- మాజీమంత్రి డీకే అరుణ
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: పాలమూరు జిల్లాలోనిప్రతి ఎకరాకు నీరందిన తర్వా తే ఇతర ప్రతిపాదనలు తేవాలని మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. పాల మూరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పీయూలో జూరాల- పాకాల ప్రాజెక్టుతో జిల్లా ప్రాజెక్టుల భవితవ్యంపై మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డీ.కె.అరు ణ మాట్లాడుతూ ఉత్తర, దక్షిణ తెలంగాణల మధ్య కేసిఆర్ చిచ్చుపెడుతూ, అభివృద్ధ్ది విషయంలో ప్రజలను అపోహలకు గురి చేస్తున్నారన్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజ లను మోసం చేస్తున్నారని ఆరోపిం చారు. జిల్లాలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయూలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రాజెక్టులనే మరోసారి చిన్న చిన్న కాల్వల పేరుతో ప్రణాళికలు రూపొంది స్తున్నట్లు పథకాలు రూపొందించి వాటి నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గతంలో సీ మాంధ్ర ముఖ్యమంత్రులు దోచుకున్నారని, ఇప్పుడు కేసిఆర్ ఆదే బాటలో వెళుతున్నారన్నారు. ప్రాజెక్టుల ద్వారా నీరిం చేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. బీ జేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నా గూరావు నామాజీ మాట్లాడుతూ బంగా రు తెలంగాణను చేస్తామని ప్రజలను నమ్మించి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారని, పెన్షన్లు, భూ పంపిణీ, తాగు, సాగునీటి విషయంలో మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఎబీవీపి జిల్లా కన్వీనర్ అయ్యప్ప మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీకి రూ.8 కోట్లు కేటాయిం చడం దారుణమనని, జిల్లాలో విద్యాభివృద్దికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేవారు.ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సిములు, అబ్రహం, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వా ల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్, ఎబీవీపి పూర్వ అధ్యక్షుడు కరేంద్రనాథ్, ఎబీవీపి నాయకులు తిరుపతి, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.