సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.
కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.
డీకే అరుణ, రాజాసింగ్‌కు కౌంటర్..
డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్‌కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment