
ఈ రోజుల్లో శుద్ధమైన నీటిని తాగడమూ కొంత ప్రయాసతో కూడిన అంశంగా మారింది. భూగర్భ, నదీ జలాల కాలుష్యం, కొన్నాళ్ల పాటు నిల్వ ఉంచే వాటర్ ట్యాంకుల వల్ల స్వచ్ఛమైన నీటి కోసం వెతుకులాట తప్పడం లేదు. దీంతో చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్లను ఎంచుకుంటున్నారు. మార్కెట్‌లో లభించే రకరకాల వాటర్ ప్యూరిఫైయర్‌లలో కొన్ని నీటిని వడకట్టేవి, మరికొన్ని నీటి నుంచి పోషకాలు పోకుండా కాపాడేవి, ఇంకొన్ని మోతాదులో పోషకాలు కలిపేవి లభిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే నీటిలోఉండే స్వచ్ఛత తెలుసుకోవడానికి అవగాహనే ప్రధానమైనది.
ఎంపిక చేసుకున్న ప్యూరిఫైయర్‌ని ఆపరేటర్లు ఇంట్లో అమర్చాక టిడిఎస్ ఎంత ఉందో నాణ్యత చూపించి, మరీ వాటి గురించి వివరిస్తుంటారు. వరప్రదాయినిగా లభించే నీటిలోపోషకాలు ఏంటి, టిడిఎస్ ఏంటి.. అంటూ కొంత ఆందోళన పడుతుంటాం. ఖనిజాలు, లవణాలు, లోహాలతో సహా నీటిలో కరిగిన పదార్థాల మొత్తాన్ని కొలవడమే టిడిఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్).
నీటిలో టిడిఎస్ స్థాయి ఎంత మేరకు ఉండాలంటే...
0-50 పిపిఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటే... దీనిని స్వేదనజలం అంటారు. అవసరమైన ఖనిజాలు,పోషకాలు లేకపోవడం వల్ల ఈ నీటిని తాగడానికి ఉపయోగించలేం50-150 పిపిఎమ్ ఉంటే అవసరమైన ఖనిజాలు,పోషకాలు ఉన్నాయని, తాగడానికి మేలైనదని గుర్తించాలి
150 - 300 పిపిఎమ్ ఉంటే తాగడానికి మేలైనది
300 - 500 పిపిఎమ్ ఉంటే ఆ నీరు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి
500-600 పిపిఎమ్ కంటే ఎక్కువ ఉంటే తాగడానికి మేలైనది కాదు.
నీటి శుద్ధి యంత్రాల రకాలు:
ఆర్‌వో (రివర్స్ ఓస్మోసిస్):
అధిక టిడిఎస్ (300 పిపిఎమ్ కంటే ఎక్కువ)కు ఆర్‌వో ఉత్తమమైనది. ఇది, నీటిలో భార లోహాలు, రసాయనాలు, అదనపు లవణాలను తొలగిస్తుంది. అయితే, ముఖ్యమైన ఖనిజాలను కూడా తొలగించవచ్చు, కాబట్టి దీనిలోనూ మినరలైజర్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మేలు.
యూవీ (అతినీలలోహిత) ఫిల్టర్: బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది. నీటిలో తక్కువ టిడిఎస్ ఉన్నప్పుడు యువి మోడల్ మంచిది.
యూఎఫ్ అతినీలలోహిత ఫిల్టర్: ఈ మోడల్ వాటర్ ఫిల్టర్ యూవీ లాగానే ఉంటుంది. కానీ సస్పెండ్ చేయబడిన కణాలను కూడా యుఎఫ్ మోడల్ తొలగిస్తుంది.
యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు: రుచిని మెరుగుపరచడానికి, క్లోరిన్, సేంద్రీయ మలినాలను తొలగించడానికి ఈ ఫిల్టర్ బాగా ఉపయోగపడుతుంది.
సరైన ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవడం:
అధిక టిడిఎస్ కోసం (300 పిపిఎమ్)RO లేదా RO+UV/UF ఎంచుకోవచ్చు
తక్కువ టిడిఎస్ (300 పిపిఎమ్ లోపల ) కోసం UV+UF లేదా గురుత్వాకర్షణ ఆధారిత ప్యూరిఫైయర్లు సరిపోతాయి.
మున్సిపల్ నీటి కోసం సాధారణ టిడిఎస్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు బాగా పనిచేస్తా.
బోర్‌వెల్/హార్డ్ వాటర్‌లో అధిక టిడిఎస్ స్థాయిలు ఉంటాయి కాబట్టి ఆర్‌వో ఫిల్టర్ బాగా పనిచేస్తుంది.
కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను తిరిగి కలపడానికి మినరలైజర్/టిడిఎస్ కంట్రోలర్ వంటి కొన్ని ఆర్‌వో ప్యూరిఫైయర్‌లు ఉన్నాయి
ఇంట్లో వాడే వాటర్ ఫిల్టర్ ఎంపికను బట్టి టిడిఎస్ స్థాయిని కొలవడానికి మీరు టిడిఎస్ మీటర్‌ను ఉపయోగిస్తూ ఉండాలి. ఏవైనా మార్పులు కనిపిస్తే సంబంధిత ఆపరేటర్‌కు తెలియజేసి, ఫిల్టర్‌ను మార్చుకోవాలి.
చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!
శుద్ధమైన నీటిని తాగితే చాలు...
గతంలో సంప్రదాయ పద్ధతిలో మరిగించడం అనేది ఒక పద్ధతిగా ఉండేది. దీని వల్ల కూడా కొన్ని పోషకాలు పోతున్నాయి అని గ్రహించారు. వాటర్ క్వాలిటీ కోసం టిడిఎస్‌ను చెక్ చేస్తాం. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అవలంబిస్తుంది. ఆర్‌వో సిస్టమ్ అయితే సురక్షితం అనుకుంటాం. ఫిల్టర్ వరకు పర్వాలేదు. కానీ, వీటి ద్వారా కూడా నీటిలో కొన్ని పోషకాలు పోతుంటాయి. 100 శాతం క్లోరిన్, కాలుష్య శుద్ధి చేసి, నీటి నుంచి మనకు కావల్సిన పోషకాలు లభిస్తే చాలు. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగితే చాలా ప్రయోజనాలు అని చెబుతుంటారు. వాటికి సంబంధించిన ఫిల్టర్లు కూడా వస్తున్నాయి. నీటిలో ప్రధానంగా ఉండే పొటాషియం, మెగ్నిషియమ్, ఐరన్ వంటివి ఉంటే చాలు. ఎక్కువ ΄ోషకాలు కలిపి మరీ తీసుకోవాల్సిన అవసరం లేదు.
– సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్
Comments
Please login to add a commentAdd a comment