
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో నటిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.
అయితే మహేశ్ బాబు సినిమాలతో పాటు సమాజసేవలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వేలమంది పేదల చిన్నారులకు వైద్య సాయానికి అండగా నిలుస్తున్నారు.
తాజాగా మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో సేవకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి సారిగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరై మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా బాలికల కోసం ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్‌ను కూడా ఏర్పాటు చేశారు. 2025 నాటికి దాదాపు 1,500 మంది బాలికలకు ఉచితంగా టీకాలు వేయడం లక్ష్యమని ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్ వెల్లడించారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లి పాలు సరిపోని నవజాత శిశువులకు ప్రతి ఏడాదికి దాదాపు 7,200 మందికి ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు తెలిపారు.
#Namratashirodkar garu inaugurated the Mothers Milk Bank at Andhra Hospitals, Vijayawada to help newborns with maternal milk which benefits 7,200 babies every year associating with @andhrahospital1
Alongside, @MBfoundationorg also initiating a cervical cancer vaccination drive… pic.twitter.com/vaBvDunrPT— Mahesh Babu Space (@SSMBSpace) March 17, 2025
Comments
Please login to add a commentAdd a comment