Telangana Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పందించింది. తెలంగాణలో ధాన్యం, బియ్యాన్ని మొత్తం కొనలేమని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్ స్పష్టం చేశారు.
ధాన్యం, బియ్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోలు ఉంటాయని స్పష్టం చేశారాయన. అస్సాంలో ధాన్యం సేకరణ పై అడిగిన ప్రశ్నకు లోక్ సభ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం. ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదు. మద్దతు ధర, డిమాండ్ , సప్లై లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చారు ఆయన.
వరి ధాన్యం కోనుగోలుపై కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీలు మంగళవారం మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తోందంటూ చర్చించిన విషయం తెలిసిందే. మరోవైపు వడ్ల కొనుగోలు అంశంపై రేపు(గురువారం) తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు ఎంపీలు పీయూష్‌ను కలవనున్నారు. వడ్ల సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ వినిపించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment