TRS Government
-
Etela Rajender: రియల్ ఎస్టేట్ బ్రోకర్ కేసీఆర్.. ఈటల ఫైర్..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నాటి ప్రభుత్వాలు పేదల కు ఉచితంగా భూములను పంచితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ఆయా రైతుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకుంటోంది. ప్రభుత్వ అధినేత సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారారు. బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.ఐదు కోట్లకు పైగా పలుకుతుంటే..ప్రభుత్వం మాత్రం రైతుల సమ్మతి, సంబంధం లేకుండా రూ.10 లక్షలు చెల్లించి, బలవంతంగా భూములను స్వాధీనం చేసుకుంటోంది. ఆయా భూములను ఐటీ సంస్థలకు, బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టి బ్యాక్‌డోర్ నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇలా వచ్చిన డబ్బులనే ఎన్నికల్లో వెదజల్లుతున్నారు’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. శుక్రవారం మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌లో నిర్వహించిన ‘భారతీయ జనతా యువమోర్చా– రంగారెడ్డి జిల్లా’ శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. కంపెనీలకు, ప్రభుత్వానికి, ఫాంహౌస్‌లకు భూములు ఇచ్చిన రైతులు నేడు అదే కంపెనీలు, ఫౌంహౌస్‌ల్లో వాచ్మన్లుగా పని చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ అంశాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుని పని చేయడం ద్వారా ప్రజల మద్దతు పొందొచ్చని సూచించారు. ఇందుకు ప్రతి ఒక్క బీజేవైఎం కార్యకర్త సిద్ధంంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఫార్మాసిటీ పేరుతో అమాయక రైతుల నుంచి 19వేలకుపైగా ఎకరాల భూమి సేకరిస్తోందని, ఈ ఫార్మాకంపెనీల వల్ల ఆయా గ్రామాల రైతులంతా తమ భూమిని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో తీవ్రమైన కాలుష్యం బారి నపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవడబ్బ సొమ్మని పంచుతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలకు, పేదల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ డబ్బును వేల కోట్లున్న రియల్టర్లకు, ఫౌంహౌస్ యజమానులకు, వ్యవసాయేతర భూములకు రైతుబంధు పేరుతో పంచిపెడుతుండటాన్ని ఎలా సమర్థిస్తామని, నెలకు రూ.1.40 లక్షల జీతం పొందే ఉద్యోగులకు దళిత బంధు పేరుతో కార్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. చదవండి: తెలంగాణ ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారు: తరుణ్ చుగ్ -
Rythu Bandhu: 4 లక్షల మందికి రైతుబంధు దూరం!.. కారణాలివే..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యాసంగికి సంబంధించి రైతుబంధు సొమ్మును ప్రభుత్వం బుధవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం మొదలుపెట్టింది. తాజా లెక్కల ప్రకారం.. మొత్తం 70.53 లక్షల మంది పట్టాదారులు ఉన్నట్టు సీసీఎల్ఏ గుర్తించగా.. అందులో నాలుగు లక్షల మంది రైతులు రైతుబంధుకు దూరమయ్యారు. దీనికి చిన్నచిన్న సమస్యలే కారణమని, గుర్తించి సరిచేయకపోవడం వల్ల ఇబ్బంది నెలకొందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తమకు సంబంధించి ఎలాంటి సమస్య లేకపోయినా రైతుబంధు ఆగిందని, తమకు సొమ్ము ఇచ్చి న్యాయం చేయాలని కొందరు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏయే సమస్యలతో.. మొత్తం ఈసారి 4.04 లక్షల మందికి రైతుబంధును నిలిపివేసినట్టు వ్యవసాయశాఖ అంతర్గత నివేదికలో వెల్లడించింది. అందులో 1.78 లక్షల మంది బ్యాంకు వివరాలు లేకపోవడం, 19,494 మందికి బ్యాంకు డీబీటీ వైఫల్యం, 124 మందికి ఐఎఫ్ఎస్సీ కోడ్ సమస్యలు ఉన్నాయని.. ఇక ఇతరత్రా స్టాప్ పేమెంట్ లిస్ట్‌లో ఉన్న 2.07 లక్షల మంది రైతులకు కూడా రైతుబంధును నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ స్టాప్ పేమెంట్ లిస్టులో ధరణి సమస్యలు, కోర్టు కేసులున్న భూములతోపాటు రైతులు చనిపోయిన వారి స్థానంలో వారసులు/ఇతరులు తిరిగి దర ఖాస్తు చేసుకోకపోవడం వంటివి ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనితో నికరంగా 66.49 లక్షల మందికి రైతుబంధు నిధులు జమచేయనున్నారు. గత వానాకాలం సీజన్లో 63.99 లక్షల మందికి రైతుబంధు నిధులు అందాయి. మరోవైపు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు వచ్చిన రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. జనవరి మొదటి వారం వరకు కొత్త దరఖాస్తులను పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా.. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు నిలిచిపోయింది. ఈ జిల్లాలో మొత్తం పట్టాదారులు 3,82,237 మంది ఉండగా, అందులో 61,159 మందికి రైతుబంధు సొమ్ము అందడం లేదు. తర్వాత సంగారెడ్డి జిల్లాలో 3,88,230 మందికిగాను 37,908 మంది రైతుబంధును నిలిపి వేశారు. నల్లగొండ జిల్లాలో 5,18,902 మంది పట్టా దారులు ఉండగా 25,453 మందికి ఆపేశారు. కాగా ఈనెల 20వ తేదీ వరకు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన 2,47,822 రైతులకు యాసంగి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సదరు రైతులు ఏఈవోను కలిసి దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ ప్రతులను అందజేయాలి. ఏఈవోలు ఆ దరఖాస్తులను, బ్యాంకు వివరాలను అప్లోడ్ చేస్తారు. రైతులు దరఖాస్తు చేసిన 24 గంటల్లో ఏఈవోలు నమోదు పూర్తి చేయాలి. ఏఈవో ధ్రువీకరించడంలో ఆలస్యమై, అందుకు సంబంధించి ఫిర్యాదులేమైనా వస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. సమస్యలున్న భూములకు నిలిపేశాం ‘‘రాష్ట్రంలో కొందరికి రైతుబంధు సొమ్ము నిలిపివేసిన మాట వాస్తవమే. కోర్టు కేసులు, వివిధ సంస్థలకు చెందిన భూములు, రైతు బీమా మరణాల కేసులు, ఎన్నారై భూముల కేసులు, గంజాయి సాగు చేస్తున్న భూములకు చెందిన వారికి రైతుబంధు నిలిపివేశాం. – రఘునందన్‌రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
తగ్గేదేలే.. మోదీ టార్గెట్‌గా మరోసారి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మహబూబ్‌నగర్: సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం, అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. కాగా, బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాము. గతంలో పాలమూరులో భయంకరమైన పరిస్థితులు ఉండేవి. సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నో కలలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తెలంగాణ వచ్చాక పాలమూరు వలసలు తగ్గాయి. వలసపోయిన బిడ్డలంతా తిరిగి వస్తున్నారు. పాలమూరు ఇప్పుడు పచ్చిన పంటల జిల్లాగా అయింది. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టాము. సంక్షేమంలో తెలంగాణకు సాటి, పోటీ ఎవరూ లేరు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాము. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించడం లేదు. తెలంగాణలో కలపాలని కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రజలు కోరుతున్నారు. నా తెలంగాణ రైతు కాలర్ ఎగరవేసే స్థాయికి చేరాలి. అసమర్థ కేంద్ర ప్రభుత్వం కారణంగా రూ. 3 లక్షల కోట్లు నష్టపోయాం. కేంద్రం కూడా బాగా పనిచేస్తేనే దేశం బాగుపడుతుంది. మన నీటి వాటా తేల్చడం లేదు. రాష్ట్రానికి వచ్చి మోదీ డంబాచారాలు చెబుతున్నారు. నీటి వాటాలు తేల్చేందుకు 8 ఏళ్లు సరిపోవా?. దేశంలో ఏం జరుగుతుందో మేధావులు, యువకులు ఆలోచించాలి. దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ కోతలు, మంచినీటి సమస్యలు ఉన్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా మంచి నీటి సమస్యలు, కరెంట్ కోతలున్నాయి. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. మేము చేయం.. వాళ్లను చేయనివ్వం అనే విధంగా కేంద్రం తీరు ఉంది. కాళ్లలో కట్టెలు పెడుతా అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయనివ్వరా?. దేశంలో ఏం జరుగుతుందో గ్రామాల్లో చర్చ పెట్టంది. ఢిల్లీలో అసమర్థ ప్రభుత్వం ఉంది. రాష్ట్రం బాగుపడుతుంటే అడ్డుపడతారా?. ప్రశ్నిస్తే మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు. చిల్లరగాళ్ల ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏ కారణంతో ప్రభుత్వాలను కూలగొడతారు. దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా స్వాతంత్ర్యం వచ్చింది. ప్రతిపక్షాలపై కేంద్రం దాడులు చేయడం సరికాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
టీఆర్ఎస్ అంటే.. తాలిబన్ల రాష్ట్ర సమతి: వైఎస్ షర్మిల ఫైర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టీఆర్ఎస్ గుండాలతో ప్రాణహాని ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆదివారం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మహిళ పాదయాత్ర చేస్తే పోలీసు స్టేషన్లో కూర్చోబెడతారా?. ఎమ్మెల్యేల అవినీతిని హైలైట్ చేస్తే జీర్ణించుకోలేక దాడులు చేస్తారా. ప్రజాఫోరం ఏర్పాటు చేసి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. టీఆర్ఎస్ గూండాల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నా బస్సును వాళ్లే తగలబెట్టి నన్ను సారీ చెప్పమంటారా!. మీది తాలిబన్ల భాష, తాలిబన్ల రాష్ట్ర సమితి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, నిర్మల్: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్టేజ్‌కు రాజకీయాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఉన్నారు. ఈ సందర్భంగా కుంటాల మండలం ఓలా గ్రామంలో సంజయ్ మాట్లాడుతూ.. లిక్కర్, డ్రగ్స్, పేకాట దందా చేసేటోళ్ల అంతు చూస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ దందా చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. బెంగళూరు పోలీసులను మేనేజ్ చేసి కేసును మూసివేయించారు. ఆ కేసును మళ్లీ బయటకు తీస్తాం. కేసీఆర్ సహా ఎవరినీ వదిలిపెట్టం. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడాల్సిందే. హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ను ప్రజలు నిలదీయాలి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తున్నదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
ఇంకా ఎన్ని రోజులు.. రాజాసింగ్ కేసులో ప్రభుత్వం తీరుపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్ కేసులో కౌంటర్ దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపడింది. గడువిచ్చినా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇదే చివరి అవకాశమని, వచ్చే విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకుంటే.. తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం తేల్చిచెప్పింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కాగా, సెప్టెంబర్ 25న రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాజాసింగ్ భార్య ఉషాబాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది రామచందర్‌రావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక జీపీ ముజీబ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. దాదాపు 100 కేసుల్లో రాజాసింగ్ నిందితుడిగా ఉన్నారన్నారు. కౌంటర్ అఫిడవిట్ 1650 పేజీలు ఉందని, సంతకం కోసం పంపించామని చెప్పారు. మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 28వ తేదీ వరకు చివరి అవకాశం ఇస్తున్నామని చెబుతూ.. విచారణను వాయిదా వేసింది. -
దసరాకైనా ఉద్యోగుల జీతాలు ఇస్తారో లేదో?
హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా సక్రమంగా జీతం ఇవ్వడం లేదని, దసరాకైనా జీతాలిస్తారో.. లేదో? అని ఆందో ళన చెందుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆమె ధ్వజమెత్తారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్, నస్తిపూర్, దౌల్తాబాద్, కాసాలా దేవులపల్లి, హత్నూర, కొన్యాల వరకు నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ అందించిన ఘనత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సుపరిపాలనను తిరిగి అందించేందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించానని తెలిపారు. వైఎస్సార్ టీపీని ఆదరిస్తే రూ.3,000 పింఛన్, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
సొమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్ఎస్ది
దామరగిద్ద: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇతర సంక్షేమ పథకా లతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని.. రాష్ట్రంలో పరిస్థితి సొమ్ము కేంద్రానిది అయితే.. సోకు టీఆర్ఎస్ది అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ యువమోర్చ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజాగోస– బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన నారాయ ణపేట జిల్లా దామరగిద్దలో బైక్ ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత బియ్యంతో కేంద్ర ప్రభుత్వ దేశంలోని 80 కోట్ల మందికి ఆపన్న హస్తం అందిస్తుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పేర్లు మారుస్తూ తామే అమలు చేస్తున్నట్లు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల, ఫసల్ బీమా యోజన, గ్రామాలకు రహదా రులు, పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు అందిస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తామే చేపడుతున్నామంటూ గొప్పలు చెప్పు కొంటుందని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయ మని డా.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
GHMC సమావేశంలో బీజేపీ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ్టి(మంగళవారం) సమావేశంలో.. బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. సుమారు 43 మంది బీజేపీ కార్పొరేటర్లు నల్లబ్యాడ్జీలతో సమావేశానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను విడుదల చేయాలంటూ.. ప్లకార్డులతో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు వాళ్లంతా. ఇదిలా ఉంటే.. కాంట్రాక్టర్ల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. రూ. 800 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వాళ్లంతా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. పోలీసులకు, కాంట్రాక్టర్లకు మధ్య తీవ్రవాగ్వాదం నెలకొనగా, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు కాంట్రాక్టర్లకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు అంబేడ్కర్‌తో పోలికా? -
గవర్నర్ ఆరోపణలపై స్పందించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజా వ్యాఖ్యలు టీఆర్ఎస్కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తన మూడేళ్ల పాలనపై రాజ్‌భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. గవర్నర్ ఆరోపణలపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో.. గవర్నర్ కార్యాలయం రాజకీయ వేదికగా మారింది. అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌గారి పరువు తీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాలు తెలంగాణ ప్రజలను మోసం చేయలేవని గ్రహించిన తరుణంలోనే.. గౌరవనీయులైన గవర్నర్ ప్రకటనలు వెలువడడం గమనార్హం అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. The office of Governor of Telangana has turned into a political stage that is determined to defame the TRS Govt and CM KCR garu. The statements of Hon’ble Governor come at a time when they realised that the BJP driven smear campaigns can’t con the people of Telangana. — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 8, 2022 ఇదీ చదవండి: రాజ్‌భవన్‌పై వివక్ష చూపుతున్నారు.. గవర్నర్ తమిళిసై -
ఇంకా గృహ నిర్బంధంలోనే బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడికి నిరసనగా జనగామ స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని పాంనూరులో ఆయన చేపట్టిన ధర్మధీక్షను భగ్నం చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించి గృహ నిర్భంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. టీఆర్ఎస్ ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ.. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలకు పిలుపు ఇచ్చింది. దీక్షలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా తన నివాసంలోనే నిరసన దీక్ష చేపట్టనున్నారు బండి సంజయ్. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. హైకోర్టుకు బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వీటితో పాటు ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బీజేపీ నేతలు నేడు హైకోర్టుకు వెళ్తున్నారు. ఈ మేరకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తద్వారా యాత్ర కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా హీటెక్కిన తెలంగాణ! -
ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లి.. మద్యం పాలసీపై నిర్ణయాలా?: భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మద్యం పాలసీపై ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ‘మద్యాన్ని విచ్చలవిడిగా, అవినీతిపరులతో విక్రయాలు జరుపుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు మద్యం పాలసీని రూపొందించటం విచిత్రం. ప్రభుత్వ పాలసీలపై సచివాలయంలో లేదా కేబినెట్లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వ పాలసీలపై హోటల్లో నిర్ణయాలేంటి? ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వచ్చి.. మద్యం పాలసీలపై నిర్ణయాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఇదీ చదవండి: లిక్కర్ స్కాం కేసు: బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత -
కేసీఆర్‌కు ఈటల కౌంటర్.. ఆస్తులు అమ్మకుండా జీతాలు ఇవ్వగలరా?
సాక్షి, మునుగోడు: టీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా దీవెన సభలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సభ వేదిక నుంచి కేసీఆర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పే చిల్లర మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.. ప్రజలను మెప్పించే శక్తిని కేసీఆర్ కోల్పోయారు. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వం. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ మాటలకు రేపటి సభలో తప్పకుండా సమాధానం చెబుతాము. మీటర్లు పెట్టాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. బీజేపీకి ఓటెస్తే మీటర్లు వస్తాయన్నది అబద్ధం. రైతులను ఒక దోషిగా బజారులో నిలిబెట్టింది కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వపరమైన ఆస్తులు అమ్మకుండా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సీపీఐ పార్టీని నేరుగా ప్రశ్నిస్తున్నాను. ప్రజల పక్షం అని చెప్పుకునే సీపీఐ నేతలు మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సమస్యలు చెప్పారా?. కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఇతర సమస్యలపై సీఎం కేసీఆర్‌కు కలిశారా?. ప్రగతి భవన్‌కు మీరు వెళ్లారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది కూడా చదవండి: మల్లారెడ్డా మజాకా మామూలుగా ఉండదు.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు.. -
కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్లే ఇదంతా: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షం బలంగా లేదని.. అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ సరిగా పోరాటం చేయడం లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల కాంగ్రెస్‌లో ఉండి ఏమీ చేయలేకపోయానని, కాంగ్రెస్‌ను బాధతోనే వీడుతున్నట్లు ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు. మంగళవారం సాయంత్రం మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని సైతం వీడుతున్నట్లు స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై కాంగ్రెస్ సరిగా పోరాటం చేయడం లేదు కాబట్టే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘‘నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోంది. అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ బలహీనపడింది. నా రాజీనామా ద్వారా ప్రజలకు కొంత మేలు జరుగుతుంది అని అనుకుంటున్నా. నా పోరాటం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ భవిష్యత్ కోసమే. మునుగోడులో ఎవరు గెలుస్తారనేది ప్రజలే నిర్ణయిస్తార’’ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉద్ఘాటించారు. అసలు కాంగ్రెస్ నా మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది? నేను ఏ తప్పు చేశా?. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల కింద 20 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న మేం పని చేయాలా?. నా జిల్లాలోనే అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్లు ఉన్నారు. 20 ఏళ్లపాటు సోనియాను తిట్టిన ఓ వ్యక్తిని పీసీసీ చేశారు. ఆయన కింద మమ్మల్ని పని చేయమంటున్నారు. కమిటీలు వేసేటప్పుడు కూడా కనీసం మాట్లాడలేదు. ఇంతకన్నా అవమానం ఉందా?. సోనియా మీద ఉన్న గౌరవంతో తాను ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించదల్చుకోలేదని చెప్పారాయన. కాంట్రాక్టుల కోసం నేను రాజీనామా చేస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నేతగా నా పలుకుబడిని ఏనాడూ వ్యాపారానికి ఉపయోగించుకోలేదు. నా వ్యాపారానికి, రాజకీయ జీవితానికి సంబంధం లేదు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఈ పదవీ త్యాగంతో ముఖ్యమంత్రి కళ్లు తెరవాలని పేర్కొన్నారు. బీజేపీలో చేరతారా? అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడే పార్టీతో ఉంటానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై తన కార్యకర్తలు, అనుచరులతో చర్చిస్తానని చెప్పారు. ఆ తర్వాతే ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని చెప్తానని ఆయన స్పష్టత ఇచ్చారు. తన ఆవేదనను మునుగోడు ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. -
కేసీఆర్ గుప్పిట్లో గుట్టు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత నడవడిక, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు తదితర అంశాలతో కూడిన సమగ్ర సర్వే నివేదికలు పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు అందాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్కు అత్యంత కీలకమని భావిస్తున్న కేసీఆర్ తనకు అందిన నివేదికలను పోస్ట్‌మార్టం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ్యులతో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి ఆర్థిక స్థితిగతులు, వారి రాజకీయ నేపథ్యం తదితర అంశాలను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఐ ప్యాక్’బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదికలను ముఖ్యమంత్రికి సమర్పించింది. ఓ వైపు ఎమ్మెల్యేల పనితీరును సానుకూల కోణంలో విశ్లేషిస్తూనే, మరోవైపు వారిలో ఉన్న లోపాలను ఈ నివేదికలు ఎత్తి చూపినట్లు సమాచారం. వీటితో పాటు వివిధ సర్వే సంస్థల నుంచి అందిన నివేదికల్లోని అంశాలను క్రోడీకరించి తుది నివేదికలు రూపొందించినట్లు తెలిసింది. వెలుగులోకి విస్తుగొలిపే అంశాలు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఈ నివేదికల్లో విస్తు గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల దందాలు, అవినీతి, బంధు ప్రీతి, వారు నెరపుతున్న ఇతర సంబంధాలు తదితరాలను ఈ నివేదికలు కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించాయి. ఎమ్మెల్యేలు పార్టీ కేడర్‌కు అందుబాటులో లేకపోవడం, కొందరినే దగ్గరకు తీయడం, అభివృద్ధి పనుల్లో వాటాల వసూలు, భూ సెటిల్మెంట్లు, ఇసుక దందాలు, కుటుంబసభ్యుల ద్వారా బెదిరింపులు, వసూళ్లు వంటి అనేక అంశాలను ఎత్తి చూపాయి. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేల విజయావకాశాలు ‘ఓ మోస్తరు’గా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేయగా, కొద్ది మందికి మాత్రమే గెలుపు ‘సుస్పష్టం’అని వెల్లడించాయి. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని సిఫారసు చేయకున్నా పార్టీలోనే మరో అభ్యర్థికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నట్లు నివేదికలు సూచించినట్లు సమాచారం. ఇక ఒకరిద్దరు మినహా మిగతా అందరు మంత్రుల పనితీరు మెరుగ్గానే ఉన్నట్లు నివేదికల్లో వెల్లడైనట్లు సమాచారం. తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు పార్టీలో ఉన్న గ్రూపులు, ఆ గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న వారు, అంతర్గత విభేదాలతో జరిగే నష్టం వంటి వివరాలతో పాటు వాటి నివారణకు పార్టీ అధిష్టానం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు కూడా పొందుపరిచినట్లు సమాచారం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరఫున టికెట్ ఆశిస్తున్న ప్రధాన అభ్యర్థులు, టీఆర్ఎస్ అభ్యర్థి నడవడిక సరిగా లేని పక్షంలో ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అనే అంశాలతో పాటు వారి బలబలాలను నివేదికలు క్షుణ్ణంగా విశ్లేషించాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఐదుగురు బలమైన నేతలు, వారు ఎన్ని వేల ఓట్లను ప్రభావితం చేయగలరు వంటి అంశాలను కూడా స్థూలంగా నివేదికల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. గుర్తింపు దక్కని పక్షంలో పార్టీని వీడే యోచనలో ఉన్న నేతలు, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చే అవకాశమున్న నాయకుల జాబితాలను పొందుపరిచినట్లు సమాచారం. హెచ్చరికలు.. దిద్దుబాట్లు తనకు అందిన నివేదికల ఆధారంగా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు పనితీరును మార్చుకోవాలంటూ ఇప్పటికే అంతర్గతంగా సంకేతాలు ఇవ్వడంతో పాటు దిద్దుబాటు చర్యలకు కూడా పూనుకున్నట్లు తెలిసింది. అంతర్గత విభేదాల పరిష్కారం, కొద్దిగా తీరు మార్చుకుంటే విజయావకాశాలు మెరుగయ్యే పరిస్థితులు ఉన్న చోట దిద్దుబాటు బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతో పాటు కొందరు జిల్లా మంత్రులకు అప్పగించినట్లు తెలిసింది. వ్యక్తిగత, ఆస్తిపాస్తుల వివరాలూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్, బీజేపీ తరఫున టికెట్ ఆశించే నేతల వ్యక్తిగత వివరాలు, వారి కుటుంబసభ్యులు ఎవరైనా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారా అనే కోణంలో కూడా నివేదికలు తయారైనట్లు తెలిసింది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌తో పాటు ఇతర కొన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ ఎంత మేర ప్రభావం చూపుతుందనే కోణంలోనూ అధ్యయన బృందాలు అంచనా వేశాయి. నేతలు ఎంతమేర ఆర్థికస్తోమత కలిగి ఉన్నారు? వారి ఆదాయ మార్గాలేంటి? ఏ తరహా వ్యాపార, వాణిజ్య సంస్థలు నిర్వహిస్తున్నారు? వారికి అనుకూలంగా, ప్రతికూలంగా పనిచేసే అంశాలు, గెలుపు అవకాశాలు తదితరాలపై సర్వే సంస్థలు లోతుగా అధ్యయనం చేశాయి. -
టీఆర్ఎస్ ‘తెలంగాణ రేప్ సపోర్ట్ పార్టీ'గా మారింది..
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ రేప్’కేసులో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రులు ఎందుకు స్పందించలేదని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, ఒక్క తెలంగాణలోనే రోజుకు ఆరు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు నిరసనగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గాం«దీభవన్‌లో చేపట్టిన మౌనదీక్షలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖలు కూడా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డిసౌజా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేప్ సపోర్ట్ పారీ్టగా మారిపోయిందని, ఈ రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మైనర్ బాలిక రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోంమంత్రి మనవడి ప్రమేయం చూస్తే తెలంగాణలో పాలిటిక్స్ గూండాగిరీ నడుస్తోందని, మద్యం, డ్రగ్స్ పెరిగాయని ధ్వజమెత్తారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, ఆమెకు న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని డిసౌజా చెప్పారు. దీక్షలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నీలం పద్మలతో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డీజీపీకి వినతిపత్రం: అంతకుముందు మహిళా కాంగ్రెస్ నేతలు డిసౌజా, కొండా సురేఖ, సునీతారావు తదితరులు డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైంది
తల్లాడ: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైం దని.. హైదరాబాద్‌లో బాలి కపై అత్యాచారం ఘటనే ఇం దుకు ఉదాహరణ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. ఆమె చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివా రం ఖమ్మం జిల్లా తల్లాడ, ఏన్కూరు మండలాల్లో కొన సాగింది. తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆమె పాదయాత్ర 1,100 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన రైతు గోస దీక్షలో మాట్లాడారు. బాలికపై అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారని తెలియడంతోనే వివరాలు బయటకు రాకుండా చూశారని ఆరోపించారు. ఘటన జరిగాక కొద్ది రోజులకు కేటీఆర్.. దోషులను శిక్షించాలని ట్వీట్ చేయడంతో ప్రభుత్వ పెద్దలకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో పోలీసు యంత్రాంగం ఉందా?: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు యంత్రాంగం ఉందా? బాలికపై అఘాయిత్యం జరిగితే హోంమంత్రి స్పందించరా? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పబ్ కల్చర్ బాగా పెరిగిపోయిందన్నారు. బాలిక అత్యాచారం కేసు సీబీఐకి అప్పగించాలని భట్టి డిమాండ్ చేశారు. చదవండి: అమ్నీషియా పబ్ కేసు: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ! సీబీఐకి అప్పగించాలి.. శ్రీధర్ బాబు ఇక్కడి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదని.. బాలిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కానీ దోషులను పట్టుకోవడంలేదు.. వారు బయట దర్జాగా తిరుగుతున్నారని శ్రీధర్‌బాబు దుయ్యబట్టారు. -
రాష్ట్రానికి సేవలు చేస్తూ.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నా..!
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఈ రాష్ట్రానికి సేవలు చేస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. కానీ బాధపడడం లేదు. నా సేవలను తెలంగాణ ప్రజలకు అందిస్తూనే ఉంటాను’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘నేను ఎవరు ఆపినా... ఆగను కలుస్తాను.. కలుస్తూనే ఉంటాను’అని స్పష్టం చేశారు. గురువారం రాజ్‌భవన్ దర్బార్ హాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గవర్నర్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో వేడుకలకు వచి్చన ప్రముఖులు, రాజ్‌భవన్ అధికారులు రెండు వేడుకలను ఒకే వేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు కళాకారులను గవర్నర్ సన్మానించారు. అనంతరం ఆమె పూర్తిగా తెలుగులో మాట్లాడారు. ‘అందరికీ నమస్కారం.. ఈ రాష్ట్రం నాది. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదు. ఈ రాష్ట్రానికి సహోదరిని’అని ప్రసంగం ప్రారంభించారు. ‘రాష్ట్రపతి, ప్రధాని నాకు ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. నేను కూడా ఆ అవకాశాన్ని చక్కగా సది్వనియోగం చేస్తున్నాను. రాజ్‌భవన్ తరపున చాలా కార్యక్రమాలు చేపట్టాము. రాజ్‌భవన్ స్కూల్లో భోజన కార్యక్రమం చేపట్టి, కరోనా కాలంలో నిరి్వరామంగా పర్యవేక్షించాం. భద్రాచలం, ఆదిలాబాద్‌లలో ఆదివాసీ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశాం. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాం’అని చెప్పారు. ఎందరో త్యాగశీలుల ఫలితమే నేటి స్వేచ్ఛ తెలంగాణ అని, తెలగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. అంతకుముందు వేడుకలను పురస్కరించుకొని గవర్నర్ కేక్ కట్ చేశారు. -
Telangana Formation Day: ఆవిర్భావం నాడూ అటు-ఇటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా సాగుతున్నాయి. రాజధాని సహా ప్రతీ జిల్లాలోనూ పార్టీలన్నీ సంబురాలను నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు జెండావిష్కరణ వేడుకల్లో పాల్గొంటున్నాయి. అయితే ఆవిర్భావ వేడుకల సాక్షిగా తెలంగాణ గవర్నర్, ప్రభుత్వం మధ్య గ్యాప్ మరోసారి బయటపడింది. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కొద్దిపాటి అధికార గణం.. కళాకారుల సమక్షంలో వేడుకలను నిర్వహించింది రాజ్‌భవన్. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు.. ఒక సహోదరిని కూడా. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా. నా సేవ తెలంగాణ ప్రజలకి అందిస్తూనే ఉంటా. ఎంతో మంది త్యాగ శీలుల ఫలితం తెలంగాణా రాష్ట్రం అని పేర్కొన్నారు ఆమె. అలాగే ఇదే వేదికగా గవర్నర్ తమిళిసై పుట్టిన రోజు వేడుకలు కూడా జరిగాయి. కేక్ కట్ చేసిన సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆపై కళాకారులను సత్కరించారామె. ఆమె ప్రసంగంలో ఎక్కడా ప్రభుత్వ ప్రస్తావన లేకపోవడం విశేషం. మరోవైపు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఉదయం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి.. ఆపై పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వనరులను అభివృద్ధి చేసుకున్నామని, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలే తమ ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శమన్నారు. తలసరి ఆదాయంలో రికార్డు సాధించామని, మౌలిక వసతుల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ‘‘ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాం. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను అధిగమించాం. ఇతర రాష్ట్రాలకు మిషన్ భగీరథ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతుల సంక్షేమ కోసం అనేక సంస్కరణలు, పథకాలు అమలు చేశాం అని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం. రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేస్తున్నాం. రైతు బంధు అందిస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. ఇతర రాష్ట్రాల మన పథకాలను ఆదర్భంగా తీసుకుంటున్నాయారు. 50 వేల కోట్లను రైతులకు పెట్టుబడులుగా అందజేసినట్లు తెలిపారు సీఎం కేసీఆర్. -
చైనా మిలటరీ పాలన కోరుకుంటున్నారా..?
సాక్షి, హైదరాబాద్: చైనాలో అమలవుతోన్న మిలటరీ తరహా పాలనను రాష్ట్రంలో అమలు చేయాలని టీఆర్ఎస్ కోరుకుంటోందా అని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘు నందన్‌రావు ప్రశ్నించారు. కొందరు మంత్రులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, చైనాలో ఉన్నది మిలటరీ పాలన అని ఐటీ మంత్రి కేటీఆర్ తెలుసుకోవాలని ఎం.రఘునందన్ రావు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రధాని గురించి ఇక్కడ మాట్లాడినట్లు అక్కడ మాట్లాడితే చైనాలో ఊరుకోరని హితవు పలికారు. ఇక్కడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కేటీఆర్ అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రాన్ని విమర్శించడానికే అసెంబ్లీ సమావేశాలను టీఆర్ఎస్ సర్కారు నిర్వహిస్తోందని ఆరోపించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు, ఇతర నిధులు విడుదల చేసిన విషయాన్ని మంత్రి హరీశ్‌రావు తెలుసుకోవాలన్నారు. రెండున్నర లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి రూ.5 వేల కోట్లు రాకపోతే ఏమైందని ప్రశ్నించారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయని తెలిపారు. -
కుటుంబ పాలనలో తెలంగాణ బందీ: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని, యువతతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ సాధిస్తున్న వరుస విజయాలు, సాగిస్తున్న పోరాటాలు చూస్తుంటే.. తెలంగాణలో పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందని, బీజేపీని తప్పక గెలిపించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. దశాబ్దాల తరబడి సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది అమరులయ్యారని, కానీ అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదని విమర్శించారు. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని, నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదని ధ్వజమెత్తారు. కేవలం ఒక కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పాటు జరగలేదని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల పాలనను ఊడబెరికి, ఈ పాలనకు అంతం పలికే పోరాటాన్ని తెలంగాణ సోదర, సోదరీమణులు, ప్రజలు ముందుకు తీసుకెళతారని భావిస్తున్నానన్నారు. గురువారం ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ.. బేగంపేట విమానాశ్రయం వద్ద రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు ఎత్తకుండానే కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు అంటూ పదేపదే వ్యాఖ్యానించారు. పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కుటుంబ పాలకులే దేశద్రోహులు.. కుటుంబ పాలన చేసేవారే దేశ ద్రోహులు. ఇలాంటి పాలన దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. దేశంలో కుటుంబ పాలన ముగిసిన రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ మాత్రం ఒక కుటుంబం చేతుల్లో దోపిడీకి గురవుతోంది. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతి మయం. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి. 2023లో విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుంది. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తాం. ఇక్కడ సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి తెలంగాణను తమ చెప్పు చేతల్లో ఉంచుకునే కుట్రకు కుటుంబ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏమి చేసినా ప్రజల హృదయాల నుంచి మాపై ప్రేమాభిమానాలను, మా పేరును మీరు తుడిచి వేయలేరు. రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనను సంకల్పంగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలి. తెలంగాణలో సంతుష్టీకరణ రాజకీయాలు సాగుతున్నాయి. దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. తెలంగాణను పురోభివృద్ధి విషయంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. దేశ ప్రజల కలలు సాకారం అవుతున్నాయ్ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోంది. ఎనిమిదేళ్లలో వేల స్టార్టప్‌లను ప్రోత్సహించాం. ప్రపంచంలోనే మూడో స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా భారత్ ఉద్భవించింది. వంద యూనికార్న్ కంపెనీలు ఏర్పడ్డాయి. ఈ పురోగతిలో టెక్నాలజీ పాత్ర ముఖ్యమైనది. ఇందులో తెలంగాణ యువత, సాంకేతిక నిపుణుల నైపుణ్యం మరువలేనిది. కేంద్ర పథకాలతో దేశంలో కోట్లాది మంది ప్రజల కలలు సాకారం అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు తగ్గేవాళ్లు కాదు..నెగ్గేవాళ్లు నేను శాస్త్ర, సాంకేతికతలను నమ్ముతాను, అంధ విశ్వాసాలను నమ్మను. 21వ శతాబ్దంలోనూ తెలంగాణలో అంధవిశ్వాసాలున్న వారున్నారు. వారితో తెలంగాణకు ప్రయోజనం కలగదు. వీరు తెలంగాణకు న్యాయం చేయలేరు. గుజరాత్ సీఎంగా ఉన్నపుడు కొన్ని ప్రాంతాలకు వెళితే పదవి పోతుందన్నారు. నేను ఢంకా భజాయించి మరీ పదేపదే ఆ ప్రదేశాలకు వెళ్లివచ్చాను. మేం పారిపోయే వాళ్లం కాదు.. పోరాడే వాళ్లం. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లు. తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి ప్రధాని మొదట తెలుగులో మాట్లాడుతూ.. ‘పట్టుదలకు, ధృఢ సంకల్పానికి, పౌరుషానికి మారు పేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారాలు..’ అంటూ సభికులకు అభివాదం చేశారు. ‘నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చినా అపూర్వ స్వాగతం పలికారు. ఇప్పుడు కూడా ఇంత పెద్దెత్తున అపూర్వమైన రీతిలో స్వాగతించారు. ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలకు, స్నేహానికి కృతజ్ఞతలు. 2013లో నేను ప్రధానిని కాదు. అయినా అప్పుడు హైదరాబాద్‌లో నా సభ జరిగితే దానికి టికెట్టు కొనుగోలు చేసి మరీ నా ప్రసంగం వినడానికి వచ్చారు. ఇదొక అద్భుతం. ఇది యావత్ దేశంలో పరివర్తనకు కారణమైంది. నా జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్. దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. ఈ విధంగా తెలంగాణకు, హైదరాబాద్‌కు తనదైన చరిత్ర ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జెండా నాటాలి. గవర్నర్, తలసాని స్వాగతం విమానాశ్రయంలో మోదీకి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ అధ్య క్షుడు, ఎంపీ బండి సంజయ్, సీఎస్ సోమేశ్కు మార్, డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. సంజయ్ ఇంకా పోరాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పలుకరించిన మోదీ.. ‘పాదయాత్ర ఎలా సాగుతోంది? ఆరోగ్యం ఎలా ఉంది ?’ అంటూ ప్రశ్నిం చారు. ‘ఇంకా పోరాడు..’ అని అన్నారు. సభా వేదికపై మూడువరసల్లో బీజేపీ ముఖ్య నేతలంతా ఆసీనులయ్యారు. స్వాగత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి తలసాని వీడ్కోలు సందర్భంగా కనబడలేదు. -
‘దరఖాస్తుల తీసుకోవడమే తప్పా పరిష్కరించింది లేదు’
హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై మరొకసారి ప్రశ్నలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇస్తున్న 200 రూపాయల పింఛన్‌ను 1000 రూపాయలకు పెంచుతామమని కేసీఆర్ ప్రకటించారని, ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆసరా పింఛన్ 65 ఏళ్లు పూర్తయిన వాళ్లు మాత్రమే అర్హులుగా ప్రకటించారని మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. అంతేకాకుండా భార్యభర్తల్లో ఒకరికి మాత్రమే ఆసరా పింఛన్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఆదివారం ప్రెస్‌నోట్‌ను విడుదల చేసిన మధు యాష్కీ గౌడ్.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో 65 సంవత్సరాలు అర్హతను 57కు తగ్గిస్తామని ప్రకటించాడు. ‘ఎన్నికలు పూర్తయి మళ్లీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సారాలు అవుతున్నా ఇప్పటివరకు ఆసరా పెంక్షనర్ల వయసు తగ్గింపుపై కల్వకుంట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పింఛన్‌దారుల అర్హత వయసు తగ్గింపుపై ఇప్పటివరకూ కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 57 సంవత్సారాలు నిండిన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని మాత్రమే.. అది కూడా పత్రికా ముఖంగా ప్రకటించారు.. అంతకుమించి మరేమీ చేయలేదు.రాష్ట్రంలో కొత్త పెంక్షన్ల కోసం దాదాపు 11 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆసరా పించన్లకోసం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్దులు దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వడం ఆపేసింది. కేవలం హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో మాత్రమే కొత్తగా పింఛన్లు ఇచ్చారు. మిగిలిన రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలేదు. ప్రస్తుత రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది.. ఆసరా పింఛన్లు వస్తున్న వాళ్లకు కూడా నెలాఖరుకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి.2021 - 2022 కు పెట్టిన భారీ అంకెల బడ్జెట్ చివరకు లోటు బడ్జెట్ గా మిగిలింది.. మొత్తంగా 10 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఏర్పడింది. ప్రతిపాదిత పథకాలకు కూడా డబ్బులు లేవు. కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అన్ని పథకాలకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప వాటిని పరిష్కరించింది లేదు. ఇప్పటివరకు ఆసరా పింఛన్ కోసం 13.07 లక్షల దరఖాస్తులు, ధరణి సవరణలకోసం 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్సిడీ లోన్ల కోసం 8.20 లక్షలు, రేషన్ కార్డుల కోసం 3.90 లక్షలు, పోడు పట్టాల కోసం 2.50 లక్షలు, గొర్రెల పంపిణీ కోసం 3.63 లక్షల దరఖాస్తులను ప్రభుత్వ తీసుకుంది. వీటిలో వేటికి ప్రభుత్వం పరిష్కారం చూపలేదు’ అని మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. -
ఆ బొగ్గుబ్లాక్‌ను రాష్ట్రమే ప్రైవేటుకు అప్పగించింది: కిషన్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి: సింగరేణిలోని తాడిచెర్ల బొగ్గుబ్లాక్‌ను రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్‌కు అప్పగించిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించా రు. మరో 4 బొగ్గుబ్లాక్‌లను ప్రైవేట్‌కు అప్పగించవద్దని రాష్ట్రం దరఖాస్తు చేసుకుంటే వాటిని సింగరేణికి అప్పగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిని, కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణివ్యాప్తంగా చేపడుతున్న కార్మిక చైతన్య యాత్రను సోమవారం భూపాలపల్లి ఏరియాలో నిర్వహించారు. మధ్యాహ్నం ఏరియాలోని కేటీకే ఐదో గనిలో జరిగిన యాత్రలో కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గని ఆవరణలో కార్మికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.23వేల కోట్లు చెల్లించడంలో రాప్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ పరిధిలోని కోల్ఇండియా సంస్థలకు కల్పిస్తున్న హక్కులు, సౌకర్యాలను రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికుల ఆదాయపన్ను చెల్లిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, కిషన్‌రెడ్డి రేగొండ మండలంలోని పాండవులగుట్టను సందర్శించారు. గుట్ట అభివృద్ధికి అవసరమైన నిధులపై జిల్లా అటవీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. మీ దౌర్జన్యం ప్రజల తిరుగుబాటుతో పతనం ప్రజల తిరుగుబాటుతో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ దౌర్జన్యం పతనం కాక తప్పదని, నియంతృత్వ పోకడ, అహంకారం, కుటుంబపాలన త్వరలోనే పోతుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ మోసం చేశారని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయలేదని, కనీస క్వార్టర్స్ సౌకర్యం కల్పించడం లేదని, యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదన్నారు. -
తెలంగాణ సర్కార్‌పై అమిత్ షా సీరియస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు, బీజేపీ పట్ల అధికార టీఆర్ఎస్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర సర్కార్, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సమగ్ర నివేదిక తెప్పించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాజాగా రాష్ట్రంలో జరిగిన రెండు ఆత్మహత్యల ఘటనల్లో మంత్రి, మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ నేతల బెదిరింపులు, వారి ప్రోద్భలంతో పోలీసుల వేధింపులను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నట్టు చెపుతున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం లో ఆత్మహత్యకు పాల్పడిన సాయిగణేశ్ కుటుంబీకులను షా ఫోన్లో పరామర్శించారు. అలాగే గురువారం ఎంపీ సోయం బాపూరావు, ఇతర ముఖ్యనేతలు గణేశ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించే గణేశ్ సంతాప సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు ఆత్మహత్య ల ఘటనలపై నిజానిజాలను తెలుసుకునేందుకు అమిత్‌షా ఖమ్మం, రామాయంపేటలకు లీగల్‌సెల్ బృందాలను పంపించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో పార్టీ జెండా ఎగురవేసిన సాయిగణేశ్‌పై మంత్రి, టీఆర్ఎస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీషీటు ఓపెన్ చేయడంపై అమిత్‌షా ఆగ్రహంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ నేతలు, వారికి మద్దతుగా పోలీసులు.. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం ఇటీవల ఎక్కువ కావడంతో హోంమంత్రికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే గతంలో పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్య, కొత్తగూడెంలో ఎమ్మెల్యే తనయుడు రాఘవేందర్ అరాచకాలు, అతని వేధిం పులతో నలుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య, తాజాగా చోటు చేసుకున్న రెండు ఆత్మహత్యల ఘటనల వెనుక టీఆర్ఎస్ నాయకుల వేధింపుల నేపథ్యంలో అమిత్ షా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. -
కొట్లాడుడు.. కొనుడు..
సర్కారు ఆలోచన ఇదీ..: రాష్ట్ర రైతులు ప్రస్తుత యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. యాసంగి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గట్టిగా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ధాన్యం కొనాల్సిందేనంటూ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ నెల 11న ఢిల్లీలో వరి దీక్ష కూడా తలపెట్టారు. అయినా కేంద్రం దిగిరాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకమంటూ ఎత్తిచూపడం, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టడంతోపాటు రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమేనన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టడం.. రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమే అన్న సందేశాన్ని జనంలోకి పంపడమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు అడుగులు వేస్తోంది. అటు కేంద్రంపై పోరును కొనసాగిస్తూనే.. ఇటు రాష్ట్ర రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో వరికోతలు ఇప్పటికే మొదలై ప్రైవేటు విక్రయాలు సాగుతున్నాయి. ఈనెల మూడో వారం నుంచి వరి కోతలు ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ధర్నా అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మొదలైన వరి కోతలు యాసంగి వరిని బాయిల్డ్ రైస్ చేస్తే తీసుకోబోమని కేంద్రం గతంలోనే ప్రకటించింది. అయితే రాష్ట్రంలో యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్‌గా మాత్రమే పనికొస్తుందని.. ముడి బియ్యం (రా రైస్)గా మారిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం కొనాలని ఓ వైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే.. వరిసాగు చేయవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని రాష్ట్ర రైతాంగానికి స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో రైతులు 36 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి వాతావరణం బాగుండటంతో దిగుబడి కూడా బాగానే వస్తుందని వ్యవసాయ శాఖ చెప్తోంది. ముందుగా నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి వంటిచోట్ల ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లా వర్ని పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో 25 శాతం పంటను కోయడం, ప్రైవేటుగా విక్రయించడం కూడా జరిగింది. ఈ నెల 3వ వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకోనున్నాయి. మిల్లర్లు, దళారుల మాయాజాలం షురూ.. కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో వరి కోతలు పూర్తయిన ప్రాంతాల్లో ధాన్యం విక్రయాలపై గందరగోళం నెలకొంది. దళారులు, మిల్లర్లు మద్దతు ధరకన్నా రూ.500 వరకు తక్కువ ఇస్తున్నారు. తరుగు, తేమ అంటూ క్వింటాల్‌కు రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ఇస్తున్నట్టు రైతులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ ‘‘తొందరపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు. ఢిల్లీ ధర్నా తరువాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’అని రైతులకు హామీ ఇచ్చారు. పలువురు మంత్రులు కూడా ప్రైవేటు సంభాషణల్లో ఇదే విషయాన్ని చెప్తున్నా.. సీఎం కేసీఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక సర్కార్‌గా జనం ముందు నిలబెట్టడంలో విజయం సాధించినట్టు భావిస్తున్న టీఆర్ఎస్ పెద్దలు.. ఇదే ఊపులో తాము మాత్రమే రైతాంగాన్ని ఆదుకోగలమనే సందేశం పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న ఢిల్లీలో జరిగే ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొని.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. అంతా హైదరాబాద్‌కు తిరిగొచ్చాక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. గత యాసంగి కంటే వరిసాగు తగ్గడం, మిల్లర్లు, దళారుల కొనుగోళ్ల నేపథ్యంలో.. ఈసారి ప్రభుత్వ కేంద్రాలను తక్కువగానే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొనుగోలు ఇలా..! ► రైతులకు మద్దతుధర కింద సాధారణ ధాన్యాన్ని రూ.1,940 ధరతో, ఏ గ్రేడ్ ధాన్యాన్ని రూ.1,960 ధరతో కొనుగోలు చేసి.. ముడిబియ్యంగా మిల్లింగ్ చేయించాలనేది రాష్ట్ర సర్కారు ఆలోచన. ► గతంలో మాదిరిగా కాకుండా అవసరమైన మేరకే కొనుగోలు కేంద్రాలు తెరిచే అవకాశం. ► మిల్లర్లు ముడిబియ్యం ఎంతమేర కొంటారో చూసుకుని, మిగతా బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలనే యోచన. ► అదనపు నూకలను ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన ► ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. పెరిగే నూకలను ఏం చేద్దాం? ► సాధారణంగా క్వింటాల్ ధాన్యం మిల్లింగ్ చేస్తే.. బియ్యం, నూకలు కలిపి 67 కిలోలు వస్తాయి. ఇందులో 50 కిలోల బియ్యం, 17 కిలోల నూకలు ఉండటాన్ని ఎఫ్‌సీఐ అనుమతిస్తుంది. ఈ బియ్యం, నూకలను తీసుకుని.. క్వింటాల్ ధాన్యంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వానికి కనీస మద్ధతు ధర అయిన రూ.1,960 చొప్పున చెల్లిస్తుంది. వానాకాలం ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు బియ్యం, నూకలు వస్తాయి. దానితో సమస్య ఉండదు. ► యాసంగిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరో 17 కిలోల నూకలు అదనంగా వస్తాయి. అంటే సాధారణంగా వచ్చే 17 కిలోలు, ఈ 17 కిలోలు కలిపి 34 కిలోలు నూకలే వస్తాయి. మిగతా 33 కిలోలు మాత్రమే బియ్యం ఉంటాయి. ఈ క్రమంలోనే అదనపు నూకలను ఏం చేసుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. తగ్గిపోయే ఒక్కో కిలో బియ్యానికి రూ.30 చొప్పున లెక్కిస్తే.. ప్రతి క్వింటాల్ ధాన్యానికి రూ.400 నుంచి రూ.500 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఈ మొత్తాన్ని సర్కారు భరించగలిగితే రైతులకు న్యాయం జరుగుతుందని మిల్లర్లు కూడా చెప్తున్నారు. సర్కారు కొనడం లేదని దళారులు వస్తున్నరు నేను ఏడెకరాలలో వరి వేసిన. ఎకరానికి 40 బస్తాల లెక్కన వచ్చింది. సర్కారు కొనడం లేదంటూ దళారులు నా దగ్గరికొచ్చి వడ్లు కొనుక్కొనిపోయిన్రు. పెట్టుబడి పోను ఎకరానికి వెయ్యి రూపాయలు కూడా మిగలలేదు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు సెంటర్లు పెట్టాలి. – శివశంకర్, జకోరా, నిజామాబాద్ జిల్లా -
కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం: పీయూష్ గోయల్
-
‘కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం’
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్ పేర్కొన్నారు. తెలంగాణ నేతలు అబద్ధాలు చెప్తున్నారని, ధాన్యం కొనుగోలులో ఏ రాష్ట్రంపై వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేకరిస్తున్నామని పీయూష్ గోయల్ తెలిపారు. పంజాబ్‌కు అనుసరిస్తున్న విధానమే తెలంగాణకు అనుసరిస్తున్నామన్నారు. రా రైస్ ఎంత ఇస్తామనే విషయం ఇంతవరకూ తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదని, ఎన్నిసార్లు అడిగినా టీఎస్ సర్కారు స్పందించలేదన్నారు. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, తెలంగాణ నేతలు అబద్ధాలు చెప్తున్నారన్నారు. ఫిబ్రవరి 22, మార్చి 8వ తేదీల్లో సమావేశాలకు రావాలని ప్రభుత్వాన్ని కోరినా ఆ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు రాలేదని పీయూష్ గోయల్ తెలిపారు.కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. -
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై స్పందించిన కేంద్రం
Telangana Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పందించింది. తెలంగాణలో ధాన్యం, బియ్యాన్ని మొత్తం కొనలేమని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్ స్పష్టం చేశారు. ధాన్యం, బియ్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోలు ఉంటాయని స్పష్టం చేశారాయన. అస్సాంలో ధాన్యం సేకరణ పై అడిగిన ప్రశ్నకు లోక్ సభ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం. ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదు. మద్దతు ధర, డిమాండ్ , సప్లై లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చారు ఆయన. వరి ధాన్యం కోనుగోలుపై కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీలు మంగళవారం మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తోందంటూ చర్చించిన విషయం తెలిసిందే. మరోవైపు వడ్ల కొనుగోలు అంశంపై రేపు(గురువారం) తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు ఎంపీలు పీయూష్‌ను కలవనున్నారు. వడ్ల సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ వినిపించే అవకాశం ఉంది. -
మీరేం చేశారో చెప్పకుండా కేంద్రంపై ఏడుపా?
కరీంనగర్ టౌన్: తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా కేంద్రంపై ఏడ్వడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. స్మార్ట్ సిటీ కోసం కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. సిగ్గు లేకుండా మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వట్లేదని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్లో ప్రారం భోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. శుక్రవారం కరీంనగర్లో కార్యకర్తలు, నాయకులతో హోలీ సంబరాల్లో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జాతీయ రహదారి రోడ్ల నిర్మాణానికి సీఆర్ఐఎఫ్ కింద రూ.205 కోట్లు, అలాగే ప్రధానమంత్రి సడక్ యోజన, ఈజీఎస్ కింద వేలాది కోట్లు, ఎల్కతుర్తి–సిద్దిపేట రోడ్డు నిర్మాణానికి నిధులు తీసుకొచ్చాం. అయినా తానేం చేయలేదని టీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు’అని విమర్శించారు. ‘ఏది పడితే అది మాట్లాడితే జనం వాత పెడతారు’అని హెచ్చరించారు. నీటి వాటాలో అన్యాయం వేములవాడ రాజన్న ఆలయానికి ‘ప్రసాద్’స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర సర్కారు ఇప్పటికీ కనీస ప్రతిపాదనలు పంపలేదని సంజయ్ విమర్శించారు. డీపీఆర్ పంపకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎట్లా ఇస్తా రని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఓటింగ్‌లో పాల్గొనని కేసీఆర్.. సీఎం అయ్యాక నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం చేశారని, ప్రాజెక్టుల పేరుతో దోచుకుం టున్నారని విమర్శించారు. గంగులపై పోటీ చేయాలని తూట్పాలిష్గాళ్లు చెబి తే పట్టించుకునేదెవరన్నారు. టీఆర్ఎస్ లెక్క బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదని.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎంఐఎం కోసం మైనారిటీ సం తుష్ట విధానాలను అవలంబించే టీఆర్ఎస్కు బుద్ధి చెబుతామన్నారు. -
కొట్టుకున్నట్లు నటిస్తూ రైతులను చంపుతున్నారు..
రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్ యాక్టింగ్ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టుకున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ఆందోళనకారులు ముట్టడించారు. సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వాలు పోటీ పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నా యని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్ యాక్టింగ్ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టు కున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరే ట్ను ముట్టడించారు. అక్కడ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ధాన్యం కొను గోలు చేయాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్ గార్డెన్స్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాలోని కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. 4 గంటల ధర్నా అనంతరం కాంగ్రెస్ నేతలు వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, మండలి సభ్యులు టీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహా, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, వీ హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ను కేంద్రమే కాపాడుతోంది సహారా కుంభకోణంలో జైలుకు వెళ్లకుండా కేసీఆర్‌ను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కాపాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ‘ధాన్యం కొనుగోలు చేయమని రైతులు అడుగుతున్నారు. రైతులకు మేలు చేయాలంటే వెళ్లి కల్లాల్లో ఉన్న ధాన్యం చూడాలి. ఏసీలు, టెంట్లు వేసుకొని కూర్చుంటే పోరాటం ఎలా అవుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తే రైతులుకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో తిరిగి ఏం ఉద్ధరిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో కేసీఆర్ కార్యాచరణ ఏంటో ప్రకటించాలి. జంతర్‌మంతర్ వద్దకు ధర్నా చేయగలవా, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపగలవా?’ అని రేవంత్ అన్నారు. చైనా, పాకిస్తాన్ కొంటాయా: భట్టి రైతులు పండించిన పంటను రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాలు కాకుంటే.. చైనా, శ్రీలంక, పాకిస్తాన్, బర్మా దేశాలు కొంటాయా అని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క వ్యాఖ్యానించారు. ‘కేంద్ర సర్కార్ తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయని కేసీఆర్.. ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. కేసీఆర్‌కు పాలన చేతగాకుంటే దిగిపో వాలి. రోడ్లపై దీక్షలు, ధర్నాలు చేసిన ప్రభుత్వాల ను ఇప్పటివరకు చూడలేదు. కేసీఆర్ పాలనలో రైతుల గుండెలు ఆగిపోతున్నాయి’ అని ఆయన మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నాయని, డ్రామాలు ఆపి వడ్లు కొనాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
‘సంక్షేమం’లో తెలంగాణ భేష్: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమపథకాలను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, ముస్లింల సంక్షేమానికి ఇక్కడ తీసుకున్నన్ని చర్యలు మరేరాష్ట్రంలో లేవని మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి అన్నారు. ఈ సంక్షేమ పథకాల అమలు వెనక మజ్లిస్‌పార్టీ కూడా ఉందని, తాము చేసిన ఎన్నో సూచనలు, సలహాలను స్వీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వెరసి టీఆర్ఎస్– మజ్లిస్ పార్టీల సంయుక్త ఆలోచనలతో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. షాదీముబారక్ పథకం రూపకల్పనలో కూడా తన సూచనలున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో సంక్షేమపథకాల అమలు అంశంపై శుక్రవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అక్బరుద్దీన్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే కాదు, తమ హయాంలో కూడా సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేశామని కాంగ్రెస్‌పార్టీ సభాపక్ష నేత భట్టి విక్రమార్క చెప్పుకొంటున్నారని, అదే నిజమైతే వరసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఎందుకు నిలవలేదని ప్రశ్నిం చారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించటంలో మాత్రం వెనకకుపోనని లోపాలున్నా నిలదీస్తానని స్పష్టం చేశారు. తాను చేసే విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నారాజ్ కారని, తాను చేసే ఆరోపణలను ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేసేవేనని ఆయనకు తెలుసునన్నారు. -
TRS: తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలు ఉన్నచోటే ప్రభుత్వం నిధులను ఖర్చుచేస్తోందని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్‌లో తదితర ప్రాంతాల్లో.. నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ప్రభుత్వం సరైన నిధులను మంజూరు చేయడంలేదని అన్నారు. పినపాక నియోజక వర్గంలో ఎన్నికలు లేకపోవడంతో అక్కడి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ప్రశ్నలకు పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్ సమాధానం చెప్పాలని కోరారు. చదవండి: కేటీఆర్ వాహనానికి చలాన్.. ట్రాఫిక్ ఎస్ఐని అభినందించిన మంత్రి -
పోస్టులు భర్తీ చేయకుంటే మిలియన్ మార్చ్
సిరిసిల్ల: దీపావళి పండుగలోగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుంటే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని, నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో శనివారం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామన్న కేసీఆర్, ఏడేళ్లలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి తరువాత నిర్వహించే మిలియన్‌మార్చ్ ఉద్యమంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని, ఇదే చివరి ఉద్యమం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున బాకీ ఉందన్నారు. కేసీఆర్ కేవలం ఒక్క రైతుబంధు ఇస్తూ.. అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేశారన్నారు. ఇక గల్ఫ్ బాధితులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం నిధులు ఇస్తే.. వాడుకుంటూనే ఏం ఇవ్వడం లేదని కేసీఆర్ చెబుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాగా, గ్రామాల్లో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎన్నో సమస్యలు తెలుస్తున్నాయని కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలా అన్నారు. బండి సంజయ్ వెంట ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన అంకిరెడ్డిపల్లెలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. అన్నీ ఆయన కుటుంబానికే... తెలంగాణ వస్తే నీళ్లు.. నిధులు.. నియామకాలు వస్తాయని అందరూ భావించారని, కానీ ఏడేళ్లలో అన్నీ సీఎం కేసీఆర్ కుటుంబానికే వచ్చాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. అంకిరెడ్డిపల్లె బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ఉపాధి కల్పించకుండా కేసీఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను గద్దె దించి బీజేపీని గెలిపించాలని కోరారు. -
త్వరలో చేనేత, మత్స్య, గౌడబీమా
హుజూరాబాద్/కమలాపూర్: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని, త్వరలోనే రైతుబీమా తరహాలో చేనేత, మత్స్య, గౌడబీమాను ప్రభుత్వం అమలు చేయబోతోందని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. సోమవారం హుజూరాబాద్‌లో చేనేత సంఘాలు, పారిశ్రామికుల అభివృద్ధి, సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులు త్రిఫ్ట్ ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తోందని, అధికారులు వారిని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి మంత్రి కేటీఆర్ రూ.70 కోట్లు విడుదల చేశారని తెలిపారు. త్వరలో చేనేత కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్‌తో సమావేశం ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు అన్నం పెట్టే వాళ్ల దిక్కా? పన్నులు వేసే వాళ్ల దిక్కా? అనేది ఆలోచించాలని కోరారు. చేనేతకు భరోసాగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మంత్రి కమలాకర్, మాజీమంత్రులు ఎల్.రమణ, పెద్దిరెడ్డి, నేతలు సమ్మారావు, స్వర్గం రవి తదితరులు పాల్గొన్నారు. నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ నమ్మకానికి టీఆర్ఎస్, అమ్మకానికి బీజేపీ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి హరీశ్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సబ్సిడీలకు కోత లు పెడుతోందని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెం చేసి వాతలు పెడుతోందని విమర్శించారు. సమావేశంలో సాయిచంద్ పాడిన పాటకు హరీశ్తోసహా ప్రభుత్వ విప్ సుమన్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మాజీమంత్రి పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డిలు స్టెప్పులేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. -
దళిత, గిరిజనులకు చేసిందేమిటి?
గజ్వేల్: అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలతో కాలం గడపడం తప్ప దళిత, గిరిజనులకు ఒరగబెట్టిందేమీ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ఏర్పాట్లను గురువారం డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. అంతకుముందు నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నదన్నారు. మరోపక్క ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం 2014 నుంచి 2021 వరకు దళితుల అభ్యున్నతికి రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. 60వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను దారి మళ్లించారన్నారు. అధికార పార్టీ మోసాలను ఎండగట్టగడానికే రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశప్రగతికి టీఆర్ఎస్ బ్రేకులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తుంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు మాత్రం అభివృద్ధికి బ్రేకులు వేస్తోందని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం సంగారెడ్డిలోని అంబేడ్కర్‌చౌక్ వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందని, ప్రశ్నించిన బీజేవైఎం కార్యకర్తలపై ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరప్రదేశ్ తరహాలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పారు. ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఇద్దరుకంటే ఎక్కువ సంతానం ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని టీఆర్ఎస్ సర్కారు చూస్తోందని, ఆ బిల్లును అడ్డుకుంటామని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్రానికి పంపిన కేసీఆర్ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ఈ సభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. కాగా, ఈ బహిరంగసభ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అతడిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. -
‘ప్రజాసంగ్రామ యాత్ర’ ఒక ఆయుధం
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనపై అన్నివర్గాలు విసిగివేసారి ఉన్నందున టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించేందుకు ‘ప్రజాసంగ్రామ యాత్ర’ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ యాత్ర సంజయ్ ఒక్కడిదే కాదని, యావత్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యంత్రాంగానిదని అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లాల అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు, మీడియా బాధ్యులు, జిల్లా యాత్రా ప్రముఖ్‌లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జీలతో శుక్రవారంరాత్రి పొద్దుపోయే వరకు వేర్వేరుగా నిర్వహించిన వర్క్‌షాపులు, సమావేశాల్లో సంజయ్ మాట్లాడారు. పాదయాత్ర ద్వారా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రం నలుమూలాల ప్రజలకు చేరవేసేందుకు సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను సమర్థవంతంగా ఉపయోగించుకోలన్నారు. ఇన్నాళ్లూ కార్యకర్తలు లాఠీచార్జీ, జైలుశిక్షలు వంటి కష్టాలను అనుభవించారని, ఇకనుంచి అధికారం చేజిక్కించుకునేందుకు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్‌రెడ్డి, సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మంత్రి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, సీనియర్ జర్నలిస్ట్ సాయి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
24 నుంచి బండి సంజయ్ పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్/దూద్‌బౌలి: ఈనెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’గా పేరును ఖరారు చేశారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ సీనియర్ నేతలతో కలసి ఎమ్మెల్యే రాజాసింగ్, పాదయాత్ర పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను చేపడుతున్నారని తెలిపారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, జనం సిద్ధంగా ఉన్నారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై హుజూరాబాద్ వరకు సాగుతుందని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్ధిపొందడానికే సీఎం కేసీఆర్ దళితబంధు పేరిట వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల సంక్షేమాన్ని కోరుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాతబస్తీని ఎంఐఎం నేతలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటిని మళ్లించుకుపోతున్నప్పటికీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ ఏడారిగా మారుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు చంద్రశేఖర్, స్వామిగౌడ్, బాబు మోహన్, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నామినేటెడ్ పోస్టులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ చాలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు కొత్త పాలక మండళ్ల నియామకం జరగలేదు. ఆ నామినేటెడ్ పదవుల కోసం పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో, తమకు ఎప్పుడు అవకాశం వస్తుందో అనే ఆశతో కీలక నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఏడాదిన్నర గడిస్తే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం ఉండటంతో.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీ జరగాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల్లో దేవాలయాలు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల పదవులు కూడా ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడి ముగిశాకగానీ, అక్టోబర్ తర్వాతగానీ నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పుడప్పుడు ఒకట్రెండు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిమిత సంఖ్యలో మాత్రమే నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధమైన కార్పొరేషన్లలో సుమారు 50కి పైగా పాలకమండళ్లు ఉన్నాయి. వాటిలో గణనీయంగానే ఖాళీలు ఉన్నాయి. మహిళా కమిషన్, టీఎస్పీఎస్సీ వంటి సంస్థలకు కోర్టు విధించిన గడువుకు తలొగ్గి నియమకాలు జరిపినట్టు విమర్శలు వచ్చాయి. రైతుబంధు సమితి, అటవీ అభివృద్ధి సంస్థ, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తదితరాలకు కొత్త పాలకమండళ్లను నియమించారు. టీఎస్ఐఐసీ, స్పోర్ట్స్ అథారిటీ, వికలాంగుల కార్పొరేషన్‌కు గతంలో ఉన్న వారినే కొనసాగించారు. ఇటీవల హుజూరాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మరోమారు నియమించారు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగినా సభ్యులను భర్తీ చేయకపోవడంతో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు. భారీగానే ఆశావహులు.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ పనిచేస్తున్న వారితోపాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలతో టీఆర్ఎస్లో అన్నిచోట్లా బహుళ నాయకత్వం ఏర్పడింది. సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విపక్షాలు బలహీనపడగా.. టీఆర్ఎస్లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. శాసనసభ, శాసనమండలి, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లుగా అవకాశాలు కల్పించినా.. ఇంకా రాష్ట్రస్థాయి పదవులను ఆశిస్తున్న నేతల జాబితా భారీగానే ఉంది. వివిధ సందర్భాల్లో పార్టీ అవసరాలతోపాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు భర్తీ చేస్తున్నా.. ఖాళీగా ఉన్న పదవులు ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. ఆయా నేతలు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతోపాటు ఇతర కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని.. ఎవరికి ఏ తరహా పదవులు ఇవ్వాలో ఆయనకు తెలుసని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన సమయంలో అవకాశాలు వస్తాయని పేర్కొంటున్నాయి. ఈ పదవులన్నీ ఖాళీయే.. పలు ప్రభుత్వ శాఖల పరిధిలోని కార్పొరేషన్లకు ఏళ్ల తరబడి పాలకమండళ్లను నియమించలేదు. బేవరేజెస్ కార్పొరేషన్, ఆర్టీసీ, పరిశ్రమల శాఖ పరిధిలో పలు సంస్థలకు పాలకమండళ్ల నియామకం జరగలేదు. మిషన్ భగీరథ, ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, సాహిత్య అకాడమీ, ఎంబీసీ, స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, టెస్కోవంటి సంస్థల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగిసినా పాతవారినే కొనసాగిస్తూ వస్తున్నారు. కాళేశ్వరం, వేములవాడ, యాదాద్రి తదితర ప్రధాన ఆలయాలు కూడా ఏళ్ల తరబడి పాలక మండళ్లు లేకుండానే ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 30 కమిటీలకు పాలకమండళ్లు లేవు. -
బియ్యం బీజేపీవి.. ఫొటో కేసీఆర్‌దా: బండి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రేషన్ షాపుల వద్ద కేసీఆర్ ఫొటోలను ప్రదర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటోలను పెట్టాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద మోదీ ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు ఉచితంగా ఆహార ధాన్యాలను కేటాయించినప్పటికీ రాష్ట్ర సర్కార్ పూర్తి స్థాయిలో పేదలకు పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటని బండి విమర్శించారు. -
9న ఇంద్రవెల్లిలో లక్షమందితో దండోరా
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా దళితులు, గిరిజనులకు చేస్తున్న మోసాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టేందుకు ఆగస్టు 9న ఇంద్రవెల్లి నుంచి లక్షమందితో దండోరా మోగించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చిరాన్‌పోర్ట్ క్లబ్లో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కె. ప్రేంసాగర్‌రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కె.సురేఖ, జాతీయ యువజన కాం గ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ ఒక్క హుజూరాబాద్‌లోనే దళితబంధు పథకం అమలు చేస్తే, మిగిలిన 118 నియోజకవర్గాల్లోని దళితుల పరి స్థితి ఏంటని ప్రశ్నిం చారు. రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది దళిత, గిరిజనులకు ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసి డబ్బాల్లో ఓట్లు వేసుకుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదని, ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ ప్రభుత్వంపై ‘దళిత, గిరిజన దండోరా’మోగిస్తామని చెప్పారు. ప్రేంసాగర్‌రావుతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలెవ్వరితోనూ తనకు విభేదాలు లేవని రేవంత్ స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు బోనాల సందర్భంగా ఉజ్జయిని అమ్మవారిని రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన నిజాంపేటకు చెందిన వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం చేశారు. -
వ్యాక్సిన్ల వృథాలో రాష్ట్రం ముందంజ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి వచ్చిన 80 లక్షల వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, వ్యాక్సిన్లను వృథా చేయడంలో ముందుందని ఆరోపించారు. ఈ నెలలో మరో 20 లక్షలు, వచ్చే నెలలో 20 లక్షలు, ఆగస్టులో 30 లక్షల వ్యాక్సిన్లు రాబోతున్నాయని, ఇక ప్రతిరోజూ దాదాపు లక్షమందికి వ్యాక్సిన్ వేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ స్థాయిలో వ్యాక్సిన్లు వేసే వ్యవస్థే రాష్ట్రంలో లేకుండాపోయిందన్నారు. జూమ్ యాప్ ద్వారా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ స్థాయి వ్యాక్సినేషన్‌కు ఇప్పుడున్న స్టాఫ్‌తోపాటు కనీసం 5 వేలకు తగ్గకుండా డాక్టర్లు, నర్సులు అవసరమని అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణకు ఇస్తానన్న రూ.2,500 కోట్లలో రూ.500 కోట్లు వెచ్చించి పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలి రాష్ట్రంలో వెంటనే ఆయుస్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని, ఆరోగ్యశ్రీలో కరోనాకు చికిత్స అదించాలని సంజయ్ డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్‌పై అవగాహన లేని రాష్ట్రమంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, హరీశ్‌రావు సిద్దిపేటలో, కేటీఆరేమో ట్విట్టర్లో కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించగానే ఇతర రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలియజేశారని, తెలంగాణ సీఎం మాత్రం స్పందించలేదని, అదీ ఆయన సంస్కారమని ఎద్దేవా చేశారు. ఫ్రీ వ్యాక్సిన్ కారణంగా రూ.2,500 కోట్లలో తమకు వచ్చే కమీషన్లు పోయాయనే బాధతోనే ప్రధానికి కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పలేదన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన అవినీతిని బయట పెడతామని హెచ్చరించారు. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేరాలని అడగడం కాకుండా, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. రమణ టీఆర్ఎస్లో చేరుతున్న విషయం తనకు తెలియదన్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడంలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘థియేటర్లు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే మీకు ముఖ్యమా’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు బదులుగా.. జనసంచారం నియంత్రణకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా ఆదేశాలు ఇవ్వమంటారా అని హెచ్చరించింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశించింది. అదే విధంగా, సంబంధిత అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 4,009 కేసులు నమోదయ్యాయని, 14 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చదవండి: కరోనా సెకెండ్ వేవ్: ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అక్రమ కట్టడాలను పూర్తిగా ఎందుకు కూల్చడం లేదు? -
డీఎస్సీ నిర్వహించాలి!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, విద్యా బోధనలో నాణ్యత పడి పోకుండా వచ్చే జూన్‌లోగా ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బందిని తిరిగి నియమించాలని సూచించారు. విద్య, వైద్యం, పురపాలక, ఆబ్కారీ, అటవీ, దేవాదాయ తదితర శాఖల 2021–22 వార్షిక బడ్జెట్ పద్దులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు అధికార, విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు చెల్లించాలని సండ్ర కోరారు. జూనియర్ కళాశాలలు లేని మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులపై ప్రభుత్వ నియంత్రణ ఉండే విధానం తీసుకురావాలన్నారు. ఎంఈఓ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలి స్టులు వస్తున్నారని, ఎవరు జర్నలిస్టులనేది ప్రభు త్వం నిర్వచించాలన్నారు. టీఆర్టీ పోస్టులకు ఎంపి కైన 250 మందిని పక్కనపెట్టారని, వీరిలో అర్హులను గుర్తించి ఉద్యోగాల్లో నియమించాలని రఘునందన్‌రావు కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలన్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ, టిమ్స్, జిల్లా ఆస్ప త్రుల్లో నియమించిన తాత్కాలిక పారా మెడికల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలన్నారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద ఇస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన దేవాలయ, వక్ఫ్ భూములను తిరిగి ఆయా సంస్థలకు అప్పగిం చాలని సూచిం చారు. కిడ్నీ రోగుల అవసరాలను తీర్చడానికి డయాలసిస్ కేంద్రాల్లో పరికరాల సంఖ్య పెంచాలని సంజయ్ సూచించారు. -
స్మార్ట్ సిటీలు.. కావాలా..వద్దా?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా వీటికి విడుదల చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే ఈ రెండు నగరాలను స్మార్ట్‌సిటీల జాబితా నుంచి తొలగించి కొత్తవాటిని ఎంపిక చేస్తామని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తెలంగాణ సర్కారుకు తేల్చిచెప్పింది. ఇందుకువీలుగా ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటివరకు విడుదల చేసిన నిధులను వెనక్కి ఇచ్చేయాలని కోరింది. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్య దర్శి దుర్గాశంకర్ మిశ్రా గత జూన్ 4న సీఎస్ సోమేశ్‌కుమార్‌కు ఈ మేరకు ఓ లేఖను రాశారు. ఇది ఆలస్యంగా వెలుగుచూసిం ది. లేఖ రాసేనాటికి గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు కేంద్రం రూ.196 కోట్ల చొప్పున విడుదల చేసింది. అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా... తామిచ్చిన నిధులనూ పూర్తిగా బదలాయించకుండా అట్టిపెట్టుకోవడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. స్మార్ట్ సిటీ మిషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్రం విడుదల చేసిన నిధులను ఏడు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)కు బదలాయించాల్సి ఉంటుందని, సమాన మొత్తంలో రాష్ట్ర వాటా నిధులను ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేసింది. తక్షణమే ఈ నిధులను ఎస్పీవీలకు అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌కు కేంద్రం సూచించింది. 2016 మేలో గ్రేటర్ వరంగల్, ఆగస్టులో కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది. వీటికి నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ కేంద్రం లేఖ రాసి 5 నెలలు గడిచిపోయిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై ‘సాక్షి’దృష్టిసారించింది. ఆ వివరాలివి.... గ్రేటర్ వరంగల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ►స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.2,350 కోట్లు ►పనుల ప్రారంభం 2017 నవంబర్ 17 ►మొత్తం ప్రాజెక్టులు: 94 ►పనులు పూర్తయిన ప్రాజెక్టులు 17. ఖర్చు చేసిన నిధులు రూ.61.35 కోట్లు ►పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులు 32. అవసరమైన నిధులు రూ.1,271 కోట్లు ►టెండర్ దశలో 14 ప్రాజెక్టులు, అంచనా వ్యయం రూ.359 కోట్లు ►డీపీఆర్‌లు ఆమోదించిన ప్రాజెక్టులు 14. అంచనా వ్యయం రూ.66.12 కోట్లు ►డీపీఆర్ తయారీ దశలో 17 ప్రాజెక్టులు. అంచనా వ్యయం రూ.592 కోట్లు. సీఎం హామీల అమలుకు ఇప్పటికే చాలా నిధులు ఇచ్చాం రాష్ట్రానికి మంజూరు చేసిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను రద్దు చేస్తామని కేంద్రం రాసిన లేఖ పాతది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులను వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు విడుదల చేశాం. పనుల పురోగతిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను విడుదల చేస్తాం. ఈ రెండు నగరాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఇప్పటికే చాలా నిధులను విడుదల చేశాం. – అరవింద్‌కుమార్, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి రూ.196 కోట్లకు 138 కోట్లు మాత్రమే జమ కేంద్ర ప్రభుత్వం వరంగల్ స్మార్ట్‌సిటీ మిషన్ అంచనా వ్యయంలో ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. ఇందులో స్మార్ట్‌సిటీ ఖాతా (ఎస్పీవీ)కు రూ.138 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. మరో రూ.58 కోట్లు జమ కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.500 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గ్రేటర్ వరంగల్‌లో భద్రకాళి చెరువు రీ జనరేషన్ ల్యాండ్ స్కేపింగ్, బండ్ రిటర్నింగ్ వాల్, 13 ట్రాఫిక్ సిగ్నల్స్, ఏంజీఎంలో 750 కేఎల్డీ మురుగునీటి శుద్దీకరణ ప్లాంటు, రీజినల్ లైబ్రరీ పునరుద్ధరణ, సుబేదారి జంక్షన్ పుట్‌పాత్ పనులు పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఫస్ట్‌ఫేజ్‌లో 4 స్మార్ట్‌సిటీ రోడ్లు (3.95 కిలోమీటర్లు) పనులు పురోగతిలో ఉన్నాయి. 10.62 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నడుస్తున్నాయి. రూ.26.5 కోట్లతో నాలుగు ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాల పను లు పురోగతిలో ఉన్నాయి. రూ.65.5 కోట్లతో భద్ర కాళి బండ్ పనులు నడుస్తున్నాయి. రూ.8.36 కోట్లతో స్వీపింగ్ మిషన్లు, ఇతర వాహనా లను కొనుగోలు చేశారు. కేంద్రం ఇచ్చినా... రాష్ట్రం వద్దే ఆగిన రూ.71 కోట్లు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. వాటిలో రూ.125 కోట్ల నిధులు మాత్రమే స్మార్ట్‌సిటీ ఖాతాకు జమ అయ్యాయి. మరో 71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రూ.266.66 కోట్ల అంచనాలతో ప్రస్తుతం 9 పనులు కొనసాగుతున్నాయి. రూ.84 కోట్లతో ప్యాకేజీ–1 కింద ప్రధాన రహదారుల నిర్మాణం, రూ.80 కోట్లతో ప్యాకేజీ–2 కింద రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రెండో విడతగా రూ.131.40 కోట్లతో 7 పనులకు డీపీఆర్‌లు సిద్ధం చేశారు. వీటిలో 24 గంటల నీటి సరఫరా, నగర ముఖద్వారాల నిర్మాణం, ఈ– ఎడ్యుకేషన్, మరుగుదొడ్ల నిర్మాణం, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ లాంటివి ఉన్నాయి. కరీంనగర్ ప్రాజెక్టు స్వరూపం.. ►కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనుల ప్రారంభం: 2017 మార్చి 31న ►స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల అంచనా మొత్తం: రూ.1,878 కోట్లు ►రెట్రోఫిట్టింగ్ (అదనపు హంగులు) పనులకు రూ.267 కోట్లు, ►వినోదాత్మక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.76 కోట్లు ►ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధికి రూ.337 కోట్లు ►మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.540 కోట్లు ►విద్యుత్ సరఫరా వ్యవస్థ అభివృద్ధికి రూ.83 కోట్లు ►ఇతర అవసరాలకు రూ.110 కోట్లు ►ఇంటలిజెంట్ రవాణాకు రూ.226 కోట్లు ►24/7 నీటి సరఫరాకు రూ.140 కోట్లు ►స్మార్ట్ విద్యావిధానానికి రూ. 15 కోట్లు ►స్మార్ట్ గవర్నెన్స్‌కు రూ.36 కోట్లు ►ఇతర అవసరాలకు రూ.22 కోట్లు -
వాహ్ హైదరాబాద్... ఇదేనా విశ్వనగరం?
మాటలు కోటలు దాటుతున్నయ్; చేతలు మాత్రం గడప దాటని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామంటూ గత ఆరేళ్లుగా ఇచ్చిన హామీలెన్ని? వాటిలో అమలైనవెన్ని? నగరంలో రూ.67,000 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయా లను ఘనంగా పెంపొందించినట్లు కేటీఆర్ స్వయంగా రాష్ట్ర శాసనసభలో చెప్పారు. అంతగా అభివృద్ధి చేస్తే నగరంలో రోడ్లపైకి వర్షపు నీరు ఎందుకొచ్చింది? కాలనీలకు కాలనీలు ఎందుకు ముంపునకు గురయ్యాయి? గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సంవ త్సర కాలంలో లక్ష మంది పేదలకు రెండు పడకల ఇళ్ళు నిర్మించి ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా దసరా రోజున 11,000 ఇళ్లలో గృహప్రవేశం జరిపిం చారు. లక్ష ఇళ్ళెక్కడ? 11,000 ఎక్కడ? హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ నగరంగా, పాతబస్తీని ఇస్తాంబుల్ నగరంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ 2015లో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కై స్క్రాపర్లు, నగరం చుట్టూ గ్రీన్ కారిడార్, వేగంగా దూసుకు పోయే స్కైవేలు, నగరం శివారులో శాటిలైట్ టౌన్‌షిప్‌లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడేమైంది? గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిస్తే 100 రోజుల ప్రణాళికలతో నగరం రూపురేఖలనే మార్చివేస్తామని మునిసిపల్ మంత్రిగా కేటీఆర్ హడావుడి చేశారు. కనీసం రోడ్లలో గుంతలనైనా పూడ్చారా? సిటీలో ఎక్కడ గుంత చూపించినా వెయ్యి ఇస్తానని సవాల్ చేసిండు. కానీ నగరంలో ఎక్కడ చూసినా గుంతలే కన్పిస్తున్నాయి. మూసీనది అభివృద్ధి కోసం అంటూ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా ఖర్చు పెట్టలేదే? రూ. 1,400 కోట్లు ఖర్చు పెడతామన్న కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పగలరా? నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం కోసం రూ 20,000 కోట్లతో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అమలుపరుస్తున్నట్లు ప్రకటించారు. 20 ఫ్లైఓవర్లు, 5 స్కైవేలు, 11 మేజర్ కారిడార్లు, 5 గ్రేడ్ సెపరేట్లతో మొత్తం 2,000 కిలోమీటర్ల కొత్త రహదారులు వేస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ అందులో నాలుగోవంతు కూడా వేయలేదు. ట్రాఫిక్ రద్దీ కోసం మూసీనదిపై 42 కిలోమీటర్ల ఆరు లైన్ల రోడ్లు వేస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రణాళిక కూడా చేయలేదు. మురికి నీటితో ఉన్న హుస్సేన్‌సాగర్‌ను మంచినీటితో నింపుతాననీ, సాగర్ నీటిని కొబ్బరి నీటివలె చేస్తాననీ చెప్పిన కేసీఆర్ ఇప్పుడా విషయమే మరచిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పునాది పడిన మెట్రో రైలు తమ ఘనతగా చెప్పుకొంటున్న కేసీఆర్ పాతబస్తీ వరకు ఆ రైల్ ఎందుకు వెళ్లడం లేదో చెప్పగలరా? శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగిస్తామని చెప్పిన ఆయన ఎందుకు ఆ ఊసెత్తడం లేదు? హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని చెప్పుకొం టున్న నేతలు 450 ఏళ్ళ నగర చరిత్రకు సాక్షిగా ఉన్న పలు వారసత్వ భవనాలను కూల్చివేస్తున్నారు. సచివాలయంలోని హెరిటేజ్ భవనంతో పాటు అమ్మవారి గుడి, మసీద్‌లను కూల్చివేసి, వాటి శిథిలాలపై కొత్త సచివాలయ నిర్మాణం చేప ట్టారు. చరిత్రాత్మక కట్టడాలైన అసెంబ్లీ భవనం, ఉస్మానియా ఆసుపత్రి, ఎర్రమంజిల్ ప్యాలెస్‌లను కూల్చేందుకు సిద్ధపడుతు న్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చే విధంగా కృష్ణా, గోదావరి జలాలను నిల్వచేసుకొనేందుకు రాచకొండ, శామీర్‌పేటల వద్ద రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని చెప్పి, డీపీఆర్‌లు కూడా సిద్ధమైనా ఒక తట్ట మట్టిని కూడా ఎత్తలేదు. గత ఎన్నికల ముందు 18,000 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం తిరిగి ఆ మాట ఎత్తడం లేదు. తెలంగాణ అకాడమీ అఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా నాలుగేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి, ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం ఒక్కరికైనా ఇచ్చిందా? నగర పరిధిలో మొదటి దశలో రూ.130 కోట్లతో 40 మోడల్ మార్కెట్లు, 200 ఆదర్శ మార్కెట్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేవలం నాలుగు మార్కెట్లు మాత్రమే నిర్మించినా వాటిని కూడా అందుబాటులోకి తేలేదు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 200 నుండి 300 ఎకరాలలో 15 కొత్త డంప్‌యార్డ్‌లు అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక్కటి కూడా చేయలేదు. నగర ప్రజలను వరదల నుండి విముక్తి కలిగించడం కోసం సీవరేజీ డెవలప్ మెంట్ ప్లాన్ అమలుకు రూ 10,000 కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోవడంతో నగర ప్రజలకు ముంపు బాధలు తప్పడం లేదు. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో గప్పాలు కొట్టడం తప్ప హైద రాబాద్‌కు ఒరిగిందేమీ లేదు. ఇటీవల కురిసిన వర్షాలు, వరద లతో కార్లు, వాహనాలు మునిగిపోయి ఎటు చూసినా బురద, వాసనతో ఉన్న నగరాన్ని చూసి ఇదేనా విశ్వనగరమంటే, ‘వాహ్... హైదరాబాద్?’ అని జనం నవ్వుకుంటున్నారు. వ్యాసకర్త: ఎన్. రామచంద్రరావు, తెలంగాణ బీజేపీ నేత, శాసనమండలి సభ్యుడు -
ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది..?
సాక్షి, హైదరాబాద్: దళితులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధ్యక్షతన.. మహిళా కాంగ్రెస్ చైర్మన్ నేరెళ్ల శారద, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం అధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. మహాధర్నాలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మహిళా, దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (టీఆర్ఎస్ నేతల ఇళ్లకే రూ.10 వేలు) ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. 'దళితులకు, మహిళలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణలో కూడా దళితులు, మహిళల హక్కుల కోసం ధర్నా చేయాల్సి రావడం మన దౌర్భాగ్యం. తెలంగాణ కోసం మహిళలు, దళితులు ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోజూ అత్యాచారాలు, దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతిరోజు దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబ పాలన పోవడానికి ప్రతి దళితుడు పోరాటం చేయాలి. ప్రతి మహిళా టీఆర్ఎస్ను బొంద పెట్టడానికి నడుం బిగించాలి' అని సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. (హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు..?) -
దోపిడీలో నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభు త్వం సంక్షేమంలో నంబర్ వన్ కాదని, దోపిడీలో నంబర్ వన్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణం గా 80 గజాలలోపు నివాస స్థలమున్న పేదలకు ఎలాంటి అనుమతులుండవని, అయితే ప్రస్తుతం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ స్కీం వారికి కూడా వర్తింపజేయ డం కేసీఆర్ ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం నడపలేని ప్రస్తుత స్థితిని అధిగమించేందుకు పేదలు, మధ్య తరగతి ప్రజల మీద ఎల్ఆర్ఎస్ స్కీంను బలవంతంగా రుద్దుతున్నారని విమర్శించారు. 74 ఏళ్లుగా గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు మంజూరు చేసిన లేఅవుట్లు అక్రమమే అయితే అక్రమంగా అనుమతులు మంజూరు చేసిన వారిని, ప్రభుత్వాలను శిక్షించారా.. లేక ఇప్పుడు శిక్షిస్తారా.. అని ప్రశ్నించారు. ‘అవి అక్రమమే అయితే రిజిస్ట్రేషన్ శాఖ ఎలా రిజిస్ట్రేషన్ చేసింది? మున్సిపాలిటీ రోడ్లు ఎలా వేసింది? విద్యుత్, వాటర్ వర్క్స్ అనుమతులెలా వచ్చాయి? ప్రభుత్వాలు కళ్లు ఎందుకు మూసుకున్నాయి’ అని దుయ్యబట్టారు. నామమాత్రపు ఫీజులు అని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ని ఆశ్రయిస్తే దాదాపు సగం ప్లాటు అమ్ముకోవాల్సిందేనన్నారు. ఇప్పటికైనా ప్ర భుత్వం కళ్లు తెరిచి ఈ ఆదేశాలను రద్దు చేయాలని, లేదంటే కేసీఆర్ ప్ర జాగ్రహానికి గురికావడం ఖాయమని హెచ్చరించారు. -
ఆలయ స్వర్ణముఖ ద్వారానికి బంగారు తాపడం..
సాక్షి, యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఆలయ నిర్మాణంలో పలు పనులకు బంగార తాపడం చేపిస్తున్నారు. ఇదే క్రమంలో యాదాద్రి ప్రధానాలయం గర్భాలయం స్వర్ణముఖ ద్వారానికి బంగారు తాపడం చేపించారు. బంగారు తాపడంతో ఉండే ద్వారాల నమూనా వీడియోను దేవాలయ అధికారులు మీడియాకు విడుదల చేశారు. దీనితోపాటు అత్యంత స్వర శోభతో ఉండే విధంగా వివిధ నరసింహుని రూపాలు, దేవత విగ్రహాలు,పద్మాలతో స్వర్ణ తాపడంతో ఆలయ ద్వారాలు వుండే వీడియో నమూనాను అధికారులు విడుదల చేశారు. (అద్భుతం.. అద్దాల మండపం) -
కుట్రతోనే నా కొడుకును అరెస్ట్ చేశారు
నల్లగొండ టౌన్: ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారన్న కారణంతో డాక్టర్‌ను అరెస్ట్ చేసిన చరిత్ర ఇంతవరకు ఎక్కడా లేదని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం నల్లగొండలో ప్రజా సంఘాల నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఫీజులు ఎక్కువ వసూలు చేస్తే అందుకు సంబంధించి నోటీసులు ఇవ్వాలి. స్పందించని పక్షంలో చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎలాంటి నోటీసులు లేకుండా డీఎంహెచ్ఓను అడ్డం పెట్టుకుని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నా కుమారుడు డాక్టర్ సుహాస్‌ను అరెస్ట్ చేయడం, ఆస్పత్రిని సీజ్ చేయడం ఎంతవరకు సమంజసం’అని ప్రశ్నించారు. ఐసీయూలో పేషెంట్లు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఆస్పత్రిని సీజ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజకీయంగా కుట్ర పన్ని సుహాస్‌ను అరెస్ట్ చేయించిందని ఆయన ఆరోపించారు. ఇది నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి సొంతంగా వచ్చిన ఆలోచన కాదని, పైనుంచి కింది వరకు రాజకీయ కుట్రతోనే జరిగిందని ఆరోపించారు. తానూ ఉద్యమంలో పనిచేశానని.. దేనికీ భయపడనన్నారు. ‘చావు నాకు బోనస్.. నా కొడుకుకు నేను పిరికి మందు తాపలేదు.. నా కొడుకు దగ్గర పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటా.. కానీ నువ్వెవరు మమ్మల్ని అనడానికి’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుహాస్‌పై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేసి ఆస్పత్రి సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో ప్రజా సంఘాలను కలుపుకొని ప్రభుత్వ తీరును ఎండగడతామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆదివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతున్న చెరుకు సుధాకర్ -
కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి మీడియాతో మాట్లాడారు. హైదరా బాద్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణా, గోదావరి మంచి నీరు, మెట్రో రైల్ తదితరాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఒక్క శాతం ప్రజలకైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించిన వేల కోట్ల రూపాయలు ఎవరు తిన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో డివిజన్ల విభజనలో అక్రమాలు జరిగాయని, కొంతమందికి లబ్ధి చేకూరేలా ఈ ప్రక్రియ జరిగిందని ఆరోపించారు. సచివాలయంలో మజీద్, మందిర్లను రాజ్యాంగ విరుద్ధంగా కూల్చేశారని, వాటిపై పోరాటాలు చేస్తామని తెలిపారు. పార్లమెంటులో ప్రస్తావిస్తాం: ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు మసీద్, మందిర్ కూల్చివేతల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఉత్తమ్ చెప్పారు. కార్ స్టీరింగ్ తమ చేతిలో ఉందని, ఎంఐఎం పార్టీ నేతలు అంటున్నారని విమర్శించారు. మసీదు కూల్చివేతపై కేసీఆర్ నిర్ణయాన్ని అసదుద్దీన్ స్వాగతించడం దారుణమన్నారు. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందజేస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లి పోరాడతామని పేర్కొన్నారు. రాబోయే మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాం ఆనవాళ్లను చెరిపేసే కుట్ర: రేవంత్ రాష్ట్రంలో నిజాం ఆనవాళ్లను ఒక్కొక్కటిగా చెరిపేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే సచివాలయం, ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నేలమట్టం చేశారని, చారిత్రక కట్టడాలను తొలగించి చరిత్రను చెరిపేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. మరోవైపు కేంద్రంలో కూడా హిందుత్వ ఎజెండాతో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆలయాల కూల్చివేతలపై బీజేపీ, ఎంఐఎంలకు మాట్లాడే అర్హత లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావోద్వేగాలను వాడుకుని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. సచివాలయంలో గుడి, మసీదు కూల్చివేతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘గ్రేటర్’ కసరత్తు షురూ! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎ న్నికల కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. పక్కా ప్రణాళికతో ఈసారి ఎన్నికలను ఎదుర్కొనాలని, జీహెచ్ ఎంసీలో అతి పెద్ద పార్టీగా అవతరించేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నేతలు నిర్ణయిం చారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. సీఎల్పీ నే త భట్టి విక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, గ్రేటర్ కాంగ్రెస్ నేతలు కిచ్చెన్న గారి లక్ష్మా రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, విక్రమ్‌గౌడ్, అనిల్ కుమా ర్ యాదవ్‌లతో పాటు ఒకరిద్దరు మినహా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై ఉత్తమ్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నెల 24లోపు 150 డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ ఎన్నికలు నాలుగు నెలలలోపే జరుగుతాయని, ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీసం 3 నెలల సమయం ఉండేలా అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని ఉత్తమ్ సూచిం చినట్టు సమాచారం. కాగా, సెక్రటేరియట్ లో దేవాలయం, రెండు మసీదుల కూల్చివేతపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలని, ప్ర భుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాల ని, బీజేపీ, ఎంఐఎంల ద్వంద్వ వైఖరిని ఎం డగట్టాలని సమావేశం నిర్ణయించింది. -
కేంద్రం ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు అందుబాటులో లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాలో వెంటిలేటర్ల సౌకర్యం కల్పించే బాధ్యతను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిల్లాలో దాతలు వెంటిలేటర్లు ఇస్తానన్న ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇష్టం లేకపోతే కోవిడ్-19 పేరుతో చికిత్స అందించాలి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్రం కితాబిచ్చిందని చెప్పుకుంటున్నారు. ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి? హైదరాబాద్ సిటీ- అర్బన్ ప్రాంతంలో రోజుకూలీ చేసుకునే వారి కోసం ప్రత్యేక పథకం తీసుకురావాలి. కేంద్ర నిబంధనలు పాటించాలని పోరాటం చేస్తున్నాం’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. (తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర బృందం ప్రశంసలు) -
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర బృందం ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో తీసుకుంటున్న వినూత్న చర్యలను కేంద్ర బృందం అభినందించింది. రాష్ట్ర ప్రభుత్వం హోమ్ ఐసోలేషన్ పేషేంట్ల కోసం రూపొందించిన ‘హితం’ యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని పేర్కొంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కరోనా కట్టడికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో బిఆర్కే భవన్లో సమావేశం అయింది. (కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా) ఇన్నోవేటివ్ హితం యాప్ ఇతర రాష్ట్రాలతో పంచుకోవాల్సిందిగా కేంద్ర బృందం, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి కోవిడ్-19 టెస్ట్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కరోనా తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేప్పట్టాల్సిన పలు అంశాలపై వీకే పాల్ చర్చించారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు సిద్ధమైన విధానం, వ్యాప్తిని అరికట్టే చర్యలు పేషేంట్లకు అందిస్తున్న చికిత్స చర్యలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. (50 మందితో స్వాతంత్ర్య వేడుకలు) మొదటి నుంచి కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రజల ప్రాణాలు రక్షించండానికి 24 గంటల పాటు శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కరోనా పరీక్షలు, చికిత్సలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ నివారణ చర్యలపై సూచనలు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మాద్యే జరిగిందని, క్యాబినెట్ సమావేశంలో రోజుకు 40 వేల పరిక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. కోవిడ్ కట్టడికి ప్రత్యేక నిధులు మంజూరు చేశారని సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశంలో కేంద్ర బృందానికి తెలిపారు. (తెలంగాణలో ‘సెట్స్’ తేదీలు ఖరారు) -
కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు సోమవారం భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. వర్చువల్ వేదికగా ఢిల్లీ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 45వేల కోట్ల రూపాయలకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారని నిలదీశారు. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదని జేపీ నడ్డా దుయ్యబట్టారు. (తెలంగాణ ద్రోహిగా మిగలనున్న కేసీఆర్) ‘కరోనాను కట్టడి చేయకుండా సీఎం కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదు. కరోనా టెస్టులు చేయటంలో తెలంగాణ వెనుకబడిపోయింది. లోక్ సభ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98 లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారు. కోవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్రానికి దేశ ప్రజలు సహకరించాలి. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని కేంద్రం పనిచేస్తోంది. కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన. ప్రధాని మోదీ ఆలోచన మేరకు పార్టీ కార్యాలయాల నిర్మాణం. కోవిడ్ ను ఎదుర్కోవటంలో ప్రధాని మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.’ అని జేపీ నడ్డా అన్నారు. -
‘స్వేచ్ఛనిచ్చాం.. నిర్ణయాలు తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ వేగవంతం చేయాలన్నారు. ‘‘కరోనా కట్టడికి కేంద్రం రూ.215 కోట్లు విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, లాక్డౌన్ విషయంలో రాష్ట్రాలకే స్వేచ్ఛనిచ్చాం. రాష్ట్రాలు పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని’’ ఆయన తెలిపారు. ప్రభుత్వాస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే రూ.లక్షలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం వల్లే ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. 200లకు పైగా వెంటిలేటర్లు గాంధీ ఆస్పత్రిలో ఉన్నా ప్రజలెందుకు భయపడుతున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందన్నారు. కరోనా చికిత్సలో ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. గాంధీ ఆసుపత్రిలో పారిశుధ్యం పెంచాలని ఆదేశాలిచ్చానని కిషన్‌రెడ్డి వెల్లడించారు. -
విద్యుత్ బిల్లుల భారం ప్రభుత్వమే భరించాలి
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 29 నుంచి జూలై 3 వరకు ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉత్తమ్ రాష్ట్రంలోని సమస్యలపై పార్టీ నేతలతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్.సి. కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, ఎంపీ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ ట్రైనింగ్ సెల్ ఇన్చార్జి సచిన్ రావ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డిలతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని కోరారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈనెల 29న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈనెల 30న కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పెరిగిన కరెంటు బిల్లులను నిరసిస్తూ జూలై 3న నల్ల బ్యాడ్జీలతో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లతో కూడిన ఒక కమిటీని కూడా ఉత్తమ్ ప్రకటించారు. -
కేసీఆర్ అసమర్థతతోనే ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కరోనా ముప్పు రావడానికి కారణం కేసీఆర్ అసమర్థతే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో ఘోరంగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శులు మహేశ్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్లతో కలిసి ఉత్తమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన మూడు నెలల తరువాత కూడా ఒక్క బెడ్ అందుబాటులో లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. కేసీఆర్ సమర్ధత ఏంటో ప్రజలందరూ తెలుసుకున్నారని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఒక్క కోవిడ్ హాస్పిటల్ మాత్రమే పనిచేస్తుందా అని ఎద్దేవా చేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి కేంద్రం రూ. 50 లక్షలు నష్టపరిహారం ప్రకటిస్తే రాష్ట్రం అమల్లోకి తేలేదని అన్నారు. కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కోవిడ్ బారిన పడిన పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందాన్ని కలిసి కరోనాపై నివేదిక ఇస్తామని చెప్పారు. పీవీ కాంగ్రెస్‌కు గర్వకారణం దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పీవీ దేశాన్ని గొప్పగా నడిపించిన తీరును కాంగ్రెస్ నేతలుగా తాము గర్వంగా చెప్పుకుంటామని, ఆయన గురించి ఎవరు గొప్పగా చెప్పినా స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ పీవీని గౌరవించి పదవులు ఇచ్చిందని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీని పార్టీ చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుందన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపినందున జూలై 3న నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. తెల్ల రేషన్‌కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో పెట్రోల్, డీజిల్ ధరల పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ రోజు చేస్తోంది ఏంటని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గ డం లేదని, 2014 నుంచి ఇప్పటివరకు 200 శాతం టాక్స్‌లు పెంచారని విమర్శించారు. -
కరోనా నిధులు కూడా కాళేశ్వరానికే: అరవింద్
సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కాళేశ్వరానికే పెట్టారని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ప్రతి ఏటా హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలకు కేంద్ర రూ.50 కోట్లు ఇస్తుందని తెలిపారు. రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన రూ.200 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సహకారంతో నిధులను కాళేశ్వరానికి మల్లించారని చెప్పారు. (చదవండి: విధుల్లో చేర్చుకోండమ్మా..!) కరోనా నిధులను కూడా కాళేశ్వరానికే తరలించారని వెల్లడించారు. వలస కార్మికులకు ఇచ్చిన నిధులను కూడా టీఆర్ఎస్ నేతలు మింగేశారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 14 వేల వలస కార్మికులను గుర్తించి కేవలం రూ.21 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగతా సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నించారు. నాసిరకం సొయా విత్తనాలు సరఫరా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని గుర్తు చేశారు. పంచాయతీలు యూనిట్‌గా తీసుకుని రైతు వేదికలు నిర్మిస్తే సరిపోతుందని అరవింద్ అన్నారు. (చదవండి: నిరసనలు: మోదీ దిష్టిబొమ్మ దగ్ధం) -
ఎక్కడికక్కడ అరెస్టులు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రంలో గోదావరి నదిపై ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘గోదావరి జలదీక్ష’ను సైతం పోలీసులు భగ్నం చేశారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపిస్తూ ప్రాజెక్టుల సందర్శనకు ఆ పార్టీ నేతలు శనివారం సిద్ధమవగా జలదీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా ముఖ్య నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు. గత నెల రోజుల వ్యవధిలో వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడం ఇది నాలుగోసారి. ఇప్పటికే కృష్ణా, మంజీరా ప్రాజెక్టుల సందర్శన, ‘చలో సెక్రటేరియట్’నిరసన కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ నిర్బంధం... హైదరాబాద్‌లో ఉన్న ఉత్తమ్‌తోపాటు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జలదీక్ష కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా వారిని ఇళ్ల నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు సిద్ధమైన భట్టి విక్రమార్కను ఖమ్మం జిల్లా వైరాలోని ఆయన ఇంట్లోనే నిర్బంధించారు. శాంతియుతంగా ప్రాజెక్టుల సందర్శన చేపడితే ప్రభుత్వానికి నష్టమేముందని, వెంటనే తమను అనుమతించాలని పోలీసులను కోరినా పట్టించుకోలేదని భట్టి మండిపడ్డారు. మరోవైపు సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ను కట్టడి చేశారు. దీంతో కార్యకర్తలతో కలసి పొన్నం రాస్తారోకో చేయగా ఆయన్ను వ్యాన్‌లో తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఎగువ మానేరుకు గోదావరి జలాలను ఎందుకు మళ్లించలేదని ప్రశ్నించారు. సిరిసిల్లను ఎండబెట్టి సిద్దిపేటకు నీళ్లు తీసుకెళ్లారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జలదీక్షకు పూనుకుంటే నియంతృత్వంగా అడ్డుకోవడం సరికాదన్నారు. ఎగువ మానేరును నింపి రైతాంగానికి సాగును అందించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలంటూ గౌరవెల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ తాము ప్రాజెక్టుల వద్దకు వెళ్తుంటే తండ్రీ కొడుకులకు (కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి) చెమటలు పట్టి భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టులను పూర్తి చేస్తే భయమెందుకని ప్రశ్నించారు. వేములవాడలో ఆది శ్రీనివాస్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ సందర్శన కోసం భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లెందు చేరుకున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను శుక్రవారం అర్ధరాత్రే పోలీసులు అదుపులోకి తీసుకొని శనివారం భద్రాచలంలో దైవ దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్ పంపారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగుతోందని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే గత ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా ఆ వెలుగులు కనిపించట్లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలు షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, మల్లు రవితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు, నిరుద్యోగులు టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనపై అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇవే అబద్ధాలు చెబుతున్నాడని, అసలు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలపాలని ప్రాజెక్టులను సందర్శించాలనుకున్నామని, కానీ పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జూన్ 2న కృష్ణా పరివాహక ప్రాజెక్టుల వద్దకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని, నల్లగొండలోని ఎస్సెల్బీసీ ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. మంజీరా డ్యాంను పరిశీలించేందుకు వెళ్తుంటే అరెస్ట్‌చేసి కేసులు పెట్టారని, కరెంటు బిల్లులపై మంత్రులను, అధికారులను కలవాలనుకుంటే వెళ్లనివ్వలేదని చెప్పారు. ఐపీఎస్‌లు కాదు.. కేపీఎస్లు ‘ప్రాజెక్టులు సందర్శిస్తున్నామని డీజీపీకి లేఖ రాసీనా సమాధానం లేదు. సీఎం కేసీఆర్‌కు కొందరు పోలీసు అధికారులు తొత్తులుగా మారారు. ప్రతిపక్షాన్ని తొక్కేయాలని అనుకుంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందనుకోలేదు. రాష్ట్రంలో కొందరు అధికారులు ఐపీఎస్‌లుగా కాకుండా కేపీఎస్‌లుగా పనిచేస్తున్నారు’అని ఉత్తమ్ విమర్శించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర మంత్రులకు, టీఆర్ఎస్ నేతలకు లేని కరోనా ఆంక్షలు కాంగ్రెస్ నేతలకే ఎందుకని ప్రశ్నించారు. మీటింగ్‌లు పెట్టి కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేసేందుకు మాత్రం మంత్రి కేటీఆర్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. తమ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా రోజూ వందల మందితో మీటింగ్‌లు పెడుతున్నాడని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణ కోసమంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను పోలీసులు చూపెడుతున్నారని, ఆ నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ నేతలకే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. దీనిపై డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడాలంటే నోరు మెదపడం లేదని, ఫోన్ కూడా ఎత్తడం లేదని ఉత్తమ్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల వాయిస్‌ను వినిపిస్తామని, ఇది తమ హక్కని, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎదుర్కొని తీరుతామని చెప్పారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్ నేతలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్‌ను కలుస్తామని, కేంద్ర పెద్దలను కలుస్తామని, న్యాయ పోరాటం కూడా చేయబోతున్నామని ఉత్తమ్ వెల్లడించారు. సొంత జిల్లాకే నీళ్లివ్వలేదు మండలిలో ప్రతిపక్ష మాజీ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేట–గజ్వేల్–సిరిసిల్లకు మాత్రమేనా? అని ప్రశ్నించారు. కామారెడ్డి–నిజామాబాద్ జిల్లాలకు నీళ్ల కోసం కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని చెప్పారు. అలా ఖర్చు చేయడం ద్వారా 3 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయి కానీ ప్రాజెక్టు కట్టడం లేదన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ ఆర్మీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సీఎం అయినా సంగారెడ్డి జిల్లాకు నీళ్లు లేవని సొంత జిల్లాకే నీళ్లివ్వని కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నీళ్లెలా ఇస్తారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
సాగునీటిలో తెలంగాణకు ద్రోహం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాగునీటి వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొన్న అనంతరం జల దీక్ష చేపట్టారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కలుగుతున్న నష్టాన్ని ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సాగు నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించామని పదే పదే చెప్పే కేసీఆర్.. ఎగువ, దిగువ ప్రాంతాల వారు నిబంధనలకు విరుద్ధంగా నీటిని తోడుకుని వెళ్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్‌కు నీళ్లు రాకపోతే ఖమ్మం, నల్లగొండ జిల్లా లు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు., దీనిపై రాజకీయాలకతీతంగా అందరూ సమైక్య పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ పోరాటంలో కలసి రాని వారిని ప్రజలు తెలంగాణ ద్రోహులుగానే పరిగణిస్తారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం ఆరేళ్ల క్రితం సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని, అయితే ఇన్నేళ్లు గడిచినా ఆ లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదని, గ్రూప్–1 నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులు ఎదురుచూడటంతోనే సరిపోతోందని చెప్పారు. ప్రశ్నించే వారి గొంతును నొక్కుతున్నారు.. ప్రజల పక్షాన ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ తాము చెప్పిందే వేదమన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని భట్టి విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి, కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలే కారణమని మండిపడ్డారు. -
కాంగ్రెస్ జలదీక్ష భగ్నం
చింతపల్లి/సాక్షి, వికారాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ మంగళవారం తలపెట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లాలో టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను, కొడంగల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పరిగిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తుండగా..: నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పరిశీ లించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసులు నిలువరించారు. మొదటగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చింతపల్లి మండల పరిధిలో ని మాల్ పట్టణానికి చేరుకోగానే అప్పటికే పంప్‌హౌస్ వద్ద ఉన్న పోలీసులు ఆయన కారును బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆయన హైదరాబాద్–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై బైఠాయించడం తో వాహనాల రాకపోకలకు గంటపాటు అం తరాయం ఏర్పడింది. కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో రహదారిపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఆయన్ను అరె స్టు చేసి మాల్ పంప్‌హౌస్‌కు తరలించారు. అనంతరం ఉత్తమ్, జానారెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. వారినీ మాల్ వద్దే అడ్డుకొని మాల్ పంప్‌హౌస్ వద్దకు తరలించారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచడంతో పార్టీ శ్రేణులు పంప్‌హౌస్‌కు తరలివచ్చారు. దీంతో ముగ్గురు నేతల ను చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి గంటపాటు స్టేషన్లోనే ఉంచారు. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ కార్యకర్తలు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించగా 5 గంటలకు నేతలను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది.. పోలీసుస్టేషన్ నుంచి విడుదలైన అనంతరం పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీ ఓ నంబర్ 203ని రద్దు చేసే వరకు పోరాడతామన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై మా ట్లాడకుండా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు. సొంత జిల్లా కు తమను వెళ్లనీయకుండా సీఎం కేసీఆర్ అ వమానపర్చారని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జిల్లాపై పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల జిల్లాలోని ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఎన్నికల సభలో చెప్పిన కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ మేధావిగా చెప్పుకుంటున్నా ఆయన ఒక నియంత అని దుయ్యబట్టారు. కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి వేల మంది హాజరైనప్పుడు అడ్డుకోని ప్రభుత్వం జలదీక్షను భగ్నం చేసేలా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, మధ్యలో నిలిచిపోయి న వాటికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో జలదీక్ష చేపట్టాలనుకున్న రేవంత్‌రెడ్డిని పోలీసులు మంగళవారం కొడంగల్‌లో హౌస్అరెస్ట్ చేశారు. ఆయ న ఇంటి వద్దే దీక్షకు పూనుకోగా అదుపులోకి తీసుకొని కుల్కచర్ల పోలీస్టేషన్‌కు తరలించా రు. అరెస్టుకు ముందుకు రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియంతలా వ్య వహరిస్తున్నారన్నారు. పాలమూరు–రంగారె డ్డి ప్రాజెక్టుకు నిధులు విడుదలచేసి వెంటనే పూర్తి చేయాలని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా, పరిగిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. -
కేసీఆరే స్టార్
సాక్షి, హైదరాబాద్ : దశాబ్దాల ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి సరిగ్గా ఆరేళ్లు. నవజాత రాష్ట్రంగా 2014 జూన్ 2న ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆరేళ్ల వ్యవధిలోనే దేశ యవనికపై తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కారు ఈ ఆరేళ్లలో వ్యవసాయం మొదలుకొని ఐటీ, పారిశ్రామిక రంగం దాకా, ఆరోగ్యం, విద్య నుంచి సంక్షేమం దాకా, సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని విద్యుత్ ఉత్పత్తి దాకా అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోంది. సాహసోపేత పాలనా సంస్కరణలు, సరికొత్త సంక్షేమ, అభివృద్ధి పథకాలకు చిరునామాగా నిలుస్తోంది. మిషన్ భగీరథ, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనలో దూసుకెళ్తోంది. హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పచ్చదనం, పరిశుభ్రత పెంచడం దిశగా అడుగులు వేస్తోంది. ఆరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాగించిన ప్రస్థానంపై అవలోకనం... వేగంగా పాలనా సంస్కరణలు.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలనను పరుగులు పెట్టించే లక్ష్యంతో 2016లో ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో 33 జిల్లాలుగా తెలంగాణ స్వరూపం మార్చుకుంది. వేగంగా జరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 76 మున్సిపాలిటీలు, 30 రెవెన్యూ డివిజన్లు, 131 మండలాలు ఏర్పాటయ్యాయి. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 4,383 గ్రామ పంచాయతీలతో కలుపుకొని మొత్తంగా పంచాయతీల సంఖ్య 12,751కు చేరింది. తండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ 2018 మార్చి 28న చేసిన చట్టంతో కొత్తగా 1,777 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. షెడ్యూల్ ఏరియాలో ఉన్న 1,281 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు కాగా జనాభా ప్రాతిపదికన మరో 688 గ్రామ పంచాయతీలు వారికే రిజర్వు అయ్యాయి. సుదీర్ఘకాలంగా ఉన్న హైకోర్టు విభజన జరగడంతో 2019 జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త హైకోర్టు మనుగడలోకి వచ్చింది. శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భారీగా పోలీసు సిబ్బంది నియామకాన్ని చేపట్టడంతోపాటు పోలీసు శాఖను పునర్వ్యవస్థీకరించింది. దీంతో కొత్తగా ఏడు కమిషనరేట్లతోపాటు 25 పోలీసు సబ్ డివిజన్లు, 31 సర్కిళ్లు, 103 పోలీసుస్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముస్తాబైన అసెంబ్లీ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత.. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడంతోపాటు మాతా, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు 25 జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవజాత శిశువుల కోసం సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)ల సంఖ్యను 18 నుంచి 42కు పెంచడంతోపాటు గర్భిణులు, బాలింతలకు అత్యవసర సేవల కోసం మెటర్నల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఎంఐసీయూ) ఏర్పాటు చేసింది. అంధత్వ రహిత తెలంగాణ నినాదంతో కంటి వెలుగు పథకం ప్రవేశపెట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1.54 కోట్ల మందికి నేత్ర పరీక్షలు జరిపింది. వారిలో 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో డియాగ్నస్టిక్ హబ్‌ల ఏర్పాటు ద్వారా పేదలు 58 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకొనే వెసులుబాటు కల్పించింది. అమ్మ ఒడి పథకం కింద 102 వాహన సేవలతో గర్భిణులను సురక్షితంగా చేర్చడంతోపాటు 104 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వైద్య సేవలను అందిస్తోంది. బాలికా విద్యకు ప్రోత్సాహం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా 661 రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సగం స్కూళ్లను వారికి కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం, యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది. వరంగల్‌లో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు, బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటైంది. వరంగల్‌లో సైనిక్ స్కూల్‌తోపాటు కొత్తగా 15 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రగతికి రెండు కళ్లుగా ఐటీ, పరిశ్రమలు తెలంగాణ ఏర్పాటు నాటికి రూ. 66,276 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2019–20 నాటికి రూ. 1.28 లక్షల కోట్లకు చేరడం రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి అద్దం పడుతోంది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీని విడుదల చేయగా ప్రపంచంలోనే ఐదు అగ్రశ్రేణి కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, సేల్స్‌ఫోర్స్ హైదరాబాద్‌లో వాటి రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఐటీ రంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓవైపు ఫలితాన్ని ఇస్తుండగా టైర్–2, టైర్–3 పట్టణాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లను నిర్మిస్తోంది. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు 65 వేల చదరపు అడుగుల్లో నిర్మించిన ఇంక్యుబేషన్ సెంటర్ ‘టీ–హబ్’, ‘వీ–హబ్’ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తోంది. 2014 నూతన పారిశ్రామిక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన టీఎస్–ఐపాస్ ద్వారా జనవరి 2020 నాటికి రూ. 2,04,000 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్లైన్ విధానం ద్వారా 12,427 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయగా 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్ర పారిశ్రామిక రంగం జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటును సాధించింది. టీఎస్–ఐపాస్ ద్వారా పరిశ్రమలు హైదరాబాద్, ఆ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటయ్యాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8% కాగా తెలంగాణ ఏకంగా 79 శాతం వృద్ధి సాధించింది. సాంస్కృతిక రంగంపై ప్రత్యేక శ్రద్ధ సాంస్కృతిక, క్రీడా, పర్యాటక రంగాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి అనేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలుగు ప్రపంచ మహాసభల నిర్వహణ, అన్ని విద్యాసంస్థల్లో ఒక సబ్జెక్టుగా తెలుగు బోధన వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ స్వీయ ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పలు ఆలయాల పునరుద్ధరణ ప్రారంభమవగా యాదగిరిగుట్టను (యాదాద్రి) ప్రభుత్వం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. అలాగే వేములవాడ, భద్రాద్రి, కొమురవెల్లి మల్లన్న, కురవి వీరన్న తదితర పుణ్యక్షేత్రాలు, నాగార్జునకొండ వంటి బౌద్ధారామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్రంలో బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలకు ప్రభుత్వం అధికారిక హోదా కల్పించింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ హుస్సేన్‌సాగర్ తీరాన 12 ఎకరాల స్థలంలో నిర్మించే అమరవీరుల స్తూపం, స్మృతివనం నిర్మాణ దశలో ఉన్నాయి. మౌలిక వసతుల మెరుగు... రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి నాలుగు లేన్ల రోడ్లు, జిల్లా కేందం నుంచి మండల కేంద్రానికి డబుల్ లేన్, మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆవిర్భావం నుంచి సర్కారు నిధులు కేటాయిస్తూ వచ్చింది. ఇప్పటివరకు 3,150 కి.మీ. జాతీయ రహదారుల మంజూరుతో తెలంగాణలో మొత్తం 5,677 కి.మీ. మేర జాతీయ రహదారుల నెట్వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. మిషన్ భగీరథ పథకాన్ని రూ. 43,791 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి లక్షా 40 వేల కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా 2019 జనవరి నాటికి రాష్ట్రంలోని 23,968 ఆవాసాలకు తాగునీటిని అందించింది. నిరుపేదలకు గూడు కల్పించేందుకు 2,72,763 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడంతోపాటు వార్డులవారీగా అవసరాలను గుర్తించి అభివృద్ధికి అవసరమైన వార్షిక, పంచవర్ష ప్రణాళికల కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు చేపట్టిన హరితహారం ద్వారా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పచ్చదనం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ సంక్షేమానికి పెద్దపీట.. నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళా కారులు తదితరులు సుమారు 32 లక్షల మందికి ప్రతి నెలా ‘ఆసరా’పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అందజేస్తోంది. వికలాంగులకు రూ. 3,016, ఇతరులకు ప్రతి నెలా రూ. 2,016 చొప్పున సామాజిక పెన్షన్లు చెల్లిస్తోంది. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగి రీలకు చెందిన వారికి కల్యాణ లక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ. లక్షా పదహారు వేల చొప్పున అందిస్తోంది. ఆహార భద్రతలో భాగంగా తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి వ్యక్తికీ నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని 17 వేలకుపైగా చౌక ధరల దుకాణాల ద్వారా 87.56 లక్షల కుటుంబా ల్లోని 2.80 కోట్ల మందికి పంపిణీ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల సామాజిక అభివృద్ధి కోసం జనాభా నిష్పత్తి మేరకు నిధుల కేటాయింపు, ఖర్చు కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం–2017 రూపొందించి వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. అన్నదాతకు అండ రైతు సంక్షేమం లక్ష్యంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తున్న ప్రభుత్వం ప్ర తి రైతుకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తోంది. జీవిత బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వ మే చెల్లిస్తోంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ, నీటి తీరువా రద్దు వంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. రైతులను సంఘటిత రంగంలోకి తెస్తూ రైతుబంధు సమితులు ఏర్పాటు చేసింది. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేస్తోంది. నియంత్రిత పద్ధతిలో పంటల సాగును ప్రోత్సహించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలను తిట్టడం మీద పెట్టిన శ్రద్ధను ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై పెట్టడం లేదని, కరోనా సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వలస కార్మి కులు ఎంతమంది ఉంటారో కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకపోవడం ఆశ్చ ర్యంగా ఉందని, కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పరిపాలనలోనూ, రైతుల పంటలను కొనుగోలు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో చేపట్టిన ఒక రోజు సత్యాగ్రహ దీక్షలో కూర్చున్న ఉత్తమ్ మాట్లాడుతూ...ప్రభుత్వ తీరుతో వలస కార్మికుల జీవితాలు నాశనమయ్యాయన్నారు. వలస కార్మికుల కోసం హైదరాబాద్‌లో 400 అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టామని ప్రభుత్వం చెపుతోందని, అవి ఎక్కడ ఉన్నాయనే వివరాలు కూడా లేవన్నా రు. వలస కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వలస కార్మికులు ఊళ్లకు వెళ్లేందుకు రైల్వే శాఖ రూ.50 వసూలు చేస్తోందని, వారి వద్ద డబ్బులు వసూలు చేయవద్దని, కాంగ్రెస్ పార్టీ ఆ ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో వైన్ షాపుల విషయంలో అత్యుత్సాహం చూపవద్దని ఉత్తమ్ కోరారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీలు హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాద వ్, టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నాయకులు బెల్లయ్య నాయక్, దాసోజు శ్రవణ్, మేడిపల్లి సత్యం తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, టీపీసీసీ నేతలు నిరంజన్, బొల్లు కిషన్, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, మానవతారాయ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు కాగా, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కుసుమ కుమార్, మల్లు రవి తదితరులు వారి ఇళ్లల్లో దీక్షలు చేశారు. -
‘నిరుద్యోగ భృతి’ని ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ‘నిరుద్యోగ భృతి’పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రైవేటు రంగ ఉద్యోగులను తొలగించకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బుధవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘అనేక ఐటీ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అనేక ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు విధించాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. లాక్డౌన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం ఒక సంవత్సరం వరకు పరిస్థితి మెరుగుపడకపోవచ్చు. ఈ సమయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి కింద ఇవ్వాలి’అని ఆ ప్రకటనలో ఉత్తమ్ కోరారు. చదవండి: ‘టిమ్స్’కు రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్స్: రేవంత్ రెడ్డి లాక్డౌన్ తర్వాత తెలంగాణలో నిరుద్యోగ యువకుల సంఖ్య రెట్టింపు అవుతుందని, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నమోదైన దాదాపు 24 లక్షలతో సహా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో.. తెలంగాణ రాష్ట్రం రాబోయే కొద్ది నెలల్లో నిరుద్యోగ గణాంకాలలో భారీ పెరుగుదలను చూడబోతోందని, ఈ పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండవ దశ లాక్డౌన్ ముగియడానికి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఉత్తమ్ ఆ ప్రకటనలో కోరారు. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం తీసుకురావాలని, తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితిపై నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
‘రుణమాఫీ’కి సమాయత్తం
రైతులకు కొండంత ఆత్మస్థైర్యాన్నిచ్చి ఆర్థికంగావెసులుబాటు కల్పించిన రుణమాఫీ పథకం అమలుకు సన్నాహాలు మొదలయ్యాయి. పంట రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీ చేసినా.. ముక్కుపిండి వడ్డీ కట్టేలా బలప్రదర్శనకు దిగినా.. సహనంతో అప్పులు చేసి రైతులు కట్టారు. రుణమాఫీ ఆదుకుంటుందనే భరోసాతో ప్రభుత్వంపై భారం వేసి కుటుంబాలను వెళ్లదీస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీ ఎట్టకేలకు పట్టాలెక్కుతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనున్నట్టు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంది. నాలుగు విడతలుగా 25 శాతం చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలోనూ మళ్లీ రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వరుస ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ అమలులో జాప్యం చోటు చేసుకుంది. దీనిపై తెలంగాణ ఆవిర్భావం రోజు అధికారికంగా ప్రకటిస్తారని భావించినా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాని ఊసే లేకుండా పోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రుణమాఫీకి సంబంధించినమార్గదర్శకాలను మూడు రోజుల క్రితమే రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి జారీ చేశారు. కటాఫ్ తేదీ 2018 డిసెంబర్ 11 రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలకు రూపకల్పన చేసింది. రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి జి ల్లాల వారీగా బ్యాంకులు, పంట రుణాల మొ త్తం, రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల వి వరాలు సేకరించింది. గతంలో 2018 డిసెంబ ర్ 11 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకర్లు రుణమాఫీ అర్హులను తేల్చేపనిలో నిమగ్నమయ్యారు. 26 అంశాలతో వివరాలను సేకరించనున్నారు. ప్రభుత్వ ప్రకటన మేరకు నిర్ణీత తేదీ కంటే ముందు బకాయిలు ఉన్న రైతుల వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. రైతు పేరు, ఖాతా నంబర్, ఆధార్ కార్డు, తీసుకున్న రుణం, అసలు, వడ్డీ కలిపి మొత్తం, ఫోన్ నంబర్, తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని సూచించారు. బ్యాంకుల వారీగా వివరాలు ఆరా తీయనుండగా వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 2014లో 4 దఫాలుగా... తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అదే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కటాఫ్ తేదీని నిర్ణయించి ‘రుణమాఫీ’ మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు నాలుగు దఫాలుగా రుణమాఫీ నిధులు విడుదల చేసింది. 2014లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం రైతులు 6,07,813 మందికి గాను రుణమాఫీకి 5,98,990 మంది అర్హత సాధించారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ.2,725.83 కోట్లు కేటాయించింది. రూ.25వేల లోపైతే ఒకేసారి.. 2018 డిసెంబర్ 11 కంటే ముందున్న పంట రుణాలన్నింటిని మాఫీ చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. రుణమాఫీతో సంబంధం లేకుండా తీసుకున్న రుణాలను చెల్లించి మళ్లీ తీసుకోవాలని, రుణమాఫీకి చెందిన డబ్బులు చెక్ రూపంలో నాలుగు విడతల్లో ఇస్తామని ప్రకటించారు. తాజాగా రూ.25వేల లోపు పంట రుణం ఉన్న రైతులకు ఒకేసారి అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు విడతల వారీగా మాఫీ సొమ్ము అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.25వేల లోపు పంట రుణం మొత్తం ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించడంతో సన్న, చిన్నకారు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తక్కువ రుణం ఉన్నా.. విడతల వారీగా రావడంతో అవి వడ్డీకే సరిపోయేవి. రూ.20వేలు రుణం ఉంటే విడతల వారీగా రూ.ఐదు వేల చొప్పున జమ చేశారు. తాజా ప్రకటనతో రూ.25వేల లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు లక్ష మంది ఉంటారని బ్యాంకర్ల అంచనా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5.42 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. అయితే గతంలో గడువులోగా రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ చేయకపోగా అప్పు ఉన్న వారికే విడతల వారీగా ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ముందు జాగ్రత్తగా చాలామంది రెన్యువల్ చేసుకోలేదు. నిర్ణీత తేదీని తెలియజేసి రుణాలు చెల్లించినా.. రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించడంతో ఈ సీజన్లో తిరిగి బకాయిలు చెల్లించి కొందరు రైతులు రుణాలు పొందారు. ఇప్పుడు మాఫీ చేస్తే వడ్డీ సొమ్మును ఎప్పటి వరకు లెక్కిస్తారనేది తేలాల్సి ఉంది. సందేహాలెన్నో..? గతంలో జరిగిన ‘రుణమాఫీ’లో ఎదురైన స మస్యలు మళ్లీ పునరావృతమవుతాయా అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలేవీ రాలేదని వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లు చె బుతున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చే యాల్సి ఉంది. చాలామందికి రెండు ప్రాంతా ల్లో భూములు ఉండి పాసు పుస్తకాలు ఉన్నా యి. వేర్వేరు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం ఉంది. రెండు మాఫీ చేస్తారా.. ఏదో ఒకటి చేస్తారా.. అలాగే కుటుంబానికి రూ.లక్ష మాఫీ చేస్తే ఒకే కుటుంబంలో ముగ్గురి పేరున కలిపి రూ.1.25 లక్షల రుణం ఉంటే ఎంత మాఫీ అవుతుంది. గత రుణమాఫీలో మొదట బంగారం తాకట్టుపెట్టిన రుణాలకు వర్తించలేదు. తదుపరి ఆదేశాలతో కొంతమందికి మాఫీ అయింది. తాజాగా బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకున్నారు. బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను పంట రుణాల కింద చూపవద్దని రిజర్వు బ్యాంకు ఆదేశించింది. వాటిని పరిగణలోకి తీసుకుంటారా.. లేదా, రుణమాఫీతో సంబంధం లే కుండా పంట రుణం కింద తీసుకున్న రుణా న్ని కొంతమంది రైతులు గడువులోగా చెల్లించారు. ఇలాంటి వారు గత రుణమాఫీలో ఉండగా వీరికి మాఫీ వర్తించలేదు. ఈ దఫా రు ణాలను సకాలంలో చెల్లించిన వారికి మాఫీ చే స్తారా? దీర్ఘకాలంగా బ్యాంకులకు అప్పులు క ట్టకుండా మొండి బకాయిదారుల జాబితాలో చేరిన వారికి మాఫీ ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రుణమాఫీ చేసిన సందర్భంలో రైతులు తీసుకున్న పంట రుణాలను కొన్ని బ్యాంకులు రీషెడ్యూ లు చేయడంతో సంబంధిత రైతులకు వర్తించలేదు. అందులో చాలామంది ఇప్పటికీ రుణాలను చెల్లించలేదు. వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. వివరాలు సేకరిస్తున్నాం రూ.లక్షలోపు అప్పు తీసుకున్న రైతులు ఎంతమంది ఉంటారో స్పష్టంగా చెప్పలేం. ఈ వివరాలు ఇవ్వాలని ఆయా బ్యాంకర్లకు చెప్పాం. వారు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో ఈ సమాచారం మాకు అందుతుంది. అలాగే మార్గదర్శకాలు సైతం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. – నాగరాజకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్, మహబూబ్‌నగర్ జిల్లా ఏకకాలంలో మాఫీ చేయాలి రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలి. రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు సైతం రూ.లక్ష వరకు బ్యాంకుల్లో రుణం తీసుకున్నారు. కొందరు మాత్రమే తక్కువ రుణం తీసుకున్నారు. చిన్న రైతులకు ప్రాధాన్యతనివ్వడం మంచిదే. అయితే రూ.లక్ష లోపు రుణం ఉన్న రైతులకు నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తే ఆ డబ్బు వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది. – వెంకటేశ్వర్‌రెడ్డి, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ మండలం -
‘రేవంత్‌కు మేము మద్దతుగా ఉన్నాం’
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని తప్పుడు కేసులు బనాయించి రేవంత్‌రెడ్డిని వేధిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి తామంతా పూర్తి మద్దతుగా ఉన్నామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై పోలీసులు ఏ మాత్రం ప్రాధాన్యం లేని, చిన్న చిన్న కేసులు పెట్టారన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మరోసారి కలిసి ఎంపీగా రేవంత్ రెడ్డి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని వివరిస్తానని చెప్పారు. సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసి, మొత్తం వ్యవహారంపై విచారణ జరపమని కోరతామన్నారు. హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి రేవంత్ రెడ్డి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ( బెయిల్ ఇవ్వండి: రేవంత్‌రెడ్డి ) చదవండి : తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు -
ప్రయాణికుల్లా వచ్చి...
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందంటూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులు ఇటీవల ఎన్నడూలేని విధంగా అసెంబ్లీ గేట్ నంబర్–2 వరకు పెద్దసంఖ్యలో రాగలిగారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాల నుంచి ముందస్తు వ్యూహంతో బయలుదేరిన ఏబీవీపీ కార్యకర్తలు సాధారణ ప్రయాణికుల మాదిరిగా, గరిష్టంగా పది మంది చొప్పున ఆర్టీసీ బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించారు. జెండాలు ఎవరి కంటా పడకుండా వాహనాలు దిగే వరకు జేబుల్లోనే ఉంచుకున్నారు. అసెంబ్లీ చుట్టూ ఉన్న తెలుగు యూనివర్సిటీ, నిజాం కళాశాల వైపుల నుంచి బస్సులు, ఆటోల ద్వారా వచ్చి.. రవీంద్రభారతి, ఆ చుట్టుపక్కల దిగారు. ఉదయం 11.20 కి ఒక్కసారిగా 1, 2 నంబర్ల అసెంబ్లీ గేట్ల వైపు దూసుకొచ్చారు. గేట్–2 వద్దకు చేరుకుని, ఎక్కేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారిని కిందికి దింపే క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించిన వారిని కిందకు లాగేశారు. లాఠీచార్జిలో రాష్ట్ర నాయకులు పృథ్వి సొమ్మసిల్లి పడిపోయాడని, నిహారిక, నరేంద్ర, మల్లికార్జున్ల చేతులకు తీవ్ర గాయాలయ్యాయని ఏబీవీపీ నాయకులు అంబాల కిరణ్, సుమన్‌శంకర్, రాఘవేంద్ర తెలిపారు. ముట్టడిలో పాల్గొన్న ఏబీవీపీతో పాటు పీడీఎస్‌యూ నాయకులు 224 మందిని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్‌చేసి నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలిం చారు. వీరిపై 151 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొందరు కార్యకర్తలపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు వారికి నోటీసులిచ్చి విడిచిపెట్టారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, వర్సిటీలలో వైస్చాన్సలర్లను నియమించాలని, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్లతో ఏబీవీపీ ఈ కార్యక్రమం చేపట్టింది. పీడీఎస్‌యూకు చెందిన విద్యార్థి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. 24 గంటల్లోగా సీఎం కేసీఆర్ స్పందించి, లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే.. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునివ్వడానికీ వెనుకాడబోమని హెచ్చరించింది. అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
నిధుల్లేక పురపాలికలు నిర్వీర్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనపై బీజేపీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. ఆరేళ్లలో టీఆర్ఎస్ పాలనలో పురపాలికలు నిధులు లేక పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆరోపించింది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తూ బీజేపీ ముందుకు వెళ్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా మోసపోకుండా ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ వైఫల్యాలపై 52 అంశాలతో రూపొందించిన చార్జ్‌షీట్‌ను బీజేపీ రాష్ట్ర కార్యాయంలో గురువారం లక్ష్మణ్ విడుదల చేశారు. అలాగే పార్టీ పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం టీఆర్ఎస్ అండతోనే ఇప్పుడు భైంసా వరకు వెళ్లిందని, ఎంఐఎం అజెండాను అమలు చేస్తున్న టీఆర్ఎస్కు ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయవద్దన్నారు. ఎంఐఎంతో లాలూచీ లేకపోతే భైంసాలో టీఆర్ఎస్ అభ్యర్థు«లను ఎందుకు పోటీ లో ఉంచలేదని, ఒవైసీకి కేసీఆర్ లొంగిపోయారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సమస్య లేదని, కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలన్నారు. పట్టణాలను డల్లాస్‌లా తయారు చేస్తామని, హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులే పట్టణాలను ఆదుకుంటున్నది వాస్తవమా.. కాదా.. అన్నది కేటీఆర్ చెప్పాలన్నారు. -
అన్ని రంగాల్లో విఫలమైన కేసీఆర్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రెండోసారి సీఎం అయిన కేసీఆర్ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎంగా కేసీఆర్ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారని ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల, ఆందోళనల, అవినీతి తెలంగాణగా మార్చారని ఆరోపించారు. మంత్రులే తమ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. -
ప్రజలకు ఒరిగిందేమీ లేదు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఏడాది అంతా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే గడిచిపోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దిశ హత్య, హాజీపూర్, వరంగల్, ఆసిఫాబాద్, జడ్చర్ల ఘటనలు దేశవ్యాప్తం గా తెలంగాణ పరువు తీశాయని, ఈ ఏడాది తెలంగాణ అశాంతి నిలయంగా మారిందని శుక్రవారం ఆయన ఓప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. -
కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు షాక్..
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. సచివాలయం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు నో చెప్పింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. అయితే కొత్త సచివాలయ భవన సముదాయనిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను నేడు తెలంగాణ కేబినెట్ ఆమోదించనున్న వార్తల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువడటం గమనార్హం. కేబినెట్ భేటీ అనంతరం సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాలని భావించిన కేసీఆర్ సర్కార్‌కు కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దు : హైకోర్టు అలాగే మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని మరో కేసులో హైకోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల కమిషన్ పాటించిన విధానాన్ని పాటించాలని సూచించింది. అలాగే ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. దసరా సెలవుల తర్వాత దీనిపై విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. సెలవుల నేపథ్యంలో అత్యవసర బెంచ్‌ల ఏర్పాటు హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో కేసుల విచారణకు అత్యవసర బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. ఈ నెల 9,10 తేదీలలో డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, దసరా పండుగ సందర్భంగా ఈ నెల 3 నుంచి 11 వరకు హైకోర్టుకు సెలవులు ఉంటాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ప్రజల ఓపిక నశిస్తోంది : లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజల ఓపిక నశిస్తోందని, ప్రజలు తిరగబడితే ఎన్నికలు ఎప్పుడైనా జరుగవచ్చని, ముందస్తు రావచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. తాము మాత్రం ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉండాలనే అనుకుంటున్నామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వతీరుతో ప్రజలు విసిగిపోయారని, బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోదని, అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. హుజూర్నగర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటామన్నారు. అక్కడి టీఆర్ఎస్ నాయకత్వంపై కేసీఆర్‌కు నమ్మకంలేకనే మంత్రులను, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ భయంతోనే కేబినెట్ విస్తరణ.. హుజుర్నగర్లో తమకు 12 వేల సభ్యత్వం ఉంద ని లక్ష్మణ్ అన్నారు. హుజుర్నగర్ టికెట్ కోసం రామకృష్ణ, జైపాల్‌రెడ్డి, రవీంద్రనాయక్, రాంమోహన్ రెడ్డి, శ్రీకళారెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. శంకరమ్మ తమను కలవలేదని, ఆమె టీఆర్ఎస్లో ఉందని పేర్కొన్నారు. ఆమె బయటకు వచ్చి తమను కలిస్తే తప్పకుండా ఆశ్రయం కల్పిస్తామన్నారు. హుజూర్‌నగర్‌లో కేసీఆర్ డబ్బుతో గెలువాలని చూస్తున్నారని, కానీ అక్కడి ప్రజలు దేశభక్తి కలిగిన వారని, బీజేపీని ఆదరిస్తారన్నారు. బీజేపీ భయంతోనే సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేపట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మీడియా కన్వీనర్ సుధాకరశర్మ, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది : కిషన్ రెడ్డి
సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని, పేద ప్రజలకు 5 లక్షల రూపాయల విలువ చేసే ‘ఆయుష్మాన్ భవ’ రాష్ట్రంలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని, కల్వకుంట్ల, ఓవైసి రెండు కుటుంబాలకు తెలంగాణను తాకట్టు పెట్టినట్లుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో రెండోసారి వరుసగా కాంగ్రెస్సేతర ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రధాని కావడం నరేంద్ర మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు. కులం, మతం, కుటుంబం అంటూ లేకుండా దేశం కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీనని తెలిపారు. ప్రధాని పనితీరు, అభివృద్ధిని కాంక్షిస్తూ బిజేపిలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. -
‘రాష్ట్రంలో నిరంకుశ పాలన’
టవర్‌సర్కిల్ (కరీంనగర్) : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. గులాబీ జెండా ఓనర్లం తామేనని మంత్రి ఈటల రాజేందర్.., రాష్ట్రం పేరు తప్ప పాఠశాలలు ఏమీ మారలేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఏకఛత్రాధిపత్యాన్ని బయటపెట్టాయన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోవిలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను హుందాగా స్వీకరించాల్సిందిపోయి, బెదరగొడతామనడం ప్రజల గొంతు నొక్కడమేనన్నారు. యూరియా కొరత సీఎం నియోజకవర్గంలో కూడా ఉన్నదని, రైతులు చెప్పులను లైన్లలో పెట్టే దృశ్యాలు కన్పించడం దురదృష్టకరమన్నారు. యాదాద్రి ఆలయంలో స్తంభాలపై కేసీఆర్ బొమ్మ చెక్కడం, ఆయన రాచరిక పోకడలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని హితవుపలికారు. కాగా, తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు విమోచనం గురించి తెలియజేసేందుకే ఈనెల 11 నుంచి 17 వరకు వారోత్సవా లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా: గంగుల
-
గవర్నర్ చేతికి కొత్తమంత్రుల జాబితా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని టీఆర్ఎస్ నేత గుంగుల కమలాకర్ తెలిపారు. కేబినెట్లో చోటు దక్కించుకున్న ఆయన ఇవాళ సాయంత్రం మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని అన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కాగా తెలంగాణ కేబినేట్ విస్తరణలో భాగంగా మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారయ్యాయి. తొలిసారిగా కేసీఆర్ కేబినేట్ ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. ఇప్పటికే మంత్రుల జాబితాతో రాజ్‌భవన్ వెళ్లిన కేసీఆర్.. ఆ జాబితాను గవర్నర్‌కు అందజేశారు. సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లోకొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు కేటీఆర్, హరీశ్ రావు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చదవండి: కేబినెట్లోకి ఆరుగురు -
పేద విద్యార్థులకు విదేశీ విద్య
సాక్షి, నల్లగొండ : ఒకప్పుడు పేద విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్షగానే ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక విద్యానిధి పథకాన్ని చేపట్టింది. ఆయా శాఖల వారీగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను అర్హత ఆధారంగా ఎంపిక చేసి విదేశాల్లో పీజీ చదువులకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దీంతో పేద విద్యార్థులకు విదేశీ విద్య సులభతరం అయింది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. గత సంవత్సరం 14 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందించగా విదేశాల్లో చదువుతున్నారు. ఈ సంవత్సరం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గతంలో విదేశీ చదువుల కోసం రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే అది వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా కొంతమందికే కొద్దిమొత్తంలో ఇచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలను సడలించడంతో ఆ పథకంతో మ రింతమందికి మేలు చేకూరుతోంది. నిబంధనలు సడలించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు నిబంధనల్లో సడలింపు తీసుకొచ్చింది. గతంలో విదేశీ విద్యను అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకోవాలంటే రూ. రెండున్నర లక్షలు మాత్రమే ఉండాలి. రూ.10లక్షలు కూడా రుణం ఇచ్చేవారు కాదు. అదికూడా దరఖాస్తు చేసుకున్నవారిలో కొంతమందికే ఇచ్చేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకంలో సమూలంగా మార్పులు చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం అనే పేరుతో నామకరణం చేశారు. ఈ పథకం కింద విద్యార్థులు విదేశాల్లో అభ్యసించాలంటే ఇక్కడ డిగ్రీలో 60 శాతం మార్కులు కచ్చితంగా సాధించి ఉండాలి. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.2.50లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. విదేశీ విద్యకు గతంలో రూ.10లక్షలు ఇవ్వగా ప్రస్తుతం దాన్ని రూ.20లక్షలకు పెంచింది. పది దేశాల్లో చదివేందుకు అవకాశం యూఎస్, లండన్, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, జపాన్, న్యూ జిలాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా రూ.20లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తుంది. దీంతో పాటు వీసా, విమాన చార్జీల ను కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఇం దుకు సంబంధిత డిగ్రీలో 60శాతం మార్కులు సాధించడంతో పాటు విదేశీ యూనివర్శిటీలు నిర్వహిం చిన జీఆర్‌ఈటీ, టోఫెల్, ఐఈఎల్టీఎస్ తదితర లాంగ్వేజీ కోర్సుల్లో అర్హత కూడా సాధించి ఉండాలి. అదే విధంగా విదేశీ యూనివర్సిటీల్లో సీట్ వచ్చి ఉండాలి. మీసేవ నుంచి పొందిన కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రంతోపాటు వీసా, పాస్‌పోర్ట్ కలిగి ఉండి అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2018–19లో 14 మంది విదేశాలకు.. 14 మంది విద్యార్థులు గత సంవత్సరం పీజీ విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లారు. ఇందులో 8మంది యూఎస్‌లో, ఐదుగురు ఆస్ట్రేలియాలో, ఒకరు కెనడాలో చదువుతున్నారు. 11మందికి రూ.20లక్షల చొప్పున, ముగ్గురికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సంవత్సరం దరఖాస్తులకు ఆహ్వానం ఈ సంవత్సరం విదేశీ విద్య కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో ఇద్దరు దరఖాస్తులు చేసుకున్నారు. వారి ఎంక్వయిరీ పూర్తి చేశారు. ఆ ప్రక్రియ పూర్తయితే విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. విద్యానిధితో ఎందరికో ఉన్నత విద్య ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకునే అవకాశం కలుగుతుంది. ఆర్థిక స్థోమత లేని వారు విదేశీ చదువులకు దూరం అవుతున్నారు. ప్రభు త్వ ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ఎంతోమంది ఆర్థికంగా వెనుకబ డిన విదేశాల్లో ఉన్నత విద్యను అ భ్యసించేందుకు అవకాశం కలి గింది. దరఖాస్తుకు గడువు ఉంది. – సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్‌కుమార్ -
‘తీన్మార్ మల్లన్నకు రక్షణ కల్పించాలి’
గన్‌ఫౌండ్రీ: తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని బీసీ కులాల సమన్వయ వేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జూలూరి మహేష్‌గౌడ్ అన్నారు. సోమవారం నిజాం కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్న మల్లన్నను కొందరు నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి మల్లన్నకు ప్రాణాపాయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట చేస్తున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై ప్రజలకు వివరిస్తున్నందుకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. సమావేశంలో లక్ష్మీనారాయణ, సందీప్, మల్లేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం నయీమ్ డైరీని బయటపెట్టాలి
-
‘ఐటీగ్రిడ్ మాదిరిగా కేసు నమోదు చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను దెబ్బతీస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర వేదిక’పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచార వివరాల్ని 25 ప్రభుత్వ శాఖల నుంచి సేకరించి రూపొందించే సమగ్ర నివేదిక ఉద్దేశాలను వెల్లడించాలని అన్నారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రజల ఫుట్‌ప్రింట్ కూడా లభిస్తుందన్న జయేశ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఐటీగ్రిడ్ మాదిరిగానే.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం చోరీ చేసిందని ఐటీగ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని శ్రవణ్ గుర్తుచేశారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టి గత ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తిపోశారని అన్నారు. మరి తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కేసు పెడతారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాల్ని క్రోడీకరించి దుర్వినియోగానికి తెర తీసిందని మండిపడ్డారు. ప్రజల అనుమతి లేకుండా అధికారులు వారి వివరాల్ని క్రోడీకరించడం చట్ట విరుద్ధమన్నారు. వ్యక్తిగత సమాచారం వెల్లడవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఆధార్‌ను అన్ని పథకాలకు ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టే ఆదేశించిందని, పౌరుల ఫుట్‌ప్రింట్ కూడా తమవద్ద ఉంటుందని ఐటీ కార్యదర్శి అనడం ఆందోళన కలిగిస్తోందని శ్రవణ్ చెప్పారు. గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదన్న గ్యారెంటీ ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ కిందకు వచ్చే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తామని తెలిపారు. -
‘విజ్ఞప్తులు పట్టించుకోకుండా పునర్విభజన చేశారు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల డీ లిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ ఆరోపించారు. మున్సిపాలిటీల పునర్విభజనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు బుధవారం గాంధీభవన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా మున్సిపాలిటీల పునర్విభజన చేశారని మండిపడ్డారు. 3385 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లలో కూడా అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే వివిధ వేదికల ద్వారా న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. వంశీచంద్ మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వార్డుల విభజన చేసిందని ఆరోపించారు. దీనిపై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ సుదీర్ఘంగా చర్చిందని తెలిపారు. మున్సిపాలిటీల్లోని ప్రజలు వార్డుల పునర్విభజనపై ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొన్నం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ వార్డులకు సంబంధించిన వినతుల కోసం గుడువును పెంచాలని కోరారు. స్థానిక నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాదమని తెలిపారు. -
‘టీఎస్ ఆర్టీసీని విలీనంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవు’
-
‘టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనలు లేవని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రవాణా శాఖ ఆదాయంలో దేశంలోనే నాల్గో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ మధ్య ఆర్టీఏలో కార్డ్స్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఐదు వేల రిబ్బన్స్ అవసరం ఉంటే రెండు వేలు మాత్రమే అందించారని అన్నారు. 2.30లక్షల కార్డ్స్ ప్రింట్ చెయాల్సి ఉందన్నారు. వీటిని రాబోయే 15రోజుల్లో ప్రింటింగ్ చేస్తామని తెలిపారు. రవాణా శాఖలో మరిన్ని మార్పులను తీసుకొస్తామని అన్నారు. తెలంగాణ రవాణా శాఖపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీ 15రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం ఫిర్యాదలు అందించడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి నెలకొకసారి ఫిర్యాదులపై మంత్రి కార్యాలయానికి రిపోర్ట్ ఇస్తుందన్నారు. ఆర్టీఏలో మొబైల్‌యాప్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. 2018-19లో ఏడు కోట్ల పర్మిట్ ఫీజులను వసూళ్లు చేశామని ప్రకటించారు. -
ఇంత దౌర్భాగ్య పాలన ఊహించలేదు: జీవన్‌రెడ్డి
జగిత్యాల: ‘రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అందరికీ ఆదర్శంగా ఉంటుందని అనుకున్నాం. అయితే ఇంత దౌర్భాగ్య పాలన ఉంటుందని ఊహించలేదు. శాసనసభలో ప్రశ్నించే గొంతు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జగిత్యాలలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో కలసి ఎన్నికల్లో పోటీ చేసిందని, కానీ వారు ఎమ్మెల్యేలను బెదిరించి తమ పార్టీ లో చేర్చుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడకు పోతోందని ఆరోపించా రు. ప్రశ్నించే వారు లేకుంటే చట్ట సభలు ఎందు కన్నారు. స్పీకర్‌కు సైతం స్వతంత్రం లేకుండా పోయిందన్నారు. ఎంఐఎం పార్టీ ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరంగా ఉందన్నార -
కారులో ‘నామినేటెడ్’ జోరు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో పదవుల పందేరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే వరుసగా రాష్ట్రస్థాయి పదవులను భర్తీ చేయనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నియమావళి అమలు గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వంలోని అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు. పార్టీ మారడంతో కొందరు ఇదే నిర్ణయం తీసుకున్నారు. మరికొందరి పదవీకాలం గడువు త్వరలో ముగియనుంది. అసెంబ్లీ, లోక్‌సభ, ఎమ్మెల్సీ, జెడ్పీ ఎన్నికల్లో అవకాశం రాని జాబితా ఆధారంగా నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ నేతలకు అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 54 చైర్మన్ పదవులను భర్తీ చేసింది. ప్రస్తుతం ఖాళీలు... అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి టి.నర్సారెడ్డి, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి ఎస్.బేగ్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వీలుగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మూసీ పరివాహక సంస్థ చైర్మన్ ప్రేంసింగ్ రాథోడ్, సెట్విన్ చైర్మన్ మీర్ ఇనాయత్‌అలీ బాక్రి తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన శేరి సుభాశ్‌రెడ్డి భూగర్భ గనుల సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ 12 పదవులను వెంటనే భర్తీ చేసే అవకాశం ఉంది. నెలాఖరులో మరికొన్ని... 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాల చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. అధికార భాషా సంఘం చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్‌రావు, అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్, వైద్య సేవలు, వసతుల కల్పన సంస్థ చైర్మ న్గా పర్యాద కృష్ణమూర్తి పదవులను ఏడాదిపాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ ఎం.భూంరెడ్డి, టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ సి.హెచ్.రాకేశ్‌కుమార్, గిరిజన సహకార సంస్థ చైర్మన్ డి.మోహన్‌గాంధీ నాయక్, ఫిల్మ్, టెలివిజన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ పుస్కూరు రామ్మోహన్రావు పదవీకాలం మే 27తో ముగియనుంది. అక్టోబర్‌లో... గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ కె.రాజయ్యయాదవ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి పదవీకాలం 2019, అక్టోబర్‌లో ముగుస్తుంది. గత ప్రభుత్వంలో వీరికి మాత్రమే మూడేళ్ల పదవీకాలం చొప్పున ఇచ్చారు. మిగిలిన చైర్మన్లకు గరిష్టంగా రెండేళ్ల చొప్పున ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన చైర్మన్ల పదవీకాలం సైతం దశలవారీగా పూర్తి కానుంది. -
విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాలూచీపడటం వల్లనే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇంటర్ కుంభకోణాలకు నిరసనగా హిమాయత్ నగర్ ఏఐటీయూసీ నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు నల్ల చొక్కాలతో సీపీఐ పార్టీ తలపెట్టిన నిరసన ర్యాలీను పోలీసులు ఏఐటీయూసీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య అనేది ఓ మలుపు వంటిదని... ఏ రంగానైన ఎంచుకోవాలంటే తప్పనిసరిగా ఇంటర్ పాస్ అవ్వాలని అన్నారు. అటువంటి ప్రాధాన్యత ఉన్న ఇంటర్ విద్యలో బోర్డ్ తప్పిదాల వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయలేదన్నారు. ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు అకాడమిక్ ఇయర్ కోల్పోయారని నారాయణ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డ్ కుంభకోణం పై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేపట్టి ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరినా సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. అనంతరం ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్న సీపీఐ నాయకులతో పాటు నారాయణను కూడా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. -
62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా భారీగా ధాన్యం దిగుబడి పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ 11 లక్షల మంది రైతుల నుండి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో ఖరీఫ్‌లో 3,297 కొనుగోలు కేంద్రాల ద్వారా 8,09,885 మంది రైతుల నుండి 40.41 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రబీలో ఇప్పటివరకు 3,447 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.52 లక్షల మంది రైతుల నుండి 22.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిం దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర పంటకు కనీస గిట్టుబాటు ధర లభిస్తుందన్న భరోసాతో రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు, కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్‌ఫోన్ ద్వారా అందించేలా, కనీస మద్దతు ధర చెల్లింపులతో రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్) సాఫ్ట్‌వేర్‌ను పౌరసరఫరాల శాఖ అభివృద్ధి చేసింది. రేషన్ డీలర్ల నుంచి గోనె సంచులను సేకరించింది. ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా ఏరోజుకారోజు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఫిర్యాదుల స్వీకరణకు పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు సీనియర్ అధికారులతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333, వాట్సప్ నంబర్ 7330774444లను అందుబాటులో ఉంచింది. కంట్రోల్ రూంకు 506 ఫిర్యాదులు రాగా 477 పరిష్కరించింది. ముమ్మర పర్యటనలు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నల్లగొండ, సూర్యాపేట్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. అకాల వర్షాలు, మండుటెండల నేపథ్యంలో ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సూచనల మేరకు కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రతిరోజూ జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. -
కాళేశ్వరంపై శ్వేతపత్రం ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు లేకపోతే నిధుల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని అన్నారు. ఇష్టానుసారంగా ప్రాజెక్టు వ్యయాలను పెంచుతున్నారని, రూ.42 వేల కోట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచేశారని, అలాగే 2014లో రూ.39 వేల కోట్లు ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచేశారని అన్నారు. తద్వారా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతోందన్నారు. అసలు తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసి విచారణ జరపాలని కోరనున్నట్లు తెలిపారు. ఇక కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ అనేది గోడ మీద పిల్లిలాంటిదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ గానీ, చంద్రబాబు చెప్పే మహాకూటమి గానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, అవినీతిపరులతో చేతులు కలిపిన బాబు.. మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపరులపై మోదీ ఉక్కుపాదం మోపడంతో చంద్రబాబు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇక తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 6 స్థానాల్లో బీజేపీ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. -
‘రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది’
యాదగిరిగుట్ట (ఆలేరు): రానున్న రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే సీఎం కేసీఆర్ దాచిన సొమ్మును, అవినీతిని బయటపెడతామని, కొడుకు, బిడ్డ సంపాదించిన రూ.50 కోట్ల సొమ్మును బయటకు తీసుకొస్తామని పేర్కొన్నారు. ‘కోమటిరెడ్డి సోదరులిద్దరం వైఎస్సార్ అభిమానులం. ఇచ్చిన మాటను ఆ మహానేత ఎలా నిలబెట్టుకున్నారో.. అలాగే మేమూ ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటాం. కార్యకర్తలకు అండగా నిలుస్తాం’ అని అన్నారు. ఇప్పటి కే రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నా రు. రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దింపే బాధ్యత కోమటిరెడ్డి సోదరులిద్దరం తీసుకున్నామన్నారు. -
కేసును సీబీఐకి అప్పగించాలి : భట్టి
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ అవకతవకలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరినా సంస్థకు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోతే వెంటనే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అర్హత, అనుభవం లేని గ్లోబరినా సంస్థకు అప్పజెప్పి లక్షలాది మంది విద్యార్థుల జీవితాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై, ఇంటర్ బోర్డ్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబరినా సంస్థపై కేసు నమోదైనప్పటికీ తెలంగాణలో ఆ సంస్థకు బాధ్యతలు ఎలా అప్పగించారని నిలదీశారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల స్వప్రయోజనాల కోసమే అలా చేశారని ఆరోపించారు. -
‘గంటలు గంటలు సమీక్షలు చేసే సీఎం ఎక్కడా..?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలు, ఇంటర్ బోర్డు అవకతవకలపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల గందరగోళంపై మంగళవారం ఆయన సీఎస్‌ను కలిశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షల్లో తప్పామనే మనోవేదనతో 16 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మధ్య గొడవ అని మంత్రి, మాస్ హిస్టీరియాతో ఫలితాల్లో గందరగోళం నెలకొందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. గంటలు గంటలు సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను వదిలేసి గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ ఫలితాల బాధ్యత ఎలా అప్పగించారని ప్రశ్నించారు. వీటన్నిటిపై న్యాయ విచారణ జరగాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం.. ఫలితాలు తారుమారైన పిల్లల తల్లిదండ్రులు నిరసన తెలుపుతుంటే నిర్బంధిస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం చేశారు. పోలీస్ జులుంతో బీజేపీ కార్యకర్తలను చితకబాదారని ఆరోపించారు. ఇప్పటికే ఎంఎసెట్ మూడుసార్లు నిర్వహించారని, గ్రూప్ 2 వాయిదా వేశారని విమర్శలు గుప్పించారు. విద్యావ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థులు తొందరపాటు చర్యలకు దిగొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ వారికి అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యం, గ్లోబరీనా సంస్థ అవకతవకలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతామని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు దిష్టి బొమ్మలు దగ్దం చేస్తామని చెప్పారు. -
తెలంగాణ రెవెన్యూశాఖలో సంస్కరణలు
-
రైతుబంధే శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్కు రైతు బంధు పథకం ఓట్ల వరదాయినిగా మారింది. గంపగుత్తగా ఓట్లు పడేలా ఇది ఉపయోగపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు పథకమే టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. రైతు బంధుతో లబ్ధి పొందిన అన్నదాతలు అనేక మంది ఆ పార్టీని ఆశీర్వదించి ఊహించని విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ పథకం ఓట్ల వర్షం కురిపిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. దీంతో ఈ పథకంపై పార్టీ శ్రేణులు పెద్దెత్తున ప్రచారం చేస్తున్నాయి. వచ్చే మే నెలలో మరోసారి ఖరీఫ్ పెట్టుబడి సాయం అందుతుందని చెబుతున్నాయి. వచ్చే సీజన్ నుంచి ఎకరానికి రూ.10 వేలు... రైతు బంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలే కాక ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించి ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దీని ఆధారంగా పీఎం–కిసాన్ పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టింది. సీజన్ ప్రారంభానికి ముందే సాగు ఖర్చు సహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఇవ్వడమే దీని లక్ష్యం. ఖరీఫ్, రబీలో ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.4 వేలు ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ ప్రకారం రాష్ట్రంలో 2018–19 ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులిచ్చి రూ. 5,256 కోట్లు అందజేశారు. రబీ సీజన్ కింద 43.60 లక్షల మందికి రూ. 4,724 కోట్లు రైతు బంధు సొమ్ము ఇచ్చారు. రెండు సీజన్లు కలిపి దాదాపు రూ. 10 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో చేరాయి. దీంతో రైతులంతా టీఆర్ఎస్కు ఓట్ల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా వచ్చే ఖరీఫ్ నుంచి ఏడాదికి ఎకరాకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల్లో మరింత ఊపు వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లోనూ తమకు లాభిస్తుందని అధికార పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీంతోపాటు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్ పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 19.04 లక్షల రైతు కుటుంబాలకు రూ.380.80 కోట్లు బ్యాంకు ఖాతాలకు చేరాయి. ఇంకా 7.25 లక్షల మంది రైతులకు మాత్రం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత వారికి రూ.145.04 కోట్లు వస్తాయని అంటున్నారు. రెండు విధాలా లాభం జరుగుతుండటంతో రైతులు టీఆర్ఎస్ను ఆశీర్వదిస్తారని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇది కేంద్ర పథకమైనా రాష్ట్ర అధికారుల ద్వారానే వస్తుండటంతో టీఆర్ఎస్కే ప్రయోజనం కలుగనుందన్నది వారి వాదన. ఒకేవైపు కోటి ఓట్లు... రాష్ట్రంలో తాజా లెక్కల మేరకు 2.96 కోట్ల మందికి పైగా ఓటర్లున్నారు. గత ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం పొందారు. అంటే భార్యాభర్తలను కలిపి చూసినా రైతు బంధు సాయం అందుకున్నవారివే కోటి ఓట్లు ఉంటాయి. వారి పిల్లలు, వారికి ఓట్లు ఉంటే మరో 25 లక్షల మంది ఉంటారు. అందులో ఇతర పార్టీలకు కొన్ని పోయినా ఒక అంచనా ప్రకారం నికరంగా కోటి ఓట్లు తమకు పడతాయన్నది టీఆర్ఎస్ వర్గాల ఆశాభావం. పైగా రైతు బంధు ద్వారా లబ్ధిపొందినవారిలో 68 శాతం మంది రైతులు ఐదెకరాల్లోపు వారే. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పైగా గ్రామీణ ఓటర్లు దాదాపు 40 శాతంపైగా ఉంటారని అంచనా. కాబట్టి 16 లోక్‌సభ సీట్లు కచ్చితంగా తమ ఖాతాలోనే పడతాయని టీఆర్ఎస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. -
‘నిరాశాజనకంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్’
సాక్షి, హైదరాబాద్: రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లా డుతూ.. ‘రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది, అప్పులను కూడా ఆదాయంగా చూపించి మళ్లీ అప్పు లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే బాగుండేది. ఇప్పుడు ఓటాన్ అకౌంట్లో ఎప్పట్నుంచి నిరుద్యోగ భృతి, రైతుబంధు, ఆసరా పెన్షన్లు పెంచి ఇస్తారో చెప్పలేదు. ఏడాది పా టు పాలన లేకుండా ఉండేందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారా?..’ అని భట్టి ప్రశ్నించారు. -
వసంత పంచమిన తెలంగాణ కేబినెట్ విస్తరణ
-
ముహూర్తం ఫిబ్రవరి 10
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గాన్ని ఫిబ్రవరి రెండో వారంలో విస్తరించనున్నారు. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీ వసంత పంచమి పర్వదినాన మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండటం, మంచి ముహూర్తాలు లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణను ఫిబ్రవరిలో పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే తొలి విడతలో ఎనిమిది మందికే చోటు ఉంటుందని, లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగే విస్తరణలో మరో ఎనిమిది మందికి అవకాశం కల్పించి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు, ఎవరెవరికి స్థానం లభిస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. విస్తరణలో మంత్రి పదవులు పొందే ఆ ఎనిమిది మంది ఎవరన్నదానిపై అధికార పార్టీలో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఈసారి విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవచ్చని, అందరూ పాతవారే ఉంటారని కొందరంటుంటే కనీసం ఇద్దరు కొత్త వారు ఉండే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాని వారికి ఇతరత్రా కీలక పదవులు కూడా అప్పుడే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలి, అవకాశం లేని వారిని ఏ పదవుల్లో నియమించాలన్న విషయంలో సీఎం ఇప్పటికే పలుమార్లు కరసత్తు చేసినట్లు సమాచారం. కేబినెట్ హోదా ఉండే పదవుల్లో డిప్యూటీ స్పీకర్‌తోపాటు శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, మండలిలో చీఫ్ విప్, శాసనసభలో, మండలిలో ఇద్దరు లేదా ముగ్గురేసి చొప్పున విప్ల పదవులు ఉండనున్నాయి. ఇవి కాకుండా పార్లమెంటరీ కార్యదర్శుల పేరుతో మరికొందరికి కూడా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ ఎనిమిది మంది ఎవరు? తొలి దశ మంత్రివర్గ విస్తరణలో పాత మంత్రులకే అవకాశం లభించవచ్చు. టీఆర్ఎస్లో, ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నేతలకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు మంత్రి మండలి ఉంటుందని, ఈ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని ఓ సీనియర్ నేత అన్నారు. ‘ముఖ్యమంత్రి ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలన్నీ పరిశీలిస్తే పాత వారికి దాదాపుగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే అనుకుంటున్నా. శాసనసభ ఎన్నికల్లో అనేక మంది సిట్టింగ్‌లు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసినా ఆయన నలుగురు మినహా పాత వారందరికీ టికెట్లు ఇచ్చారు. మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు కీలక పదవులిచ్చారు. ఇవన్నీ గమనిస్తే ముఖ్యమంత్రి అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారనిపిస్తోంది’అని ఆ సీనియర్ నేత విశ్లేషించారు. మంత్రివర్గంలో ఎవరు ఉంటారన్న విషయంలో ముఖ్యమంత్రి తన మనోగతాన్ని ఇప్పటిదాకా ఎవరితోనూ పంచుకోలేదని పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. అయితే సమయం చిక్కినప్పుడల్లా ఆయన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల జాబితా ముందు పెట్టుకొని ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారని ఓ మాజీ మంత్రి అన్నారు. తొలి దశ విస్తరణ రేసులో ఉన్నది వీరే... తొలి మంత్రివర్గ విస్తరణలో స్థానం పొందే వారిలో ఈటల రాజేందర్ (కరీంనగర్), కడియం శ్రీహరి (జనగామ), జి. జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), సి. లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్), కేటీ రామారావు (సిరిసిల్ల), టి. హరీశ్‌రావు (సిద్దిపేట), తలసాని శ్రీనివాస్ యాదవ్ (గ్రేటర్ హైదరాబాద్), జోగు రామన్న (ఆదిలాబాద్) ఉండొచ్చని ఒక అంచనా. తొలి దశలోనే ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తే డీఎస్ రెడ్యానాయక్ (మహబూబాబాద్ జిల్లా)కు అవకాశం రావచ్చని అంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ పేరు వినిపిస్తోంది. స్పీకర్ పదవిని ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంతో ఈసారి పద్మాదేవేందర్‌రెడ్డికి ఆ అవకాశం లేకపోవచ్చు. ఆమెకు మలి దశ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి లేదా మరో కేబినెట్ హోదా పదవి లభించొచ్చు. అయితే మలి విడత మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించే వారి సంఖ్య రెండు డజన్ల దాకా ఉంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ మంది శాసనసభకు ఎన్నిక కావడంతో పోటీ కూడా తీవ్రంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల తరువాత విస్తరించనున్న మంత్రివర్గంలో ముగ్గురు రెడ్లకు అవకాశం లభించవచ్చు. ఈ కోటాలో మంత్రి పదవి కోసం నాయిని నర్సింహారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. వారిలో ఒకరిద్దరికి చీఫ్ విప్, విప్ పదవులు కట్టబెట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్... కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాతే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల మంత్రివర్గ విస్తరణ తరువాత మార్చి రెండో వారంలో తాత్కాలిక బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే మలి విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టి జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు సిద్ధం కావాలని ఆయన యోచిస్తున్నారు. -
వృద్ధిరేటులో తెలంగాణ ముందజలో వుంది
-
ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ, మండలిలో పార్టీ ఫిరాయింపుల చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతుందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేసిన నెల రోజులకే వేటు వేశారు. అదే టీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీల నేతలపై ఫిర్యాదు చేస్తే మాత్రం ఇప్పటి వరకు విచారణ చేయలేదన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇష్టానుసారం అన్వయించుకుంటూ స్పీకర్, మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని, ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. -
నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను, నామినేటెడ్ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్)గా ఎల్విస్ స్టీఫెన్సన్ను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం జరిగింది. సాధారణంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకం జరిగేది. అయితే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటే నామినేటెడ్ సభ్యుడు సైతం ప్రమాణం చేసేలా మంత్రివర్గం నిర్ణయించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే తన విలువైన పదవీకాలం కోల్పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తెలంగాణలో మతసామరస్య సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ట్లుగానే.. అసెంబ్లీ వ్యవహరాల్లోనూ ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్‌గా ముస్లిం వర్గానికి చెందిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను, నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఎల్విస్ స్టీఫెన్సన్ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ప్రతిపాదనలు పంపగా.. వీటికి గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం ఈ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ కూడా దీనికి ఆమోదిస్తూ.. స్టీఫెన్సన్ నియామకాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టీఫెన్సన్ తెలంగాణ శాసనసభకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులవడం ఇది రెండోసారి. తెలంగాణ తొలిశాసనసభలోనూ ఈయన నామినేటెడ్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2018 డిసెంబర్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర మంత్రి వర్గం అభినందించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. ఎమ్మెల్యేలకు రాజ్యాంగం ప్రతులు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులకు భారత రాజ్యాంగ ప్రతులను, అసెంబ్లీ నిబంధనల పుస్తకాలను, బుక్లెట్లను, ఇతర సమాచారాన్ని అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో వీటిని అందివ్వనుంది. దీనికి సబంధించిన ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చూపించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. జనవరి 17న ఉదయం 11.30 గంటలకు శాసనసభ తొలి సమావేశం.. 19న ఉదయం 11.30 గంటలకు శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 19న ఉదయం 11.30 గంటలకు శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. -
చోటెవరికి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంటుందనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణం కోసం జనవరి 17 నుంచి 20 వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని సీఎం నిర్ణయించడం, తొలిదశ విస్తరణలో ఆరు లేదా ఎనిమిది మందికే మంత్రులుగా అవకాశం ఉంటుందన్న సమాచారంతో ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సామాజిక సమీకరణలు, జిల్లాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, చీఫ్ విప్‌లు, విప్ పదవులను దృష్టిలో పెట్టుకొని జాబితా రూపొందిస్తున్నారు. ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తుండటంతో మొత్తం 33 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరెవరికి అవకాశం ఉంటుందనే చర్చ టీఆర్ఎస్లో జోరుగా సాగుతోంది. డిసెంబర్ 13న కొత్త ప్రభుత్వం ఏర్పడగా ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్‌అలీ మాత్రమే ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఐదారు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కేసీఆర్ చెప్పినప్పటికీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటన, ప్రాజెక్టుల పనుల పరిశీలన, వివిధ శాఖలపై వరుస సమీక్షల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు ఇప్పటివరకు వీలు కాలేదు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం సైతం వాయిదా పడటం తెలిసిందే. విధేయులు, సమర్థులకే చోటు... రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 17 మంత్రి పదవులకు అవకాశం ఉంటుంది. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను కలిపితే మరో నాలుగు అవుతాయి. శాసనమండలి, శాసనసభలలో చీఫ్ విప్, విప్ పదవులు ఉన్నాయి. కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అన్నింటినీ కలిపి 33 పదవులు ఉండేలా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. టీఆర్ఎస్లో ఆశావహులు సైతం ఎక్కువగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున రామగండంలో గెలిచిన కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థిగా వైరాలో గెలిచిన లావుడ్య రాములు నాయక్ టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. మరోవైపు ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు సైతం మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే టీఆర్ఎస్కు విధేయులుగా ఉండటంతోపాటు సమర్థులైన వారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో కంటే మెరుగైన మంత్రివర్గం ఉండేలా ఎమ్మెల్యేల జాబితాను రూపొందిస్తున్నారు. స్పీకర్‌తోనే అన్ని... అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరు ఉంటారనేది స్పష్టత వస్తేనే మంత్రివర్గ కూర్పుపై ఒక అంచనా రానుంది. గత అసెంబ్లీలో స్పీకర్‌గా వ్యవహరించిన ఎస్. మధుసూదనచారి ఈసారి ఓడిపోవడంతో సీనియర్ ఎమ్మెల్యేలలో ఒకరిని స్పీకర్‌గా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ విధేయులు పేర్లను పరిశీలిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లలో ఒకరిని స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ పదవిని గతంలోలాగే బీసీ వర్గాలకు కేటాయిస్తే మంత్రివర్గం కూర్పులో మార్పులు జరగనున్నాయి. తొలిదశ విస్తరణ పరిమితంగానే ఉంటుందని టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే స్పష్టత ఇచ్చినా అశావహుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. -
అధికారులు కండువాలేని కార్యాకర్తల్లా వ్యవహరిస్తున్నారు
-
‘బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో నిర్లక్ష్యం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు హామీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్లాంట్ ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలపై కేంద్రానికి ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదని, ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తనకు చెప్పారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రం అడిగిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్‌లో రూ.600 కోట్లతో నిర్మాణంలో ఉన్న కొత్త ఆయిల్ టెర్మినల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అలాగే రూ.2,321 కోట్లతో నిర్మాణంలో ఉన్న పారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్‌ను కొత్త ఆయిల్ టెర్మినల్‌కు అనుసంధానంగా ఉపయోగించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలసి కోరినట్టు దత్తాత్రేయ తెలిపారు. -
‘ఉద్యమాలను అణచివేస్తున్నారు’
హైదరాబాద్: ప్రజాఉద్యమాలు కొనసాగడమే పాలనకు గీటురాయని, ఎన్ని ప్రజాఉద్యమాలు జరిగితే పాలన అంత సజావుగా జరుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కానీ, తెలంగాణలో ప్రజాఉద్యమాలను పూర్తిగా అణచివేస్తున్నారని, ఉద్యమాలు చేస్తున్నవారిని అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న అక్రమంగా అరెస్టు చేసిన అక్కాచెల్లెళ్లు భవానీ, అన్నపూర్ణ, అనూషలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సంబంధం పెట్టుకుని ప్రజాసంఘాలను నిర్బంధిస్తున్నదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు కట్టడం, షాదీ ముబారక్‌లు ఇవ్వడం కాదని, ప్రజాస్వామ్యం కాపాడడం, ఉద్యమాలు చేయనివ్వడం అని పేర్కొన్నారు. మా పిల్లలు ఏ నేరమూ చేయలేదు... అరెస్టుకు గురైన మహిళల తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, ఆత్మకూరి రమణయ్య మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు 15 మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి తమ కూతుళ్లను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఆ పోలీసుల్లో కేవలం ఇద్దరు మాత్రమే పోలీసు డ్రస్‌లో, మిగిలినవారందరూ మఫ్టీలో ఉన్నారని, దౌర్జన్యంగా అరెస్టు చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న 7 సెల్ఫోన్లు, ఐడీ ప్రూఫ్‌లు బలవంతంగా తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలపై ఏ నేరచరిత్ర లేదని, కేవలం మహిళాసంఘాలతో కలసి, మహిళల సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పారన్నారు. ప్రజాచైతన్య యాత్ర చేసినందుకే కక్షగట్టి అరెస్టులు చేశారని ఆరోపించారు. తమ పిల్లల్ని ఎక్కడ నుండి తీసుకువెళ్లారో, అక్కడ వదిలిపెట్టాలని, ఇంట్లో నుండి తీసుకెళ్లిన వస్తువులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను టఫ్ అధ్యక్షురాలు విమలక్క, ప్రొఫెసర్ లక్ష్మణ్, పీవోడబ్ల్యూ సంధ్య, సామాజిక కార్యకర్తలు సజయ, సనా ఉల్లాఖాన్, ముజాహిద్ హష్మీ, ప్రొఫెసర్ ఖాసీం తీవ్రంగా ఖండించారు. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
సంక్షేమం కొత్త పుంతలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’అనే నినాదంతో సర్కారు నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఏడాది ఇలాగే కొనసాగాయి. కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో సంక్షేమం ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కింది. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ మంజూరైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇతర ప్రాజెక్టుల పరిధిలో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. ఇవన్నీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సానుకూలంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకాలపై రౌండప్ మీకోసం. పెళ్లికి లక్షా నూట పదహార్లు.. అడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా భావించే పేదలకు అండగా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను ప్రవేశపెట్టింది. 2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అమలైన ఈ పథకాన్ని ఆ తర్వాత బీసీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకూ వర్తింపజేసింది. పథకం మొదలైన కొత్తలో రూ.51 వేలుగా ఉన్న సాయాన్ని గతేడాది రూ.75,116 వేలకు పెంచింది. ఈ ఏడాదిలో దీన్ని రూ.1,00,116కు పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఈ ఏడాది 1,21,793 మందికి సాయం అందింది. ఈ రెండు పథకాలతో లబ్ధిపొందిన వారిలో ఎస్సీలు 18,626, ఎస్టీలు 12,105, బీసీలు 62,453, ఈబీసీలు 6,369, మైనార్టీలు 22,240 మంది ఉన్నారు. అన్నదాతకు బీమా.. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడుతుంది. ఇలాంటి దుస్థితిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైంది. పట్టాదారుగా నమోదై, 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతు పేరుమీద రూ.2,271 చొప్పున రూ.650 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసీకి ఏడాది ప్రీమియం చెల్లించింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు వయసున్న 28.3 లక్షల మంది ఈ పథకం కింద నమోదయ్యారు. రైతు బీమా అమల్లోకి వచ్చినప్పటి నుంచి దురదృష్టవశాత్తు 5 వేలకు పైగా రైతులు చనిపోయారు. వీరికి ఎల్ఐసీ రూ.230 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్రం ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లు, ఎయిమ్స్ నిర్వహణలో కీలకమైన డైరెక్టర్ పోస్టును మంజూరు చేసింది. ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరంలో ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. రైతు బంధు.. రైతులకు పెట్టుబడి సాయమందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘రైతు బంధు’పేరిట రైతులకు నగదు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 ఖరీఫ్ నుంచి అమల్లోకి వచ్చింది. రబీలోనూ విజయవంతంగా అమలు చేశారు. రైతుబంధు పథకం అమలుకు ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా సీజనుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. వర్షాకాలం సీజన్లో 1.4 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం ఇచ్చింది. చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా వ్యవసాయ భూమి ఉన్న అందరికీ రైతుబంధు సాయం అందింది. రాష్ట్రంలో 58.16 లక్షల పట్టాదారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 58.81 లక్షల చెక్కులను ముద్రించింది. 51.4 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చెక్కుల విలువ మొత్తం రూ.5,437 కోట్లు. రబీలో 44 లక్షల మందికి రూ.4,500 కోట్ల పెట్టుబడి సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నీళ్లు పారాయి.. సాగునీటి రంగంలో ఈ ఏడాది గణనీయ పురోగతి కనిపించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రారంభించిన పనుల ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం కృషి చేసింది. మిషన్ కాకతీయ కింద నాలుగు విడతల్లో పునరుద్ధరించిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏడు లక్షల ఎకరాలకు కొత్త నీరు అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ మధ్యతరహా ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరు చేరింది. కాళేశ్వరం పనులు మరింత వేగవంతమయ్యాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన పనులతో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. కోటి కళ్ల కొత్త చూపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘కంటి వెలుగు’పథకానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవనశైలితో కంటి జబ్బుల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో కంటి పరీక్షల నిర్వహణ కార్యక్రమం ఈ పథకానికి స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు చేయించడం ఈ పథకం ఉద్దేశం. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కోటి మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 లక్షల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. వీరిలో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా సాధారణ కళ్లద్దాలు(రీడింగ్) పంపిణీ చేశారు. దృష్టి లోపం ఎక్కువగా ఉన్న మరో 12.95 లక్షల మందికి ప్రత్యేకంగా అద్దాలను తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 4.47 లక్షల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు నిర్ధారించారు. త్వరలోనే శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. కొత్తగా 7 లక్షల ఎకరాలకు.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు పట్టుదల తోడవడంతో మంచి ఫలితాలొచ్చాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించడంతో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువ ఆధునీకరణతో హుజూరాబాద్, పెద్దపల్లి, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పంటలకు, చెరువులకు నీరు అందింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూసేకరణ అడ్డంకులతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57 చెరువు పనులు ఈ ఏడాది పూర్తయ్యాయి. దీంతో 82 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు 75 శాతం పూర్తయ్యాయి. 2019 జూన్ నాటికి మొత్తం పనులను పూర్తి చే సి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడిగడ్డ నుంచి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.24 వేల కోట్లు రుణాల రూపంలో ఖర్చు చేశారు. మరో ఎనిమిది వేల కోట్ల రుణాలతో తుపాకులగూడెం, సీతారామ, వరదకాల్వ పనులు చేశారు. రుణాల ద్వారా చెల్లింపులు చేస్తున్నా ప్రతి నెలా రూ.5 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో ఈ సమస్యను అధిగించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ–హబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం వీ–హబ్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించింది. స్టార్టప్‌ల ఏర్పాటుకు ఐడియాలతో వచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం దీని ద్వారా అవసరమైన ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్) ముగింపు సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘వీ–హబ్’పేరుతో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
లక్ష్యం చేరలే..
హన్మకొండ చౌరస్తా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమీకృత మత్స్య అభివృద్ధి పథకం లక్ష్యం నెరవేరడం లేదు. చేపల పెంపకం.. చేప విత్తనాల ఉత్పత్తి.. ప్రాసెసింగ్.. మార్కెటింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి చేయూతనందించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం నిధుల లేమితో పేదల దరిచేరని పరిస్థితి నెలకొంది. సుమారు రూ.వెయ్యి కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఎఫ్‌డీఎస్ అమలుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష మంది మత్స్యకారులు ఉండగా.. ఇందులో 40 శాతం మంది మాత్రమే లబ్ధి పొందినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన 60 శాతం మంది డీడీలు చెల్లించి.. ఆరు నెలలకు పైగా వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిధుల కొరతే కారణమా.. పథకం అమలులో జాప్యంపై అధికారులను సంప్రదించగా.. ఎన్నికలే కారణమని చెప్పారు. కోడ్ అమలులో ఉన్నందున వాహనాలను పంపిణీ చేయలేదని అంటున్నారు. అయితే.. ఎన్నికల ముందే ప్రారంభమైన పథకానికి కోడ్ సంబంధమేంటని మత్స్య సహకార సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా నిధుల కొరత కారణంగానే పథకం అమలు నిలిచిపోయినట్లు సమాచారం. వస్తాయా.. లేదా.. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా లబ్ధిపొందే వస్తువుపై లబ్ధిదారుడు 25 శాతం మొత్తాన్ని డీడీ ద్వారా మత్స్యశాఖ కార్యాలయం పేరుతో చెల్లించాలి. మిగిలిన 75శాతం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రాతిపదికన టీవీఎస్ మోపెడ్, లగేజీ ఆటోల కోసం చెల్లించిన వారే ఎక్కువ శాతం మంది ఉన్నారు. ఇందులో 40 శాతం మంది లబ్ధిదారులకు మాత్రమే వాహనాలు అందినట్లు మత్స్య సహకార సంఘాలు చెబుతున్నాయి. టీవీఎస్ మోపెడ్ నుంచి లగేజీ ఆటోల వరకు లబ్ధిదారులుగా ఎంపికైన మత్స్యకారులు డీడీలు చెల్లించి ఆరు నెలలు గడుస్తోంది. అప్పు తెచ్చి డీడీలు చెల్లించిన మత్స్యకారులకు నిధుల లేమి నేపథ్యంలో వాహనాలు వస్తాయా.. లేదా.. అనే అనుమానం వారిని పీడిస్తోంది. -
కూడికలు.. తీసివేతలు మంత్రివర్గం మ్యాథ్స్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త మంత్రివర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన జట్టులో ఎవరిని చేర్చుకుంటారనే ఆసక్తి పెరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ ఒకింత ఆలస్యమవుతుండటంతో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నెల 20 వరకే మంచి రోజులు ఉన్న నేపథ్యంలో అప్పటిలోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ సోమవారం (17న) బాధ్యతలు చేపడుతున్నారు. దీంతో ఆరోజు మంత్రివర్గ విస్తరణ ఉండబోదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 18న మంత్రుల ప్రమాణ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఆ రోజు కాకుంటే బుధ, గురువారాల్లో నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు స్థాయిలో 88 స్థానాల్లో విజయం సాధించింది. కొత్త ఎమ్మెల్యేలలో అత్యధికులు రెండు, అంత కంటే ఎక్కువసార్లు గెలిచిన వారే ఉన్నారు. దీంతో మంత్రి పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మంత్రి పదవులను ఆశించే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలుస్తున్నారు. మనసులోని కోరికను నేరుగా చెప్పలేకపోయినా... అంతరంగం తెలిసేలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ గతంలో ఏదైనా సందర్భాల్లో తమకు కీలక బాధ్యతలు ఇస్తానని చేసిన ప్రకటనలు గుర్తుకు వచ్చేలా చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలసి నేరుగా తమ మనసులోని కోరికను చెబుతున్నారు. సీఎంకు చెప్పి మంత్రివర్గంలో చోటు కల్పించేలా చేయాలని కోరుతున్నారు. ‘సామాజిక’మార్పులు.. కేసీఆర్ గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. కేసీఆర్‌తోపాటు మహమూద్‌అలీ ఒక్కరే ఆ రోజు మంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులు ఉండవచ్చు. మహమూద్‌అలీ మంత్రిగా ఉన్నందున మరో 16 మందికి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో తుమ్మల నాగేశ్వర్రావు (కమ్మ), అజ్మీర్ చందూలాల్ (ఎస్టీ), జూపల్లి కృష్ణారావు (వెలమ), పట్నం మహేందర్‌రెడ్డి (రెడ్డి) ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో వీరి స్థానాల్లో కచ్చితంగా కొత్త వారికి అవకాశం కల్పించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో 11 మంది ఓసీలు, నలుగురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ.. మంత్రివర్గంలో ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో సామాజిక సమీకరణల పరంగా స్వల్ప మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓసీల సంఖ్యను తగ్గించి బీసీల సంఖ్య పెంచేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఎవరికి ఖరారు చేస్తారనే విషయంలో స్పష్టత వచ్చాకే మంత్రివర్గంలో సామాజిక సమీకరణల లెక్కలు తేలనున్నాయి. స్పీకర్‌గా ఓసీ సామాజికవర్గం వారికి అవకాశం ఇస్తే ఈ మేరకు మంత్రివర్గంలో వీరి సంఖ్య తగ్గనుంది. ఎస్సీ వర్గంలో మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎస్సీ కోటాలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు మాదిగ వర్గానికి చెందిన అరూరి రమేశ్ (వర్ధన్నపేట), రసమయి బాలకిషన్ (మానకొండూరు) మాల వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), బాల్క సుమన్ (చెన్నూరు) పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. మాదిగ, మాల వర్గాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత, అజ్మీర రేఖానాయక్‌ల్లో మహిళా కోటాలో ఒకరికి చోటు కల్పించే అవకాశం ఉంది. బీసీలో మున్నూరుకాపు ఎమ్మెల్యేల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఈ వర్గానికి చెందిన జోగు రామన్న, దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, గంగుల కమలాకర్, దాస్యం వినయభాస్కర్‌లు ఉన్నారు. స్పీకర్‌గా ఎవరు... కీలకమైన శాసనసభ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారనేది టీఆర్ఎస్ సీనియర్ నేతలకు టెన్షన్‌గా మారింది. స్పీకర్‌గా వ్యవహరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరికొండ మధుసూదనచారి (భూపాలపల్లిలో) పరాజయం పాలయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్‌గా పని చేసిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు లేకపోవడంతో దాదాపు అందరు ఈ పదవిపై ఆసక్తి చూపడంలేదు. పైగా స్పీకర్ పదవి వద్దని చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సీనియర్లు అయిన ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పేర్లను స్పీకర్ పదవి కోసం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. స్పీకర్ పదవిని ఓసీ వర్గం వారికి ఇస్తే డిప్యూటీ స్పీకర్ పోస్టును బీసీ లేదా ఎస్టీలకు ఇచ్చే అవకాశం ఉంది. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవుల ప్రాబబుల్స్... రెడ్డి: నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగడి సునీత, వేముల ప్రశాంత్‌రెడ్డి, సిహెచ్.మల్లారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి. వెలమ: తన్నీరు హరీశ్‌రావు, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు కమ్మ: కోనేరు కోనప్ప, పువ్వాడ అజయ్‌కుమార్, అరికెపూడి గాంధీ. బీసీ: ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావుగౌడ్, జోగు రామన్న, దానం నాగేందర్, గంగుల కమలాకర్, దాస్యం వినయభాస్కర్, బాజిరెడ్డి గోవర్ధన్, వి.శ్రీనివాస్‌గౌడ్, కె.పి.వివేకానందగౌడ్. ఎస్సీ: కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, అరూరి రమేశ్, బాల్క సుమన్, రసమయి బాలకిషన్. ఎస్టీ: డి.ఎస్. రెడ్యానాయక్, అజ్మీర రేఖానాయక్. -
సస్యశ్యామలం చేస్త
పాలమూరు ప్రాంతానికి శత్రువులెవరో కాదు.. ఈ ప్రాంతానికి చెందిన నాయకులే. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు కేసులు వేశారు. నాగం జనార్దన్‌రెడ్డి కేసు వేస్తే హైకోర్టు నిన్ననే చెంప ఛెళ్లుమనిపించింది. పవన్‌కుమార్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా కేసులు వేసిండ్రు. ఇలా మన దరిద్రులే కేసులు వేస్తున్నరు. ప్రాజెక్టులకు అడ్డంపడ్డ బాబు ఇప్పుడు సిగ్గు లేకుండా ఓట్లు ఎలా అడుగుతడు? ఎన్నికలు వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులు వచ్చి ఏదేదో చెప్పిపోతుంటరు.. ఆగమాగం కావద్దు.. అందరి మాటలు విని, ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓట్లేయాలె. ఈ ఎన్నికల్లో తికమక ఏమీలేదు. 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన, నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకోవాలె. హైదరాబాద్‌ను నేనే కట్టిన.. ప్రపంచపటంలో నేనే పెట్టిన అంటున్న బాబూ.. అప్పుడు విద్యుత్‌ను ఎక్కడ దాచిపెట్టావ్? సాక్షి నెట్వర్క్ : ఏళ్ల తరబడి కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలోని ప్రతీ అంగుళానికి సాగునీరు అందినప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న తెలంగాణలోని ప్రతిఅంగుళాన్నీ సాగునీటితో తడిపే వరకు విశ్రమించబోనని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కేసీఆర్ జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్, మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి(కొడంగల్ నియోజకవర్గం), మక్తల్, వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ల్లో మాట్లాడారు. కేసీఆర్ చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం ఆర్డీఎస్పైనేనని తెలిపారు. రాజోలి గ్రా మం వద్ద కేసీ కెనాల్‌కు నీళ్లు ఇచ్చే సుంకేçశులను పరిశీలించగా.. కింద ఉన్న గ్రామానికి తాగడానికి నీళ్లు ఇవ్వని పరిస్థితి చూసి కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు. సుంకేశుల కట్ట మీద ఉండి కర్నూలు జిల్లా పేపర్ చూస్తే అందులో సీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనే ఎమ్మెల్యే.. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఆర్డీఎస్ తూ ములు మూసివేస్తే బాంబులు పెట్టి మళ్లీ పగలకొడతానని హెచ్చరించినట్లు ప్రచురితం కాగా, ఆర్డీఎస్ మీద అడుగుపెట్టు.. సుంకేశుల బ్యారేజీని వెయ్యి బాంబులు పెట్టి పేలుస్తానని నాడే సభలో హెచ్చరించానని గుర్తుచేశారు. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరు రాక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి శాశ్వ త పరిష్కారం చూపేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినట్టు చెప్పారు. ఈ పథకాన్ని కూడా చంద్రబాబు అడ్డుకోవాలని చూశారని విమర్శించారు. ఆర్డీఎస్ను ధ్వంసం చేసినా ఆనాటి టీడీ పీ, కాంగ్రెస్ నాయకులు దద్దమ్మల్లా చూస్తూ ఊరుకున్నారని దుయ్యబట్టారు. తుమ్మిళ్ల మాదిరిగానే గట్టు ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని పేర్కొన్నారు. ఆయా సభల్లో కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే... మంగళవారం కోస్గిలో జరిగిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం ఈ దరిద్రులను వదిలేయాలె... ‘పాలమూరు ప్రాంతానికి శత్రువులెవరో కాదు.. ఈ ప్రాంతానికి చెందిన నాయకులే. కేసీఆర్ ఎంత మందితో కొట్లాడాలి. కరువు జిల్లా అయిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నిస్తున్నం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.35వేల కోట్లు మంజూరు చేసినం. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు మాదిరిగా ఇక్కడి వారు కూడా కేసులు వేస్తున్నరు. నాగం జనార్దన్‌రెడ్డికి హైకోర్టు నిన్ననే చెంప ఛెళ్లుమనిపించింది. దొంగ కేసులు వేసి ప్రాజెక్టులకు అడ్డుకోవాలని చూసిండు. ఆయనతో పాటు దేవరకద్రలో పోటీ చేస్తున్న పవన్‌కుమార్, కొల్లాపూర్‌లో పోటీ చేస్తున్న బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా కేసులు వేసిండ్రు. ఇలా మన దరిద్రులే కేసులు వేస్తున్నరు. ఇలాంటి దరిద్రులను వదిలేయాలె. ప్రాజెక్టులకు అడ్డంపడ్డ చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా ఓట్లు ఎలా అడుగుతడు? ఆగమాగం కావొద్దు ‘ఎన్నికలు వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులు వచ్చి ఏదేదో చెప్పిపోతుంటరు.. ఆగమాగం కావద్దు.. అందరి మాటలు విని, ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓట్లేయాలె. ఈ ఎన్నికల్లో తికమక ఏమీలేదు. 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన, నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకోవాలె. హైదరాబాద్‌ను నేనే కట్టిన.. ప్రపంచపటంలో నేనే పెట్టిన అంటున్న చంద్రబాబూ.. అప్పుడు విద్యుత్‌ను ఎక్కడ దాచిపెట్టావ్? రాష్ట్రంలో నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను ఇస్తుండడం వల్లనే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంలేదు. కేసీఆర్ బతికున్నంత వరకు ఎవ్వరు అడ్డుకున్నా 24 గంటల విద్యుత్‌ను అమలు చేసి తీరుతం. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ రంగానికి రూ.43 వేల కోట్లు వెచ్చిస్తున్నం. పింఛన్లు, రేషన్ బియ్యం, మహిళలకు కేసీఆర్ కిట్లు, పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఈ పథకాలన్నీ మీ ఊళ్లోనే మీ కళ్లముందు కనిపిస్తున్నయి. కంటివెలుగు కార్యక్రమంతో పాటు చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐకేపీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తం. అన్నీ చూసి సరైన నిర్ణయం తీసుకోవాలె. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజల ఎజెండా గెలవాలి. మంచి లాభం జరగాలి. ఎన్నికల్లో గాలిగాలిగా ఓట్లు వేయొద్దు. గాలిగాళ్లకు ఓట్లేస్తే గాలిగాలిగా గత్తర చేస్తరు. అభివృద్ధి ఉండదు. అందుకే ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలె. ఇప్పటి వరకు 117 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన. తెలంగాణలో 98 నుంచి 108 వరకు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయం’అని కేసీఆర్ ఉద్ఘాటించారు. కేసీఆర్‌కు తుమ్మిళ్ల జలాలు.. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఇటీవల తుంగభద్ర నది నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అలంపూర్ సభకు వచ్చిన కేసీఆర్‌కు ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి తుమ్మిళ్ల జలాలు అందించారు. వాటిని కేసీఆర్ తన శిరస్సున పోసుకున్నారు. కాగా, అలంపూర్ సభలో కేసీఆర్ అసహనానికి గురయ్యారు. ఆయన ప్రసంగిస్తుండగా కొందరు నినాదాలతో హోరెత్తించడంతో పాటు తోసుకుంటూ ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు స్థానిక నేతలు వారిని నచ్చజెప్పేందుకు యత్నించినా వినలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అంటే కమీషన్.. కాలయాపన: హరీశ్ కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాష్ట్రంలో పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అలంపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంకలో పిల్లిని పెట్టుకొని ఎన్నికలకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుతో కలిసి ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అలంపూర్‌కు వచ్చి చూస్తే తెలంగాణ అభివృద్ధి కనిపిస్తుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అంటే కమీషన్లు.. కాంగ్రెస్ అంటే కాలయాపన అని విమర్శించారు. కానీ టీఆర్ఎస్ మాత్రం పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిందని వ్యాఖ్యానించారు. 10 నెలల కాలంలోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మించి రైతులకు నీరందించిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని హరీశ్‌రావు తెలిపారు. -
ఎవరి ‘కోటా’ తగ్గిస్తారు?
కాగజ్‌నగర్/హన్మకొండ/త్రిపురారం: ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లలో ఎవరి కోటా తగ్గించి ముస్లింలకు 12 శాతం కల్పిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్‌లో, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో, నల్లగొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. రిజర్వేషన్ కల్పించడం చేతకాక కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు రిజర్వేషన్లు ఎక్కడి నుంచి ఇస్తారని, ఎవరి రిజర్వేషన్లకు కోత పెడతారని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓట్ల కోసం మతాలు, కులాల వారీగా ప్రజలను విభజిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గమన్నారు. బెంగాలీలకు కుల ప్రాతిపదికపై అన్యాయం జరుగుతోందని, అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులను ఎస్సీ కేటగిరిలో చేరుస్తామన్నారు. టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేస్తుండటంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఈ పొత్తు అనైతికమని, దీనికి టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ, రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 4,500 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రశ్నించారు. రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధరను మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు కోసం రూ. 100 కోట్లు, కాకతీయ మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం రూ.155 కోట్లు మంజూరు చేస్తే నేటి వరకూ పనులు ప్రారంభం కాకుండానే శంకుస్థాపనకు పరిమితమయ్యాయని తెలిపారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి దేశం నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 13వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రూ.16 వేల కోట్లు కేటాయిస్తే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.1.15 లక్షల కోట్లు రాష్ట్రానికి మంజూరు చేసినా అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. దేశంలో నక్సల్స్ సమస్య తగ్గిందన్నారు. ఉగ్రవాదులను దేశపొలిమెరలోకి రాకుండా కట్టడి చేశామన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని విని ఆశ్చర్యపోయానని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ‘వాదేహై వాదోంకా క్యా’ అనే పాట గుర్తుకొస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానాలు చూస్తుంటే పాత రోజుల్లో ఉపకార్ సినిమాలోని ‘వాదేహై వాదోంకా క్యా’అనే పాట గుర్తుకొస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాగ్దాన భంగం చేసిన కేసీఆర్.. మళ్లీ మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారన్నారు. 2022 నాటికి దేశంలో సొంతిళ్లు లేని వారు ఉండకూడదన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం శక్తివంత దేశంగా ఎదిగితే, రాహుల్‌గాంధీ ఆలుగడ్డల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి, రాహుల్‌కు ఉన్న విజన్‌లో తేడా ఇదేనని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ లక్షా15 వేల కోట్లు ఇచ్చిందని కేంద్రమంత్రి తెలిపారు. -
మచ్చ తొలగితేనే మంచి పేరు!
‘మనిషి సాంఘిక జంతువు’ అని రెండు వేల సంవత్సరాల కింద ఆరిస్టాటిల్ అన్న మాటకీ, ‘ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తున్న జంతువు మనిషి’ అన్న హైకోర్టు తాజా వ్యాఖ్యకి ఎంతో తేడా ఉంది. మొదటిది, బుద్ధికలిగి సకల జీవులతో పరస్పర సహజీవనం సాగిస్తున్న ఉన్నతుడిగా మనిషికి ప్రశంస అయితే, రెండోది, స్వార్థంతో బుద్ధి మందగించి బాధ్యత మరచిన మనిషి ఇతర జీవులకు హాని చేస్తున్నాడనే అభిశంస! ఇందులో వ్యక్తులుగా, సమూహాలుగా, జాతులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా అందరి బాధ్యతా ఉంది. ‘మనిషి విధ్వంసకారి’అనే మాటను చెరిపేయాలి. ‘బుద్ధిజీవి’అనే మాటను నిలబెట్టాలి. అప్పుడే పృథ్వికి రక్ష, భవితకు భరోసా! ‘మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది’ అంటూ హైకోర్టు ధర్మాసనం వెలి బుచ్చిన ధర్మాగ్రహం ప్రతి మనిషికీ తగలా ల్సిన పోటు! ఎక్కడో తగిలే ఉంటుంది, ఎవరికి అది ఎంత వరకు తగి లింది అనేదానికి కొలతలు లేవు. కానీ, పర్యావరణం అన్నది ఇక ఏ మాత్రం న్యాయస్థానాలకో, పరిశోధనాలయాలకో, శాస్త్రజ్ఞులకో, హరిత కార్యకర్తలకో మాత్రమే పరిమితమైన పదం కాదు. ఇది సామాన్యుల నుంచి రాజకీయ పార్టీల మేనిఫెస్టోల వరకు అత్యంత కీలకమైన ఎజెం డాగా మారిందనేది సత్యం. మన దేశ రాజధాని «ఢిల్లీలో ముప్పిరిగొం టున్న వాయు కాలుష్యం అత్యంత దుర్భరంగా తయారయింది. ఇది జీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపడమే కాకుండా అక్కడ నివసించే ప్రతి మనిషి సగటు పదేళ్ల ఆయుర్ధాయాన్ని హరిస్తోందని అధ్యయనాలు చెబు తున్నాయి. ముఖ్యంగా భూతాపం, వాయుకాలుష్యం వంటివి అంచనా లకు మించిన వేగంతో దూసుకువస్తూ తెచ్చిన ‘వాతావరణ మార్పు’ల ప్రతికూల ప్రభావం ఇపుడు ప్రతి జీవినీ తడుముతోంది. ఇది విశ్వ పరి ణామం! ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పర్యావరణం భూమ్మీది జీవుల న్నింటి బతుకునీ ప్రభావితం చేస్తోంది. పరిణామ క్రమంలో ఉత్కృష్ట జీవిగా అవతరించిన ‘మనిషి’తన చర్యలవల్లో, చర్యల లేమివల్లో పర్యా వరణ విధ్వంసానికి కారణమవుతున్నాడు. ఇతర జీవులనీ నానా యాత నకి గురిచేస్తున్నాడు. తాను నియంత్రించి, నివారించ గలిగిన వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ జీవుల మనుగడకు ముప్పు తెస్తున్నాడు. సహజ వనరుల్ని సర్వనాశనం చేసి భవిష్యత్తరాలకు ఓ భగ్న పృథ్విని అందించ నున్నాడు. ఇదే విషయాన్ని హైకోర్టు నొక్కి చెప్పింది. ‘మనిషి సాంఘిక జంతువు’ అని రెండు వేల సంవత్సరాల కింద ఆరిస్టాటిల్ అన్న మాటకీ, ‘ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తున్న జంతువు మనిషి’ అన్న హైకోర్టు తాజా వ్యాఖ్యకి ఎంతో తేడా ఉంది. మొదటిది, బుద్ధికలిగి సకల జీవులతో పర స్పర సహజీవనం సాగిస్తున్న ఉన్నతుడిగా మనిషికి ప్రశంస అయితే, రెండోది, స్వార్థంతో బుద్ధి మందగించి బాధ్యత మరచిన మనిషి ఇతర జీవులకు హాని చేస్తున్నాడనే అభిశంస! ఇందులో వ్యక్తులుగా, సమూహా లుగా, జాతులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా అందరి బాధ్యతా ఉంది. అన్ని స్థాయిల్లో ఎవరి బాధ్యత వారెరిగి, జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం మనందరి పైనా ఉందనేది తిరుగులేని వాస్తవం. ఇది ఓటర్లముందున్న సవాల్ సగటు మనిషి జీవితపు ప్రతి పార్శా్వన్నీ శాసించే అధికారాన్ని తెలిసో, తెలియకో మనం మన రాజకీయ వ్యవస్థకు ధారాదత్తం చేశాం. అన్నీ వారు చెప్పినట్టు నడవాల్సిందే! పాలకులుగా అవతరించే రాజకీయ పార్టీలను ప్రజలు నిలదీసే, ప్రశ్నించే ఒకే ఒక సందర్భం ఎన్నికలు. అయి దారు మాసాల వెనకా, ముందు... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎన్నికల ముంగిట్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనయితే పక్షం రోజుల్లోనే ఎన్ని కలు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తు న్నాయి. కానీ, వాటిల్లో నిర్దిష్టత లోపిస్తోంది. ఓట్లనాకర్షించే ఆర్థికాంశాల కిచ్చే ప్రాధాన్యత ఇతర ముఖ్య అంశాలకు ఇవ్వటం లేదు. ‘పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’ అనే సాధారణ ప్రకటన ఇవ్వడం, ఇతరే తర అంశాల కింద ప్రకటించే విధానాల్లో అస్పష్టత అంతిమంగా పర్యా వరణానికి భంగం కలిగించే సందర్భాలెన్నో! ఉదాహరణకి, పర్యావ రణం గురించి సదరు పద్దు కింద సానుకూల ప్రకటన చేసినా, ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ వినియోగ విధానం’ లోని అస్పష్టత చివరకు పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉంటోంది. పరిశ్రమల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల కల్పన, రవాణా వ్యవస్థ, భూసేకరణ... ఇలా చాలా అంశాలూ పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిని నిశితంగా పరి శీలించి, విశాల జనహితంలో విపులంగా చర్చించాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల విస్తృతి వల్ల వచ్చిన జనచేతన క్రమంగా వేర్వేరు అంశాల్లోకి వ్యాపించడమొక మంచి పరిణామం! పర్యావరణ విషయా ల్లోనూ ఆ జాగ్రత్త అవసరం. దీపావళి టపాసులు పండుగరోజు రాత్రి 8–10 గంటల మధ్యే కాల్చాలన్న సుప్రీం ఇటీవలి తీర్పు పదేళ్లకింద అయితే ఎలా ఉండేదో! అన్న సందేహం కలుగుతుంది. తెలంగాణలో కూటమికట్టి ఎన్నికల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, రేపో మాపో ప్రకటించ నున్న తన ఎన్నికల ప్రణాళికలో పర్యావరణాన్ని ఒక అంశంగా చేర్చింది. జీహెచ్ఎంసీ పరిధి ప్రతి కొత్త నిర్మాణాలకూ ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ప్రమాణాల్ని తప్పనిసరి చేస్తామని, కొత్తగా నిర్మించే ప్రతి వాణిజ్య, గృహ నిర్మాణాల్లో ఇంకుడు గుంతల్ని నిర్బంధం చేస్తామని, సోలార్ రూఫ్‌టాప్ రాయితీ పథకాన్ని కొనసాగిస్తామని, షెంజెన్ తర హాలో ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ క్యాబులు, ఎలక్ట్రిక్ ఆటోల విధానం తీసుకువస్తామని, ప్లాస్టిక్‌ను నియంత్రించి జూట్, బట్ట సంచుల వాడ కాన్ని తప్పనిసరి చేస్తూ సంబంధిత పరిశ్రమల్ని అభివృద్ధి పరుస్తామని... ఇలా ప్రకటించారు. పాలక తెరాస 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించ నప్పటికీ ‘హరితహారం’ ద్వారా విస్తృతంగా మొక్కలు నాటే పెద్ద కార్య క్రమాన్ని గత నాలుగేళ్లుగా అమలుపరచింది. హైదరాబాద్‌ను విశ్వనగ రంగా తీర్చిదిద్దుతామనే హామీలో భాగంగా మూసీనది, హుస్సేన్‌సాగర్ జలశుద్ది గురించి ఎంతో చెప్పింది. నగరంలోని చెరువుల పునరుద్ధరణ చేస్తామనీ ప్రకటించింది. కానీ, అవేవీ జరగలేదు. అప్పుడు జరిగిన ఉమ్మడి ఎన్నికలకు తమ ప్రణాళికను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ పలు పర్యావరణ హామీలతో పాటు ప్లాస్టిక్ పైనా నిర్దిష్ట హామీ ఇచ్చింది. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం విధిస్తాం, భూగర్భ మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. శిలాజ ఇంధనాల బదులు పునర్వినియోగ యోగ్యమైన శుద్ధ ఇంధనాల వినియోగాన్నే అభివృద్ధి పరుస్తామని బీజేపీ తన జాతీయ ఎన్నికల విధాన ప్రకటనలో తెలిపింది. సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా పర్యావరణ విధాన ప్రకటన చేశాయి. ఎవరెన్ని మాటలు చెప్పినా అమలులో చిత్తశుద్ధి అంతంతే! సమాజ శ్రేయస్సుకు పాలకులను నిలదీసి ఫలితాలు సాధించుకోవాల్సిన బాధ్యత పౌరులదే! ప్లాస్టిక్ వినియోగంపై నిర్దిష్ట చర్యలేవి? ప్రపంచ పర్యావరణాన్ని ఈ రోజు ప్లాస్టిక్ గడగడలాడిస్తోంది. వాడి విసిరి పారేశాక మట్టిపొరల్లోకి జారిపోయీ, వెయ్యేళ్లయినా నశించని దాని లక్షణం పెనుసవాల్ విసురుతోంది. నేల పైన, భూమి పొరల్లోనే కాకుండా అటు ఇటు తిరిగి సముద్రంలోనూ కోట్ల టన్నుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఎన్నెన్నో జీవుల మనుగడనే ఈ ప్లాస్టిక్ కల్లోల పరుస్తోంది. ప్రాణాలనూ హరిస్తోంది. ఇండోనేషియాలోని ఓ దీవి తీరానికి ప్రాణాలు కోల్పోయి ఇటీవల కొట్టుకొచ్చిన తిమింగలం సంచ లనం సృష్టించింది. తీరం నుంచి తొలగించేందుకు యత్నించినపుడు దాని పొట్టపగిలి ఎన్నెన్నో ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. బాటిల్స్, కప్పులు, చెప్పులు, స్ప్రింగులు.. ఇలా లెక్కలేనంత ప్లాస్టిక్ కడుపులో పేరుకుపోయింది. అదే దాని చావుకు కారణమయిందని అధికారులు తేల్చారు. ఆసియా ఖండంలో ఉన్న 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్ దేశాల్లోనే నిక్షిప్తమ య్యాయని ‘మెక్‌నెసీ సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఎన్విరాన్మెంట్’ అనే సంస్థ అధ్యయనం చేసి నివేదించింది. ‘ప్లాస్టిక్ నియంత్రణ, నివారణకు మీరెలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నారో తెలుపండ’ని రెండు తెలుగు రాష్ట్రాలను హైకోర్టు అడిగింది. తదుపరి విచారణ లోపు ఆయా ప్రభుత్వాలు ఏం చెబుతాయో చూడాలి. దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వ హణ సంక్లిష్టమవుతూ వస్తోంది. రోజూ సగటున 15000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు జమ అవుతున్నాయి. 60 శాతం పునర్వినియోగం(రీసైకిల్) అవుతుండగా 40 శాతం వ్యర్థాల్ని అభద్ర విధానంలో పారవేస్తున్నారు. అది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సరైన సేకరణ, నిర్వహణ పద్ధ తులు లేకపోవడం, విధానాల అమలు లోపాల వల్లే ఈ దుస్థితి! అభి వృద్ధి చెందిన దేశాల తలసరి ప్లాస్టిక్ వినియోగంతో పోల్చి చూస్తే మనది నామమాత్రమే! ప్రపంచ సగటు తలసరి ప్లాస్టిక్ వినియోగం 28 కిలోలు కాగా అమెరికా (109), ఐరోపా (65), చైనా (38), బ్రెజిల్ (32)ల ముందు భారత్ (11కిలోలు) వినియోగం ఎంతో తక్కువ. అయినా, పద్ధతిగా వాడటం, వ్యర్థాల్ని పోగుచేయడం, నిర్వహణ ఘోరంగా ఉండ టం వల్లే ఇబ్బందులు. 2022 నాటికి మనదేశంలోనూ తలసరి విని యోగం 20 కిలోలకు చేరవచ్చని ఇంధన శాఖ అంచనా. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016లో కొన్ని మార్పులు చేయాలని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ఓ ఉన్నతస్థాయి కమిటీ కొన్ని సిఫార సులు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, నిర్వహణ స్థానిక సంస్థలకు అప్పగించాలని, ఉత్పత్తి–వినియోగం చేసే వారి నుంచి సదరు ఫీజు వసూలు చేయాలనీ ఈ కమిటీ సిఫారసు చేసింది. మన దేశంలో అత్యధి కంగా ప్యాకేజింగ్ (35 శాతం), బిల్డింగ్స్–నిర్మాణం (23), రవాణా (8), ఎలక్ట్రానిక్స్ (8), వ్యవసాయ (7), ఇతర (19శాతం) రంగాల్లో ప్లాస్టిక్ వినియోగమవుతోంది. పాలనా వ్యవస్థను జవాబుదారీ చేయాలి పర్యావరణ పరిరక్షణకు మూడేళ్ల కింద సరిగ్గా ఇవే రోజుల్లో ‘ప్యారిస్ ఒప్పందం’ జరిగింది. మనదేశం కూడా పలు వాగ్దానాలు చేసింది. ఆ దిశలో గొప్పగా అడుగులు పడటం లేదు. వచ్చేనెల క్యాటోవైస్ (పోలాం డ్)లో భాగస్వాముల సదస్సు (కాప్) జరుగనుంది. ప్యారిస్ ఒప్పందం అమలుకు అక్కడ బ్లూప్రింట్ తయారు చేస్తారు. ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తున్నారో 2020 నుంచి లెక్కలు మొదలవుతాయి. జాతీయ స్థాయిలో విధానాల పరంగా, స్థానిక స్థాయి ఆచరణ పరంగా చర్యలుండాలి. ప్రజలు నిబద్ధత చూపాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమౌతుంది. న్యాయస్థానం పేర్కొన్నట్టు ప్రభుత్వాలు బాధ్యత తీసు కోవాలి. ఖచ్చితత్వం పాటించాలి. ఎక్కడికక్కడ స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంలో చర్యలు చేపట్టాలి. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాల్లో వ్యక్తులుగా పౌరులూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ‘మనిషి విధ్వంసకారి’అనే మాటను చెరిపేయాలి. ‘బుద్ధిజీవి’అనే మాటను నిలబెట్టాలి. అప్పుడే పృథ్వికి రక్ష, భవితకు భరోసా! దిలీప్ రెడ్డి, ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
రైతుబంధు..ఆర్ అండ్ బీకి నిధులు బందు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ) నిధుల కటకటతో సతమతమవుతోంది. ఈ ప్రభావం వివిధ అభివృద్ధి పనులపై పడుతోంది.ఆర్అండ్ బీ నిధులను ‘రైతుబంధు’పథకానికి మళ్లించడంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని తెలుస్తోంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖను నిధుల కోసం బ్యాంకుల వద్ద అప్పు తీసుకోమని సూచించింది. ఆ యత్నానికి ముందస్తు ఎన్నికలు బ్రేకులు వేయడంతో ఆర్ అండ్ బీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆగడంతో వారు అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని వారి చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పనులు ప్రారంభించినా... ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్అండ్ బీకి కేటాయించిన రూ.5,600 కోట్ల నిధులు సకాలంలోనే వస్తాయని భావించిన ఆ శాఖ అధికారులు ఏప్రిల్‌లో ఆర్థిక సంవత్సరం మొదలవగానే.. పాత బిల్లులతోపాటు కొత్త పనుల అప్పగింతకు ముందుకెళ్లారు. ఇలా ఈ ఏడాది దాదాపుగా రూ.20వేల కోట్లకుపైగా విలువైన పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. అదే సమయంలో ఆర్అండ్ బీకి ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఆర్‌అండ్‌బీకి నిధులురావని, రూ.3000 కోట్లు బ్యాంకుల నుంచి రుణం కోసం ప్రయత్నించమని అధికారులకు సలహా ఇచ్చింది. దీనికోసం అధికారులు ప్రయత్నిస్తే... ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని 4 బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈలోగా ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో రుణం మంజూరుకు బ్యాంకులు వెనకంజవేశాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో అక్టోబరు తొలి వారంలోనే తెలంగాణ బిల్డర్ల అసోసియేషన్ పనులు నిలిపివేసింది. వారిని చర్చలకు పిలిచిన ప్రభుత్వం రూ.5,600 కోట్లు మంజూరుకు హామీ ఇచ్చింది. ఆ మేరకు వారు పనులు మొదలు పెట్టినా, నవంబరు ఆరంభం వరకూ నిధులు అందలేదు. ఈ విషయమై వారు పలుమార్లు సీఎస్, మంత్రి తుమ్మల, కేటీఆర్‌ల వద్ద చర్చలు జరిపినా పురోగతి రాలేదు. దీంతో వారు రెండోసారి సమ్మె యోచన చేశారు. చివరికి ఇటీవల సీఎస్ రూ.10 కోట్లు మంజూరు చేసి, రూ.10 లక్షల్లోపు బిల్లులకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేశారు. సీఎం పేషీ నుంచే ఆదేశాలు..! వాస్తవానికి అక్టోబరులో ఆర్ అండ్ బీ అధికారులు ప్రభుత్వంతో పలుమార్లు సమావేశమయ్యారు. బ్యాంకులు రుణం ఇవ్వడం లేదని, ప్రభుత్వమూ నిధులు ఇవ్వకపోతే.. పరిస్థితి ఇబ్బందికరమని తేల్చిచెప్పారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నిధుల మంజూరుకు హామీ ఇచ్చింది. చివరికి నవంబరు తొలి వారంలో నిధులు రావడం లేదంటూ సీఎం పేషీ నుంచి ఆర్ అండ్ బీ అధికారుల నెత్తిన పిడుగులాంటి వార్త వచ్చి పడింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆర్ అండ్ బీ శాఖకు రావాల్సిన నిధులను ‘రైతు బంధు ’పథకానికి బదిలీ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఇలా రోడ్లుభవనాల శాఖ చెల్లింపులకు చేతులెత్తేయాల్సిన పరిస్థితిలో పడింది. ఆశ్రయించిన బ్యాంకులూ ఎన్నికల నేపథ్యంలో వెనుకడుగు వేశాయి. ప్రస్తుతం ఈ ప్రభావం వివిధ అభివృద్ధిపనులపై ప్రభావం చూపుతోంది.పనులు చేసిన కాంట్రాక్టర్లూ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. -
‘కంటి వెలుగు’...స్ఫూర్తి కనుమరుగు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు పథకం స్ఫూర్తిని కొందరు వైద్యులు దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు, చత్వారం ఉన్న వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలన్న సర్కారు ఆశయాన్ని కొందరు తుంగలో తొక్కుతున్నారు. కొన్నిచోట్ల చత్వారం ఉన్నప్పటికీ బాధితులకు కేవలం రీడింగ్ గ్లాసులు ఇచ్చి పంపుతున్నారు.ప్రిస్క్రిప్షన్‌లో మాత్రం చత్వారం గ్లాసులు రాస్తూ.. రీడింగ్ గ్లాసులు చేతికి ఇవ్వడం గమనార్హం. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఆ మధ్య నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో ఒక మహిళా ఉద్యోగి ప్రసన్నకు చత్వారం ఉందని నిర్దారించారు. ప్రిస్క్రిప్షన్పైనా చత్వారం కళ్లద్దాలు అని రాసి ఉన్నా ఆమెకు రీడింగ్ గ్లాసులు ఇచ్చి పంపడంపై విమర్శలు వచ్చాయి. అత్యంత కీలకమైన హైదరాబాద్ సచివాలయంలోనే ఇలా జరిగితే, ఇక సాధారణ గ్రామీణ ప్రాంతాల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉందంటున్నారు. 11.98 లక్షల మందికి చత్వారం... రాష్ట్రంలో కంటి వెలుగు పథకం ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న వారందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు, చత్వారం కళ్లద్దాలు, క్యాటరాక్ట్ వంటి లోపాలుంటే ఆపరేషన్లు చేయాలన్నది సర్కారు లక్ష్యం. పథకం ప్రారంభమైన నాటి నుంచి సోమవారం వరకు 85.83 లక్షల మందికి కంటి పరీక్షలు జరిపారు. అందులో 52.68 లక్షలు (61.38%) మందికి ఎలాంటి కంటి లోపాలు లేవని నిర్ధారించారు. మిగిలిన వారిలో 15.02 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు.మొత్తం 11.98 లక్షల మందికి చత్వారం ఉందని నిర్ధారించారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇస్తామన్నారు. ఇప్పటివరకు కేవలం 78 వేల మందికే చత్వారం కళ్లద్దాలు అందాయి. ఇంకా 11.19 లక్షల మందికి ఆ గ్లాసులను సరఫరా చేయనేలేదు. నెల రోజుల్లోగా అందజేయాలని అనుకున్నా కూడా సరఫరా చేయడంలేదు. సరఫరాలో అనేక లోపాలున్నందున చాలాచోట్ల వైద్యులు, కొందరు అధికారులు చత్వారం ఉన్నా కూడా సాధారణ రీడింగ్ గ్లాసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. మరోవైపు 12.29 లక్షల మంది ప్రజలకు వివిధ రకాల కంటి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. అక్కడక్కడ ఆపరేషన్లు వికటించడంతో, ఎన్నికల సమయంలో ఆపరేషన్లు చేయకూడదని నిర్ణయించారు.ఇలా ఆపరేషన్లకు బ్రేక్ పడింది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. -
టీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది
-
టీఅర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లూగా చేసిందేమి లేదు
-
దద్దరిల్లనున్న ధర్నాచౌక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలను ప్రభుత్వం నిషేధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిరసన గళం అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని, అటువంటి నిరసన గళాన్ని అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్యలను తాము ఎంతమాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్ర హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, సమావేశమయ్యే హక్కు దేశ పౌరులందరికీ ఉందని, సహేతుక ఆధారాలు లేకుండా ఈ హక్కులపై ఏకపక్ష ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని తేల్చి చెప్పింది. ధర్నాచౌక్ కాకుండా నిరసన కార్యక్రమాల నిర్వహణకు వేదికగా సరూర్‌నగర్ స్టేడియాన్ని ఎంపిక చేశామని, అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నా తమకు ఇబ్బంది లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలోలాగే ధర్నాచౌక్‌ను వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే నిరసనల నిర్వహణ సమయంలో అర్థవంతమైన ఆంక్షలు విధించవచ్చని పోలీసులకు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఆరు వారాలపాటు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టేందుకు తమ ఈ ఉత్తర్వులు ఎంతమాత్రం లైసెన్స్ కాదని తేల్చి చెప్పింది. స్థానికులకు ఇబ్బంది అవుతోందనే... ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు ఇదే అంశంపై విశ్రాంత ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు రాసిన లేఖను కూడా హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యాల్లో కాంగ్రెస్ నేత నగేష్ ముదిరాజ్ ఇదే అభ్యర్థనతో ఇంప్లీడ్ అయ్యారు. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్. శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు చేపడుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే ఇందిరాపార్క్ చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయని, నిరసనల వల్ల భారీగా ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోందన్నారు. అంతేకాక ఆ ప్రాంతం అత్యధిక జనసాంద్రతగల ప్రాంతమని వివరించారు. అందుకే సరూర్‌నగర్ స్డేడియాన్ని ధర్నా చౌక్‌గా గుర్తించామని, అక్కడ నిరసనలు చేపట్టేందుకు తమకు అభ్యంతరాలు లేవన్నారు. ఆ గళాల వల్లే ప్రజాస్వామ్య బతికిబట్టకడుతోంది... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు చెప్పేది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు పెట్టుకోవద్దంటారు అంతేనా? జనాలు ఉన్న చోట కాకుండా అడవుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలా? ఇంట్లో ఏడుస్తున్న పిల్లాడిని పైగదిలోకి వెళ్లి ఏడువు అన్నట్లు మీ వాదన ఉంది. నిరసనల వల్ల ఇబ్బంది ఉంటే అర్థవంతమైన ఆంక్షలు విధించండి. పరిమితులు, షరతులతో అనుమతులివ్వండి. అంతేకానీ నిరసన గళాలు వినిపించకుండా చేస్తామంటే ఎలా? ఇంకా ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతోందంటే ఈ నిరసన గళాలే కారణం. ఇవే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఇవి లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ట్రాఫిక్ సమస్య ఉంటే వేల సంఖ్యలో రిజిస్టర్ అవుతున్న కార్ల సంఖ్యను వాటిని వందల సంఖ్యలోకి తీసుకురండి’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తిరిగి శరత్ వాదనలు వినిపిస్తూ ధర్నాచౌక్ వద్ద అనుకోని ఘటన ఏదైనా జరిగితే బయటపడటం కష్టమని పేర్కొనగా ఇప్పటివరకు అటువంటి ఘటనలు ఎన్ని జరిగాయని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ప్రైవేటు’కోసం నిరసనలను అడ్డుకోమంటారా?! ‘ఆ చుట్టుపక్కల అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఎవరు ఇవ్వమన్నారు? అన్ని విద్యా సంస్థలకు అనుమతులు ఎందుకిచ్చారు. ఇందులో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి? ఎన్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి చెందాలన్నది రాజ్యాంగకర్తల ఆలోచన. అయితే ఇప్పుడు అంతా ప్రైవేటుమయం అయిపోయింది. అందుకు మీరు చెబుతున్న ఉదాహరణలే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల కోసం నిరసన గళాలను అడ్డుకోమంటారా? ఈరోజు ధర్నాచౌక్ వద్ద నిరసనలు చేపట్టడానికి వీల్లేదంటారు. రేపు నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలని కూడా నిర్ధేశిస్తారు. మీ (ప్రభుత్వ) వాదనతో మేం ఎంత మాత్రం ఏకీభవించడం లేదు’అని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఎన్నికల అనంతరానికి ఈ వ్యాజ్యాలను వాయిదా వేయాలని, ఇప్పుడు ధర్నాచౌక్ వినియోగానికి అనుమతినిస్తే ఎన్నికల సమావేశాలన్నీ అక్కడే జరుగుతాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ పేర్కొనగా ఇందుకు ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం ధర్నాచౌక్ వద్ద పరిస్థితి ఏమిటని ధర్మాసనం ఆరా తీయగా వీహెచ్ తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి స్పందిస్తూ అక్కడ ప్రైవేటు టూరిస్ట్ ఆపరేటర్లు తమ బస్సులను పార్కింగ్ చేస్తున్నారన్నారు. ఆ హక్కు ఎందుకు లేదు..? ఈ సమయంలో నిరసన తెలియచేసే ప్రాంతాన్ని ఎంచుకునే హక్కు ఆందోళనకారులకు లేదని శరత్ వాదించగా ఎందుకు లేదని ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా సమావేశమయ్యే హక్కు ఈ దేశ పౌరులకు ఉందని స్పష్టం చేసింది. ఈ సమయంలో చాడ వెంకటరెడ్డి తరఫు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్, వీహెచ్ తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి స్పందిస్తూ గత 20 ఏళ్లుగా ధర్నాచౌక్ కొనసాగుతోందని, ఎప్పుడూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, ఒకవేళ ఏవైనా జరిగి ఉంటే అవి పోలీసుల అత్యుత్సాహం వల్లే జరిగాయన్నారు. ఈ సమయంలో ఇంప్లీడ్ పిటిషనర్ నగేష్ ముదిరాజ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ రాజకీయ పార్టీలే నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, వాస్తవానికి అక్కడ దివ్యాంగులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, చిరుద్యోగులూ నిరసన కార్యక్రమాలు చేపడుతుంటారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అదే చీఫ్ జస్టిస్ బంగ్లాకు తీసుకెళ్లమంటే వింతగా చూస్తారు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ‘ధర్నా చౌక్‌కు ఒక ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు నేను మా కారు డ్రైవర్‌ను ధర్నా చౌక్ వద్దకు తీసుకెళ్లమంటే నేరుగా తీసుకెళ్తాడు. అదే ఓ ఆటో డ్రైవర్‌ను నన్ను చీఫ్ జస్టిస్ బంగ్లా వద్దకు తీసుకెళ్లమంటే వింతగా చూస్తాడు. అది ఎక్కడుందని అడుగుతాడు. తాజ్‌కృష్ణకు సమీపంలో ఉందని, అక్కడి నుంచి ముందుకెళ్లి ఎడమ వైపు తిరిగి చీఫ్ జస్టిస్ బంగ్లా వస్తుందని చెప్పినా కూడా నేరుగా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. కానీ ధర్నా చౌక్ పరిస్థితి అది కాదు. దానికున్న గుర్తింపు అలాంటిది’అంటూ వ్యాఖ్యానించింది. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ ధర్నాచౌక్‌ను గతంలోలాగా వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. -
స్థిరమైన ప్రగతికే ఓటు వేయాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పన్ను లు పెంచారు, అప్పులు చేశారు. కానీ, విద్య, వైద్య, రవాణా, కలుషితాల నివారణ, అవినీతి నిర్మూలన మొదలైన వాటి కోసం ఖర్చు చేయవలసినంత చేయలేదు. ఆ డబ్బంతా ఆడంబరాలకు, అట్టహాసాలకు ఖర్చుచేశారు. పాపం ప్రజలు.. ధరలు ఎంత పెరిగినా ఫరవాలేదు, నిరుద్యోగం ఎంత పెరిగినా ఫరవాలేదు, అవినీతి ఎంత పెరిగినా ఫరవాలేదు, అపరిశుభ్రత, కాలుష్యం, లంచగొండితనం, విచ్చలవిడిగా తాగుడు, ఆడుడు, హత్యలు, ఆత్మహత్యలు ఎంత పెరిగినా ఫరవాలేదు కానీ ఏవో కొన్ని పెన్షన్లు, సబ్సిడీలు, రుణమాఫీలు, నిరుద్యోగభృతులు ఇస్తే ప్రజలు సంబరపడిపోతారని భ్రమిస్తున్నారు. గవర్నమెంట్‌ను చక్కగా నడిపి తద్వారా డబ్బు మిగిల్చి ఇచ్చేటివి ఇవ్వక, చేసేటివి చేయక ప్రజలు టాక్స్‌ల ద్వారా కట్టిన డబ్బును ఇలా ఖర్చు చేయడం ఎంతవరకు సబబు. ఒక చైనీస్ సామెతుంది... ‘ఎవరికైనా ఇవ్వదలచుకుంటే చేపను పట్టడానికి గాలాన్ని ఇవ్వు కాని నేరుగా చేపనే పట్టి ఇవ్వకు’ అని. అంటే, జనాల్ని సోమరిపోతులుగా తయారు చేయకుండా, కష్టపడి సంపాదించుకోవడానికి అవసరమైన శిక్షణలను, పనిముట్లను, పరికరాలను మాత్రమే ఇవ్వాలి అని ఉపదేశించడమే. ధరలు ఎంత పెరిగినా ఫరవాలేదు, నిరుద్యోగం ఎంత పెరిగినా ఫరవాలేదు, దవాఖానాలు, విద్యాలయాలు ఎంత భ్రష్టు పట్టినా, తోవలు ఎంత కంకర తేలినా, లంచగొండితనం ఎంత బాహాటమైనా, హత్యలు ఆత్మ హత్యలు ఎంత పెరిగినా పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని నడపడం గొప్ప పని అనిపించుకోదు. జనాలు ఈ పైపై మెరుగులకు మోసపోకూడదు. అందుకే స్థిరమైన ప్రగతికి చెందిన వాటిని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. పైపై మెరుగులు ఎల్లకాలాలకు చెందినవి, స్థిరమైనవి కావు. ఎప్పుడూడిపోతాయో, మారిపోతాయో తెలియదు. అందుకే స్థిరమైన ప్రగతికి చెందిన కార్యక్రమాలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. టెంపరరీ బెనిఫిట్స్ కాదు కావలసింది, పర్మనెంట్ బెనిఫిట్స్. వాటిని కల్పించే ప్రభుత్వాన్ని పాలకులను ఎన్నుకోవాలి. అభివృద్ధి చెందిన ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలలో ఓటర్లు ప్రభుత్వాలను ధరల పెరుగుదల, తరుగుదలను బట్టే ఎన్నుకుంటారు. కానీ మన దేశంలో ధరల పెరుగుదలను అతి ముఖ్య అంశంగా భావించి ఓటు వేయరు. అటు తదుపరి అవి విపరీతంగా పెరిగితే తల బాదుకుంటారు. కె.సి.ఆర్.గారు సి.ఎం. అయ్యాక ప్రభుత్వం ఖర్చు అయిదేళ్ళలో అయిదింతలు ఎక్కువయింది. దీనికి కారణం అప్పులు చేయుట, టాక్సులు పెంచుట, ఎసెన్షియల్ సర్వీసెస్‌ను కుంటుపరచి వాటికి చెందిన వనరులను ఏవేవో అట్టహాసాలకు, ఆర్భాటాలకు, పటాటోపాలకు తరలించడమే. వీటికి తోడు అయినవారికి, కానివారికి, అవసరమున్నవారికి, లేనివారికి అడిగినన్ని భూములు, నిధులు అవసరానికన్నా ఎక్కువ కేటాయించడమే. ఈ విచ్చలవిడి ఖర్చులకు దాదాపు రెండు లక్షల కోట్ల అప్పు చేసినట్లు పత్రికలు, తదితరులు పదే పదే ప్రకటిస్తూనే ఉన్నారు. వీటిపై పౌరులు కోట్లాది రూపాయలు ‘మిత్తి’ కట్టవలసి ఉంటుంది. ఆ భారాన్ని ప్రజలు ధరల పెరుగుదల రూపంగా మోయవలసి ఉంటుంది. మనకు కూడా ఈ పక్క ఆ పక్క రాష్ట్రాలుంటాయి. వాటితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే, రోడ్లు, రైళ్లు, జలవనరులు, వ్యాపారాలు, ఇంకా ఎన్నో అవసరాలు ఉంటాయి ఒకరితో ఒకరికి. ఒకరు సహకరించంది మరొకరికి నడవదు. ఈ అవగాహన మన కె.సి.ఆర్.కి ఏమాత్రం ఉన్నట్లు లేదు. ఉదాహరణకు ఆంధ్రా నుండి తెలంగాణ విడిపోయాక ఏపీ సీఎంతో సుహృద్భావంగా, స్నేహంగా ఉంటే పరస్పర సహాయాలకు పనికొస్తుందన్న ఆలోచన లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు విషయానికి వస్తే దేశానికే పీఎం అవబోతున్నట్లు, దానికి కావలసినంత తెలివి తనవద్ద తప్ప మరెవ్వరి వద్ద లేనట్లు ఆదరాబాదరాగా అటు బెంగాల్‌కు, ఇటు కర్ణాటకకు, అటు ఒడిశాకు, ఇటు తమిళనాడుకు తిరిగొచ్చారు. అచటి నేతలనందరినీ ఏకం చేసేసి ఒక కూటమిగా ఏర్పరచి, అలాగే ఉత్తర రాష్ట్రాల్లో కూడా యు.పి. సి.ఎం., మాయావతి తదితరులతో సంప్రదింపులు జరిపి వారినందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పీఎం అవుదామనుకున్నారు. తన తదుపరి తన కుమారున్ని సీఎంగా చేయొచ్చునని కూడా భావిస్తున్నారు. అది మిస్ ఫైర్ అయి, అట్టర్ ఫ్లాప్ అయింది. అది అతనిని దేశవ్యాప్తంగా నవ్వులపాలు చేసింది. అందుకే నేతలు స్థిరమైన ప్రగతిపై దృష్టి పెడితే ఎటు వంటి మ్యాజిక్కులు, జిమ్మిక్కుల అవసరం ఉండదు. వెల్చాల కొండలరావు వ్యాసకర్త, గౌరవ అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ సమితి, తెలంగాణ -
మూడు నెలల్లో పంచాయతీ
-
నాలుగేళ్లలో అరవై ఏళ్ల దోపిడీ
కామారెడ్డి అర్బన్: ఉద్యమాలు, అమరుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అరవై ఏళ్లలో కాని దోపిడీ ఈ నాలుగేళ్లలో జరిగిందని కవి అందెశ్రీ ఆరోపించారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన తెలంగాణ రచయితల వేదిక(తెరవే) జిల్లా ప్రథమ మహాసభలు ప్రారంభమయ్యాయి. ‘తెలంగాణ సమా జం– భరోసాలు –తీరు తెన్నులు’అనే అంశంపై అందెశ్రీ మాట్లాడారు. ‘నాడు నిజాం పైజామాను ఊడగొట్టి.. రజాకార్లను తరిమికొట్టిన తెలంగాణ ప్రజలంటే అలుసా అని ప్రశ్నించారు. రాచరిక పాలనకు చరమగీతం పాడిన ప్రజలపై పాలకులు చిన్నచూపు చూడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పుణ్యమా అని నేడు రాష్ట్రంలో కవులు రెండుగా విడిపోయారని అందెశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రజల్లో నిలబెట్టడానికి కవులు తమ కలాలను ప్రజల పక్షాన నిలపాల్సిన అవసరం ఉందన్నారు. 105 మందిని గెలిపించుకుంటానన్న వ్యక్తి.. ప్రజల ఆశీర్వాదం పేరిట మర్నాడే çహుస్నాబాద్ సభ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని నిలదీశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో సర్కారు సంచి కోసం కవులు దేబరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారు... తెలంగాణలో నేడు ప్రజలను ఓటర్లుగానే చూసే దుస్థితి వచ్చిందని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సమయం ఆసన్నమైందని తెరవే రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్‌రావు పేర్కొన్నారు. మేధావిలోకం నాలుగేళ్లుగా నిశబ్దంలోకి జారిపోయిం దని పేర్కొన్నారు. కాళేశ్వరం కవులు, ప్రజాక్షేత్రం కవులు అని రెండు శిబిరాలుగా సాహితీ జీవులు విడిపోయారన్నారు. తెరవే అఖిల భారత అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, రచయితలు అల్లం రాజయ్య, సీహెచ్ మధు తదితరులు ప్రసంగించారు. -
‘ఆపద్ధర్మం’లో అడ్డదారి బదిలీలు
సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలను తీసుకునే అధికారం లేనప్పటికీ అడ్డదారి బదిలీలకు విద్యాశాఖ తెరలేపింది. ఒకవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, మరోవైపు టీచర్ల బదిలీలపై నిషేధం ఉండగా పైరవీలకు తలొగ్గింది. నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది జూన్‌లో సాధారణ బదిలీలు జరిగాయి. దాదాపు 74 వేల మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా 46 వేల మందికి స్థానచలనం కలిగింది. ఇందులో దాదాపు వంద మంది టీచర్లు తమ బదిలీల్లో తప్పులు దొర్లినట్లు పేర్కొంటూ విద్యాశాఖకు అప్పీళ్లు చేసుకున్నారు. వీటిని పక్షంరోజుల్లో పరిశీలించి పరిష్కరించాల్సి ఉండగా మూడు నెలలు కావస్తున్నా పట్టించుకోకపోగా దొడ్డిదారి బదిలీలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నలుగురు టీచర్లకు వరుసగా బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేయడం విద్యాశాఖ వర్గాల్లో దుమారం రేపుతోంది. వీరిలో ముగ్గురు టీచర్లకు అంతర్ జిల్లా బదిలీలు కాగా, మరో టీచర్‌కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో స్థానచలనం కలిగింది. ఒక టీచర్‌ను మాత్రం ఏకంగా జిల్లా పరిషత్ యాజమాన్యం నుంచి ప్రభుత్వ యాజమాన్యానికి బదిలీ చేయడం గమనార్హం. మరో 22 మంది టీచర్లకు ప్రత్యేక బదిలీలు కలిగించేందుకు విద్యాశాఖలో పైరవీలు వేగవంతమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు... వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎల్.హెచ్.దుర్గాభవాని(స్కూల్ అసిస్టెంట్–ఇంగ్లిష్)ని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 24న ప్రొసీడింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సెప్టెంబర్ 11న మెమో జారీ చేశారు. కరీంనగర్ జిల్లా ముగ్దూంపూర్ పాఠశాలలో ఎస్జీటీ పులి కవితను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ హరిజనవాడ పాఠశాలకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 22న ప్రొసీడింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మోమోను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే నెల 11వ తేదీన జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బోడజానంపేట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న వి.జీవనజ్యోతి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బొమ్మనగండి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 12న ప్రొసీడింగ్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మోమోను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే నెల 11వ తేదీన జారీ చేశారు. సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం రాజ్గోపాల్పేట్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పీవీ సునిత(స్కూల్ అసిస్టెంట్–ఇంగ్లిష్)ను హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెప్టెంబర్ 6న మెమో జారీ చేశారు. స్థానిక సంస్థల యాజమాన్యానికి చెందిన టీచర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకు బదిలీ కావడం గమనార్హం. పైరవీలకు తలొగ్గి ఆపద్ధర్మ ప్రభుత్వంలో జరిగిన బదిలీల వెనుక కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. సిద్దిపేట్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన టీచర్ బదిలీ విషయంలో విద్యాశాఖ అధికారులపై సీఎం ఓఎస్డీ ఒత్తిడి చేసినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన టీచర్ విష యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సిఫారసు ఆధారంగా బదిలీ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. వికారాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డికి బదిలీపై వచ్చిన టీచర్ విషయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సిఫారసు ఆధారంగా బదిలీ చేసినట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. అంతర్జిల్లా బదిలీ విషయంలో భారీగా లావాదేవీలు జరిగినట్లు విద్యాశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక కేటగిరీల బదిలీలు కావడంతో పెద్దమొత్తంలోనే ముడుపులు చెల్లించినట్లు ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి. జూన్‌లో సాధారణ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే రెండ్రోజుల ముందు కూడా ఇదే తరహాలో వంద మంది టీచర్లకు దొడ్డిదారిలో బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదు
సాక్షి, కామారెడ్డి: ఇతరుల ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామంలోని 50 మంది యువకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. దేశానికి ముప్పు ఉందనుకున్న సమయంలో కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకుని మాత్రమే ట్యాప్ చేస్తారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో కొందరు అధికారులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ గురవుతన్నాయేమోనని భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ట్యాపింగ్ ద్వారా ఏదైనా సమాచారం దొరుకుతుందని వెతుకుతున్నారని.. వారు ఎంత వెతికినా పర్వలేదని అన్నారు. తన ఫోన్ కూడా మార్చలేదని తెలిపారు. తన ఒక్కడి నెంబర్ మాత్రమే కాదని.. ఇంకా చాలా మంది నెంబర్లు ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, అధికార టీఆర్ఎస్ ప్రోద్బలంతో పోలీసు ఉన్నతాధికారులు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన గవర్నర్ నరసింహాన్‌కు కూడా లేఖ రాశారు. -
‘ఏ అమరులు చెప్తే వారికి పదవులిచ్చారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన వారి గురించి మాట్లాడే నైతిక అర్హత టీఆర్ఎస్లో ఎవరికి లేదని కాంగ్రెస్ నాయకులు దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, మదన్‌మోహన్‌రావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు అమరుల పేరు చెబితే చనిపోయిన వారి ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. కేసీఆర్ నిరహార దీక్ష చేస్తే.. ఆత్మహత్య చేసుకుందామంటే హరీష్‌రావుకు అగ్గిపుల్ల కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ జాతి, నీతి లేని పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ అమరులు చెప్తే మహేందర్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రి పదవులిచ్చారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ గౌరవాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు తాకట్టుపెట్టారని విమర్శించారు. విమర్శలు చేస్తే ఎన్నికలకు పోతామంటున్నారు.. అలాగైతే టీఆర్ఎస్ జీవితాంతం ఎన్నికలకు పోవాలని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటే మంచి.. కానీ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటే అనైతికమా అని ప్రశ్నించారు. 2009లో సీపీఎం, టీడీపీలతో టీఆర్ఎస్ పొత్తు ఎలా పెట్టుకుందని నిలదీశారు. తమది ప్రజల కూటమని.. దొంగల కూటమి కాదని తెలిపారు. తమ అధిష్టానం ఢిల్లీలో ఉందని.. మరి కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదని.. అందులో ఏ పేజీపైనైనా తాను చర్చకు సిద్దంగా ఉన్నట్టు వెల్లడించారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తామిచ్చిన తెలంగాణను పాలిస్తూ.. తామిచ్చిన మెట్రో ప్రారంభించి.. తామిచ్చిన ఇళ్లను ప్రారంభిస్తోందని విమర్శించారు. అమరుల కుటుంబాలను కాంగ్రెస్ పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన చేస్తుందని తెలిపారు. ఉద్యమ సమయంలో చేపట్టిన సాగర హారంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. అలీబాబా అరడజన్ దొంగల లెక్క తెలంగాణను టీఆర్ఎస్ దోచుకుంటుందని ఆయన ఆరోపించారు. మదన్మోహన్రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు కౌరవులైతే.. కాంగ్రెస్ నాయకులు పాండవులని అన్నారు. ఏం అభివృద్ధి చేశారని సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళతారని ప్రశ్నించారు. -
తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహన్ని నింపారు. అంతేకాకుండా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విధంగా అమిత్ షా ట్విటర్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలను ఆకర్షించేందుకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందకుండా అక్కడి ప్రభుత్వం వ్యవహారించడం బాధాకరమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్ధ ఆలోచన కారణంగా నే తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారని విమర్శించారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్ధ ఆలోచన కారణంగా తెలంగాణ పేదలు ఈ అద్భుతమైన కార్యక్రమ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. పేదల వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కార్యకర్తలు నిలదీయాలి. — Amit Shah (@AmitShah) September 24, 2018 -
రెండో విడత షురూ..
గద్వాల వ్యవసాయం : గొర్రెల పెంపంకం అభివృద్ధి పథకంలో భాగంగా అందించే రెండో విడత గొర్రెల పంపిణీ మొదలైంది. జిల్లా పశుసంవర్దకశాఖ అధికారులు ఇప్పటికే జాబితా ‘ఏ’ కింద మొదటి విడతను పూర్తి చేసి జాబితా ‘బీ’ కింద ఉన్న లబ్ధిదారులకు జూలై చివరివారం నుంచే పంపిణీ ప్రక్రియ ఆరభించారు. కొత్తగా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని గొర్రెలు కావాలని ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సైతం పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించారు. రాయితీ ఇలా.. పెంపకందారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది జూన్ 20న ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో కురుమ యాదవులు గ్రామాల వారీగా సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. డిప్ ద్వార మొదటి విడత, రెండో విడత లబ్దిదారులను ఎంపిక చేశారు. మొదటివిడత లబ్దిదారులకు (లిస్ట్–ఏ) 2017–18లో, రెండో విడత లబ్ధిదారులకు (లిస్ట్–బి) 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యూనిట్లో ఒక పొట్టేలు, 20 గొర్రెలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో యూనిట్‌కు రూ.1.25లక్షలు ఖర్చు అవుతుండగా ఇందులో లబ్దిదారుడు 25శాతం చెల్లిస్తే 75శాతం ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది. శరవేగంగా రెండో విడత పంపిణీ రెండో విడత కింద (2018–19) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పంపిణీ షురూ చేశారు. జూలై చివరివారం నుంచే ప్రక్రియ ప్రారంభంకాగా ఆగస్టు 15న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా కొన్ని యూనిట్లు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 487 యూనిట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలను ఏపీలోని అనంతపురం, తాడిపత్రి, కదిరి ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. రెండో విడత గొర్రెలను ఏపీలోని కడప, మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని హుమనాబాద్‌ల నుంచి తీసుకొస్తున్నారు. పశుసంవర్దకశాఖ అధికారులు అక్కడి వెళ్లి గొర్రెల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి లక్ష్యం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 35,000 మందితో ప్రతిపాదనలు గత ఏడాది పథకాన్ని ప్రారంభించగా గొర్రెలను కావాలనుకునే పెంపకందారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అందరి సమక్షంలో డిప్ వేసి లిస్ట్ ఏ, బీగా విభజించారు. అయితే జిల్లాలో చాలామంది కురువ కులస్థులు తమను మాదాసి, మాదారి కురువలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల డిప్ కార్యక్రమాన్ని బహిష్కరించారు. సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్నప్పటికీ డిప్‌కు దూరంగా ఉన్నారు. ఇలా సుమారు 35వేల మంది ఉన్నారు. అయితే రెండో విడతలో తమకు గొర్రెల యూనిట్లను అందించాలని, అధికారులు రెండో విడతకు తోడు అదనంగా 35వేల యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు నివేదించారు. అందరికీ న్యాయం మొదటివిడత గొర్రెల పంపిణీ లక్ష్యాన్ని పూర్తిచేశాం. రెండో విడతలోనూ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప, నాందేడ్, హుమనాబాద్ ప్రాంతాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తున్నాం. అయితే రెండోవిడతలో మరో 35వేల యూనిట్లు అదనంగా మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. – డాక్టర్ ఆదిత్య కేశవసాయి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జిల్లాలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు : 182 సహకార సంఘాల్లోని సభ్యులు : 35,300 మంది మొదటి విడత పంపిణీ లక్ష్యం : 10,872 యూనిట్లు ఇప్పటివరకు చేసింది : 10,520 యూనిట్లు రెండో విడత పంపిణీ లక్ష్యం : 10,782 ఇప్పటి వరకు చేసింది : 487 యూనిట్లు -
లోకేష్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఈటల
సాక్షి, హుస్నాబాద్ (సిద్దిపేట): టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లోకేష్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా, హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రజాకార్ల రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందన్న ఆంధ్ర నాయకులు ఏమయ్యారో ప్రజలకు తెలుసని ఈటెల మండిపడ్డారు. ప్రశాంతమైన అభివృద్ది ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల మెప్పుపొందిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చదవండి: లోకేష్ ఏమన్నాడంటే.. -
నేడు తెలంగాణ అసెంబ్లీ రద్దు...!
-
‘డబుల్’ కల తీరుతోంది!
జెడ్పీ సెంటర్(మహబూబ్‌నగర్): గూడు లేని నిరుపేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. రాష్ట్రప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్రూం గృహాలు నిర్మిస్తుండగా.. నిరుపేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధహయ్యాయి. మహబూబ్‌నగర్ పట్టణానికి 2,300 ఇళ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేయగా.. ఇప్పటికే క్రిస్టియన్‌పల్లిలో 310 ఇళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక మండల పరిదిలోని దివిటిపల్లిలో మరో 1,334 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇందులో 882 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం హౌజింగ్ పీడీ రమణారావు గృహాలను పరిశీలించారు. దీంతో మరో పక్క వీరన్నపేటలో 660 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రతిష్టాత్మకం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రకటించారు. అంతేకాకుండా పథం తీరుతెన్నులపై స్వయంగా ఆయనే పరిశీలిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. రూ.5 లక్షలకు పైగా వ్యయంతో ప్రభుత్వమే ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు ఇస్తుండడంతో నిరుపేదలు కొండంత ఆశ పెట్టుకున్నారు. ఈ మేరకు దివిటిపల్లిలో 882 గృహాలను బుధవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1,334 ఇళ్ల నిర్మాణం మండల పరిధిలోని దివిటిపల్లిలో 1,334 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా 882 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొత్తంగా 52 ఎకరాల్లో ఇళ్లను నిర్మిస్తుండగా.. తొలుత మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇళ్లను ప్రారంభించి ఆ తర్వాత లబ్ధిదారులను కేటాయించాలని నిర్ణయించారు. సీఎం జిల్లా కేంద్రానికి మంజూరు చేసిన 2,300 ఇళ్ల కోటాలో వీటి నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీరన్నపేట, పాతపాలమూర్, పాత తోటకు చెందిన వారి కోసం ఈ ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. క్రిస్టియన్‌పల్లిలోని ఆదర్శనగర్ 523 సర్వే నెంబర్లో 15 ఎకరాల్లో డబుల్ ఇళ్ల నిర్మాణాలు సాగుతోంది. ఇందులో 310 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కూడా అందజేశారు. ఇక 2,300 ఇళ్లలో పాత తోట వాసులకు 234, పాత పాలమూర్ వాసులకు 530 ఇళ్లు, వీరన్నపేట వారి కోసం 1,536 ఇళ్లు కేటాయించారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లా కేంద్రంలోని దివిటిపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. ఇందులో 882 ఇళ్లను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనుండగా ఏర్పాట్లు పూర్తిచేశాం. మంత్రి ప్రారంభించిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తాం. – రమణరావు, హౌజింగ్ పీడీ -
‘ప్రగతి నివేదన సభ’పై హైకోర్టులో పిటిషన్
సాక్షి, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’ ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా, సాంఘిక మాద్యమాల ద్వారా చేయాలని.. ప్రజలకు, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. శరవేగంగా ‘ప్రగతి నివేదన సభ’ ఏర్పాట్లు సెప్టెంబర్ 2న కొంగర్ కలాన్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు శరావేగంగా జరుగుతున్నాయి. సభకోసం ఔటర్ రింగ్ రోడ్డునుంచి ప్రత్యేకంగా రోడ్లను వేశారు. ఔటర్ రింగ్ రోడ్డునుంచి నేరుగా పార్కింగ్ ప్లేసులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
సీఎం కేసీఆర్ వరాలపై మథనం!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటవెంటనే నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలను పూర్తి చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 30 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలాలను, నిధులను ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. బీసీల్లోని 30 కులాల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలను, నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ మరో పది ఉత్తర్వులను జారీ చేశారు. – బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని స్థలాలను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. భవనాల నిర్మాణానికి రూ.58.75 కోట్లను కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొంది. ► ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎస్సీ వర్గాల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. ► నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.2.81 కోట్లను మంజూరు చేసింది. ► మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో భీమా నది పుష్కరాల పనుల కోసం రూ.5 కోట్లు కేటాయించింది. ► పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 242 అభివృద్ధి పనుల కోసం రూ.2.30 కోట్లను విడుదల చేసింది. ► వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల–ఎర్రగట్టు గుట్ట రోడ్డు వెడల్పు పనుల కోసం రూ.4.45 కోట్లను కేటాయించింది. ► సూర్యాపేట జిల్లాలోని అభివృద్ధి పనుల కోసం రూ.3.62 కోట్లను కేటాయించింది. -
ఎమ్మెల్యేలకు ‘నివేదన’ పరీక్ష
అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సమీకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కేసీఆర్ దృష్టిని ఆకర్షించేలా జన సమీకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత ప్రకటించడంతో ఎన్నికల వేడి రాజేసి నట్లయ్యింది. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని, రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు కేటాయిస్తామని స్పష్టత ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సమీకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో.. జిల్లాలోని ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులను తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తున్నారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించేలా జన సమీకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల జోన్లోకి వచ్చేశామని, రేపే ఎన్నికలు అనుకుని సమాయత్తం కావాలి.. అని అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేడిని రాజేసింది. మరోవైపు సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని, రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టత ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్ పెరిగింది. ఈ సంకేతాలు ఒక రకంగా టిక్కెట్ల రేసులో ఉన్న ఆశావహుల్లో ఆశలు రేకెత్తించినట్లయింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్పు చేయాల్సిన వారిలో జిల్లాలో ఏ నియోజకవర్గం ఉంటుంది.. అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి రెండు లక్షల మంది.. జాతీయ రాజకీయ వర్గాల దృష్టిని సైతం ఆకర్షించేలా అధికార పార్టీ సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ శివారులో ప్రగతి నివేదన భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయిం చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, రాష్ట్ర కార్యవర్గం నేతల సమావేశం అనంతరం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా మంత్రి పోచారం నివాసంలో సమావేశమయ్యా రు. నియోజకవర్గానికి 20 వేల నుంచి 25 వేల మందిని తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి వం టి నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో శ్రే ణులను తీసుకెళ్లేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. లారీలు, అందుబాటులో ఉన్న అన్ని రకా ల వాహనాల్లో తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రాక్టర్లలో తరలివెళ్లే వారు ఒక రోజు ముం దుగానే కొంగరకు చేరుకోవాలని భావిస్తున్నారు. జిల్లా సమన్వయ కర్తగా ప్రశాంత్‌రెడ్డి.. ప్రగతి నివేదన సభకు ఆయా నియోజకవర్గాల్లో జన సమీకరణకు ఇన్చార్జిగా జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. జిల్లా సమన్వయకర్తగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించారు. ఇద్దరు నేతల పర్యవేక్షణలో శ్రేణుల తరలింపు జరగనుంది. కాగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమాయత్త సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యవర్గ నేతలను ఆహ్వానించకపోవడం పట్ల సదరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అన్ని బస్సులు ఇవ్వండి.. ప్రగతి నివేదన సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించాలని ఆ సంస్థ అధికారులకు విజ్ఞప్తి అందింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అద్దె బస్సులతో సహా.. అన్ని బస్సులను కూడా ఈ సభకు తీసుకెళ్లాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో ఉన్న 520 బస్సులను తీసుకెళ్లాలని భావిస్తున్నా రు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా.. ఒ క్కో డిపోకు 50 నుంచి 60 వరకు బస్సులను కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. -
రైతులకు స్వర్ణయుగం
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు స్వర్ణయుగం ప్రారంభమైందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో తమ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేలా చేశాయన్నారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ డైమండ్ జూబ్లీ వేడుకలకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గిడ్డంగుల నిర్మాణం, గిడ్డంగుల సామర్థ్యంలో దేశంలో తెలంగాణ నంబర్‌వన్ అని చెప్పారు. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్, సంస్థ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. 2014లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములుంటే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గోదాముల సామర్థ్యాన్ని 21 లక్షల టన్నులకు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 80 శాతం ఆక్యుపెన్సీ ఉంటే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద శాతం ఆక్యుపెన్సీతో దేశంలో తొలి స్థానంలో నిలిపామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసి అవి నిండిన తర్వాతే ప్రభుత్వ గోదాములు నింపేవారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ గోదాముల్లో నిండిన తర్వాతే ధాన్యాన్ని ప్రైవేటు గోదాముల్లో నింపాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు జీవో ఇచ్చామన్నారు. ఈ జీవో రాకుండా చాలా ఒత్తిళ్లు వచ్చినా.. గోదాములను నిలబెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చామని, మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ వల్ల మరో 12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం వల్ల పంట దిగుబడులు పెరిగాయన్నారు. జలాశయాలు నిండాయి.. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో జలాశయాలు నిండాయని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నిండిందనీ, రెండు రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండబోతుందన్నారు. రెండు మూడు రోజుల్లో నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఎస్సారెస్పీలో తాగునీటికి మాత్రమే నీరు ఉంటే.. సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేశారని చెప్పారు. ఆ నీరు సాగుకు ఇచ్చేస్తే.. వేసవిలో కాంగ్రెస్ నేతలు మళ్లీ తాగునీరు ఇవ్వలేదని రాజకీయం చేసేవారని మండిపడ్డారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని తెలిపారు. మళ్లీ రైతు బంధు పథకంలో భాగంగా ఎకరానికి రూ. 4 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పంటలకు మద్దతు ధరతో కందులు, మక్కలు, శనగలు, పెసలు, ఉల్లిని తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. సంస్థ ఆదాయం పెంచితే ఉద్యోగులకు ప్రోత్సాహకం ఇస్తామన్నారు. సంస్థలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామ్యేల్, ఎండీ భాస్కరాచారి, మార్కెటింగ్‌శాఖ సంచాలకులు లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులను వంచించిన టీఆర్ఎస్: గట్టు
సాక్షి, హైదరాబాద్: లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను పూర్తిగా వంచించిందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఖాళీగా వున్న ఉద్యోగాలకు ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని శనివారం ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాల భర్తీకి ఖమ్మం జిల్లాలో నిర్వహించాలనుకున్న నిరుద్యోగ గర్జనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినందున అదే సభను ఈ నెల 21న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్నారని వాపోయారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కక్కుర్తికి సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయటానికి మాత్రం చేతులు రావటం లేదన్నారు. నిరుద్యోగ గర్జన సభకు నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
మాటలతో నాలుగేండ్లు గడిపిండ్రు..
సాక్షి, కామారెడ్డి : రాష్ట్రం కోసం ఎన్నడూ పోరాడని కేటీఆర్‌కు మంత్రి పదవి వచ్చింది గని, రాష్ట్రం వస్తే ఉద్యోగాలొస్తయని ఆశపడ్డ నిరుద్యోగులను నాలుగేళ్లుగా మోసపూరిత మాటలతో వంచించారని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ కాలంలో తన కొడుకు, కూతురు అమెరికాలోనే ఉంటరని, తాను సీఎం పదవిని తీసుకోనని, దళితుడినే సీఎంని చేస్తానని మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికి పదవులు ఇచ్చాడని, ఇటీవలే తోడల్లుని కొడుక్కి కూడా ఎంపీ పదవి ఇచ్చుకున్నాడని విమర్శించారు. రాహుల్‌గాంధీని మంత్రి కేటీఆర్ విమర్శించడం సరికాదన్నారు. రాజీవ్‌గాంధీ 1989లో చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు అధికారంలోకి వచ్చినా సోనియాగాంధీగాని, రాహుల్గాంధీగాని పీఎం అయ్యే అవకాశాలు ఉన్నా పదవులు తీసుకోలేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని సీఎం కేసీఆర్ శాసన మండలిలో పేర్కొన్నాడన్నారు. ఎన్నికలకు ఎప్పుడైనా కాం గ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తానంటాడని, ఆయన చేతిలో రాయి ఎప్పుడు ఎటువైపు పడు తుందో ఆయనకే తెలియాలన్నారు. రాష్ట్రంలో ని రుద్యోగులు ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం కనికరించడం లేదన్నారు. ఇటీవల తాము టాటా కంపెనీ సాయంతో ఉద్యోగమేలా నిర్వహిస్తే 30 వేల మంది నిరుద్యోగులు వచ్చారని తెలిపారు. వారిలో 1800 మందిని ఎంపిక చేశారని, విడతల వారీగా వారికి ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర చైర్మన్ కే.మదన్‌మోహన్‌రావ్, నాయకులు నల్లమడుగు సురేందర్, కైలాస్ శ్రీనివాస్‌రావ్, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, మామిండ్ల అంజయ్య, పండ్ల రాజు పాల్గొన్నారు. -
ఇంటికో ఉద్యోగమేది?
నేరడిగొండ(బోథ): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెజ్జంకి అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నాయకులు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారన్నారు. కాని ప్రభుత్వం వారికి మొండిచేయి చూపిస్తుందని ఆరోపించారు. నోటిఫికేషన్లతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్ సీపీ ఉద్యమిస్తుందన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి గోవింద్‌నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చి నేడు హామీలను అమలుపర్చడంలో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి గంగాధర్, షేక్ అస్లం, మండల అధ్యక్షుడు ఏలేటి రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంతోషంగా లేరా?
సాక్షి, హైదరాబాద్: ‘అమ్మా.. ఎలా ఉన్నారు... తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడి తెచ్చుకున్నారు కదా... మీరెలా ఉన్నారు.. సంతోషంగా ఎందుకు లేరు?’అని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన గిరిజన మహిళను ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం ఇక్కడి హరిత ప్లాజా నుంచి పార్టీ కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు, మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్లతో నిర్వహించిన ఈ టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా, టీపీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డితోపాటు శక్తి యాప్ ఇన్చార్జి, ఎమ్మెల్యే టి.రామ్మోహనరెడ్డి, టీపీసీసీ ఐటీ విభాగం చైర్మన్ ఎర్రబెల్లి మదన్మోహన్, హర్కర వేణుగోపాల్‌లు పాల్గొన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో భాగంగా జుక్కల్, డోర్నకల్, కామారెడ్డి, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన ఐదుగురు బూత్ కమిటీ అధ్యక్షులతో రాహుల్ మాట్లాడారు. డోర్నకల్‌కు చెందిన మహిళను ప్రశ్నించగా తాము సంతోషంగా లేమని బదులిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు ఇంటికొకటి కాదు కదా... ఊరికొకటి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందా అని ఆమెను రాహుల్ అడగ్గా మంజూరైందని చెబుతున్నారు కానీ ఇంతవరకు రాలేదని చెప్పారు. మరో బూత్ కమిటీ అధ్యక్షుడితో మాట్లాడుతూ రాష్ట్రంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు ఎలా ఉందని, ప్రత్యక్ష జీవనంపై జీఎస్టీ ఎలాంటి ప్రభావం చూపుతోందని రాహుల్ అడిగారు. ఈ సందర్భంగా జుక్కల్‌కు చెందిన ఓ నేత మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని చెబుతున్నా అది వడ్డీలకే సరిపోయిందని రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు. టీపీసీసీ నేతలు చెబుతున్నట్లుగా రూ. 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించాలని కోరారు. అందరి మాటలు విన్న రాహుల్... కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజలందరికీ కార్యకర్తలు చెప్పాలని, అందరూ ఐక్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ‘చార్మ్స్’భేష్... టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో సంభాషించే ‘చార్మ్స్’కార్యక్రమం బాగుందని రాహుల్ అభినందించారు. 4జీ టెక్నాలజీ సాయంతో ఏకకాలంలో వేలాది మందితో నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్‌పై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని టీపీసీసీ నేతలకు చెప్పారు. ‘చార్మ్స్’ను జాతీయ స్థాయిలో అమలు చేద్దామని, ఢిల్లీకి రావాలని ఐటీ విభాగం చైర్మన్ కె. మదన్మోహన్కు సూచించారు. శక్తి యాప్ ద్వారా ఇప్పటికే 2 లక్షల మంది సభ్యులను చేర్చడంపై కూడా హర్షం వ్యక్తం చేసిన రాహుల్...ఈ నెల 18న శక్తి యాప్‌పై ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. కాగా, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో బూత్ కమిటీల ఏర్పాటు, బలోపేతం దిశగా టీపీసీసీ నిర్వహిస్తున్న లీడర్షిప్ మిషన్ ఇన్ రిజర్వ్డ్ కాన్‌స్టిట్యుయెన్సీస్ (ఎల్డీఎంఆర్సీ) తీరు గురించి ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా రాహుల్‌కు వివరించారు. -
రాహుల్ పర్యటన విజయవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్ణయించింది. రాహుల్ పాల్గొనే కార్యక్రమాలన్నింటిలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే భారీగా జనసమీకరణ చేయాలని నేతలకు సూచించింది. రాహుల్ పర్యటనపై శనివారం సీఎల్పీ నేత జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ భేటీకి ఎమ్మె ల్యేలు గీతారెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, మాధవరెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత హాజరయ్యారు. రాహుల్ పర్యటించే ప్రాంతాల్లో మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొనేలా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న అంశాలపై చర్చించారు. రాహుల్‌ను ఓయూలోకి అనుమతించకపోవడాన్ని వారంతా మూకుమ్మడిగా ఖండించారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కొందరిని రెచ్చగొట్టి రాహుల్ ను ఓయూకు రాకుండా అడ్డుకుందని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ వస్తున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని రాహుల్ చెప్పబోతున్నారన్నారు. -
మెదక్‌లో ఏర్పాటుకానున్న పలు కంపెనీలు
సాక్షి, మెదక్ : మెదక్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు స్థల సేకరణ అంశం కొలిక్కివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో తూప్రాన్ ప్రాంతంలో మాత్రమే ప్రస్తుతం పరిశ్రమలు ఉన్నాయి. మెదక్, నర్సాపూర్ ప్రాంతంలో పెద్దగా పరిశ్రమలు లేవు. ఇక్కడి యువతకు సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మెదక్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కలెక్టర్ ధర్మారెడ్డి పరిశ్రమలవాడ ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు రెవెన్యూ, పారిశ్రామిక శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో మెదక్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు మెదక్ నియోజకవర్గంలో అనువైన వనరులు ఉండటం, రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటం, రెండు జాతీయ రహదారులు ఇక్కడ ఉన్న విషయాన్ని పారిశ్రామికవేత్తలకు తెలియజేసి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల అన్వేషణ మెదక్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు సైతం ఆశిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఇక్కడి యువతకు ఉపాధి లభించటంతోపాటు అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా జిల్లా యంత్రాంగం రూపలకల్పన చేస్తోంది. ఇప్పటికే అనువైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు అన్వేషిస్తున్నారు. మెదక్ మండల పరిధిలో 50 నుంచి 100 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అలాగే చేగుంట మండలంలో సైతం పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రతిపాదనలను మెదక్ ఆర్డీఓ నగేశ్ ఇటీవలే కలెక్టర్‌కు అందజేసినట్లు సమాచారం. మెదక్ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కులో ఆటోమొబైల్, ఆగ్రో కంపెనీలు పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చేగుంట ప్రాంతంలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కులో ఫార్మా కంపెనీలు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారికి చేగుంట దగ్గరగా ఉండటం ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నట్లు సమాచారం. యువతకు ఎంతో మేలు మెదక్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు విషయంలో కలెక్టర్ ధర్మారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. భూములు గుర్తింపు ప్రక్రియ ఈనెలాఖరుకు కొలిక్కివచ్చే అవకాశం ఉంది. భూ సేకరణ పూర్తి అయితే పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. –రత్నాకర్, జీఎం డీఐసీ -
ప్రతి జిల్లాకో గులాబీ భవన్
సాక్షి, హైదరాబాద్ : అధికార తెలంగాణ రాష్ట్ర సమితి 29 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించుకునేందుకు ప్రభుత్వ భూములను కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గజం వంద రూపాయల చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా భూములను కేటాయించాలని నిర్ణ యించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు భూములను కేటాయించే విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ప్రకారమే.. టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్మించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను మినహాయింపు కల్పించింది. శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ప్రకటించిన పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. వెంటనే బీసీ జనాభా గణన గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన బీసీ జనాభా గణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. గ్రామ పంచా యతీల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నందున గ్రామాల్లో పాలన కోసం ప్రత్యేకాధికారులను నియమించేందుకూ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధి కారులను నియమించాలని నిర్ణయించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం.. ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియగానే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సంఖ్య 12,751కి పెరగనుంది. ప్రతీ గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ఒక కార్యదర్శి ఉండేలా కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శులను నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం పూర్తికాగానే కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారునున్నాయి. కొత్తగా మనుగడలోకి వచ్చే మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కాలేజీల్లోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలు విషయాన్ని పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించేలా, శస్త్రచికిత్సలను చేసేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలివీ.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు. ఇలాంటి పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ప్రకారమే టీఆర్ఎస్ పార్టీకి 29 జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు. పదవీకాలం ముగుస్తున్న సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకూ ప్రత్యేకాధికారుల నియామకం. రాష్ట్రంలో కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో ప్రతీ గ్రామానికీ కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేలా చర్యలు. రాష్ట్రంలో వెంటనే వెనుకబడిన వర్గాల(బీసీ) జనాభా గణన. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం. 2019–20 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున 119 కొత్త బీసీ గురుకులాల ఏర్పాటు. వీటిలో 4,284 మంది సిబ్బంది నియామకం. గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం. ప్రతీ నియోజకవర్గానికీ కచ్చితంగా ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే విధానం మేరకు రాష్ట్రంలో కొత్తగా 18 అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు. రాష్ట్ర పోలీస్ శాఖకు కొత్తగా 11,577 వాహనాల కొనుగోలు. మందుపాతర పేలుడులో మరణించిన మాజీ మంత్రి మాధవరెడ్డి కుటుంబానికి హైదరాబాద్‌లోని షేక్‌పేటలో 600 గజాల ఇంటి స్థలం కేటాయింపు. భారత్–పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన పోరాటంలో మరణించిన వీర జవాను ఫిరోజ్‌ఖాన్ కుటుంబానికి షేక్‌పేటలో 200 గజాల కేటాయింపు. సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, సిబ్బంది నియామకం. జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే అవకాశాల పరిశీలన కేబినెట్ కీలక నిర్ణయాలు.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు. ఇలాంటి పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు. రాష్ట్రంలో కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో ప్రతీ గ్రామానికీ కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేలా చర్యలు. రాష్ట్రంలో వెంటనే వెనుకబడిన వర్గాల(బీసీ) జనాభా గణన. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం. 2019–20 విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున 119 కొత్త బీసీ గురుకులాల ఏర్పాటు. వీటిలో 4,284 మంది సిబ్బంది నియామకం. -
అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది
-
భువనగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు లైన్ క్లియర్
-
సెగ మొదలైంది..
సాక్షి, హైదరాబాద్ : లారీల సమ్మె సెగ మొదలైంది. ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక వర్గాలు, సామాన్యులపైనా ప్రభావం పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరానికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రవాణా నిలిచి పోవడంతో పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కడికక్కడే నిలిచిపో యాయి. లారీల సమ్మె గురువారంతో వారానికి చేరింది. లారీ యజమానుల సమస్యలతో పాటు డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తేవాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లతో సాగుతోన్న సమ్మె ప్రభావం నెమ్మదిగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె మొదలైతే సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానులను చర్చలకు ఆహ్వానించేవి. కానీ, లారీ యజమానుల డిమాండ్లన్నీ కేంద్ర పరిధిలోనివే కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ధరలు.. ప్రత్యామ్నాయ చర్యలు నిత్యావసర సరుకుల లారీలు సమ్మెలో పాల్గొనకపో వడంతో సామాన్యులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా.. రవాణా మీద ఆధారపడ్డ పప్పులు, ధాన్యాలు, ఇతర నిత్యావసరాలపై దాని ప్రభావం పడుతోంది. దీంతో ధరలు పెరిగే అవకాశాలున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ పరిధిలోని గోదాముల్లో నెలరోజులకు సరిపడా ఆహారపదార్థాలున్నాయి. వ్యాపారులు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిల్వలు తగ్గకుండా, నిత్యావసరాల రవాణాకు ఆటంకం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోందని సమాచారం. డీసీఎం వ్యానులు, త్రీవీలర్స్ ద్వారా కూరగాయలు, ధాన్యం, ఇతర నిత్యావసరాలను రవాణా చేయాలని.. ఫలితంగా ధరలు పెరగకుండా, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు తన వంతు ప్రణాళికను సిద్ధం చేస్తోన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్కార్ట్ సాయంతో కాళేశ్వరానికి సిమెంట్ కాళేశ్వరానికి సిమెంటు కొరత ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సిమెంటు లారీలు సమ్మెలో పాల్గొనడం.. ప్రాజెక్టు వద్ద నిల్వ ఉంచిన సిమెంట్ నిండుకోవడంతో పోలీసు పహారాలో సిమెంటు సరఫరా చేస్తున్నారు. పెద్దపల్లి, మహారాష్ట్ర నుంచి రావాల్సిన సిమెంట్ లారీలను భారీ బందోబస్తు మధ్య తరలిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు కంకర కొరత తీర్చేందుకు పరకాల, రామడుగు నుంచి పోలీసు పహారాలో లారీలను తరలించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగాళాదుంపకూ కొరతే.. సమ్మె కారణంగా బంగాళాదుంపకూ కొరత ఏర్పడింది. రాష్ట్రానికి ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఆలూ సరఫరా అవుతుంది. బంగాళాదుంప నిల్వలు చాలాచోట్ల నిండుకున్నట్లు సమాచారం. త్రీవీలర్లు, డీసీఎంల్లో ఇతర కూరగాయలు తరలిస్తుండటంతో మిగిలిన కూరగాయలకు కొరత లేదని అధికారులు పేర్కొంటున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రావాల్సిన క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్ల నిల్వలు కూడా నిండుకున్నాయి. మొత్తం మీద ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన కూరగాయలకు కొరత ఏర్పడుతోంది. పేరుకుపోతోన్న ఉత్పత్తులు.. దేశవ్యాప్తంగా రవాణా స్తంభించడంతో తెలంగాణలాంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాల్లో ఉత్పత్తులన్నీ పేరుకుపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నా.. రవాణా స్తంభించిపోయింది. కరీంనగర్ నుంచి జరగాల్సిన ఇసుక, గ్రానైట్ కూడా నిలిచిపోయాయి. సమ్మె కారణంగా ఎక్కువ ప్రభావితమైంది సిమెంటు రంగమే. ఉత్పత్తి జరుగుతున్నా.. లారీలు కదలకపోవడంతో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. నిర్మాణరంగానికి కీలకమైన సిమెంటు, ఇసుక, గ్రానైటు, మట్టి, కంకర తదితర వస్తువుల రవాణా నిలిచిపోయింది. ఆఖరు అస్త్రంగా.. సమ్మె మరింత ఉదృతమైతే.. ఆయిల్, పాలు, నీళ్లు లాంటి నిత్యావసరాల ట్యాంకర్లు కూడా సమ్మెలో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ సమ్మెకు మద్దతుగా 24న తెలంగాణవ్యాప్తంగా ఒక్కరోజు బంద్‌లో పాల్గొంది. కేంద్రం దిగిరాకపోతే తాము కూడా నిరవధిక సమ్మెలో పాల్గొంటామని స్పష్టం చేసింది. ఇదే జరిగితే.. సమ్మె ప్రభావం సామాన్యులపైనా పడుతుంది. సమ్మె నష్టం రూ.200 కోట్లు వారం రోజులుగా సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోఛనీయం. సమ్మె వల్ల తెలంగాణ లారీ యజమానులు రూ.200 కోట్లు నష్టపోయారు. అయినా.. న్యాయమైన డిమాండ్ల సాధనలో వెనకడుగు వేసేది లేదు. మా కోర్కెలు నెరవేరేదాకా సమ్మె కొనసాగిస్తాం. – భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం, అధ్యక్షుడు డిమాండ్లు నెరవేర్చాల్సిందే: శ్రీనివాస్‌గౌడ్ లారీ యజమానుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌లో లారీ యజమానులు రోడ్డుపై నిర్వహించిన వంటా–వార్పులో లారీ కార్మికులతో కలసి పాల్గొన్నారు. సింగిల్ పర్మిట్ విధానానికి ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే అనుమతించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. -
ఎవరికి ఏమిచ్చాం
సాక్షి, హైదరాబాద్ : రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళ్లే వ్యూహంతో అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. దేశానికే ఆదర్శంగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేశామని చెబుతున్న అధికార పార్టీ దానికి తగినట్లుగానే వివరాలన్నీ సేకరిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను, ఆ పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. సమగ్ర సమాచార నిధి.. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలవారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, మండలాలవారీగా, గ్రామ స్థాయిలో లబ్ధిదారుల సంఖ్య, వారి వివరాలను సేకరించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 80 శాతం వివరాలు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నాయి. మిగిలిన వివరాలను సేకరించడంతోపాటు, ఉన్న వివరాలను సరిచూసుకుని తప్పులు లేని విధంగా సంక్షేమ సమాచార నిధి ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళుతోంది. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ఉన్నతాధికారులు ఈ వివరాలను సేకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసమే కాక రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలను పొందుపరిచే లక్ష్యంతో అధికారులు ఈ పని చేస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖాల వారీగా వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ శాఖల్లో అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎస్కే జోషి ఆయా శాఖల అధికారులను ఇటీవల ఆదేశించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి పూర్తిస్థాయి డాటాబేస్‌ను రూపొందించాలని సూచించారు. డాటాబేస్ రూపకల్పన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక పేజీలో ఈ వివరాలు అందిరికీ తెలిసేలా ఉంచనున్నారు. వంద శాతం స్పష్టత.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా సంక్షేమ శాఖల ఆధర్యంలోనే అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి తదితర కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆర్థిక చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లు సబ్సిడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేజీటు పీజీ కార్యక్రమంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి 2.5 లక్షల మంది పిల్లలకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. గ్రామీణాభివద్ధి శాఖ లక్షలాది మందికి ఆసరా పింఛన్లు ఇస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ కేసీఆర్ కిట్లు, అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పెట్టుబడి సాయం, రైతు బీమా పథకాలు అమలవుతున్నాయి. ఆపద్భంధు, ఫ్యామిలీ బెనిఫిట్ పథకాలు రెవెన్యూ శాఖ అమలు చేస్తోంది. పశుసంవర్ధక శాఖ గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, మత్సశాఖ ద్వారా చేప పిల్లల పంపిణీ.. ఇలా పెద్ద సంఖ్యలో పథకాలు అమలవుతున్నాయి. అయితే అన్ని పథకాల సమగ్ర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీన్ని సరి చేసేందుకు శాఖల వారీగా పథకాలు, కార్యక్రమాలు.. వీటి లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. వంద శాతం సరైన గణాంకాలు, వివరాలు ఉండేలా ఈ ప్రక్రియ సాగుతోంది. సామాజిక వర్గాల వారీగా.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల నమోదు పక్కా ప్రణాళికతో సాగుతోంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నమోదు చేయడంతోపాటు సామాజిక వర్గాల వారీ వివరాలనూ సేకరిస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబాల వారీగానూ క్రోడీకరిస్తున్నారు. పథకాల వారీగా చేసిన ఖర్చు, లబ్ధిదారుల సంఖ్య తెలిసేలా ప్రభుత్వ వెబ్సైట్లో ఈ వివరాలను అందుబాటులో పెట్టనున్నారు. కచ్చితమైన సమాచారంతో ప్రజల్లోకి వెళ్లడం వల్ల పారదర్శకతతోపాటు, ప్రభుత్వానికి ప్రజలలో ఆదరణ ఉంటుందనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు ఇప్పటికే దాదాపుగా నమోదయ్యాయి. రెవెన్యూ, వ్యవసాయ, పశుసంర్ధక, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలు వివరాలను సేకరిస్తున్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు.. రాష్ట్రంలో ఎస్సీ జనాభా : 54 లక్షలు కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులు : 88,786 చేసిన ఖర్చు : రూ.504 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లబ్ధిదారులు : 8,74,443 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ లబ్ధిదారులు : 2.50 లక్షలు ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థులు : 2.67 లక్షలు ఆర్థిక చేయూత(ఈఎస్ఎస్) పథకం లబ్ధిదారులు : 1,04,980 ఆర్థిక చేయూత(ఈఎస్ఎస్) పథకానికి మంజూరు : రూ.1,136 కోట్లు ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు : 57,500 -
ఉద్యోగాల భర్తీలో టీఆర్ఎస్ విఫలం
పరిగి వికారాబాద్ : ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్, జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాద య్య, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యం నిరసిస్తూ బుధవారం పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనం తరం ఉప తహసీల్దార్ వాజేశ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆహ్మద్ ఖాద్రి, జిల్లా అధికార ప్రతినిధి నరేందర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆనంద్, నాయకులు వేణు, అనిల్, రాజు, రమేశ్, మహేశ్, వెంకటేశ్, ఖాజా, శ్రీనివాస్, హరికృష్ణ, అశోక్, బాల్‌రాజ్, న ర్సింహులు, చంద్రయ్య, నాగగారు, నగేశ్, తులసి, వీరేశం, సత్యయ్య, బాలు, హరిబాబు, మజీద్‌ఖాన్, ఎల్లయ్య, నవాజ్, గోపాల్ పాల్గొన్నారు. -
వీడని జాలి‘ముడి’!
మధిర : ప్రతిష్టాత్మకంగా రూ.43కోట్ల వ్యయంతో జాలిముడి గ్రామ సమీపంలో చేపట్టిన తాగునీటి (సీపీడబ్ల్యూ స్కీం) ప్రాజెక్టు నిర్మాణ పనులు ముగిసి, ట్రయల్ రన్ పూర్తయి మూడేళ్లు గడిచినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అయితే మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్‌ను జాలిముడి ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఇచ్చే అవకాశం ఉండటంతో రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యే అవకాశం ఉంది. మధిర మండలంలోని 33 గ్రామాలు, బోనకల్ మండలంలోని 23 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు వైరా నదిపై రోజుకు 7 మిలియన్ లీటర్ల నిల్వసామర్థ్యం గల ప్రాజెక్టును నిర్మించారు. మధిర మండలం జాలిముడి వద్ద 900 కిలోలీటర్లు, ఖాజీపురం వద్ద 800 కిలోలీటర్లు, బోనకల్ గార్లపాడువద్ద 250 కిలోలీటర్ల కెపాసిటీ గల సంపులను నిర్మించారు. వీటి ద్వారా 56 గ్రామాలకుగాను.. 51 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే మధిర నగర పంచాయతీ పరిధిలోని అంబారుపేటకు తాగునీరు అందడం లేదు. మధిర పెద్ద చెరువు విస్తరణ పనులు జరుగుతుండడంతో పైపులైన్ ధ్వంసమైంది. చిలుకూరుకు తాగునీటి పైపులైన్ కనెక్షన్ కలపాల్సి ఉంది. బోనకల్ మండలం ముష్టికుంట్ల, తూటికుంట్ల, చిన్నబీరవల్లి గ్రామాలకు పలు కారణాలతో తాగునీరు అందడం లేదు. మధిర, బోనకల్ రైల్వే క్రాసింగ్‌ల వద్ద పైపులైన్ కనెక్షన్ అనుసంధానం చేయలేదు. తాగునీటిని శుద్ధి చేసేందుకు ఆలమ్, క్లోరినేషన్ సమపాళ్లలో కలిపిన తర్వాత ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించాక తాగునీటిని సరఫరా చేయాలి. అయితే ల్యాబ్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. హెడ్‌వర్క్స్, ప్రధాన సంపుల చుట్టూ ప్రహరీ నిర్మించలేదు. ఇటువంటి చిన్నచిన్న పెండింగ్ పనులతోపాటు ప్రాజెక్టుపై ఇంజనీర్లు, సూపర్వైజర్లను నియమించేందుకు ప్రభు త్వం ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలున్నాయి. సమస్యలు ఇలా.. తాగునీటిని సరఫరా చేసే వైరా నది వద్ద తూటికాడ పేరుకుపోయింది. ప్రాజెక్టు వద్దకు వచ్చే విద్యుత్ తీగలపై తాటిచెట్లు, సుబాబుల్, కంపచెట్లు విరిగి పడుతుండడంతో తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో నెల రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. పలుచోట్ల పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడుతున్నాయి. గతంలో బోడేపూడి సుజల స్రవంతి పథకం కింద పని చేసిన 40 మంది కార్మికులను ప్రస్తుతం నిర్మించిన జాలిముడి తాగునీటి ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ‘భట్టి’కి పేరొస్తుందనే.. జాలిముడి ప్రాజెక్టుపై సాగు, తాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి.. మధిర, బోనకల్ మండలాల పరిధిలో సాగు, తాగునీరు అందించేందుకు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కృషి చేశారు. అయితే 2011 నుంచి చేపట్టిన ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ ట్రయల్ రన్‌లోనే ఉంది. మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ అనుసంధానం చేయలేదు. త్వరలోనే మిషన్ భగీరథ పైపులైన్‌ను ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైపులైన్‌కు కనెక్షన్ ఇచ్చి.. రూ.కోట్ల వ్యయంతో జాలిముడి వద్ద నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలివేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే భట్టి ప్రతిపక్ష నాయకుడు కావడంతోపాటు ప్రభుత్వాన్ని పలు అంశాల్లో ప్రశ్నిస్తుండటం, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయనకు పెరుగుతున్న ప్రతిష్టను చూసి.. ప్రాధాన్యతను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పలు పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. ఇది వినియోగంలోకి వస్తే భట్టికి పేరొస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వేసవిలో సుమారు 50 గ్రామాలకు తాగునీరు అందించిన తాగునీటి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా.. రాజకీయ విభేదాలతోనే ప్రాజెక్టుకు మోక్షం కలగడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరందించాలి.. పెండింగ్ పనులు పూర్తి చేసి అన్ని గ్రామాలకు తాగునీరందించాలి. బోడేపూడి సుజల స్రవంతి పథకం పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. తాగునీరు కలుషితమవుతోంది. పలుచోట్ల గేట్వాల్వ్లపై మూతలు లేవు. జాలిముడి ప్రాజెక్టు నీరందడం లేదు. మిషన్ భగీరథ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తాగునీటి సమస్య తీరుతుంది. – బట్టా గోవిందరాజు, గ్రామస్తుడు, మహదేవపురం -
ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపు
-
‘కంటి వెలుగు’కార్యక్రమానికి ముహూర్తం ఖరారు
-
యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్న మాఫియా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇసుక మాఫియా మళ్లీ పేట్రేగిపోతోంది! వారం పది రోజుల వ్యవధిలోనే ధరలు రెట్టింపు కావడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాద్‌లో వారం కింద రూ.40 వేలు పలికిన 25 టన్నుల ఇసుక లారీ ధర ఏకంగా రూ.87 వేలకు చేరింది. మొన్నటిదాకా టన్ను రూ.1,600–1,700 పలికిన నాణ్యమైన సన్న ఇసుక ధర రూ.3,400–3,500కు ఎగబాకింది. సిమెంట్ ఇటుకలు, శ్లాబుల నిర్మాణానికి వినియోగించే దొడ్డు ఇసుక టన్నుకు రూ.1,300–1,400 నుంచి రూ.2,500–2,600కు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలతో తవ్వకాలు, రవాణా నిలిచిపోయి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇసుక కొరత ఏర్పడింది. ఇందుకు లారీల సమ్మె మరింత ఆజ్యం పోసింది. ఇదే అదనుగా మాఫియా, దళారులు రెచ్చిపోతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, సాగునీటి, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ముందస్తుగా బుక్ చేసుకున్న ఇసుకను కాంట్రాక్టర్లు బ్లాక్‌లో విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. 2014 డిసెంబర్లో ప్రకటించిన కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు, ఉపనదుల ఇసుకతోపాటు జలాశయాల్లోని ఇసుక పూడికల తవ్వకాల బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కు బదలాయించింది. ఏటా జూలై–అక్టోబర్ మధ్య వర్షాలతో ఇసుక తవ్వకాలు, రవాణాకు ఆటంకం కలగడం, మాఫియా రంగంలోకి దిగి ధరలు పెంచేయడం గత నాలుగేళ్లుగా కొనసాగుతోంది. కొత్త విధానంలో ప్రభుత్వం.. క్వారీల్లో ఇసుక వ్యాపారులకు విక్రయించే ఇసుక ధరలను మాత్రమే నిర్ణయించింది. ప్రజలకు విక్రయించాల్సిన రిటైల్ ధరలను నిర్ణయించకపోవడంతో ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వర్షాలతో నిలిచిన తవ్వకాలు రాష్ట్రంలోని పాత ఏడు జిల్లాల పరిధిలోని గోదావరి తీరంలో 56 చోట్లలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గతేడాది టీఎస్ఎండీసీకి అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం 30 చోట్ల మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో 25 భారీ, మరో ఐదు చిన్న రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల నుంచి తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసి ఆన్లైన్ బుకింగ్ ద్వారా టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. సాధారణంగా టీఎస్ఎండీసీ ప్రతి రోజూ 40 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను బుకింగ్ కోసం అందుబాటులో ఉంచేది అందులో 30 వేల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక అమ్ముడయ్యేది. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గత 10 రోజులుగా ఇసుక తవ్వకాలు, రవాణాకు ఆటంకం ఏర్పడింది. రీచ్‌లు, స్టాక్ యార్డులకు వెళ్లే దారులు దెబ్బతినడంతో వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోజువారీగా ఆన్లైన్ బుకింగ్ ద్వారా రోజుకు 9 వేల నుంచి 12 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. ఫలితంగా ఇసుక కొరత తీవ్రమైంది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ కోసం వ్యాపారులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇసుక అవసరం ఉన్నవారు టీఎస్ఎండీసీ పేరిట మీ సేవా, ఆన్లైన్ కేంద్రాలకు డబ్బులు చెల్లించి రశీదు పొందితే వారి బుకింగ్ ఆర్డర్ మేరకు స్టాక్ పాయింట్ల వద్ద లారీల్లో ఇసుక నింపుతున్నారు. క్యూబిక్ మీటర్‌కు రూ.550 (టన్నుకు రూ.357.5) చొప్పున ప్రభుత్వం ఇసుకను రీచ్‌ల వద్ద విక్రయిస్తోంది. అయితే రవాణా కోసం అవసరమైన లారీలు ఇసుక వ్యాపారుల వద్దే ఉండడంతో దళారుల ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇసుకను పొందలేకపోతున్నారు. ఇసుక వ్యాపారులే ఆన్లైన్లో బుక్ చేసుకొని అవసరమైన వారికి హైదరాబాద్‌లో టన్నుకు రూ.1600–1700లు, జిల్లాల్లో రూ.1200కు చొప్పున విక్రయించేవారు. హైదరాబాద్‌లో 25 టన్నుల ఇసుక లారీ రూ.40 వేలలోపు ధర పలికేది. ప్రస్తుతం కొరత ఉండడంతో టన్ను ఇసుక ధరను అడ్డగోలుగా రూ.3,400–3,500కు పెంచేశారు. లారీ ఇసుక ధర రూ.40 వేల నుంచి రూ.87 వేలకు పెంచడంతో సామాన్యులతోపాటు బిల్డర్లు గగ్గోలు పెడుతున్నారు. సర్కారీ కాంట్రాక్టర్ల బ్లాక్ దందా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానేరు నది పరిధిలోని నాలుగు రీచ్‌లలోని ఇసుకను డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, మరో ఆరు రీచ్‌లలోని ఇసుకను పూర్తిగా సాగునీటి, ఇతర ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక మొత్తాన్ని నిర్ధారిస్తూ సంబంధిత ప్రాజెక్టుల నిర్వహణ అధికారులు జారీ చేసిన అంచనా నివేదిక ఆధారంగా టీఎస్ఎండీసీ నుంచి కాంట్రాక్టర్లు నేరుగా ఇసుక కొనుగోలు చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లు.. ఇంజనీరింగ్ శాఖల అధికారులను ప్రలోభపెట్టి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక కన్నా ఐదారు రెట్లు ఎక్కువగా అంచనాలను తెచ్చుకుంటున్నారు. వాటి ఆధారంగా టీఎస్ఎండీసీ నుంచి ఒకేసారి బల్క్‌గా ఇసుక కొనుగోలు కోసం ఆర్డర్లు పొందుతున్నారు. ఆ ఆర్డర్ల ఆధారంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు టీఎస్ఎండీసీకి డీడీలు చెల్లించి నేరుగా మానేరు రీచ్‌ల నుంచి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఇసుక కొరత నెలకొన్న సమయంలో కూడా ప్రభుత్వ పనులకు ఆటంటం కలగకూడదన్న ఉద్దేశంతో టీఎస్ఎండీసీ కాంట్రాక్టర్లు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఇసుక విక్రయిస్తోంది. కాంట్రాక్టర్లు అవసరానికి మించి బుక్ చేసుకున్న ఇసుకకు సంబంధించిన ఆర్డర్లను ఇసుక వ్యాపారులకు బ్లాకులో విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్లైన్లో 25 టన్నుల లారీ ఇసుక కోసం వ్యాపారులు టీఎస్ఎండీసీకి రూ.8,889 డీడీని చెల్లిస్తే కొనుగోలు ఆర్డర్ జారీ అవుతోంది. ప్రస్తుతం టీఎస్ఎండీసీ ద్వారా ఆన్లైన్లో ఇసుక విక్రయాలు తగ్గిపోవడంతో సర్కారీ కాంట్రాక్టర్లు 25 టన్నుల ఇసుక ఆర్డర్‌ను ఇసుక వ్యాపారులు, లారీల యజమానులకు బ్లాక్‌లో రూ.20 వేలకు అమ్ముకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఇసుక ధరలు రెట్టింపు అయ్యాయి. సర్కారీ పనుల కోసం కేటాయించిన ఇసుకను దారి మళ్లించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న లారీలు నిత్యం పట్టుబడుతున్నా.. కేవలం వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక ధరకు కొనుగోలు చేయకండి: టీఎస్ఎండీసీ గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు, రహదారులు దెబ్బతినడంతో ఇసుక సరఫరాలో కొంత ఇబ్బంది కలుగుతోందని టీఎస్ఎండీసీ వైస్ చైర్మన్, ఎండీ జి.మల్సూర్ తెలిపారు. వినియోగదారులకు సరిపడ ఇసుకను రోజువారీగా సరఫరా చేయలేకపోతున్నామన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇసుక దళారులు మార్కెట్లో అధిక ధరకు ఇసుక విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరకు ఇసుక కొనుగోలు చేయొద్దని, కొన్ని రోజులు వేచి ఉంటే ధరలు సాధారణ స్థితికి వస్తాయని సూచించారు. వర్షాకాలంలో వినియోగదారులకు సరఫరా చేసేందుకు స్టాక్ యార్డుల్లో 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక 25 ప్రాంతాల్లో అందుబాటులో ఉందని, ఇసుక కొరత లేదని చెప్పారు. ప్రభుత్వ పనులకు కేటాయించిన ఇసుకను దారి మళ్లించి బ్లాక్‌లో విక్రయిస్తున్న లారీలను పట్టుకుని బ్లాక్‌లిస్టులో పెడుతున్నామని వివరించారు. -
గజ్వేల్ నుంచి ‘కంటి వెలుగు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గజ్వేల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటలకు కార్యక్రమాన్ని కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. అదేరోజు గవర్నర్ నరసింహన్‌తో ఇంకో ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిం చాలని, అవసరమైన వారికీ కళ్లద్దాలు, మందులు ఇవ్వాలని, ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమానికి అవసరమైన సిబ్బంది, వైద్య పరికరాలు, వాహనాలు, కళ్లద్దాలు, మందులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్‌రాజ్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్‌గౌడ్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్ మోతీలాల్, టీఎస్ఎండీసీ ఎండీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కల్పించండి ‘రికార్డు స్థాయిలో రాష్ట్రంలోని దాదాపు 3.70 కోట్ల మంది పౌరులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందున అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలి. కలెక్టర్లు ప్రజాప్రతినిధులందరితో సమావేశాలు నిర్వహించి జిల్లాస్థాయిలో షెడ్యూల్‌ను రూపొందించాలి. క్షేత్రస్థాయిలో కార్యక్రమ నిర్వహణపై సమీక్షలు జరపాలి. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరు కంటి వైద్య శిబిరాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి’అని అధికారులను సీఎం ఆదేశించారు. 799 బృందాల ఏర్పాటు కంటి పరీక్షల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 799 బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతి బృందంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఆప్తోమెట్రిస్ట్, ఏఎన్ఎం ఉంటారు. ఒక్కో వైద్య బృందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుంది. కంట్లో వేసే మందులను, ఇతర ఔషధాలను సిద్ధం చేస్తున్నాం. 34 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి జిల్లాలకు పంపుతున్నాం. అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆసుపత్రులను గుర్తించాం’అని అధికారులు తెలిపారు. సీఎం సూచనలివీ.. వర్షం వచ్చినా కంటి పరీక్షలు నిరాటంకంగా నిర్వహించేందుకు వీలుగా గ్రామ స్థాయిలో పాఠశాల భవవాన్నిగానీ, మరేదైనా పక్కా భవనాన్నిగానీ ఎంపిక చేసుకోవాలి. కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్య సేవలకు ఎక్కడా ఇబ్బంది రావద్దు. కంటి పరీక్షల శిబిరంలో పని చేయడానికి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకోవాలి. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వారిని వినియోగించవద్దు. ఏ రోజు ఏ గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలి. కంటి పరీక్షలపై అవగాహన కల్పించాలి. ఎఎన్ఎంలు, ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. కంటి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ ప్రజా ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేఖలు రాయాలి. వైద్య శిబిరాల్లో పాల్గొనే సిబ్బందికి వారానికి రెండు రోజులు కచ్చితంగా సెలవులు ఇవ్వాలి. వాళ్లు వచ్చి వెళ్లడానికి ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో సరైన వసతి ఉండదు కాబట్టి సమీప పట్టణాల్లో వసతి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, సింగరేణి, విద్యుత్ సంస్థల అతిథి గృహాలను ఇందుకోసం వినియోగించుకోవాలి. వీలైతే ప్రైవేటు హోటళ్లలోనూ బస ఏర్పాటు చేయాలి. పేదలకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బంది భోజన, వసతి ఏర్పాట్లు బాగుండాలి. దగ్గరి చూపు లోపం ఉన్న వారికి వెంటనే మందులను, అద్దాల (రీడింగ్)ను అందించాలి. ఇతరులకు డాక్టర్లు సూచించిన అద్దాలు పంపిణీ చేయాలి. ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దశల వారీగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ఆపరేషన్లు చేయించాలి. సరోజినీ దేవి ఆసుపత్రికి కొత్త భవనం: సీఎం హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించడంతోపాటు అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సరోజినీ కంటి ఆసుపత్రికి మంచి పేరు, ప్రతిష్టలున్నాయని, అందుకు తగినట్లు కొత్త భవనాలు నిర్మించి రోగుల వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వాటి సంఖ్యను పెంచా లన్నారు. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. బస్తీ దవాఖానాలను సందర్శించిన గవర్నర్.. అవి పేదలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని అభినందించారని సీఎం పేర్కొన్నారు. -
వారి డిమాండ్లు తీర్చరా?
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావు గారికి, విద్యుత్ కాంట్రాక్టు (ఆర్టిజాన్) కార్మికుల సమ్మె గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురు కుగా పాల్గొన్న ప్రక్రియ కూడా మీకు తెలుసు. ఈ కార్మికులనుద్దేశించి మింట్ కాంపౌండ్‌లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డుతూనే వాళ్లందరి సర్వీసును క్రమబద్ధీకరిస్తామన్న సభలో నేను కూడా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడి నాలు గేళ్లైంది. ఇక ఎన్నికలకు పది నెలలు మాత్రమే మిగి లాయి. గతంలో వీళ్లు చేసిన రెండు సమ్మెల ఫలి తంగా వీళ్లని ఔట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్టు ఉద్యమంగా మారుస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా హర్షించాం. అదే క్రమంలో 24 గంటల విద్యుత్ సరఫరా ప్రభుత్వం సాధించగలిగింది. ఈ సాధనలో 23వేల మంది కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఏమిటో మీకు తెలుసు. అది గుర్తించే వీళ్లందరినీ పర్మ నెంట్ చేయాలనే ఒక నిర్ణయం మీరు తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒక కీలకమైన నిర్ణయం. విద్యుత్ బోర్డుకు సారథ్యం వహిస్తున్న ప్రభాకర్ రావు నేతృత్వంలో, సాధక బాధకాలను, చట్టపర అడ్డంకులను పరిశీలించాకే ఈ 23 వేల మందిని నాలుగు కేటగిరీల కింద విభజించి చాలా శాస్త్రీయం గానే వీళ్లను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీఓను విడు దల చేసింది. దీనిని సవాలు చేస్తూ కాంట్రాక్టర్ల ప్రోద్బలంతో ఎవరో ఒక అనామకుడు కోర్టులో ప్రజా వ్యాజ్యం కింద కేసు వేశాడు. కోర్టు దీనిమీద స్టే ఇచ్చిన విషయం మీకు తెలుసు. అప్పట్లో కోర్టు డైరెక్టు పేమెంటును సమర్థించింది. అంటే కాంట్రా క్టర్ల వ్యవస్థను తిరస్కరించింది. మీరు ఇంత ప్రతి ష్టగా తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో కౌంటర్ వేసి అప్పటి అడ్వొకేట్ జనరల్ ద్వారా వాదనలు విని పించి స్టేను ఎత్తివేసే ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది. ఇదంత కష్టమైన పనేం కాదు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో 30 వేల మంది కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సర్వీసులని క్రమబద్ధీకరించారు. కోర్టు స్టే తర్వాత కౌంటర్ వేయడంలో కాని ఈ ఉద్యోగుల క్షేమ సమాచారాలను కాని ప్రభుత్వం పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదని మేం భావిస్తున్నాం. ముఖ్యంగా 24 గంటల విద్యుత్ సంద ర్భంలో మీరు ఒక ఇంక్రిమెంట్ ప్రకటించినప్పుడు ఆ ఇంక్రిమెంట్ ఈ 23 వేల మందికి ఇవ్వలేదు. ఈ 23 వేల మంది పాత్ర లేకుండానే 24 గంటల విద్యుత్ సాధ్యమయ్యిందా? పర్మినెంట్ చేయాలని నిర్ణయిం చినప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఎందుకు అంత వెనుకంజో అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఇంక్రి మెంట్ కానీ లేదా వాళ్లకు అంగీకరించిన టైం స్కేళ్లు ఇవ్వడానికి కోర్టుకు ఏం అభ్యంతరం ఉంటుంది? అభ్యంతరమల్లా క్రమబద్ధీకరణ మీదే. విద్యుత్ ఉద్యోగులు సమ్మె నోటీసు దాదాపు 40 రోజుల కిందే ఇచ్చారు. ప్రభుత్వం ఏదో సహాయం చేద్దామంటే సమ్మెకు నోటీస్ ఇవ్వడమేంటి అని ప్రభు త్వం భావించి ఉండవచ్చు. ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలను కోర్టులో సకాలంలో సమర్థించు కోలేకపోతే, ఆ దిశలో ఏం చర్యలు తీసుకోకపోతే కార్మికులు ఏం చేయాలి? తెలంగాణ ప్రకటించి జాప్యం చేస్తే మనం ఉద్యమాలు చేయలేదా? ఉద్య మాలు చట్టబద్ధం కాదు, సమ్మెచేస్తే చర్యలు తీసు కుంటాం అని అంటే, వేరే మార్గాలేమిటో ప్రభుత్వం సూచించాలి. సంబంధిత అధికారులకు అర్జీలు పెట్టు కున్నారు. ఒకటీ రెండు సందర్భాలలో ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారిని కార్మికులు కలిసినప్పుడు నేను కూడా వెళ్లాను. ఇవ్వన్నీ పాత డిమాండ్సే కదా అన్ని పరిశీలనలో ఉన్నాయని మాత్రం సమాధానం చెప్పారు. రెండు, మూడు రోజుల క్రితం లేబర్ కమి షనర్ చర్చలకు పిలిచి ప్రతి డిమాండ్‌కు యాంత్రి కంగా స్పందించారే తప్ప, పరిష్కారాలను సూచించ లేదు. సమ్మె హక్కు రాజ్యాంగంలోనే ఉంది. బ్రిట న్లో సమ్మె హక్కు లేదు. కానీ సంప్రదింపుల యంత్రాంగం చాలా పటి ష్టంగా ఉంది. ఈ సమ్మెను మీరు సరిౖయెన స్ఫూర్తితో అవ గాహన చేసుకొని సంప్రదింపులు జరిపి తగు నిర్ణ యాలు తీసుకోండి. వారి డిమాండ్లలో క్రమబద్ధీ కరణ అంశం కోర్టు ముందు ఉంది కాబట్టి దాని విష యంలో తక్షణమే కౌంటర్ వేసి అవసరమైతే సుప్రీం కోర్టు లాయరుకు అప్ప జెప్పండి. మీరే అంగీకరించి జీవో ఇచ్చిన జీతభత్యాలను, అంటే నాలుగు స్కేళ్లను అమలు చేయండి. కోర్టు అభ్యంతరం చెబితే ప్రభుత్వ దృక్పథాన్ని, వాదనని కోర్టుకు చెప్పి ఒప్పిం చేలా ప్రయత్నం చేయండి. రాజకీయాలంటేనే సమస్యలను పరిష్కరించడం. సమ్మెను శాంతి భద్ర తల సమస్యల్లా చూడకండి. తక్షణమే స్పందించి, మీరు తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయండి అంటున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేసే డిమాం డ్లను సుముఖంగా పరిష్కరించండి. గౌరవ అభినందనలతో... ప్రొ జి. హరగోపాల్ వ్యాసకర్త విద్యుత్ కార్మికుల సలహాదారు -
కత్తి మహేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోరు?
సాక్షి, భూపాలపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచడంతో రైతులు సంతోషిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతును రాజును చేసిన ఘనత మోదీకి దక్కిందని, మద్దతు ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు జై జవాన్, జై కిసాన్ అనేవి నినాదాలుగా ఉండేవి కానీ నేడు వాటిని గొప్పగా కీర్తించిన వ్యక్తి మోదీ అని తెలిపారు. 70 ఏళ్లుగా రైతుల పేరుతో ఓట్లు దండుకున్నారని, బీజేపీ రైతుల మొహంలో చిరునవ్వు చూడాలని కోరుకుంటోందని లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తే, బీజేపీ ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయల వరకు లాభాలు వచ్చేలా చేసిందని తెలిపారు. శ్రీరాముడుపై కత్తి మహేష్ కించపరిచే వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. దీన్ని ప్రభుత్వం మతం, కులం కోణంలో చూస్తే ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే చట్టాన్ని సవరించైనా రాముడిపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వంరంగల్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి లక్ష్మణ్ సంతాపం తెలిపారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, వరంగల్ నడిబొడ్డున బాణసంచా అక్రమంగా తయారు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో ప్రభుత్వం తన శాఖల పనితీరుపై పట్టు కోల్పోయినట్లు తెలుస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పరిహారం అందిచాలని కోరారు. సింగరేణి కార్మికులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావులు పాల్గొన్నారు.