tirumala
-
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లుగా లెక్క తేలింది. -
ఆ పది రోజులు టోకెన్ లేకుంటే దర్శనం లేదు
తిరుమల: తిరుమలలో వచ్చేనెలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలో టోకెన్ లేని భక్తులను దర్శనానికి అనుమ తించమని టీటీడీ పీఆర్వో విభాగం శని వారం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో వచ్చేనెల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్య మిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. జనవరి 10 నుంచి 19 వరకు దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్ర మే అనుమతిస్తారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణశాఖ, ఎన్ ఆర్ఐ మొదలైన వారికి పదిరోజుల పాటు వీఐపీ బ్రేక్, విశేష దర్శనాలు రద్దు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి అనుమతించబడరు. 11 నుంచి 19 తేదీ వరకు అనుమతిస్తారు. 28న డయర్ యువర్ ఈవోటీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్ర మా న్ని వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసా రం చేస్తుంది. భక్తులు తమ సందేహా లను, సూచనలను టీటీడీ ఈఓ శ్యామల రావుకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు 0877– 2263261 నంబర్లో సంప్రదించాలని టీటీడీ తెలిపింది. -
తిరుమలలో అర్ధరాత్రి నుంచి ఎడతెగని వర్షం
-
తిరుమలలో కుండపోత.. స్వామి వారిని దర్శించుకున్న స్నేహారెడ్డి, రాధిక (ఫొటోలు)
-
తిరుమలలో భారీ వర్షం.. సీమకు ఎల్లో అలర్ట్
సాక్షి, తిరుమల/విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఒకవైపు వర్షం.. పెరిగిన చలి తీవ్రత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తిరుమలలో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డుల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండటంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, గోగర్భం, పాపవినాశనం జలాశయాలలో పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. వర్షం కారణంగా తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోసా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.#tirupati #tirumala #HeavyRain pic.twitter.com/8uN6R5FHr4— tirupati weatherman (@TPTweatherman) December 12, 2024ఇదిలా ఉండగా.. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ కాలనీ, కోర్లగుంట, సత్యనారాయణ పురం, లక్ష్మి పురం సర్కిల్లో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరుకుంది. వెస్ట్ చర్చి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా చేరుకుంది. దీంతో, వన్ వేలోనే వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిస్తున్నారు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 01 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం.ఇక.. నిన్న(ఆదివారం) 67,284 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా లెక్క తేలింది.ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు...డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసంధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దుడిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురాళ్లు పఠనంజనవరి 15న తిరిగి సుప్రభాతం ప్రారంభం. -
ఓటీటీలో తెలుగు సినిమా.. తిరుమల సీన్స్‌పై వివాదం!
ఇటీవల తిరుమల కొండపై వివాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే బిగ్ బాస్ ప్రియాంక మెట్లమార్గంలో ప్రాంక్ వీడియో చేయగా.. మరో యువతి పుష్ప సాంగ్ రీల్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వీరిద్దరు క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా తిరుమలలో మరో వివాదం చోటు చేసుకుంది.నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35 చిన్నకథకాదు. ఈ మూవీ అంతా దాదాపుగా తిరుపతిలోనే తెరకెక్కించారు. అయితే కొన్ని సీన్స్ తిరుమలలో కూడా రూపొందించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద హీరో కూర్చొని ఉన్నట్లు దర్శకుడు చూపించారు. అంతేకాకుండా తిరుమల ఘాట్ రోడ్ సీన్లు కూడా తెరపై కనిపించాయి. కానీ తిరుమల కొండపై షూటింగ్‌లపై ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. ఎవరు కూడా తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు నడకదారి, ఘాట్ రోడ్లలో కూడా షూటింగ్స్ చేయడానికి అనుమతులు కూడా లేవు. దీంతో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కనిపించడంతో అది మరో వివాదానికి దారితీసింది.ఓటీటీలో స్ట్రీమింగ్..అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అందుబాటులో ఉంది. తన కుమారుడి చదవు కోసం ఓ తల్లి పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. -
తిరుమలలో నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్ తిరుమలలో వివాహం చేసుకున్నారు. 'కలర్ ఫోటో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చకున్న ఆయన తన తొలి మూవీలో చిన్న పాత్ర చేసిన చాందిని రావుతో కలిసి ఏడడుగులు వేశారు. కొద్దిరోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.షార్ట్ ఫిల్మ్‌లతో కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ .. కలర్ ఫోటో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తిరుమల వేదికగా నేడు చాందిని రావుతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడం ఆపై మూడు ముళ్ల బంధం వరకు సాగడంతో వారు చాలా సంతోషంగా కనిపించారు. పెద్దల అంగీకారంతోనే జరిగిన ఈ వేడుకలో కలర్ ఫోటో సినిమాలో నటించిన హీరో సుహాస్, వైవా హర్ష పాల్గొన్నారు.'కలర్ ఫోటో' సినిమా ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం సొంతం చేసుకుంది. చిరంజీవి వంటి స్టార్స్ కూడా ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. సందీప్ రాజ్ ప్రస్తుతం సుమ- రాజీవ్ కనకాల తనయుడు రోషన్‌తో 'మోగ్లీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది. -
తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై టీటీడీ నిఘా
-
తిరుచానూరు బ్రహ్మోత్సవాలు: వైభవంగా పంచమితీర్థం
-
రీలు చేసింది, క్షమాపణ చెప్పింది
-
అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్‌కు యువతి రీల్..
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్‌కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024 -
Tirumala: తిరుమలపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్
-
తిరుమల ప్రాంక్ వీడియోపై స్పందించిన ప్రియాంక, శివ
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ క్షమాపణలు చెప్పింది. కొద్దిరోజుల క్రితం బుల్లితెర నటుడు శివకుమార్, ప్రయాంక ఇద్దరూ తిరుమలకు వెళ్లారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ఇద్దరూ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం ఆపై తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తుండగా చిరుత పులి దాడి అంటూ వీడియో అప్లోడ్ చేశారు. అయితే, అది భక్తులను భయాందోళలకు గురి చేసేలా ఉండటంతో చాలామంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు.'మేము షేర్ చేసిన వీడియోపై చాలామంది శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. మేము తెలియకనే ఈ తప్పు చేశాం. మీ మనోభావాలను గాయపరిచినట్లయితే మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాము. ఉద్దేశపూర్వకంగా అయితే వీడియో చేయలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేశాం. అయితే, ఇలా అవుతుంది అని మేము ఏమాత్రం ఊహించలేదు. ఇంతమందిని ఈ వీడియో హర్ట్ చేస్తుంది అంటే అసలు చేసేవాళ్లమే కాదు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను మేము తక్కువ చేయాలని అనుకోలేదు. భక్తులలో భయం కలగేలా చేసి వారి మనోభావాలను కించపరిచేలా వంటి పొరపాట్లు మేము చేయం. తెలియకుండా జరిగిన ఈ తప్పును మీరందరూ క్షమిస్తారని ఆశిస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. మరోసారి ఈ తప్పు జరగదు.' అని వారు ఒక వీడియోతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న కీర్తిసురేష్
-
తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో
-
వచ్చే నెలలో నా పెళ్లి.. అందుకే తిరుమలకి వచ్చా: కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్.. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి కొండపై కనిపించింది. అలానే తన పెళ్లి గురించి తొలిసారి మాట్లాడింది. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరగనుందని, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల చిన్న కూతురు కీర్తి సురేశ్. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 'మహానటి' సినిమాతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈమె నటించిన హిందీ మూవీ 'బేబీ జాన్'.. క్రిస్మస్కి రిలీజ్ కానుంది.గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్ పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. అవి నిజమని స్వయంగా ఈమెనే క్లారిటీ ఇచ్చింది. ఆంటోని తట్టిళ్‌తో తాను 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తిరుమలలో కనిపించి స్వయంగా మీడియాతో వచ్చే నెలల గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 11-12 తేదీల్లో ఓ రిసార్ట్‌లో వివాహ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)Actress @KeerthyOfficial visited Tirumala.My wedding is in Goa next month, so I came for the darshan.#KeerthySuresh pic.twitter.com/Wbq6XORhxq— Suresh PRO (@SureshPRO_) November 29, 2024#GetsCinema UPDATE ✅#KeerthySuresh Confirmed her MARRIAGE - Next Month in GOA 🤩🤩🤩💥💥💥pic.twitter.com/H9tzU28pfs— GetsCinema (@GetsCinema) November 29, 2024 -
తిరుమల కొండ మీద ప్రాంక్ వీడియోలు..
-
తిరుమలలో సందడి చేసిన RK రోజా, వరుదు కళ్యాణి
-
Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము
తిరుమల: తిరుమలలో మంగళవారం 8 అడుగుల నాగుపాము స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుమలలో స్థానికులు నివాసముంటున్న బీ–టైపు 23వ క్వార్టర్స్ ప్రాంతంలో నాగుపాము వచ్చింది. స్థానికులు టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకు అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. -
వివాదంలో తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. పవిత్రమైన ప్రదేశంలో ప్రియుడితో అలా!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సీజన్లో టాప్-5లో చోటు దక్కించుకుంది. అంతేకాదు బుల్లితెర నటుడు శివకుమార్‌తో ప్రేమాయణం సాగిస్తోంది.అయితే తన యూట్యూబ్ ఛానెల్ నెవర్ ఎండింగ్ టేల్స్ ద్వారా వీడియోలు పోస్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. అలా చాలాసార్లు తన ప్రియుడితో ఫ్రాంక్ వీడియోలు చేసింది. అయితే అందులో తిరుమల అలిపిరి నడక మార్గంలోనూ ఓ ఫ్రాంక్ వీడియో చేశారు ప్రియాంకజైన్, శివకుమార్. దీంతో పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కేవలం వ్యూస్ కోసం కక్కుర్తిపడి తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశాయ అని నామస్మరణ చేయాల్సిన చోట వీళ్లకు రీల్స్ పిచ్చి ఏంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.అసలేం జరిగిందంటే..తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్. చిరుత వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. దీన్ని.. తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్? అంటూ షాకింగ్ అయిన ఫొటోలతో వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. కానీ చివరికీ చిరుత లేదు.. అంతా ఫ్రాంక్ అంటూ తమ పైత్యాన్ని ప్రదర్శించింది ప్రియాంక జైన్. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి చిల్లర పనులేంటని నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వీడియోను ప్రస్తుతం తన ఛానెల్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.సీరియల్స్‌తోనే ఫేమస్..జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది. గత కొన్నేళ్లుగా వీరద్దరు సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. -
తిరుమల లడ్డూపై సీబీఐ సిట్ విచారణ
-
తిరుమల శ్రీవారి దర్శనం: చాలా సంతోషం అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ
-
తిరుమలలో ‘టూరిజం’ దర్శనాలు రద్దు
తిరుమల: టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం తదితర విధానాల్లో భక్తులకు టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంటుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తుంటుంది.ఇందులో ఏపీ టూరిజం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఐఆర్టీసీల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంటుంది. దీనివల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. కానీ టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ రోజూ 4 వేల టికెట్లు కేటాయిస్తుండేది. ఇందులో ఏపీ టూరిజానికి 1,000, తెలంగాణకు 800 టికెట్లు, మిగతా వాటికి 500, 400 చొప్పున టికెట్లు కేటాయించేది వీరికి మధ్యాహ్నం 2 గంటల స్లాట్ ద్వారా దర్శనం కల్పించేది. అయితే ఈ టికెట్ల అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఏడు టూరిజం కార్పొరేషన్లకు దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. తప్పు చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి గానీ.. ఇలా అందరికీ దర్శన టికెట్లు నిలిపివేయడం సరికాదని ఇతర రాష్ట్రాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘శ్రీవాణి’లో మార్పులు!
తిరుమల: శ్రీవాణి ట్రస్టు పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ బ్యాంకుల్లోని డిపాజిట్లను వెనక్కు తీసుకుని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. శ్రీవారి నిత్య అన్న ప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేరుస్తామని చెప్పారు.తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా భవనం లీజు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్యూలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి 2, 3 గంటల్లోనే దర్శనమయ్యేలా నిపుణుల కమిటీని నియమించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయిస్తామన్నారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు, నాలుగు నెలల్లో తొలగిస్తామని చెప్పారు.తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చామన్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడినా, ప్రచారం చేసినా కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. టూరిజం కార్పొరేషన్లు, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 ) టికెట్లలో అవకతవకలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సదరు సంస్థల ద్వారా కోటాను పూర్తిగా రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు అందించే బహుమానాన్ని 10 శాతం పెంచుతున్నట్లు చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 చొప్పున బ్రహ్మోత్సవ బహుమానం అందిస్తామన్నారు.శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ, అన్న ప్రసాద కేంద్రం ఆధునికీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నామని, వారు ఉచితంగానే చేస్తారని చెప్పారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కాగా శ్రీవాణి ట్రస్టు పేరును మార్చి ప్రధాన ఖాతాను మార్చడం వల్ల 80 సీ నిబంధన వర్తించక టీటీడీకి ట్యాక్స్ భారం పడే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.