breaking news
Dussehra 2025
-
ప్రపంచంలోనే అతి పురాతనమైన రాంలీలా ఇది..! ఎక్కడంటే..
దసరా వేడుకల్లో భాగంగా ఉత్తరభారతదేశం ఢిల్లీ తప్పనిసరిగా రాంలీలా ప్రదర్శన జరుగుతుంది. మన సంస్కృతికి అద్దం పట్టే ఈ ఇతిహాసం చెడుపై మంచి ఎప్పటికైనా గెలవాల్సిందే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే కాదు సత్ప్రవర్తనతో మెలిగేందుకు దోహదపడుతోంది. అలాంటి రాంలీల ప్రదర్శన ఎప్పుడు మొదలైంది..? ఎవరు ప్రారంభించారు..? అంటే..ఈ రాంలీలా 485 ఏళ్ల క్రితమే కాళీలో ప్రారంభమైందట. వారణాసిలో జరిగే చిత్రకూట్ రాంలీలా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాంలీలా అట. 16వ శతాబ్దంలో 1540 ఆ సమయంలో జరిగిందట. ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతోందట. 16వ శతాబ్దంలో తులసీదాస్ రామచరితమానస్‌ని అవధి భాషలో రాశారు. ఆయన వారణాసిలో కూర్చొని రామ ధ్యానం, ఆయన కథ వినిపిస్తుండేవాడట. తనకు రామదర్శనం ఎప్పుడవుతుందని కుతుహలంగా ఎదురుచూసేవాడట. ఒకనొక సందర్భంలో అస్సీఘాట్‌లో తులసీదాస్ రామకథ చెబుతుండగా రాముడు, సీత, లక్ష్మణ సమేతంగా వెళ్తున్నట్లు దర్శనం పొందుతాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన శిష్యుడు మేఘ భగవత్ ఈ రాంలీలా ప్రదర్శన సంప్రదాయాన్ని ప్రారంభించాడు. జనులంతా తులసీదాసు మాదిరిగా రాముడి అనుగ్రహానికి పాత్రులు కావాలనే ఉద్ధేవ్యంతో భగవత్ దీన్ని ప్రారంభించాట. వాస్తవానికి మేఘ భగవత్ రాంలీలా ప్రదర్శన వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందింపబడినప్పటికీ.. రాంలీలాని సంస్కృతంలోనే ప్రదర్శిస్తారట. అందువల్లే తులసీదాస్ రాసిన రామచరిత మానస్ ప్రసిద్ధికెక్కిందని చరిత్రకారులు చెబుతున్నారు.ఎన్నో విశేషాలు..ఇక్కడ రాంలీలా సుమారు 22 రోజులపాటు కొనసాగుతుందట. ముకుట్ పూజతో ప్రారంభమవుతుందట. రాముడు, లక్ష్మణుడు, సీత, ధరించే (ముకుట్)కిరీటాలకి పూజ చేయడంఓత ప్రారంభమవుతుంది. అంతేగాదు ఆ కిరీటాలు శతాబ్దాల నాటివని చెబుతుంటారు. అక్కడ ఈ వేకుడ కోసం చాలా పెద్ద ఆచారాన్ని నిర్వహిస్తారు అక్కడ. ఆ కిరీటాలను అలా పూజ చేసి పవిత్రంగా మార్చడంతో వాటిని ధరించిన మానవులు దేవతా స్వరూపులుగా కనిపిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. మరో ఆసక్తికరమైన ఘట్టం ఏంటంటే..నక్కటైయగా పిలిచే ఊరేగింపు. ఇది 12వ రోజు జరుగుతుంది. అప్పుడు శూర్పణఖ ఎపిసోడ్‌ని ప్రదర్శిస్తారు. పంచవటిలో రాముడి అందానికి మోహవశురాలైన ఘట్టం అత్యంత ముగ్ధమనోహరంగా జరుగుతుందట. అక్కడ కాశీ వీధులన్ని తిరుగుతూ నిర్వహిస్తారట ఆ సన్నివేశాన్ని. అంతేగాదు ఈ రాంలీలా నాటక ప్రదర్శన కోసం స్వచ్ఛందంగా దుకాణాలను బంద్ చేసి ప్రజలంతా గుమిగూడి మరి తిలికిస్తారట. అంత విశేషాలతో కూడుకున్నది అ చిత్రకూట్ రాంలీలా. (చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..) -
దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..
దసరా అంటేనే తొమ్మిది రోజుల పండుగ. రోజుకో విధంగా అమ్మవారిని అలంకరించుకుని.. జగన్మాత శరణు అంటూ ఉపవాసాలతో కొలుచుకుంటారు భక్తులు. కొన్ని ప్రాంతాల్లో నవరాత్రుల్లో రాత్రి సమయంలో దాండియా, గర్భా, కోలాటం వంటి డ్యాన్స్‌లతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇలా మంచి మ్యూజిక్ లయబద్ధంగా డ్యాన్స్‌లు చేస్తూ చాలామంది ప్రాణాలను కోల్పోయారు. మరికొందరూ కాలి గాయాల బారినడ్డారు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉత్సాహంగా..హెల్దీగా పండుగను జరుపుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.దసరా సరదా పదిలంగా ఉండాలంటే..సాయం సమయంలో చేసే నృత్యాల విషయంలో కాస్త కేర్‌ఫుల్‌గా ఉండమని చెబుతున్నారు సూరత్‌కి చెందిన ఆర్థోపెడిక్. రాత్రుళ్లు భక్తితో అమ్మవారి అనుగ్రహం పొందేలా గంటలతరబడి డ్యాన్స్‌లు చేస్తుంటారు. దాంతో కాలి గాయాలు బారిన పడటం లేదా, చీలమండలం, మోకాలు వంటి సమస్యలు తలెత్తేందుకు దారితీస్తాయి. మరికొందరికి..జనం సముహం ఎక్కువగా ఉండి శ్వాసకు అంతరాయం లేదా, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలా జరగకుండా సంతోషభరితంగా, ఆరోగ్యప్రదంగా పండుగ వాతావరణం ఉండాలంటే..ఈ చిట్కాలను ఫాలోకండి అని చెబుతున్నారు వైద్యులు. హెల్దీగా ఉండేలా..హైడ్రేటెడ్‌గా ఉండేలా కేర్ తీసుకోవాలి. మనతోపాటు ప్రోటీన్ బార్లు కూడా తీసుకెళ్లాలి. అలాగే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా కేర్ తీసుకోండి. జిమ్‌కి వెళ్లడం, స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా, బల శిక్షణకు సంబంధించిన వర్కౌట్లు వంటివి ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం అని సూచించారు. పెయిన్ కిల్లర్స్‌కి దూరం..ఇప్పటికే ఏదైనా గాయం లేదా కాలి సమస్య ఉంటే..నొప్పి నివారణ మంందులు తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు. అన్ని నొప్పి నివారణ మందులు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. సుమారు 4 నుంచి 5 గంటలు గర్భా నృత్యం చేస్తున్నప్పుడూ డీ హైడ్రేషన్‌కి గురవ్వతారు ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు. శరీరం మాట వినండి..గర్భా సమయంలో శరీరంలో ఏ భాగం నుంచి అయినా నొప్పి వస్తే..ఆగిపోండి. కాస్త ఇబ్బందికరంగా ఉన్నా..డ్యాన్స్ చేసే సాహసం చెయ్యొద్దు అని సూచిస్తున్నారు. తక్షణమే సమీప వైద్యలును సంప్రదిస్తే..సురక్షితంగా ఉంటారని అన్నారు. View this post on Instagram A post shared by Krunal Shah (@dr.krunal_shah_) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!) -
'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!
టెక్నాలజీ ఎన్నో ఆలోచనలకు తెరతీస్తుంది. సాంకేతిక సాయంతో దూరంగా ఉన్న తమ వాళ్లను తమవద్దకు చేర్చుకునేలా కొందరు భలే ఉపయోగిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఈ టెక్నాలజీని మన సంతోషాలకు, సంబరాలకు అనుగుణంగా మార్చుకుంటూ..ఇలా కూడా వాడుకోవచ్చా అని విస్తుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే..అసలేంటి కథ అంటే..విదేశాల్లో నివశించే చాలామంది భారత్‌లో జరిగినట్లు సంస్కృతి సంపద్రాయలకు అనుగుణంగా సంబరంగా జరిగే పండుగలను మిస్ అవుతుంటారు. ఒకవేళ అక్కడ భారత కమ్యూనిటీలంతా ఒకచోట చేరి చేసుకున్న మన దేశంలో ఉన్న మాదిరి ఆనందమైతే మిస్ అయిన వెలితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉండే పండుగ కోలాహలం, సందడి..అక్కడ ఉండదు. అత్యంత నిశబ్దంగా జరిగిపోతుందంతే. అలా ఉసురుమనుకుండా హాయిగా ఎంజాయ్ చేసేలా..సరికొత్త మార్గాన్ని పంచుకున్నాడు కంటెంట్ క్రియేటర్, నటుడు విరాజ్ ఘేలాని. ఈ నవరాత్రిని తన ఇద్దరు ఎన్ఆర్ఐ స్నేహితుల మిస్ అవ్వకుండా..వారి ఫోటోలను చెరో చేతిలో పెట్టుకుని సంబరంగా గర్భా డ్యాన్స్ చేశాడు. తన స్నేహితులు మిస్ అవ్వకుండా వాళ్లు కూడా ఎంజాయ చేస్తున్నారనిపించేలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నవరాత్రిని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నా, అలాగే తన స్నేహితులు ఈ పండుగ మిస్ అయ్యానని బాధపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు నటుడు విరాజ్ వీడియోలో. మీరు ఇలాంటి డిజిటల్ గర్భాలో పాల్గొనేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నవాళ్లు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు అని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లలో చాలామంది తమ దేశానికి దూరంగా ఉన్నమనే ఫీల్‌తో ఉన్నవాళ్లందరి మనసులను తాకింది ఈ వీడియో. కానీ మరికొందరూ బాస్ భారత్‌లో తొమ్మిది రోజులే గర్భా డ్యాన్స్ చేస్తారు, అదే కాలిఫోర్నియాలో నెలల తరబడి ఆ డ్యాన్స్ చేస్తామంటూ వ్యంగంగా పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా ఈ ఆలోచన మాత్రం అదుర్స్. చిన్న చిన్న పొరపచ్చలు సైతం ఇలా మనవాళ్లని భాగస్వామ్యం చేస్తే బాంధవ్యం బలపడటమే కాదు వాళ్లు ఖుషి అవుతారు. View this post on Instagram A post shared by Viraj Ghelani (@viraj_ghelani) (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
నాలుగో రోజు నవరాత్రుల పూజలో యాంకర్ లాస్య.. (ఫొటోలు)
-
అక్కడ దసరా విజయదశమి నుంచే ..
మన దేశంలో ఈ దసరా పండుగ పలు సంప్రదాయాలకు అనుగుణంగా విభిన్నంగా చేసుకుంటుంటారు. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇదే పండుగ పర్యాటక ప్రేమికులు ఇష్టపడే హిమచల్‌ప్రదేశ్ కులుమనాలిలోని కులు లోయలో ఎలా జరుగుతుందో తెలిస్తే విస్తుపోతారు. ఈ పండుగను అక్కడ అత్యంత విచిత్రంగా నిర్వహిస్తారు. అన్నిచోట్ల నవరాత్రులు విజయదశమితో ముగిస్తే..అక్కడ ఆ రోజు నుంచి మొదలవుతాయట. ఇదేంటని అనుకోకండి. ఎందుకంటే అందుకు ఓ పెద్ద స్టోరీనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం చకచక చదివేయండి..కులు లోయలో జరిగే ఈ పండుగ ప్రపంచంలోని ప్రత్యేకమైన పండుగలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. మనకు దసరా పాడ్యమి నుంచి మొదలై విజయ దశమితో మగుస్తాయి. కానీ ఈ కులు లోయలో విజయదశమి రోజు నుంచి మొదలై.. సరిగ్గా వారం రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఇది 375 ఏళ్ల నాటి పండుగ అట. సింపుల్‌గా చెప్పాలంటే సుమారు 17వ రాజా జగత్ సింగ్ ఆధ్వర్యంలో రూపుదొద్దుకుందట. అలా అప్పటి నుంచి అదే ఆచారంలో నిర్వహిస్తున్నారట ఈ దసరా వేడుకని. ఈ పండుగ వెనుకున్న ఆసక్తికర కథేంటంటే..శాపం నుంచి వచ్చిన పండుగ..పురాణ కథనాల ప్రకారం..దుర్గా దత్ అనే బ్రహణుడు వద్ద ముత్యాల గిన్నె ఉంది. అది అందరిని అమితంగా ఆకర్షించేది. గిన్నె గురించి కులు లోయ రాజు రాజా జగత్ సింగ్‌కి తెలుస్తుంది. అలాంటి వస్తువులు తనలాంటి వాళ్ల వద్ద ఉండాలన్న అహకారంతో తన భటులకు వెంటనే దాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజు సైనికులు ఆ దుర్గా దత్ అనే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి ధౌర్జన్యం చేసి మరి తీసుకువెళ్లే సాహసం చేస్తారు భటులు. దాంతో ఆ బ్రహ్మణుడు కోపంతో ఆ భటులతో ఆ గిన్నె కోసం ఆ రాజే స్వయంగా వచ్చి తీసుకోవాలని చెబుతాడు. దీని కోసం మా రాజు గారు రావాలంటావా నీకెంత ధైర్యం అంటూ ఆ బ్రహ్మణుడిని అతడి కుటుంబాన్ని అతడి ఇంటిలోనే సజీవదహనం చేసేస్తారు సైనికులు. అయితే ఆ బ్రహ్మణుడు దుర్గాదత్ చనిపోతూ.. నీ దురాశకు తగిన ఫలితం అనుభవిస్తావంటూ రాజుని శపిస్తాడు. అది మొదలు రాజు జగత్సింగ్కి ఆ బ్రహ్మణుడి కుటుంబ సభ్యుల ఆత్మలు కలలోకి వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఫలితంగా రాజుకి కంటిమీద కునుకు కరువై రోజురోజుకి అతడి ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ వార్త రాజ్యమంతా దావానలంలా వ్యాపిస్తుంది. ఇది తెలుసుకున్న కృష్ణ దత్(పహారి బాబా) అనే బైరాగి రాజుని కలిసి తక్షణమే రాముడి శరణు కోరమని సూచిస్తాడు. దాంతో రాజు రఘనాథుడుని ఆహ్వానించేందుకు కులు లోయ చుట్టుపక్కల ఉండే గ్రామ దేవతలందరిని ఆహ్వానిస్తాడు. ఆ గ్రామ దేవతలను సుమారు 300కి పైగా పల్లకిలపై ఘనంగా తీసుకువచ్చి సమావేశపరిచి..రాముడి కరుణ పొందుతాడు. అలా ఏటా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రజారంజకంగా పాలన సాగించాడు. అలా ఆ రాజు శాపం నుంచి విముక్తి పొందాడు. ఆ రాజు ఈ పండుగను సరిగ్గా విజయ దశమి రోజున నుంచి గ్రామ దేవతలను ఆహ్వానించడం మొదలుపెట్టాడు. అలా మొదలైన ఆచారం నేటికి నిరాటంకంగా అదే సంప్రదాయంలో జరుగుతుండటం విశేషం. ఎలా జరుగుతుందంటే..ఈ పండుగను వారం రోజులపాటు నిర్వహిస్తారు. అక్టోబర్ 2 నుంచి మొదలై ఈ నెల 8తో ముగుస్తుంది. అంటే విజయదశమి రోజున ప్రారంభమై, ఒక వారం తర్వాత కులులోని ధల్పూర్ మైదానంలో ముగుస్తుంది. కాలినడకన పల్లకీల్లో చుట్టుపక్కల గ్రామ దేవతలను తీసుకురావడం అనేది రోజుల తరబడి సాగుతుందట. అది కూడా డ్రమ్స్, నృత్యాలతో సాదరంగా ఆ గ్రామ దేవతల్ని కులు రాజ్యానికి తీసుకువచ్చి దేవతలందరి సమావేశ పరిచి రాముడని ఘనంగా సత్కరిస్తారట. అన్ని చోట్ల విజయదశమి రోజున రావణ దహనం వంటివి నిర్వహిస్తే..ఇక్కడ రాముడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకునేందుకు గ్రామదేవతలను పిలవడం విశేషం. (చదవండి: కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో నవరాత్రి పూజలు..) -
అంబానీ నవరాత్రి ఉత్సవాలు:నీతా, రాధికా గార్బా డ్యాన్స్‌తో సందడి
-
నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ శైలితో ఆకట్టుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థానీ టై-డై టెక్నిక్ సాంప్రదాయ దుస్తులలో అమ్మ వారి ఆరాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ చిత్రాలను సోషల్ మీడియాలో సందడిగామారాయి.దుర్గాదేవి తొమ్మిది రూపాలను సూచించే బహుళ వర్ణ బనారసి పింక్ లెహంగా చోళిలో అత్యంత సుందరంగా కనిపించారు. దీనిపై వివిధ రకాల బట్టలతో ప్యాచ్‌వర్క్, క్లిష్టమైన జరీ వర్క్, సంక్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహంగాలో భారీ లేస్‌వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కర్ట్‌కు మ్యాచింగ్‌గా ప్యాచ్‌వర్క్ , బంగారు జరీ వర్క్‌తో పింక్ బ్లౌజ్‌ను ఆమె ఎంచుకున్నారు. గులాబీ , నారింజ రంగు లెహెరియా ప్రింట్ దుపట్టాతో నీతా అంబానీ లుక్మరింత ఎలివేట్ అయింది. మల్టీ లేయర్డ్ డైమండ్స్, ఆకుపచ్చ పచ్చ నెక్లెస్‌తో పాటు స్టేట్మెంట్ చెవిపోగులు, మాంగ్ టికా, రంగురంగుల గాజులు, హెవీరింగ్ను ధరించారు. ఈ కాస్ట్యూమ్స్‌ను ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ JADE మోనికా అండ్ రిష్మా రూపొందించారు. నీతా అంబానీ లుక్కు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. గుజరాత్ ఆత్మ నుండి ప్రేరణతో పవిత్రమైన మూలాంశాలు ,శక్తివంతమైన కచ్చి వస్త్రాలతో కూడిన దైవిక నేపథ్యంలో నీతా అంబానీ లుక్ సజీవంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. (Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్)అంతేకాదు అంబానీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఐలైనర్, కోల్-ఐడ్, మస్కారా-కోటెడ్ లాషెస్, బ్లష్డ్ బుగ్గలు, రేడియంట్ హైలైటర్, న్యూడ్ లిప్‌స్టిక్‌తోపాటు, మిడిల్-పార్టెడ్ బన్ హెయిర్‌స్టైల్ , నుదిటిపై ఎర్రటి బొట్టు తదితర వివరాలను అందించారు. (సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు)నెటిజన్ల స్పందనసోషల్ మీడియా వినియోగదారులు ఆమె సొగసైన స్టైలింగ్‌ను ప్రశంసించారు. నవరాత్రి క్వీన్‌కు అవార్డు నీతా అంబానీ జీకి దక్కుతుంది. ఎలిగెంట్ రాయల్, చాలా అందంగా ఉన్నారంటూ కొనియాడటం విశేషం. -
శరీరంపై జాగ్రత్తేనా.. మరి ఆత్మ! యా దేవీ సర్వ భూతేషు...
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆదిశక్తి అనేక అవతారాలు తీసుకోవడం జరిగింది. అందుకు ప్రతీకగానే అమ్మను దేవీ నవరాత్రులలో నవ దుర్గలుగా ఆరాధిస్తాము. నవరాత్రులుగా మనం జరుపుకునే 9 రోజులు అతి ముఖ్యమైన పవిత్రమైన పర్వదినాలు. అతి రౌద్ర రూపిణి, రాక్షస సంహారిణి అయిన దుర్గాదేవి ఈ రోజులలో తన విజయోత్సవంతో అతి కరుణామయిగా, ప్రసన్న వదనంతో ఉంటుంది. తనను నమ్ముకుని, సంపూర్ణ సమర్పణతోను, భక్తి ప్రపత్తులతోను ఆరాధిస్తున్న తన భక్తుల కోరికలను నెరవేరుస్తుందనేది ప్రగాఢ విశ్వాసం. మానవులలో సూక్ష్మ ధర్మాలు శక్తుల రూ΄ాలలో వుంటాయి. అయితే భగవంతుడు మనలో స్థిరపరచిన ధర్మాలను మనం తప్పుతూ వుండడం వలన అంటే ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకోవడం వలన మానవుడు అనేక ఇబ్బందులకు, సమస్యలకు లోనవడం జరుగుతోంది. మానవ శరీరంలోనే వున్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి, శ్రీ మహా కాళీ శక్తుల ద్వారా ఆ దేవియే అంతర్గతంగా మనకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తోంది. ‘‘యాదేవి సర్వ భూతేషు’’ అంటే ఆమెయే అన్ని ప్రాణులలోనూ వుంది. ప్రత్యేకించి దేవి నవరాత్రులలో దేవీ మహాత్మ్యంలో వివరించిన సప్తశతీ శ్లోకాలలో దేవీసూక్తం తప్పక చదవాలి. దానిలో ఒక విశిష్టత వుంది. ఉదాహరణకు ‘‘యాదేవి సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్థితా’’ నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై, నమోనమః’’అంటే దేవి మనుష్యులలో శాంతి రూపంలో వుంటుందని. ఆమె మన లోపల, బాహ్య పరంగాను శాంతిని ప్రసాదించింది. ఆమె అనుగ్రహించిన ఆ శాంతిని మనం సాధించాలి. ఆస్వాదించాలి. అలా మనం వుండగలుగుతున్నామా? లేదా? అని మనం పరిశీలన చేసుకోవాలి. మరొకటి – యాదేవి సర్వ భూతేషు ప్రీతి రూపేణా సంస్థితా ...’’ ప్రీతి అంటే ప్రేమించే గుణం. ప్రేమించే గుణం మానవులకు అనుగ్రహించ బడింది. ప్రేమంటే మంగళకరమైన, ధర్మబద్ధమైన, ఏ కోరిక, ఏ కామం, అసూయలు లేకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇతరులను ప్రేమతో చూడటం. కానీ మానవులలో పేరుకు పోయి ఉన్న అసూయ అనే పనికిమాలిన గుణం వలన ప్రేమించే గుణానికి విరుద్ధంగా ప్రవర్తించడం వలననే దేవికి ఆగ్రహం తెప్పిస్తున్నాం. సమస్యలు కోరి తెచ్చుకుంటున్నాం. అలాగే –‘‘యాదేవి సర్వ భూతేషు క్షమా రూపేణా సంస్థిత .. ’’ అని చెప్పబడింది. క్షమాగుణం అంటే ఇతరుల తప్పులను మన్నించడం. ఆ క్షమించడం మీ హృదయం నుండి రావాలి. ఎవరో మీ పట్ల అమర్యాదగా, అసభ్యంగా, క్రూరంగా ప్రవర్తిస్తారు లేదా వారి స్వలాభం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. అయితే దేవి మనలో స్థిరరపరచిన ఆ క్షమాశక్తిని మనం ఉపయోగిస్తున్నామా ? లేదా? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘‘యా దేవీ సర్వ భూతేషు: నిద్రారూపేణాసంస్థితా .. ‘‘మీరు అలసిపోయినప్పుడు, నిద్ర పోలేనప్పుడు ఆమె మీకు నిద్రను ప్రసాదిస్తుంది. మీకు సేద తీరుస్తుంది. ఆమెకు మిమ్మల్ని విశ్రాంతి పరిచే శక్తి వుంది. ఇదంతా మనలోని నాడీ వ్యవస్థ ద్వారా ఆమె చేయిస్తుంది. ‘‘యాదేవీ సర్వ భూతేషు భ్రాంతి రూపేణా సంస్థితా ...’’ ఆమె మిమ్మల్ని మాయలో పడేస్తుంది. ఎందుకంటే వారలా భ్రాంతిలో పడితే గాని ఆమె పిల్లలమైన మనం ఆమె గురించి ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేము. స్త్రీలకు, పురుషులకు ఈ మాయా, ఈ భ్రాంతి రకరకాలుగా కలగజేస్తుంది. మరొక శక్తి. ‘‘యాదేవీ సర్వ భూతేషు లజ్జా రూపేణా సంస్థితా ...’’ అని. లజ్జ అంటే సిగ్గు కాదు. మీ శరీరం గురించిన ఒక విధమైన అవమానం. మనకు భగవంతుడు చక్కని శరీరాన్ని ప్రసాదించాడు. స్త్రీలయినా, పురుషులయినామనం మన కళను ఉపయోగించి దానిని సందర్భానికి తగినట్లుగా చక్కటి వస్త్ర ధారణతో అలంకరించుకోవాలి.‘‘యాదేవీ సర్వ భూతేషు క్షుధా రూపేణా సంస్థితా ...’’ మనకు ఆకలిని ప్రసాదించేది కూడా ఆ దేవియే. మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రోజుల్లో సన్నగా ఉండటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. లేక మరేదైనా కారణాల వలన మీరు తినవలసినంత ఆహారం తినడం లేదు. ప్రత్యేకించి శక్తి స్వరూపిణులైన స్త్రీలు ఆహారం చాలా తక్కువగా తీసుకుంటున్నారు. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మీ జీవిత ధ్యేయం కేవలం శరీరం గురించి జాగ్రత్త తీసుకోవడమే కాదు. ఆత్మ గురించి జాగ్రత్త పడడం, ఆత్మసాక్షాత్కారం పొంది ఆత్మ స్వరూపులుగా వ్యక్తీకరింపబడడమే మీ ధ్యేయం కావాలి. మీరు దేవీ సూక్తం పూర్తిగా చదవండి. దేవి ప్రసాదించిన ఈ గుణాలన్నీ మీలో అంతర్గతంగా ఉన్నాయా? లేవా? అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ దేవీ నవరాత్రులలో దేవీసూక్తం, దేవీ అధర్వ శీర్షం, అర్గళా స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం, మన శరీరంలోనూ, సూక్ష్మ శరీరంలోని అంగాం గాలలో ఉంటూ మనల్ని సంరక్షిస్తూ ఉన్న ఎందరో దేవీ దేవతలను ఆరాధించే దేవీ కవచం లాంటి ఎన్నో దేవిని ప్రసన్నం చేసుకునే సంస్కృత శ్లోకాలు, స్తుతులు ఉన్నాయి. వాటిని కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా వాటి భావార్థం తెలుసుకుని చదవడం చాలా మంచిది. ప్రస్తుత పరిస్థితులలో చాలామంది ఆమె ప్రసాదించిన ఈ ధర్మాలను ఏవేవో కారణాలు చెప్పుకుని ఆచరించడం మానుకున్నారు. అందుచేత వ్యక్తిగతపరంగా కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించాలి.చదవండి: మిలన్ ఫ్యాషన్‌వీక్ : రొటీన్‌గా కాకుండా బోల్డ్ లుక్‌లో మెరిసిన ఆలియావీటిని మీ కుండలినీ జాగృతి ద్వారా, ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా మీరు తిరిగి జాగృత పరచుకోవాలి. ఈ ప్రపంచాన్ని కలియుగ ధర్మం ప్రభావాలనుండి రక్షించాలనుకుంటే అది కేవలం మీ ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారానే సాధ్యమవుతుంది. మనలోనే నిక్షిప్తమై వున్న కుండలినీ శక్తి జాగృతమై సహస్రారం దగ్గర ఛేదించు కుని వచ్చి బాహ్యంగా వున్న పరమాత్ముని పరమ చైతన్య శక్తితో అనుసంధానం కావడమే ఆత్మ సాక్షాత్కారం.ఇదీ చదవండి: Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆవిష్కరించిన సహజ యోగా ధ్యానసాధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో సాధకులు ఈ నవరాత్రి పర్వదినాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. – డాక్టర్ పి.రాకేష్( శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి (ఫొటోలు)
-
#Dussehra2025 : వైభవంగా శ్రీశైలం దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
కార్పొరేట్లకూ దసరా జోష్!
కోల్‌కతా: దసరా నవరాత్రి వేడుకలను కంపెనీలు మార్కెటింగ్ మంత్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ సందర్భంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ, వినియోగదారులకు మరింత దగ్గరయ్యే దిశగా మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా దుర్గా పూజలను పెద్ద ఎత్తున నిర్వహించే పశ్చిమబెంగాల్ వంటి ప్రాంతాల్లో థీమ్డ్ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నాయి. టీపొడి, వ్యక్తిగత సంరక్షణ నుంచి ఫ్యాషన్, పాదరక్షలు, లైటింగ్, సాంకేతికత వరకు.. బ్రాండ్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు ఆవిష్కరణలకు సంప్రదాయాన్ని జోడిస్తున్నాయి. పండుగల రోజుల్లో షాపింగ్‌కు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుంటారు. అందులోనూ దసరా రోజుల్లో ఖరీదైన కొనుగోళ్లు ఎక్కువగా నమోవుతుంటాయి. ఈ సమయంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలతో విక్రయాలను పెంచుకోవడమే కాకుండా, వినియోగదారులతో దీర్ఘకాల భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కంపెనీలు చూస్తుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘పండుగ కార్యక్రమాలు బ్రాండ్ల నిర్మాణానికి కీలకం. వినియోగదారుల సెంటిమెంట్ గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో వారితో అనుబంధానికి వీలు కలి్పస్తాయి’’అని పర్సనల్‌కేర్ బ్రాండ్ జోయ్ సీఎంవో పౌలోమీ రాయ్ తెలిపారు. మింత్రా జబాంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రీమియం ఎతి్నక్ వేర్ లేబుల్ ‘సౌరాగ్య’ను మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో కలసి రూపొందించింది. సౌరవ్ విజన్ అయిన అసలైన బెంగాలీ ఫ్యాషన్ ఈ భాగస్వామ్యానికి మూలమని మింత్రా అధికార ప్రతినిధి చెప్పారు. దీంతో సౌరవ్ గంగూలీ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టయిందన్నారు. ఇమామీ గోధుమ పిండి దసరా ముందు గోధుమ పిండి బ్రాండ్‌ను విడుదల చేయడం ద్వారా ఇమామీ ఆగ్రోటెక్ స్టేపుల్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన చెక్కీ ఫ్రెష్ ఆటా పిండితో రూపొందించిన దుర్గామాత విగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. పశి్చమబెంగాల్ కళ, సంస్కృతిని ప్రతిబింబిస్తూ టాటా టీ కంపెనీ టాటా టీ గోల్డ్ బ్రాండ్ ప్రచారాన్ని చేపట్టింది. ఐదుగురు బెంగాలీ కళాకారులు రూపొందించిన డిజైన్లతో లిమిటెడ్ ఎడిషన్ టాటా టీ గోల్డ్‌ను విడుదల చేసింది. ఈ డిజైన్లు దుర్గా పూజల ప్రత్యేకతను చాటనున్నాయి. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ సైతం దసరా సందర్భంగా తన ఫారŠూచ్యన్ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. సంప్రదాయ వేడుకలు, సంబరాల్లో పాలు పంచుకునేందుకు పండుగలు అవకాశం కలి్పస్తాయని కంపెనీ సేల్స్ జాయింట్ ప్రెసిడెంట్ ముకేశ్ మిశ్రా తెలిపారు. కొత్త ఉత్పత్తులు, ప్రచారాలతో తమ విక్రయాలు పెంచుకోవడమే కాకుండా, వినియోదారులకు చేరువ అయ్యేందుకు ఈ సీజన్‌ను ఒక చక్కని అవకాశంగా భావిస్తూ ముందుకు వెళుతున్నాయి. -
75 రోజుల దసరా!
డెబ్బై అయిదు రోజుల పాటు జరిగే దసరా పండగ (Dussehra) ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ బస్తర్‌లో కొనసాగుతోంది. ‘జోగీ బిథాయి’ సంప్రదాయంలో భాగంగా హల్బా తెగకు చెందిన ఒక యువకుడు సాధువు వేషధారణతో దంతేశ్వరీ ఆలయంలో భూమికి ఆరు అడుగుల దిగువన, జ్యోతి ఎదురుగా తొమ్మిది రోజుల పాటు పీఠంపై కూర్చుంటాడు. ఈ యువకుడు ఎనిమిది రోజులు ఉపవాసం ఉంటాడు.‘జోగి బిథాయి’ సంప్రదాయానికి 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులో పాత్ జత్ర, దేరి గడాయి, కాంచన గడాయి సంప్రదాయాలు ఉంటాయి. మవల్లి ఆలయంలో పూజారి దీపం వెలిగించడంతో దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఒక ఖడ్గాన్ని ఆలయంలో పెట్టి పూజలు చేస్తారు. ఈ పురాతన సంప్రదాయాన్ని ఇటలీకి చెందిన ఇద్దరు యువకులు డాక్యుమెంట్ చేశారు.‘ఇక్కడి ప్రజలు నిరాడంబరం గా, స్నేహంగా ఉంటారు. ఇక్కడ దసరా పండగ రకరకాల సంప్రదాయలతో కన్నుల పండుగగా జరుగుతుంది’ అంటున్నాడు ‘జోగి బిథాయి’ సంద్రాయాన్ని వీడియో డాక్యుమెంట్ చేసిన యువకులలో ఒకరైన డేనియల్. ప్రపంచంలో జరిగే అతి పెద్ద దసరా వేడుకలలో ‘జోగి బిథాయి’కి ప్రత్యేక గుర్తింపు ఉంది.చదవండి: Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్ -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్‌లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్‌షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్‌ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్‌గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్‌తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్‌తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్‌కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్‌గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్‌లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్‌లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్‌లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్‌తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
దేవి నవరాత్రులు: నవ దుర్గలు... వర్ణాలు
దేవీ నవరాత్రులు వచ్చాయి. ఈ తొమ్మిది రోజులూ భక్తులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు పెట్టి నృత్య గానాలు చేసి భక్తి పారవశ్యంలో ఓలలాడుతుంటారు. అయితే అమ్మవారికి రోజుకో నైవేద్యం పెట్టినట్లే రోజుకో రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అంతేకాదు, తాము కూడా ఆ రంగు వస్త్రాలను ధరించి, అమ్మవారి అనుగ్రహాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నవరాత్రులలో ఇప్పటికే రెండు రోజులు గడచిపోయాయి. మిగిలిన రోజుల్లో అయినా అమ్మవారిని ఆమెకు ఇష్టమైన రంగులతో అలంకరిద్దాం. అమ్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. 1. శైలపుత్రి: మొదటి రోజున అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. శైలపుత్రి అలంకారం బలానికి, శక్తికి ప్రతీక అయితే, ఎరుపు రంగు అభిరుచికి, ధైర్యానికి సూచిక. నైవేద్యం: పులిహోర, కట్టు పొంగలి2. బ్రహ్మచారిణి: నీలం రంగునీలవర్ణం నిశ్శబ్దానికి, ప్రశాంతతకు, భక్తికి ప్రతీక అయితే, బ్రహ్మచారిణి అమ్మవారు క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడేలా చేసి, ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. నైవేద్యం: కొబ్బరి అన్నం, పాయసాన్నం3. చంద్రఘంట: భక్తులు చంద్రఘంటాదేవిని సౌందర్యానికి, సాహసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ అమ్మను ఆరాధించడం వల్ల భయం, ప్రతికూలతలు తొలగుతాయని నమ్ముతారు. ఈ రోజున సంతోషానికి, సానుకూల భావనలకు చిహ్నమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు.నైవేద్యం : క్షీరాన్నం, దద్దోజనం, గారెలు4. కూష్మాండ: ఈ అలంకారంలో అమ్మవారు సాక్షాత్తూ ఈ విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల ఏ పనినైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు అలవడతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించే ఆకుపచ్చ రంగు ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. ఆకుపచ్చ వృద్ధికి, ఉపశమనానికి సంకేతంగా నిలుస్తుంది. నైవేద్యం : దద్దోజనం, క్షీరాన్నం5. స్కందమాత: స్కందుడు అంటే కార్తికేయుడు అంటే కుమారస్వామి. అమ్మవారిని స్కందమాతగా ఆరాధించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగడంతోపాటు ధైర్యం కూడా లభిస్తుంది. ఈ అమ్మవారికి ధూమ్రవర్ణం అంటే బూడిదరంగు ఇష్టం. బూడిద రంగు సమతుల్యతకు, స్థిరత్వానికి, తెలివితేటలకూ చిహ్నం. నైవేద్యం : కేసరి, పరమాన్నం, దద్దోజనం6. కాత్యాయని: ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడంతో΄ాటు సమస్యలను ఎదుర్కొనే శక్తి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. కాత్యాయనీ దేవికి ఇష్టమైన నారింజ రంగు ధైర్యానికి, జిజ్ఞాసకు, పరివర్తనకూ ప్రతీక. నైవేద్యం : చక్కెర పొంగలి, క్షీరాన్నం7. కాళరాత్రి: దుర్గాదేవి రౌద్రరూపానికి ప్రతీకగా కాలరాత్రి అమ్మవారిని సంభావిస్తారు. ఈ అమ్మవారి ఆరా«దనతో భయాలు తొలగి, దేనినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం కలుగుతుందంటారు. ఈమెకు ప్రీతికరమైన తెలుపు రంగు స్వచ్ఛతకు, ప్రశాంతతకూ ప్రతీక. నైవేద్యం : కదంబం, శాకాన్నం8. మహాగౌరి: సంతోషానికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అయిన ఈ అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. గులాబీరంగు వస్త్రాలను ధరించడం వల్ల కరుణ భావనలు కలుగుతాయి. మనసుకు ప్రశాంత చేకూరుతుంది. నైవేద్యం : చక్కెర పొంగలి9. సిద్ధిదాత్రి: ఈ అమ్మవారి ఆరాధన వల్ల అతీంద్రియ శక్తులు సిద్ధిస్తాయని, విజ్ఞానం, సంపద చేకూరతాయని భక్తుల విశ్వాసం. ఈమెకు ప్రీతికరమైన ఊదారంగు శక్తికి, ఆధ్యాత్మికతకు, ఆశయ సాధనకూ తోడ్పడుతుంది, నైవేద్యం : పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు.రంగులు.. మానసిక ప్రభావంఏ రోజుకు నిర్దేశించిన రంగును ఆ రోజున వాడటం వల్ల మనసుకు ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలతోపాటు మనస్తత్వ నిపుణులు కూడా చెబుతారు. – డి.వి.ఆర్. (చదవండి: 'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్) -
వారెవ్వా గర్భా..
సాక్షి, హైదరాబాద్ దేవీ నవరాత్రులను పురస్కరించుకుని దాండియా, కోలాటం, గర్భా నృత్యాలతో ప్రాంగణాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా మారాయి. విస్టా కన్వెన్షన్ అండ్ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన ‘రంగ్ థాలి’ ఆకట్టుకుంటోంది. ఇందులో గుజరాతీ సంప్రదాయ గర్భా నృత్యాలు కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల దుస్తులు, ఆకట్టుకునే వేషధారణలో యువతీ యువకులు చేస్తున్న దాండియా, కోలాటాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఫిఫ్త్ అవెన్యూ ఈవెంట్ మేనేజ్మెంట్, రంగోలి మార్కెటింగ్, అగర్వాల్స్ ప్యాకర్స్ మూవర్స్, డీఆర్ఎస్ స్కూల్, దోడియా ఆగ్రోటెక్ సంస్థల ఆధ్వర్యంలో ‘రంగ్ థాలి’ సీజన్–4 కనువిందు చేస్తోంది. అక్టోబర్ 1 వరకూ రాత్రి 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే నృత్యాలు అహూతులను విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. సుమారు నాలుగు వేల మంది ప్రతిరోజూ సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక నృత్యరీతులను ప్రదర్శిస్తున్నారు.చదవండి: వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన పాపులర్ నటుడు -
కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో..
విభిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలతో మినీ భారత్‌ను తలపిస్తోంది హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ. విభిన్న ప్రాంతాలకు చెందిన వారు విభిన్న రీతుల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి కలసికట్టుగా నవరాత్రులు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యాణ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు అగర్వాల్ కుటుంబీకులు, మరాఠాలు, కన్నడిగులు, బెంగాలీలు తమతమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన కన్నడిగులు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జియాగూడ, అత్తాపూర్, సికింద్రాబాద్, గుల్జార్‌హౌజ్, మామ జుమ్లా పాటక్, చార్‌కమాన్, కోకర్‌వాడీ, చెలాపురా, ఘాన్సీబజార్, జూలా, కూకట్పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కన్నడిగులు దసరా వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దుర్గామాత చిత్రపటం వద్ద నల్లరేగడి మట్టిలో నవధాన్యాల విత్తనాలను వేస్తారు. ఇవి మొలకెత్తడంతో తొమ్మిది రోజుల పాటు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవధాన్యాల మొలకలు పెరిగిన ఎత్తు అమ్మవారి కటాక్షానికి కొలమానంగా భావిస్తారు. కన్నడిగుల అష్టమి కడాయి.. దుర్గాష్టమి సందర్భంగా గోధుమ పిండితో అమ్మవారి ఆభరాలను తయారు చేస్తారు. వీటిని కడాయిలో వేసి వేపుతారు. అమ్మవారి పుస్తె, మట్టెలు, జడ వంటి ఆభరణాలను తయారుచేసి అమ్మవారి విగ్రహం చుట్టు వేలాడదీస్తారు. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చే బంధు మిత్రులకు వీటిని అందజేసి దసరా శుభాకాంక్షలు చెబుతారు. ఉపవాసం అనంతరం.. తొమ్మిది రోజుల ఉపవాసం అనంతరం విజయ దశమినాడు జమ్మిచెట్టు పూజతో పాటు చెరుకుగడ, బంగారం ఇస్తూ ఆలింగనం చేసుకుంటారు. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. బెంగాలీలకు ఐదు రోజులే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన బెంగాలీలు దసరా ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇదే వారి ప్రధాన పండుగ. దుర్గామాతను ప్రతిష్టించిన నాటి నుంచి నాలుగు రోజుల వరకూ ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ దశమి రోజు నిమజ్జనం చేస్తారు. కోల్‌కతాలో దుర్గామాత వద్ద మేకలను బలిస్తామని.. ఇక్కడ మాత్రం తొమ్మిది రకాల వేర్వేరు ఫలాలను ప్రసాదంగా పెడతామని తెలిపారు. మొదటి రెండు రోజులు శాకాహారం, మిగిలిన రెండు రోజులు మాంసాహారం భుజిస్తారు. అగర్వాల్ ఉపవాస దీక్షలు.. ఉత్తర భారతీయులైన అగర్వాల్ కుటుంబీకులు తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేస్తారు. గోడకు పటం వేసి గోధుమలు, జోన్నలు మట్టి కుండలో పెడతారు. మొలకెత్తిన విత్తనాల ఆకులను విజయదశమి రోజు తలపాగలో, చెవులపై ధరించి పాదాభివందనం చేస్తారు. విజయ దశమి నాడు 2–8 ఏళ్ల వయసున్న తొమ్మిది మంది బాలికలను ప్రత్యేకంగా పూజించి తాంబూలం సమరి్పస్తారు. ఈ సందర్భంగా పూజా తాలీ పోటీలు నిర్వహిస్తారు. ఐక్యతకు నిదర్శనం.. మేము ఉత్తర భారతీయులమైనప్పటికీ దశాబ్దాలుగా నగరంలో జీవిస్తూ కలసిమెలసి ఉత్సవాలు చేసుకుంటున్నాం. దసరా వేడుకను ఘనంగా జరుపుకుంటాం. ఇది శక్తి, ఐక్యతకు నిదర్శనం. శ్రీరాముని విజయమైనా, దుర్గామాత పూజ అయినా రెండూ శక్తి ఆరాధన రూపాలే. – పంకజ్ కుమార్ అగర్వాల్, హైదరాబాద్ కుంభమేళా అగర్వాల్ సమితి అధ్యక్షులు కోల్‌కతా మాదిరిగానే.. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కోల్‌కతాలో నిర్వహించినట్లుగానే ఇక్కడా నిర్వహిస్తాం. ఐదు రోజులపాటు బెంగాలీ మాతను పూజించి, అనంతరం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తాం. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – జగన్నాథ్ అడక్, బెంగాలీ యంగ్ స్టార్ అసోసియేషన్ అధ్యక్షులుకలిసి మెలిసి ఉత్సవాలు ఏన్నో ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన మేమంతా ఇక్కడ కలిసి మెలసి ఉత్సవాలు చేసుకుంటాం. ఇది నిజాం కాలం నుంచి వస్తోంది. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా..ఉత్సవాలను మాత్రం మా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్నాం. ఇక దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్రంలో ఎలా నిర్వహిస్తారో..అదే పద్ధతిలో ఇక్కడా నిర్వహిస్తున్నాం. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. – డాక్టర్ నాగ్నాథ్ మాశెట్టి, టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షులు -
నటి శివానీ నగరం దసరా స్పెషల్..ఆ నమ్మకంతోనే ముందుకు
‘‘దుర్గా మాతని శక్తి స్వరూపిణి అంటారు. ప్రతి స్త్రీలోనూ అంతర్లీనంగా దుర్గా మాత ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే ఎలాంటి క్లిష్టమైన సవాల్‌ను ఎదుర్కొనాల్సి వచ్చినా బలంగా, ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నారు... సక్సెస్ అవుతూ, వారిని వారు సంరక్షించుకోగలుగుతున్నారు. స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే దసరా మహిళలందరికీ పెద్ద పండగ’’ అని అన్నారు యువ నటి శివానీ నాగారం. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయం అయ్యారు శివానీ. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తెలుగు తెరపై ఈ మధ్య మెరిసిన నవ తారల్లో తెలుగమ్మాయి శివానీకి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. విజయోత్సాహంలో ఉన్న శివానీ దసరా, బతుకమ్మ పండగ విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. మా కుటుంబానికి ‘దసరా’ చాలా పెద్ద పండగ. మేం అందరం కలిసి చాలా సందడిగా దసరా నవరాత్రులను చేసుకుంటాం. అలాగే బతుకమ్మ పండగను కూడా సెలబ్రేట్ చేస్తాం. రంగు రంగుల పువ్వులు సేకరించి, మా కుటుంబంలోని మహిళలతో పాటు అ పార్ట్మెంట్లోని మహిళలందరం కలిసి బతుకమ్మ ఆడతాం. దసరా అనగానే నాకు అమ్మవారు గుర్తుకు వస్తారు. మనకు ఉన్న చెడు వెళ్లిపోయి మనల్ని అమ్మవారు గుడ్ డేస్, గుడ్ స్ట్రెంత్తో ఆశీర్వదిస్తారు. మేం ఆ రోజు బంగారం కొంటాం. తొమ్మిదో రోజు ఆయుధ పూజ చేస్తాం. మా ఇంట్లో ఉన్న కార్లు, బైక్‌లకు పూల మాల వేసి, పూజలు చేస్తాం. ఇంటిని బాగా అలకరించుకుంటాం. బూరెలు, పాయసం, పులిహోర... ఇలా రకరకాల వంటకాలు చేసి, దేవుడికి పూజ చేసి, నైవేద్యం పెడతాం. ఇక నా జీవితంలో దసరా పండక్కి ప్రత్యేకమైన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాను. కొన్ని పండగలకు మా కజిన్స్ మా ఇంటికి వస్తారు. కొన్నిసార్లు మేం వాళ్ల ఇంటికి వెళ్తాం. అలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటాం. దసరా పండగకి సంబంధించి నా స్కూల్ డేస్‌లో కానీ, కాలేజ్ డేస్‌లో కానీ ఎలాంటి మైథలాజికల్ క్యారెక్టర్ చేయలేదు. అయితే అవకాశం వస్తే ఆ తరహా పాత్ర చేయాలని ఉంది. ఎందుకంటే ఆ పాత్రలో కొంత మహిళా సాధికారత ఉంటుందని నా నమ్మకం. ఓ నటిగా నాకు స్థిరత్వం, ఓపిక చాలా ముఖ్యం. దసరా అంటే క్లిష్టపరిస్థితులను దాటుకుని, విజయం సాధించడం. అందుకే మనకు ఓపిక, నమ్మకం ఉండాలి. చెడు రోజులను బలంగా ఎదుర్కొని, హుందాగా నెగ్గుకు రాగలగాలి. చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలుకోల్కతాలో దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. నా జీవితంలో ఒక్కసారైనా నేను కోల్‌కతా వెళ్లి, దుర్గామాత పూజలో పాల్గొనాలని ఉంది. కొన్నిసార్లు నేను హైదరాబాద్‌లో బెంగాలీ సమితులకు వెళ్తాను. ప్రతి ఏడాది దసరా నవరాత్రుల ఉత్సవాల్లో ఏదో ఒకరోజు తప్పకుండా వెళ్లి, అమ్మ వారిని దర్శించుకుంటాను. అక్కడ దుర్గామాతకు హారతి ఇస్తారు. ఆ సమయంలో బెంగాలీ మహిళలు తెల్లచీర ధరించి, నుదుట ఎరుపు రంగు బొట్టు పెట్టుకుని, డ్యాన్స్ చేస్తుంటే ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి. ఇక దసరా ఫెస్టివల్‌కి నా కాలేజీ డేస్ నుంచి దాండియా, గర్బా ఆడటం అలవాటు. ఎవరు దాండియా, గర్బా ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేసినా అక్కడికి మేం గ్రూప్‌గా వెళ్లి రాత్రంతా ఆడేవాళ్ళం. అంత క్రేజీగా ఉండేది. నాకు అది లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇదీ చదవండి: Janhvi Kapoor అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్‌ను కట్టిపడేసి : అమేజింగ్ లుక్నేను స్పిరిచ్యువల్ పర్సన్నిబాధగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడనే కాదు... అవకాశం దొరికినప్పుడల్లా దేవాయాలకు వెళ్తుంటాను. గుడిని ఇల్లుగా భావిస్తాను. అలాగే ఇంటిని కూడా దేవాలయంలా అనుకుంటాను. మా కుటుంబ సభ్యులు కూడా అలానే ఉంటారు. నేను ఎక్కడకి వెళ్లినా, ఎక్కడున్నా దేవుడు అక్కడే ఉన్నారని నేను అనుకుంటాను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి నన్ను రక్షిస్తుందని నా నమ్మకం. నన్నే కాదు... అందర్నీ రక్షిస్తుంటుందని భావిస్తాను. ఈ నమ్మకం వల్లే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతాం. ఉపవాసం అంటే స్వీయ నియంత్రణఉపవాసం గురించి ఎవరి వ్యక్తిగత అభి్ర΄ాయాలు వారికి ఉండొచ్చు. దసరా సమయంలో ఇప్పటివరకు నేనైతే ఉపవాసం ఉండలేదు. మా అమ్మ, అమ్మమ్మగార్లు ఉంటారు. అయితే ఉపవాసం చేయడం వల్ల స్వీయ నియంత్రణ కలుగుతుంది. అమ్మవారికి మన వంతుగా ఏదో ఇచ్చిన ఓ సంతృప్తి ఉంటుంది.ఓపికతో ఉండాలి మనకు మనమే స్ఫూర్తిగా నిలవాలంటే ముందు మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇదే మనకు మనం ఇచ్చుకునే మోటివేషన్. ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితం వస్తుందంటారు. సహనంగా ఉంటే ఏ పనైనా సరిగ్గా అవుతుంది. అందుకే నా ఓర్పే నా శక్తి అని నమ్ముతాను. – ముసిమి శివాంజనేయులు -
ఇంద్రకీలాద్రి పరిసరాల్లో చెప్పులతో సంచారం
ఇంద్రకీలాద్రి(విజయవాడ): దసరా ఉత్సవ వేళ ఇంద్రకీలాద్రిపై అపచారం చోటు చేసుకుంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఆలయ, ఉపాలయాల పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు మంగళవారం కాళ్లకు చెప్పులు వేసుకుని తిరిగారు. అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వచ్చే దారిలో నటరాజ స్వామి ఆలయం, గణపతి ఆలయం, పక్కనే శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు కుంకుమార్చన నిర్వహించే ప్రాంగణం, వెనుక వైపు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి. నటరాజస్వామి వారి ఆలయం నుంచి ముగ్గురు వ్యక్తులు నేరుగా కుంకుమార్చన ప్రాంగణం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాల మీదగా లక్ష్మీ గణపతి ప్రాంగణం వైపు చెప్పులతో పరుగులు తీశారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లోకి చెప్పులతో రాకుండా ఘాట్‌రోడ్డులోని పలు చోట్ల దేవస్థానం స్టాండ్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఆలయ పరిసరాల్లోకి చెప్పులు వేసుకొని రావడమే కాకుండా తాఫీగా పరిసరాల్లో తిరుగుతూ కనిపించారు. ఇటువంటి వారిపై దేవస్థాన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా అంకురార్పణ (చిత్రాలు)
-
'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్
దేవి నవరాత్రులతో యావత్తు దేశం ఆధ్యాత్మిక వాతవరణంతో అలరారుతోంది. ఎటు చూసిన దుర్గామాత నామస్మరణతో మారు మ్రోగిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ భారతదేశ ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా పోస్ట్‌లో..శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛ భక్తికి నెలవు ఈ తొమ్మిది రాత్రులు అని అన్నారు. పైగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎవరితోచినట్లుగా వారు తమ భక్తి కొలదీ అమ్మను కొలుచుకుంటారు. అయితే వాటితోపాటు ఈ కీర్తనను కూడా వినండి అంటూ భక్తును ప్రోత్సహించారు. దీంతో ఒక్కసారిగా ఆ పాట నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నవరాత్రులు ఏడాదికి రెండుసార్లు జరుపుకోవడం ఆచారం. ఒకటి చైత్రమాసంలో జరుపుకునే శారద నవరాత్రులు కాగా, మరొకటి ఆశ్వీయుజ మాసంలో జరుపుకునే దుర్గా నవరాత్రులు. అయితే ఈసారి దుర్గమ్మను కొలుచుకునేందుకు సంగీతాన్ని కూడా జోడించండి అని భక్తులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అంతేగాదు పండిట్ జస్రాజ్ పాటను షేర్ చేస్తూ ఈ తొమ్మిది రోజులు ఈ పాట వింటూ..అమ్మవారికి కృపకు పాత్రులకండి అంటూ సోషల్‌మీడియా పోస్ట్ ఎక్స్‌లో పేర్కొన్నారు. नवरात्रि पर देवी मां की आराधना मन को असीम शांति से भर देती है। माता को समर्पित पंडित भीमसेन जोशी जी का यह भावपूर्ण भजन मंत्रमुग्ध कर देने वाला है…https://t.co/bMydkzyjPp— Narendra Modi (@narendramodi) April 1, 2025 కాగా, మోదీ కూడా ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి దుర్గమ్మ వారిని ధ్యానిస్తానని గతంలో చెప్పారు. అలా చేయడం వల్ల తనలోని శక్తి మరింతగా జాగృతమై మంచి ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి వీలవుతుందని కూడా అన్నారు. ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు కూడా భక్తిభావాన్ని పెంపొందించే ఇలాంటి పోస్టులనే మరిన్ని చేయమని మోదీని పోస్ట్‌లో కోరారు. ఇక పండిట్ పండిట్ జస్రాజ్ దుర్గమ్మపై పాడిన అందమైన పాట ఏంటంటే యాదేవి సర్వభూతేషు.. అంటూ సాగే రమ్యమైన పాట. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై క్లిక్ చేసి ఆస్వాదించండి మరి..!. కీర్తనలు భగవంతునికి చేరువయ్యేలా చేస్తాయా?కీర్తనలు భక్తి మార్గాన్ని చేరుకోవడంలో హెల్ప్ అవుతాయనేది పురాణ వచనం. నవవిధ భక్తుల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నాయి పురాణాలు. అందుకే మోదీజీ ఈ శరన్నవరాత్రులను కీర్తనలు, భజనల సాయంతో అమ్మవారిని కొలుచుకుందామని పిలుపునిచ్చారు. రామదాసు, అన్నమయ్య, కబీర్ దాస్, మీరాబాయి వీరంతా కీర్తనలతో ఆ భగవంతుడుని వశం చేసుకోవడమే కాదు ఆయనకు ప్రీతీపాత్రులైన భక్తులుగా మారిపోయారు. అంతేగాదు ఆధ్యాత్మికత శక్తికి నెలవైనే ఈ భారతవని..ఎందరో విదేశీయులను తనవైపుకి తిప్పుకుని భక్తిమార్గంలో నడిచేలా చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కూడా. (చదవండి: భారత్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంతలా మారిపోయిందా..? విస్తుపోతున్న ఉక్రెయిన్ మహిళ) -
రూ.50 కొట్టండి.. నాటుకోడి, ఫుల్‌బాటిల్ గెలుచుకోండి
కరీంనగర్‌రూరల్: దసరా జోష్‌ను క్యాష్ చేసుకునేందుకు గ్రామాల్లో పలువురు పలు రకాలుగా ఆలోచిస్తున్నారు. రూ.50 చెల్లించి ఒక కూపన్ కొంటే చాలు.. నాటుకోడి, టీచర్స్ మద్యం బాటిల్ గెలుచుకోవచ్చంటూ ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చెర్లభూత్కూర్‌లో రూ.50 చెల్లించి కూపన్ తీసుకోండి దసరా ధమాకా గెలుచుకోండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొదటి బహుమతిగా నాటుకోడి, టీచర్స్ ఫుల్‌బాటిల్, రెండో బహుమతిగా బ్లెండర్సై్పడ్ రిజర్వ్ ఫుల్‌బాటిల్, మూడో బహుమతిగా రాయల్‌స్టాగ్ ఫుల్‌బాటిల్ గెలుచుకోండంటూ వాట్సాప్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. చెర్లభూత్కూర్తోపాటు సమీప గ్రామాలు దుబ్బపల్లి, చామనపల్లి, తాహెర్‌కొండాపూర్, మొగ్ధుంపూర్‌కు చెందిన వ్యక్తులు కూపన్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
శరన్నవరాత్రులలో మహమాన్విత దుర్గా సప్తశ్లోకి పారాయణం-శృంగేరీ పీఠం
ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అత్యంత శ్రద్ధాభక్తులతో అమ్మవారిని ఆరాధించడం అనూచానంగా వస్తోంది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు, మన దేశం, సమాజం అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ఈ సంవత్సరం శరన్నవరాత్ర మహోత్సవ శుభ సందర్భంలో సెప్టెంబర్ 22, సోమవారం నుంచి అక్టోబర్ 2, గురువారం విజయందశమి వరకూ మార్కండేయ పురాణాంతర్గతమూ, మహా శక్తిసంపన్నమూ అయిన శ్రీ దుర్గాసప్తశతి సంక్షిప్త రూపమైన దుర్గా సప్తశ్లోకీ అనే ఏడు శ్లోకాల స్తోత్రాన్ని ప్రతిరోజూ కనీసం 108 మార్లు పఠించవలసిందిగా శృంగేరీ పీఠం పిలుపునిచ్చింది.భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పైన సూచించిన దుర్గాసప్తశ్లోకి సంకల్ప సహితంగా పారాయణ చేసి కృతార్థులు కావలసిందిగా శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు భక్తులకు సూచించారు.సంకల్పంమమ శ్రీ దుర్గాపరమేశ్వరీ ప్రసాదేన చింతిత సకల మనోరథ సిద్ధ్యర్థం ఆయుర్విద్యా యశోబల వృధ్యర్థం సర్వారిష్ట పరిహార ద్వారా సమస్త మంగళా వ్యాప్తర్థం విశేషతః అస్మిన్ భారత దేశ పరిదృశ్యమాన పరస్పర విద్వేష నివృత్తి ద్వారా ధర్మ శ్రద్ధాలూనామ్ సకల శ్రేయోభివృద్యర్థం ఏతత్దేశ రాజ్య పరిపాలకానాం ధన ధాన్యాది సకల సాంపత్సమృధ్యర్థం శ్రీ దుర్గా సప్త శ్లోకీ పారాయణం కరిష్యేశ్రీ దుర్గా సప్త శ్లోకీఅస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః 1. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సాబలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి 2. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోఃస్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి ।దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యాసర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా ॥ 2 ॥3. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే 4. శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే ।సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే 5. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే ।భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే6. రోగానశేషానపహంసి తుష్టా-రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ ।త్వామాశ్రితానాం న విపన్నరాణాంత్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి 7. సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ।ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ । -
రాజాధిరాజ.. రాజమార్తాండ.. బహుపరాక్!
మైసూరు ప్యాలెస్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. అంబా విలాస్ ప్యాలెస్‌లో మైసూరు రాజవంశస్తులు వైభవం అంబరాన్ని అంటింది. రాజవంశీకుడు, స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ బంగారు, రత్న సింహాసనం పైన 11వసారి ఆసీనులై దర్బార్ని నిర్వహించారు. ముత్యాలు పొదిగిన సంప్రదాయ పట్టు వస్త్రాలను ఆయన ధరించారు. గండభేరుండ చిహ్నంతో సహా పలు రకాల బంగారు ఆభరణాలతో మెరిసిపోయారు. 12:42 గంటల తరువాత శుభ ముమూర్తంలో రాజవంశానికి చెందిన ఖడ్గాన్ని పట్టుకొని సింహాసనాన్ని అధిష్టించారు. ఈ సందర్భంగా భటులు జయహొ మహారాజా అంటు నినాదాలు చేశారు. మంగళ వాయిద్యాలు మారుమోగాయి, రాజ మార్తాండ సార్వభౌమ, యదుకుల తిలక, యదువీర ఒడెయార బహుపరాక్ బహుపరాక్ అని గట్టిగా స్వాగత వచనాలు పలికారు. నవగ్రహ పూజ:ముందుగా దర్బార్ ప్రాంగణానికి చేరుకున్న యదువీర్ అక్కడే నవగ్రహాలకు పూజలు చేశారు. కొంత సమయం సింహాసనంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి త్రిషిక భర్తకు పాద పూజ చేశారు. ఆపై ఆయన అందరికీ నమస్కరించి ఆనాటి మహారాజుల తరహాలో దర్బార్ని నిర్వహించారు. చాముండికొండ, పరకాల మఠం, నంజనగూడు, మేలుకొటె, శ్రీరంగపట్టణ, శృంగేరిలతో పాటు 23 ఆలయాల నుంచి పురోహితులు తీసుకువచ్చిన పూర్ణ ఫల ప్రసాదాలను స్వీకరించారు. తరువాత పండితులకు చిన్న చిన్న కానుకలను అందజేశారు. అర్ధగంట సేపు దర్బార్ సాగింది. రాజమాత ప్రమోదా దేవి పాల్గొన్నారు. మైసూరు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు సోమవారం నాడిన శక్తిదేవత చాముండేశ్వరి దేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్త కోటికి దర్శనమిచ్చారు. 9 రోజులపాటు అమ్మవారిని రోజుకొక్క అవతారంలో అలంకరిస్తారు. వేలాదిగా భక్తులు దర్శించుకుని తరించారు. ఫలపుష్ప ప్రదర్శన మైసూరు దసరా ఉత్సవాలలో ఫలపుష్ప ప్రదర్శనను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. కుప్పణ్ణ పార్క్‌లో ఏర్పాటైన ఈ ఫ్లవర్ షో అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫల పుష్ప విన్యాసాలను తిలకించిన సిద్దరామయ్య సంతోషం వ్యక్తంచేశారు. ఉప్పు సత్యాగ్రహం మహాత్మాగాంధీ పోరాటం విగ్రహాలను చూసి వివరాలను తెలుసుకున్నారు. (చదవండి: నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..) -
ఫ్లిప్ సైడ్ వేదికగా దాండియా మస్తీ..
లైవ్ ఢోల్, లైవ్ డీజే ప్రదర్శనలతో ఈ సారి ‘దాండియా మస్తీ–2025’ నగర వాసులను సందడి చేస్తోంది.. జాంటీ హ్యాట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నానకరాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫ్లిప్ సైడ్ వేదికగా దాండియా వేడుకలు సోమవారం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా నైట్స్, డాన్స్ లైక్ నెవర్ బిఫోర్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. జాంటీ హ్యాట్ ఈవెంట్స్ వ్యవస్థాపకురాలు దీపికా బాజీ రెడ్డి, నటి అరియానా గ్లోరీ, నటుడు రామ్ కార్తిక్, డీజే కిమ్, డీజే ఫ్లోజా, డీజే వినీష్, డీజే రిషి, డీజే హరీష్, డీజే వివాన్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. దాండియా మస్తీ 2025లో ప్రత్యేక ఆకర్షణలుగా లైవ్ ఢోల్, లైవ్ డీజే ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ భాగస్వాములుకానున్నారు. గర్బా మ్యూజిక్, బాలీవుడ్ ట్విస్ట్, స్టేజ్ సెటప్, థీమ్ డెకర్, స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్స్, ఓపెన్ అరేనాతో పాటు లైవ్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు దీపికా బాజీ రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ బెస్ట్ డ్రెస్, బెస్ట్ డ్యాన్సర్ విజేతలకు సిల్వర్ కాయిన్స్ బహుమతులు, పిల్లలకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. మహిళలకు 1+1 టికెట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాండియా మస్తీ టికెట్లు బుక్ మై షో, 95533 06329, 77023 99188, 97040 0162 నంబర్లలో పొందవచ్చు. ‘ఆరో రియాలిటీ’లో బతుకమ్మ..నగరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హైటెక్ సిటీలోని కోహినూర్ ఆరో రియాలిటీ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పలువురు ఔత్సాహిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. (చదవండి: వయసులకు అతీతం.. ఆధ్యాత్మిక పర్యాటకం..) -
శ్రీశైలంలో వైభవంగా దేవీశరన్నవరాత్రోత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయ దశమి: స్త్రీ శక్తి విజయానికి ప్రతీక
ఈ సకల చరాచర సృష్టిని నడిపించేది శక్తి. ఈ శక్తి లేకుండా త్రిమూర్తులు... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు—తమ కృత్యాలైన సృష్టి, స్థితి, లయాలను నిర్వర్తించలేరు; కదలడం కూడా సాధ్యపడదు. ఆ పరమ శక్తినే అదిశక్తి లేదా పరాశక్తి అంటారు. ఈ శక్తి త్రిగుణాత్మకమైనది—సత్వ, రజస్, తమో గుణాలతో కూడినది. ఈ గుణాలు శక్తిబీజంతో సంయోగమైతే 'స్త్రీ' రూపం ధరిస్తుంది. అటువంటి త్రిగుణమయ శక్తి ఆవిర్భవించి దుష్ట రాక్షస సంహారం చేసిన కాలం శరదృతువు, ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు.హిందూ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి శక్తివంతమైన ఆచారం దసరా! ఇది అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు చేసే మహోత్సవం. ఆ శక్తిస్వరూపిణి సృష్టిలోని సకల ప్రాణకోటికి అమ్మ, అందుకే జగన్మాత. అమ్మవారి రూపంలో దైవాన్ని ఆరాధించడం అనాదికాలం నుంచి వస్తున్న సంప్రదాయం. భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు ప్రధాన స్థానం ఉంది, ముఖ్యంగా దేవీ మహాత్మ్యం (మార్కండేయ పురాణంలోని భాగం)లో వివరించినట్లు, ఆమె దుష్ట సంహారం మరియు శిష్ట రక్షణ కోసం అవతరిస్తుంది.మహాశక్తి అవసరమైనప్పుడు దుష్ట సంహారం చేయడానికి లేదా శిష్ట రక్షణకు అవతరిస్తుంది. జీవులపై ఆమెకు అంతులేని ప్రేమ ఉంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఆమె అవతరణ మరియు రాక్షస సంహారం జరుగుతుంది. ఆ సమయంలో ఆదిపరాశక్తిని పూజించి అనుగ్రహం పొందడం సంప్రదాయం. దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలిగించేందుకు యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు, పారాయణాలు చేశారు. మనుషులు కూడా తమకు తోచిన దీక్షలు పూనుకున్నారు.ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైన మహాకాళి. నిర్గుణ పరాశక్తి మొదటి సగుణ ఆవిర్భావం మహాకాళి, అందుకే త్రిశక్తులలో—మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి—మహాకాళి మొదటిది. సావర్ణి మన్వంతరంలో ఆదిపరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి కారణం మహిషాసురుడు. ఈ తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఏ కాలంలోనైనా అవసరం. మహిషాసురులు—అంటే అహంకారం, కామం వంటి దుర్గుణాలు—ఎప్పుడూ ఉంటాయి. అందుకే మహిషాసుర మర్దిని మహాలక్ష్మి అవసరం ఎప్పుడూ ఉంటుంది.మహిషాసుర సంహార కథ: త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన తేజస్సు అమ్మవారిగా రూపుదాల్చింది. దేవతలందరూ తమ తేజస్సు, ఆయుధాలు సమకూర్చారు. మహిషుడు తన సంహారం కోసమే ఆమె వచ్చిందని తెలిసినా, ఆమెను ప్రలోభపెట్టాలని ప్రయత్నించాడు. ఆమె అంగీకరించకపోవటంతో, కామరూపిగా రకరకాల రూపాల్లో యుద్ధం చేశాడు. దేవి తగిన రూపాలు ధరించి మహిష రూపంలోని రాక్షసుని సంహరించింది. ఇది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున జరిగింది. దీక్ష వహించినవారు దశమి నాడు జగదంబను స్తుతించి, పట్టాభిషేకం చేసి, స్త్రీ శక్తి విజయాన్ని జరుపుకున్నారు. ఆమె వారిని వరం కోరమని చెప్పగా, అవసరమైనప్పుడు కాపాడమని కోరారు. ఆమె తలచినప్పుడు అవతరిస్తానని మాటిచ్చింది.మరొక కథ శుంభ-నిశుంభులది. వారు బ్రహ్మను తపస్సుతో మెప్పించి, అమర, నర, పశు, పక్షి పురుషుల వల్ల చావులేని వరం పొందారు. స్త్రీలు బలహీనులని భావించి, వారి వల్ల భయం లేదని చెప్పారు. ఆ తర్వాత స్వర్గంపై దాడి చేసి, ఇంద్రాసనాన్ని ఆక్రమించారు. దిక్పాలకులు, సూర్య-చంద్రాది దేవతలను ఓడించి, వారి పదవులు గ్రహించారు. దేవతలు బృహస్పతి సూచనతో హిమవత్పర్వతంపై దేవిని శరణు వేడారు. జగదంబ అభయం ఇచ్చింది.ఆ సమయంలో సర్వదేవతలు తమ శక్తులను మాతృకాగణాలుగా పంపారు. ఇవి ఆయా దేవతల ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలతో వచ్చి రక్తబీజ సైన్యాన్ని సంహరించాయి.మాతృకాగణాలు:బ్రహ్మ శక్తి: బ్రహ్మాణి (హంస వాహనం, కమండలు).విష్ణు శక్తి: వైష్ణవి (గరుడ వాహనం, చక్రం).శివ శక్తి: మాహేశ్వరి (వృషభ వాహనం, త్రిశూలం).కుమారస్వామి శక్తి: కౌమారి (మయూర వాహనం, శక్తి).ఇంద్ర శక్తి: ఐంద్రి (ఐరావత వాహనం, వజ్రం).వరాహ శక్తి: వారాహి (మహిష వాహనం, ఖడ్గం).నరసింహ శక్తి: నారసింహి (సింహ వాహనం, చక్రం).వీటికి తోడు వారుణి (పాశం), యామి (దండం), శివదూతి మొదలైనవి దానవులను సంహరించాయి. రక్తబీజుడు రక్త బిందువుల నుంచి కొత్త రాక్షసులు పుట్టించాడు. అప్పుడు అంబిక కాళికను రక్తం తాగమని చెప్పింది. కాళిక రక్తం తాగి, దేవి రక్తబీజుని సంహరించింది. తర్వాత నిశుంభుని తల నరికి, మొండెం కూడా నాశనం చేసింది. శుంభుని మాటలతో యుద్ధానికి ఆహ్వానించి సంహరించింది. ఇది మహా సరస్వతి అవతారం. మాట నైపుణ్యంతో విజయానికి సంకేతం.నవరాత్రులలో లలితా దేవి అవతారం ప్రాధాన్యం. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో వివరించినట్లు, ఆమె సర్వచైతన్య స్వరూపిణి. బండాసురుడు (అజ్ఞానం, మూఢత్వం)ను సంహరించేందుకు అవతరించింది. జీవితం కేవలం భౌతిక సుఖాలే కాదు; చైతన్యం అవసరం. బండతనం మీద చైతన్యం విజయం—విజయదశమి సంకేతం.ప్రాంతీయ వైవిధ్యాలు: బెంగాల్లో దుర్గాపూజ ఘనంగా జరుపుకుంటారు, మహిషాసుర సంహారాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. దక్షిణ భారతంలో బొమ్మల కొలువు (గొల్లు), బతుకమ్మ (తెలంగాణలో పూలను పూజించే పండగ), కుంకుమార్చన, చండీహోమాలు చేస్తారు. ఇవన్నీ సామూహిక ఐక్యత, స్త్రీ శక్తి గౌరవాన్ని పెంపొందిస్తాయి.‘యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.’సమాజంలో మంచి-చెడు సంఘర్షణలో మంచి గెలుస్తుంది. విజయదశమి దానికి ప్రతీక. శరీర అనారోగ్యం, మానసిక దుర్గుణాలు, సామాజిక దురాచారాలు, పర్యావరణ మాలిన్యాలు, స్వార్థం, అహంకారం.. వీటన్నింటి మీద విజయం సాధించడమే విజయ దశమి. ముఖ్యంగా స్త్రీల పట్ల చులకన భావం మీద స్త్రీ శక్తి విజయం. సద్భావనలు పెంపొందించుకునే పవిత్రమైన రోజు ఇది.హిందూ సంస్కృతిలో విజయ దశమి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ఉత్సవం. ఆశ్వయుజ మాసంలో జరిగే ఈ నవరాత్రి ఉత్సవం జగన్మాత శక్తి స్వరూపాన్ని ఆరాధించే సమయం. ఈ పండుగ దుష్ట సంహారం, శిష్ట రక్షణ మరియు స్త్రీ శక్తి విజయానికి ప్రతీక.- చింతా గోపిశర్మ సిద్ధాంతి -
శరన్నవరాత్రులు అమ్మవారి అలంకారాలు- నైవేద్యాలు! (ఫొటోలు)
-
మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆట, పాటలతో బతుకమ్మను పూజిస్తారు. గుజరాతి, రాజస్థానీలు దుర్గాదేవిని పూజించే క్రమంలో దాండియా నృత్యాలు చేస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా కొండాపూర్ శరత్ సిటీమాల్లోని స్నో కింగ్డమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దాండియా సంబురాలను ఒకే వేదికపై చేపట్టారు. ముంచు కొండలు, మంచుతో కప్పిన ప్యాలెస్‌లు, బ్లాక్ సీల్స్, ఇగ్లూ, ఓక్ చెట్లు, దృవపు ఎలుగుబంట్ల సెట్ల మధ్య ఈ ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఇవి 11 రోజుల పాటు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. రెండో రోజు బతుకమ్మ ప్రత్యేకత..బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో విశిష్టత కలిగి ఉంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా జరుపగా, రెండో రోజు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. రెండో రోజు రంగు రంగుల పూలతో బతుకమ్మను తయారు చేసుకుని గౌరమ్మను తయారు చేసుకుంటారు. అందులో గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఆరోజు అమ్మవారికి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే అటుకులు బతుకమ్మ అని పేరు వచ్చింది. తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ వేడుకలు జరుపుతారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిగా భావించి మహిళలు జరుపుకునే పండుగే ఇది. తొమ్మిది రోజులపాటు ఈ వేడుకులు జరుగుతాయి. ఒకవైపు నవరాత్రులు, మరోవైపు బతుకమ్మను ఘనంగా జరుపుకొంటారు. (చదవండి: సరదా పాటలు..దాండియా ఆటలు..!) -
ఇంద్రకీలాద్రిపై మొదలైన దసరా వైభవం.. దుర్గమ్మ 11వ అవతారంగా కాత్యాయనీ దేవి (చిత్రాలు)
-
దసరా వింత ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!
