సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారు మోసపోకుండా చర్య లు చేపడుతున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపా రు. రాష్ట్రంలో గుర్తింపులేని విదేశీ నియామక సంస్థలు, అక్రమ నియామక సంస్థలు, టూరిస్ట్ ఏజెన్సీలపై గట్టి నిఘా ఉంచామన్నారు. ‘విదేశాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగుల భద్రత, క్రమబద్దీకరణ– పోలీస్ శాఖ చేపట్టాల్సిన చర్యలు’ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో శుక్రవా రం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
డీజీపీ అంజనీకుమార్ మాట్లాడు తూ విదేశీ వలసలలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని, ప్రధానంగా నర్సింగ్, పారామెడికల్ రంగాల్లో సుశిక్షితులైనవారిని మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాలకు పంపించడంలో ముందంజలో ఉందన్నారు. గల్ఫ్‌దేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల మోసాల కు గురవుతున్నారన్నారు. ప్రధానంగా కువైట్, ఖ తార్, బెహ్రెయిన్, సౌదీ అరేబియా, మలేసియా, దుబాయ్‌లకు వెళ్లే బలహీనవర్గాలు, నిరక్షరాస్యులు ఎక్కువగా మోసాలకు గురవుతున్నారన్నారు.
గతేడాది 3.70 లక్షల మంది వలస
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఔసఫ్ సయీద్ మాట్లాడుతూ అక్రమంగా విదే శాలకు పంపే ఏజెన్సీలపై కఠినచర్యలు చేపట్టేందుకు 1983 ఇమిగ్రేషన్ చట్టం స్థానంలో సరికొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. గతేడాది లో భారత్ నుంచి 3.70 లక్షలమంది కా ర్మి కులు వివిధ దేశాలకు వలసవెళ్లారన్నారు. పాస్‌పోర్ట్ వెరి ఫికేషన్ అత్యంత వేగంగా చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
సీఎస్‌తోనూ సమావేశం
సురక్షిత, చట్టబద్ధ వలసలను ప్రోత్సహించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో చేస్తున్న సంప్రదింపులలో భాగంగా డాక్టర్ ఔసఫ్ సయీద్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని బీఆర్కేఆర్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో కా ర్మి క శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాణి కుముదిని, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment