చిత్తూరు (అర్బన్) : నిర్మాణ రంగంలో నాణ్యతకు, నమ్మకానికి భారతి సి మెంట్ ప్రతీక అని ఆ సంస్థ చిత్తూరు మార్కెటింగ్ అధికారి బాలకృష్ణ అన్నా రు. భారతి సిమెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని గాంధీ రోడ్డు కూడలిలో ఉన్న శ్రీలక్ష్మీ సిమెంట్ దుకాణం లో డీలర్లు, వినియోగదారులతో సమావేశం నిర్వహించారు. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానం, రోబోటెక్ క్వాలిటీ, ట్యాం పర్ ప్రూఫ్ ప్యాకింగ్‌తో తయారవుతున్న ఏకైక సిమెంట్ భారతి సిమెంట్ మాత్రమేనని మార్కెటింగ్ అధికారి బా లకృష్ణ చెప్పారు.
తయారీలోనూ, సరఫరాలోనూ కచ్చితమైన నాణ్యతప్రమాణాలు పాటించడంతో నాలుగేళ్లలోనే భారతి సిమెంట్ దేశంలోనే అగ్రగామి గా నిలిచిందన్నారు. వ్యాపార దృక్పథంతోనే కాకుండా నిర్మాణ రంగంలోని కా ర్మికుల సంక్షేమానికి కూడా భారతి సి మెంట్ యాజమాన్యం కృషి చేస్తోందన్నారు. నిర్మాణ రంగంలో వస్తున్న మా ర్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాపీమేస్త్రీలకు, కార్మికులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోం దని తెలిపారు.
తాపీమేస్త్రీలకు లక్ష రూ పాయల ప్రమాదబీమా కూడా కల్పిస్తూ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. భారతి సిమెంట్ టెక్నికల్ మేనేజర్ ఛాయపతి మాట్లాడుతూ భారతి సిమెంట్ ప్రత్యేకతలను స్లైడ్‌షోలు, షార్ట్ వీడియోల ద్వారా వివరించారు. నిర్మాణ రంగంలో కార్మికులు పాటించాల్సిన విధానాలు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, నీటి విని యోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం డీలర్లకు, వినియోగదారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ సిమెంట్ హార్డ్‌వేర్ దుకాణం నిర్వాహకులు శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నాణ్యతకు, నమ్మకానికి ప్రతీక భారతి సిమెంట్
Published Sat, Sep 20 2014 4:07 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement