Jithender Reddy AP
-
నిన్నటి దాకా ఘాటు కౌంటర్లు.. ఇవాళ ఆత్మీయ ఆలింగనం!!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు ఎడమొహం, పెడమొహం పెట్టుకున్న నేతలిద్దరూ లంచ్ మీట్.. ఆపై ఆత్మీయ ఆలింగనంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ట్వీట్ల యుద్ధంతో కాకరేపిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. చివరకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లంచ్ మీట్లో కలవడం, ఆపై ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం చర్చనీయాశంగా మారింది. మొయినాబాద్‌లోని జితేందర్ రెడ్డి ఫాంహౌజ్ ఏర్పాటు చేసిన లంచ్ మీట్లో మాజీ ఎంపీ జితేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల భేటీ అయ్యారు. అనూహ్యంగా ఈ ఇద్దరూ నేతలు భేటీ అవ్వడం వెనుక ఆంతర్యమేంటనే దానిపై కార్యకర్తలు విస్తృతంగా చర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు, చేర్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈటల రాజేందర్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పరస్సర కౌంటర్లు చేసుకున్న వీళ్లు.. ఆప్యాయంగా పలకరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈటలతో భేటీ అనంతరం.. ‘‘రాష్ట్ర బీజేపీపై తప్పుడు ప్రచారం సరికాదు. పార్టీలో అంతా కలిసి పని చేస్తాం. నా ట్వీట్‌ను ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం’’ అంటూ మీడియా ద్వారా జితేందర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇంతకు ముందు ‘తెలంగాణ నాయకత్వాన్ని వ్యతిరేకించేవాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం’ అంటూ దున్నపోతును ట్రాలీ ఎక్కించే వీడియో ఒకటి పోస్ట్ చేసి పెనుదుమారమే రేపాయాన. ఆపై ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి.. మళ్లీ పోస్ట్ చేసి.. చివరకు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ అనే మీనింగ్ వచ్చేలాగా దానిని పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపైనా ఈటల కూడా కాస్త కటువుగానే స్పందించారు. సీనియర్లు, అన్నీ తెలిసిన వారు ఇతరుల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని ఈటల కామెంట్స్ చేశారు. అంతేకాకుండా వయసు పెరిగిన కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇప్పుడు లంచ్ మీట్ లో ఈ ఇద్దరు నేతల మధ్య నవ్వులు.. ఆత్మీయ అలింగనాలతో భేటీ సాగింది. ఇదిలా ఉంటే.. ఈటల, ఏపీ జితేందర్ రెడ్డికి మధ్య ముందు నుంచే స్నేహముంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు జితేందర్ రెడ్డి ఇంచార్జీ గా సైతం వ్యవహరించారు. అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నారు. కాగా గత నెల జితేందర్ రెడ్డి ఇంట్లో అసంతృప్తి నేతలు సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మొత్తానికి ఇప్పుడు లంచ్ మీట్ తో పాత మిత్రులు మళ్లీ ఒక్కటయ్యారు. ఇదీ చదవండి: ఏయ్.. నన్నే ఆపుతారా?.. కేఏపాల్ హల్చల్ -
దున్నపోతుని తన్నినట్లు.. జితేందర్‌రెడ్డి వరుస ట్వీట్ల కలకలం
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్ చేసిన.. ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్ చేసి.. మళ్లీ పోస్ట్ చేయడం గమనార్హం. పైగా ఆ ట్వీట్‌కు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలను ట్యాగ్ చేశారాయన. అయితే ఆయన ట్విటర్ వాల్‌పై ఆ పోస్ట్ కనిపించకపోవడంతో.. ఆయన దానిని డిలీట్ చేసినట్లు అర్థమైంది. ఆ వెంటనే మళ్లీ ఆ వీడియోను ఆయన పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ గందరగోళ రాజకీయం నడిపిస్తోంది. పార్టీ కేడర్ సైతం అయోమయానికి గురవుతోంది. ఈ తరుణంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ట్వీట్ తో పార్టీ పట్ల తన అసంతృప్తి చూపించారని కొందరు అంటుండగా.. పార్టీ మారతారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q — AP Jithender Reddy (@apjithender) June 29, 2023 అయితే తన ట్వీట్‌ను సమర్థించుకునేలా మరో ట్వీట్ వెంటనే పోస్ట్ చేశారాయన. కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే... బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి — AP Jithender Reddy (@apjithender) June 29, 2023 बीजेपी नेता और पूर्व सांसद @apjithender ने अपना ये ट्वीट क्यों डिलीट कर दिया ? pic.twitter.com/rxSnAmskBO — Lutyens Media (@LutyensMediaIN) June 29, 2023 ఇదీ చదవండి: కేంద్రమంత్రిగా బండి.. ఈటలకేమో ఆ బాధ్యతలు? -
'బీజేపీని వదిలేది లేదు.. మా తమ్ముడిని సీఎం చేశాక ఏమైనా ఆలోచిస్తా'
సాక్షి, సంస్థాన్ నారాయణపురం: బీజేపీ సిద్ధాంత పార్టీ.. ప్రజల కోసం, దేశం కోసం పోరాడు తున్న పార్టీ.. ఇటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం రాత్రి రాజగోపాల్‌రెడ్డితో కలిసి సంస్థాన్ నారాయణపురంలో రోడ్ షో నిర్వ హించారు. రోడ్‌షోలో పాల్గొన్న జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే... ’’‘నేను ప్రగతిభవన్‌లో ఉన్నానట.. ‘నన్ను నీవా కొనేది.. నాకా మెసేజ్‌లు పంపించేది. (జుట్టును చూపిస్తూ) నా వెంట్రుక కూడా కొనలేవు. బీజేపీ ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు, లుచ్చా మనుషులే బయటకు పోతారు. జితేందర్‌రెడ్డి లాంటి వారు పోరు’.... ‘గుర్తుపెట్టుకో హుజూరాబాద్‌లో ఎన్నికలో పెద్దిరెడ్డిని తీసుకొని పోయావు. మోత్కుపల్లి నర్సింహులును, కాంగ్రెస్ నుంచి ఓ లీడర్‌ను తీసుకుపోయావు. ఏమైనా పీకగలిగినవా, ఏమైనా చేశావా.. ప్రజలు 25వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఎవడిని తీసుకొని పోయినా రాజగోపాల్‌రెడ్డి 50వేల మెజారిటీతో గెలుస్తాడు. బీజేపీని వదిలేది లేదు. మా తమ్ముడు సంజయ్‌ను సీఎంను చేస్తా అప్పుడు ఏమైనా ఆలోచిస్తా’ అని వ్యాఖ్యానించారు. -
డీకే అరుణ, జితేందర్‌రెడ్డికి బీజేపీ ఝలక్
ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేజారింది. ఎన్నో దోబూచులాటల అనంతరం ఎట్టకేలకు.. ఆ పదవి పార్టీ విధేయుడు, సీనియర్ నాయకుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు వరించింది. దీంతో ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి భంగపడ్డారు. సాక్షి, మహబూబ్‌నగర్ : పార్లమెంట్ ఎన్నికలకు ముందు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి అనూహ్యంగా కాషాయం కండువా కప్పుకోవడంతో బీజేపీ బలోపేతం కావడంతో పాటు.. వరుసగా జరిగిన పార్లమెంట్, మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఆపారీ్టఅభ్యర్థులు అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష పదవి రేసులో వీరిద్దరి పేర్లు కూడా వినిపించాయి. జితేందర్‌రెడ్డి అయితే ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యే భాగ్యం తనకూ ఉందని కార్యకర్తల సమావేశంలోనే చెప్పారు. అప్పట్లోఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో 1999లోనే బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎంపీగా గెలిచిన జితేందర్‌రెడ్డికి ఈ సారి అధిష్టానం ఆశీస్సులు ఉంటాయనే ప్రచారం జరిగింది. (బీజేపీ బండికి.. సంజయుడే సారథి) 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఆయన పార్టీ పార్లమెంటు పక్షనేతగా పని చేసినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర మంత్రులు, ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి పార్టీ నాయకులతో ఆయన పరిచయాలు మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. గతేడాది మార్చి 27న.. టీఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతూనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో జితేందర్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి హామీ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగింది. బీజేపీలో చేరిన తర్వాత జితేందర్‌రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా అనేక పర్యాయాలు అధిష్టానాన్ని ఆకర్షించేలా సీఎం కేసీఆర్ పని తీరును తీవ్రంగా విమర్శించారు. (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?) మరోవైపు సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సైతం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నా.. ఎప్పుడూ బహిరంగంగా బయటపడలేదు. తన ముఖ్య అనుచర వర్గాల ముందు మాత్రమే పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని చెప్పారు. అయితే ఒకానొక దశలో ఈసారి అధ్యక్ష పదవి రాష్ట్రంలో మహిళకే ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో అది కచ్చితంగా డీకే అరుణకే వరిస్తుందని బీజేపీ శ్రేణులు చర్చించుకున్నాయి. ఆమె పారీ్టలో చేరిన తర్వాత ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలోపేతానికి పట్టుసడలని కృషి చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళమెత్తుతున్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో నిర్మిస్తోన్న రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు రెండ్రోజుల క్రితమే మద్దతు తెలిపారు. (కార్పొరేటర్ నుంచి ఎంపీగా.. సంజయ్ ప్రస్థానం) ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్ పని తీరును విమర్శించారు. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌పై, ప్రజా వ్యతిరేక విధానాలపై గత గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా.. రాష్ట్ర పదవి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్లకు చేజారడంతో పార్టీ శ్రేణుల్లో కాస్త నైరాశ్యం కలిగింది. అయితే వీరిద్దరి మినహా పార్టీలో చాలా మంది సీనియర్లు ఉండడం.. తాజా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేరు సైతం బలంగా వినిపించింది. ఇందులో జితేందర్‌రెడ్డి, డీకే అరుణలకు పార్టీలో సీనియార్టీ లేకపోవడం.. ఒకవేళ వీరిలో ఎవరికైనా అధ్యక్ష పదవి ఇస్తే మిగిలిన సీనియర్ల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో అధిష్టానం ఆ పదవిని ఆరెస్సెస్‌లో సేవకుడిగా పని చేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగిన ఎంపీ బండి సంజయ్‌కు అప్పగించినట్లు పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. అయితే డీకే అరుణ, జితేందర్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయని, భవిష్యత్‌లో మంచి పదవులు వరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
సీఎం మనవడు తినే బియ్యమే హాస్టల్ పిల్లలకు
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కె.చంద్రశేఖర్‌రావు మనవడు తినే నాణ్యమైన బియ్యాన్నే గురుకుల పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి అన్నా రు. ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టాన్ని సవరిస్తూ డిటెన్షన్ విధానాన్ని విస్తృత పరిచేందుకు బుధవారం లోక్‌సభలో తెచ్చిన బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఐదో తరగతిలో ఉత్తీర్ణత సాధించకుంటే పైతరగతిలో ప్రవేశానికి అనర్హుడిని చేసే నిబంధనను తొలగించాలని కోరారు. స్కూళ్లలో మౌలిక వసతుల లేమి చిన్నారులను తీవ్రంగా వేధిస్తోందని తెలిపారు. భువనగిరి, ఆలేరుల్లోరైళ్లు ఆపండి: బూర సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి, ఆలేరు, జనగామలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో ఈఅంశాన్ని లేవనెత్తారు. దీనిపై నాలుగేళ్లుగా అడుగుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ప్రాంతంలో జైన మందిరం, యాదాద్రి పుణ్యక్షేత్రం, ప్రాచీన చర్చి ఉం దని పేర్కొన్నారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను భువనగిరి, ఆలేరు స్టేషన్లలో, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జనగామ స్టేషన్లో ఆపాలని కోరారు. -
ఆ భూములను వాడుకునే వీలు కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రక్షణశాఖ, రైల్వేశాఖ అధీనంలోని భూములు చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ప్రజావసరాలకు వినియోగించుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభలో ‘అవసరార్థం స్థిరాస్తి సేకరణ చట్ట సవరణ’ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల రక్షణశాఖకు చెందిన బైసన్‌పోలో మైదానాన్ని తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి ఇచ్చేందుకు ఆ శాఖ అంగీకరించింది. రక్షణ అవసరాల కోసం హైదరాబాద్‌లో రక్షణశాఖకు భూములిస్తే.. ఆ శాఖ స్థానికంగా ఉండే ప్రజలను ఇబ్బందిపెట్టేలా నిబంధనలు పెడుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి వేధింపులు మానుకోవాలి. జాతీయ భద్రత గురించి భూములు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకొని చర్చలు జరపాలి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భూములు బదిలీ చేసుకోవాలి గానీ వెల కట్టడం సరికాదు’ అని అన్నారు. నాడు ‘కల్యాణలక్ష్మి’ ఉండుంటే..: కడియం తొర్రూరు రూరల్ (పాలకుర్తి): ‘నాకు ఆరుగురు అక్కాచెల్లెళ్లు.. పేదలైన మా తల్లిదండ్రులు బిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు నానా కష్టాలు పడ్డారు.. ఇప్పటిలా కల్యాణలక్ష్మి ఉంటే మాకు ఆ ఇబ్బందులు ఉండేవి కావు’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నాటి కష్టాలను గుర్తుచేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెం గ్రామంలో బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ తనకు ముగ్గురు ఆడపిల్లలేనని, ఒక్క కొడుకైనా కలగకపాయేనని కన్నతల్లి ఆవేదన చెందేదని, కానీ.. కూతుళ్లను ఉన్నతంగా చదివించి ఉత్తములుగా తీర్చిదిద్దానని చెప్పారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లిది.. తనది ఒకే గ్రామమని.. ఉన్నత కుటుంబం నుంచి ఎర్రబెల్లి, పేద కుటుంబం నుంచి తాను అభివృద్ధి చెందామని అన్నారు. -
బీజేపీతో పొత్తు ఉండదు..
♦ మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ♦ 112 అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ ♦ ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం ఎంఐఎంకు.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో కూడా బీజేపీతో తమకు పొత్తు ఉండదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లోని తన స్వగృహంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 112అసెంబ్లీ, 16 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని అన్నారు. మిగతా ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం ఎంఐఎంకు కేటాయించనున్నట్లు తెలిపారు. గంగ, యమున తహజీబ్ మాదిరిగా ఎంఐఎంతో మాత్రమే తమపార్టీ పొత్తు ఉంటుందని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అంశాల వారిగానే తమ పొత్తు ఉంటోందని అన్నారు. ఇక.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఏ ఒక్క నాయకుడు కూడా చేరబోరన్నారు. కేవలం మీడియాను అడ్డుపెట్టుకుని బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతోందన్నారు. అదే విధంగా పాలమూరు జిల్లాలో అఖిలపక్షం పేరిట అన్నిపార్టీలు కలిసి చేసిన ధర్నాలో అర్థంలేదని ఎద్దేవా చేశారు. పనిలేని వారంతా కలిసి ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి నుంచి డిండికి 0.5టీఎంసీ నీటి తరలింపు వల్ల పాలమూరు ఆయకట్టుకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7.5లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామన్నారు. అభివృద్ధి సూచీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన ర్యాంకింగ్‌లో 20.7శాతంలో మొదటి స్థానంలో నిలిచినట్లు వివరించారు. రెండో స్థానంలో నిలిచిన ఛత్తీస్‌గఢ్ కేవలం 10.6శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదు చేసిందన్నారు. అన్యాయాన్ని చక్కదిద్దుతున్నాం 60ఏళ్లుగా జిల్లాకు జరిగిన అన్యాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. సమైక్య పాలకుల హయాంలో ఉమ్మడి పాలమూరులో లక్ష ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చారని చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం మూడున్నర ఏళ్లకాలంలోనే పాలమూరు ఆయకట్టును 4.5లక్షల ఎకరాలకు తీసుకెళ్లామన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్దేషిత కాలంలో పూర్తి చేసి 7.5లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాజెక్టుల టెండర్లలో అవకతవకలు జరిగితే తన వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చన్నారు. కానీ రైతుల పేర్లు చెప్పుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టు పనులకు అడ్డు తగులుతున్నారని విమర్శించారు. 75 సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం.. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో 75సంక్షేమ పథకాలను సీఎం అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. సంక్షోభం నుంచి వ్యవసాయరంగాన్ని గట్టెక్కించడం కోసం ప్రాజెక్టుల నిర్మాణం, పెట్టుబడి, ధాన్యానికి మద్దతు ధర అనే మూడు అంశాలతో ముందుకెళ్తున్నామన్నారు. వచ్చేసీజన్ నుంచి రైతన్నకు ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తుందన్నారు. అందుకోసమే భూసమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 15నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వే కోసం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరూ 3 గ్రామాలను తీసుకొని పర్యవేక్షించనున్నారని తెలిపారు. దీనిద్వారా బినామీ ఆస్తులన్నీ బయటపడతాయన్నారు. -
మాకేమో నీళ్లు లేవు..
► వాళ్లేమో ప్రాజెక్టులు కడుతున్నారు ► లోక్‌సభలో జితేందర్‌రెడ్డి ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నీటి ఎద్దడి ఉంటే ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో కేంద్రం అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు కడుతోందని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ప్రశ్నోత్తరాల సమ యంలో మాట్లాడుతూ.. రైతులు ఇప్పటికే విత్తనాలు నాటారని, ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో పంటలు ఎలా ఎదుగుతా యని ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఆల్మట్టి నిండకపోవడంతో కిందికి నీళ్లు రాలేదన్నారు. ఏపీ.. కృష్ణా, గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందని కేంద్రానికి ఇప్పటికే చెప్పామని, పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చెర్ల, గుండ్రే వుల రిజర్వాయర్, గాజులదిన్నె, గురురాఘవేంద్ర, పులికనుమ, సిద్ధాపురం తదితర ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పారు. పెద్ద ప్రాజెక్టుల విషయంలోనే కేంద్రం అనుమతులు అవసరమని జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బలియాన్ బదులిచ్చారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు ఇక్కడే కూర్చుని మాట్లాడుకున్నారన్నారు. నీటి వివాదం ప్రస్తుతం ట్రిబ్యునల్ పరిధిలో ఉందన్నారు. -
రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయం
ఎంపీ జితేందర్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం కేసీఆర్ సూచనలు తీసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పినట్టుగానే ఎన్డీయే అభ్యర్థిగా రాజకీయ అనుభవం, దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను మోదీ ఎంపిక చేశారన్నారు. అనంతరం ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించుకోవడానికి ఈ సమావేశాల్లో పట్టుబడతామని అన్నారు. చట్టంలో పొందుపరిచినట్టు ఉమ్మడి హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపును చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపునకు ఉద్దేశించిన బిల్లు సిద్ధంగా ఉందని, మూడు రోజుల్లో అది పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
నా హాజరు శాతాన్ని వక్రీకరించారు
ఆంగ్ల పత్రికపై ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తన హాజరు శాతాన్ని వక్రీకరించి ప్రచురించిందంటూ ఓ ఆంగ్ల పత్రికపై టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీల హాజరు శాతానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఓ ఆంగ్ల పత్రిక శుక్రవా రం ఎడిషన్‌లో వార్తను ప్రచురించింది. అందులో అత్యల్పంగా 9% మాత్రమే తాను సభకు హాజరైనట్టు పేర్కొందంటూ జితేందర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తన హాజరు శాతం సదరు పత్రిక పేర్కొన్న దానికంటే అత్యధి కంగా ఉందని, ఈ విషయంలో నిజాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు..సదరు పత్రిక బహి రంగ క్షమాపణ చెప్పి.. తన హాజరు శాతాన్ని పక్కాగా తిరిగి ప్రచురించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో కూడా జితేందర్‌రెడ్డి ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. సదరు పత్రిక ఎడిటర్, పబ్లిషర్లకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. -
రాష్ట్ర పథకాలకు కేంద్రం సాయం చేయాలి
లోక్‌సభలో ఎంపీ జితేందర్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలకు కేంద్రం సాయం చేయాలని ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఉత్తర ప్రదేశ్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా రైతు రుణమాఫీకి కేంద్రం సహకరించాలని కోరారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన జాతీయ ఆర్యోగ పాలసీలో ఆశావర్కర్ల ప్రయోజనాలను విస్మరించిందని ప్రత్యేక ప్రస్తావన కింద ఎంపీ వినోద్ కుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. గర్భిణీలు.. ప్రసవించే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే ఆశావర్కర్లకు రాయితీ రావడం లేదని పేర్కొన్నారు. ఆశావర్కర్లకు రాయితీలు పెంచి వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు. -
మంత్రి పదవి రాకుండా చేసింది మీరే!