జగిత్యాల జిల్లా: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు యువకులు ‘దసరా బొనాంజా’ పేరుతో ప్రకటించిన ఆఫర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన ఫ్లెక్లీ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.రూ.150తో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ.. మద్యం, మాసం పేరుతో సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. రూ.150కు ప్రథమ బహుమతిగా మేక, రెండో బహుమతిగా బీర్లు, మూడో బహుమతిగా విస్కీ, నాలుగో బహుమతిగా కోళ్లు, ఐదో బహుమతిగా చీర అని పేర్కొంటూ వెలసిన ఫ్లెక్సీ విస్తుగొలుపుతోంది. స్థానికంగా ఉండే సాయిని తిరుపతి అనే వ్యక్తి ఈ బంపర్ డ్రా నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ నెల మొదటి తేదీన డ్రా తీయనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో ఎగబడి టోకెన్లు కొనుక్కుంటున్న జనాలు. -
సరదా పాటలు..దాండియా ఆటలు..!
దాండియా ఆటలు.. ఆడ.. సరదా పాటలు పాడ అంటూ నగర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలకు ఏర్పాటు జరుగుతున్నాయి. వేడుకలను సంబరంగా నిర్వహించేందుకు పలువురు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. మిగిలిన ఈవెంట్స్‌కు భిన్నంగా మొత్తం 10 రోజుల పాటు సందడి కొనసాగడమే నవరాత్రి సంబరాల ప్రత్యేకత. ఈ 10 రోజులూ దాండియా–గర్భా నృత్యాల హోరులో నగరవాసులు మునిగితేలనున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ డీజేలు, ఫుడ్ స్టాల్స్‌తో పాటు ఫ్లీ మార్కెట్స్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సంప్రదాయంతో పాటు ఆధునికతనూ కలగలిపి డిజైన్ చేస్తున్న ఈవెంట్స్ సకుటుంబ సపరివార సమేతంగా అలరించనున్నాయి. క్లబ్స్‌తో పాటు, ఫంక్షన్ హాల్స్, ఉద్యానవనాలు, ఓపెన్–ఎయర్ వేదికలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఈ దాండియా/గర్భా ఈవెంట్స్‌కు వేదికలుగా మారనున్నాయి. ప్రధానంగా బ్యాండ్ ప్రదర్శనలు, డీజే, ఫుడ్ స్టాల్స్, వంటివి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. టికెట్ ధరల విషయానికి వస్తే కొన్ని ఈవెంట్స్ బడ్జెట్–ఫ్రెండ్లీగా ఉంటే, సగటున రూ.500 ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏదైనా పెద్ద ఈవెంట్స్, సెలబ్రిటీ ప్రదర్శనలు ఉంటే లేదా ప్రీమియం వేదిక అయితే ధరలు ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఈ ఈవెంట్స్ సెపె్టంబర్ 20 నుంచి ప్రారంభమై, నవరాత్రి ముగిసే వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలో జరిగే కొన్ని కార్యక్రమాల గురించిన సమాచారం ఇది.. ఓపెన్ ఎయిర్ వేడుక.. నగరంలోని అతిపెద్ద ఓపెన్–ఎయిర్ వేదిక అయిన జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్ దాండియా ఉత్సవ్ జరుగుతుంది. ఇది 10 రోజుల పాటు నృత్యం, సంగీతం సహిత వేడుకలను అందిస్తుంది. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6.30 గంటల నుంచి నిర్వహిస్తున్నారు. ఓపెన్–ఎయిర్ సెటప్, లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్, మొత్తం ఫెస్టివ్ అలంకరణతో ప్రాంగణం కనువిందు చేస్తుంది. ఈ బేగంపేట్‌లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్లో ఎస్కే నవరాత్రి ఉత్సవ్ పేరిట ఈ నెల 22న రాత్రి 7గంటల నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ఢమాల్‌గా నిర్వాహకులు అభివరి్ణస్తున్న ఈ ఈవెంట్లో డీజే డాన్ సింగ్ ఓ ఆకర్షణ. ఫుడ్, పానీయాలు, బహిరంగ వినోద వేదికలు.. సిద్ధం చేశారు. ఈమాదాపూర్లోని యూలో ఎరీనాలో నవరాత్రి దాండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 22 రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ డీజే మ్యూజిక్ అందిస్తున్నారని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పీర్జాదిగూడలోని శ్రీ పలణి కన్వెన్షన్స్‌లో ఈ నెల 22న దాండియా మహోత్సవ్ సీజన్ 3 పేరిట నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా అలరించేలా తమ ఈవెంట్ ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ ఈవెంట్ సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది.ఈసారి ఈ ఈవెంట్‌ను ఫ్లీ మార్కెట్‌తో మేళవించి అందిస్తున్నారు. బైరమల్గూడలోని ఎడుకంటి రామ్ రెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే రస్ గర్భా వాల్యూమ్ 7 ఫ్లీ మార్కెట్ అండ్ ఎక్స్పో.. ఓ వైపు నవరాత్రి సంబరాల నృత్యాలతో పాటు షాపింగ్, ఫుడ్.. వంటివి మేళవిస్తోంది. మొత్తం 3 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవం ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది.ఈ ఉప్పల్‌లోని శ్రీ పళణి కన్వెన్షన్స్‌లో ఈ నెల 22 రాత్రి 7గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకూ దాండియా సంబరాలు కొనసాగనున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ సంబరాల్లో లైవ్ ఢోల్, డీజే షోస్, ఫుడ్ స్టాల్స్, సెలబ్రిటీల రాక.. వంటివి ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు. ఈనోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో సెలబ్రిటీ దాండియా నైట్స్ నిర్వహిస్తున్నారు. లైవ్ మ్యూజిక్, డీజేలు, సెలబ్రిటీల ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. నవరాత్రి ఉత్సవాలకు పేరొందిన నామ్ధారి గౌరవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని ఎస్ఎస్ కన్వెన్షన్‌లో నవరాత్రి ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తరంగ్ నైట్స్ పేరిట దాండియా నైట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4.30గంటలకు ప్రారంభం కానుంది. గర్భా, దాండియా నృత్యాలు, ఫొటోగ్రఫీ అవకాశాలు.. ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయ గర్భాను డిస్కో లైట్లు, ఆధునిక సంగీతంతో మిళితం చేసే డిస్కో దాండియా ఏఎమ్ఆర్ ప్లానెట్ మాల్లో జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఫ్యూజన్ ఈవెంట్ అని నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఈ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షలో 11 రోజుల పాటు డోలా రే డోలా పేరిట నవరాత్రి దాండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. బుకింగ్స్.. ప్లానింగ్స్..ప్రత్యేక రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. కుటుంబ సమేతంగా హాజరయ్యేవారు వేదికల సమాచారం, పార్కింగ్ సౌకర్యం, వాతావరణ పరిస్థితులు వంటి విషయాలు ముందుగా సరిచూసుకుని ప్లాన్ చేయడం అవసరం. ఈ నృత్యాలు చేసే అలవాటు ఉంటే అలసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంటికి దగ్గరలోని ఈవెంట్ ఎంచుకుంటే బెటర్.ఈ కొన్ని ఈవెంట్స్‌లో థీమ్ నైట్లు ఉంటాయి. కాబట్టి హాజరయ్యే ఈవెంట్‌కి సంబంధించి థీమ్/డ్రెస్ కోడ్ ఉంటే వాటి వివరాలు ముందుగా తెలుసుకోవడం అవసరం.ప్రస్తుతం వాతావరణ మార్పులు అనూహ్యంగా ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఈవెంట్ రద్దయ్యే పరిస్థితుల్లో సందర్శకులకు ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి.టికెట్ కొనుగోలుకు బుక్ మై షో, హై యాపె, డిస్టిక్ట్, టిక్కెట్స్ 99 వంటి అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించడం మేలు. స్ట్రీట్ కాజ్ పేరిట 21న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాండియా నైట్స్ జరుగనుంది. 22 నుంచి అక్టోబర్ 2 వరకు గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్‌లో ఢోలా రే ఢోలా పేరిట మెగా ఫెస్ట్. నాగోలు శ్రీరాంగార్డెన్స్లో 27, 28 తేదీల్లో దాండియా ఢోల్ భాజే పేరిట వేడుకలు. నగరంలోని టీబీఏ వేదికగా 22న నవరాత్రి బతుకమ్మ, దాండియా నృత్యాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమాజీగూడ ది పార్క్ హోటల్లో 24 నుంచి అక్టోబర్ 2 వరకు డిస్కో దాండియా. నాగోలు శుభం కన్వెన్షన్ సెంటర్లో 27న నాచో దాండియా పేరిట నవరాత్రి ఉత్సవాలు. బేగంపేట చిరాన్పోర్ట్లో 22 నుంచి అక్టోబర్ 2 వరకూ పది రోజుల పాటు నవరాత్రి ఉత్సవ్ పేరిట హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ధమాల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. (చదవండి: ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు..!) -
హైదరాబాద్: 'సెలెబ్రిటీ డాండియా నైట్స్' 9వ సీజన్ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు (ఫొటోలు)
-
నేటి నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి... 375 రకాల ఉత్పత్తులపై తగ్గనున్న ధరలు
-
సొంతూళ్లకు పయనమైన నగర వాసులు
సాక్షి,హైదరాబాద్: దసరా రద్దీ మొదలైంది. విద్యాసంస్థలు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే బస్సులు, రైళ్లలో ఆదివారం ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరో వారం రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లతో పాటు ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లోనూ జనం పల్లెబాట పట్టారు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ఈసారి ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్ మేరకు 100 రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసి బెర్తుల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ రైళ్లన్నింటిలోనూ ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ వందల్లోకి చేరింది. దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి వంటి వరుస పండుల సీజన్ దృష్ట్యా రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఫిబ్రవరి వరకు పలు రైళ్లలో 150 నుంచి 200 వరకు వెయిటింగ్ లిస్ట్ దర్శనమివ్వడం గమనార్హం. నగర శివార్ల నుంచే.. బతుకమ్మ, దసరా పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని 7,754 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సుమారు 377 స్పెషల్ సరీ్వసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కలి్పంచారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ మేరకు నగర శివార్ల నుంచే ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, సాగర్‌రింగ్ రోడ్డు, మెహిదీపట్నం, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. మరోవైపు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నేరుగా హాస్టళ్ల నుంచి ఆయా జిల్లా కేంద్రాలకు నడిపేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ప్రత్యేక బస్సుల్లో 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు చార్జీలు విధించనున్నారు. అన్ని రెగ్యులర్ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు యథావిధిగా ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చర్లపల్లి నుంచే ఎక్కువ రైళ్లు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా పలు రెగ్యులర్ రైళ్లతో పాటు ప్రత్యేక సరీ్వసులను చర్లపల్లి నుంచి నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇవి కాకుండా యథావిధిగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే రైళ్ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేశారు. సాధారణ బోగీల్లో బయలుదేరే ప్రయాణికులు టికెట్ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా యూటీఎస్ మొబైల్ యాప్ సదుపాయాన్ని స్టేషన్‌లోని వివిధ చోట్ల అందుబాటులో ఉంచారు. అధికారులు ఎంపిక చేసిన కొంతమంది సిబ్బంది మొబైల్ స్కానర్లు కలిగిన జాకెట్లను ధరించి ప్రయాణికుల వద్దకు వచ్చేవిధంగా ఏర్పాటు చేశారు. దీంతో టికెట్ కౌంటర్ల వద్ద క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. -
నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..
భారతదేశం అంతటా దుర్గమ్మ నవరాత్రుల సంభరాలతో కోలహలంగా మారింది. ఎటుచూసిన శరన్నవరాత్రుల సందడే కనిపిస్తుంది. రేపటి నుంచి మొదలుకానున్న ఈ నవరాత్రుల్లో దుర్గమ్మను ఎంతో భక్తిప్రపత్తులతో కొలుచుకుంటారు. ఇక తొలిరోజు నుంచి దశమి వరకు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా, ఉల్లి, వెల్లుల్లిని లేకుండా ఒంటిపూట భోజనాలతో కఠిన నియమాలను అనుసరిస్తారు. ముఖ్యంగా భవాని మాలధారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతలానో కఠిననియమాలను అనుసరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటారో తెలిసిందే. అంతటి పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల్లో అక్కడ మాత్రం దుర్గమ్మ తల్లికి చేప, చికెన్ వంటి నాన్‌వెజ్ ఆహారాలనే నైవేద్యంగా నివేదించడమే కాదు అవే తింటారట ఆ తొమ్మిది రోజులు. అదేంటని విస్తుపోకండి. ఇంతకీ అదెంత ఎక్కడో తెలుసా..!.పశ్చిమబెంగాల్లో ఈ విభిన్నమైన ఆచార సంప్రదాయం ఉంది. అక్కడ బెంగాలీల కుంటుంబాలన్నీ నాన్‌వెజ్ వంటకాలతో ఘమఘమలాడిపోతుంటాయి. అక్కడ ఎక్కువగా మతపరమైన పండుగల్లో చేపలు, మాంసం వంటి వంటకాలు తప్పనిసరిగా ఉంటాయట. అక్కడ ఇలా మాంసాహారాన్ని నివేదించడాన్ని పవిత్రంగా భావిస్తారని చరిత్రకారుడు నృసింహ భాదురి చెబుతున్నారు. బెంగాల్‌లోని అనేక ఆలయ ఆచారాల్లో మాంసాహారం నివేదించడం ఉంటుందట. ఇక్కడ అమ్మవారి ఉగ్ర రూపమైన కాళి ఆరాధన ఎక్కువగా ఉంటుందట. ఆమెకు మేకబలి, మాంసాన్ని నివేదించడం వంటివి ఉంటాయట. ప్రసాదంగా వాటిని వండుకుని తింటారట. అంతేగాదు వేయించి కూరగాయలు, చేపలు, మాంసం వంటి నైవేద్య సమర్పణ ఉంటుందట. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే కొన్ని ప్రాంతాలకు భిన్నంగా ఉంటుందట. ఇక్కడ శాకాహారాన్ని స్వచ్ఛమైనదిగా భావిస్తే..అక్కడ మాంసాహార సమర్పణను పవిత్రంగా భావిస్తారట. ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..కోషా మాంగ్షో - నెమ్మదిగా వండిన మటన్ కర్రీ, ముదురు, రిచ్ అండ్ లూచీస్ (డీప్-ఫ్రైడ్ పఫ్డ్ బ్రెడ్) తో జత చేసింది. ఇలిష్ మాచ్ - ప్రియమైన హిల్సా, తరచుగా ఆవాలు లేదా వేయించిన బంగారు రంగులో ఉడికించిన వంటకం. బంగాళాదుంపలతో చికెన్ కర్రీ - ఇంట్లో ఇష్టపడేది, తరచుగా వారాంతపు కుటుంబ భోజనంలో భాగం. మటన్ బిర్యానీ, ముఖ్యంగా కోల్‌కతాలో బంగాళాదుంప ముక్కతో బిర్యానీ పవిత్రమైనదిగా పరిగణిస్తారట.చేపల ఫ్రై, పులుసు: నవరాత్రుల్లో ఇది తప్పనిసరి వంటకం, భక్తులకు ప్రసాదంగా ఇచ్చే రెసిపీ కూడా. (చదవండి: ఢిల్లీలో జరిగే రామ్‌లీలా నాటకంలో పరశురాముడిగా బీజేపీ ఎంపీ) -
బలాన్నిచ్చే బతుకమ్మ ఫలహారం
తెలంగాణ ఆడపడుచుల్లో ‘బతుకమ్మ’ పండుగ ఆరోగ్యకాంతులను వెలిగిస్తోంది. బతుకమ్మ ఆడిన తర్వాత ‘సద్ది’ పేరుతో ‘ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం’ అంటూ అతివలు ఫలహారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిలో అనేక పోషక విలువలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఆటపాటలు, మానసికోల్లాసమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది. బతుకమ్మ సద్దిలో ‘ఐరన్’.. భారతీయ మహిళల్లో ఐరన్ లోపం కనిపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం పిల్లల్లోనూ ఉంటుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తొమ్మిదిరోజులు తొమ్మిది రకాల ఫలాహారాలను తయారు చేస్తారు. ఇందులో సత్తుపిండి, సద్ద ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు తదితర ఫలహారాలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు.. వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో తీరు పిండి వంట తయారు చేస్తుంటారు. సద్దుల్లో పోషకాలు.. బతుకమ్మ ఉత్సవాలు వస్తే అందరికీ సద్ద ముద్దలు(సజ్జ ముద్దలు) గుర్తుకొస్తాయి. ఈ పేరుతోనే పెద్దబతుకమ్మకు సద్దుల బతుకమ్మ అని పేరు వచి్చందని చెబుతారు. సందె వేళలో చేసే బతుకమ్మ కాబట్టి.. సద్దుల బతుకమ్మ అంటారని మరో చరిత్ర. సజ్జలను పిండిగా పట్టించి బెల్లం కలిపి ముద్దలు చేస్తారు. కొందరు వీటికి నెయ్యి కూడా కలుపుతారు. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ. కార్పోహైడ్రేట్స్ తక్కువ. ప్రొటీన్స్, కాల్షియం అధికంగా ఉంటాయి. త్వరగా జీర్ణం అవుతుంది. దీనికి బెల్లం కలపడంతో ఐరం శాతం పెరిగి మహిళల రుతుక్రమ సమస్యల నివారణ, గొంతు నొప్పి తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. నువ్వుల ముద్దలు.. బతుకమ్మ పండుగలో నువ్వులు ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో ఎమినోయాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్ మెదడును చురుకుగా ఉంచుతుంది. కాల్షియం ఎమకల దృఢత్వాన్ని పెంచుతుంది. పెసర ముద్దలు.. పెసళ్లను ఉడకబెట్టి బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తాయి. కొబ్బరి పొడి... కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నం, పులిహోర ఇటీవల సద్దిగా ఇస్తున్నారు. పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలు కలుపుతున్నారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర కూడా ప్రసాదంగా వాడుతున్నారు. దేశంలో దాదాపు 6 వేల ఏళ్లుగా పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా.. పంటల్లో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పెరుగులో పోషక విలువలు మెండు. అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమరి్పస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్ బి –6, బి12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్‌తో బసిల్లె అధికంగా ఉంటుంది. అపెండిసైటీస్, డయేరియా, డిసెంట్రీ వంటి వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను లాక్టిక్ యాసిడ్ నాశనం చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ నిరోధక శక్తిని పెంచుతుంది. పల్లిపిండి.. పల్లిపిండి శరీర ఎదుగుదలలో అత్యంత ప్రధానమైనది. అధిక ప్రొటీన్లతోపాటు రుచికరంగా ఉంటాయి. చాలామంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో పోషకాలూ లభిస్తాయి.పోషకాలు పుష్కలం బతుకమ్మ పండుగకు తయారు చేసే సత్తుపిండిలో వ్యాధి నిరోధక శక్తి పెంచే పోషకాలు ఉంటాయి. రుచికరంగా ఉండే సత్తుపిండి పిల్లలకు ప్రొటీన్స్ అందిస్తాయి. కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల ఎదుగుదల.. ఇలా అనేక ఉపయోగాలున్నాయి. సంప్రదాయ పిండివంటలను ప్రతీఒక్కరు తినాలి. బతుకమ్మ ఆరోగ్యాన్ని పంచే ప్రత్యేకమైన పండుగ. – దండె రాజు, ఆర్ఎంవో, గోదావరిఖని జీజీహెచ్ -
తంగేడు పూసింది గునుగు నవ్వింది
చినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు ముత్యం మాదిరిగా గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది.వీధులు.. పూల వనాలురామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలు గా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరి విగా పూసే పూలతో సిబ్బిలో పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. కనిపించని గునుగుగునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు గునుగు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది.ఆడపడుచుల వేడుకబతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు.విభిన్నం బతుకమ్మఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే జిల్లాలోని విభిన్న సాంస్కృతుల కారణంగా బతుకమ్మను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీని వాస్నగర్, రాఘవాపూర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవా యితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావి లాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుమ్మ అనంతరం బావిని పూడ్చుతారు.రాజన్న పాట వినాలి్సందేఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుక మ్మ పాటల స్పెషలిస్ట్. మ హిళలకన్నా మధురంగా పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. సొంత గ్రామంలో బతుక మ్మ పాటలు పాడుతూ.. గుర్తింపు తెచ్చుకున్నాడు.60 ఏళ్లనుంచి ఆడుతున్నమల్యాల: పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది.– ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాలనుదుటి సిందూరం పండుగల్లో ముఖ్యమైంది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ -
Tirumala: శ్రీవారి భక్తులకు మార్గదర్శకాలు
తిరుమలకు బయలు దేరేముందు ఇష్టదేవతలను పూజించుకోవాలి.శ్రీ వారిని దర్శించేముందు పుష్కరిణిలో స్నానంచేసి, ముందుగా వరాహస్వామిని పూజించాలి. ఆ తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించాలి.ఆలయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తూ ‘ఓం శ్రీవేంకటేశాయ నమః’ అని స్మరిస్తూ ఉండాలి.స్వామిపైనే ధ్యాసను ఉంచాలి. తిరుమల సమీపంలో ఉన్న ఆకాశగంగ, పాపవినాశనం తీర్థాలలో స్నానం చేస్తే, సకల పాపాలు హరిస్తాయి. తిరుమలలో ఉన్నప్పుడు సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విధిగా పాటించాలి.తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలి కానుకలు, ముడుపులను ఆలయంలోని స్వామి హుండీలోనే సమర్పించాలి.తిరుమలలో భక్తులు చేయకూడనివిఆలయం చుట్టూ నాలుగు మాడవీథుల్లో పాదరక్షలు ధరించరాదు. ఈ వీథుల్లోనే ఉత్సవమూర్తులు నిత్యం ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తుంటారు.విలువైన ఆభరణాలు, ఎక్కువ నగదు మీ వద్ద ఉంచుకోకూడదు.శ్రీవారి దర్శనం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతో తిరుమలకు రాకూడదు.స్వామి దర్శనం కోసం త్వరపడకుండా మీవంతు వచ్చేవరకు ఆగాలి. ఆలయార్హత లేని సందర్భాల్లో ఆలయంలోకి రాకూడదు. స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో పువ్వులు అలంకరించుకోరాదు. తిరుమల గిరుల్లోని విరులన్నీ స్వామి సేవకే.కాటేజీల్లో నీరు, విద్యుత్ వృథా చేయకూడదు. అపరిచితులను వసతి గృహాల్లోకి అనుమతించరాదు. వారిని నమ్మి, గది తాళాలను ఇవ్వకూడదు.పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు. తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం మొదలైనవి పూర్తిగా నిషేధం. పేకాట, జూదం వగైరాలు పూర్తిగా నిషేధం.శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించరాదు. వారిని ప్రోత్సహించరాదు. దళారుల నుంచి నకిలీ ప్రసాదాలను కొనుగోలు చేయరాదు. ఆలయప్రాంగణంలో ఉమ్మివేయరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధం.వివిధ రాజకీయసభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్లు మొదలైనవి నిషేధం.ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు వంటి పరికరాలు తీసుకువెళ్లరాదు. ఆయుధాలు తీసుకురాకూడదు.జంతువధ నిషేధం.భిక్షుకులను ప్రోత్సహించరాదు.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలన్న నిబంధనను టీటీడీ కచ్చితంగా అమలు చేస్తోంది.పురుషులు ధోవతి–ఉత్తరీయం, కుర్తా–పైజామా... మహిళలు చీర–రవిక, లంగా–ఓణి, చున్నీతో పాటు పంజాబీ డ్రస్, చుడీదార్ ధరించాల్సి ఉంటుంది.స్వచ్ఛంద సేవ ‘శ్రీవారి సేవ’లో పాల్గొనదలచిన వాలంటీర్లు కూడా డ్రెస్‌కోడ్‌ను విధిగా పాటించాలి. తొక్కిస లాటలకు, తోపులాటలకు తావులేకుండా ఆలయ అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు సహకరిస్తే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తుంది. తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి దర్శనానుగ్రహాలు పరిపూర్ణంగా లభించాలని కోరుకుందాం. -
కలియుగ వైకుంఠం.. తిరుమల ఆలయం
కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయం. క్రీ.పూ. 12వ శతాబ్దంలో తిరుమలలో శ్రీవెంకటేశ్వర ఆలయం నిర్మితమైంది. 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆలయ గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు.. పవిత్ర వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరచేందుకు వేరువేరు గదులు. లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగది. మొదటి ప్రాకారం..మహాద్వార గోపురంఏడుకొండల్లో కొలువైన వెంకన్న స్వామిని దర్శించుకునే ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ప్రవేశద్వార గోపురమే మహాద్వార గోపురం. పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అని వేరువేరు పేర్లు ఉన్నాయి. పెద్దవాకిలి. తమిళంలో ‘పెరియ తిరువాసల్’ అని కూడా పిలుస్తారు. ఈ మహాద్వారాన్ని గోపురంతో అనుసంధానిస్తూ నిర్మించిన ప్రాకారమే మహా ప్రాకారం అంటారు. వైకుంఠం క్యూ కంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. లోనికి అడుగుపెట్టక మునుపు పైపుల ద్వారా వచ్చే నీటితోనే భక్తులు పాదాలను శుభ్రం చేసుకుని ప్రవేశించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ వాకిలి గోడపై అనంతాళ్వారులు వినియోగించిన గునపం ఇప్పటికీ కనిపిస్తుంది.శంఖనిధి.. పద్మనిధిమహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల్లా పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. వీరే శ్రీవారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. కుడివైపున ఉన్న మరో రక్షక దేవత పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.కృష్ణదేవరాయమండపంమహాద్వారానికి ఆనుకుని లోపలివైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే శ్రీకృష్ణదేవరాయ మండపం. దీనినే ప్రతిమ మండపం అని కూడా అంటారు. ఈ మండపం లోనికి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపున రాణులు తిరుమలదేవి, చిన్నమదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మణ్ణి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు తిరుమల యాత్ర చేసి శ్రీవారికి ఎన్నో కానుకలు సమర్పించారు. అచ్యుతరాయలు తనపేరిట బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు.అద్దాల మండపంప్రతి మండపానికి 12 అడుగుల దూరంలో ఎతై ్తన అధిష్ఠానంపై నిర్మించిన దాన్నే అద్దాల మండపం లేదా ఆయినా మహల్ అంటారు. ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు. ఈ అరలు ఉన్న ప్రాంతాన్ని ప్రసాదం పట్టెడ అంటారు.తులాభారంశ్రీకృష్ణదేవరాయల మండపానికి ఎదురుగా ఉంటుంది తులాభారం. భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణా తులాభారంగా స్వామివారికి సమర్పించుకుంటుంటారు. తులాభారానికి అవసరమైన వస్తు సామగ్రిని భక్తులు తిరుమలకు మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆలయం లోపలే తులాభారంలో వేయాల్సిన వస్తువులకు తగిన నగదు రూపంలో చెల్లిస్తే టీటీడీనే ఆ వస్తువులను సమకూరుస్తుంది.రంగనాయక మండపంకృష్ణదేవరాయ మండపానికి దక్షిణం వైపుగా 108 అడుగల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో శిల్ప శోభితమై విరాజిల్లుతూ కనిపించేదే రంగనాయక మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపం అని పిలుస్తారు. ఒకప్పుడు నిత్యకళ్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలైన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వాచనంతో పాటు స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు.తిరుమలరాయ మండపంరంగనాయక మండపాన్ని ఆనుకుని పడమరవైపున ఉన్న ఎత్తైన స్తంభాలతో, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి ఈ మండపం. ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించారు. స్వామివారికి ‘అన్నా ఊయల తిరునాళ్లు’ అనే ఉత్సవాన్ని నిర్మించే నిమిత్తం క్రీశ 1473లో ఈ మండపాన్ని నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించారు. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.రాజా తోడరమల్లుఅక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉన్న లాలా ఖేమార్ము క్షత్రియ వంశస్థుడు. ఈయన రాజా తోడరమల్లుగా ప్రసిద్ధి పొందాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించేటప్పుడు ధ్వజస్తంభానికి సమీపంలో రాజా తోడరమల్లు, తల్లి మాత మోహనాదేవి, భార్య పితబీబీ విగ్రహాలు స్వామివారికి అభిముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు కనిపిస్తాయి. 17వ శతాబ్దంలో ముస్లిం పాలకుల దాడులు, బ్రిటిష్ దండయాత్రల నుంచి శ్రీవారి ఆలయాన్ని సంరక్షించిన పాలకుల్లో రాజా తోడరమల్లు ఒకరు. నాటి నుంచి వీరి లోహ విగ్రహాలు తిరుమల ఆలయంలో ఉన్నాయి.ధ్వజస్తంభంధ్వజస్తంభ మండపం వెండి వాకిలికి ఎదురుగా చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంలా ఎత్తైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం. ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండి వాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్న ధ్వజారోహణం అంటారు. బలిపీఠంధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారురేకు తాపడం ఉంటుంది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని (అన్నాన్ని) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.క్షేత్రపాలక శిలధ్వజస్తంభానికి ఈశాన్య మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే క్షేత్రపాల శిల అంటారు. ఇది రాత్రి పూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు గుడికి తాళం వేసి తరువాత ఈ శిలపై ఉంచి నమస్కరించి తాళం చెవులను తీసుకెళుతారు. మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులతో గుడి తలుపులు తెరుస్తారు. సంపంగి ప్రాకారంమహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థలవృక్షాలనేవి ఉండటం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం సంపంగి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందున ఇలా పిలువబడుతోంది. కళ్యాణమండపందక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంలో ఈ కళ్యాణమండపాన్ని నిర్మించారు. ఇందులో తూర్పుముఖంగా ఉన్న కళ్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కళ్యాణోత్సవం జరుగుతుంది.ఉగ్రాణంస్వామివారి ప్రసాదాలకు తయారయ్యే ముడిసరుకులు నిల్వ ఉంచే గది. ఇది వాయవ్య మూలగా ఉంటుంది.విరజానదివైకుంఠంలోని పరమ పవిత్రమైన ఈ నది శ్రీవారి పాదాల క్రిందగా ప్రవహిస్తుంటుందని నమ్మకం. ఆలయం లోపలి బావుల్లో ఈ నది నీరు ప్రవహిస్తుందని, అందుకే ఆలయ బావుల్లోని నీరు పరమ పవిత్రమైనదిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వినియోగిస్తుంటారు.నాలుగుస్తంభాల మండపంసంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వనరసింహ రాయలు, ఆయన భార్య, ఇద్దరు కుమారుల పేర స్తంభాలు కట్టించారు.పూలబావిపూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామివారికి ఉపయోగించిన పూలను ఇందులో వేస్తారు. దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్లేటప్పుడు ఎతైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.వగపడి భక్తులు దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది. ముఖ మండపం అద్దాల మండపానికి ముందు భాగంలో ఉంటుంది. కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు ఇక్కడ అందజేస్తారు.రెండవ ప్రాకారం..వెండి వాకిలి.. నడిమి పడికావలి ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండి వాకిలి. నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండి వాకిలి మీదుగా భక్తులు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రవేశ ద్వారమంతటా వెండిరేకు తాపడం చేసినందున దీన్ని వెండివాకిలి అంటారు. ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీవారు పాచికలాడుతున్న శిల్పం ఉంటుంది.విమాన ప్రదక్షిణంవెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అని కూడా అంటారు. సుప్రభాత సేవ జరిగే సమయంలో భక్తులు వెలుపల అంగప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో వెండి వాకిలికి ఎదురుగా శ్రీరంగనాథస్వామి, వరదరాజస్వామి ఆలయాలు ఉంటాయి. ఇంకా ప్రధాన వంటశాల, పూలబావి, అంకురార్పణ మండపం, యాగశాల, నాణేల పరకామణి, నోట్ల పరకామణి, చదనపు అర, విమాన వేంకటేశ్వరస్వామి, రికార్డులగది, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి సన్నిధి, ప్రధాన హుండి, విష్వక్సేనుల వారి ఆలయం మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్లుగా పేర్కొంటారు.బంగారు బావిదర్శనాంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడం ఉంటుంది. ఇందులో నీటినే స్వామి వారి అభిషేకాలకు, ప్రసాదాలకు వినియోగిస్తారు. ఇందులో వైకుంఠంలోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.వకుళాదేవిబంగారుబావి పక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. శ్రీవారి తల్లి. ద్వాపరయుగంలో యశోదాదేవే ఈ కలియుగంలో స్వామివారి కళ్యాణం చూడటానికి వకుళాదేవిగా అవతరించింది.అంకురార్పణ మండపంబంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు. ఇంకా గరుడ, విష్వక్సేన, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.యాగశాలహోమాది క్రతువులు నర్వహించే ప్రదేశం. ఇప్పుడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.సభ అరకైంకర్యాలకై ఉపయోగించే బంగారు, వెండి పాత్రలు, కంచాలు, గొడుగులు ఉంచే ప్రదేశం. ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విసనకర్రలను ఇక్కడే భద్రపరుస్తారు.సంకీర్తన భాండాగారంసభ అర పక్కనే ఈ గది ఉంటుంది. ఇరువైపులా తాళ్లపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్లపాక వంశం వారు రచించిన సుమారు 32వేల సంకీర్తనలను భద్రపరచారు. వేటూరి ప్రభాకర శాస్త్రి, సాధు సుబ్రమణ్యశాస్త్రి వంటి వారి విశేష కృషి వలన ఈ రోజు మనం వాటిని చూస్తున్నాం.భాష్యకార్ల సన్నిధిఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏ కైంకర్యాలు ఏ విధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి. తన 120 సంవత్సరాల కాలంలో మూడు పర్యాయాలు తిరుమలకు మోకాళ్లపై వచ్చారు. అలా వస్తున్నప్పుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ల పర్వతం. నేటికీ కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్లతో ఎక్కుతుంటారు.పోటుప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణంలో ఈ పోటు ఉంది. ఇక్కడ దద్ధోజనం, చక్కెర పొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరాతో పాటు కళ్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్ పాయసం, అప్పం మొదలైనవి తయారు చేస్తుంటారు. ఆనందనిలయ విమానంఆనందనిలయంపై ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు. గరుత్మంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుంచి భూమి మీదకు తీసుకొచ్చారని చెబుతారు. దీని మీద దాదాపు 64 మంది దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నట్లు చెబుతుంటారు. ఈ గోపురంపైనే వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామినే విమాన వెంకటేశ్వరస్వామి అంటారు.రికార్డు గదిస్వామివారి అభరణాల వివరాలు, జమ ఖర్చులు వివరాలను భద్రపరచు గది.వేదశాలరికార్డుల గది పక్కనే వేద పండితులు పఠనం చేసే గది. ఇక్కడ మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.యోగనరసింహస్వామి సన్నిధిరామానుజాచార్యులుచే శ్రీనరసింహాలయం ప్రతిష్ఠితం చేయబడింది. క్రీశ 1330–1360 మధ్య కాలంలో నిర్మించినట్లు పరిశోధకుల అభిప్రాయం. క్రీశ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. అళగియ సింగం (అందమైన సింహం) అని, వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది. చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండటం ప్రత్యేకం. ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.శంకుస్థాపన స్తంభంరాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.పరిమళ అరశంకుస్థాపన స్తంభం నుంచి తిరిగి వచ్చే మార్గంలో ఈ పరిమళ అర ఉంది. స్వామివారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.శ్రీవారిహుండీభక్తులు కానుకలు వేసే ప్రాంతం. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగినా ఇప్పటికీ ఎటువంటి మార్పు చెందని ఒకే ఒక స్థలం. దీని కింద శ్రీచక్రయంత్రం, ధనాకర్షణ యంత్రం ఉన్నాయని నమ్మకం.బంగారు వరలక్ష్మిహుండీ ఎడమగోడపై బంగారు లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఈవిడ భక్తులకు అషై్టశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.కటాహ తీర్థంఅన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టిలాంటి నిర్మాణం. ఇందులో స్వామివారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.విష్వక్సేనహుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ఘంటా మండపంబంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్య ఉన్న ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామివారి సందర్శనకు వేచి ఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు. పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయంలో వీటిని మోగించేవారు. దీనిని ఘంటపని అనేవారట. ఈ గంటలను అనుసరించే స్వామివారి ఆహారసేవలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం తీసుకునేవారట. ప్రస్తుతం రెండూ ఒకేచోటుకు చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం పక్కనే ఉంటాయి.గరుడ సన్నిధిమూలవిరాట్టుకు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారు మండపం. బంగారువాకిలి ఎదురుగా, గరుడాళ్వార్ మందిరం ఉంది. శ్రీవారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో ఉన్న గరుడాళ్వారు దర్శనమిస్తాడు. ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.ద్వారపాలకులుబంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు. మహాలఘు దర్శనం ఇక్కడే చేసుకుంటారు.మూడవ ప్రాకారం..బంగారు వాకిలిశ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లటానికి అత్యంత ప్రధానమైన ఏకైక ద్వారం బంగారు వాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారు వాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీమలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. స్నపన మండపంబంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే స్నపనమండపం. క్రీ.శ. 614లో పల్లవరాణి సామవై ఈ మండపాన్ని నిర్మించి భోగశ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించారట. ఈ స్నపన మండపాన్నే తిరువిలాన్కోయిల్ అంటారు. ఆనందనిలయం జీర్ణోద్ధరణ సమయంలో ఈ మండపాన్ని నిర్మించినట్లు చెబుతారు. ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునికి ఆరోజు పంచాంగం చెప్పే పూజారులు, క్రితం రోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు. రాములవారి మేడస్నపన మండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపులా ఎత్తుగా కనిపిస్తుంది రాములవారి మేడ. తమిళంలో మేడు అంటే ఎతై ్తన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆనంద నిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పేరుపొందింది.శయన మండపంశ్రీవారి గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయన మండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.కులశేఖరపడిశ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరపడి. పడి అనగా మెట్టు, గడప అని అంటారు.ఆనందనిలయంకులశేఖరపడి అనే బంగారు గడప దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. ఈ ఆనందనిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయం అంటారు.శ్రీవేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు)గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిల్చొని ఉన్న శిలాదివ్యమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామి. నిలబడి ఉన్నందున ఈ అర్చామూర్తిని ‘స్థానకమూర్తి’ అంటారు. అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ‘ధ్రువమూర్తి’ అని, ‘ధ్రువబేరం’ అని కూడా అంటారు. శ్రీవారు అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నారు. ఈ మూలమూర్తికి ప్రతినిధులుగా కొలువు శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్ప స్వామి అనే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా సీతారామలక్ష్మణులు, శ్రీకృష్ణ రుక్మిణులు, చక్రత్తళ్వారులు, సాలగ్రామ శిలలు ఉన్నాయి (స్వామివారికి ప్రతిరూపాలుగా వారికి నిత్య అభిషేకాలు జరుగుతుంటాయి)∙ -
Tirumala: ఆ దేవదేవుడికి కునుకే కరువు..!
కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోకవైకుంఠం తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. పూర్వం చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త దివ్యతేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. యేళ్ల తరబడి ఆ స్వామికి కంటిమీద కనుకు కష్టమైపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..!! అవును.. పూర్వం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత మంది భక్తజనం రావటంతో స్వామి దర్శనం కేవలం పగటిపూట మాత్రమే కలిగేది. రానురానూ తిరుమలకొండ మీద సౌకర్యాలు పెరిగాయి. భక్తులు పెరిగారు. క్యూలు పెరిగాయి. వారి వేచి ఉండే సమయం పెరిగింది. ఆ ప్రభావం సాక్షాత్తు మన స్వామి దర్శనం మీద పడిందనటంలో అతిశయోక్తిలేదు. కష్టాలు తొలగాలని కోర్కెల చిట్టాలతో వచ్చే భక్త జనులకు దివ్యాశీస్సులు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే అన్నట్టుగా స్వామి క్షణకాలం కూడా తీరికలేకుండా అనుగ్రహిస్తున్నారనటంలో ఆవంతైనా అనుమానం లేదు. మన స్వామికి కంటి మీద కనుకు లేకపోవడానికి కారణ విశేషాలేమిటో తెలుసుకోవాల్సిందే మరి!!నాటి కుగ్రామం నుండి ప్రపంచ స్థాయి క్షేత్రంగా విరాజిల్లుతూ..1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే నాటికి ఈ క్షేత్రం కుగ్రామమే. కనీసం మట్టిరోడ్డు కూడా లేని దట్టమైన అటవీ ప్రాంతం. తిరుమల కొండకు రెండు ఘాట్రోడ్ల ఏర్పాటుతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగాయి. ఎలాంటి మౌలిక వసతుల్లేని తిరుమలలో ప్రస్తుతం స్టార్ హోటళ్ల స్థాయి సౌకర్యాలు ఏర్పడ్డాయి.ఒకప్పుడు చేతివేళ్లపై లెక్కపెట్టగలిగేలా ఉన్న సిబ్బంది నేడు వేలసంఖ్యకు పెరిగారు. రోజూ వందల సంఖ్యలోపే వచ్చే భక్తులు నేడు 70 వేలు దాటారు. అప్పట్లో వేలల్లో లభించే ఆలయ హుండీ కానుకలు కూడా ఆ మేరకు పెరిగి రూ.2.5 నుండి రూ.3 కోట్లకు చేరుకున్నాయి. రూ.లక్షల్లో ఉన్న స్వామి ఆస్తిపాస్తులు నేడు లక్షన్నర కోట్లరూపాయలకు పైబడ్డాయి. పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామికి నేడు అర్ధరాత్రి దాటినా కూడా కునుకు దొరకని విధంగా భక్తులు పెరిగిపోయారు. ⇒ నాడు దట్టమైన అరణ్యంలో దాగిన తిరువేంగడమే నేడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం. పూర్వం తిరుమలకొండను ‘తిరువేంగడం’ అని, శ్రీవేంకటేశ్వర స్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అనీ కీర్తించేవారు. మహనీయులెందరో..!⇒తిరుమల „ó త్రానికి పల్లవులు, చోళులు, పాండ్యులు, కాడవ రాయరులు, తెలుగుచోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు విశిష్ట సేవ చేశారు. ఆలయ కుడ్యాలపై ఉన్న శాసనాలే ఇందుకు ఆధారం. ఆ తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు, అధికారులు తిరుమలేశుని కొలువులో సేవించి తరిస్తూ ఆయా కాలాల్లో ఆలయ పరిపాలనలో భక్తులకు తమవంతుగా సేవలు, సౌకర్యాలు కల్పించారు. ⇒ఇక ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, అన్నమాచార్యులు, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వంటి వారెందరో ఈక్షేత్ర మహిమను వేనోళ్ల కొనియాడారు. తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని దశదిశలా చాటారు. బ్రిటిష్ చట్టాలపైనే దేవస్థానం పునాదులురెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన తెల్లదొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులేనని చెప్పొచ్చు. దేవస్థానం పాలన కోసం వేసిన పునాదులు వారి కాలంలోనే పటిష్ఠంగా ఏర్పడ్డాయనటానికి టీటీడీ వద్ద లభించే రికార్డులే ఆధారం. ⇒1843 నుండి 1933 వరకు మహంతుల పాలన జరిగింది. ఆలయ పరిపాలన కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆలయ కమిషనర్‌తోపాటు ధర్మకర్తల మండలి కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టింది. ⇒ చివరి మహంతు ప్రయాగ్‌దాస్ దేవస్థాన కమిటీకి తొలి అధ్యక్షులుగా 1933 నుంచి 1936 వరకు సేవ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 52 మంది అ«ధ్యక్షులు, స్పెసిఫైడ్ అథారిటీ ప్రత్యేక పాలనాధికారులుగా పనిచేశారు.⇒ధర్మకర్తల మండళ్లలోని చైర్మన్, ఈవోలు ఎవరికి వారు ఆయా కాలాల్లో అవసరాలకు అనుగుణంగా భక్తుల బస కోసం సత్రాలు, కాటేజీలు నిర్మించారు. ప్రయాణ సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. తొలినాళ్లలో పగటిపూటే స్వామి దర్శనం⇒1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత కూడా తిరుమలకు నడిచేందుకు సరిగ్గా కాలిబాట మార్గాలు లేవు. తిరుమల మీద కూడా అలాంటి పరిస్థితులే కనిపించేవి. చుట్టూ కొండలు, బండరాళ్లే కనిపించాయి.⇒కొండకు వచ్చే భక్తులు ఆలయం ఎదురుగా ఉండే వేయికాళ్ల మండపం, ఆలయ నాలుగు మాడ వీథుల్లోని మండపాలు, స్థానిక నివాసాల్లో తలదాచుకునేవారు. అప్పట్లో ఎలాంటి క్యూలు ఉండేవికావు. ⇒మహాద్వారం నుండే గర్భాలయం వరకు వెళ్లేవారు. స్వామిని తనివితీరా దర్శించుకునేవారు. అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రమైన మంచు, చలి ఉండేవి. అందుకే సూర్యుడు కనిపించే సమయంలోనే ఆలయాన్ని తెరిచి ఉంచేవారు. ఘాట్రోడ్ల నిర్మాణంతోనే భక్తుల పెరుగుదల ⇒ఈ పరిస్థితులలో మద్రాసు ఉమ్మడి రాష్ట్ర బ్రిటిష్ గవర్నర్ సర్ ఆర్థ్థర్ హూప్ నేతృత్వంలో ప్రముఖ భారతీయ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘాట్‌రోడ్‌కు రూపకల్పన చేశారు.⇒1944 ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైంది. తొలుత ఎడ్లబండ్లు, తర్వాత నల్లరంగు బుడ్డ బస్సులు (చిన్న బస్సులు) ఈ మొదటి ఘాట్‌రోడ్డులోనే తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. దీంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ⇒1951 నవంబర్ నెల మొత్తానికి కలిపి శ్రీవారి దర్శనానికి దేవస్థానం బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య 27,938 మంది, 1953, ఏప్రిల్‌లో 52,014 మంది మాత్రమే. ⇒1961, నవంబర్ మొత్తంగా తిరుమల ఘాట్‌రోడ్డులో 1,986 కార్లు, బస్సులు, 81 మోటారు సైకిళ్లు తిరిగాయి.⇒తర్వాత 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్‌రోడ్డుతో తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు మరింత మెరుగుపడ్డాయి.⇒ప్రయాణ సమయం తగ్గింది. నునుపైన తారు, సిమెంట్ రోడ్లు అందుబాటులోకి రావటం, వాటిపై వాహనాలు రివ్వున తిరగటంతో తిరుమలేశుని దర్శించే భక్తుల రాక క్రమంగా పెరుగుతూ వచ్చింది.⇒రెండో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి రావటంతో రోజుకు పదివేల మంది భక్తులు పెరిగారు. టీటీ డీ రవాణా సంస్థ వాహనాల బదులు 10.8.1975 నుండి రెండు ఘాట్‌రోడ్లపై ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరగటంతో భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 500 ఆర్టీసీ బస్సులు, రోజుకు 3,200 ట్రిప్పులు సాగిస్తూ.. బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. నాడు నిమిషాల్లోనే దర్శనం.. నేడు రోజు పైబడి...∙1933 నుంచి 1970కి ముందు వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు.⇒మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 5 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండవ ఘాట్‌రోడ్డు వచ్చేనాటికి ఈ సంఖ్య రోజుకు సుమారు 10 వేలకు పెరిగింది. ⇒తిరుమలలో పాతపుష్కరిణి కాంప్లెక్స్ నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. దీంతో 1990 నాటికి రోజుకు 20 నుంచి 25 వేలు, 1995కు 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు పెరిగింది.⇒2003 నాటికి రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు. క్యూలైన్లు పెరిగాయి. భక్తుల నిరీక్షణ సమయం రెండు రోజులకు పెరిగింది. 2010 నాటికి రోజువారీ భక్తుల సంఖ్య 60 వేలకు చేరింది.⇒ఇలా 2010 సంవత్సరంలో మొత్తం 2.14 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2011లో 2.43 కోట్లు, 2012లో 2.73 కోట్లు, 2013లో ఈ సంఖ్య 1.96 కోట్లు (సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం), 2014లో 2.26 కోట్లు, 2015లో 2.46 కోట్లు, 2016లో 2.66 కోట్లమంది భక్తులు వచ్చారు. ⇒ఇక ఈ యేడాది 8 నెలలకే సుమారు 2 కోట్లకు చేరగా, ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.⇒స్వామి దర్శనానికి రోజువారీగా పోటెత్తే భక్తులకు ఈ రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మొత్తం 64 కంపార్ట్మెంట్లు చాలటం లేదు. శుక్ర, శని, ఆదివారాల్లో కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో భక్తులు నిరీక్షించటం రివాజుగా మారింది. ⇒పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు రోజుల తరబడి తిరుమలలో నిరీక్షించకుండా 2000 సంవత్సరంలో దర్శనానికి సుదర్శనం కంకణ విధానం, ఆన్లైన్ రిజర్వేషన్ పద్ధతికి రూపకల్పన చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఈ–దర్శన్ కౌంటర్ల ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జితసేవా టికెట్ల కేటాయింపును చేపట్టారు. 2009వ సంవత్సరం నుండి ప్రవాస భారతీయులకు, ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డతోపాటు వారి తల్లిదండ్రులను ‘సుపథం’ ద్వారా అనుమతిస్తున్నారు. ⇒2010వ సంవత్సరంలో అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో నడచి వచ్చే భక్తులకు దివ్య దర్శనం (ప్రస్తుతం టైమ్ స్లాట్ విధానం) ఆరంభించారు.⇒అదే ఏడాదే ఎటువంటి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా టికెట్లు కొనుగోలు చేసేవిధంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆరంభించారు. ప్రస్తుతం ఆ¯Œ లైన్ టైంస్లాట్‌లో మాత్రమే టికెట్ల అమ్మకం చేస్తున్నారు. ⇒ఆలయ మహద్వారం నుండి (పస్తుతం దక్షిణ మాడవీ«థి నుండి) వికలాంగులు, 65 ఏళ్ల వయసు నిండిన వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులను అనుమతించారు.⇒ఇక సిఫారసులతో రూ.500 టికెట్ల వీఐపీ దర్శనాలు, అన్ని రకాల ఆర్జితసేవా టికెట్లతో ప్రత్యేక దర్శనాలు.. ఇలా అన్ని కేటగిరీల్లోని భక్తులకు ఏదో రూపంలో సుమారు పది రకాలకు పైగా దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది. కోనేటిరాయని కునుకు పదినిమిషాలే! ⇒మహంతుల కాలం (1843 నుంచి 1933)లో తిరుమల ఆలయంలో గర్భాలయ దివ్యమంగళ మూర్తికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. నిత్య ఏకాంత కైంకర్యాలన్నీ నిర్ణీత వేళల్లో సంపూర్ణంగా జరిగేవి.⇒2000వ సంవత్సరం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయి పట్టుమని పదినిమిషాలు కూడా స్వామికి విశ్రాంతి లభించటం లేదు. ⇒ఇక తప్పని పరిస్థితుల్లో లాంఛనంగా తలుపులు వేసి మమ అనిపిస్తున్నారు. ఆగమం ప్రకారం ఆరు గంటలు విరామం, ఏకాంత కైంకర్యాలుండాలి⇒వైఖానస ఆగమం ప్రకారం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి కనిçష్ఠంగా 6 గంటలపాటు విరామం ఉండాలి. అదే స్థాయిలోనే స్వామికి ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి ఏకాంత కైంకర్యాలు ఉండాలని పండితులు చెబుతున్నారు.⇒ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. 24 గంటల్లో కేవలం 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామివారి కైంకర్యాలకు కేటాయిస్తున్నారు. మిగిలిన 20 గంటలపాటు వివిధ రకాల పేర్లతో టికెట్లు కేటాయించి దర్శనం అమలు చేస్తున్నారు. ⇒ఇక నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ పేరుతో పట్టుమని పది నిమిషాలు కూడా స్వామికి విరామం ఇవ్వటం లేదు. ఏకధాటిగా 22 గంటలపాటు స్వామి దర్శనం సాగించే పరిస్థితులు పెరిగాయి. అర్ధరాత్రి దాటాక ఏకాంత సేవ, ఆ వెంటనే సుప్రభాతం నిర్వహిస్తూ స్వామి కైంకర్యాలు నిర్వహించే పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి టీటీడీ అధికారులు చెబుతున్న ప్రధాన కారణం ఒక్కటే. భక్తుల రద్దీ...రద్దీ.. భక్తుల రద్దీకి తగ్గట్టు స్వామి దర్శనం కల్పించవలసిన బాధ్యత ఎంత మేరకు ఉందో, పూర్వం నుండి ఆగమోక్తంగా అమలు చేసే స్వామి కైంకర్యాల్లో కోత విధించటం, స్వామికి విరామం లేకుండా చేయటం సమాజ శ్రేయస్కరం కాదని ఆగమ పండితుల హెచ్చరికల్ని కూడా దేవస్థానం అధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి!! -
స్వామివారి పాదాల కింద విరాజిల్లిన విరజానది
స్వామివారి పాదాల కింద ప్రవహించే విరజానది ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరజానది అంటారు. వైకుంఠంలోని ఈ దేవనది స్వామి పాదాల కింద ప్రవహిస్తోందంటారు. నదిలో కొంత భాగాన్నే బావి అంటారు. దీన్ని చతురస్రాకారంలో చెక్కిన రాళ్ళతో నిర్మించారు. రాళ్లపై నాలుగు అంచుల్లో వానరులతో కలిసి ఉన్న సీతారామలక్ష్మణులు, హనుమంత, సుగ్రీవులు, కాళీయమర్దనంలో శ్రీకృష్ణుని వేడుకుంటున్న నాగకన్యలు, ఏనుగును అదిలిస్తున్న వేంకటేశ్వరుడు, గరుడుని బొమ్మలు మలిచారు. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు బొమ్మలబావిగా పిలుస్తుంటారు.స్వామి పవిత్ర నిర్మాల్యం పూలబావికే సొంతం అద్దాల మండపానికి ఉత్తర దిశలో ఈ పూల బావి ఉంది. స్వామికి సమర్పించిన తులసి, పుష్ప, పూమాలలను ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు. అందుకే ఆ పవిత్రమైన నిర్మాల్యాన్ని ఎవ్వరూ తిరిగి వాడకుండా ఈ పూలబావిలో వేస్తారు. స్వామికి నివేదించిన అన్ని రకాల నిర్మాల్యం పూలబావి తన ఉదరంలో దాచుకుంటుందని అర్చకులు చెబుతారు. అందుకే దీనికి పూలబావిగా నామం సార్థకమైంది. దీనినే భూ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోవడంతో శ్రీనివాసుని ఆదేశంతో రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం పునరుజ్జీవం పొందిందని చెబుతారు. రంగదాసు మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి స్వామిని సేవించారని పురాణాల కథనం. అభిషేక సేవకు బంగారుబావి నీళ్లువకుళమాత కొలువైన పోటు(వంటశాల) పక్కనే బంగారు బావి ఉంది. స్వామి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపలకు వచ్చిన భక్తులకు ఎదురుగానే ఈ బంగారుబావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్నే వాడతారు. బావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో వర నిర్మించారు. దీనికి బంగారు తాపడం చేసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీతీర్థం, సుందర తీర్థం, లక్ష్మీ తీర్థం అని కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి వంట కోసం మహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారట! త్రైలోక్య దుర్లభాలుశ్రీవారి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శన భాగ్యం, కటాహ తీర్థపానం... ఈ మూడు త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. కటాహ తీర్థం శ్రీవారి హుండీకి వెలుపల ఆనుకుని తొట్టిమాదిరిగా ఎడమ దిక్కున ఉంది. దీన్ని తొట్టి తీర్థమని కూడా అంటారు. స్వామి పాదాల నుండి వచ్చే అభిషేకతీర్థం ఇది. ఈ తీర్థాన్ని స్వీకరించినప్పుడు అష్టాక్షరి లేదా కేశవాది నామాలు లేదా శ్రీవేంకటేశుని నామాలు ఉచ్చరిస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతారు.మోక్షప్రాప్తి కలిగించే పుష్కరిణి పుణ్యస్నానంబ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. శ్రీమహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుండి క్రీడాద్రితోపాటు పుష్కరిణిని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానమాచరించడం వల్ల సకల పాపాలు తొలగి ఇహంలో సుఖ శాంతులతోపాటు పరలోకంలో మోక్షమూ సిద్ధిస్తుందని నమ్మకం. ప్రతి యేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే ఇందులో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.పుష్కరిణిలో ప్రాచుర్యంలోని తొమ్మిది తీర్థాలుముక్కోటి తీర్థాల సమాహారమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ప్రధానంగా తొమ్మిది తీర్థాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. అవి: మార్కండేయ తీర్థం (పూర్వ భాగం), ఆగ్నేయ తీర్థం (ఆగ్నేయ భాగం), యమ తీర్థం (దక్షిణ భాగం), వసిష్ట తీర్థం (నైరుతి), వరుణ తీర్థం (పడమర), వాయు తీర్థం (వాయు భాగం), ధనద తీర్థం (ఉత్తర భాగం), గాలవ తీర్థం (ఈశాన్యం), సరస్వతీ తీర్థం(మధ్య భాగం). «పూర్వం శంఖనుడు అనే రాజు స్వామివారి పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించడం వల్ల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాడట! దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం పొందాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించడంతో వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించి పోగొట్టుకున్నాడట! ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగ రుగ్మతలు పోగొట్టుకుని, భోగభాగ్యాలు సంపాదించుకున్నారని పెద్దలు చెప్పే మాట! -
Tirumala: ఆనంద నిలయం అఖండ తేజోమయం
తనమీద అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని వీడిన విష్ణుమూర్తి భూలోక వైకుంఠమైన వేంకటాచల క్షేత్రానికి విచ్చేశాడు. అక్కడ స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తిగా వెలసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు. స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం. గర్భాలయంపై నిర్మించిన బంగారు గోపురమే ‘ఆనంద నిలయ విమానం’గా ప్రసిద్ధి పొందింది.⇒ శ్రీవేంకటేశ్వరస్వామి వారు గర్భాలయంలో ‘ఉపధ్యక’ అనే పవిత్రస్థానంలో కొలువై నిత్యపూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో మూడు విగ్రహాలుంటాయి. వాటినే ధ్రువమూర్తి, మూలమూర్తి, మూలవిరాట్టుగా కొలుస్తారు. యోగ, భోగ, విరహ రూపాలతోపాటు ‘వీర స్థానక’ విధానంలో నిలబడిన స్వామి ముగ్ధమనోహరంగా ప్రకాశిస్తాడు. స్థిరంగా ఉంటాడు. ఈ విగ్రహాన్నే ఆగమ పరిభాషలో ధ్రువబేరంగా సంబోధిస్తారు. ⇒ సుప్రభాతంతో వేకువజామున 2.30 గంటలకు స్వామిసేవను ప్రారంభించి, తిరిగి రాత్రి 12.30 గంటలకు జోలపాటతో నిద్రపుచ్చుతారు. వైఖానస ఆగమబద్ధంగా తోమాల, అర్చన, కొలువు ఇతర నిత్యసేవా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో మూడుపూటలా అన్నప్రసాదాలు, పిండి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తూ అర్చకులు లోకకల్యాణం కోసం శరణు వేడుతారు. ⇒ పుష్పకైంకర్యంలో భాగంగా సాలగ్రామ హారాలు, శిఖామణి, శంఖుచక్రం, శ్రీదేవి, భూదేవి కంఠహారాలు, అలంకార బిట్లు, 25 రకాల పూలకుచ్చులతో కూడిన సువాసనలు వెదజల్లే పుష్పాలతో స్వామిని అలంకరిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పుష్పకైంకర్యాలు చేస్తారు. నిత్య దిట్టం కింద 300 కేజీల పుష్పాలు వాడతారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలు, ఆస్థాన కార్యక్రమాల కోసం 10 నుంచి 20 టన్నుల వరకు పుష్పాలు వినియోగిస్తారు. ⇒ తననే శరణు వేడండంటూ కటి, వరదహస్తాలతో స్వామి తన పాదపద్మాలను చూపిస్తూ భక్తులకు హెచ్చరికతో కూడిన హితబోధ చేస్తూ దర్శనమిస్తుంటారు. అలాంటి దివ్యమైన బంగారు పాదాలను నిత్యం పుష్పాలు, తులసి సేవిస్తుంటాయి. వేకువజాము సుప్రభాత దర్శనంలో మాత్రమే తులసి, పుష్పాలు లేకుండా దర్శించవచ్చు. ఇక శుక్రవారం అభిషేకం, ఆ తర్వాత దర్శన సమయంలో మాత్రమే బంగారు పాద తొడుగులు లేకుండా స్వామి పాద పద్మాలు (నిజపాద సేవలో) దర్శించవచ్చు. ⇒ ప్రతి రోజూ నిత్యకట్ల అలంకారంలో 120 రకాల ఆభరణాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలు, పర్వదినాల్లో ప్రత్యేక అలంకారాలు చేసేందుకు అదనంగా ఆభరణాలు వాడతారు. రోజూ చేసే అలంకారాన్ని నిత్య కట్ల అలంకారమని, పండుగలు, ఉత్సవాలు, ప్రముఖుల రాక సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారమని అంటారు. స్వామికి వజ్రకిరీటం, శంఖ, చక్ర, వరద హస్తాలు, ప్రత్యేక ఆభరణాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. ⇒ శ్రీ స్వామి, ఉత్సవమూర్తుల అలంకరణలకు వాడే కిరీటాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, ఇతర నిల్వలు దాదాపుగా 11 టన్నులు ఉంటాయి. వీటితోపాటు వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాల నగలు కూడా ఉన్నాయి. ⇒ ఆకాశరాజు కిరీటం, వేంకటాద్రిని పాలించిన రాజులు, బ్రిటిష్ పాలకులు, మహంతులు, భక్తులు సమర్పించే కానుకల వివరాలను నమోదు చేసేందుకు టీటీడీ 19 తిరువాభరణ రిజిస్టర్లు నిర్వహిస్తోంది. ⇒ శుక్రవారం అభిషేకం తర్వాత స్వామికి ఊర్ధ్వపుండ్రాలు (తిరునామం) సమర్పిస్తారు. దీనినే ‘తిరుమామణికాపు’ అంటారు. ఇందుకోసం 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరి సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భాల్లో తిరుమామణికి వాడే ద్రవ్యాలు రెట్టింపు స్థాయిలో వాడతారు. ⇒ అభిషేకం తర్వాత మూలమూర్తికి అంతరీయం (ధోవతి)గా 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగా ధరింప చేస్తారు. ⇒ విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ఇతర సామాజ్య్రాలపై దండయాత్రకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ స్వామివారిని దర్శించుకునేవారు. ఆ సందర్భంగా విలువైన ఆభరణాలు, కిరీటాలు, ఖడ్గాలను బహూకరించారు. మలయప్పకు అలంకరించే గుండ్రని కిరీటం, మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక ఉత్సవాల్లో ఎదపై అలంకరించే పెద్ద పచ్చ రాయలు సమర్పించినవే. ⇒ ఆలయంలోని జయవిజయలు ఉన్న బంగారువాకిలి దాటుకున్న తర్వాత రాములవారి మేడలో ఉండే రహస్య అలమరాలో శ్రీవారికి వినియోగించే ఆభరణాలు భద్రపరుస్తారు. వీటిని ఆలయ డిప్యూటీ ఈవో, పేష్కార్ పర్యవేక్షిస్తారు. ఏ రోజు, ఏ ఉత్సవంలో ఏయే ఆభరణాలు అవసరమో అర్చకుల సూచన మేరకు వాటిని సమకూరుస్తారు. ⇒ శ్రీవారి ఆలయంలో గర్భాలయ మూలమూర్తితోపాటు భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, ఉగ్ర శ్రీనివాసుడు కొలువై ఉన్నారు.⇒ పంచమూర్తులే కాకుండా సుదర్శన చక్రత్తాళ్వార్, సీతారామ లక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు వంటి పంచలోహ మూర్తులు కూడా గర్భాలయంలోనే కొలువై ఉన్నారు. ఇక్కడే దేవతామూర్తులతోపాటు పవిత్ర సాలగ్రామాలు కూడా నిత్య పూజలందుకుంటున్నాయి.∙గర్భాలయానికి ఆగ్నేయం, ఈశాన్య దిశల్లో అటు ఇటుగా ‘బ్రహ్మ అఖండం’ నిత్యదీపారాధన వెలుగుతూనే ఉంటుంది. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ దీపాలను వెలిగించాడని విశ్వాసం.∙రాత్రి పవళింపు సేవ చివరి సమయంలో బంగారు నవారు పట్టె మంచంపై ‘మనవాళ పెరుమాళ్’ (భోగశ్రీనివాసుడు) వేంచేపు చేస్తారు. అదే సమయంలోని గర్భాలయ మూలమూర్తికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి ‘ముత్యాల హారతి’ మంగళ కర్పూర నీరాజనం సమర్పిస్తారు. ∙తెలుగు నూతన సంవత్సరాధి పర్వదినమైన ఉగాది (మార్చి/ఏప్రిల్), ఆణివార ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం (సెప్టెంబరు/అక్టోబరు), వైకుంఠ ఏకాదశి (డిసెంబరు/జనవరి) పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహిస్తారు. ∙కోయిల్ ఆళ్వారు తిరుమంజనం రోజున ఆనంద నిలయం నుంచి మహాద్వారం వరకు శుద్ధ జలంతో శుద్ధి చేస్తారు. ఈ క్రమంలో నీరు, దుమ్ము, ధూళి పడకుండా ఉండేందుకు మూలమూర్తి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళ వస్త్రాన్ని కప్పుతారు. ఈ వస్త్రాన్నే ‘మలైగుడారం’ అని అంటారు. తిరుమంజన సేవలు పూరి ్తకాగానే కురాళం అనే దీర్ఘచతురస్రాకారపు మఖమల్ వస్త్రాన్ని పైకప్పునకు కడతారు.∙గర్భాలయంలో కేవలం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పునకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. ∙తిరుమంజనానికి ముందురోజే ఎక్కువ మోతాదులో నామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారు చేస్తారు. భారీ గంగాళాల్లో సిద్ధం చేసిన ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనంగా పూస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు క్రిమికీటకాలు ఉండకుండా ప్రాకారం పటిష్ఠతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. నిత్యం సుప్రభాతసేవలో స్వామికి గోక్షీర సేవనం, నవనీత హారతి ఇస్తారు. అప్పుడే పితికిన గోవుపాలు, అప్పుడే తీసిన వెన్న, పచ్చకర్పూరపు తాంబూలంతో కూడిన పళ్లెరంతో హాథీరామ్ మఠం మహంతుల సన్యాసి/బైరాగి ఆలయానికి సమర్పించగా హాథీరామ్ మహంతు పేరుతో అర్చకులు ఈ కైంకర్యాలు నిర్వహిస్తారు. -
మాడవీథుల ప్రాశస్త్యం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి ఆలయం 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. స్వామివారి ఆలయం పక్కనే వున్న పుష్కరిణి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అటు తర్వాత లడ్డు కౌంటర్లు, బూందీ కౌంటరు, లడ్డు తయారీ కేంద్రం వంటివి రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండగా వరాహస్వామి ఆలయం మిగిలిన ప్రాంతం కలుపుకొని దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ మాడవీథులు ఏర్పడ్డాయి. తూర్పు మాడవీథి 750 అడుగుల పొడవున; దక్షిణ, ఉత్తర మాడ వీథులు ఎనిమిది వందల అడుగుల పొడవున; పడమటి మాడవీథి 900 అడుగుల పొడవున ఉంటాయి. శ్రీవారి ఆలయం చుట్టూ ఏర్పడిన ఈ మాడవీథులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు తన ఉభయ దేవేరులతో నిత్యం తిరుగాడే ప్రాంతం మాడవీ«థులు. గతంలో వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే స్వామివారి వాహన సేవలు నిర్వహించేవారు. దీనితో మాడవీథుల్లో ఏడాదికి తొమ్మిది రోజులు పాటు మాత్రమే స్వామివారి ఊరేగింపు నిర్వహించేవారు. ఆ తర్వాత వీ«థి ఉత్సవం పేరుతో స్వామివారు నిత్యం మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చేవారు. సహస్ర దీపాలంకరణ సేవను ఆలయం వెలుపలకు మార్చిన తర్వాత ప్రతినిత్యం స్వామివారు దీపాలంకరణ సేవ పూర్తయ్యాక మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఇలా మాడ వీథుల్లో నిత్యం స్వామివారి సంచారం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతుంది.మాడవీ«థుల చుట్టూ ఉన్న నిర్మాణాలను భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2004 నాటికి పూర్తిగా తొలగించి, గ్యాలరీల నిర్మాణం చేపట్టింది. దీనితో మాడవీథుల ఆధునికీకరణ కూడా చేపట్టింది. మాడవీ«థుల్లో భక్తుల తాకిడి పెరుగుతూ రావడంతో 1970 నుంచి టీటీడీ మాడవీ«థులలో ఆంక్షలు విధించడం ప్రారంభించింది. గతంలో వీవీఐపీలు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సమయంలో దక్షిణ మాడవీ«థి గుండా ఆలయం ముందు వరకు వారి వాహనంలోనే చేరుకునేవారు. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం వరకు వాహనంలో విచ్చేసే వీవీఐపీలకు అక్కడి నుంచి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికేవారు. భక్తుల సౌకర్యార్థం అప్పటి ఈవో చంద్రమౌళీశ్వర్ రెడ్డి 1970 ఫిబ్రవరి 22 నుంచి మాడవీ«థులలోకి వాహనాల అనుమతిని నిలిపివేశారు. వీఐపీల కోసం ఆలయం ఎదురుగా టీటీడీ మరో రోడ్డు నిర్మాణం చేపట్టింది. 1996 నుంచి ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వీవీఐపీలు ఈ మార్గం గుండానే మాడవీ«థుల వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, వాహనాలను మాడవీథులలోకి అనుమతించరు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వ్యక్తులు అయినా కూడా బ్యాటరీ వాహనాల ద్వారానే ప్రయాణం చేయవలసి ఉంటుంది. మాడవీథుల్లో భక్తులు పాదరక్షలు ధరించకుండా టీటీడీ 2007 నుంచి నిబంధనలను అమలు చేసింది. నిత్యం స్వామివారి వాహన ఊరేగింపులు జరిగే మాడవీ«థులను అంతే పవిత్రంగా చూడవలసిన బాధ్యత భక్తులపై కూడా ఉందంటూ ఈ నిబంధనలను టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది.∙ -
పువ్వులా పరిమళిద్దాం.. సుద్దాల అశోక్ తేజ
‘‘ప్రతి మనిషి ఒక పువ్వులాంటివాడే. పువ్వు ఉన్నంతసేపు పరిమళాన్నిస్తుంది. మనిషి కూడా ఉన్నన్ని రోజులు ప్రపంచానికి, భూమికి, తన కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి ప్రేమగా, బాధ్యతగా ఉండాలన్నది మానవ జీవితం అయినప్పుడు.. పువ్వు కూడా అంతే. పూస్తుంది... పరిమళాలు పంచుతుంది.. వాడి పోయి రాలి పోతుంది. పూల జీవన తాత్పర్యం, జీవన తాత్వికత అదే. మనిషి కూడా మంచి చేయక పోయినా పర్వాలేదు కానీ, చెడు చేయకూడదు. ఇలా ఓ మంచి సందేశం ఇచ్చే పండుగ బతుకమ్మ’’ అని ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ చెప్పారు. నేడు ‘బతుకమ్మ’ పండుగ ఆరంభం సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.‘‘నాకు ఊహ తెలిసీ తెలియని వయసులోనే మా అమ్మ, అక్కతో పాటు మా నాన్న కూడా బతుకమ్మ కోసం పూలను తీసుకొచ్చేవారు. అలా ఈ పూల పండుగ అయిన బతుకమ్మకి ఇచ్చే ప్రాధాన్యం చిన్న వయసులో నాకు అర్థం అయింది. బతుకమ్మ అనే పేరు పెట్టడంలోనే ప్రజలు చాలా గొప్ప ప్రతిభ పాటించారనిపిస్తోంది. పూలతో అలంకరించి చేస్తారు కాబట్టి పూలమ్మ పండుగ అని కూడా అనొచ్చు కదా? కానీ, అనలేదు. గౌరమ్మ పండుగ, పార్వతీదేవి పండుగ, లక్ష్మీదేవమ్మ పండుగ అనలేదు. ఇవన్నీ పాటలు పాడుతుంటారు. కానీ, బతుకుకు సంబంధించిన ప్రకృతిని పూజించి, ప్రార్థించి, గౌరవించి, ఆరాధించేటటువంటి ఒక పండుగేమో అని అర్థం వచ్చేటట్లు బతుకమ్మ అని పేరు పెట్టారేమో అనిపిస్తుంది. మనిషి బతకాలంటే పంచభూతాలు బాగుండాలి. అది మన శరీరం కావొచ్చు, ఈ ప్రపంచం కావొచ్చు. అసలు మన పండుగలన్నీ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బతుకుతున్న ప్రజలు చేసుకునే పండుగలే. అది దసరా అయినా, సంక్రాంతి అయినా, ఉగాది అయినా. అందులో భాగంగా దసరాకి ముందు వచ్చేదే ఈ బతుకమ్మ పండుగ. → సామాన్యుల పండుగ బతుకమ్మ పండుగలో ఒక గమ్మత్తయిన ఆచారం ఉంది. ఖరీదైన పూలు బతుకమ్మలో వాడరు. పేదవాళ్లు తమ పొలాల్లో, పొలం గట్లల్లో, చెలకల్లో, ఆరు బయట ఊరు చివర ఉన్న ఎక్కడపడితే అక్కడ దొరికే గడ్డి పోగులను, పూలను మాత్రమే వాడతారు. ఈ పూలన్నింటినీ పేర్చినప్పటికీ.. గణపతిని నీళ్లల్లో నిమజ్జనం చేసినట్లు చేయరు. ఒక కార్తీక దీపంలాగా అలల మీద పెట్టి తోస్తారు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరుకోమని. వాళ్ల బతుకులు కూడా ఒక గట్టు మీద నుంచి మరో గట్టుకి చేరడంలోనే జీవితానికి సార్థకత ఉందని భావించడానికే చెరువులో వేసి ‘ పోయిరా బతుకమ్మా..’ అంటుంటారు. ఇలా తమ బతుకులకు తామే ధైర్యం చెప్పుకుంటున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ గట్టు అనేది పుట్టక అయితే ఆ గట్టు అనేది చివర. మధ్యలో అనేకమైన అల్లకల్లోలాలు, గాలులు, అలలు, తుఫానులు, అభ్యంతరాలు, ఆటంకాలు, ఆశాభంగా లు ఉంటాయి జీవితంలో. ఈ పండుగలో కూడా బతుకమ్మని పేర్చి, ఈ చివరి నుంచి అటు తోస్తే అది మెలమెల్లగా వెళుతూ మధ్యలో మునిగి పోతుందా? ఆ గట్టుకు చేరుకుంటుందా? అనేది మనకు తెలియదు కానీ, తమ జీవితాలను తామే ఒక సాంకేతికమైన మార్గంగా సృష్టించుకుని చేసుకుంటారేమో అనిపిస్తుంది నాలాంటివాళ్లకి. → మా ఇంట్లో మనవరాళ్ల దాకా... బతుకమ్మ అనేది ఆడపడుచుల పండుగ. అత్తగారింటికి వెళ్లిన ఆడబిడ్డలందరూ అమ్మగారింటికి వచ్చి బతుకమ్మ, దసరా పండుగ చూసుకుని వెళ్లి పోతుంటారు. ఈ పండుగ గురించి మాకు గుర్తొచ్చేది ఏంటంటే.. పూలను తీసుకురావాలి, పేర్చాలి.. అమ్మ ప్రసాదం చేస్తే తినాలి.. ఇరుగు పొరుగువారికి ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. ఈ సంప్రదాయం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకూ సాగుతూనే ఉంది. మా అమ్మ, అక్కలు, చెల్లెళ్లు్ల, కూతుళ్లు, కోడళ్లు... ఇప్పుడు నా మనవరాళ్ల దాకా వచ్చింది. → చప్పట్ల పండగ బతుకమ్మ అంటే చప్పట్ల పండుగ. ఈ పండుగనాడు సన్నాయిలు, వాయిద్యాలు, మృదంగాలు, డప్పులు కొడుతుంటే మహిళలు బతుకమ్మని చెరువుదాకా తీసుకెళ్లేవారు. కాలప్రవాహంలో మనం చూస్తున్న ఈ దాండియా, డీజేలు మన సంప్రదాయం కాదు. బతుకమ్మ పండుగలో కాలక్రమేణా వస్తున్న మార్పులు సంప్రదాయబద్ధంగా ఉంటే పర్వాలేదు. కానీ, అందులోకి ఈ ఐటెమ్ సాంగ్‌లను వాయించే వాయిద్యాలు చొరబడొద్దు.. అది కరెక్ట్కాదు..→ ఆ అనుభూతితో పాటలు రాశా! బతుకమ్మ పండుగపైన నేను కూడా చాలా పాటలు రాశాను. చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ ఆడుతుంటే చూసినవాణ్ణి. అలాగే మా అక్కలు, చెల్లెళ్లు, కూతుళ్లు, మనవరాళ్లు ఆడుతుంటే చూసినప్పుడు ఒక అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి, సంప్రదాయం, వారు పాడే పాటల్లోని జానపదం కలిపి ఆ పాట రాస్తున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఆ అనుభూతితోనే పాటలు రాశాను. → తాత్త్విక సందేశం ఇచ్చే పండుగబతుకమ్మ పండుగ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే... మన సంప్రదాయం, మన పూర్వీకులు ఆచరిస్తున్న పద్ధతులు, ప్రేమ, మానవ సంబంధాలు, రక్తసంబంధాలు, ఆడపడుచులు పుట్టింటికి రావడం, ఆ ప్రేమలు ఉన్నాయి. అదే విధంగా మనం పూలను గౌరవించాలి.. పూజించాలి.. పువ్వులకు నమస్కారం చేయాలి. పువ్వులు ఉండాలంటే చెరువులుండాలి.. చెరువులు ఉండాలంటే వానలు ఉండాలి.. వానలు ఉండాలంటే చెట్లు ఉండాలి. చెట్లు పిలిస్తే వాన–వాన కురిస్తే చెట్టు అయినప్పుడు ఈ రెండూ లేకుండా బతుకమ్మ పండుగ లేదు. ప్రకృతి, పర్యావరణం బాగుంటేనే బతుకమ్మ బాగుంటుంది.. బతుకమ్మ బాగుంది అంటే బతుకులు బాగున్నట్టు లెక్క. ఇలా ఓ మంచి సందేశం ఇచ్చే పండుగ బతుకమ్మ. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, గండాలు, సుడిగుండాలు ఉంటాయి.. వాటన్నింటినీ తప్పించుకుంటూ, అధిగమించుకుంటూ మనుషుల్లో అందరం బాగుండడం.. అందులో మనం కూడా ఉండటం అనే తాత్త్విక సందేశం ఇచ్చేదే బతుకమ్మ. → ఆ సంబరం... ఆ సందడి బతుకమ్మ పండుగప్పుడు గతంలో మా అక్కలు, చెల్లెళ్లు ఇంటికొచ్చేవారు. ఇప్పుడైతే నా కూతురు వస్తుంది.. మనవరాళ్లు వస్తారు. మా కోడళ్లు కుదిరితే తల్లిగారి ఇంటికి వెళతారు.. లేదంటే మా ఇంట్లోనే ఉంటారు. నా భార్య కూడా బతుకమ్మ పేర్చడం, ఇరుగు పొరుగువారితో బతుకమ్మ ఆడటం, మా కాలనీలో తాత్కాలిక నీటి కొలను ఏర్పాటు చేసుకుని అందులో బతుకమ్మని వేయడం జరుగుతుంటుంది. లేదా అవకాశం ఉంటే ఎవరితోనైనా పంపించి, నదిలోనో, చెరువుల్లోనో వేయిస్తాం. మా ఊరు సుద్దాలకి వెళ్లి బతుకమ్మ చేసుకుంటే మాత్రం పక్కాగా బతుకమ్మ కుంటలో వేస్తాం. పిత్రమాస నాడు కుంటలో వేస్తాం, సద్దుల బతుకమ్మనాడు చెరువు వద్దకు అందరూ వెళతారు. ఆట పాటల్లో మహిళలు మాత్రమే పాల్గొంటారు. కానీ, పురుషులు మాత్రం వారి వెంట వెళతారు. బతుకమ్మలను అవసరమైతే చెరువు మధ్యలోకి వెళ్లి వదలాల్సి వచ్చినప్పుడు పురుషులు వెళ్లి వదిలే సంప్రదాయం మాత్రం ఉంది.. వాటన్నింటిలో మేము పాల్గొన్నాం. ఇప్పుడైతే మా అబ్బాయిలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు.. వాళ్లు చూసుకుంటారు కానీ, నేను పాల్గొనటం లేదు. నాకు ఐదుగురు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు. వీరందరూ బతుకమ్మ పండగకి తప్పకుండా వస్తారు. అది పిత్రమాస రోజు అయినా లేదంటే సద్దుల బతుకమ్మనాడు అయినా వస్తుంటారు. ఆ సంబురం, ఆ సందడి వేరుగా ఉంటుంది. అది బతుకమ్మలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే నా దృష్టిలో అమ్మాయిలు లేని బతుకమ్మ పండుగ చంద్రుడు లేనటువంటి పౌర్ణమిలాంటిది’’ అని చెప్పారు సుద్దాల అశోక్ తేజ. – డేరంగుల జగన్ మోహన్ -
ఆపదమొక్కులతో తొలగేను చిక్కులు
దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరునికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తూ భక్తితో శరణు కోరుతుంటారు. భక్తి తత్పరులు, కోర్కెలు నెరవేరినవారు, కోర్కెలు నెరవేరాల్సిన వారు ఆపదమొక్కులవాడికి ఎన్నోరకాల మొక్కులు చెల్లిస్తారు. ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించేందుకు నిర్ణీతకాలంలో ప్రత్యేకంగా దీక్షా మార్గాన్ని ఎంచుకుంటారు. భూ శయనం, బ్రహ్మచర్య దీక్ష, ఏకభుక్తం వంటి నియమాలతో తల వెంట్రుకలు తీయకుండా దీక్షను చేపడతారు. పూర్తికాగానే కాలినడకన యాత్రగా తిరుమలకు చేరుకుంటారు. భక్తిశ్రద్ధ్దలతో తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. దివ్యమైన కాలినడకకోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తొలుత చేసేది... నడచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే. కొందరు మోకాళ్లతో, మరికొందరు పొర్లుదండాలతో ఎక్కుతూ మొక్కులు చెల్లిస్తుంటారు. ఇంకొందరు మెట్టు మెట్టుకూ పూజలు, మరికొందరు ప్రతిమెట్టుకూ çపసుపు, కుంకుమ పూసి, కర్పూరం వెలిగిస్తే, మరి కొందరు కొబ్బరికాయలు కొడుతూ తిరుమల కొండెక్కుతారు. రోడ్డు, వాహన సదుపాయాలు లేనిరోజుల్లో కాలిబాటే తిరుమలకు ఏకైక మార్గం. అధునాతనమైన రెండు ఘాట్‌రోడ్లు ఏర్పడి రోజుకు పదివేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా తిరుమలకు నడిచివెళ్లే భక్తుల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోందంటే ఈ మొక్కుపై భక్తులకు ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో 15 వేలు, సెలవు రోజులు, ఉత్సవాల రోజుల్లో 40 వేల మంది వరకు భక్తులు కాలినడకన కొండెక్కుతున్నారు.‘తల’ నీలాల సమర్పణవెంకన్న మొక్కులో తలనీలాల మొక్కు అత్యంత ప్రధానమైంది. అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా భక్తులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. క్రీ.శ.1830కు ముందు నుండే తలనీలాలు మొక్కుగా చెల్లించే ఆచారం ఉన్నట్టు శాసనాధారం. పుష్కరిణి పుణ్యస్నానం భక్తుల మొక్కులలో పరమ పవిత్రమైంది పుష్కరిణీ స్నానం. బ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానం ఆచరించడంతో సర్వపాపాలు తొలగి, మోక్షం సిద్ధి్దస్తుంది. ప్రతియేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే, ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. వరాహస్వామి దర్శనంతిరుమల క్షేత్రంలో ఆదిదైవం శ్రీ వరాహస్వామి. అందుకే ఈ పుణ్యతీర్థాన్ని ఆది వరాహ క్షేత్రమని పిలుస్తుంటారు. వైకుంఠం వదిలి భూలోకం వచ్చిన శ్రీనివాసునికి వరాహస్వామివారే స్థలాన్ని ప్రసాదించారు. దీనికి ప్రతిఫలంగా భక్తుల తొలి దర్శనాన్ని వరాహస్వామి పొందారు. దానితోపాటు తొలిపూజ, తొలినైవేద్యం వరాహస్వామికే! సామాన్య భక్తుడి నుండి ప్రముఖుల వరకు తొలుత వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీన్ని కొనసాగిస్తేనే ఫుణ్యఫలం దక్కుతుంది. తులా ‘భారం’.. నిలువుదోపిడీ తిరుమలేశునికి భక్తులు తులాభార రూపంలో చిల్లర, బెల్లం, పటిక బెల్లంతో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు ముడుపుల రూపంలో పోగుచేసిన నగదును హుండీలో సమర్పిస్తారు. వెంకన్నను కొలిచే భక్తుల్లో దాదాపుగా పుట్టిన ప్రతి బిడ్డనూ ఏదో ఒక సందర్భంలో స్వామివారికి ఏదో ఒక రూపంలో తులాభారం సమర్పించి మొక్కులు చెల్లిస్తుంటారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అ«ధికారులు కూడా తులాభారం సమర్పిస్తుంటారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి నిలువుదోపిడీ రూపంలో తాము ధరించిన ఆభరణాలన్నిటినీ హుండీలో సమర్పిస్తారు. వెంట తీసుకొచ్చిన నగదు, ఇతర కానుకల్ని కూడా సమర్పిస్తారు. -
కలియుగ దైవానికి కమనీయ బ్రహ్మోత్సవం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వచ్చి, భూలోక వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువుదీరాడు. కన్యామాసం (చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం) శ్రవణా నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వరస్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి! వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట! ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట! తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి.దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం (చెక్కరథం) బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది.అంకురార్పణతో ఆరంభంశ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత దేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.ధ్వజారోహణంఅంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండమీదే కొలువుదీరి ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.పెద్దశేషవాహనంమొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీథులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. భూభారాన్ని వహించేది శేషుడే! శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.చిన్నశేషవాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీ యోగసిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి.హంస వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించి వేరుచేయగల అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు.సింహ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహాన్ని బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహనసేవలోని అంతరార్థం.ముత్యపుపందిరి వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చల్లని ముత్యాలపందిరి కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.కల్పవృక్ష వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీథుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తమకు కాసిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.సర్వభూపాల వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజు అని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.మోహిని అవతారంబ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు.గరుడ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీథుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళరూప దర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు.హనుమంత వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం అవగతమవుతుంది.స్వర్ణ రథంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది.గజవాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.సూర్యప్రభ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీథుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభవాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్య, సంతాన లాభాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.చంద్రప్రభ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభవాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు విప్పారతాయి. హృదయాలలో ఆనందం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.రథోత్సవంగుర్రాల వంటి ఇంద్రియాలను మనసు అనే కళ్లెంతో అదుపు చేసే విధంగానే, రథం వంటి శరీరాన్ని రౌతు అయిన ఆత్మ ద్వారా అదుపు చేయాలని తత్త్వ జ్ఞానాన్ని స్వామివారు ఎనిమిదో రోజు ఉదయం తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథసేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉందని భక్తుల విశ్వాసంఅశ్వవాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.చక్రస్నానంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.ధ్వజావరోహణంచక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగరవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాలు వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.శ్రీవారి వాహన సేవల వివరాలు 24–09–2025సాయంత్రం 05:43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.25–09–2025ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం26–09–2025ఉదయం 8 గంటలకు సింహ వాహనం మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం27–09–2025ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంమధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం28–09–2025ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి గరుడ వాహనం29–09–2025 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథంరాత్రి 7 గంటలకు గజ వాహనం30–09–2025ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంరాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం01–10–2025ఉదయం 7 గంటలకు రథోత్సవంరాత్రి 7 గంటలకు అశ్వ వాహనం02–10–2025ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం. -
శ్రీవారి ఆలయ చరిత్ర
తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం. ఎన్నో శతాబ్దాలుగా వెలుగొందుతున్న శ్రీవారి ఆలయం వెనుక ఎంతో చరిత్ర, ఎన్నో స్థలపురాణాలు ఉన్నాయి. రాజుల పాలన నుంచి బ్రిటిష్ పాలకుల చేతిలోకి వెళ్లినప్పటికీ, శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోగలిగింది. వాటిని నేటికీ కొనసాగించగలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో శేషాచలంలో ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుమల. కలియుగ వైకుంఠంగా పిలుస్తున్న ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడిగా కొలువై కోరిన కోరికలను తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం. బ్రిటిష్ ఈస్టిండియా పాలన నుంచి ప్రత్యేక బోర్డుగా ఏర్పడే వరకు ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో మద్రాసు ప్రభుత్వం ఏడవ రెగ్యులేషన్ ద్వారా 1817లో శ్రీవారి ఆలయాన్ని ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నియంత్రణలోకి తెచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం ‘బ్రూస్ కోడ్’ రూపొందించారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆలయ పరిపాలనను 1843లో హథీరామ్జీ మఠం మహంతులకు అప్పగించింది. అప్పటి నుంచి 1933 వరకు మహంతుల పాలనలోనే ఆలయం విలసిల్లింది.టీటీడీ పాలక మండలి ఏర్పాటుతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటైంది. అంతకు ముందు మహంతుల పాలనలో ఉన్న ఆలయాన్ని ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం 1933లో టీటీడీకి పాలక మండలి పరిధిలోకి తీసుకురావడం వల్ల మహంతుల వ్యవస్థ ముగిసింది. దీంతో పాలనా వ్యవహారాలు అధికారుల చేతిలోకి వెళ్ళాయి. పాలనా వ్యవహారాలు మారినా, సుదీర్ఘకాలం తిరుమల వ్యవహారాలను పర్యవేక్షించిన మహంతులకు నేటికీ ప్రత్యేక గౌరవం కొనసాగుతోంది. హాథీరామ్‌జీ మఠంతో అనుబంధంఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని క్రేడల్ క్రేల గ్రామంలో రామానంద మఠం ఉండేది. మఠం అధిపతి అభయ్ ఆనంద్జీ శిష్యుడు హాథీరామ్‌జీ దేశయాత్రలో భాగంగా వెంకటాచలానికి చేరుకున్నాడు. శ్రీవేంకటేశ్వరుడిని అయోధ్య రాముడి అంశగా భావించి, కొలుస్తూ ప్రసన్నం చేసుకునేవాడు. హాథీరామ్‌జీ భక్తికి ముగ్ధుడైన శ్రీవారు నిత్యం ఆనందనిలయం దాటి ఆలయానికి సమీపంలోనే ఉన్న హాథీరామ్‌జీ మఠానికి వచ్చి, ఆయనతో పాచికలాడుతూ, భక్తుడిని గెలిపించి, ఆనందపడేవారనే కథలు ఉన్నాయి.తిరుమలలో శ్రీవారి పేరు తరువాత వినిపించే పేరు విష్వక్సేనుడు. టీటీడీ పాలనా వ్యవహారాలు మహంతుల చేతికి ఈస్టిండియా కంపెనీ అప్పగించినప్పటికీ, ఆలయ నిత్యకలాపాల్లో లోటు లేకుండా చేశారు. అదే సమయంలో పాలనా పగ్గాలు చేతికి తీసుకున్న మహంతులు (çహాథీరామ్‌జీ బాబా వారసులు) తమ పాలన వ్యవహారాలలో విష్వక్సేనుడి అధికార ముద్రను వాడేవారు. మొదటి మహంతు సేవాదాస్ కాలంలోనే శ్రీవారి పుష్కరిణిలో జలకేళీ మండపోత్సవం పేరిట తెప్పోత్సవం ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి మహంతు బాబాజీ పేరుతో సుప్రభాత సేవలో గోక్షీర నివేదన, నవనీత హారతి సమర్పించే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజూ వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీవారికి సంప్రదాయబద్ధంగా హారతి అందిస్తున్నారు.ఆణివార ఆస్థానం వెనుకవందల సంవత్సరాలు కాలంలో కలిసిపోయినా, తిరుమలలో మాత్రం ఆనాటి ఆచార వ్యవహారలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా కొనసాగిస్తున్నారు. అందులో ఒకటి ఆణివార ఆస్థానం కార్యక్రమం. శాస్త్రోక్తంగా నిర్వహించడంలో టీటీడీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తిరుమలలో ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక పెద్ద కథే ఉంది.ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆర్కాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈస్టిండియా కంపెనీ పాలన సాగించింది. దీంతో 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు ఆలయ పాలన హాథీరామ్‌జీ మఠం మహంతుల పాలనలో సాగింది. తిరుమల ఆలయానికి మొదటి మహంతుగా1843 జూలై 10న మహంత్ సేవాదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆణివార ఆస్థానం రోజే బ్రిటిషర్లు శ్రీవారి ఆలయ ఆస్తులు, ఆభరణాలు, ఉత్సవ మూర్తులు, ఉత్సవర్లకు ఊరేగింపులో వాడే వాహనాలు, నిత్య కైంకర్యాలకు వాడే పురాతన వస్తువులు, రికార్డులు, లెక్కల అప్పగింత జరిగింది.ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తరహా సమీక్ష జరిగేది. టీటీడీ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇది వార్షిక బడ్జెట్‌గా మారింది. వందల ఏళ్ల నాటి సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూనే, ఆనాటి చరిత్ర మరుగున పడకుండా, మహంతుల పరిపాలనా కాలం నాటి పద్ధతుల్లోనే శ్రీవారికి ఆణివార ఆస్థానం ద్వారా లెక్కలు నివేదించే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. -
దసరా మామూళ్లు ఇవ్వలేం.. గేటుకు బోర్డు
చౌటుప్పల్ రూరల్: దసరా మామూళ్లు ఇవ్వలేం.. అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ పరిధిలోని ఓ పరిశ్రమ యాజమాన్యం బోర్డు పెట్టింది. దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల కోసం గ్రామాల్లోని యువత చందాలు వసూలు చేస్తుంటారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన కిందిస్థాయి సిబ్బంది కూడా పరిశ్రమ వద్దకు వెళ్లి దసరా (dussehra) మామూళ్లు అడుగుతారు. అయితే, ఈ ఏడాది పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని, తాము ఎవరికీ దసరా చందాలు ఇవ్వలేమని పరిశ్రమ గేటుకు బోర్డు తగిలించారు. వైద్యానికి పడవ ప్రయాణమే..ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మల్యాల సమీపంలోని గొత్తికోయగూడెంలో (gutti koya gudem) శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. కొండాయి– దొడ్ల మధ్యలో వంతెన లేకపోవడం.. జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పడవలో ప్రయాణించాల్సి వచ్చింది. దొడ్లనుంచి నుంచి గొత్తి కోయగూడానికి రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లారు. గొత్తికోయగూడెంలో వైద్య శిబిరం నిర్వహించి, ఇంటింటికి తిరిగి జ్వరాల సర్వే (Fever Survey) చేశారు. మొత్తం 35 మందికి మందికి మందులు అందజేసి.. ఐదుగురికి రక్తపూతల పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కొండాయి వైద్యాధికారి డాక్టర్ ప్రణీత్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ భాస్కర్‌రావు, ఆశ వర్కర్లు జ్యోతి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థులతో బెంచీల తరలింపుట్రాక్టర్లో ప్రమాదకర ప్రయాణంజగిత్యాల రూరల్: విద్యార్థులతో ట్రాక్టర్లో ప్రమాదకర రీతిలో బెంచీలు తరలించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట పాఠశాలలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. పురాణిపేట పాఠశాల విద్యార్థులకు బెంచీలు అవసరం కాగా.. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది శుక్రవారం ట్రాక్టర్లో జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి బెంచీలు తీసుకొచ్చేందుకు వెళ్లారు. బెంచీలను విద్యార్థులతో ట్రాక్టర్లోకి మోయించారు. కాగా, విద్యార్థులు అదే ట్రాక్టర్లో ప్రమాదకర రీతిలో.. పొరండ్ల నుంచి పురాణిపేటకు ప్రయాణించడం చూసి పట్టణ ప్రజలు విద్యాశాఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చెరువులో దిగి.. విద్యుత్ సమస్య పరిష్కరించిఆలేరు రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక నుంచి పటేల్‌గూడెం వెళ్లే మార్గంలో మల్లన్న కుంట చెరువు వద్ద వ్యవసాయ బావులకు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్లో సాంకేతిక సమస్య వల్ల గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్.. ప్రాణాలకు తెగించి కుంటలోకి దిగి ఈదుకుంటూ వెళ్లి స్తంభం ఎక్కి విద్యుత్ లైన్‌ను సవరించాడు. శ్రీకాంత్ సాహసాన్ని గుర్తించిన భువనగిరి డివిజినల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు అతనికి ప్రశంసా పత్రం అందజేశారు.చదవండి: శ్రీపురం శ్రీమంతులు.. రూ. కోటితో ఆలయం పునరుద్ధరణముమ్మరంగా తిరుమాడ వీధుల పనులువరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించేందుకు చుట్టూ వెడల్పాటి మాడవీధులు, తొమ్మిది అంతస్తుల్లో నాలుగు రాజగోపురాలు నిర్మించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేయించారు. ఆలయం చుట్టూ ఉన్న స్థలం చదును పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండ -
Dussehra 2025 అమ్మవారి ప్రసాదాలు, రెసిపీలు
దుర్గామాత పూజలకు అన్నీ సిద్ధం అనుకునేలోపు నైవేద్యాల తయారీ ఎలా– అనే ఆందోళన తలెత్తడమూ సహజం... ఏమేం కావాలి, ఎలా రెడీ చేసుకోవాలో ముందే తెలుసుకుని, ఆచరణలో పెడితే అమ్మవారికి రుచిగా... శుచిగా నైవేద్యాలను సులువుగా సిద్ధం చేసుకోవచ్చు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఆ వివరాలు ఈ వారం వంటిల్లులో..పరమాన్నం కావలసినవి: పెసరపప్పు - 1/2 కప్పు; బియ్యం -3/4 కప్పు; పాలు -కప్పు; నీళ్లు - 4 కప్పులు; బెల్లం తరుగు- కప్పు; యాలకుల పొడి-అర టీ స్పూన్; నెయ్యి - 3 టేబుల్‌స్పూన్లు; జీడిపప్పు-పది పలుకులు; కిస్మిస్ – గుప్పెడు.తయారీ: ∙పప్పును దోరగా వేయించుకోవాలి ∙బియ్యం, పప్పు కలిసి కడగాలి. కుకర్‌లో కడిగిన బియ్యం, పప్పు, నీళ్లు కలిపి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దించాలి. మందపాటి గిన్నెలో బెల్లం తరుగు వేసి వేడిచేయాలి. దీంతో 3–4 నిమిషాల్లో బెల్లం పాకం సిద్ధం అవుతుంది.కుకర్ విజిల్ వచ్చాక మూత తీసి, అన్నం మెత్తగా స్పూన్‌తో మెదుపుకోవాలి. పాలు పోసి కలపాలి ∙ఫిల్టర్ పెట్టి, బెల్లం సిరప్ వడకట్టి, మెత్తగా అయిన అన్నంలో కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టౌపై పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. దీంట్లో యాలకుల పొడివేసి కలపాలి.విడిగా మరొక మూకుడులో నెయ్యి వేడి చేసి, దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు మిశ్రమంలో కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.చదవండి: మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్అల్లం గారెలుకావలసినవి: మినప్పప్పు- కప్పు; ఉప్పు - 1/3 టీ స్పూన్ (తగినంత); వంట సోడా- చిటికెడు; పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూన్; అల్లం తరుగు – టేబుల్ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; మిరియాల పొడి - పావు టీ స్పూన్; నూనె-వేయించడానికి తగినంత.తయారీ: ∙మినప్పప్పు కడిగి, 3–4 గంటలసేపు నానబెట్టాలి. నీళ్లు వడకట్టి, ఉప్పు వేసి, మెత్తగా రుబ్బుకోవాలి ∙రుబ్బిన పిండిలో పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, మిరియాల పొడి, కరివేపాకు తరుగు వేసి కలపాలి. స్టౌ పై కడాయి పెట్టి, గారెలు వేయించడానికి తగినంత నూనె పోసి, వేడి చేయాలి ∙వేళ్లకు నీళ్లు తగిలేలా తడి చేసుకొని, పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, వేళ్లతోనే బాల్స్‌లా చేసుకోవాలి ∙నూనె రాసిన ΄్లాస్టిక్ షీట్‌పైన పిండి బాల్‌ను కొద్దిగా వేళ్లతో అదిమి, మధ్యలో హోల్ పెట్టాలి ∙తయారు చేసుకున్న దానిని కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు ఉంచి, బయటకు తీసి, ప్లేటులో పెట్టాలి. కదంబంకావలసినవి: బియ్యం-కప్పు; కందిపప్పు-అరకప్పు, చింతపండు నిమ్మ కాయంత; కూరగాయలు - బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, బెండకాయ, దొండకాయ, గాజర్, బఠానీ.. మొదలైనవి – 150 గ్రాములు (చిన్న ముక్కలు); పసుపు- పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; సాంబార్ పొడి – 2 టీ స్పూన్లు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీ స్పూన్; ఎండుమిర్చి – 2; ఇంగువ – చిటికెడు; నెయ్యి – బేటుల్ స్పూన్.తయారీ: కందిపప్పు బాగా ఉడికించి, మెత్తగా మెదిపి పక్కనుంచాలి. మరొక గిన్నెలో బియ్యం మెత్తగా ఉడికించి, వేరుగా ఉంచాలి ∙ఒక గిన్నెలో కూరగాయల ముక్కలు, చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.ఉడికిన కూరగాయ ముక్కల్లో సాంబార్ పొడి వేసి బాగా కలపాలి ∙మెత్తగా చేసిన పప్పు, అన్నం ఉడుకుతున్న కూరగాయల మిశ్రమంలో వేసి కలపాలి ∙ఒక చిన్నపాన్లో నూనె వేసి వేడి చేసి, ఆవాలు, జిలకర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసిన తాలింపును వేసి కలపాలి. గిన్నెలోకి తీసిన తర్వాత చివరగా నెయ్యి వేయాలి. – నారాయణమ్మ, మీ థాట్ హోమ్ డిలైట్ -
విజయవాడ : ముగిసిన దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)
-
అదిరే ఫ్యాషన్ లుక్ : దాండియా ధడక్
నవరాత్రులలో దాండియా ఆటలు గర్భా నృత్యాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేలా ఉంటాయి. ఈ ఆటపాటలలో పాల్గొనే వారు మరింత సౌకర్యంగా ఉండేలా చూపరులకు కనువిందు చేసేలా... ప్రత్యేక డ్రెస్సులూ ఉంటాయి. ముదురు రంగులు, అద్దాల మెరుపులు, ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు, ధోతీ ప్యాంట్స్‌కి ఆధునికపు హంగుల అమరిక ఈ రోజుల్లో ముచ్చట గొలుపుతుంటాయి. నవరాత్రి గర్భా, దాండియా రాత్రుల కోసం ట్రెండీ దుస్తుల ఆలోచనలు నవతరాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వైపుగా నడిపిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌తో అలంకరించిన రంగురంగుల చనియా చోళి దుస్తులను స్టైల్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.ధోతీ ప్యాంటుతో క్రాప్ టాప్ మిర్రర్,ఎంబ్రాయిడరీ చేసిన క్రాప్ టాప్, ధోతీ ప్యాంటు కలయిక కంఫర్ట్ స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. దాండియా ఆడటానికి అనుకూలంగా ఉండే ఈ డ్రెస్ కాన్ఫిడెన్స్నూ ఇస్తుంది. ఫ్యాషన్ లుక్ కోసం ధోతీ ప్యాంటును కొత్త క్రాప్ టాప్‌తో తిరిగి వాడచ్చు.లెహెంగా అసెమెట్రికల్ కుర్తీఅసెమెట్రికల్ కుర్తీలు వేడుకలకు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఫ్లేర్డ్ లెహెంగాతో జత చేస్తే చూపుతిప్పుకోలేరు. ఒక డైనమిక్ ఎలిమెంట్‌ను జోడిస్తుంది. పండుగ సీజన్లో స్పెషల్ లుక్ కోరుకునేవారికిది బెస్ట్ ఆప్షన్. ప్యాంటుతో సైడ్ స్లిట్ కుర్తీసంప్రదాయ దుస్తులకు ఆధునిక టచ్‌ను ఇష్టపడే వారికి సైడ్ స్లిట్ కుర్తీ సరైన ఎంపిక. ఇది ప్లెయిన్, ఎంబ్రాయిడరీ లేదా బ్రోకేడ్ బోర్డర్లతో డిజైన్ చేసిన ప్యాంటుతో, లెహెంగా కాంబినేషన్‌గా ధరించవచ్చు.లెహెంగాతో మిర్రర్ డెనిమ్ షర్ట్ఇండో–వెస్ట్రన్ లుక్ కోసం లెహెంగాతో డెనిమ్ షర్ట్‌ను జత చేయచ్చు. ఈ ఇండో–వెస్ట్రన్ లుక్ వివిధ రకాల ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే వారికి సరైనది. క్లాసిక్ లెహెంగా, క్యాజువల్ డెనిమ్ షర్ట్ మరింత కంఫర్ట్‌గా ఉంటుంది, ఇది నవరాత్రుల్లో ప్రత్యేకంగా చూపుతుంది. సొంతంగా క్రియేషన్ పెద్ద పెద్ద జూకాలు, గాజులు, లేయర్డ్ నెక్లెస్‌లు.. జర్మన్ సిల్వర్ జ్యువెలరీని ఎంచుకోవచ్చు నృత్యం చేసే సమయం కాబట్టి వాటర్ ప్రూఫ్ మేకప్‌ను ఎంచుకుంటే లుక్ ఫ్రెష్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద బిందీలు నవరాత్రి రోజులలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. పొడవాటి జడలు, వివిధ మోడల్స్‌లో ఉన్న ముడులు, వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ బాగుంటాయి. బోహో– ఫ్యూజన్ కాంబినేషన్లో డెనిమ్ డ్రెస్‌లు పగటి పూట కూడా ఈ రోజుల్లో క్యాజువల్‌గా ధరించవచ్చు. సంవత్సరాలుగా లెహంగాలు, ఘాగ్రాలు నవరాత్రి దుస్తులుగా ఉన్నాయి కాబట్టి స్కర్టులు, కుర్తీల నుండి లేయర్డ్ ఇండో–వెస్ట్రన్ గౌన్ల వరకు ఈ రోజుల్లో ప్రయత్నించవచ్చు. ∙రంగురంగుల టాసెల్స్, రాజస్థానీ ఎంబ్రాయిడరీ ప్యాచ్‌లు, మిర్రర్ వర్క్ ఉపయోగించి పండగ థీమ్‌ను క్రియేట్ చేయవచ్చు. నవరాత్రి స్పెషల్ డ్రెస్సులు దాదాపు రూ.1500/– నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. లేదంటే ఇంట్లోనే డిజైనరీ క్రాప్ టాప్, బ్లౌజ్ లేదా చిన్న కుర్తీతో జత చేయబడిన డెనిమ్ బాటమ్స్ ధరిస్తే డ్యాన్స్ చేసేవారికి తాజా, ఉల్లాసభరితమైన వైబ్‌ను జోడిస్తాయి. పండుగ అలంకరణ కోసం దుప్పట్టా లేదా బాందిని స్టోల్ లేదా టై–డై ప్రింట్లతో స్టైల్ చేయచ్చు. నవరాత్రి ఫ్యాషన్ అనేది వ్యక్తిగత వ్యక్తీకరణతో సంప్రదాయాన్ని కళ్లకు కట్టవచ్చు. వాటిని మార్కెట్లో కొనుగోలు చేసినా, సొంతంగా తమదైన స్టైల్‌ను క్రియేట్ చేసినా, బోహో–ఫ్యూజన్ డ్రెస్సులు డ్యాన్స్ ఫ్లోర్‌పై హంగామా చేస్తాయి. ఈ పండుగ సీజన్లో సాధారణంగా కాకుండా తమదైన సొంత సృజనాత్మకతను సరికొత్తగా పరిచయం చేయచ్చు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)
-
బతుకమ్మ, దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడువేల పైచీలుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను నడిపేందుకు సిద్ధం కాగా.. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది.ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ .. బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉంది. గత దసరా కంటే ఈ సారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. పోలీస్, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోంది.” అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. -
ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..!
గణపతి నవరాత్రలు ముగిసిన వెంటనే దేవి నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు, వాడ, గ్రామంలోని ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరంణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కాగా, ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం. చివరి రోజు విజయ దశమితో కలిపి పదకొండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే..ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి. ఇక చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం 11 రోజులు 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకొండు అలంకారాలు ఇవే..!.సెప్టెంబర్ 22 - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారంసెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రి దేవి అలకారంసెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంసెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారంసెప్టెంబర్ 26 - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారంసెప్టెంబర్ 27 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంసెప్టెంబర్ 28 - శ్రీ మహా చండీదేవి అలంకారంసెప్టెంబర్ 29 - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారంసెప్టెంబర్ 30 - శ్రీ దుర్గా దేవి అలంకారంఅక్టోబర్ 1 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంఅక్టోబర్ 2 - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంగమనిక: ఈ కథనంలో తెలియజేసిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)
-
అడవులన్నీ పైలంగా.. ఆపదలన్నీ దూరంగా..
‘అడవి పూల సింగారం.. చేను చెల్కల బంగారం పైలమే తల్లీ.. పైలమే బతుకమ్మా.. గునుగు పూలెయ్యాలో.. తంగెడు పూలెయ్యాలో.. ఊరూ.. అడవి.. ఆడీపాడంగా.. అడవులన్నీ పైలంగా.. ఆపదలన్నీ దూరంగా.. చప్పట్లే మిరిమిట్లవ్వంగా.. రావే చెల్లి.. రావే అక్క.. బతుకమ్మ ఆడగరావే.. ఉయ్యాలో.. ఉయ్యాలో.. బతుకు సుడిగుండం దాటి బరిగీసి నిలువగ రావే.. ఉయ్యాలో.. ఉయ్యాలా..’ఇలా సాగే బతుకమ్మ పాటతో బహుజన బతుకమ్మ సింగారించుకుంది. ఈ పాటను వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ అలియాస్ మిత్ర రాయగా.. ఆయన సతీమణి విమలక్క గానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిసరాల్లోనే చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం బహుజన బతుకమ్మ పాటను ఆవిష్కరించారు. పన్నెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మ (Bahujana Bathukamma) ఆటాపాటలతో అలరించనుంది.ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని చాటుదాం ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం అంటూ..’ ప్రారంభమైన ఈ కార్యక్రమానికి 15 ఏళ్లు నిండుతున్నాయి. తెలంగాణ ప్రాంత మెట్టపంటలు అందివచ్చే కాలానికి పంటల పండుగలా (హార్వెస్ట్ ఫెస్టివల్) వస్తున్న బతుకమ్మను తెలంగాణ ప్రజలు వందల ఏళ్లుగా జరుపుకుంటున్నారు. ఈ సాంస్కృతిక ఉత్సవం మహత్తర తెలంగాణ (Telangana) సాయుధ పోరాటకాలంలోనూ, రైతాంగ పోరాటాలలోనూ, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో సాధనంగా మారిన అనుభవం ఉంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో మొదలైన బహుజన బతుకమ్మ, కులం, మతం అని తేడాలు లేకుండా, వనరుల విధ్వంసం జరగకుండా, ప్రత్యేకించి స్త్రీల సమానహక్కుల ప్రస్తావనతో సెక్యులర్ పండుగగా జరగాలని బహుజన బతుకమ్మ కృషి చేస్తుంది. ‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ’అనే నినాదంతో ఈ ఏడాది బహుజన బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలో చిత్రీకరణ బహుజన బతుకమ్మ పాటను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, గోపాల్రావుపల్లి, తాడూరు శివారుల్లో చిత్రీకరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క బృందం, జానపద కళాకారుడు వంతడ్పుల నాగరాజు పర్యవేక్షణలో ఈ పాట షూటింగ్ జరిగింది. ‘ప్రకృతి విధ్వంసమంటే.. ప్రజలపై యుద్ధమే.. శాంతి స్వావలంబన చాటుదామని ఈ ఏడాది ప్రజాబాహుళ్యంలోకి వెళ్లారు. గత 15 ఏళ్లుగా బహుజన బతుకమ్మను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వహిస్తోంది. కళాకారుల నృత్యాలు, ఆటపాటలతో గోపాల్రావుపల్లి, తాడూరు, తంగళ్లపల్లి పరిసరాల్లో సందడి చేశారు.పన్నెండు రోజులు పాటల పండుగే బహుజన బతుకమ్మ పాటల పండుగను రాష్ట్రమంతంటా నిర్వహించనున్నారు. తొలిరోజు సెప్టెంబర్ 20న గన్‌పార్క్‌లో 11 గంటలకు నివాళితో మొదలై.. 3 గంటలకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఆటపాటలతో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 21న సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, 22న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు, 23న వనపర్తి జిల్లా కొత్తకోట, 24న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రం, 25న ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు, 26న ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం పెద్దాపురంలో, 27న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేడుకలు నిర్వహించనున్నారు. చదవండి: గత చరిత్రకు సజీవ సాక్ష్యం.. అమ్మాపురం సంస్థానంసెప్టెంబర్ 28న ఉమ్మడి మెదక్ జిల్లా పెద్ద నిజాంపేట మండలం కల్వకుంట, 29న హైదరాబాద్‌లోని మల్లాపురం గోకుల్‌నగర్‌లో, 30న మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచెడ్, అక్టోబర్ 3న నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో బహుజన బతుకమ్మ వేడుకలు ముగియనున్నాయి.- సిరిసిల్ల