
బిగ్‌బాస్ షోకు వెళ్లడం వల్ల తనకు మంచే జరిగిందంటోంది నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar). పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గిపోయానని చెప్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నాజూకుగా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు. శిల్పా మట్లాడుతూ.. బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో ఎక్కువ ఆహారం అందుబాటులో ఉండదు. దీనివల్ల మితంగానే తినేదాన్ని. ఫలితంగా 11 కిలోలు తగ్గిపోయాను. బయటకు వచ్చాక మరో రెండు కిలోలు తగ్గాను.
జీవితంలోనే మొదటిసారి..
మొత్తంగా 13 కిలోల పైన బరువు తగ్గాను. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు చాలా సన్నబడిపోయావ్, నీ వయసు తగ్గిపోతుందేంటి అన్న ప్రశంసలు నా జీవితంలోనే మొదటిసారి వింటున్నాను. అవి వింటుంటే నాకు మరింత ఎనర్జీ వస్తోంది. బిగ్‌బాస్‌లో మూడు, నాలుగు నెలలపాటు ఉన్నాను. బయటకు రాగానే తొలిసారి నమ్రత (Namrata Shirodkar)ను కలిసినప్పుడు నన్ను చూసి షాకైంది. చాలా సన్నబడిపోయావ్ అంది. నన్ను చూసి నా కుటుంబం ఎంతగానో గర్విస్తోంది.

మంచి డైట్..
ఇప్పుడు మంచి డైట్ ఫాలో అవుతున్నాను. ఇంకాస్త బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్క్రీన్‌పై మనం ఉన్నదానికంటే కాస్త బొద్దుగానే కనిపిస్తాం. కాబట్టి నాకు నేను కఠిన నియమాలు పెట్టుకుంటున్నాను. రోజుకు ఒకటీ లేదా రెండు సార్లు మాత్రమే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. గతంలో నేను లావుగా ఉన్నానని చయ్యా చయ్యా పాటకు నన్ను రిజెక్ట్ చేశారు.
నాకోసం కష్టపడుతున్నా..
అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించుకున్నాను. నాకోసం నేను కష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. శిల్ప.. ఖుదా గవా, ఏక్ ముత్తి ఆస్మాన్, త్రినేత్ర, ప్రతీక్ష, పెచాన్, ఆంఖెన్.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో బ్రహ్మ అనే సినిమాలో నటించింది. హీరో మహేశ్‌బాబుకు శిల్ప శిరోద్కర్ మరదలు అవుతుంది.
చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా
Comments
Please login to add a commentAdd a comment