Pure water
-
నీరు.. బేజారు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కళాఖండమేమీ కాదు, ఇది మంచినీటి సీసా మాత్రమే! దీని ధర తెలుసుకుంటే మాత్రం గుండె బేజారవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసా. ‘అక్వా డి క్రిస్టాలో ట్రిబ్యూటో ఎ మోదిగ్లియానీ’ పేరుతో ఈ మంచినీటి సీసాను దివంగత ఇటాలియన్ కళాకారుడు అమేదియో క్లెమెంటె మోదిగ్లియానీకి నివాళిగా మెక్సికన్ కళాకారుడు ఫెర్నాండో ఆల్టమిరానో ప్రాచీన ఈజిప్షియన్ శిల్ప శైలిలో రూపొందించాడు. దీని తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్, 23 కేరట్ల బంగారం ఉపయోగించి, యంత్రాలతో పనిలేకుండా పూర్తిగా హస్తకళా నైపుణ్యంతోనే ఈ నీటిసీసాలను తయారు చేశాడు. వీటిలో జలపాతాల నుంచి జాలువారిన నీటిని నింపి, విక్రయానికి సిద్ధం చేశాడు. ఈ నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. మెక్సికో సిటీలో 2010లో జరిగిన వేలంలో ఈ లీటరు నీటి సీసా ఒకటి 60 వేల డాలర్లకు (రూ.49.89 లక్షలు) అమ్ముడుపోయి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసాగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు దీని రికార్డు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. -
మంచి నీటి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్
-
లాక్డౌన్ ఎఫెక్ట్.. క్లీన్ గంగా
వారణాసి : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు భారత్‌లో 21 రోజులపాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా దేశంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాలు అన్ని మూతపడ్డాయి. పరిశ్రమల బంద్ కారణంగా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు నిలిచిపోయాయి. సాధారణంగా పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు స్థానికంగా ఉన్న నదిలోకి వెళ్లి కలుస్తుంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలన్నీ మూసివేయడంతో వారణాసి, హరిద్వార్ ప్రాంతాల్లో ప్రవహించే గంగా నదిలోకి వ్యర్థాలు చేరకపోవడంతో నదిలోని నీరు రోజు రోజుకి శుద్ధి అవుతోంది. అనేక పరిశోధనల అనంతరం ప్రస్తుతం నీటి నాణ్యతలో గొప్ప మార్పు కనిపిస్తోందని, అలాగే తాగడానికి కూడా సరిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. (బ్రిటన్ కమెడియన్ కన్నుమూత) లాక్డౌన్ నేపథ్యంలో హరిద్వార్ ఘాట్లు మూసివేయడంతో ప్రజలు నీటిలో దిగడం, వ్యర్థాలను నీటిలో వేయడం వంటివి లేకపోవడంతో చూడటానికి నీళ్లు తేటగా కనిపిస్తున్నాయి. చేపలు ఇతర సముద్ర జీవులు కూడా నీటిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గంగా నదిలోకి పదోవంతు కాలుష్యం పరిశ్రమలు, సమీప హోటళ్ల నుంచి వచ్చ చేరుతుందని బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పీకే మిశ్రా వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండటం, పరిశ్రమలు పనిచేయకపోవడం కారణంగా దాదాపు 40 నుంచి 50 శాతం వరకు గంగా నది నీరు నాణ్యత పెరిగిందని ఆయన చెప్పారు. అలాగే గత కొన్ని వారాలుగా ఆ ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదవ్వడంతో నీటి మట్టాలు పెరిగాయి. (కరోనా: వీధుల్లో తిరుగుతున్న దెయ్యాలు! ) కాగా కేవలం గంగా నది మాత్రమే కాకుండా యమునా నది నీటి నాణ్యత, నీటి పరిమాణంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కాలుష్యంతో నిండిన నది ప్రస్తుతం క్లీన్‌గా కనిపిస్తోంది. ఇక రోడ్లపై వాహానాలు తక్కువ ప్రయాణిస్తుండటంతో వాయు కాలుష్యం సైతం కనుమరుగయ్యింది. అలాగే ఇప్పటి వరకు కనిపించని అనేక వలస పక్షులు కూడా తిరిగి వచ్చాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో కొన్ని ప్రదేశాల్లో అడవిలో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. (సెహ్వాగ్‌కు ‘రామాయణం’ గుర్తొచ్చింది..! -
మెట్రో వాటర్.. సూపర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌కు జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు అత్యంత స్వచ్ఛమైనదని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) పరీక్షల్లో తేలింది. దేశంలోని 15 నగరాల నుంచి పది చొప్పున నీటి నమూనాలు తీసుకొని పరీక్షించింది. పదికి పది బాగుండడంతో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఒక్క నమూనా మాత్రమే ఫెయిలైన హైదరాబాద్, భువనేశ్వర్ రెండో స్థానంలో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం పదో స్థానానికి పరిమితమైంది. 2012లో బీఐఎస్ నోటిఫై చేసిన తాగునీటి ప్రమాణాల ప్రకారం 28 పారామీటర్లుగా తీసుకొని నమూనా పరీక్షలు చేశారు. చాలా వరకు ఫెయిలైన శాంపిల్స్‌లో ఎక్కువగా నీటిలో కరిగిన ఘన పదార్థాలు, మలినాలు, నీటి కాఠిన్యత, లవణీయత, లోహలు, నీటి నాణ్యతకు సంబంధించిన పారామీటర్లు ఉన్నాయి. నిలువ చేసి.. శుద్ధి చేసి కోటికిపైగా జనాభా ఉన్న నగరానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు జలమండలి ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. 9,80,000 నల్లా కలెక్షన్ల ద్వారా ప్రతిరోజూ 465 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. కృష్ణా, గోదావరితో పాటు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నీటిని శుద్ధి చేసి నగరవాసులకు కుళాయిల ద్వారా అందిస్తోంది. ఏ కాలంలోనైనా నగరవాసులకు తాగునీటి తిప్పలు ఉండకూడదన్న ఉద్దేశంతో 500కు పైగా రిజర్వాయర్లలో మంచి నీటిని నిలువ చేస్తోంది. గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చిన నీటిని ఈ రిజర్వాయర్లలో నిలువ చేసి బ్లాస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తున్నారు. దీనిద్వారా నీటిలో ఉన్న హానికారక బ్యాక్టీరియ నశించి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు చేరుతోంది. ఇప్పటికే కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న జలమండలికి ఐఎస్వో ధ్రువీకరణ పత్రం అందింది. తాజాగా బీఎస్ఐ నమూనా పరీక్షల్లో హైదరాబాద్‌కు రెండో స్థానం దక్కడంతో జలమండలి ఎండీ దానకిశోర్ హర్షం వ్యక్తం చేశారు. -
ఇక శుద్ధ జలధార
అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే... శుద్ధమైన నీటిని సేవించాలి. సంక్షేమ పథకాలతోనే సంతృప్తి చెందని సర్కారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ... వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో ప్రజలకు దశలవారీగా శుభ్రమైన నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతలో జిల్లాలో అమలు చేయనున్న పథకం కోసం జిల్లా అధికారులు రూ. 2600 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. నేడో రేపో దానిని మంత్రులకు అందించి ఆమోదింపజేయనున్నారు. జిల్లాలోని తాగునీటి పథకాల సంఖ్య: 1989 ఇందులో సోలార్ పథకాలు : 160 మల్టీ విలేజ్ స్కీంలు : 34 సాక్షి, బొబ్బిలి: ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని ఇంటింటికీ అందించేందుకు నిర్ణయించింది. రెండో దశలో ఈ పథకం మన జిల్లాలో అమలు పరచనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని వర్తింపజేసి తాగునీటి సమస్యను నూరు శాతం పరిష్కరించే చర్యలు తీసుకోనున్నారు. జిల్లాకు పూర్తి స్థాయి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అమలు పరిచేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలో దీనికి జలధార అనే నామకరణం చేశారు. జిల్లాలోని 34 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మండలాల్లో ఉన్న పథకాలను కూడా వినియోగిస్తారు. ఆయా పథకాలకు శుద్ధి చేసిన జలాన్ని సరఫరా చేసి ఆ నీటిని గ్రామాల్లోని ప్రజలకు ఇంటింటికీ అందజేస్తారు. ఇందుకో సం అన్ని గ్రామాల్లో అదనపు పైప్లైన్లు నిర్మించనున్నారు. రూ.2,600 కోట్లతో మాస్టర్‌ప్లాన్.. జిల్లాలో పథకం అమలుకు సంబంధించి గ్రామీ ణ నీటి సరఫరా విభాగం అధికారులు రూ. 2,600 కోట్లతో ప్రణాళికలు, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. ఈ నిధులతో వాటర్ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓవర్‌హెడ్‌ట్యాంకులు, తాగునీటి పైప్‌లు నిర్మిస్తారు. తద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందజేస్తారు. విజయవాడ తరహాలో సాగునీటి ప్రాజెక్టుల్లోని మిగులు జలా లు వృధాగా పోకుండా వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించే ప్రణాళికే వాటర్‌గ్రిడ్. ఈ జలాలను ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల సహాయంతో శుద్ధ జలాలుగా మారుస్తారు. ఇందుకోసం జిల్లాలోని తోటపల్లి, తాటిపూడి రిజర్వాయర్ల నీటిని తాగునీటి అవసరాలకోసం మారుస్తారు. దీనివల్ల మిగులు జలాలు వృధాగా నదుల్లోకి విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే నిత్యం బోర్లతో భూగర్భ జలాలను తోడేస్తూండటంవల్ల తలెత్తే పర్యావరణ ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చనేది ముఖ్యమంత్రి భావన. మనిషికి వందలీటర్ల నీరు పట్టణాల్లో ఓ వ్యక్తికి రోజుకు135 లీటర్ల నీరు అవసరం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 105 లీటర్ల నీరు అవసరమనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల్లో ఒకటి. వీటి ని అనుసరించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా సగటున ఓ వ్యక్తికి వంద లీటర్ల తాగునీరు ఇవ్వాలని జిల్లా అధి కారులు నిర్ణయించారు. తాగునీరు, వాడుక నీరు అన్న తేడా లేకుండా పూర్తి స్థాయిలో ఈ వా టర్‌గ్రిడ్‌ను అమలు పరచాలని నిర్ణయించారు. దీనిపై సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవా ణి, ఇన్‌ఛార్జి మంత్రులకు అధి కారులు అందజేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు వెంటనే ప్రారంభిస్తారు. మనిషికి వంద లీటర్ల నీరు.. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా ప్రతీ ఇంటిలోని ఒక్కో వ్యక్తికీ వందలీటర్ల చొప్పున నీటిని అందిస్తాం. ఇందుకోసం రూ.2,600 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశాం. త్వరలో ప్రభుత్వ పెద్దలకు అందజేస్తాం. – పప్పు రవి, ఎస్ఈ ఇన్చార్జి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, విజయనగరం -
గాల్లోంచి స్వచ్ఛ జలం
యంత్రంతో నీళ్లు పుట్టిస్తారా..? అయ్యే పనేనని.. అనుకుంటున్నారా? ఆలోచన ఉండాలిగానీ.. సాధ్యం కానిదేమీ లేదంటున్నారు ఇజ్రాయెల్‌కు చెందిన వాటర్ జెన్ వ్యవస్థాపకుడు మాక్సిమ్ పాసిక్! తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వాటర్ జెన్ కంపెనీ ఓ వినూత్నమైన యంత్రాన్ని సృష్టించింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం జరిగే ఓ కార్యక్రమంలో పాసిక్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వాటర్ జెన్ అవసరం, ప్రత్యేకతల గురించి ‘సాక్షి’ కథనం.. గాల్లోని తేమను ఒడిసిపట్టి.. తాగునీటి సమస్య పరిష్కారానికి చాలా కంపెనీలు సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేందుకు, లేదంటే కలుషితమైన నీటిని శుభ్రం చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీలు అభివృద్ధి చేస్తున్నాయి. వాటర్‌జెన్ మాత్రం అన్నింటికంటే భిన్నంగా.. వినూత్నంగా గాల్లోంచే నీటిని పుట్టించే యంత్రాన్ని అభివృద్ధి చేసింది. గాల్లో రకరకాల వాయువులతోపాటు నీటి ఆవిరి కూడా ఉంటుందన్నది తెలిసిందే. వాటర్ జెన్ యంత్రాలు ఈ తేమను ఒడిసిపట్టి, శుభ్రం చేసి అందిస్తాయి. కొద్దిపాటి కరెంటుతో గాలిని పీల్చుకుని.. అందులోని మలినాలు, ఉష్ణాన్ని తీసేయడం ద్వారా ఈ యంత్రం నీళ్లను సృష్టిస్తుంది. ‘కలుషితమైన నీటిని శుభ్రం చేయడం కంటే.. గాలిని శుభ్రం చేయడం చౌక. అందుకే మేం ఈ టెక్నాలజీని ఎన్నుకున్నాం’ అని మాక్సిమ్ పాసిక్ చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ.. వాటర్ జెన్ యంత్రాలు మన అవసరాలకు తగ్గట్టుగా మూడు రకాల సైజుల్లో లభిస్తాయి. కుటుంబ అవసరాల కోసం రోజుకు 20 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయగల యంత్రంతోపాటు రోజుకు 600, 4,500–6 వేల లీటర్ల నీటిని తయారు చేయగల యంత్రాలను సిద్ధం చేసినట్లు పాసిక్ తెలిపారు. గాల్లోని తేమశాతాన్ని బట్టి ఒక్కో లీటర్ నీరు ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చు రూ.2 మించదని అంచనా. ఉదాహరణకు 30 డిగ్రీల ఉష్ణోగ్రత.. గాల్లో తేమశాతం 70 శాతం వరకూ ఉన్న ప్రాంతాల్లో నీటి ఉత్పత్తి ఖర్చు లీటర్‌కు రూపాయికి మించదు. అంతేకాదు.. గాల్లోని ధూళి, ఇతర కాలుష్యాలను మొత్తం తొలగించేందుకు అత్యాధునిక ఏర్పాట్లు ఉన్న కారణంగా ఈ యంత్రం ద్వారా ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని కూడా పొందవచ్చు. ఓజోన్ వాయువుతో శుద్ధి చేయడం ద్వారా నీళ్లు మరింత ఎక్కువ కాలం తాజాగా ఉండటంతోపాటు వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ల సమస్య ఉండదు. యంత్రం నిర్వహణకు అయ్యే ఖర్చు నెలకు రూ.300 వరకూ ఉంటుందని అంచనా. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో జనాన్ని ఆదుకునేందుకు లారీలోనూ ఒద్దికగా అమరిపోతుంది వాటర్ జెన్ యంత్రం. వీటితోపాటు మిలటరీ అవసరాల కోసం మొబైల్ యంత్రాన్ని, ఎయిర్ కండీషనర్ల నుంచి విడుదలయ్యే నీటిని శుద్ధి చేసేందుకు, గాల్లోని తేమను తొలగించడం ద్వారా పదార్థాలు మరింత ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసేందుకు కూడా ఈ కంపెనీ ప్రత్యేకంగా యంత్రాలను తయారు చేసింది. భారత్‌లోని చెన్నైతోపాటు అనేక ఇతర దేశాల్లో ప్రస్తుతం వాటర్‌జెన్ యంత్రాలు దాదాపు పది వేలు పనిచేస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోని సగం మందికి వాటర్ జెన్ ద్వారా తాగునీరు అందించేందుకు వాటర్‌జెన్ ప్రయత్నిస్తోంది. ఈ యంత్రాల కోసం భారత్‌తోపాటు అనేక ఇతర దేశాల నుంచి డిమాండ్ ఉంది. అతితక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా సామాన్యుల ప్రాణాలు కాపాడాలన్నది మా లక్ష్యం. – మాక్సిమ్ పాసిక్ – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇంటింటికీ శుద్ధజలం
– కష్ణానది నుంచి నీళ్లు పొందే మొదటి హక్కు పాలమూరుకే – నాగం.. చిల్లర మాటలు మానుకోండి – మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి బొంరాస్‌పేట : మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామని మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. శనివారం బొంరాస్‌పేట మండలంలో పర్యటించిన ఆయన చెట్టుపల్లితండాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కష్ణానది నుంచి నీళ్లు పొందే మొదటి హక్కు పాలమూరుకే ఉందన్నారు. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టులతోపాటు 45–50 చెరువులను నింపి సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టిలో ఉందన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి 1.08లక్షల ఎరకాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి శుద్ధమైన (ఫిల్టర్ వాటర్) తాగునీటి నల్లా ఏర్పాటు చేయిస్తామన్నారు. అనంతరం చిల్మల్‌మైలారంలో ఆర్ఓ ప్లాంట్‌ను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు వల్లే అన్ని రోగాలను నివారించవచ్చన్నారు. ‘ఆసరా పథకం కింద పింఛను రూ.వేయి, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలన్నీ వథానా..? అంటూ ఎంపీ జితేందర్రెడ్డిప్రశ్నించారు. అభివద్ధి చేసి చూపే టీఆర్ఎస్ను వేలు ఎత్తిచూపే అర్హత బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌరారం, చెట్టుపల్లితండాలోని కేజీబీవీ, చిల్మల్‌మైలారంలో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితోపాటు సినీ యువ హీరోలు, నటులు రాజా (ఆనందం), నాగశౌర్య (ఒక మనసు), అభిజిత్ (కేటుగాడు), ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి (బందూక్), తేజస్ (ఉలువ చారు ఆవకాయ బిర్యానీ) మొక్కలు నాటారు. నటులతోపాటు స్థానికులు మొక్కలు నాటుతూ సెల్ఫీలు దిగారు. ఇందులో టీఆర్ఎస్ మండల నాయకులు మల్కిరెడ్డి, ముద్దప్ప దేశ్‌ముఖ్, వెంకట్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సీసీ వెంకటయ్యగౌడ్, తహసీల్దార్ వెంకటయ్య, ఎంఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘శుద్ధ జలం’ ఉత్తిదే!
గజ్వేల్, న్యూస్‌లైన్: ‘శుద్ధ జలం’ గ్రామీణ ప్రజలకు ఇక అందే పరిస్థితులు కనిపించడంలేదు. రక్షిత నీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టాలనుకున్న ఆర్ఓ ప్లాంట్ల పథకానికి ప్రభుత్వం మంగళం పాడినట్లు కనిపిస్తోంది. నాలుగేళ్లుగా అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తామంటూ ఊరించి ప్రస్తుతం పూర్తిగా మరుగున పడేసింది. జిల్లాలో తొలివిడతగా 45 యూనిట్లను మంజూరుచేసినా నిధులివ్వకుండా చేతులెత్తేసింది. ఫలితంగా ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. కలుషిత నీటిని సేవించడం సర్వరోగాలకు కారణమవుతున్న తరుణంలో.. సురక్షిత నీటి వాడకంపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ రంగంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రస్తుతం ఇది లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. 20 లీటర్ల క్యాన్‌కు రూ.10 నుంచి 12 వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనలతో ప్రమేయం లేకుండా ఇవే శుద్ధనీటిగా సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కడుపేదరికాన్ని అనుభవిస్తున్న ప్రజలు నీటి కోసం నిత్యం 10 నుంచి 12 రూపాయలు వెచ్చించలేక కలుషిత నీటినే సేవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పేదలు రోగాల బారినపడి అల్లాడుతున్నారు. ఈ దుస్థితిని మార్చడానికి ప్రభుత్వం 2009-10 ఏడాదిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటుచేయడానికి నిర్ణయించింది. తొలివిడతలో జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున మొత్తం 45 యూనిట్ల నిర్మాణానికి మంజూరు కూడా ఇచ్చారు. ఒక్కో ప్లాంటుకు రూ.5 లక్షల వరకు నిధులిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు ఒక్కోటి చొప్పున మంజూరు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో ప్లాంట్ల నిర్మాణానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమైన గ్రామ పంచాయతీ తీర్మానం, ప్లాంటు నిర్మాణానికి అవసరమైన స్థలాల సేకరణ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. కానీ నాలుగేళ్లు గడిచినా నిధులు మాత్రం పత్తాలేవు. నాలుగేళ్లుగా చోటుచేసుకుంటున్న జాప్యం తీరును పరిశీలిస్తే ఈ పథకానికి మంగళం పాడినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం అలసత్వం వల్ల ప్రైవేట్ రంగంలో మినరల్ వాటర్ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ నాణ్యతాప్రమాణాల మాటేమో గానీ ప్రజలను నీళ్లు పేరిట దోపీడీ చేస్తున్నాయి. నిధుల విడుదలపై చడీచప్పుడు లేదు ఆర్ఓ ప్లాంట్ల పథకంపై చడీచప్పుడు లేదు. నిధులు వస్తాయనే ఆశలు కనిపించడంలేదు. ఆర్ఓ ప్లాంట్ల పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో కొత్త పథకం రాబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ కలిగిన మంచినీటి బోరుబావులకు రూ.18వేల విలువైన పరికరాలను బిగించి నీటిని శుద్ధి చేసిన తర్వాత ప్రజలకు అందించడం జరుగుతుంది. కొత్త పథకంతో ప్రజల ఇబ్బందులు తీరుస్తాం. - విజయప్రకాశ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