raja singh
-
ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ.. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధమవ్వాలి. 4 జతల డ్రెస్‌లు, టవల్, బ్లాంకెట్, హ్యాండ్ కర్చీఫ్. సోప్, అవకాయ, స్వెటర్ దగ్గర పెట్టుకోవాలి. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు (కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్ (జైలులో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండి.. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటూ కేటీఆర్‌కు రాజా సింగ్ చురకలు అంటించారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. Karma doesn’t forgetI have been thrown in jail by both the Congress and BRS/TRS governments after they filed false cases against me. I know exactly how the game works.So, @KTRBRS ji, here’s a little checklist to pack before heading to jail:👉Four sets of clothes – fashion…— Raja Singh (@TigerRajaSingh) January 16, 2025 -
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.డీకే అరుణ, రాజాసింగ్‌కు కౌంటర్..డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్‌కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు
-
లక్ష్మీబాంబులు కొనొద్దు.. కాల్చొద్దు: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ వేళ.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాకులపై హిందూ దేవతల బొమ్మలు ఉంచడం పెద్ద కుట్ర అని, అలాంటి వాటిని బహిష్కరించాలని ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘హిందూ దేవతల బొమ్మలు ఉంటే పటాకులు కాల్చొద్దు. లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కొనద్దు. ఇది హిందువుల దేవుళ్లను హిందువుల చేతే కాల్చివేసే కుట్ర’’ అంటూ దీపావళి ఆయన సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. అలాగే..ఈ దీపావళి నుంచి ఒక సంకల్పం తీసుకోవాలని, మన దేవుడి బొమ్మలు ఉన్న పటాకులు మనం కాల్చకుండా ఉంటే.. వచ్చే సంవత్సరం అలాంటి పటాకులు ఎవరూ అమ్మకుండా ఉంటారని, దయచేసి అందరూ ఇది పాటించాలని విజ్ఞప్తి చేశారు. పండుగ రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తామని, పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి పటాకులు కాల్పించాలని సూచించారు.ఇదీ చదవండి: వేణు స్వామి జోస్యం.. చర్యలకు హైకోర్టు ఆదేశం -
HYD: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. హౌజ్అరెస్ట్పై రాజాసింగ్ స్పందించారు.‘అందరూ గుడికి వెళ్తున్నారు.నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు.నన్ను ఇవాళ హౌజ్ అరెస్టు చేసినా రేపైనా గుడికి వెళ్తాను. హిందువులకు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిందువుల గుళ్ల మీదనే దాడులు జరుగుతున్నాయి. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు అతడి మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు.ఇది సరికాదు. ఈ ఘటనలో మిగిలిన నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలి.కఠిన చర్యలు తీసుకోవాలి’అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: టెన్షన్..టెన్షన్ -
జానీ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లవ్ జిహాదీకి పాల్పడిన కొరియోగ్రాఫర్ జానీ బాషాను కఠినంగా శిక్షించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అలాగే, జానీ బాషా ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చాడో బయటపెట్టించాలని పోలీసులకు సూచించారు.లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాజాగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జానీ బాషా అరెస్ట్ ఎందుకు ఆలస్యమవుతోంది?. జానీని త్వరగా అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అతడు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి చేశాడో బయటపెట్టించాలి. ఒక దొంగకి, ఒక రౌడీకి, ఒక హంతకుడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అదే విధంగా అతడికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ బాషాను కఠినంగా శిక్షించాలి. బాలీవుడ్చిత్ర పరిశ్రమకు జానీ బాషా మచ్చ తెచ్చాడు. ఇలాంటి వారి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన ప్యానల్ సీరియస్‌గా వ్యవహరించాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వారు మళ్లీ అడుగుపెట్టకుండా ప్యానల్ కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాట తీయండి - బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్#Janasena #JaniMaster x #RajaSingh #UANow #STopRape pic.twitter.com/dVpZHyaKzN— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 19, 2024Video Credit: ఉత్తరాంధ్ర నౌ!ఇదిలా ఉండగా.. కొరియోగ్రాఫర్ జానీ బాషాను హైదరాబాద్ ఎస్వోటీ పోలీసులు కాసేపటి క్రితమే గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం, అతడిని గోవా కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్ కింద.. పోలీసులు జానీని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరుచనున్నారు. ఇక, అంతకుముందు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ బాషాపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు! -
ఇదేం పద్దతి.. కేటీఆర్‌పై రాజాసింగ్ సెటైరికల్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పని పాట లేక కేంద్రంలో కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేటీఆర్ ఆందోళనలో ఉన్నారు. అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని ప్రజలకు ఒక సూచన చేశారు. దాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పనేమీ లేకపోవడంతో కేంద్రంపై కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేయాలని ట్వీట్ చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మంచి ఫైట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా కేటీఆర్ కూడా పోరాడాలి. కానీ, ఎక్కడో ఉంది ఇలా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా మధ్యలో వచ్చి మంచి పనులపై ఇలాంటి కామెంట్స్ చేస్తే జనాలు మిమ్మల్ని పిచ్చి వాళ్లు అనుకుంటారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు -
ఒవైసీ కాలేజీ కూలిస్తే రేవంత్ హీరో..లేదంటే: రాజాసింగ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(సెప్టెంబర్8) ఈ విషయమై రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఒవైసీ కాలేజీ ఎప్పుడు కూలుస్తున్నారో సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఒవైసీ కాలేజీ కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనన్నారు. ఒకవేళ కూలిస్తే రేవంత్ హీరో అవుతారన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చివేతపై జాప్యం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.ఇదీ చదవండి.. హైడ్రా కూల్చివేతలు.. మాదాపూర్‌లో ఉద్రిక్తత -
లంచాలకు మరిగారు.. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు మృతిచెందడం బాధాకరం. అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం. తాన్యా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.హైదరాబాద్‌లోనూ అక్రమ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. నా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు నేను చూపిస్తా. కొత్తగా డైనమిక్ లేడీ కమిషనర్ వచ్చారు. కొంచెం టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. తెలంగాణలోను ఢిల్లీ లాంటి ప్రమాదాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలి’’ అని రాజాసింగ్ సూచించారు.కాగా, సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే.. మృతి చెందినవారిని తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన తాన్యా సోని స్వస్థలం బీహార్ కాగా ఆమె తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్‌గా పని చేస్తున్నారు. -
రాష్ట్ర బీజేపీలో ‘అధ్యక్ష’ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరగొచ్చుననే అంచనాల మధ్య అది తీవ్ర రూపం దాలి్చంది. ప్రధానంగా కొంతకాలం క్రితం కొత్తగా పార్టీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే ఇతర పదవుల్లో ఉన్న వారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారి మధ్య తీవ్రపోటీ నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై పూర్తి అంకితభావంతో ఉన్న పాత నాయకులకే ఈ పదవి దక్కాలంటూ బీజేపీలో ఓ వర్గం నాయకులు గట్టిగా ప్రయతి్నస్తున్నారు. అయితే పార్టీ విస్తరించాలంటే కొత్తవారు చేరడం ముఖ్యమని, కొత్త, పాత తేడాలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకిగా మారకూడదని మరికొందరు వాదిస్తున్నారు. రాజాసింగ్ వర్సెస్ ఈటల దాదాపు రెండేళ్ల క్రితం పార్టీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి దాదాపు 4 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్ పేరు పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా పార్టీలోని ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవిని కోరుకున్న ఈటలకు.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్‌షా చెప్పినట్టు సమాచారం.మరోవైపు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తనను తప్పించాలని కోరడంతో.. త్వరలోనే అంటే వారం, పది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే (అగ్రెసివ్) నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం పార్టీలో సంచలనం సృష్టించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఈటల ఘాటుగా స్పందించారు. గల్లీల్లో ఉన్నవారు కాదు కావాల్సింది‘ఫైటర్‌కు పదవిని ఇవ్వాలంటూ కొందరు మాట్లాడుతున్నారు.. ఎవరికి ఇవ్వాలి.. స్ట్రీట్ఫైటర్కు ఇవ్వాలా..’అంటూ నేతల పేరును ప్రస్తావించకుండా ఈటల వ్యాఖ్యానించారు. సందర్భం వచ్చినపుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్న వాడు కావాలని, గల్లీల్లో ఉన్న వారు కాదని రాజ్యాన్ని, అధికారంలో ఉన్న వారిని నిగ్గదీసి నిలదీయగలిగే వాడే ఫైటర్ అవుతాడని అన్నారు. తన లాంటి వారు ఊరికే మాట్లాడరని సందర్భం వచ్చినపుడు జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వారిమని ఓ సమావేశంలో పాల్నొన్న సందర్భంగా ఈటల వ్యాఖ్యానించారు. కొత్త, పాత నాయకులు అనే తేడాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని బీజేపీ ముందుకు వెళుతుందన్నారు. ఒక పార్టీ కొత్తగా ఎదిగి, అధికారంలోకి రావాలంటే కొత్త శక్తి, కొత్త నీరు జతకావాల్సిందేనన్నారు. కొత్త, పాత ఏమీ లేదన్న రఘునందన్ తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్‌రావు వద్ద ఓ విలేకరి ఈ విషయాలు ప్రస్తావించగా.. ‘కొత్తగా వచి్చన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదు. అలా అయితే హిమంత బిశ్వ శర్మ అసోం సీఎం అయ్యేవారు కాదు. ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరి కండువా కప్పుకున్న రోజునుంచే ఆ పార్టీ నాయకుడిగా సదరు వ్యక్తి చెలామణి అవుతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు.. రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు’అంటూ స్పందించడం గమనార్హం. పోటీలో పలువురు నేతలుమల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, జి.మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తమ వంతు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి నాటికి బీజేపీ రాష్ట్ర కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బీజేపీలో ఏం జరుగుతోంది.. ఈటల Vs రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అదే పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.కాగా, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ స్పందిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవిని అగ్రెసివ్‌గా ఉండే వ్యక్తికి కేటాయించాలని.. అలాంటి వ్యక్తే పార్టీ చీఫ్‌గా ఉండాలన్నారు. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలకు ఈటల కౌంటరిచ్చారు. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు.అలాగే, తాను ఇప్పటికే ఐదుగురు ముఖ్యమంత్రులతో కోట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. సందర్భంగా వస్తే జేజమ్మతో కొట్లాడేటోల్లం అని అన్నారు. ఇంతకన్నా దమ్మున్న వాళ్లు ఎవరు ఉంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ బీజేపీలో ఈటల వర్సెస్ రాజాసింగ్
-
రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్
అబిడ్స్(హైదరాబాద్): గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం ఉదయం 9:19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన ఫోన్‌కు గుర్తు తెలియనివ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉన్నారని రాజాసింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు.కొన్నిసార్లు వాయిస్ మెసేజ్ కూడా చేసి బెదిరిస్తున్నారన్నారు. వచ్చిన కాల్స్‌లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించిందని రాజాసింగ్ వెల్లడించారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తనను ఇంకో నంబరు ఉందా? అని అడిగాడని, దానికి సమాధానంగా గూగుల్‌లో అన్వేషించి సీఎం రేవంత్‌రెడ్డి నంబర్‌ను ఇచ్చానని తన వీడియోలో పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలాసార్లు వచ్చాయని, పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారని ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నందున సీఎం రేవంత్‌రెడ్డి నంబర్‌ను ఇచ్చానని, ఒకవేళ ఆ వ్యక్తులు ఆ నంబరకు బెదిరింపు కాల్స్ చేస్తే ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపిస్తారేమో అనే భావంతోనే సీఎం నంబర్ ఇచ్చానంటూ రాజాసింగ్ వెల్లడించారు. -
రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదేపదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. పలు నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు.తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్‌ను రాజాసింగ్ తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.మరోవైపు, బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాని తెలిపారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ ముందుకు సాగుతుందా? లేదా?’’ అంటూ ప్రశ్నించారు.ఇవాళ నాకు కంటిన్యూయస్‌గా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ సాగుతుందా? లేదా? అనేది చూద్దాం.. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. Once again, I'm receiving death threats from multiple numbers today. This isn't the first time I've been targeted with such threats. Despite previous complaints, it seems no action will be taken.Nonetheless, as a responsible citizen, I feel obligated to inform the police… pic.twitter.com/exIFElcrUx— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) May 29, 2024 -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్‌లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్‌రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్‌రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్‌ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇది మంచిది కాదని తెలిపారు. బాధితులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు. కాగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
రాజాసింగ్ అలక!.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే అలకబూనినట్లు ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరుకాని రాజాసింగ్.. నేడు భువనగిరి సభకు కూడా రాలేదు. బీజేఎల్పీ టీంలోనూ రాజాసింగ్‌కు అవకాశం దక్కలేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు సమాచారం. దీంతో పార్టీకి, రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కాగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటూ ఇటీవల రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: ‘బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’ -
బీజేఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్లోనే కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. ► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్‌రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ► ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. -
నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!
కొత్త ఏడాదిలో నయనతార కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్నపూరణి చిత్రం పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. తాజాగా ఈ చిత్రంపై తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జీ స్టూడియోస్‌పై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిషాకు విజ్ఞప్తి చేశారు. అన్నపూరణి సినిమాపై ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మాట్లాడుతూ..'జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నా. కానీ క్షమాపణలు చెప్పినా ఇలాంటివీ రిపిట్ అవుతూనే ఉంటాయి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు చేయడం మనం చాలాసార్లు చూశాం. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధించాలని.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నా' అని వీడియోలో కోరారు. కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం అన్నపూరణిపై ఇప్పటికే మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్‌లోనూ ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి పూర్తిగా తొలగించింది. ఈ సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతియడమే కాకుండా.. లవ్ జీహాద్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. స్పందించిన మేకర్స్ అన్నపూరణి వివాదం తర్వాత జీ స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరకర సన్నివేశంలో అవసరమైన మార్పులు చేసేవరకు సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసివేస్తామని హామీ ఇచ్చారు. మాకు ఎవరీ మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం లేదని తెలిపింది. ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నాం అంటూ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూరణిలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Hyderabad, Telangana: On 'Annapoorani' movie, BJP leader T Raja Singh says, "I have heard that Zee Studios has apologized but an apology will do nothing. We have seen many times that such films are being made to hurt the sentiments of Hindus...I appeal to Union Home… pic.twitter.com/pOMDyA7EY6 — ANI (@ANI) January 12, 2024 -
ప్రజాపాలన దరఖాస్తు.. ఏర్పాట్లపై రాజాసింగ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన పేరుతో ఆరుగ్యారంటీలకు దరఖాస్తులను నేటి నుంచి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల కోసం ప్రజలు కొన్ని చోట్ల బారులు తీరుతున్నారు. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గోషామహల్, మంగళ్‌హాట్ నియోజకవర్గంలో అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని రాజాసింగ్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్‌లో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు దాఖలు కోసం మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఇది కూడా చదవండి: పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు: భట్టి -
బీజేపీలో కొత్త చర్చ.. రాజాసింగ్‌కే మద్దతు?
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు?. గత సభలో ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాజాసింగ్‌నే కంటిన్యూ చేస్తారా?. లేక కొత్తగా ఎన్నికైనవారిలో ఎవరికైనా అప్పగిస్తారా?. తాజాగా అసెంబ్లీకి ఎన్నికైన ఎనిమిది మంది కమలం పార్టీ ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ రాజాసింగ్ మాత్రమే. అందుకే ఇప్పుడీ విషయంపై బీజేపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అసలు బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది?.. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరరెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే, ఏలేటి కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్మేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో ముగ్గురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు, సీనియర్లు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు వంటివారంతా ఓడిపోయారు. అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్నవారు ఇద్దరే ఉండటంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. గత అసెంబ్లీలో రాజాసింగ్ ఒక్కరే గెలవడంతో ఆయనే సభాపక్ష నేతగా కొనసాగారు. తర్వాత ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్‌గా రాజాసింగ్‌నే కొనసాగించారు. రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి ఇవ్వలేదు. ఇప్పుడు మూడోసారి గెలిచిన రాజాసింగ్‌నే మరోసారి పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కమలం పార్టీ నాయకత్వం కొనసాగిస్తుందా? లేక మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తుందా అనే టాక్ నడుస్తోంది. రాజాసింగ్ ఇలా.. రాజాసింగ్ తన నియోజకవర్గమైన గోషామహల్‌కే పరిమితం అవుతున్నారు. పైగా ఆయనకు తెలుగు భాషపై కూడా పట్టు లేదు. రాష్ట్ర సమస్యల మీదా అవగాహన లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, మూడోసారి గెలిచారు గనుక ఆయనకే ఫ్లోర్ లీడర్ బాధ్యత అప్పగించాలని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్‌గా నియమించే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మహేశ్వరరెడ్డికి ఉంది. రాష్ట్రంలోని సమస్యల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వవచ్చని అనుకుంటున్నారు. కాటిపల్లికి ఛాన్స్.. కానీ, కామారెడ్డిలో అనూహ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని రాష్ట్రమంతా తిప్పాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కాటిపల్లిని ఫ్లోర్ లీడర్ చేయాలని సూచిస్తున్నారు. కాటిపల్లి సమస్యలపై మాట్లాడగలరని, ఆయనలో పోరాటం చేసే తత్వం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కొత్త, ఎక్కువగా తన నియోజకవర్గానికి పరిమితమైనటువంటి వ్యక్తి కావడంతో పార్టీ హై కమాండ్ ఏ మేరకు ఆయన వైపు మొగ్గు చూపుతుందనేది సందేహమే అంటున్నారు మరికొందరు నేతలు. ఏదేమైనా అసెంబ్లీలో బీజేపీ నేత ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
నేను ప్రమాణ స్వీకారం చెయ్యను.. ఎమ్మెల్యే రాజాసింగ్
-
అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్‌గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు.