
కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు
థీమ్డ్ ప్రచార కార్యక్రమాలు
వినియోగదారులకు చేరువ అయ్యే ప్రయత్నం
విక్రయాలు పెంచుకునేందుకు వినూత్నబాట
కోల్‌కతా: దసరా నవరాత్రి వేడుకలను కంపెనీలు మార్కెటింగ్ మంత్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ సందర్భంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ, వినియోగదారులకు మరింత దగ్గరయ్యే దిశగా మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా దుర్గా పూజలను పెద్ద ఎత్తున నిర్వహించే పశ్చిమబెంగాల్ వంటి ప్రాంతాల్లో థీమ్డ్ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నాయి.
టీపొడి, వ్యక్తిగత సంరక్షణ నుంచి ఫ్యాషన్, పాదరక్షలు, లైటింగ్, సాంకేతికత వరకు.. బ్రాండ్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు ఆవిష్కరణలకు సంప్రదాయాన్ని జోడిస్తున్నాయి. పండుగల రోజుల్లో షాపింగ్‌కు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుంటారు. అందులోనూ దసరా రోజుల్లో ఖరీదైన కొనుగోళ్లు ఎక్కువగా నమోవుతుంటాయి. ఈ సమయంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలతో విక్రయాలను పెంచుకోవడమే కాకుండా, వినియోగదారులతో దీర్ఘకాల భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కంపెనీలు చూస్తుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
‘‘పండుగ కార్యక్రమాలు బ్రాండ్ల నిర్మాణానికి కీలకం. వినియోగదారుల సెంటిమెంట్ గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో వారితో అనుబంధానికి వీలు కలి్పస్తాయి’’అని పర్సనల్‌కేర్ బ్రాండ్ జోయ్ సీఎంవో పౌలోమీ రాయ్ తెలిపారు. మింత్రా జబాంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రీమియం ఎతి్నక్ వేర్ లేబుల్ ‘సౌరాగ్య’ను మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో కలసి రూపొందించింది. సౌరవ్ విజన్ అయిన అసలైన బెంగాలీ ఫ్యాషన్ ఈ భాగస్వామ్యానికి మూలమని మింత్రా అధికార ప్రతినిధి చెప్పారు. దీంతో సౌరవ్ గంగూలీ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టయిందన్నారు.
ఇమామీ గోధుమ పిండి
దసరా ముందు గోధుమ పిండి బ్రాండ్‌ను విడుదల చేయడం ద్వారా ఇమామీ ఆగ్రోటెక్ స్టేపుల్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన చెక్కీ ఫ్రెష్ ఆటా పిండితో రూపొందించిన దుర్గామాత విగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. పశి్చమబెంగాల్ కళ, సంస్కృతిని ప్రతిబింబిస్తూ టాటా టీ కంపెనీ టాటా టీ గోల్డ్ బ్రాండ్ ప్రచారాన్ని చేపట్టింది. ఐదుగురు బెంగాలీ కళాకారులు రూపొందించిన డిజైన్లతో లిమిటెడ్ ఎడిషన్ టాటా టీ గోల్డ్‌ను విడుదల చేసింది.
ఈ డిజైన్లు దుర్గా పూజల ప్రత్యేకతను చాటనున్నాయి. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ సైతం దసరా సందర్భంగా తన ఫారŠూచ్యన్ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. సంప్రదాయ వేడుకలు, సంబరాల్లో పాలు పంచుకునేందుకు పండుగలు అవకాశం కలి్పస్తాయని కంపెనీ సేల్స్ జాయింట్ ప్రెసిడెంట్ ముకేశ్ మిశ్రా తెలిపారు. కొత్త ఉత్పత్తులు, ప్రచారాలతో తమ విక్రయాలు పెంచుకోవడమే కాకుండా, వినియోదారులకు చేరువ అయ్యేందుకు ఈ సీజన్‌ను ఒక చక్కని అవకాశంగా భావిస్తూ ముందుకు వెళుతున్నాయి.