district project
-
పాలమూరు ప్రాజెక్టులకు పెద్దపీట
కోడేరు: పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తామని భారీ పరి శ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్, కొ ల్లాపూర్ నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉ పాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన గురువారం కొల్లాపూర్ నియోజకవర్గంలో మొదటిసారిగా కోడేరులో ఆ సరా పింఛన్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. నియోజకవర్గ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.500 కో ట్లు మంజూరు చేసిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రై తులు, ప్రజలకు తెలంగాణ ప్రభుత్వ హయాంలో మంచిరోజులు ఉ న్నాయని, అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. వచ్చే మూడేళ్లలో నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. ప్రతి ఇంటికీ వాటర్‌గ్రిడ్ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. మండలంలోని ఎత్తం గట్టు నుంచి వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాకు తాగునీరు అందిస్తామని తెలిపారు. తన హయాంలో కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్‌కు డబుల్‌రోడ్డు నిర్మాణం చేపట్టడమేకాక కోడేరు, పెద్దకొత్తపల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కొల్లాపూర్‌లో పీజీ కళాశాల ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. వచ్చే రెండేళ్లలో కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఆంగ్ల బోధనలు చెప్పేందుకు రెసిడెన్షియల్ పా ఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి మళ్లీ మంత్రి పదవి రావడం హర్షణీయమన్నారు. వారంరోజుల్లో మండలంలోని ప్రతి చెరువు, కుంటల్లో పూ డిక తీసే కార్యక్రమం చేపడతామని, అందుకు రైతులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. మంత్రికి ఘనసన్మానం మంత్రి పదవి చేపట్టి మొట్టమొదటిసారిగా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి కోడేరుకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో ఎంపీపీ రాంమోహన్‌రావు, నాగర్‌కర్నూల్ ఆర్డీఓ వీరారెడ్డి, ఎంపీడీఓ రాములు, తహశీల్దార్ కృష్ణయ్య, డీలర్లసంఘం అధ్యక్షుడు శ్రీనివాసులుశెట్టి, నదీమ్, శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్ కరీఫ్, సర్పంచ్ కవిత, ఎంపీటీసీ శ్రీను, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. డీఎస్పీ చెన్నయ్య ఆధ్వర్యంలో కొల్లాపూర్ సీఐ రాఘవరావు, కోడేరు ఎస్ఐ వెంకటరమణ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పాలమూరు తర్వాతే ‘పాకాల’
మాజీమంత్రి డీకే అరుణ మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: పాలమూరు జిల్లాలోనిప్రతి ఎకరాకు నీరందిన తర్వా తే ఇతర ప్రతిపాదనలు తేవాలని మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. పాల మూరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పీయూలో జూరాల- పాకాల ప్రాజెక్టుతో జిల్లా ప్రాజెక్టుల భవితవ్యంపై మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డీ.కె.అరు ణ మాట్లాడుతూ ఉత్తర, దక్షిణ తెలంగాణల మధ్య కేసిఆర్ చిచ్చుపెడుతూ, అభివృద్ధ్ది విషయంలో ప్రజలను అపోహలకు గురి చేస్తున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజ లను మోసం చేస్తున్నారని ఆరోపిం చారు. జిల్లాలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయూలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రాజెక్టులనే మరోసారి చిన్న చిన్న కాల్వల పేరుతో ప్రణాళికలు రూపొంది స్తున్నట్లు పథకాలు రూపొందించి వాటి నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో సీ మాంధ్ర ముఖ్యమంత్రులు దోచుకున్నారని, ఇప్పుడు కేసిఆర్ ఆదే బాటలో వెళుతున్నారన్నారు. ప్రాజెక్టుల ద్వారా నీరిం చేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. బీ జేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నా గూరావు నామాజీ మాట్లాడుతూ బంగా రు తెలంగాణను చేస్తామని ప్రజలను నమ్మించి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారని, పెన్షన్లు, భూ పంపిణీ, తాగు, సాగునీటి విషయంలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎబీవీపి జిల్లా కన్వీనర్ అయ్యప్ప మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీకి రూ.8 కోట్లు కేటాయిం చడం దారుణమనని, జిల్లాలో విద్యాభివృద్దికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేవారు.ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సిములు, అబ్రహం, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వా ల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్, ఎబీవీపి పూర్వ అధ్యక్షుడు కరేంద్రనాథ్, ఎబీవీపి నాయకులు తిరుపతి, పరుశురాం తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణ.. కృష్ణా!
కృష్ణమ్మ బిరబిరా పరుగులు ఆగిపోనున్నాయి.. ఏరువాక వచ్చిందంటే ఆ జీవనది గలగల సవ్వడులు వినిపించేవి. కానీ ఆగస్టు తరువాతే గాని వరదనీరు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాల్లో ఎగువరాష్ట్రాలకు నీటివాటా కల్పించడం పాలమూరు ప్రాజెక్టులకు నీటిరాక కష్టమే..! ఇప్పటికే కృష్ణానదికి ఆలస్యంగా వరదలు వస్తున్నాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంపు వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాగా, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు పూర్తయ్యే నాటికే ప్రాజెక్టులను నిర్మించకపోవడం, ప్రభుత్వాల ముందుచూపు లేకపోవడం, మిగులు జలాలపై సరైన వాదనలు వినిపించడం వెరసి..జిల్లా ప్రాజెక్టులకు శాపంగా మారింది. బ్రిబ్యునల్ తీర్పు అమలైతే మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన నెట్టెంపాడు, ఎంజీఎల్‌ఐ, ఎస్ఎల్బీసీ, బీమా, డిండి, అమ్రాబాద్, కోయిల్‌సాగర్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిగండం ఏర్పడనుంది. ఇదే జరిగితే పాలమూరు ఎడారిగా మారడం ఖాయం..