సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ డీజీపీకి ఆదివారం ట్వీట్ చేశారు. పాస్ పోర్ట్ కోసం మే 25నదరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు వెరిఫికేషన్ ప్రక్రియ ఎందుకు చేయలేదని డీజీపీ అంజనీ కుమార్ యాదవ్‌ను ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా పాస్‌పోర్టు వెరిఫికేషన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎందుకు ఆలస్యమవుతోందని నిలదీశారు.
ఓ ప్రజా ప్రతినిధిగా తనకే ఇంత ఆలస్యం జరిగితే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే రాజాసింగ్ ట్వీట్‌పై డీజీపీ స్పందిస్తారో లేదో చూడాలి.
కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎమ్మెల్యేను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి దాదాపు పది నెలలైంది. అయితే ఎమ్మెల్యేపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బండి సంజయ్ , విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి బీజేపీ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు.
Applied for my #Passport on May 25 & still no @CPHydCity verification done
— Raja Singh (@TigerRajaSingh) July 30, 2023
As a Public representative, I am experiencing this delay & I am concerned about the potential impact on ordinary citizens
Why is @TelanganaDGP not processing the verifications?@MEAIndia @passportsevamea pic.twitter.com/gC1eaE5UwL
Comments
Please login to add a commentAdd a comment