నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్
తొర్రూరు టౌన్ : నాణ్యతకు మరుపేరు భారతి సిమెంట్ అని సంస్థ సీనియర్ రీజినల్ సేల్స్ మేనేజర్ ప్రమోద్‌రెడ్డి అన్నారు. భారతి సిమెం ట్‌పై గురువారం స్థానిక బృందావన దాబాలో వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రమోద్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భారతి సిమెంట్‌కు అతి తక్కువ సమయంలో వినియోగదార్ల ఆదరణ పెరిగిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో అత్యున్నత నాణ్యత, జర్మన్ టెక్నాలజీతో రోబోటిక్ క్వాలిటీ నియంత్రణ గల కొత్త సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మిగతా సిమెంట్‌లతో పోలిస్తే భారతి సిమెంట్ మూడు రెట్లు నాణ్యమైనది, పటిష్టమైందన్నారు. ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ వల్ల వినియోగదారుడికి నష్టం కలగదన్నారు. ఈ ప్రమాణాలు పాటించడంతో మార్కెట్‌లో భారతి సిమెంట్ ముందువరుసలో ఉంటుందని తెలిపారు. అనంతరం సంస్థ రీజ్‌నల్ టెక్నికల్ ఇంజనీర్ మూర్తికుమార్ మాట్లాడుతూ వినియోగదారులకు పవర్ పాయింట్‌తో ఇంటి నిర్మాణ కట్టడాల గురించి, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వివ రించారు. కార్యక్రమంలో ఏరియా సేల్స్ మేనేజర్ నాగేశ్వర్‌రావు, సాయిరామ్ సిమెంట్ ఏజెన్సీ, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.