Passport Verification
-
డీజీపీకి రాజాసింగ్ ట్వీట్.. నా పరిస్థితే ఇలా ఉంటే.. వారి సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ డీజీపీకి ఆదివారం ట్వీట్ చేశారు. పాస్ పోర్ట్ కోసం మే 25నదరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు వెరిఫికేషన్ ప్రక్రియ ఎందుకు చేయలేదని డీజీపీ అంజనీ కుమార్ యాదవ్‌ను ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా పాస్‌పోర్టు వెరిఫికేషన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎందుకు ఆలస్యమవుతోందని నిలదీశారు. ఓ ప్రజా ప్రతినిధిగా తనకే ఇంత ఆలస్యం జరిగితే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే రాజాసింగ్ ట్వీట్‌పై డీజీపీ స్పందిస్తారో లేదో చూడాలి. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎమ్మెల్యేను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి దాదాపు పది నెలలైంది. అయితే ఎమ్మెల్యేపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బండి సంజయ్ , విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి బీజేపీ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. Applied for my #Passport on May 25 & still no @CPHydCity verification done As a Public representative, I am experiencing this delay & I am concerned about the potential impact on ordinary citizens Why is @TelanganaDGP not processing the verifications?@MEAIndia @passportsevamea pic.twitter.com/gC1eaE5UwL — Raja Singh (@TigerRajaSingh) July 30, 2023 -
అక్రమ వలసలపై పోలీసుల ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారు మోసపోకుండా చర్య లు చేపడుతున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపా రు. రాష్ట్రంలో గుర్తింపులేని విదేశీ నియామక సంస్థలు, అక్రమ నియామక సంస్థలు, టూరిస్ట్ ఏజెన్సీలపై గట్టి నిఘా ఉంచామన్నారు. ‘విదేశాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగుల భద్రత, క్రమబద్దీకరణ– పోలీస్ శాఖ చేపట్టాల్సిన చర్యలు’ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో శుక్రవా రం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడు తూ విదేశీ వలసలలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని, ప్రధానంగా నర్సింగ్, పారామెడికల్ రంగాల్లో సుశిక్షితులైనవారిని మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాలకు పంపించడంలో ముందంజలో ఉందన్నారు. గల్ఫ్‌దేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల మోసాల కు గురవుతున్నారన్నారు. ప్రధానంగా కువైట్, ఖ తార్, బెహ్రెయిన్, సౌదీ అరేబియా, మలేసియా, దుబాయ్‌లకు వెళ్లే బలహీనవర్గాలు, నిరక్షరాస్యులు ఎక్కువగా మోసాలకు గురవుతున్నారన్నారు. గతేడాది 3.70 లక్షల మంది వలస భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఔసఫ్ సయీద్ మాట్లాడుతూ అక్రమంగా విదే శాలకు పంపే ఏజెన్సీలపై కఠినచర్యలు చేపట్టేందుకు 1983 ఇమిగ్రేషన్ చట్టం స్థానంలో సరికొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. గతేడాది లో భారత్ నుంచి 3.70 లక్షలమంది కా ర్మి కులు వివిధ దేశాలకు వలసవెళ్లారన్నారు. పాస్‌పోర్ట్ వెరి ఫికేషన్ అత్యంత వేగంగా చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సీఎస్‌తోనూ సమావేశం సురక్షిత, చట్టబద్ధ వలసలను ప్రోత్సహించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో చేస్తున్న సంప్రదింపులలో భాగంగా డాక్టర్ ఔసఫ్ సయీద్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని బీఆర్కేఆర్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో కా ర్మి క శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాణి కుముదిని, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
మళ్లీ మొదటికొచ్చిన పీసీసీ సమస్య.. స్లాట్ బుకింగ్‌కే 3 వారాలు
మోర్తాడ్: విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)లను తక్షణమే జారీ చేయడానికి హైదరాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మూడు రోజుల ముచ్చటగానే మిగిలాయి. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతుండడంతో విచారణ, పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో వారం వ్యవధిలో పీసీసీలను జారీ చేసేవారు. కరోనా భయాలు తొలగిపోవడంతో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. కొత్త పాస్‌పోర్టులు, రెన్యువల్‌తోపాటు పీసీసీల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం పరిధిలోని ఐదు సెంటర్లలో రోజుకు ఐదు వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందులో ఎక్కువగా కొత్త పాస్‌పోర్టులకు సంబంధించినవే ఉంటున్నాయి. గతంలో రోజుకు 2 వేల స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇచ్చేవారు. ఈ సంఖ్యను ప్రస్తుతం ఐదు వేలకు పెంచారు. అయినా క్యూ తగ్గకపోవడంతో పీసీసీల కోసం గత నెలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినా ఆలస్యమవుతున్నాయి. పోస్టాఫీసులకు సేవలు విస్తరించినా.. గతంలో పీసీసీలు పూర్తిగా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారానే జారీ చేసేవారు. తర్వాత పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా హెడ్ పోస్టాఫీసుల ద్వారా కొత్త పాస్‌పోర్టులకు దరఖాస్తులు స్వీకరించారు. పీసీసీలను వేగంగా జారీ చేయడం కోసం ప్రధాన తపాలా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తులను అందించేందుకు సెప్టెంబర్ చివరివారంలో అవకాశం ఇచ్చారు. పోస్టాఫీసులకు సేవలను విస్తరించడం వల్ల పీసీసీల జారీ సులభతరం అవుతుందని భావించారు. అయితే ఈ కార్యాలయాల్లోనూ రద్దీ పెరిగింది. పీసీసీల స్లాట్ బుకింగ్‌కే మూడు వారాల సమయం పడుతోంది. పీసీసీల జారీకి నెల రోజులకంటే ఎక్కువ సమయం పడుతోంది. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించిన విచారణ త్వరగా పూర్తి అవుతుండగా పోస్టాఫీసుల్లో కోసం దరఖాస్తు చేసుకున్నవారి విచారణలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పీసీసీల జారీ కోసం విదేశాంగ శాఖ వేగవంతమైన శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. (క్లిక్: ముగిసిన జోసా కౌన్సెలింగ్.. ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ) -
వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్’
సాక్షి,సిటీబ్యూరో: పాస్‌పోర్ట్ వెరిఫికేషన్.. ఒకప్పుడు పెద్ద ప్రహసనం. కానీ కొన్నాళ్ల క్రితం ఈ ప్రక్రియను పోలీసు విభాగం సులభతరం చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలోనే పూర్తి చేస్తోంది. అయితే, ఏ ఒక్క నేరచరితుడికీ పాస్‌పోర్ట్ జారీ కాకూడదనే ఉద్దేశంతో అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ‘వెరీ ఫాస్ట్’లో ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్‌ను సైతం భాగం చేసింది. ఇది అమల్లోకి తెచ్చాక మహానగరంలో 40 మంది గత చరిత్ర బయటపడి వారికి పాస్‌పోర్టులు నిలిచిపోయాయి. ఈ విధానాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరం నుంచి ఏటా కొన్ని లక్షల మంది పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఇలా పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లే దరఖాస్తులు ప్రాథమిక పరిశీలన తర్వాత వెరిఫికేషన్ కోసం పోలీసు విభాగానికి చేరతాయి. స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు క్షేత్రస్థాయిలోనూ తనిఖీ చేస్తారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మరింత కఠినం వీరిచ్చే నివేదిక ఆధారంగా సదరు దరఖాస్తుదారుకు రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. ఒకప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం నెలరోజులు పట్టేది. కొన్నేళ్ల క్రితం ‘వెరీఫాస్ట్’ అనే విధానం ప్రవేశపెట్టిన పోలీసు విభాగం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ చేసింది. అభ్యర్థి పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసిన నాటి నుంచి గరిష్టంగా 72 గంటల్లో పోలీసు వెరిఫికేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నేరచరితుల రికార్డులను వెరీ ఫాస్ట్‌తో అనుసంధానించారు. ఫలితంగా నేరచరితుడై ఉండీ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ విషయం ఈ వెరిఫికేషన్‌లో బయటపడి, అప్లికేషన్ తిరస్కారానికి గురవుతోంది. దీనికి తోడు వరసగా నేరాలు చేసే నేరగాళ్లలో కొందరు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకూ కొత్త ఎత్తులు వేయడం ప్రారంభించారు. పోలీసులకు చిక్కినప్పుడు, పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తున్న సందర్భంలోనూ పేర్లను మార్చి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారు తమ పేర్లను పూర్తిగా మార్చరు. ఎక్కువగా స్పెల్లింగ్స్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఇదే విధానాన్ని పాస్‌పోర్ట్ దరఖాస్తు సమయంలోనూ అవలంబిస్తున్నారు. ఉదాహరణకు పేరు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే అరెస్ట్ అయినప్పుడు చివరి స్పెల్లింగ్ (్గ్గఅ) ఒకలా, పాస్‌పోర్ట్ దరఖాస్తులో (ఐఅఏ) మరోలా రాస్తూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వారికీ చెక్ చెప్పడానికి అధికారులు వెరీఫాస్ట్లో ఫింగర్ ప్రింట్ ఎనాలసిస్ అంశాన్నీ చేర్చారు. ఆన్లైన్లోనే కోర్టు కేసుల వివరాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ–కోర్ట్స్ విధానం అమలులో ఉంది. వివిధ సివిల్, క్రిమినల్ న్యాయస్థానాల్లో ఉన్న కేసులకు సంబంధించిన సమగ్ర వివరాలను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) క్రోడీకరిస్తోంది. దాదాపు 19 వేల కోర్టులకు సంబంధించిన ఏడున్నర కోట్లకు పైగా రికార్డులతో డేటాబేస్ ఏర్పాటైంది. ఆయా న్యాయస్థానాల్లో ఉన్న అన్ని తరహా కేసుల వివరాలు ఆన్లైన్లో ఉన్నాయి. దీని ఆధారంగానే పోలీసు విభాగం ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఆయా కేసుల్లో నిందితులుగా, పిటిషనర్లుగా ఉన్న వారి పేర్లు, ఇతర వివరాలతో కూడిన ప్రత్యేక డేటాబేస్కు సెర్చ్ ఇంజన్ అనుసంధానించారు. దాంతా కేసుల వివరాలు నిమిషాల్లో వస్తున్నాయి. అలాగే పోలీసు డేటాతోనూ అనుసంధానించారు. వివిధ నేరాల్లో అరెస్టు అయినప్పుడు నిందితుల నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరిస్తారు. ఈ డేటాబేస్‌ను సైతం వెరిఫాస్ట్తో అనుసంధానించారు. ఫలింతంగా ట్యాబ్ తీసుకుని వెరిఫికేషన్‌కు వెళ్ళిన ఎస్బీ సిబ్బంది అతడి వివరాలను ఆన్‌లైన్‌తో తనిఖీ చేస్తారు. అలా చేసినప్పుడు క్షణాల్లో ఆ వ్యక్తి దాచిన, ‘మార్చిన’ నేరచరిత్ర బయట పడుతోంది. ప్రస్తుతం రాజధాని నగరంలోనిహైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ పోలీస్ కమిషనరేట్లలోనూ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం ‘వెరీ ఫాస్ట్’ అమల్లో ఉంది. ఇప్పుడు ఇందులో భాగంగా ఫింగర్ ప్రింట్స్‌ను సైతం తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ పక్కాగా సాగుతున్న ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగావిస్తరించడానికి పోలీసు విభాగం కసరత్తు ప్రారంభించింది.’’ -
పాస్‌పోర్ట్ తనిఖీ పేరుతో పోకిరీ పోలీస్..
సాక్షి, న్యూడిల్లీ : దేశంలో మహిళలకు ఇంట్లో సైతం భద్రత లేదనేందుకు మరో ఉదంతం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్ ఓ పోలీస్ అధికారి చేతిలో గురైన లైంగిక వేధింపులను ప్రస్తావించారు. తన పాస్‌పోర్ట్‌ను తనిఖీ చేసేందుకు తన ఇంటికి వచ్చిన దేవేంద్ర సింగ్ అనే పోలీస్ అధికారి ఆమెను వేధించాడు. ప్రముఖ పత్రికలో పనిచేసే శ్వేతా గోస్వామి తనకు ఎదురైన వేధింపులను ట్వీట్ చేస్తూ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఘజియాబాద్ పోలీసులకు ట్వీట్ చేశారు. మహిళా దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్‌లకు పోలీస్ వెరిఫికేషన్ ఎంత దారుణంగా ఉందో కొద్ది క్షణాల కిందట ఘజియాబాద్‌లో తనకు ఎదురైన అనుభవం వెల్లడిస్తోందని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. పోలీస్ అధికారి వెళ్లే వరకూ తనకు సాయంగా ఉండాలని తన హెల్పర్‌ను కోరాల్సివచ్చిందన్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన పోలీస్ అధికారి ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ అవకాశం కోసం చూశాడని చెప్పారు. ‘మీ వెరిఫికేషన్‌ను పూర్తిచేశాను.. మరి నాకేమి ఇస్తారంటూ’ తనను కౌగిలించుకోవాలని అడిగాడన్నారు. ఆ పోలీస్ అధికారి పేరు దేవేంద్ర సింగ్ అని ఆమె ట్వీట్ చేశారు. పోకిరీ పోలీస్‌పై ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. The policeman had the audacity to ask for a “hug” after saying “I have done your verification. Now what will you give me?”. The name of the policeman is Devendra Singh. @passportsevamea @SushmaSwaraj @rajnathsingh @ghaziabadpolice @myogiadityanath — Sweta Goswami (@sweta_goswami) 12 July 2018 -
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ నంబర్‌వన్
సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవల్లో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పాస్‌పోర్ట్ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో విశిష్ట సేవలు అందించిన రాష్ట్రాలకు కేంద్ర విదేశాంగ శాఖ ర్యాంకులు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ మొదటి ర్యాంకు సాధించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా డీజీపీ మహేందర్‌రెడ్డి అవార్డు అందుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో సాంకేతికత ద్వారా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి పారదర్శకతతో వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్‌లో యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ను ప్రవేశపెట్టామని, 4 రోజుల్లో ప్రక్రియ పూర్తయి ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు వివరాలు తెలియజేస్తున్నామన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత థర్డ్ పార్టీ ద్వారా వెరిఫికేషన్ సేవల్లో పౌరుల ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకొని సంబంధిత అధికారులకు రేటింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియకు 9 రోజుల గడువు తీసుకుంటుండగా, రాష్ట్రంలో 4 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వెరిఫికేషన్‌లో విశిష్ట సేవలకు గుర్తింపుగా గత మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వెరిఫికేషన్ కోసం రాష్ట్ర పోలీసులు ప్రవేశపెట్టిన వెరీఫాస్ట్ యాప్‌తో పాస్‌పోర్ట్ దరఖాస్తును అనుసంధానం పై టీసీఎస్ సంస్థతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు. -
తెలంగాణ పోలీస్‌కు ‘వెరీఫాస్ట్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తిచేస్తున్నందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు వరుసగా మూడోసారి ‘ది బెస్ట్ వెరిఫికేషన్’ అవార్డును అందిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. 2017–18 ఏడాదికి పోలీస్ శాఖకు ఈ అవార్డు దక్కినట్టు తెలిపింది. గతంలో హైదరాబాద్ సిటీ పోలీస్‌కు రెండు సార్లు ఈ అవార్డు దక్కింది. నెలల సమయం తీసుకునే పోలీస్ వెరిఫికేషన్‌ను ‘వెరీఫాస్ట్’అనే సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు రోజుల్లోనే తీసుకువస్తున్నారు. ఈ అవార్డు దక్కడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం పాస్‌పోర్టు సేవాదివస్ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ అవార్డు అందుకుంటారని పోలీస్ శాఖ తెలిపింది. -
‘టీఎస్‌కాప్’లోకి పాస్‌పోర్టు వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖ చేతుల్లోకి త్వరలో రాబోతున్న ‘టీఎస్ కాప్’యాప్‌లోకి మరో సర్వీసు చేరబోతోంది. ప్రస్తుతం 54 సర్వీసులతో రూపొందించిన ఆ శాఖ పాస్‌పోర్టు పరిశీలననూ దీనిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను కేవలం 2 లేదా 3 రోజుల్లో పూర్తిచేస్తున్నారు. దీంతో వారంలోపే అభ్యర్థులు పాస్‌పోర్టు పొందుతున్నారు. నగర కమిషనర్‌గా పనిచేసిన మహేందర్‌రెడ్డి మూడేళ్ల క్రితం పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో త్వరితగతిన పరిశీలన పూర్తిచేయడంతో పాటు సిబ్బంది పనితీరుపై ఫీడ్‌బ్యాక్‌ను సైతం దరఖాస్తుదారుల నుంచి స్వీకరించారు. అయితే ఆ సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో యాప్ పరిధిలోకే వెరిఫికేషన్‌ను తేవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పాస్‌పోర్టు దరఖాస్తుదారుల వెరిఫికేషన్ 3 రోజుల్లో పూర్తవుతుంది. యాప్‌లో ఉన్న డేటాబేస్‌తో దరఖాస్తుదారులపై కేసులు, ఇతర వివరాలనూ క్షణాల్లో తెలుసుకోవచ్చు. -
ఉగ్రవాదులున్నారు.. అందుకే..!
ముజఫర్‌నగర్ : బంగ్లాదేశ్, పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకాలాపాలు నిర్వహించే వారికి భారత పాస్‌పోర్టులు ఉన్నట్లు అనుమానాలు రావడంతో.. పాస్‌పోర్టులు పరిశీలనకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దియోబంద్, ముజఫర్‌నగర్, సహరన్పూర్ జిల్లాల్లోని వేల పాస్‌పోర్టులను ధృవీకరణ చేయాల్సిందిగా ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. బంగ్లాదేశ్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరివద్ద భారత పాస్‌పోర్టులు.. దియోబంద్ అడ్రస్‌తో లభించడంతో.. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులు.. పదుల సంఖ్యలో దియోబంద్‌లో దాక్కున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దియోబంద్లోనే.. ప్రముఖ ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఉండడం గమనార్హం. బంగ్లాదేశీ అనుమానాస్పద ఉగ్రవాదులు అరెస్టయిన నేపథ్యంలో.. అక్రమంగా దియోబంద్‌లో నివసిస్తున్న బంగ్లా జాతీయులపై తక్షణం చర్యలు తీసుకోవాలని యూపీ సర్కార్ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బంగ్లాజాతీయులకు తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అనేది.. దియోబంద్ లేదా మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న అంశం కాదని షమారాన్పూర్ డీఐజీ ఎమ్మాన్యువల్ తెలిపారు. పాస్‌పోర్టులు ఉన్నవారంతా.. దియోబంద్, ముజఫర్‌నగర్, సహారాన్పూర్లలో తప్పకుండా వెరిఫికేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. ముజఫర్‌నగర్, సహారాన్పూర్, దియోబంద్ జిల్లాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు స్పష్టమైన సమాచారం ఉండడంతోనే విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు. గతంలోనూ సహారాన్పూర్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలతో ఉన్నవ్యక్తులను గుర్తించినట్లు ఆయన చెప్పారు. అరెస్టయిన బంగ్లాదేశీ ఉగ్రవాదుల వద్దనున్న భారతీయ పాస్‌పోర్టులను చూపించారు. ఇదిలా ఉండగా 20 మంది బంగ్లాదేశ్ జాతీయులు పశ్చిమ యూపీలో అదృశ్యమైన విషయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. -
2018 నాటికి ఆన్లైన్లోనే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్
న్యూఢిల్లీ: 2018 మార్చి నాటికి పాస్‌పోర్టుల జారీ కోసం పోలీసులు భౌతికంగా వెళ్లి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదని హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇందుకోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్టు(సీసీటీఎన్ఎస్)ను విదేశాంగ శాఖ నేతృత్వంలోని పాస్‌పోర్టు సేవలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల పోలీసులు భౌతికంగా వెరిఫికేషన్‌కు వెళ్లకుండా ఆన్లైన్లోనే వ్యక్తుల వివరాలు (గతంలో నేరచరిత్ర ఏమైనా ఉంటే) తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టులో భాగంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారమిక్కడ డిజిటల్ పోలీస్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహర్షి మీడియాతో మాట్లాడుతూ.. ‘కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇప్పటికే సీసీటీఎన్‌ఎస్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా అందించే స్మార్ట్‌ఫోన్ లాంటి పరికరంతో పోలీసులు పాస్‌పోర్ట్ దరఖాస్తుదారు ఇంటికి చేరుకుని వివరాలను అప్లోడ్ చేస్తారు. దీనివల్ల సమయం తగ్గుతుంద’ని వెల్లడించారు. దేశంలోని మొత్తం 15,398 పోలీస్ స్టేషన్లలో 13,775 స్టేషన్లను సీసీటీఎన్ఎస్ పరిధిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. -
360 డిగ్రీస్ ‘వ్యూ’
నేరగాళ్లు పేరు మార్చినా పట్టేసే పరిజ్ఞానం సిద్ధం చేస్తున్న అధికారులు నాలుగు నెలల్లో అందుబాటులోకి: నాగిరెడ్డి సిటీబ్యూరో: నేరగాళ్లను కట్టడి చేయడానికి వారి గత చరిత్రను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పక్కాగా చేయడానికి నగర పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. ఇందులో భాగంగానే నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ‘360 డిగ్రీస్ వ్యూ’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పనకు సన్నాహాలు చేస్తోంది. ఐదు జోన్లు... వేల కేసులు ఏటా 18 వేలకు పైగా కేసులు నమోదయ్యే సిటీ కమిషనరేట్‌లో... నిందితులందరినీ పోలీసు అధికారులు గుర్తుంచుకోవడం కష్టం. దీనికి తోడు నగరంలో ఉన్న ఐదు జోన్లలో ఓ జోన్ పరిధిలో అరెస్టయిన వ్యక్తి పూర్తి సమాచారం మరో జోన్ అధికారుల వద్ద అందుబాటులో ఉండదు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో ఇది కొంత వరకు అమలవుతున్నా... పాస్‌పోర్టుల వెరిఫికేషన్ లో పూర్తి స్థాయిలో ఫలితాలు ఉండడం లేదు. దీనికితోడు నేరగాళ్ల ఎత్తులు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పేర్లు మారుస్తూ తప్పుదారి... నగర పోలీసులు గడిచిన ఏడాది కాలంగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. పదేపదే నేరాలు చేసే వారిని గుర్తిస్తూ... ఏకకాలంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై దీన్ని ప్రయోగిస్తున్నారు. ఈ భయానికి తోడు వరుసగా నేరాలు చేసే వారిలో కొందరు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకు కొత్త ఎత్తులు ప్రారంభించారు. ఓసారి అరెస్టయినప్పుడు ఇంటి పేరు ముందు... అసలు పేరు వెనుక చెబుతూ... మరోసారి తన పేరు ముందు... ఇంటి పేరు వెనుక చెప్పడంతో పాటు పేర్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మార్పుచేర్పులు చేస్తూ... ఇలాంటి ‘మార్పిడిగాళ్లు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టయిన ప్రతిసారీ బెయిల్ కోసం న్యాయస్థానంలో ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెబితే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఉదాహరణకు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే ఓసారి అరెస్టయినప్పుడు చివరి అక్షరాలు ‘డడ్చ’గా... మరోసారి చిక్కినప్పుడు దీన్ని ‘జ్చీజి’గా రాస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల ఈ తరహా కేటుగాళ్ల సంఖ్య పెరిగినట్లు పోలీసు విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ‘360 డిగ్రీస్ వ్యూ’కు సన్నాహాలు చేస్తోంది. ఏకతాటిపైకి పబ్లిక్ డేటాబేస్లు ఈ సాఫ్ట్‌వేర్‌లో నగర పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి అరె స్టయిన వ్యక్తుల వివరాలతో పాటు ఇతర విభాగాలకు చెందిన డేటాబేస్‌లైన డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల పూర్తి వివరాలను సర్వర్‌కు అనుసంధానిస్తారు. తమ కు కావాల్సిన వ్యక్తి పేరుతో పాటు ఇతర వివరాలు ‘సెర్చ్’ చేయడానికి ఉపక్రమిస్తే... అందుబాటులో ఉన్న సమాచారం పొందుపరిస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ వీటన్నింటినీ సెర్చ్ చేసి ఆ వ్యక్తి పేర్లు మార్చుకున్నా వివరాలన్నింటినీ అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా లు, కమిషనరేట్ల నేరగాళ్ల వివరాలనూ ఈ డేటాబేస్‌లో పొందుపరచాలని అధికారులు నిర్ణయించారు. ‘వెరిఫై’కి భిన్నంగా ‘360’ నగర పోలీసు విభాగం ఇప్పటికే ‘వెరిఫై 24/7’ పేరుతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో దేశంలోని 19 వేల కోర్టుల్లో ఉన్న డేటాను అనుసంధానించింది. దీనిలో కేవలం కేసుల దర్యాప్తు పూర్త యి, చార్జ్షీట్లు దాఖలైన వారి వివరాలే ఉంటాయి. ‘360’లో ఎఫ్ఐఆర్ జారీ అయితే చాలు. వారం రోజుల్లో టెండర్లు పిలవాలని భావిస్తున్నాం. నాలుగు నెలల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పోలీసు విభాగం కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, సెల్ఫోన్ల నుంచీ ‘సెర్చ్’ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పాస్‌పోర్టుల వెరిఫికేషన్‌కు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. - వై.నాగిరెడ్డి, అదనపు పోలీసు కమిషనర్, ఎస్బీ -
పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో పట్టుబడిన శ్రీలంక మహిళ
పీలేరు(కేవీపల్లె): పాస్‌పోర్టు కోసం తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన శ్రీలంకకు చెందిన ఓ మహిళను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పీలేరు ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. శ్రీలంకకు చెందిన షేక్ చాందని మల్కంతియ అలియాస్ రాంపతి ద్వావలజె(35) బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లింది. పీలేరు పట్టణం సైనిక్‌నగర్‌కు చెందిన ఎస్.కాలేషా కువైట్‌కు వెళ్లాడు. అక్కడ వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అనంతరం వివాహం చేసుకుని మూడేళ్ల క్రితం పీలేరుకు వచ్చారు. మల్కంతియ ప్రస్తుతం గర్భం దాల్చడంతో శ్రీలంకలో తల్లిదండ్రులను చూసేందుకు అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తప్పడు అఫిడవిట్లు సమర్పించి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. తనది రాయచోటి అని... ఆధార్, ఓటరు కార్డు స్థానికంగా ఉన్నట్లు తెలిపింది. అయితే పోలీసుల విచారణలో ఆమె సమర్పించినవి తప్పుడు అఫిడవిట్లు అని ఎస్ఐ తెలిపారు. సోమవారం ఆమె వద్ద గల పాత పాసుపోర్టులు, ఆధార్, ఓటరు కార్డు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమెను వివాహం చేసుకున్న కాలేషా ప్రస్తుతం కువైట్‌లో ఉన్నట్లు చెప్పారు. -
శభాష్ పోలీసన్నా..
* కానిస్టేబుల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు * పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో డబ్బులు ఇవ్వజూపినా * తిరస్కరించిన నారాయణరావు సాక్షి, హైదరాబాద్: శభాష్ పోలీసన్నా.. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు ఇవ్వజూపిన డబ్బును తిరస్కరించి పోలీసుల నిజాయతీని పెంచిన నగర స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.నారాయణరావును ఉద్దేశించి కేసీఆర్ అన్న మాట ఇది. ఆదివారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని కానిస్టేబుల్ నారాయణరావును సీఎం అభినందించారు. వెస్ట్‌జోన్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నారాయణరావు విధి నిర్వహణలో భాగంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం జూబ్లీహిల్స్‌లోని ఓ దరఖాస్తుదారుడి ఇంటికి శనివారం ఉదయం వెళ్లాడు. పని పూర్తిచేసుకుని తిరిగివెళ్తున్న నారాయణరావును దరఖాస్తుదారుడి తండ్రి ఆపి.. కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా సున్నితంగా తిరస్కరించాడు. అయినా మరికొంత మొత్తాన్ని ఇవ్వబోగా ‘‘మా జీతాలను ముఖ్యమంత్రిగారు పెద్ద మొత్తంలో పెంచారు. మా బాగోగులను మంచిగా చూసుకున్నారు. కాబట్టి మాకు మీరిచ్చే డబ్బు అక్కర్లేదు’’ అనడంతో అశ్చర్యానికి గురైన సదరు వ్యక్తి నారాయణరావును ప్రశంసించారు. కాగా ఆ వ్యక్తే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి ‘‘మీ పోలీసులు నిజాయతీగా పనిచేస్తున్నారు. డబ్బులు తీసుకోవాలని బల వంతం చేసినా తీసుకోలేదని’’ జరిగిన విషయం వివరించారు. కాగా ఆదివారం సీఎం కేసీఆర్ కానిస్టేబుల్ నారాయణరావును క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించి నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ వై.నాగిరెడ్డి, అదనపు డీసీపీ గోవర్ధన్‌రెడ్డి, ఏసీపీ కె.ప్రసాద్, ఇన్స్పెక్టర్ సంతోష్కిరణ్ల సమక్షంలో ప్రశంసించారు. పోలీసుల పనితీరును మెరుగుపరిచేం దుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని ఈ ఘటన వెల్లడించిందని, పోలీసులందరు నారాయణరావును ఆదర్శంగా తీసుకుని నిజాయతీగా పని చేయాలని కేసీఆర్ సూచించారు. నగర పోలీసులు చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని, దానికి సాక్షిగా నిలిచిన నారాయణరావును సీఎం ప్రశంసించడం నిజాయతీపరులైన పోలీసులందరిని ప్రశంసించినట్లేనని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.