సోమ్ డిస్టిలరీస్ నుంచి బీర్ల సరఫరా ఆఫర్‌కు స్పందించింది బీసీఎల్ ఎండీనే
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాలకు సంబంధించి తాను ఎలాంటి అను మతులు ఇవ్వలేదని, తన వద్దకు ఎలాంటి దర ఖాస్తులు రాలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గతంలో చెప్పిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని, అనుమతులు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ తీసుకున్న నిర్ణయమేనని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త మద్యం బ్రాండ్లను ఎక్సైజ్ శాఖ అనుమతించిందని జరుగుతున్న ప్రచారం తప్పని, రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే జరుగుతాయని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను రూఢీ చేసుకోకుండా పత్రికలు తప్పుగా ప్రచురించాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్) లావాదేవీలన్నీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని తెలిపారు.
దీనికి టీజీబీసీఎల్ ఎండీ/ఎక్సైజ్ కమిషనర్ నేతృత్వం వహిస్తారన్నారు. రాష్ట్రంలో గత ఆరువారాలుగా వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఉందని, బీర్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి బీసీఎల్ ఎండీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోమ్ డిస్టిలరీస్ రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే ఆఫర్‌పై ప్రతిస్పందించారని తెలిపారు. కొత్తగా ఐదు సంస్థలకు బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment