
బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఓ గాడిదను కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు. గత వారం బిగ్‌బాస్ 18వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో 19వ కంటెస్టెంట్‌గా గాడిదను ప్రవేశపెట్టారు. దీని పేరు గదరాజ్. దాన్ని బిగ్‌బాస్ హౌస్‌లోనే ఓ చోట కట్టేశారు. కంటెస్టెంట్లు సమయానికి దానికిన్ని నీళ్లు, గడ్డి పెట్టారు. అయితే రియాలిటీ షో కోసం మూగజంతువును వాడుకోవడం చూసి పెటా(పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది.
మొదటివారం ఎవరు ఎలిమినేట్?
తక్షణమే దాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈమేరకు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు లేఖ రాసింది. పెటా ఆదేశాలతో ఈ వారం గాడిదను ఎలిమినేట్ చేసి పంపించినట్లు సమాచారం. నిజానికి ఈ వారం చాహత్ పాండే, గుణరత్న సదవర్తె, కరణ్ వీర్ మెహ్రా, అవినాష్ మిశ్రా, ముస్కన్ బామ్నే నామినేషన్‌లో ఉన్నారు. కానీ వీళ్లలో ఒకరికి బదులుగా పెటా ఆదేశాల ప్రకారం గాడిదను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.
18 మంది కంటెస్టెంట్లు
ఇకపోతే ఈ హిందీ బిగ్‌బాస్‌లో వివియన్ డిసేనా, ఐషా సింగ్, కరణ్ వీర్ మెహ్రా, చాహత్ పాండే, షెహజాదా దామి, నైరా బెనర్జీ, అవినాష్ మిశ్రా, ఎలైస్ కౌశిక్, రాజత్ దలాల్, శిల్ప శిరోద్కర్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment