Namrata Shirodkar
-
ఫ్రెండ్ షీమా నజీర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో 'నమ్రత, ఉపాసన' (ఫోటోలు)
-
ఇఫ్తార్ పార్టీలో నమ్రత-ఉపాసన.. ఫొటోలు వైరల్
పార్టీలంటే మహేశ్-నమ్రత ఎప్పుడూ జంటగానే వెళ్తారు. కానీ ప్రస్తుతం రాజమౌళి మూవీ వల్ల మహేశ్ బయటకు రాకూడదు కాబట్టి నమ్రత ఒక్కతే పార్టీలకు వెళ్తోంది. ఈమెకు తోడుగా చరణ్-ఉపాసన కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి మరో పార్టీ జరిగింది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!)నమ్రత-ఉపాసనలకు ఫ్రెండ్ అయిన షీమా నజీర్.. శుక్రవారం రాత్రి ఇఫ్తార్ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకకు వీళ్లిద్దరు మాత్రమే హాజరయ్యారు. మహేశ్ ఎలానూ ఇప్పుడు రావడానికి కుదరదు. కానీ ఈసారి చరణ్ కూడా రాలేకపోయాడు. దీంతో నమ్రత-ఉపాసన మాత్రమే పార్టీకి వచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా నమ్రత.. కొన్ని ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వీటిలో ఈమెతో పాటు ఉపాసన.. ముస్లిం ట్రెడిషన్ కి తగ్గ లుక్స్ లో కనిపించడం విశేషం. ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తోందిగా. మళ్లీ పండగ రోజు వీళ్లు ఏమైనా పార్టీ చేసుకుంటారేమో చూడాలి?(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్'.. చరణ్ కి కాస్త ఇబ్బందే?) -
టాలీవుడ్ ప్రిన్స్ గొప్ప మనసు.. మరో రెెండు మహోన్నత సేవలకు శ్రీకారం
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో నటిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.అయితే మహేశ్ బాబు సినిమాలతో పాటు సమాజసేవలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వేలమంది పేదల చిన్నారులకు వైద్య సాయానికి అండగా నిలుస్తున్నారు.తాజాగా మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో సేవకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి సారిగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరై మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా బాలికల కోసం ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్‌ను కూడా ఏర్పాటు చేశారు. 2025 నాటికి దాదాపు 1,500 మంది బాలికలకు ఉచితంగా టీకాలు వేయడం లక్ష్యమని ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్ వెల్లడించారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లి పాలు సరిపోని నవజాత శిశువులకు ప్రతి ఏడాదికి దాదాపు 7,200 మందికి ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు తెలిపారు. #Namratashirodkar garu inaugurated the Mothers Milk Bank at Andhra Hospitals, Vijayawada to help newborns with maternal milk which benefits 7,200 babies every year associating with @andhrahospital1 Alongside, @MBfoundationorg also initiating a cervical cancer vaccination drive… pic.twitter.com/vaBvDunrPT— Mahesh Babu Space (@SSMBSpace) March 17, 2025 -
విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ (ఫొటోలు)
-
టీనేజీ బ్యూటీలా నమ్రత.. మైమరిపించేస్తున్న సంయుక్త
యువరాణిలా నిధి అగర్వాల్ అలంకరణపూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భాగ్యశ్రీఒంపు సొంపులతో అందాలని చూపించేస్తున్న సంయుక్తఅవార్డ్ అందుకున్న 'డ్రాగన్' బ్యూటీ కాయదు లోహర్గాగ్రా చోళీలో మెరిసిపోతున్న మహేశ్ భార్య నమ్రతఒంటికి రంగులు పూసుకుని హోలీ చేసుకున్న పూనమ్ బజ్వాక్యూట్ అండ్ స్వీటుగా రీతూ వర్మ పోజులు View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sangeerthana (@sangeerthana__vipin) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
రెడ్ శారీలో మెరిసిపోతున్న మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. (ఫోటోలు)
-
పార్టీలో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్
రీసెంట్ టైంలో పెళ్లిళ్లు చాలా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర సెలబ్రిటీల వరకు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో నిర్మాత మహేశ్వర్ రెడ్డి కుమారుడు నితీశ్ రెడ్డి పెళ్లి దుబాయిలో జరిగింది. దీనికి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలేంటంటే?)దుబాయిలో జరిగిన పెళ్లికి చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాగార్జున కుటుంబాలు వెళ్లాయి. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్ లో రిసెప్షన్ జరగ్గా.. నమ్రత-సితార, రామ్ చరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని నమ్రత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొత్త జంట నితీష్-కీర్తిని ఆశీర్వదించింది.అయితే పార్టీలంటే ముందుండే మహేశ్ బాబు మాత్రం రాజమౌళితో తీస్తున్న సినిమా షూటింగ్ వల్ల వీటిని మిస్ అవుతున్నాడు. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలోని కొండల్లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించి లీకైన ఓ వీడియో క్లిప్ కూడా తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్
బిగ్‌బాస్ షోకు వెళ్లడం వల్ల తనకు మంచే జరిగిందంటోంది నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar). పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గిపోయానని చెప్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నాజూకుగా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు. శిల్పా మట్లాడుతూ.. బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో ఎక్కువ ఆహారం అందుబాటులో ఉండదు. దీనివల్ల మితంగానే తినేదాన్ని. ఫలితంగా 11 కిలోలు తగ్గిపోయాను. బయటకు వచ్చాక మరో రెండు కిలోలు తగ్గాను.జీవితంలోనే మొదటిసారి..మొత్తంగా 13 కిలోల పైన బరువు తగ్గాను. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు చాలా సన్నబడిపోయావ్, నీ వయసు తగ్గిపోతుందేంటి అన్న ప్రశంసలు నా జీవితంలోనే మొదటిసారి వింటున్నాను. అవి వింటుంటే నాకు మరింత ఎనర్జీ వస్తోంది. బిగ్‌బాస్‌లో మూడు, నాలుగు నెలలపాటు ఉన్నాను. బయటకు రాగానే తొలిసారి నమ్రత (Namrata Shirodkar)ను కలిసినప్పుడు నన్ను చూసి షాకైంది. చాలా సన్నబడిపోయావ్ అంది. నన్ను చూసి నా కుటుంబం ఎంతగానో గర్విస్తోంది.మంచి డైట్..ఇప్పుడు మంచి డైట్ ఫాలో అవుతున్నాను. ఇంకాస్త బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్క్రీన్‌పై మనం ఉన్నదానికంటే కాస్త బొద్దుగానే కనిపిస్తాం. కాబట్టి నాకు నేను కఠిన నియమాలు పెట్టుకుంటున్నాను. రోజుకు ఒకటీ లేదా రెండు సార్లు మాత్రమే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. గతంలో నేను లావుగా ఉన్నానని చయ్యా చయ్యా పాటకు నన్ను రిజెక్ట్ చేశారు. నాకోసం కష్టపడుతున్నా..అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించుకున్నాను. నాకోసం నేను కష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. శిల్ప.. ఖుదా గవా, ఏక్ ముత్తి ఆస్మాన్, త్రినేత్ర, ప్రతీక్ష, పెచాన్, ఆంఖెన్.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో బ్రహ్మ అనే సినిమాలో నటించింది. హీరో మహేశ్‌బాబుకు శిల్ప శిరోద్కర్ మరదలు అవుతుంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73)చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా -
మహేశ్ వల్లే సినిమాలకు దూరమైన నమ్రత.. రిలేషన్లో ఉన్నప్పుడు..
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ హీరోలు హీరోయిన్లను పెళ్లాడడం జరుగుతూనే ఉంది. అయితే గతంలో పెళ్లి తర్వాత హీరోయిన్లు తప్పనిసరిగా తమ నటన కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. పెళ్లి తర్వాత కూడా టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే మహేశ్‌బాబు (Mahesh Babu)ను పాతికేళ్ల క్రితం వివాహం చేసుకున్న అప్పటి స్టార్ హీరోయిన్ నమ్రత (Namrata Shirodkar) మాత్రం నటనను వదిలేసుకున్నారు. మరి ఇప్పటి పరిస్థితిని చూసి ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు? అందాల కిరీటం అందుకున్న నమ్రతఎందుకంటే అప్పట్లో అందాల కిరీటం అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. దేశంలోని అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్... మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే ఎకాఎకిన సినిమాల్లోకి వచ్చేసినట్టే. ప్రస్తుతం మహేశ్‌బాబు (Mahesh Babu) సతీమణిగా గ్లామర్ రంగానికి దూరంగా ఉన్న నమ్రత శిరోద్కర్ తొలిసారిగా 1993లో ఫెమినా మిస్ ఇండియాగా కిరీటాన్ని పొందిన ఘనత దక్కించుకుంది. దాంతో అప్పటి బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్, మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన నటించేందుకు వరుస అవకాశాలు వచ్చాయి. అప్పుడు హీరోయిన్గా.. ఇప్పుడు ఇల్లాలిగా..మెగాస్టార్ చిరంజీవితో కూడా నమ్రత నటించింది. తన సినీరంగ ప్రవేశం జరిగి మూడు దశాబ్ధాల తర్వాత... ప్రస్తుతం ఆమె టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్యగా చక్కని సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతోంది. ఇప్పుడు తెర వెనుక పూర్తి జీవితాన్ని అనుభవిస్తోంది మాజీ నటి నమ్రతా శిరోద్కర్. ఆమె 1998లో హిందీ 'ఎల్ఎమ్ జబ్ ప్యార్ కిసీసే హోతా హై'తో సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. నమ్రత కెరీర్.. హిందీ, కన్నడ, తెలుగు, మరాఠీ, మలయాళంతో సహా పలు భాషల్లో విస్తరించింది. ఆమె హీరో హిందుస్తానీ, పుకార్, అస్తిత్వ, దిల్ విల్ ప్యార్ వ్యార్, తెహసీబ్, ఇన్సాఫ్: ది జస్టిస్ వంటి అనేక రకాల టాప్ మూవీస్‌లో నటించింది. వంశీ సినిమాతో మొదలు..ఎజుపున్న తారకన్ చిత్రం ద్వారా ఆమె మలయాళ ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. అదే క్రమంలో 2000లో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన వంశీతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. వంశీ సినిమా ద్వారానే వారిద్దరూ సన్నిహితంగా మారారు. ఆ సినిమా షూటింగ్ కోసం 52 రోజుల పాటు న్యూజిలాండ్‌లో గడిపారు. అక్కడ ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే కండీషన్అయితే ఆ సమయంలో మహేశ్ కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా నమ్రత మహేశ్ కంటే వయసులో నాలుగేళ్లు పెద్దది కావడం, హిందీ చిత్రసీమకు చెందిన సినీనటిని కోడలిగా తెచ్చుకోవడానికి ఇష్టపడకపోవడం చిక్కులు తెచ్చిపెట్టింది. చివరికి, వారు అన్ని అడ్డంకులను అధిగమించి 2005లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక మహేశ్‌బాబు నటనకు స్వస్తి చెప్పాలని కోరడంతో పెళ్లికి ముందే నమ్రత తన కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత నమ్రత పలు ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు ఆ విషయం వెల్లడైంది.రిలేషన్లో ఉన్నప్పుడే..తామిద్దరూ రిలేషన్షిప్ ఉన్నప్పుడే మహేశ్ తనకు ఈ విషయాన్ని చెప్పాడని నమ్రత అంటోంది. నటించడం నచ్చక లేదా నటిగా కొనసాగడం నచ్చకే మహేష్ అలా అన్నాడా? అంటే ‘అదేమీ కాదు. ‘మహేశ్‌కు ఇంటిని దిద్దుకునే భార్య కావాలి. నేను వేరే ఏదైనా ఉద్యోగంలో ఉండి ఉంటే కూడా అతను నన్ను ఆ జాబ్ వదిలేయమని అడిగేవాడు’’ అనేది నమ్రత సమాధానం. ఒకవేళ తాను సినిమాల్లో కొనసాగి ఉంటే మరింత అగ్రస్థానంలో ఉండేదేమో కదా! అని ఎవరైనా అంటే.. ‘‘నాకెప్పుడూ కూడా టాప్ హీరోయిన్ని కావాలనే కోరిక లేదు, కాబట్టి నేను నటించడం మానేయాల్సి వచ్చినప్పుడు, ఏ మాత్రం నిరాశ చెందలేదు.‘ అని నమ్రత స్పష్టం చేసింది. అర్థం చేసుకున్న మహేశ్‘నేను ముంబైలో నివసించిన పరిస్థితులకు మహేశ్‌తో కలిసి హైదరాబాద్‌లో పెద్ద బంగ్లాకు మారడం నాకు చాలా కష్టమైన మార్పు. ఇది అర్థం చేసుకున్నాడు మహేశ్. దాంతో మా పెళ్లి తర్వాత, కొంతకాలం మేం ముంబైలో ఉండిపోయాం’’ అంటూ చెప్పుకొచ్చారు నమ్రత. అయితే నమ్రత, మహేశ్ విడిపోయారని, నమ్రత తమ కొడుకుతో కలిసి ముంబైకి వెళ్లారని అప్పట్లో కొన్ని పుకార్లు షికారు చేశాయి. ‘నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను అలాగే కొన్ని విభేదాల వల్ల కొంతకాలం విడిగా ఉన్నాము.మహేశ్ విజయం వెనక నమ్రతకానీ ఆ సమయంలో, మేము మా అనుబంధంలోని బలం స్పష్టతను కనుగొన్నాం’’ అంటూ చెప్పారామె. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఓ మహిళ ఉందంటారు.. ’మహేశ్‌బాబు తన విజయానికి కీలకం అని నమ్రతను తరచుగా అంటుంటాడు. తన భర్త నిర్మాణ సంస్థ అయిన జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే నమ్రత తన కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. సక్సెస్ఫుల్ భార్యగా, తల్లిగా ఇంటిని తీర్చిదిద్దుతోంది.-సత్యబాబుచదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?! -
సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్
తొలి సినిమా హిట్టు కొడితే ఆ కిక్కే వేరు. మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) వాస్తవ్ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా కథను సంజయ్ దత్‌కు చెప్పడానికి ముందు మద్యం తాగాడట! ఈ విషయాన్ని తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ముందుగా రెండు పెగ్గులేసి..'వాస్తవ్ కథను సంజయ్ దత్ (Sanjay Dutt)కు చెప్పడం కోసం ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన్ను కలవడానికి ముందు ఓ రెస్టారెంట్‌కు వెళ్లి రెండు పెగ్గులేశాను. వెయిటర్ దగ్గరున్న నోట్‌ప్యాడ్ తీసుకుని అందులో కథలో కీలకమైన అంశాలు రాసుకున్నాను. ఆల్రెడీ కథంతా నా మెదడులో ఉంది కాబట్టి కొన్ని పాయింట్స్ రాశాక సంజయ్ దగ్గరకు వెళ్లాను. దుష్మన్ సినిమా సెట్లో ఆయన్ను కలిశాను. ఆయన ఓ డైరెక్టర్‌తో మాట్లాడుతుండగా వెనకాల నిల్చున్నాను. ఇక్కడేం చేస్తున్నావ్?సడన్‌గా నన్ను చూసి నువ్విక్కడేం చేస్తున్నావ్? అన్నాడు. కచ్చితంగా తిడతాడేమో అనుకున్నాను. అక్కడున్నవారెవరికీ నేను తెలియదు. నన్ను కూర్చోమని కూడా ఎవరూ చెప్పలేదు. అంత పెద్ద సినిమా సెట్‌కు వెళ్లడం అదే నాకు మొదటిసారి. సంజయ్ విరామం లేకుండా షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నాడు. ఛాన్స్ మిస్ అయితే మళ్లీ దొరకదన్న భయంతో ఆయన వెనకాలే తిరుగుతున్నాను. నన్ను గమనించి.. నీకు కథ చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? అన్నాడు. పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదని బదులిచ్చాను. పదినిమిషాలు కాస్తా గంటగా..అలా అతడి గదిలోకి వెళ్లి వాస్తవ్ కథ (Vaastav: The Reality Movie) చెప్పడం మొదలుపెట్టా.. ఐదు నిమిషాలయ్యాక గదిలో ఉన్న మిగతా అందర్నీ బయటకు వెళ్లమన్నాడు. గంటన్నరపాటు కథ చెప్పాను. ఆయనకు చాలా నచ్చింది. షూటింగ్ మొదలైంది.. అయితే వారానికి ఒకరోజు సంజయ్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేసింది. ఆ రోజు చేయాల్సిన షూటింగ్‌ను అర్ధరాత్రైనా సరే పూర్తి చేసేవాళ్లం. 35% షూటింగ్ అయ్యాక నిర్మాత తన దగ్గర డబ్బు లేదని చేతులెత్తేశాడు. అప్పటివరకు షూటింగ్ చేసిన సీన్స్ ఎలా వచ్చాయోనని రష్ చూశాను. ఏమీ బాగోలేదు. షూటింగ్ ముందుకు సాగలేదు.సినిమా రైట్స్ అమ్మిన డబ్బుతో..ఏడాదిపాటు ఎలాంటి ముందడుగు లేకపోవడంతో సినిమా అటకెక్కిందన్న ప్రచారం జరిగింది. ఒక రోజు నిర్మాత శ్యామ్ ష్రాఫ్.. సినిమా రష్ చూసి బాగుందన్నాడు. రూ.50 లక్షలు పెట్టి బాంబే హక్కులు కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు చేతిలో పెట్టాడు. దీంతో షూటింగ్ పునఃప్రారంభించాం. ఆ డబ్బు అయిపోయాక మిగతాచోట్ల రైట్స్ అమ్మాం.. ఈ పద్ధతిని ఫాలో అవుతూ వాస్తవ్ పూర్తి చేశాం. సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు' మహేశ్ అని చెప్పుకొచ్చాడు.వాస్తవ్ విశేషాలువాస్తవ్ సినిమా విషయానికి వస్తే.. సంజయ్‌దత్, నమ్రత శిరోద్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. పరేశ్ రావల్, దీపక్, సంజయ్ నర్వేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ 1999 అక్టోబర్‌లో విడుదలైంది. వాస్తవ్ హిట్టవడంతో దర్శకుడు మహేశ్ దీనికి సీక్వెల్‌గా హత్యార్ తీశాడు. ఇందులోనూ సంజయ్ దత్ హీరోగా నటించాడు.చదవండి:కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే! -
పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు.. ఫోటోలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
దుబాయ్‌లో జూనియర్ ఎన్టీఆర్- ప్రణీత, నమ్రత, ఉపాసన సందడి (ఫోటోలు)
-
దుబాయ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు
టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫారిన్లో చిల్ అవుతున్నారు. దుబాయ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, హీరోల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. జీవితంతం సంతోషంగా..'కీర్తి- నితేశ్ జంటగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీరు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని క్యాప్షన్ జోడించింది. ఈ ఫోటోల్లో ఉపాసన, ఎన్టీఆర్ (Jr NTR)- లక్ష్మీ ప్రణతి తదితరులు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర అనిరుధ్ రవిచంద్రన్‌తో కలిసి మహేశ్ కూతురు సితార, సుకుమార్ కూతురు సుకృతి సెల్ఫీ కూడా దిగారు.నాటు నాటు పాటకు స్టెప్పేసిన అఖిల్ఈ పెళ్లిలో అఖిల్ సహా మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నాటునాటు పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో చరణ్, తారక్ డ్యాన్స్ చేసినట్లుగానే ఇక్కడ కూడా అఖిల్ వేరొకరితో కలిసి స్టెప్పులేశాడు. ఈ సెలబ్రిటీల హంగామా చూసిన ఫ్యాన్స్ మిగతా హీరోలు కూడా ఈ పార్టీలో ఉంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Akhil Akkineni Dance For "NattuNattu" Song 🔥Happy to witness His Dance 🥹@AkhilAkkineni8 Anna Akhil6 lo Dance kummeyandi #AkhilAkkineni #RRR pic.twitter.com/xxg7OKuz3r— Vinay Vk18 (@Vinay_Akhil999) February 23, 2025చదవండి: హీరోయిన్ కుమార్తెలకు బంగారు గాజులు తొడిగిన స్టార్ హీరో -
రెడ్ శారీలో యాంకర్ రష్మీ.. పెళ్లి వీడియోను షేర్ చేసిన బుల్లితెర నటి!
రెడ్ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ హోయలు..సైకిల్‌పై సవారీ చేస్తోన్న నమ్రతా శిరోద్కర్...బ్లాక్ డ్రెస్‌లో ఐశ్వర్య లక్ష్మి స్టన్నింగ్ లుక్స్..పెళ్లి వీడియోను షేర్ చేసిన బుల్లితెర నటి మాన్సి జోషి..పింక్ డ్రెస్‌లో షాలిని పాండే పోజులు.. View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
ఎప్పటికీ నీతోనే.. నమ్రతకు మహేశ్ లవ్ నోట్
సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంతమంది మాత్రమే ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మహేశ్-నమ్రత జంట ఒకటి. పెళ్లయి ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ జంటపై చిన్న రూమర్ కూడా రాలేదంటే.. ఎంత అనోన్యంగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నేడు(ఫిబ్రవరి 10) ఈ బ్యూటిఫుల్ కపుల్ 20వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా యానివర్సరీ విషెస్ తెలియజేశాడు మహేశ్. ‘నువ్వు, నేను.. అందమైన 20 వసంతాలు. ఎప్పటికీ నీతోనే నమ్రత..’ అంటూ నమ్రత, తను కలిసి ఉన్న నవ్వుతున్న ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మహేశ్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు మహేశ్-నమ్రత జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమా కలిపిందిమహేశ్ బాబు, నమ్రతలను ఒక్కటి చేసింది ఓ సినిమా. వీరిద్దరు జంటగా వంశీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మనసులు కలిశాయి. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది.నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
స్నేహితులతో ఫ్యాషన్ ఈవెంట్లో నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
మ్యూజిక్ కన్సర్ట్‌లో సందడి చేసిన సితార, నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
మా మధ్య గొడవలు లేవు : శిల్పా శిరోద్కర్
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కొద్దిరోజుల క్రితం హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, చాలామంది అభిమానాన్ని ఆమె దక్కించుకుంది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడినట్లు బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే శిల్ప చెప్పింది. ఆ సమయంలో వారిద్దరూ రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్‌లో నమ్రత రావాలని కూడా ఆమె కోరుకుంది. కానీ, నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్‌బాస్‌కు వెళ్లింది. శిల్పకు సపోర్ట్‌గా ఆమె అక్కాబావ నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar)- మహేశ్‌బాబు(Mahesh Babu) తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని రూమర్స్ రావడంతో శిల్ప శిరోద్కర్ మరోసారి రియాక్ట్ అయింది.'సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌ల వల్ల బంధాలను జడ్జ్ చేయడం తప్పు. సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా సంబంధాలను అంచనా వేయకూడదు.. మనుషుల మధ్య అనుబంధాన్ని తెలిపేందుకు సోషల్ మీడియా పోస్ట్ అవసరం లేదు. మేమిద్దరమూ మా భావాలను బహిరంగంగా వ్యక్తీకరించుకోలేం.. ఆన్లైన్ వేదికగా అలాంటివి మాకు ఇష్టం ఉండదు. నాకు సపోర్ట్‌గా నమ్రత పోస్ట్ చేస్తేనే మా మధ్య సంబంధాలు ఉన్నాయని, లేదంటే గొడవలు ఉన్నాయని ఊహించుకోవడం చాలా తప్పు. నా గుర్తింపు కోసం నేను బిగ్ బాస్ 18కి వెళ్లాను. నమ్రత సోదరి గానో లేదా మహేష్ మరదలిని కావడం వల్లో వెళ్లలేదు. వాస్తవానికి మహేశ్ ఒక సూపర్ స్టార్. ఆయన చాలా పాపులర్. కానీ, వారు నా కెరీర్లో భాగం కావాలని అర్థం కాదు కదా..? మహేశ్, నమ్రత ఇద్దరూ చాలా ప్రైవేట్‌గా ఉండాలనుకుంటారు. దీంతో వారికి పొగరు అని అందరూ అనుకుంటారు. ఇదీ ముమ్మాటికి నిజం కాదు. వారిద్దరూ చాలా మంచివారు. మహేశ్ చాలా సింపుల్, కూల్‌గా మాట్లాడుతారు. అతను చాలా మంచి వ్యక్తి. మీకు ఏదైనా అవసరమైతే.., ఎల్లప్పుడూ మీ కోసం అండగా నిలబడుతాడు.' అని శిల్పా పేర్కొంది. బిగ్ బాస్‌లో శిల్పా శిరోద్కర్‌కు ఓటు వేయాలని మహేశ్, నమ్రత శిరోద్కర్ విజ్ఞప్తి చేసి ఉంటే.. ఆమె తప్పకుండా గెలిచి ఉండేది అని చాలామంది భావించారు. ఈ క్రమంలో శిల్ప ఇలా రియాక్ట్ అయింది.నమ్రతను కలిసిన శిల్పతాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్‌లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్‌డే సందర్భంగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్‌డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. -
నమ్రతతో గొడవపడ్డ శిల్ప.. మూడు నెలల తర్వాత.. (ఫోటోలు)
-
అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ..
బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar).. ఇటీవలే హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడింది. ఈ విషయాన్ని శిల్ప శిరోద్కర్ స్వయంగా వెల్లడించింది. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నమ్రతతో గొడవైందని.. రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్‌లో నమ్రత రావాలని కోరుకుంది.పట్టించుకోలేదా?కానీ నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్‌బాస్‌కు వెళ్లింది. ఇకపోతే శిల్పకు సపోర్ట్‌గా ఆమె అక్కాబావ నమ్రత- మహేశ్‌బాబు తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. షో నుంచి వచ్చిన వెంటనే శిల్ప ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. నమ్రత ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. తను కచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని చెప్పను. ఇలాంటివి మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. తను నాకు మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా తనేంటో నాకు తెలుసు.. నేనేంటో తనకు తెలుసు అని చెప్పింది.బర్త్‌డే విషెస్తాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్‌లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్‌డే సందర్భంగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్‌డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మహేశ్- నమ్రత దంపతులు.. శిల్పకు సపోర్ట్‌గా లేరు, పట్టించుకోవట్లేదన్న రూమర్లకు ఈ పోస్ట్‌తో చెక్ పడినట్లైంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..! -
బిగ్‌బాస్ ఫినాలే ఛాన్స్ మిస్.. నమ్రతా, మహేశ్ బాబు సపోర్ట్‌పై శిల్పా రియాక్షన్
బిగ్‌బాస్ సీజన్-18 దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈనెల 19న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే టాప్-6 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ముఖ్యంగా ఫైనలిస్ట్‌లో కచ్చితంగా ఉంటుందని భావించిన నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె బిగ్‌బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన సిస్టర్ నమ్రతా, మహేశ్ బాబు గురించి మాట్లాడింది. వాళ్లు సోషల్ మీడియాలో తనకు మద్దతు ప్రకటించకపోవడంపై కూడా స్పందించింది.ఎలిమినేషన్ గురించి శిల్పా మాట్లాడుతూ..'ఈ లిటీ షోకు నేను పెద్ద అభిమానిని. మిడ్వీక్లో ఎవిక్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏ విషయంలోనూ నేను అబద్ధం చెప్పను. ఈ సీజన్లో టాప్ -3లో ఉండాలని ఆశించా. నా పేరు ప్రకటించినప్పుడు కాస్తా విచారంగా అనిపించింది. కానీ నా ఎలిమినేషన్ చాలా గౌరవంగా ఉంది. బిగ్ బాస్ నా పేరును కూడా ప్రకటించలేదు. నా లేఖను కూడా నేనే చదివా. ఈ షో అభిమానిగా హౌస్‌లో ప్రవేశించా. బిగ్ బాస్ హౌస్‌లో నా ప్రయాణంతో సంతోషంగా ఉన్నా' అని అన్నారు.అయితే శిల్పా శిరోద్కర్‌కు సోదరి నమ్రతా శిరోద్కర్, మహేష్ బాబు దంపతుల నుంచి ఆమెకు తగినంత సపోర్ట్ లభించలేదని కొందరు సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టారు. ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు ఆమెకు ఓట్లు వేయాలని నమ్రతా కోరకపోవడంపై కొందరు అభిమానులు షాకయ్యారు.అయితే ఇదే విషయం శిల్పా మాట్లాడుతూ.. "ఒక కుటుంబంగా, మాకు ఒకరిపై ఒకరికి అలాంటి అంచనాలు ఉండవు. ఈ ఇంటి ద్వారా నేను అన్ని రకాల వ్యక్తులను కలిశాను. మన తెలివితేటలను బట్టే మనల్ని అంచనా వేస్తారని తెలుసుకున్నా. నమ్రతా నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. అలా అని నాకు సపోర్ట్ చేయాలని నేను చెప్పను. ఇలాంటివీ మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. ఆమె నాకు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. తానేంటో నాకు తెలుసు..నేనేంటో తనకు తెలుసు.' అని వెల్లడించింది. మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లో వివియన్ ద్సేనా, కరణ్ వీర్ మెహ్రా తనకు స్నేహితులని శిల్పా శిరోద్కర్ తెలిపింది.బిగ్‌బాస్‌లో అనుభవం గురించి మాట్లాడుతూ..' ఇక్కడ నా ఆత్మగౌరవం గురించి ప్రశ్నించారని నాకు తెలుసు. కానీ నేను ఎలాంటి అంచనాలు లేకుండా షోలోకి ప్రవేశించా. అసలు నేను ఇన్ని రోజులు హౌస్‌లోని ఉంటానునుకోలేదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారని తెలుసు. మేం చేసే ప్రతి విషయం వారికి గుర్తుంటుంది. నా కుమార్తె హౌస్‌లోకి వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. అప్పుడే గెలిచినంత ఆనందం వేసింది.' అని పంచుకుంది. కాగా.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్-18 రియాలిటీ షో ఫైనల్ జనవరి 19 ఆదివారం జరగనుంది. -
వేకేషన్లో నమ్రతా, సితార చిల్.. తామరపువ్వులా తంగలాన్ బ్యూటీ!
కలర్‌ఫుల్ డ్రెస్సులతో లైగర్ భామ పోజులు..క మూవీ హీరోయిన్ తన్వీ రామ్ అలాంటి లుక్..వేకేషన్లో నమ్రతా, సితార చిల్..పెళ్లి వేడుకలో సందడి చేసిన శోభన, సుహాసిని..తామర పువ్వులాంటి అందంతో తంగలాన్ బ్యూటీ.. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) -
వింటర్ వండర్ ల్యాండ్: శాంటాక్లాజ్‌తో సూపర్‌స్టార్ ఫ్యామిలీ (ఫోటోలు)
-
దుబాయ్‌లో చిల్ అవుతోన్న సితార, నమ్రత.. ఫోటోలు వైరల్!
-
దుబాయ్ టూర్లో నమ్రత, సితార.. స్వీట్ మెమోరీస్ ఫోటోలు చూశారా..?
-
నమ్రతతో గొడవపడి బిగ్‌బాస్‌కు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్లో పాల్గొంది. రెండు నెలలుగా హౌస్‌లో కొనసాగుతున్న ఈమె తన సోదరి నమ్రత శిరోద్కర్‌ను గుర్తు చేసుకుని ఏడ్చేసింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అతిథిగా విచ్చేశాడు. నీ సోదరి గురించి చెప్పు అని అనురాగ్ అడగ్గానే శిల్ప కన్నీటిపర్యంతమైంది. నమ్రతతో గొడవపడ్డా..శిల్ప మాట్లాడుతూ.. ఈ షోకి వచ్చేముందే నమ్రతకు, నాకు గొడవ జరిగింది. రెండు వారాలు మేమసలు మాట్లాడుకోనేలేదు. తనను నేను చాలా మిస్సవుతున్నాను. నాకోసం తను ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఎపిసోడ్లో సైతం నమ్రతను గుర్తు చేసుకుంది. బిగ్‌బాస్‌కు వచ్చేముందు తనను కలిసి గుడ్‌బై కూడా చెప్పలేదని బాధపడింది. ఫ్యామిలీ వీక్‌లో అయినా తనను కలవాలని కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టింది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మహేశ్-నమ్రతని మించిపోతున్న సితార
రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న మహేశ్ బాబు.. బయట పెద్దగా కనిపించట్లేదు. మరోవైపు ఇతడి భార్య, కూతురు మాత్రం ఇప్పుడు ముంబైలో కనిపించారు. ప్రముఖ పాప్ సింగర్ దువా లిపా కన్సర్ట్కి హాజరయ్యారు. బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్‌లో కనిపించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)ప్రస్తుతం సితార టీనేజీ అమ్మాయి. అయితేనేం డ్యాన్సుల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఎత్తు, అందంలోనూ తల్లితండ్రులని మించిపోయేలా ఇప్పుడే కనిపిస్తోంది. చూస్తుంటే అందం విషయంలో మహేశ్‌ని మించిపోతుందేమోనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.మహేశ్.. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అవుతున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. అంతవరకు మహేశ్ అయితే పెద్దగా కనిపించడని చాలామంది అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు అయితే ఎయిర్పోర్ట్ లేదా ఏదో ఓ ఈవెంట్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ముంబై కన్సర్ట్కి భార్య-కూతురిని మాత్రం పంపించాడు.(ఇదీ చదవండి: కోడలు శోభితకి నాగార్జున ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా?) -
అనార్కలీ డ్రెస్‌లో మహారాణిలా వెలిగిపోతున్న మాజీ మిస్ ఇండియా (ఫోటోలు)
-
అచ్చం సూపర్ స్టార్‌లాగానే.. వయసు తరుగుతోంది.. అందం పెరుగుతోంది
-
బిగ్‌బాస్ హౌస్‌లో మహేశ్ బాబు మరదలు.. తెలుగులో ఓకే ఒక్క సినిమా!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే తెలుగులో ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం వెల్డ్ కార్డ్ ద్వారా మరో ఎనిమిది మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే అదే రోజు హిందీతో పాటు తమిళంలోనూ బిగ్‌బాస్ సీజన్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 6 నుంచి హిందీ బిగ్‌బాస్ సీజన్-18 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్లో టాలీవుడ్ హీరో మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హౌస్‌లో అడుగుపెట్టింది. నమ్రతా శిరోద్కర్ చెల్లి అయిన శిల్పా బిగ్‌బాస్ సీజన్ 18లోకి నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తనకు బిగ్‌బాస్ షో అంటే విపరీతమైన అభిమానమని.. నా కల నిజమైన క్షణమని సంతోషం వ్యక్తం చేశారు. నా ప్రయాణం పట్ల ఆనందంగా ఉన్నట్లు శిల్పా శిరోద్కర్ అన్నారు. బిగ్‌బాస్ ద్వారా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లమని కూతురు ఎప్పుడు తనను అడుగుతుండేదని శిల్పా శిరోద్కర్ వెల్లడించారు. అందరికంటే ఎక్కువ తన కూతురు సంతోషంగా ఉందని పేర్కొంది.(ఇది చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!)1990 దశకంలో బాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు శిల్పా శిరోద్కర్. బాలీవుడ్లో బందీష్, మృత్య్దండ్, హమ్, త్రినేత లాంటి సినిమాల్లో నటించారు. మోహన్‌బాబు హీరోగా నటించిన బ్రహ్మ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన మూవీ ఇదే కావడం విశేషం. అంతే కాకుండా నాగార్జున నాగార్జున బాలీవుడ్లో నటించిన ఖుదాగవా సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోకి కొండవీటి సింహాం పేరుతో డబ్ చేశారు. 2000 సంవత్సరంలో చివరిసారిగా గజగామిని అనే హిందీ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
స్టైలిష్ లుక్‌లో మహేశ్.. సీతక్కకు ఫ్యాన్ అంటున్న నమ్రత (ఫోటోలు)
-
బిగ్‌బాస్ షోలో నమ్రత సోదరి ఎంట్రీ!
బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచితే, కంటెస్టెంట్లకు పాపులారిటీని తెచ్చిపెడుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్ విజయవంతంగా ప్రసారమవుతోంది. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్ నడుస్తుండగా హిందీలో 18వ సీజన్ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది.ఒకప్పుడు హీరోయిన్గా..ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందట! ఈ జాబితాలో నటి శిల్ప శిరోద్కర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రతకు సోదరి అన్న విషయం తెలిసిందే! భ్రష్టాచార్(1989) సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్ కన్హయ్య, త్రినేత్ర, హమ్, ఖుదా గవా, ఆంఖెన్, గోపి కిషన్, మృత్యునాద్, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ షోలో ఎంట్రీ?తెలుగులో బ్రహ్మ మూవీలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టేసిన ఆమె పదేళ్ల గ్యాప్ తర్వాత 2013లో మళ్లీ సీరియల్స్‌లో కనిపించింది. ఇప్పుడు బుల్లితెరకు సైతం దూరంగా ఉంటున్న శిల్ప.. నిజంగానే బిగ్‌బాస్ షోలో అడుగుపెడుతుందా? లేదా? అనేది చూడాలి!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు, నమ్రత.
-
మహేశ్ బాబు కుమారుడి బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన నమ్రత
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ బర్త్ డే వేడులకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రిన్స్ ఫ్యామిలీ గౌతమ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలను నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ గౌతమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. ప్రస్తుతం మహేశ్‌బాబు దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించునున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను అందించారు. ఈ మూవీ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సీమంతం వేడుకల్లో నమ్రత.. షో కేస్ బొమ్మలా రకుల్ ప్రీత్!
బికినీలో రెచ్చిపోయిన సీనియర్ బ్యూటీ శ్రియ శరణ్బార్బీ డాల్‌లా అషూ రెడ్డి.. కాకపోతే ట్రోల్స్విచిత్రమైన వేషధారణలో యాంకర్ అనసూయటైట్ ఫిట్ డ్రస్సులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్సీమంతం వేడుకల్లో మహేశ్ భార్య నమ్రతశేఖర్ మాస్టర్‌కి హగ్గులిచ్చేస్తున్న రీతూ చౌదరిప్రగ్యా జైస్వాల్ హాట్ హాట్ పోజులు.. చూస్తే మతి పోవాల్సిందే View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో కలిసి ఇవాళ ఉదయాన్నే మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు అలిపిరి నుంచి కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు.కాగా.. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్లో సినిమా చేయనున్నారు. ఇప్పటికే కథను సిద్ధం చేయగా.. షూటింగ్‌కు సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ చిత్రానికి మహారాజ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. -
ప్రకృతి ఒడిలో సీతారామం బ్యూటీ.. రాజస్థాన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ చిల్!
ప్రకృతి ఆస్వాదిస్తోన్న సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. రాజస్థాన్‌లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ.. దసరా మూడ్‌లోనే కీర్తి సురేశ్.. కళ్లతోనే మాయ చేస్తోన్న పూనమ్ బజ్వా.. రెడ్ డ్రెస్‌లో శ్రద్ధాకపూర్ అందాలు.. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
దైవం మహేష్ రూపేణ.. వారి కోసం 'మహేశ్' ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా..?
మహేశ్‌బాబు అనగానే టక్కున గురొచ్చేది రాజకుమారుడు లాంటి అందం. ఐదుపదుల వయసు దగ్గరపడుతున్నా కూడా తన గ్లామర్‌తో చూపు తిప్పుకోనివ్వడు. నలుగురికి నచ్చింది ఆయనకు నచ్చదు. అందుకే టక్కరిదొంగలా అభిమానుల మనసు దోచేశాడు. నాన్న నుంచి నేర్చుకున్న పాఠాలతో ఒక్కడే తన జీవితానికి బంగారు బాటలు వేసుకున్నాడు. పేద చిన్నారులకు సాయం చేస్తూ వాళ్లింటి వాకిట్లో సిరిమల్లె చెట్టులా కనిపించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపించే మహేశ్ బాబు నేడు ఆగష్టు 9న తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..మహేశ్.. 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించాడు. ఇతడు పుట్టే నాటికే తండ్రి కృష్ణ 100 సినిమాలకు పైగా పూర్తి చేసి, ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఆరేళ్ల వయసులో మహేశ్ తన అన్నయ్య అయిన రమేశ్‌తో కలిసి విజయవాడ వెళ్లారు. అప్పట్లో దాసరి దర్శకత్వంలో 'నీడ' సినిమా రమేశ్ చేస్తున్నారు. అందులో ఓ కీలక పాత్రని మహేశ్‌కి తెలియకుండానే ఆయనపై తీశారు దాసరి. అలా బాల నటుడిగా మహేశ్ తెరంగేట్రం ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది. అప్పుడు మహేశ్ వయసు ఆరేళ్లు మాత్రమే.. తర్వాత నాన్న కృష్ణతో 'పోరాటం' సినిమాలో మహేశ్ నటించి, మెప్పించారు. అలా స్కూల్ హాలీడేస్ రాగానే షూటింగ్స్‌లో మహేశ్ పాల్గొనేవాడు. ఈ క్రమంలో బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం వంటి సినిమాల్లో ఆయన నటించారు. తర్వాత మహేశ్ స్కూల్‌కు వెళ్లడం తగ్గించాడు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అనే భయంతో ఇకపై సినిమాలు వద్దని, బుద్ధిగా చదువుకోవాలని ప్రిన్స్‌కు కృష్ణ చెప్పడంతో మళ్లీ చదువుపై ఫోకస్ పెట్టాడు. అలా లయోలా డిగ్రీ కాలేజీలో బీకామ్ వరకు చదువు పూర్తిచేసిన ప్రిన్స్ ఆపై మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్.. 'రాజకుమారుడు' సినిమాతో మహేశ్‌ను హీరోగా పరిచయం చేశారు. దైవం మహేశ్ రూపేణ'దైవం మానుష రూపేణ'.. అంటే దైవం ఎక్కడో లేదు.. 'మనిషి' రూపంలో మన దగ్గరే ఉందని అర్థం. ఎలాంటి లాభేక్ష లేకుండా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేపిస్తూ వారికి మరో జన్మ కల్పిస్తున్నారు మహేశ్. చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు. అలాంటి చిన్నపిల్లలకే పెద్ద సమస్య వస్తే.. వారిని కాపాడుకోవడానికి పేదరికం అడ్డొస్తే.. ఆ తల్లిదండ్రులు వేదన ఎలా ఉంటుందో ఊహించుకోలేం. ఆ బాధను గుర్తించిన మహేశ్ కష్టాల్లో ఉన్నవారికి దేవుడిలా సాయం చేయడంలో వెనకాడడు. అందుకే దైవం మహేశ్ రూపేణ అని ఆ తల్లిదండ్రులు అంటారు. పలు సేవా కార్యక్రమాల కోసం మహేశ్ తన సంపాదనలో ఏడాదికి 30 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆ మొత్తం సుమారు రూ. 50 కోట్లకు పైమాటే ఉండొచ్చన అంచనా ఉంది.చిన్నపిల్లలకు అండగా మహేశ్.. కారణం ఇదేకుటుంబానికే మహేశ్ బాబు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మహేశ్‌కు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఈ విషయంలో బయటి వారి పిల్లలు అయినా సరే.. వారికి ఏదైనా కష్టం వస్తే చూస్తూ ఉండే వ్యక్తి కాదు. ఆ మంచి మనసే ఎన్నో చిట్టి ‘గుండె’లకు ప్రాణం పోసింది. ఈ క్రమంలో సుమారు 3వేల మంది చిన్నారుల గుండెకు సంబంధించిన ఆపరేషన్స్‌ను ఉచితంగానే చేపించాడు. అందుకు ప్రధాన కారణం కూడా ఉంది. మహేశ్ తనయుడు గౌతమ్.. డెలివరీ సమయం కంటే ఆరువారాలు ముందే పుట్టడంతో పలు సమస్యలు ఎదుర్కొన్నాడు. అందుకు అవసరమైన చికిత్సను మహేశ్ చేయించారు. దాదాపు మూడు నెలలకి గౌతమ్ మామూలయ్యాడు. ఆయన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటన నేడు ఎంతోమంది చిన్నారుల జీవితాలను కాపాడుతుంది. తన వద్ద డబ్బు ఉంది కాబట్టి ఎంతైనా ఖర్చుపెట్టి పిల్లాడిని రక్షించుకున్నామని ఆయన తెలిపారు. అదే లేనివాళ్లకి ఇలా జరిగితే వారి పరిస్థితి ఏంటీ..? అని మహేశ్ బాధపడేవారు. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో మహేశ్ పంచుకున్నారు. పుట్టుకతో వచ్చే ఆ సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని నమ్రతతో కలిసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది వెంటనే ఆ నిర్ణయానికి నమ్రత రూపకల్పన చేశారు. మహేశ్ బాబు ఫౌండేషన్‌ను స్థాపించి ఇప్పటి వరకు సుమారు 3వేల మందికి పైగానే కోట్ల రూపాయాలు ఖర్చు చేసి వారికి మరో జన్మనిచ్చాడు. అలాంటి పిల్లలకు హైదరాబాద్, విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్నారు.ఆ పుస్తకమే సిగరెట్ మాన్పించిందిమహేశ్కు తరచూ పుస్తకాలు చదువుతూ ఉంటారు.. ఆపై బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా కాలక్షేపం కోసం చూస్తుంటారు. అయితే, ప్రతి దాని నుంచి కొంత స్ఫూర్తిపొందుతుంటారు. గతంలో మహేశ్ బాగా సిగరెట్ తాగే అలవాటు ఉండేదని దానిని మానేద్దామంటే కుదరలేదని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఎలెన్ కార్ రాసిన 'ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్' అనే పుస్తకం చదివాక సిగరెట్‌ని మాత్రం ముట్టుకోలేదని ఓ ఇంటర్వ్యూలో మహేశ్ చెప్పారు. తన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటానని కూడా ఆయన తెలిపారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చెక్కర పదార్థాలు తీసుకోనని ఆయన పేర్కొన్నారు.టాలీవుడ్లో తిరుగులేని రికార్డ్స్మహేశ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల్లో నటించలేదు. ఆయన సినిమాలు కనీసం రెండు మూడు భాషల్లో కూడా విడుదల కాలేదు. కేవలం తెలుగులోనే విడుదలయ్యాయి. ఈ క్రమంలో కేవలం టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగేసి ఆయన రికార్డ్స్‌ను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా పాన్ ఇండియా చిత్రాల సరసన నిలబడ్డాయి. మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ తెలుగులోనే విడుదలై రూ. 214 కోట్ల వసూళ్లను సాధించింది. సరిలేరు నీకెవ్వరు రూ. 260 కోట్లు, మహర్షి రూ. 170 కోట్లు, గుంటూరు కారం రూ. 200 కోట్లు, భరత్ అనే నేను రూ. 187 కోట్లు రాబట్టింది. ఒక్క భాషలోనే విడుదల అయితేనే ఇలాంటి కలెక్షన్లతో సత్తా చాటితే అదే పాన్ ఇండియా రేంజ్లో బొమ్మ పడితే ఎలా ఉంటుందో ఊహకే వదలేయ వచ్చు అని చెప్పవచ్చు.ఈ ప్రత్యేకతలే మహేశ్‌ను అభిమానించేలా చేస్తాయిమొదటి సినిమా రాజకుమారుడుతోనే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డ్‌ను అందుకున్నారు.ఉత్తమ నటుడిగా నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు చిత్రాలకు నంది పురస్కారాలు గెలుచుకున్నారు.వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వారి మైనపు విగ్రహాలు 'మేడమ్ టుస్సాడ్స్'లో కొలువుదీరుతాయనే విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కించుకున్న వారి జాబితాలో మహేశ్ ఒకరు.సుమారు 25 ఏళ్లుగా సినీ పరిశ్రమలో మహేశ్ ఉన్నారు. ఇన్నేళ్లలో ఆయన ఒక్క రీమేక్ చిత్రంలోనూ నటించకపోవడం రికార్డ్.గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌ను మహేశ్ పరిచయం చేశారు. 'శ్రీమంతుడు'ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు.మోపిదేవి పెదప్రోలులో కాకర్లపూడి రాజేష్ అని అభిమాని పిల్లలను దత్తత తీసుకున్న మహేశ్.. వారి పేర్లు కూడా అర్జున్, అతిథి, ఆగడు ఇలా మహేశ్ సినిమా పేర్లనే ఆ అభిమాని పెట్టుకోవడం విశేషం.మహేశ్ బాబుకు వచ్చే సంపాదనలో 30 శాతం డొనేషన్స్కే ఉపయోగిస్తారు . pic.twitter.com/ApOAaJwb1d#HBDSuperStarMahesh#CelebrateSSMB #MaheshBabu𓃵— lucky (@lucky_dhfm7) August 8, 2024Happy Birthday Super Star @urstrulyMahesh Anna 🛐🫶🏻A Man With Golden Heart 🙇🏻💓#HBDSuperStarMahesh pic.twitter.com/E9ok0opj1o— లోకేష్ ™ 🐆 (@LokEshDidS) August 8, 2024 -
పేద విద్యార్థి కలలకు ఊపిరి పోసిన సితార
పేదలకు చేతనైనంత సాయం చేయడంలో ఘట్టమనేని సితార ఎప్పుడూ ముందు ఉంటుంది. తండ్రి మహేశ్ బాబు అడుగుజాడల్లో సితార కూడా పేదలకు అనేకసార్లు సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంది. సితా వయసులో చిన్నదే అయినా.. తన మనసు మాత్రం చాలా విశాలమైనది అంటూ నెటిజన్లు కూడా ఎప్పుడూ పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా సితార తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్ చదవాలనుకున్న పేద విద్యార్థికి సాయం చేసి అండగా నిలిచింది.ఈ విషయాన్ని నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టా ద్వారా ఇలా పంచుకున్నారు. 'దినసరి కూలీ తన కూతురు నవ్యను చదివించేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాడు. ఆమె కూడా NEET పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు సాధించింది. ఆమె డాక్టర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి.. తన కలలను సాధించే మార్గంలో కష్టపడి చదివి విజయం సాధించింది. అయితే, ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అడ్డుగా నిలిచింది. దీంతో మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా నవ్యశ్రీకి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. మెడికల్ విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు కాలేజీ, హాస్టల్ ఫీజులన్నీ ఇక నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ అందిస్తోంది. మా లిటిల్ ప్రిన్సెస్ (సితార) తన పుట్టినరోజును కూడా నవ్యతో జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెను అభినందించడంతో పాటు కాబోయే డాక్టర్‌కు ల్యాప్‌టాప్, స్టెతస్కోప్‌ను బహుమతిగా ఇచ్చింది.' అని నమ్రత తెలిపింది.2024లో జరిగిన నీట్ పరిక్షలో నవ్య 605 మార్కులు సాధించింది. సాధారణ కళాశాలలో చదవి తన ప్రతిభతో టాప్ స్కోర్ సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. కానీ, పుస్తకాలు, హాస్టల్ ఫీజు, కనీస కాలేజీ ఫీజులు కూడా చెల్లిచలేని స్థితిలో నవ్య కుటుంబం ఉంది. దీంతో మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను నవ్య సంప్రదించింది. ఆమె కలలకు మహేష్ బాబు ఫౌండేషన్ ఊపిరి పోసింది. రూ. 1,25,000 చెక్కుతో పాటు తన మెడిసిన్ విద్య పూర్తి అయ్యే వరకు తమ సంస్థ నుంచే డబ్బు అందుతుందని ఘట్టమనేని కుటుంబం భరోసా కల్పించింది. సితార పుట్టినరోజును ఆమెతో జరుపుకోవడం మహేశ్ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. View this post on Instagram A post shared by Mahesh Babu Foundation (@mbfoundationorg) -
సితార పాప బర్త్ డే.. మహేశ్, నమ్రత స్పెషల్ విషెస్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు పేరు చెప్పగానే అతడి ఫ్యామిలీ కూడా గుర్తొస్తుంది. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్-సితార కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటారు. గౌతమ్ పెద్దగా కనిపించడు గానీ సితారకి మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా అందరూ విషెస్ చెబుతున్నారు. కానీ పేరెంట్స్ మహేశ్-నమ్రత కాస్త ప్రత్యేకంగా చెప్పారు.(ఇదీ చదవండి: మొన్న సుకుమార్.. ఇప్పుడు త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో కలిసి!)మహేశ్ కూతురు సితార తాజాగా 12వ వసంతంలోకి అడుగుపెట్టేసింది. ఈ క్రమంలోనే తండ్రి మహేశ్ బాబు హార్ట్‌ఫుల్‌గా విషెస్ చెప్పాడు. క్యూట్ ఫొటో పోస్ట్ చేసి.. 'హ్యాపీ 12 మై లిటిల్ వన్ సితార. నువ్వు కోరుకున్నది నీకు దక్కాలని కోరుకుంటున్నాను. లవ్ యూ మోర్ అండ్ మోర్. హ్యాపీ బర్త్ డ్ సన్ షైన్' అని మహేశ్ బాబు రాసుకొచ్చాడు.తల్లి నమ్రత కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది సితార ఫొటోలని కలిపి ఓ వీడియోగా చేసి మరీ కూతురికి పుట్టినరోజు విషెస్ చెప్పింది. 'హ్యాపీ బర్త్ డే టూ మై లిటిల్ ట్రావెల్ కంపానియన్. ఎన్నో దేశాలు, మర్చిపోలేని గుర్తులు. నీ వల్ల ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ ఆల్వేజ్' అని నమ్రత తన ప్రేమని అక్షరాలుగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రి కొత్త సినిమా ఎలా ఉందంటే?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
అనంత్ - రాధిక పెళ్లి.. స్పెషల్ అట్రాక్షన్‌గా మహేశ్‌బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
లండన్‌లో మహేష్ ఫ్యామిలీ మేజికల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్లో పరిచయం అవసరంలేని అందమైన జంట ప్రిన్స్ మహేష్ బాబు, నటి నమ్రతా శిరోద్కర్ది. పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పి నమ్రత కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. వీరి ముద్దుల తనయ సితార నటిగా, మోడల్‌గా ఇప్పటికే తన హవాను చాటుకుంటోంది. అయితే తాజాగా నమ్రత వర్కౌవుట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. దీంతో వదినమ్మ ఎందుకింత కసరత్తు చేస్తోందంటూ ఫ్యాన్స్ చేస్తున్న ఊహాగానాలు వైరల్‌గా మారాయి.2004 నుండి పెద్ద స్క్రీన్కు దూరంగా ఉన్నారు నమ్రత. అయితే సోషల్ మీడియా అభిమానులకు అప్డేట్స్ మాత్రం అస్సలు మర్చిపోదు. భర్త , సూపర్ స్టార్ మహేష్ బాబు, పిల్లలు సితార గౌతమ్ గురించి తరచుగా పోస్ట్ చేస్తుంది. తాజాగా మాజీ మిస్ ఇండియా ఇటీవల ఒక రీల్‌ను షేర్ చేసింది. ఆమె భారీ వర్కౌట్ సెషన్ చూసి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.ఫిట్నెస్ కోసం ఆమె చేస్తున్న పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘‘బలమైన మహిళ!!’’ ‘‘సూపర్ వుమన్’’, , ‘‘వావ్’’, ‘‘బ్యూటిఫుల్’’ , ‘‘సూపర్ మామ్’’ అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) కాగా నమ్రతా గతంలో వివిధ సందర్భాలలో వర్కౌట్ వీడియోలను షేర్ చేసింది. గత ఏడాది మేలో, ట్రైనర్ కుమార్ మన్నవతో కలిసి హార్డ్‌కోర్ వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఆమె మళ్ళీ నటించనుందనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. -
Mahesh Babu Europe Vacation Photos: యూరప్ వేకేషన్లో ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు
-
మంచుతో మహేశ్ ఫ్యామిలీ ఆటలు.. ఇంతకీ హీరో ఎక్కడ? (ఫోటోలు)
-
టాలీవుడ్ ప్రిన్స్ సందడి.. ఆ హిట్ సినిమా చూసేందుకే!
గుంటూరు కారం మూవీతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించాడు ప్రిన్స్ మహేశ్ బాబు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించారు. గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్.. తదుపరి చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు స్క్రిప్ట్ రెడీగా ఉన్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు హైదరాబాద్‌లో సినిమా థియేటర్లో సందడి చేశారు. ఇటీవల రిలీజైన మలయాళ డబ్బింగ్ హిట్ సినిమా ప్రేమలు చిత్రాన్ని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో వీక్షించారు. తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి థియేటర్‌కు వచ్చారు. సినిమా చూసి వెళ్తున్న వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ప్రేమలు చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. #TFNExclusive: Super 🌟 @urstrulyMahesh along with #NamrataShirodkar spotted near AMB Cinemas!📸#MaheshBabu #GunturKaaram #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/X1SJYekSt4 — Telugu FilmNagar (@telugufilmnagar) March 10, 2024 -
వెడ్డింగ్ యానివర్సరీ : మహేష్‌కు, నమ్రత విషెస్, వైరల్ పోస్ట్
టాలీవుడ్లో మోస్ట్ లవబుల్ అండ్ బెస్ట్ పవర్ కపుల్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ గుర్తొస్తారు. ఈ రోజు వారి 19వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నమ్రతా ఒక అందమైన పప్పీల జంట వీడియోతో అందంగా విషెస్ చెప్పింది. దీంతో ఫ్యాన్స్ అంతా శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు. ఫిబ్రవరి 10, 2005న ఈ లవబర్డ్స్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ముద్దుల తనయ సితార తనదైన స్టయిల్లో దూసుకుపోతూ ఘట్టమనేని కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతోంది. అంటు గౌతమ్ కూడా భిన్న రంగంలో తానేంటో నిరూపించుకున్నాడు. కరీయర్ పీక్ స్టేజ్‌లో ఉండగా పెళ్లి చేసుకున్న నమ్రత ప్రస్తుతం నటనకు గుడ్‌బై చెప్పి కుటుంబ జీవితంపై దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికపుడు విశేషాలను పంచుకుంటూ ఉంటుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సితార పేరుతో మోసాలు.. పోలీసులకు మహేశ్ బాబు టీమ్ ఫిర్యాదు
టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్‌బాబు కూతురు సితార పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లుకు పోలీసులు ఫిర్యాదు అందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ లింకులను ప్రజలకు పంపుతున్నట్లు ఘట్టమనేని మహేశ్ బాబు టీమ్ (GMB) గుర్తించింది. అలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని వారు తెలిపారు. సితారకు ఉన్న ఏకైక ఇన్స్టాగ్రామ్ లింక్‌ను అక్కడ చేర్చుతూ మాదాపుర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెలబ్రిటీల పేరుతో అనుమానస్పద లింకులు వస్తే అందరూ అప్రమత్తంగా ఉండాలని జీఎంబీ తెలిపింది. ఈ అంశాన్ని తాజాగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ విడుదల చేశారు. అందులో ఇలా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఘట్టమనేని ఫోటోలు ఉపయోగించి కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బు కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గుర్తుతెలియని కొందరు ఘట్టమనేని సితార పేరుతో కొన్ని ట్రేడింగ్, పెట్టుబడి లింక్‌లను పంపుతున్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించిన తక్షణమే సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. మహేష్ బాబు టీమ్ ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అనుమానస్పద నోటిఫికేషన్‌కు స్పందించవద్దని అభిమానులకు మహేష్ టీమ్ సూచిస్తుంది. త్వరలోనే ఆ సైబర్ నేరగాళ్లను పట్టుకుంటామంటున్న సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. (సితార, నమ్రతకు సంబంధించిన ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ లింక్‌లు గమనించగలరు) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
'దమ్ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్.. మిలియన్లకొద్ది వ్యూస్
టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో ఎక్కువగా వినిపించే పేరు ఘట్టమనేని సితార. మహేశ్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వీడియోలతో పాపులరైన సీతూ పాప.. మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎప్పుడూ స్పెషలే అని చెప్పవచ్చు. నటనతో పాటు పదిమందికి సాయం చేయడంతో తండ్రి వారసత్వాన్ని సితార ముందుకు తీసుకెళ్తుంది. భవిష్యత్‌లో సితార కూడా సినిమాల్లోకి వస్తుందని నమ్రత ఇప్పటికే పలుమార్లు చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సితార కూడా చదువుతో పాటు క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. అప్పుడప్పుడు పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు ఆమె డ్యాన్స్ చేస్తూ అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది. తాజాగా 'గుంటూరు కారం' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్‌కు సితార అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు రెండు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 'గుంటూరు కారం' సినిమాలోని 'దమ్ మసాలా' పాటకి ఆమె దుమ్మురేపే డాన్సు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో సితార డాన్సుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. గుంటూరు కారంలో హీరోయిన్ శ్రీలీలకు ఏ మాత్రం తగ్గకుండ సితార డ్యాన్స్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. సీతూ పాప డ్యాన్స్ త్రీ డీలో కనిపిస్తుందని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. సితార అదరగొట్టిన డ్యాన్స్ వీడియోకు ఇప్పటి వరకు 50 లక్షల వ్యూస్ రావడం విశేషం. -
గడ్డ కట్టించే చలిలో మహేశ్ బాబు.. నమ్రత ఎమోషనల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కొద్దిరోజుల క్రితం జర్మనీ వెళ్లారు. గుంటూరు కారం సినిమా విడుదల తర్వాత ఆయన ఆక్కడకు వెళ్లడం జరిగింది. జర్మనీలోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ 'హ్యారీ కొనిగ్'ను మహేష్ కలుసుకున్నారు. ఆయన బాడీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన డాక్టర్. ఆయన్ను ఇప్పటికే పలుమార్లు కలుసుకున్న మహేశ్.. ప్రస్తుతం ఆయనతో పాటుగా జర్మనీ అడవుల్లో ట్రావెల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ ఫొటోలను ఆయన షేర్ చేశారు. జర్మనీలోని బాడెన్ ప్రాంతంలో మహేశ్, తన ఫిట్నెస్ డాక్టర్ హ్యారీ కొనిగ్‌తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ పర్వతంపై ట్రెక్కింగ్ చేశారు. గడ్డ కట్టించే చలిలో డాక్టర్ హ్యారీతో కలిసి మహేశ్ పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. ట్రెక్కింగ్ విషయం గురించి చెబుతూ మహేష్ ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమా కోసం మహేశ్ ఇలా కష్టపడుతున్నారని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి-మహేశ్ సినిమా SSMB29 ఎక్కువగా అటవి ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ బాబు పోస్ట్ చేసిన ఈ ఫోటోలను చూసిన ఆయన సతీమణి నమ్రత.. 'నిన్ను ఎంతో మిస్సవుతున్నా' అంటూ లవ్ ఎమోజిస్‌తో ఎమోషనల్‌గా కామెంట్ చేశారు. నమ్రత చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. . గుంటూరు కారం చిత్రం సమయం నుంచే ఆయన SSMB29 కోసం కసరత్తులు ప్రారంభించారు. ఆ వర్కౌట్ ఫోటోలు అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఆయన పోస్ట్ చేస్తుంటారు కూడా. ఈ వేసవి నుంచి షూటింగ్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
నమ్రతకు మహేశ్ బాబు స్పెషల్ విషెస్!
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో ప్రిన్స్ మహేశ్ బాబు- నమ్రత శిరోద్కర్ జంట ఒకరు. ఇవాళ నమ్రత శిరోద్కర్ 53వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన భార్యకు స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ అంటూ.. లవ్ సింబల్ జత చేస్తూ ట్వీట్ చేశారు. నా జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. సందడి చేయనుంది. సినిమా రిలీజ్‌కు ముందు గుంటూరులో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మహేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి నుంచి నాకు మీరే అన్నీ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో నమ్రత పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. Happy birthday NSG…♥️♥️♥️ Grateful for another year filled with love and togetherness. Thank you for making my every day better 😍😍😍 Have a rocking 2024!! pic.twitter.com/uy6gK8AiWs — Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024 -
Namrata Shirodkar Photos: ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేస్తున్న నమ్రత శిరోద్కర్ (ఫోటోలు)
-
థియేటర్ వద్ద పరిస్థితి ఇదీ అంటూ వీడియో షేర్ చేసిన నమ్రత
త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన వరకు భారీగా బజ్ క్రియేట్ అయింది. రికార్డు స్థాయిలో విడుదలకు రెడీగా ఉన్న గుంటూరు కారం ట్రైలర్ మరికొంత సమయంలో విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ లక్షల వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని గంటల్లో ట్రైలర్ విడుదల కానున్నడంతో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఒక ఫ్యాన్ బేస్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో నేడు గుంటూరు కారం ట్రైలర్ విడుదల కానుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు అక్కడ ఏర్పాటు చేశారు. దారి వెంట పోస్టర్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమన్ మ్యూజిక్కు స్టెప్పులేస్తూ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సుదర్శన్ థియేటర్ వద్ద మహేశ్ బాబు భారీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ హంగామా మొదలైంది. జనవరి 12న గుంటూరు కారం సినిమా చూసేందుకు వారందరూ సుదర్శన్ థియేటర్‌కు వస్తున్నట్లు నమ్రత తెలిపారు. గుంటూరు కారం చిత్రం నుంచి ఇటీవల వచ్చిన 'కుర్చీని మడతపెట్టి' సాంగ్ విపరీతంగా పాపులర్ అయింది. ఈ పాటలో మహేష్ బాబు, శ్రీలీల ఊర నాటు స్టెప్లు అదిరిపోయాయి. థియేటర్లో ఈ పాట చూస్తే సూపర్ స్టార్ అభిమానులకు పూనకాలే.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
స్పెషల్ ఫోటోను షేర్ చేసిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో కలర్‌ఫుల్ ఫోటోను షేర్ చేశారు. 2024 కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబంతో సహా దుబాయ్‌లో జరుపుకున్నారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ.. తాజాగా తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు పోస్టర్‌తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ) మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నమ్రతతో మహేష్ ఉన్న ఆ ఫోటో ఎంతో ఆప్యాయతతో కూడుకొని ఉంది. ఆ చిత్రంలో నమ్రత ఎంతో సంతోషంగా మహేష్ భుజంపై తన తలను ఉంచింది. ప్రేమతో నిండిన ఆ చిత్రంతో పాటుగా 2024 సంవత్సరానికి గాను మహేష్ ఆకాంక్షలను ప్రతిబింబించే శీర్షిక ఉంది. 'సహజత్వం. నవ్వు. ప్రేమ. సాహసం. ఎదుగుదల. #హ్యాపీ న్యూ ఇయర్ #2024 ❤️' అని మహేష్ ఆ ఫోటోతో పాటు షేర్ చేశారు. అందుకు నమ్రత కూడా వెంటనే తన ప్రేమను ప్రతిస్పందిస్తూ, 'లవ్ యు టు ది మూన్ అండ్ బ్యాక్ ♥️♥️♥️♥️ ఎప్పటికీ♥️♥️' అని తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ఆరాధించే జంటలలో మహేష్- నమ్రత ముందు వరుసలో ఉంటారు. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ అనంతం. దీంతో మహేష్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులు ఇన్‌స్టాలోకి చేరిపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్‌రాజ్, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
రీనా మల్టీ డిజైనర్ స్టోర్‌ను ప్రారంభించిన నమ్రత శిరోద్కర్ (ఫోటోలు)
-
Mahesh Babu- Namrata Shirodkar: ప్రముఖ వ్యాపారవేత్త బర్త్ డే వేడుకల్లో మహేశ్ బాబు, నమ్రత (ఫొటోలు)
-
నేడు కృష్ణ తొలి వర్ధంతి.. మరో సాయానికి శ్రీకారం చుట్టిన నమ్రత
ఆంధ్రా జేమ్స్‌బాండ్, లెజెండరీ హీరో, సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని వీడి ఏడాది గడిచిపోయింది. నేడు ఆయన తొలి వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన వారసుడిగా ప్రిన్స్ మహేశ్ బాబు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని ఘట్టమనేని అనే పేరుకు గౌరవాన్ని తీసుకొచ్చారు. వారి కుటుంబంలో కృష్ణ గారి నుంచి మహేశ్, సితార,నమ్రత,గౌతమ్ అందరిలో ఒక పాయింట్ కామన్‌గా కనిపిస్తుంది. అదేమిటంటే..? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం. పేదల భవిష్యత్ కోసం తమ వంతు సాయం చేయడం ఇవన్నీ ఘట్టమనేని కుటుంబంలో కనిపిస్తాయి. కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా తాజాగా నమ్రత మరో బృహత్కార్యాన్ని తలపెట్టారు. పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు వారు ముందుకొచ్చారు. ఇప్పటికే ఘట్టమనేని వారి సొంత ఊరు అయిన బుర్రిపాలెంలో పేదల కోసం ఒక స్కూల్‌ను నిర్మించారు. ఇలాంటి లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో నిర్వహిస్తున్నారు. సుమారు 3వేలకు పైగా చిన్నారుల గుండెకు సంబంధించిన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని నమ్రత ఇలా ప్రకటించారు. మామయ్య గారి పేరుతో వారికి సాయం: నమ్రత మామయ్య గారి వర్దంతి సందర్భంగా.. ఆయన పేరు మీద ఒక స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే నలుగురు చురుకైన పేద విద్యార్థులను ఎంపిక చేశాం. ఇక నుంచి వారిని చదివించే బాధ్యతను ఎంబీ ఫౌండేషన్ తీసుకుంటుంది. వారు ఎంత వరకు చుదువుకున్నా.. అందుకు అయ్యే పూర్తి ఖర్చులు మేమే చూసుకుంటాం. ప్రస్తుతం నలుగురు విద్యార్థులను సెలక్ట్ చేశాం. ఈ కార్యక్రమంలో మామయ్య ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం.' నేడు నలుగురు విద్యార్థులు రేపటి రోజు ఎంతమంది అవుతారో చెప్పలేం. మాకు చేతనైనంత వరకు పేద విద్యార్ధులను చదవించి వారి అందమైన భవిష్యత్‌కు దారి చూపించాలనేది మా లక్ష్యం.' అని నమ్రత తెలిపారు. ఘట్టమనేని ఫ్యామిలీలో సాయం చేయడం, సాటి వ్యక్తిని ఆదుకోవడం ఈనాటిది కాదు. గతంలో తన సినిమాలతో నష్టపోయిన నిర్మాతలకు కృష్ణ గారు మరో సినిమా ఛాన్స్ ఇచ్చేవారు. అందుకు ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా ఆయన నటించేవారు. ప్రస్తుతం ఆయన వారసుడు కూడా మరో అడుగు ముందుకేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే.. ఇండస్ట్రీలో కూడా ఎన్నో గొప్ప పనులు చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరినో ఆదుకున్నారు. తండ్రిని చూసి ఎన్నో మంచి గుణాలను మహేశ్ బాబు కూడా అలవరుచుకున్నారు. మహేశ్‌ను చూసి సితార,గౌతమ్ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పేదలు, పేద పిల్లలను ఆదుకోవడంలో వారు ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగానే తాజాగా స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని నమ్రత ప్రకటించారు. -
Namrata Shirodkar Photos: మహేశ్‌బాబు భార్య నమ్రత దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మెగాస్టార్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్.. స్టార్ హీరోలంతా ఇక్కడే!
వెలుగులు విరజిమ్మే దీపావళి పండగను మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. కేవలం కుటుంబసభ్యుల మధ్యే కాకుండా ఇండస్ట్రీలోని అత్యంత దగ్గరి స్నేహితులను కూడా పార్టీకి పిలిచారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేశ్ తమ కుటుంబంతో పార్టీకి విచ్చేసి సందడి చేశారు. క్లీంకార పుట్టాక తొలి దీపావళి క్లీంకార పుట్టిన తర్వాత రామ్‌చరణ్- ఉపాసన దంపతులు జరుపుకుంటున్న తొలి దీపావళి కావడంతో ఈసారి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఇంట్లో ప్రత్యేక విందు పార్టీ ఇచ్చారు. దీనికోసం స్టార్ హీరోలు కుటుంబసమేతంగా రావడం విశేషం. ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో, మహేశ్ బాబు.. నమ్రతతో కలిసి హాజరయ్యారు. పార్టీలో ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. నలుగురు హీరోలు ఒకేచోట ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నలుగురు హీరోలు ఒకేచోట కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ పార్టీకి మంచు లక్ష్మి సైతం హాజరైంది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే మహేవ్బాబు గుంటూరు కారం, రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. వెంకటేశ్ సైంధవ్ , ఎన్టీఆర్ దేవర సినిమాలతో బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్.. ఏ సినిమాకో తెలుసా? -
హైదరాబాద్‌లో స్వదేశ్ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన నమ్రతా(ఫోటోలు)
-
నమ్రతా ఎంత అదృష్టవంతురాలంటే..!
-
నాకు మా ఆయన పక్కనుంటే చాలు: నమ్రతా శిరోద్కర్
-
శారీలో నమ్రతా శిరోద్కర్.. దేవకన్యలా దివి.. నదిలో మాళవిక!
►శారీలో నమ్రతా శిరోద్కర్ హోయలు ►వైట్ డ్రెస్సులో దేవకన్యలా దిగొచ్చిన దివి ►నదిలో చిల్ అవుతోన్న మాళవిక మోహనన్ ►గ్రీన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా పోజులు ►సంప్రదాయంగా ముస్తాబైన అత్తారింటికీ దారేది భామ ►ది కేరళ స్టోరీ భామ ఆదా శర్మ అదిరిపోయే లుక్స్ View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) -
జ్యువెలరీ షాప్‌ను ప్రారంభించిన నమ్రతా, మహేశ్ బాబు ( ఫొటోలు)
-
అది నా డీఎన్ఏలోనే ఉంది.. ఎమోషనల్ అయిన సితార
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని.. తాత, తండ్రి పేరు నిలబెడుతూ.. ఘట్టమనేని వారసురాలిగా దూసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఆమె పేరొక ప్రభంజనం కాబోతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురి ప్రముఖల పిల్లలకు భిన్నంగా తన మార్క్‌ను చూపిస్తుంది. అలా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను కూడా సొంతం చేసుకుంది. సామాజిక సేవలో నాన్న బాటలోనే నడుస్తానని చెప్పినట్లుగానే తన అడుగులు పడుతున్నాయి. (ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) శుక్రవారం నేషనల్ సినిమా డే సందర్భంగా సితార ఒక ఫోటోతో పాటు కొన్ని విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన దృష్టిలో సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ కాదంటూ సితార పేర్కొంది. సినిమా అనేది తన డీఎన్ఏలోనే ఉందని ఆమె తెలిపింది. 'లెజండరీ, ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నాన్న ఎలాగైతే తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నారో.. నేను కూడా అంతే. నాన్నే నా స్ఫూర్తి.' అంటూ సితార ఎమోషనల్ పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్ అయిన తమన్నా..) ప్రస్తుతం ఇదీ నెట్టింట వైరల్‌గా మారింది. వయసులో సితార చిన్నపిల్ల అయినా ఆలోచనలు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చలనచిత్ర రంగంలోకి తప్పకుండా అడుగుపెడతానని సితార గతంలో తెలిపిన విషయం తెలిసిందే.. భవిష్యత్‌లో తాను సినిమాల్లో నటిస్తానని, సినిమా రంగంలో తనకూ ఆసక్తి ఉందని ఆమె తెలిపింది. View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
కూకట్‌పల్లిలో నెక్సస్ మాల్లో సందడి చేసిన మహేశ్‌బాబు సతీమణి నమ్రత, కూతురు సితార (ఫొటోలు)
-
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: నమ్రత
నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబును ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. మహేశ్, నమ్రతకు సితార, గౌతమ్ జన్మించారు. సామాజిక సేవలోనూ ముందుండే నమ్రత తాజాగా తన కుమారుని గురించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. నమ్రత ఇన్‌స్టాలో రాస్తూ.. 'నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రెయిన్బో ఆస్పత్రిలోని పిల్లలను కలవడం సంతోషంగా ఉంది. చికిత్స తీసుకుంటున్న పిల్లలతో కలిసి.. క్యాన్సర్ బారిన పడిన పిల్లల్లో గుండె ధైర్యాన్ని నింపడం చూస్తుంటే గర్వంగా ఉంది. వాళ్ల కోసం బహుమతులు తీసుకెళ్లడం.. చిరునవ్వులను చిందించే చిన్నారులతో సరదాగా ఉండడం. ఇలా చేయడం వల్ల చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకుంటుంటారు. వాళ్లకు అండగా నిలుస్తున్నందుకు గౌతమ్‌కు ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వావ్ గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. మహేశ్ బాబు ఫౌండేషన్‌తో రెయిన్బో ఆస్పత్రి కలిసి పని చేస్తోంది. ఎంబీ ఫౌండేషన్ సహకారంతో చిన్న పిల్లలకు గుండెకు సంబంధించిన ఆపరేషన్స్ ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడు ఆదే బాటలో ఆయన కుమారుడు గౌతమ్ కూడా చేరిపోయారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులను ఆసుపత్రికి వెళ్లి పలకరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ రూట్లోనే గౌతమ్.. అదీ చిన్న వయసులో
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అయితే సినిమాలు చేస్తాడు. లేదంటే కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటాడు. మహేశ్ పిల్లల్లో సితార సందడి చేస్తూనే ఉంటుంది. గౌతమ్ మాత్రం చాలా సైలెంట్. పెద్దగా బయట కనిపించడు. అలాంటిది ఇప్పుడు ఓ పనిచేసి తల్లిదండ్రులు పొంగిపోయేలా చేశాడు. ఈ విషయమై నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెగ ఆనందపడిపోతుంది. (ఇదీ చదవండి: బర్త్‌డే స్పెషల్.. టాలీవుడ్లో ఆ రికార్డులన్నీ నాగార్జునవే) హీరోగా మహేశ్‌బాబు హిట్, ఫ్లాఫ్స్ ఉండొచ్చు కానీ ఓ మనిషిగా మాత్రం ఇతడిని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఫౌండేషన్ తరఫున ఎంతోమంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లోనే గౌతమ్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహేశ్ ఫౌండేషన్ తరఫున చికిత్స పొందుతున్న పేషెంట్స్ తో గౌతమ్ ముచ్చటించాడు. ఈ పిక్స్‌ని నమ్రత ఇన్ స్టాలో షేర్ చేశారు. 'చిల్డ్రన్ హాస్పిటల్ కు గౌతమ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇలా వచ్చి సందర్శించాడు. ఎంబీ ఫౌండేషన్, రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్స్ కలిసి ఇలా చిన్నారులకు ఫ్రీగా వైద్యం అందిస్తోంది. గౌతమ్ కూడా ఈ కార్యక్రమంలో ఓ భాగస్వామినే. ఇలా ఆంకాలజీ, కార్డియో వార్డుల్లో పిల్లలతో కలిసి ముచ్చటించాడు. వారి ముఖంలో నవ్వు తీసుకొచ్చాడు. వారికి నయమవుతుందని భరోసా ఇచ్చాడు' అని నమ్రత పోస్టులో పేర్కొంది. కొడుకుని చూసి తెగ గర్వపడుతోంది. (ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్‌బాబు నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ అదే!: నమ్రత
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే! వంశీ(2000) సినిమాతో మొదలైన వీరి స్నేహం సినిమా ముగిసేసరికల్లా ప్రేమగా మారింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా వీరి మనసులను మాత్రం ఒక్కటి చేసింది. ముందు నమ్రత తన మనసులోని ప్రేమను బయటపెట్టగా.. అప్పటికే తనపై చెప్పలేనంత ప్రేమను దాచుకున్న మహేశ్ వెంటనే ఓకే చెప్పాడు. పెద్దలను ఒప్పించి మరీ వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది నమ్రత. షాపింగ్ అంటే ఇష్టముండదే! పిల్లలు సితార, గౌతమ్‌లను చూసుకోవడంతో పాటు మహేశ్ బిజినెస్ వ్యవహారాలు సైతం చూసుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లిన నమ్రత ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నాకు పెద్దగా నగలేమీ ఇష్టముండదు. చాలావరకు సింపుల్‌గానే ఉండటాన్ని ఇష్టపడతాను. షాపింగ్ కూడా అంత ఇష్టముండదు. మహేశ్‌బాబు నాకు ఇచ్చిన మొదటి బహుమతి వెడ్డింగ్ రింగ్. ఇప్పటికీ అది నాతోనే నేను ఇప్పటివరకు అందుకున్న ఉత్తమమైన బహుమతుల్లో ఒకటి మా అమ్మ ఇచ్చిన బంగారు ఉంగరం. 8 ఏళ్ల వయసులో అమ్మ నాకు సాయిబాబా ఉంగరం ఇచ్చింది. ఇప్పటికీ నేను దాన్ని ధరిస్తున్నాను. ఇకపోతే మహేశ్‌బాబుతో కలిసి నటించబోతున్నా, రీఎంట్రీ ఇవ్వనున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలే సితార ఓ గోల్డ్ యాడ్ షూటింగ్లో పాల్గొని అందరినీ సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే! ఆ యాడ్‌కు సంబంధించిన చిత్రాలను న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ఇది చూసి మహేశ్‌బాబు ఎంతగానో సంతోషించాడు. చదవండి: ఈ శుక్రవారం ఓటీటీ రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లివే -
మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు రాజమౌళి మూవీ కోసం ఇప్పటినుంచి ఫిజికల్‌గా సరికొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. మరోవైపు కూతురు సితార కూడా యాడ్స్ లో నటిస్తోంది. ఇలా అంతా హ్యాపీగా ఉన్న ఈ ఫ్యామిలీలో తాజాగా విషాదం నెలకొంది. ఈ విషయమై కన్నీళ్లు పెట్టుకున్న సితార.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్ కామెంట్స్ వైరల్) విషాదం అంటే మనుషులు ఎవరికీ ఏం కాలేదు. దాదాపు ఏడేళ్ల నుంచి మహేశ్ ఇంట్లో ఫ్లూటో అనే కుక్కని పెంచుకుంటున్నారు. ఇప్పుడు అది చనిపోయింది. ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన సితార.. పప్పీతో బాండింగ్ ని గుర్తు చేసుకుని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీనికి తల్లి నమ్రత కామెంట్ పెట్టింది. 'ఫ్లూటో ఎప్పటికీ మన గుండెల్లో ఉంటుంది' అని రాసుకొచ్చింది. అలానే తన ఖాతాలోనే ఫ్లూటో చనిపోవడంపై పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే మహేశ్ అభిమానులు, సితారని ఓదార్చేలా కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) (ఇదీ చదవండి: ఏపీలో పవన్ పొలిటికల్ భవిష్యత్‌పై మంచు విష్ణు కామెంట్!) -
మహేశ్ - నమ్రత లవ్ మ్యారేజ్.. మొదట ప్రపోజ్ చేసింది ఎవరంటే..!
వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి.. నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన టాలీవుడ్ జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత ఒకరు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఈ జంటకు పేరుంది. వీరి రీల్ అండ్ రియల్ లవ్ మొదలైంది వంశీ సినిమాతోనే! ఈ మూవీ షూటింగ్‌లోనే వీరికి పరిచయం ఏర్పడింది. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వంశీ బాక్స్‌ఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కానీ వీరి మనసులు ఒక్కటయ్యేలా చేసింది. ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే సందర్బంగా ఈ జంట ప్రేమకథపై ఓ లుక్కేద్దాం. అక్కడే ప్రేమ చిగురించింది వంశీ అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లింది. దాదాపు 25 రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి పరిచయం స్నేహంగా, అది కాస్తా ప్రేమగా మారింది. అయితే న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చాక ఫస్ట్ నమ్రతనే ప్రపోజ్ చేసింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో మరోమారు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ కుటుంబం మొదట్లో అంగీకరించకపోవడం లవ్ జర్నీకి బ్రేక్ పడింది. నమ్రతనే తన భార్యగా ఊహించుకున్న మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. ఇకపోతే నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. (ఇది చదవండి: సౌత్ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్ మహేష్ సొంతం) మంజులదే కీలకపాత్ర నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీ రోల్ ప్లే చేసింది. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబై వెళ్లి మరీ వివాహం చేసుకున్నారు మహేశ్. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై పెళ్లి తర్వాత మహేశ్ కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్ గతంలో వెల్లడించాడు. కానీ నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు. మహేశ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా' అని చెప్పుకొచ్చింది నమ్రత. కాగా.. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. సితార, గౌతమ్‌తో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్తూ ఉంటారు మహేశ్ దంపతులు. సినిమాల్లో ఎంజ బిజీగా ఉన్నా సరే.. ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తు చిల్ అవుతుంటారు టాలీవుడ్ ప్రిన్స్. (ఇది చదవండి: మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) -
వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. టాలీవుడ్ ప్రిన్స్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్న నమ్రత ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన నమ్రత సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో స్కాట్లాండ్లో టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. (ఇది చదవండి: హీరోయిన్గా మారిన ‘విక్రమార్కుడు’ చైల్డ్ ఆర్టిస్ట్) స్కాట్లాండ్లోని అతి పురాతనమైన రాయల్ స్కాట్స్ అండ్ ది రాయల్ రెజిమెంట్ మ్యూజియాన్ని సందర్శించారు. చారిత్రాత్మక మ్యూజియంలో తన పిల్లలు సితార, గౌతమ్‌తో దిగిన ఫోటోలను నమ్రత పంచుకుంది. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ సరసన పెళ్లి సందడి భామ శ్రీలీల కనిపించనుంది. అంతకుముందు పూజా హెగ్డేను ఎంపిక చేయగా.. పలు కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్
టాలీవుడ్లో నమ్రతా శిరోద్కర్ పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబును ప్రేమ వివాహాం చేసుకున్న నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. ఎక్కడికెళ్లినా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే తన ముద్దుల కూతురు సితార బర్త్ డే వేడుకను మహేశ్ బాబు ఫౌండేషన్ విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. అంతే కాదు సితార పుట్టిన రోజు సందర్భంగా పాఠశాల విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేశారు. (ఇది చదవండి:స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే! ) మహేశ్ బాబు స్వగ్రామమైన బుర్రిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 40 మంది బాలికలకు ఏంబీ ఫౌండేషన్ ద్వారా ఈ సైకిళ్లను అందించారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను నమ్రత తన ఇన్‌స్టాలో పంచుకుంది. బాలికలందరూ సైకిళ్లతో పాఠశాల ముందు నిలబడిన ఫోటోలను షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం మహేశ్ బాబు ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నమ్రత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ 40 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. మీరంతా పాఠశాలకు సైకిల్‌పై వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన చదువును ఆనందంగా నేర్చుకోవడానికి ఇలాంటివి అవసరం. మీ కళ్లలో సంతోషం తీసుకొచ్చిన సితారకు, మహేశ బాబు ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. 'అంటూ పోస్ట్ చేశారు. కాగా.. శనివారం మహేశ్ బాబు ఫ్యామిలీ వేకేషన్‌కు వెళ్తూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. (ఇది చదవండి: వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హేగ్డేను ఎంపిక చేయగా.. ఆ తర్వాత ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. పూజా స్థానంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే హీరో.. కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. (ఇది చదవండి: జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) అయితే ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్‌కు కాస్త విరామం లభించడంతో వేకేషన్ ప్లాన్ చేశాడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు పయనమయ్యారు. మహేశ్ బాబు సతీమణి, పిల్లలు సితార, గౌతమ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. జూలై 20న సితార బర్త్‌డేను జరుపుకున్న సంగతి తెలిసిందే. సితార పుట్టినరోజు వేడుకను మహేష్ బాబు ఫౌండేషన్‌లోని యువతులతో కలిసి ఇంట్లోనే చాలా సింపుల్‌గా జరుపుకున్నారు. కాగా.. ఇటీవలే సితార మొదటి జ్యూవెల్లరీ యాడ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ యాడ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సితారకు యాడ్ కోసం ఏకంగా రూ.కోటి ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: బేబీ బంప్ వీడియో షేర్ చేసిన నటి..సోషల్ మీడియాలో వైరల్!) Superstar #MaheshBabu with family off to vacation #GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/srs35m2Hoh — 𝙎𝙎𝙈𝘽 𝙁𝙍𝙀𝘼𝙆𝙎 𝙁𝘾 (@ssmb_freaks) July 22, 2023 -
Sitara Ghattamaneni Birthday Celebrations: గ్రాండ్ గా సితార పుట్టిన రోజు వేడుక
-
Sitara Ghattamaneni Family Photos: ఫ్యామిలీతో సితార.. ఈ ఫోటోలపై ఓ లుక్కేయండి
-
పుట్టినరోజున పేదపిల్లలకు సితార పాప సైకిళ్ల పంపిణీ (ఫొటోలు)
-
నేడు సితార పుట్టినరోజు.. ఆ పిల్లల కోసం గొప్ప మనసు చాటుకుంది
సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార బర్త్‌డే నేడు (జూలై 20). ఈ సందర్భంగా మహేశ్ తన కూతురికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. '11వ పడిలోకి అడుగు పెట్టిన నా చిన్నారి పాపకు బర్త్‌డే శుభాకాంక్షలు. నా ప్రపంచంలో నువ్వే స్టార్‌వి. నువ్వు ఏదైనా సాధించగలవు. అని మహేష్ అన్నారు. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కుమార్తెగానే కాకుండా తను ఇప్పుడు ఒక స్టార్‌గా గుర్తింపు పొందింది. కానీ నేడు తన పుట్టినరోజును ఎంతో ఆలోచనాత్మకంగా జరుపుకుంది. ఇప్పటికే స్టార్‌గా ఉన్న సితార.. బర్త్‌డేను విలాసవంతమైన సంబరాలకు పోకుండా ఇలా మహేష్‌బాబు ఫౌండేషన్‌లోని యువతులతో చాలా సాధారణంగా సెలబ్రేట్ చేసుకుంది. దీంతో సోషల్‌మీడియా నుంచి ఆమెకు చాలా ప్రంశంసలతో పాటు శుభాకాంక్షలు అందుతున్నాయి. సితార పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో, సితార మహేష్ బాబు ఫౌండేషన్‌లోని యువతులను కలుసుకోవడం, వారితో కేక్ కట్ చేయడం వంటివి ఉన్నాయి. అక్కడ ఉన్న వారందరికి పింక్ కలర్లో ఉన్న సైకిళ్లను సితార బహుమతిగా ఇచ్చింది. వీడియో షేర్ చేస్తూ నమ్రత ఇలా తెలిపింది. 'ఇప్పుడు ఆ చిన్నారులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారందరికి పాఠశాల కేవలం సైకిల్ దూరంలో ఉంది. నీలో ఆలోచనాత్మకత ,ఇతరులపై ప్రేమను చూపించే పెద్ద హృదయం ఉంది. నీ అద్భుతమైన ప్రయాణంలో ఇలాంటి అర్థవంతమైన జ్ఞాపకాలను మరెన్నో సృష్టించాలని కోరుకుంటున్నాను.' అని సితారకు నమ్రత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పీఎంజే జ్యువెలరీ యాడ్‌లో సితార నటించగా, అందుకు సంబంధించిన ఫోటోలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ఈ ప్రకటనలో నటించేందుకుగానూ సితార కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఓ ఇంటర్వ్యూలో తన తొలి పారితోషికంపై స్పందించిన సితార. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను చారిటీకి ఇచ్చానంది సితార. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శనీయంగా నిలిచిన మహేశ్‌బాబు అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!
Sitara Ad Video: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తన తర్వాతి తరాన్ని కూడా అప్పుడే పరిచయం చేసేశాడు. కొడుకు గౌతమ్ ఓ సినిమాలో నటించాడు. కాకపోతే అది చైల్డ్ ఆర్టిస్ట్ రోల్. కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కూతురు సితార మాత్రం ఇప్పటి నుంచే తండ్రి మించిపోయేలా అలరిస్తోంది. (ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలున్నారు.. బాంబు పేల్చిన తెలుగు హీరోయిన్) సితారకు ప్రస్తుతం 11 ఏళ్లు. అయితేనేం ఏ సెలబ్రిటీ కిడ్కి సాధ్యం కాని విధంగా ఓ యాడ్‌లో నటించింది. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. సరే ఎంత అందుకుంది అనేది పక్కనబెడితే ఆ మొత్తాన్ని ఛారిటీకి ఇచ్చేసినట్లు స్వయంగా ఆమెనే బయటపెట్టింది. అలానే ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఈ యాడ్‌ని తొలుత ప్రదర్శించారు. ఇప్పుడు ఆ యాడ్ పూర్తి వీడియోని మహేశ్‌బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఈ యాడ్ వీడియోలో సితార.. చాలా అనుభవం ఉన్న అమ్మాయిలా నటించింది. కొన్నిచోట్ల యాక్టింగ్‌లో మెరుపడాల్సి ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్రెజెన్స్, హైట్, స్కిన్ కలర్ తదితర అంశాల్లో మాత్రం తండ్రి మహేశ్‌ని మించిపోతుందేమో అనిపించేలా ఉంది. త్వరలో సినిమాల్లోకి వస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సితార.. ఆల్రెడీ డ్యాన్సర్‌గా ప్రూవ్ చేసుకుంది. ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) (ఇదీ చదవండి: మెగాహీరో సినిమాలకు దూరం) -
ట్వింకిల్ ట్వింకిల్ సూపర్‌స్టార్
మహేష్ బాబు–నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కూతురు సితార న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసి నెటిజనులను కనువిందు చేసింది. ఒక జ్యుయెలరీ యాడ్‌లో సితార నటించింది. ఆ యాడ్‌కు సంబంధించిన చిత్రాలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ‘సో సో ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫైర్ క్రాకర్’ అంటూ మహేష్‌బాబు సితార చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘పదాలలో చెప్పలేని సంతోషం ఇది. కీప్ షైనింగ్ మై సూపర్ స్టార్’ అంటూ స్పందించింది నమ్రతా శిరోద్కర్. చిన్న వయసులోనే యూ ట్యూబ్ చానల్ మొదలు పెట్టి ‘ఆహా!’ అనిపించిన సితార చక్కని డ్యాన్సర్ కూడా. ‘ఫ్రోజెన్–2’ సినిమా తెలుగు వెర్షన్లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్–వోవర్ ఇచ్చింది. జ్యుయలరీ బ్రాండ్ ‘పీఎంజే’కు సితార బ్రాండ్ అంబాసిడర్. ఈ నేపథ్యంలో యంగెస్ట్ స్టార్ కిడ్‌గా టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసింది. -
ఎవరూ ఊహించలేని టార్గెట్ వైపు అడుగులేస్తున్న 'సితార'
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార. కాదు.. కాదు.. 'సితార ఘట్టమనేని' అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది. మొదట ప్రిన్స్ మహేష్ బాబు ఫేమ్‌తో గుర్తింపు దక్కినా తర్వాత తన టాలెంట్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌నే క్రియేట్ చేసుకునే స్థాయికి చేరుకుంది. సితార శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. అంతే కాకుండా ఇటీవలే ఓ ప్రముఖ జ్యూయెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసి.. ఆ సంస్థ నుంచి ఒక హీరోయిన్ అందకునేంత రెమ్యునరేషన్ తీసుకుంది. అంటే సుమారు కోటి రూపాయలకు పైగానే అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: Sitara Ad Remuneration: చిన్న యాడ్.. కళ్లుచెదిరే మొత్తం ఇచ్చారు!) గతంలో తన గురించి మహేష్ ఇలా అన్నారు. 'సితార ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయింది. తను ఇంగ్లీష్,తెలుగు చాలా చక్కగ మాట్లాడుతుంది. ముఖ్యంగా తను మాట్లాడేటప్పుడు అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది. కానీ అలా మాట్లాడాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. తనకు సొంతంగా వచ్చింది.' అని చెప్పారు. సితార ఇంత వరకు ఎలాంటి సినిమాలు తీయలేదు. యూట్యూబ్,ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే తను కనిపిస్తుంది. అక్కడ కూడా తనకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సితార ఒక స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆమె తల్లి నమ్రతా కృషి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అమెకు డ్యాన్స్,యాక్టింగ్‌లో హావ భావాలు పలికించడంలో రాటుతేలేందకు శిక్షణ ఇప్పించింది. ఈ విధంగా చాలా విషయాల్లో సితార మీద చిన్నప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది నమ్రత. దీంతో ఆమె ఒక స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!) తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా మహేష్ బాబు అభిమానుల్లో సితార గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సితారని 'మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్' పోటీలకు నమ్రత సిద్ధం చేస్తోంది అని... ఆపై సితారను హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలో పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారట.. ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే సితారకి ఇంకా పదకొండేళ్లే.. మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనాలంటే ఇంకా సుమారుగా ఆరేళ్లు ఉండాల్సిందే. మరీ ఇప్పటి నుంచే ఎందుకంటారా? అలాంటి పోటీలకు శిక్షణ చాలా ముఖ్యం. అక్కడ రానించాలంటే లాంగ్ టర్మ్ తర్ఫీదు తప్పదు. ఈ శిక్షణల వల్లే తను బాలీవుడ్ టాప్ హీరోల పిల్లలను కూడా దాటేసి తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ యాడ్ రిలీజ్ అయ్యాక ఆమె మరింత పాపులర్ అవడం ఖాయం. ఒక రకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సితార ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగడం ఖాయం అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. View this post on Instagram A post shared by sitara 🍓 (@sitaraghattamaneni) (ఇదీ చదవండి: 'రంగబలి' సినిమా రివ్యూ) -
పార్టీలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన మహేశ్‌బాబు (ఫొటోలు)
-
చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్ కిడ్‌గా సోషల్ మీడియాలో సితారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో బాగా యాక్టివ్‌గా ఉండే సితార.. ఫ్యామిలీ మూమెంట్స్‌తో పాటు తనకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఆమెకు ఇన్‌స్టాలో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీనికి తోడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ కూడా నిర్వహిస్తుంది. మహేశ్ ముద్దుల కూతురిగానే కాకుండా తన స్పెషల్ టాలెంట్‌తో ఈ లిటిల్ సూపర్‌స్టార్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. సితారకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో ఉంచుకొని ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సితారను తన ప్రచారకర్తగా నియమించుకుంది. ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. ఇప్పటికే సితారతో మూడు రోజుల పాటు యాడ్ షూట్ చేశారట. ప్రముఖ టెక్నీషియన్లు ఈ యాడ్ కోసం పనిచేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన యాడ్ టీవీల్లో కనిపించనుంది. ఈ విషయం తెలిసి మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 🌟 Sitara Ghattamaneni, The Most Happening star kid to bag a major jewellery brand contract! 💎✨ Proud parents Mahesh Babu and Namrata are overjoyed! Stay tuned for the grand TVC launch! @urstrulyMahesh #NamrataShirodkar #Sitara pic.twitter.com/rOMfEjcrio — Mahesh Babu Space (@SSMBSpace) May 26, 2023 -
సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు గారాలపట్టి సితార గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. విదేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. అయితే తాజాగా సితారకు సంబంధించిన ఓ వీడియోను నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ఓటీటీకి నాగచైతన్య 'కస్టడీ'.. స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్!) అయితే గతంలో సితార భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సితార తనదైన టాలెంట్‌తో దూసుకెళ్తోంది. ఓ బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో నెటిజన్స్ వాట్ ఏ గ్రేట్ ఫర్మామెన్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సితారా ఓ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సితార స్టెప్పులకు ఒక అమ్మగా నమ్రత ఫిదా అవ్వకుండా ఉండలేకపోయింది. 'నీ హృదయంతో డ్యాన్స్ చేయి.. నీ పాదం దాన్ని అనుసరిస్తుంది.' అంటూ నమ్రత పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఫ్యామిలీ ఫ్రెండ్ తనయుడి వివాహ వేడుకలో మహేశ్‌బాబు, నమ్రత సందడి (ఫొటోలు)
-
సానియా మీర్జా ఫేర్‌వెల్‌లో సందడి చేసిన మహేశ్ దంపతులు
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్‌లో జరిగిన ఫేర్వెల్ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఫేర్వెల్ పార్టీకి హాజరయ్యారు. ఇద్దరూ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక సానియాతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇన్నాళ్ల నీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సానియా మీర్జా కుటుంబంతో మహేశ్‌బాబు, నమ్రతకు మంచి అనుబంధం ఉంది. గతంలోనూ పలు ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో వీళ్లు సందడి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) What a journey!! So so proud of you! 🤗 @MirzaSania pic.twitter.com/qyWAIUs0XB — Mahesh Babu (@urstrulyMahesh) March 5, 2023 -
ఉమెన్స్ డేకి మహిళలంతా మొక్కలు నాటండి: నమ్రత
పర్యావరణం పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సూపర్ స్టార్ మహేశ్‌బాబు సతీమణి నమ్రత స్వీకరించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని ఆమె కోరారు. అంతకుముందు గ్రీన్ ఇండియా చాలెంజ్ కి తనను నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి నమ్రత ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
నమ్రత కొత్త రెస్టారెంట్ ప్రారంభం (ఫొటోలు)
-
Namrata shirodkar: ఏసియన్ నమ్రత ‘ప్యాలెస్ హైట్స్’ రెస్టారెంట్ ప్రారంభం ( ఫొటోలు)
-
మహేశ్ బాబు-నమ్రతల లవ్‌స్టోరీ.. ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల పేరు ముందుంటుంది. తెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ వీరి జోడికి ఎంతోమంది అభిమానులున్నారు. మహేశ్వరుస సినిమాలతో బిజీగా ఉంటే, నమ్రత ఇంటి బాధ్యతలతో పాటు మహేశ్ కాస్ట్యూమ్స్ విషయాల్లోనూ చురుగ్గా ఉంటుంది. దీనికి తోడు మహేశ్ వ్యాపారాలన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేంతలా ఉండే ఈ అందమైన జంట పరిచయం ఎలా మొదలైంది? అసలు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? అంత స్టార్డమ్ ఉండి సీక్రెట్‌గా పెళ్లెందుకు చేసుకున్నారు వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మహేశ్‌బాబు, నమ్రతలు తొలిసారి వంశీ సినిమా షూటింగ్లో కలుసుకున్నారు. అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారట.దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే మహేశ్-నమ్రతల స్నేహం మరింత బలపడింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారట. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. వీరి ప్రేమను మహేష్ కుటుంబం తొలుత అంగీకరించలేదట.దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట.అలా నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించింది. అలా ఈ ప్రేమ మజిలీ పెళ్లిదాకా వెళ్లింది. 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారు మహేశ్. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్-నమ్రతల రిలేషన్ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం. వీరి పెళ్లి జరిగే వరకు ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 18ఏళ్ల వైవాహిక బంధంతో ఇప్పటికీ ఎవర్గ్రీన్ కపుల్‌గా ఆదరణ పొందుతున్న మహేశ్, నమ్రతల దంపతులకు పలువురు సెలబ్రిటీల నుంచి పెళ్లిరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
నేను, మహేశ్ తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదే : నమ్రతా శిరోద్కర్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల జంట ఒకరు. వెండితెరపై హీరో,హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వంశీ సినిమాలో కలిసి నటించిన మహేశ్-నమ్రతలు 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా కొనసాగుతున్నారు. టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఈ స్టార్కపుల్కి పెళ్లయి నేటితో 18 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు నమ్రతతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. '18 ఏళ్ల ప్రయాణం ఎంతో క్రేజీగా, ప్రేమగా ముందుకు సాగింది. ఎప్పటికీ ఇలాగే ముందుకు సాగాలి. పెళ్లి రోజు శుభాకాంక్షలు'.. అంటూ పోస్ట్ చేశారు. ఇక నమ్రతా కూడా ఇన్‌స్టాలో క్యూటెస్ట్ పోస్ట్‌ను షేర్చేసింది. 'మా జీవితంలో మేం తీసుకున్న అత్యత్తుమ నిర్ణయం ఇదే' అంటూ మహేశ్‌తో దిగిన అరుదైన ఫోటోను పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి మహేశ్, నమ్రతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
చాలా త్వరగా వెళ్లిపోయావు, మిస్ యూ: నమ్రత
వెండితెరపై హీరోయిన్గా వెలిగిన నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపడుతూనే మహేశ్‌బాబుకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటూ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తోంది. తాజాగా ఆమె తన తండ్రి నితిన్ శిరోద్కర్‌ను తలుచుకుని ఎమోషనలైంది. '16 ఏళ్లుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నా పప్పా.. నీ ప్రతి జ్ఞాపకం నా మదిలో అలాగే ఉండిపోయింది. ఏమీ మారలేదు.. నువ్వు చాలా త్వరగా మమ్మల్ని వదిలేసి పోయావు పప్పా.. అనంతమైన ప్రేమను, వెలుగులను నిత్యం నీకు పంపిస్తూనే ఉంటాను' అని రాసుకొచ్చింది నమ్రత. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: -
నన్ను విడిచి వెళ్తుంటే చాలా బాధగా ఉంది: నమ్రత ఎమోషనల్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. మిస్ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి నటించింది. వంశీ మూవీ సమయంలో మహేశ్ బాబుతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు కుమార్తె సితార గురించి మనందరికీ తెలుసు. నమ్రత శిరోద్కర్ అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా తన కుమారుడు గౌతమ్ గురించి ఆమె తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నమ్రత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'గౌతమ్ కల్చరల్ ట్రిప్‌లో భాగంగా మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లాడు. అంతా తన సొంతంగానే చక్కబెట్టుకోవాలి. ఇది తలుచుకుంటే నాలో కొంత భాగం నన్ను విడిచిపెట్టినట్లు అనిపించింది. అతను వెళ్లిన రోజంతా శూన్యంగా ఉంది. గౌతమ్ తిరిగి వచ్చే వరకు ఇదో బాధకరమైన అనుభూతి. మా ఇంట్లో, మా కళ్ల ముందు తిరగాల్సిన చిన్న పిల్లవాడు సొంతంగా బయటికి వెళ్లే స్థాయికి చేరాడు. ఒక వారం వినోదం, ఆనందం, సాహసం అన్నింటికీ మించి నువ్వు ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఈ యాత్ర నీకు విలువైందని ఆశిస్తున్నా. బేబీ.. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పోస్ట్‌లో గౌతమ్ సహ విద్యార్థులతో దిగిన ఫొటోలను నమ్రత పంచుకున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
'బంగారు కళ్ల బుచ్చమ్మో.. కోపంలో ఎంత ముద్దమ్మో'.. సితార వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులందరూ పండుగ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక పండుగంటే సినీ తారలు చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఫెస్టివల్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గారాల పట్టి సితార గురించి తెలుగు అభిమానులకు పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్విట్జర్లాండ్‌లో జరుపుకున్న ఫోటోలను పంచుకుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది సితార. పట్టు వస్త్రాలు ధరించి అచ్చం తెలుగుమ్మాయి అనేలా ఓ వీడియోను షేర్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో మహేశ్ బాబు నటించిన మురారి సినిమాలోని 'బంగారు కళ్ల బుచ్చమ్మో.. కోపంలో ఎంత ముద్దమ్మో' అంటూ సాగే సాంగ్‌కు నృత్యం చేస్తూ కనిపించింది. 'ఈ ఆనంద సమయంలో గాలిపటాలు ఎగరనివ్వండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఎరుపు డ్రెస్‌లో సితార తెలుగువారి సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ వీడియోకు మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ కామెంట్ చేసింది. ' నా చిట్టి దేవత. నీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా' అంటూ రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూ ఇయర్‌కు ముందు ఫ్యామిలీతో కలిసి వ్యాకేషన్‌కు వెళ్లారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉన్నారు. వ్యాకేషన్ పూర్తి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ శనివారం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితార, కుమారుడు గౌతమ్‌తో కలిసి లండన్ నుంచి నగరానికి తిరిగి వస్తుండగా ఎయిర్‌పోర్టులో కెమెరాలకు చిక్కారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మహేష్ బాబు తన కుటుంబం, స్నేహితులతో కలిసి స్విట్జర్లాండ్‌లో వేడుకలు జరుపుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. మహేష్ ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో నటి పూజా హెగ్డే నటిస్తోంది. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళితో కలిసి మరో చిత్రంలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
హీరోలను మించిపోతున్న వారి భార్యల క్రేజ్
-
స్విట్జర్లాండ్‌కు మహేశ్‌బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ గురించి పరిచయం అక్కర్లేదు. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్- నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మహేశ్ బాబు తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. మహేష్ బాబు అతని భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితార ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో క్రిస్మస్ చెట్టు వద్ద ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా మహేశ్ సతీమణి నమ్రత అదే ఫోటోను షేర్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందే నమ్రత ఒక కప్పు పానీయంతో కుర్చీలో కూర్చుని సితార ఫోన్ బ్రౌజ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. కొద్ది రోజుల క్రితమే మహేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. సెలవులు ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. కాగా.. మహేశ్ బాబు దర్శకుడు త్రివిక్రమ్‌తో తన తదుపరి చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో ఒక ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. మహేశ్ చివరిసారిగా సర్కారు వారి పాట సినిమాలో లోన్ ఏజెంట్‌గా కనిపించారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
సెలూన్ ఓపెనింగ్‌లో నమ్రత సందడి (ఫోటోలు)
-
మహేశ్ బాబు కండీషన్.. అందుకే వాటిని వదిలేశా: నమ్రత
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత జంట ఒకటి. మిస్ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్- నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తొలిసారి తన వ్యక్తిగత విషయాలపై నోరు విప్పింది. ఈ సందర్భంగా పెళ్లి అనంతరం సినిమాల్లో నటించకపోవడంపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ తమ పెళ్లికి ముందే మహేశ్ ఓ కండిషన్ పెట్టాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహేష్ బాబు తనను పని చేయడం వద్దని కోరడంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. పెళ్లికి ముందే అన్ని షూట్లను పూర్తి చేయడానికి మహేశ్ బాబు తన కోసం వేచి ఉన్నాడని కూడా ఆమె చెప్పుకొచ్చింది. మహేశ్‌తో పెళ్లికి ముందు తాను కూడా ఒక షరతు పెట్టానని నమ్రత తెలిపింది. తాను ముంబైలో పెరిగినందున పెద్ద భవనంలో నివసించడం సౌకర్యంగా లేదని చెప్పడంతో.. మహేశ్ తన కోసం అపార్ట్మెంట్లోకి మారాడని చెప్పింది. నటన నుంచి తప్పుకున్నందుకు ఎలాంటి బాధ లేదని ఆమె స్పష్టం చేసింది. తన తల్లి కోరిక మేరకే మోడలింగ్ ప్రారంభించానని.. ఆ తర్వాతే మహేశ్‌ను వివాహం చేసుకున్నానని మాజీ మిస్ ఇండియా తెలిపింది. ఒకవేళ నేను నా కెరీర్‌ను సీరియస్‌గా తీసుకున్నట్లయితే.. నా జీవితం ఇప్పుడు ఉన్న దానికంటే చాలా భిన్నంగా ఉండేదని నమ్రత తెలిపారు. -
ఆ విషయంలో నాకు- మహేశ్‌కు మధ్య గొడవలు అవుతుంటాయి : నమ్రత
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మహేశ్‌బాబు-నమ్రత ఒకరు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపడుతూనే, మరోవైపు మహేశ్‌కు సంబంధించిన వ్యాపారాలను చేసుకుంటూ బిజినెస్ విమెన్గానూ రాణిస్తుంది. అంతేకాకుండా భర్త మహేశ్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ సహా పలు విషయాలను దగ్గరుండి చూసుకుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నమ్రత తాజాగా ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ''మహేశ్-నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడం నా జీవితంలోనే బెస్ట్ మూమెంట్. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి. ఇక భార్యభర్తలుగా మహేశ్‌కు, మీకు ఏ విషయంలో గొడవలు అవుతుంటాయి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మా ఇద్దరి మధ్య పిల్లల విషయంలోనే గొడవలు అవుతుంటాయి. వాళ్లు నన్ను అడిగితే నో చెప్తాను.. అందుకే పిల్లలు వాళ్లకు ఏం కావాలన్నా మహేశ్నే అడుగుతారు. ఆయన నో చెప్పరు. ఈ విషయంలో చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి'' అంటూ చెప్పుకొచ్చింది నమ్రత. -
ఆ రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి.. నమ్రత పోస్ట్ వైరల్
వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత కూడా ఒకరు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. వీరి ప్రేమకు మజిలీగా నిలిచింది వంశీ సినిమానే. షూటింగ్ సమయంలోనే నమ్రత-మహేశ్ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొంది. తాజాగా 1993లో నమ్రతా శిరోద్కర్ మిస్ యూనివర్స్ పోటీల్లో నడుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి స్పందిస్తూ 'మేము గర్వపడేలా చేశావ్' అంటూ నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కామెంట్ చేసింది. ఆ వీడియో చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె అభిమానులు'అద్భుతమైన, అందమైన జ్ఞాపకం' అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ముంబయిలో బిజీగా మహేశ్ బాబు.. నమ్రత పోస్ట్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల కృష్ణ మరణం తర్వాత తొలిసారి త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబీ28 టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేశ్ సతీమణి నమ్రత ముంబయిలో ఆమె స్నేహితురాలు సాజియాను కలుసుకున్నారు. వారి ఇంట్లోనే మహేశ్ బాబు, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి రుచికరమైన ఇంటి వంటకాలను ఆస్వాదించారు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పంచుకున్నారు. తన స్నేహితురాలు ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటోలను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇన్‌స్టాలో ఆమె రాస్తూ..' నా కలల జీవితంలో కొన్ని మధుర క్షణాలు.. ఇంటి భోజనాన్ని రుచి చూపించిన సాజియాకు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కనిపించనుంది. గతంలో ఆమె మహర్షి చిత్రంలో కలిసి పనిచేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో నటించనున్నారు. ఆ చిత్రానికి ఎస్ఎస్ఎంబీ29 టైటిల్ ఖరారు చేశారు. దీనిపై మహేష్ బాబు మాట్లాడుతూ..'ఈ చిత్రం గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా కల నిజమైంది. రాజమౌళితో నేను చాలా కాలంగా కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నా. చివరకు అది నెరవేరబోతోంది. ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్‌గా ఉన్నా' అని అన్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
'లవ్ యూ మామయ్య గారు'.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
సూపర్‌స్టార్ కృష్ణ మరణం అటు ఘట్టమనేని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఒకే ఏడాది మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, ఆ తర్వాత కృష్ణ కన్నుమూయడంతో ఆ విషాదం నుంచి కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా మహేశ్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఎవర్ గ్రీన్ స్టార్, ఎన్నింటికో పునాది వేసి.. నిజమైన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఆయనకు సినిమాలపై ఉన్న ప్రేమే ఆయన్ను సూపర్ స్టార్‌ను చేసింది. ఇయన ఎప్పటికీ సూపర్ స్టారే. ఆయన్ను మామయ్య గారు అని పిలవడం నా అదృష్టం. జీవితంలోని ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నాను. ఆయన వారసత్వాన్ని, ఖ్యాతిని ఎప్పటికీ మేం పండగలా జరుపుకూనే ఉంటాం. లవ్ యూ మామయ్య గారు అంటూ కృష్ణ సుధీర్ఘ జర్నీకి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
లండన్ వెకేషన్లో మహేశ్ బాబు.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్స్‌లతో ఫుల్ బిజీగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్‌కు వెళ్తుంటారు. తాజాగా మహేశ్ కుటుంబం లండన్ ట్రిప్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, కాసేపటికే అవి వైరల్‌గా మారాయి. ఇందులో మహేశ్ న్యూలుక్‌తో కనిపించారు. కాగా సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మమ్మీ మా గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారు.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
హీరో మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా మహేశ్ భార్య, నటి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. అత్త ఇందిరా దేవిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నమ్రత శిరోద్కర్ రాస్తూ.. 'జీవితం అనేది ఒక సర్కిల్ లాంటిది. ఇప్పుడు నా జీవితం ఇదే. మామయ్య గారు మా జీవితంలో ఉన్నందుకు మాకు సంతోషం. అమ్మ ఇందిరాదేవి ఇప్పుడు మా మధ్య లేకపోయినా ఆమె మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటుంది. మేం జీవించి ఉన్నంత వరకు ప్రతి రోజూ ఆమెను గుర్తు చేసుకుంటాం. ఆమె మా కుటుంబాన్ని కాపాడుతుందని మాకు తెలుసు.. లవ్ యూ మమ్మీ' అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవలే ఇందిరా దేవి పెద్దకర్మ కూడా నిర్వహించారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఇందిరా దేవి పార్థీవదేహానికి కుటుంబ సభ్యుల నివాళులు (ఫొటోలు)
-
షర్ట్ లేకుండా షాకిచ్చిన మహేశ్ బాబు.. క్షణాల్లో ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.గుబురు గడ్డంతో షర్ట్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చారు. ఈ ఫోటోలను స్వయంగా మహేశ్ భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ పోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సాధారణంగా మహేశ్ తన బాడీని ఎక్స్ పోజింగ్ చేయరు. సినిమాల్లోనూ షర్ట్‌లేకుండా కనిపించాలని మేకర్స్ కోరినా మహేశ్ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు. చదవండి: మహేశ్ సోదరి మంజులకు పిల్లలను కనడం ఇష్టమే లేదట.. కానీ! ఇలాంటి లుక్‌లోనూ మహేశ్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇటీవలి కాలంలో తన లుక్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు మహేశ్. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేశ్ ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో మహేశ్ షర్ట్ లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'ఫైనల్లీ.. మహేశ్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: కొంపముంచిన విజయ్ కామెంట్స్.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ 'లైగర్' View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ సోదరి మంజులకు పిల్లలను కనడం ఇష్టమే లేదట.. కానీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 1993లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆమె ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాస్తవ్ మూవీ నమ్రత కెరీర్లో తొలి హిట్ సినిమా. దీని తర్వాత నమ్రతకు అవకాశాలు క్యూ కట్టాయి. అలా దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా వంశీ. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మహేశ్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా పెద్దల అంగీకారంతో 2005, ఫిబ్రవరి 10న ముంబైలో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.అయితే వీరి పెళ్లి జరగడానికి మహేశ్ సోదరి మంజుల ముఖ్య పాత్ర వహించారట. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మంజలతో తనకున్న రిలేషన్‌ను షేర్ చేసుకున్నారు. చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే.. 'ఓ పార్టీలో అనుకోకుండా మంజులను కలిశాను. అప్పుడు నేను మహేశ్‌ను ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలియదు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ అయ్యాం. తను నా బెస్ట్‌ఫ్రెండ్. అంతేకాదు. మేమిద్దరం ఒకేసారి ప్రెగ్నెన్సీని ధరించడం యాధృచ్చికంగా జరిగింది. నిజానికి మంజులకు పిల్లలను కనడం మొదట్లో ఇష్టమే లేదు. కానీ ఇప్పుడో కూతురు. తల్లిగా ఆమె ఎంతో ఆనందిస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పినందుకు తనకెలాంటి బాధ లేదని, స్తుతం తన ఫ్యామిలీని చూసుకోవడంలో బిజీగా ఉన్నానంటూ తెలిపారు. అందుకే ప్రస్తుతానికి సినిమాలు చేసే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: అందుకే సావిత్రిపై కృష్ణకుమారికి కోపం..చనిపోయినా వెళ్లలేదు! -
నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..
సాక్షి, వెబ్ డెస్క్: వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత కూడా ఒకరు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద అంతగా మెప్పింపలేకపోయింది. కానీ వీరి ప్రేమకు మజిలీగా మారింది. వంశీ షూటింగ్ సమయంలోనే నమ్రత-మహేశ్ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది. నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ తొలుత కుటుంబం అంగీకరించలేదట. దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. అలా నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారు మహేశ్. ఇక పెళ్లి తర్వాత మహేశ్ కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్ ఓ సందర్భంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్-నమ్రతల రిలేషన్ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం. ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. 'టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు. మహేశ్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా. పెళ్లయి ఇన్నేళ్లయినా ఒక్కసారి కూడా ఈ విషయంలో రిగ్రేట్‌గా అనిపించలేదు. మహేశ్ కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ఎంత బిజిగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. వీటన్నింటికీ మించి గొప్ప మానవతా వాది. అందుకే మహేశ్ అంటే నాకు ఎంతో ప్రేమ, ఆరాధన. ఆయన్ను పెళ్లిచేసుకోవడం నాకు లభించిన అత్యంత ప్రత్యేకమైన బహుమతిగా ఫీల్ అవుతుంటా' అని నమ్రత పేర్కొంది. -
పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నా... మహేశ్ బాబు ట్వీట్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకే కాదు.. ఆయన ముద్దుల కూతురు సితారకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. నేడు(జులై 20) సీతు పాప పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన గారాల పట్టి సితారకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ‘తెలియకుండానే పదేళ్లు గడిచాయి. నా ప్రపంచంలో వెలుగు నింపిన నక్షత్రం నువ్వు. హ్యాపీ బర్త్‌డే సితార..నిన్ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నాను’అని మహేశ్ ట్వీట్ చేశాడు. All of 10.. before we even knew it! ♥️♥️♥️ To the brightest star in my world... Happy birthday Sitara!! I love you tenfold 🤗🤗🤗 pic.twitter.com/m693TMYad5 — Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2022 మరోవైపు నమత్ర కూడా సోషల్ మీడియా వేదికగా సీతారకు పుట్టిన రోజు శుభాక్షాంక్షలు తెలిపారు. ‘హ్యాపీబర్త్‌డే మై లిటిల్ వన్. నీ చిన్ని కుయుక్తులు, అల్లరి చేష్టలు, బోరింగ్ బెడ్ స్టోరీస్..అన్నింటిని ప్రేమిస్తున్నాను. ఇవి వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. కొత్త దశలోకి అడుగుపెడుతున్న నీకు నా ప్రేమ, కౌగిలింతలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇంకా నువ్వు కనుగొనవలసినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీ మనసులో అనుకున్న ఏ లక్ష్యాన్ని అయినా కచ్చితంగా సాధించగలవని అనుకుంటున్నాను. లవ్ యూ పప్లూ’ అని నమ్రత ఇన్‌స్టాలో రాసుకొస్తూ.. ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసింది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu And Namrata Special Birthday Wishes To Super Star Krishna: తొలి తెలుగు జేమ్స్‌బాండ్, కౌబాయ్ హీరో అని ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన 1965లో వచ్చిన 'తేనె మనసులు' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. తర్వాత వచ్చిన మూడో సినిమా 'గూఢచారి 116' సినిమాతోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం అనేక బ్లాక్‌బ్లస్టర్ హిట్లు ఇచ్చిన ఆయన డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాలకు మారుపేరుగా నటనలో ఎప్పటికీ సూపర్ స్టార్‌గా అభిమానులకు ఎవర్గ్రీన్ హీరోగా ఖ్యాతి సాధించిన కృష్ణ పుట్టినరోజు నేడు. సూపర్ స్టార్ కృష్ణ 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ వసంతంలోకి అడుగుపెడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మహేశ్ బాబు, కోడలు నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదిక ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. 'హ్యపీ బర్త్‌డే నాన్న. మీలాంటి వారు నిజంగా ఎవరు లేరు. మీరు రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ' అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you ♥️🤗🤗 pic.twitter.com/rJKvVQoHQq — Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022 'చాలా సంవత్సరాలుగా మీతో నాకు ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలోకి ఎంతో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞతరాలును. మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే మామయ్య. వి లవ్ యూ.' అని నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాలో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో గౌతమ్, సితారతో కృష్ణ కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు నమ్రతా. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
SVP: సుదర్శన్ థియేటర్లో నమ్రత సందడి.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
Namrata Shirodkar Watches Sarkaru Vaari Paata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మే 12న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబడుతుడుతూ దూసుకుపోతోంది. అయితే సినిమా విడుదలైనప్పటినుంచే మహేశ్ బాబు అభిమానులతో థియేటర్ హాల్లు కిక్కిరిసిపోయాయి. తాజాగా ఈ మూవీని మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ వీక్షించారు. 'సర్కారు వారి పాట' సినిమాను తిలకించేందుకు నమ్రతా శిరోద్కర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌కు వెళ్లారు. ఈ థియోటర్ అభిమానులతో సందడిగా మారింది. అధికజనంతో కిక్కిరిసిపోయింది. వారందరి మధ్య ఒక ప్రేక్షకురాలిగా నమ్రత సినిమాను వీక్షించారు. ఇదిలా ఉంటే ఫుల్ క్రౌడ్ ఉన్న ఆ థియేటర్లలో సందెట్లో సడేమియాలా జేబు దొంగలు చేతివాటం చూపించారు. ఓ వ్యక్తి జేబులో నుంచి పర్సు కొట్టేశారు. అందులో రూ. 2800 నగదు ఉన్నట్లు సమాచారం. తర్వాత అక్కడ కొద్దిసేపు పలువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చదవండి: గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ పార్టీ.. ఫోటోలు వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ పార్టీ.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ .. మూవీ యూనిట్‌కి శుక్రవారం విందు ఏర్పాటు చేసింది. (చదవండి: 'సర్కారు వారి పాట’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన ఈ పార్టీలో మహేశ్‌బాబు, నమ్రతలతో పాటు దర్శకుడు పరశురామ్, సుకుమార్, బుచ్చిబాబు, హరీశ్‌శంకర్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శిరీష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. సర్కారు వారి పాటకు వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉందని నమ్రత రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
సితార చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’.పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ బాబు ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్ఫార్మెన్స్ గురించి అడగ్గా.. మహేశ్ మాట్లాడుతూ.. అది తమన్ ఆలోచన అని, నమ్రతతో ఈ విషయం గురించి చెప్పేలోపు తమన్ నమ్రతని అడిగాడని చెప్పారు. ఇక ఈ సినిమాలో సితార డ్యాన్స్ ఎండ్ టైటిల్స్‌లో అయినా కనిపిస్తుందా అని అడగ్గా.. 'మేకింగ్ వీడియోలో అనుకున్నాం. ఇప్పటికే ప్రింట్స్ యూఎస్‌కి వెళ్లిపోయాయి. అయినా దయచేసి ఇవన్నీ అడగకండి. ఇప్పటికే సినిమాల్లో ఎందుకు లేను అని సితర అడుగుతుంది. కానీ పర్ఫార్మన్స్ పరంగా తను నన్ను చాలా గర్వపడేలా చేసింది. నాకు తెలిసి తను భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మహేశ్. -
అమ్మ కోప్పడితే నాన్నకు కంప్లైంట్ చేస్తాను : సితార
నేను గర్వపడేలా చేశావు సితూ పాపా...నమ్రత ఎమోషన్ అయ్యారు...కూతుర్ని గట్టిగా హత్తుకున్నారు.అంతే.. సితూ పాప పిచ్చ హ్యాపీ.నువ్వు మా అమ్మలా ఉంటావు...అలా అంటూ కూతుర్ని ముద్దు చేస్తుంటారు మహేశ్‌బాబు. ఇంతకీ అమ్మ ఆనందపడేలా సితూ ఏం చేసింది?‘మదర్స్ డే’ సందర్భంగా తన తల్లి గురించి సితార చెప్పిన ముచ్చట్లు చదివితే తెలుస్తుంది. ►మదర్స్ డే ప్లాన్ గురించి? సితార: అమ్మ కోసం స్పెషల్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాను. అది సర్ప్రైజ్. అలాగే ఆదివారం మొత్తం అమ్మతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ► ఇంట్లో నిన్ను ‘సితూ పాపా’ అని పిలుస్తారు. మీ అమ్మని ‘అమ్మా’ అనే పిలుస్తావా? మామ్ అని కాదా? అమ్మా అనే పిలుస్తాను. అలా పిలిపించుకోవడం అమ్మకు ఇష్టం. ► ఇంతకీ మీ అమ్మగారు ఎంత స్ట్రిక్ట్? అవసరమైనప్పుడు మాత్రమే స్ట్రిక్ట్. మిగతా సమయాల్లో మా అమ్మ చాలా స్వీట్. ► చదువు విషయంలో, స్పోర్ట్స్, డాన్స్ వంటివి నేర్చుకునే విషయంలో అమ్మ ప్రోత్సాహం ఎంతవరకూ ఉంటుంది? స్కూల్ నుంచి రాగానే హోమ్‌వర్క్‌కి స్పెషల్‌గా టైమ్ ప్లాన్ చేస్తుంది. ఆ టైమ్‌కి మేం హోమ్‌వర్క్ చేసేలా చూస్తుంది. ఇక పెయింటింగ్, డాన్సింగ్... ఇంకా స్కూల్ యాక్టివిటీస్ అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసేలా అమ్మ ప్రోత్సహిస్తుంది. ► ఎప్పుడైనా చదువుపట్ల నిర్లక్ష్యంగా ఉంటే మీ అమ్మగారి రియాక్షన్? నిర్లక్ష్యంగా ఉండే చాన్సే లేదు. రోజూ చదువుకోవడానికి ఒక టైమ్ కేటాయించిందని చెప్పాను కదా. ఆ టైమ్‌కి చదవుకోవాల్సిందే. తప్పించుకోవడానికి లేదు. ► అమ్మ కోప్పడినప్పుడు నాన్నకు కంప్లైంట్ చేయడం జరుగుతుందా? జరుగుతుంది. నాకేదైనా కావాలన్నప్పుడు అమ్మ ‘నో’ చెబితే అప్పుడు నాన్నకు కంప్లైంట్ చేస్తాను. ► మీ ఇద్దరి (సితార అన్నయ్య గౌతమ్)లో అమ్మ ఎవర్ని ఎక్కువగా గారాబం చేస్తారు? ఇద్దరంటే అమ్మకి చాలా ప్రేమ. కానీ నేను చిన్నదాన్ని కాబట్టి నన్ను ఎక్కువగా గారాబం చేస్తుంది... హహ్హహ్హా... ► మీ అమ్మగారి నుంచి తీసుకోవాల్సిన మంచి విషయాలు? పాజిటివ్‌గా ఉండాలని చెబుతుంది. అలాగే ఇతరుల పట్ల కైండ్‌గా ఉండాలని కూడా అంటుంది. మన దగ్గర ఉన్నవాటికి కృతజ్ఞతాభావంతో ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. ► పండగలప్పుడు ట్రెడిషనల్‌గా డ్రెస్ చేసుకుని, చక్కగా పూజలు చేస్తుంటావు.. అమ్మ నేర్పిస్తుంటారా? నా చిన్నప్పటి నుంచి అమ్మ మన కల్చర్ గురించి మంచి విషయాలు చెబుతూ ఉంది. కల్చర్ పరంగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అమ్మకి ఇష్టం. మా అమ్మ మహారాష్ట్రీయన్.. నాన్న తెలుగు అని మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇంట్లో ఈ రెండు సంప్రదాయాలకు సంబంధించిన పండగలు చేసుకుంటాం. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ► మరి... మీ అమ్మగారి మదర్ టంగ్ మరాఠీ వచ్చా? మాట్లాడతాను కానీ అంత ఫ్లూయంట్‌గా రాదు. ► ఫ్రెండ్స్‌తో ఫుడ్ షేర్ చేయడం, కేరింగ్‌గా ఉండటం వంటివి కూడా అమ్మ చెబుతుంటారా? స్కూల్ లేక వేరే చోట ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేసినప్పుడు తినడానికి నా దగ్గర ఏం ఉంటే అది వాళ్లతో షేర్ చేసుకుంటాను. నా దగ్గర తక్కువ ఉన్నా సరే షేర్ చేస్తాను. ఎందుకంటే ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’ అని అమ్మ చెప్పింది. నేను ఫాలో అయిపోతున్నాను (నవ్వులు). ► మీ నాన్నమ్మలా ఉంటావు కాబట్టి మీ నాన్నగారు ఆ విషయం చెప్పి, గారాబం చేస్తుంటారా? ‘నువ్వు మా అమ్మలా ఉన్నావు’ అని నాన్న ఎప్పుడూ నాతో అంటుంటారు. బాగా ముద్దు చేస్తారు కూడా. కానీ నేను మా అమ్మలా కూడా ఉన్నానని అనుకుంటున్నాను ► నీ యూ ట్యూబ్ చానల్ సక్సెస్ వెనకాల అమ్మ హెల్ప్ ఉందా? అమ్మ బోలెడన్ని ఐడియాలు ఇస్తుంది. అది మాత్రమే కాదు.. షూట్ విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది. ► మరి.. ‘సర్కారువారి పాట కోసం’ నువ్వు చేసిన ‘పెన్నీ..’ సాంగ్‌కి ఆమె హెల్ప్ చేశారా? ఆ పాటలో నీ డాన్స్ బాగుంది... ఆ పాట షూట్ మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేవరకు నా డాన్స్ టీచర్ అనీ మాస్టర్‌తో పాటు అమ్మ నాతోనే ఉంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అనే విషయంలో గైడ్ చేసింది. అలాగే కెమెరా వెనకాల నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. ► డాన్స్ మొత్తం పూర్తయ్యాక ఆమె ఏమన్నారు? నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా రావడంతో అమ్మ చాలా హ్యాపీ ఫీలయింది. ‘నన్ను గర్వపడేలా చేశావు’ అని గట్టిగా హత్తుకుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ► పిల్లలకు ఆరోగ్యం బాగా లేనప్పుడు మీ అమ్మగారు ఎలా చూసుకుంటారు? అలాంటి సమయాల్లో మా అమ్మ మా పక్కనే ఉంటుంది. ఒంట్లో బాగాలేనప్పుడు ప్రత్యేకంగా డైట్ ప్లాన్ చేసి, మేం తినేలా చేస్తుంది. టైమ్‌కి టాబ్లెట్లు ఇచ్చి, చాలా కేరింగ్‌గా ఉంటుంది. ► నువ్వు, గౌతమ్ ఏం అడిగినా మీ అమ్మ కొనిపెడతారా? ఐస్‌క్రీములు, చాక్లెట్లు ఎక్కువగా తింటే ఒప్పుకుంటారా? మేం ఏం అడిగినా దాదాపు కాదనదు. అయితే ప్రతిదానికీ ఒక లిమిట్ ఉండాలంటుంది. మితి మీరితే ఏదీ మంచిది కాదని అమ్మ అంటుంది. నేను అమ్మ మాటని ఒప్పుకుంటాను. ► ఈ మధ్య ఫ్యామిలీ టూర్ వెళ్లారు కదా. ఆ విశేషాలు? మేం ప్యారిస్, బోర్దూ, ఫ్రాన్స్‌లోని లూర్దు వెళ్లాం. ఈఫిల్ టవర్ చూశాను. ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. – డి.జి. భవాని . -
తల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్.. మిస్ అయిన మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఇందిరా దేవీ పుట్టినరోజు సందర్భంగా ఓ అపురూపమైన ఫోటోను షేర్ చేసిన మహేశ్ తల్లికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. కుటుంబసభ్యుల మధ్య ఆమె పుట్టినరోజును జరుపుకున్నారు.సూపర్ స్టార్ కృష్ణ భార్యకు కేక్ తినిపించి విషెస్ తెలిపారు. చదవండి: ఆ హీరోయిన్ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్ ఈ వేడకల్లో సూపర్ స్టార్ కృష్ణ, నమ్రత, సితార, గౌతమ్, ప్రియదర్శిని, మంజులా, గల్లా జయదేవ్ దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మిగతా కుటుంబసభ్యులు పాల్గొనగా మహేశ్ బాబు మాత్రం మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్లో బిజీగా ఉండటంతోనే మహేశ్ రాలేకపోయారని తెలుస్తుంది. చదవండి: సర్కారు వారి పాట: ఫైనల్ షూటింగ్ -
బాలీవుడ్ స్టార్ హీరో భార్యతో నమ్రత అనుకోని లంచ్ డేట్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. కుటుంబం సహా పలు విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌తో ఓ ఫోటోను నమ్రత షేర్ చేసింది. అనుకోని లంచ్ డేట్ ఇది. చాలా సంవత్సరాల తర్వాత ఇలా కలిశాం. ఎన్నోఫ్లాష్బ్యాక్లు, గొప్ప జ్ఞాపకాలు, చాలా నవ్వులు మిగిల్చాయి అంటూ నమ్రత పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో తళుక్కుమన్నారు. కాగా మహేశ్, షారుక్ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. గతంలో 'బ్రహ్మోత్సవం' సెట్స్‌లో కూడా మహేష్ దంపతులను షారుక్ కలిసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సీతూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్ చూశారా? ఎంత బావుందో..
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇటీవలె కళావతి పాటతో మెస్మరైజ్ చేసిన సితార..రీసెంట్గా పెన్నీ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. ఇప్పటివరకు వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న సీతూ పాప తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 'సితార మొదటి కూచిపూడి డ్యాన్స్ ఇది. ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ఈ వీడియోను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ శ్లోకం రాముడి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. నా సీతూ పాప అంకితభావం, తన టాలెంట్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వు నన్ను మరింత గర్వపడేలా చేస్తున్నావు. సితారకు కూచిపడి నేర్పించిన గురువులకు ధన్యవాదాలు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు' అంటూ మహేశ్ పేర్కొన్నారు. ఇక సితూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
అది ఎప్పుడూ మిస్ చేసుకోం.. ప్రేమిస్తూనే ఉంటాం : నమ్రత ఎమోషల్ పోస్ట్
Superstar Krishna Best Moments With His Grandchildren: సూపర్ స్టార్ మహేశ్ బాబు మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిందే. స్టార్ హీరో అయినప్పటికీ తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు నార్మల్‌గానే ఉంటాడు. విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచే నేర్చుకున్నానని మహేశ్ చెబుతుంటాడు. అప్పట్లో కృష్ణ ఫుల్ బీజీగా ఉన్నప్పటికీ.. కుటుంబానికి మాత్రం సమయం కేటాయించేవాడట. ప్రతి రోజు ఉదయం కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి టిఫిన్ చేసేవాడట. రాత్రి పిల్లలతో మాట్లాడేవాడట. ఇప్పుడు మహేశ్ కూడా అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. షూటింగ్ లేకుండా ఖాలీగా ఉంటే.. ఆ సమయాన్ని అంతా ఫ్యామిలీకే కేటాయిస్తాడు. అలాగే వారానికి ఒక్క రోజు అయినా.. తన ఫ్యామిలీ అంతా కృష్ణ ఇంట్లో గడుపుతుంటుందట. తాజాగా ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘మండే లంచ్.. ఎప్పుడూ మిస్ అవ్వం.. ఎన్నో కథలు చెబుతుంటారు.. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.. మేం అంతా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం మామయ్య గారు’అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మహేశ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
పెళ్లై అప్పుడే 17 ఏళ్లయిందా?: శ్రీమతికి మహేశ్ స్వీట్ విషెస్
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మహేశ్‌బాబు. నటనాచాతుర్యంతో తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ హీరో. టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్న మహేశ్ నమ్రత శిరోద్కర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 'వంశీ' సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారగా అది కాస్తా పెళ్లి దాకా వెళ్లింది. వీరి వివాహం జరిగి నేటికి 17 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా మహేశ్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసి సతీమణికి శుభాకాంక్షలు తెలియజేశాడు. 'అప్పుడే 17 సంవత్సరాలు పూర్తైంది. హ్యాపీ యానివర్సరీ.. ఇలాంటి రోజులు మనం మరెన్నో జరుపుకోవాలి' అని రాసుకొచ్చాడు. ఇక నమ్రత కూడా స్పెషల్ వీడియో ద్వారా భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. 'సంతోషం, నమ్మకం, గౌరవం, కరుణ, సరదాతో కొనసాగిన మన ప్రేమను జీవితాంతం ఇంతే మధురంగా కొనసాగిద్దాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) So easily 17! Happy anniversary NSG!! Many more to us... it’s all about love ♥️♥️♥️ pic.twitter.com/Lw76cY77zu — Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2022 -
#SSMB28 : మహేశ్-త్రివిక్రమ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)
-
అంతకు మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు: మహేశ్ భార్య నమ్రత
Namrata Shirodkar's 50th Birthday Celebration Photo: సూపర్ స్టార్ మహేశ్‌బాబు సతీమణి నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె.. మహేశ్‌తో వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి కుటుంబ బాధ్యలతను నిర్వర్తిస్తోంది. మహేశ్ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంటే.. అతని వ్యాపారాలతో పాటు పిల్లల బాధ్యతలను ఆమే చూసుకుంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది నమ్రత. తమ వ్యక్తిగత విషయాలతో పాటు మహేశ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పకప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల(జనవరి 22) నమ్రత పుట్టిన రోజు జరిగింది. తన బర్త్‌డేని కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది నమ్మత. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు’అంటూ నమ్రత కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మహేశ్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేశ్‌బాబు
సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుటున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఒకపక్క వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరో పక్క సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఓ హాస్పిటల్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. దాని ద్వారా ఇప్పటి వరకు 1050 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. పేద పిల్లల పాలిట దైవంగా మారారు. (చదవండి: మనసు మార్చుకున్న మహేశ్.. ఇకపై తన టార్గెట్ అదేనట!) తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు మహేశ్. ఈ విషయాన్ని మహేశ్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సహస్ర అనే ఒక సంవత్సరం పాపకి కావాల్సినవి సమకూర్చి ఆంద్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయించారని, ప్రస్తుతం ఆ పాప క్షేమంగా ఉందని తెలిపారు నమ్రత. దీంతో ప్రేక్షకులు, అభిమానులు మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
బాలీవుడ్లో కరోనా కలకలం.. నమ్రత సోదరికి పాజిటివ్
దేశంలో కరోనా మళ్లీ విజృంభించింది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సాధారణ ప్రజలు మొదలు.. సెలబ్రిటీల వరకు కరోనా ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, ఐటెం బ్యూటీ నోరా ఫతేహి తదితరులు కోవిడ్ బారిన పడగా.. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్‌కి కరోనా సోకింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. గత నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోని, అన్ని నియమాలను పాటించండి’ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది శిల్ప. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది. -
దుబాయ్‌లో పార్టీ చేసుకున్న నమత్ర, ఉపాసన!
టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్‌బాబు, రామ్‌చరణ్ తమ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండగా వాళ్ల సతీమణులిద్దరూ దుబాయ్‌లో పార్టీ చేసుకున్నారు. మహేశ్ భార్య నమ్రత, రామ్‌చరణ్ భార్య ఉపాసన ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం మనందరికీ తెలిసిందే. దుబాయ్ ఎక్స్పో 2020లో భాగంగా వీళ్లిద్దరూ అక్కడికి వెళ్లి క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన.. నమత్ర, ఆమె సోదరి శిల్పా, మనీశ్ మల్హోత్రా తదితరులకు లంచ్ పార్టీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 'ఇష్టమైనవారితో రుచికరమైన విందు. ఈ మధ్యాహ్నాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను. ఉపాసన.. నీలా అద్భుతమైన వంటకాలతో విందును ఎవరూ ఇవ్వలేరు. మనీశ్.. నిన్నిక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. మనమంతా మరోసారి హైదరాబాద్‌లో ఇలాంటి పార్టీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అది కూడా త్వరలోనే! అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది నమ్రత. 'నిజంగా చాలా ఎంజాయ్ చేశాం. లవ్లీ మీటింగ్. త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ప్లాన్ చేద్దాం' అని బదులిచ్చింది ఉపాసన. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
'సర్కారు వారి పాట' సెట్లో నమ్రత సందడి
Namrata And Keerthy’s BTS picture from SVP: మహేశ్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది. దీంతో మహేశ్ తన ఫ్యామిలీని తీసుకొని స్పెయిన్ వెళ్లారు. ఓ వైపు మహేశ్ సినిమా షూటింగులో పాల్గొంటూనే మరోవైపు వెకేషన్లో ఉన్నారు. తాజాగా సర్కారు వారి పాట చిత్రీకరణలో స్పెయిన్‌లో ముగిసింది. చివరి రోజున సినిమా సెట్స్‌లో మహేశ్ భార్య నమ్రత సందడి చేసింది. సాంగ్ షూట్ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఆమె కీర్తి సురేశ్‌తో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కానుంది. చదవండి: ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే.. Hyper Aadi: ఏడాదికి హైపర్ ఆది ఎంత సంపాదిస్తున్నాడంటే.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయన పరశురాం దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఆ చిత్రంలో షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ సమయంలో కొంచెం గ్యాప్ తీసుకున్న ప్రిన్స్ భార్య, పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌లో ట్రిప్‌లో ఉన్నాడు. తాజాగా ఈ ట్రిప్‌లో పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఈత కొడుతున్న ఎంజాయ్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరితో కలిసి శాంతిని కనుగొన్నట్లు క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే ఆయన భార్య నమ్రతా సైతం ఈ ట్రిప్ సంబంధించి చిన్న వీడియోని షేర్ చేసింది. అందులో సూపర్ స్టార్ తన కూతురితో కలిసి లూసెర్న్‌లో నడుస్తున్నాడు. దీంతో ఇవీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి. చదవండి: నా సూపర్ ఉమెన్‌తో ఇలా, చాలా ఆనందంగా ఉంది: మహేశ్ View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
హాలో మ్యాగజైన్ కోసం తన ‘సూపర్ ఉమెన్’తో సూపర్ స్టార్ ఫొటోలు వైరల్
-
మహేశ్ ఫ్యామిలీ ఇంట వినాయక నిమజ్జన వేడుకలు.. వీడియో వైరల్
Mahesh Babu Family Ganesh Chaturthi Celebrations: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫ్యామిలీ ప్రతి ఏటా వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకుంటుంది. ఇంట్లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించి నిష్టగా పూజలు చేస్తారు. అయితే ఈ సారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు ఘట్టమనేని ఫ్యామిలీ. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు.మట్టి గణేషుడిని ఇంట్లోని తొట్టిలో నిమజ్జనం చేయగా, ఆ కార్యక్రమంలో మహేశ్, నమ్రత, సితార, గౌతమ్ పాల్గొన్నారు. నిమజ్జనం చేసే ముందు పూజలు చేసి ఆ తర్వాత గణేషుడికి బైబై చెప్పారు. ‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నాను అంటూ నమ్రత ఓ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. (చదవండి: సైదాబాద్ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్) వినాయక విగ్రహాల నిమజ్జనం జలవనరులు కాలుష్యానికి కారణం కాకుడదని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మహేశ్‌బాబు, నమ్రత సహజంగానే ప్రకృతి ప్రేమికులు. పర్యావరణాన్ని కాపాడుతూనే పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవచ్చని ఘట్టమనేని ఫ్యామిలీ నిరూపించింది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
గౌతమ్ బర్త్‌డే: మహేశ్, నమ్రత ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల తనయుడు గౌతమ్ ఘట్టమనేని 15వ పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 31). ఈ సందర్భంగా గౌతమ్‌కు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ లిటిల్ ప్రిన్స్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు మహేశ్ బాబు, నమ్రత. హ్యాపీ 15 మై సన్.. నీ ఎదుగుదలను చూస్తుండడం నాకెప్పుడూ గొప్ప ఆనందం.. ఎల్లప్పుడూ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. వెళ్లి ప్రపంచాన్ని జయించు.. లవ్ యూ’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. ఇక నమ్రత కూడా ఇన్‌స్టా వేదికగా తమ కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. గౌతమ్ ఫోటోని షేర్ చేసింది. Happy 15 my son!! Watching you grow has been my greatest joy. Wishing you the best today and always! Go on and conquer the world 🤗🤗🤗 Love you, GG ♥️♥️♥️ pic.twitter.com/cLbfuCPvRL — Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2021 ఇక గౌతమ్ విషయానికి వస్తే.. మహేశ్ హీరోగా నటించిన వన్- నేనొక్కడినే సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు గౌతమ్‌కు కేవలం 8 సంవత్సరాల వయస్సు మాత్రమే. 2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన గౌతమ్.. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌లోని టాప్ 8 ఈతగాళ్లలో స్థానం దక్కించుకున్నాడు. ఈతలోని నాలుగు విధానాల్లో గౌతమ్ అద్భుతంగా ఈదగలడు. ప్రస్తుతం స్టడీస్‌తో పాటు తనకిష్టమైన స్పోర్ట్స్‌లోనూ రాణిస్తున్న గౌతమ్ త్వరలో హీరోగా అరంగేట్రం చేస్తాడని సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
అందువల్లే రమేశ్ బాబుకు నటించాలన్న ఆసక్తి పోయింది: కృష్ణ
Krishna About Namrata Shirodkar: సూపర్ స్టార్ మహేశ్‌బాబు తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అయితే అతడు పెద్ద స్టార్ అవుతాడని తమకెప్పుడో తెలుసంటున్నారు మహేశ్ తండ్రి, సీనియర్ నటుడు కృష్ణ. కృష్ణ సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పోరాటం' సినిమాలో తనయులు మహేశ్ బాబు, రమేశ్ బాబు ఇద్దరూ బాగా నటించారన్నారు. కానీ ఆ తర్వాత రమేశ్ కెరీర్లో మంచి సినిమాలు పడలేదన్నారు. అందుకే రమేశ్ బాబుకు నటించాలన్న ఆసక్తి సన్నగిల్లిందని చెప్పుకొచ్చారు. ఇక తన కోడలు నమ్రత సినిమాలు, బిజినెస్ పట్టించుకోదని, అన్నీ తన కొడుకే చూసుకుంటాడని తెలిపారు. ఆయన ఇంకా ఏమేం మాట్లాడారో తెలియాలంటే కింది వీడియో చూసేయండి.. -
మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్
గోవాలో ‘సర్కారువారి పాట’ షెడ్యూల్ ముగిసింది. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ గోవాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ బుధవారంతో ముగిసింది. ఈ గోవా షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సెస్‌ను షూట్ చేశారు. ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలైన గోవా షెడ్యూల్ మరో యాక్షన్ సీక్వెన్స్‌తో పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి : ఎస్... అవన్నీ వదంతులే! ‘బంగార్రాజు’ మూవీ షూటింగ్ స్టార్ చేసిన అక్కినేని హీరోలు -
మహేశ్సార్కు దిష్టి తీయడం మర్చిపోకండి: కీర్తిసురేష్
Keerthi Suresh Suggestion Namrata Shirodkar : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అనగానే టక్కున గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. ఆయన అందానికి ఫిదా కాని వాళ్లు అమ్మాయిలెవరూ ఉండరేమో. అందుకే అత్యధిక లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేశ్ ముందుంటారు. 46 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ యంగ్‌లుక్‌లో కనిపిస్తూ కుర్ర హీరోలకు సైతం షాకిస్తున్నాడు. వయసు పెరిగేకొద్దీ మరింత సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారాయన. కాగా నిన్న(ఆగస్టు9)న మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా పలవురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ కీర్తి సురేష్ సైతం మహేశ్‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..నమ్రత మేడమ్..మహేశ్ సార్ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి అంటూ ఓ పోస్టును షేర్ చేసింది. దీనిపై స్పందించిన నమ్రత..సరే అంటే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..
సాక్షి, వెబ్ డెస్క్: వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత కూడా ఒకరు. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద అంతగా మెప్పింపలేకపోయింది. కానీ వీరి ప్రేమకు మజిలీగా మారింది. వంశీ షూటింగ్ సమయంలోనే నమ్రత-మహేశ్ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది. షూటింగ్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ తొలుత కుటుంబం అంగీకరించలేదట. దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. అలా నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్-నమ్రతల రిలేషన్ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం.ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. 'టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడు లేదు. మహేశ్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా. పెళ్లయి ఇన్నేళ్లయినా ఒక్కసారి కూడా ఈ విషయంలో రిగ్రేట్‌గా అనిపించలేదు. మహేశ్ కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ఎంత బిజిగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. వీటన్నింటికీ మించి గొప్ప మానవతా వాది. అందుకే మహేశ్ అంటే నాకు ఎంతో ప్రేమ, ఆరాధన. ఆయన్ను పెళ్లిచేసుకోవడం నాకు లభించిన అత్యంత ప్రత్యేకమైన బహుమతిగా ఫీల్ అవుతుంటా' అని నమ్రత పేర్కొంది. -
Mahesh Babu: సీతూ పాపతో మహేశ్.. పిక్ వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిందే. స్టార్ హోదా ఎంత పెరిగినా తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు నార్మల్‌గానే ఉంటాడు. తండ్రికి మంచి కొడుకుగా, భార్యకు మంచి భర్తగా, పిల్లలకు మంచి తండ్రిగా మహేశ్ ఉంటాడు. విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇక లాక్డౌన్ సమయంలో అయితే మహేశ్ ఎక్కువగా కొడుకు గౌతమ్, కూతురు సితారాతోనే గడిపేస్తున్నాడు. వారితో కలిసి సరదాగా ఆడుకున్నాడు. ఆ ఫొటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో, దానిపై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మహేశ్ బాబు తన గారాల పట్టి సితారాను గట్టిగా హత్తుకొని నిద్రపోయాడు. ఆ దృశ్యాన్ని నమత్ర తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఇలాంటి హగ్గులు అనూహ్యంగా వస్తుంటాయ్.. ఎప్పుడైనా ఎక్కడైనా.. ఇలా వస్తాయ్. ఒక వేళ పాఠశాలలు ప్రారంభమైతే.. ఇలాంటివి ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటాయి. అదే ఇప్పుడు మహేశ్ బాబు రియలైజ్ అవుతున్నాడు’అని నమ్రత చెప్పుకొచ్చింది. ఇక మహేశ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: సర్కారువారి పాట’ అప్డేట్స్ ఎప్పుడంటే.. -
నాన్న కూచి.. మహేశ్ ఒడిలో సితార అలా.. ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మనందరికీ తెలిసిందే. షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే ప్రిన్స్.. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇక లాక్డౌన్ సమయంలో అయితే మహేశ్ ఎక్కువగా కొడుకు గౌతమ్, కూతురు సితారాతోనే గడిపేస్తున్నాడు. వారితో కలిసి సరదాగా ఆడుకున్నాడు. ఆ ఫొటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో, దానిపై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేశ్ బాబుని తమ గారాలపట్టీ సితార పాప హత్తుకుని పడుకున్న ఫొటో నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఛైర్లో కూర్చొని ఉన్న తండ్రిని సితార పాప గట్టిగా హత్తుకొని నిద్రపోయింది. ఆ దృశ్యాన్ని నమత్ర తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.‘ఉదయాన్నే గట్టిగా కౌగిలించుకోవడం తప్పనిసరి ! లేదంటే నిద్ర నుంచి తేరుకోవడం చాలా కష్టం.. నిద్రలేపాలంటే ఇదో మంత్రం.. అని నమ్రత తన గారాల పట్టి సితార అలవాటుని బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక మహేశ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఈ ఫోటో.. చిరునవ్వులు తీసుకొచ్చింది : నమ్రత
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజుకి లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే భయంతోనే చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు సినీ, క్రీడా ప్రముఖులు. ప్రస్తుత పరిస్థితుల్లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని సలహా ఇస్తూ పోస్ట్ పెట్టింది సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత. ‘ప్రస్తుతం మన చుట్టూ విషాదాలు, దుర్భర పరిస్థితులే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ రోజు నా మొహంపై చిరునవ్వులు తీసుకొచ్చింది ఈ ఫోటో. ఇవన్నీ కూడా అద్భుతమైన మెమోరీస్. మీరు కూడా అలాంటి వాటిని వెతికి చూసుకోండి.. కాస్త నవ్వేందుకు ప్రయత్నించండి’అంటూ సితార చిన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. దీనికి మెమోరీ థెరపీ అనే హాష్ట్యాక్ని యాడ్ చేసింది. ఇక బుల్లి సితార ఫోటోని చూసి మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సితార ఎంత క్యూట్‌గా ఉందో అంటూ మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఎన్టీఆర్ తన పిల్లల ఫొటోలు, వీడియోలు ఎందుకు షేర్ నెట్టింట వైరలవుతున్న సుధీర్‌బాబు ఫ్యామిలీ ఫోటోలు -
మా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి అది!
అమ్మ అంటే అనురాగం... అమ్మ అంటే ఆలంబన... అమ్మ అంటే ఆత్మస్థయిర్యం... అమ్మ అంటే కొండంత అండ... నిస్వార్థమైన ప్రేమకు చిరునామా – అమ్మ. ‘మాతృదినోత్సవం’ సందర్భంగా తన తల్లి వనితా శిరోద్కర్ గురించి నటి, మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చెబుతూ, ‘అమ్మ అంటే ధైర్యం’ అన్నారు. ఇంకా తన తల్లి, పిల్లల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► మీ అమ్మగారి గురించి? నమ్రత: అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ మా అమ్మ. ఈరోజు నేను, నా సోదరి (శిల్పా శిరోద్కర్) స్ట్రాంగ్ ఉమెన్‌గా ఉండగలుగుతున్నామంటే మా అమ్మ పెంపకం వల్లే! మా అమ్మ జీవన విధానం నాకు గొప్ప ఇన్స్పిరేషన్. అమ్మ జాబ్ చేసేవారు. ఇంటినీ, ఉద్యోగాన్నీ ఆవిడ బ్యాలెన్స్ చేసుకున్న తీరు అద్భుతం. మేం ‘నెగ్లెక్టెడ్ చిల్డ్రన్’ అనే ఫీలింగ్ మాకెప్పుడూ కలగలేదు. అమ్మలేని లోటును నేనెప్పటికీ ఫీలవుతుంటాను. అయితే ఆవిడలోని చాలా విషయాలను నా సిస్టర్ శిల్పలో చూస్తున్నాను. ► అమ్మ నుంచి ఏం నేర్చుకున్నారు? ఇతరుల పట్ల దయగా ఉండడం... మానవత్వం. అన్ని సమయాల్లో ధైర్యంగా ఉండడం, సవాళ్లను ఎదుర్కోవడం వంటివన్నీ ఆమె నుంచి నేర్చుకున్నాను. అవి నా పిల్లలకు నేర్పుతున్నాను. మా అమ్మ తన పిల్లలకు ‘బెస్ట్ మామ్’గా నిలిచారు. మా అమ్మలా నేను నా పిల్లలకు బెస్ట్ మామ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ► అమ్మతో గడిపిన ఆనంద క్షణాలు? మా అమ్మగారి చివరి రోజుల్లో నాతో ఎక్కువగా గడిపారు. అవి నాకు ముఖ్యమైన రోజులు. ఆ మూడు నెలలు అమ్మకు ఏమేం చేయాలో అన్నీ చేశాను. అమ్మ చుట్టూ తిరుగుతూ ఆవిడను చూసుకున్న ఆ మూడు నెలలు నాకు స్పెషల్‌గా గుర్తుండిపోతాయి. ► సమస్యలను అధిగమించడానికి మీ అమ్మగారు ఎలా హెల్ప్ చేసేవారు? అమ్మకు ఒక మంచి లక్షణం ఉండేది. ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు ఓపికగా వినేవారు. ‘వినడం’ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవారు. సమస్య మొత్తం విన్నాక అప్పుడు పరిష్కార మార్గం చెప్పేవారు. సమస్య అనే కాదు.. ఏ విషయాన్నయినా పూర్తిగా వినాలనే లక్షణం అమ్మ నుంచి నాకు అలవాటయింది. ► అమ్మ చేసిన వంటల్లో నచ్చినవి? పెప్పర్ చికెన్, అలాగే వైట్ సాస్ చికెన్ కూడా అద్భుతంగా వండేవారు. ► ‘ఆడపిల్లలు’ అంటూ... మీ అమ్మగారు పదే పదే జాగ్రత్తలు చెప్పేవారా? జాగ్రత్తలు చెప్పేవారు కానీ పదే పదే చెప్పేవారు కాదు. ఒక తల్లిగా తను చెప్పదలచుకున్నవి చెప్పేవారు. కానీ ఏదైనా మా అంతట మేం తెలుసుకోవాలనేవారు. అలాగే ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోమనేవారు. ఎలా ఉంటే ఆ దారి బాగుంటుందో మాత్రం చెప్పేవారు. అలా చేయడం వల్ల మాకంటూ సొంత వ్యక్తిత్వం ఏర్పడింది. పిల్లల చెయ్యి పట్టుకుని నడిపించాలి. కానీ వాళ్ల జీవితం మొత్తం పట్టుకునే నడిపించాలనుకుంటే సొంత వ్యక్తిత్వం ఏర్పడదని నమ్మిన వ్యక్తి మా అమ్మ. ► మీకు ఆంక్షలు ఏమైనా పెట్టేవారా? కొన్ని రూల్స్ పెట్టేవారు. అయితే నేను వాటిని ఆంక్షలు అనను. ఏ తల్లయినా పిల్లలకు కొన్ని నియమాలు పెట్టడం చాలా అవసరం. అవి వాళ్ల భవిషత్తుకు మంచి పునాది అవుతాయి. ► మీరు మీ పిల్లలతో ఎలా ఉంటారు? పిల్లల కోసం పూర్తిగా టైమ్ కేటాయిస్తాను. పిల్లలకు మంచీ చెడు చెబుతుంటాను. గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్‌కి తేడా చెబుతాను. వీలైనంత నిరాడంబరంగా ఉండమని చెబుతాను. దాదాపు ఏ పిల్లలూ అదే పనిగా చదువుకోవడానికి ఇష్టపడరు. అందుకే చదివించేటప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాను. చదువుతో పాటు పిల్లలకు ఆటలు కూడా ముఖ్యం. గౌతమ్‌కు స్విమ్మింగ్, సితారకు డ్యాన్స్ వంటి క్లాసులు ఉన్నాయి. వాటిని ఇద్దరూ ఎంజాయ్ చేస్తారు. ► కరోనా లాక్డౌన్లో పెద్దలు, పిల్లలు బయటికి వెళ్లే వీలు లేదు. ముఖ్యంగా పిల్లల అల్లరిని ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? ఇద్దరూ గొడవపడుతుంటారా? మా ఇద్దరు పిల్లలు బంగారాలనే చెప్పాలి. వాళ్లను మ్యానేజ్ చేయడం నాకెప్పుడూ ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. అందుకని మిగతా రోజులకి, లాక్‌డౌన్‌కి నాకు తేడా తెలియడంలేదు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే గొడవపడడం కామన్. వీళ్లిద్దరిదీ ఇల్లు పీకి పందిరేసేంత అల్లరి కాదు కాబట్టి మ్యానేజ్ చేసేయడమే (నవ్వుతూ). ► ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలను ఏ విధంగా చూసుకోవాలి? పిల్లలతో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలి. అలాగే మాస్కు ధరించడంవల్ల ఉండే ఉపయోగాలను పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. ‘ఈ టైమ్‌లో కొంచెం ఎక్కువ శుభ్రంగా ఎందుకు ఉండాలి? భౌతిక దూరం ఎందుకు పాటించాలి?’ అనే విషయాలను పిల్లలకు వివరించాలి. అలాగే ఈ సమయంలో స్వచ్ఛమైన గాలి చాలా అవసరం. శుభ్రమైన శ్వాస ప్రాముఖ్యాన్ని చెప్పాలి. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం పిల్లలకు ఇవ్వాలి. నీళ్లు ఎక్కువగా తాగాలని చెప్పాలి. మా అమ్మ ఎప్పుడూ కరెక్టే! ► మీ అమ్మగారు మీకిచ్చిన ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ... చెప్పిన విషయాల గురించి కానీ షేర్ చేసుకుంటారా? ఓ సందర్భలో మా అమ్మ నాకు ‘శ్రీసాయి సచ్చరిత్ర’ పుస్తకాన్ని ఇచ్చారు. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినప్పుడు, సవాళ్లు ఎదురైనప్పుడు ఆ పుస్తకాన్ని ఏకాగ్రతగా చదవమని చెప్పారు. మంచి చేయడంతో పాటు సవాళ్లను అధిగమించి ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని అన్నారు. నేను ఏడు రోజుల పారాయణం పూర్తి చేశాను. మా అమ్మ ఎప్పుడూ కరెక్టే. సచ్చరిత్ర చదువుతున్నప్పుడే నాకు ఓ బలం, నమ్మకం ఏర్పడ్డాయి. ఇతరుల నుంచి ఏదీ ఆశించకుండా అభిమానించడం, జీవితాన్ని స్పష్టంగా చూడడం కూడా అలవాటైంది. మా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి అది! ► మీ అమ్మగారు ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొనాలనుకున్నారట. కానీ మీరు ‘మిస్ ఇండియా’ అయ్యారు... ‘మిస్ ఇండియా’ కాంటెస్ట్‌లో అమ్మ పాల్గొనలేకపోవడానికి కారణం అప్పటికే ఆమెకు పెళ్లి కావడమే! నన్ను మిస్ ఇండియాగా చూడాలన్నది ఆమె కల. అది నెరవేర్చగలిగాను. నేను సాధించిన ‘మిస్ ఇండియా’ కిరీటం నా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి. వాళ్ల కోసం ఏదో సాధించానన్న తృప్తి నాకెప్పటికీ ఉంటుంది. నితిన్, వనిత దంపతులు మా మమ్మీ చాలా కూల్ – సితార మహేశ్‌బాబు–నమ్రతల ముద్దుల కుమార్తె సితార తన తల్లి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పిన విశేషాలు... ► మీ అమ్మగారు వెరీ స్ట్రిక్టా? మా అమ్మ చాలా గారాబం చేస్తుంది. వెరీ కూల్. వెరీ స్వీట్. అయితే స్ట్రిక్ట్‌గా ఉండాల్సినప్పుడు మాత్రం ఉంటుంది. మేం తప్పు చేస్తున్నాం అనిపించగానే మందలిస్తుంది. కరెక్ట్ ఏంటో చెబుతుంది. ► నువ్వు అలిగినప్పుడు మీ అమ్మ ఏం చేస్తారు? ఫన్నీ స్టోరీలు చెప్పి నవ్విస్తారు. ► నీతో ఎప్పుడూ ఏం చెబుతుంటారు? ‘ముందు చదువుకో... తర్వాతే ఆటలు’ అంటారు. ► మరి.. స్టడీస్ విషయంలో హెల్ప్ చేస్తారా? ఓ.. అన్ని సబ్జెక్టులకీ హెల్ప్ చేస్తారు. అలాగే ఆర్ట్ వర్క్‌కి కూడా! నాకేది ఇష్టమో అవన్నీ చేస్తారు. ► నీతో ఆటలు ఆడుకుంటారా? మేం ఇన్డోర్ గేమ్స్ ఆడతాం. మేము ఇంట్లో పెంచుతున్న మా పెట్స్ నోబు, ప్లూటోతో బాగా ఆడుకుంటాం. ► మీ అమ్మ ఫేవరెట్ ఫుడ్? అమ్మకు అన్నీ ఇష్టమే. హెల్త్ కోసం మంచివే తినాలంటారు. ఆర్గానిక్ ఫుడ్‌ని ఇష్టపడతారు. ► మదర్స్ డే సందర్భంగా అమ్మకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు నచ్చినవి చేయడానికి ఎంకరేజ్ చేసే ‘బెస్ట్ మామ్’ మా అమ్మ. నా బెస్ట్ మామ్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. – డి.జి. భవాని -
వ్యాక్సినేషన్ కోసం ఇలా చేయండి.. రాష్ట్ర ప్రభుత్వాలకు నమ్రత విజ్ఞప్తి
Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకి మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కేసుల సంఖ్య పెరడంతో ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరకడం లేదు. కరోనా సోకి కొంతమంది మృతి చెందితే, ఆక్సిజన్ అందక మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని సైతం ప్రకటించాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ముందుగా 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సీన్‌ని అందిస్తుంది. అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వృద్ధులకు, దివ్యాంగులకు చాలా కష్టంగా మారింది. వ్యాక్సిన్ కోసం సీనియర్ సిటిజన్లు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అలా క్యూలో నిలుచుంటే కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఎక్కువసేపు వాళ్ళు నిలుచో లేరు. ఈ నేపథ్యంలో ముంబై, భోపాల్ ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఉన్న చోటుకే వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. కారులోనే, ఇతర వాహనాలలో ఉన్నా కూడా అక్కడే టీకా అందిస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత చెబుతూ.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ‘భోపాల్, ముంబైలోవ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. ఎంతో మంచి నిర్ణయమది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు కారులోనే వ్యాక్సిన్ వేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కష్టకాలం నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి అని నమత్ర కోరారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
అరుదైన ఫోటో షేర్ చేసిన నమ్రత, డాడీ డైనోసార్ అంటున్న విష్ణు
ఇంట్లోనే సేఫ్‌గా ఉండి తన సినిమా చూడండి అంటూ.. వకీల్‌సాబ్ సినిమా చూస్తున్న ఫోటోని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకంది అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. బేబీ అండ్ డాడీ డైనోసర్ అంటూ కుమారుడి బుగ్గలు కొరుకూ ఫోటోని బంధించి అభిమానులతో పంచుకున్నాడు మంచు విష్ణు భర్త మహేశ్ బాబు, కొడుకు గౌతమ్‌తో కలిసిన దిగిన అరుదైన ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది నమ్రతా శిరద్కర్ అజిత్‌కు బర్త్‌డే విషెష్ చెప్తూ తనతో దిగిన ఫోటోని షేర్ చేసుకుంది హీరోయిన్ లక్ష్మీరాయ్ తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్ View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by renu (@renuudesai) రీతూ వర్మ View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by sundeep kishan (@sundeepkishan) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by ANIL GEELA (@myvillageshow_anil) -
పోకిరి మూవీకి 15 ఏళ్లు.. నమ్రత కామెంట్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ కమర్షియల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేటికి ఈ సినిమాను మర్చిపోని వారు లేరు. పోకిరిలోని కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ఇప్పటికి వినబడుతూనే ఉంటాయి. ఇక ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు, ‘ఎప్పుడు వచ్చావని కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా?’ అనే డైలాగ్స్ ఎంత పాపులరయ్యాయో అందరికి తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ‘పోకిరి’ చిత్రం విడుదలై నేటికి (ఏప్రిల్ 28) 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పండు ఫొటోను షేర్ చేస్తూ తన స్పందనను తెలిపారు. ‘;పోకిరి ఒక సంచలనాత్మక చిత్రం. క్లాస్, మాస్ వంటి సంపూర్ణ మిశ్రమ చిత్రం. పండుగా మహేశ్ జీవితకాలం గుర్తుండిపోయే అద్భుతమైన చిత్రం’ అంటూ రాసుకొచ్చారు. కాగా పోకిరి మూవీని కోరియోగ్రఫర్, దర్శకుడు, ప్రభుదేవ హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘వాంటెడ్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో ‘పోక్కిరి’గా కూడా రీమేక్ అయ్యింది. ఇందులో మహేశ్ పాత్రలో తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించాడు. కాగా ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఆ ట్రిప్ మరవలేనిది.. మేమిద్దరమే ఎంజాయ్ చేశాం: నమ్రత
సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మనందరికీ తెలిసిందే.షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే ప్రిన్స్.. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇక లాక్డౌన్ సమయంలో అయితే మహేశ్ ఎక్కువగా కొడుకు గౌతమ్, కూతురు సితారాతోనే గడిపేశాడు. వారితో కలిసి సరదాగా ఆడుకున్నాడు. ఆ ఫొటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో, దానిపై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేశ్ బాబు షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్తే.. తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్తుంటాడు. అలా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన మహేశ్.. భార్య నమ్రత, కొడుకు గౌతమ్‌ని కూడా వెంట తీసుకెళ్లాడు. మహేశ్ షూటింగ్లో పాల్గొంటే.. సితారా కొడుకుతో కలిసి అక్కడి పర్వతాలను చుట్టేసిందట. అక్కడి అందమైన లోకేషన్స్ అన్ని వీక్షించి ఎంజాయ్ చేసిందట. ఆ రోడ్ ట్రిప్ ఎన్నటికీ మరచిపోలేనిదంటూ.. గౌతమ్‌తో దిగిన ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరలయింది. ఇది చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ఇద్దరు చాలా అందంగా ఉన్నారు, సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ న్యూ పిక్: ఎంత ముద్దొస్తున్నాడో..
మహేశ్‌బాబు.. ఈ పేరులోనే ఓ మత్తు ఉంది. టాలీవుడ్ ప్రిన్స్‌గా పేరొందిన మహేశ్‌కు అభిమానులు కోట్లలో ఉన్నారు. ఆయన నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఆనందంలో మునిగితేలుతుంటారు. సినిమా నుంచే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆరాధిస్తుంటారు. ఎంత మంది హీరోలున్న అమ్మాయిల ఫాలోయింగ్‌లో మాత్రం మహేశ్ ముందు వరుసలో ఉంటాడు. వయస్సు పెరిగే కొద్దీ సాధారణంగా ఎవరికైనా అందం తగ్గుతుంటే అదేంటో మన ప్రిన్స్ మాత్రం మరింత యంగ్‌గా తయారవుతున్నాడు. ఈ మధ్య కాలంలో తన డిఫరెంట్ లుక్స్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాడు. మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు తన భర్తకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫాన్స్‌ను అలరిస్తుంటారు. తాజాగా నమ్రత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో మహేశ్ న్యూ ఫోటోను షేర్ చేసింది. ‘మీ మెనూలోకి చిరునవ్వును చేర్చండి. ప్రతిరోజూ సంతోషంగా మారుతుంది.’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేశారు. ఎప్పుడూ క్లీన్ అండ్ నీట్‌గా కనిపించే హీరో ఈసారి గజిబిజిగా ఉన్న జుట్టు, చిరునవ్వుతో దర్శనమిచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘తరగని అందం.. మహేశ్ సొంతం, ఎంత ముద్దొస్తున్నాడో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. సర్కారు వారి పాటలో నటిస్తున్నాడు మహేశ్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకొని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. కూతురు నమ్రతతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. చదవండి: సర్కారు వారిపాట: మహేశ్‌కి తండ్రిగా సీనియర్ హీరో వకీల్ సాబ్ బిగ్ అప్డేట్ వచ్చేసింది -
కూతురి గిఫ్ట్‌ను చూసి మురిసిపోతున్న మహేష్
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార చిన్నతనంలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరో కూతురుగానే కాక డ్యాన్స్, సింగింగ్ లాంటి వ్యక్తిగత టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సితారకు తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ.. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా పేరెంట్స్‌కు మంచి బహుమతిని అందించి వారిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పురస్కరించుకొని మహేష్, నమ్రతకు గ్రీటింగ్ కార్డు ఇచ్చింది సితార. దానిపై లవ్ యూ అమ్మ, నాన్న.. హ్యపీ వాలెంటైన్ డే అని రాసిచ్చింది. కూతురు నుంచి ఇలా ఊహించని గిఫ్ట్ అందడంతో మహేష్ దంపతులు ఎమోషనల్ అయ్యారు. ఇక కూతురు ప్రేమగా ఇచ్చిన గ్రీటింగ్ కార్డును అభిమానులతో పంచుకున్నాడు మహేష్. థ్యాంక్ యూ సితూ పాప అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. నమ్రత సైతం సితార గిఫ్టుకు మురిసిపోయి, థ్యాంక్యూ తల్లి అంటూ కూతురుపై ప్రేమను కురిపించింది. ఇదిలా ఉండగా ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుంది. అక్కడే ఫ్యామిలీతో ఉన్న మహేష్ బాబు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. గీత గోవిందం తర్వాత పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి 2022కు విడుదల కానుంది. చదవండి : వైరల్ అవుతున్న సితార తాజా ఫొటోలు View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
పెళ్లిరోజు: భార్యకు మహేష్ రొమాంటిక్ విష్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నమ్రత శిరోద్కర్ దాంపత్య జీవితానికి నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్యూట్ కపుల్ బుధవారం 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి రోజు సందర్భంగా నమ్రతకు విషెస్ చెబుతూ భార్యపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు మహేష్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్ పోస్టు పెట్టారు. నమ్రతకు ప్రేమతో నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ. ‘16 ఏళ్ల ప్రేమకు శుభాకాంక్షలు మై లవ్.. జీవితాంతం నీతో కలిసి ఉంటాను’ అంటూ పేర్కొన్నారు. చదవండి: స్నేహితుడికి అండగా మహేష్.. ట్రైలర్ రిలీజ్ నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత.. అచ్చం ఇలాగే నమ్రత కూడా మహేష్ బుగ్గలపై కిస్ చేస్తున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘16 ఏళ్లు త్వరగా గడిచిపోయాయి. ఇన్నేళ్ల జీవితంలో అమితపైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలగలిసి ఉన్నాయి. పెళ్లి రోజు శుభాకాంక్షలు మహేష్.. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను’. అని భర్తపై ప్రేమను కురిపించారు. కాగా వంశీ సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు.. ఆ సమయంలోనే ప్రేమలో పడి 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.. కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్నారు. ఇక ప్రస్తుతం మహేష్ తన కుటుంబంతో కలిసి దుబాయిలో ఉన్నాడు. అక్కడ సర్కారు వారి పాట షూటింగ్లో పాల్గొంటున్నాడు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
‘సర్కారు వారి పాట’ కోసం దుబాయ్ ఛలో
‘సర్కారు వారి పాట’ చిత్రీకరణను షురూ చేయడానికి మహేశ్ బాబు సిద్ధమయ్యారు. దుబాయ్ ప్రయాణం అయ్యారు కూడా. వచ్చే వారం నుంచి దుబాయ్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కీర్తీ సురేశ్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ 26న దుబాయ్‌లో ప్రారంభం కానుంది. కుటుంబంతో కలసి దుబాయ్ ప్రయాణం అయ్యారు మహేశ్‌బాబు. కోవిడ్ తర్వాత తొలిసారి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మహేశ్. ఇవాళ నమ్రత పుట్టిన రోజు. దుబాయ్‌లో బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నారు. చదవండి: నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు: మహేష్ -
నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు: మహేష్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతోనే గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫ్యామిలీ అకేషన్స్ అయితే మరింత గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. నేడు మహేష్ భార్య నమ్రత పుట్టినరోజు సందర్భంగా దుబాయ్‌లో గ్రాండ్‌గా వేడుకలు ప్లాన్ చేసినట్లు సమాచారం. జనవరి 22వ తేదీ 1972 సంవత్సరంలో జన్మించిన నమ్రత.. నేడు 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. శ్రీమతి పుట్టిరోజు సందర్భంగా సూపర్‌స్టార్ స్పెషల్ విషెస్ అందజేశారు. (మహేశ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్) 'ఈరోజు నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు. ప్రతీరోజు నీతో గడపడం నాకు ప్రత్యేకం అయినప్పటికీ ఈరోజు మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు..లేడీ బాస్‌కు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ మహేష్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. భార్యపై మహేష్ కురిపించిన ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రంలో మహేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా తొలిసారి కీర్తిసురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్‌ను దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. (నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత ఎమ్ఎస్ రాజు) Someone I love was born today! ❤️ Everyday with you is special but today is a little more!! Celebrating my amazing woman. Happy birthday, boss lady ♥️♥️ pic.twitter.com/gDQ3hHVvSt — Mahesh Babu (@urstrulyMahesh) January 21, 2021 -
నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత..
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై శుక్రవారానికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఒక్కడు సినిమాను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘మహేష్ సినిమాల్లో ఒక్కడు క్లాసిట్ హిట్. మళ్లీ మళ్లీ చూడలనించే సినిమా.. ఒక్కడు నాకు ఆల్‌టైమ్ ఫేవరెట్ అని పేర్కొన్నారు. ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా ఈ పోస్టు ప్రస్తుతం చర్చకు దారి తీసింది. పోస్టులో.. చిత్రయూనిట్ సభ్యులైన మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను నమ్రత ప్రస్తావించింది. అయితే వీరిలో నిర్మాత ఎమ్ఎస్ రాజును మాత్రం మర్చిపోయింది. చదవండి: మహేష్ సినిమాకు 18 ఏళ్లు.. నమ్రత కామెంట్ View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) తాజాగా ఈ విషయాన్ని గమనించిన నిర్మాత ఎమ్ఎస్ రాజు నమ్రత ట్వీట్‌పై స్పందించారు. ఒక్కడు సినిమా గురించి పేర్కొనే సమయంలో నమ్రత తన పేరును ప్రస్తావించలేదని ఎమ్ఎస్ రాజు హర్ట్ అయ్యారు. తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్న కారణంతో అప్సెట్ అయ్యారు. ఈ మేరకు ట్విటర్లో ‘ పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్ మూవీ అయినందుకు. గుడ్‌లక్’ అంటూ ట్వీట్ చేసి మహేష్‌ను ట్యాగ్ చేశారు. మరి ఎమ్ఎస్ రాజు ట్వీట్‌ను మహేష్ చూస్తాడా.. దీనిపై నమ్రత స్పందిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు మాత్రం మీరు లేకుండా ఒక్కడు సినిమా లేదు సార్.. ఇంతటి గొప్ప సినిమాను అందించనందుకు కృతజ్ఞతలు అని కామెంట్ చేస్తున్నారు. @urstrulyMahesh Mistakes do happen babu...namratha garu forgot my name on Instagram while addressing 18 yrs of Okkadu...but I am happy it's her favorite classic...good luck — MS Raju (@MSRajuOfficial) January 15, 2021 -
మహేష్ సినిమాకు 18 ఏళ్లు.. నమ్రత కామెంట్
సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై నేటికి 18 సంవత్సరాలు పూర్తవుతోంది. మహేష్ బాబు, భూమిక చావ్లా ప్రధాన పాత్రలో 2003 జనవరి 15న విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటినీ మించిన బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించాడు. అప్పటివరకూ మహేష్ బాబు కెరీర్లో రాజకుమారుడు, మురారి లాంటి హిట్లు వచ్చినా మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌గా ఒక్కడు నిలిచింది. ఈ సినిమా వచ్చి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. మహేష్ నటించిన సినిమాల్లో ఒక్కడు క్లాసిక్ హిట్ అని, ఎక్కువ సార్లు చూసే చిత్రమని కొనియాడారు. అంతేగాక తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని పేర్కొన్నారు. చదవండి: సుకుమార్-మహేష్ కాంబినేషన్లో మరో సినిమా? ఇక సినిమాలో కబడ్డీ ఆటగాడిగా మహేష్ కనిపించాడు. అప్పటి వరకు ఎప్పుడూ కబడ్డీ ఆడని మహేష్ ఈ సినిమా కోసం కొన్ని రోజులు కబడ్డీ నేర్చుకొని ఆ పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన చార్మినార్ సెట్ కోసం హైదరాబాదు శివార్లలోని గోపన్నపల్లె గ్రామంలో నిర్మాత రామానాయుడికి ఉన్న ఓ పదెకరాల ఖాళీస్థలాన్ని వాడారు. ఈ సెట్ నిర్మాణానికి రూ.కోటి డెబ్భై లక్షలు ఖర్చయింది. ఈ సినిమాకు ముందుగా ‘అతడే ఆమె సైన్యం’ అనే టైటిల్‌ను అనుకున్నారు కానీ అప్పటికే ఈ పేరుతో ఎవరో ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నారు. దాంతో టైటిల్‌ను ఒక్కడుగా మార్చారు. ఈ సినిమా తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్‌గా విడుదలైంది. తమిళంలో విజయ్, త్రిష జంటగా గిల్లి పేరుతో రీమేక్ చేసారు. అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇదే సినిమాను కన్నడంలోకి పునీత్ రాజ్ కపూర్, అనురాధా మెహతా జంటగా అజయ్ పేరిట రీమేక్ చేయగా ఇది అంతగా విజయవంతం కాలేదు. చదవండి: ‘సర్కారు వారి పాట’పై స్పందించిన రేణు దేశాయ్ View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar)