Jupalli krishna rao
-
ఈ టర్మ్‌లోనే అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘దశాబ్దాల తరబడి కరువు, వలసల జిల్లాగా ఖ్యాతికెక్కిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడు భూములకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తాం. ఇదే శాసనసభ కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను సంపూర్ణంగా పూర్తిచేసి సాగు నీరందిస్తాం’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు–రంగారెడ్డితోపాటు పలు ప్రాజెక్టులను మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం నాగర్‌కర్నూల్‌లోని కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని భావించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ పెద్ద మనిషి ఇటీవల పాలమూరు ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రూ.27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకూ సాగు నీరివ్వలేక పోయారన్నారు. ఈ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించే విధంగా చిత్తశుద్ధితో ముందుకెళుతున్నామని చెప్పారు. రెండు నెలలకోసారి ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తామని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.కృష్ణా నీటిని ఇప్పటికీ వినియోగించుకోలేకపోతున్నాం..: జూపల్లికృష్ణా నీటి కేటాయింపులున్నా, వాటిని ఇప్పటికీ వినియోగించుకోలేక పోతున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 18 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకోవాల్సి ఉండగా, ఇప్పటిదాకా కేవలం ఆరు టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా తమ సమస్యలను విన్నవించుకునేందుకు వస్తే.. తమకు అవకాశం ఇవ్వలేదంటూ ఉదండాపూర్ నిర్వాసితులతోపాటు కానాయపల్లి నిర్వాసితులు మంత్రులు వెళ్లిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. -
కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు
గద్వాల రూరల్: ‘అసెంబ్లీలో పాతమిత్రులు కనిపిస్తే వెళ్లి మాట్లాడినంత మాత్రాన పార్టీ మారినట్లు మీడియా కథనాలు రాయడం సరైంది కాదు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు’అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలసి గద్వాలలోని ఎమ్మెల్యే బండ్ల నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డితో మంతనాలు చేయడంతో పాటు ఆయనతో కలసి అల్పాహారం చేశారు.అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నారు. పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఎక్కడా ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నెట్టెంపాడు, ర్యాలంపాడు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేకపోవడంతో కొంత మనస్తాపానికి గురైనట్లున్నారని పేర్కొ న్నారు.కాగా, కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమాన అవకాశాలుంటాయని, పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని చెప్పారు. గద్వాల అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికే ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనన్నారు. అనంతరం ఆయన కృష్ణమోహన్‌రెడ్డిని తన వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
ప్రభుత్వ భూముల్లో ఈత వనాల పెంపకం
సాక్షి, నాగర్‌కర్నూల్: అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన యోధుడు సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈత వనాల పెంపకం కోసం గౌడ సొసైటీలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విరివిగా ఈత వనాలను పెంచనున్నట్టు చెప్పారు. అలాగే సాగునీటి కాల్వల గట్లపై కూడా ఈత వనాలను పెంచుతామన్నారు. వైన్‌షాపుల కేటాయింపులో ప్రస్తుతం అమలులో ఉన్న 15 శాతం రిజర్వేషన్‌ను సొసైటీ సభ్యులకు వర్తింపజేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఏళ్లుగా దాగి ఉన్న సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను బయటకి తెచ్చామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గీత కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గౌడ కార్మికులకు రక్షణ కిట్లను అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో టీపీ సీసీ సీనియర్ నేత మధు యాష్కిగౌడ్, బీసీ సంఘాల నేత జాజాల శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు
నాగర్‌కర్నూల్: చెంచు మహిళపై జరిగిన దాడి ఘటన ఆటవిక చర్య అని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లి తండాకు చెందిన బాధిత మహిళను మంత్రి శనివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నలుగురు వ్యక్తులు బాధిత మహిళపై పాశవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని, ఘటనకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించామని, నిందితులను అరెస్ట్ చేసి కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు వివరించారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఊపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వారి ముగ్గురు ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో విద్యను అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రస్తుతం రెండెకరాల భూమి ఉందని, ప్రభుత్వం తరఫున మరికొంత భూమిని కూడా ఇచ్చి ఆదుకుంటామని జూపల్లి హామీ ఇచ్చారు. -
కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం నాది కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాలకు సంబంధించి తాను ఎలాంటి అను మతులు ఇవ్వలేదని, తన వద్దకు ఎలాంటి దర ఖాస్తులు రాలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గతంలో చెప్పిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని, అనుమతులు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ తీసుకున్న నిర్ణయమేనని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త మద్యం బ్రాండ్లను ఎక్సైజ్ శాఖ అనుమతించిందని జరుగుతున్న ప్రచారం తప్పని, రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే జరుగుతాయని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను రూఢీ చేసుకోకుండా పత్రికలు తప్పుగా ప్రచురించాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) లావాదేవీలన్నీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని తెలిపారు. దీనికి టీజీబీసీఎల్ ఎండీ/ఎక్సైజ్ కమిషనర్ నేతృత్వం వహిస్తారన్నారు. రాష్ట్రంలో గత ఆరువారాలుగా వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఉందని, బీర్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి బీసీఎల్ ఎండీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోమ్ డిస్టిలరీస్ రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే ఆఫర్‌పై ప్రతిస్పందించారని తెలిపారు. కొత్తగా ఐదు సంస్థలకు బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిసింది. -
కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్‌లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. వీరిద్దరిపై పరువు నష్టం దావా వేస్తాను. భూ తగదాల కారణంగా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యాడని జూపల్లి చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి జూపల్లి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పరువు నష్టం దావా వేస్తాను. వీరిద్దరూ నన్ను ఏ చౌరస్తాను రమన్నా వస్తాను. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి హత్యను ఖండిస్తున్నాను. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో పూర్తి వివరాలు తెలియాలి అంటూనే కేటీఆర్‌ను నాపై ఆరోపణలు చేస్తున్నాడు. శ్రీధర్ రెడ్డికి తన కుటుంబ సభ్యులు, పలువురితో భూ తగాదాలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. నేను, పొంగులేటి.. కేసీఆర్‌తో విభేదించి బయటకి వచ్చాక ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేసీఆర్‌ను నియంత అన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు కేసీఆర్ పంచన చేరారు. ప్రవీణ్ కుమార్ ఆత్మగౌరవం అమ్ముకున్నారు. ఒకాయన ఐపీఎస్ ఆఫీసర్, ఒకాయన ఎన్ఆర్ఐ ఇద్దరూ కలిసి బట్టకాల్చి మీద వేస్తున్నారు. నన్ను, పొంగులేటిని కేసీఆర్ బర్తరఫ్ చేసినందుకు, ప్రజలు కేసీఆర్‌ను బర్తరఫ్ చేశారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి. శ్రీధర్‌రెడ్డి గ్రామానికి వెళ్లి కేటీఆర్ అసలు నిజాలు తెలుసుకోవాలి. నిజనిర్ధారణ చేసి తప్పు నాదుంటే ఎలాంటి చర్యలైనా తీసుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
మరింత మంచి పాలన
సాక్షి, హైదరబాద్: క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం గాం«దీభవన్‌లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. ప్రజాభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తుందన్నారు. వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేసి, ప్రజాదరణ పొందారని, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఈ క్రోది నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్‌రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నవ వసంతంలో అందరికీ మేలు జరగాలి
గన్¸పౌండ్రీ (హైదరాబాద్): క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో క్రోధినామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలలో పున్నమి వెన్నెలను నింపడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాగ పఠనం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా
ఖలీల్‌వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు. అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
పర్యాటక అభివృద్ధికి కృషి
కంటోన్మెంట్ (హైదరాబాద్): ప్రపంచ స్థాయిలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా అన్ని పండుగలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్‌ను శనివారం రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో నిర్వహించే పతంగుల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు నగరంలో నివసిస్తున్నారని, అందువల్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో పతంగులు, మిఠాయిల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 16 దేశాల నుంచి 40 మందికి పైగా కళాకారులు కైట్స్ ఫెస్టివల్లో పాలుపంచుకుంటున్నారన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు 400కు పైగా స్టాళ్లలో సుమారు 1,200 రకాల స్వీట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వేడుకల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలతోపాటు వంటకాలనూ తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇలాంటి ఉత్సవాలను జిల్లా, మండలస్థాయిలోనూ నిర్వహిస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాం, నెదర్లాండ్స్, కొరియా తదితర దేశాల నుంచి పర్యాటకులు పాల్గొన్నారని తెలిపారు. ముఖ్య ఆదాయ వనరుగా మారాలి: పొన్నం రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పర్యాటకం అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎక్సైజ్ ఇతర శాఖలకు పోటీగా పర్యాటకం ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఇందుకు రవాణా శాఖ నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె.నిఖిల, ఎండీ రమేష్ నాయుడు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికీ హామీ ఇవ్వలే.. ధాన్యం గోల్‌మాల్‌లో కొత్త ట్విస్టు!
జోగులాంబ: గద్వాలలో ధాన్యం గోల్మాల్ వ్యవహారంలో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ఈవ్యవహారంపై ఇటీవల మంత్రి జూపల్లి సమీక్షలో సివిల్‌సప్లయ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం విధితమే. అయితే, ప్రభుత్వం నుంచి మిల్లర్లకు ధాన్యం కేటాయించే సమయంలో సదరు మిల్లు యజమానితో పాటు అదనంగా మరో ముగ్గురితో హామీ తీసుకోవడం ప్రభుత్వ నిబంధన. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం కేటాయించే సమయంలో సదరు మిల్లర్ల నుంచి మిల్లు యజమానితో పాటు మరో ముగ్గురితో హామీ తీసుకుంది. అయితే రూ.కోట్ల విలువైన ధాన్యం గోల్మాల్ వ్యవహారంలో తాము ఎవరికీ హామీ ఇవ్వలేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని కొందరు వ్యక్తులు పోలీసు ఠాణా వెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయంపై సదరు ఠాణా అధికారి ధృవీకరించడం.. అయితే వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని చెప్పడం ధాన్యం గోల్మాల్ వ్యవహారం చర్చకు దారితీసింది. బియ్యం రికవరీలో ఉదాసీనత తాము ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్న కొందరి రైస్‌మిల్లర్ల వాదనలో నిజమే ఉందా..? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వానికి హామీ ఇచ్చి తప్పించుకోవాలని చూస్తే నేర తీవ్రత మరింత పెరుగుతుందని సదరు మిల్లర్లకు తెలుసు. మరి ఎక్కడ పొరపాటు జరిగింది. ఇందులో సివిల్‌సప్లయ్ శాఖ అధికారుల పాత్ర, మరికొందరి మిల్లర్ల పాత్ర పైనే సరికొత్త చర్చకు దారితీసింది. ఆదినుంచి సివిల్‌సప్లయ్ శాఖలోని కొందరు అధికారులు సీఎమ్మార్ రైస్ రికవరీపై వ్యవహరిస్తున్న ఉదాసీనత, అక్రమార్కులను కాపాడేలా చేస్తున్న యత్నాలు పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా గ్యారంటీ హామీలు పెట్టిన రైస్‌మిల్లు యజమానులు రెండు మిల్లర్లకు సైతం డబుల్ గ్యారెంటీలు హామీలు ఇచ్చినట్లు అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తుండడం కూడా పలు సందేహాలకు తెరలేపింది. హామీ ఇవ్వలే.. సూర్యాట్రేడర్స్ శాంతినగర్, కృష్ణారైస్ మిల్లు కాకులారం, అన్నపూర్ణ ట్రేడర్స్ గద్వాల రైస్‌మిల్లులకు 2021–22 రబీ, 2022–23 ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వం ధాన్యం కేటాయించింది. ఇందుకు సంబంధించి సదరు మూడు మిల్లు యజమానులతో పాటు మరో తొమ్మిది మంది రైస్‌మిల్లు యజమానులతో గ్యారెంటీలుగా హామీలు తీసుకుంది. రాజోలికి చెందిన వీరాంజనేయ రైస్ మిల్ యజమాని బి.సురేష్‌కుమార్, గద్వాలకు చెందిన విశాలక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ యజమాని జి.సుదర్శన్, కాకులారానికి చెందిన కృష్ణ రైస్ మిల్ యజమాని కృష్ణగౌడ్, శాంతినగర్‌కు చెందిన భాను ట్రేడర్స్ యజమాని బి.అశోక్‌కుమార్, అయిజకు చెందిన ఈశ్వర్ రైస్ మిల్ యజమాని జి.తేజాశ్, గద్వాలకు చెందిన రాజారాజేశ్వరి రైస్ మిల్లు యజమాని యు.సుదర్శన్‌రెడ్డి, కోదండాపురానికి చెందిన శ్రీలక్ష్మీ వెంకట సాయి పీబీఆర్ఎం యజమాని పి.నర్సింహులు పైన పేర్కొన్న డిఫాల్టర్లుగా మారిన మూడు రైస్ మిల్లులకు గ్యారెంటీలు, హామీ (ష్యూరిటీ) ఇవ్వలేదని అధికారులు రికార్డు చూపెడుతున్నారు. అయితే ఇందులో ముగ్గురు రైస్‌మిల్లు యజమానులు తాము ఎలాంటి గ్యారెంటీలు, హామీ పెట్టలేదని తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమను బలిచేస్తున్నారని పేర్కొంటూ మంగళవారం గద్వాల రూరల్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడి ఎస్ఐ ఆనంద్‌తో తమ గోడును వెల్లబోసుకున్నారు. అయితే దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. నోటిమాటగా చెప్పారు.. ఈ విషయపై గద్వాల రూరల్ ఎస్ఐ ఆనంద్‌ను ‘సాక్షి’ సంప్రదించగా కొంతమంది రైస్‌మిల్లు యజమానులు తమ పోలీసుస్టేషన్‌కు వచ్చిన మాట నిజమేనని, అయితే వాళ్లు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని కేవలం నోటిమాట ద్వారా చెప్పారన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సమాధానమిచ్చారు. నోటీసులు ఇచ్చాం.. గ్యారెంటీలు, హామీలు ఇవ్వలేదని చెప్పడం పూర్తి అబద్దం. వీరందరికి ఇదివరకే నోటీసులు ఇచ్చాం. ఇప్పుడు ఆర్ఆర్ యాక్టు ప్రకారం తప్పకుండా మిల్లు యజమానులతోపాటు, గ్యారెంటీలు, హామీలు ఇచ్చినవారితో వసూలు చేస్తాం. ఈవిషయంలో కలెక్టర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆర్ఆర్ యాక్టు అమలుకు రంగం సిద్ధం. మంత్రి జూపల్లి హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారయంత్రాంగంలో కదలిక వచ్చింది. ధాన్యం తీసుకుని ఎగ్గొట్టిన వారిపై ఆర్ఆర్ యాక్టు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశాం. దీంతో అటు ధాన్యం ఇవ్వాల్సిన రైస్‌మిల్లర్లు, వారికి గ్యారెంటీ హామీలు ఇచ్చిన వారిలో దడ మొదలైంది. – రేవతి, డీఎస్ఓ సివిల్సప్లై శాఖ ఇవి కూడా చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి పదవి మరోసారి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే దక్కింది. నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రిగా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టబెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు, తాజాగా మరోసారి పాలమూరు జిల్లాకే ఆ శాఖల బాధ్యతలు రావడంతో నల్లమల ప్రాంతం, ఇక్కడి విశిష్టమైన వన, జంతు సంపద, ఎకో టూరిజం, కృష్ణాతీర ప్రాంతాల అభివృద్ధిపై జిల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వ పాలనలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, దర్శనీయ స్థలాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి.. అభివృద్ధి పనులు కొనసాగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకం రంగంపై.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన భారీ రిజర్వాయర్ల వద్ద బోటింగ్ ఏర్పాటు, సౌకర్యాల కల్పనతో పెద్దఎత్తున పర్యాటకలను ఆకర్షించేందుకు ఆస్కారం ఉంది. పురాతన ఆలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద సౌకర్యాల కల్పనతో పర్యాటకం పెరగనుంది. జోగుళాంబ శక్తిపీఠం, నల్లమలలోని శైవక్షేత్రాలు, శ్రీశైల ఉత్తరద్వారంగా పేరొందిన ఉమామహేశ్వర క్షేత్రం, మన్యంకొండ తదితర ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి పర్చాల్సి ఉంది. పురావస్తు శాఖ సైతం జూపల్లి పరిధిలోనే ఉండగా.. జోగులాంబ శక్తిపీఠం సమీపంలోని పురాతన బ్రహ్మదేవాలయాలు, క్షేత్ర అభివృద్ధిపై మరింత దృష్టిసారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎకో టూరిజంతో మేలు.. ప్రకృతి రమణీయ ప్రాంతాలు, సహజసిద్ధమైన వనాలు, వన్య మృగాలను సంరక్షిస్తూనే పర్యాటకులను ఆకర్షించే ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించాలన్న డిమాండ్ స్థానికుల్లో నెలకొంది. ప్రధానంగా నల్లమల అభయారణ్యంలో పర్యాటకులు, సందర్శకుల ద్వారా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎకోటూరిజం ద్వారా అమూల్యమైన వృక్షసంపద, వన్యప్రాణులను వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇప్పటికే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీ, వ్యూ పాయింట్ వీక్షణం కొనసాగుతున్నా పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో లేవు. అలాగే కృష్ణాతీర ప్రాంతంలోని సోమశిల, అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం తదితర తీరప్రాంతాల్లో కాటేజీలు, బోటింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఎకో టూరిజం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా స్థానికంగా ఉన్న యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం దక్కనుంది. ఇవి చదవండి: పవన్ సీఎం రేసులో లేనట్టే! -
ముదురుతున్న గలాటా..! కూచుకుళ్ల కుటుంబంపై నాగం ఘాటు వ్యాఖ్యలు!
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత నేతల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొనగా, అదే సమయంలో పార్టీలోని ముఖ్య నేతల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఇటీవల పార్టీలోకి చేరిన నేతలు తమకే టికెట్ వరిస్తుందనే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. గురువారం జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్టానం నుంచి టికెట్ ప్రకటన వెలువడ్డాక ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కూచుకుళ్ల కుటుంబంపై నాగం విమర్శనాస్త్రాలు.. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కలసి నాగం జనార్దన్‌రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ వేదికగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిపై విమర్శలను సంధించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరకుండానే పార్టీ టికెట్ అడగడాన్ని తప్పుబట్టారు. మళ్లీ తనను ఓడించేందుకే దామోదర్‌రెడ్డి కుమారుడిని పార్టీలోకి పంపారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నుంచి నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేర్చాల్సిందిపోయి.. కేవలం కాంగ్రెస్ పార్టీలోనే చీలికలు తెస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తన అసలు శక్తి చూపుతానని, చక్రం తిప్పుతానంటూ నాగం చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు.. నాగర్‌కర్నూల్‌తో పాటు కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వేర్వేరుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్దేశించిన కార్యక్రమాలను సైతం ఎవరికి వారే సొంతంగా చేపడుతున్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నేతలు జగదీశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇరువురూ బరిలో ఉంటామని చెబుతుండటంతో అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. కొల్లాపూర్‌లో ఎవరికి వారే.. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతలపల్లి జగదీశ్వరరావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య సఖ్యత పొసగడం లేదు. ఎవరికి వారు తమకే పార్టీ టికెట్ లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. వేర్వేరుగా ప్రజల మధ్య కార్యక్రమాలను చేపడుతున్నారు. పార్టీ టికెట్‌పై సాగుతున్న ప్రచారం నేపథ్యంలో శుక్రవారం జగదీశ్వరరావు స్పందించారు. ఈసారి ఎన్నికల్లో కాాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని, తాను ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. -
స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క ఉపఎన్నికనే (మునుగోడు అసెంబ్లీ సీటుకు) సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్ఎస్ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని ఆరోపించాయి. ఏకంగా పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో అధికార బీఆర్ఎస్ డబ్బు సరఫరా చేసిందని దుయ్యబట్టాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి. సీఈసీతో సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న బి.వినోద్ కుమార్. చిత్రంలో భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర బలగాలను దింపాలి: బీజేపీ మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్ పాఠక్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులను భారీ స్థాయిలో ఎన్నికల పరిశీలకులుగా పంపాలని కోరారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు పనులు చేయా లని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు. మద్యం షాపులు మూసేయిస్తే... మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రధానపోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి. శ్రీధర్‌బాబు, ఫిరోజ్‌ఖాన్, జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అధికారుల బదిలీలను మళ్లీ జరపాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు. ప్రజల మధ్య విభజనకు మతఛాందసవాదుల కుట్ర: బీఆర్ఎస్ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతఛాందసవాదులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో మతఛాందసవాదులను నియంత్రించాలని సీఈసీని కోరింది. పార్టీ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ ఈసీ బృందానికి కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ గుర్తును ఓ పార్టీకి కేటా యించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కాగా, ఈ భేటీలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్‌కుమార్, కాసాని సతీష్, రాఘవేంద్ర ప్రతాప్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నరసింహారావు, జ్యోతి, బీఎస్పీ నేతలు విజయార్య క్షత్రియ, రాజరత్నం, సురే‹Ùకుమార్, ఆప్ నేతలు దిడ్డి సుధాకర్, రాములు గౌడ్, హేమ ఈసీ బృందానికి తమ సూచనలు తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఈసీ బృందానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, పోలీసు అధికారులు స్వాగతం పలికారు. -
TS Election 2023: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ సందర్శన.. ఉత్కంఠకు దారి..!
మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా కాంగ్రెస్ శనివారం చేపట్టిన రిజర్వాయర్ల సందర్శన ఉత్కంఠకు దారితీసింది. శనివారం రాత్రే సమాచారం అందుకున్న పోలీసులు కొల్లాపూర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీకి చెందిన వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి సందర్శనకు శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ నుంచి అక్కడకు వెళ్లకుండా.. కల్వకుర్తి మీదుగా మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. షాద్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డితో కలిసి నేరుగా కాంగ్రెస్ కార్యాలయంలోకి ఉదయం 8 గంటలకు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోగా.. హడావుడి చోటుచేసుకుంది. లోపల విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం 12.35 గంటలకు జూపల్లి తదితరులు బయటకు రాగా.. పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. ఏమైనా ధర్నా చేస్తున్నామా అని జూపల్లి, నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. జూపల్లి, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలోకి తీసుకెళుతుండగా.. కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జూపల్లి, ఇతర నాయకులను పోలీసులు మహమ్మదాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా.. అదే దారిలో వస్తున్న నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి తదితరులు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని సైతం అరెస్ట్ చేసి మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు, జూపల్లి తదితరులను మహమ్మదాబాద్ పీఎస్‌కు తరలించారు. ఇలా సుమారు మధ్యాహ్నం ఒంటిగంట వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకోగా.. ఉత్కంఠ నెలకొంది. సంజీవ్ ముదిరాజ్, కొత్వాల్ అరెస్ట్.. జూపల్లి కృష్ణారావును కలవడానికి కాంగ్రెస్ కార్యాలయానికి వస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, బెక్కరి మధుసూదన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా పట్టణంలో నాయకులు సిరాజ్‌ఖాద్రీ, రాములు యాదవ్, సాయిబాబా, తాహెర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరందరినీ సొంత పూచికత్తుపై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఓట్ల కోసమే హడావుడిగా ప్రారంభిస్తున్నారు: జూపల్లి స్టేషన్ మహబూబ్‌నగర్: ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ కాల్వలకు సంబంధించి భూసేకరణ పూర్తికాలేదు.. టెండర్లు పిలవనే లేదు.. మరి ఏ విధంగా ప్రాజెక్ట్ పూర్తయింది.’అని జూపల్లి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పడం పూర్తి అవాస్తమన్నారు. రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే పూర్తికాని ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నారని విమర్శించారు. శనివారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్ రెండో లిఫ్ట్ ద్వారా నుంచి ఏదుల వరకు కెనాల్ ద్వారా నీళ్లు పంపాలని.. ఈ కెనాళ్లు పూర్తికానప్పుడు ఏ విధంగా నీళ్లు తీసుకుపోతారని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు ప్రతిపక్ష నాయకులకు ఎందుకు చూపించరు.. ప్రాజెక్ట్‌లో అవినీతి జరగనప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ పూర్తయినట్లు గూగుల్ మ్యాప్‌లోనే మీ పనితనం చూపిస్తున్నారని.. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ, సోనియాగాంధీ సభల ప్రాధాన్యతను తగ్గించేందుకే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.5,570 కోట్లలో ఇంకా రూ.500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. 1,44,450 ఎకరాల ఆయకట్టుకు ఇప్పటికీ నీళ్లు రాలేదన్నారు. తొమ్మిదేళ్లవుతున్నా.. కల్వకుర్తి ప్రాజెక్ట్ ఇంకా పూర్తికాలేదన్నారు. కల్వకుర్తి ప్రాజెక్ట్ట్ లెక్కను బట్టి పాలమూరు–రంగారెడ్డి పూర్తిచేయడానికి 20 ఏళ్లు పడుతుందన్నారు. ముందస్తు అదుపులోకి.. జిల్లాకేంద్రంలోని వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ముందస్తుగా 35 మంది కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్ పరిధిలో 10 మంది, టూటౌన్లో 20, రూరల్ పరిధిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
నన్ను కాదని.. నిన్నమొన్న వచ్చిన వారికి టికెట్లా?
పంజగుట్ట: ‘రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో సీనియర్‌ను.. అనుభవం ఉన్న వాడిని. కాంగ్రెస్ పార్టీని ఎన్నో సంవత్సరాలుగా నాగర్‌కర్నూల్‌లో కాపాడుకుంటూ వస్తున్నా. నన్ను కాదని నిన్న, మొన్న వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారు?’అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు పార్టీని కాపాడుతుంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన జూపల్లి కృష్ణారావు... కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల సీట్లు తన వారికే కావాలంటున్నాడని, ఆయన అంత పెద్ద నాయకుడు ఎప్పుడయ్యాడో అర్థం కావడంలేదన్నారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ కేడర్‌కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉండి, ఏ ఎన్నికలు వచ్చినా ముందుండి పార్టీని నడిపిన మేము ఏం కావాలి? ఆయన గెలిచిన తర్వాత ఇక్కడే పార్టీలోనే ఉంటారన్న నమ్మకం ఉందా..ఆ గ్యారెంటీ ఎవరిస్తారని నాగం ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి... కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48 వేల కోట్ల అవినీతి జరిగిందని నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉండగా సీఎం కేసీఆర్ దాన్ని పక్కన పెట్టేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ అవినీతి గురించి మాట్లాడుతోందని, అయితే ఎవరూ ప్రశ్నించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు, టీపీసీసీ అధ్యక్షుడు దీనిపై తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై త్వరలోనే ఏసీబీ డీజీని కలసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. -
కేసీఆర్‌ది దింపుడు కల్లం ఆశ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధమయ్యారని అర్థమై దింపుడు కల్లం ఆశతో బీసీ బంధు, రైతు రుణమాఫీ అంటూ కేసీఆర్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా... ఇంటింటికీ తిరిగి ప్రజల కాళ్లు పట్టుకున్నా తెలంగాణ సమాజం, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను వదిలిపెట్టబోదని రేవంత్ హెచ్చరించారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రేవంత్, మాణిక్‌రావ్ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, మాజీ పోలీసు అధికారి నాగరాజు, కూచికుళ్ల రాజేశ్‌రెడ్డి, మేఘారెడ్డి సహా పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని తెలిపారు. 4 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం పనిచేయకుండా తన నలుగురు కుటుంబ సభ్యుల సంక్షేమం, పదవు లు, పైసలు, ఫాంహౌస్‌లు, కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టారని దుయ్యబట్టారు. «కేసీఆర్‌కు ఢిల్లీలో దందా చేయాలన్నా, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా లిక్కర్ ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ లిక్కర్ కింగ్‌లా మారిపోయారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రైవేట్ సైన్యంపై ఈసీకి ఫిర్యాదు ఆర్టీసీ కారి్మకుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి కేసీఆర్ తెరలేపారని రేవంత్ ఆరోపించారు. మరోసారి మోసగించేందుకు కేసీఆర్ వేస్తున్న బైరూపుల వేషాన్ని తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని... ఈసారి ఆయన మాటలను ఎవరూ నమ్మరని రేవంత్ చెప్పారు. అందుకే కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు, డబ్బు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే పోలీసుల బదిలీలను సీఎం చేపడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో నెగ్గడానికి రిటైరైన అధికారులను ప్రైవేట్ సైన్యంగా తయారుచేసి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఆ వివరాలన్నింటినీ సేకరించి త్వరలో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తుందని వివరించారు. కేసీఆర్ నియంత: జూపల్లి మాజీ మంత్రి జూపల్లి మాట్లాడుతూ కేసీఆర్ తొమ్మి దేళ్లుగా నియంతలా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మరిచిపోవడం ఆయనకే చెల్లుతుందన్నారు. దేశ చరిత్రలో కేసీఆర్‌ను మించిన అవినీతి ముఖ్యమంత్రి ఎవరూ లేరని వ్యా ఖ్యానించారు. రాజకీయ వ్యవస్థను కేసీఆర్ భ్రష్టుపట్టించారని... ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖర్చు పెడుతున్న రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు. కేసీఆర్.. చార్లెస్ శోభరాజ్ శిష్యుడు తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించేది కాంగ్రెస్ పార్టీనేనని, బీజేపీ ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఇప్పటికైనా ఈ విషయం గుర్తించి కాంగ్రెస్‌లో చేరాలని రేవంత్ ఆహ్వానించారు. తనను చంద్రబాబు శిష్యుడు అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని... అయితే కేసీఆర్ మాత్రం అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్ శిష్యుడని... ఇప్పటివరకు రూ. లక్ష కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపించారు. -
కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, గుర్నాథ్ రెడ్డి
-
నేడు కాంగ్రెస్‌లోకి జూపల్లి, కూచుకుళ్ల
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు కాంగ్రెస్ పారీ్టలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీవర్ధన్ తదితరులు బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం వీరంతా ఢిల్లీ వెళ్లారు. లోక్‌సభ సమావేశాలకు హాజరవుతున్న పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలు, మల్లికార్జున ఖర్గే సమక్షంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జూపల్లి తదితరులు పారీ్టలో చేరుతారని గాందీభవన్ వర్గాలు తెలిపాయి. వీలైతే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేక ప్రియాంకాగాంధీ ఈ చేరిక కార్యక్రమానికి రావొచ్చని అంటున్నారు. ప్రియాంకా సమక్షంలో చేరాల్సి ఉన్నా.. వాస్తవానికి, కొల్లాపూర్‌లో జరగాల్సిన బహిరంగసభలో ప్రియాంకాగాం«ధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పారీ్టలో చేరాల్సి ఉంది. కానీ, ఇప్పటికే రెండు సార్లు ఈ సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీ సభ ఇక రద్దయినట్టేనని తెలుస్తోంది. అయితే సభ రద్దు కాలేదని, ఈనెల 7–14 తేదీల్లో ప్రియాంకాగాంధీ మహబూబ్‌నగర్ జిల్లాకు వస్తారని కానీ పార్టీ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొనేందుకే ఖర్గే సమక్షంలో జూపల్లి అండ్ టీం ఢిల్లీ వెళ్లి పారీ్టలో చేరుతోందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పుకొచ్చారు. -
మాజీ మంత్రి జూపల్లికి షాక్..!
మహబూబ్‌నగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు కోడేరు ఎంపీపీ కొండ వెంకటరాధ, కొండ సుధాకర్‌రెడ్డి, ఎత్తం భాస్కర్‌రెడ్డిలు శనివారం బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేసి, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని మంత్రులు వారికి సూచించారు. -
కాంగ్రెస్ గూటికి ఉమ్మడి జిల్లా సీనియర్ నేతలు..
మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో సహ పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేశ్‌రెడ్డితో పాటు వనపర్తి జిల్లాకు ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు సైతం కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు సోమవారం ఢిల్లీ వేదికగా పార్టీ పెద్దల సమక్షంలో వెల్లడించారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతల పార్టీ మార్పుపై కొన్ని నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జూలై 14న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో వీరంతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొంది. సొంత బలాన్ని ప్రదర్శించేలా.. మాజీ మంత్రి జూపల్లి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, వనపర్తి జిల్లా పెద్దమందడి ఎంపీపీ తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ సానే కిచ్చారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి, ఇతర నేతలంతా ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జ్ ఠాక్రే సమక్షంలో సోమవారం చర్చలు జరిపి తామంతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. అయితే ఢిల్లీలోనే పార్టీ పెద్దల సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకుంటారని భావించగా, స్థానికంగానే ప్రజల మధ్య పార్టీ మారాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జూలై 14 కొల్లాపూర్ వేదికగా భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా తమ సత్తా చాటాలనే యోచనలో జూపల్లితో పాటు ఇతర నేతలున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను ఆహ్వానించి ఆయన సమక్షంలో కండువా కప్పుకుంటామని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. బీఆర్ఎస్ను వీడిన తర్వాత ఇతర పార్టీలోకి వెళ్లే అంశంపై మాజీ మంత్రి జూపల్లి మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ మార్పుపై మాత్రం ఎప్పుడూ పెదవి విప్పలేదు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీలో చేరుతారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో చేరేందుకే వేగంగా పావులు కదిపారు. కొత్త నేతలతో కలసివచ్చేనా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేర నుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వీరి రాకతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరుతున్న నేతలు తమ సొంత బలంతో పాటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కేడర్ తమకు ఏ మేరకు కలసి వస్తుందోననే అంచనాలో ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో వీరికి పార్టీలోని పాత నేతలు ఎంత మేరకు సహకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొడంగల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆయన ముఖ్య అనుచరులు కోస్గి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కూర అన్న కిష్టప్ప, కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ కూడా కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండాలని జూపల్లి భావిస్తుండగా, స్థానిక నేత చింతలపల్లి జగదీశ్వరరావు మాత్రం ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తానే బరిలో ఉంటానని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం తనకే వస్తుందని ఎమ్మెల్సీ కూచుకుళ్ల తనయుడు రాజేశ్‌రెడ్డి భావిస్తుండగా, రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్టు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి స్పష్టం చేస్తుండటం గమనార్హం. పార్టీ అధిష్టానం సూచన మేరకు నేతలంతా నడుచుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వనపర్తిలో చేరనున్న మేఘారెడ్డి సైతం తానే పోటీ చేస్తున్నట్టు చెబుతుండటంతో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డిచేరికపై ఇంకా వీడని సస్పెన్స్.. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ నుంచి తన కుమారుడు రాజేశ్‌రెడ్డికి టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తాను సైతం కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముందుగా తన కుమారుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే ఆ పార్టీలో చేరాలని దామోదర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు పదవికి రాజీనామా, కాంగ్రెస్‌లో చేరికపై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రచారం సాగుతోంది. -
టీ కాంగ్రెస్‌లో ఘర్ వాపసి జరుగుతోంది: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ , జూపల్లి కృష్ణారావు భేటీ ముగిసింది. వీరిద్దరితోపాటు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సిరెడ్డి, ముఖ్య నాయకులు పిడమర్తి రవి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి కూడా ఉన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో అరగంటకు పైగా సమావేశం సాగింది. ఈ సందర్భంగా జూలై 2న ఖమ్మం సభకు రావాలని రాహుల్‌ను పొంగులేటి, జూపల్లి కోరారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టీ కాంగ్రెస్‌లో ఘర్ వాపసి జరుగుతోందని.. నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాగా తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు నేడు(సోమవారం) రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరునున్నారు. ఇందులో భాగంగానే వీరు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక, ఢిల్లీలో ఉన్న వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పొంగులేటి, జూపల్లి ఉన్నట్టు సమాచారం. అనంతరం, మధ్యాహ్నం రెండు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీతో వీరు సమావేశం కానున్నారు. పొంగులేటి, జూపల్లితో పాటు అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరంతా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కానున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లికి పయనమయ్యారు. ఈ సందర్బంగా మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కాంగ్రెస్‌లో చేరడం లేదు. ప్రజల అభిప్రాయం మేరకే కాంగ్రెస్‌లో చేరుతున్నారు. వారు మధ్యాహ్నం రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతారు అని తెలిపారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. 500 వాహనాల కాన్వాయ్‌తో కేసీఆర్.. -
ఎవరో చెబితే చేర్చుకోవడమేనా?: టీ కాంగ్రెస్‌లో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలపై చీలికలు మొదలయ్యాయా?. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్‌రెడ్డి చేరికలు ఖరారు అయిపోయాయి. అయితే తేదీల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. వీళ్ల చేరికలపై నేతల్లో ఏకాభిప్రాయం ఉంది. అయితే ఈలోపు మరికొందరి చేరికలపై హడావిడి నడుస్తుండగా.. పలువురు సీనియర్లు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వేముల వీరేశం కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే చిన్నయ్యతో ఆయనకు పడదన్న సంగతి తెలిసిందే. అదే టైంలో టికెట్ కూడా దక్కే ఛాన్స్‌లు కనిపించడం లేదు. దీంతో వీరేశంతో పాటు కోదాడకు చెందిన శశిధర్‌రెడ్డి సైతం హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పొంగులేటి ఇంటికి ఈ ఇద్దరూ వెళ్లినట్లు సమాచారం. వేముల వీరేశం అయితే.. వీరేశం, శశిధర్‌రెడ్డి చేరికల అంశాన్ని నల్లగొండ సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అవమానించడమే అవుతుందని, సునీల్ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి పీపీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలుపే ముఖ్యమన్న కోమటిరెడ్డికి ఆయన చేరికలపై నచ్చజెప్పి.. ఆపై ఇద్దరూ పొంగులేటి ఇంటికి వెళ్తారని సమాచారం. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ నుంచి కొత్త మనోహర్‌రెడ్డి సైతం కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. 2014లో మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారీయన. పొంగులేటితో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు మనోహర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్‌రెడ్డితో భేటీ కానున్నారు. ఇదీ చదవండి: పక్కా.. బీఆర్ఎస్ నేతలు పార్టీ మారతారు చూస్కోండి! -
పొంగులేటి, జూపల్లితో ఇవాళ రేవంత్ రెడ్డి భేటీ
-
టీ కాంగ్రెస్ లో చేరికలు
-
నేడు పొంగులేటి నివాసానికి రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలోకి వెళతారన్న దానిపై సస్పెన్స్ క్రమంగా వీడుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ ఇద్దరూ సిద్ధమయ్యారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఊతమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం ఆ ఇద్దరితో భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన ముందుగా అత్తాపూర్ సమీపంలోని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ జూపల్లితో భేటీ అయి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం జూపల్లిని వెంటబెట్టుకుని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో ఉన్న పొంగులేటి నివాసానికి వస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడే ముగ్గురు నేతలతో పాటు మరికొందరు ముఖ్యులు భోజనం చేస్తారని, ఆ సమయంలోనే రేవంత్‌రెడ్డి వారందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. రాహుల్ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీకి పొంగులేటి అండ్ టీంతో సమావేశమైన తర్వాత రేవంత్‌రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. విదేశాల నుంచి ఢిల్లీకి వస్తున్న రాహుల్‌తో గురువారం రేవంత్ సమావేశమవుతారని, ఆయనతో మాట్లాడిన తర్వాత పొంగులేటి అండ్ టీం కలిసేందుకు రాహుల్ అపాయింట్మెంట్ తీసుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 25న లేదంటే నెలాఖరులోపు ఏదో ఒక రోజు రాహుల్‌గాంధీ వీలును బట్టి పొంగులేటి, జూపల్లి అండ్ టీం ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరికపై అధికారిక ప్రకటన చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
రాహుల్ జీ..మేమొస్తున్నాం..
-
కాంగ్రెస్ వైపే మొగ్గు..?
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని సీనియర్ రాజకీయ నేతలు జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ దిశగా ఇరువురు నేతలు కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఇరువురు కాంగ్రెస్ గూటికే చేరనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ► గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం బీరం బీఆర్ఎస్లో చేరడంతో ఇరువురి మధ్యలో అంతర్గత పోరు నెలకొంది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు సీఎం కేసీఆర్‌పై జూపల్లి నేరుగా విమర్శనాస్త్రాలు సంధించిన నేపథ్యంలో పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు విధించింది. అప్పటినుంచి తాను ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నుంచి ఆహ్వానం అందినప్పటికీ కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీపై పెరిగిన అంచనాలు, స్థానిక పరిస్థితులు, అనుచరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై బీఆర్ఎస్లో చేరి రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. శనివారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవితో జూపల్లి, కూచుకుళ్ల వేర్వేరుగా భేటీ అయ్యారు. తాము పార్టీలో చేరితే దక్కే అవకాశాలు, హామీలు, ఇతర నేతల సహకారంపై చర్చించినట్టు తెలిసింది. ఈనెల 12న లేదా మరో నాలుగైదు రోజుల్లో ఇరువురు కాంగ్రెస్‌లో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వడివడిగా నేతల మంతనాలు.. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఇరువురు నేతలు వడివడిగా మంతనాలు జరుపుతున్నారు. పలువురు నేతలతో ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్వయంగా కూచుకుళ్ల ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. సీఎం సభకు ముందు ఆయన్ను ఆహ్వానించేందుకు వెళ్లగా, గంటకు పైగా ఎమ్మెల్సీతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం. ఈసారి ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కోరగా దామోదర్‌రెడ్డి మాత్రం తానూ ఎన్నికల బరిలో ఉంటానని తేల్చిచెప్పినట్టు తెలిసింది. కాగా.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలపై మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి స్పందిస్తూ.. ఎమ్మెల్సీ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని, అయితే పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా సహకారం అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవితో పాటు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత జగదీశ్వర్‌రావుతో జూపల్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాను పార్టీలో చేరుతున్నానని, సహకారం అందించాలని కోరినట్టు తెలిసింది. పార్టీ ఎవరికి టికెట్టు ఇచ్చినా మద్దతుగా నిలవాలని జగదీశ్వర్‌రావు చెప్పినట్టు సమాచారం. అయితే తానే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో ఉంటున్నట్టు జగదీశ్వర్‌రావు చెబుతుండడం గమనార్హం. -
కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్క మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? చిన్న చెరువునైనా తవ్వారా? కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టి ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు ఇచ్చారా?’అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించి భూనిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద మొదలుపెట్టిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేయకుండా నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జిల్లాకు అదనంగా చుక్క నీరూ ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2004లో సీఎం అయిన వైఎస్ జలయజ్ఞం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2014 నాటికి ముందే రాష్ట్రంలో 95 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. కాళేశ్వరంతో కరెంటు బిల్లు నష్టం తప్ప తెలంగాణ ప్రజలకు, రైతులకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. జూపల్లి కృష్ణారావు రాక ఖరారు అయినట్లేనని పేర్కొన్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రైవేటు సైన్యంలా పోలీసులు: కేసీఆర్‌కు భట్టి బహిరంగ లేఖ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులు ప్రైవేటు సైన్యంలా తయారయ్యారని, ఎమ్మెల్యేల ఆదేశాలతో పోలీసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలు భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. తాను 84 రోజులుగా చేస్తున్న పాదయాత్రలో ఈ పరిస్థితులను గ్రహించానని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ప్రజల కోసమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టు పాదయాత్ర శిబిరం వద్ద భట్టి విడుదల చేశారు. ప్రజలు నా దృష్టికి తెచ్చారు.. ‘మార్చి 16న చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పురస్కరించుకుని వందల గ్రామాల్లో కాలినడకన తిరిగిన సందర్భంగా.. పోలీసులు తమను వేధింపులు, ఇబ్బందులకు గురి చేయడాన్ని వందలాది మంది ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఆదేశాలను అమలు చేస్తోంది. డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు చెప్పినట్లుగా కాకుండా ఎమ్మెల్యేల ఆదేశాలు అమలు చేసే పోలీసులుగా మారిపోయారు. వారు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కోల్పోయారు.. సమాజంలో అనేక వర్గాల ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయారు. కవులు, కళాకారు లు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదు లు, ప్రగతిశీల వాదులు, రాజకీయ పార్టీలు స్వేచ్ఛ గా భావజాలాన్ని వ్యాప్తి చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఏ ఆత్మగౌరవం కోసం, ఏ హక్కుల కోసం పోరాడామో అవి సాధించుకున్న స్వరాష్ట్రంలో మరింతగా లేకుండా పోయాయి. ప్ర జాస్వామ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ వ్యవస్థలు మాత్రం శా శ్వతంగా ఉంటాయి. పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం ఉపయోగించాలి తప్ప రాజకీయ పార్టీ ల కోసం కాదు..’అని భట్టి లేఖలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్ లో చేరనున్న పొంగులేటి మరియు జూపల్లి
-
పొంగులేటి, తుమ్మల బీజేపీలో చేరికపై ఈటల సంచలన వ్యాఖ్యలు!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనే విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు చర్చలు జరిపి పొంగులేటి, జూపల్లి ఇతర పార్టీల్లో చేరకుండా ఆపగలిగానని ఈటల రాజేందర్ తెలిపారు. అయినా, వారిద్దరూ బీజేపీలో చేరతారని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈటల సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రోజు వాళ్లతో మాట్లాడుతున్నానని.. అయితే బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు పట్టుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి తాను పొంగులేటితో చర్చించాననని తెలిపారు. కొంతమంది తను అనని వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త ం చేస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌ను అవలీలగా మింగేస్తారని.. సీఎంకు ట్రిక్స్ బాగా తెలుసని అన్నారు. కాగా ఈటల తాజా వ్యాఖ్యలతో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. చదవండి: ఇందిరా, రాజీవ్ గాంధీ పథకాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు -
బీఆర్ఎస్ను దించే ప్లాన్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోకి ఇతర పార్టీల నేతలను చేర్పించే కసరత్తును ఆ పార్టీ చేరికల కమిటీ కన్వీనర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ వేగవంతం చేశారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో ఈటల భేటీ అయ్యారు. ఉదయమే జూబ్లీహిల్స్ ప్రాంతంలో తమ సొంత వాహనాలను విడిచిపెట్టి.. గన్మన్లు, వ్యక్తిగత సహాయకులు కూడా లేకుండానే వారితో నాలుగైదు గంటల పాటు చర్చించినట్టు తెలిసింది. ఐదారు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వెంటనే బీజేపీలో చేరికపై నిర్ణయం తీసుకోవాలని, చేరికపై జాతీయ నాయకత్వం నుంచి సానుకూలత వ్యక్తమైందని వారికి ఈటల చెప్పినట్టు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ సందర్భంగా కూడా ఈ అంశం చర్చకు వచి్చందని తెలిపినట్టు సమాచారం. జాతీయ నాయకత్వం తరఫున పొంగులేటి, జూపల్లిలకు ఈటల హామీ ఇచ్చారని, పారీ్టలోకి వస్తే కలిగే ప్రయోజనాలను వివరించారని తెలిసింది. మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? భేటీ సందర్భంగా బీఆర్ఎస్ను ఓడించేందుకు బీజేపీ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటని, ఇందుకోసం ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయబోతున్నారని ఈటలను పొంగులేటి, జూపల్లి ప్రశ్నించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వాల వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని, ఏ రకమైన వ్యూహాలను అనుసరిస్తారన్నది ఈటల వివరించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమే తమ ప్రధాన లక్ష్యమని, దాన్ని సాధించగలిగే పార్టీ, నాయకత్వం వెంటే వెళ్లేందుకు తాము సిద్ధమని వారు ఈటలకు చెప్పినట్టు తెలిసింది. ఈ దిశగా బీజేపీ ఏమేరకు సంసిద్ధమై ఉంది? బీఆర్ఎస్ను గద్దె దించేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతున్నదనే దానిపై మరింత స్పష్టత కావాలని వారు కోరినట్టు సమాచారం. ఈటల సమాధానాలతో సంతృప్తి చెందని పొంగులేటి, జూపల్లి.. బీజేపీలో చేరికపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలని కోరినట్టు తెలిసింది. శుక్రవారం కూడా వారితోపాటు మరికొందరితో ఈటల సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యామ్నాయాలపై చర్చ? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు అన్ని రాజకీయ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ఈటలకు పొంగులేటి, జూపల్లి సూచించినట్టు సమాచారం. అంతా బలమైన పార్టీలోకి వెళ్లడం లేదా వివిధ పారీ్టల్లోంచి ముఖ్య నేతలంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీని స్థాపించి.. ఇతర భావ సారూప్యశక్తులతో పొత్తు కుదుర్చుకుంటే ఎలా ఉంటుందనే అంశాలపైనా వారి మధ్య చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇద్దరు నేతలూ బీజేపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. -
ముహూర్తం ఫిక్స్!.. పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరుతారో?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనే దానిపై అధికారిక ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఇద్దరు నేతలు తాము ఏ పార్టీలో చేరేది ప్రకటించనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి లేదా మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి అదే రోజు పార్టీలో చేరనున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కడ సభ నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తారని సమాచా రం. కాగా ఈ బహిరంగ సభ తెలంగాణ ఆత్మ గౌరవ పొలికేక సభగా మారనుందని పొంగులేటి, జూపల్లి అనుచర గణం చెబుతోంది. దీనికిముందు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో వారి నియోజకవర్గాల్లో పొంగులేటి ఆత్మీయ భేటీలు నిర్వహించనున్నారు. 14న ఖమ్మంలో ఆత్మీయ భేటీ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పొంగులేటి ఇప్పటికే ఖమ్మం మినహా 9 నియోజకవర్గాల్లో ఆత్మీయ భేటీలు నిర్వహించారు. భద్రాచలం, ఇల్లెందు, పిన పాక, అశ్వారావుపేట, వైరా నుంచి పోటీ చేసే తన అభ్యర్థులను కూడా ప్రకటించారు. తాజాగా ఖమ్మంలో 14న ఆత్మీయ భేటీ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. చదవండి: పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్ ఏమన్నారంటే? ఏ పార్టీలో చేరతారో.. పొంగులేటి ఏ పారీ్టలో చేరతారన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాంగ్రెస్ నేతలు ఆయనతో పార్టీలో చేరిక విషయమై చర్చించారు. తాజాగా గురువారం బీజేపీ నేతలు పొంగులేటి, జూపల్లితో సమావేశమయ్యారు. భోజనం కూడా కలిసి చేసిన నేతలు.. నడ్డా, అమిత్‌షా ఆదేశాలకు అనుగుణంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. వీరిద్దరు బీజేపీలో చేరితే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసొస్తుందా? లేక ఓట్లు చీలి కేసీఆర్‌ను గద్దె దించే లక్ష్యం నెరవేరకుండా పోతుందా? అన్న అంశం చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇలావుండగా బీజేపీ నేతల భేటీ నేపథ్యంలో పొంగులేటి ఆ పార్టీలో చేరతారనే ప్రచా రం ప్రారంభమయ్యింది. అయితే అధికారికంగా జూన్ 2న పొంగులేటి నిర్ణయం వెలువడనుంది. -
పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్ ఏమన్నారంటే?
సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బీజేపీ చేరికల కమిటీ బృందం భేటీపై ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకే వారిని కలిసినట్లు స్పష్టం చేశారు. కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో బీజేపీ చేరికల కమిటీ బృందం ఖమ్మంలో గురువారం భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. పొంగులేటి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన ముఖ్యమైన అనుచరులతో సైతం బీజేపీ చేరికల కమిటీ బృందం చర్చలు జరిపింది. దాదాపు అయిదు గంటలుపైగా చర్చలు కొనసాగాయి. ఈ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. చదవండి: తెలంగాణ బీజేపీలో లుకలుకలు?..పొంగులేటి ఎపిసోడ్‌తో బట్టబయలు సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బొద్దపెట్టే ఏకైక పార్టీ బీజేపీయేనని తెలిపారు. తమ లక్ష్యం, పొంగులేటి, జూపల్లి లక్ష్యం ఒకటేనని అన్నారు. పొంగులేటిని బీజేపీని ఆహ్వానించామని, ఆయన నిర్ణయం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పొంగులేటితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్‌ను గద్దె దించుతామని అన్నారు. పార్టీలో సుముచిత స్థానం పొంగులేటి , జూపల్లికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మీకు ఎదురైన సమస్యలు, అవమానాలు తమకు తెలుసని, బీజేపీలో అవన్నీ ఉండవని తెలిపారు. మీ దృష్టిలో ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి మీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించే విధంగా అమిత్ షా, నడ్డాతో మాట్లాడుతామని ఇద్దరు నేతలకు ఈటల చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చేరికల కమిటీ ఎదుట పొంగులేటి, జూపల్లి పలు డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. చర్చల్లో పార్టీలో చేరికపై పొంగులేటి, జూపల్లి బీజేపీ బృందానికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. త్వరలో తమ అనుచరులతో మాట్లాడి నిర్ణయం చెబుతామనిపేర్కొన్నారు. చదవండి: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన బీజేపీ నేతలతో భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆలోచలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ ఏకమయ్యేలా చూడాలన్నారు. మాయ మాటలతో మూడవసారి సీఎం కావాలనే ఆశ కలగానే మిగులుతుందని జోస్యం చెప్పారు. పదవుల పంపకమేమి లేదు.. ఏపార్టీ వాళ్లయిన తమతో సంప్రదింపులు జరిపి, పార్టీలోకైనా ఆహ్వానించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చిన కమ్యూనిస్ట్‌లు వచ్చినా స్వాగతిస్తామన్నారు. బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని పొంగులేటి తెలిపారు. కేసీఆర్ ఖమ్మంలో పోటీచేస్తే ఆయననై కూడా పోటీచేస్తానని పేర్కొన్నారు. బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని ప్రస్తావించారు. అయితే తాను ఏ పార్టీలో చేరుతాననే దానిపై ఈనెలలో సస్పెన్స్‌కు తెరపడుతుందనుకుంటున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఏ నిర్ణయం తీసుకోలేదు.. నేటీ బీజేపీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జూపల్లి కృష్ణారావు తెలిపారు. గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, సంస్థలు, ఉద్యమకారులు, కళాకారులందరినీ సంఘటితం చేసి.. లక్ష్య సాధన కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. చదవండి: నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని -
బీఆర్ఎస్కు మూడోసారి పాలించే హక్కులేదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రాన్ని మూడోసారి పాలించే హక్కును బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కిరీటం ఏమీ పోలేదని, మరింత గౌరవం పెరిగిందన్నారు. గత మూడేళ్లుగా తనను పార్టీ సభ్యుడిగా చూడలేదని, కనీసం సభ్యత్వ పుస్తకాలను కూడా చేతికివ్వలేదని చెప్పారు. అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఇప్పుడు తనకు పంజరం నుంచి బయటకు వ చ్చినంత సంతోషంగా ఉందని చెప్పారు. రిమోట్ కంట్రోల్ అంతా ప్రగతిభవన్లోనే ఉందని చెప్పా రు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ఇంట్లో పెట్టుకుంటే మంత్రి నిరంజన్‌రెడ్డికి కోపమెందుకని ప్రశ్నించారు. తన ఇంట్లో సీఎం కేసీఆర్ ఫొటో కూడా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 సీట్లలో బీఆర్ఎస్ వ్యతిరేకులే గెలుస్తారని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ కనీసం ఒక్క సీటు గెలవడం కూడా అనుమానమేనన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదట 2.50 లక్షల ఎకరాల సామర్థ్యానికే మంజూరైందని, తర్వాత 3.50 లక్షల ఎకరాలకు తానే పెంచానని చెప్పారు. కేఎల్ఐ ద్వారా వనపర్తికి నీళ్లు రావడంతోనే ఆయనకు పేరొ చ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఖాదీ బోర్డు చైర్మన్‌గా ఉన్న నిరంజన్‌రెడ్డి అక్రమాలకు పాల్పడటంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. అయినా పదవికి రాజీనామా చేయకపోవడంతో బోర్డునే రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. జూపల్లికి డీకే అరుణ ఫోన్ ‘మీరు దేని కోసమైతే పోరాడారో ఆ లక్ష్యం నెరవేరలేదు. ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడంలేదు. ఈ నియంతృత్వ ప్రభుత్వంపై సమష్టిగా పోరాటం చేద్దాం’అని సీనియర్ నేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి రండి అంటూ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్సన్‌కు గురైన జూపల్లికి ఆమె ఫోన్ చేసి మాట్లాడారు. -
పదునెక్కిన విమర్శలు.. పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారో?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఏడాది మొదటి నుంచే బీఆర్ఎస్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి విమర్శలు ఎక్కుపెట్టిన ఆయనపై చివరకు చర్యలు తీసుకున్నారు. కొత్తగూడెంలో ఆదివారం జరిగిన సభ ఇటు బీఆర్ఎస్, అటు పొంగులేటి శిబిరంలో కాక పెంచగా.. సస్పెన్షన్ వ్యవహారం మరింత వేడెక్కించింది. పొంగులేటితో పాటు కొత్తగూడెం వేదికను పంచుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై వేటు వేస్తూ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యాన పొంగులేటి ఖమ్మంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొమ్మిది నియోజకవర్గాల్లో భేటీలు పూర్తి బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి ఈ ఏడాది జనవరి 1వ తేదీన పార్టీపై ఉన్న అసమ్మతిని బయటపెట్టారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ విమర్శల దాడి పెంచారు. ఖమ్మం మినహా ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో భేటీలు పూర్తికాగా, కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇప్పటికే పొంగులేటి వెంట నడుస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఇదే సమయాన వైరా మున్సిపల్ చైర్మన్‌పై కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. 2016 మే 4న టీఆర్ఎస్లోకి.. పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా అప్పటి ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2016 మే 4న టీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా వెళ్లారు. సోమవారం పొంగులేటిని సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్లో దాదాపు ఏడేళ్ల ప్రయాణం ముగిసినట్లయింది. ఈ ప్రయాణం పొంగులేటికి రాజకీయంగా ఆశించిన స్థాయిలో కలిసి రాకపోగా, సిట్టింగ్ ఎంపీ అయి కూడా టికెట్ దక్కలేదు. చివరకు రాజ్యసభ స్థానం ఇస్తారని ఆశిస్తే నిరాశ ఎదురుకావడం.. అనుచర గణానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి కారణాలు ఆయనకు అసంతృప్తిని కలిగించాయి. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత పరాభవాలే ఎదురవుతాయన్న భావనతో ఆయన ముందుగానే దారి మార్చుకున్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఏ పార్టీలోకి వెళ్తారో ? బీఆర్ఎస్ సస్పెన్షన్ నిర్ణయం ప్రకటించగానే శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు చేయడంతోపాటు ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవరని, ఎవరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ సవాల్ విసిరారు. అయితే ఏదైనా పార్టీలో చేరడమా, సొంత పార్టీ పెట్టడమా అనే నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పడంతో పొంగులేటి తదుపరి రాజకీయ ప్రస్థానం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మిగిలింది. కాగా, కొత్తగూడెం సభకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కావడం, త్వరలో మిగతా జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను కలుపుకుని సభలు పెడతామన్న పొంగులేటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మిగిలింది ఖమ్మమే.. మూడున్నర నెలలుగా బీఆర్ఎస్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు సంధిస్తున్న పొంగులేటి.. ఆత్మీయ సమ్మేళనాలతో తన కేడర్ చేజారకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఖమ్మం సభ మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడు నిర్వహిస్తారు, ఆ భేటీలో ఏదైనా నిర్ణయం ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు పలు మండలాల్లో ఆయన అనుచరులు, ఆయన వెంట నడుస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు పొంగులేటిని సస్పెండ్ చేసినట్లు తెలియగానే రాజీనామా బాట పట్టారు. -
నెక్స్ట్ ఏంటి
-
పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉంది:జూపల్లి
-
'పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదు.. 9 ఏళ్లుగా ఆత్మాభిమానం ఎటుపోయింది'
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. వీరిద్దరు చాలా కాలంగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భం లేకుండా సందర్భం సృష్టించుకుని ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. 'తమను ఏం చేయలేరనుకొని ఇష్టారీతిలో వ్యవహరించారు. వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదు. ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టం. పార్టీ అధినేతనే విమర్శించే స్థాయికి చేరుకోవడం పరాకాష్ట. ఎవరినైనా వదులుకోకుండా ఉండాలనే పార్టీ చూస్తుంది. కేసీఆర్‌ను తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీలో చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఓడినా ఓపికతో వేచి చూడాలని పార్టీ చెప్పింది. కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుంటే అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని కాదని రెబల్స్‌ను పోటీలో నిలబెట్టారు. గత తొమ్మిది ఏళ్ళు గా ఆత్మాభిమానం ఎటుపోయింది? ఇన్ని రోజులు ఏం చేశాడు?' అని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: పొంగులేటి, జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ -
Telangana: బీజేపీ మెయిన్ టార్గెట్ ఆ ఆరుగురే..!
తెలంగాణలో జెండా పాతేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న కాషాయ దళం భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? మునుగోడు పోయింది సరే, 2023 ఎన్నిక కోసం ఎలా సమాయత్తం కావాలి? ఢిల్లీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు వచ్చిన ఆదేశాలేంటి? తెలంగాణలో దూకుడు మీదున్న కమలదళానికి మునుగోడ్ బ్రేక్ వేసింది. కారు, కమలం పార్టీల మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరిగినా.. చివరికి విజయం టీఆర్ఎస్కే దక్కింది. దీంతో కాషాయ పార్టీ అగ్రనేతలు.. తెలంగాణ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా కీలక నేతలకు బ్రీఫింగ్ ఇచ్చారు. పటిష్టమైన క్యాడర్ లేని నల్లగొండ జిల్లాలో కొంత పట్టుసాధించినట్లు భావిస్తున్న బీజేపీ నేతలు...ఉప ఎన్నిక తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలం పెంచుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో.. పార్టీకి దూరంగా ఉంటున్న నేతలకు కాషాయ కండువాలు కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ లిస్టులో ఉన్న ప్రధానంగా మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ గెలవని పార్లమెంట్ స్థానాల్లో ఖమ్మం ఒకటి. ఇక్కడ పాగా వేయడానికి అవసరమైన అస్త్రాలను కమలనాథులు సిద్దం చేసుకుంటున్నారు. వారితో పాటు ఇతర జిల్లాల్లోనూ బడా నేతలపై కన్నేశారు. 1. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం నుంచి గతంలో వైఎస్సార్సిపి ఎంపీగా గెలిచిన పొంగులేటి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం పేరుకే పార్టీలో ఉన్నా.. పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతారు. జిల్లాలో మంచి పేరు ఉండడంతో పాటు ఆర్థికంగా పుష్కలమైన వనరులున్నాయని ఈయనకు పేరుంది. ఇటీవల ఆయన కూతురి వివాహం సందర్భంగా జిల్లా అంతటా చేసిన ఆర్భాటం ఇప్పట్లో ఎవరూ మరిచిపోరు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో కమలం పాగా వేయాలంటే పొంగులేటి సరైన వ్యక్తిగా పార్టీ భావిస్తోంది. 2. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల పేరు కమలం పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తోంది. గతంలో కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్నా.. అనూహ్యంగా ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత జిల్లాలో మారిన సమీకరణాలు ఇబ్బందికరంగా మారడం తుమ్మలను నిరుత్సాహపరిచాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మంత్రి పదవి వస్తుందనుకున్న తుమ్మలకు.. నిరాశే మిగిలింది. సత్తుపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు కూడా తుమ్మల రాలేదు. తుమ్మలను చేర్చుకోగలిగితే.. జిల్లాలో పార్టీ సూపర్‌హిట్ అన్న ఆలోచనలో ఉన్నారు. 3. జలగం వెంకటరావు ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జలగం వెంకటరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. అమెరికాలో చదువుకుని వచ్చి సత్తుపల్లి, కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో కొత్తగూడెం నుంచి రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు. మారిన సమీకరణాలతో టీఆర్ఎస్ తనను పక్కన పెట్టిందన్న భావనలో జలగం వర్గం ఉంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తుమ్మలకు సన్నిహితుడిగా ఉంటోన్న జలగం.. తాజాగా సత్తుపల్లి మీటింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇటువంటి సీనియర్ నాయకులను తమవైపు తిప్పుకుంటే పార్టీకి లాభం చేకూరుతుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. 4. జూపల్లి కృష్ణారావు తుమ్మల లాగే టీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నుంచి 5 సార్లు గెలిచిన జూపల్లి.. గతంలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారులో మంత్రిగా ఉన్నారు. 2014-18 మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో స్ట్రాంగ్ లీడర్లలో ఒకరైన జూపల్లి.. 2018లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో ఓడారు. కొంత కాలంగా టీఆర్ఎస్ పట్ల జూపల్లి అసంతృప్తిగా ఉన్నారు. 5. పట్నం మహేందర్ రెడ్డి నాలుగు సార్లు తాండూరు నుంచి గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దగ్గరి బంధువు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పట్నం.. 2018లో అనూహ్యంగా పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరిపోవడం పట్నంకు రుచించని వ్యవహారంలా మారింది. అందుకే పట్నం మహేందర్‌రెడ్డిని తమ వైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ ఆలోచన. 6. బాల్కొండ సునీల్ రెడ్డి బాల్కొండ టీఆర్ఎస్లో చాలా కాలం పని చేసి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ముత్యాల సునీల్‌కుమార్ రెడ్డి సరైన సమయం కోసం వేచిచూస్తున్నాడు. నియోజకవర్గంపై కొంత పట్టున్న సునీల్‌రెడ్డి.. అవకాశం దక్కట్లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిజామాబాద్‌లో సునీల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే.. మరింత బలోపేతం అవుతామని భావిస్తున్నారు. మొదటి ఫేజులో కొందరిని చేర్చుకోగలిగితే.. ఆటోమెటిక్‌గా మరింత మంది చేరుతారన్న భావనలో ఉన్నారు కమలనాథులు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను : జూపల్లి
సాక్షి, హైదరాబాద్ : కొల్లాపూర్ ప్రజల తీర్పుని గౌరవిస్తున్నానని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన ఐదు సార్లు తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి కారణంగానే రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్లీ గెలిచిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ, పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి తన జీవితాన్ని అంకితం చేసినట్లు తెలిపారు. కొల్లాపూర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు అండదండగా ఉంటానన్నారు. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని పనులు ఆగిపోయాయని, కొన్ని ప్రారంభించలేకపోయానని తెలిపారు. 18 కోట్ల ముక్కిడి గుండం కెనాల్, నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం, 29 కోట్లు మంజూరైన 100 పడకల ఆస్పత్రి పనులు, కళ్యాణ మండపం, పాత్‌వేల పనులను ఇప్పుడు కొనసాగిస్తానని చెప్పారు. నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని, టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అన్ని పథకాలు అమలు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దన్నారు. ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌లో గడిచిన 19 ఏళ్లపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వలేదని, అదే కొనసాగేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా కృషి చేస్తానన్నారు. కొల్లాపూర్‌ను కోహినూర్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. -
జోరుగా టీఆర్ఎస్ నాయకుల ప్రచారం..
సాక్షి, కోడేరు: మండలంలోని జనుంపల్లి, నాగులపల్లి, బాడిగదిన్నె తదితర గ్రామాల్లో నియోజకవర్గ అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆదివారం టీఆర్ఎస్ మండల యూత్ నాయకులు రవీందర్, మాజీ వార్డు సభ్యులు రాజు, బుగ్గస్వామి, పరమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శివ, రాజు, వంశీధర్‌రావు, రాజు, మాసుం తదితరులు పాల్గొన్నారు. పెంట్లవెల్లి: మండల కేంద్రమైన పెంట్లవెల్లి, మాధవస్వామినగర్, మంచాలకట్ట తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ను గెలిపించడానికే ఈ ప్రచారం చేస్తున్నామని టీఆర్ఎస్ యూత్ వింగ్ తాలుకా ఇన్చార్జ్ కేతూరి ధర్మతేజ అన్నారు. ఎటు చూసినా టీఆర్ఎస్ కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్లకార్డులతో విస్తృత స్థాయి ప్రచారం చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన పథకాలు, చేయబోయే పథకాల గురించి వివరించారు. కొల్లాపూర్ పరిధిలో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు గెలవడం తథ్యమన్నారు. శివకుమార్, కృష్ణ, శివకుమార్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దకొత్తపల్లి: మండలంలోని చిన్నకొత్తపల్లి, చెన్నపురావుపల్లిలో టీఆర్ఎస్ నాయకులు విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ జూపల్లి కృష్ణారావుకు ఓట్లు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతులకు 24గంటల కరెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అందించిందన్నారు. ఇవి కొనసాగాలంటే కృష్ణారావుకు ఓట్లు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో శివ, రాము తదితరులు పాల్గొన్నారు. కొల్లాపూర్ రూరల్: మండలంలోని రామాపురంలో జూపల్లి తనయుడు జూపల్లి అరుణ్ ఇంటింటి ప్రచారం చేశారు. నాలుగున్నరేళ్ల నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కొల్లాపూర్‌ను అన్నిరంగాల్లో ముందుంచారన్నారు. ప్రతి గ్రామంలో సాగు, తాగునీటి కోసం కృషిచేశారన్నారు. సీసీరోడ్ల నిర్మాణాల కోసం పూర్తిస్థాయి నిధులను మంజూరు చేయించి ప్రతి గ్రామంలో సీసీరోడ్డు వేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వివిధ రకాల పథకాలు అందించడం జరిగిందన్నారు. మరోసారి మంత్రి జూపల్లి కృష్ణారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను పంపిణీ చేసి ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాల్‌రాజు, టీఆర్ఎస్ యూత్ తాలుకా కోఆర్డినేటర్ ధర్మతేజ, గోపాలకృష్ణ, శరబంద, మహేష్, శ్రీనివాసరావు, మధు తదితర నాయకులు ఉన్నారు. -
'స్వతంత్ర' వీరులు
ఎన్నికలంటేనే పెద్ద తతంగం.. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగాలనుకునే వారు రెండు, మూడేళ్ల ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. నియోజకవర్గవ్యాప్తంగా పర్యటించడం.. కార్యకర్తలు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం.. మంచీచెడు చూసుకోవడం వంటివి చేస్తూ కేడర్‌పై పట్టు సాధించడమంటే మామూలు విషయం కాదు. ఇదంతా పూర్తయ్యాక తీరా ఎన్నికల వేళ పార్టీ టికెట్ వస్తుందో, లేదో తెలియదు! అప్పటికప్పుడు కొత్త నేతలు వస్తే సమీకరణాల నేపథ్యంలో వారికే టికెట్ దక్కొచ్చు. ఇదే జరిగితే రెండు, మూడేళ్ల కష్టం నీళ్ల పాలైనట్లే. అధిష్టానాల నుంచి భవిష్యత్‌పై స్పష్టమైన హామీ వస్తేనే అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ కొందరు పోటీకి దూరంగా ఉంటుండగా.. మరికొందరు మాత్రం గెలుపు ఖాయమనే భావనతో పోటీకి సై అంటుంటారు. ఇంకా మరికొందరు ఏదో పార్టీ నుంచి పోటీకి దిగడం ఇష్టం లేక స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతుంటారు. సాక్షి,మహబూబ్‌నగర్: ఎన్నికల వేళ అన్ని పార్టీల్లోనూ మార్పులు, చేర్పులు జరగడం సహజమే. ఈ సందర్భంగా పార్టీ టికెట్ ఆశించిన వారికి దక్కకపోవచ్చు. టికెట్‌పై ఆశలే లేని వారికి అవకాశం దక్కొచ్చు. ఈ నేపథ్యంలో తప్పక గెలుస్తామనే నమ్మకం ఉన్న వారు, పార్టీ ప్రకటించిన అభ్యర్థి కంటే తనకే బలం ఎక్కువమని నమ్మే వారే కాకుండా.. పార్టీ టికెట్‌పై పోటీచేయడం ఇష్టం లేని పలువురు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో పలువురు స్వతంత్రులుగా రంగంలోకి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఇక మరికొందరికి మాత్రం పరాజయమే ఎదురైంది. నమ్మకంతో బరిలోకి.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి... 1967 ఎన్నికల్లో బి.నర్సింహారెడ్డి, 1972 ఎన్నికల్లో కె.రంగదాసు స్వతంత్రులుగా ఎన్నికల బరిలోకి దిగి గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన జూపల్లి కృష్ణారావు 2004 ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఇంతలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నిరంజన్‌రెడ్డికి టికెట్ దక్కింది. దీంతో జూపల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగగా విమానం గుర్తుపై గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. అయితే, వీరిద్దరు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీకి దిగుతుండటం మరో విశేషం. జూపల్లి ఆ తర్వాత 2009లో మళ్లీ కాంగ్రెస్ నుంచి, 2012, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన గెలిచారు. అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రికార్డు జూపల్లి పేరిట నమోదై ఉంది. నాగర్‌కర్నూల్ లో 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు బ్రహ్మారెడ్డి, రామస్వామి ఇద్దరు కూడా ఇండిపెండెంట్లు గానే గెలిచారు. ఆ తర్వాత 1867 ఎన్నికల్లో వీఎన్.గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం ఆయన 1972, 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీకి దిగి గెలిచారు. కాగా, నాగం జనార్దన్‌రెడ్డి 2009 ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేయడంతో 2012లో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో నాగం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి గెలిచారు. అప్పట్లో నాగం తరఫున ప్రచారానికి కేసీఆర్ కూడా రావడం విశేషం. జడ్చర్ల నియోజవర్గానికి.. 1962, 1967లో జరిగిన ఎన్నికల్లో కొత్త కేశవులు, లక్ష్మీనర్సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. ఆ తర్వాత మరెవరు స్వతంత్రులకు కూడా ఇక్కడ విజయం దక్కలేదు. మక్తల్ నియోజకవర్గం ద్విసభ్య స్థానంగా ఉన్నప్పుడు 1957లో జరిగిన ఎన్నికల్లో ఒకరు కాంగ్రెస్ నుంచి గెలుపొందగా.. బన్నప్ప ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. మహబూబ్‌నగర్ స్థానానికి 1962 లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిఎం.రాంరెడ్డి 3,634 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2004 ఎన్నికల్లో పులి వీరన్న 19,282 ఓట్ల మెజార్టీతో, 2009 ఎన్నికల్లో రాజేశ్వర్‌రెడ్డి 5,275 ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థులుగానే గెలిచారు. గద్వాల నియోజకవర్గానికి.. 1957లో జరిగిన ఎన్నికల్లో డీకే.సత్యారెడ్డి ఇండిపెండెంట్‌గా అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత ఆయనే 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక సత్యారెడ్డి కుమారుడు, డీకే.భరతసింహారెడ్డి 1994 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన ఆయన ప్రత్యర్థి సమరసింహారెడ్డి సొంత సోదరుడే కావడం విశేషం. మధ్యలో 1967లోనూ ఇక్కడి నుంచి ఉప్పల గోపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1962లో వెంకట్‌రెడ్డి, 1967లో ద్యాప గోపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. ఆ తర్వాత 1994లో ఎడ్మ కిష్టారెడ్డి సైతం ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. రెండుసార్లు ఒక్కరే.. 2009లో కనుమరుగైన అమరచింత నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి ఓ రికార్డు ఉంది. ఈ నియోజకవర్గానికి 1952 నుంచి 2004 వరకు మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 1962, 1967లో జరిగిన ఎన్నికల్లో అమరచింత సంస్థానానికి చెందిన రాజవంశీయుడు రాజాసోంభూపాల్ ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించారు. అయితే, రాజ వంశీయుడు కావడంతో సహజంగానే అన్ని పార్టీల వారు తమ పార్టీ తరఫున పోటీకి దిగాలని కోరారు. కానీ ఏ పార్టీని ఎంచుకున్నా.. మరో పార్టీని తిరస్కరించినట్లవుతుందని.. అది మంచి పద్ధతి కాదనే భావనతో రాజాసోంభూపాల్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఈ మేరకు ఆయన విజయం సాధించారు. ఇక మూడో సారి 1972లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీకి దిగి విజయం సాధించారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి 1957లో జరిగిన ఎన్నికల్లోనూ డి.మురళీధర్‌రెడ్డి స్వతంత్రఅభ్యర్థిగానే విజయం సాధించారు. అంటే ఒక్క నియోజకవర్గం నుంచే ఇద్దరు స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం.. ఒక్కరే రెండు సార్లు సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. స్వతంత్రులు.. ఆ నలుగురు మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలో కలగలిసి ఉన్న కొడంగల్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ల పరంగా ఓ రికార్డు నమోదై ఉంది. ఈ నియోజకవర్గంలో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడమే ఈ రికార్డు. 1962 ఎన్నికల్లో రుక్మారెడ్డి, 1967లో అచ్యుతరెడ్డి, 1972లో నందారం వెంకటయ్య, 1978లో గుర్నాథ్రెడ్డి స్వతంత్రులుగా బరిలోకి దిగి గెలిచారు. ఇందులో గుర్నాథ్రెడ్డి ఆ తర్వాత 1983, 1989, 1999, 2004లో కాంగ్రెస్ నుంచి గెలవగా.. నందారం వెంకటయ్య 1985లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని అలంపూర్, దేవరకద్ర, అచ్చంపేట, వనపర్తి, నారాయణపేట నియోజకవర్గాల నుంచి స్వతంత్రులెవరికీ ఇంత వరకు విజయం దక్కలేదు. -
‘మహాకూటమికి మహా ఓటమి తప్పదు’
సాక్షి, నాగర్ కర్నూలు : మహాకూటమికి మహా ఓటమి తప్పదని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో వివిధ పార్టీలకు చెందిన 60మంది జూపల్లి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు ఆకర్షితులై మరింత మంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీని అక్షరాలా అమలు చేయటం సీఎం కేసీఆర్ నైజమని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్ నైజమన్నారు. మహా కూటమి కాదని తెలంగాణ ప్రజల పట్ల కుళ్లుకుతంత్రాల కూటమని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఆకాంక్షించే టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారని అన్నారు. -
‘మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రజలకు రౌడీలు, గూండాల నుంచి బెదిరింపులు వచ్చేవన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీల పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రుల, ఎమ్మెల్యేల పేషీలు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయన్నారు. మంత్రులు కృష్ణారావు, పద్మారావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, దుర్గం చిన్నయ్యలు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులే రౌడీల్లాగా వ్యవహరిస్తే ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో 30 ఎకరాల దళితుల భూమి కబ్జా చేశారనే ఆరోపణలు వస్తే.. వాటిలో వాస్తవాలు ఇప్పటివరకు తేలలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులను బెదిరించిన మంత్రి జూపల్లిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
రూ.17 కోట్ల ఆస్తులు తనఖా పెట్టి రూ.86 కోట్ల రుణం
-
ఖనిజ సంపదను ఆంధ్రకు తరలిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు ఇసుక మాఫియాలో మునిగి తేలుతున్నారని, జూపల్లి అండతో పాలమూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. జూపల్లి ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినా సీఎం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం తీరు చూస్తుంటే ‘నేను ప్రగతిభవన్‌లో కూర్చుని రాష్ట్రాన్ని దోచుకుంటాను, మీరు జిల్లాలను దోచుకోండని’మంత్రులకు చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఖనిజ సంపదను ఆంధ్రకు తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాపై చర్చించేందుకు జూపల్లి సిద్ధమా అని సవాల్ చేశారు. -
ఎన్నికలంటే కాంగ్రెస్‌కు భయం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నికలకు భయపడే శాసన సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్లిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆయన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు ఎన్నికలంటే భయం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మళ్లీ గెలుస్తామనే నమ్మకం ఉంటే కాంగ్రెస్ ప్రజా తీర్పును కోరాలని సూచించారు. ప్రజాతీర్పుకు వెళ్లకుండా కోర్టును ఆశ్రయించారంటే కాంగ్రెస్ ఓటమిని అంగికరించినట్లేనని జూపల్లి ఎద్దేవా చేశారు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే పంచాయతీ రాజ్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన తెలిపారు. -
కాంగ్రెస్ నేతలు ఓట్లు ఎలా అడుగుతారు..?
వీపనగండ్ల (వనపర్తి): తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం వద్ద బలంగా మాట్లాడటానికే జంకిన కాంగ్రెస్ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని తూంకుంటలో టీఆర్ఎస్లో చేరిన పలువురిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగానికి సిద్ధపడిన కేసీఆర్ ఉద్యమ తీవ్రతను పసిగట్టిన సోనియాగాంధీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, తాగునీటి లాంటి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలయమ్యారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం లేకపోతే ఎలాంటి అభివృద్ధి జరగదని వరుసగా మూడు సార్లు గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనేక గ్రామాల్లో నేటికీ నీటి సమస్య ఉందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రెండు లక్షల కి.మీ. మేర పైపులైన్ వేసి జూన్ 30నాటికి ఇంటింటికీ తాగునీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ లోకారెడ్డి, విండో చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, కృష్ణప్రసాద్, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నందిగామలో ఉద్రిక్తత
మద్దూరు: మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలంలోని నందిగామలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అనుచరులు, ఇతర టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండలంలోని మన్నాపూర్‌లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మంత్రులు గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించేందుకు వెళ్లగా రేవంత్ తన అనుచరులతో కొత్తపల్లి మీదుగా నందిగామ వెళ్లారు. అక్కడ మంత్రులు రాకముందే శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు యత్నించారు. కొద్దిసేపు ఆగిన ఎమ్మెల్యే ఆ వెంటనే శిలాఫలకం ఎదుట కొబ్బరికాయ కొట్టారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరగగా శిలాఫలకం ధ్వంసమైంది. ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుల వాహన శ్రేణిని టీఆర్ఎస్ నేతలు, గ్రామస్తులు అడ్డగించారు. దీంతో ఎమ్మెల్యే వాహనం దిగి నడుచుకుంటూ తిమ్మారెడ్డిపల్లి గేటు వరకు వెళ్లి అక్కడి నుంచి బైక్‌పై కొడంగల్ వెళ్లిపోయారు. ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నాయకులు, వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోయిల్‌కొండ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం నాయకులకు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న జూపల్లి, పట్నం మహేందర్‌రెడ్డిలు రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచే ముఖ్యమంత్రి పతనం కొడంగల్: తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, సీఎం పతనం గజ్వేల్ నుంచే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి
మహబూబ్‌నగర్ , కోస్గి: పోరాడి సాధించుకున్న తెలంగాణలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి చేస్తూ దేశం గర్వించేలా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలో చంద్రవంచ, ముక్తిపాడ్, బొలుగోనిపల్లి, పోతిరెడ్డిపల్లి, కోస్గి, కడంపల్లి, మాసాయపల్లి, అమ్లికుంట్ల, మల్రెడ్డిపల్లి, సంపల్లి గ్రామాల్లో వారు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కోస్గి, సంపల్లిలో జరిగిన సభల్లో మంత్రులు మాట్లాడారు. కాగా, కార్యక్రమాల్లో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా పాల్గొని కోస్గిలో జరిగిన సభలో మాట్లాడారు. ఆ తర్వాత చివరగా సంపల్లిలో జరిగిన సభలో మాత్రం ఆయన పాల్గొనకుండా వెళ్లిపోయారు. అభివృద్ధిని అడ్డుకోవద్దు.. కోస్గి, సంపల్లిలో జరిగిన సభల్లో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచిపుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ హుందాగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయాల కోసం అభివృద్దిని అడ్డుకుంటే పుట్టగతులుండవన్నారు. పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చునన్నారు. పాలమూర్ జిల్లాకు రోడ్ల కోసం గత పాలకులు రూ.2 కోట్లు అందించని దుస్థితి ఉంటే ప్రస్తుతం కేవలం పాలమూర్ జిల్లాకే రూ.140 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఒక్క కొడంగల్ నియోజకవర్గం కోసం రూ.50 కోట్లు ఇచ్చామన్నారు. మరో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అడుగడుడున అభివృద్ధిని అడ్డుకుంటూ తన రాజకీయ ఉనికి కోసం పాకులాడే రేవంత్‌రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమేనని అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నారని ఇందులో భాగంగనే కొడంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని తెలిపారు. కోస్గి బస్ డిపోకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఆంధ్ర పార్టీలో ఉండి తెలంగాణ రాకుండా అడ్డుకున్న దద్దమ్మలు నేడు రాజకీయ మనుగడ కోసం పార్టీ మారి అభివృద్దిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌లో చేరి ఏం చేస్తారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు రాజకీయాల కోసం ప్రజల్ని మభ్యపెట్టి మాయమాటలతో కాలం గడిపాయని, కేసీఆర్‌ది మాటలు చెప్పేతత్వం కాదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఏనాడు అభివృద్ది కోసం పని చేయలేదని తన జీవితమంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలు, దందాలకే పరిమితమైందని విమర్శించారు. ఇటు తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండకుండా తన సొంత దందాల కోసం తిరుగుతున్న రేవంత్‌రెడ్డి అభివృద్ధి్దని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. అభివృద్ధి్దకి నిరంతరం కృషి రెండుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. కోస్గికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించానని, గేల్ సంస్థ సహాకారంతో జూనియర్ కళాశాలను నిర్మించానన్నారు. బస్‌డిపో ఏర్పాటు కోసం సొంతంగా భూమి కొనుగోలు చేసి తన ఎమ్మెల్యే నిధుల్ని కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అన్న కిష్టప్ప, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జెడ్పీటీసీ అనితబాల్‌రాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోటాపోటీగా ర్యాలీలు మండలంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలు పోటాపోటీ ర్యాలీలు, నినాదాలతో దద్దరిల్లింది. ఈ మేరకు పోలీసులు వలయంగా ఏర్పడి ఇరువర్గాలను వేరు చేయడంతోపాటు శంకుస్థాపనకు ముఖ్యులనే అనుమతించారు. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే వాహన శ్రేణి ఓ వైపు, మంత్రుల కాన్వాయ్ ఓ వైపు వెళ్తుండడంతో పోలీసులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. బొల్వోన్‌పల్లి దగ్గర ఎమ్మెల్యే వెంట మమ్మల్ని ఎందుకు అనుమతించడంలేదంటూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్, నాయకులు అంజయ్య, రహీం, ఇద్రీస్, నరేందర్ తదితరులు సీఐ రామకృష్ణతో వాగ్వాదానికి దిగారు. -
ఉత్తమ్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అయినా ఈ విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అని, అందుకే ఆ పార్టీ నేతలు నోటికొచ్చిన హామీలిస్తున్నారని విమర్శించారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలసి జూపల్లి విలేకరులతో మాట్లాడారు. పింఛన్లు, మహిళా సంఘాలకు రుణాలు, అభయహస్తం, సెర్ప్ ఉద్యోగుల విషయంలో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను జూపల్లి ఖండించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రవ్యాప్తంగా రూ. 835.64 కోట్ల పింఛన్లు ఇస్తే, తాము ఏటా రూ. 5,301.83 కోట్ల ఆసరా పింఛన్లుగా ఇస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే 1998–2014 మధ్య మహిళా సంఘాలకు రూ. 16 వేల కోట్ల రుణాలు అందగా గత మూడున్నరేళ్లలోనే తాము రూ. 22,301 కోట్ల రుణాలిచ్చామన్నారు. దీనికి అదనంగా రూ. 4,555 కోట్లను స్త్రీనిధి ద్వారా అందించామని చెప్పారు. అభయహస్తం కింద లబ్ధి పొందేవారిలో 1,16,848 మందికి ఆసరా కింద పింఛన్లు ఇస్తున్నామని, వారి కోసం ప్రత్యేక పథకానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. వారి ద్వారా కట్ చేసుకునే బీమా మొత్తాన్ని తీసుకోవడం లేదని, అయినా సహజ మరణం పొందితే రూ. 75 వేలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 4 లక్షలు అందేలా రాష్ట్రంలోని 78 లక్షల మందికి వర్తింపజేసే పథకాన్ని త్వరలోనే ప్రవేశపెడతామని జూపల్లి చెప్పారు. సెర్ప్ ఉద్యోగుల వేతనాలను గణనీయంగా పెంచిన ఘనత తమదేనన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు అర్థం చేసుకోవాలని, మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పకుండానే తాము ఇస్తున్నామని, అదే కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. పింఛన్లలో జాప్యం నిజమే... రిజర్వు బ్యాంకు నుంచి రాష్ట్రానికి నగదు రావడంలో సమన్య వచ్చినందున గత నెలలో పింఛన్ల విషయంలో ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమేనని మంత్రి జూపల్లి తెలిపారు. అలాగే అభయహస్తం పింఛన్ల కింద 2017 ఫిబ్రవరి నుంచి బకాయి ఉన్నమాట కూడా నిజమేనని చెప్పారు. ఉపాధి హామీ వేతనాల కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగా రావడం లేదని, అయినా రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసి ఇస్తున్నామని, అందుకే కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఏదిఏమైనా పథకాల అమల్లో ఉన్న ఇబ్బందులు తొలగించుకుని ముందుకెళుతున్న తమను విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. -
కొలిక్కి వచ్చేనా?
సాక్షి, గద్వాల : జిల్లాలో రైతు సమన్వయ సమితుల ప్రక్రియ ఓ కొలిక్కి రావడం లేదు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతోపాటు ఇతర వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.నాలుగు వేల చొప్పున ఏటా రెండుసార్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇందులో గ్రామం మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు నాలుగు అంచెల్లో ఉండే రైతు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషించనున్నాయి. సభ్యులను నామినేట్ చేసే బాధ్యతను జిల్లా ఇన్చార్జి మంత్రికి అప్పగించింది. గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీలోగా కమిటీల ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ గడువు ముగిసి ఐదు నెలలు కావస్తున్నా అలంపూర్ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి సమితులపై ఎవరూ పట్టించుకోవడం లేదు. అలంపూర్ నియోజకవర్గంలో ఒక్క కమిటీ కూడా వేయని పరిస్థితి నెలకొనగా, గద్వాల నియోజకవర్గంలో 86కమిటీలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. గ్రామ, మండల సమితులతోపాటు జిల్లా సమన్వయ సమితులు వెంటనే వేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఇది కార్పొరేషన్ తరహాలో పనిచేస్తుందని ఆయన ప్రకటించడం గమనార్హం. ఆచరణకు నోచుకోని కమిటీలు కలెక్టర్ నేతృత్వంలో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ప్రోత్సాహక పెట్టుబడి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసే రైతు సమన్వయ సమితులకు సంబ ంధించి విధి విధానాలను వ్యవసాయశాఖ రూపొం దించింది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులోనే జీఓ ఎంఎస్ నం.39 జారీ అయింది. దీనికి అనుగుణంగానే జిల్లాలో ఈ కమిటీల ప్రక్రియ చేపట్టగా గద్వాల నియోజకవర్గంలో మాత్రమే పూర్తయింది. 86రెవెన్యూ గ్రామాల్లో, ఐదు మండలాలకు రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేశారు. గత అక్టోబర్ 15న గద్వాలలో బాధ్యులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. అలంపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ప్రతిష్టంభన నెలకొంది. 121రెవెన్యూ గ్రామాల్లో ఒక్కచోటైనా సమితి ఏర్పాటు కాలేదు. దీంతో జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే వ్యవసాయ శాఖ క్లస్టర్లలో రైతు సమావేశ మందిరాలు నిర్మిస్తామని ప్రకటించినా ఇంతవరకు ఏ గ్రామం లోనూ స్థలాలు ఎంపిక చేయలేదు. మంత్రి దృష్టికి తీసుకె Ðð ళ్తాం రైతు సమన్వయ సమితులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశించింది వాస్తవమే. దీనిపై త్వరలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి తగు కార్యాచరణ చేపడతాం. అలంపూర్ నియోజకవర్గంలో రైతు సమన్వయ సమితులు ఏర్పాటైతేనే జిల్లా కమిటీకి అవకాశం ఉంటుంది. – గోవింద్‌నాయక్, డీఏఓ, గద్వాల -
ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు లక్ష్యం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతోందని, కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 89 రహదారుల పనుల కోసం రూ.142 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చామని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు . కొడంగల్ నియోజకవర్గంలోని 36 రోడ్డు పనులను తానే మంజూరు చేయించానంటూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రకటనలు జారీ చేసుకోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీ, బీటీ రోడ్ల కోసం ఎమ్మెల్యేల నుంచి ఏటా వందలాది ప్రతిపాదనలు వస్తున్నాయని, అలాంటి ప్రతిపాదనలేవీ పంపని ఏకైక ఎమ్మెల్యే రేవంత్ అని విమర్శించారు. తెలంగాణ ఏర్పడే నాటికి కొడంగల్ నియోజకవర్గంలోని 39 గ్రామాలకు రహదారి సౌకర్యమే లేదని, దీనికి కాంగ్రెస్, టీడీపీలు కారణం కాదా అని ప్రశ్నించారు. అప్పుడు అభివృద్ధి చేయడం చేతగాని రేవంత్.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను తానే చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 376 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామని, సమైక్య పాలనలో 756 గ్రామాలకు రహదారి సౌకర్యమే కల్పించలేకపోయారని పేర్కొన్నారు. -
స్త్రీ నిధి ప్రపంచానికే స్ఫూర్తి: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ‘స్త్రీ నిధి’వంటి కార్యక్రమాలతో తెలంగాణ మహిళా సంఘాలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్త్రీ నిధి బ్యాంకు నాలుగో వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జూపల్లి మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నియంత్రించే స్థాయికే కాకుండా, సామాజిక కార్యక్రమాల్లోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మహిళల చేత, మహిళల ద్వారా, మహిళల కోసం నడుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు ఎన్నో విజయాలను సాధిస్తోందని, ఇది దేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శనీయంగా మారిందని తెలిపారు. స్త్రీ నిధి సహకార పరపతి సమాఖ్య ఆరేళ్లలోనే 18 లక్షల మంది సభ్యులతో 2.86 లక్షల గ్రూపులకు రూ.4,800 కోట్ల రుణాలు అందించే స్థాయికి ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన పలువురిని సన్మానించారు. ఆధార్ ఆధారిత రుణ వితరణ యాప్‌ను, మహిళ సంఘాల ఆన్లైన్ అకౌంటింగ్ వెబ్‌సైట్‌ను జూపల్లి ఆవిష్కరించారు. స్త్రీ నిధి విజయగాథలు, జీవనోపాధి కోసం పాజెక్టు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి స్త్రీ నిధి అధ్యక్షురాలు అనిత అధ్యక్షత వహించగా.. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, మెప్మా ఎండీ శ్రీదేవి, సెర్ప్ సీఈవో పౌసమీ బసు తదితరులు హాజరయ్యారు. -
దేశానికే ఆదర్శంగా తెలంగాణ: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న కొత్త పంచాయతీరాజ్ చట్టంతో దేశానికే ఆదర్శంగా తెలంగాణలో స్థానిక పాలన సాగాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్ట రూపకల్పనపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీతో శనివారం మంత్రి సమావేశమయ్యారు. చట్టంలో పొందుపర్చేందుకు సిద్ధం చేసిన పలు అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ప్రధానంగా గ్రామసభల నిర్వహణతో పాటు సర్పంచ్ల విధులు, బాధ్యతల అంశాలపై చట్టంలో చేయాల్సిన మార్పులపై దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా స్థానిక పాలనను కొత్త పుంతలు తొక్కించేలా చట్టానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లోని స్థానిక పాలనలో ఉన్న అన్ని అంశాలను పరిశీలించి మెరుగైన చట్టాన్ని రూపొందించాలన్నారు. గ్రామ సభలను నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా నిర్వహించేలా చట్టంలో విధివిధానాలు రూపొందించాలని సూచించారు. నిధుల కొరత లేదు.. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ ఇచ్చి ప్లేస్‌మెంట్స్ కల్పించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా శిక్షణ కేంద్రాలను నిర్వహించాలని జూపల్లి కోరారు. టీ సిపార్డులో గ్రామీణ ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు నిర్వహిస్తున్న సంస్థలతో శనివారం మంత్రి సమావేశమయ్యారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కింద నిరుద్యోగ యువతకు శిక్షణ, ప్లేస్‌మెంట్స్ కల్పించడంలో భాగస్వామ్య సంస్థల కృషిని మంత్రి ప్రశంసించారు. గ్రామీణ యువతను శిక్షణ కేంద్రాలకు రప్పించడంతో పాటు స్వయం ఉపాధికి దోహదం చేసేలా శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని, ఉపాధి శిక్షణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌కూ టీడీపీ గతే: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తే.. నేడు ఆ పార్టీలో చేరాడని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. అధికారం, పదవులు అన్న కోణంలోనే రాజకీయాలు చేస్తున్నారు తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం అన్న కోణంలో చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉప ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగయ్యిందని, కాంగ్రెస్‌కూ అదే గతి పడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అసలు రంగు ఏంటో తెలియాల్సి ఉందని, కొడంగల్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉపఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చిందో అదే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలసి మంగళవారం జూపల్లి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కబంధ హస్తాల్లో తెలంగాణ ఉందని, అన్ని పార్టీలు ఏకం కావాలని రేవంత్ అనడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అన్నది వాస్తవమే అయినా, ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారన్న వాస్తవాన్ని మరిచిపోవద్దని అన్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి చేరాడని జూపల్లి ఆరోపించారు. చంద్రబాబు శిక్షణలో పెరిగానని రేవంత్ అనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో సీఎం కేసీఆర్ ఏమీ చేయకపోతే జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎలా గెలిచారని నిలదీశారు. కాంగ్రెస్‌ను బురిడీ కొట్టించి రేవంత్ ఆ పార్టీలో చేరాడని, అనేక కుంపట్లు ఉన్న కాంగ్రెస్‌లో రేవంత్ పరిస్థితి ఏమిటో త్వరలో తేలిపోతుందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
చేనేత వస్త్రాల ఎగుమతికి కృషి: జూపల్లి
నగరంలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం సాక్షి, హైదరాబాద్: చేనేత వస్త్రాలకు డిమాండ్ పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆన్లైన్ ద్వారా చేనేత ఉత్పత్తుల ఎగుమతికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం ‘జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో చేనేత ఎగుమతులు పెద్ద ఎత్తున సాగుతున్నాయని, కానీ తెలంగాణలో రూ. 100 కోట్ల విలువైన ఎగుమతులు కూడా లేవని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేనేత ఉత్పత్తుల విక్రయాల్లో కూడా వినియోగిస్తామని, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ వ్యాపార సంస్థల ద్వారా అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఈ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. ఇక నుంచి నేతన్నలు తయారు చేసిన వస్త్రాల్లో ఆ చీరను తయారు చేసిన వారి ఫొటో వివరాలు ఉంచే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా నేరుగా చేనేత కార్మికుల నుంచే వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్, ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేందర్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
మహబూబ్‌నగర్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డ్‌కు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ శంకుస్థాపన ఉంది. అయితే మంత్రి పర్యటనకు ముందే అక్కడకు చేరుకున్న రేవంత్ రెడ్డి ....ప్రొటోకాల్ ప్రకారం తమను ఆహ్వానించలేదని ధర్నాకు దిగటంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వాహనాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. జీపు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పటంతో రేవంత్ రెడ్డితో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా అదుపులోకి తీసుకున్న రేవంత్ రెడ్డిని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన చేపట్టారు. మరోవైపు మంత్రి జూపల్లి మార్కెట్ యార్డ్‌కు శంకుస్థాపన చేశారు. -
టీడీపీ నేతల కోసం జూపల్లి ఎదురుచూపు
హైదరాబాద్ : భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఈ మేరకు టీడీపీ నేతల కోసం వేచి ఉన్నారు. జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు నాయుడు నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జూపల్లి ఆదివారం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాలులోఈనెల 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని, ఈ తేదీలు, సమయం అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి సిద్ధంగా ఉంటామని జూపల్లి పేర్కొన్నారు. కాగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
సవాల్‌కు కట్టుబడి ఉన్నా: జూపల్లి
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం వారికి ఒక బహిరంగ లేఖ రాశారు. 'మీ అధినేత చంద్రబాబు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నానని చెబుతూనే, జిల్లా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనుసరించిన వైఖరిని, మోసపూరిత లేఖలతో కేంద్ర ప్రభుత్వాన్ని, సంస్థలనీ తప్పుదోవ పట్టిస్తూ, పాలమూరు- ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న తీరును, ఆయన హయాంలో ప్రాజెక్టుల వ్యయంలో ఒక శాతం కంటే తక్కువ స్థాయిలో ఖర్చు చేసినా, జిల్లాను ఉద్దరించామని చెబుతున్న టీడీపీ నేతల ప్రకటనల్లోని డొల్లతనాన్ని ప్రజల ముందు ఆధారాలతో సహా బట్టబయలు చేయడానికి నాతో పాటు, నా సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిద్ధంగా ఉన్నాం..' అని మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ చర్చ పాత్రికేయ సంఘాల ప్రతినిధుల సమన్వయంతో, పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా ఉంటూ, టీవీ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరిగేలా ఏర్పాటు చేయాలని, ఇందుకోసం వారిని తాను ప్రత్యేకంగా అభ్యర్ధిస్తున్నానన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులోఈనెల 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని, ఈ తేదీలు, సమయం అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
'ఎన్టీఆరే... బాబును గాడ్సేతో పోల్చారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సిహెచ్ లక్ష్మారెడ్డి గురువారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టింది చంద్రబాబే అని వారు ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆరే ... చంద్రబాబును గాడ్సేతో పోల్చిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. చంద్రబాబు నైజం అనైతికమంటూ విమర్శించారు. ఓటుకు కోట్లు అంశంపై ఇప్పటికీ ఎందుకు స్పందించలేదని చంద్రబాబును జూపల్లి, లక్ష్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు. 1995లో వేల రూపాయల ఆదాయం ఉన్న చంద్రబాబు ఇప్పుడు వేల కోట్లను ఏ విధంగా సంపాదించారని నిలదీశారు. ఓటుకు కోట్లు అంశంలో అరెస్ట్ అయిన కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందన్నారు. రేవంత్‌కు న్యాయస్థానంలో శిక్ష తప్పదని జూపల్లి, లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. -
'ఎన్టీఆరే... బాబును గాడ్సేతో పోల్చారు'
-
'అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు'
హైదరాబాద్: సమాజానికి అవినీతిని పరిచయం చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు నైజంపై విరుచుకుపడ్డారు. సీఎం పదవి కోసం వైశ్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను కొన్న ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. చంద్రబాబు నాయుడుది రెండు దొంగకళ్ల సిద్ధాంతమంటూ మండిపడ్డారు. చంద్రబాబులో ఇంకా పులుపు చచ్చినా చింత చావలేదంటూ జూపల్లి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అభివృద్ధిపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు తామెప్పుడూ సిద్ధమేనంటూ జూపల్లి ఈ సందర్భంగా సవాల్ విసిరారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, చైర్మన్ల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. ఆదివారం స్థానిక అన్నపూర్ణగార్డెన్స్‌లో పీఆర్టియు తెలంగాణ ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీ, జెడ్పీఛైర్మన్, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ వ్యతిరేకులకు అండగా నిలవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే రెండు మంత్రిపదవులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారన్నారు. ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఉపాధ్యాయులు నిబద్దతతో పనిచేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేయనున్నందున ఇంగ్లీష్‌మీడియంలో బోధించేందుకు ఉపాధ్యాయులు సిద్దంగా ఉండాలన్నారు. మేనిఫెస్టోలో పేర్కొ న్న ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నా రు. జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. పరి శ్రమల స్థాపనకు ముందుకు వస్తే అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఇందుకుగాను ఆన్లైన్లో పరిశ్రమల సమాచారం ఉంచామని, దరఖాస్తు చేసుకున్న వారికి 15రోజుల్లో అనుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తామన్నారు. కోతలు లేని విద్యుత్ జిల్లాలో రైతులు ఎక్కువగా బోర్లపై ఆధారపడినందున కోతలు లేని విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖామంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. మంత్రులమైనా ఉద్యమ కారులలాగే పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ ధ్యేయమని, జిల్లాలో వెయ్యిమెగావాట్ల సోలార్‌ప్లాంటును ఏర్పాటు చేస్తామనిచ మైనార్టీ స్టడీ సర్కిల్, పాస్‌పోర్టు ఆఫీసును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యమంలో ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం జెడ్పీచైర్మన్, ప్రణాళికాసంఘం డిప్యూటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘం నేతలు మాట్లాడారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు విఠల్‌రావు ఆర్య, బెక్కెం జనార్ధన్, సాయిరెడ్డి, చలపతిరావు, బాల్‌రెడ్డి, నిస్సీ డెబోరా, యుగంధర్‌రెడ్డి, దుంకుడ శ్రీనివాస్, చెన్నప్ప, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ తాగునీరు
వనపర్తి: జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిచేయడంతో పాటు మారుమూల పల్లెలకు రోడ్లు వేస్తామని, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామని ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆ గ్రామానికి వేసినరోడ్డు, రైతు పంట పొలం, ఇంటి ముందు ఉన్న నల్లాయే తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా చెబుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని స త్వరం అభివృద్ధి చేసేందుకు సీఎం కం కణం కట్టుకున్నారని అన్నారు. పదవి స్వీ కరించిన అనంతరం బుధవారం వనపర్తికి వచ్చిన ఆయనకు ఘనస్వాగతం ల భించింది. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో పార్టీ శ్రేణులు ఘనంగా ఆయనను సన్మానించారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ.. 60 ఏళ్ల సీమాంధ్రపాలనలో జరి గిన అన్యాయాన్ని ఐదేళ్లలో పూడ్చేందుకు కృషిచేస్తామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల కష్టాలను తీర్చుతామన్నారు. వనపర్తిని జిల్లా కేంద్రంగా మార్చుతామని, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల విస్తరణను సత్వరం చేస్తామన్నారు. ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ల పాటు పనిచేసిన నిరంజన్‌రెడ్డికి సీఎం కీలకపదవి ఇచ్చారని చెప్పారు. ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ.. నిరంజన్‌రెడ్డి ఆలోచన విధానం, ఆ యన చిత్తశుద్ధి తనకెంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. మాజీమంత్రి వై.ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ మాట్లాడుతూ.. జిల్లాలో కరువు, వలసలను అరికట్టేం దుకు అధికనిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో నాయకులు పు రుషోత్తంరెడ్డి, బి.లక్ష్మయ్య, జగదీశ్వర్‌రె డ్డి, బుచ్చారెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, ఖిల్లాఘనపురం ఎంపీపీ కృష్ణనాయక్, పెద్దమందడి జెడ్పీటీసీ సభ్యులు వేణుగోపాల్ వనపర్తి కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ప్రధాన లక్ష్యం ఉపాధి కల్పనే
నాగర్‌కర్నూల్: జిల్లాలో వలసలను ఆపడంతో పాటు పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని.. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ ఇవ్వడంతో ఇందులో భాగమేనన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూలులోని వెలమ ఫంక్షన్హాల్లో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించేందుకు సౌదీ నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని.. వారు తొలుత మహబూబ్‌నగర్ జిల్లాకే వస్తున్నారని అన్నారు. ఉద్యోగులు, నేతలు సోదరభావంతో కలిసి పనిచేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు. గ్రామీణస్థాయిలో భూ తగాదాలు అధికంగా ఉంటాయని, రెవెన్యూ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. అధికారం చెలాయించడం గాక పేదలకు సేవ చేసినప్పుడే మంచిపేరు వస్తుందన్నారు. గతంలో రాజకీయ నాయకులు పని తక్కువ చేసి ప్రచారం ఎక్కువగా చేసుకున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం అలా కాదన్నారు. కల్యాణ పథకంలో వివాహానికి ముందే ప్రభుత్వం సహాయం అందిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమ రథసారథులని, వారితో మంచిగా మెలుగుతూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ఆత్మీయ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో నేతలు కార్యకర్తల ముందే అధికారులను పిలిపించి దూషించే వారని, తాము అలాంటి విధానానికి దూరమని వెల్లడించారు. కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా పనిచేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో అన్ని శాఖలపరంగా ఎన్నో పథకాలు అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ చల్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 26 వాటర్‌గ్రిడ్‌లలో మొదటిది కృష్ణానది బ్యాక్‌వాటర్ నుంచి చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎల్లూరు వద్ద చేపట్టనున్న ఈ గ్రిడ్ ద్వారా 6 జిల్లాలకు చెందిన 25 నియోజకవర్గాలకు తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ ఈఈ రామన్న మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ. 24కోట్ల వ్యయంతో 184 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. చిన్ననీటి పారుదల ఈఈ మాట్లాడుతూ నియోజకవర్గంలో 132 చెరువులు గుర్తించామని, 36 చెరువులకు ఎస్టిమేట్లు వేశామని, మిగతావి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రూ.50 కోట్ల టెండర్లు వచ్చే నెలలో పిలుస్తున్నామన్నారు. ఆర్డీఓ వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీఓ హరినందన్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జక్కా రఘునందన్‌రెడ్డి, డీఎస్పీ గోవర్ధన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు ప్రాజెక్టులకు పెద్దపీట
కోడేరు: పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తామని భారీ పరి శ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్, కొ ల్లాపూర్ నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉ పాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన గురువారం కొల్లాపూర్ నియోజకవర్గంలో మొదటిసారిగా కోడేరులో ఆ సరా పింఛన్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. నియోజకవర్గ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.500 కో ట్లు మంజూరు చేసిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రై తులు, ప్రజలకు తెలంగాణ ప్రభుత్వ హయాంలో మంచిరోజులు ఉ న్నాయని, అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. వచ్చే మూడేళ్లలో నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. ప్రతి ఇంటికీ వాటర్‌గ్రిడ్ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. మండలంలోని ఎత్తం గట్టు నుంచి వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాకు తాగునీరు అందిస్తామని తెలిపారు. తన హయాంలో కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్‌కు డబుల్‌రోడ్డు నిర్మాణం చేపట్టడమేకాక కోడేరు, పెద్దకొత్తపల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కొల్లాపూర్‌లో పీజీ కళాశాల ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. వచ్చే రెండేళ్లలో కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఆంగ్ల బోధనలు చెప్పేందుకు రెసిడెన్షియల్ పా ఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి మళ్లీ మంత్రి పదవి రావడం హర్షణీయమన్నారు. వారంరోజుల్లో మండలంలోని ప్రతి చెరువు, కుంటల్లో పూ డిక తీసే కార్యక్రమం చేపడతామని, అందుకు రైతులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. మంత్రికి ఘనసన్మానం మంత్రి పదవి చేపట్టి మొట్టమొదటిసారిగా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి కోడేరుకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో ఎంపీపీ రాంమోహన్‌రావు, నాగర్‌కర్నూల్ ఆర్డీఓ వీరారెడ్డి, ఎంపీడీఓ రాములు, తహశీల్దార్ కృష్ణయ్య, డీలర్లసంఘం అధ్యక్షుడు శ్రీనివాసులుశెట్టి, నదీమ్, శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్ కరీఫ్, సర్పంచ్ కవిత, ఎంపీటీసీ శ్రీను, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. డీఎస్పీ చెన్నయ్య ఆధ్వర్యంలో కొల్లాపూర్ సీఐ రాఘవరావు, కోడేరు ఎస్ఐ వెంకటరమణ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మా జిల్లాలో రేవంత్ చెడబుట్టారు: టీఆర్ఎస్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తమ జిల్లాలో తప్పబుట్టారని, జిల్లా పరువును తీస్తున్నారని జూపల్లి, లక్ష్మారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లాంటివాళ్లు శాసనసభకే కళంకమని మండిపడ్డారు. చంద్రబాబు కీ ఇస్తే ఈయన బొమ్మలా ఆడుతున్నారని విమర్శించారు. అవినీతిని చట్టబద్ధం చేసిన చరిత్ర చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఓబులేసు అని కూడా జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బహిరంగ చర్చకు సిద్ధం: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూములను ఎవరు కొల్లగొట్టారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రావాలని మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు.టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మా రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులతో కలసి ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన రూ. వేలకోట్ల విలువైన భూములను చంద్రబాబు ధారాదత్తం చేసినప్పుడు రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ‘రేవంత్ చేస్తున్న ఆరోపణలపై మీడియా సాక్షిగా బహిరంగచర్చకు మేం సిద్ధ్దం. మెట్రో భూములను ఎవరికీ కేటాయించలేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రుజువు చేసే దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగచర్చకు రావాలి. ఆరోపణలను రుజువు చేయలేకుంటే రేవంత్‌రెడ్డి గుండు గీయించుకుంటడా? అసత్య ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబుకు గుండు గీయిస్తడా? లేదా? అని జూపల్లి సవాల్ చేశారు. మెట్రో భూములపై అర్థంలేని ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు.తెలంగాణ ఏర్పాటుకోసం కేసీఆర్‌తో సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి త్యాగాలకు పాల్పడితే మూడేళ్లు దాటినా పదవులను పట్టుకుని వేలాడిన రేవంత్ రెడ్డి లాంటి టీడీపీ నేతలు ఇప్పుడేమో నోటికొచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు క్షమిస్తారా? అని జూపల్లి ప్రశ్నించారు. అసత్య ఆరోపణలతో మెట్రో రైలు ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు కుట్రకు దిగుతున్నాడని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ వేరుగా మీడియాతో మాట్లాడుతూ మెట్రో రైలుపై అఖిలపక్షాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని జానారెడ్డిని ప్రశ్నించారు. అప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. -
ఆంధ్రాకు బీసీని సీఎం చేస్తావా..?
చంద్రబాబుకు జూపల్లి ప్రశ్న హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోయాయని.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఒక్కశాతం కూడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. పచ్చి అబద్ధాలు, పూటకోమాటతో పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నమే తప్ప.. బాబుకు బీసీలపై ప్రేమ లేదని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాదనే బీసీలను సీఎం చేస్తానంటూ చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ ఇక్కడ అవకాశం ఉంటే చంద్రబాబు లేదా లోకేష్ ముందుకొచ్చేవారని చెప్పారు. 1983 నుండి ఇప్పటిదాకా సీఎంగా బీసీని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మరి ఆంధ్రాకు బీసీని సీఎం చేస్తావా? అని జూపల్లి సవాల్ చేశారు. -
110 సీట్లు గెలిస్తే విలీనం ఎందుకు?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒంటిరిగా పోటీ చేసినా 110 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామంటున్న నమ్మకం ఆ పార్టీ నేతలకు ఉంటే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయమని ఎందుకు అడుగుతున్నారని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. పార్టీని విలీనం చేయలేదంటూ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను విమర్శించే అర్హత తెలంగాణ కాంగ్రెస్ నేతలకెక్కడదని దుయ్యబట్టారు. పార్టీ నేతలతో కలిసి మంగళవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీని విలీనం చేయనందుకు తెలంగాణ మంత్రులుగా పనిచేసిన నేతలు అవహేళన చేసి మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదంటున్నారు, కాకపోతే మీ వల్ల తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు మంత్రులుగా ఉంటూ ఏనాడు ఉద్యమానికి సహకరించిన నేతలు ఇప్పుడు విలీనం గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. జూలై 30వ తేదీన సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత కెడ్రిట్ కాంగ్రెస్ రావాలని ఈ నేతలందరికీ మాటలోచ్చాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ని పిట్టల దొర అని షబ్బీర్ అలీ అంటున్నాడని.. కేసీఆర్ దెబ్బకే ఢిల్లీ బెదిరింది.. పదేళ్లగా చంద్రబాబు కోలుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వారం రోజులలో పోయే ముందు శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా గొప్పులు చెప్పుకుంటున్నాడని విమర్శించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాల మేరకు రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పెలా అవుతుందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. -
బిల్లుకు టీఆర్ఎస్ 10 సవరణలు
స్పీకర్‌కు అందజేసిన పార్టీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులో సవరించాల్సిన అంశాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గురువారం తన అభిప్రాయాలు, సూచనలను స్పీకర్‌కు తెలియజేసింది. 10 అంశాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, పి.శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కె.హరీశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, గంపా గోవర్ధన్, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య, గడ్డం అరవింద్ రెడ్డి, జోగు రామన్న, కె.తారక రామారావు, ఎస్.సత్యనారాయణ, కె.విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, దాస్యం వినయ్ భాస్కర్, టి.రాజయ్య, మొలుగూరి భిక్షపతి, హనుమంత్ షిండే సంతకాలతో కూడిన పత్రాన్ని స్పీకర్‌కు అందించింది. ఎమ్మెల్యేల బృందం సూచించిన సవరణలివీ.. 1. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మూడేళ్ల కంటే ఎక్కువగా ఉంచకూడదు. 2. గవర్నర్‌కు శాంతి భద్రతలపై అధికారం వద్దు. గవర్నర్‌కు ఈ అధికారం లేకుంటే ప్రత్యేకంగా సలహా మండలి అవసరం ఉండదు. 3. రెండు రాష్ట్రాలకు వెంటనే వేర్వేరుగా హైకోర్టులను ఏర్పర్చాలి. వెంటనే సాధ్యం కాకుంటే మూడు నెలల గరిష్ట కాలపరిమితితో ఏర్పాటు చేయాలి. 4. జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా స్థానికత ఆధారంగా పెన్షనర్లను గుర్తించి, పెన్షన్ల భారాన్ని పంచాలి. 5. కార్పొరేషన్ల, కంపెనీల ఆస్తులను వెంటనే పంపిణీ చేయాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను విభజించిన సమయంలో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అనుసరించినట్టుగానే ఇక్కడా వ్యవహరించాలి. 6. ఉద్యోగుల విభజన కూడా స్థానికత ఆధారంగానే ఉండాలి. 7. పోలవరంతోపాటే ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలి. 8. సమైక్య రాష్ట్రంలో అమల్లో ఉన్న విద్యుత్ ఒప్పందాల (పీపీఏ)లను సమీక్షించడానికి, కొత్తగా వచ్చిన అవకాశాలు, ఉత్పత్తి వనరులు, డిమాండ్, సరఫరా, విధానాలను అనుసరించి కొత్త విధానాలను అమలు చేయడానికి అనువుగా పార్లమెంటు బిల్లును సవరించాలి. 9. తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఎయిమ్స్ స్థాయిలో ఆసుపత్రి, వైద్య శిక్షణా సంస్థ, ఐఐఎం, 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో విద్యుత్ ప్రాజెక్టును ఇవ్వాలి. 10. పదేళ్లపాటు ఉమ్మడి పరీక్షలు, అడ్మిషన్లు అసంబద్ధం. దీన్ని ఐదేళ్లకు కుదించాలి. -
పట్టు కోసం ఫైట్
మహబూబ్‌నగర్: తెలంగాణ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం మరిం త దూకుడు పెంచిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై మరొకరు విమనార్శస్త్రలు సంధిస్తూ ప్రజలదృష్టిలో పడేందుకు పోరాటాలు చేస్తున్నారు. తమ ఉద్యమాల వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్.. కేంద్రంలో మా మద్దతు ఉండటం వల్లే తెలంగాణ వస్తోందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల నినాదం ఇలా ఉంటే ఇచ్చేది.. మేమే తెచ్చేది తామే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే జైత్రయాత్రలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో అన్నీతానై ముందుకెళ్తున్న జిల్లా మంత్రి డీకే అరుణ స్పీడుకు బ్రేకులు వేసేందుకు ఇటు కాంగ్రెస్‌లోని ఓ వర్గం.. అటు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు బ్రేకులు వేసే ప్రయత్నిస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కొంతమేర టీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మంత్రి అరుణ పాల్గొని ఆయా పార్టీలను విమర్శిస్తూనే కాంగ్రెస్ విజయాలను చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టార్గెట్ జూపల్లి! మొదటి నుంచీ రాజకీయ శత్రువుగా ఉన్న ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావును రాజకీయంగా ఎదుర్కొని భవిష్యత్తులో దెబ్బతీయాలనే ఉద్దేశంతో మంత్రి డీకే అరుణ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇటీవల మంత్రి బస్సుయాత్ర నిర్వహించిన సమయంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటూనే ఓ దశలో రాళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అందులోనూ ఆ పార్టీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావును లక్ష్యంగా చేసుకుని కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపడేందుకు వీలుగా ఆ పార్టీ నాయకులను మంత్రి ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే జూపల్లి స్పీడును తగ్గించేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని వేదిక గా ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలంలో గత గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణ క్రెడిట్ మాదంటే..మాదే అంటూ మంత్రి అరుణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు ఒకరిపై మరొకరు వాదనలకు దిగిన విషయం తెలిసిందే. దీనికితోడు ఎమ్మెల్యేను అన్నివిధాలుగా ఎదుర్కొనేందుకు అవసరమైన స్పీడును పెంచేందుకు కాంగ్రెస్ కొల్లాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి విష్ణువర్థన్‌రెడ్డికి మంత్రి అరుణ అంతర్గతంగా మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీపనగండ్ల మండలంలో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అధికారులు ఆహ్వానించకపోయినా విష్ణువర్ధన్‌రెడ్డి వేదికపైకి ఎక్కడాన్ని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తప్పుపట్టడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదంలో ప్రత్యేకాధికారి గోపాల్‌పై కూడా చేయి చేసుకున్నారు. టార్గెట్ మంత్రి అరుణ! ఇక బీజేపీ నుంచి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి మాత్రం మంత్రి డీకే అరుణను టార్గెట్ చేసి మాట్లాడుతూ.. ఆయన కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారు. అయితే జిల్లా అంతటా పార్టీ బలపడేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి అరుణ ప్రాతినిథ్యం వహిస్తున్న గద్వాలలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు లోలోపల అన్ని రాజకీయపార్టీల ముఖ్య నాయకులతో నాగం జనార్దన్‌రెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా కాంగ్రెస్‌లో మంత్రి అరుణకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో మరోవర్గాన్ని తయారుచేస్తున్నారు. వీటికి మరింతబలం చేకూర్చేవిధంగా గద్వాలలో మంత్రి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ జైత్యయాత్ర సభకు ఎస్.జైపాల్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి హాజరుకాలేదు. ఏదేమైనా తెలంగాణ పేరుతో పట్టుకోసం రాజకీయనేతలు తంటాలు పడుతున్నారు.