ఎంపీ జితేందర్‌రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలు సాక్షి, మహబూబ్‌నగర్: ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య విభేదాలు మరోసారి పొడచూపాయి. తమ మధ్య విభేదాలు లేవంటూనే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జితేందర్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అక్కడ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు. మొదట జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, మీడియా కావాలని లేనిపోని కథనాలు సృష్టిస్తోందని ఆరోపించారు. శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి రాకుండా తాను అడ్డుకున్నట్లు ప్రచారం చేయడం తగదన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి రాకుండా మీరే అడ్డుకున్నారని.. సదరు విషయాన్ని ఓ మంత్రి చెప్పారని వ్యాఖ్యానించారు. మంత్రి పదవిని తాను అడ్డుకున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే తప్పుకుంటానని జితేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. అయినా, మంత్రి పదవి అనేది తలరాత ఉంటేనే దక్కుతుందని.. ఎవరో అడ్డుపడితే ఆగేది కాదన్నారు. అయినా, సీఎం కేసీఆర్ ఒకరు చెప్తే వింటారా? అందులోనూ మంత్రి పదవుల విషయంలో వింటారా? అని ఎదురు ప్రశ్నించారు. 14 ఏళ్లు ఆయనను దగ్గరుండి చూశానంటున్న శ్రీనివాస్‌గౌడ్.. ఇతరులు చెప్తే ఎట్లా నమ్ముతారని చెప్పారు. ఈ విషయంలో చాలెం జ్ చేస్తున్నా.. ‘ఏ మంత్రి చెప్పాడో అతన్ని సీఎం దగ్గరికి తీసుకెళ్దాం. నేను అడ్డుపడ్డట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచే తప్పుకుంటా’ అని సవాల్ చేశారు. ఇరువురి మధ్య వేడి రగులుతుండటంతో పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో విషయం సద్దుమణిగింది. -
మంత్రి పదవి రాకుండా చేసింది మీరే!
-
పోరాడితేనే తెలంగాణకు ఎయిమ్స్
కేంద్రం ఎయిమ్స్ ప్రకటనపై ఎంపీ జితేందర్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ‘పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పోరాటం చేస్తే తప్ప రాష్ట్రానికి ఏమీ దక్కడంలేదు. ఇప్పుడు అలాగే పోరాటం చేసి తెలంగాణకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను సాధించుకున్నాం’అని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఎయిమ్స్ ఏర్పాటు హామీని అమలు చేయాలని గత రెండున్నరేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం నేటికి ఫలించిందని ఆయన అన్నారు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసిన తరువాత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా ఎయిమ్స్ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మార్గదర్శకత్వంలో పార్టీ ఎంపీలు చేసిన కృషి నేటికి ఫలించిందని జితేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎయిమ్స్ కేటాయింపు లేకపోవడం వల్ల తీవ్ర నిరాశ చెందామని ఆయన అన్నారు. దీనికి నిరసనగా తమ పార్టీ ఎంపీలు లోక్‌సభకు హాజరుకాకూడదని నిర్ణయించారన్నారు. బడ్జెట్ ఓటింగ్‌కు వచ్చే ముందైనా ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎయిమ్స్ ప్రకటన చేయాలని బుధవారం అరుణ్ జైట్లీని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ప్రత్యేకంగా కలసి విజ్ఞప్తి చేశామన్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడికి తలొగ్గి తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుపై లోక్‌సభలో ప్రకటన చేశారని ఎంపీ వినోద్ తెలిపారు. -
అన్ని మతాల సారం ఒక్కటే
స్టేషన్ మహబూబ్‌నగర్ : అన్ని మతాల సారం ఒక్కటేనని ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం బక్రీద్‌ను పురస్కరించుకుని ఖౌమీ ఏక్తా కమిటీ కార్యదర్శి రఫీఖ్ పటేల్ నివాసంలో ఈద్ మిలాప్ నిర్వహించారు. ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండడం అభినందనీయన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కతి ప్రపంచ దేశాలకు అదర్శంగా నిలించిందన్నారు. త్యాగాలకు ప్రతీకౖయెన బక్రీద్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రజలకు వారు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అ«ధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, పాలమూరు మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, టీడీపీ నాయకులు ఎన్పీ వెంకటేశ్, నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల పునర్విభజనతో నష్టం కలగదు
– ఎంపీ జితేందర్‌రెడ్డి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : జిల్లాల పునర్విభజన వల్ల ఏ జిల్లాకు నష్టం కలగదని, ప్రతి జిల్లాకు సాగునీరు అందిస్తామని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు మా జిల్లాకు రాలేదని, వేరే జిల్లాకు వెళ్లిందని ఆందోళన చెందొద్దని, సాగునీరు అన్ని ప్రాంతాలకు వస్తాయన్నారు. వచ్చే దసరా నుంచి జిల్లాల నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు. అన్ని జిల్లాలు అభివద్ధి పథంలో నడుస్తాయన్నారు. క్రీడాభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తుందని చెప్పారు. 2024 ఒలంపిక్స్ దేశంలో జరిగేందుకు ప్రభుత్వాలు కషి చేయాలన్నారు. కష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని, అందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒప్పందపత్రం చూపితే తప్పుకుంటాం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నట్లు ఒప్పందపత్రం చూపితే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సవాల్ విసిరారు. ఏ ప్రాంతం అయినా సాగునీరు ఉంటేనే అభివద్ధి చెందుతుందన్నారు. అలాంటి సారునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. వేల క్యూసెక్యుల నీళ్లు సముద్రంలో కలుస్తున్న ప్రాజెక్టులు కట్టాలనే సోయి కాంగ్రెస్ నాయకులకు లేకపోయిందన్నారు. జానారెడ్డి ఒప్పందం లేదని.. ఆ పార్టీ అధ్యక్షుడు ఒప్పందం ఉందని ఆ పార్టీ నాయకుల్లోనే స్పష్టత లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శివకుమార్, మాజీ అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ కోట్లకిషోర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, కష్ణముదిరాజ్, శివన్న తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ శుద్ధజలం
– కష్ణానది నుంచి నీళ్లు పొందే మొదటి హక్కు పాలమూరుకే – నాగం.. చిల్లర మాటలు మానుకోండి – మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి బొంరాస్‌పేట : మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామని మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. శనివారం బొంరాస్‌పేట మండలంలో పర్యటించిన ఆయన చెట్టుపల్లితండాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కష్ణానది నుంచి నీళ్లు పొందే మొదటి హక్కు పాలమూరుకే ఉందన్నారు. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టులతోపాటు 45–50 చెరువులను నింపి సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టిలో ఉందన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి 1.08లక్షల ఎరకాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి శుద్ధమైన (ఫిల్టర్ వాటర్) తాగునీటి నల్లా ఏర్పాటు చేయిస్తామన్నారు. అనంతరం చిల్మల్‌మైలారంలో ఆర్ఓ ప్లాంట్‌ను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు వల్లే అన్ని రోగాలను నివారించవచ్చన్నారు. ‘ఆసరా పథకం కింద పింఛను రూ.వేయి, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలన్నీ వథానా..? అంటూ ఎంపీ జితేందర్రెడ్డిప్రశ్నించారు. అభివద్ధి చేసి చూపే టీఆర్ఎస్ను వేలు ఎత్తిచూపే అర్హత బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌరారం, చెట్టుపల్లితండాలోని కేజీబీవీ, చిల్మల్‌మైలారంలో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితోపాటు సినీ యువ హీరోలు, నటులు రాజా (ఆనందం), నాగశౌర్య (ఒక మనసు), అభిజిత్ (కేటుగాడు), ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి (బందూక్), తేజస్ (ఉలువ చారు ఆవకాయ బిర్యానీ) మొక్కలు నాటారు. నటులతోపాటు స్థానికులు మొక్కలు నాటుతూ సెల్ఫీలు దిగారు. ఇందులో టీఆర్ఎస్ మండల నాయకులు మల్కిరెడ్డి, ముద్దప్ప దేశ్‌ముఖ్, వెంకట్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సీసీ వెంకటయ్యగౌడ్, తహసీల్దార్ వెంకటయ్య, ఎంఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రివర్గంలో చేరం
లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత జితేందర్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం లేదని, ఇదంతా ఊహజనిత ప్రచారమని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలుచేయడంలో పూర్తిస్థాయి దృష్టి సారించిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభానికి సిద్ధమవుతున్నా.. కొన్ని దుష్టశక్తులు ఆ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు, పేదవర్గాలకు అనుకూలంగా ఉందని, భవిష్యత్‌లో వారి సంక్షేమానికి మరింతగా నిధులొచ్చే అవకాశముందన్నారు. వచ్చే నెల 27వ తేదీన ఖమ్మంలో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీని అత్యంత ఘనంగా పార్టీ కార్యకర్తల, ఉద్యమకారుల మనోభావాలకు అద్దం పట్టేలా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. -
వలసలు నివారించడమే లక్ష్యం
70టీఎంసీల నీటిని నిల్వచేసుకుందాం పరిశ్రమలు స్థాపించే వారిని అడ్డుకోవద్దు ఎంపీ ఏపీ.జితేందర్‌రెడ్డి అడ్డాకుల : కరువు జిల్లాగా పేరొందిన పాలమూరు నుంచి కూలీల వలసలను నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భా గంగా జిల్లాలో 70టీఎంసీల నీటిని నిల్వచేసుకుని జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మండలంలోని అడ్డాకుల, కాటవరం, గాజులపేట గ్రా మాల్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. జిల్లాకు పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారిని అధికారులు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై సీఎం కేసీఆర్ నిపుణులతో చర్చిస్తున్నారని త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. ఒక్కపైసా అవినీతి జరగకుండా కేసీఆర్ పరిపాలిస్తున్నందున అందరూ అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని ఎంపీ జితేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు నీళ్లందిస్తామన్నారు. కార్యక్రమాల్లో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటయ్యగౌడ్, స్నేహాఫామ్స్ అధినేత రాంరెడ్డి, ఎంపీపీలు బగ్గి కమలమ్మ, ఈవీ గోపాల్, జెడ్పీటీసీ సభ్యుడు రామన్‌గౌడ్, కోఆప్షన్ సభ్యుడు మైమూద్, పార్టీ మండల అధ్యక్షుడు నాగార్జున్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సర్పంచులు కె.రఘు, వడ్డే నర్సమ్మ, సరస్వతమ్మ, నాగిరెడ్డి, ఇంద్రయ్యసాగర్, భాస్కర్‌గౌడ్, వైస్ ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యులు విజయలక్ష్మి, శ్రీనివాసులు, శెట్టిశేఖర్, హేమ్లీ, స్నేహాఫామ్స్ నిర్వాహకులు రామేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దులో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాకు ఎగువనుంచి వచ్చే నీటిని అడ్డుకునే విధంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో గిరిజాపూర్ వద్ద నిర్మిస్తున్న అక్రమబ్యారేజీని మంగళవారం పరిశీలించేందుకు వెళ్లిన జిల్లా ప్రజాప్రతినిధులకు అడుగడుగునా అడ్డగింతపర్వం ఎదురైంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డిని కర్ణాటకలో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేకవాహనాల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు కర్ణాటకలోని గిరిజాపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. కర్ణాటక ప్రాంతానికి వెళ్లే బ్రిడ్జి వద్ద కర్ణాటక పోలీసులు మంత్రి జూపల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. గిరిజాపూర్‌లో నిర్మిస్తున్న బ్యారేజీని పరిశీలించేందుకు వచ్చామని, ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చామని అక్కడి పోలీసులకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో మంత్రి కర్ణాటక పోలీస్ అధికారులతో ఫోన్లో చర్చలు జరిపారు. రాయిచూర్ జిల్లాలోని గిరిజాపూర్, శక్తినగర్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని అనుమతించడం కుదరదని పోలీసులు స్పష్టం చేసి ఇక్కడినుంచి వెళ్లిపోవాలని గట్టిగానే హెచ్చరించారు. అరగంట పాటు తర్జనభర్జనపడిన కర్ణాటక పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించి బ్రిడ్జి మీద నిరీక్షిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని గిరిజాపూర్ బ్యారేజీ నిర్మాణస్థలిని పరిశీలించేందుకు అనుమతించారు. రాయిచూర్ ఎంపీ, ఎమ్మెల్యే చర్చలు ఈ సమయంలో రాయిచూర్ ఎమ్మెల్యే శివరాాజ్పాటిల్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి వద్దకు వచ్చి చర్చలు జరిపారు. బ్యారేజీ నిర్మాణంపై అనేక అపోహలు లేవనెత్తుతున్నారని, వాస్తవంగా ఆ పరిస్థితి లేదని కేవలం రాయిచూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు అవసరమైన నీటిని వినియోగించుకునేందుకు చట్టానికి లోబడే రోడ్డుకం బ్యారేజీని నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. అదే సమయంలో రాయిచూర్ ఎంపీ నాయక్ సైతం అక్కడకు చేరుకుని వారితోచర్చించారు. ఈ సమయంలో పోలీసులు కల్పిస్తున్న ఆటంకాలపై ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి జూపల్లి వారికి వివరించి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రాయిచూర్ జిల్లా అధికారులతో అక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడి టీఆర్ఎస్ నేతలు గిరిజాపూర్‌కు చేరుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. మీడియాను మాత్రం అనుమతించలేదు. తప్పని నిరీక్షణ గంటపాటు నిరీక్షణ అనంతరం గిరిజాపూర్ బ్యారేజీ నిర్మాణానికి బయలుదేరిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి బ్యారేజీ నిర్మాణం ప్రాంతంలో దాదాపు గంటసేపు గడిపారు. అక్కడ ఎంత నీటినిల్వ సామర్థ్యం ఉన్న బ్యారేజీని పరిశీలిస్తున్నారు.. అనుమతులు ఏమిటన్న అంశంపై అక్కడి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. బ్యారేజీ నిర్మాణానికి తమకు కృష్ణ రివర్‌బోర్డు అనుమతి ఉందని అక్కడి అధికారులు చెప్పగా వాటికి సం బంధించిన ఆధారాలు, వివరాలు కావాలని కోరారు. గిరిజాపూర్ వద్ద నిర్మించే బ్యారేజీ ద్వారా నిల్వ చేసే 0.4 టీఎంసీ నీటిని రాయిచూర్ థర్మల్ పవర్‌స్టేషన్‌లో విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నామని, ఈ విద్యుత్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలోని సగం ప్రాంతానికి పంపిణీ చేస్తున్నామని వివరించారు. అనుమతుల్లేకుండా బ్యారేజీ నిర్మాణం కొనసాగుతోందని, దీనిపై కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. పదేపదే జలదోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక ప్రభుత్వం తీరుపై న్యాయపోరాటం చేస్తామని, దీనిపై పార్లమెంట్లో నిలదీస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శివకుమార్, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'పీఎంను కలిసినా పట్టించుకోవడం లేదు'
న్యూఢిల్లీ: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ జితేంతర్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్ సభలో మంగళవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. కోర్టును విభజించాలని తమ ముఖ్యమంత్రి పలుమార్లు ప్రధానమంత్రిని కలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏపీ హైకోర్టుకు ప్రత్యేక బిల్డింగ్ కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా విభజనకు కేంద్రం ముందుకు రావడం లేదని వాపోయారు. హైకోర్టు విభజన ఆలస్యమవుతుండడంతో తెలంగాణ న్యాయవాదులు నష్టపోతున్నారని పార్లమెంట్ దృష్టికి తెచ్చారు. -
ఢిల్లీలోనూ అవతరణోత్సవాలు: జితేందర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోనూ తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహించనున్నట్టు టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించి ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో జితేందర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను చాటేలా మొత్తం 6 రోజులపాటు ఈ వేడుకలు ఉంటాయని, ఢిల్లీ వాసులకు సైతం తెలంగాణ వంటకాలు రుచి చూపిస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం సీఎం 18 నుంచి 20 గంటలు కష్టపడుతున్నారని కొనియాడారు. -
మండలానికో స్టేడియం నిర్మించాలి: జితేందర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మండలానికొక ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలను నిర్మించాలని ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్ర క్రీడల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో మంగళవారం క్రీడలకు ప్రోత్సాహం అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడాకారిణులు క్రీడల్లో ముఖ్యభూమిక నిర్వహిస్తున్నారని టాప్ ర్యాంకర్లుగా ఉన్న సైనా నెహ్వాల్, సానియా మీర్జాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2024 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిచ్చేలా చొరవచూపాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోన్వాల్.. అన్ని రాష్ట్రాల క్రీడా మంత్రులు, జాతీయ క్రీడల సమాఖ్య కార్యవర్గం, ఒలింపిక్ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. -
అన్నదాతను కేంద్రం ఆదుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: అకాల వర్షాలతో తెలంగాణలో పంట నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ పరిస్థితులపై లోక్‌సభలో సోమవారం ఆయన ప్రసంగించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా పలు రకాల పంటలు నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే రాష్ట్రంలో పర్యటించాలని జితేందర్‌రెడ్డి కోరారు. ప్రధానమంత్రి ఇటీవల ప్రకటించిన విధానం ప్రకారం వెంటనే తెలంగాణ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ దూరదృష్టి కారణంగా కేవలం పది నెలల పాలనలోనే విద్యుత్ కోతల నుంచి రైతాంగాన్ని బయటపడేశారని చెప్పారు. -
'హామీల అమలులో రాజీపడేది లేదు'
టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి వెల్లడి ప్రజాస్వామ్యయుతంగా అన్నీ సాధించుకుంటాం కేంద్రంలో చేరుతామనడం ఊహాగానాలేనని వివరణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను సాధించుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణకు కేంద్ర నిధులు తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మూడుసార్లు ప్రధాని మోదీని కలసి రాష్ట్ర అవసరాలను వివరించారని చెప్పారు. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందులో తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి పార్టీ ఎంపీలతో సమీక్షిస్తామన్నారు. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాక సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఢిల్లీలో ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ డిమాండ్లు నెరవేరకపోతే కేంద్రంపై ఒత్తిడి తెస్తారా అని విలేకరుల అడగగా... ప్రజాస్వామ్యబద్ధంగానే సాధించుకునేలా తగిన వ్యూహంతో ముందుకెళతామని సమాధానమిచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామ్యం కానున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ ఊహాజనితాలేనని జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై అసలు ఇప్పటి వరకు చర్చలే జరగలేదని పేర్కొన్నారు. -
మొగిలిపూలు పూయిస్తా..
నారాయణపేట : ‘మొగుల్‌మడ్కను ఎంపీగా దత్తత తీసుకున్నా.. బ్యాంకును ఏర్పాటుచేస్తా.. వైఫై సిస్టం తీసుకొస్తా.. రోడ్లు నిర్మిస్తా.. పాఠశాల భవనాలు కడతాం.. గ్రంథాలయం.. ఆరోగ్యకేంద్రం.. తాగునీటి కుళాయిలు.. పశువుల దవాఖానా.. చెరువును పునరుద్ధరిస్తాం. రైతులకు సాగునీరు అందిస్తాం. నాడు మొగల్‌మడ్క గ్రామచివరలో మొగిలిపూలు పూసేవట.. అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి మొగిలిపూలు పూసేలా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తా..’ అని ఎంపీ జితేందర్‌రెడ్డి భరోసాఇచ్చారు. సంసద్ ఆదర్శగ్రామ యోజన పథకం కింద ఎంపీ దత్తత తీసుకున్న దామరగిద్ద మండలంలోని మొగుల్ మడ్క గ్రామంలో ఆయన శుక్రవారం రాత్రి బసచేసి శనివారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘ఇప్పుడు ఎలక్షన్లు లేవ్.. ఊర్లోకొచ్చాం.. ఈ గ్రామంలో నిద్రపోయాం.. గ్రామంలో తీరిగి సమస్యలు తెలుసుకున్నాం..’అని అన్నారు. గ్రామాన్ని దేశప్రజాప్రతినిధులు వచ్చి చూసి మురిసిపోయి ఆదర్శంగా తీసుకునేలా అభివృద్ధిపరుస్తామన్నారు. గ్రామంలో అధికారులు సర్వే చేపట్టి 866 కుటుంబాలు, 3659 జనాభా ఉన్నట్లు గుర్తించారన్నారు. అందులో 404మందికి ఇళ్లులేని వారికి ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తామన్నారు. చెరువు పునరుద్ధరణకు నిధులు మండలంలోని ఆశన్‌పల్లి, లోకూర్తి, నర్సపూర్, మొగుల్మడ్కరోడ్లకు నిధులు మంజూరుచేయించేందుకు మంత్రి కేటీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఉళ్లో పెద్ద చెరువును పునరుద్ధరించి ఆరొందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా చర్యలు చేపడతామన్నారు. జయమ్మ చెరువు బ్యాక్‌వాటర్ ద్వారా దామరగిద్దలో ఉన్న చెరువుల్లో నీరునింపే విధంగా భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యవంతంగా ఉండేలా గ్రామస్తులే సూపర్వైజర్లుగా వ్యవహరించాలన్నారు. అధికారులు ఎవరైనా అమ్యామ్యాలకు పాల్పడితే సహించేదిలేదన్నారు. కాకతీయ మిషన్ పథకం కింద ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు రూ.1190కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కుంభం శివకుమార్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ, జెడ్పీ కోఆప్షన్‌సభ్యుడు మహ్మద్‌గౌస్, జిల్లా నాయకులు బెక్కం జనార్దన్, మాజీ ఎంపీపీలు వెంకట్‌రెడ్డి, సదాశివారెడ్డి, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చిట్టెం కేశవర్ధన్‌రెడ్డి ఉన్నారు. మంచి ప్రధాని వచ్చారు ‘మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించారు.. ప్రజాభిమానంతో దేశప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ, దేశప్రజల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేయడం హర్షణీయం’ అని టీఆర్ఎస్ పార్లమెంటరీ ప్రతిపక్షనేత, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కితాబునిచ్చారు. యూపీఏ సర్కార్ టాప్ టూ బాటమ్ ప్రణాళికలను తయారుచేయగా మోదీ పాలన దానికి విరుద్ధంగా బాటమ్ టూ టాప్ ప్రణాళికలు తయారుచేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు. ‘టీం ఇండియా’ చైర్మన్‌గా ప్రధాని నరేంద్రమోదీ 29 రాష్ట్రాల్లో పార్టీలకతీతంగా అభివృద్ధి పర్చేందుకు కంకణబద్దులుకావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.