌లో సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో గాడిద పాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయన్న నమ్మకం అనాదిగా ఉంది. వయసు మళ్లిన వారు గాడిద పాలను బలవర్ధక ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని ఇటీవలి పరిశోధనలో తేలింది. లాటిన్ అమెరికన్ దేశాల్లో గాడిద పాలను ఔషధంగానే కాకుండా తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అయితే మన దేశంలో మాత్రం కేవలం ఔషధంగానే తీసుకుంటున్నారు. ఈ పాలు తాగితే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకం కూడా ఉంది. లీటర్ గాడిద పాల ధర సుమారు రూ.2 వేలపైనే ఉంది. ఔషధ వినియోగం కోసం సుమారు 25, 30 మి.లీ. మోతాదులో విక్రయిస్తున్నారు. ఒక్కో మోతాదు ధర రూ.200 నుంచి రూ.300 వరకూ ఉంది. మన ఇళ్ల దగ్గరకొచ్చేవారు 10 మి.గ్రా ఇచ్చి రూ.100 తీసుకుంటున్నారు. సీ విటమిన్ పుష్కలంగా ఉన్న గాడిదపాల వినియోగం ఇటీవల కరోనా నేపథ్యంలో బాగా పెరిగింది. పుష్కలంగా పోషకాలు గాడిద పాలల్లో విటమిన్ సీ, బీ, బీ12, ఈ విటమిన్లతో పాటు, న్యూట్రిన్లు ఉన్నాయి. ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో సీ విటమిన్ 60 రెట్లు అధికం కీలకమైన ఓమేగా–3, 6తో పాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలం తల్లిపాలతో సమాన స్థాయిలో కేలరీలు, మినరల్స్ ఉంటాయి. గేదె పాలతో సమానమైన బలం ఇస్తాయని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఆస్తమా, క్షయ, గొంతు సంబంధిత వ్యాధుల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో గాడిద పాలను వినియోగిస్తారు. నవజాత శిశువులకు పూర్తి పోషకాలను అందించడంతో పాటు చర్మవ్యాధులను నయం చేస్తాయి. గాడిద పాలల్లో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తక్కువ. ఆవుల వల్ల వచ్చే ఎలర్జీ వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయి. గాడిద పాలలో కాల్షియం ఎక్కువ. పిల్లల్లో ఎముకలను పటిష్ట పర్చడం, విరిగిన ఎముకలను అతికించే స్వభావం వీటికి ఉంది. ఈ పాల వినియోగంతో ఉబ్బసం, సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్టు ఇటీవల సైప్రస్ వర్సిటీ నిర్ధారించింది. కొవ్వు శాతం చాలా తక్కువ గాడిద పాలు తల్లి పాలకు దగ్గర ఉంటాయి. తల్లి పాలకు దాదాపు సమానంగా వీటిలో లాక్టోజ్ ఉంటుంది. ఈ పాలలో కొవ్వు శాతం చాలా తక్కువ. స్థూలకాయం నుంచి బయటపడేందుకు గాడిద పాలను సూచిస్తున్నారు. మనకు మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నా.. మన దేశంలో మాత్రం గాడిద పాలు వాణిజ్య స్థాయిలో వినియోగంలోకి రాలేదు. – డాక్టర్ జి.రాంబాబు, అసిస్టెంట్ సర్జన్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ జనాభాలో దాదాపు 2 నుంచి 6 శాతం ప్రజలకు ఆవు పాలు సరిపడవు. ఆ పాల వల్ల ఎలర్జీలొస్తాయి. అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయి. – ఐక్యరాజ్యసమితి అధ్యయనం మా తాతముత్తాతల దగ్గర్నుంచి మా ఇంట్లో గాడిద పాలు వాడుతున్నాం. గాడిద పెంపకందార్లే ఇంటి ముందుకొచ్చి పాలు పితికి ఇస్తారు. చిన్న అమృతాంజనం సీసా పాలకు రూ.100 తీసుకుంటారు. ఇప్పుడు కరోనా కూడా రావడంతో ఇంట్లో పిల్లలకీ ఇస్తున్నాం.. – మురళీ, చీరాల గాడిద పాలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయకపోయినా, రోగుల జీవిత కాలాన్ని పొడిగించేందుకు మాత్రం దోహదపడతాయి – లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్‌దీపక్ ప్రకటన -
వారు గాడిదపై ప్రయాణిస్తున్నట్టున్నారు!
బ్రెసీలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్షల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన బ్రెజిల్‌లోని ఆగ్నేయ రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటోను సందర్శించి పలు ప్రజా ప్రాజెక్టులను ప్రారంభించడానికి వెళ్లారు. ఆ సమయంలో అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఓ విమానంలోకి ఎక్కి వారికి హలో చెప్పారు. అయితే ఆ క్షణం ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. కాగా వెనుక నుంచి ప్రయాణీకుల్లో కొందరు మధ్య వేలును చూపుతూ.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "గెట్ అవుట్, బోల్సోనారో!", "జెనోసిడల్ ఉన్మాది!" అంటూ పలువురు ఘాటుగా విమర్షించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. బయటకు వెళ్లండి అనేవారు గాడిదలపై ప్రయాస్తున్నట్టున్నారు అంటూ చమత్కరించారు. ఇక కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిపై పోరులో బోల్సోనారో తరచుగా ఫేస్ మాస్క్‌లు, లాక్డౌన్, వ్యాక్సిన్లను విమర్శించారు. కాగా బ్రెజిల్లో కరోనా మహమ్మారి బారిన పడి 4,80,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అమెరికా తరువాత అత్యధిక మరణాలు బ్రెజిల్‌లోనే చోటుచేసుకున్నాయి. Jair Bolsonaro tried to take a plane. This is how it went. pic.twitter.com/xOer7Kdo2M— Brasil Wire (@BrasilWire) June 11, 2021 చదవండి: వైరల్: పారాచూట్‌తో ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి.. పసుపు కార్డుతో రిఫరీ -
‘గాడిద సార్.. మాస్క్ ధరించదు’
ఓ వైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడకం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాను కట్టడి చేయగలమని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కానీ మన జనాలు మాత్రం వీటిని చెవిన పెట్టడం లేదు. పని ఉన్నా లేకపోయినా రోడ్ల మీద తిరుగుతుంటారు. మాస్క్ ధరించారు. సామాజకి దూరం మాట దేవుడేరుగు. ఈ క్రమంలో కొందిరిలోనైనా మార్పు తీసుకురావడానికి ఓ జర్నలిస్ట్ వినూత్న ప్రయత్నం చేశాడు. మాస్క్ ధరించని మనుషులకు బుద్ధి చెప్పడం కోసం గాడిదను ఇంటర్వ్యూ చేశాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. ప్రస్తుతం ఈ గాడిద ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజనులు సదరు జర్నలిస్ట్ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. (ఎఫ్బీ పోస్ట్; టిప్‌గా 32 వేల డాలర్లు!) ఈ వీడియోలో ఓ జర్నలిస్ట్ రోడ్డు మీద మాస్క్ లేకుండా తిరుగుతున్న జనాలకు బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలో రోడ్డు మీద ఉన్న గాడిద మూతి దగ్గర మైక్ పెట్టి.. ‘మాస్క్ ధరించకుండా రోడ్డు మీదకు ఎందుకు వచ్చావు’ అని ప్రశ్నిస్తాడు. కానీ అది జంతువు కదా సమాధానం రాదు. దాంతో పక్కనే మాస్క్ ధరించకుండా వెళ్తోన్న ఓ మనిషిని ఆపి.. ‘మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చావేందుకు అని అడిగాను. కానీ సమాధానం చెప్పడం లేదు ఎందుకు’ అని అడుగుతాడు జర్నలిస్ట్. అందుకు ఆ వ్యక్తి ‘ఎందుకంటే అది గాడిద’ అంటాడు. వెంటనే జర్నలిస్ట్ ‘ఓహో గాడిద లాక్డౌన్ సమయంలో మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీద తిరుగుతుంది. అంతే కదా’ అంటాడు. జర్నలిస్ట్ తనను గాడిదతో పోల్చాడని అర్థం చేసుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలానే మాస్క్ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్న మరి కొందరిని ప్రశ్నిస్తాడు. (చావు కబురు చల్లగా చెప్పాడు..) Best media interview of the Lockdown period 😎 pic.twitter.com/qbHGflcoBx — Arun Bothra (@arunbothra) July 21, 2020 ఈ వీడియోను అరుణ్ బోత్రా అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. ‘లాక్డౌన్ సమయంలో బెస్ట్ మీడియా ఇంటర్వ్యూ’ అనే క్యాపన్ష్తో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోది. చాలా బాగా బుద్ధి చెప్పాడని నెటిజనులు సదరు జర్నలిస్ట్‌ను ప్రశంసిస్తున్నారు. -
జూదం: గాడిదను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు
-
జూదం: గాడిదను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు
కరాచీ: జూదం రేసులో పాల్గొందంటూ పాకిస్తాన్ పోలీసులు ఓ గాడిదను అరెస్ట్ చేశారు. ఈ వింత ఘటన పంజాబ్ ప్రావిన్స్‌లోని యార్ ఖాన్ నగరంలో చోటు చేసుకుంది. జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో యార్ ఖాన్‌కు చేరుకున్న పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఇక నిందితుల దగ్గర నుంచి లక్షా 20 వేల రూపాయల బెట్టింగ్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఓ గాడిద కూడా ఉండటంతో దాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ('నాకు 30 సెకన్లు పట్టింది.. మరి మీకు') ఎఫ్ఐఆర్లో గాడిద పేరు కూడా ఉండటంతోనే దాన్ని అరెస్టు చేశామని పోలీసులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం దాన్ని స్టేషను ఆవరణలో కట్టేసినట్లు పేర్కొన్నారు. నైలా ఇనాయత్ అనే జర్నలిస్టు ఈ ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. గాడిదను అరెస్టు చేయడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. (ఆ గాడిద నాదే.. కాదు నాదే!) -
దారుణం : గాడిదల్ని దొంగలించారని...
-
పీఎస్‌లో ‘గాడిద’ పంచాయితీ!
వికారాబాద్ అర్బన్: ఒక గాడిదను ఇద్దరు వ్యక్తులు.. నాదంటే.. నాదేనంటూ పట్టుబట్టడంతో ఎటూ తేల్చలేక వికారాబాద్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గాడిదతోపాటు దాని పిల్ల, ఇద్దరు వ్యక్తులు పీఎస్ చుట్టూ తిరుగుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో నివాసం ఉండే బాణాల ప్రభు గాడిదల పాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. ఇతని వద్ద 22 గాడిదలు ఉండగా నాలుగు తప్పిపోయాయి. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాడిదలను వెతికి ఆచూకీ చెబితే పట్టుకొచ్చి ఇస్తామని పోలీసులు చెప్పారు. ఇటీవల మోమిన్‌పేటలో ఓ వ్యక్తి వద్ద తన గాడిద ఉన్నట్లు గుర్తించిన ప్రభు.. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు గాడిదను వికారాబాద్ పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ గాడిద తనదేనంటూ పద్మ అనే మహిళ తన తండ్రి సత్తయ్యతో కలిసి పీఎస్‌కు చేరుకుంది. వీరిద్దరూ గాడిద నాదంటే.. నాదే అనడంతో ఏం చేయాలో తోచని పోలీసులు.. మంగళవారం మరోసారి గాడిదను తీసుకొని స్టేషన్‌కు రావాలని చెప్పి పంపించారు. -
‘ఎమిలీ’ గానానికి నెటిజన్లు ఫిదా
ముంబై: ఇంటర్నెట్, సోషల్ మీడియా పుణ్యాన ఇన్నాళ్లు వెలుగులోకి రాని ప్రతిభావంతుల గురించి ప్రపంచానికి తెలియడం.. వారు రాత్రికి రాత్రే సూపర్ స్టార్లుగా మారుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చూశాం. తాజాగా ఈ లిస్ట్‌లోకి ‘ఎమిలీ’ కూడా వచ్చి చేరింది. తన గానంతో నెటిజన్ల మనసు దోచుకుంటుంది ఎమిలీ. ఇంతకు ఎమిలీ ఎవరనేగా మీ అనుమానం.. గాడిద. అవును మీరు చదివింది కరెక్టే ఎమిలీ ఓ గాడిద. సాధరణంగా గొంతు బాగాలేకపోయినా పాటలు పాడుతూ.. ఇబ్బంది పెట్టే వారిని గార్దభ స్వరం(గాడిద గొంతు) అంటూ వెక్కిరిస్తాం. కానీ ఇక్కడ గాడిద గానమే వైరల్ కావడం విశేషం. ఆ వివరాలు.. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యం పాలైన ‘ఎమిలీ’ అనే ఆడ గాడిదను దాని యజమాని రోడ్డు మీద వదిలేసి వెళ్లాడు. దాంతో పుణెకు చెందిన ఓ జంతు సంరక్షణశాల యాజమాన్యం ఎమిలీని తీసుకెళ్లి.. చికిత్స చేసి కోలుకునేలా చేశారు. ఈ సంరక్షణశాలలో ఎమిలీతో పాటు పిల్లులు, కుక్కలు, దున్నపోతులు వంటి ఇతర జంతువులు కూడా చాలానే ఉన్నాయి. ఎమిలీకి సంతోషం కలిగినప్పుడు కూనిరాగాలు తీస్తుందట. ఇది విని మిగతా జంతువులు దాని చుట్టూ చేరి సంతోషంగా ఆడటం గమనించారు సిబ్బంది. దాంతో వారికి ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఎప్పుడూ గాయపడిన జంతువుల గురించే వీడియోలు తీసి.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాం. ఈ సారి వెరైటీగా ఎమిలీ కూనిరాగాలను వీడియో తీద్దామనుకున్నారు. అలానే చేసి ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ వీడియో వైరల్ అయ్యిందంటున్నారు సదరు ఎన్జీవో ప్రతినిధులు. ఐర్లాండ్‌కు చెందిన హ్యారియేట్ అనే గాడిద కూడా ఇలానే ప్రచారం పొందిందని.. దాన్ని చూసే తాము ఇలా ప్రయత్నించామంటున్నారు ఎన్జీవో ప్రతినిధులు. -
అతని పాటకు గాడిద గొంతు కలిపింది: వైరల్
పాడటం సరిగారాని, గొంతు బాగాలేని వారు పాడితే ‘అచ్చం గాడిద ఓండ్ర పెట్టినట్లు ఉందిరా!’ అంటుంటాం. ఓ వ్యక్తి పాట పాడుతుంటే దూరంగా గాడిద అరుపులు వినిపించే కామెడీ సీన్లు చాలా సినిమాల్లో మనం చూసుంటాం. అచ్చం అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాజమాని పాడిన పాటకు గాడిద గొంతు కలిపింది. లయన్ కింగ్ సినిమా ఓపెనింగ్ సాంగ్ ‘‘అకూన మటాట’’కు గాడిద తన గొంతు సవరించింది. కిన్లే అనే వ్యక్తి తన పెంపుడు జంతువులు గాడిద, గుర్రం దగ్గర ఈ పాటను పాడాడు. ఆ పాటకు గుర్రం స్పందించలేదు కానీ, గాడిద మాత్రం యాజమానితో గొంతు కలిపి ఓ రెండు లైన్లు పాడింది. మరి పాట పాడిందో.. యాజమాని గొంతు వినలేక ఆపమని ఏడ్చిందో.. అది గాడిదకే తెలియాలి. కిన్లే ఈ వీడియోను తన ఫేస్బుక్లో ఖాతాలో పోస్ట్ చేయగా 2.7మిలియన్ వ్యూస్ వచ్చాయి. -
అతని పాటకు గాడిద గొంతు కలిపింది
-
‘డాన్కీ’ తెరపైకి రావడానికి రెడీ
డాన్కీ ద్విభాషా చిత్రంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. స్ట్రీట్ లైట్ పిక్చర్స్ పతాకంపై జో యోవానిసింగ్ స్వీయ దర్శత్వంలో నిర్మించి, ప్రతినాయకుడిగా నటించిన చిత్రం డాన్కీ. మురళీరామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సింగపూర్‌కు చెందిన పాప్‌సింగర్, మోడల్ నబాసా బేగం హీరోయిన్‌గానూ, ష్రీన్ కాంజ్వాలా మరో హీరోయిన్‌గానూ నటించారు. హబీబీ, విక్కీ, ప్రభు, కదిరేశన్రాజ్, సావిత్రి ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. నృత్య దర్శకుడు దీనా, ఛాయాగ్రాహకుడు విలియమ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ డాన్కీ చిత్ర వివరాలను దర్శక నిర్మాత తెలుపుతూ ప్రియురాలి చేత తిరస్కరించబడ్డ ఒక యువకుడు ఉద్యోగం లేక, ఆర్థికసమస్యలతో ఇబ్బందులు పడుతూ పని కోసం సింగపూర్‌లో ఉన్న తన బంధువును ఆశ్రయిస్తాడన్నారు. అయితే అతను చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తుండడంతో వేరే గతి లేక ఈ యువకుడు కూడా అదే పనికి పూనుకుంటాడనని తెలిపారు. అలా ఒక యువతిని కిడ్నాప్ చేయగా తను ఒక పెద్ద గ్యాంగస్టర్ కూతురని తెలుస్తుందన్నారు. దీంతో ఆ యువకుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా డాన్కీ ఉంటుందని చెప్పారు. చిత్రంలో నాలుగు పాటలు చోటు చేసుకుంటాయని, చిత్ర షూటింగ్‌ను పూర్తిగా సింగపూర్‌లో 50 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. చిత్రంలో పాటలు, పోరాట దృశ్యాలు ప్రేక్షకులను అలరిస్తాయని అన్నారు.నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత జో యోవానిసింగ్ తెలిపారు. -
కిందికి రాదెందుకు?
ముల్లా నసీరుద్దీన్ ఒకసారి తన గాడిదను ఇంటికప్పుపైకి తీసుకువెళ్లాడు. తరువాత మళ్లీ దాన్ని కిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే అది ఎంతమాత్రం కిందికి రావడంలేదు. ఎంత ప్రయత్నించినా అది తన మాట వినడంలేదు. దాంతో విసిగిపోయి, ‘సరే.. అదే వస్తుందిలే..’ అని తానే దిగి వచ్చేశాడు. చాలా సమయం గడిచిపోయింది. అయినా గాడిద కిందికి దిగలేదు. ఏవో శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైంది దీనికీ, ఎందుకు రావడంలేదు, కప్పును పాడుచేస్తుందో ఏమో.. అది చాలా సున్నితమైన కప్పు.. అని ఆందోళన చెందుతూ.. ముల్లా పైకి వెళ్లాడు. గాడిద కిందికి రాకపోగా పైకప్పును నాశనం చేయడం ప్రారంభించింది. ఎంతగా అదిలించి, ప్రయత్నించినా ససేమిరా దారికి రావడంలేదు. ఒక్కటి తగిలించి లాక్కురావడానికి ప్రయత్నించాడు. కానీ అది ఎదురు తిరిగి అతన్నే లాగి ఒక్క తన్ను తన్నింది. ముల్లా కిందపడిపోయాడు. చివరికి గాడిద కప్పును కూల్చేసింది. దాంతో, కప్పుతో పాటు అది కూడా కింద పడిపోయింది. ఎందుకిలా జరిగిందీ.. అని ముల్లా చాలాసేపటి వరకు తీవ్రంగా ఆలోచించాడు. అతనికి అర్థమైంది ఏమిటంటే.. ‘అనర్హుల్ని ఎప్పుడూ అందలం ఎక్కించకూడదు. వారిని అందలాలెక్కించి పైస్థానాల్లో, ఉన్నతస్థానాల్లో కూర్చోబెట్టకూడదు అని. అనర్హులైనవారిని గనక ఉన్నతస్థానాల్లో కూర్చోబెడితే, అనేక రకాలుగా నష్టం కలుగజేస్తారు. ఆ స్థాయినీ, స్థానాన్నీ దిగజారుస్తారు. ఆ స్థాయికి తీసుకెళ్లినవారినీ నష్టపరిచి విశ్వాసఘాతుకానికి ఒడిగడతారు..’ అని. – మదీహా -
గాడిదపై రాజకీయ చిత్ర హింసలు
-
గాడిదలపై రాజకీయ దాడులు.. ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : జూలై 17వ తేదీ, కరాచీ నగరంలో గుర్తుతెలియని దుండగులు ఓ గాడిదను చిత్ర హింసలకు గురిచేశారు. ఇష్టమొచ్చినట్లు ముష్ఠి ఘాతాలు తగిలించారు. ముక్కు రంధ్రాలను గట్టిగా చిదిమారు. పక్క టెముకలు విరిగేలా తన్నారు. కన్ను కింద రక్తం కారేలా గీరారు. దాని శరీరంపై ‘నవాజ్’ అని అక్షరాలు రాసివెళ్లారు. రోడ్డుపక్కన పడిపోయి ఆ గాడిద బాధను భరించలేక మెలితిరిగి పోతుంటే చూసిన ఓ బాటసారి దాన్ని ఎలాగైనా ఆదుకోవాలనుకున్నారు. ఎలా ఆదుకోవాలో తెలియలేదు. దాన్ని ఫొటోలుతీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి చేతనైన వాళ్లు ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి స్పందించి.. ‘అయేషా చుండ్రిగర్ ఫౌండేషన్ (ఏసీఎఫ్)’ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ కార్యకర్తలు ఆ గాడిదను వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు. కాస్త కోలుకున్నప్పటికీ ఇప్పటికీ అది నిలబడలేక, నడవలేక పోతోంది. ఈ నెల 25వ తేదీన జరగనున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలకు ఈ గాడిదకు ప్రత్యక్ష సంబంధం ఉంది. దేశ ప్రధాని పదవి కోసం ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్ ఖాన్, తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన నవాజ్ షరీఫ్ మద్దతుదారులను ఏమీ తెలియని గాడిదలని, మూర్ఖులని, వెదవలని తిట్టారు. అంతే, ఆ రోజు నుంచి గాడిదల మీద దాడులు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ ‘తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడుతున్నారని నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్)’ పార్టీ కార్యకర్తలు ఆరోపించగా, తమకు ఈ దాడులతో సంబంధం లేదని, సానుభూతి కోసం నవాజ్ షరీఫ్ కార్యకర్తలే ఈ దాడులు జరిపి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని ఖాన్ కార్యకర్తలు వాదిస్తున్నారు. తాము దాడులు చేస్తే గాడిదపై ‘నవాజ్’ అని పేరు కూడా ఎందుకు రాస్తామని షరీఫ్ పార్టీ కార్యకర్తలు వాదిస్తున్నారు. అందులోనే సానుభూతి ఉందని అవతలి వారంటున్నారు. ఇందులో ఏ పార్టీ వారు ఒకరికొకరు తీసిపోరు. గాడిదలపై దాడులు చేసే మూర్ఖత్వం వారిది. ఈ నెల 25వ తేదీన నాలుగు ప్రాంతీయ అసెంబ్లీ స్థానాలతోపాటు జాతీయ అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీల మధ్యనే పోటీ ఎక్కువగా ఉంది. బిల్వాల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి ప్రజల మద్దతు అంతగా కనిపించడం లేదు. నవాజ్ షరీఫ్ పార్టీయే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు తెలియజేస్తుండగా, అవినీతి కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ, సైన్యం కుట్ర పన్నుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘మొహమ్మద్ అలీ జిన్నా’ వారసులం తామంటే, ‘అల్లమా ఇక్బాల్’ వారసులమని తామని, అక్బర్ వారసులమంటే తాము బాబర్ వారసులమంటూ ఇరు పార్టీల వారు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. వారు ఎవరి వారసులైనా ప్రజల వారసత్వం మాత్రం వారికి అసలే లేదు. వాస్తవానికి ఇరు పార్టీల వారికి ప్రజలంటే ప్రేమగానీ, ఓటర్లంటే గౌరవంగానీ బొత్తిగా లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం వారి హక్కనుకుంటారు. గెలిపించడం ప్రజల ఖర్మ అంటారు. గెలిస్తే ప్రధాని పదవిలో వెలగబెడతాం అంటారు. ఓడిపోతే ఏ సౌదీ అరేబియాకో, మరో దేశానికి వెళ్లి వచ్చే ఎన్నికలకు వస్తామంటారు. వారు ప్రజలను నిజంగా గాడిదలనుకుంటారు. అలాగే చూస్తారు. 2009లో తాలిబన్లు ఓ గాడిదకు పేలుడు పదార్థాలు కట్టి అఫ్ఘానిస్థాన్లోని సైనిక శిబిరంలోకి పంపించారు. ఆ పేలుడులో ఆ గాడిద వెంటనే చచ్చి పోయింది. అంతటి భాగ్యం కూడా పాకిస్థాన్ గాడిదలకు లేదు. (పాక్ ఎన్నికలపై లాహోర్ మానవ హక్కుల కార్యకర్త రిమ్మెల్ మొహిద్దిన్ అభిప్రాలకు అక్షరరూపం) -
డిప్యూటీ తహసీల్దార్ అభ్యర్థి గాడిద..!!
శ్రీనగర్ : ఎవరినైనా తిట్టాలంటే గాడిద..! అనే పదానికి ఇంకా ఏవేవో జతచేసి వారి దుమ్ము దులుపుతాం. ఇక సరదా సంభాషణల్లో గాడిద గుడ్డు..! అనే పద ప్రయోగం కూడా ఉంది. ఎందుకంటే మనం గాడిదకు అంత అల్ప ప్రాధాన్యం ఇస్తాం. కానీ.. జమ్మూ కశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) గాడిదకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. డిప్యూటీ తహసీల్దార్ పరీక్షలో పోటీ పడేందుకు గాడిదకు హాల్ టికెట్ జారీ చేసింది. అభ్యర్థి పేరు ‘కచౌర్ ఖర్’ (గోధుమ రంగు గాడిద) అంటూ, హాల్ టికెట్‌పై గాడిద ఫోటోని కూడా ముద్రించి నవ్వులపాలైంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్ఎస్బీ నిర్వాకంపై ట్విటర్, ఫేస్‌బుక్‌లలో కామెంట్ల వర్షం కురుస్తోంది. వేలకు వేలు జీతాలు తీసుకోవడమే కాకుండా అధికారుల అలసత్వం వల్ల గాడిదలకు పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎస్ఎస్బీ చేరిందంటూ ఒక నెటిజన్ ఘాటైన ట్వీట్ చేశాడు. ఎస్ఎస్బీ చర్యలు నవ్వు తెప్పిస్తోంది. అది గాడిదకి హాల్ టికెట్ జారీ చేయడం ఒక విడ్డూరమైతే.. ఆ వార్త వైరల్ కావడం మరో విడ్డూరమంటూ ఫేస్బుక్లో మరో వ్యక్తి తన అసహనం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఎస్ఎస్బీ అధికారులు నిరాకరించారు. సాంకేతిక పొరపాటు వల్ల ఇలాంటి తప్పిదమే గతంలోనూ చోటు చేసుకుంది. 2015లో ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఎస్ఎస్బీ ఆవు పేరిట హాల్ టికెట్ జారీ చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన సర్వర్ నుంచి ఆవు పేరుతో నమోదైన అప్లికేషన్‌ను తొలగించింది. -
గాడిదలను చూస్తేనే వణుకుపుడుతోంది
కాబూల్ : మానవ బాంబులు, ట్రక్కు బాంబులు... ఇంత కాలం ఇలాంటి ఆత్మాహుతి దాడుల గురించి విని, చదివి ఉన్నాం. కానీ, ఇప్పుడు అఫ్ఘనిస్థాన్‌లో కొత్త తరహా దాడులతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. గాడిదలతో బాంబు దాడులకు పాల్పడుతూ ఉగ్రవాదులు భద్రతా సిబ్బందికి వణుకు పుట్టిస్తున్నారు. గాడిదలకు బాంబులను అమర్చి భద్రతా క్యాంపులపై వాటిని వదులుతారు. నిర్దేశిత లక్ష్యం చేరాక వాటిని రిమోట్ కంట్రోల్‌తో పేలుస్తూ దాడులకు పాల్పడుతున్నారు. నెల వ్యవధిలో ఇలాంటి దాడులు 5 చోటు చేసుకోగా.. సుమారు 9 మంది(ఐదుగురు సాధారణ పౌరులు) ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెక్‌పోస్టులను దాటేందుకు ఉగ్రవాదులు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గాడిదలు కనిపిస్తేనే చాలూ అధికారులు వాటిని కాల్చి చంపుతున్నారు. తాజాగా సోమవారం కున్వార్ ప్రొవిన్స్‌లో గాడిద బాంబు దాడి చోటు చేసుకోగా.. ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీటిని క్రూరమైన చర్యలుగా జంతు ప్రేమికులు అభివర్ణిస్తున్నారు. మనుషుల ప్రాణాలు తీస్తూ వస్తున్న ఉగ్రవాదులు.. తమ లక్ష్యాల కోసం ఇప్పుడు మూగ జీవాలను బలి పెట్టడం దారుణమని పేర్కొంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి దాడులు చోటు చేసుకున్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2014లో కున్వార్ ప్రొవిన్స్‌లోనే ఉగ్రవాదులు ఇలాంటి తరహా దాడులకు పాల్పడిన ఘటనలను ఆయన గుర్తు చేశారు. -
గాడిదల బహిరంగ వధపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కబేళా విషయంలో నిజానిజాలను తేల్చేందుకు ఓ న్యాయాధికారిని నియమించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. వాస్తవాలను పరిశీ లించి నివేదిక ఇచ్చేందుకు వీలుగా న్యాయాధికారిని క్షేత్రస్థాయికి పంపాలని గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరులో నిబంధనలకు విరుద్దంగా కబేళా నిర్వహించడమే కాక, గాడిదలను బహిరంగంగా వధిస్తూ, వాటి మాంసాన్ని విక్రయిస్తు న్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎస్.గోపాల్‌రావు, మరో ముగ్గురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబేళాను 2014లోనే మూసివేయడం జరిగిందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇది నిజమేనా? అంటూ ప్రశ్నించింది. దీనిని రికార్డు చేసి, క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలు తెలుసుకుంటామంది. తప్పని తేలితే కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తరువాత పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కబేళా వెలుపల గాడిదలను బహిరంగంగానే వధిస్తున్నారని కోర్టుకు నివేదించారు. మాంసం విక్రయాలను కూడా అక్కడే జరుపుతున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, క్షేత్రస్థాయికి ఓ న్యాయాధికారిని పంపి వాస్తవాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఓ న్యాయాధికారిని పంపి వాస్తవాలపై ఓ నివేదిక సమర్పించాలని గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
గార్దభ వ్యథ
కిలోమీటర్ల దూరం.. వీపుపై మోయలేని బరువు..రాళ్ల దారైనా, ముళ్ల బాటైనా అలుపెరగని ప్రయాణం. యజమాని బతుకు బరువు మోసేందుకు గాడిదలు పడిన కష్టమిది.. ఆయన ఇల్లు గడించేందుకు ఒళ్లంతా గుల్ల చేసుకున్న మూగజీవాల ప్రస్తానమిది. అయితే మనిషి కష్టాన్ని గుండెలపై మోసిన గాడిదలను నేడు నిర్దయగా చంపేస్తున్నారు. వాటి రక్తమాంసాలకు అలవాటు పడి నిత్యం కత్తివేటుకు బలి చేస్తున్నారు. జీవన నావకు తోడుగా..బతుకు బాటకు నీడగా నిలిచిన జీవాన్ని పాషాణ హృదయాలతో ప్రాణాలు తోడేస్తున్నారు. గంభీరమైన గార్దబాల గొంతును నిత్యం వధిస్తూ వాటికి మూగ వ్యథనే మిగిలిస్తున్నారు. ‘గాడిద’ హైకోర్టు మెట్లెక్కింది. గాడిద మాంసం విక్రయాలను నిలిపేయాలంటూ ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ అమ్మకాలు గుం టూరు జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీంతో స్పందించిన న్యాయస్థానం గాడిద మాంసం అమ్మకాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. తెనాలి : కష్టపడి పనిచేసే వ్యక్తిని ఉద్దేశించి ‘గాడిదలా కష్టపడుతున్నాడు’ అనటం, గొంతు బాగో లేదనటానికి ‘అబ్బ! నీది గార్దభ స్వరం రా’ అని ఎద్దేవా చేయటం తెలిసిందే. భారమంతా తానే మోస్తున్నానని చెప్పటానికి ‘గాడిద బరువును మోస్తున్నా’ అనీ అంటారు. అలాగే, ‘గాడిద గుడ్డేం కాదూ’ అనే వాడుక పదాన్నీ వింటుంటాం. గాడిదను ఇన్ని రకాల ఉపమానాలకు వాడుకుంటున్న మనిషి, ఆధునికతను తొడుక్కుంటున్నకొద్దీ ఆ జంతువుకు దూరమవుతూ వచ్చాడు. యంత్రం ప్రవేశించాక గాడిదతో అవసరం లేదన్నట్టుగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి మనుగడ బాగా తగ్గిపోతోంది. తగ్గుతున్న సంఖ్య.. దేశంలో పశువులు, ఇతర జంతువుల సంఖ్య తగ్గిపోతోంది. పాడి పశువుల సంఖ్య పెరుగుతున్నా, మిగిలిన వాటి పరిస్థితి ఆందోళనకరమే. 2012 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గాడిదల్లో 27.22 శాతం తగ్గుదల నమోదైంది. 2007 నాటికి 4.38 లక్షలుగా ఉన్న గాడిదలు, 2012 లెక్కలకు వచ్చేసరికి 3.19 లక్షలు మాత్రమే ఉన్నాయి. రాజస్తాన్‌లో ఇవి అధికం కాగా, తర్వాతి స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మనిషి కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన గాడిద, క్రమక్రమంగా సంచార జీవులతో సహవాసం చేస్తూ వచ్చాయి. ఇప్పటికీ ఎక్కువగా దుస్తులు ఉతికేవాళ్లు, ఇటుక బట్టీలు, కొండల్లోని పుణ్య క్షేత్రాలకు యాత్రికులను తీసుకెళ్లేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో వీటి ఉనికి నామమాత్రమే. గతంలో చీరాల ప్రసిద్ధి.. మాంసాహారులు పెరగటం కూడా గాడిదల మనుగడకు ముప్పుతెచ్చేలా తయారైంది. రకరకాల జంతువులను తింటున్నట్టే, మనిషి గాడిద మాంసానికీ అలవాటు పడుతున్నాడు. ఒకప్పుడు రాష్ట్రంలో చీరాల గాడిద మాంసానికి ప్రసిద్ధి. క్రీడాకారులు, బరువైన పనులు చేసేవాళ్లు గాడిద రక్తం తాగేందుకు చీరాలకు చేరుకునేవారు. వేకువజామునే గాడిదను కోసిన వెంటనే పట్టిన రక్తాన్ని తాగేసి వీధుల్లో పరుగులు తీసేవారు. పనిలోపనిగా కొంత మాంసాన్ని తీసుకొచ్చి వండించుకుని తినేవారు. గాడిద రక్తం, మాంసం ఆరోగ్యానికి భేషుగ్గా ఉంటాయని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. స్టూవర్ట్పురంతో సహా మరికొన్ని ప్రాంతాలకు చెందిన ఆరితేరిన నేరస్తులు గాడిద రక్తాన్ని, మాంసాన్ని తీసుకుంటారని ఉదహరించేవారు. క్రమంగా విస్తరించి గ్రామాలకు, నగరాలకు పాకింది. వందకుపైగా కుటుంబాలకు జీవనోపాధి.. జిల్లాలో చెరుకుపల్లి, తాడేపల్లి, గుంటూరు, బాపట్లకు చెందిన 100 నుంచి 200 కుటుంబాల వారు గాడిద మాంసాన్ని జీవనోపాధిగా చేసుకున్నారు. కొందరు వారం వారం ఒకేచోట మాంసం విక్రయాలు చేస్తుంటే, మరికొందరు రోజుకో ఊరు చొప్పున చేపడుతున్నారు. ఆపరేషను చేయించుకున్నవారికి కుట్లు మానటానికి, ప్రమాదాల్లో తగిలిన దెబ్బలు తాలూకు నొప్పుల నివారణకు గాడిద మాంసం మంచి ఔషధమనే ప్రచారంతో వినియోగం పెరిగింది. పొట్టేలు మాంసం తరహాలోనే కిలో రూ.400 అమ్ముతున్నారు. ఆడ గాడిద పాలు కూడా (గా>్లసుడు) రూ.50 నుంచి రూ.100 ధరకు విక్రయిస్తున్నారు. ఛాతీలో నెమ్ము, ఆయాసానికి దివ్యౌషధంగా చెబుతుంటారు. మాంసాహారుల్లో అవసరమైనవారు నిరభ్యంతరంగా ఈ మాంసాన్నీ ఆదరిస్తున్నారు. కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం... ఈ నేపధ్యంలో కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి గోపాలరావు, మరో ముగ్గురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. గుంటూరులో గాడిదలను వధించి, విచ్చలవిడిగా మాంసం విక్రయాలు సాగిస్తున్నారనీ, అధికారులు చర్యలు తీసుకోవటం లేదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. గత నెల 31వ తేదీన ఈ వ్యాజ్యంలో వాదనలు విన్న తర్వాత సంబంధిత రాష్ట్ర, గుంటూరు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం జరిగిన విచారణలో ‘గాడదల్నీ వదలరా..’ అంటూ విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై నివేదికను కోరి వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే, ఈ పరిణామాలతో గాడిదల మాంసం విక్రయాలు జీవనోపాధిగా చేసుకున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. వారు కూడా కోర్టును ఆశ్రయించి తమ వాదనల్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. తాడేపల్లి, వణుకూరుల్లోనూ.. తాడేపల్లి రూరల్ (మంగళగిరి) / కంకిపాడు (పెనమలూరు) / నందిగామ : తాడేపల్లి కేంద్రంగా గాడిద మాంసం అమ్మకాలను నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి గాడిదలను తీసుకువస్తుంటారు. కేజీ రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముతుంటారు. జిల్లా మొత్తంమీద ఇక్కడే గాడిద మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పొచ్చు. ఇక పెనమలూరు మండలం వణుకూరులో ప్రతి ఆదివా రం గాడిద మాంసం అమ్మకాలు సాగుతుంటా యి. ప్రస్తుతం కిలో రూ.400 ఉంది. ఉయ్యూరు బస్టాండు సెంటర్లోనూ ప్రతి ఆదివారం అమ్మకాలు జరుగుతుంటాయి. అలాగే, లీటరు గాడిద పాలు రూ.100 నుంచి రూ.130 వరకు అమ్ముతుంటారు. నందిగామ పట్టణంలోనూ తరచూ గాడిద పాలు అమ్మకానికి వస్తున్నాయి. మేమూ కోర్టును ఆశ్రయిస్తాం.. గొర్రెలు, కోళ్లు కోస్తున్నారు.. పశువుల్నీ వదలటం లేదు. గాడిదల మాంసం విక్రయిస్తే తప్పేమిటి? తినేవాళ్లుంటేనే కదా మేం అమ్మేది? జిల్లాలో చాలామందిమి ఈ వ్యాపారంపై ఆధారపడ్డాం. మేం కోయోళ్లం... గాడిదలోళ్లు అంటారు. ఇక్కడ గాడిదలు దొరకటం లేదు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. ఇద్దరం కలిసి చాకిరీ చేస్తే చెరో రూ.500 మిగిలితేనే గొప్ప! మా నోటికాడ కూడు లాగేత్తే ఎట్టా బతకాల? మేమూ కోర్టుకెళతాం. – చండ్ర గోపి, చెరుకుపల్లి -
గాడిదల్నీ వదలరా: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గాడిద మాంసాన్ని కూడా అమ్మేస్తున్నారా.. గాడిదల్ని కూడా వదలట్లేదా.. అని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గుంటూరులో రోడ్లపైనే గాడిదల్ని వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం ఉమ్మడి హైకోర్టు విచారించింది. కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి గోపాలరావు, మరో ముగ్గురు దాఖలు చేసిన పిల్‌ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కబేళాలను మూసేయాలన్న ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదో తెలియజేయాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
గుంటూరులో గాడిద మాంసం అమ్మకాలు!
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కబేళాల్లో గాడిద వధ జరుగుతోందని, గాడిద మాంసాన్ని పట్టణంలో ఎక్కడ బడితే అక్కడ విక్రయిస్తున్నారని, అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. గాడిద వధను, మాంసం విక్రయాలను నిరోధించి, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతిలేని కబేళాలను మూసివేసేలా గుంటూరు మున్సిపల్ అధికారులను ఆదేశించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు చెందిన యానిమల్ రెస్కూ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎస్.గోపాలరావు, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గుంటూరు జిల్లాలో ఇష్టానుసారంగా గాడిద వధ జరుగుతోందని, రోడ్లను ఆక్రమించి జంతువులను వధిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. -
ఈ గాడిద ఎంతపని చేసిందో తెలుసా!
బెర్లిన్: ఖరీదైన తన స్పోర్ట్స్ కారును గాడిద పాడు చేసిందంటూ కారు యజమాని కోర్టును ఆశ్రయించాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనపై జర్మన్‌లోని గిఎస్సెన్ రాష్ట్ర కోర్టులో కేసు దాఖలయింది. ఖరీదైన మెక్లారెన్ స్పోర్ట్స్ కారును పార్కు చేసి ఉంచగా ఓ గాడిద దాని వెనుక భాగాన్ని కొరకడంతో రంగు పోవటంతో పాటు సొట్టలు పడిందని కారు ఓనర్ ఫిర్యాదు చేశాడు. ఇందుకు గాను సదరు గాడిద యజమాని 5,876 అమెరికా డాలర్లు పరిహారంగా చెల్లించాలని పిటిషన్ వేశాడు. అయితే, గాడిద యజమాని మాత్రం ఇందుకు నిరాకరించాడు. అంత ఖరీదైన కారును అక్కడే ఎందుకు ఉంచాల్సి వచ్చిదంటూ అడ్డం తిరిగాడు. మరింత సురక్షితమైన ప్రాంతంలో పార్కు చేసుకోవాలని సూచించాడు. ఆ స్పోర్ట్స్ కారు ఆరంజ్ రంగులో ఉండటంతో క్యారెట్‌గా భావించి గాడిద కొరికి ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరి. -
ఈ గాడిద ధర అక్షరాల రూ.10 లక్షలు
చండీగఢ్: టిప్పు అలాంటి ఇలాంటి గాడిద కాదు. గుర్రంలా ఒడ్డూ పొడువున్న టిప్పు ధర పది లక్షల రూపాయలట. మామూలు గాడిద లక్ష రూపాయల వరకుంటే దీని ధర అంతకు పదింతలు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ గాడిదల వ్యాపారి ఐదు లక్షల రూపాయలకు కొంటా అంటే కూడా ఇవ్వలేదని, పది లక్షలకైతేనే అమ్ముతానని హర్యానాలోని సోనాపేట్ జిల్లాకు చెందిన గాడిద యజమాని రాజ్ సింగ్ చెబుతున్నారు. ఈ గాడిదకు రోజుకు ఐదు కిలోల మినుములు, నాలుగు లీటర్ల పాలు, 20 కిలోల పచ్చిగడ్డి ఆహారం. అందుకు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చవుతుందట. ఈ గాడిదను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు కూడా తీసుకెళతానని రాజ్ సింగ్ తెలిపారు. ఇలాంటి గాడిద చుట్టుపక్క రాష్ట్రాల్లో కూడా దొరకదని, మగ గాడిదల సంకర జాతులను పెంచే ఆయన చెప్పారు. -
చైనాకు పాక్ గాడిదల ఎగుమతి!
పెషావర్: చైనాతో వ్యాపార సంబంధాలు పెంచుకుంటున్న పాకిస్తాన్ ఆ దేశానికి గాడిదలను కూడా ఎగుమతి చేయాలని యోచిస్తోంది. దీని కోసం వంద కోట్ల డాలర్లతో గాడిదల అభివృద్ధి పథకాన్ని ప్రతిపాదించింది. 46 బిలియన్ల(రూ. 6,447 కోట్లు) విలువైన చైనా–పాక్ ఆర్థిక కారిడార్‌లో ఖైబర్–పక్తూన్‌ఖ్వా–చైనా సంతులిత గాడిదల అభివృద్ధి పథకం ఒకటని, ఖైబర్–పక్తూన్‌ఖ్వా రాష్ట్రానికి చైనా పెట్టుబడులను రప్పించేందుకు దీన్ని ప్రతిపాదించారని మీడియా తెలిపింది. రాష్ట్రంలోని గాడిదల చర్మానికి చైనాలో డిమాండ్ ఉందని, దాన్ని ఔషధాల తయారీ వంటివాటిలో వాడుతున్నారని ఓ అధికారిక పత్రంలో పేర్కొన్నారు. ఈ పథకం వల్ల గాడిదల పెంపకందారులకు లభ్ధి కలుగుతుందని వెల్లడించారు. -
గార్దభం..పోటీ అదరహో!
నంద్యాల: జంబులాపరమేశ్వరి తిరునాల సందర్భంగా శనివారం గార్దభాల(గాడిదల) పోటీలు నంద్యాల పట్టణంలో ఆసక్తికరంగా సాగాయి. పోటీలకు మహానంది, వెలుగోడు, బండి ఆత్మకూరు, రుద్రవరం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, కోవెలకుంట్ల ప్రాంతాల నుండి 20 గాడిదలు వచ్చాయి. లక్కీడిప్ ద్వారా పందెంలో పోటీ పడే గాడిదలను ఎంపిక చేశారు. దాదాపు 160 కేజీల ఇసుకను బస్తాలను కట్టి గాడిదలపై ఉంచి పరుగు పెట్టించారు. ఎక్కువ దూరం పరిగెత్తిన వాటిని విజేతలుగా ప్రకటించారు. విజేతలైన గాడిదల యజమానులకు వరుసగా రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు, రూ.2వేలు, రూ.వెయ్యి నగదు బహుమతులుగా అందజేశారు. పోటీల్లో హింసకు తావులేకుండా ముళ్లకర్రను నిషేధించారు. గాడిద లక్ష రూపాయలు.. పోటీల్లో బెంగళూరు నుంచి బండి ఆత్మకూరుకు చేరిన రేసు గాడిద ఆకర్షణగా నిలిచింది. దీని ఖరీదు అక్షరాల లక్షరూపాయలు. బెంగళూరులో పలు పోటీల్లో ఇది విజేతగా నిలువడంతో డిమాండ్ వచ్చింది. బండిఆత్మకూరు మండలానికి చెందిన లింగమయ్య దీనిని కొనుగోలు చేశారు. ప్రతిరోజూ మంచి పౌష్టికాహారాన్ని అందించి దీనిని రేసు గాడిదగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. గాడిదల ఉనికిని చాటేందుకే.. రవాణా వసతులు పెరగడంతో గాడిద జాతి అంతరించిపోతోందని, వీటి ఉనికిని చాటడానికి నాలుగైదేళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లెల్ల శ్రీరాములు తెలిపారు. పోటీల్లో ఆలయ పాలక మండలి కార్యదర్శి గాండ్ల వెంకటేశ్వర్లు, నిర్వాహకులు పరమేశ్వరరెడ్డి, జిల్లెల్ల శ్రీరాములు, ఎన్కే నూర్‌బాషా, పాణ్యం మద్దిలేటిస్వామి, జూటూరు పెద్ద వెంకటేశ్వర్లు, గాండ్ల మధుప్రకాష్ పాల్గొన్నారు. -
ఖరమే జీవనాధారం
గాడిద పాలమ్మి జీవిస్తున్న కుటుంబాలు ఆదిలాబాద్ నుంచి వచ్చి సంచార వ్యాపారం చిన్న గ్లాసుడు పాల ఖరీదు రూ.వంద ఔషధమన్న నమ్మకంతో కొంటున్న జనం రాజానగరం : పని చేయకుండా ఖాళీగా తిరిగే వాళ్లను ‘ఎందుకురా.. అలా గాడిదలా తిరుగుతావు’ అని చులకనగా మాట్లాడతారు. అలా అంటే.. ‘తెలుగు తెలియని’ గాడిదలు ఊరుకుంటాయేమో గానీ.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే వారి జీవనం ఆధారపడిందే ఖరాల (గాడిదలు) మీద. ఆ జిల్లాకు చెందిన కొంతమంది జిల్లాలోని పలుగ్రామాల్లో గాడిదలను తిప్పుతూ వాటి నుంచి పాలను పిండి, చిన్న గ్లాసుడు పాలను రూ.వందకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో 11 కుటుంబాలు గాడిదలతో సంచరిస్తూ వాటి పాలతో జీవనోపాధిని పొందుతున్నాయి. గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనడంతో, నేటి ఆధునిక సమాజంలో రోగాల పరమై జీవనం సాగిస్తున్న అనేక మంది ఈ పాలను. తాగితే స్వస్థత చేకూరుతుందని ఆశిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు..’ అన్న శతక పద్యాన్ని సవరించుకోవలసిన అవసరం ఉందనిపిస్తోంది కదూ! ప్రచారం నేపథ్యంలో పెరిగిన గిరాకీ గాడిద పాలను కొద్ది కొద్దిగా రోజుకు మూడు పూటల చొప్పున మూడు రోజుల పాటు తాగితే ఆయాసం, ఉబ్బసం, జలుబు, రొంప, పిల్లలకు దగ్గు తదితర రోగాలు తగ్గుతాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గాడిద పాలకు మంచి గిరాకీ వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ విధంగా సంచార జీవనం సాగించే కుటుంబాలు సుమారు 35 వరకు ఉన్నాయి. వీరంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు గాడిదలను వేసుకుని తిరుగుతూ ఉపాధిని పొందుతుంటారు. వర్షాకాలం, శీతాకాలంలో వీరు ఈ విధమైన సంచార జీవనం గడుపుతారు. వేసవిలో ఇళ్ల వద్దనే ఉంటారు. అదేమంటే వేసవిలో ఈ పాలు మరింత వేడిని చేస్తాయని, అందుకని బయటకు పోమని అంటారు. -
గాడిదలు కాయడానికి వస్తున్నావా?
ఉపాధ్యాయుడి తీరుపై మంత్రి చందూలాల్ ఆగ్రహం మదనపల్లి యూపీఎస్ ఆకస్మిక తనిఖీ ములుగు : ‘నీ జీతం ఎంత?’ మంత్రి చందూలాల్ ప్రశ్న. ‘సార్ రూ.40వేలు’ ఉపాధ్యాయుడి స మాధానం. ‘రూ.40వేలు తీసుకొని గాడిదలు కాయడానికి వచ్చావా?.. పిల్లలకు పాఠాలు చెప్పడానికి వస్తున్నావా?’ అంటూ మంత్రి తీ వ్రంగా మండిపడ్డారు. ములుగు మండలం మదనపల్లి యూపీఎస్‌ను శుక్రవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఉపాధ్యాయుడు కుమారస్వామి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ హెచ్ఎం ఎక్కడా? అని మంత్రి ప్రశ్నించగా రాలేదని ఉపాధ్యాయు డు సమాధానం చెప్పాడు. దీంతో అటెండెన్స్ రిజిస్టర్ చూపించాలనడంతో ఒకరు తెచ్చి మం త్రికి ఇచ్చారు. అందులో ఇన్చార్జి హెచ్ఎం భవానీ పేరుతో సీఎల్ అని రాసి ఉంది. లీవ్ లెటర్ చూపాలని మంత్రి అడగ్గా తనతో ఫోన్ లో చెప్పిందని ఉపాధ్యాయుడు కుమారస్వామి సమాధానం చెప్పారు. లీవ్ లెటర్ లేకుండా లీవ్ ఎలా ఇచ్చారంటూ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. అటెండెన్స్ రిజిస్టర్లో గురువారం ఉపాధ్యాయుడు కుమారస్వామి విధులకు హాజరు కాలేదు. ఎలాంటి లీవ్ లెటర్ లేదు. దీన్ని మంత్రి గుర్తించి ప్రశ్నించారు. అక్కడే ఉన్న గ్రామస్తులు వీరు విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని మంత్రికి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి హెచ్ఎం, ఉపాధ్యాయుల మధ్య పరిణామాలపై మంత్రికి వివరించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి ఇన్చార్జి హెచ్ఎం భవానీ, ఉపాధ్యాయుడు కుమారస్వామిని సస్పెండ్ చేయాలని డీఈవో రాజీవ్‌ను ఫోన్లో ఆదేశించారు. డీఈఓ ఆదేశాల మేరకు ఇన్చార్జి ఎంఈఓ శ్రీనివాస్ నివేదిక ఇచ్చారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల తీరుతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పోతుందన్నారు. ఉదయం 8.45 గంటలకు పాఠశాలలకు చేరుకోవాల్సిన ఉపాధ్యాయులు కొందరు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఇద్దరు టీచర్ల సస్పెన్షన్ విద్యారణ్యపురి : జిల్లాలోని ములుగు మం డలం మదనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం జి.భవానీ, ఎస్జీటీ కుమారస్వామిని డీఈఓ రాజీవ్ సస్పెండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి చందూలాల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఇన్చార్జి హెచ్ఎం జి.భవానీ విధులకు గైర్హాజరు కాగా ఎస్జీటీ కుమారస్వామి అటెండెన్స్ రిజిస్టర్లో సీఎల్ అని రాసినట్లు గుర్తించారు. లీవ్‌లెటర్ గురించి అడగ్గా లేకపోవడంతో వారిద్దరిని సస్పెండ్ చేయాలని అందులో రాశారు. ఈమేరకు వారిని డీఈఓ సస్పెండ్ చేశారు. -
గాడిద పని గుర్రానికి...
సామాన్యంగా సంచార జీవులు తమ సామాగ్రిని గాడిదపై వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే మహబూబ్‌నగర్‌కు చెందిన గొర్రెల కాపర్లు శనివారం తమ సామగ్రిని గుర్రంపై వేసి తీసుకు వెళ్తూ ములుగు–జాకారం మధ్య సాక్షి కెమెరాకంటికి చిక్కారు. గొర్రెల మందలతో వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో.. సరుకు రవాణాతో పాటు పనులపై వెళ్లేందుకు తమకు కూడా ఉపయోగపడుతాయని గుర్రాలను పెంచుకుంటున్నట్లు కాపరులు ఈ సందర్భంగా తెలిపారు. -
ఆయన పులి అంట.. వీరంతా గాడిదలంట
గోరఖ్ పూర్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. వివాదాస్పద పోస్టర్లు వేసి తీవ్రంగా అవమానించింది. రాహుల్ గాంధీని గాడిదగా పేర్కొంటూ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ లో బీజేపీ మైనారిటీ విభాగం ఒకటి గోడ పత్రికలు అంటించింది. ఒక్క రాహులే కాదు.. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాయావతి, అసదుద్దీన్ ఓవైసీలు గాడిదలు తోలుతున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీ నేత యోగి ఆదిత్య నాథ్ ను పులితో పోలుస్తూ ఆయన పులిపై సవారీ చేసే వ్యక్తిగా అభివర్ణించారు. అంతకుముందు రాహుల్ గాంధీని సింహంతో పోలుస్తూ సింహంపై సవారీ చేసే వ్యక్తిగా ఆయనను పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచార పోస్టర్లు విడుదల చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ గా బీజేపీ మైనారిటీ విభాగం తాజా పోస్టర్లు విడుదల చేసింది. '2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మోత మోగిస్తుంది. మేం యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం' అని ఆ విభాగం పేర్కొనగా.. సమాజ్ వాది పార్టీ నేతలు గట్టి కౌంటర్ వేశారు. తాము శాంతియుత పౌరులం అని.. అశాంతితో కూడిన మనస్తత్వం కలిగినవారే పులులపై సవారీ చేస్తారు అని మహానగర్ అధ్యక్షుడు మోసిన్ ఖాన్ చెప్పారు. కాగా, బీజేపీ చేసిన ఈ పనిపట్ల తాము నిరసన వ్యక్తం చేస్తామని, ఈ చర్య పూర్తిగా ఖండిచందగినదని ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ సిద్దిఖీ అన్నారు. -
హమ్మయ్య! 'మైక్' భలే బతికిపోయింది!
