కోడేరు: పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తామని భారీ పరి శ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్, కొ ల్లాపూర్ నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉ పాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన గురువారం కొల్లాపూర్ నియోజకవర్గంలో మొదటిసారిగా కోడేరులో ఆ సరా పింఛన్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. నియోజకవర్గ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.500 కో ట్లు మంజూరు చేసిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రై తులు, ప్రజలకు తెలంగాణ ప్రభుత్వ హయాంలో మంచిరోజులు ఉ న్నాయని, అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. వచ్చే మూడేళ్లలో నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు.
ప్రతి ఇంటికీ వాటర్‌గ్రిడ్ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. మండలంలోని ఎత్తం గట్టు నుంచి వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాకు తాగునీరు అందిస్తామని తెలిపారు. తన హయాంలో కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్‌కు డబుల్‌రోడ్డు నిర్మాణం చేపట్టడమేకాక కోడేరు, పెద్దకొత్తపల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కొల్లాపూర్‌లో పీజీ కళాశాల ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. వచ్చే రెండేళ్లలో కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఆంగ్ల బోధనలు చెప్పేందుకు రెసిడెన్షియల్ పా ఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి మళ్లీ మంత్రి పదవి రావడం హర్షణీయమన్నారు. వారంరోజుల్లో మండలంలోని ప్రతి చెరువు, కుంటల్లో పూ డిక తీసే కార్యక్రమం చేపడతామని, అందుకు రైతులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు.
మంత్రికి ఘనసన్మానం
మంత్రి పదవి చేపట్టి మొట్టమొదటిసారిగా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి కోడేరుకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో ఎంపీపీ రాంమోహన్‌రావు, నాగర్‌కర్నూల్ ఆర్డీఓ వీరారెడ్డి, ఎంపీడీఓ రాములు, తహశీల్దార్ కృష్ణయ్య, డీలర్లసంఘం అధ్యక్షుడు శ్రీనివాసులుశెట్టి, నదీమ్, శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్ కరీఫ్, సర్పంచ్ కవిత, ఎంపీటీసీ శ్రీను, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. డీఎస్పీ చెన్నయ్య ఆధ్వర్యంలో కొల్లాపూర్ సీఐ రాఘవరావు, కోడేరు ఎస్‌ఐ వెంకటరమణ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పాలమూరు ప్రాజెక్టులకు పెద్దపీట
Published Fri, Dec 19 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement
Advertisement