marketing
-
ఇచ్చింది రూ.720 ..పోయింది రూ.4.49 లక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహిళను టార్గెట్‌గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో ఎర వేశారు. ఆమెకు రూ.720 లాభం ఇవ్వడం ద్వారా నమ్మకం కలిగించి ఏకంగా రూ.4.49 లక్షలు టోకరా వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ వివాహితకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ట్రేడ్ మార్కెటింగ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఎర వేశారు. దానికి ముందు కొన్ని టాస్్కలు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో ఆయా వీడియోలు, ఫొటోలను షేర్ చేయడం, ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చని నమ్మబలికారు. మొదటి టాస్క్ పూర్తి చేసిన ఆమెకు రూ.120, రెండో టాస్క్ పూర్తి చేయడంతో రూ.300 చెల్లించారు. దీంతో వారిపై పూర్తిగా నమ్మకం కలిగిన గృహిణి తాను పెట్టుబడులు పెడతానంటూ వాట్సాప్ ద్వారా సందేశం ఇచ్చారు. దీంతో ఆమెకు ఓ లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు అందులో ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడులు పెట్టాలన్నారు. తొలుత రూ.వెయ్యి పెట్టుబడి పెట్టిన ఆమెకు రూ.300 లాభంతో రూ.1300 చెల్లించారు. ఆపై పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయిస్తూ, త్వరలోనే లాభాలు వస్తాయని కాలయాపన చేశారు. మొత్తమ్మీద రూ.4.49 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత రిఫండ్ కోరితే మరికొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తేనే వస్తుందని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే... తెలుగు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేట్ ఉద్యోగికి పెళ్లి కూతురి పేరుతో ప్రొఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.05 లక్షలు కాజేశారు. దీనికోసం వాళ్లు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కథ చెప్పారు. నగర యువకుడు తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోగా... మలేíÙయాలో ఉంటున్న విశాఖపట్నం యువతిగా ఓ యువతి తన ప్రొఫైల్ పంపింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. ఆపై తన తండ్రి క్రిప్టో కరెన్సీ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి, లాభాలు పొందటంతో నిష్ణాతుడని చెప్పింది. తొలుత నిజమైన క్రిప్టో కరెన్సీ యాప్‌లోనే పెట్టుబడి పెట్టి, లాభాలు పొందేలా చేశారు. ఆపై నకిలీ యాప్ లింక్‌ను పంపి, అందులో రూ.2.05 లక్షలు ఇన్వెస్ట్ చేయించి కాజేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తెలుగు మ్యాట్రిమోనీ నుంచి వాట్సాప్ ద్వారా బాధితుడికి ఓ మెసేజ్ వచి్చంది. అందులో సైబర్ నేరగాళ్లు పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలుగా పరిచయమై ఎర వేస్తున్నారని, ఆపై వివిధ అంశాల్లో తమ అంకుల్, తండ్రి నిష్ణాతులని చెప్పి మోసం చేస్తున్నారని ఉంది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తక్షణం ఫిర్యాదు చేయండిఅపరిచితులతో ఎలాంటి లావాదేవీలు వద్దు. ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అంటూ వచ్చే ప్రకటనలు నమ్మవద్దు. ఎవరైనా సైబర్ నేరాల బారినపడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి లేదా 8712665171 నెంబర్‌ను వాట్సాప్ ద్వారా,(cybercrimespshyd@gmail.com) మెయిల్‌కు ఐడీకి ఈ–మెయిల్ ద్వారా సంప్రదించి లేదా (www.cybercrime.gov.in) వెబ్సైట్లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి. – సైబర్ క్రైమ్ పోలీసులు -
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
పక్క వీధి లక్ష్మి పచ్చళ్లు, మసాలాలు, కారం, పసువు.. ఇలా మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతి ఉత్పత్తినీ వంద శాతం సహజసిద్ధంగా అందిస్తుంది. రోజంతా ఊళ్లు తిరిగి ఆమె సంపాదించేది ఇంటి ఖర్చులకే సరిపోవు. కానీ ఆమె ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది. వేరే పని తెలియని లక్ష్మి మాత్రం తనకు నష్టం వస్తుందని తెలిసినా తప్పక ఇదే కొనసాగిస్తోంది. ఇలాంటి వారికి అండగా నిలుస్తూ వారి ఆదాయం పెంచేలా సాయం చేసే స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. అలాంటి కంపెనీల్లో టెండ్రిల్స్ నేచురల్స్ ఒకటి. సేంద్రియ ఉత్పత్తుల విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ మహిళా పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న సేవలేమిటి.. కంపెనీ విధానాల వల్ల రైతులకు ఎలా మేలు జరుగుతుంది.. సంస్థ పురోగతికి ‘వాల్‌మార్ట్ వృద్ధి’ కార్యక్రమంలో ఎలా ఉపయోగపడింది..వంటి అంశాలపై సంస్థ వ్యవస్థాపకులు అజయ్‌బాబుతో సాక్షి.కామ్ బిజినెస్ ముఖాముఖి నిర్వహించింది.సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటి పరిష్కారానికి మీరు ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు?మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద సవాలుగా మారుతుంది. వినియోగదారులకు ఎలాంటి ఉత్పత్తులు అవసరమో తెలుసుకుని వాటిని సరఫరా చేయాలి. వారికి అందిస్తున్న ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించాలి. దాంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతాయి. ఈ సవాళ్లను పరిష్కరిస్తున్న కంపెనీల్లో టెండ్రిల్స్ ఒకటి. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు అమ్ముకునేలా రూ.8 లక్షలతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్)ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా ప్రత్యేక టెస్టింగ్ విధానాన్ని రూపొందించాం. దాంతో వినియోగదారులకు నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి పంటలు పండించాలో అవగాహన ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల రైతుల పంటకు సరైన ధర వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు సరైన రక్షణ చర్యలు పాటించకుండా, అవగాహన లేమితో సాగుచేసి నష్టపోతుంటారు. అలాంటి వారికోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎలాంటి పంటలు పండించాలో తెలియజేస్తున్నాం. దాంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు.తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతులతో కలిసి పనిచేశాం. సరైన విధానాలతో పండించే పంటలను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేశాం. అలా సేకరించిన ఔషధ, సుగంధ మొక్కల నుంచి ఉత్పత్తి చేసిన నూనె, సౌందర్య సాధనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దాంతో మహిళా పారిశ్రామికవేత్తల సాయంతో ఆ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాం. ఫలితంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులకు మేలు జరుగుతోంది. అరకు, పాడేరు జిల్లాల్లోని అడవి తేనె, పసుపుతో 5% కర్కుమిన్ కంటెంట్ (పసుపుకు రంగును ఇచ్చే పదార్థం)ను, పతారి అడవిలోని గిరిజన ప్రాంతాల నుంచి మిరియాలను ప్రాసెస్ చేస్తున్నాం.బిజినెస్ పరంగా మీకు ఎదురవుతున్న సమస్యలేమిటి?వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను గుర్తించడం ఈ రంగంలో పెద్ద సవాలు. అన్ని ఉత్పత్తులను పూర్తిగా పరీక్షించాకే మార్కెట్లోకి విడుదల చేయాలి. సంస్థ విక్రయించే ప్రతి వస్తువుకు పరీక్ష నివేదికలు అవసరం. టెండ్రిల్స్లో ప్రత్యేకంగా ప్రతి ఉత్పత్తికి ‘ఫూల్ప్రూఫ్ టెస్టింగ్ సిస్టమ్’ను అమలు చేస్తున్నాం. సౌందర్య సాధనాల సేకరణకు తగిన లేబులింగ్, ప్యాకేజింగ్ వంటివి సవాళ్లుగా ఉన్నాయి. వాటిని సమర్థంగా నిర్వహించాలి. ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించడం వల్ల ఖర్చులు, ఆన్లైన్ కార్యకలాపాల నిర్వహణ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్ పరిధిని విస్తరించడానికి ఈ సవాళ్లను అధిగమించడం చాలా కీలకం. అందుకోసం విభిన్న మార్గాలు అనుసరిస్తున్నాం. ఆర్గానిక్ ఉత్పత్తులు బయట మార్కెట్లో లభించే సాధారణ ఉత్పత్తుల కంటే 10-20 శాతం ధర ఎక్కువగా ఉంటాయి. కొత్త కస్టమర్లు వీటిని భారంగా భావిస్తున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్నావారికి వాటి విలువ తెలుసు కాబట్టి ధర గురించి ఆలోచించడం లేదు.ఆన్లైన్లో పోటీ అధికంగా ఉంది కదా. ధరల సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?ఆన్లైన్లో నిత్యం కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వివిధ సంస్థలు విభిన్న ధరలతో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ‘వాల్‌మార్ట్ వృద్ధి ప్రోగ్రామ్’లో చేరడం వల్ల ధరలకు సంబంధించిన సమస్యలను అధిగమించేలా సహాయపడింది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను ఎలా విక్రయించాలో ఇందులో నేర్పించారు. వ్యాపారానికి అవసరమైన ఫైనాన్స్ సదుపాయం ఎలా పొందాలో వివరించారు. ప్రధానంగా నేను ఎంచుకున్న రంగంలో ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా అవగాహన ఏర్పడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఎలా వాటి ఉత్పత్తులను ఆన్లైన్లో మరింత సమర్థవంతంగా విక్రయించుకోవచ్చో ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తారు. ఫ్లిప్‌కార్ట్ వంటి విస్తారమైన మార్కెట్ అవకాశం ఉన్న ప్లాట్ఫామ్లో ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తారు. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను అమలు చేయడం వల్ల అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ) లాజిస్టిక్స్ విభాగంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాం. ఆఫ్‌లైన్ లాజిస్టిక్స్ ఖర్చులను 50% తగ్గించడంలో ఈ ఒప్పందం సాయపడుతుంది.భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?విభిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో సంస్థ ఉత్పత్తుల విక్రయాలను పెంచాలి. కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే దాదాపు 200 కంటే ఎక్కువగా కంపెనీ ఉత్పత్తులను అమ్మాలని జాబితా ఏర్పాటు చేశాం. ఆ దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో వరుసగా 50, 60 ఆవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్చివరగా..స్థిరంగా ఉత్పత్తుల నాణ్యతను పాటిస్తే వ్యాపారంలో తప్పకుండా విజయం సాధించవచ్చు. కొత్తగా వచ్చే కంపెనీలు కూడా ఈ నియమాన్ని పాటించాలి. యువతకు వ్యాపార రంగంలో అపార అవకాశాలున్నాయి. నచ్చిన రంగంలో ముందుగా నైపుణ్యాలు పెంచుకుని వ్యాపారంలో ప్రవేశిస్తే భవిష్యత్తులో మంచి విజయాలు పొందవచ్చు. -
ఈవీ విక్రయాలు.. ఏటా కోటి!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ 2030 నాటికి ఏటా ఒక కోటి యూనిట్ల స్థాయికి చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే 5 కోట్ల ఉద్యోగాల కల్పన కూడా జరగగలదని వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 64వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఆటోమోటివ్లకు సంబంధించి భవిష్యత్తులో భారత్ నంబర్‌వన్ తయారీ హబ్‌గా ఎదగగలదని తెలిపారు. 2030 నాటికి దేశీయంగా మొత్తం ఈవీ వ్యవస్థ రూ. 20 లక్షల కోట్ల స్థాయికి, ఈవీ ఫైనాన్స్ మార్కెట్ రూ. 4 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని గడ్కరీ పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో లిథియం అయాన్ బ్యాటరీల ఖరీదు మరింత తగ్గి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగి వస్తాయని, ఈవీల వినియోగం గణనీయంగా పెరిగేందుకు ఇది దోహదపడగలదని ఆయన చెప్పారు. 2023–24లో ఈవీల అమ్మకాలు 45 శాతం పెరిగాయని, 400 స్టార్టప్‌లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ప్రారంభించాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా సుమారు 30 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయని, మొత్తం అమ్మకాల్లో టూ–వీలర్ల వాటా 56 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో (పీఎల్ఐ) బ్యాటరీ సెల్ తయారీకి ఊతం లభించగలదని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పరిశ్రమగా ఎదిగేందుకు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై ఆటోమొబైల్ సంస్థలు మరింత ఇన్వెస్ట్ చేయాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు. ఎగుమతులను పెంచుకునే దిశగా తమ ఉత్పత్తులకు గ్లోబల్ ఎన్‌క్యాప్ (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం) రేటింగ్స్‌ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. పీఎల్ఐ కింద రూ. 75 వేల కోట్ల ప్రతిపాదనలు.. పీఎల్ఐ కింద రూ. 75,000 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కంపెనీలు ఇప్పటికే సుమారు రూ. 18,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. సుమారు 30,000 ఉద్యోగాల కల్పనకు స్కీము తోడ్పడిందని మంత్రి వివరించారు. మరోవైపు, వాహనాల వయస్సును బట్టి కాకుండా వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని బట్టి స్క్రాపేజీ విధానం ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ కార్యదర్శి తెలిపారు. ‘విశ్వసనీయమైన‘ పొల్యూషన్ పరీక్షల విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వానికి వాహన పరిశ్రమ దన్నుగా నిలవాలన్నారు.ఆర్థిక వృద్ధికి ఆటోమోటివ్ దన్నుభారత్ అధిక స్థాయిలో వృద్ధిని సాధించేందుకు ఆటోమోటివ్ రంగం చోదకంగా ఉంటుంది. ఇందుకు కొత్త ఆవిష్కరణలు తదితర అంశాలు తోడ్పడతాయి. ఈ క్రమంలో పెరిగే డిమాండ్‌తో పరిశ్రమ కూడా లబ్ధి పొందుతుంది. దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ గత దశాబ్దకాలంలో గణనీయమైన స్థాయిలో, గతంలో ఎన్నడూ చూడనంత వృద్ధిని సాధించింది. రాబోయే రోజుల్లో దేశ పురోగతి వేగవంతంగా మాత్రమే కాకుండా పర్యావరణహితంగా కూడా ఉండాలి. – ప్రధాని మోదీ -
పాలు, పాల ఉత్పత్తులకు ఏ1, ఏ2 పేర్లు వద్దు: ఎఫ్ఎస్ఎస్ఏఐ
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ కింద A1, A2 పేరుతో పాలు, నెయ్యి లేదా పాల ఉత్పత్తులను విక్రయించడంపై స్పష్టతనిచ్చింది. అన్ని పాల ఉత్పత్తుల మీద ఏ1, ఏ2 క్లెయిమ్‌లను తొలగించాలని వెల్లడించింది.ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ క్లెయిమ్‌లను వెంటనే తమ వెబ్సైట్ల నుంచి తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఇప్పటికే ఈ లేబుల్స్ ముద్రించి ఉంటే.. అలంటి వాటిని తొలగించడానికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. లేబులింగ్స్ అనేవి కస్టమర్లను తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయని, ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006కు అనుకూలంగా లేదని స్పష్టం చేసింది.ఏ1, ఏ2 పాలలో ప్రోటీన్లు వేరు వేరుగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఈ రెండు కేటగిరీల పాలలోని ప్రయోజనాలపై సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ నియమాలను పాటించాలని.. మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. -
మారుతున్న ప్రచార పంథా
ఏ వస్తువు తయారు చేసినా దాన్ని విక్రయించాలంటే సరైన ప్రచారం అవసరం. మేలైన వస్తువులు ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలైనా సరే వాటి స్తోమతకు తగిన ప్రచారకర్తలను నియమించుకుంటాయి. కొన్ని పెద్ద కంపెనీలు సినీ తారలు, క్రికెట్లు, పాపులర్ వ్యక్తులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని ప్రచారం సాగిస్తుంటాయి. కానీ క్రమంగా ఆ ట్రెండ్ మారుతుంది. ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు సామాజిక మాధ్యమాల్లోని చిన్న ఇన్ఫ్లుయెన్సర్లకు అవకాశం ఇస్తున్నాయి.భారత్‌లో స్థిరంగా వృద్ధి చెందే ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) రంగంలోని కంపెనీలు చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ పరిశ్రమలో ప్రముఖ సంస్థలుగా ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్), డాబర్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్(జీసీపీ)..వంటివి ఈ పంథాను అనుసరిస్తున్నాయి. ఈమేరకు 2024 ఆర్థిక సంవత్సరంలో చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెట్ విలువ రూ.2,344 కోట్లుగా ఉంది. ఇది 2026 నాటికి రూ.3,375 కోట్లకు చేరుతుందని అంచనా. కంపెనీలు తమ డిజిటల్ బడ్జెట్లో సుమారు 8-10 శాతం రెవెన్యూను ఈ ప్రచారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దేశీయంగా ఎఫ్ఎంసీజీ రంగంలో పెద్ద కంపెనీగా ఉన్న హెచ్‌యూఎల్ తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం వెచ్చించే ఖర్చును 2024లో 31 శాతం పెంచి రూ.6,380 కోట్లకు చేర్చింది. ఈ కంపెనీ దాదాపు 700 మంది ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా దేశంలోని అన్ని భాషల్లో తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు!ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక మాధ్యమాలు, యూట్యూజ్, ఇన్స్టాగ్రామ్..వంటి వాటిలో కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. ఇదిలాఉండగా, ఏ వస్తువైనా మార్కెట్లోని ఇతర కంపెనీ ఉత్పత్తుల ధరతో పోల్చి ఎక్కడ తక్కువకు లభిస్తుందో బేరీజు వేసుకుని తీసుకోవాలి. ప్రధానంగా ఏదో విలాసాలకు వస్తువులు కొనకుండా అవసరానికి మాత్రమే కొనుగోలు చేసేలా జాగ్రత్తపడాలి. డబ్బు మిగిల్చుకోవాలి. -
మెప్పించలేకపోతున్న ఏఐ.. పరిశోధనలో కీలక విషయాలు
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం ఎక్కువవుతోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు పనిచేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ మార్కెటింగ్ రంగం కొంప ముంచుతోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.ఏఐ అనేది నేడు స్మార్ట్‌ఫోన్, గూగుల్, ఇంటర్నెట్లలో కనిపించే సాధారణ పదం అయిపోతోంది. యాడ్స్ విషయంలో కూడా ఏఐ హవా సాగుతోంది. ఇది తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచే అవకాశం ఉందని సంస్థలు కూడా భావిస్తున్నాయి. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ (WSU) పరిశోధకుల ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రకటనలలో ఏఐ ఉపయోగించడం వల్ల అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని వారు స్పష్టంగా వెల్లడించారు.ఏ రంగంలో ఏఐ ఎలా ఉపయోగపడినా.. అమ్మకాల విషయంలో మాత్రం ఇది అంత నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. దీంతో సేల్స్ గణనీయంగా తగ్గుతాయని తెలుస్తోంది. జర్నల్ ఆఫ్ హాస్పిటాలిటీ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఈ విషయాలను వెల్లడించింది.ఏఐ క్రియేట్ చేసిన లేబుల్స్ కస్టమర్లను ఎక్కువ ఆకర్శించలేవు. ఏఐ భావోద్వేగాలను తగ్గిస్తుంది. అమ్మకాల్లో ఎమోషన్ చాలా ప్రధానం, ఏఐ అదే విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేకపోతోందని డబ్ల్యూఎస్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మెసూట్ సిసెక్ వెల్లడించారు.కంపెనీలు తమ మార్కెటింగ్‌లో ఏఐను ఎలా ప్రదర్శించాలో జాగ్రత్తగా పరిశీలించాలని అధ్యయనం సూచిస్తుంది. మార్కెటర్లు ఫీచర్లు లేదా ప్రయోజనాలను వివరించడంపై దృష్టి పెట్టాలి. ఏఐ బజ్వర్డ్లను నివారించాలని సిసెక్ సలహా ఇచ్చారు. -
గ్రేటర్ హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు
వరుస ఎన్నికలు, ప్రభుత్వ మార్పు, భూమి విలువల సవరణ, కరువు ఛాయలు, ఆర్థిక మందగమనం, బ్యాంకు రుణవడ్డీ రేట్ల భారం.. వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై ముప్పేట దాడి జరుగుతోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పడిపోయాయి. గత ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలతో మొదలైన ప్రతికూల పరిస్థితి క్రమంగా తారస్థాయికి చేరింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత లేకపోయే సరికి పరిశ్రమ నిరాశలోకి జారిపోయింది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టత..సాధారణంగా ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే స్థిరాస్తి మార్కెట్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నగదు లభ్యత,లావాదేవీలపై పరిమితులు, వడ్డీ రేట్ల ప్రభావం, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం వంటివి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా.. ఇప్పటికీ విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత కొరవడింది. ఔటర్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, 111 జీవో రద్దు వంటి పలుకీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో తగ్గుదల..సాధారణంగా గ్రేటర్ పరిధిలో మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో 30,814 డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్కాగా.. రూ.758.13 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే సమయంలో రిజి్రస్టేషన్లు 30,111 డాక్యుమెంట్లకు, ఆదాయం రూ.731.15 కోట్లకు తగ్గాయి. అలాగే మేడ్చల్‌లో డాక్యుమెంట్లు 83,742 నుంచి 75,068కు, రంగారెడ్డిలో 1,18,072 నుంచి 1,13,570కు తగ్గాయి.లే–ఆఫ్‌లు, ధరల పెరుగుదలా కారణమే..గ్రేటర్లో గృహాలు, ఆఫీసు స్పేస్ వ్యాపారం ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు, ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతోపాటు ఐటీ రంగంలో లే–ఆఫ్‌లు జరుగుతున్నాయి. కంపెనీలు కూడా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇది ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ప్రభావం చూపడంతో.. గ్రేటర్లో స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా మారింది. మరోవైపు కరోనా తర్వాత సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో డెవలపర్లు అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు.రిజిస్ట్రేషన్లపై లెక్కలు చూస్తే..2022 జనవరి–జూన్ మధ్యలో గ్రేటర్లో మొత్తం 2,48,817 స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్కాగా.. రూ.4,108 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో 2,32,628 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ అయి.. ఆదాయం రూ.3,920 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 2,18,749కు పడిపోయాయి. అంటే 2022తో పోలిస్తే 30 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి.కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు..సాధారణంగా హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరడంతో మార్కెట్ ఎలా ఉంటుందోఅన్న సందేహాలు ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి స్థిరాస్తి రంగం బాగుంటుంది. – ఇంద్రసేనారెడ్డి, గిరిధారి హోమ్స్ ఎండీ -
అరకు కాఫీకి సలాం.!
సాక్షి, విశాఖపట్నం : ‘‘మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రథమ శ్రేణిలో ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు ఉంది. లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న జీసీసీ.. ఆదివాసీ రైతు సోదర,సోదరీమణుల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తోంది.ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరంలేదు..అద్భుతంగా ఉంటుంది. అరకు కాఫీకి ప్రపంచస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్ లో కూడా అరకువ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించింది. మీకు ఎప్పుడు వీలు దొరికినా అరకువ్యాలీ కాఫీ రుచిని ఆస్వాదించండి’’ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీలో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన మాటలివీ. ప్రధాని ప్రశంసల వెనుక కాఫీకి రుచి తీసుకొచ్చి.. ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో గత ఐదేళ్లలో అనేక కృషి సల్పింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.2014–19 కాలంలో రాష్ట్రంలోని ప్రతి విభాగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కీ అదే దుస్థితి పట్టించారు. ఇక కోలుకోలేదనుకున్న సంస్థకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది. జీసీసీనే నమ్ముకున్న గిరిజనుల జీవితాలకు కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఉత్పత్తుల కొనుగోలు దగ్గర నుంచి.. విక్రయాల వరకూ తిరుగులేని శక్తిగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోయింది. కాఫీ తోటలకు పునరుజ్జీవం పోశారు. ఫలితంగా చంద్రబాబు కాలంలో టర్నోవర్ కంటే.. ఈ ఐదేళ్లలో రెట్టింపు టర్నోవర్‌ని జీసీసీ సొంతం చేసుకుంది.తొలిసారిగా కాఫీతోటలకు సేంద్రీయ ధృవీకరణ లభించడంతో పాటు.. ఐదు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. త్వరలోనే విదేశాలకు కాఫీని సొంతంగా ఎగుమతి చేసేందుకూ సిద్ధమవుతోంది. 2014–15 నుంచి 2018–19 వరకూ రూ.1209 కోట్లు మాత్రమే ఉన్న జీసీసీ టర్నోవర్ ఒక్కసారిగా గేర్ మార్చింది. గత సీఎం వైఎస్ జగన్ జీసీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 2019–20 నుంచి 2023–24 మధ్య కాలంలో రెట్టింపై ఏకంగా టర్నోవర్ రూ.2,303 కోట్లకు చేరుకుంది.మేడిన్ ఆంధ్రా పేరుతో...ఓ వైపు అరకు కాఫీ టేస్టీగా ఉండటమే కాకుండా.. ఆర్గానిక్‌గా పండించడం వల్ల గిరాకీ సొంతం చేసుకుంది. అల్లూరి జిల్లాలో మొత్తం 2.27 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ఈ తోటల్లో ఏడాదికి 71, 258 మెట్రిక్ టన్నుల కాఫీపండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ప్రస్తుతానికి రెండు క్లస్టర్లలో 2,258.55 హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్నారు. చింతపల్లి క్లస్టర్ వరుసగా మూడో ఏడాది కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పీవోపీ) స్టాండర్డ్స్ సర్టిఫికెట్ తీసుకోగా.. జీకేవీధి క్లస్టర్ ఇప్పటికే రెండుసార్లు స్కోప్ సర్టిఫికెట్ దక్కించుకుంది. మూడో ఏడాదీ సేంద్రీయ సాగుకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం కాఫీ గింజల క్యూరింగ్, ప్రాసెసింగ్ అంతా బెంగళూరులోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీతో టై–అప్ కారణంగా కాఫీ ప్రాసెసింగ్ వ్యయం పెరుగుతూ వస్తోంది. డౌనూరులో క్యూరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2,27,021 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. మొత్తం 93,521 మంది గిరిజనులు కాఫీ సాగులో పాల్గొంటున్నారు, వీరిలో 2,600 మంది రైతులు టాప్ గ్రేడ్ రకాన్ని సాగు చేస్తున్నారు. వీరి వద్ద నుంచి సేకరించిన బీన్స్‌ని ఫిల్టర్ కాఫీ ఉత్పత్తి కోసం బెంగళూరుకు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉత్పత్తి, రిటైల్ మార్కెటింగ్ కోసం ఏలూరుకు పంపిస్తుంటారు. ఇకపై ఇక్కడి నుంచే చేసేలా క్యూరింగ్ వ్యవస్థ సిద్ధమవుతోంది. త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అరకు కాఫీ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి పంపించేందుకు అవకాశం ఉంది.తొలిసారిగా భారీగా ధరలు పెంపుగిరిజన రైతుల జీవనోపాధి, ఆదాయ స్థాయిల్ని కాఫీ తోటల పెంపకం ద్వారా మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాడేరు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో సుమారు లక్షకు పైగా ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. గిరిజనులు పండించిన కాఫీకి జీసీసీ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్నడూ లేని విధంగా గిరిజన రైతు పండించిన కాఫీని జీసీసీ భారీ మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పార్చ్మెంట్ కాఫీ కిలోకి రూ.285, చెర్రీ కాఫీ కిలోకి రూ.145 మార్కెట్ ధరగా ప్రకటించి కొనుగోలు చేయడంతో మధ్యవర్తుల దోపిడిని నిరోధించింది. 2023–24లో ఇప్పటి వరకూ 564.48 మెట్రిక్ టన్నుల ముడి కాఫీని రైతుల నుంచి జీసీసీ కొనుగోలు చేసి రూ.13.39 కోట్లు కాఫీ రైతు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసింది.2019–24 మధ్యలో అరకు కాఫీ ఎదిగిందిలా..⇒ 2018–19 కాలంలో రూ.799.58 లక్షల కాఫీ కొనుగోలు చేయగా.. 2023–24 నాటికి రూ.1339.05 లక్షల కాఫీ కొనుగోలు చేసింది.⇒ డౌనూరులో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ని స్థాపించేందుకు రూ.3 కోట్లుని ప్రభుత్వం మంజూరు చేయగా 2023 అక్టోబర్ 20న అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ⇒ కాఫీ తోటల నిర్వహణకు జీసీసీ ద్వారా గిరిజన రైతులకు ఏటా రూ.1.05 కోట్ల రుణాల్ని, వ్యవసాయ కార్యక్రమాల అమలుకు రూ.1.06 కోట్ల క్రెడిట్ రుణాల్ని పంపిణీ చేశారు.⇒ వివిధ నగరాలు, పట్టణాల్లో అరకు కాఫీ పేరుతో అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశారు. ⇒ దేశానికి వచ్చే వివిధ దేశాల అతిథులకు, రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు బహుమతులుగా అందించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులతో కూడిన కిట్స్ అందించారు.⇒ సేంద్రీయ పద్ధతుల్లో పండుతున్న కాఫీ ఘుమఘుమలకు విదేశీయులు ఫిదా అవుతోంది. విదేశీ విపణిలో పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇకపై సొంతంగా ఎగుమతులు చేపట్టాలని జీసీసీ భావిస్తోంది. ఇప్పటికే ఎక్స్పోర్ట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరిపారు.గిరిజనుల ఆర్ధిక సాధికారతకు ఊతమిస్తున్న అరకు కాఫీఅల్లూరి జిల్లాలో అరకు వ్యాలీ సాగు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం, జీసీసీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానినరేంద్ర మోడి మన్ కి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వంగా ఉంది. సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగానని చెప్పారు. ప్రధాని స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు, ప్రశంస గిరిజన కాఫీ రైతులకు, జీసీసీ సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి వున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, వర్గాల వారికీ ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. గిరిజనుల ఆర్ధిక సాధికారతకు అరకు కాఫీ ఎంతగానో ఊతమిస్తోంది. –జి. సురేష్ కుమార్, జీసీసీ ఉపాద్యక్షుడు, ఎండీ -
హైదరాబాద్‌కు ఢోకా లేదు కానీ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఇక, రియల్టీ పరుగులే తరువాయి. కాకపోతే, హైదరాబాద్ మార్కెట్ పరిస్థితులు వేరు. రాజకీయ స్థిరత్వం అనేది వినియోగదారులు, పెట్టుబడిదారులకు కీలకం. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు విశ్వాసాన్ని చూరగొనాలంటే వేగవంతంగా విధానపరమైన నిర్ణయాలతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, క్రయవిక్రయాలు పెరుగుతాయి.మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్బుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.హైదరాబాద్‌లోని భౌగోళిక వాతావరణం, వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ, విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌కు ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్‌లో గృహాల ధరలు, అద్దెలు, భూముల రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం వంటివి నగరానికి అదనపు అంశాలు. దీంతో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏమాత్రం అలసత్వం ఉండదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు ఢోకా ఉండదు.మార్కెట్లోకి మూడోతరం..జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని నివాసితుల రెండు, మూడోతరం వారసులు కూడా సిటీకి వస్తున్నారు. వీరికి ఆయా ప్రాంతాల్లో లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్‌లు దొరకడం కష్టం. దీంతో హైరైజ్, అల్ట్రాలగ్జరీ అపార్ట్మెంట్ల వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితి. అలాగే విదేశాల్లో స్థిరపడిపోయిన ప్రవాసులు తిరిగి స్థానిక ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి కొత్తతరం కస్టమర్లు వస్తున్నారు. వీరికి విదేశాల్లో తరహా ఆధునిక వసతులు, విస్తీర్ణమైన అపార్ట్మెంట్లు కావాలి. అందుకే చాలామంది గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు.కొందరు ఎన్నారైలు ఇప్పటికే స్థానికంగా ఉన్న స్థిరాస్తులను విక్రయించి, లగ్జరీ ప్రాపర్టీలకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. అలాగే ఇన్నాళ్లు భార్యా, భర్తలిద్దరి సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఇప్పుడు వారి పిల్లల సంపాదన కూడా తోడైంది. గత 3–4 ఏళ్లుగా ఈ మూడోతరం సంపాదనతో నగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పక్క రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొత్తగా స్థలాలు కొనే వారి కంటే ఉన్న భూమిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో నగరంలో ప్రాపర్టీ కొనేందుకే ఆసక్తి చూపిస్తారని దీంతో ప్రాపర్టీలకు మరింత డిమాండ్ ఉంటుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. -
కథర్నాక్.. స్టోరీ టెల్లింగ్ మంత్ర
‘కథలు చెప్పకు’ అని పేరెంట్స్‌తో, ఫ్రెండ్స్‌తో సుతిమెత్తని తిట్లు తినని వారు యూత్‌లో తక్కువగానే ఉంటారు. అయితే ప్రసిద్ధ బ్రాండ్స్ మాత్రం ‘కథలు చెప్పండి ప్లీజ్’ అంటూ యంగ్ టాలెంట్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రకటనలకు సంబంధించి ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. రకరకాల బ్రాండ్లకు సంబంధించి భావోద్వేగాలతో మిళితమైన యాడ్స్ యువ సృజనకారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అమూల్ బ్రాండ్ ‘అమూల్ గర్ల్’ ద్వారా సమకాలీన సంఘటనలతో కనెక్ట్ కావడానికి చేస్తున్న టాపికల్ యాడ్స్ పాపులర్ అయ్యాయి. నగల బ్రాండ్ ‘తనిష్క’ తమ వ్యాపార ప్రకటనల్లో ‘స్టోరీ టెల్లింగ్’ ఫార్మట్‌ను బలంగా ఉపయోగించుకుంటుంది. ఇక ‘లైఫ్‌బాయ్’ దగ్గరకు వస్తే... ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది ్ర పాడక్ట్ను ప్రమోట్ చేయడానికే కాదు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ విషయంలోనూ ఉపయోగపడుతుందనేది అర్థమవుతుంది. శాస్త్ర, సాంకేతిక విషయాలపై వినియోగదారుల్లో ఆసక్తి కలిగించడానికి, పెంచడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టేజ్డ్ విజువల్స్‌ను ఉపయోగించుకుంటుంది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్. బ్రాండ్లు విస్తృత స్థాయిలో కన్జ్యూమర్లతో కనెక్ట్ కావడానికి తమ ప్రాడక్ట్‌కు సంబంధించిన అడ్వర్టైజింగ్ విషయంలో భావోద్వేగాలతో కూడిన ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్‌ను కోరుకుంటున్నాయి. అడ్వర్టైజింగ్ ప్రపంచంలో స్ట్రాటజిక్ స్టోరీ టెల్లింగ్ అనేది కీలకంగా మారింది. ఈ పవర్ఫుల్ టూల్ బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. సర్వేల ప్రకారంప్రాడక్ట్లకు సంబంధించి సంప్రదాయ అడ్వర్టైజింగ్ల కంటే మిత్రుల మాటలనే విశ్వసిస్తోంది యువత. వారిలో నమ్మకం కలిగించాలంటే యాడ్ అనేది యూత్‌ఫుల్‌గా, మిత్రుడు కొత్త విషయం చెప్పినట్లుగా ఉండాలి. ఇందుకోసం బ్రాండ్స్ యువ స్టోరీ టెల్లర్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. వారి స్టోరీ టెల్లింగ్లోని తాజాదనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. థీమ్‌ను గుర్తించడం, సెంట్రల్ క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసుకోవడం, కస్టమర్ల హృదయాలను తాకేలా యాడ్‌ను తీర్చిదిద్దడం అనేవి స్టోరీ టెల్లింగ్‌లో కీలక విషయాలు. ఇలాంటి విషయాలలో యువ సృజనకారులు తమలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ డిజిటల్ శకంలో స్టోరీ టెల్లింగ్ అనేది కొత్త రూ పాలతో సృజనాత్మకంగా వికసిస్తోంది. వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), గేమింగ్ టెక్నాలజీ... మొదలైనవి స్టోరీ టెల్లింగ్‌లో కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. ‘స్టోరీ టెల్లింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బలమైన సాధనం. టార్గెట్ ఆడియెన్స్‌ను మెప్పించేలా స్టోరీ టెల్లింగ్ కోసం ఏ.ఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉనేది బలమైన భావోద్వేగాల సమ్మేళనం’ అంటున్నాడు ‘పోకో’ ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్. సినిమాల నుంచి ఇంటర్వ్యూల వరకు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు ప్రకటనలు ప్రత్యక్షమైతే చిరాగ్గా అనిపిస్తుంది. కోల్‌కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నివేదిత మాత్రం పనిగట్టుకొని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ను చూస్తుంటుంది. ‘ఒకప్పటి వ్యా పార ప్రకటనల్లో వారి బ్రాండ్‌కు సంబంధించిన గోల మాత్రమే ప్రధానంగా కనిపించేది. ఇప్పటి ప్రకటనల్లో మాత్రం ఇంటలెక్చువల్ ఫ్లేవర్, క్రియేటివిటీ కనిపిస్తోంది. వాటిని చూస్తుంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు కూడా రకరకాల ఐడియాలు వస్తుంటాయి’ అంటుంది నివేదిత. ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ వికాస్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో ‘నేను అయితే ఈ యాడ్‌ను ఇలా తీస్తాను’ అంటూ నోట్స్ రాసుకోవడం అలవాటు. ఒక్కముక్కలో చె΄్పాలంటే నివేదిత, వికాస్లాంటి యువ ఉత్సాహవంతులను బ్రాండ్స్ కోరుకుంటున్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతిభను నిరూపించుకుంటే ఇక వారికి తిరుగేలేదు. స్టోరీ టెల్లింగ్ మంత్ర యాడ్‌లో స్టోరీ టెల్లింగ్ ఫార్మట్ అనేది కంపెనీకి, కస్టమర్లకు మధ్య భావోద్వేగాలతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ.. ఎలా... ఎంత చెప్పాలో అంతే చెప్పాలనేది స్టోరీ టెల్లింగ్‌లో భాగం. మిస్ ఫైర్ అయితే మొదటికే మోసం వస్తుంది. ప్రకటనలకు సంబంధించి కొన్ని కంపెనీలు విఫలం కావడానికి కారణం... తమ ప్రాడక్ట్ గురించి తప్ప కన్జ్యూమర్ గురించి పట్టించుకోకపోవడం. అందుకే కన్జ్యూమర్‌ను హీరో చేసేలా స్టోరీ బిల్డ్ చేయాలి అనేది ముఖ్యమైన స్టోరీ టెల్లింగ్ మంత్ర. ‘ఫలానా యాడ్ ఎందుకు విఫలమైంది’ అనే విషయంలో యువ సృజనకారులు పోస్ట్‌మార్టం చేయడంతో పాటు ఒక యాడ్ సూపర్ డూపర్ హిట్ కావడంలోని కీలక అంశాలను ఔ పాసన పడుతున్నారు. ‘వాట్ మేక్స్ ఏ గ్రేట్ స్టోరీ’ అనే కోణంలో కస్టమర్ ఛాలెంజ్‌లను అధ్యయనం చేస్తున్నారు. -
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌ఎఫ్‌ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్‌తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్‌ఎఫ్‌ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్‌సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్‌పవర్‌గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్‌ఎఫ్‌ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్‌ఎఫ్‌ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్‌తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్‌సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
మీకు 18 ఏళ్లు నిండాయా? మోడీ ప్రభుత్వం 3 లక్షలు ఇస్తోంది
-
గిరిజన ఉపాధిలో వికాసం
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని వన్ ధన్ వికాస్ కేంద్రాలు(వీడీవీకే)లతో గిరిజన ఉపాధిలో వికాసం కనిపిస్తోంది. వీటి ఏర్పాటుతో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గిరిజనులు సేకరించిన ఫలసాయంతోపాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్‌తో అమ్మకాలు చేయిస్తోంది. గిరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా మలుస్తోంది. కొనుగోలుదారులకు సైతం ప్రయోజనాలను అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో వీడీవీకేలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆయా ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు. విక్రయిస్తున్న ఉత్పత్తులివీ.. అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన అటవీ ఫలసాయంతోపాటు వారు పండించిన ఉత్పత్తులు కూడా అందంగా ప్యాక్‌చేసి వీడీవీకేల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా తేనె, కాఫీ, పసుపు, మిరియాలు, రాజ్మా, రాగులు, రాగి పిండి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అడవి దుంపల నుంచి తీసిన పాలపిండి, జీడిపప్పు, నల్లజీడి పిక్కలు, మినుములు, చింతపండు, శీకాయ, శీకాయ పొడి, కుంకుడు, చీపుర్లు, అడ్డాకులతోపాటు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి, నువ్వులు, కారం, కరివేపాకు, మునగాకు పొడులు కూడా విక్రయిస్తుండటం విశేషం. రూ.61.63 కోట్లతో 415 వీడీవీకేలు రాష్ట్రంలో 2019–20 నుంచి 2021–22 వరకు గిరిజన సంక్షేమ శాఖ 415 వీడీవీకేలను ఏర్పాటు చేయించింది. ఇందుకోసం రూ.61.63 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.36.04 కోట్లు విడుదల చేశారు. గిరిజన మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేయించి.. వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన ఫలసాయాలకు వీటిద్వారా కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్నారు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్‌కు అనుగుణంగా వాటిని సిద్ధం చేయడం వంటి లక్ష్యాలు సాధించడంలో వీడీవీకేల ద్వారా చేస్తున్న ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకు వీడీవీకేల ద్వారా అందిస్తున్న తోడ్పాటు గిరిజన మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన వీడీవీకేలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. నెలకు రూ.25 వేలకు పైనే మిగులుతోంది గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి వీడీవీకే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం అందిస్తుంది. ఐటీడీఏ, డీఆర్డీఏ పర్యవేక్షణలో ఇవి గిరిజన ప్రాంతాల్లో వినూత్న సూపర్ మార్కెట్ల మాదిరిగా ఆదరణకు నోచుకుంటున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో నెలకు కనీసం రూ.లక్షకుపైగా విక్రయాలు జరిగితే పెట్టుబడి పోనూ రూ.25 వేలు లాభం మిగులుతోంది. గ్రూపు సభ్యులు లాబాల్లో వాటా పంచుకుని మెరుగైన జీవనం గడిపేందుకు వీడీవీకేలు దోహదం చేస్తున్నాయి. – జి.పైడమ్మ, వీడీవీకే నిర్వాహకురాలు, పాడేరు -
క్రెడో బ్రాండ్స్ @ రూ. 266–280
మఫ్టీ బ్రాండ్ జీన్స్ తయారీ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.96 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 266–280 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పురుషుల మధ్యస్థాయి ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ వేర్ దుస్తుల తయారీలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా 404 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్స్, 1,807 టచ్‌పాయింట్స్‌సహా 71 లార్జ్ ఫార్మాట్, 1332 మల్టీ బ్రాండ్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. గతేడాది(2022–23) ఆదాయం 46 శాతం ఎగసి రూ. 498 కోట్లను అధిగమించింది. నికర లాభం 117 శాతం దూసుకెళ్లి రూ. 77.5 కోట్లను తాకింది. -
ఢీ అంటే ఢీ ఆర్ట్ ఆఫ్ డీఇన్‌ఫ్లుయెన్సింగ్
‘ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూశారు. ఇక డీఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూసే టైమ్ వచ్చింది’... ఇది తెలుగు సినిమాలో మాస్ డైలాగ్ కాదు. సోషల్ మీడియాలో ఒక కుర్రాడు పెట్టిన కామెంట్.సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల హవా నడుస్తున్న కాలం ఇది. కస్టమర్లు ఏది కొనాలో, ఏ షో చూడాలో, ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో చెబుతున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్‌కు అడ్డుపడే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్ యువతరం నుంచే వచ్చి బలపడుతోంది. ట్రెడిషనల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ప్రాడక్ట్‌ను హైప్ చేస్తే డీఇన్ఫ్లుయెన్సర్లు ఆ హైప్‌ను ఛాలెంజ్ చేస్తున్నారు.... మార్కెటింగ్ డాటా అండ్ ఎనలిటిక్స్ కంపెనీ కంతార్ స్టడీ రిపోర్ట్ ప్రకారం వినియోగదారులపై ఇన్ఫ్లుయెన్సర్ల సిఫారసుల ప్రభావం తక్కువేమీ కాదు. సోషల్ మీడియాలో ఎటు చూసినా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపిస్తారు. టీ పోడుల నుంచి టీపాయ్‌ల వరకు రకరకాలప్రాడక్ట్స్ను ప్రమోట్ చేయడానికి చిన్నచిన్న క్యాచీ వీడియోలను రూపోందిస్తారు. దీనికి భిన్నంగా ఒక ప్రాడక్ట్‌ను విశ్లేషిస్తూ విమర్శిస్తే...అదే డీఇన్‌ఫ్లుయెన్సింగ్! ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో టిక్ టాక్‌లో ఈ ట్రెండ్ మొదలైంది.సోషల్ మీడియా ఎనాలటిక్స్ ఫర్మ్ ట్యూబ్లర్ ల్యాబ్స్ చెబుతున్నదాని ప్రకారం గత సంవత్సరం నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. మ్యాడి వెల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ప్రముఖ కాస్మటిక్ స్టోర్స్‌లో పని చేసింది. కొన్నిప్రోడక్ట్స్ పట్ల కస్టమర్లు ఎందుకు విముఖంగా ఉన్నారో తన స్వీయ అనుభవాలను తెలియజేసింది. ఈ ప్రభావంతో ఆమె పేరు ఇన్ఫ్లుయెన్సర్ల జాబితా నుంచి డీఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలోకి చేరింది. న్యూయార్క్‌కు చెందిన ఇరవై సంవత్సరాల క్లారా కొన్ని బ్రాండ్లను విమర్శిస్తూ వీడియోలు చేసింది. వాటిలో ఒకటి వైరల్‌గా మారింది. అదే సమయంలో తాను విమర్శించిన బ్రాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే భయం పట్టుకుంది. అయితే తనకు తానుగా ధైర్యం తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.‘నేను సరిౖయెన వివరాలతోనే వీడియో చేశాను. నేనెందుకు భయపడాలి’ అంటోంది క్లారా. మన సెలబ్రిటీ ఒకరు ఆరోగ్య సంబంధమైన విషయాలపై కాస్త లోతుగానే మాట్లాడాడు. అయితే ఆయన అవగాహన లోపాన్ని ఒక వైద్యుడు వెంటనే ఎత్తిచూపాడు. పాపులర్ చైనీస్ వ్లోగర్ ఒకరు తన వయసు తక్కువగా కనిపించేలా సాంకేతిక మాయ చేస్తే ఎవరో కుర్రాడు కనిపెట్టి ‘ఆయన అసలు రూపం ఇది’ అని చూపాడు. స్వీడన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫేక్ ట్రిప్ గురించి మరొక యువకుడు ‘ఇవి ఫొటోషాప్ చిత్రాలు’ అని నిజాన్ని బహిర్గతం చేశాడు. నిజానికి ఇలాంటివి సోషల్ మీడియాలో గతంలో లేవని కాదు. అయితే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ పుణ్యామా అని ‘అది కాదు ఇది’ అని వెంటనే సాధికార సమాచారంతో స్పందించే ధోరణి పెరిగింది.డీఇన్ఫ్లూయెన్సర్లు వోవర్–హైప్డ్ప్రాడక్ట్స్ను విమర్శించడమే కాదు చౌక ధరల్లో లభించే వాటి గురించి చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రోఫెసర్ అయిన అమెరికస్ రీడ్ ఇలా అంటున్నారు...‘ఇన్ఫ్లుయెన్సర్లలో ఎక్కువమంది సాధికారికంగా మాట్లాడడం లేదేమో అనే భావన కస్టమర్లలో వచ్చింది. డబ్బులు ఇస్తారు కాబట్టి సంబంధితప్రాడక్ట్ను ప్రమోట్ చేస్తారు. నిజానిజాల గురించి వారికి అవసరం లేదు. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో డీఇన్ఫ్లుయెన్సరే నయం అనుకుంటున్నారు. నిజానికి డీఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇన్ఫ్లుయెన్సరే’ కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఈ ట్రెండ్‌కు ‘యాంటీ క్యాపిటలిస్ట్’ ట్రెండ్‌గా నామకరణం చేశారు. డీఇన్‌ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ వల్ల వృథా ఖర్చులు తగ్గుతాయని, వేలం వెర్రికి అడ్డుకట్టపడుతుందని, పర్యావరణ కోణంలో కూడా ఈ ట్రెండ్ వల్ల మేలు జరుగుతుందని యువతరంలో ఎంతోమంది బలంగా వాదిస్తున్నారు. తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలలో ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి.డీఇన్ఫ్లుయెన్సింగ్కు విషయ సాధికారత, నిజాయితీ అనేవి కీలకం. అయితే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ రూపంలో సూడో–అథెంటిసిటీ ముందుకు వస్తుందని, ఈ ట్రెండ్‌ను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే విమర్శ ఉంది. ‘ఈ ట్రెండ్ కాస్త చివరికి ఎలా మారుతుందంటే ఇది కొనవద్దు. మీరు కొనాల్సింది అది అన్నట్లుగా!’ అంటుంది 26 సంవత్సరాల అమెరికన్ ఇన్ఫ్లు్లయెన్సర్ జెస్సిక. ‘ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పగానే కస్టమర్ల అభిప్రాయాలు రాత్రికి రాత్రి మారిపోవు. ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం సలహా ఇస్తారు. అంతే. ఏది కొనాలి, ఏది కొనకూడదు అనే స్వీయవిచక్షణ కస్టమర్లలో ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లుగా మేము పారదర్శకంగా, నిజాయితీగా ఉంటాం’ అంటుంది ఫ్రాన్స్‌కు చెందిన ఇన్ఫ్లున్సర్ కోలిన్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం డీఇన్‌ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ హెల్త్, ఫైనాన్స్, లైఫ్‌స్టైల్ విభాగాలలో ఎక్కువగా కనిపిస్తుంది.‘డీఇన్ఫ్లూయెన్సింగ్ అనేది వాపా బలుపా?’ అనేది పక్కన పెడితే ఈ ట్రెండ్ మూలంగా ఇన్ఫ్లుయెన్సర్లుప్రాఫిట్కు మాత్రమే కాదు మెరిట్‌కు కూడాప్రాధాన్యత ఇచ్చే ధోరణి, జవాబుదారీతనం పెరుగుతుంది. సమస్య ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అనుసరిస్తున్న ధోరణి. వారిలో మార్పు రావాలి. సామాజిక బాధ్యత పెరగాలి. యువతలో అశాంతి, ఆందోళన రేకెత్తించే కంటెంట్‌కు దూరంగా ఉండాలి.– హిమాద్రి పటేల్, డిజిటల్ క్రియేటర్ -
మార్కెట్ల ప్రవేశం, కస్టమర్లను కాపాడుకోవడమే కీలకం
న్యూఢిల్లీ: మార్కెట్లలోకి ప్రవేశించలేకపోవడం, కస్టమర్లను కాపాడుకోవడం, తమ ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేసుకోలేకపోవడం వంటి ప్రధాన సవాళ్లను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) ఎదుర్కొంటున్నాయి. మార్కెటింగ్‌కు సంబంధించి సవాళ్లు వాటి వృద్ధికి అవరోధంగా ఉంటున్నాయి. ఈ వివరాలను ‘కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్’(ఐసీఆర్ఐఈఆర్) సర్వే తెలిపింది. 2022 నవంబర్ 4 నుంచి 2023 జనవరి 20 మధ్య కాలంలో 2,007 ఎంఎస్ఎంఈల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకుంది. ఇందులో 65 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. 19 శాతం చిన్నవి కాగా, 16 శాతం మధ్య స్థాయి సంస్థలు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను విక్రయ మార్గాలుగా ఎంపిక చేసుకుంటున్న ఎంఎస్ఎంఈలు ప్రధానంగా యువ, విద్యావంతులైన వారి నిర్వహణలో ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. ఇతర ఎంఎస్ఎంఈలతో పోలిస్తే, ఎగుమతి ఆధారిత ఎంఎస్ఎంఈలలో అధిక శాతం ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమై ఉన్నాయి. ఎగుమతుల పట్ల అవగాహన కలిగిన సంస్థలు, ఈ కామర్స్ సేవల వినియోగానికి అనుకూలంగా ఉన్నట్టు ఇది తెలియజేస్తోంది. సమీకృత ఎంఎస్ఎంఈలు పనితీరు, టర్నోవర్, లాభదాయకత, ఉద్యోగ ప్రయోజనాల విషయంలో మెరుగ్గా ఉన్నట్టు ఐసీఆర్ఐఈఆర్ నివేదిక తెలిపింది. సదుపాయాల కొరత, రుణ సాయం లభించకపోవడం, నిపుణులైన కార్మిక శక్తి, ఆలస్యపు చెల్లింపులు ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ఇతర ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఈ కామర్స్‌తో అవకాశాల విస్తరణ.. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 1,005 ఇప్పటికే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమయ్యాయి. మిగిలిన 1,002 ఈ కామర్స్‌పై నమోదు కానివి. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం కావడం వల్ల కేవలం మార్కెట్ విస్తరణ అవకాశాలు పెరగడమే కాకుండా, రుణ సదుపాయానికి అవకాశం ఉంటుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. సమ్మిళిత వృద్ధికి ఎంఎస్ఎంఈలు కీలకమని పేర్కొంటూ.. అవి డిజిటల్‌గా పరివర్తనం చెందడం ఎంతో అవసరమని ఈ సర్వే ప్రస్తావించింది. ఈ కామర్స్ వేదికల ద్వారా మరిన్ని భౌగోళిక ప్రాంతాలకు విస్తరించే అవకాశాల పట్ల ఎంఎస్ఎంఈల్లో అవగాహన ఉన్నట్టు పేర్కొంది. ఎంఎస్ఎంఈలు టెక్నాలజీ సాయంతో మార్కెట్ అనుసంధానాన్ని పెంచుకునేందుకు, వాటికి ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు అవసరాన్ని ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర రుణ హామీ పథకం తదితర ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా, వాటి మధ్య స్థిరీకరణ అవసరమని ఎంఎస్ఎంఈలు అభిప్రాయపడ్డాయి. విధానపరమైన అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అసవరాన్ని కూడా ప్రస్తావించాయి. సమగ్ర ఎంఎస్ఎంఈ విధానం ఉండాలని, ఒకే వేదికగా అన్ని ప్రయోజనాలు పొందేలా అవకాశం కలి్పంచాలని పేర్కొన్నాయి. ఈ ప్రయోజనాల పట్ల ఎంఎస్ఎంఈల్లో అవగాహన కలి్పంచాలని కూడా అభిప్రాయపడ్డాయి. -
లోగో రీబ్రాండింగ్ చిక్కులు: మస్క్‌కు షాకిచ్చిన మార్కెటింగ్ ఏజెన్సీ
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్లో మరోసారి చిక్కుల్లోపడ్డాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ ఐకానిక్ ‘బర్డ్ లోగో’ను మార్చిదాని ప్లేస్‌లో ‘ఎక్స్’గా మారుస్తూ ఈ ఏడాది జూలైలో మాస్క్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మార్కెటింగ్ ఏజెన్సీ ఎక్స్ అనే కంపెనీ కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. ట్రేడ్‌మార్క్ , సర్వీస్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ట్విటర్ లోగో రీబ్రాండ్ తరువాత ఇలాంటి కోర్టు కేసును ఎదుర్కోవడం ఇదే తొలిసారి. (ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!) ఫ్లోరిడాకు చెందిన అడ్వర్టైజింగ్ , సోషల్ మీడియా సర్వీస్ కంపెనీ ఎక్స్ ..ట్విటర్ పేరు మార్పునకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ ట్రేడ్‌మార్క్ "X" గుర్తును ఉపయోగించి మార్కెటింగ్, విక్రయించడం లేదా పంపిణీ లాంటి వాటినుంచి ఎక్స్‌ను నిషేధించాలని కోరుతోంది. అంతేకాదు మస్క్ ఎక్స్ సేవలు, ప్రకటనలు తమ వినియోగదారులు గందరగోళానికి గురయ్యారని ఎక్స్ పేర్కొంది. తన నష్టాలకు లేదా ప్రతివాది లాభాలకు మూడు రెట్లు సమానమైన పరిహారాన్ని అందించాలని కోరింది. ఈ ప్రమాదాన్ని ముందేఊహించిన ట్రేడ్ మార్క్ నిపుణులు తాజా పరిణామంతో ఇప్పటికే లాభాలు క్షీణించి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న మస్క్‌కు మరింత దెబ్బేనని భావిస్తున్నారు. కాగా గతేడాది ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టాడు. భారతీయ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించడం, వేలాదిమంది ఇతర ఉద్యోగుల తొలగింపులు, ట్విటర్ సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు, కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు లాంటివి ఉన్నాయి. తాజాగా గేమ్ స్ట్రీమింగ్, ప్లాట్‌ఫారమ్‌ని సరిచేయడానికి లైవ్ షాపింగ్ ఫీచర్‌పై పని చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ది అడ్వర్టైజింగ్ క్లబ్ చైర్మన్‌గా రానా బారువా
అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా పరిశ్రమకు చెందిన అపెక్స్ బాడీ అడ్వర్టైజింగ్ క్లబ్ నూతన మేనేజింగ్ కమిటీని ప్రకటించింది. తమ 69వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2023-2034 సంవత్సరానికి సంబంధించి హవాస్ ఇండియా గ్రూప్ సీఈవో రానా బారువాను అధ్యక్షునిగా నియమించింది. మాజీ అధ్యక్షుడు పార్థ సిన్హా మేనేజింగ్ కమిటీ సభ్యునిగా కొనసాగనున్నట్లు అడ్వర్టైజింగ్ క్లబ్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. తన నియామకం గురించి.. రానా బారువా మాట్లాడుతూ, “దాదాపు 70 చరిత్ర కలిగిన సంస్థ ది యాడ్ క్లబ్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కొత్త తరం, ఔత్సాహికులకు మెరుగైన సేవలు అందిచాలనేది తమ లక్ష్యమని.. ఇందుకోసం వివిధ రంగాల్లో వైవిధ్యమైన లీడర్స్ అపరిమిత అవకాశాల్ని, సేవల్ని అందించేందుకు తమ ఉత్తమమైన మేనేజ్మెంట్ టీమ్‌తో కలిసి ముందుకెళ్తామన్నారు. ఇండస్ట్రీలోని కొత్త ప్రతిభను ఆకర్షించడానికి, మహిళా సాధికారతకు, భవిష్యత్తు నాయకులను ప్రోత్సహించడం, వైవిధ్యాన్ని అభివృద్ధి చేయడం, ఈక్విటీ, చేరికలను పెంచేందుకు ప్రగతిశీల పొత్తులు, సంభాషణలను ప్రోత్సహించడానికి తామంతా కలిసి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి కట్టబడి ఉంటామని చెప్పారు. అడ్వర్టైజింగ్ క్లబ్ ఆఫీస్ బేరర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు ► రానా బారువా - అధ్యక్షుడు ►ధీరజ్ సిన్హా - ఉపాధ్యక్షుడు ►డాక్టర్ భాస్కర్ దాస్ - కార్యదర్శి ►శశి సిన్హా - జాయింట్ కార్యదర్శి ►మిత్రజిత్ భట్టాచార్య - కోశాధికారి మేనేజింగ్ కమిటీ సభ్యులు ►అవినాష్ కౌల్ ►మాల్కం రాఫెల్ ►ప్రశాంత్ కుమార్ ►పునీత ఆరుముగం ►శుభ్రాంశు సింగ్ ►సోనియా హురియా ► సుబ్రహ్మణ్యేశ్వర సమయం కో-ఆప్టెడ్ పరిశ్రమ నిపుణులు ►అజయ్ కాకర్ ►ప్రదీప్ ద్వివేది ►విక్రమ్ సఖుజా డ్వర్టైజింగ్ క్లబ్‌ను మరింత ముందుకు నడిపేందుకు ప్రతిభ నైపుణ్యం, సంబంధిత విభాగాల్లో లోతైన అనుభవం ఆధారంగా ఎంపికైన మరికొంత మంది వ్యక్తులు ► అజయ్ చాంద్వానీ ► అలోక్ లాల్ ► అనూషా శెట్టి ► లులు రాఘవన్ ► మన్షా టాండన్ ►నిషా నారాయణన్ ►రాజ్ నాయక్ ►సత్యనారాయణ రాఘవన్ ►వికాస్ ఖంచందాని -
ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను సేకరిస్తాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్ సంస్థ సిద్ధంగా ఉందని అమూల్ ఆర్గానిక్స్ బిజినెస్ హెడ్ నిమిత్ దోషి వెల్లడించారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కలిగిన రైతుల నుంచి మార్కెట్ ధరపై నిర్దేశించిన ప్రీమియం ధరతో వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తూ.. వారికి తగిన గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ అనుబంధశాఖల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో అమూల్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. అమూల్ ఆర్గానిక్స్ ద్వారా ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. నిమిత్ దోషి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం ఐదేళ్ల ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మ, శనగపిండి తదితర ఉత్పత్తులను ప్రీమియం ధరలకు రైతుల నుంచి సేకరించి, ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు. భవిష్యత్‌లో విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. నేషనల్ కో–ఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్‌లో చేరితే విస్తృతస్థాయి మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చు కోవచ్చునన్నారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వీరు పండించిన ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీ ప్రక్రియను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారిలో మహిళలే అత్యధికమని తెలిపారు. తొలి దశలో ఆర్గానిక్ సర్టిఫికెట్ కలిగిన గిరిజన ప్రాంతాలలోని రైతుల నుంచి రాజ్మ సేకరించాలని సూచించారు. మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, రైతు బజార్ సీఈవో నందకిషోర్, నాబార్డు ఏజీఎం ఎం.చావ్సాల్కర్ పాల్గొన్నారు. -
‘అమూల్’.. ఆర్గానిక్
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ సంస్థ తాజాగా రైతన్నలు పండించే ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు చేయూత అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన, రైతు సాధికారత సంస్థ అధికారులతో అమూల్ ప్రతినిధులు బుధవారం సమావేశం కానున్నారు. విస్తృత మార్కెటింగ్ రాష్ట్రంలో ప్రస్తుతం 8.82 లక్షల ఎకరాల్లో 8 లక్షల మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్దఎత్తున మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది. రైతుబజార్లలో ప్రత్యేకంగా స్టాల్స్ కేటాయించడంతోపాటు కలెక్టరేట్ ప్రాంగణాలు.. సచివాలయాలు, ఆర్బీకేలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో వీక్లీ మార్కెట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చిన అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి అయ్యే పంట దిగుబడుల్లో 30 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మరో రూ.1,100 కోట్ల విలువైన 1.42 లక్షల టన్నుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్యను అధిగమించేందుకు మంత్ర, సహజ ఆహారం, రిలయన్స్ రిటైల్, బిగ్ బాస్కెట్ ఇతర కంపెనీల భాగస్వామ్యంతో రైతు సాధికార సంస్థ ముందుకెళ్తోంది. మరోవైపు టీటీడీ దేవస్థానానికి 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో కనీసం రూ.5 వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 10 – 15 శాతం ప్రీమియం ధరకు సేకరణ ఈ ఏడాది 1,29,169 ఎకరాల్లో వరి, వేరుశనగ, జీడిమామిడి, మొక్కజొన్న, బెల్లం, కాఫీ, పసుపు సహా 12 రకాల ఉత్పత్తులు సాగవుతుండగా 2,03,640 టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. రైతు సాధికార సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఎమ్మెస్పీకి మించి మార్కెట్లో పలికిన ధరలకు అదనంగా 15 శాతం, ఒకవేళ మార్కెట్ ధరలు ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉంటే ఎమ్మెస్పీకి అదనంగా 10 శాతం ప్రీమియం ధరతో రైతుల నుంచి టీటీడీ సేకరిస్తోంది. అదే రీతిలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందిన రైతులు ఉత్పత్తి చేసిన పంట ఉత్పత్తులను అమూల్ సంస్థ సేకరించి మార్కెటింగ్ చేయనుంది. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మా, శనగపిండి లాంటి వాటిని రైతుల నుంచి ప్రీమియం ధరలకు సేకరించి ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్లోకి తీసుకురానుంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అమూల్ ఆర్గానిక్స్ అధ్యయనం చేస్తోంది. గుజరాత్ నుంచి వచ్చిన అమూల్ బిజినెస్ హెడ్ దోషి, బ్రాండ్ మేనేజర్ స్నేహ కమ్లాని నేతృత్వంలోని అమూల్ ఆర్గానిక్స్ ప్రతినిధి బృందం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించింది. ప్రకృతి సాగు చేసే మహిళా రైతులతో సమావేశమైంది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాల్మిల్ కమ్ బల్క్ స్టోరేజ్ పాయింట్, ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించింది. ప్రకృతి, సేంద్రీయ సాగుకు ఊతం ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఇది చరిత్రాత్మక ముందడుగు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ అదే రీతిలో ప్రకృతి సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ముందుకు రావడం శుభ పరిణామం. ఇది రాష్ట్రంలో ప్రకృతి, సేంద్రీయ సాగుకు మరింత ఊతమిస్తుంది. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ మార్కెటింగ్‌కు తోడ్పాటు అందిస్తాం తెనాలి: పాడి పరిశ్రమ రంగంలో దేశంలో అగ్రగామిగా ఉన్న అమూల్ తాజాగా ఆర్గానిక్ రంగంలోకి ప్రవేశించిందని సంస్థ ఆర్గానిక్ హెడ్ నిమిత్ దోషి చెప్పారు. ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు తోడ్పాటునందిస్తామని తెలిపారు. అమూల్ సంస్థ మేనేజర్ స్నేహతో కలిసి మంగళవారం గుంటూరు జిల్లా కొల్లిపరలోని శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని నిమిత్ సందర్శించారు. కంపెనీ ఆధ్వర్యంలో పండించిన పంటలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను పరిశీలించారు. 100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు శ్రేష్ట డైరెక్టర్ ఉయ్యూరు సాంబిరెడ్డి తెలిపారు. ఎన్జీవోలు, ఇతర సంస్థలతో కలసి భూమి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పరిమిత వ్యయంతో సాగు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ విభాగం ప్రతినిధి ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ రాజకుమారి, శ్రేష్ట డైరెక్టర్లు నెర్ల కుటుంబరెడ్డి, బొంతు గోపాలరెడ్డి, రైతు సాధికార సంస్థ రీజినల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకట్రావు, విజయ్, ప్రవల్లిక, భానుమతి తదితరులు పాల్గొన్నారు. -
జీడీపీలో వ్యవసాయం వాటా మరింత పెరగాలి
న్యూఢిల్లీ: దేశ జీడీపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరగాల్సి ఉందని, మార్కెటింగ్‌ను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైతులు, తయారీదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) కీలకపాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలను అనుసరించడం మొదలు పెడితే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందన్నారు. ఈ దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), ఎఫ్‌పీవోలు సాయంగా నిలుస్తాయన్నారు. ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్‌లు హైబ్రిడ్ నమూనాలో కలసి పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా 11,770 ఎఫ్‌పీవోలు ఒప్పందం ద్వారా పీఏసీఎస్‌తో అనుసంధానం కావాలని కోరారు. దీనికింద పీఏసీఎస్‌లకు ఎఫ్‌పీవోలు సేవలు అందించాలని సూచించారు. ‘‘తయారీ ద్వారా జీడీపీ వృద్ధి చెందితే ఉపాధి కల్పన భారీగా ఉండదు. అదే వ్యవసాయం, అనుబంధ రంగాలు వృద్ధి చెందిదే జీడీపీకే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అనుకూలిస్తుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అత్యధికంగా జీడీపీకి 17.5–18 శాతం వాటా సమకూరుస్తున్నాయి. కానీ, ఇతర రంగాల్లోని వారితో పోలిస్తే రైతుల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఇతర రంగాల్లో మాదిరే రైతుల పరిస్థితులు మెరుగు పడాలంటే అందుకు ఎఫ్‌పీవోలను ఆమోదించాలి’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. ఎఫ్‌పీవోల్లో రైతులు, తయారీదారులు (ఉత్పత్తిదారులు) భాగంగా ఉంటారు. వీరు చిన్న, సన్నకార రైతులకు సాగు, ముడి సరుకులు, సాంకేతిక సేవలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సహా అన్ని రకాల సేవలు అందిస్తుంటారు. మరిన్ని ఎఫ్‌పీవోలు ఇప్పటికే 11,770 ఎఫ్‌పీవోలు ఉండగా, 2027–28 నాటికి మరో 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకార రైతులే ఉన్నందున వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలు అవసరమని సూచించారు. ‘‘ఎఫ్‌పీవోల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. కానీ, సహకార రంగంలో ఎఫ్‌పీవోలు, వాటి వల్ల ప్రయోజనాలు పరిమిత స్థాయికే చేరుకున్నాయి. పీఏసీఎస్‌ల ద్వారా 1,100 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయించాం’’అని అమిత్‌షా తెలిపారు. వ్యవసాయ మౌలిక నిధికి మద్దతుగా నిలవాలి బ్యాంక్‌లను కోరిన వ్యవసాయ శాఖ వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి (రూ.లక్ష కోట్లు)కి ప్రోత్సాహంగా నిలవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది. సాగు రంగంలో మౌలిక వసతులు కల్పించేందుకు ఇది తప్పనిసరి అవసరంగా పేర్కొంది. సాగు అనంతరం నిల్వ వసతుల నిర్వహణ, కమ్యూనిటీ సాగు తదితర చర్యల కోసం 2020 జూలై 8న కేంద్ర సర్కారు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనా నిధి (ఏఐఎఫ్)ని ప్రారంభించింది. ఈ పథకం కింద 2025–26 నాటికి రూ.లక్ష కోట్లను బ్యాంక్‌లు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇది వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ఇందుకోసం కొత్త ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రారంభించారు. ‘‘నెల రోజుల పాటు (ఆగస్ట్ 15 వరకు) ఇది కొనసాగుతుంది. ఈ కాలంలో రూ. 7,200 కోట్లను మంజూరు చేయాలి. ఈ వీడి యో కాన్ఫరెన్స్ సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాంతీయ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోపరేటివ్ బ్యాంక్‌ల ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు’’అని అహుజా తెలిపారు. దేశంలో వ్యవసాయ మౌలిక ప్రాజెక్టులకు గణనీయమైన అవకాశాలున్నాయని చెప్పారు. -
14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం
తక్కువ కాలంలో మంచి నికరాదాయం పొందాలనుకుంటే సీమ పందుల పెంపకం చేపట్టడం ఒక్కటే మార్గం అంటున్నారు యువ మహిళా రైతు రాచెల్లి అనూష. తెలంగాణ రాష్ట్రం జిల్లా కేంద్రం సిద్దిపేటకు 12 కిలో మీటర్ల దూరంలోని మల్యాలకు చెందిన అనూష సీమ పందులను పెంచుతూ చక్కటి ఆదాయాన్ని గడిస్తున్నారు. పట్టభద్రురాలైన అనూష తన భర్త మల్లేశం ప్రోత్సాహంతో తన నాలుగు ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం నుంచి స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాల పాలయ్యారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, నాటుకోళ్లు, కంజు పిట్టలు, కుందేళ్లు, కొర్రమీను చేపలు.. ఏవి పెంచినా కలిసిరాలేదు. మూడేళ్లు తిప్పలు పడిన తర్వాత వెటర్నరీ కళాశాలకు చెందిన నిపుణులు డా. ప్రసాద్, డా. విద్య సలహా మేరకు సీమ పందుల ఫాంను ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందుతున్నారు. పందులు పెంచటం ఏమిటని బంధువులు వారించినా పట్టించుకోకుండా భర్త సహకారంతో 2020 మార్చిలో 14 సీమ పందులను కొని తెచ్చుకొని పెంపకం ప్రారంభించారు. లార్ట్ వైట్ యార్క్ షేర్, ల్యాండ్రెస్, డ్యూరార్, లార్జ్ బ్లాక్ యార్క్ షేర్ వంటి సంకర జాతి పందులను ఆమె పెంచుతున్నారు. ఫాంలో ఇప్పుడు వాటి సంఖ్య 150కి పెరిగింది. ఫాం సమీపంలోనే ఇంటిని నిర్మించుకొని నిరంతరం తానే స్వయంగా అన్ని పనులూ చేసుకోవటం ద్వారా అనూష చక్కటి ఫలితాలు పొందుతున్నారు. మార్కెటింగ్ సమస్య లేదని అంటూ.. కర్ణాటక, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి సీమ పందులను కొనుక్కెళ్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి రైతులు వచ్చి ఫాంను చూసి, పిల్లలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారన్నారు. వారానికో రోజు పంది మాంసాన్ని కిలో రూ. 280 చొప్పున ఫాం దగ్గరే విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ సమస్య లేదు! సీమ పందులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. పోటీ తక్కువ. శ్రమ తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ సమస్య లేదు. ఒక ఎకరం భూమి సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో రెండు పందులను పెంచితే అంతే ఆదాయం వస్తుంది. దాణా, గడ్డి రోజుకు రెండు సార్లు వేయాలి. ఎప్పుడైనా వీలుకాకపోతే సాయంత్రం వేయకపోయినా పర్వాలేదు. 200 పందులను ఒక్కరే చూసుకోవచ్చు. పందులను సాదుకుంటూ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. – రాచెల్లి అనూష, యువ రైతు 75 రోజుల్లో 20 కేజీలు కోతకు అమ్మే పందులను, బ్రీడింగ్ కోసం అమ్మే పందులను ప్రత్యేక షెడ్లు వేసి వేర్వేరుగా పెంచుతున్నారు. పంది పిల్ల 75 రోజుల్లో 20 కేజీల బరువు పెరుగుతుందని అనూష వివరించారు. బ్రీడింగ్ కోసం 20 కేజీల బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. మాంసం కోసం కోతకైతే సుమారుగా 80 కిలోలకు పైగా బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. బ్రీడింగ్ పందులకు గడ్డితో పాటు రెండు పూటలా దాణా పెడుతున్నారు. కోతకు వెళ్లే పందులకు హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని కూడా మేపుతున్నారు. పశు వైద్యుడు డా. అభిలాష్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అనేక వ్యాక్సిన్లతోపాటు, ఇతర ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇస్తూ నాణ్యమైన మేతను అందిస్తే సీమపందుల పెంపకం సులభమేనని అంటారు అనూష భర్త మల్లేశం (97044 99873). – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ; ఫోటోలు: కె. సతీష్ కుమార్ (చదవండి: సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం) -
ఉద్యానం.. మరింత విస్తారం
సాక్షి, విశాఖపట్నం: ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని విస్తృతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రైతులకు రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో ఉద్యాన విస్తరణ పథకం కింది ఏటా కొంతమేర దీనిని విస్తరించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నం జిల్లాలో 10,328 ఎకరాల ఉద్యాన పంటల విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది అదనంగా మరో 180 ఎకరాల్లో ఈ పంటలను విస్తరించాలని జిల్లా ఉద్యానశాఖ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రక్రియను ఉద్యానశాఖ అధికారులు చేపట్టారు. ఉద్యాన విస్తరణ పథకం కింద డ్రాగన్ ఫ్రూట్, టిష్యూ కల్చర్ అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర పంటలు సాగు చేస్తారు. వీటితో పాటు జిల్లాలో మరో 500 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకంలో సాగు చేసే పంటలకు ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. మొక్కలు, ఎరువులతో పాటు సాగుకు అవసరమైన పనిముట్లకు కూడా యూనిట్ ధరను బట్టి గరిష్టంగా 50 శాతం వరకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఆర్బీకే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యాన సాగు పెంపు ఆవశ్యకత, అధిక దిగుబడులనిచ్చే వంగడాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర అంశాలను రైతులకు వివరిస్తున్నారు. అదే సమయంలో వీటికి అర్హులైన రైతులను గుర్తింపు ప్రక్రియను కూడా మొదలు పెట్టారు. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం అవసరమైన నర్సరీలను కూడా ఎంపిక చేసి మొక్కలను పంపిణీ చేస్తారు. ఉద్యాన పంటల విస్తరణకు నీటి పారుదల, డ్రిప్, స్పింక్లర్లు వంటి సదుపాయాలు కలిగి ఉండాలి. మరోవైపు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో మొక్కలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఇందుకు అవసరమయ్యే కూలీలను కూడా ఈ పథకంలో సమకూరుస్తారు. ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు చేకూర్చనుంది. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం రైతులు పండించిన ఈ ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. ఈ ఉత్పత్తులను రైతు బజార్లలో విక్రయించేలా మార్కెటింగ్ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఈ రైతులకు కార్డులను జారీ చేస్తాం. ఉద్యాన పంటల నాణ్యత, దిగుబడులు పెంచడం, రైతులకు మంచి ధర గిట్టుబాటు అయ్యేలా చూడడం వంటివి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. – మన్మధరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, విశాఖపట్నం -
రూ.2 వేల వాచీ.. రూ.59 వేలకు విక్రయం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన అగ్నిప్రమాదం క్యూ–నెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) సంస్థ అక్రమ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురూ దీని ఉద్యోగులే. ఈ ఘటనపై నమోదైన కేసులను దర్యాప్తు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు.. ఈ సంస్థ సౌత్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ గుమ్మడిల్లి రాజేశ్ అలియాస్ రాజేశ్ ఖన్నాను బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ సంస్థ ఎంఎల్ఎం పేరిట తక్కువ ఖరీదైన వస్తువులను అత్యంత ఎక్కువ రేటుకు అమ్ముతోందని.. రూ.2 వేల వాచీని రూ.59 వేలకు విక్రయించినట్టు ఆధారాలు సేకరించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కేసులు నమోదవడంతో పేరు మార్చి.. హాంకాంగ్ కేంద్రంగా ఎంఎల్ఎం దందా చేస్తున్న క్యూ–నెట్‌పై అనేక కేసులు నమోదవడంతో.. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘వీ–ఎంపైర్’ పేర్లతో మళ్లీ దందా ప్రారంభించింది. ఈ సంస్థలో టెలీకాలర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ప్రమోటర్స్, టీమ్ లీడర్లుగా చాలామంది పనిచేస్తున్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 511లో దీని కార్యాలయం ఉంది. రాజేశ్ ఖన్నా, ఉపేందర్‌రెడ్డి, శివనాగ మల్లయ్య, కటకం మల్లేశ్, నాగమణి సహా 12 మంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించవచ్చంటూ ఎరవేయడం.. ఇప్పటికే ‘వీ–ఎంపైర్’లో చేరినవారు నెలకు రూ.50వేల నుంచి రూ.1.5లక్షల దాకా సంపాదిస్తున్నారని అమాయకులకు ఎర వేస్తున్నారు. మూడు కోట్లు వసూలు చేసి.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసు బృందం.. ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే 159 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్టు గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంకా ఎంతో మంది బాధితులు ఉంటారని పోలీసులు తెలిపారు. రాజేశ్ ఖన్నా వద్ద లభించిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్ల నగదును ఫ్రీజ్ చేశామని.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. -
‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది(2023–24) 1,66,736 హెక్టార్లలో చిరుధాన్యాలు పండించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థి క ఏడాదితో పోల్చితే ఇది 39,365 హెక్టార్లు అధికం. అలాగే గత ఆర్థిక ఏడాది 3.22 లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి చేయగా.. ఈసారి 4.11 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం, వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రజలు ఆహారంగా తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. జిల్లాల వారీగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం లక్ష్యాలను నిర్ధారించారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సీఎస్ ఆదేశించారు. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద.. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 160 చిరుధాన్యాల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే వారికి తగిన విధంగా ప్రోత్సాహకాలను అందించాలన్నారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చిరుధాన్యాల స్టాల్స్ ఏర్పాటు చేసి ఆయా ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆదేశించారు. మహిళా మార్టుల్లోనూ వీటిని విక్రయించాలని సూచించారు. చిరుధాన్యాలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీస మద్దతు ధరను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అనేక జబ్బులకు చిరుధాన్యాలతో చెక్ జొన్నలు, సజ్జలు, రాగులు తదితరాల్లో పిండి పదార్థాలు ఎక్కువ. ఇవి దైనందిన అవసరాలకు సరిపడా 70 నుంచి 80 శాతం శక్తిని అందిస్తాయి. నిత్యం వీటిని ఆహారంగా వినియోగిస్తే గుండె జబ్బులు, షుగర్, బీపీ తదితర జబ్బులు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉండటంతో.. మూత్ర రోగాలను అరికట్టడంతో పాటు దేహపుష్టిని కలుగజేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను వినియోగించాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. -
తోపుడు బండి మీద సమోసాలు అమ్మి.. రోజుకు రూ.12 లక్షలు సంపాదిస్తున్న క్యూట్ కపుల్!
Ghar, Padosi, Bacche Hi Rishtedar Ek Samosa Toh Banta Hai Yaar నవ్వొస్తుంది కదా. బట్ ఇదే ట్యాగ్ లైన్‌తో సమోసా సింగ్ అనే కంపెనీ మొత్తం మార్కెట్‌నే క్యాప్చర్ చేస్తోంది. ఇప్పటికే వందల కోట్ల సమోసా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. భవిష్యత్‌లో ప్రపంచ దేశాల్లో సైతం సమోసాలు అమ్మి వేలకోట్ల టర్నోవర్ సాధించేలా ప్రణాళికలు రచిస్తుంది. తోపుడు బండి మీద సమోసాలు అమ్మిన నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్..వందల కోట్ల వ్యాపారంగా ఎలా తీర్చిదిద్దారు. పూలమ్మిన చోటే కట్టెలమ్మే అనే సామెతను తిరగరాసిన ఈ దంపతులిద్దరూ సమోసాలు ఎందుకు అమ్మాలనుకున్నారో తెలుసుకుందాం పదండి. కరణ్ జోహార్ సినిమా తరహాలో రియల్ లైఫ్‌లో హీరో శిఖర్ వీర్ సింగ్, హీరోయిన్ నిధి సింగ్ బ్యాచిలర్ బయోటెక్నాలజీ డిగ్రీని పూర్తి చేసేందుకు 2004లో థానేలోని కురకేత్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే? రీల్ లైఫ్ తరహాలో రియల్ లైఫ్‌లో శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్‌లు స్నేహితులు కాస్త ప్రేమికులుగా మారారు. అలా అని చదువును ఆటకెక్కించలేదు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం నిధి బయోటెక్నాలజీ చదవనైతే చదివింది కానీ మనసంతా మార్కెటింగ్ వైపే మళ్లింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా థానే నుంచి ఢిల్లీకి పయనమైంది. ఢిల్లీలో అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో జాయిన్ అయింది. లైఫ్ సైన్సెస్ అమితంగా ఇష్టపడే శిఖర్ మాస్టర్స్ చేసేందుకు ఉన్నత చదువుల కోసం థానే నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. లైఫ్ సైన్సెస్ చదివే సమయంలో శిఖర్ ఫాస్ట్ ఫుడ్ తరహాలో స్నాక్ ఐటమ్స్ అమ్మకాల్లో శుభ్రత లేకపోవడాన్ని గమనించాడు. అన్నీ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలలో పిజ్జాలు, బర్గర్లను అమ్మితే.. అదే ఇండియన్ స్నాక్స్, సావీరస్ (సాల్టీగా-స్పైసీగా) ను వీధుల్లో అమ్మడాన్ని గమనించాడు. సమోసాలు అమ్ముదాం నిధి అదిగో అప్పుడే శిఖర్‌కు దిగ్గజ రెస్టారెంట్లకు పోటీగా సమోసా వ్యాపారం చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. తన ఐడియాను నిధికి షేర్ చేశాడు. వ్యాపార మెళుకువలు తెలియని శిఖర్.. కియోస్కోలో సమోసా అమ్మితే ఎలా ఉంటుందని నిధికి తన మనసులో మాట చెప్పాడు. శిఖర్ 2009లో సైంటిస్ట్‌గా బయోకాన్ కంపెనీలో చేరాడు. కొంత కాలానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి, నచ్చిన జీతం ఇంతకంటే ఏం కావాలి? కానీ వాళ్లు అలా అనుకోలేదు. ఉద్యోగాల నిమిత్తం దేశాలు పట్టుకొని తిరిగినప్పటికీ సమోసా వ్యాపారం చేయాలన్న ఆశ పోలేదు. ఇంకా రెట్టింపు అయ్యింది. వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. శుభ్రత (hygiene)తో పాటు సమోసాను వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. జాబ్‌కు రిజైన్ చేసి సంవత్సరాలు గడిచాయి. చివరికి 2015 అక్టోబర్ నెలలో బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. బిజినెస్ కోసం ఎవరు ఏం చేయాలో డిసైడ్ అయ్యారు. అందుకు నిధి అమోదం తెలపడంతో తన స్టార్టప్ ప్రయత్నాల్ని ప్రారంభించాడు శిఖర్. అక్టోబర్ 13, 2015లో శిఖర్ తాను చేస్తున్న జాబ్‌కు రిజైన్ చేశాడు. నిధి తాను కూడా జాబ్‌కు రిజైన్ చేస్తానంటే కంపెనీ ఒప్పుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ స్టార్టప్ ప్రారంభించుకోమని ఆఫర్ ఇచ్చింది. వెంటనే వాళ్లిద్దరూ కలిసి రెండు చిన్న కిచెన్ రూమ్‌లు అద్దెకు తీసుకున్నారు. వంట చేసే వాళ్లను నియమించుకున్నారు. పరిశోధన- అభివృద్ధి (Research and Development)లో నిమగ్నమయ్యారు. నాలుగు నెలల కష్టం 4 నెలల పాటు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని వినూత్నంగా పలు షేపుల్లో సమోసాను తయారు చేశాడు శిఖర్. బిజినెస్ ప్రారంభించాలన్న తమ ప్రయత్నాల్లో ఎట్టకేలకు మరో అడుగు ముందుకు వేశారు. ఆర్ అండ్ డీలో రకరకాల రుచులతో సమోసాలు వేయించాలి. కాల్చకూడదు, జిడ్డు లేకుండా ఆరోగ్యం ఉండాలన్న ఆలోచన శిఖర్ బయోటెక్ అనుభవం నేర్పిచ్చింది. రకరకాల ఫ్లేవర్లతో ప్రత్యేకంగా తయారు చేసిన పిండితో సమోసాపై భాగంగా గట్టిగా ఉండేలా చూసుకున్నారు. అలా సంప్రదాయ సమోసా షేప్ కంటే వీళ్లు తయారు చేసిన సమోసా చూడటానికి బాగుంది. సమోసా ఆకారం ఇలా ఉండడం (కింద ఇమేజ్‌లో చూపించినట్లుగా) వల్ల నూనెను పీల్చుకోదని తెలిపారు. చికెన్ మఖానీ (బటర్ చికెన్), కడాయి పనీర్ నుండి చాక్లెట్ వరకు రకరకాల రుచుల్లో సమోసాలు అందించేందుకు సిద్ధమయ్యారు. సమోసా సింగ్ పేరు భలే ఉందే అమ్మేందుకు సమోసా సిద్ధమైంది. ప్రొడక్ట్ ఉంటే సరిపోదు కదా. దానికంటూ పేరుండాలి. అందుకే అందరి నోళ్లలో నానేలా మా సంస్థకు సమోసా సింగ్ అని పేరుపెట్టాం. ఓ రోజు శిఖర్ నా దగ్గరకు వచ్చి కంపెనీ పేరు సమోసా సింగ్ అని చెప్పడంతో ‘అరె ఈ పేరేదో భలే ఉందే అని’ నవ్వుకున్నట్లు నిధి వివరించారు. తోపుడుబండి మీద సమోసాలు ప్రొడక్ట్ (సమోసా),పేరు రెడీ. మార్కెటింగ్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. ముందుగా తాము తయారు చేసిన సమోసా గురించి కస్టమర్ల నుంచి అభిప్రాయం తెలుసుకునేందుకు తోపుడుబండి మీద సమోసాలు అమ్మారు. రద్దీ ఉండే ఏరియాల్లో కియోస్కోలు ఏర్పాటు చేసి సమోసా గురించి కస్టమర్ల అభిప్రాయాలు సేకరించారు. ఫీడ్‌బ్యాక్ పాజిటీవ్‌గా రావడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బెంగళూరులో సమోసా సింగ్ పేరుతో క్యూఎస్ఆర్ అవుట్ లెట్‌ను ప్రారంభించారు. నిధి బిల్ కౌంటర్‌ను నిర్వహిస్తుండగా, శిఖర్ కొంతమంది వర్కర్లతో కలిసి సమోసాలు తయారు చేసి అమ్మడం, హోమ్ డెలివరీలు చేయడం ప్రారంభించారు. టేస్ట్ అదిరింది. ధర రీజనబుల్‌గా ఉంది. రెండు సమోసాలు రూ.20, చికెన్ మఖానీ సమోసాలు (రెండు) రూ. 55కే ధర తక్కువగా ఉండడం సమోసా సింగ్‌కు కలిసి వచ్చింది. మౌత్ పబ్లిసిటీ పెరిగి రెండు నెలల్లో ఆర్డర్లు రోజుకు 500 సమోసాలు అమ్మే స్థాయికి ఎదిగారు. భారీ ఆర్డర్ దశ తిరిగింది బిజినెస్ ఊహించని విధంగా సాగుతుండడంతో నిధి క్యాష్ కౌంటర్ నుంచి..కార్పొరేట్ ఆర్డర్ల కోసం మార్కెటింగ్ విభాగంలో అడుగు పెట్టింది. అలా తనకున్న మార్కెటింగ్ అనుభవంతో జర్మన్ కంపెనీ నుంచి 8వేల సమోసాలను తయారు చేసి ఇచ్చే ఆర్డర్‌ను సంపాదించింది. ఆర్డర్ అయితే వచ్చింది. చేయడం,వాటిని నిల్వ చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉందని భావించారు. సదరు సంస్థను వారం రోజుల సమయం అడిగారు. వారంలో మళ్లీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్‌పై పనిచేశారు. సమోసా చెప్పిన టైంకు చేసి ఆర్డర్ ఇవ్వాలి. ప్రొడక్ట్ చెడిపోకుండా తయారు చేసేలా రీసెర్చ్ చేశారు. షిప్ట్‌ల వారీగా సమోసాలు తయారు చేసి చెప్పిన టైం కంటే ముందే ఆర్డర్ సిద్ధం చేశారు. ఇల్లు అమ్మి జర్మనీ ఆర్డర్ తర్వాత సమోసా సింగ్ మారు మ్రోగింది. ఆర్డర్ల సంఖ్య పెరిగింది. వివిధ నగరాల్లో అవుట్ లెట్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కానీ చేతిలో సరిపడ డబ్బు లేకపోవడంతో బెంగళూరులో ఉన్న ఇల్లును అమ్మి వ్యాపారానికి అనువుగా ఉండేలా అవుట్ లెట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బెంగళూరు,హైదరాబాద్, పూణేతో పాటు ఇతర నగరాల్లో సమోసాలు అమ్ముతున్నారు. ఇలా సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.12 లక్షల నుంచి సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సిద్ధాంతం తమను ఇక్కడికి దాకా తీసుకొచ్చిందని, భవిష్యత్‌లో విదేశీయులతో తమ సమోసాను టేస్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు నిధిసింగ్, శిఖర్ సింగ్‌లు విజయ గర్వంతో చెబుతున్నారు. -
ఇంతై.. ‘ఇంతి’oతై..
ఈమె పేరు కొండా ఉషారాణి.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కికి చెందిన ఈమెకు తన 13వ ఏట వివాహమైంది. పెళ్లయిన మూడున్నరేళ్లకే భర్త చనిపోవడంతో తల్లితో పాటు తనకున్న ఇద్దరు పిల్లలను పెంచుకునేందుకు పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరింది. వచ్చే జీతం సరిపోకపోవడంతో రుణం తీసుకొని ఇంట్లోనే బట్టల దుకాణం ప్రారంభించింది. అయితే దొంగలు పడి బట్టలన్నీ దోచుకెళ్లారు. దీంతో కొన్నాళ్లు దిగాలు పడ్డ ఉషారాణి తన బిడ్డలను పోషించుకోవడానికి పడి లేచిన కెరటంలా నిలబడింది. కంపెనీల నుంచి బయో ఎరువులను తీసుకొని మార్కెటింగ్‌కు శ్రీకారం చుట్టింది. 10 ఏళ్ల పాటు ఊరూరా తిరుగుతూ వాటిని అమ్ముతూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అంతేకాకుండా గోశాల నుంచి సేకరించిన గోమూత్రం, పేడ వ్యర్థాలతో స్వయంగా బయో ఎరువులు తయారు చేస్తూ రైతులకు విక్రయించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సొంతంగా పాడి గేదెలను కొనుగోలు చేసి బయో ఎరువుల తయారీ యూనిట్ పెట్టింది. తాను స్వయంశక్తితో నిలదొక్కుకోవడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతటితో ఆగకుండా తనకున్న 1.40 ఎకరాలతో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని ప్రకృతి సాగు చేపట్టింది. వరితో పాటు మిరప, మునగ, పసుపు, కాలీఫ్లవర్ పంటలను సాగు చేస్తోంది. ఇటీవల స్త్రీ (శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం) అవార్డును అందుకుంది. మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా.. రెండో అబ్బాయి పుట్టిన మూడు నెలలకే భర్త చనిపోయారు. ఏం చేయాలో పాలుపోలేదు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా – కొండా ఉషారాణి, మహిళా రైతు, నూతక్కి, గుంటూరు జిల్లా -
లెమన్ గ్రాసే లచ్చిందేవి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వారందరూ ఓ చిన్న తండాకు చెందిన గిరిజన మహిళలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు, తమ కుటుంబాలను గాడిన పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు అందరూ ఏకమై దారులు వెతికారు. వినూత్న ఆలోచనను ఒడిసిపట్టి విజయబావుటా ఎగురవేశారు. లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి)తో సుగంధ ద్రవ్యాన్ని (నూనె) తయారుచేస్తూ.. ఓ అంతర్జాతీయ ఏజెన్సీ సహకారంతో మార్కెటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి యూనిట్ ఏర్పాటు చేసి ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చీకరుచెట్టు తండా మహిళలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అడుగులు ఇలా.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చీకరుచెట్టు తండా జనాభా 570 మంది. ఈ చిన్న తండాలో 14 మహిళా సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు 150 మంది సభ్యులు ఉన్నారు. గతంలో బ్యాంకు లింకేజీ రుణాలతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని సెరా అనే సంస్థ మహిళా చైతన్యం, ఆర్థికాభివృద్ధిపై 2021 జనవరిలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లిలో జరిగిన సదస్సుకు చీకరచెట్టు తండాలోని మహిళలు హాజరయ్యారు. లెమన్ గ్రాస్‌తో సుగంధ ద్రవ్యంతో పాటు పలు ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. పదిమంది మహిళలు గ్రూపుగా ఏర్పడి.. తమ ఆసక్తిని అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్‌భాషా దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆర్థిక సాయంతో పాటు ప్రోత్సాహం అందించడంతో.. వారంతా ఝాన్సీలక్ష్మీబాయి మహిళా సంఘంగా ఏర్పడి సుగంధ ద్రవ్యం, ఇతర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం మొత్తం యూనిట్ కాస్ట్ రూ.11.50 లక్షలు కాగా.. కలెక్టర్ నుంచి రూ.6.50 లక్షలు, సెరా సంస్థ రూ.2 లక్షలు సాయం లభించింది. మహిళలు తమవంతుగా రూ.3 లక్షలు వేసుకుని యూనిట్‌ను నెలకొల్పారు. మొదట లెమన్ గ్రాస్ సేకరించి సుగంధ ద్రవ్యం తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నూనెతో పలు ఉత్పత్తులకూ రూపకల్పన చేశారు. అంతేకాదు.. వీటిని మార్కెటింగ్ చేయడం ఎలా అని ఆలోచించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ట్రికా నుంచి ఇటీవల రూ.11.13 లక్షల సబ్సిడీ విడుదలైంది. లీటర్ ఆయిల్‌కు రూ.1,400 టన్ను నిమ్మగడ్డితో ఆ మహిళలు ఆరు లీటర్ల నూనె తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఈ ఆయిల్ లీటర్‌కు రూ.1,400 పలుకుతోంది. ఈ నూనెతో క్రిమినాశక సబ్బులు, షాంపూలు, పలు కాస్మోటిక్స్, ఫేస్ క్రీమ్, హెయిర్ ఆయిల్, లెమన్‌టీ పౌడర్ తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడి మహిళలు సబ్బులు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సెంట్లు, లెమన్ టీ పౌడర్ తయారు చేసి విక్రయిస్తున్నారు. భవిష్యత్‌లో అగర్‌బత్తులతో పాటు ధూప్ స్టిక్స్ ఇతరత్రా తయారు చేయనున్నట్లు మహిళలు వెల్లడించారు. పెరుగుతున్న సాగు సంఘంలో ఉన్న సభ్యులు మొదట తమ తమ వ్యవసాయ పొలాల్లో నిమ్మగడ్డి సాగు చేశారు. తర్వాత తాము కొంటామంటూ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతులను యూనిట్ వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, చిలకటోనిపల్లి, పెద్దమందడి గ్రామాల్లో చాలామంది రైతులు లెమన్ గ్రాస్ సాగు చేపట్టారు. ఈ మేరకు టన్ను నిమ్మగడ్డికి రూ.4 వేలు ఇవ్వడంతో పాటు మంట కోసం ఉపయోగించిన గడ్డి కాలిపోగా వచ్చిన బూడిదను పొలాల్లో ఎరువుగా వినియోగించేందుకు సదరు రైతులకే అందజేస్తున్నారు. ఆదరణ లభిస్తోంది.. నిమ్మగడ్డి పంట రెండు నెలలకోసారి వస్తుంది. అయినా దీని సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ మేరకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రెండు నెలలకోసారి 80 నుంచి 100 లీటర్ల వరకు ఆయిల్ విక్రయిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాం. మేం తయారు చేసే లెమన్ గ్రాస్ ఆయిల్, సబ్బులు ఇతరత్రా ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో మంచి ఆదరణ ఉంది. వనపర్తి కలెక్టరేట్లో లెమన్ టీ సెంటర్ ఏర్పాటు చేశాం. – మోతీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
షాపర్‌టైన్‌మెంట్‌కు స్వాగతం
తాము ఇష్టపడే వస్తువును కొనడానికి వెబ్సైట్లలోకి వెళ్లే యువతరం... అక్కడ కనిపించే సుదీర్ఘమైన సమాచారాన్ని చదవడం బోర్‌గా ఫీలవుతున్నారు.అలా అని వస్తువుగురించి పూర్తిగా తెలుసుకోకుండా కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో లైవ్ ‘షాపర్‌టైన్‌మెంట్’ను ఇష్టపడుతున్నారు.వెబ్సైట్లలో వన్‌సైడ్ కమ్యూనికేషన్ ఇష్టపడని వారికి లైవ్ కామర్స్ యాప్‌లు దగ్గరయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 25 సంవత్సరాల కనిక షిండే యాక్టివ్ ఆన్లైన్ షాపర్. రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు ఆమె నోట పదేపదే వినిపిస్తున్నమాట షాపర్‌టైన్‌మెంట్. ‘షాపర్టైన్మెంట్లో షాప్‌కు వెళ్లి సరదాగా షాపింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది. లిప్‌స్టిక్ నుంచి ఐ షాడోస్ వరకు మనం ఎంపిక చేసుకునే వస్తువుల విషయంలో స్పష్టత వస్తుంది. ఆ వస్తువులకు సంబంధించి సందేహాలకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి’ అంటుంది కనిక. నాసిక్‌లోని కనిక షిండే మాత్రమే కాదు మన దేశంలో చిన్న, పెద్ద పట్టణాలు అనే తేడా లేకుండా జెన్–జెడ్, మిలీనియల్స్ రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ‘షాపర్‌టైన్‌మెంట్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడది వారికి ఫ్యాషన్‌గా కూడా మారింది. చైనీస్ డిజిటల్ మార్కెట్లో పుట్టిన ‘షాపర్‌టైన్‌మెంట్’ (కాంబినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇ– కామర్స్, వీడియో కంటెంట్) ట్రెండ్ ఇప్పుడు మన దేశంలోనూ హల్చల్ చేస్తోంది.చైనాలో ‘షాపర్‌టైన్‌మెంట్’ అనేది పాపులర్ ట్రెండ్‌గా ఉంది. చైనాకు చెందిన దిగ్గజ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ‘టవ్భావ్’ షాపర్‌టైన్‌మెంట్‌కు ఊపు ఇచ్చింది. అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ‘ఇది కేవలం మరో మార్కెటింగ్ ట్రెండ్ కాదు. రిటైల్ ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చే పరిణామం’ అంటున్నారు విశ్లేషకులు.చైనాలోని షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్ దౌయిన్, క్లైష్ ‘షాపర్‌టైన్‌మెంట్’ ట్రెండ్ దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నసంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ‘షాపర్‌టైన్‌మెంట్’కు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫాం ‘మింత్రా’ లైవ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ లాంచ్ చేసింది. 2026 కల్లా ‘షాపర్‌టైన్‌మెంట్’ అమ్మకాలు గణనీయంగా పెరగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇ–కామర్స్ ప్రపంచంలో కస్టమర్ రివ్యూలు కొనుగోలు ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు గందరగోళంగా మారి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి నెడతాయి. ఇలాంటి సమయంలోనే షాపర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. – హరిత, కోజికోడ్ (కేరళ) వెబ్సైట్లలో కనిపించే సుదీర్ఘమైన సమాచారం చదవాలంటే బోర్‌గా ఉంటుంది. మనం కావాలనుకున్న వస్తువును కంటితో చూసి కొనుగోలు చేయడంలోనే మానసిక తృప్తి ఉంటుంది. – శాంతిస్వర, చెన్నై -
నవంబర్‌లో సేవలకు పటిష్ట డిమాండ్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం నవంబర్‌లో మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 56.4గా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఇది 55.1 వద్ద ఉంది. పీఎంఐ 50 శాతంలోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన దేశ ఎకానమీలో మెజారిటీ పాత్ర పోషిస్తున్న సేవల రంగం వరుసగా 20 నెలల నుంచి వృద్ధి ధోరణిలోనే కొనసాగుతోంది. ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా తెలిపిన సమాచారం ప్రకారం, నవంబర్‌లో సేవల రంగానికి పటిష్ట డిమాండ్ నెలకొంది. మార్కెటింగ్, అమ్మకాలు బాగున్నాయి. సేవల రంగం నవంబర్‌లో చక్కటి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. అయితే కంపెనీలు అత్యధిక నిర్వహణా వ్యయాలను ఎదుర్కొన్నాయి. సేవలు–తయారీ కలిపినా.. స్పీడే! ఇక తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ అక్టోబర్‌లో 55.5గా ఉంటే, నవంబర్‌లో 57.7కు ఎగసింది. ఈ రెండు విభాగాల్లో ప్రైవేటు రంగ క్రియాశీలత పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు డీ లిమా తెలిపారు. ఒక్క తయారీ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) చూస్తే, నవంబర్‌లో 55.7గా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. గడచిన మూడు నెలల్లో సూచీ ఈ గరిష్ట స్థాయిల్లో నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీ 50పైన ఉంటే వృద్ధిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన పీఐఎం వరుసగా 17 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. -
విజయపథం: ఆలోచనే ఆదాయం
చిన్నప్పుడెప్పుడో స్నేహితురాలికి సినిమా కథ చెప్పింది రమ్య. ఆ స్నేహితురాలు మరుసటిరోజే సినిమా చూసింది. ‘ఆ సినిమా కంటే నువ్వు చెప్పిన విధానమే బాగుంది’ అని రమ్యకు కితాబు ఇచ్చింది. ప్రతిభ వృథా పోదు అంటారు. రమ్యలోని ప్రతిభ కూడా అంతే. ఒక అంశాన్ని ఆకర్షణీయంగా చెప్పే ఆమె ప్రతిభ మార్కెటింగ్ రంగంలో తనకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ‘రమ్య రామచంద్రన్... యంగ్ ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఎంటర్ప్రెన్యూర్’గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. ‘హుపల్’ పేరుతో ముంబై కేంద్రంగా డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ ఏజెన్సీని స్థాపించి విజయం సాధించింది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ రంగంలోకి అడుగు పెట్టడం సులువే కానీ, అక్కడ గెలుపు జెండా ఎగరేయడం మాత్రం సులువు కాదు. ఎంతో పోటీ ఉంటుంది. అందుకే ఆషామాషీగా ఏజెన్సి ప్రారంభించలేదు రమ్య. యాక్టివ్ సోషల్‌మీడియా యూజర్ల సంఖ్య ఎంత, ఏ వయసు వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, వారి స్క్రీన్టైమ్ ఎంత? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకొని ఏజెన్సీ ప్రారంభించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల గురించి తెలుసుకుంటూ ఉండేది. ‘వీరి ప్రతిభను మనం ఎలా ఉపయోగించుకోగలమా’ అని ఆలోచించేది. ‘ఈ తరం వాళ్లకు ఏది చెప్పినా ఇది మాకు సంబంధించిన విషయమే అన్నట్లుగా చెప్పాలి. ఉన్న వాస్తవాన్ని పదింతలు పెద్దచేసి చూపించే కంటెంట్‌ను వారు ఇష్టపడడం లేదు’ అంటుంది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరికొత్త భవిష్యత్ వ్యూహాలతో సిద్ధం అవుతుంది రమ్య. ‘విజయం అనేది ఒక ప్రాజెక్ట్ కు మాత్రమే పరిమితం. అది పునరావృతం కావాలంటే బుర్రకు ఎప్పుడూ పదును పెడుతూనే ఉండాలి. ఇతరుల కంటే ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నామనేదే మన బలం అవుతుంది. మన విజయానికి ఇంధనం అవుతుంది’ అంటున్న రమ్య రామచంద్రన్ మాటలు నిజం కదా. -
గ్యాస్‌లో పెట్టుబడులకు ధర విషయంలో స్వేచ్ఛ కీలకం
న్యూఢిల్లీ: సముద్రాల్లో వందల కొద్దీ మీటర్ల లోతున ఉండే సహజ వాయువు నిక్షేపాలను కనుగొని, వెలికి తీయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ వీపీ సంజయ్ రాయ్ తెలిపారు. ఈ రంగంలోకి పెట్టుబడులు రావాలంటే ధర, మార్కెటింగ్పరమైన స్వేచ్ఛ కల్పించడం కీలకమని పేర్కొన్నారు. చమురు, గ్యాస్ ఆపరేటర్ల సమాఖ్య ఏవోజీవో ఈ విషయాన్నే గ్యాస్ ధరను సమీక్షిస్తున్న ప్రభుత్వ నియమిత కిరీట్ పారిఖ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్ కాల్లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు వివరించారు. అటు వినియోగ సంస్థలు మాత్రం గ్యాస్ ధరపై ఎంతో కొంత పరిమితి ఉండాలని కోరుకుంటున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పారిఖ్ కమిటీ రాబోయే కొన్ని వారాల్లో నివేదికను సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రైమరీ ఎనర్జీ బాస్కెట్లో 6.7 శాతంగా ఉన్న దేశీ గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే కనీసం రూ. 2–3 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని కమిటీకి ఏవోజీవో తెలిపింది. విద్యుత్తు, ఎరువులు మొదలైన వాటి ఉత్పత్తిలో సహజ వాయువును వినియోగిస్తారు. -
భారత్‌లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాలేవో తెలుసా మీకు?
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా డిమాండ్ కలిగిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలకు వీలుంటుందని లింక్డ్ఇన్ నివేదిక తెలిపింది. ఈ తరహా నైపుణ్యాల విషయంలో ఉద్యోగార్థులకు సాయం చేయడం, వారి కెరీర్‌కు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో.. ‘స్కిల్స్ ఎవల్యూషన్ 2022’, ‘ఫ్యూచర్ ఆఫ్ స్కిల్స్ 2022’ డేటాను లింక్డ్ఇన్ విడుదల చేసింది. లింక్డ్ఇన్కు భారత్‌లో 9.2 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వారి నైపుణ్యాల డేటా ఆధారంగా.. వృద్ధి చెందుతున్న టాప్10 నైపుణ్యాలు, భవిష్యత్ నైపుణ్యాల వివరాలను తెలియజేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాల్లో 25 శాతం మార్పు చోటు చేసుకుందని.. 2025 నాటికి 41 శాతం మార్పు చోటు చేసుకుంటుందని తెలిపింది. భారత్‌లో వీటికి డిమాండ్.. భారత్‌లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాల వివరాలను లింక్డ్ఇన్ తెలియజేసింది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఎస్‌క్యూఎల్, సేల్స్, జావా, సేల్స్ మేనేజ్మెంట్, మైక్రోసాఫ్ట్ అజూర్, స్ప్రింగ్‌బూట్ డిమాండ్ నైపుణ్యాలుగా ఉన్నాయి. 2015 నుంచి చూస్తే కార్పొరేట్ సేవల పరంగా నైపుణ్యాల్లో 41.6 శాతం మార్పు చోటు చేసుకుంది. ఫైనాన్షియల్ రంగంలో.. జీఎస్టీ, టీడీఎస్, స్టాట్యుటరీ ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్‌కు సంబంధించి నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. సాఫ్ట్వేర్, ఐటీ సేవల పరంగా పదింటికి గాను ఆరు నైపుణ్యాలు కొత్తవే ఉన్నాయి. మీడియా ఆన్లైన్ మాధ్యమంలో విస్తరిస్తున్న క్రమంలో.. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో), వెబ్ కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బ్రాంచ్ బ్యాంకింగ్, బ్రాంచ్ ఆపరేషన్స్ నైపుణ్యాలకు ఫైనాన్షియల్‌లో డిమాండ్ నెలకొంది. అంటే ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. హెల్త్‌కేర్ రంగంలో నైపుణ్యాల పరంగా 2015 తర్వాత 30 శాతం మార్పు చోటు చేసుకుంది. -
గిగ్ వర్కర్లకు ఫుల్ డిమాండ్, గిగ్ వర్కర్లు అంటే ఎవరు?
ముంబై: గిగ్ వర్కర్లకు(తాత్కాలిక పనివారు/సంప్రదాయ వ్యవస్థకు వెలుపల చేసేవారు/రెగ్యులర్ రోల్స్ కాకుండా ఒప్పందం మేరకు చేసేవారు)మే నెలలో డిమాండ్ 22 శాతం పెరిగింది. ప్రధానంగా విక్రయాలు, మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది. క్వెస్ కార్ప్‌కు చెందిన స్టార్టప్ టాస్క్‌మో తన తొలి ‘టాస్క్‌మో గిగ్ ఇండెక్స్’ (టీజీఐ) నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి తర్వాత భారతీయ కంపెనీలు గిగ్ వర్కర్ల కోసం, ప్రాజెక్టు ఆధారిత తాత్కాలిక ఉద్యోగుల కోసం ఎక్కువగా చూస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. బిజినెస్ డెవలప్మెంట్, క్షేత్రస్థాయిలో విక్రయాలు, చివరి వరకు చేరుకోవడం, డిజిటల్ ప్రచారం, బ్రాండ్ ప్రచారానికి గిగ్ వర్కర్లపైనే కంపెనీలు ఎక్కువగా ఆధార పడుతున్నాయి. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో వీరికి డిమాండ్ మూడొంతులు పెరిగింది. క్విక్ కామర్స్‌లో 300 శాతం (వేగంగా డెలివరీ చేసేవి), హెల్త్టెక్లో 250 శాతం, ఫిన్టెక్లో 200 శాతం, ఈకామర్స్‌లో 198 శాతం చొప్పున గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగిందని ఈ నివేదిక తెలియజేసింది. 2022 జనవరి-మే నెల మధ్య ధోరణలను ఈ నివేదికలో టాస్క్‌మో వివరంగా ప్రస్తావించింది. తన ప్లాట్ఫామ్లో మే నెలలో 60వేల మంది గిగ్ వర్కర్లు పేర్లను నమోదు చేసుకున్నట్టు టాస్క్‌మో తెలిపింది. -
Sircilla Weavers: అంచు చీరలే ఆ‘దారం’
► సాంచాలపై కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తున్న ఇతను వేముల వెంకట్రాజం. సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆయన మూడో తరగతి చదువుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే చేనేత మగ్గాలు నడుపుతున్నారు. ఇప్పుడు ఆరు పదుల వయసులో కాటన్ జరీ అంచు చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. నిత్యం రెండు సాంచాలపై చీరలను నేస్తూ.. నెలకు రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదిస్తున్నారు. ► ఈయన సబ్బని నరేందర్. సిరిసిల్ల శివనగర్‌కు చెందిన ఇతను డిగ్రీ చదివారు. అందరిలా పవర్‌లూమ్స్(సాంచాల)పై పాలిస్టర్ బట్టను, బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయకుండా సొంతంగా కాటన్ చీరలపై దృష్టి పెట్టారు. తనకున్న ఇరవై సాంచాలపై ఇదే వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ మరో పది మందికి పని కల్పిస్తున్నారు. నవ్యమైన, నాణ్యమైన కాటన్ చీరల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ చీరలకు సొంతంగానే మార్కెటింగ్ చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50వేలు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిరిసిల్ల: సిరిసిల్లలో ఇలా సొంతంగా వస్త్రం ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్న వారు ఒక్కరిద్దరు కాదు.. సుమారు 300 సాంచాలపై 150 మంది కార్మికులు, 25 మంది యజమానులు ఉన్నారు. సొంతంగానే జరీ అంచులతో కూడిన కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రాలేదనే బెంగలేదు.. బతుకమ్మ చీరల బిల్లులు రాలేదనే చింత లేదు. సర్కారు ఆర్డర్ల వైపు ఎదురుచూడ కుండా సొంత సాంచాలపై జరీ అంచుతో 8 మీటర్ల (18 మూరల) గోచీ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, భీంగల్, నిర్మల్, భైంసా వంటి పట్టణాల్లోని వస్త్ర వ్యాపారులకు నేరుగా సరఫరా చేస్తున్నారు. ఒక్కో చీరను రూ.650 నుంచి 800 వరకు నాణ్యతను బట్టి అందిస్తున్నారు. నేరుగా నూలు కొనుగోలు చీరలకు అవసరమైన నూలును నేరుగా భీవండి నుంచి కొనుగోలు చేస్తున్నారు. నూలుకు అవసరమైన రంగులను అద్ది, బీములు పోయించుకుని, సాంచాలపై ఎక్కిస్తారు. జరీ పోగులతో చీరల అంచులను, కొంగులను డిజైన్ చేసి ఇంపైన రంగుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు వారే మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న నూలు ధరలతో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని అధిగమించి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే.. కాటన్ చీరల ఉత్పత్తికి అవసరమైన నూలు సరఫరాకు ప్రభుత్వం స్థానికంగా నూలు డిపోను ఏర్పా టు చేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. కరోనా లాక్డౌన్ వంటి విపత్తులు ఎదురైనా, తట్టుకుని నేతన్నలు చీరల బట్టను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్లలో నూలు డిపో ఏర్పాటు, మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పిస్తే.. మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు
సాక్షి, తిరుపతి: శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు సిద్ధం చేసిన జీడిపప్పును స్వయంగా పరిశీలించారు. మూడు కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా ఒక కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పులో దుమ్ము, విరిగిపోయినవీ చాలా ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు. చదవండి: చంద్రబాబు, బాలకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్ టీటీడీ షరతు కంటే ఎక్కువగానే దుమ్ము, విరిగిన జీడిపప్పు ఉన్నాయని అధికారులు చైర్మన్‌కు వివరించారు. మిగిలిన రెండు కంపెనీలు సరఫరా చేసిన జీడిపప్పు టెండర్ నిబంధన మేరకు నాణ్యతగా ఉన్నట్లు గుర్తించారు. నాణ్యత సరిగాలేని జీడిపప్పు సరఫరా చేసిన సంస్థ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం యాలకులు మూట విప్పించి అవి స్పెసిఫికేషన్స్ మేరకు ఉన్నాయా లేదా అని అధికారులను అడిగారు. వాసన బాగా రావడం లేదని వీటిని ప్రభుత్వ పరీక్ష కేంద్రానికి పంపాలని చైర్మన్ ఆదేశించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యి డబ్బా తెరిపించి నెయ్యి వాసన చూశారు. నెయ్యి నాణ్యతగా లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీవారి సేవకులు జీడిపప్పును బద్దలుగా మార్చే సేవను ఛైర్మన్ చూశారు. జీడిపప్పు నాణ్యత ఎలా ఉందని, సేవ ఎన్ని రోజులు చేస్తారు, ఎక్కడి నుంచి సేవకు వచ్చారు అని శ్రీవారి సేవకులతో మాట్లాడారు. స్వామివారి ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు ఏటా రూ. 500 కోట్లు ఖర్చు చేసి జీడిపప్పు, నెయ్యి, యాలకులు కోనుగోలు చేస్తున్నామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. వీటిలో నాణ్యత లోపిస్తోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆకస్మిక తనిఖీలు చేశానని ఆయన వివరించారు. సరుకులు టీటీడీ ల్యాబ్‌లో పరీక్షించడంతో పాటు, సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్‌కు కూడా పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. -
చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రకారం.. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన మార్కెటింగ్ సంవత్సరంలో 71–72 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు సరఫరా అయింది. మార్కెట్ నివేదికలు, నౌకాశ్రయాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 80 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఒప్పందం జరిగింది. 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి మధ్య ఇప్పటికే 57.17 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు చేరింది. అంత క్రితం మార్కెటింగ్ సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 31.85 లక్షల టన్నులకు పరిమితం అయింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఎగుమతి అయిన పరిమాణంలో 44 శాతం ఇండోనేషియా, బంగ్లాదేశ్ కైవసం చేసుకున్నాయి. అంత క్రితం ఏడాదిలో ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్లు 48 శాతం వాటా చేజిక్కించుకున్నాయి. 2021–22లో 350 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కానుంది. ఇందులో ఇప్పటికే మిల్లులు 330 లక్షల టన్నులు ఉత్పత్తి చేశాయి. దేశీయంగా 272 లక్షల టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఎగుమతులు, దేశీయ వినియోగం పోను సెప్టెంబర్ నాటికి మిగులు 68 లక్షల టన్నులు ఉంటుంది. -
సస్పెన్షన్‌లో రంగనాథన్: గెయిల్
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ రంగనాథన్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ– గెయిల్ (ఇండియా) ధ్రువీకరించింది. ప్రైవేటు కంపెనీలకు పెట్రోకెమికల్ ప్రొడక్టుల అమ్మకాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తూ లంచాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రంగనాథన్‌ను రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఆరుగురిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. రంగనాథన్సహా పలువురి నివాసాలపై జరిగిన సీబీఐ దాడుల్లో దాదాపు రూ.1.25 కోట్లు డబ్బు, అంతే మొత్తం విలువైన ఆభరణాలు, కొన్ని కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ‘గెయిల్ ఎంప్లాయీస్ (కాండక్ట్ డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1986లోని రూల్ 25 ప్రకారం దాఖలైన అధికారాలను అమలు చేస్తూ ఈఎస్ రంగనాథన్‌ను 2022 జనవరి 18వ తేదీ నుంచి అమలయ్యేలా సస్పెండ్‌చేస్తూ భారత్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు’’ అని గెయిల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. -
Krishna: మూడు రోజుల పాటు జాతీయ ఆర్గానిక్ మేళా
సాక్షి, అమరావతి: సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘4వ జాతీయ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఈ మేళాను మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతులు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో సాగవుతున్న సేంద్రియ ఆహార ఉత్పత్తులు, మొక్కలు, దుస్తులు, మెడిసిన్స్‌తో పాటు యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం కూడా భాగస్వామి కాబోతోంది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా సంఘాలు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అలాగే జై కిసాన్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పాత్రికేయులను సత్కరించనున్నారు. శనివారం మిద్దెతోటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన రంగ నిపుణులతో సెమినార్ నిర్వహిస్తారు. ఆదివారం ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే అంశంపై డాక్టర్ రామచంద్రరావు ప్రసంగిస్తా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహణ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, గో ఆధారి త వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు, భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు జె.కుమారస్వామి కోరారు. -
ఊహలకు అందని రూపాలు
టీ కప్పులు, మగ్‌లను అందమైన కళారూపాలుగా మార్చుతూ, ఫంక్షనల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ, మార్కెటింగ్ చేస్తూ, ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారింది శ్రీనియా చౌదరి. ఈ కళారూపం అంతగా సక్సెస్ కాదన్న వారి నోళ్లను మూయిస్తూ, ఛాలెంజ్‌గా తీసుకొని మరీ ఈ కళలో రాణిస్తోంది. ఢిల్లీలో సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన కళారూపాలను వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఎవరి ఊహకూ అందని కళారూపాలు శ్రీనియా చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. పదేళ్లుగా సిరామిక్ మెటీరియల్‌తో మగ్‌లను తయారుచేస్తూ, వాటినే అందమైన కళాఖండాలుగా తీర్చిదిద్దుతోంది. యూరప్‌లోని లాట్వియాలో సిరామిక్స్ బియన్నాలే, మార్క్ రోత్కో మ్యూజియంలలోనూ తన కళారూపాలు స్థానాన్ని పొందాయంటే శ్రీనియా కృషి, పట్టుదల ఎంత బలమైనవో ఇట్టే తెలిసిపోతాయి. సాధనమున సమకూరిన కళ స్వతహాగా చిత్రకారిణి అయిన శ్రీనియా ఈ కళలో రాణించడానికి మట్టిపైనే చిత్రాలు వేసేది. ఆ తర్వాత మట్టితో కళారూపాలు తయారుచేసి వాటిపైనే చిత్రీకరించేది. తన ప్రతి చిత్రంలోనూ సమాజం గురించిన ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. ‘సెరామిక్స్‌తో రకరకాల కళాత్మక రూపాలను తయారుచేయడం అనేది శతాబ్దాలుగా ఉంది. కానీ, నేను ప్రత్యేకంగా ఎంచుకున్న మగ్గులతో డిజైన్లు, మగ్గులపై పెయింటింగ్.. ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని అనుసరించే నేను నా దైన సృజనను జోడించాను. అభ్యాసనకు మట్టితోనే కళారూపాలను తీర్చడంలో కొన్నాళ్లు నిమగ్నమయ్యాను. ఎంతోమందిని అవి ఆకట్టుకున్నాయి. వీటికున్న డిమాండ్‌ను బట్టి ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నాను. నెలల సమయం.. కోవిడ్ టైమ్‌లోనూ నా ఆలోచనా విధానాన్ని నలుగురితో పంచుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి వెబ్‌షాప్‌ను ప్రారంభించాను. కొన్ని వారాల పాటు వెబ్‌షాప్‌ను నిర్వహించాను. వ్యూవర్స్‌లో మంచి ఆసక్తి కనపడింది. కానీ, నిత్యసాధనతోనే ఈ కళలో రాణించగలరు. ఏ కాలమైనా సరే యంత్రంతో తయారుచేసిన వస్తువుకన్నా, పూర్తిగా చేతితో తయారుచేసిన వస్తువు ఖరీదు ఎక్కువ. అందుకే, సిరామిక్‌తో మగ్ తయారీ నుంచి వాటి రూపాల్లో మార్పులతో పాటు.. ఒక కళాఖండంగా తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా నేను అనుకున్న కళారూపం స్కెచ్ వేసుకుంటాను. అది సంతృప్తిగా అనిపించాక దానిని వాస్తవ రూపానికి తీసుకు రావడానికి నెలల సమయం పడుతుంది. ఒక్కో సమయంలో అయితే ఒక చిన్న పీస్‌ను మాత్రమే తయారు చేస్తుంటాను. ఒకదానితో మరోటి అస్సలు పోలికే ఉండదు. దేనికది ప్రత్యేకం. కానీ, అన్ని కళారూపాలకు మంచి డిమాండ్ ఉంది. ఆన్లైన్ వేదిక ద్వారా నా కళారూపాలను నేనే మార్కెటింగ్ చేస్తుంటాను. విదేశీయులు కూడా ఈ ఫంక్షనల్ ఆర్ట్‌ను బాగా ఇష్టపడుతున్నారు. వ్యాపారిగా మారినప్పటికీ ప్రతీ కళారూపాన్ని నేనే స్వయంగా సృష్టిస్తాను. ఎవరి సాయమూ తీసుకోను. అచ్చులు పోయడం అనేది నా ఆలోచనకు పూర్తి విరుద్ధం. అందుకే ప్రతీ కళాఖండం విభిన్నంగా ఉంటుంది’ అని వివరిస్తారు శ్రీనియా. -
Sanjana Chatlani: ఆ అక్షరాల రూపకర్త.. ఒకింత ఆశ్చర్యం, గర్వం!
రోలెక్స్, ది రిట్జ్ కార్ల్టన్, ఫ్యూచర్ గ్రూప్, గూచి, లూయీ వ్యుట్టన్, మిఖాయిల్ కోర్స్, జిమ్మీ చూ, గూగుల్ ఇండియా, ది వెడ్డింగ్ ఫిల్మర్, టాటా జోయా... ఇలా ఎన్నో ఎన్నెన్నో కంపెనీలు. ఈ పేర్లతోపాటు ఆయా కంపెనీల అక్షరరూపం కూడా కళ్ల ముందు మెదిలి తీరుతుంది. ఆ ఆక్షరాలకు ఓ రూపం పురుడు పోసుకున్నది మనదేశంలోనే. ఆశ్చర్యమే కాదు ఒకింత గర్వంగానూ ఉంటుంది మరి. ఈ అక్షరాల రూపకర్త పూనాకు చెందిన సంజన చత్లాని. ఆమె తన జీవితాన్ని అక్షరాలా అక్షరాలతోనే దిద్దుకుంది. తన కెరీర్‌ను తానే అందంగా రాసుకుంది. నిస్తేజం నుంచి ఉత్తేజం అది 2015 ఆగస్టు. సంజన చట్లాని కాలేజ్ నుంచి సమాజంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లు అవి. ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. మూడున్నరేళ్ల ఉద్యోగ జీవితం ఆమెకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. అంతటి నిస్పృహలోనూ ఆమెకు సాంత్వన చేకూరుతున్న విషయం ఒక్కటే. కుటుంబంతో యూఎస్‌కి వెళ్లినప్పుడు లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కాలిగ్రఫీ క్లాసులకు హాజరైంది. అప్పుడు నేర్చుకున్న కాలిగ్రఫీలో తోచిన నాలుగు అక్షరాలు రాసుకున్నప్పుడు మనసు ఆనందంగా ఉంటోంది. ‘తనను ఆనందంగా ఉంచని ఉద్యోగంలో కొనసాగడం కంటే తనకు సంతోషాన్నిస్తున్న కాలిగ్రఫీలోనే జీవితాన్ని వెతుక్కుంటే తప్పేంటి’ అనుకుంది సంజన. ఉద్యోగం మానేసి ముంబయిలో ఒక చిన్న గదిలో ‘ద బాంబే హ్యాండ్ లెటరింగ్ కంపెనీ’ సంస్థను స్థాపించింది. సాధనేలోకం సంజన సొంతంగా కంపెనీ స్థాపించిన తర్వాత ఆర్డర్ల కోసం ప్రయత్నించలేదు. అక్షరాలను అందంగా రాయడం అనే ప్రక్రియను సాధన చేయడానికే ఎక్కువ సమయం కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే కాలిగ్రఫీ వర్క్‌షాపులకు హాజరయ్యేది. తిరిగి వచ్చిన తర్వాత స్టూడియోలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తూ టైమ్ మర్చిపోయేది. అలా రోజుకు పన్నెండు గంటల సేపు స్టూడియోలోనే గడిపిన రోజులున్నాయి. ఆ అలవాటు ఆమె కెరీర్లో బిజీ అయిన తర్వాత అంత నిడివి స్టూడియోలో పని చేయడానికి దోహదం చేసింది. ఇప్పుడు ఆమె క్లయింట్ల జాబితాలో ప్రపంచంలో అనేక ప్రఖ్యాత కంపెనీలున్నాయి. ఇంతగా పేరు వచ్చేసింది కదా అని కూడా ఆమె రిలాక్స్ కావడంలేదు. ఆర్డర్ల పని పూర్తయిన తర్వాత రోజుకు కనీసం మూడు గంటల సేపు అక్షరాలను కొత్తగా రాయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మొదట్లో బిజినెస్ ఆర్డర్స్ లేని రోజుల్లో సంజన దీపావళి శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డ్స్ రాసి స్నేహితులకు, బంధువులకు పంపించేది. ఆ గ్రీటింగ్ కార్డులు అందుకున్న వారి ప్రశంస లు నోటిమాటగా ప్రచారం కల్పించాయి. ఇప్పుడు మనదేశంలో అత్యుత్తమ కాలిగ్రఫీ ఆర్టిస్టుల్లో ఆమె ఒకరు. ఆటిజమ్కి ఔషధం సంజన ఇప్పుడు మనదేశంలో సామాన్యులకు కూడా కాలిగ్రఫీ గురించి తెలియచేయాలనే సంకల్పంతో పని చేస్తోంది. కాలిగ్రఫీ సాధన చేయడం ద్వారా ఆటిజమ్ నుంచి బయటపడవచ్చని, ఆటిజమ్ పిల్లలకు ఉచితంగా వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. కాలిగ్రఫీ నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోదని, ఎన్ని రకాలుగా సాధన చేసినా ఇంకా ఎన్నో మిగిలిపోయి ఉంటాయని చెప్తోంది. రానున్న ఏడాది జనవరిలో ఆమె యూకేలో మూడు నెలల అడ్వాన్స్డ్ స్టడీ కోసం వెళ్తోంది. అంతటి అంకితభావంతో పని చేస్తుంటే... విజయం వారిని నీడలా వెంటాడుతుంది. సంజన చట్లాని -
ఎయిర్‌లైన్స్ మహిళా సిబ్బంది..... ఇక హైహిల్స్, స్కర్ట్స్‌కి స్వస్తీ
విమానంలో పని చేసే మహిళా సిబ్బంది అంటే స్కర్ట్లు, హైహిల్స్ వేసుకుని దర్శనమిస్తుంటారు. ఇక నుంచి వాటికి స్వస్తి పలికి మహిళా సిబ్బంది ఆరోగ్య సంరక్షణార్థం సౌకర్యవంతమైన యూనిఫాంని తీసుకోస్తున్నామని చెబుతోంది ఒక ఎయిర్ లైన్ సంస్ధ. ఆ వివరాలు.. ఉక్రెయిన్: మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం ఇక నుంచి సరొకత్త యూనిఫాంని తీసుకొస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రముఖ విమానాయాన సంస్థ స్కైఅప్ ప్రకటించింది. ఈ సంస్థ అత్యంత తక్కువ ధర కలిగిన అతిపెద్ధ విమానయాన సంస్థ. ఇంతవరకు తమ మహిళా సిబ్బందికి పాత యూనిఫాం (హైహిల్స్, స్కర్ట్స్) వంటివి ధరించేవారని, వాటితో తమ సిబ్బంది చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొటున్నట్లు వివరించింది. అంతేకాదు అత్యవసర సమయాల్లో ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేయాలంటే హైహిల్స్ వేసుకుని పరిగెడితే అత్యంత కష్టమవుతోందని.. పైగా ఈ పాత యూనిఫాంతో వాళ్లు చాలా విసిగిపోయారని తెలిపింది. (చదండి: ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!) ఈ మేరకు మహిళా సిబ్బంది, ట్రౌజర్లు (ఫ్యాంట్లు), స్నీకర్లు (తేలికపాటి ష్యూ) ధరించవచ్చని స్కైఅప్ ఎయిర్‌లైన్స్ మార్కెటింగ్ హెడ్ మరియన్న గ్రిగోరాష్ వెల్లడించారు. అంతేకాదు 1930ల నాటి యూనిఫాంలన్నింటిని అధ్యయనం చేసి మరీ అత్యంత సౌకర్యవంతమైన నారింజ రంగు యూనిఫాంని డిజైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు స్కై అప్ సంస్థ త్వరలో తమ మహిళా సిబ్బంది ప్రయాణికులకు సరికొత్త యూనిఫాంలో స్వాగతం పలుకుతారని చెప్పింది. (చదండి: నేను గిటారు వాయిస్తాను... మీరు పాట పాడండి ప్లీజ్!) -
స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్ సంస్థలతో..!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) రాష్ట్రంలోని రైతు ఉత్పత్తుల సంస్థలు (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్ సంస్థలతో కలిసి మార్కెటింగ్ అవకాశాల కల్పన, ఇతరత్రా మెరుగైన వ్యవస్థ ఏర్పాటు విషయంలో కీలక భూమికను పోషించనున్నట్టు నాబార్డ్ రాష్ట్ర సీజీఎం వైకే రావు తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు ఎఫ్‌పీవోలు ఒక్కటే మార్గమని, అందువల్లే వాటిని మరింత ప్రోత్సహించేందుకు తమ సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని 330 ఎఫ్‌పీవోలకు అవసరమైన సహకారాన్ని అందించి ముందుకు తీసుకెళుతున్నట్టు, 2020–21లో నవకిసాన్ ద్వారా 57 ఎఫ్‌పీవోలకు నాబార్డ్ క్రెడిట్ లింకేజీని ఇచ్చిందన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వానికి అవసర మైన సహాయ సహకారాలను నాబార్డ్ అందిస్తుందని చెప్పారు. మొత్తంగాచూస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో నాబార్డ్ రాష్ట్రానికి రూ.20,549 కోట్ల మేర సహకారాన్ని, మద్దతును అందించినట్టు, ఇది 2019–20తో పోల్చితే 25.09 శాతం ఎక్కువని ఒక ప్రకటనలో తెలిపారు. 2020–21లో బ్యాంకులకు రూ. 13,915.22 కోట్ల పంటరుణాలు, టర్మ్లోన్ల కింద అందజేసినట్లు, అందులో రూ.వందకోట్లు నాబార్డ్ మద్దతు అందించిన వాటర్‌షెడ్ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రానికి రూ. 6,633 కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం రూ. 4,600 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు రూ. 2,500 కోట్లు క్యాష్ క్రెడిట్ కింద మంజూరు చేసి పంపిణీ చేసినట్టు వైకేరావు వెల్లడించారు. చదవండి: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతనోత్సాహం -
వెల్లువెత్తనున్న ప్రకటనలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రకటనలు, మార్కెటింగ్ కార్యకలాపాలకు కంపెనీలు 2021-22లో పెద్ద ఎత్తున వ్యయం చేయనున్నాయి. కోవిడ్-19 కారణంగా 2020లో భారత ప్రకటనల పరిశ్రమ విలువ పరంగా 21.5 శాతం తగ్గింది. ప్రస్తుత సంవత్సరంలో 23.2 శాతం వృద్ధితో పరిశ్రమ రూ.80,123 కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మారుతి సుజుకి, అమూల్, ఎల్జీ, పార్లే, పెప్సికో, వివో, మారికో, ఇమామి, వోల్టాస్, బ్లూ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్‌కు భారీగా ఖర్చు చేయనున్నాయి. కొన్ని సంస్థలు గతం కంటే 50 శాతం వరకు అధికంగా వెచ్చించనున్నట్టు సమాచారం. ఆదాయంతోపాటు మార్కెట్ వాటాను పెంచుకునే వేటలో కంపెనీలు ఖర్చుకు వెనుకాడడం లేదు. డిమాండ్ నేపథ్యంలో.. కొన్ని నెలలుగా కస్టమర్లు వస్తువులు, ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తుండడం కంపెనీలను ఆకట్టుకుంటోంది. మహమ్మారి మూలంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టపోయిన వ్యాపారం నుంచి రికవరీకి 2021-22లో చేసే వ్యయాలు దోహదం చేస్తాయని సంస్థలు భావిస్తున్నాయి. వేసవిలో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, శీతల పానీయాలు, ఐసీ క్రీమ్స్ వంటి విభాగాలకు డిమాండ్ ఉంటుంది. ఈ విభాగాల్లో వ్యాపారం సాగిస్తున్న కంపెనీలు ఆ మేరకు ప్రకటనలు, మార్కెటింగ్‌పై వ్యయాలను పెంచనున్నాయి. గతేడాది డిజిటల్ ప్రకటనలకు పరిమితమైన ఈ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వేదికలనూ వినియోగించు కోనున్నాయి. ప్రధానంగా ప్రింట్ మీడియా కీలకం కానుందని కాంటినెంటల్ కాఫీ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పటా్నయక్ తెలిపారు. ఎఫ్ఎంసీజీ రంగం 15-20 శాతం అధికంగా వ్యయం చేయనుందని అన్నారు. ఖర్చుల్లోనూ పోటీయే.. ప్రకటనలు, మార్కెటింగ్ కోసం చేసే వ్యయాల్లోనూ కంపెనీలు పోటీపడుతున్నట్టు ఉంది. 2021-22లో ఎల్జీ ఏకంగా రూ.650 కోట్లు వ్యయం చేయనుంది. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం అధికం. ఇప్పటి వరకు ఎల్జీ ఇండియా ఈ స్థాయిలో ఖర్చు చేయకపోవడం గమనార్హం. అంచనాలను మించి మార్కెట్ రికవరీ అయిందని, ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు అన్నారు. బ్లూ స్టార్ రూ.35 కోట్ల నుంచి రూ.64 కోట్లకు బడ్జెట్ పెంచింది. గతేడాది లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ నుంచి కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ కోసం ఖర్చు చేయడం ప్రారంభించాయి. దాదాపు 2019-20 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వ్యయాలు చేశాయి. ముందు వరుసలో ఎఫ్ఎంసీజీ.. భారత్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలోని కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ విషయంలో ముందున్నాయి. ఆ తర్వాత ఈ-కామర్స్, ఆటోమొబైల్, టెలికం, రిటైల్, డ్యూరబుల్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రకటనలు ప్రధానంగా వెలువడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో రియల్టీ రంగం ప్రధాన ఆకర్షణ అని బ్రాండింగ్ సేవల్లో ఉన్న జాన్‌రైజ్ క్రియేటివ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. గతంలో లేని విధంగా ఆరోగ్య బీమా, మ్యూచువల్ ఫండ్స్ ప్రకటనలూ వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఇక్కడి మార్కెట్లో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, గుంటూరు వంటి పెద్ద నగరాలు, ఖర్చులకు వెనుకాడని కస్టమర్లు ఉండడమూ కంపెనీలకు కలిసి వస్తోందని వివరించారు. చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం -
రైతుల సేవే లక్ష్యం: సీఎం జగన్
ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ– క్రాపింగ్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర లభిం చకపోతే వీరికి చెబితే రిజిస్టర్ చేసుకుం టారు. సీఎం యాప్ ద్వారా ఆ విషయాన్ని వారు పైకి తెలియజేస్తారు. తద్వారా మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకుని, మద్దతు ధరకు అమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అలా వీలుకాకపోతే నేరుగా మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేస్తుంది. ఇదంతా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతును ఊరు దాటించే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) ఉం దని, ఆ మేరకు అవసరమయ్యే సేవలన్నింటినీ అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలు అన్నింటినీ తీర్చడమే లక్ష్యంగా ఆర్బీకేలు పని చేయాలని, వీటి ద్వారా రైతులు ఆర్డర్ చేసిన వెంటనే నిర్దేశిత సమయంలోగా విత్తనాలు, ఎరువులు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుత రబీ ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు, ఖరీఫ్ 2021–22 సన్నద్ధతపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు ఊరు దాటి పోకూడని విధంగా సేవలందించాలనే విషయాన్ని అధికారులు కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి ఆర్బీకే యూనిట్‌గా పంటల ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆర్బీకేల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ఈ సమయంలో వ్యవసాయ సిబ్బంది ఆర్బీకేలోనే రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్బీకేల ద్వారా కచ్చితంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందివ్వాలని, ఇందులో వేరే మాటకే తావులేదని.. ఫిషరీస్ ఫీడ్, లైవ్ స్టాక్ మెడిసిన్, సీడ్, ఫెర్టిలైజర్స్ అన్నీ రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆర్బీకేలన్నింటికీ ఇంటర్నెట్ సదుపాయం ఆర్బీకేలన్నింటికీ వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఉండాలని సీఎం ఆదేశించారు. ఇది ఇంటరాక్టివ్ విధానంలో రైతుల సందేహాల నివృత్తికి ఉపయోగపడుతుందన్నారు. రైతులకు వచ్చే ఖరీఫ్‌లో ఇచ్చే విత్తనాలు కచ్చితంగా నాణ్యతతో ఉండాలని.. మార్కెట్లో కొనుగోలుకు ఆసక్తి చూపని వంగడాలు, ఆసక్తి చూపి మంచి ధర లభించే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. దీనిపై పోస్టర్లను విడుదల చేయాలన్నారు. దీనివల్ల మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగు పడతాయన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ సహాయంతో రైతులకు స్పష్టంగా ఈ విషయాలను తెలియజేయాలని, ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలని సూచించారు. రబీ పంటలు సాగు చేసిన 6,081 ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోళ్లు ప్రారంభించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.28,430 కోట్లతో పంటల కొనుగోళ్లు చేశామని తెలిపారు. ఇందులో ధాన్యం కొనుగోలుకు రూ.22,918 కోట్లు, ఇతర పంటలకు రూ.5,512 కోట్లు వెచ్చించామన్నారు. 2015–16 నుంచి 2018–19 వరకు గత ప్రభుత్వం నాలుగేళ్లలో పంటల కొనుగోలు కోసం రూ.43,047 కోట్లు మాత్రమే వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విత్తనాల దగ్గర నుంచి పురుగు మందులు, ఎరువులు సహా ఏం కొనుగోలు చేసినా రైతు మోసపోకూడదు. వాటి కోసం ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్ చేసిన 48 నుంచి 72 గంటల్లోగా అందుబాటులోకి తేవడమే లక్ష్యం. వాటిని ప్రభుత్వం పరీక్షించి, క్వాలిటీ పరంగా స్టాంప్ వేసి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా కల్తీ అన్నది రైతు దగ్గరకి రాకూడదన్న తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆర్బీకే యూనిట్‌గా ప్రతి గ్రామానికి పంటల ప్రణాళిక తయారు చేయాలి. ఏయే పంటలకు కనీస మద్దతు ధర ఏమిటనేది ప్రదర్శించిన పోస్టర్ ఉండాలి. ప్రతి గ్రామంలో రైతులు విత్తనం వేసే దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ప్రతి అడుగులో తోడుగా ఉంటూ చేయి పట్టుకుని నడిపించాలి. ఇలాంటి వ్యవస్థ కచ్చితంగా గ్రామాల్లో రావాలనే తాపత్రయం, తపన నుంచి పుట్టిన బీజమే ఈ రైతు భరోసా కేంద్రం. ఆర్బీకే చానల్ ప్రారంభం రైతులకు అన్ని విధాలా తోడుగా ఉండేలా రూపొందించిన ఆర్బీకే చానల్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ఘట్టంలో ఈ రోజు ఇంకో ముందడుగు వేశామని పేర్కొన్నారు. ఆర్బీకేల్లో స్మార్ట్ టీవీలు పెడుతున్నాం కాబట్టి, అక్కడి రైతులకు చాలా విషయాల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం గురించి తెలియజెపుతూ నిరంతరం సమాచారం ఇచ్చేందుకు ఈ చానల్ ఉపయోగపడుతుందన్నారు. ఏ రైతుకు ఏ సందేహం వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. రైతుల సందేహాలపై సైంటిస్ట్‌లతో ఇంటరాక్టివ్ పద్ధతిలో కూడా సందేహాలు తీర్చడానికి ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆర్బీకేలను విప్లవాత్మకంగా రైతులకు ఇంకా దగ్గరగా, ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడాలని మనసారా ఆశిస్తున్నానని, రైతులకు ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. చదవండి: బడుగుబలహీన వర్గాలకే అగ్రాసనం.. మైదుకూరు ఛైర్మన్ పీఠం వైఎస్సార్సీపీదే -
మనకూ బ్రాండ్ ఉండాలి.. సర్కార్ బ్రాండ్‌తో మార్కెటింగ్
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ప్రైవేట్ రంగం నుంచి వస్తున్న కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాలు వంటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో ఎన్నో సందేహాలు ఉంటున్నాయని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) అభిప్రాయపడింది. అందుకే ప్రభుత్వమే ఒక బ్రాండ్‌ను నెలకొల్పి ఉద్యాన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తే, ఒకవైపు వినియోగదారులకు ప్రయోజనం కలగడంతో పాటు రైతులకూ లాభాలు వస్తాయని సిఫారసు చేసింది. తెలంగాణలో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తి, అవసరాలపై ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఆస్కీని అధ్యయనం చేయమని కోరింది. ఈ నేపథ్యంలో ఆస్కీ పలు సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం పలు దఫాలుగా చర్చించింది. ముఖ్యమంత్రికి కూడా ఈ నివేదికను అందజేసినట్లు ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యానశాఖ అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి ఏ పంట.. ఎలా పండిస్తే ఏ మేరకు లాభం ఉంటుందో వివరించి చెప్పాలని సూచించింది. అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు రాష్ట్ర అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు పండాలంటే సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగాలని ఆస్కీ స్పష్టం చేసింది. అందుకోసం వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో అదనంగా రెండు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచాలని సిఫార్సు చేసింది. దీంతో ఉద్యాన ఉత్పత్తుల విలువ దాదాపు రూ. 40 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గి, ఎగుమతులు కూడా పెరుగుతాయని తెలిపింది. ఉద్యాన ఉత్పత్తులను పెంచాలంటే, ఉద్యాన శాఖకు ప్రతీ ఏటా బడ్జెట్లో రూ. 1,700 కోట్లు కేటాయించాలని సూచించింది. అలాగే ఉద్యానశాఖలో అధికారులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెంచాలని, అందుకోసం నియామకాలు చేపట్టాలని సిఫారసు చేసింది. క్రాప్ క్లస్టర్ల ఏర్పాటు రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల లోటు భారీగా ఉందని, వాటి కొరత తీరాలంటే క్రాప్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ‘పండ్ల సాగుకు ఐదు క్లస్టర్లు, కూరగాయలకు తొమ్మిది, పూలకు ఒకటి, సుగంధ ద్రవ్యాలకు ఐదు క్లస్టర్లు ఉండేలా ప్రణాళిక రచించాలి. అందుకోసం ప్రతి జిల్లాలో అక్కడి వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం, నీటి వసతిని పరిశీలించాలి. రైతులు తమ పంటల పొలాల గెట్ల వద్ద టేకుతో పాటు చింత, జామ, వెదురు తదితరమైనవి వేసుకునేలా అవగాహన కల్పించా’లని తెలిపింది. అక్టోబర్ నెలలో ఉల్లిగడ్డ దిగుమతులు రాష్ట్రానికి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫలితంగా ధరలు తగ్గి, రైతులకు నష్టం వస్తోంది. అందుకే అక్టోబర్‌లో ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గించాలని సూచించింది. ఆలుగడ్డ పండిస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని, దాన్ని 27 వేల ఎకరాల్లో సాగు చేసేలా చూడాలంది. 16 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పండించాలని పేర్కొంది. మరికొన్ని సిఫారసులు ►ఖరీఫ్, రబీలలో కొన్ని రకాల కూరగాయలు అదనంగా వస్తున్నాయి. వాటికి డిమాండ్ వచ్చేలా ప్రణాళిక రచించాలి. ►వేసవిలో వస్తున్న కొరతను అధిగమించేలా ఉత్పత్తి, సరఫరా పెంచాలి. ►ఉద్యాన ఉత్పత్తులకు కోల్డ్‌చైన్లు ముఖ్యం. ప్రీ కూలింగ్, కోల్డ్ స్టోరేజ్‌లు, రైసెనింగ్ చాంబర్లు (పండ్లను మగ్గబెట్టేందుకు) ఏర్పాటు చేయాలి. ►5 వేల మెట్రిక్ టన్నులతో 30 కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, 300 రైసెనింగ్ చాంబర్లు, ప్రతి కూరగాయల మార్కెట్‌కు ఒక రిఫ్రిజిరేటర్ ఉండాలి. ►రెడీ టు సర్వ్‌లో భాగంగా డ్రైయింగ్, ఓస్మోటిక్ డీ హైడ్రేషన్, పల్పింగ్ జ్యూస్ చేసే ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పించాలి. ►మార్కెట్ ఇంటెలిజెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. -
అనవసర మార్పులు వద్దు
న్యూఢిల్లీ: ప్రేక్షకాదరణ కోసమంటూ మహిళల క్రికెట్‌కు పనికిరాని మార్పులు చేయొద్దని భారత సీనియర్ పేసర్ శిఖా పాండే సూచించింది. మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ దక్కేందుకు బంతి బరువు తగ్గించడం, పిచ్ పొడవును 20 గజాలకే పరిమితం చేయాలంటూ వస్తోన్న ప్రతిపాదనలపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పురుషుల ఆటలతో మహిళల ఆటల్ని పోల్చవద్దన్న ఆమె అనవసర మార్పులతో మహిళా క్రికెట్ సామర్థ్యాన్ని తక్కువ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ‘మహిళా క్రికెట్‌ను ఆకర్షణీయం చేసేందుకు వినిపిస్తోన్న మార్పులన్నీ నిరుపయోగమైనవని నా అభిప్రాయం. ఆటకు ఆదరణ కల్పించాలంటే మంచి మార్కెటింగ్ అవసరం అంతేగానీ పిచ్ పొడవు తగ్గించకూడదు. మేం బంతిని బలంగా బాదలేమనే ఉద్దేశంతో బంతి బరువు తగ్గించాలనుకోవడం సరికాదు. ఇటీవల మహిళా క్రికెట్లో పవర్‌హిట్టింగ్ పెరగడం అందరూ చూస్తున్నారు. పురుష అథ్లెట్లకు సమానమని అనిపించుకునేందుకు ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం మహిళా స్ప్రింటర్ 100 మీటర్ల పరుగును 80 మీటర్లే పరుగెత్తాలనుకోదు. ఇది అంతే. మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం అన్ని మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయాలి. మా మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మాలో సత్తా ఉందని వారు నమ్ముతున్నారు. మీరు కూడా మమ్మల్ని నమ్మండి’ అని శిఖా కోరింది. -
రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తన యాంటీ-వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మార్కెటింగ్ అనుమతి కోరుతూ భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్‌కు దరఖాస్తు చేసింది. ఇప్పటికే అమెరికా, జపాన్‌లో ప్రత్యేక అనుమతిని పొందిన ఈ సంస్థ తాజాగా తన మందును భారత్‌లో కూడా విక్రయించాలనుకుంటోంది. భారత్‌లో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో కోవిడ్-19 చికిత్సలో సమర్ధవంతంగా పని చేస్తుందని గిలియడ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెమెడిసివిర్ మార్కెటింగ్ అధికారాన్ని కోరుతూ కేంద్ర ప్రామాణిక ఔషధ నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ)కు గిలియడ్ దరఖాస్తు చేసింది. రెమెడిసివిర్ ప్రీ-క్లినికల్, క్లినికల్ అధ్యయనాల పూర్తి డేటా తమ వద్ద ఉందని, దీన్ని పరిశీలించి, సంబంధిత అనుమతులు మంజూరు చేయాలని రెమెడిసివిర్ పేటెంట్దారు అయిన గిలియడ్ కోరినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీడీఎస్ సీఓ నిపుణుల కమిటీ సహాయంతో దీన్ని పరిశీలించనుంది. ఈ సిఫారసుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని సంస్థ అధికారి వెల్లడించినట్టు సమాచారం. (అక్టోబరు చివరకు కరోనా వ్యాక్సిన్ : ఫైజర్) రెండు భారతీయ ఔషధ సంస్థలు సిప్లా, హెటెరో ల్యాబ్స్ భారతదేశంలో రెమిడెసివిర్ తయారీ, అమ్మకాలకు అనుమతి కోరుతూ డ్రగ్ రెగ్యులేటర్‌కు ఇటీవల దరఖాస్తు చేశాయి. అంతేకాకుండా రెమెడిసివిర్ క్లినికల్ ట్రయల్స్ రద్దు చేయాలని, తద్వారా రోగులకు వేగంగా అందుబాటులోకి తేవాలని కోరాయి. అయితే ఈ దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయని నియంత్రణ సంస్థ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు రెమిడెసివిర్ తయారీ, పంపిణీకిగాను సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ హెటెరోతో సహా కొన్ని దేశీయ ఫార్మా సంస్థలతో గిలియడ్ ప్రత్యేకమైన లైసెన్సింగ్ ఒప్పందాలను ఇప్పటికే కుదుర్చుకుంది. యుఎస్ క్లినికల్ డేటా ఆధారంగా , జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ డ్రగ్ వినియోగానికి మే 7న ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా 2019 న్యూ డ్రగ్ అండ్ క్లినికల్ ట్రయల్స్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక పరిస్థితులలో క్లినికల్ ట్రయల్స్‌ను రద్దు చేయడంతోపాటు రెమిడెసివిర్ వినియోగానికి అనుమతి లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు కరోనా వైరస్ రోగులలో రెమెడిసివిర్ మందు ఇచ్చినప్పుడు ఇద్దరిలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. అటు ఆసుపత్రిలో చేరిన రోగులకు రెమెడిసివిర్ వినియోగించాలని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ (యూఎస్ ఎఫ్‌డీఏ) ఇయుఎ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సీవీఆర్, చోహన్ క్యు సాగు పద్ధతులపై శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యు ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, స్వచ్ఛంద సంస్థ ‘సర్ర’ డైరెక్టర్ రోహిణీ రెడ్డి (బెంగళూరు)తోపాటు.. మట్టిని ఎరువుగా, పురుగులమందుగా వాడే మట్టి సేద్య పద్ధతి ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్) ఈ నెల 29(బుధవారం)న రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు శిక్షణ ఇస్తారు. డా. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు ఈ శిక్షణలో రైతులకు తెలియజేస్తారు. డా. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్ (ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్) బెడ్ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యేక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. వివరాలకు.. సంపత్‌కుమార్ – 98854 55650, నీలిమ – 99636 23529. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై 5 రోజుల శిక్షణ సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.), గ్రామీణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయ రంగంలో వివిధ స్థాయిలో వ్యాపారావకాశాలు, ప్రభుత్వ నియమ నిబంధనలు, సమస్యలపై ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం నిర్వహించనున్నట్లు సి.ఎస్.ఎ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు తెలిపారు. పిజిఎస్ ఇండియా సేంద్రియ సర్టిఫికేషన్ నియమాలపై కూడా అవగాహన కల్పిస్తారు. హైదరాబాద్ తార్నాకలోని సెయింట్ ఆన్స్ జెనరలేట్‌లో జరుగుతుంది. ఫీజు రూ. 15 వేలు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన నంబరు.. 85006 83300. trainings@csa-india.org/https://csa-india.org/events/200217-organic-food-marketing/ 2న కొర్నెపాడులో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఫిబ్రవరి 2 (ఆదివారం)న గొర్రెలు, మేకల పెంపకంపై కడప జిల్లాకు చెందిన పశువైద్య నిపుణులు డా. జి. రాంబాబు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు 97053 83666, 0863–2286255 2న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349. రేపు సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్‌పై సదస్సు సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, మార్కెటింగ్ సమస్యలపై ఈ నెల 29(బుధవారం) మధ్యాహ్నం 2 గం. నుంచి సా. 5 గం. వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని మారుతి నర్సరీ(అమ్మపల్లి, నర్కోడా–ఒయాసిస్ స్కూల్ ఎదురు)లో రైతులు, వ్యాపారుల అవగాహన సదస్సు జరగనుంది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, హార్ట్ ట్రస్టు, భారతీయ కిసాన్ సంఘ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు – 76598 55588, మహిపాల్‌రెడ్డి – 76609 66644 -
వాట్సాప్ విజేతలు
వాట్సాప్‌లో దగ్గరివాళ్లంతా కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం ఒక ఆత్మీయ బంధం. వాట్సాప్‌లో ఒక గ్రామం పేరుతో గ్రూప్ క్రియేట్ చేసుకుని అభివృద్ధి వివరాలను తెలియ చేసుకోవడం ఓ సామాజిక బంధం. అలాగే వాట్సాప్‌ను చక్కగా వినియోగించుకుని వ్యక్తిగత నైపుణ్యాలకు మార్కెటింగ్ కల్పించుకోవడం ఒక వ్యాపార బంధం. ఈ బంధంతో వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న గృహిణులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం. వారి నుంచి స్ఫూర్తిని పొందుదాం. నెల్లూరు పట్టణంలో చీరల షోరూమ్ నడుపుతున్న తుంగా భారతినే తీసుకోండి. ఆమె బిజినెస్ వాట్సాప్ ద్వారా చాలా వేగంగా జరిగిపోతోంది. ‘‘మొదట్లో నేను హాబీగా ఫ్రెండ్స్‌కు, బంధువులకు వాళ్లకు నప్పే విధంగా డ్రస్‌లు డిజైన్ చేయించి ఇచ్చేదాన్ని. నా పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత రోజంతా ఖాళీ అనిపించేది. దాంతో రెండేళ్ల కిందట పూర్తి స్థాయిలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను. ఇప్పుడు ‘విఆర్కే’ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నాను. నా కస్టమర్లు ఎక్కువమంది విదేశాల్లో ఉన్నారు. అందరం వాట్సాప్ గ్రూప్‌తో కనెక్ట్ అయి ఉన్నాం. కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఆ రోజే ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌లో షేర్ చేస్తే, తెల్లవారి నిద్ర లేచేసరికి ఆర్డర్లు రెడీగా ఉంటాయి. వాళ్ల సందేహాలు కూడా. వాటన్నింటికీ ఓ గంటలో మా టీమ్ రిప్లయ్ ఇచ్చేస్తుంది. ఆర్డర్లుగా వచ్చిన చీరలకు వర్క్ బ్లవుజ్ కూడా రెడీ చేయించి సోమవారం కొరియర్ చేస్తే గురువారానికి అమెరికాకు చేరిపోతాయి. ఆ వీకెండ్ పార్టీకి కట్టేసుకుంటారు. మొత్తం టాస్క్ పది రోజుల నుంచి రెండు వారాల్లో పూర్తయిపోతుంది’’ అని చెప్పారు భారతి. ఢిల్లీలో మరాఠా భోజనం అభిలాష ఐదేళ్ల కిందట ఇంట్లో వంటలు చేసి ఢిల్లీలోని మరాఠీయులకు సప్లయ్ చేయడం మొదలు పెట్టాలనుకుంది. మెల్లిగా దాన్నే వ్యాపారంగా మలుచుకుంది. పెద్ద పెద్ద క్యూజిన్లు, కాంటినెంటల్ ఫుడ్ రెస్టారెంట్ల కాలంలో కూడా అభిలాష ఫుడ్ బిజినెస్ విస్తరించింది. వాట్సాప్ అనే లాంచింగ్ పాడ్ మీదనే తన వ్యాపారం సాగుతోందని చెప్పింది అభిలాష. ‘‘నేను గృహిణిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేదాన్ని. చాలా మంది మహిళలు ఏదో ఒక అభిరుచితో ఉండడాన్ని గమనించాను. నేను ఖాళీగా రోజు గడిపేస్తున్నాననిపించింది. ఏదైనా చేద్దామంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు వంట చేయడం ఇష్టం. కాబట్టి తెలిసిన పని, ఇష్టమైన పనిలోనే ప్రవేశించాలనుకుని ఓ రోజు నా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లందరికీ ‘సంప్రదాయ మార్వాడీ భోజనాన్ని వండుతాను’ అని మెసేజ్ పెట్టాను. ‘మాకు కావాలంటే మాక్కావాలంటూ..’ అని నేను ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. అలా మొదలైన నా భోజన వ్యాపారం ఇప్పుడు పది వాట్సాప్ గ్రూపులతో నడుస్తోంది. ఒక్కో గ్రూప్‌కి 250 మంది లెక్కన నా ఫుడ్ కస్టమర్లతో పది గ్రూపులున్నాయిప్పుడు. డెబ్బై శాతం వ్యాపారం వాట్సాప్ ఆర్డర్ల ద్వారానే సాగుతోంది. అన్నీ ‘టేక్ అవే’నే! ఇలానే మరికొందరు షబ్రి హోమ్ డెకోర్ ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్న గుంజన్ది కూడా ఇదే బాట. ఫేస్బుక్, వాట్సాప్‌లోనే వ్యాపారం జరుగుతోంది. వాట్సాప్ ద్వారా కస్టమర్ ప్రశ్నలకు బదులిస్తూ వారిని సమాధానపరచడం ద్వారా నిశ్శబ్దంగా జరిగిపోతోందని చెప్తోంది గుంజన్. పన్నెండేళ్ల పాటు ముంబయిలో అడ్వరై్టజ్‌మెంట్ ఫర్మ్‌లో పని చేసిన ఆమె ఇతర ఉద్యోగాలకంటే ఇదే బాగుందని చెప్పింది. ‘యునిక్ త్రెడ్స్’ షణ్ముఖ ప్రియది కూడా వాట్సాప్ విజయమే. చంటి బిడ్డను చూసుకునే వాళ్లు లేక ఈ తమిళమ్మాయి ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. జీవితాన్ని నిరుపయోగంగా గడుపుతున్నాననే భావన వేధించినంత కాలం వేధించిందామెను. పాపాయి పెద్దయిన తర్వాత ముప్పై వేలతో మొదలైన వస్త్ర వ్యాపారం ఇప్పుడు పదహారు వాట్సాప్ గ్రూపులతో నడుస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రీతి సిన్హా అయితే బిడ్డ పుట్టినప్పుడు తాను పెరిగిన బరువు తగ్గడానికి అనుసరించిన మార్గంలోనే వ్యాపారాన్ని ఎంచుకుంది. ‘గ్రీన్ అండ్ మోర్’ పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టింది. బరువు తగ్గడానికి, శక్తి పెరగడానికి డాక్టర్లు సూచించిన ఆహారాన్ని కస్టమర్ ఆరోగ్యానికి తగినట్లు వండి సప్లయ్ చేస్తోందీమె. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. మీలోనూ ఏదో చేయాలన్న తపన ఉంది. భారతి, అభిలాష, ప్రియాంక, గుంజన్, షణ్ముఖ ప్రియ, ప్రీతీ సిన్హా.. ఆ తర్వాతి పేరు మీదే ఎందుకు కాకూడదు? – వాకా మంజులారెడ్డి సరిహద్దు దాటిన కళ ప్రియాంక తన వస్త్ర వ్యాపారాన్ని వాట్సప్ యుగానికి ముందే మొదలు పెట్టింది. గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమైంది. రోజంతా నాలుగ్గోడల మధ్య ఉంటూ, ఏ పనీ చేయకుండా గడపడం ఆమెకు దుర్భరంగా తోచింది. చదువుకునే రోజుల్లో హాబీగా నేర్చుకున్న ఫ్యాబ్రిక్ పెయింటింగ్నే ప్రవృత్తిగా మార్చుకుంది. పిల్లలతో పాటే ఆమె వ్యాపారమూ ఎదిగింది. పెయింటింగ్ చేయడానికి అనువుగా చీరల ప్యాటర్న్లు చేనేతకారులకు ఇచ్చి మరీ తయారు చేయించేది. ఇందుకోసం తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సప్ ద్వారా ప్యాటర్న్లు పంపించడంతో శ్రమ తగ్గిపోయింది. సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. గుర్గావ్లోనే ఉంటూ బెంగాల్ నుంచి న్యూ జెర్సీ వరకు తన క్లయింట్లతోనూ, తనకు పని ఇస్తున్న చేనేతకారులతోనూ కాంటాక్ట్‌లో ఉంటోంది. షో రూమ్ ద్వారా జరిగే వ్యాపారం కంటే వాట్సప్ ఆర్డర్లు, విక్రయాలే ఎక్కువ అంటోంది ప్రియాంక. -
23న చిరుధాన్యాల ప్రాసెసింగ్, మార్కెటింగ్‌పై శిక్షణ
చిరుధాన్యాల ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగంలోకి అడుగుపెట్టదలచిన ఔత్సాహికులు, స్టార్టప్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) ఈ నెల 23న హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో సంస్థ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనుంది. చిరుధాన్యాల ప్రాసెసింగ్ సదుపాయాలు, టెక్నాలజీ లైసెన్సులు పొందే మార్గాలు, ఇంక్యుబేషన్ సేవలపై ఈ శిక్షణలో అవగాహన కలిగిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 94904 76098, 04024599379 / 29885838 www.nutrihub-tbi-iimr.org గోవాలో సేంద్రియ వ్యవసాయ వర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి గోవా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఏడాది లోగా యూనివర్సిటీని ప్రారంభిస్తామని గోవా ఉపముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి చంద్రకాంత్ కవలేకర్ ప్రకటించారు. అత్యాధునిక సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తేవడం, రాష్ట్రానికి అనువైన సేంద్రియ పంటలపై పరిశోధనలు చేయడానికి అనుగుణంగా యూనివర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు. సేంద్రియ పంటల ఉత్పాదకత పెంపుదల, నాణ్యత నియంత్రణ, పరిశోధన, అభివృద్ధి సంబంధ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సేంద్రియ వర్సిటీ స్థానికులకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. గుజరాత్లో ఆనంద్ యూనివర్సిటీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన డా. మదన్‌గోపాల్ వర్షణిని సేంద్రియ యూనివర్సిటీ చీఫ్ స్ట్రాటజిస్ట్‌గా నియమించారు. జల సంరక్షణ, బోరు రీచార్జ్ పద్ధతులపై శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోర్లను రీచార్జ్ చేసుకునే పద్ధతి సహా వివిధ జల సంరక్షణ పద్ధతులపై డిసెంబర్ 16న స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు, రైతు బృందాలు, వ్యక్తులకు సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వాటర్ అండ్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సురన ఆడిటోరియంలో శిక్షణ ఇవ్వనుంది. భూగర్భ జల సంరక్షణలో అపారమైన అనుభవం కలిగిన జలవనరుల ఇంజినీరు ఆర్. వి. రామమోహన్ శిక్షణ ఇస్తారు. జలసంరక్షణలో అనుభవాలను పంచుకునే ఆసక్తి గల వారు కూడా సంప్రదింవచ్చు. ఈ నెల 30లోగా రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1,500. ఇతర వివరాలకు.. 040–27014467 email: wlfoundation@outlook.com 20న కుంచనపల్లిలో కూరగాయల రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేయదలచిన, చేసే ఆలోచన ఉన్న రైతులకు ఈ నెల 20(బుధవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని సీనియర్ రైతు ఎ. సాంబిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం శిక్షణ ఇవ్వనుంది. వివిధ జిల్లాల్లో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ సేంద్రియ కూరగాయలు సాగు చేసే రైతులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. జగదీష్ – 78934 56163 24న సేంద్రియ దానిమ్మ, జామ, అంజూర సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులో ఈ నెల 24(ఆదివారం)న సేంద్రియ వ్యవసాయ విధానంలో దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సాగు విధానంపై, జీవన ఎరువుల వినియోగంపై రైతులు హనుమాన్ కిషోర్ (ప్రకాశం), శ్రీనివాసరావు(ప.గో.) శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. ముందుగా పేర్ల నమోదుకు సంప్రదించాల్సిన నంబర్లు.. 97053 83666, 0863–2286255 26న సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై సదస్సు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం(ట్రీ), మిషన్ జలనిధి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం (డబ్ల్యూ.ఎం.ఎఫ్.) ఆధ్వర్యంలో సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై ఈ నెల 26(మంగళవారం)న ఉ. 9 గం. నుంచి సిద్ధిపేట జిల్లా జగ్దేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో రైతు సదస్సు జరగనుంది. ‘ట్రీ’ అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, డబ్ల్యూ.ఎం.ఎఫ్. చైర్మన్ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, మిషన్ జలనిధి చైర్మన్ జి.దామోదర్‌రెడ్డి, గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాక్షి సాగుబడి ఇన్చార్జ్ పంతంగి రాంబాబు సిరిధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తారు. వివరాలకు: కృష్ణమోహన్ – 99490 55225 19న తాడూర్‌లో మామిడి సాగుపై క్షేత్రస్థాయి శిక్షణ గ్రామభారతి సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగులో వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలపై రైతులకు ఈ నెల 19(మంగళవారం) నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం తాడూర్లోని డా. మధుసూదన్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. పలువురు మామిడి రైతులు తమ అనుభవాలను పంచుకుంటారు. మార్కెటింగ్ విధానం, సేంద్రియ ధృవీకరణ, మామిడి రైతుల సంఘం ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. డా. మధుసూదన్‌రెడ్డి – 77027 71282, టి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి – 94924 23875, బాలస్వామి – 97057 34202. -
‘పల్లె కల్లు.. పట్నం దాకా’
సాక్షి, జగిత్యాల: గ్రామాల్లో ఈత, తాటి కల్లును అమ్ముకుని, ఆయా గ్రామాల్లోని గీత కార్మికులు జీవనం సాగిస్తుంటారు. కాని ప్రస్తుతం గ్రామాల్లో ఈత, తాటి చెట్లు తగ్గుతుండటంతో, పాటుగా కొన్ని రకాల తెగుళ్లు వ్యాపించి ఉన్న చెట్లు సైతం కల్లుగీతకు పనికి రాకుండా పోతున్నాయి. దీంతో, గీత కార్మికులకు ఉపాధి దొరకక రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కల్లుగీతపైనే ఆధారపడిన గ్రామాల్లో గీత కార్మికుల సంఘాల తరుపున భూములు కొనుగోలు చేయడం లేదా ప్రభుత్వ భూములను లీజు ప్రతిపాదికన తీసుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వ సహాకారంతో వినూత్న పద్ధతిలో ఈత వనాలు పెంచేందుకు ప్రయత్నిస్తూ విజయవంతమవుతున్నారు. జిల్లాలో తొలుత నాగులపేట సంఘం జగిత్యాల జిల్లాలో తొలుత కోరుట్ల మండలంలోని నాగులపేట గీత కార్మిక సంఘం ఈత వనాల పెంపకంలో ఇతర గ్రామాల గీత కార్మికులకు ఆదర్శంగా మారారు. ఆ గ్రామంలో 70 మంది గీత కార్మికులు కల్లుగీతపైనే ఆధారపడతారు. ఈత వనాల సంఖ్య తగ్గిపోవడంతో, గ్రామంలో ఓ 20 ఎకరాల వరకు కొనుగోలు చేసి, ఈత వనాన్ని ఓ పద్ధతి ప్రకారం మూడేళ్లుగా పెంచి, నాలుగవ ఏడాది నుంచి కల్లు గీస్తూ ఉపాధి పొందుతున్నారు. మొక్కల నర్సరీ నుంచి మంచి నాణ్యమైన ఈత మొక్కలను తీసుకుని 4 5 పద్ధతిలో నాటారు. నాటే ముందు డీఏపీ వంటి ఎరువులను వాడారు. ఎప్పటికప్పుడు కింది కొమ్మలను కత్తిరించి, ప్రతీ ఏటా ఎరువులు వేస్తూ కల్లు దిగుబడిని తీస్తున్నారు. మొక్కలను పెట్టిన సమయంలో నీటి ఎద్దడికి గురికాకుండా ఓ కూలీ మనిషిని పెట్టి విజయవంతంగా ఈతవనాన్ని పోషించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఇందులో 2500 వరకు ఈత చెట్లు ఉన్నాయి. రెండో గ్రామంగా అంతర్గాం సంఘం ఆదర్శం జగిత్యాల మండలంలోని అంతర్గాం గీత కార్మికులు మాజీ జెడ్పీటీసీ జితేందర్‌రావు నేతృత్వంలో నాగులపేట ఈతవనాన్ని సందర్శించి, మూడేళ్ల క్రితం వీరు సైతం ఈత వనాన్ని పెంచారు. వీరు మరింత ముందడుగు వేసి డ్రిప్ ద్వారా సాగు నీటితో పాటు ఎరువులను కూడా అందిస్తున్నారు. దాదాపు 100 మంది సంఘ సభ్యులు, దాదాపు 5వేల మొక్కలను, 9‘‘9 పద్ధతిలో 8 ఎకరాల్లో నాటారు. ఒక్కో మొక్కకు రూ.25 చొప్పున సంగారెడ్డిలోని నర్సరీల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. దాదాపు మూడేళ్ల క్రితం ఈత మొక్కలను నాటగా, ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. మరో ఏడాదిలో కల్లు గీతకు వచ్చే అవకాశం ఉంది. పక్కకు చెరుకు కట్ట ఉండగా, ఆ కట్టకు సైతం ఈత మొక్కలను నాటారు. నాటేందుకు ముందు కోళ్ల ఎరువును వేయగా, యూరియా, పొటాష్‌ను డ్రిప్ ద్వారా నేరుగా మొక్కల మొదళ్ల దగ్గర పడేలా చేశారు. అలాగే ఈత వనంలో కలుపు మొక్కలు పెరగకుండా ట్రాక్టర్‌తో అంతర కృషి చేస్తున్నారు. పలువురు ప్రముఖుల సందర్శన అంతర్గాం గీత కార్మికులు పెంచిన ఈతవనాన్ని ఇప్పటికే అప్పటి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పరిశీలించి, ఇతర గ్రామాల్లో సైతం డ్రిప్ ద్వారా ఈత వనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం విశేషం. అలాగే ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డితో పాటు మంత్రి హరీష్‌రావు సూచన మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని గీత కార్మికులు సైతం అంతర్గాంలోని ఈతవనాన్ని పరిశీలించి వెళ్లారు. ఈ రెండు గ్రామాల్లోని ఈత వనాలను చూసిన గీతకార్మికులు, జగిత్యాల మండలంలోని మోతె, జగిత్యాల, అంతర్గాం, అంబారిపేట గీత కార్మికులు ఈతవనాన్ని పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం గమనార్హం. పల్లె కల్లు పట్నం కోసం.. ఈత చెట్ల నుంచి వచ్చే కల్లును మార్కెటింగ్ చేసేందుకు కూడా గీతకార్మికులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇక అమ్మగా, మిగిలిపోయిన ఈత కల్లును పట్నం పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఒక్కో ఈత చెట్టుకు కనీసం 5 లీటర్ల కల్లు వస్తుంది, 5వేల ఈత చెట్లకు 25వేల లీటర్ల కల్లు వస్తుంది. ఇంత కల్లు గ్రామంలో కాని, సమీప పట్టణ ప్రాంతాల్లో కాని అమ్ముడు పోదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో అంతర్గాం కల్లు హైద్రాబాద్ పట్నానికి పంపేలా సైతం ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు చేస్తున్నారు. దీనివల్ల గీత కార్మికులకు మంచి అదాయం రావడమే కాకుండా, రుచికరమైన నాణ్యమైన ఈత కల్లు ఈత కల్లు తాగే ప్రియులకు వరంగా మారనుంది. కార్యక్రమం వల్ల ఇరువర్గాలకు సైతం లాభం చేకూరనుంది. మా ఈత వనాన్ని చూసి వెళ్లారు కొన్నేళ్లుగా మా సంఘం భూమి వృథాగా ఉండటంతో, మూడేళ్ల క్రితం ఈత వనాన్ని పెంచాం. ఈత వనాన్ని పెంచడం వల్ల మా సంఘంలోని 100 మంది సభ్యులకు ఉపాధి దొరికే అవకాశం ఏర్పడింది. మా ఈత వనాన్ని చూసి చాలామంది గౌడ కులస్తులు మా బాటలో ఈత మొక్కలను పెంచేందుకు ముందుకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. – గొడిసెల శంకర్ గౌడ్ , గౌడ సంఘం నాయకుడు, అంతర్గాం -
నిధులు మింగిన బాబు
మార్కెటింగ్ శాఖ నిధులను చంద్రబాబు సర్కారు దారి మళ్లించింది. ఫలితంగా రైతు బంధు పథకం నిలిచిపోయింది. ఎంతో ఆత్రుతగా గిడ్డంగుల్లోకి ధాన్యాన్ని తరలించిన రైతులకు నిరాశ ఎదురైంది. తక్షణ అవసరాలు తీరక అప్పులు చేయాల్సి వస్తోంది. కొందరు రైతులైతే రైతు బంధు రుణాలు నిలిచాయని తెలుసుకుని నష్టానికే అమ్ముకున్నారు. కొడవలూరు: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు అన్నదాతలు నష్టపోకుండా రైతు బంధు పథకం దోహదపడుతుంది. ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు నష్టానికి అమ్ముకోకుండా మార్కెటింగ్ శాఖ గిడ్డంగుల్లో ఈ పథకం కింద భద్రపరచుకోవచ్చు. ఇలా భద్రపరచుకున్న ధాన్యానికి విలువ కట్టి అందులో 75 శాతాన్ని రైతులకు ముందుగానే మార్కెటింగ్ శాఖ వారు ఇచ్చేస్తారు. ఈ మొత్తంతో రైతులు తక్షణ అవసరాలు తీర్చుకుని ధాన్యానికి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. మార్కెటింగ్ శాఖ రైతులకిచ్చిన మొత్తానికి ఆర్నెల్ల దాకా ఎలాంటి వడ్డీ ఉండదు. రైతు మంచి ధరకు ధాన్యం అమ్ముకున్నప్పుడు మాత్రమే తీసుకున్న మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఒక్కో రైతుకు రూ.2 లక్షల దాకా మాత్రమే రుణం కింద ఇస్తారు. ఒక వేళ ఆర్నెల్లకు పైబడినా గిడ్డండుల్లో ఉంచితే మాత్రం తీసుకున్న రుణానికి అతి తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆర్నెల్లలోపే విక్రయించుకుంటారు. గనుక వడ్డీ సమస్య ఉండదు. ఆశలు అడియాసలు రైతు బంధు పథకం అమలులో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రబీలో మరో ఆరు వేల మెట్రిక్ టన్నుల గిడ్డంగులు అందుబాటులోకి రావడంతో ఈ పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఈ మార్కెట్ కమిటీ సెస్సు వసూళ్లలోనూ జిల్లాలోనే ముందంజలో ఉంది. ఆ నిధులనే రైతు బంధు పథకం ద్వారా రైతులకు రుణాలిస్తూ వస్తున్నారు. కమిటీ పరిధిలోని నార్తురాజుపాళెం మార్కెట్ యార్డ్‌లో కొత్తగా మరో ఆరు వేల మెట్రిక్ టన్నుల గిడ్డంగులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ రబీ పంటకు రైతు బంధు పథకం మరింత విస్తరించాలని సంకల్పించారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉన్న నిధులన్నింటినీ చంద్రబాబు సర్కారు లాగేసుకోవడంతో ఈ రబీ రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపివేశారు. రైతులకు మొండిచేయి కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కోవూరు, కొడవలూరు,విడవలూరు, అల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, దగదర్తి మండలాలున్నాయి. ఈ మండలాలన్నీకూడా పూర్తిగా డెల్టా మండలాలే కావడంతో లక్షా 30 వేల ఎకరాల దాకా వరి సాగవుతుంది. అన్నీ డెల్టా మండలాలే కావడంతో సెస్సు వసూలు గణనీయంగా ఉంది. నిర్దేశించిన సెస్సు లక్ష్యాలను ఛేదించడంలోనూ జిల్లాలోనే ముందంజలో ఉంది. జిల్లాలో 11 మార్కెట్ కమిటీలుండగా, వీటి సెస్సు వసూలు లక్ష్యం రూ.26.16 కోట్లు కాగా జిల్లాలోని అన్ని కమిటీలు కలిపి కేవలం రూ.24.14 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. కోవూరు మార్కెట్ కమిటీ మాత్రం లక్ష్యం రూ.5.20 కోట్లు కాగా, రూ.5.90 కోట్లు వసూలు చేసింది. సెస్సు రూపంలో వచ్చిన మొత్తాన్ని రైతు బంధు పథకానికి వినియోగించుకునే వెసులుబాటు ఉండడం, అదనంగా గిడ్డంగులు అందుబాటులోకి రావడంతో ఈ రబీలో 480 మంది రైతులకు రైతు బంధు రుణాలివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది కేవలం 271 మంది రైతులకే రైతు బంధు రుణాలిచ్చారు. కమిటీలో గతంలోని రూ.8 కోట్లు నిధులుండడంతోపాటు ఈ రబీలో రూ.6 కోట్ల దాకా సెస్సు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ నిధులన్నీ బాబు సర్కారు లాగేసుకొంది. రైతుల పరిస్థితి దయనీయం రైతు బంధు రుణాలిస్తారు గనుక తక్షణ అవసరాలు గడుపుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామన్న ఉద్దేశంతో రైతులు అధికారుల లక్ష్యాల మేర గిడ్డంగులకు సరిపడా ధాన్యం నిల్వ బెట్టారు. తీరా రుణాలు చేతికందకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులు పంట సమయంలో ఎరువులు, పురుగు మందులు తదితరాలన్నీ దుకాణాల్లో అప్పు కింద తెస్తారు. పంట చేతికందాక వారి అప్పు చెల్లించేస్తారు. రైతులు ధాన్యం అమ్ముకోకపోయినా రైతు బంధు రుణం తీసుకుని అప్పు చెల్లిస్తారు. రుణమందుతుందని భావించి ధాన్యం గిడ్డంగుల్లో ఉంచిన వారి పరిస్థితి అప్పులు చేయాల్సి వస్తోంది. ఆర్థికపరమైన చిక్కుల వల్లే ఆర్థికపరమైన కొన్ని చిక్కుల వల్ల రైతు బంధు పథకాన్ని ఇప్పటి దాకా అమలు చేయలేదు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. సమస్య పరిష్కారమైన వెంటనే రైతు బంధు రుణాలిస్తాం. – ఉపేంద్రకుమార్,ఏడీ మార్కెటింగ్ శాఖ -
ఈ–నామ్ అమలులో తెలంగాణ అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖలో సంస్క రణలు అనూహ్య ఫలితాలు ఇవ్వడమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ–నామ్ పథకం అమలులో ఎన్నో మైలురాళ్లు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ–నామ్‌తోపాటు ఈ–నామ్‌యేతర వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనూ ఆర్థిక లావాదేవీలు పెం పొందించుకున్నట్లైతే అంతర్జాతీయ ఎగుమతులకు అవకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. మంగళవారం తెలంగాణ, ఏపీలలో ఈ–నామ్ వ్యవస్థ, వ్యవసాయ, ఉద్యానోత్పత్తుల కొనుగోళ్లపై జరిగిన అంతర్రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మూడేళ్లకాలంలో 47 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 22 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయోత్పత్తుల విక్రయాలు జరగడం ద్వారా రూ.9 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. ఈ–నామ్ అమలవుతున్న మార్కెట్లలో లైసెన్సింగ్ విధానం, మోడల్ యాక్ట్, నిబంధనలు, లావాదేవీలు వంటి అంశాలపై వర్తకులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ, ఏపీల్లో 64 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలవుతున్న నేపథ్యంలో అంతర్రాష్ట్రాల మధ్య వ్యాపారం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో 22 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలవుతోందని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ వెల్లడించారు. -
ఏడాదిలో 10 ఐస్ప్రౌట్ సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ వర్క్‌స్పేసెస్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఐస్ప్రౌట్... కొత్త నగరాలకు విస్తరిస్తోంది. 2019 మార్చిలో చెన్నైలో 210 సీట్ల సామర్థ్యం ఉన్న కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. పుణే, బెంగళూరు, గుర్గావ్లోనూ ఆరు నెలల్లో బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు సంస్థ కో–ఫౌండర్ సుందరి పాటిబండ్ల ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి తెలిపారు. ఇటీవలే విజయవాడలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 సీట్ల సామర్థ్యం గల కార్యాలయాన్ని ప్రారంభించామని, 2019 డిసెంబరుకల్లా 10 సెంటర్లతో మొత్తం 7,000 సీట్ల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యమని వెల్లడించారు. ‘హైదరాబాద్‌లో ఐస్ప్రౌట్కు 1.3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 2,400 సీట్ల సామర్థ్యం గల బిజినెస్ సెంటర్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్ సామర్థ్యం పరంగా భారీ, ప్రీమియం బిజినెస్ సెంటర్ ఇది. ఇప్పటి వరకు రూ.25 కోట్లు వెచ్చించాం. భవిష్యత్ విస్తరణలో భాగంగా వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలన్నది మా ఆలోచన’ అని ఆమె వివరించారు. -
75 శాతం కందులను కేంద్రం కొనాలి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: కంది, పప్పుదినుసుల ఉత్పత్తిలో 75 శాతం మేర కొనుగోలు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం 60 రోజులుగా ఉన్న సేకరణ దినాలను 150 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఉత్పత్తిలో 25 శాతమే కేంద్రం కొనుగోలు చేయడం, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం వల్ల అప్పులే మిగులుతున్నాయని పేర్కొన్నారు. గతేడాది కేంద్రం 75,300 క్వింటాల్ కందులు మాత్రమే కొనుగోలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 1.84 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇందులో ఇప్పటికీ కేవలం 12 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే విక్రయించగా క్వింటాల్‌కు రూ.3,500 ధర మాత్రమే వచ్చినట్లు పేర్కొన్నారు. మయన్మార్ తక్కువ ధరకే పప్పును ఎగుమతి చేస్తోందని, ఇది ధరలపై ప్రభావం చూపుతోందన్నారు. ఎగుమతి, దిగుమతి విధానాలపై దృష్టి సారించి మార్పులు చేయాలని, తద్వారా స్థానిక రైతులకు మేలు చేసినట్లవుతుందని వివరించారు. -
బాటిళ్లలో ‘మహువా’ అమ్మకాలు
న్యూఢిల్లీ: సంప్రదాయ గిరిజన పానీయం ‘మహువా’ను బాటిళ్లలో నింపి మార్కెటింగ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వన్‌ధన్ కార్యక్రమం కింద గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య ట్రైఫెడ్తో అవగాహనా ఒప్పందం కుదర్చుకుందని అధికారులు తెలిపారు. అయితే మహువాలో ఆల్కహాల్ పాళ్లు ఉన్నందున దాని అమ్మకానికి ఇంకా పలు అనుమతులు రావాల్సి ఉంది. బాటిళ్లలో నింపే సమయంలోనే ఈ పానీయానికి అల్లం, వాము కలిపితే మరింత రుచికరంగా మారుతుందని ట్రైఫెడ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గిరిజనుల ఏ వేడుకలోనైనా సేవించే ఈ పానీయాన్ని మహువా పువ్వుల నుంచే తయారుచేస్తారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని గరిజన ప్రాంతాల నుంచి ఈ ఉత్పత్తిని సేకరిస్తారు. గిరిజనుల ఇతర ఉత్పత్తులైన చింతపండు, ఉసిరిని కూడా జామ్ రూపంలో మార్కెటింగ్ చేయాలని కూడా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
ఈ ఏడాదే ఎయిరిండియా విక్రయం
న్యూఢిల్లీ: భారీ రుణభారం, నష్టాలతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో వాటాల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌కు స్పందన కరువవడంతో.. నిబంధనలను సవరించాలని యోచిస్తోంది. వీటిని త్వరలోనే ఖరారు చేసి, ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2017 మార్చి ఆఖరు నాటికి ఎయిరిండియా రుణభారం దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నెగ్గుకొస్తున్న ఎయిరిండియాతో పాటు రెండు అనుబంధ సంస్థలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందు కొన్ని సంస్థలు ఆసక్తి కనపర్చినా.. బిడ్డింగ్‌కు ఆఖరు తేదీ అయిన మే 31 దాకా కూడా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఈ ఎదురుదెబ్బతో.. బిడ్డర్లను ఆకర్షించడంలో వైఫల్యానికి గల కారణాలను అన్వేషించడంలో కేంద్రం తలమునకలైంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ప్రభుత్వం ఊహించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. తాజా పరిణామంతో.. విక్రయ లావాదేవీకి సలహాదారుగా వ్యవహరిస్తున్న సంస్థ నుంచి వివరాలను సేకరించి, తదనుగుణంగా బిడ్డింగ్ నిబంధనలను సవరించడంపై దృష్టి సారించింది. ఒకవేళ సవరించినా... వాటాల విక్రయ ప్రతిపాదన గతంలో రూపొందిన దానికి పూర్తి భిన్నంగా మాత్రం ఉండబోదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రూ. 1,000 కోట్ల సమీకరణలో ఎయిరిండియా .. వరుసగా మూడో నెలలో కూడా 11,000 మంది పైచిలుకు ఉద్యోగులకు జీతభత్యాలు సకాలంలో చెల్లించలేకపోవడంతో.. ఎయిరిండియా అర్జంటుగా నిధుల వేటలో పడింది. అత్యవసర నిర్వహణ మూలధన అవసరాల కోసం రూ. 1,000 కోట్ల మేర స్వల్పకాలిక రుణాల సమీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
మార్కెట్లోకి త్వరలో జీసీసీ ఉత్పత్తులు: చందూలాల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా వ్యవసాయ, అటవీ ఉత్పత్తు లను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చెప్పారు. సోమవారం సచివాలయంలో జీసీసీ వార్షిక ప్రణాళిక విడుదల చేశారు. అనంతరం జీసీసీ కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీసీసీ ద్వారా తేనె అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. గిరిజన ప్రాంతాలు ఇచ్చోడ, బేల, నార్నూరు, ఇల్లెందులలో పప్పు శుద్ధి కర్మాగారాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపిస్తామన్నారు. నిర్మ ల్, ఏటూరు నాగారం, భద్రాచలంలో సబ్బు పరి శ్రమ ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు. -
మార్కెటింగ్‌పై హరీశ్‌కు చిత్తశుద్ధి లేదు
భూదాన్ పోచంపల్లి: నీటి పారుదల మంత్రి హరీశ్‌రావుకు మిషన్ కాకతీయ, భగీరథ పథకాలపై ఉన్న చిత్తశుద్ధి మార్కెటింగ్‌పై లేదని, దాంతో ఆ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పోచంపల్లి, రేవనపల్లి, గౌస్‌కొండ, ఇంద్రియాల గ్రామాల్లో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను సందర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షంతో వరి, మామిడి తోటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 799 వరి రకాన్ని సాధారణ గ్రేడ్ కింద పరిగణించడం రైతు వ్యతిరేక చర్య అని, దీన్ని వెంటనే ఉపసంహరించుకుని పూర్తి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులకు రెట్టింపు లాభం చేకూర్చేలా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తున్నారని, వీటిని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను విస్మరించి మిల్లర్లను ప్రోత్సహిస్తూ, దళారులను పెంచడం సరికాదన్నారు. -
ఇంత బరువు భావ్యమా?
నిజానికి పెళ్లి ఏ హంగూ ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా జరుపుకుంటే తప్పేంటి? పెళ్లి పవిత్రతను గౌరవించినట్టూ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఇంటి ముందు పచ్చని పందిరి వేసి, ఇరు కుటుంబాలు, ఇరుగుపొరుగే కాకుండా బంధువర్గమందరినీ పిలుచుకొని మూడు రోజుల పండుగయినా చాలా హుందాగా, సంతోషంగా జరుపుకోవచ్చు. ఆత్మీయ కలయికలా ఉంటుంది. ఖర్చు రమారమి తగ్గుతుంది. భూలోకమంత పీట, ఆకాశమంత పందిరే వేయక్కర్లేదు. ఇరు కుటుంబాల వారి మనసులు కలిస్తే చాలు. ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారింట’’ అన్నాడో సినీకవి. నిజమే! ఎవరం కోరుకునేదయినా అదే! వారి వారి అంతస్తులు, ఆస్తిపాస్తులతో నిమిత్తం లేకుండా ఏ ఇంటి ఆడబిడ్డయినా, మగబిడ్డయినా యుక్తవయసు రాగానే సరిజోడయిన వారితో పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటాం. చక్కగా పెళ్లయి, సంతానం పొంది, పిల్లా, పాపలతో బతికినంత కాలం సుఖసంతోషాలతో ఉండాలనేదే ఎవరి కోరికైనా! మానవ మనుగడలో పెళ్లి అనేదొక కీలక ఘట్టం. ఇద్దర్ని జత కలపడమే కాకుండా, ఇకపై వారు ఉమ్మడిగా దాంపత్య జీవితం కొనసాగిస్తారని అందరికీ తెలియజెప్పడానికే పెళ్లి అంటారు పెద్దలు. ఇది, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కుటుంబాల బహిరంగ వేడుక. దీవించ వచ్చే వందలు, వేలాది మంది దానికి సాక్షులు. సాధారణ పరిస్థితుల్లో పెళ్లి వీలయినంత తక్కువ వ్యయంతో జరగాలనే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు వెల్లడిస్తున్నాయి. కానీ, క్రమంగా పరిస్థితి మారుతోంది. ఒకరకంగా చేయి దాటిపోతోంది. పెళ్లి అనే పవిత్ర ప్రక్రియను చుట్టుముట్టి కన్యాశుల్కం, వరకట్నం వంటి సాంఘిక దురాచారాలు వేర్వేరు కాలాల్లో చాలా కుటుంబాల్ని వేధించాయి, ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. కుటుంబాలే రగిలే సామాజిక అశాంతికి అవి పోసిన ఆజ్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడిక, అసాధారణ వ్యయభారంతో పెళ్లి ప్రక్రియే ఓ గుదిబండలా తయారయింది. ఖరీదయిన, ఖర్చుతో కూడిన పెద్ద ఆర్థిక వ్యవహారం అయింది. పేద, మధ్యతరగతి వారికి, ఉద్యోగులు, అల్పాదాయవర్గాలు, ఆర్థిక స్తోమత అంతంతగా ఉన్నవారికి పెళ్లంటేనే భయం కలిగించే పరిస్థితి నెలకొంది. కొందరు సంపన్నులకిది ‘సంపద అసభ్య ప్రదర్శన’కు ఓ అవకాశమైంది. మరికొందరు, హంగూ –ఆర్భాటాల పెళ్లితో తమ ఆర్థిక–సామాజిక హోదాను చాటుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల పెళ్లిని ఓ పెద్ద తంతుగా మార్చి, లెక్కకు మిక్కిలి డబ్బు వ్యయం చేస్తున్న తీరు గగుర్పాటు కలిగిస్తోంది. ఇది అన్ని స్థాయిల్లోనూ జరుగుతోంది. కొందరు హెచ్చు లకోసం, ఇంకొందరు దర్పం కోసం, మరి కొందరు సంపద ప్రదర్శన కోసం చేస్తే.... అత్యధికులు ‘ఇక మాకూ తప్పదేమో!’ అనే అపోహలో చేస్తున్నారు. సాటివారితో సరిపోల్చుకొని తామూ హంగులు, ఆర్భాటాలకు పోతున్నారు. ఈ వడిలో పడి ఆస్తులు కరిగిస్తున్నారు, లేదంటే అప్పుల పాలవుతున్నారు. కమ్మేసిన మార్కెట్ మాయ! సమాజంలో పలు అంశాల్లాగే క్రమంగా పెళ్లినీ మార్కెట్ మాయ కమ్మేసింది. పెళ్లి ఏ పవిత్రతనూ వదలకుండా ప్రతి అంశాన్నీ మార్కెట్ తన పిడికిట్లోకి లాక్కుంది. అనుబంధ వ్యవహారాలన్నింటిలోకి మార్కెట్ చొరబడింది. పెళ్లి చేసే వారి మెడపై కత్తి పెట్టి వసూళ్లకు దిగినట్టుంది పరిస్థితి. వారది తమ అవసరమనుకుంటే, వీరికిది అవకాశం! సాధారణ కుటుంబాల్లోనూ ఈ అయిదారేళ్లలోనే పెళ్లి వ్యయం సగటున 30 నుంచి 40 శాతం పెరిగింది. వెరసి ఒకో పెళ్లి ఖర్చు లక్షలు, కొన్నిచోట్ల కోట్ల రూపాయలకు విస్తరించింది. పదేళ్ల కింద, నగరంలో పేరు మోసిన ఓ డాక్టర్ నాతో మాట్లాడుతూ ‘‘.... ఏమిటిది! ప్లేటు 800 రూపాయలట, పెళ్లికి కనీసం 2000 మంది వస్తారనుకుంటున్నాము. ఒక్కపూట భోజనానికే 16 లక్షల రూపాయలు, మా వియ్యంకుడైనా, నేనైనా.. సరే మేమిద్దరం పెట్టగలిగిన వాళ్లం కనుక, చెరిసగం భరిస్తున్నాం. పెట్టలేని వాళ్ల సంగతేంటి? లేదు... ఎక్కడో ఈ దుబారా పరిస్థితి మారాలి. మీ బోటివాళ్లు ప్రసంగాల్లోనో, వ్యాసాల్లోనో చెప్పి ఓ సామాజిక మార్పుకు నాంది పలకాలి’ అన్నారు. ఈ దశాబ్దకాలంలో అది మారకపోగా మరింత దిగజారింది. స్థాయి ఉందో, లేదో కూడా చూసుకోకుండా నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్ ఈ మూడూ దాదాపు తప్పనిసరి ప్రక్రియలయ్యాయి. పెళ్లి పత్రికల నుంచే చేతి చమురు వదలడం మొదలవుతుంది. అక్కడ్నుంచి బట్టలు–నగల కొనుగోళ్లు, మంటపాలు, వేదిక, పూల అలంకరణ, వీడియో ప్రొమోలు, డ్రెస్ డిజైనింగ్–మేకప్, ఫొటో–వీడియోగ్రఫీ, కొరియోగ్రఫీ.... ఇలా ప్రతి వ్యవహారమూ ఖరీదే! ఎంత గిరిగీసి లెక్కేసినా ఖర్చు గిర్రున తిరిగే మీటరే! వాటికి తోడు మెహంది, సంగీత్ ఉత్సవాలు జరిపే సంస్కృతి తోడయింది. అపరిమితమైన మాంసాహార భోజనాలు, మద్యం టేబుళ్లతో విందులు, రిటర్న్ గిఫ్టులు.... ఖర్చు ఆలోచించండి! ఇక రిసార్టులో, స్టార్ హోటళ్లో బుక్ చేసుకొని ఎక్కడో గోవానో, జైపూరో, ఇండొనేíసియానో.... వెళ్లి జరిపే ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ వ్యయానికి లెక్కే లేదు. సంప్రదాయిక విలువలేమయ్యాయి? నిజానికి పెళ్లి ఏ హంగూ ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా జరుపుకుంటే తప్పేంటి? పెళ్లి పవిత్రతను గౌరవించినట్టూ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఇంటి ముందు పచ్చని పందిరి వేసి, ఇరు కుటుంబాలు, ఇరుగుపొరుగే కాకుండా బంధువర్గమందరినీ పిలుచుకొని మూడు రోజుల పండుగయినా చాలా çహుందాగా, సంతోషంగా జరుపుకోవచ్చు. ఆత్మీయ కలయికలా ఉంటుంది. ఖర్చు రమారమి తగ్గుతుంది. భూలోకమంత పీట, ఆకాశమంత పందిరే వేయక్కర్లేదు. ఇరు కుటుంబాల వారి మనసులు కలిస్తే చాలు. ఇంటి ముంగిట పెళ్లి నిర్వహణ ఎంతో సౌలభ్యం! వచ్చేవారి సౌకర్యమనే సాకు చూపి అందరూ నేల విడిచి సాము చేస్తున్నారు, డబ్బు తగలేస్తున్నారు. మధ్య, అల్పాదాయాల వారిపై సంపన్నులు ఒత్తిడి పెంచుతున్నారు. నగరాలు, పట్టణాలు, చివరకు మండల కేంద్రాల్లోని ఫంక్షన్ హాళ్లలోనే పెళ్లిళ్లు. సీనియర్ పాత్రికేయుడొకరంటారు.. ‘మా ఊళ్లోగాని, మా మండలంలోగాని, ఆ మాటకొస్తే నాకు తెలిసిన వాళ్లెవరూ గడచిన మూడేళ్లలో.. ఇంటిముందు వేసిన పచ్చని పందిట్లో పెళ్లి జరిపిన సందర్భమే నే చూడలేదు’అని. ఫంక్షన్ హాళ్లదీ ఓ మాయ! హాలుకే పెద్ద మొత్తం చార్జీ చేస్తారు. అది కాకుండా ఇక వేదికపై అలంకరణ, కుర్చీలు, వంట సామగ్రి, దేనికదే ప్రత్యేక చార్జీ! పురోహితుడి నుంచి బాజా, భజంత్రీ, సన్నాయి, పూలవాడు, మైక్‌సెట్టు, పాటకచేరీ.... ఇలా అందరి వ్యాపారమూ హాల్ వాడితో ముడివడి ఉంటుంది చాలా సందర్భాల్లో! అదో మాయా మేళం! మండల కేంద్రాల్లో, రెండు మూడు పెద్ద గ్రామాల మధ్యలో ఇటీవల చాలా ఫంక్షన్ హాళ్లు వెలిశాయి. కరీంనగర్, వరంగల్ వంటి జిల్లా కేంద్రాలతో పాటు పలు పట్టణాల్లో దాదాపు కమ్యూనిటీ హాళ్లన్నీ ఇలాంటి కమర్షియల్ ఫంక్షన్ హాళ్లయ్యాయి. ఆర్థికంగా స్థితిమంతులయిన వారు హడావుడి చేస్తున్నారు. సామాజికంగా, బంధుత్వాల పరంగా సమస్థాయిగల వారు తమ వద్ద సొమ్ము లేకపోయినా... హెచ్చులకు అదే స్థాయిలో పెళ్లిళ్లు్ల చేస్తున్నారు. లేని డాంబికాలు ప్రదర్శిస్తూ చేయి కాల్చుకుంటున్నారు. పోల్చి చూసుకోవడం, ఫలానా వారికన్నా తగ్గొద్దనే భావనలు పెరిగాయి. ఖర్చు తట్టుకోవడానికి, ఉంటే ఆస్తులు కరిగేసుకోవడం, లేదంటే అప్పో, సప్పో చేయడం రివాజయింది. అప్పటి వరకు నిబ్బరంగా, గౌరవంగా బతికిన కుటుంబాలు, పెళ్లి తర్వాత చితికిపోయిన సందర్భాలూ ఉన్నాయి. హన్మకొండలో తాహతుకు మించిన ఖర్చుతో పెళ్లి చేసిన ఓ ఉమ్మడి కుటుంబం తర్వాత విడివడి, చితికిపోయింది. కరీంనగర్లో ఓ వ్యాపారి పెళ్లి జరుగుతున్నంత సేçపూ హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపించి, తర్వాత ఐటీ దాడులు, ఆస్తికి సరితూగని ఆదాయవనరులు... కేసుల్లో ఇరుక్కుని నలిగిపోయాడు. చట్టపరంగా నియంత్రించే యత్నాలు... పెళ్లికొచ్చే అతిథుల సంఖ్యపైన, వంటకాలపైన, మొత్తం పెళ్లి ఖర్చులపైన పరిమితులు విధించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇందుకోసం ఓ చట్టమే ఉండాలనేది అభిమతం. కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ లోక్‌సభలో కిందటేడు ఒక (ప్రయివేటు మెంబరు) బిల్లును ప్రతిపాదించారు. ఈ ‘పెళ్లి (తప్పనిసరి రిజిస్ట్రేషన్–అనవసర వ్యయ నియంత్రణ) బిల్లు’కు ఆమోదం లభించలేదు. 2011లో అఖిలేష్ దాస్‌గుప్త రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు లాంటిదే! అతిథుల సంఖ్య, విందులో వంటకాలపై పరిమితికి యత్నం. పెళ్లి ఖర్చు రూ.5 లక్షల వరకే అనుమతించాలని, మించితే పది శాతం చొప్పున స్థానిక ప్రభుత్వాలకు చెల్లించేలా చర్యలుండాలని ప్రతిపాదించారు. ఆ డబ్బును పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఖర్చు చేయాలని ప్రతిపాదన. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా 1996లో సరోజ్ కపర్దే, 2005లో ప్రేమ్ కరియప్ప రాజ్యసభలోను, 2005లోనే తెలుగు ఎంపీ రాయపాటి సాంబశివరావు, 2011లో పి.జె.కురియన్, అదే సంవత్సరం మహేంద్ర చౌహాన్లు లోక్‌సభలో దాదాపు ఇటువంటి బిల్లుల్నే ప్రతిపాదించారు. పెళ్లి ఖర్చులపైన, జల్సాలపైన, ఆహారం వృథాపైన నియంత్రణ ఉండాలంటూ ఇలాంటి బిల్లులు జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిపాదనకు వచ్చాయి. పొరుగుదేశం పాకి స్తాన్‌లో పెళ్లి వ్యయం, అతిథుల సంఖ్యపై నియంత్రణ ఉంది. పెళ్లిళ్లు, రిసెప్షన్లలో వచ్చే అతిథుల సంఖ్య, వడ్డించే ఆహారపదార్థాల సంఖ్య, మైకుల వినియోగం, టపాసులు కాల్చడంపై నియంత్రణ విధిస్తూ గత సంవత్సరం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఇదే యత్నాలు ఇతర రాష్ట్రాల్లోనూ సాగుతున్నాయి. సమగ్ర చట్టం వస్తే తప్ప ఈ పెళ్లి దుబారాలను, డీజేలు, రికార్డింగ్ డాన్స్‌లు, పెద్దపెద్ద శబ్దాలతో గంటల తరబడి సాగే బారాత్‌లను నియంత్రించలేమని పోలీసులంటు న్నారు. పబ్లిక్ న్యూసెన్స్ తప్ప వేరే కేసులు పెట్టలేకపోతున్నామని వారి వాదన. పెళ్లి ముగింపు కాదు ఆరంభం ఉన్న డబ్బంతా కరిగించి జల్సా చేయడానికి పెళ్లేం ముగింపు వేడుక కాదు, ఇది దాంపత్య జీవితానికి ఆరంభం! పెళ్లిలో దుబారా ఆపి, పొదుపు ద్వారా మిగిల్చే డబ్బు ఆ దంపతులకిచ్చినా ఓ గొప్ప భరోసాతో వారి ఉమ్మడి జీవితం మొదలవుతుంది. తదుపరి దశలో పిల్లల పెంపకం, విద్య, వైద్యం వంటి వాటికి ఎలాగూ ఖర్చు తప్పదు, నియంత్రించ గలిగిన చోటన్నా ఎందుకు చేయరనేది ప్రశ్న! పెళ్లి జీవిత కాలపు వేడుకే! అది జీవితాన్ని వెలిగించేదవాలి తప్ప ఖర్చు తడిసి మోపెడై నలిపేసేది కావద్దు! దిలీప్ రెడ్డి dileepreddy@sakshi.com -
గింజ గుట్టు విప్పేస్తుంది
సాక్షి, హైదరాబాద్: ఎంఆర్ఐ స్కానింగ్ చేయ డం ద్వారా శరీర అంతర్భాగంలోని లోపాలను గుర్తించినట్లుగానే, ఇప్పుడు ఆహార ధాన్యాల నాణ్యతను గుర్తించేలా కొత్త స్కానింగ్ పరిజ్ఞా నం వచ్చింది. ఎంఆర్ఐ రిపోర్టు ఇచ్చినట్లుగానే ఇది కూడా ధాన్యం గింజలోని లోపాలను గుర్తిం చి రిపోర్టు ఇస్తుంది. అటువంటి పరికరాన్ని ఇద్ద రు ఐఐటీయన్లు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో ఇతర మార్కెట్లలోనూ ప్రవేశ పెట్టాలని మార్కెటింగ్‌శాఖ నిర్ణయించింది. త్వరలో టెండ ర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సేంద్రీయ లక్షణాలను గుర్తించవచ్చు రైతులు పండించిన ఆహార పంటల్లో నాణ్యతను గుర్తించడానికి ప్రస్తుతం సాధారణ పద్ధతులనే ఉపయోగిస్తున్నారు. తేమ శాతం, వాటిలోని నాణ్యతను సక్రమంగా నిర్ధారించకపోవడంతో సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారు. పూర్తిస్థాయి శాస్త్రీయ పద్ధతులు లేకపోవడంతో దళారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టే పరిజ్ఞానాన్ని మార్కెటింగ్ శాఖ ప్రవేశపెట్టింది. ‘మ్యాట్’ అనే ఈ పరికరం ద్వారా వరి, పప్పులు సహా ఇతర అన్ని ధాన్యాల నాణ్యతను గుర్తించవచ్చు. ధాన్యం రాశిలోని నమూనా గింజలను ఈ పరికరంలోని స్కానర్‌పై పెడితే కంప్యూటర్ మానిటర్‌పై గింజలోని లక్షణాలు, లోపాలు ప్రత్యక్షమవుతాయి. ఆ ధాన్యంలో పురుగు మందులు, తేమ శాతం, సేంద్రీయ లక్షణాలు, ప్రొటీన్లు, విటమిన్లూ ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తుంది. నిముషాల్లో స్కానింగ్ చేసి రిపోర్టు ఇస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా దాని నాణ్యతను నిర్ధారించి, దానికి తగ్గట్లు గ్రేడింగ్ చేసి ధరను నిర్ణయిస్తారు. అంతేకాదు సేంద్రీయ లక్షణాలు, నాణ్యత సరిగా ఉంటే అటువంటి ధాన్యాన్ని పెద్ద పెద్ద కంపెనీలు కొనుగోలు చేసే అవకాశముంది. వాటి ధర కూడా గణనీయంగా పెరిగి రైతుకు లబ్ధి చేకూరనుందని అధికారులు చెబుతున్నారు. ధర ఎక్కువే అయినా... ఈ పరికరం ద్వారా ధాన్యం నాణ్యతను గుర్తించేందుకు ఖర్చు అధికంగానే ఉందని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ‘సాక్షి’కి చెప్పారు. ‘ఒక నమూనాను స్కానింగ్ చేయాలంటే రూ.180 వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ పద్ధతులకంటే ఇది ఖరీదైనది. అయినా ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకో వాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. టెండ ర్లు పిలిచి ఈ పరిజ్ఞానాన్ని ఇతర మార్కెట్లలో ప్రవేశపెడతామన్నారు. సమగ్రమైన నాణ్యత రిపోర్టు వస్తున్నందున ఖరీదైనప్పటికీ రైతుకు లాభం చేకూర్చుతుందన్నారు. పత్తి, మిరప, పసుపు, పండ్లను స్కానింగ్ చేసే పరిస్థితి లేకపోవడం ఇందులో ప్రధాన లోపం. -
ఫేస్ తెలీకపోయినా.. మనసు గ్రహిస్తుంది
మీకు వంటలంటే ఇష్టమా? ఫేస్బుక్లో వంటలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తుంటారా? అలాగైతే ఫుడ్‌కి సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్స్ మీ వాల్‌పై ఎప్పుడైనా గమనించారా? మీకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువా? ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమైనా పోస్టు లేదా షేర్ చేస్తూ ఉంటారా? అలాగైతే ఆరోగ్య ఉత్పత్తుల యాడ్స్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండాలి..! మా ఇష్టాయిష్టాలు ఫేస్‌బుక్‌కు ఎలా తెలుసు..? అని ఆశ్చర్యపోకండి ఇదో వాణిజ్య వల..!! మీ అలవాట్లు, అభిరుచులు, ఇష్టాయిష్టాలన్నింటినీ గ్రహించి, వాటిని క్రోడీకరించి వాణిజ్య ప్రకటనదారుల చేతుల్లో పెట్టేస్తోంది ఫేస్బుక్. తద్వారా తాను సొమ్ము చేసుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జనం నాడి పసిగట్టి తాను యాడ్స్ రూపంలో కోట్లు కొల్లగొడుతోంది. వాణిజ్య ప్రకటనల ఆదాయంలో గూగుల్ తర్వాత స్థానం ఫేస్‌బుక్‌దే.. ప్రజల అలవాట్లనే తన ఆదాయానికి మార్గం చేసుకుని 400 కోట్ల డాలర్ల యాడ్ రెవెన్యూ సాధించింది. కేంబ్రిడ్జి ఎనలిటికా డేటా లీకేజీ వ్యవహారం తర్వాత ఫేస్బుక్ వినియోగదారుల్ని ఎలా ఆకర్షిస్తోందన్న అంశంలో ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మీ ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం మొత్తాన్ని అంచనా వేస్తుంది. మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నారు? ఏ కాలేజీలో చదివారు.. మీ విద్యార్హతలు.. మీరు రిలేషన్లో ఉన్నారా? వంటి అంశాల ద్వారా మీరు ఎలాంటి విషయాలకు ఆకర్షితులవుతారో గ్రహిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్లో లొకేషన్ ఆప్షన్ ఆన్ అయి ఉంటే చాలు.. అడుగు తీసి అడుగు వేసినా ఫేస్బుక్ పసిగట్టేస్తుంది. మీరు ఏయే ప్రాంతాలకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? వంటి విషయాల ద్వారా మీ అభిరుచుల్ని తెలుసుకుంటుంది. ఆన్లైన్లో మీరు చేసే బుకింగ్‌ల ద్వారా మీకున్న ఇష్టాయిష్టాలపై ఒక అంచనాకి వస్తుంది. మీరు చేసే పోస్టులు, షేర్ చేసే విషయాలు, కొట్టే లైక్‌లు, పెట్టే కామెంట్స్ కూడా ఫేస్బుక్ రూపొందించే మార్కెట్ వ్యూహాలకు ముడిసరుకులే. చివరికి మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులని బట్టి మీకున్న ఆసక్తుల్ని పట్టేయగలదు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తూ మార్కెటింగ్ కంపెనీలకు సమాచారాన్ని అందించడం ద్వారా వాణిజ్య ప్రకటనల్ని తెచ్చుకుంటోంది. అంతేకాదు వాణిజ్య ప్రకటనదారుల కోసం ఫేస్బుక్ పిక్సెల్ అనే టూల్‌ని రూపొందించింది. ఎఫ్బీకి యాడ్స్ ఇవ్వాలనుకునే కంపెనీలు ఈ టూల్‌ని తమ వెబ్సైట్లో పెట్టడం ద్వారా వినియోగదారుల ప్రతీ చర్యా తెలుసుకోగలరు. మీ వాల్ మీదనున్న యాడ్‌ను క్లిక్ చేసిన తర్వాత మీరేం చేసినా పిక్సెల్ టూల్‌తో తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న సమాచారంతో ప్రకటనదారులు తమ యాడ్స్‌కి మరింత మెరుగులు దిద్దుతారు. రీ టార్గెటింగ్ అనే టూల్ ద్వారా మీకు ఇష్టమైన ఉత్పత్తుల్ని గ్రహించుకుని, వాటిని మీరు కొనేలా ఉసిగొల్పుతారు. ఇలా కనీసం మీ ఫేస్ తెలీకపోయినా, మీ మనసు గ్రహిస్తుంది.. అదే ఇప్పుడు ఫేస్‌బుక్‌కు పెట్టుబడి. -
మెరుగైన పరపతి, విస్తృత మార్కెటింగ్
న్యూఢిల్లీ: మెరుగైన రుణ పరపతి, మార్కెటింగ్ సౌకర్యాలు సులువుగా అందుబాటులోకి వస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ‘2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం’పై నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మంగళవారం ప్రసంగించారు. వ్యవసాయ అభివృద్ధికి నిపుణులు చేసిన సిఫార్సులను పరిశీలిస్తామని, నీతి ఆయోగ్ ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుందని తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్‌ను ఉమ్మడి జాబితాలో చేర్చడం, భూమి పట్టాల డిజిటలైజేషన్, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారైన వస్తువులపై జీఎస్టీ తగ్గింపు, గ్రామీణ వాణిజ్య కేంద్రాల ఏర్పాటు లాంటివి ఈ సదస్సులో తెరమీదికి వచ్చిన కొన్ని సూచనలు. 2.3కోట్ల టన్నులు పెరిగిన పప్పు దినుసుల రాబడి వ్యవసాయ పరపతి సదుపాయాన్ని రూ.8 లక్షల కోట్ల నుంచి రూ. 11 లక్షల కోట్లకు పెంచినట్లు మోదీ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయాభివృద్ధికి ప్రకటించిన చర్యలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఏడాది కాలంలోనే దేశంలో పప్పు దినుసుల ఉత్పత్తి 1.7 కోట్ల టన్నుల నుంచి 2.3 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. యూరియాకు వేప పూత కోటింగ్ వల్ల ఎరువు సామర్థ్యం పెరిగిందని తెలిపారు. భూసార కార్డులతో రసాయన ఎరువుల వాడకం 8–10 శాతం తగ్గిందన్న ప్రధాని..పంట ఉత్పత్తి 5–6 శాతం పెరిగిందని వెల్లడించారు. -
కొత్త చట్టాలపై అపోహలు వద్దు
నిజామాబాద్ అగ్రికల్చర్(నిజామాబాద్ అర్బన్): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మార్కెటింగ్ చట్టాలు, నిబంధనలపై వ్యాపారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వీటిని అమలుచేస్తున్నామని మార్కెటింగ్‌శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. నగరంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కిసాన్ మీటింగ్ హాల్లో మార్కెటింగ్ చట్టాలు, నిబంధనలపై సోమవారం వ్యాపారులకు అవగాహనాసదస్సును ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గత డిసెంబర్ 29వ తేదీ నుంచి మార్కెటింగ్ శాఖలో కొత్త చట్టాలు, నిబంధనలను అమల్లోకి తెచ్చిందన్నారు.మూడునెలల్లోపు వ్యాపారులు కొత్త చట్టాలకు లోబడి లైసెన్సులను పొందాలని, అందులోకి తమ వ్యాపారాన్ని మార్చుకోవాలని సూచించారు. ఇక నుంచి తమ వ్యాపార సముదాయాల నుంచే నేరుగా లైసెన్సులు పొందవచ్చని, ఒకే లైసెన్స్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఈ–పర్మిట్లు, ఈ–తక్‌పట్టీల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని, నేరుగా ఆన్లైన్లో పొందవచ్చని తెలిపారు. కొత్తగా లైసెన్సులు పొందే వారికి రూ.5లక్షలు, రెన్యూవల్ చేసుకునే వ్యాపారులకు రూ.10లక్షల బ్యాంక్ గ్యారెంటీ నిబంధన తప్పనిసరి చేసిందన్నారు. రూ.10లక్షల బ్యాంక్ గ్యారెంటీతో కోటీ వరకు టర్నోవర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సామర్థ్యాన్ని బట్టి వ్యాపారులు వ్యాపారం చేసుకోవాలని, మించి వ్యాపారం చేయడం వల్ల మోసాలు జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ వ్యాపారులు మంచి వారేనని, రాష్ట్రంలోని అన్ని మార్కెట్ల వ్యాపారులను ఉద్ధేశించి చట్టాలను రూపొందించామని తెలిపారు. ఇప్పటి నుంచి వ్యాపారుల లైసెన్సులు రాష్ట్రస్థాయిలో నోటిఫై అవుతాయన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి లైసెన్సులుగా మారవచ్చని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 44 మార్కెట్లను ఈ–నామ్ ద్వారా అనుసంధానం చేశామని, ప్రస్తుతానికి ఈ మార్కెట్లలో ఏ పంట ఉత్పత్తినైనా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గంపా శ్రీనివాస్ గుప్త, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్త మాట్లాడుతూ కొత్త చట్టాలకు అనుగుణంగా తాము వ్యాపారం చేసేందుకు సుముఖంగా ఉన్నామని, కానీ బ్యాంకు గ్యారెంటీని తగ్గించాలని కోరారు.బ్యాంకు గ్యారెంటీ వ్యాపారులకు భారమని, జిల్లా రైతులను ఏనాడూ మోసం చేసిన చరిత్ర లేదన్నారు. వ్యాపారులతో చర్చించకుండా బ్యాంకు గ్యారెంటీని నిర్ణయించారని, కావున పాత విధానాన్నే అనుసరించాలని డిమాండ్‌చేశారు.మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జేడీని కోరారు. అంతకుముందు జేడీ రవికుమార్ పాలకవర్గం ప్రతిపాదించిన కవర్ షెడ్స్ ఆవశ్యకతను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. మార్కెట్‌కమిటీ పరిధిలోని గ్రామాల్లో కవర్ షెడ్స్ నిర్మాణానికి పాలకవర్గం మంత్రికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈకార్యక్రమంలో మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ స్వరూపారాణి, డీఎంఓ రియాజ్, అసిస్టెంట్ సెక్రటరీ విజయ్‌కిషోర్, రవీందర్‌రెడ్డి, వ్యా పారులు కరిపె సత్యం, మాస్టర్ శంకర్, మల్లేష్, దేవేందర్, హన్మంతు, సాయిరాం, పిండి గంగాధర్, రాధాకిషన్, మురళీ, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు ధరలపై అధ్యయనం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ ఉన్నతాధికారుల బృందం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హరియాణా తదితర రాష్ట్రాలలో పర్యటించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆయా రాష్ట్రాలలో వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలకు అక్కడి ప్రభుత్వాల నుంచి లభిస్తున్న కనీస మద్దతు ధరలపై అధ్యయనం చేయాలని సూచించారు. పంటల దిగుబడి, వాటి కొనుగోలు, విధివిధానాలు, అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను పరిశీలించాలన్నారు. రాష్ట్ర రైతులకు మేలు జరిగేలా కొత్త విధానాలను ప్రవేశపెట్టేందుకు ఈ నెల 13 లోగా నివేదికలివ్వాలని ఆదేశించారు. ఆదివారం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని అన్ని మిల్లుల వివరాలు, వాటి మిల్లింగ్ సామర్థ్యం, ఆయా ప్రదేశాల్లో అంచనా వేసిన వివిధ పంటల ఉత్పత్తులు తదితర వివరాలను ఈ నెల 13 లోగా సంబంధిత జిల్లా మార్కెటింగ్ అధికారులు ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. మన కూరగాయల విక్రయ కేంద్రాలను జీహెచ్ఎంసీ సమీకృత మార్కెట్లలో, అనువైన మెట్రో రైల్వేస్టేషన్లలో త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. మొత్తం 330 నాబార్డు గోదాముల్లో మిగిలిన 18 గోదాముల నిర్మాణం ఈ మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. నేడు ‘తుమ్మిళ్ల’కు శంకుస్థాపన రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) కింది ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగు జలాలు అందించనుంది. తుంగభద్ర జలాల వాటాను వినియోగంలోకి తెచ్చేలా తలపెట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్‌రావు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. -
పూచీకత్తు ఇవ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ వ్యాపారులకు, ఏజెంట్లకు సర్కారు ముకుతాడు బిగించింది. ఆయా మార్కెట్ల టర్నోవర్‌ను బట్టి వ్యాపారులు, ఏజెంట్లు తప్పనిసరిగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకు గ్యారంటీ చూపాలని సర్కారు నిర్ణయించింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్కెటింగ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చట్టం అమలు మార్గదర్శకాలు, నిబంధనలపై నోటిఫికేషన్ జారీ చేసింది. డబ్బు ఎగ్గొడుతున్న వైనం.. ఇప్పటి వరకు ఏజెంట్లు, వ్యాపారులకు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ ఉండేది కాదు. అయితే చాలాచోట్ల వ్యాపారులు, ఏజెంట్లు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బు ఎగ్గొడుతున్నారు. ఇలాంటి పరిస్థితికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో బ్యాంకు గ్యారంటీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 10 వేల మంది వ్యాపారులు, 4,200 మంది ఏజెంట్లు కొత్తగా బ్యాంకు గ్యారంటీ చూపాల్సి ఉంది. వారికి మూడేళ్లకోసారి లైసెన్సులు జారీ చేస్తారు. మరిన్ని మార్గదర్శకాలు ♦ కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు. అయితే రైతుతో కాంట్రాక్టు చేసుకునే స్పాన్సర్.. తప్పనిసరిగా పంట ఉత్పత్తి అంచనాలో 20 శాతం బ్యాంకు గ్యారంటీ చూపాలి. అప్పుడే అతన్ని కాంట్రాక్టు వ్యవసాయంలో భాగస్వామిని చేస్తారు. ♦ కొనుగోలుదారులకు ఒక ఫారం, కమీషన్‌దారులకు మరో ఫారం, గోదాములకు మరో ఫారం, ప్రాసెసింగ్ యూనిట్లకు ఒక ఫారం ద్వారా లైసెన్సులు జారీ చేస్తారు. కేటగిరీల వారీగా షరతులు విధించి లైసెన్సులు జారీ చేస్తారు. ♦రూలు 49–బి ద్వారా క్లియరింగ్, ఫార్వర్డింగ్ ఏజెంట్ వ్యవస్థ ఏర్పాటు. అన్ని మార్కెట్లలో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. సరుకులను సులువుగా రవాణా చేసేందుకు అవకాశం కలుగుతుంది. ♦లైసెన్స్ సస్పెండ్ చేసే అధికారం డైరెక్టర్‌కు కల్పించారు. దీనివల్ల పర్యవేక్షణ ఉంటుంది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ♦కమీషన్ ఏజెంటు జారీ చేసే తక్‌పట్టీ మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లోనూ తక్‌పట్టీ ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. దీంతో తక్‌పట్టీ కోసం కమీషన్ ఏజెంటుపై రైతు ఆధారపడే పరిస్థితి పోతుంది. అనుమతిలేని చెల్లింపులను తక్‌పట్టీలో పొందుపరచకుండా నిషేధించే అవకాశముంది. ♦మార్కెట్ కమిటీ రికార్డుల్లో నమోదు ద్వారా రైతు సరుకుకు పూర్తి భద్రత కల్పించారు. ఇందుకోసం స్టోరేజీ స్లిప్‌ను ఆన్లైన్ మార్కెట్ ద్వారా రైతు పొందే అవకాశముంది. ♦మార్కెట్ చార్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లే నిర్ణయించే అధికారం కల్పించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వారు నిర్ణయం తీసుకుంటారు. ♦నెలవారీ కొనుగోలు నివేదికలను వ్యాపారులు ఇవ్వాలి. దీంతో పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. వ్యాపారులకు ఈ–ప్లాట్‌ఫాం ద్వారా పర్మిట్లు తీసుకునే వెసులుబాటు కల్పించడంతో అక్రమ రవాణా తగ్గుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు.. రాష్ట్రంలో ఎవరైనా సరే ధాన్యం, ఇతర పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైతుల పంటను కొనుగోలు చేయాలి. ఇందులోకి రిలయన్స్ సహా ఆ స్థాయి కలిగిన సంస్థలను ఆహ్వానించాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉంది. అలాగే గోదాములు, వేర్ హౌజింగ్, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా మార్కెట్లుగా మార్చేందుకు వీలు కల్పించారు. కమీషన్ ఏజెంటు రైతుకు డబ్బు చెల్లించాకే వ్యాపారికి పంట అందజేయాలి. చెల్లింపుల వివరాలు తెలిపే రికార్డులను కమీషన్ ఏజెంటు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల రైతు అమ్మిన పంటకు తక్షణమే సొమ్ము చేతికి వస్తుంది. అలాగే ప్రైవేటు మార్కెట్లలో ఆన్లైన్ మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రూ.3 కోట్లతో వసతులు కల్పిస్తారు. మార్కెటింగ్ డైరెక్టర్ అనుమతించిన ప్రైవేటు మార్కెట్ లైసెన్సుదారులకు యూజర్ చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ప్రైవేటు మార్కెట్ లైసెన్సులు ప్రోత్సహించడంతోపాటు ఆన్ లైన్ మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేస్తారు. తద్వారా ఈ–నామ్ పటిష్టమవుతుంది. -
గుర్తింపు కార్డులతో కార్మికులకు ప్రయోజనాలు
కదిరి అర్బన్: గుర్తింపు కార్డులు కలిగి ఉండే కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని మార్కెటింగ్ శాఖా మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక ఎమ్యెల్యే అత్తార్ చాంద్‌బాషా నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కదిరిలో భవన, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారంతా గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు కలిగిన కార్మికులకు ఇళ్లు కూడా మంజూరు చేస్తారని ఆయన చెప్పారు. ఇళ్లు కట్టుకున్నాక అత్యవసరమైతే విక్రయించుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు. ఇంటిపై ఉన్న రుణం కొన్నవారు కట్టుకోవాలన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు చంద్రన్న భీమా పథకంలో చేరితే వారింట్లోని ఇద్దరు అమ్మాయిలకు ఒక్కొక్కరి వివాహానికి రూ.20 వేల చొప్పున పెళ్లికానుక, అలాగే ఒక్కొక్కరికి రెండు ప్రసవాలకు రూ.20 వేల చొప్పున ప్రసవ కానుక అందజేస్తారన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ అండ్ టీలో వాటా విక్రయం
ప్రభుత్వానికి 4,000 కోట్లు న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)లో ప్రభుత్వానికి ఉన్న వాటాలో 2.5 శాతం షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 4,000 కోట్లు సమకూరింది. బుధవారం ఎల్ అండ్ టీ షేరు ధర స్వల్ప పెరుగుదలతో రూ. 1,754 వద్ద ముగిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్పెషల్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యూయూటీఐ)లో 6.53 శాతం ఎల్ అండ్ టీ వాటాలు ఉన్నాయి. తాజా విక్రయంతో ఎస్‌యూయూటీఐలో ప్రభుత్వం కలిగిన ఎల్ అండ్ టీ 4 శాతానికి తగ్గుతుంది. ఈ వాటా విక్రయంతో ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 6,400 కోట్లు సమకూరినట్లవుతుంది. వివిధ కంపెనీల్లో వున్న మైనారిటీ వాటాలు, ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక విక్రయం వంటి వాటి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఎస్‌యూయూటీఐ వద్ద దాదాపు 50 కంపెనీల వాటాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి ఐటీసీ (9.17 శాతం), యాక్సిస్ బ్యాంక్ (11.53 శాతం). ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం ఐటీసీ వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ. 6,700 కోట్లు సమీకరించింది. -
ఈ ఏడాదే హెచ్పీసీఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్
♦ ఓఎన్జీసీకి 51.1 శాతం వాటాల విక్రయం ♦ విలువ సుమారు రూ. 28,770 కోట్లు ముంబై: అంతర్జాతీయ స్థాయి చమురు దిగ్గజానికి రూపకల్పన చేసే దిశగా కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. హెచ్పీసీఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ని ఈ ఏడాదే పూర్తి చేయాలని యోచిస్తోంది. మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ)కి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్‌పీసీఎల్)లో 51.1 శాతం వాటాల విక్రయ విధివిధానాలపై మరికొద్ది నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌పీసీఎల్ షేరు ధర ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 28,770 కోట్ల మేర ఉండనుంది. రెండు కంపెనీలను విలీనం చేయడానికి బదులుగా హెచ్‌పీసీఎల్‌ని ఓఎన్జీసీలో భాగమైన యూనిట్‌గా మాత్రమే ఉంచాలని కేంద్ర చమురు శాఖ భావిస్తున్నట్లు సమాచారం. రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే కావడంతో యాజమాన్యంలో మార్పులేమీ ఉండనందున ఓపెన్ ఆఫర్ అవసరం రాకపోవచ్చని పరిశీలకులు తెలిపారు. దేశీయంగా టేకోవర్ నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ మరో లిస్టెడ్ కంపెనీలో 25 శాతం పైగా వాటాలు కొన్న పక్షంలో సదరు టార్గెట్ సంస్థలో కనీసం మరో 26 శాతం వాటాలను పబ్లిక్ నుంచి కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. హెచ్‌పీసీఎల్ దేశీయంగా మూడో అతి పెద్ద రిఫైనర్. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికీ తోడ్పాటు.. చమురు ధరల హెచ్చుతగ్గులను తట్టుకోవడంతో పాటు ఆయిల్ కంపెనీల విలీనాల ద్వారా ప్రపంచ స్థాయి చమురు దిగ్గజాన్ని దేశీయంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్లు కేంద్రం ఫిబ్రవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీకి హెచ్పీసీఎల్లో వాటాలను విక్రయించడం ద్వారా భారీ సంస్థ ఆవిర్భావంతో పాటు ప్రభుత్వం నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కూడా నెరవేరగలదు. గత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 46,247 కోట్లు సమీకరించిన కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 72,500 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఈ దిశలో 11 ప్రభుత్వ రంగ సంస్థల్లో 25 శాతం దాకా వాటా విక్రయాలు జరగనున్నాయి. -
అన్నదాతకు అందుబాటులో ‘మార్కెటింగ్ ’ సేవలు
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా మార్కెటింగ్ శాఖ అందిస్తున్న వివిధ రకాల సేవలు రైతులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ జిల్లా సహాయ సంచాలకులు బి.హిమశైల తెలిపారు. రైతు బంధు పథకం : మార్కెట్లో ధర తగ్గిపోయి రైతులకు గిట్టు బాటుధర లభించని సమయంలో పండిన సరుకును వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచుకొని, సరుకు విలువపై 75 శాతం మొత్తాన్ని రూ.2,00,000 గరిష్ట పరిమితికి లోబడి రుణం పొందొచ్చు. అలా పొందిన రుణంపై 180 రోజుల వరకు (ఆరు నెలలు) ఎలాంటి వడ్డీ ఉండదు. అమరాపురంలో వక్క రైతులకు సదుపాయం కల్పించారు. రైతు బజార్లు : రైతులకు గిట్టు బాటు ధర కల్పించడం, వినియోగదారులు సరసమైన ధరలకు తాజా కూరగాయాలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రైతు బజార్లను ఏర్పాటు చేశారు. రైతులు తాము పండించిన కూరగాయలు, పండ్లను జిల్లా కేంద్రంలో ఉన్న రైతుబజార్లో అమ్ముకొని మంచి ధర పొందొచ్చు. భూసార పరీక్ష కేంద్రాలు : తమ పొలాల్లో మట్టి నమూనాలను తీసుకొని వచ్చి భూసార పరీక్ష కేంద్రాల్లో పరీక్షించుకొని, తద్వారా ఎరువుల వాడకం చేపట్టాలి. పెనుకొండ, ధర్మవరం మార్కెట్ యార్డుల్లో భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. త్వరలో మరికొన్ని మార్కెట్‌యార్డుల్లో మట్టి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ధరల సమాచారం : రోజూ రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల పరిధిలోని వివిధ వ్యవసాయోత్పత్తుల కనిష్ట, గరిష్ట ధరల వివరాలను మార్కెట్ కమిటీలు పొందుపరుస్తాయి. కనీస మద్దతు ధరలు : కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రధానమైన ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (మినిమం సపోర్ట్ ప్రైజెస్ – ఎంఎస్పీ) ప్రకటిస్తుంది. మద్దతు ధర కన్నా మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు రైతును ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నోడల్ ఏజెన్సీలైన నాఫెడ్, సీసీఐ, ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా వ్యవసాయోత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయి. కనీస మద్దతు ధరల గురించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వసతులను మార్కెటింగ్ శాఖ కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ తూకం వేసే విధానం : సంప్రదాయ పద్ధతిలో ఉపయోగిస్తున్న తూకపు విధానం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంది. రైతులకు నష్టం జరగకుండా మార్కెట్ యార్డుల్లో ఎలాక్ట్రానిక్ తూకపు యంత్రాలను ఉపయోగించేలా చర్యలు చేపట్టాం. ఈ.బిడ్డింగ్ విధానం : వ్యవసాయోత్పత్తుల క్రయ,విక్రయాల్లో పారదర్శకత, సరళీకృతం చేసి రైతులకు మంచి ధరలు కల్పించడానికి ఈ–బిడ్డంగ్ విధానంలో అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గం యార్డుల్లో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. క్రయ,విక్రయ మార్కెట్లు : జిల్లాలో ఉన్న కొన్ని మార్కెట్‌యార్డుల్లో క్రయ విక్రయాలు జరుగుతున్నందున రైతులు వాటిని వినియోగించుకోవాలి. అనంతపురంలో పశువులు, గొర్రెలు, మేకల సంతతో పాటు చీనీకాయలు, కర్బూజా, కళింగర, దానిమ్మ, ఇతరత్రా పండ్లు అమ్ముకోవచ్చు. తాడిపత్రిలో చీనీకాయలు, హిందూపురం, కళ్యాణదుర్గంలో చింతపండు అమ్మకాలు, కదిరిలో చింతపండు, పశువులు, గొర్రెలు, మేకల సంత, అలాగే గోరంట్లలో పశువుల సంత జరుగుతుంది. మామిడి, అరటి మాగబెట్టేందుకు కొన్ని మార్కెట్ యార్డుల్లో రైపనింగ్ ఛాంబర్ల నిర్మాణం జరుగుతోంది. అనంతపురం యార్డులో చీనీకాయల గ్రేడింగ్ పరికరం అందుబాటులో ఉంది. -
టెలికాంలో 6000 ఉద్యోగాలు గోవింద
ముంబై : టెలికాం టవర్ సంస్థల ఉద్యోగాల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ సంస్థల్లో రెవెన్యూల దెబ్బ, టెలికాం సర్వీసు ప్రొవైడర్ల నుంచి అద్దెలు రాకపోవడం టవర్ సంస్థల్లో ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. దాదాపు 6000 ఉద్యోగాలకు గండి కొట్టనున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో టెలికాం టవర్ కంపెనీల్లో పనిచేసే 10 శాతం మందికి ఉద్యోగాలు పోతాయని రిక్రూట్మెంట్ హెడ్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. ప్రస్తుతం టెలికాం టవర్ సంస్థలు 60వేల మంది ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. వీరిలో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. టెలికాం ఇండస్ట్రీతో సంబంధమున్న సేల్స్, మార్కెటింగ్, కార్పొరేట్ ఆఫీసు ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ లు తెలిపారు. కొత్త వ్యక్తుల నియామకాలు కూడా 50 శాతం మేర తగ్గినట్టు తెలిసింది. అయితే స్వల్పకాలంగా టెలికాం టవర్ ఇండస్ట్రి ఒత్తిడిలో కొనసాగినా.. దీర్ఘకాలంలో ఇది మరింత స్ట్రాంగ్ అవుతుందని ఎగ్జిక్యూటివ్ లు పేర్కొంటున్నారు. కంపెనీల విలీనం ప్రస్తుతం ఇండస్ట్రీ ఉద్యోగులను ఆందోళనలో పడేస్తుందని తెలుపుతున్నారు. -
లారీలన్నీ బంద్
-
లారీలన్నీ బంద్
గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన సమ్మె సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లారీలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అత్యవసర సరుకులు మినహా మిగతా అన్ని రకాల సరుకుల రవాణా దాదాపుగా ఆగిపోయింది. జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్లతో పాటు రాష్ట్రంలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం ఉదయం ఆరు గంటల నుంచే లారీ యజమానులు సమ్మె ప్రారంభించారు. తెలంగాణ లారీ యజమానుల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినా అవి కొలిక్కి రాలేదు. ఉన్నఫళంగా డిమాండ్ల పరిష్కారం సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం.. వాటి పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ దీనికి లారీ యజమానుల సంఘం అంగీకరించలేదు. ఫలితంగా చర్చలు విఫలం కావటంతో.. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం ఉదయం ఆరు గంటలకు లారీ యజమానులు సమ్మె మొదలుపెట్టారు. దాదాపు లక్షన్నర లారీలు.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర లారీలు ఆగిపోయాయి. చాలా మార్కెట్లకు సరుకు రవాణా నిలిచిపోయింది. హైదరా బాద్‌లోని మూసాపేట్, మియాపూర్, పటాన్ చెరు, వనస్థలిపురం, ఆటోనగర్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో వేలాది లారీలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు లారీల రాకపోకలు ఆగిపో యాయి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సరఫరా అయ్యే ఇసుక రవాణా కూడా చాలా వరకు నిలిచిపోయింది. బుధవారం ఉగాది సెలవు రోజు కావటం, ముందే సరుకు రవాణా బుక్ చేసుకుని ఉండటంతో కొన్ని లారీలు మాత్రం రోడ్డెక్కాయి. అవి కూడా శుక్రవారం నిలిచిపోతాయని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరెడ్డి ప్రకటించారు. పాలు, మందులు, కూరగాయలు, చమురు, నీటి ట్యాంకర్లను తాత్కాలికంగా సమ్మె నుంచి మినహాయించామని... ఆదివారం నాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే వాటిని కూడా సమ్మెలోకి తెస్తామని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు వర్తించేలా సింగిల్ పర్మిట్‌ను అమలు చేయాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించాలని డిమాండ్ చేశారు. నేటి నుంచి వంటావార్పు, నిరసనలు.. ప్రస్తుతం దక్షిణ భారతదేశవ్యాప్తంగా లారీల సమ్మె కొనసాగుతోంది. దాంతో కొందరు ముందస్తు రవాణా ఒప్పందాలు కుదుర్చు కున్నా కూడా.. ఇతర లారీల నిర్వాహకులు అడ్డుకునే అవకాశం ఉండటంతో లారీలు నడపడం లేదు. ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. గురువారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదని.. దీంతో శుక్రవారం నుంచి సమ్మెను తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్టు లారీల యజమానుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు. శుక్రవారం నుంచి వంటావార్పు కార్యక్రమాలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం వరకు ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. సోమవారం నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం ధాన్యం సరఫరా సీజన్ కావటంతో.. లారీల సమ్మె విషయంలో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీఏ ప్రత్యేక సెల్ నిత్యావసరాలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు రవాణా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. మార్కెటింగ్, పౌర సరఫరాల విభాగాలకు అవసరమైన వాహనాలను అందజేసేందుకు, సరుకు రవా ణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ కేంద్రంగా 9848528460 నంబర్‌తో ప్రత్యేక సెల్ ఏర్పా టు చేసింది. ప్రస్తుతం అన్ని చోట్లా నిత్యా వసరాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వారం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. -
రైతు సంక్షేమమే మార్కెటింగ్‌శాఖ లక్ష్యం
అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ చౌదరి మార్కెట్‌యార్డులో రైతు సంజీవిని ఆసుపత్రి ప్రారంభం కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): రైతుల సంక్షేమమే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ లక్ష్యమని ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ చౌదరి పేర్కొన్నారు. యార్డుకొచ్చే ప్రతి రైతుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దిగుబడులు విక్రయించేందుకు యార్డుకు వచ్చిన రైతులకు వైద్యసేవలు అందించడం కోసం స్థానికంగా రైతు సంజీవి పేరుతో ఉచిత వైద్య ఆసుపత్రి ఏర్పాటు చేశారు. దీన్ని శనివారం కృష్ణాపురానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం యార్డు ప్రత్యేక కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ఏడీఎం మాట్లాడుతూ యార్డులో ఆహ్లాదాన్ని అందించే విధంగా పచ్చని మొక్కలను నాటే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ యార్డుకొచ్చే రైతులకు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ప్రాథమిక వైద్యం అందించేందుకు ఈ వైద్యశాల దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో యార్డు సహాయ కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, శివప్ప, సూపర్వైజర్లు రెహమాన్, ఈశ్వర్‌రెడ్డి, రామదాసు, రిటైర్డ్ జేడీ నారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 300 మంది రైతులకు ఉచిత వైద్యపరీక్షలు: రైతు సంజీవిని వైద్యశాలలో ప్రారంభోత్సవ రోజున డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి 300 మంది రైతులను పరీక్షించారు. బీపీ, షుగర్‌తో పాటు పలు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశౠరు. స్వచ్ఛమార్కెట్ : ఏడీఎం సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో శనివారం యార్డులో స్వచ్ఛమార్కెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మొత్తం యార్డు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. -
బ్రేక్..ఎటాక్..
►ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్ ►పంజా విసిరేది ‘బ్రేక్’ సమయంలోనే ►ల్యాప్టాప్స్, హ్యాండ్‌బ్యాగ్స్ అపహరణ ►నిందితుడితో పాటు రిసీవర్లూ అరెస్టు సిటీబ్యూరో: ప్రభుత్వ కార్యాలయాలనే టార్గెట్‌గా చేసుకుని ల్యాప్టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ చోరీలు చేస్తున్న నిందితుడిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. మార్కెటింగ్ ముసుగులో ఆఫీసుల్లోకి ప్రవేశించే ఇతను టీ, లంచ్ బ్రేక్ల్లోనే పంజా విసురుతాడని మధ్య మండల డీసీపీ డి.జోయల్ డెవిస్ గురువారం వెల్లడించారు. నిందితుడి నుంచి 10 ల్యాప్టాప్స్, మూడు తులాల బంగారం, రూ.20.5 వేల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. టోలిచౌకీ ఎండీ లైన్స్‌కు చెందిన షేక్ ఇబ్రహీం వృత్తిరీత్యా అత్తర్ల వ్యాపారి. వివిధ కార్యాలయాలకు తిరుగుతూ సుగంధద్రవ్యాలు విక్రయించే ఇతను అదును చూసుకుని చోరీలు చేస్తుంటాడు. 2012లో రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్ళిన ఇబ్రహీంకు ఒక దాంట్లో శిక్ష కూడా పడింది. మళ్ళీ 2015 నుంచి పాత పంథానే అనుసరిస్తూ పంజా విసురుతున్నాడు. ‘బ్రేక్’లో ఎంట్రీ ఇస్తూ... ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు టీ, లంచ్ బ్రేక్ సమయాల్లో కాస్త సేదతీరుతూ ఉంటారు. ఇదే సమయాన్ని ఇబ్రహీం తనకు అనువుగా మార్చుకున్నాడు. ఆయా వేళల్లో సుగంధద్రవ్యాలు అమ్మే నెపంతో ఆఫీసుల్లోకి వెళ్లి, అదును చూసుకుని అక్కడున్న ల్యాప్టాప్స్, మహిళల హ్యాండ్ బ్యాగ్స్ అపహరిస్తాడు. 2015 నుంచి ఇప్పటి వరకు అబిడ్స్, బేగంబజార్, సైఫాబాద్, హుమాయున్‌నగర్, పంజగుట్టల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 15 చోరీలు చేశాడు. చోరీ చేసిన తర్వాత బయటకు వచ్చే ఇతగాడు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా రెండుమూడు వాహనాలు మారుతూ ఇంటికి చేరుకుంటాడు చోరీ సొత్తును మల్లేపల్లి, టప్పాచబుత్ర ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు మహ్మద్ ఇస్తాయిల్, మహ్మద్ అష్రద్ ఖాద్రీలకు విక్రయించేవాడు. సీసీ కెమెరాల ఆధారంగా.. ఇబ్రహీం ఈ ఏడాది జనవరి 13న నాంపల్లిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కార్యాలయంలోకి ప్రవేశించి, అసిస్టెంట్ కమిషనర్ అమరేష్‌కు చెందిన ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ ఇన్స్పెక్టర్ ఎ.గంగారామ్ నేతృత్వంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు, డిటెక్టివ్ ఎస్సై డి.నరేష్ దర్యాప్తు చేపట్టారు. ఆ కార్యాలయంలో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్, సాంకేతిక ఆధారాలను బట్టి ఇబ్రహీంను అతడి ఇంట్లో పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మహ్మద్ ఇస్తాయిల్, మహ్మద్ అష్రద్ ఖాద్రీలను అరెస్టు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఎవరిని పడితే వారిని రానీయకూడదని, వచ్చిపోయేప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని డీసీపీ జోయస్ సూచించారు. -
వాటా విక్రయించనున్న డీఎల్ఎఫ్ ప్రమోటర్లు
న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ కంపెనీ ప్రమోటర్లు, తమ రెంటల్ విభాగంలో 40 శాతం వాటాను విక్రయించనున్నారు. తమ రెంటల్ విభాగం, డీసీసీడీఎల్(డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్)లో 40 శాతం వాటాను సింగపూర్‌కు చెందిన జీఐసీకు ప్రమోటర్లు విక్రయించనున్నట్లు డీఎల్ఎఫ్ తెలిపింది. డీల్ విలువ రూ.12,000–13,000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. జీఐసీతో ఒప్పందం మరో రెండు, మూడు నెలల్లో కుదరగలదని డీఎల్ఎఫ్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) అశోక్ త్యాగి చెప్పారు. వాటా విక్రయ ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తవగలదని అంచనాలున్నాయని వివరించారు. డీఎల్ఎఫ్కు నికర రుణ భారం రూ.24,000 కోట్లుగా ఉంది. ఈ రుణభారం తగ్గించుకోవడానికి డీఎల్ఎఫ్ ప్రమోటర్లు ప్రయత్నిస్తున్నారు. -
వెబ్ సేవలకు ‘వన్‌స్టాప్’
• డిజైన్, మార్కెటింగ్, టెక్నికల్ రైటింగ్, కన్సల్టెన్సీ సేవలన్నీ • రూ.10 వేలతో మొదలై 5 కోట్ల టర్నోవర్‌కు చేరిన ఇనోవీస్ • దేశ, విదేశాల్లోని 365 కంపెనీలకు సేవలు • 3 నెలల్లో వర్సిటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు • ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ నాగేంద్ర బొమ్మసాని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమీర్‌పేట్‌లోని ఓ చిన్న గదిలో రూ.10 వేల పెట్టుబడితో మొదలైన కంపెనీ.. ఇప్పుడు దేశ, విదేశాల్లోని బడా సంస్థలకు సేవలందిస్తోంది. విద్య, వైద్యం, వ్యాపారం, స్థిరాస్తి రంగాల్లో... ప్రతి మూడు కంపెనీల్లో ఒకదానికైనా టెక్నాలజీ లేదా అప్లికేషన్ అభివృద్ధి చేసిన కంపెనీల్లో ‘ఇనోవీస్’ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో!! చదువుకునే వయసులోనే తాను పనిచేసిన కంపెనీని కొని... ఆ అనుభవాన్నే ఇనోవీస్కు పునాది చేసిన సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర బొమ్మసాని...కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ రతన్ అవార్డునూ అందుకోవటమే కాదు, తన సంస్థను గూగుల్‌కు సంబంధించి అత్యుత్తమ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా మార్చారు. సంస్థ ప్రారంభం, సేవలు, విస్తరణ ప్రణాళికలు ఆయన మాటల్లోనే... మాది ఖమ్మం జిల్లా పాల్వంచ. డిగ్రీ చదువుతూ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవాణ్ణి. కొన్నాళ్లకు ఆ ఇనిస్టిట్యూట్ అమ్మకానికొస్తే కొనేశా. అదే నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఎందుకంటే చదువుతూ పార్ట్ టైం జాబ్ చేయటం, అలా ఉద్యోగం చేసిన కంపెనీనే కొని స్థానికంగా నంబర్–1గా తీర్చిదిద్దటం... ఇవి నాపై నాకు నమ్మకాన్ని పెంచాయి. ఆరేళ్ల కిందట ఇనోవీస్.కామ్‌ను ప్రారంభించా. వెబ్ డిజైన్ నుంచి డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ రైటింగ్, స్టార్టప్ కన్సల్టింగ్, మొబైల్ అప్లికేషన్స్... అన్ని రకాల టెక్నాలజీ సేవలందించడం మా ప్రత్యేకత. టెక్నాలజీ మేగజైన్ ‘సీఐఓ’... ఇనోవీస్ను 20 ఉత్తమ గూగుల్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా పేర్కొంది. దేశ, విదేశీ కంపెనీలకు సేవలు.. దేశ, విదేశాల్లోని విద్య, వైద్యం, వ్యాపారం, మీడియా, స్థిరాస్తి సంస్థలకు వెబ్సైట్లు, అప్లికేషన్స్, యాప్స్ అభివృద్ధి చేశాం. ఐటీ కంపెనీలకు కంటెంట్ విశ్లేషణ, ఆసుపత్రులకు ఆన్లైన్ కన్సల్టేషన్, విద్యా సంస్థలకు ఇంటర్నెట్, స్టూడెంట్ ఎవల్యూషన్ సిస్టమ్స్ సేవలందించాం. మీడియా సంస్థలకు బిజినెస్ పోర్టల్స్‌ను అభివృద్ధి చేసిచ్చాం. ప్రస్తుతం 365కు పైగా సంస్థలు మా క్లయింట్లుగా ఉన్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచే 300 కంపెనీలుంటాయి. అమెరికా, దుబాయ్, శ్రీలంకల్లోనూ మాకు క్లయింట్లున్నారు. వైట్ లేబులింగ్ సర్వీసెస్ కింద హైదరాబాద్‌లోని దాదాపు అన్ని కంపెనీలకూ టెక్నాలజీ సేవలందించింది ఇనోవీసే. అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రారంభ ధర రూ.2.5 లక్షలుగా ఉంది. 3 నెలల్లో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు.. బడా కంపెనీలతో పాటు స్టార్టప్‌లకూ సేవలందించాలని నిర్ణయించాం. అందుకే స్టార్టప్ కన్సల్టెన్సీని ప్రారంభించాం. స్టార్టప్స్‌కు వెబ్సైట్ అభివృద్ధి నుంచి మార్కెటింగ్, విస్తరణ, బ్రేక్ ఈవెన్ వంటి అన్ని విభాగాల్లోనూ సేవలందిస్తున్నాం. తెలంగాణ, ఏపీల్లోని విశ్వ విద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని నాగార్జున యూనివర్సిటీతో ప్రారంభిస్తున్నాం. వచ్చే 3 నెలల్లో మరో 3 వర్సిటీల్లో సెంటర్లను ఏర్పాటు చేస్తాం. రూ.5 కోట్ల టర్నోవర్ లక్ష్యం.. ప్రస్తుతం సంస్థలో ప్రత్యక్షంగా 36 మంది ఉద్యోగులున్నారు. వెబ్ అప్లికేషన్ సర్వీసు విభాగాన్ని హైదరాబాద్‌కు పరిమితి చేసి.. సపోర్ట్ ఎండింగ్ సర్వీసెస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించాం. బెంగళూరుతో ప్రారంభించి 3 నెలల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రారంభిస్తాం. గతేడాది రూ.3.8 కోట్ల టర్నోవర్ సాధించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యించాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
పోస్టల్ ద్వారా ‘రియల్ షాపీ’ వస్తువులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): తపాలా శాఖ ద్వారా రియల్షాపీ వస్తువుల మార్కెటింగ్‌కు రంగం సిద్ధమైంది. వినియోగదారులు స్థానిక పోస్టాఫీసులో కేటలాగ్‌లోని వస్తువులు ఆర్డర్ ఇస్తే సప్లై చేస్తారు. ఈ విధానానికి తపాలా శాఖ శ్రీకారం చుట్టినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. రియల్షాపీ విధానంపై శుక్రవారం డివిజన్ స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వాచీలు, మొబైల్స్, శారీలు మొదలు ఆన్లైన్లో కొనుగోలు చేసే ప్రతి వస్తువును వినియోగదారుడి ఆర్డరుపై తపాలా సిబ్బంది తెప్పిస్తారని సుబ్బారావు తెలిపారు. -
సోమవారం.. చేనేత వారం
ప్రభుత్వ ఉద్యోగులు ధరించేలా ప్రోత్సాహం కలెక్టరేట్లో ‘టెస్కో’ ఆధ్వర్యాన స్టాల్ వచ్చే వారం నర్సంపేట.. ఆపై వర్ధన్నపేట, పరకాలలో... చేనేత రంగం పరిరక్షణకు కలెక్టర్ చొరవ హన్మకొండ : చేతి నిండా పని.. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ బతికిన చేనేత కార్మికులు ఇప్పుడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు నేసిన వస్త్రాన్ని కొనుగోలు చేసే వారు లేక.. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియక.. పని కరువై పొట్ట కూటి కోసం తిప్పలు పడిన నేతన్నకు మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. చేనేత వస్త్రాలు ధరించడంపై అవగాహన కల్పించడమే కాకుండా రాష్ట్ర మంత్రి మొదలు జిల్లా కలెక్టర్ వరకు వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరించాలని నిర్ణయించడం.. దీనిపై ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తుండడంతో వస్త్రాల అమ్మకాలు పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఇదేకాకుండా వరంగల్ రూరల్ జిల్లాలోని శాయంపేటలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కిందమంజూరైన డైయింగ్, హ్యాండ్లూమ్ యూనిట్ ఏర్పాటుతో చేనేత కార్మికులు నూతన డిజైన్లలో వస్త్రాలను రూపొందించడం ద్వారా మార్కెట్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆచరణలోనూ చూపించిన కలెక్టర్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచన మేరకు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని కోరిన వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. అందరిలో స్ఫూర్తి నింపేలా ఆయన కూడా సోమవారం చేనేత వస్త్రాలు ధరించడమే కాకుండా ఉద్యోగులందరికీ అందుబాటులో చేనేత వస్త్రాలు ఉండేలా ఏకంగా కలెక్టరేట్లో ‘టెస్కో’ ఆధ్వర్యాన అమ్మకాల కోసం స్టాల్ ఏర్పాటుచేయించడం విశేషం. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ స్టాల్ మంగళవారం ముగిసింది. అంతేకాకుండా ప్రతీ వారం జిల్లాలోని ఓ ప్రాంతంలో స్టాల్ ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా ప్రకటించారు. 16వేల మంది ఉద్యోగులు జిల్లాలో ఉన్న 16వేల మంది ఉద్యోగులు ప్రతీ సోమవారం ధరించేందుకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తే కార్మికులకు ఉపాధి చూపించినట్లవుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చెబుతున్నారు. అంతేకాకుండా వారంవారం గ్రీవెన్ససెల్ జరిగే రోజుల్లో ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా.. వినతిపత్రాలు, ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు చేనేత ఆవశ్యకతను చాటిచెప్పినట్లవుతుందనేది కలెక్టర్ భావన. అంతేకాకుండా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునే ఉద్యోగుల కోసం ప్రత్యేక పథకం ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఉద్యోగి నెలకు రూ.వెయ్యి చొప్పున తొమ్మిది నెలల పాటు చేనేత సహకార సంఘంలో చెల్లిస్తే.. తర్వాత వారు రూ.16,500 విలువైన వస్త్రాలు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరుతున్నారు. అటు కలెక్టర్ చొరవ.. ఇటు ప్రభుత్వ పథకాలు అమలైతే చేనేత రంగానికి మంచి రోజులు వచ్చేందుకు ఇంకా ఎన్నో రోజులు పట్టదని చెప్పొచ్చు.