వికారాబాద్ అర్బన్: ఒక గాడిదను ఇద్దరు వ్యక్తులు.. నాదంటే.. నాదేనంటూ పట్టుబట్టడంతో ఎటూ తేల్చలేక వికారాబాద్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గాడిదతోపాటు దాని పిల్ల, ఇద్దరు వ్యక్తులు పీఎస్ చుట్టూ తిరుగుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో నివాసం ఉండే బాణాల ప్రభు గాడిదల పాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. ఇతని వద్ద 22 గాడిదలు ఉండగా నాలుగు తప్పిపోయాయి.
ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాడిదలను వెతికి ఆచూకీ చెబితే పట్టుకొచ్చి ఇస్తామని పోలీసులు చెప్పారు. ఇటీవల మోమిన్‌పేటలో ఓ వ్యక్తి వద్ద తన గాడిద ఉన్నట్లు గుర్తించిన ప్రభు.. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు గాడిదను వికారాబాద్ పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ గాడిద తనదేనంటూ పద్మ అనే మహిళ తన తండ్రి సత్తయ్యతో కలిసి పీఎస్‌కు చేరుకుంది. వీరిద్దరూ గాడిద నాదంటే.. నాదే అనడంతో ఏం చేయాలో తోచని పోలీసులు.. మంగళవారం మరోసారి గాడిదను తీసుకొని స్టేషన్‌కు రావాలని చెప్పి పంపించారు.
పీఎస్‌లో ‘గాడిద’ పంచాయితీ!
Published Tue, Dec 10 2019 3:46 AM | Last Updated on Tue, Dec 10 2019 4:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment