ఈ ఫొటోలో కనిపిస్తున్నది కళాఖండమేమీ కాదు, ఇది మంచినీటి సీసా మాత్రమే! దీని ధర తెలుసుకుంటే మాత్రం గుండె బేజారవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసా. ‘అక్వా డి క్రిస్టాలో ట్రిబ్యూటో ఎ మోదిగ్లియానీ’ పేరుతో ఈ మంచినీటి సీసాను దివంగత ఇటాలియన్ కళాకారుడు అమేదియో క్లెమెంటె మోదిగ్లియానీకి నివాళిగా మెక్సికన్ కళాకారుడు ఫెర్నాండో ఆల్టమిరానో ప్రాచీన ఈజిప్షియన్ శిల్ప శైలిలో రూపొందించాడు.
దీని తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్, 23 కేరట్ల బంగారం ఉపయోగించి, యంత్రాలతో పనిలేకుండా పూర్తిగా హస్తకళా నైపుణ్యంతోనే ఈ నీటిసీసాలను తయారు చేశాడు. వీటిలో జలపాతాల నుంచి జాలువారిన నీటిని నింపి, విక్రయానికి సిద్ధం చేశాడు.
ఈ నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. మెక్సికో సిటీలో 2010లో జరిగిన వేలంలో ఈ లీటరు నీటి సీసా ఒకటి 60 వేల డాలర్లకు (రూ.49.89 లక్షలు) అమ్ముడుపోయి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసాగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు దీని రికార్డు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment