
తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇచ్చారు

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాల నడుమ స్వామి వారి వాహనసేవ కోలాహలంగా సాగింది.
















