బొంరాస్‌పేట : చెట్టుపల్లితండాలో మాట్లాడుతున్న ఎంపీ జితేందర్‌రెడ్డి
ఇంటింటికీ శుద్ధజలం
Published Sat, Jul 23 2016 10:19 PM | Last Updated on Thu, Aug 9 2018 8:30 PM
– కష్ణానది నుంచి నీళ్లు పొందే
మొదటి హక్కు పాలమూరుకే
– నాగం.. చిల్లర మాటలు మానుకోండి
– మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి
బొంరాస్‌పేట : మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామని మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. శనివారం బొంరాస్‌పేట మండలంలో పర్యటించిన ఆయన చెట్టుపల్లితండాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కష్ణానది నుంచి నీళ్లు పొందే మొదటి హక్కు పాలమూరుకే ఉందన్నారు. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టులతోపాటు 45–50 చెరువులను నింపి సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టిలో ఉందన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి 1.08లక్షల ఎరకాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి శుద్ధమైన (ఫిల్టర్ వాటర్) తాగునీటి నల్లా ఏర్పాటు చేయిస్తామన్నారు. అనంతరం చిల్మల్‌మైలారంలో ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు వల్లే అన్ని రోగాలను నివారించవచ్చన్నారు.
‘ఆసరా పథకం కింద పింఛను రూ.వేయి, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలన్నీ వథానా..? అంటూ ఎంపీ జితేందర్‌రెడ్డిప్రశ్నించారు. అభివద్ధి చేసి చూపే టీఆర్‌ఎస్‌ను వేలు ఎత్తిచూపే అర్హత బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌరారం, చెట్టుపల్లితండాలోని కేజీబీవీ, చిల్మల్‌మైలారంలో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డితోపాటు సినీ యువ హీరోలు, నటులు రాజా (ఆనందం), నాగశౌర్య (ఒక మనసు), అభిజిత్ (కేటుగాడు), ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి (బందూక్), తేజస్ (ఉలువ చారు ఆవకాయ బిర్యానీ) మొక్కలు నాటారు. నటులతోపాటు స్థానికులు మొక్కలు నాటుతూ సెల్ఫీలు దిగారు. ఇందులో టీఆర్‌ఎస్ మండల నాయకులు మల్కిరెడ్డి, ముద్దప్ప దేశ్‌ముఖ్, వెంకట్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సీసీ వెంకటయ్యగౌడ్, తహసీల్దార్ వెంకటయ్య, ఎంఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement