trs ministers
-
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై స్పందించిన కేంద్రం
Telangana Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పందించింది. తెలంగాణలో ధాన్యం, బియ్యాన్ని మొత్తం కొనలేమని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్ స్పష్టం చేశారు. ధాన్యం, బియ్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోలు ఉంటాయని స్పష్టం చేశారాయన. అస్సాంలో ధాన్యం సేకరణ పై అడిగిన ప్రశ్నకు లోక్ సభ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం. ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదు. మద్దతు ధర, డిమాండ్ , సప్లై లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చారు ఆయన. వరి ధాన్యం కోనుగోలుపై కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీలు మంగళవారం మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తోందంటూ చర్చించిన విషయం తెలిసిందే. మరోవైపు వడ్ల కొనుగోలు అంశంపై రేపు(గురువారం) తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు ఎంపీలు పీయూష్‌ను కలవనున్నారు. వడ్ల సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ వినిపించే అవకాశం ఉంది. -
‘తెలంగాణ మంత్రులకు చీరలు, గాజులు పంపుతున్నాం’
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఢిల్లీలో తేల్చుకొస్తామని వెళ్లి ఉత్త చేతులతో వచ్చిన రాష్ట్ర మంత్రులకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, బొట్టు బిళ్లలు పంపుతున్నట్టు మహిళా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. శనివారం గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధులు కల్వ సుజాత, రవళిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులను ఆడవారితో పోల్చడమంటే తమకే అవమానంగా ఉందన్నారు. అయినా పీసీసీ అధ్యక్షుడి ఆదేశాలతో వారికి చీరలు, గాజులు పంపుతున్నామని చెప్పారు. ఢిల్లీలో అగ్గి పుట్టిస్తామని వెళ్లిన మంత్రులు వారం రోజులు అక్కడే ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ అంశంపై సరిగ్గా పోరాడలేక టీఆర్ఎస్ చేతులెత్తేసిందన్నారు. కనీసం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా వారికి కష్టమయ్యాయని ఎద్దేవా చేశారు. చేతకాని రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసి, చీర, గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోవాలని సుజాత, రవళి రెడ్డి వ్యాఖ్యానించారు. (చదవండి: Hyderabad: న్యూఇయర్ వేడుకలు.. లిక్కర్ టార్గెట్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ ) -
తెగని పంచాయితీ.. రెండ్రోజుల్లో తేలుస్తాం
-
తెగని పంచాయితీ.. రెండ్రోజుల్లో తేలుస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి నిర్ణీత లక్ష్యానికి మించి అదనంగా వచ్చే ధాన్యాన్ని కూడా సేకరిస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందానికి హామీ ఇచ్చారు. అయితే అదనంగా ఎంతమేర ధాన్యాన్ని సేకరిస్తామన్నది ఒకట్రెండు రోజుల్లో అధికారులతో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పారు. యాసంగిలో మాత్రం బాయిల్డ్ రైస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునేది లేదని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు. అదనపు ధాన్యాన్నంతా సేకరించాలి ధాన్యం కొనుగోళ్ల అంశమై శనివారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన మంత్రుల బృందం నాలుగు రోజుల పడిగాపుల అనంతరం ఎట్టకేలకు మంగళవారం పార్లమెంటులో íపీయూష్ గోయల్ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, నేతకాని వెంకటేశ్, బీబీ పాటిల్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి కేంద్రం విధించిన లక్ష్యం మేరకు 60 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చివరి దశలో ఉన్నందున అదనపు ధాన్యం సేకరణపై కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరారు. మరో 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉండగా, మరో 5 లక్షల టన్నుల పంట కోత దశలో ఉందని, ఈ అదనపు ధాన్యాన్నంతా సేకరించాలని కోరారు. దీనిపై స్పందించిన గోయల్, తాను ఈ విషయమై ఇదివరకే లోక్‌సభలో ప్రకటన చేశానని గుర్తు చేశారు. దీంతో తమకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని మంత్రులు కోరారు. చదవండి: పాలన చేతకాకపోతే తప్పుకోండి! బియ్యం తరలింపులో రాష్ట్ర నిర్లక్ష్యం లేదు ఇదే సమయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి ఇవ్వాల్సిన బియ్యం విషయంలో రాష్ట్ర నిర్లక్ష్యం లేదని కేంద్రమంత్రికి మంత్రులు వివరణ ఇచ్చారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని గోదాముల నుంచి తరలించడంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. గోదాములు ఖాళీ చేయాలని తమ అధికారులు పదేపదే లేఖలు రాశారంటూ వాటిని కేంద్ర మంత్రికి అందించారు. రైల్వే వ్యాగన్లు కేటాయించకపోవడం వల్లే తరలింపు ఆలస్యమైందని గతంలో కేంద్ర రైల్వే మంత్రి తెలిపారని ఎంపీ నామా చెప్పగా, గోయల్ అప్పటికప్పుడు రైల్వే మంత్రితో మాట్లాడారు. వ్యాగన్లు కేటాయించి బియ్యాన్ని తరలించాలని కోరారు. అక్కడే ఉన్న అధికారులకు సైతం ఆదేశాలిచ్చారు. కాగా బియ్యం విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని గోయల్‌కు రాష్ట్ర మంత్రులు ఫిర్యాదు చేశారు. -
టీఆర్ఎస్ మంత్రులు కబ్జాకోరులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మంత్రులు, నేతలు రాష్ట్రంలో కబ్జాకోరులుగా తయారయ్యారని, కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మింగేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో కలిసి ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలను విడుదల చేశారు. గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్ భూములకు సంబంధించిన పత్రాలు, మల్లారెడ్డి కళాశాల గురించి న్యాక్ ఇచ్చిన నివేదికను మీడియాకు అందజేశారు. మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధారాలతో సహా ఆరోపణలు చేసినా సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. -
ప్రగతిభవన్‌కు వెళ్లినా అనుమతించలేదు: ఈటల
సాక్షి, హుజూరాబాద్: మంత్రి హోదాలో తాను ప్రగతిభవన్‌కు వెళ్లినా అనుమతించలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మంత్రుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర లేదనడం సరికాదన్నారు. తనపై విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. తనకు గౌరవం, గుర్తింపు ఇవ్వలేదని అనలేదని ఆయన పేర్కొన్నారు. తాను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చెప్పానని ఈటల అన్నారు. చదవండి: ఈటల రాజేందర్ మేక వన్నె పులి; మంత్రుల కౌంటర్ Etela:హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం -
పార్టీలో ప్రాధాన్యత లేదనడం సత్యదూరం
-
ఈటల రాజేందర్ మేక వన్నె పులి; మంత్రుల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఈటల వ్యాఖ్యలపై మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యవహారంపై మంత్రులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈటలకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చామని.. ఆయనకు ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బతిందని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారే పదవుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎల్పీ నాయకుడిగా ఈటలకు అవకాశం ఇచ్చారు. ఈటలకు మంత్రి పదవితో పాటు కీలక శాఖలు కూడా ఇచ్చారు. పార్టీలో గౌరవం దక్కినా ఈటల విమర్శలు చేస్తున్నారు. ఈటలకు మంత్రి పదవితో పాటు కీలక శాఖలు అప్పగించారు. పార్టీలో ప్రాధాన్యత లేదనడం సత్యదూరం. అసైన్డ్ భూములను కొనరాదు.. అమ్మరాదు అనే విషయం తెలియదా?. మంత్రిగా ఉండి అసైన్డ్ భూములను ఎందుకు కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఈటల నష్టం చేశారని’’ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ‘‘కుటుంబ అవసరాల కోసం అసైన్డ్ భూములు కొనడం తప్పు కాదా?. దేవరయాంజల్లో దేవాదాయ భూములను ఎందుకు కొన్నారు?’ అంటూ మంత్రి ఈశ్వర్ ప్రశ్నలు సంధించారు. ఆరోపణలపై సమాధానం ఇవ్వకుండా సీఎంపై విమర్శలు చేస్తున్నారని.. రెండేళ్లుగా ఈటల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల నిప్పులు చెరిగారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్.. ఈటల రాజేందర్ మేక వన్నె పులి అంటూ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను దొర అని సంభోదించడం సరికాదన్నారు. ‘‘బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్. ముదిరాజులు, బలహీనవర్గాల గురించి ఈటల ఏనాడూ ఆలోచించలేదు. కమలాపూర్‌లో చీమలు పెట్టిన పుట్టలో పాములా చేరారు. ఈటల పార్టీలోకి రాకముందే కమలాపూర్ జడ్పీ పీఠం గెలిచాం. పార్టీ గెలిస్తే ఏడవడం.. పార్టీ ఓడితే నవ్వడం ఈటల పని’’ అంటూ మంత్రి గంగుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చదవండి: Etela:హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! -
సబిత, మల్లారెడ్డిలకు అగ్నిపరీక్ష..!
సాక్షి, హైదరాబాద్: పుర‘పోరు’మంత్రులకు అగ్నిపరీక్షగా మారింది. మున్సిపోల్స్‌లో ఓడితే మంత్రి పదవి పోతుందనే ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిక అమాత్యులను కలవరపరుస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల మధ్య సమన్వయం కుదరకపోవడం, సముదాయించేందుకు ప్రయత్నించినా స్థానిక నేతలు వారి మాట పెడచెవిన పెట్టడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కార్మిక మంత్రి మల్లారెడ్డితో మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితతో మాజీ ఎమ్మెల్యే తీగల.. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి పొసగకపోవడంతో వీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ దళానికి తిరుగుబాటు బెడద తొలగిపోలేదు. ఎవరికి వారే పట్టువీడకపోవడంతో రాజధాని శివార్లలో మున్సిపోల్స్ ఆసక్తికరంగా మారాయి. కుదరని సమన్వయం.. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఫీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్ నగర పాలక సంస్థల్లో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య సమన్వయలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు స్థానిక నాయకులను వర్గాలుగా చీల్చేసింది. టికెట్ల కేటాయింపులో ఇద్దరూ వేదిక మీదే కీచులాడుకునే స్థాయికి వెళ్లడంతో సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై రెండు సార్లు మందలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలకే బీఫారాలు ఇచ్చే బాధ్యతలు అప్పగించడంతో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి తనకు అనుకూలంగా ఉన్న వారికే బీ ఫారాలు ఇచ్చారని సుధీర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ వర్గానికి అన్యాయం జరిగిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ కొందరు రెబెల్స్‌గా దిగగా.. మరికొందరు వేరే పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇదే సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట పురపాలికల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, మరోమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్‌పేట, మీర్ పేట కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో మంత్రి సబిత, మాజీ ఎమ్మె ల్యే తీగల కృష్ణారెడ్డిల మధ్య కూడా సమన్వయం కుదరలేదు. ఇరువర్గాలు పోటాపోటీగా టికెట్లు ఆశించడం, స్థానిక ఎమ్మెల్యేగా సబిత తన వర్గానికి పెద్దపీట వేయడంతో తీగల వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. వారిలో కొందరు రెబెల్స్‌గా బరిలో నిలిచారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చెప్పినా పట్టించుకోకుండా తిరుగుబావుటా ఎగురవేశారు. తాండూరు అసెంబ్లీ కూడా అధికార పార్టీకి తలనొప్పిగానే మారింది. ఇక్కడ ఉన్న తాండూరు మున్సిపాలిటీలో అభ్యర్థుల ఖరారు విషయంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి చుక్కెదురైంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ తన మార్కును చూపించడంతో మహేందర్ శిబిరానికి నిరాశే మిగిలింది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు మంత్రి తలసాని రంగంలోకి దిగినా ఫలితం అంతంతగానే ఉంది. దీంతో ఇక్కడా టీఆర్ఎస్కు రె‘బెల్స్’మోగుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు, ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రులకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు.. పూర్వ రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్ఎస్ పుర రాజకీయం ఉత్కంఠను రేపుతోంది. మంత్రులుగా ఉమ్మడి జిల్లాకు బాధ్యత వహించాల్సిన సబిత, మల్లారెడ్డిలు తమ వర్గాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ రాజకీయం రంజుగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే 22 పుర, 7 నగర పాలక సంస్థలకు బాధ్యత వహించాల్సిన అమాత్యులు తమ సెగ్మెంట్లలోని ఇంటిపోరునే పరిష్కరించుకోలేకపోవడం గమనార్హం. ఇక, మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా సమస్య వచ్చిన దగ్గర మంత్రుల మార్కు కూడా కనపడలేదు. నియోజకవర్గాలకే పరిమితమై మంత్రులు రాజకీయం చేయడంతో రాష్ట్రంలోనే అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్న రంగారెడ్డి జిల్లా అధికార పార్టీకి సవాల్‌గానే మారింది. -
మంత్రులు మాట మీద నిలబడరు
హామీలు ఇచ్చి తప్పించుకుంటారు ఒప్పందాలకు తిలోదకాలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హన్మకొండ: టీఆర్ఎస్ మంత్రులు మాట మీద నిలబడరని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో చేపట్టిన విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు ఆయన శుక్రవారం సంఘీభావం తెలిపి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శిం చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పి, అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని తూర్పారబట్టారు. విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ శాఖ మంత్రి ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందానికి తిలోదకాలు ఇవ్వడంతో విద్యుత్ ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. దీనికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యుత్ సంస్థల యాజమాన్యాలదే బాధ్యత అని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వీరి సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఆ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 30న వరంగల్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం వరంగల్: ప్రపంచంలో మూడో ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను పెద్ద నోట్ల రద్దు చేసి నడ్డివిరిచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌కు వచ్చిన ఆయన డీసీసీ భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని ప్రపంచంలోని పలువురు ప్రముఖ ఎకనామిస్టులు అన్నారని తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బ్లాక్ మనీ బయటకు తెస్తా అన్న మోదీ దేశానికి బ్లాక్ రోజులను తీసుకువచ్చారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా ఈ నెల 28న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిందని, అన్ని జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నారుుని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ముగిసిన ‘మున్సిపల్’ ప్రచారం
వరంగల్, ఖమ్మం, అచ్చంపేటల్లో రేపే పోలింగ్ సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా మూడు జిల్లాల్లో రాజకీయ వేడి పుట్టించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెర పడింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పి రంగంలోకి దించింది. వరంగల్‌కు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఖమ్మంకు ఆ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అచ్చంపేటకు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్చార్జిలుగా వ్యవహరించారు. గ్రేటర్ వరంగల్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు కూడా ప్రచారం చేశారు. రెండు నగరాల్లో టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేపట్టింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో చివరి రెండు రోజుల్లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ సుడిగాలి ప్రచారం జరిపారు. విపక్షాలు కూడా..: అధికార పార్టీని మూడు చోట్లా ఓడించి తమకు అవకాశం ఇవ్వాలంటూ విపక్ష పార్టీలు ప్రచారం చేసుకున్నాయి. వరంగల్‌లో ఈసారి బీజేపీ, టీ టీడీపీలు పొత్తుకు దూరంగా ఉండి విడివిడిగా బరిలో దిగాయి. పరస్పరం విమర్శలు కూడా గుప్పించుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు వరంగల్ ఎన్నికల ప్రచారంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అచ్చంపేటలో టీఆర్ఎస్కు దీటుగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. మాజీ మంత్రి డి.కె.అరుణ ప్రచారంలో పాల్గొన్నారు. -
మంత్రులు.. నపుంసకులు!
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్య పటాన్చెరు: టీఆర్ఎస్ మంత్రులు నపుంసకులని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జిల్లా పటాన్చెరులో జరిగిన టీడీపీ సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు మంత్రి పదవులిచ్చామని గుర్తు చేస్తూ.. ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలున్నా కేసీఆర్ క్యాబినెట్లో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. ‘ఎంపీ కవిత వెళ్లి తండ్రితో ఆడవాళ్లకు మంత్రి పదవి ఎందుకివ్వలేదని అడిగితే .. ఇప్పుడున్న మంత్రులు మగాళ్లలా కనిపిస్తున్నారా అని కేసీఆర్ ఆమెతో అన్నారట.. వారంతా అటు ఇటుగాని మంత్రులు ’ అంటూ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. అంతెందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెబితే జీహెచ్ఎంసీ చెప్రాసీ కూడా మాటవినే పరిస్థితిలేదని విమర్శించారు. చెప్రాసీతో పని చేయించుకునేందుకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మంత్రికి చెప్పాల్సిన పరిస్థితి ఉందని, ఎందుకీ బానిస బతుకులు అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, ఆయన బంధువులు ఏలేందుకా తెలంగాణా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణాలోని అన్ని జిల్లాలను ఓ దొరకు అప్పగించారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాగా రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ సాధనకు జరిగిన ఉద్యమంలో విద్యార్థుల త్యాగాల విలువ వెలకట్టలే నిదని అన్నారు. సస్పెన్షన్‌పై కాంగ్రెస్‌లో తర్జనభర్జన వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజయ్యపై సస్పెన్షన్ వేటు వేయాలా వద్దా అన్న అంశంపై కాంగ్రెస్‌లో తర్జనభర్జనలు సాగుతున్నాయి. రాజయ్య నివాసంలో జరిగిన దుర్ఘటనపై రాజకీయంగా ఎలా స్పందించాలనే దానిపై పార్టీ నాయకులు నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆయన ఏఐసీసీ సభ్యుడు కానందున చర్య తీసుకునే అధికారం టీపీసీసీ పరిధిలోనే ఉంది. ఆయనను సస్పెండ్ చేయాలని జిల్లా పార్టీ సిఫార్సు చేస్తే తదనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చునని పార్టీ నేత ఒకరు సాక్షికి చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో మౌనంగా ఉంటేనే మంచిదని, సస్పెన్షన్ వేటు వేస్తే ఆయా సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రావొచ్చుననే అభిప్రాయంతో కొందరు నాయకులున్నారు. -
బావ బావమరుదుల మధ్య పోటీ
-
'ఎన్టీఆరే... బాబును గాడ్సేతో పోల్చారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సిహెచ్ లక్ష్మారెడ్డి గురువారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టింది చంద్రబాబే అని వారు ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆరే ... చంద్రబాబును గాడ్సేతో పోల్చిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. చంద్రబాబు నైజం అనైతికమంటూ విమర్శించారు. ఓటుకు కోట్లు అంశంపై ఇప్పటికీ ఎందుకు స్పందించలేదని చంద్రబాబును జూపల్లి, లక్ష్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు. 1995లో వేల రూపాయల ఆదాయం ఉన్న చంద్రబాబు ఇప్పుడు వేల కోట్లను ఏ విధంగా సంపాదించారని నిలదీశారు. ఓటుకు కోట్లు అంశంలో అరెస్ట్ అయిన కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందన్నారు. రేవంత్‌కు న్యాయస్థానంలో శిక్ష తప్పదని జూపల్లి, లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. -
'ఎన్టీఆరే... బాబును గాడ్సేతో పోల్చారు'
-
'పసలేదు, కారం లేదు... కేసీఆర్ ప్రకటనలా ఉంది'
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో శనివారం జరిగిన సంఘటనని ఖండిస్తారా ? లేక సమర్థిస్తారా ? అని సీఎం కేసీఆర్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... నేడు జరిగిన శాసనసభ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ వెల్‌లోకి వెళ్లాల్సిన అవసరమేముందని ఆయన అధికార పార్టీ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. శనివారం సభలో జరిగిన తీరుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభలో చోటు చేసుకున్న ఘర్షణపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో పసలేదు, కారం లేదని... అది సీఎం కేసీఆర్ ప్రకటనలా ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
'స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లకు మంత్రి పదవులు'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లకు మంత్రి పదవులు అలంకరించబోతున్నారు. వీరిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగులు లేని తెలంగాణ ఉద్యమమే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. తమది ఉద్యోగ అనుకూల ప్రభుత్వం తమదని చెప్పుకున్నారు. ఆంధ్రా ఉద్యోగులు, ఆంధ్ర ప్రభుత్వంలో ఉండాలని కొద్ది మందిని బలవంతంగా రుద్దినా ఉండనీయబోమని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులను అనుమతించమని చెప్పారు. ఈ విషయంలో తమ స్పేచ్ఛను హరిస్తే ఊరుకోబోమని, కొట్లాకైనా సిద్దమని అన్నారు. ఆంధ్రా ఉద్యోగులను సచివాలయం గేటులోపలికి కూడా అనుమతించమని కేసీఆర్ స్పష్టం చేశారు.