రాష్ట్రంలో లారీలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అత్యవసర సరుకులు మినహా మిగతా అన్ని రకాల సరుకుల రవాణా దాదాపుగా ఆగిపోయింది. జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్లతో పాటు రాష్ట్రంలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం ఉదయం ఆరు గంటల నుంచే లారీ యజమానులు సమ్మె ప్రారంభించారు.