హీరోయిన్ల లైఫ్ అంత ఈజీగా ఉండదు. కాస్త లావెక్కినా, వయసు మీద పడుతున్నట్లు ఏమాత్రం కనిపించినా వారి కెరీర్ డేంజర్‌లో పడ్డట్లే! పైగా కొత్తవారు ఎంట్రీ ఇచ్చేకొద్దీ తమను తాము ప్రూవ్ చేసుకుంటూ నిలదొక్కుకునేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. అయినా కొన్నిసార్లు ఏవో వంకలు చెప్పి రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.
బిగ్‌బాస్ షోలో నమ్రత సోదరి
టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు హీరోయిన్. ఆమె చెల్లి శిల్ప శిరోద్కర్ కూడా కథానాయికగా నటించింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఈమె టాప్ హీరోయిన్‌గా చెలామణి అయింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇన్నాళ్లు ఆన్‌స్క్రీన్‌పై చూశారు.. ఇప్పుడు ఆఫ్‌స్క్రీన్‌లో నేనెలా ఉంటానో చూపిస్తానంటూ హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌లో పాల్గొంది.
సల్మాన్ ఖాన్‌కు బదులుగా..
ఈ షోకు వెళ్లేముందు నమ్రతతో గొడవపడి మరీ వచ్చేశానంటూ తన సోదరిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా శిల్ప మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. వీకెండ్ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్‌కు బదులు కొరియోగ్రాఫర్, దర్శకనటి ఫరాఖాన్ హోస్ట్‌గా వ్యవహరించింది. ఆమెను చూడగానే శిల్పకు ఓ విషయం గుర్తుకు రావడంతో దాన్ని మరో కంటెస్టెంట్‌తో పంచుకుంది.
సడన్‌గా నన్ను తీసేశారు
బ్లాక్‌బస్టర్ సాంగ్ చయ్య చయ్య (దిల్‌సే మూవీలోనిది) పాటకోసం మొదట నన్నే అనుకున్నారు. నా దగ్గరకు వచ్చిన ఫరా ఖాన్ నన్ను చూసి కాస్త బరువు తగ్గమని చెప్పింది. వారం పదిరోజుల తర్వాత నన్ను పక్కనపెట్టి మరో నటి(మలైకా అరోరా)ని వెతుక్కున్నారని తెలిసింది. నేను మరీ లావుగా ఉన్నానని, ఆ పాటకు సూటవనని ఫరా నాతో చెప్పింది. నిజంగా నన్ను తీసేయడానికి అదే కారణమా? ఇంకేదైనా ఉందా? అన్నది కొరియోగ్రాఫర్ ఫరా, డైరెక్టర్ మణిరత్నమే చెప్పాలి అని శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment