
గుంటూరు కారం మూవీతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించాడు ప్రిన్స్ మహేశ్ బాబు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించారు.
గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్.. తదుపరి చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు స్క్రిప్ట్ రెడీగా ఉన్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా మహేశ్ బాబు హైదరాబాద్‌లో సినిమా థియేటర్లో సందడి చేశారు. ఇటీవల రిలీజైన మలయాళ డబ్బింగ్ హిట్ సినిమా ప్రేమలు చిత్రాన్ని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో వీక్షించారు. తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి థియేటర్‌కు వచ్చారు. సినిమా చూసి వెళ్తున్న వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ప్రేమలు చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
#TFNExclusive: Super 🌟 @urstrulyMahesh along with #NamrataShirodkar spotted near AMB Cinemas!📸#MaheshBabu #GunturKaaram #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/X1SJYekSt4
— Telugu FilmNagar (@telugufilmnagar) March 10, 2024