అనగనగా ఓ వ్యక్తికి ముసలి గాడిద ఉంటుంది. అది బావిలో పడుతుంది. గాడిద ముసలిదవ్వడం, నీళ్లులేని ఆ బావితో ప్రయోజనం లేకపోవడంతో.. ఆ గాడిదతో సహా బావిని పూడ్చేయాలని అతను భావిస్తాడు. కానీ ఆ గాడిద తెలివిగా అతను పోసిన మట్టినంతా దులుపుకొని బావి పూడ్చేసే సరికి పైకి వచ్చేస్తుంది. ఇది మనకు తెలిసిన కథ. ఇలాంటిదే ఐర్లాండ్‌లో జరిగింది. అయితే అక్కడ గాడిద బావిలో కాకుండా వరద నీళ్లలో చిక్కుకుపోయింది. గాడిదే కదా మనకెందుకొచ్చిన ఖర్మ అనుకొని వాళ్లు వదిలేయలేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సాహసోపేతంగా బోటులో ప్రయాణించి ఆ గాడిదను కాపాడారు. ఎంతోసేపు వరదనీళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపిన గాడిద ఎట్టకేలకు ఒడ్డుకు చేరడంతో ఆనందంగా ఒండ్ర పెట్టింది. తనను కాపాడిన రెస్క్యూ సిబ్బందిని చూసి ఓ నవ్వు కూడా విసిరింది. ఈ ఘటన సోమవారం ఐర్లాండ్‌లోని కెర్రీ ప్రాంతంలో జరిగింది. తన గాడిద వరదనీటిలో చిక్కుపోయింది కాపాడమంటూ దాని యాజమాని 'యానిమల్ హెవెన్ యానిమల్ రెస్క్యూ' సంస్థను ఆశ్రయించాడు. వాతావరణ పరిస్థితులు బాగాలేకున్నా.. ఆ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది సాహసోపేతంగా వరదనీటిలో బోటువేసుకొని వెళ్లి మరీ దానిని కాపాడారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఈ గాడిదకు 'మైక్' పేరు పెట్టారు. మైక్ ఇప్పుడు యాజమాని కొట్టంలో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నది. Posted by Animal Heaven Animal Rescue on Sunday, December 6, 2015 -
గాడిద చేప్పే జ్యోతిష్యం
-
గాడిదకు హెయిర్ కట్
పని లేని... ఏదో చేశాడంట, సామెత ఇక్కడ వర్తించదు. ఎందుకంటే మహమ్మద్ ముస్తఫా పనే గాడిదలకు క్షవరం చేయడం. ఈజిప్టు రాజధాని కైరోలోని దృశ్యమిది. ఇలాంటివాళ్లు ఇంకా ఉన్నా కూడా ముస్తఫా మరింత మర్యాదస్తుడని వినియోగదారులు ఆయన దగ్గరకు వస్తుంటారు. కాదు, తమ గాడిదలను ఆయన దగ్గరకు తెస్తుంటారు. అన్నట్టూ, చరిత్రలో గాడిదలను తొలిగా మచ్చిక చేసింది ఈజిప్షియన్లేనని చెబుతారు. -
నవవధువు కుడికాలే ఎందుకు పెట్టాలి?
నివృత్తం పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చాక కుడికాలు లోపల పెట్టి రమ్మని వధువుకు చెబుతూ ఉంటారు పెద్దలు. ఎడమకాలు పెడితే అశుభాలు జరుగుతాయని అంటారు. దీనికి సాక్ష్యంగా రామాయణంలో హనుమంతుడిని చూపిస్తుంటారు. సీతను అన్వేషిస్తూ లంకకు చేరుకున్న హనుమంతుడు, కావాలని తన ఎడమకాలును మొదట ఆ నేలమీద మోపుతాడు. కుడిపాదం పెడితే రావణాసురుడికి సకల శుభాలు కలుగుతాయనీ, తాను వైరానికే సిద్ధపడి వచ్చాను కాబట్టి ఎడమ పాదం పెట్టడమే మంచిదనీ భావించి అలా చేస్తాడు. అంటే... గొడవకు సిద్ధపడి వచ్చేవారు ఎడమ పాదమే మోపుతారని తెలుస్తోంది. శుభం జరగాలని కోరుకునేవారు ఎవరైనా కూడా కుడి పాదమే మోపాలని అర్థమవుతోంది. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు... ఒక అడవిలో ఓ గాడిద ఉండేది. అది కడుపు నిండా తిండి మేస్తూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండేది. ఓసారి దానికి ఇంకో గాడిద కనిపించింది. ‘నిన్నిక్కడ ఎప్పుడూ చూళ్లేదు, అడవికి కొత్తగా వచ్చావా’ అనడిగింది మొదటి గాడిద. ‘లేదు, మా యజమానీ, నేనూ పట్నం వెళ్లి మా ఊరికి తిరిగొస్తున్నాం, దారిలో ఇక్కడ ఆగాం’ అని చెప్పింది రెండో గాడిద. అక్కడితో ఆపకుండా... ‘ఇక్కడ అడవిలో ఏం బతుకుతావ్, మా ఊరిలో చాలా బాగుంటుంది, నాతో రా’ అంటూ దాన్ని రెచ్చగొట్టింది. అది నమ్మి ఇది కూడా దాని వెనుక బయలుదేరింది. తీరా అక్కడికెళ్లాక యజమాని ఇద్దరితో చాకిరీ చేయించసాగాడు. పైగా తిండి సరిగ్గా పెట్టేవాడు కాదు. దాంతో... అడవిలోనే ఉంటే తిండయినా దొరికేది కదా అని కన్నీళ్లు పెట్టుకుందా గాడిద. ఈ కథను అనుసరించే పై సామెత పుట్టుకొచ్చింది. -
గాడిద అన్నాడని భర్తను కోర్టుకు లాగిన భార్య
జెద్దా: భర్త అందరి ముందు తనను అవమానించాడనే కోపంతో భార్య అతన్ని కోర్టుకు లాగింది. ఆవు, గాడిదా అంటూ తనను దూషించాడని, చెప్పుకోలేనటువంటి అసభ్య పదాలు వాడాడని ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన సౌదీ అరేబియాలో జరిగింది. జెద్దాలోని ఓ క్రిమినల్ కేసు విచారణకు చేపట్టింది. తనను అవమానించడం భర్తకు ఓ వ్యాపకంగా మరిందని ఆమో ఫిర్యాదులో పేర్కొంది. తను భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రెండు వారాల్లోగా కోర్టు ముందు హాజరు కావాల్సింది ఆమె భర్తకు సమన్లు జారీ చేసింది. -
ఇంకీ పింకీ జాంకీ..
వీటిల్లో ఒకటి జీబ్రా.. రెండోది? ఏదో తేడాగా ఉంది కదూ.. గాడిదలా కనిపిస్తోందా.. అయితే, ఇది డాంకీ కాదు.. జాంకీ! అవును.. ఎందుకంటే.. దీని తండ్రి గాడిద.. తల్లి జీబ్రా(ఫొటోలోనిది). అందుకే దీన్ని జాంకీ అంటున్నారు. అసలు పేరు కుంభ. ఓ వారం క్రితం మెక్సికోలోని రేనొసా జూలో పుట్టింది. జాంకీ పుట్టుక వెనుక చిన్న లవ్ స్టోరీ ఉంది. జాంకీ తల్లిదండ్రులు ఫస్ట్ ఫ్రెండ్స్ అట. రోజూ మధ్యాహ్నం కలుసుకునేవారట.. అలాఅలా లవ్ పుట్టి లవర్స్ అయిపోయాయట. అంతేకాదు.. జాంకీ చాలా అరుదైనదట. ఎందుకంటే.. గాడిద, జీబ్రా క్రోమోజోములు పూర్తిగా విరుద్ధమైనవని.. జాంకీ పుట్టడం అరుదైన పరిణామమని జూ అధికారులు చెబుతున్నారు.