'ఎన్టీఆరే... బాబును గాడ్సేతో పోల్చారు' | Cash For Vote || Joopalli Krishnarao Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 2 2015 1:25 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సిహెచ్ లక్ష్మారెడ్డి గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టింది చంద్రబాబే అని వారు ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆరే ... చంద్రబాబును గాడ్సేతో పోల్చిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. చంద్రబాబు నైజం అనైతికమంటూ విమర్శించారు. ఓటుకు కోట్లు అంశంపై ఇప్పటికీ ఎందుకు స్పందించలేదని చంద్రబాబును జూపల్లి, లక్ష్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు. 195లో వేల రూపాయిల ఆదాయం ఉన్న చంద్రబాబు ఇప్పుడు వేల కోట్లను ఏ విధంగా సంపాదించారని నిలదీశారు. ఓటుకు కోట్లు అంశంలో అరెస్ట్ అయిన కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్కు బెయిల్ మాత్రమే వచ్చిందన్నారు. రేవంత్కు న్యాయస్థానంలో శిక్ష తప్పదని జూపల్లి, లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement