
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో కలిసి ఇవాళ ఉదయాన్నే మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు అలిపిరి నుంచి కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు.
కాగా.. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్‌లో సినిమా చేయనున్నారు. ఇప్పటికే కథను సిద్ధం చేయగా.. షూటింగ్‌కు సంబంధించి ఇంకా అప్‌డేట్ రావాల్సి ఉంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ చిత్రానికి మహారాజ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

Comments
Please login to add a commentAdd a comment