Police Department
-
కానిస్టేబుల్‌తో ఎస్ఐ వివాహేతర సంబంధం.. భార్య ఫిర్యాదు
సాక్షి, నల్లగొండ: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా ఓ పోలీసు అధికారి.. వివాహిత అయిన కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య.. పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్నేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న భార్య జ్యోతి.. మహేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వారించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వీరిద్దరూ తమ తీరు మార్చుకోలేదు. ఇక, తాజాగా వీరిద్దరి కాల్ రికార్డింగ్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరోవైపు భర్తపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా మహేందర్ భార్య జ్యోతి మాట్లాడుతూ.. ఐదారేళ్లుగా వసంతతో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. మహేందర్‌ను శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలి. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలి. లేకపోతే మాకు మెర్సీ కిల్లింగ్‌కు అవకాశం కల్పించాలి. వసంతకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె భర్తకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. వసంత కూడా నాపై దాడి చేసింది. నన్ను కొట్టి ఇంట్లో ఉన్న బంగారం నగదు ఎత్తుకెళ్లింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
-
హద్దు మీరితే లోపలేయండి
సాక్షి, హైదరాబాద్: ‘బాధితులను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నేరగాళ్లు రాజకీయ నాయకులైనా, అధికారులైనా సరే.. ఎలాంటి హోదా ఉండదు. ప్రొటోకాల్ వర్తించదు. నేరం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి. పోలీస్స్టేషన్లకు వచ్చి డాబూ దర్పం ప్రదర్శిస్తూ హడావుడి చేసేవాళ్లను సక్కగా తీసుకుపోయి బొక్కలో వేయండి. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజాప్రతినిధులకు పోలీసులు మర్యాద ఇవ్వడం ఎంత ముఖ్యమో..పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజాప్రతిధులు సహా ఎవరైనా పోలీసులతో మర్యాదగా ప్రవర్తించడం అంతే ముఖ్యం.పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించేవారి పట్ల మర్యాదగా ఉండాల్సిన పనిలేదు. ఈ మేరకు ఈ వేదిక నుంచే పోలీస్ శాఖలోని అన్ని స్థాయిల సిబ్బందికి.. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా నేను ఈ విషయంలో స్పష్టత ఇస్తున్నా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో హోంశాఖ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్నిమాపక శాఖకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.ఆ తర్వాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీజీపీ జితేందర్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అగ్నిమాపక శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డిప్యూటీ సీఎంతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో పనిచేశారు. కానీ గత ఏడాదిగా పైరవీలకు తావులేకుండా సమర్థత ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్లు లేనందున రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయి. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసుల చేతుల్లోనే ఉంది. ప్రజా ప్రభుత్వంలో 4 కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛ అనే ఏడో గ్యారంటీని అమలు చేశాం..’ అని సీఎం పేర్కొన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాల కేసుల్లో 6 నెలల్లోనే శిక్ష‘గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారితో పాటు సైబర్ నేరాలు సవాల్ విసురుతున్నాయి. డ్రగ్స్ కట్టడికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుంది. కాబట్టి డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలి. డ్రగ్స్, సైబర్ నేరాల కేసుల్లో ఆరు నెలల్లోనే విచారణ పూర్తి చేసి శిక్షలు విధించేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. డ్రగ్స్, సైబర్ క్రైం నియంత్రణ కోసం బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులను డేటా అనాలసిస్ కోసం వాడుకోవాలని డీజీపీని ఆదేశిస్తున్నా. అదేవిధంగా నగరాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పోలీసులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి‘క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖ సిబ్బంది దాన్ని ఉల్లంఘించడం సరికాదు. పోలీసులు ఆందో ళనలు చేయడం వల్ల సమస్యల పరిష్కారం మరింత జఠిలం అవుతుంది. పోలీస్ సిబ్బంది తమ సమ స్యలేవైనా ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి. అధికా రుల వద్ద పరిష్కారం కాకపోతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తేవాలి. అక్కడా పరిష్కారం కాక పోతే నేను స్వయంగా పోలీసుల సమస్యలు పరిష్క రించే బాధ్యత తీసుకుంటా..’అని సీఎం తెలిపారు. అందరి కోసం పోలీస్: డిప్యూటీ సీఎం ప్రజా ప్రభుత్వంలో కొంతమంది అవసరాల కోసం కాకుండా, సమాజ అవసరాల కోసం మాత్రమే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ నగరంతో పా టు రాష్ట్రాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కో సం ఫ్రెండ్లీ పోలీస్ కార్యాచరణ ప్రణాళిక తీసుకుని ముందుకు వెళుతున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉందని, డయల్ 100కు సమాచారం అందిన పది నిమిషాల్లోనే బాధి తుల వద్దకు చేరుకుంటున్నామని చెప్పారు. ఆకట్టుకున్న విన్యాసాలు..అబ్బురపర్చిన జాగిలాలు విజయోత్సవాల్లో భాగంగా ఆక్టోపస్ సిబ్బంది ప్రద ర్శించిన విన్యాసాలు అలరించాయి. పోలీస్ బ్యాండ్ బృందాలు ఆకట్టుకున్నాయి. పోలీస్ జాగిలాలు తమ ప్రదర్శనతో అబ్బురపరిచాయి. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మేయర్ విజ యలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అగ్ని మాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఐపీఎస్ లు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.మానవీయ కోణంలోనే ట్రాన్స్జెండర్లకు బాధ్యతలు‘సమాజంలో నిరాదరణకు గురైన ట్రాన్స్జెండర్లను మానవీయ కోణంలో ఆదుకునేందుకే వారికి తాత్కాలిక విధానంలో ట్రాఫిక్ అసి స్టెంట్లుగా విధులు అప్పగిస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచించే ట్రాన్స్జెండర్లను నేను గతంలో చూశా. అందుకే వారికి ట్రాఫిక్ విధులు అప్పగించి, నెలకు గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 50 మంది ట్రాన్స్జెండర్లకు నియామక పత్రాలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెంచుతాం. ఇందిరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు ట్రాన్స్జెండర్లకు ఇస్తాం. అన్ని విధాలా అండగా ఉంటాం. ఈ అవకాశాన్ని ఉపయో గించుకుని ట్రాన్స్జెండర్లు క్రమశిక్షణతో మెల గాలి..’ అని ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు.హోంగార్డులకు రోజుకు రూ.వెయ్యి⇒ వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.100 నుంచి రూ.200కు పెంపు⇒ వచ్చే జనవరి నుంచి అమలుహోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా వారికి సీఎం రేవంత్‌రెడ్డి వరాలు ప్రకటించారు. ‘పోలీసు లతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డులకు భరోసా ఇస్తున్నా. రాష్ట్రంలో దాదాపు 14 వేల మందికి పైగా హోంగార్డులు పనిచేస్తున్నారు. డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా మీ సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నాం. రోజువారీ భత్యాన్ని రూ.921 నుంచి రూ.1,000కి పెంచుతున్నాం.అలాగే వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోంగార్డులు ప్రమాదవశాత్తు కానీ, సహజ మరణం కానీ పొందితే కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి మెరుగైన వైద్య సహాయాన్ని కూడా హోంగార్డులకు అందిస్తాం. ఈ నిర్ణయాలన్నీ 2025 జనవరి 1 నుంచి అమల్లోకి తెస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
టీడీపీ నేతలపై YSRCP ఇచ్చిన ఫిర్యాదులపై..
-
ఇవి మీకు కనిపించవా?.. పోలీసులపై నారాయణస్వామి ఆగ్రహం
-
దొంగ కేసులు.. పెయిడ్ ఆర్టిస్టులు.. పోలీసులపై ఆర్కే రోజా ఫైర్
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అమానుష కాండను కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడమే వారు చేసిన నేరం. వారిపై అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా ...వారిని అక్రమంగా నిర్బంధించి భౌతికంగా దాడులు చేస్తూ ...కసి తీరిన తరువాతే అరెస్ట్ చూపిస్తోంది. మానవ హక్కులను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ ...రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దమనకాండకు ప్రభుత్వ ముఖ్యనేతే ప్రధాన కుట్రదారు కాగా... కీలక పోలీసు అధికారులు పాత్రధారులు, పర్యవేక్షకులు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపోయారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం వారిలో కనిపిస్తోంది. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా కాలరాస్తున్న సర్కారు దమననీతిపై న్యాయపోరాటానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు తమ విద్యుక్తధర్మాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా తలాడిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దమనకాండను కొనసాగిస్తున్న పోలీసు అధికారులపైనా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. వీరికి పలువురు మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకారులు, పలు పౌరసంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే ‘పచ్చ’పాత పోలీసు అధికారులందరూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడడం తథ్యమని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయి. అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే... ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. అంటే ఈ అమానుష కాండను కొనసాగించేందుకు ప్రభుత్వ పెద్దలు రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని దీనినిబట్టి స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులను వారు సంతృప్తిచెందే స్థాయిలో భౌతికంగా హింసించారా లేదా అన్నది వీడియో కాల్ ద్వారా పర్యవేక్షిస్తుండటం ప్రభుత్వ కక్షకు పరాకాష్టగా నిలుస్తోంది. ఆ రాక్షసకాండ ఇలా సాగుతోంది... ఎన్ని కేసులు.. ఎక్కడికి తరలిస్తున్నారు? రాష్ట్రంలో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం ఎడాపెడా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఒక్కో యాక్టివిస్టుపై ఒకటికి మించిన కేసులు నమోదు చేయడమే కాకుండా... వేర్వేరు జిల్లాల్లో కేసులు నమోదు చేస్తోంది. వారిని పోలీసులు హఠాత్తుగా అదుపులోకి తీసుకుని తమతో పట్టుకుపోతున్నారు. ఏ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుందీ... ఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారన్న కనీస సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. దాంతో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాకబు చేస్తే అసలు తాము ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కరడుగట్టిన నేరస్తులా? అక్రమంగా అదుపులోకి తీసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులపై ప్రయోగించినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతికంగా హింసిస్తున్నారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని..లేకపోతే మరిన్ని రోజులు చిత్రవధ తప్పదని హెచ్చరిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిర్ధారణ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించామని పోలీసులు మాటలతో చెబితే ఉన్నతాధికారులు సంతృప్తి చెందడం లేదు. పోలీసు అధికారులు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఓ ఉన్నతాధికారికి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ తాము ఆశించినస్థాయిలో ప్రయోగించారా లేదా అన్నది ఆ ఉన్నతాధికారి వీడియో కాల్ ద్వారా పరిశీలిస్తారు. ఆయన సంతృప్తి చెందితే ఆ విషయాన్ని తన బిగ్ బాస్‌కు నివేదిస్తారు. ఆయన అనుమతి ఇచ్చిన తరువాతే... ఒకే ఇక చాలు... అరెస్ట్ చూపించండి అని ఆ ఉన్నతాధికారి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చెబుతారు.చిత్రహింసల తర్వాతే అరెస్ట్..ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినస్థాయిలో థర్డ్ డిగ్రీని ప్రయోగించారని నిర్ధారించుకున్న తరువాతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా మూడు రోజుల నుంచి వారం రోజులపాటు సాగుతోంది. కుట్రపూరిత, కక్ష పూరిత రాజకీయాలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా దుర్వినియోగం చేయలేదని పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులను గుండాల మాదిరిగా మార్చి రాజకీయ అరాచకం సాగిస్తుండటం విభ్రాంతికరమని మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో పోలీసు అధికారులు భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఇకపై టీజీ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖ సిబ్బంది, అధికారులు ధరించే యూనిఫాంకు సంబంధించిన.. పోలీస్ టోపీ, బెల్ట్, బ్యాడ్జీలపై టీఎస్‌కు బదులుగా టీజీ అని ఉండేలా లోగోలో మార్పు చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాడ్జీలపై టీఎస్పీ స్థానంలో టీజీపీ, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, టీఎస్ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ, టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండేలా మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను ఆదేశించారు. -
మహిళా పోలీసుల్ని అంగీకరించే పరిస్థితి లేదు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోకి మహిళలు రావడానికి వారి కుటుంబాలు అంగీకరించడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిస్తూ.. గత ప్రభుత్వంలో మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీస్ డ్రెస్ కూడా వేయించాలని చూశారన్నారు. దానిపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించారని చెప్పారు. వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో కొనసాగిస్తారా, మహిళా, శిశు సంక్షేమ శాఖలో కొసాగిస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికే అవగాహన లేకపోవడం వల్ల వారంతా మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు.విశాఖ మెట్రో ఎప్పుడుచింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం పనులు 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. త్వరగా పూర్తిచేయండని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ఎర్రకాలువ వరద వల్ల రైతులకు ఏటా నష్టం వాటిల్లుతోందని.. మరమ్మతులకు కనీసం రూ.50 కోట్లు కేటాయించమని అడిగితే ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ ప్రయోజనాలు వర్తించవుమినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన గత ప్రభుత్వం 3,939 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని విద్యా శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మిగిలిన 600 పోస్టుల భర్తీకి చర్చిస్తామన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు. వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని బుచ్చయ్య చౌదరి ప్రశ్నకు సమాధానంగా మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో హజ్ యాత్రికుల ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇచ్చేవారని.. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనూ ఇవ్వాలని ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మర్ కోరారు.‘సాక్షి’పై అక్కసుఅసెంబ్లీ వేదికగా మరోసారి సాక్షి పత్రికపై జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నోరుపారేసుకున్నారు. వైఎస్సార్సీపీ కరపత్రిక, అవినీతి పత్రిక అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నట్టు.. సాక్షి పత్రిక చదవడం ఆరోగ్యానికి హానికరం అని మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
పోలీసులపై పొన్నవోలు ఫైర్
-
అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్ట
‘‘మేము ఎలా పాలన సాగించినా ఎవరూ నోరెత్తకూడదు.. ఇది మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం.. తప్పు పట్టడానికి మీరెవరు? కాదు కూడదని మా నిర్ణయాలను ప్రశ్నిస్తే నాలుగు తగిలించడంతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి. సుప్రీంకోర్టు, హైకోర్టుల సంగతి మా లాయర్లు చూసుకుంటారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను కూడా వదిలి పెట్టం. మేం చెప్పినట్లు ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టడానికి పోలీసులున్నారు. ఆ విధంగా వాళ్లను ట్యూన్ చేసుకున్నాం. ఎవరైనా తోక జాడించి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చేస్తామో.. ఎలాంటి కేసులు పెడతామో మాకే తెలియదు’’ అన్నట్లు కూటమి సర్కారు గుడ్లురు ముతోంది. నియంతృత్వమే తమ చట్టం అని, రెడ్‌బుక్ తమ రాజ్యాంగమని స్పష్టం చేస్తోంది. తాలిబన్లు సైతం విస్తుపోయేలా వికటాట్టహాసం చేస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజ్యమేలుతోంది. పక్కన పేర్కొన్న దయనీయ సంఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉండటం ప్రజాస్వామ్య వాదులను విస్మయ పరుస్తోంది.సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వారిపైకి పోలీసులను ఉసిగొలుపుతోంది. రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు చట్టం, రాజ్యాంగం అనే వాటికి తిలోదకాలు వదిలారు. అధికార పారీ్టల నేతలు చెప్పిన వారందరిపై ఉన్నవీ లేనివీ కల్పించి ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరు పరచాలన్న చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, మైనర్లు అని కూడా చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా ఊళ్లపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. నిద్రిస్తున్న వారిని అపహరించుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పరు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి అడిగితే మాకేం తెలీదనే సమాధానం వస్తుంది. పోలీసు వాహనాల్లో కుక్కి.. కొడుతూ ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగితే లాఠీలే సమాధానమిస్తున్నాయి. మేం చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తే పోలీసుల బూట్లే మాట్లాడుతున్నాయి. ఒక్కొక్కరిపై రెండు మూడు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తిప్పుతున్నారు. మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 110కి పైగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. ఇవన్నీ బాధితుల తరఫున లాయర్లు, గ్రామ పెద్దలు నిలదీస్తేనే అధికారికంగా ప్రకటించినవి కావడం గమనార్హం. అరెస్టు చూపకుండా వేధిస్తున్న కేసులు వేలల్లో ఉన్నాయనడం అక్షర సత్యం. ఒక్కో కేసులో ఒకరు మొదలు 10–20 మందిని సైతం నిందితులుగా చేరుస్తూ వేధిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తున్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న ఆదేశాలు తమకు పట్టవన్నట్టు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాలు హెబియస్ కార్పస్ పిటీషన్లతో హైకోర్టును ఆశ్రయించినా సరే తమ నియంతృత్వాన్ని నిర్భీతిగా సమర్ధించుకోవడం దుర్మార్గం. ఇదీ చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యం. మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగం! సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల పోలీసులు మహిళ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించడం దారుణం. మూడు రోజుల పాటు ఆమెను, ఆమె భర్తను చిత్రహింసలకు గురిచేశారు. ‘నన్ను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. నా భర్త వెంకటరెడ్డినీ చిత్రహింసలకు గురిచేశారు. చిలకలూరిపేట సీఐ రమేష్ దుర్భాషలాడారు. నోరెత్తితే ఇష్టానుసారం కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వద్ద జొన్నవాడలోని రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లినప్పుడు మమ్మల్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సీఐ రమేష్ బృందం అదుపులోకి తీసుకుంది. చిలకలూరిపేట, ఒంగోలుకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు’ అని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. తుదకు ఆమె తరఫు వారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో శుక్రవారం సాయంత్రం కొత్త పేట పోలీసులు గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే విషయాన్ని ఆమె మెజిస్ట్రేట్ ఎదుటే చెప్పారు. పోలీసులు కొట్టడంతో అయిన గాయాలను సైతం చూపించారు. ఈమెపై ఏకంగా 6 అక్రమ కేసులు బనాయించారు. నా భర్తను చంపేస్తారేమో.. ‘సోషల్ మీడియా యాక్టివిస్టు అయిన నా భర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు చంపేస్తారేమోనని భయంగా ఉంది. రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంత వరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడం లేదు. ఐ టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లు మా ఆయన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విచారణలో కూడా ఈ విషయం తేలింది. అయినా ఇప్పుడు దీనిపై కుట్ర చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆయనేదో అంతర్జాతీయ టెర్రరిస్ట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని రవీందర్‌రెడ్డి భార్య కళ్యాణి శనివారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టగా నిలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళలను వేధించినట్లా? కూటమి ప్రభుత్వ పెద్దలు నివసిస్తున్న విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అరాచకాలు, దుర్మార్గాలకు అంతే లేకుండా పోయింది. ఓ పోస్టును సాకుగా చేసుకుని కూటమి నాయకుడొకరు తన పార్టీ కార్యకర్తలతో ఈ నెల 2వ తేదీన పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులిప్పించాడు. అదే రోజు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ 42 కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో 172 మందికి నోటీసులిచ్చారు. శుక్రవారం నాటికి మొత్తంగా 260 మందికి నోటీసులు ఇచ్చారు. కూటమి సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే.. అమ్మాయిలపై తప్పుడు పోస్టు పెట్టారని అభాండాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘నేను ఇటీవల ఓ వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన పోస్ట్‌ను చూశాను. ఈ మాత్రం దానికే నాకు సైబర్ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు’ అని గుంటూరుకు చెందిన ఆకుల మురళి అనే వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. ఇది నేరమట!శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈనెల 1వ తేదీన బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్ కోసం గంటలతరబడి వేచి ఉంటూ సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు వెంటనే ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదే విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామ ఉప సర్పంచ్ మడ్డు జస్వంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతని పాలిట ఇదే పాపమైపోయింది. పాలక పార్టీ పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన్ను భయపెట్టాలని కూడా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆయన ఇంట్లో లేడు. గంటల కొద్దీ అక్కడే ఉండి ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా వేధించారు. ఆ తర్వాత ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే జస్వంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ రోజు కార్తీక పూజ నిర్వహిస్తున్నామని, భోజనం చేసి వస్తానన్నా కూడా వదల్లేదు. ఫోన్‌ను కూడా లాగేసుకున్నారు. ఏం కేసు పెట్టారని అడిగినా అప్పుడు చెప్పలేదు. తర్వాత లాయర్ సాయంతో బయటకు వచ్చాడు. అయినా ఇప్పటికీ ఎప్పుడుపడితే అప్పుడు స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు చేసి పిలిపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. 192 బీఎన్ఎస్ సెక్షన్‌తో ఎఫ్ఐఆర్ (150/24) నమోదు చేశారు. శాంతిభద్రతలు నిల్.. వేధింపులు ఫుల్! వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వీటిని అరికట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 177 మంది హత్యకు గురయ్యారు. 500కుపైగా హత్యాయత్నాలు జరిగాయి. 2 వేలకుపైగా దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. అత్యాచార పర్వానికి అంతు లేకుండా పోయింది. ఇళ్లల్లో ఉండే చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్ధినులు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. అయినా శాంతిభద్రతలతో తమకు సంబంధం లేదన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలిక కిడ్నాప్‌కు గురికాగానే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి బతికుండేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడితే ఏ మేరకు శిక్ష వేశారో పాలకులే చెప్పాలి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. ఇలాంటి వారందరిపై ఏ చర్యలూ లేవు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టిన వారిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగినా ఇక్కడ మాత్రం ఏ చర్యలూ లేవు. అన్నా.. వాడిక ఆర్నెల్లు నడవలేడు⇒ సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారి ఆచూకీ తెలియనీయకుండా, కోర్టులోనూ హాజరు పరచకుండా ఊళ్లు.. ఊళ్లు తిప్పుతూ.. వారిని ఏ విధంగా వేధిస్తున్నారో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. ‘అన్నా.. మీరు చెప్పినట్లే వాడిని కుమ్మేశాను. ఏడాది.. కనీసం ఆర్నెల్లు వాడు నడవలేడు. ఆ తర్వాత కూడా వాడు కుంటుకుంటూ నడవాల్సిందే’ అని ఇటీవల ఓ ఎస్ఐ అధికార పార్టీ నేతకు చెప్పడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ⇒ అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సంజీవరెడ్డిని ఈ నెల 6వ తేదీ రాత్రి పుట్టపర్తి అర్బన్ సీఐ సునీత సిబ్బందితో వచ్చి ఇంటి నుంచి బలంవంతంగా లాక్కెళ్లింది. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆచూకీ తెలియడం లేదు. ⇒ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారనే కారణంతో విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వెంకటేష్, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్‌పై కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా తమకు ఊడిగం చేసే పోలీసులు ఎక్కడ ఉంటే అక్కడ అక్రమ కేసులు ఇష్టారాజ్యంగా నమోదు అవుతున్నాయి. ఇంకా వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు కసరత్తు సాగిస్తున్నారు.⇒ వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబీఎన్ వంటి ఎల్లో మీడియా ఈ అరాచకానికి కొమ్ము కాస్తుండటం దారుణం. నిబద్ధత కలిగిన ఇతర మీడియా సంస్థలు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బరితెగించి సాగిస్తున్న ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బాధితుల తరఫున న్యాయ పోరాటానికి దిగింది. చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వాన్ని నిలదీస్తోంది. -
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే.. అంతే!
-
అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం
సాక్షి అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, అక్రమ నిర్బంధాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధానికి సంబంధించి రెండు పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ ఫుటేజీలను సంబంధిత మేజిస్ట్రేట్ల ఎదుట సీల్డ్ కవర్లలో అందచేయాలని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తుల అరెస్ట్ విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్య పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్‌ను సోమవారం తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ఎక్కువ అయిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబాలు..టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారంటూ పలువురిని పోలీసులు అక్రమంగా నిర్భంధంలోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల్లో 101 మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. తమవారిని పోలీసులు కోర్టు ముందు హాజరు పర్చకుండా అక్రమ నిర్బంధంలో ఉంచడంపై బాధిత కుటుంబాలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా నిర్భందించిన తమ కుటుంబ సభ్యులను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచేలా ఆదేశించాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది.పౌరుల స్వేచ్ఛను కాపాడతాం..విచారణ సందర్భంగా తిరుపతి లోకేష్ తరఫు న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ కుటుంబం పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న 411 మందికి నోటీసులు ఇచ్చారని నివేదించారు. వారిలో 120 మంది విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారని తెలిపారు. తిరుపతి లోకేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 5వతేదీన విశాఖ నుంచి విజయవాడ తరలించారన్నారు. లోకేష్ సోదరుడిని పిలిపించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ధర్మాసనానికి నివేదించారు. ప్రస్తుతం లోకేష్ జాడ తెలియడం లేదన్నారు. ఈ సమయంలో కోర్టులో ఉన్న విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జానకి రామయ్యతో ధర్మాసనం నేరుగా మాట్లాడింది. తిరుపతి లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ గ్రూప్ నిర్వహిస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆయన కోర్టుకు చెప్పారు. దీనిపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామన్నారు. ఫోన్ చేయడంతో తన బావతో కలిసి లోకేష్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారన్నారు. లోకేష్‌ని విచారించిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపామన్నారు. నేరానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలతో ఈ నెల 10న హాజరు కావాలని ఆయనకు సూచించినట్లు చెప్పారు. జానకి రామయ్య చెప్పిన వివరాలను రికార్డు చేసిన ధర్మాసనం.. సోమవారం ఉదయం 10:30 గంటలకు లోకేష్‌ను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది . ఈ నెల 4వతేదీ నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సీల్డ్ కవర్లో విజయవాడ మెజిస్ట్రేట్‌కు సమర్పించాలని ఆదేశించింది. అరెస్ట్ చేసిన 24 గంటలలోపు నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలను పాటించి తీరాలని లేదంటే తమ జోక్యం తప్పదని తేల్చి చెప్పింది. పౌరుల స్వేచ్ఛను కాపాడటం ఈ కోర్టు బాధ్యత అని స్పష్టం చేసింది. అంతకు ముందు పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ్త సోషల్ మీడియా ద్వారా కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. ఇలాంటి వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొనగా, దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చట్ట నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.టేకులపల్లి స్టేషన్ ఫుటేజీ కూడా..అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఆత్మకూరుకు చెందిన జింకల నాగరాజు అక్రమ నిర్భందంపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించించింది. టేకులపల్లి స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. -
Big Question: సర్కారు వారి అరాచకం.. లా అండ్ ఆర్డర్ రెడ్ బుక్ సేవలో పోలీసులు
-
పోలీసులకు ‘ఆంబిస్’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆంబిస్ (ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం)ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో టీఓటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లలో కలిపి ఐదు పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద ఆంబిస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సైతం అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పారు. ఆంబిస్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, అవసరమైన సమాచారాన్ని నూతన సెర్చింగ్ పద్ధతుల్లో పొందేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఏమిటీ ఆంబిస్? నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అర చేతిముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2017 నుంచి ఆఫిస్ (ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం) సాంకేతికతను వినియోగిస్తోంది. దీన్ని మరింత ఆధునీకరిస్తూ ఆంబిస్ (ఏఎంబీఐఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చట్టం–2022 ప్రకారం నేరస్థుల వేలి ముద్రలు, చేతి ముద్రలతోపాటు ఐరిష్ స్కాన్, ముఖ చిత్రాలు (ఫేషియల్ ఇమేజెస్), కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం సేకరించడం తప్పనిసరి చేశారు. ఇలా వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు తెలంగాణ పోలీసులు ఈ నూతన ఆంబిస్ సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ఆంబిస్ పూర్తిగా ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇది న్యూరల్ నెట్వర్క్ ఆధారిత ఫింగర్‌ప్రింట్ ఆల్గారిథమ్స్ ఆధారంగా నడుస్తుంది. నేరస్థులకు సంబంధించిన డేటాను విశ్లేషించడంలోనూ ఈ సాంకేతికత ఎంతో వేగంగా స్పందిస్తుంది. సమాచార సేకరణలో అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు నేరం జరిగిన స్థలంలో దొరికిన వేలిముద్రలను మాత్రమే పోల్చాలనుకుంటే అవి మాత్రమే పోల్చి ఫలితాన్ని ఈ సాంకేతికత ఇస్తుంది. గతంలో ఉన్న సాంకేతికతతో పోలిస్తే ఈ ఆంబిస్ సాంకేతికత కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్ ఇమేజ్‌లతో పోల్చేందుకు ఇందులో వీలుంది. ఈ తరహా న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రస్తుతం రష్యాలో మాత్రమే వినియోగిస్తున్నారు. రష్యా తర్వాత భారత్‌లో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం గమనార్హం. -
వేధించకుంటే వేటే!
టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేయాలి. అక్రమ కేసులు పెట్టి వేధించాలి. థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి. రాజ్యాంగ హక్కులు, సుప్రీంకోర్టు తీర్పులు పట్టించుకోకూడదు. కాదు కూడదంటే వేటు తప్పదు. – ఇది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పాటిస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగ దుర్నీతిసాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధికార కూటమి పారీ్టల నేతలు చెప్పినట్లుగా పోలీసు వ్యవస్థ నడుచుకోవాలని, ఎవరైనా ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే శంకరగిరి మాన్యాలకు పంపుతామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడమే ఇందుకు నిదర్శనం. ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడును వైఎస్సార్ జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న హర్షవర్దన్ రాజును టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు యథేచ్ఛగా అక్రమాలకు తెగించారు. తాజాగా తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేసి, చిత్రహింసలకు గురి చేయాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 41 ఎ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటాంగానీ అక్రమంగా అరెస్ట్ చేయడం సాధ్యం కాదని ఎస్పీ వారితో చెప్పినట్టు తెలిసింది. దాంతో ఆయనపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహించారు. విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీనిని సాకుగా తీసుకున్న చంద్రబాబు.. వైఎస్సార్ జిల్లా ఎస్పీపై వేటు వేయడం ద్వారా ఐపీఎస్ అధికారులను లోబరుచుకోవచ్చన్న మైండ్‌గేమ్‌కు తెరలేపినట్లు సమాచారం. వెంటనే ఎస్పీని బదిలీ చేయడంతో పాటు టీడీపీ మాజీ ఎంపీకి సమీప బంధువైన కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్‌ను ప్రత్యేకంగా వైఎస్సార్ జిల్లాకు పంపారు. డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, స్టేషన్ హౌస్ అఫీసర్లకు ఒక స్థానంలో కనీసం రెండేళ్లపాటు విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని ‘ప్రకాశ్‌సింగ్ వెర్సస్ భారత ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పును తమకు వర్తింప చేయాలని డీజీపీ, సీఎస్‌లు కోరుతున్న నేపథ్యంలో హర్షవర్దన్‌రాజు విషయంలో పాటించక పోవడం గమనార్హం. ఈ విషయమై పోలీసువర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా, వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొండ్రెడ్డి పల్లెకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని జిల్లా పోలీసులు కడప తాలూకా స్టేషన్‌కు తీసుకుని వచ్చి ఓ కేసులో 41ఎ నోటీసు ఇచ్చి పంపించారు. అతన్ని అరెస్ట్ చేయలేదనే నెపంతో, ఇతర కారణాలను చూపిస్తూ జిల్లా ఎస్పీని బదిలీ చేశారు. చిన్నచౌక్ సీఐని సస్పెండ్ చేశారు. కడప తాలూకా సీఐపై కూడా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్నగరంపాలెం: రిమాండ్ ముద్దాయి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన ఘటనలో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ విధించిన గుంటూరు జిల్లా కోర్టు.. రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో అనిల్‌కుమార్‌ను ఏలూరు సమీపంలోని ఓ రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు ఎస్కార్ట్ సిబ్బంది తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఒక ఆర్ఎస్ఐతో పాటు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులిచ్చారు. -
రాజ్ పాకాలకు నోటీసులు
శంకర్పల్లి: మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో అనుమతి లేని పార్టీ నిర్వహణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. సోమవారం రాత్రి 11 గంటలకల్లా తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విషయంలో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను 48 గంటల్లో విచారణకు హాజరవుతానని పేర్కొంటూ న్యాయవాదుల ద్వారా పోలీసులకు లేఖ అందజేశారు. ఇంటికి అనుమతులు లేవన్న అధికారులు రాజ్ పాకాలకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే 691, 692 లలో శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో సుమారు 8 ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 1,500 గజాల విస్తీర్ణంలో జీ+1 ఇంటి నిర్మాణం చేపట్టారు. జన్వాడ గ్రామం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ఇంటికి శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో 7– 90 ఇంటి నంబర్‌తో పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో పాల్గొన్నవారి విచారణ రాజ్ పాకాల ఇంట్లో పార్టీకి హాజరైన వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇప్పటికే ముగ్గురికి నోటీసులిచ్చి విచారించగా.. మరో ముగ్గురు స్వచ్ఛందంగా పీఎస్‌కు వచ్చి, వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. మిగతా 32 మందికి రెండు రోజుల్లో నోటీసులిచ్చి, విచారిస్తామని వెల్లడించారు. కేసుపై ఏసీపీ సమీక్ష రాజ్ పాకాల ఇంట్లో పార్టీ కేసును నార్సింగి ఏసీపీ రమణగౌడ్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఆయన స్టేషన్‌కు వచ్చి, కేసు దర్యాప్తు తీరు, ఇతర వివరాలను తెలుసుకున్నారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరి విచారణకు హాజరుకాకపోతే తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయన సూచనలు చేసినట్టు తెలిసింది. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 10 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని మోకిల పీఎస్‌కు పంపించారు. ఫోన్ సీజ్‌లో ట్విస్ట్ ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్‌తోపాటు ఆయన ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్‌కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్‌ను ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ చర్యలు
-
హోంగార్డులపై ‘కారుణ్య’మేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి విధుల్లో అత్యంత కీలకమైన హోంగార్డులు.. అరకొర జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నెలలో ఒక్కో తేదీన వేతనాలు వస్తున్నాయని.. ఒక్కోసారి సగం నెల గడిచినా జీతాలు అందని పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు. తమకు కనీస జీవన భద్రత లేదని, హోంగార్డు చనిపోతే కారుణ్య నియామకంగానీ, మరేదైనా తీరులోగాని వారి కుటుంబాలకు న్యాయం జరగడం లేదని చెప్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళన బాట పట్టాలనే యోచనతో ఉన్నామని అంటున్నారు. సీఎం హామీలు అమలు చేయాలంటూ..హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్ గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని హోంగార్డులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హోంగార్డుల వేతన సవరణతోపాటు సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారని చెప్తున్నారు. ఇక తాజాగా శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి.. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి పిల్లలు అందులో చదువుతారని పలుమార్లు పేర్కొన్నారు. అయితే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ జీవోలో మాత్రం హోంగార్డుల ప్రస్తావన లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి విధుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేసే తమకు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారని పోలీసు అమరవీరుల దినోత్సవం రోజు ఆశతో ఎదురుచూశామని, కానీ అలాంటి హామీ ఏదీ రాలేదని వాపోతున్నారు. యూనిఫాం అలవెన్స్, స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ సహా పలు కీలక హామీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచీ పెండింగ్‌లో ఉన్నాయని... కాంగ్రెస్ ప్రభు త్వంలోనైనా అవి పరిష్కారం అవుతాయన్న ఆశతో ఉన్నామని చెప్తున్నారు. కదలని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ ఫైల్.. హోంగార్డులను సైతం లాస్ట్ పేగ్రేడ్ కింద తీసుకుని, వారిని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ (ఎస్పీఏ)గా మార్చాలని 2017లో ప్రతిపాదన సిద్ధం చేశారు. రిక్రూట్మెంట్లో లోటుపాట్లను సరిదిద్ది, వారిని పర్మినెంట్ చేసి దీన్ని అమలు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే పలు కారణాలతో ఇది పెండింగ్‌లో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13వేల మంది జనరల్ డ్యూటీ హోంగార్డులు, మరో 2,500 మంది వరకు ఓడీ (అదర్ డిపార్ట్మెంట్) హోంగార్డులు పనిచేస్తున్నారు. -
తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం
-
39 మంది సస్పెండ్.. పోలీసు శాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అందులో వివిధ బెటాలియన్లకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. టీజీఎస్పీ బెటాలియన్లలో ఆందోళనలకు నేతృత్వం వహించిన, ఇంటర్వ్యూలు ఇచ్చినవారిని గుర్తించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అంతకుముందు టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలపై డీజీపీ జితేందర్ ప్రకటన విడుదల చేశారు. వారి సమస్యలను సానుభూతితో పరిశీలిస్తామని, సిబ్బంది యథావిధిగా విధుల్లో చేరాలని హామీ ఇస్తూనే.. క్రమశిక్షణ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. టీజీఎస్పీ సిబ్బంది పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించరాదని.. నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 39 మంది టీజీఎస్పీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిరసనలు, ఆందోళనలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, తదనుగుణంగా చర్యలు చేపడతామని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ విధానాలే.. ఉమ్మడి ఏపీలో టీజీఎస్పీ పోలీసు సిబ్బంది విధులకు అనుసరించిన విధివిధానాలే తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగుతున్నాయని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీస్ ఎంపిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులు కోరుకున్న విధంగా జరిగాయన్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు లేనివిధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవులు, అదనపు సరెండర్ లీవులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పండుగలు, సెలవుల్లో సిబ్బంది విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నామని ఆ ప్రకటనలో డీజీపీ వివరించారు. టీజీఎస్పీ సిబ్బందికి ఉన్నతాధికారుల కౌన్సెలింగ్.. టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనబాట పట్టడంతో పోలీస్ ఉన్నతాధికారులు వారికి పలు అంశాలపై కౌన్సెలింగ్ చేపట్టారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? వారి సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలేమిటనే అంశాలను వివరిస్తున్నారు. ఈ మేరకు మొదటి, ఎనిమిదో బెటాలియన్ల సిబ్బందికి శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, టీజీఎస్పీ అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్లు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వరంగల్‌లో సీపీ వరంగల్, 12వ బెటాలియన్‌లో నల్లగొండ జిల్లా ఎస్పీ, సిరిసిల్లలో స్థానిక ఎస్పీ, డిచ్‌పల్లిలో కామారెడ్డి ఎస్పీలు సిబ్బందితో మాట్లాడారు. -
డ్రగ్స్ దందాలో టీవీ చానల్ అధినేత
సాక్షి, హైదరాబాద్: ఆయనో మీడియా అధినేత.. తండ్రి స్థాపించిన టీవీ చానల్ నిర్వహణ పగ్గాలు వారసత్వంగా పొందారు. గతంలోనే పలు వివాదాలు ఆయన్ను చుట్టుముట్టగా, ఇటీవల ఓ ‘సొసైటీ’ వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర వివాదాస్పదమైంది. తాజాగా ఆయనకు సంబంధించిన మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు, అనుమానితులతో సదరు న్యూస్ చానల్ యజమానికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 మంది డ్రగ్స్ వినియోగదారులు, అనుమానితులతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో పటిష్ట నిఘా వేసి ఉంచారు. కొన్నాళ్లుగా పరిశీలిస్తున్న పోలీసులు రాష్ట్ర పోలీసు విభాగం కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకప్పుడు ఏదైనా కేసులో దొరికిన డ్రగ్ పెడ్లర్ వద్దే దర్యాప్తు, విచారణ ఆగిపోయేది. తద్వారా మాదకద్రవ్యాల దందాకు కళ్లెం పడట్లేదని భావించిన పోలీసు విభాగం కొత్త పంథా అనుసరించడం మొదలెట్టింది. డ్రగ్స్ విక్రేతలు, ఖరీదు చేసే వారితో పాటు అనుమానితులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సైతం సమకూర్చుకుంది. ఏదైనా ఓ కేసులో డ్రగ్ సప్లయర్, పెడ్లర్, కన్జ్యూమర్లతో పాటు వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను ఆద్యంతం పరిశీలిస్తోంది. ఆయా వివరాలతో ప్రత్యేకంగా డేటాబేస్ సైతం రూపొందిస్తోంది. దాన్ని కేంద్రం ఆ«దీనంలోని క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ అండ్ ట్రాకింగ్ సిస్టంతో (సీసీటీఎన్ఎస్) అనుసంధానించింది. ఓ కేసు దర్యాప్తులో దొరికిన తీగ పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్ వినియోగదారుడికి సంబంధించిన కాల్‌డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరికొంత లోతుగా ఆరా తీశారు. దీంతో ఆయనకు ఈ డ్రగ్ వినియోగదారుడితో పాటు మరో రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న 14 మందితో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో డ్రగ్స్ వినియోగదారులతో పాటు ఆ కేసుల్లో అనుమానితులు సైతం ఉన్నారు. కొందరితో చాలా కాలంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారని తెలిసింది. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు సైతం ఉండటం గమనార్హం. కదలికలపై కన్ను డ్రగ్స్ దందా చేస్తున్న వారితో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఉన్నత కుటుంబాల్లో ఈ జాఢ్యం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఈ వర్గాల్లో పెరిగిన డిమాండ్‌తోనే సింథటిక్ డ్రగ్స్ దందా జోరందుకుంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఇటీవలి కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ మీడియా సంస్థ అధినేతకే మాదకద్రవ్యాల వినియోగదారుడు, ఆ కేసుల్లో అనుమానితులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు ఆ జాబితాలోని వారిపై నిఘా ఉంచడంతో పాటు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 2011 నుంచి సంబంధాలు మీడియా ఛానల్ అధినేతకు, మాదకద్రవ్యాల కేసుల్లో అనుమానితులు, వినియోగదారులుగా ఉన్న వారి మధ్య జరిగిన సంప్రదింపులు భారీ స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మందితో 2,500 కాల్స్ ఉన్నట్లు తెలిసింది. వీటిలో అత్యధికం ఇన్కమింగ్ కాల్స్ కాగా ఎస్సెమ్మెస్‌ల్లో మాత్రం ఎక్కువగా ఔట్ గోయింగ్ ఉన్నాయి. వీరిలో కొందరితో ఆయన 2011 నుంచి సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం. వారి మధ్య వందల నిమిషాల సేపు సంప్రదింపులు జరిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండటంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. -
ఉన్మాదంతో దాడులు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కొందరు ఉన్మాదం, భావోద్వేగంతో మందిరాలు, మజీద్‌లపై దాడులు చేస్తూ.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ గుడి సంఘటన సహా ఇటీవల జరిగిన మరికొన్ని ఘటనలు ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరా లకు పాల్పడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా సమాజానికి చెడు చేసేవారి విషయంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ఎంతో తెలివైనదని, మత విద్వేషాలను అరికట్టడంలో ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని చెప్పారు. ‘పోలీస్ అమరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే)’సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసు అమరుల స్మారకం వద్ద నివాళులు అరి్పంచారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రజల భద్రత కోసం ఉగ్రవాదులు, మావోయిస్టుల చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకం. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ఏ చిన్న తప్పు జరిగినా ప్రభుత్వం, పోలీసుల ప్రతిష్ట పోతుంది. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. పోలీసులపై ప్రజల్లో గౌరవం పెరిగేలా పనిచేయాలి. ఒకరి దగ్గర చేయిచాచే పరిస్థితి ఉండకూడదు. ఖద్దరు, ఖాకీలను సమాజం నిశితంగా గమనిస్తుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునేలా నడుచుకోవాలి..’’ అని సీఎం రేవంత్ సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠినంగా ఉంటాం సరికొత్త పంథాలో జరుగుతున్న సైబర్ నేరాలు, యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలని, బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని పోలీసులకు సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిబ్బందిని, కృత్రిమ మేధ (ఏఐ)ను వాడుకోవాలని డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసు అమరులపై రాసిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లతో కలిసి సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల వద్దకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ఒక్కరిని పలకరించారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఐడీ డీజీ శిఖాగోయల్, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరులకు భారీగా ఎక్స్‌గ్రేషియా.. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా అమరులైన పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.కోటి.. ఎస్సై, సీఐలకు రూ.1.25 కోట్లు, డీఎస్పీ, ఏఎస్పీలకు రూ.1.50 కోట్లు, ఎస్పీ స్థాయి నుంచి ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యానికి గురైన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.50 లక్షలు, ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ వరకు రూ.60 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. ఇక తీవ్రంగా గాయపడిన వారిలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్పీ వరకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇస్తామని.. ఎస్పీ, ఆపై ర్యాంకు అధికారులు తీవ్రంగా గాయపడితే రూ.12 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇటీవల మృతి చెందిన ఐపీఎస్ రాజీవ్‌రతన్ కుమారుడికి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా, కమాండెంట్ మురళి కుమారుడికి డిప్యూటీ ఎమ్మార్వోగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. పోలీస్ అమరుడు ఆది ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతిచెందిన గ్రేహౌండ్స్ జూనియర్ కమెండో ఆది ప్రవీణ్ కుటుంబాన్ని గోషామహల్ స్టేడియం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆది ప్రవీణ్ భార్య రాథోడ్ లత, కుమారులు ఆది హర్ష, ఆది వివాన్లకు పోలీసు స్మారక చిహ్నం జ్ఞాపికను అందించారు. ఆది ప్రవీణ్ భార్య లతకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియా పెంపుపై సీఎంకు ధన్యవాదాలు పోలీసు అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇవ్వడం, పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. -
ప్రజలు – పోలీసుల బంధం బలపడాలి
1959 అక్టోబర్ 21వ తేదీన భారత–చైనా సరిహద్దులోని ఆక్సాయిచిన్ ప్రాంతంలో పదిమంది కేంద్ర పోలీసు రిజర్వు దళానికి చెందిన జవానులు విధినిర్వహణలో వీర మరణం పొందారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి సంఘటన అది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ’పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని’ పాటిస్తున్నాం.ఈనాడు అనేక కారణాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది. సమ్మెలు, ఆందోళనలు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం, మత సంఘర్షణలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వం తరఫున శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. బలవంతుల నుండి బలహీనులకు పోలీసులు రక్షణ కల్పించాలి. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించాలి. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతలకు అవసరమైన చర్యలు గైకొనేట ప్పుడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. మిగతా ప్రభుత్వ శాఖలకూ పోలీసు శాఖకూ మధ్య పనితీరులో చాలా భేదం ఉంది. పోలీసులు అవసరమైతే అవిశ్రాంతంగా శాంతి భద్రతల కోసం 24 గంటలూ పనిచేయాలి. పండుగలు వచ్చినప్పుడు అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ, పోలీసులు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితి! సమయానికి ఆహారం, నిద్ర లేని కారణంగా వారి ఆరోగ్యంపై దాని దుష్ప్రభావం పడుతుంది.1861 కంటే ముందు మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం లేదు. సైనికులే శాంతి భద్రతలను పరిరక్షించేవారు. సిపాయిల తిరుగు బాటు అనంతరం 1861 పోలీసు యాక్టు ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విభాగాన్ని ఆంగ్లేయ పాలకులు ఏర్పాటు చేశారు. 1902లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఆంగ్లేయ పాలకులు స్వతంత్ర సము పార్జన కోసం పోరాడుతున్న భారతీయులను అణచి వేయడం కోసం, భారతీయుల హక్కులను హరించడం కోసం పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రా నంతరం శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ జాబి తాలో చేర్చడం వలన పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది. పోలీసుల పనితీరుపై ఈ నాటికీ ప్రజలకు సదభి ప్రాయం లేదు. పోలీసులకు కూడా తాము ప్రజల కోసం నిరంతరం కష్టపడినా ప్రజల నుండి రావలసిన సహకారం, ఆదరణ లభించడం లేదన్న అభిప్రాయముంది. పోలీసు ప్రజాసంబంధాలు బాగుపడాలంటే ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు సరియైన సమయంలో సరియైన రీతిలో స్పందించాలి. కొన్ని సందర్భాలలో ఫిర్యాదు దారులు చేసిన ఫిర్యాదుల పరిష్కారం పోలీసుల పరిధిలో ఉండక పోవచ్చు. అటువంటప్పుడు వారు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో వివరించాలి. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించాలి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా 2006 సెప్టెంబర్ 22న సుప్రీం కోర్టు పోలీసుల పనితీరుకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. అందులో ముఖ్యమైనవి: 1) కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రస్థాయి భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. భద్రతా మండలి శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను సమీక్షించి అవసరమైన చర్యలు గైకొనాలి. 2) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థాపక బోర్డును ఏర్పాటు చేయాలి. 3) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర/జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల అథారిటీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఆ పై స్థాయి అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలి. 4) డీజీపీ నియామకం కోసం ముగ్గురు సీని యర్ ఐపీఎస్ అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఒక జాబి తాను రూపొందించాలి. అందులో నుండి ఒకరిని వారి యోగ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. ఈ రకంగా నియమించబడ్డ వారు వారి పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండు సంవత్సరాలు ఆ పద విలో కొనసాగాలి. 5) పోలీసు వ్యవస్థలో కార్యాచరణ విధులు నిర్వహించే ఐజీపీ, డీఐజీ, ఎస్పీల పదవీ కాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. 6) పోలీసు శాఖలో శాంతి భద్రతల విధులను, విచారణ (ఇన్వెస్టిగేషన్) విధులను వేరు చేయాలి. పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేయాలంటే ఈ మార్గదర్శకాలను అమలుచేయాలి. – డా. పి. మోహన్‌రావు విశ్రాంత ప్రొఫెసర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ హైదరాబాద్(రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం)