కేంద్ర మంత్రివర్గంలో చేరం | TRS Party leader jithendar reddy comment in loksabha | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రివర్గంలో చేరం

Published Sun, Mar 20 2016 5:48 AM | Last Updated on Thu, Aug 9 2018 8:30 PM

కేంద్ర మంత్రివర్గంలో చేరం - Sakshi

కేంద్ర మంత్రివర్గంలో చేరం

లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత జితేందర్‌రెడ్డి

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: టీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం లేదని, ఇదంతా ఊహజనిత ప్రచారమని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలుచేయడంలో పూర్తిస్థాయి దృష్టి సారించిందన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభానికి సిద్ధమవుతున్నా.. కొన్ని దుష్టశక్తులు ఆ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు, పేదవర్గాలకు అనుకూలంగా ఉందని, భవిష్యత్‌లో వారి సంక్షేమానికి మరింతగా నిధులొచ్చే అవకాశముందన్నారు. వచ్చే నెల 27వ తేదీన ఖమ్మంలో జరగనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీని అత్యంత ఘనంగా పార్టీ కార్యకర్తల, ఉద్యమకారుల మనోభావాలకు అద్దం పట్టేలా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement